హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!? | Bigg Boss Telugu 7 Promo 1 & 2 - Day 5: Unexpected Task For This Week Nominations | Friendship To Romance Between Contestants - Sakshi
Sakshi News home page

Bigg Boss 7: రతిక వార్నింగ్.. అందరికీ టార్గెట్ అవుతున్న ఆమె!

Published Fri, Sep 8 2023 6:39 PM | Last Updated on Sat, Sep 9 2023 9:26 AM

Bigg Boss 7 Telugu Day 5 Promo Latest - Sakshi

'బిగ్‌బాస్ 7' సీజన్ మొదలవడానికి ముందు హోస్ట్ నాగార్జున.. ఈసారి అలా కాదు ఇలా, ఇలా కాదు అని ఏదేదో చెప్పారు. 'ఉల్టా పల్టా' ఉండబోతుందన్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే.. సేమ్ రొటీన్ స్టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు లవర్స్ మధ్య సమస్యలు, మరోవైపు కొత్త గొడవలు పుట్టుకొస్తున్నాయి. ఇంతకీ హౌసులో ఏం జరుగుతోంది?

లవర్స్- మనస్పర్థలు
బిగ్‌బాస్‌లో ఏ సీజన్ తీసుకున్నా సరే.. దాన్ని ప్రేమ అనొచ్చే లేదో తెలీదు గానీ కొందరైతే జంటలు అవుతుంటారు. అలా ఈ సీజన్ లో డాక్టర్-లాయర్ జంట ఒకటి ఉంది. అదే గౌతమ్-శుభశ్రీ జోడీ. వచ్చిన తొలిరోజు నుంచి కలిసి కనిపిస్తూ వచ్చారు. తాజాగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయేమో అనిపిస్తుంది. తేజతో శుభశ్రీ డ్యాన్స్ చేస్తుండగా.. గౌతమ్ కాస్త డల్ అయిపోయాడు. ఆ తర్వాత వీళ్ల మధ్య జరిగిన సంభాషణ కూడా స్పర్థలు వచ్చినట్లు హింట్ ఇచ్చేస్తోంది. 

(ఇదీ చదవండి: హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్')

రతిక వార్నింగ్
ఇమ్యూనిటీ టాస్క్‌లో సందీప్, ప్రియాంక జైన్ గెలిచారు. మరోవైపు బిగ్‌బాస్‌ని ఇంప్రెస్ చేసిన శివాజీ, రతిక కూడా ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. ఇక్కడే మరో ట్విస్ట్ వచ్చి పడింది. వీళ్ల నలుగురిలో ఎవరికి అర్హత లేదో చెప్పమని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. దీంతో పలువురు రతిక పేరు చెప్పారు. ఈ క్రమంలోనే దామిని, రతిక మధ్య గొడవ జరిగింది. నోరు అదుపులో పెట్టుకో అని దామినికి రతిక వార్నింగ్ ఇచ్చింది.

టార్గెట్ ఆమెనే
అయితే ప్రస్తుతం హౌసులో పరిస్థితి అంతా చూస్తుంటే దాదాపు చాలామంది రతికనే టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఓ విధంగా ఆమెకు ప్లస్ కావొచ్చు కూడా. కానీ ఎవరికీ అది అర్థం కావడం లేదేమో అనిపిస్తుంది. మరోవైపు సింక్‌లో ప్లేట్లు కడగకుండా పెట్టేస్తున్నారని ప్రియాంక గట్టిగా అరిచింది. దీనిపై దామిని రియాక్ట్ కాగా.. అప్పుడు ప్రియాంక-దామిని మాటమాట అనుకున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో రిలీజైన సూపర్‌హిట్ సినిమా.. కానీ?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement