'బిగ్‌బాస్ 7' సీజన్‌లో నామినేషన్స్ గొడవ అయిపోయింది. ఒకరిని ఒకరి నామినేట్ చేసుకోవడం అనే తంతు ముగిసింగి. మొత్తంగా 8 మంది లిస్టులో ఉన్నారు. ఇకపోతే బిగ్ బాస్.. 14 మంది కంటెస్టెంట్స్‌కి తొలి టాస్క్ ఇచ్చి, ఓ గేమ్ పెట్టేశాడు. ఇందులో అందరూ కండబలంతో ఆడితే.. ఓ ఇద్దరు మాత్రం బుద్ది బలంతో ఆడి, విజయం సాధించారు. ఇంతకీ మూడో రోజు హౌసులో ఏమేం జరిగింది? బిగ్‌బాస్ Day-3 హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో తొలివారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?)
ఫస్ట్ టాస్క్
నిద్ర లేవడంతో మూడో రోజు ఎపిసోడ్ ప్రారంభమైంది. 14 మంది కూర్చున్న తర్వాత.. బిగ్‌బాస్ మరోసారి అందరికీ గీతోపదేశం చేశాడు. ఇంట్లో ఉన్నంత మాత్రాన ఇంటి సభ్యులు కాదని, కంటెస్టెంట్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. 'ఫేస్ ద బీస్ట్' అనే గేమ్‌లో గెలిచిన వాళ్లకు హౌసులో కన్ఫర్మేషన్‌తోపాటు ఐదు వారాల ఇమ్యూనిటీ పొందే అవకాశం దక్కుతుందని చెప్పాడు. గెలిచిన వాళ్లు.. నామినేషన్, ఎలిమినేషన్ నుంచి కూడా సేవ్ అవుతారని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు.
తేజకి షకీలా ముద్దు
ఇకపోతే తేజని అందరూ కలిసి ముస్తాబు చేశారు. శుభశ్రీ అతడికి బ్రష్‌తో బుగ్గపై లిప్‌స్టిక్ పెట్టేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే అతడు.. తన బుగ్గపై కూడా ఎవరైనా ముద్దు పెడితే బాగుంటుందని ఫన్నీగా అన్నాడు. పక్కనే ఉన్న షకీలా.. తేజ బుగ్గపై ముద్దు పెట్టింది. ఇది అయిపోయిన తర్వాత 'ఫేస్ ద బీస్ట్' టాస్క్ మొదలైంది. ఈ గేమ్‌లో భాగంగా రింగ్‌లో ఎక్కువసేపు ఉన్నవాళ్లు గెలుస్తారని బిగ్‌బాస్ చెప్పాడు.
(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా!?)
కొందరు మాత్రమే
బయట వర్షం పడుతుండటం వల్ల లాన్‌లో కాకుండా ఇన్‌డోర్‌లో 'ఫేస్ ద బీస్ట్' గేమ్ నిర్వహించారు. 14 మందిలో దాదాపు అందరూ చేతులెత్తేశారు. ఆట సందీప్ , ప్రియాంక, శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ.. మిగతా వారి కంటే ఎక్కువ సేపు రింగ్‌లో ఉండి ఫైట్ చేశారు. ఫలితంగా అబ్బాయిల్లో ఎక్కువసేపు ఉన్న ఆట సందీప్, అమ్మాయిల్లో ప్రియాంక టాప్‌లో నిలిచి.. తర్వాత స్టేజీకి అర్హత సాధించారు. వీళ్లిద్దరి మధ్య విన్నర్ ఎవరనేది తర్వాత టాస్కులో తెలుస్తుంది.
బుద్దిబలంతో గెలిచారు
అయితే ఈ గేమ్ జరుగుతున్నంతసేపు ఆట సందీప్, ప్రియాంక పెద్దగా ఎనర్జీ వేస్ట్ చేసుకోలేదు. ఏ మాత్రం అరవకపోయినప్పటికీ, అందరినీ ఎంకరేజ్ చేశారు. వచ్చినప్పటి నుంచి కండలు చూపిస్తూ ఎక్స్‌పోజ్ చేసిన ప్రిన్స్.. ఈ గేమ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 32 సెకన్లు మాత్రమే మ్యాట్‌పై ఉండగలిగాడు. దీన్నిబట్టి కండలు ఉంటే సరిపోదని అతడికి అర్థమైందనుకుంటా! తర్వాత టాస్కుల్లో అతడు ఈ విషయం గుర్తుపెట్టుకుంటే బెటర్.
ప్రశాంత్, గౌతమ్ ఏడుపు
ఈ గేమ్‌లో భాగంగా ఆట సందీప్ (1 min 49 సెకన్లు) తో టాప్‌లో నిలవగా, తర్వాత స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అయితే గెలవలేకపోయినందుకు ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు గౌతమ్ కూడా తనకు ఇల్లు గుర్తొస్తుందని ఎమోషనల్ అయ్యాడు. ఆ వెంటనే.. ఎలాగైనా సరే ఆడి తీరాల్సిందే, స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే అని తనకు తానే చెప్పుకున్నాడు. అలా మూడో రోజు పూర్తయింది.
(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకే ఇంట్లో కలిసుంటున్నారా!?)
Comments
Please login to add a commentAdd a comment