బిగ్‌బాస్ గేమ్ ఈ రోజు ఎందుకో చాలా అంటే చాలా ఆసక్తిగా అనిపించింది. బహుశా శివాజీ గ్యాంగ్ లేకపోవడం వల్ల కావచ్చు. అలానే అమర్‌దీప్ అయితే హౌస్ అంతా గాయిగత్తర చేశాడు. పిచ్చిపట్టిన వాడిలా అరుస్తూ బీభత్సం సృష్టించాడు. మరోవైపు ప్రియాంకని చూస్తే నిజంగా హేట్సాఫ్ అనిపించింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది Day 75 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
శివాజీ బ్లాక్‌మెయిల్
ఎవిక్షన్ పాస్ చివరి రౌండ్‌లో నిర్ణయం తీసుకునే దగ్గర గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. శోభా తన అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. శివాజీ తన వాళ్లకు రాకపోతే బాగోదు అన్నంత రేంజులో బ్లాక్‌మెయిల్ చేశాడు. సంచాలక్స్ ఒక్క మాట అనుకుని యావర్.. ఎవిక్షన్ పాస్ విజేత అని ప్రకటించడంతో శివాజీ చల్లబడ్డాడు. మంచి డెసిషన్ తీసుకున్నారని పుడింగిలా పనికిమాలిన కామెంట్ చేశాడు. దీంతో శోభా ట్రిగ్గర్ అయిపోయింది. నియమాల ప్రకారం అన్నప్పుడు ఒకవేళ నేను గానీ, ప్రశాంత్ గానీ తప్పు నిర్ణయం తీసుకుంటే.. పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉంటానని శోభాశెట్టి చెప్పింది. దీంతో శివాజీ అతి చేశాడు. నువ్వు సంచాలక్‌గా ఉన్న ప్రతిసారీ 90 శాతం వాదనలు, గొడవలు, డిస్కషన్, మనస్పర్థలు జరిగాయి కాబట్టే నేను చెబుతున్నానని శివాజీ అన్నాడు. మూడుసార్లు సంచాలక్‌గా ఇబ్బందిపడ్డావ్ శోభా, ఇది నిజం, అందుకే నేను నిన్ను అలెర్ట్ చేశానని శివాజీ నీతికబర్లు చెప్పాడు. ఇక్కడంతా గమనిస్తే శోభాదే తప్పు అని తను అనుకునేలా శివాజీ బ్లాక్‍మెయిల్ చేశాడనిపించింది.
(ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?)
ప్లేటు తిప్పేసిన శివాజీ
ఇక యావర్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దీంతో దాన్ని నచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే శోభాతో అంతా గొడవపడ్డ శివాజీ.. మళ్లీ ప్లేట్ తిప్పేశాడు. నేను గెలవలేదని ఫైట్ చేశానని అనుకున్నారా మీరేమైనా అని శోభానే శివాజీ నైస్‌గా అడిగాడు. అరిచినప్పుడేమో అరిచేసి, ఇప్పుడేమో నంగనాచిలా మాటలు చెప్పి శోభాని ఏమార్చడానికి శివాజీ ట్రై చేశాడు. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని నేను ఫైట్ చేశానని నీతికబుర్లు చెప్పాడు. దీంతో నా అనుకున్న ఫ్రెండ్స్ అందరూ బాల్కానీలో తనని వదిలేసి మీటింగ్ పెట్టిరని, తాను అందరికీ శత్రువు అయిపోయానని శోభా తెగ బాధపడిపోయింది.
ప్రియాంక నువ్వు సూపర్
ఎవిక్షన్ పాస్ తంతు పూర్తయిన తర్వాత కొత్త కెప్టెన్ కోసం రెండు లెవల్స్‌లో టాస్కులు జరుగుతాయని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఇందులో అందరూ పోటీదారులే అని అన్నాడు. తొలుత ఇటుకులు తెచ్చే టాస్క్ పెట్టగా అందరూ చాలా పోటీపోటీగా గేమ్ ఆడారు. కాకపోతే ప్రతి దశలోనూ తక్కువ ఇటుకులు తెచ్చిన కారణంగా రతిక, గౌతమ్, అశ్విని, శోభాశెట్టి వరసగా ఎలిమినేట్ అయ్యారు. వీళ్లందరూ గేమ్ ఎలా ఆడాలో తెలియక, కిందపడిపోయి, అరుస్తూ ఆటపై సరిగా కాన్సట్రేషన్ చేయలేకపోయారు. అమ్మాయిల్లో ప్రియాంక ఒక్కతే సైలెంట్ గా తనపని తాను చేసుకుని నెక్స్ట్ రౌండ్‌కి అర్హత సాధించింది. ఈమెతో పాటు అమర్, ప్రశాంత్, అర్జున్.. ఫైనల్ టాప్-4కి క్వాలిఫై అయ్యారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు)
అమర్ పిచ్చిపట్టినట్లు ప్రవర్తన
ఈ గేమ్ లో భాగంగా నలుగురు పోటీదారులు ఇటుకులతో టవర్ కట్టాలి. బజర్ మోగిన తర్వాత మిగిలిన వాళ్లు వాటిని పడగొట్టడానికి ట్రై చేయాలి. ఇందులో ప్రశాంత్, అర్జున్ వరసగా ఔట్ అయిపోయారు. చివరకు అమర్, ప్రియాంక మిగలగా.. అమ్మాయి అయిన ప్రియాంక చాలా చక్కగా అస్సలు సౌండ్ చేయకుండా గేమ్ ఫినిష్ చేసింది. అమర్ మాత్రం కెప్టెన్సీ కోసం రెచ్చిపోయాడు. అరుస్తూ, ఏడుస్తూ, భయపెడుతూ స్ట్రాటజీలన్నీ ఉపయోగించాడు కానీ వర్కౌట్ కాలేదు. ప్రియాంక గెలిచింది. దీంతో కిందపడి కొట్టేసుకున్నాడు. అయితే అది కోపంతో వచ్చిన బాధే కానీ ఎవరిపై కోపం ఏం లేదని అమర్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.
ప్రియాంక-అమర్ మనస్పర్థలు
అయితే తాను కెప్టెన్ అయినట్లు కలగన్నాను కానీ తాను ఏది అనుకుంటే అది జరగదని అమర్‌దీప్ తెగ బాధపడిపోయాడు. అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. నువ్వు గెలిస్తే నేను అంతే సంతోషపడుతున్నాను, కానీ నీ దగ్గర నుంచి మాత్రం అలాంటి రెస్పాన్ రావట్లేదని అమరదీప్‌తో ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య మనస్పర్థలు బయటపడ్డాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియాంక దగ్గర నుంచి అమర్ ఎలా ఆడాలో తెలుసుకోవాలి. కానీ మనోడు అది చేయకుండా ఏడుస్తూ కనిపించాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment