Aata Sandeep
-
‘ది షార్ట్ కట్’ మూవీ రివ్యూ
కంచి రామకృష్ణ దర్శకత్వంతో అట సందీప్, షాజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ది షార్ట్ కట్’.విజయానికి అడ్డదారులు ఉండవు అనేది ఉప శీర్షిక. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది.కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుకొని ఎట్టకేలను నేడు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..ప్రకాశ్(ఆట సందీప్)కి సినిమా డైరెక్టర్ కావాలని కోరిక. ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీలోకి వస్తాడు. సినిమా డైరెక్టర్ గా ఎదగాలి అన్న కోరికతో ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్లను కలిసి కథలు చెబుతూ ఉంటాడు. ఒక్కరు కూడా తనకు సినిమా చాన్స్ ఇవ్వరు. మరోవైపు తన ప్రియురాలు దివ్య(షాజ్ఞ శ్రీ) మాత్రం సినిమా, డైరెక్షన్ వర్కౌట్ ఇప్పట్లో వర్కౌట్ కాదని, ఉద్యోగం చేయమని ఒత్తిడి చేస్తుంది. ప్రకాశ్ మాత్రం తన ఫోకస్ అంతా డెరెక్షన్పైనే పెడతాడు. ఎలాగైనా సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి డ్రగ్స్ ఉన్న బ్యాగ్ దొరుకుతుంది. ఆ డ్రగ్స్‌ని, అమ్మి వచ్చిన డబ్బుతో సినిమా చేయాలనుకుంటాడు. కానీ అనుకోకుండా డ్రగ్స్ మాఫీయా డాన్ చేతికి దొరుకుతాడు. ఆ తర్వాత ప్రకాశ్ జీవితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకున్నాయి? డైరెక్టర్ కావాలనే కోరిక నెరవేరిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ప్రస్తుతం యువత డ్రగ్స్‌కి అలవాటు పడి తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? ఈ డ్రగ్స్ దందా వెనక జరుగుతున్న చీకటి కోణాలు ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపై చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. కథా ప్రారంభం బాగుంటుంది. అయితే హీరో పాత్ర మొదలు చాలా సీన్లు కూడా గత సినిమాలను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక సెండాఫ్లో కథ మొత్తం డ్రగ్స్ మాఫియా చుట్టే తిరుగుతుంది. సెకండాఫ్‌లో అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది. కొన్ని అనవసర సన్నివేశాలను జోడించి, కథను సాగదీసినట్లు అనిపిస్తుంది. కమర్షియల్‌గా ఈ సినిమా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ ఓ మంచి సందేశం అయితే ఇస్తుంది.ఎవరెలా చేశారంటే...ఆట సందీప్ అంటే ఇప్పటివరకు అందరికి డ్యాన్సర్‌గానే పరిచయం. ఆయనలో మంచి నటుడు ఉన్నాడని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. డైరెక్టర్ అయ్యి తన ప్రేమను పొందాలి అనే తపన ఉన్న కుర్రాడిగా చాలా బాగా నటించాడు. షాజ్ఞ శ్రీ నటన క్యారెక్టర్జషన్ బాగున్నాయి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈటీవీ ప్రభాకర్ గారి నటన అదే విధంగా డ్రగ్స్ మాఫియా కు సంబంధించి లోకల్ డాన్ క్యారెక్టర్ లో రాకేష్ మాస్టర్ నటన ప్రేక్షకులను అలరిస్తాయి. టెస్టర్ క్యారెక్టర్ లో బల్వీర్ సింగ్ సపోర్టింగ్ రోల్ లో చాలా బాగా నటించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఆర్ఆర్ ద్రువన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది. ఎస్ ఎన్ మీరా సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'సోలో బాయ్' ఛాలెంజ్ గెలిస్తే రూ. 30 వేలు బహుమతి
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై ఒక సినిమా తెరకెక్కుతుంది. సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి 'సోలో బాయ్' టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా నుంచి ఒక హుక్ స్టెప్‌తో మేకర్స్ ఛాలెంజ్‌గా విసిరారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్‌ను తాజాగా లాంచ్ చేశారు.ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ .. 'నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా మీడియాతో పాటు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్‌కు కృతజ్ఞతలు. సోలో బాయ్ సాంగ్ చూసిన అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ నవీన్ మంచి సినిమాను అందించాడు. నా తమ్ముడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గౌతమ్ ఫ్యూచర్లో కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.సోలో బాయ్ టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ చాలెంజ్ చేసిన వాళ్లకి మొదటి బహుమతిగా 30,000 రెండవ బహుమతిగా 20,000 మూడో బహుమతిగా 10,000 ఇస్తామని హీరో గౌతమ్ కృష్ణతో పాటు కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తెలిపారు. ఈ స్టెప్‌తో వీడియో తీసి తమ టీమ్‌ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసిన వాళ్ళ నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసి మీడియా ముందే బహుమతిని ఇస్తామని పేర్కొన్నారు. టైటిల్ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రచిస్తే.. రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడారని తెలిపారు. -
తిరుమలలో బిగ్‌బాస్ సందీప్ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (ఫొటోలు)
-
ఉగాది రోజు ఆట సందీప్- జ్యోతిరాజ్ నూతన గృహప్రవేశం (ఫొటోలు)
-
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ స్పెషల్ వీడియో!
ఎటు చూసినా జై శ్రీరామ్ పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆ అయోధ్య రాముని నామ జపం చేస్తోంది భారతావని. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడుతోంది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఆ రాముని పట్ల తమ భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తనదైన శైలిలో భక్తిని చాటుకున్నారు. జై శ్రీరామ్ అంటూ తన భార్య జ్యోతిరాజ్ సందీప్‌తో కలిసి నృత్యం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు మీ కొరియోగ్రఫీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు జై శ్రీరామ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
శేఖర్, సందీప్ మాస్టర్ సంపాదన ఎంతో తెలుసా? ఒక్క సంగీత్‌కు..
ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నవాళ్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. రాకేశ్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న ఇతడు తర్వాతి కాలంలో గురువును మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో పెద్ద హీరోలతో స్టెప్పులేయిస్తూ టాప్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నాడు. రాకేశ్ మాస్టర్ దగ్గర శిష్యుడిగా చేరి డ్యాన్స్‌లో మెళకువలు నేర్చుకున్న మరో వ్యక్తి బషీర్ మాస్టర్. తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ అందుకునే పారితోషికాన్ని బయటపెట్టాడు. బషీర్ మాస్టర్ నేను లక్ష తీసుకుంటా బషీర్ మాస్టర్ మాట్లాడుతూ.. 'సంగీత్ వేడుకల కోసం నేను ఐదు రోజులపాటు కొరియోగ్రఫీ చేసి రూ.1 లక్ష తీసుకుంటాను. అదే అమెరికా వాళ్లకు ఆన్లైన్లో ఒక్క పాటకు డ్యాన్స్ నేర్పించినందుకుగానూ రూ.30 వేలు తీసుకుంటాను. నా పార్ట్‌టైమ్ సంపాదన ఇదే! ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లందరూ ఇలా సంగీత్ వేడుకలు చేసినవారే! సందీప్ కూడా.. శేఖర్ మాస్టర్ ఒక్క సంగీత్ కోసం రూ.40 లక్షలు తీసుకుంటాడు. జానీ మాస్టర్, సత్య మాస్టర్, సందీప్ అందరూ సంగీత్‌లలో చేసినవారే! మొన్నటివరకు సందీప్ కూడా రూ.2-3 లక్షలకు సంగీత్ చేశాడు. నాక్కూడా మంచి రేంజ్ వచ్చినప్పుడు రూ.50 లక్షలు తీసుకుంటాను. బిగ్‌బాస్ షోలో పాల్గొనడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఛాన్స్ వస్తే వెళ్తానేమో, అంతా ఆ దేవుడి చేతిలో ఉంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: డిసెంబర్లో నటుడి మరణం.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాని ఫ్యామిలీ! -
హీరోగా బిగ్‌బాస్ కంటెస్టెంట్.. పాటతో కుమ్మేసిన భోలె!
ఆట సందీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి ఆయన పేరు ఆట సందీప్‌గా మారిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే కావడం విశేషం. అంతే కాకుండా గతేడాది జరిగిన బిగ్‌బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. చాలా వారాల పాటు హౌస్‌లోనూ తన ఆటతీరుతో మెప్పించారు. అయితే ప్రస్తుతం ఆట సందీప్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ది షార్ట్‌కట్ అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు. విజయానికి అడ్డదారులువండవు అనేది ఈ మూవీకి క్యాప్షన్. ఈ చిత్రాన్ని రామకృష్ణ కంచి దర్శకత్వంలో తోట రంగారావు, రజినీకాంత్ పున్నపు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ పాల్గొన్ని సందడి చేశారు. ఈవెంట్‌కు హాజరైన వారిలో భోలె షావలి, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ, అశ్విని, గౌతమ్ ఉన్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
నువ్వు తోపెహె.. బిగ్‌బాస్‌ను ఇలా కూడా వాడుకుంటారా?
ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుని విజయవంతం అయింది. రైతుబిడ్డ విజేతగా.. బీటెక్ కుర్రాడు రన్నర్‌గా నిలిచాడు. నీతులు చెప్పడమే తప్ప పాటించడం తెలియని శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రియాంక, ప్రిన్స్ యావర్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉండగా టాస్కుల బాహుబలిగా పేరు గడించిన అర్జున్ ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. అసలు ఫినాలే వరకు రాకుండా ఎనిమిదో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు కొరియోగ్రాఫర్ సందీప్. ఎన్నో తప్పులు.. అయినా బెస్ట్ సంచాలక్ బిగ్‌బాస్ 7 నుంచి ఎలిమినేట్ అయిన ఫస్ట్ మేల్ కంటెస్టెంట్‌గా, అలాగే నామినేషన్లోకి వచ్చిన మొదటి వారమే ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్‌గా తనకంటూ ఓ రికార్డు కూడా ఉంది. ఇకపోతే ఫినాలే రోజు నాగార్జున.. కంటెస్టెంట్లకు ఒక్కో అవార్డు ప్రకటించాడు. అందులో భాగంగా.. సందీప్‌కు బెస్ట్ సంచాలక్ అవార్డు ఇచ్చాడు. నిజానికి సందీప్ సంచాలకుడిగా ఉన్నప్పుడు చాలా సార్లు తప్పులు జరిగాయి. కానీ ఎక్కువసార్లు అతడే సంచాలకుడిగా ఉన్నందుకో ఏమో కానీ తనను ఉత్తమ సంచాలకుడిగా ప్రకటించేశారు. అయితే ఇప్పుడు అదే అవార్డును తన పేరు ముందు పెట్టేసుకున్నాడు సందీప్. ఈ డ్యాన్స్ మాస్టర్ ప్రస్తుతం హీరోగా ద షార్ట్‌కట్ అనే సినిమా చేస్తున్నాడు. ఆస్కార్ గెలిచినట్లు ఫీలవుతున్నాడే.. విజయానికి అడ్డదారులుండవు అనేది ట్యాగ్‌లైన్. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఈ చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బిగ్‌బాస్ 7 బెస్ట్ సంచాలక్ సందీప్ అని ఉండటంతో నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. 'ఎవరైనా బిగ్‌బాస్ ఫేమ్ అని వేసుకుంటారు.. కానీ బెస్ట్ సంచాలక్ ఏంట్రా బాబూ..', 'ట్రోఫీ గెలిచినట్లు ఫీలవుతున్నాడుగా.. దాన్నేదో ఆస్కార్‌లా వాడేసుకుంటున్నాడు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆడియో లాంచ్‌లో బిగ్‌బాస్ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయిన మేల్ కంటెస్టెంట్ అని సందీప్ గురించి పొగుడుతారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. Me : Inthaki ah title evaru icharu Bata Sundeep : evaru ivvaledhu, nene petteskunna — Gajala ceo (@gajala_sonicsol) January 2, 2024 View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) చదవండి: ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'యానిమల్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా? -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ భార్య గొప్పమనసు.. వారి కోసం అలా!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, కొరియాగ్రాఫర్ ఆట సందీప్ ఈ సీజన్లో తన ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకున్నారు. తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7లో మొదటి నుంచి హౌస్‌లో గట్టి పోటీదారునిగా నిలిచారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. అయితే ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే అని తెలిసిందే. ఆమె సైతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో ఆరుబయటే నిద్రిస్తున్న వారికోసం తనవంతు సాయంగా ముందుకు కదిలారు. రోడ్డు పుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారికి దుప్పట్లు అందించారు. తన ఫ్రెండ్‌తో కలిసి ఆమె రోడ్ల పక్కన నిద్రిస్తున్న ఉన్నవారికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్స్ ప్రశంసలు కురిస్తున్నారు. మీరు ఇలాగే మరికొంత మందికి సాయం చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Jyoti Raj (@jyothiraj_sandeep) -
బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్.. లీక్ చేసిన సందీప్ భార్య!
బిగ్‌బాస్ జర్నీ.. జీవితంలో ఒక్కసారైనా ఈ షోకి వెళ్లాలని చాలామంది అనుకుంటారు. కానీ కొందరికే ఆ అవకాశం వరిస్తుంది. అందులో అతికొంతమందే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు. జీవిత పాఠాలు తెలుసుకుంటారు. అందుకే ఈ రియాలిటీ షో ఏళ్లతరబడి హిట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఏడో సీజన్ ముగింపుకు వచ్చింది. నేటితో బిగ్‌బాస్ 7 చాప్టర్ క్లోజ్ కానుంది. మరికాసేపట్లో విజేత ఎవరనేది తేలిపోనుంది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఫినాలేలో అడుగుపెట్టగా అందులో ముగ్గురు.. అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ నిన్నే అయిపోయింది. కష్టం ఎప్పటికీ వృథా పోదు.. ఈరోజు మిగతా ముగ్గురిలో విజేత ఎవరనేది నిర్ణయించనున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ 7 విన్నర్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్. 'పడ్డ కష్టం ఎన్నటికీ వృథా కాదు.. దేవుడు నిన్ను చల్లగా చూడాలిరా తమ్ముడు' అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో స్పై(శివాజీ, ప్రశాంత్, ప్రిన్స్ యావర్) బ్యాచ్ అభిమానులు ఆదివారం రాత్రి 8.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోకి రావాలని ఉంది. అసలే సందీప్ మాస్టర్ ఫినాలే షూటింగ్లో ఉండటంతో ఈ పోస్ట్ నిజమయ్యే ఛాన్స్ ఉందని అభిమానులు ఖుషీ అవుతున్నారు. న్యాయం కోసం ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టేశాడు! ఇక మరో పోస్ట్‌లో సందీప్ మాస్టర్ న్యాయం కోసం ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టాడని చెప్పుకొచ్చింది. అయితే ఇదే కాస్త అతిగా ఉంది. సందీప్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు అమర్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ప్రశాంత్ పేరెత్తినా కూడా చిరాకుపడేవాడు. కానీ షో నుంచి బయటకు రాగానే ప్రశాంత్‌కు ఏ లెవల్లో సపోర్ట్ ఉందో బాగా అర్థమైంది సందీప్‌కు. దీంతో అమర్‌ను పక్కన పెట్టేసి ప్రశాంత్‌కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. నిజానికి అమర్‌కు ఫౌల్ గేమ్స్ అనే ట్యాగ్ రావడానికి సందీప్ కూడా ఓ కారణమే! కానీ బయటకు వచ్చాక మాత్రం ఆ ట్యాగ్‌కు, తనకు ఏ సంబంధం లేదన్నట్లు వ్యవహరించాడు. చదవండి: క్రేజీ ఆఫర్.. 7 సెకన్ల టైమ్.. అమర్దీప్ అంత వేగంగా! -
'మీరు నాకు అన్యాయం చేశారు'.. ఆట సందీప్‌పై టేస్టీ తేజ పోస్ట్ వైరల్!
బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంతోమంది ఫేమస్ అవుతున్నారు. వారిలో చాలామంది సెలబ్రిటీలయ్యారు కూడా. అలానే ఈ ఏడాది సీజన్-7లో కొందరు సినీ ఇండస్ట్రీతో సంబంధంలేనివారు కూడా ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టగానే వారికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. అలాంటి వారిలో ఫేమస్ అయిన యూట్యూబర్, ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ. హౌస్‌లో అందరినీ అలరించిన టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అతనితో పాటు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న శుభశ్రీ రాయగురు, కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కూడా హోస్ నుంచి బయటకొచ్చేశారు. వీరంతా కలిసి బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లికి హాజరయ్యారు. అయితే వీరు ముగ్గురు కలిసి పెళ్లిలో సందడి చేశారు. డ్యాన్సులు చేస్తూ చిల్ అవుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే పెళ్లి వేడుకలో ఆటసందీప్, శుభశ్రీ కలిసి ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇది చూస్తూ పక్కనే ఉన్నా టేస్టీ తేజ వాళ్లద్దరి కెమిస్ట్రీని చూసి తట్టుకోలేకపోయారు. దీంతో వాళ్లిద్దరూ డ్యాన్స్ చేయడాన్ని చూస్తూ పక్కనే ఉన్న చెట్టుకు తల బాదుకుంటూ కనిపించారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఇది చాలా అన్యాయం సార్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇదంతా టేస్టీ తేజ సరదా కోసమే చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) -
ఆ ఒక్క ప్రశ్న అడగొద్దంటున్న తేజ.. ఇలా దొరికిపోయాడేంటి!
టేస్టీ తేజ.. సందీప్ మాస్టర్.. ఇద్దరూ హౌస్‌లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఎలిమినేట్ అయ్యాకే అసలు గొడవ మొదలైంది.. ఎనిమిది వారాలుగా నామినేషన్స్‌లోకి రాకుండా తనను తాను కాపాడుకుంటూ వస్తున్న సందీప్‌ను నామినేషన్స్‌లోకి లాక్కొచ్చాడు తేజ. దీంతో ఆ వారమే సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. దీన్ని ఆయన మనసులో పెట్టుకున్నాడు. అంతేకాదు, తేజ ఎలిమినేట్ అవుతున్నాడనగానే ఎగిరి గంతేశాడు. అందరినీ ఎలిమినేట్ చేస్తూ చివరకు తనే ఎలిమినేట్ అయ్యాడు అని సెటైర్లు కూడా వేశాడు. ఎవరు చెప్పేది నిజం? ఎవరు చెప్పేది అబద్ధం? అయితే సందీప్ మాస్టర్‌ను కావాలని నామినేట్ చేయలేదని, తనే అడిగి చేయించుకున్నాడని బిగ్‌బాస్ హౌస్‌లో కుండ బద్ధలు కొట్టి చెప్పాడు తేజ. అది అబద్ధం, నేనెందుకు అడిగి మరీ చేయించుకుంటానని ఆగ్రహించాడు సందీప్. ఈ విషయం దగ్గరే గొడవ మొదలైంది. వీరిద్దరిలో ఎవరు చెప్పేది నిజం? ఎవరు చెప్పేది అబద్ధం? అనేది అర్థం కాక అభిమానులు తల పట్టుకుంటున్నారు. తాజాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తేజకు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. సందీప్ మాస్టర్ నిన్ను అడిగి మరీ నామినేట్ చేయించుకున్నాడా? అని యాంకర్ అడిగాడు. తటపటాయించిన తేజ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు తేజ తటపటాయించాడు. 'హౌస్ లోపల ఏం జరిగిందనేది మీకు తెలియదు. దీని గురించి ఇప్పుడేం మాట్లాడదల్చుకోలేదు. సందీప్, నేను కలిసి ఈ విషయంపై ఓ వీడియో చేస్తాం' అంటూ ఆ ప్రశ్న దాటవేశాడు. తర్వాత ఏ ప్రశ్నలడిగినా టపీమని సమాధానాలు చెప్పుకుంటూ పోయిన తేజ ఈ ఒక్క విషయంపై మాత్రం మాట్లాడటానికే ఇష్టపడలేదు. దీంతో తప్పు తేజదేనా? అతడు కావాలనే అబద్ధం చెప్పి ఉంటాడా? అని అనుమానిస్తున్నారు జనాలు. సమాధానం చెప్పను అంటున్నాడంటే కచ్చితంగా తప్పు చేసినట్లే.. తేజ అడ్డంగా దొరికిపోయాడు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఓ టాస్కులో తనకు తెలియకుండానే గౌతమ్‌ను గట్టిగా కొట్టాడు తేజ. అందుకు అతడి ఇంటికి వెళ్లి మరీ గౌతమ్ పేరెంట్స్‌కు సారీ చెప్తానంటున్నాడు. చదవండి: తేజ తొమ్మిది వారాల్లో ఎంత సంపాదించాడంటే? -
తేజ ఎలిమినేట్.. వారికి రీ ఎంట్రీ ఛాన్స్
బిగ్ బాస్ సీజన్ - 7 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. 9 వారాల పాటు ఆటలొ కొనసాగిన ఆయన పాజిటివిటీని సంపాదించుకుని హౌస్ నుంచి వచ్చేశాడు. ఇలాంటి సమయంలో ఇప్పటికే 8 వారంలోనే ఎలిమినేట్ అయిన ఆట సందీప్ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందుకు వారు కొన్ని కారణాలను కూడా చెబుతున్నారు. ఎనిమిదో వారంలో సందీప్ నామినేషన్ లిస్ట్‌లోకి రావడానికి ప్రధాన కారణం తేజ అని తెలిసిందే.. అలా మొదటిసారి నామినేట్ కావడం ఆపై సందీప్ ఎలిమినేషన్ అవడం జరిగిపోయింది. అదే విధంగా తేజ ఎలిమినేషన్‌కు కారణం శివాజీ.. నామినేషన్ సమయంలో సందీప్ అంశాన్ని లేవనెత్తి తేజను నామినేట్ చేశాడు శివాజీ... ఇలా ఈ ముగ్గురి మధ్యనే గేమ్ నడిచింది. బిగ్ బాస్‌లో ఉన్నంత వరకు అమర్,శోభ బ్యాచ్‌లో సందీప్ ఉన్నాడు.. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా శివాజీ, పల్లవి ప్రశాంత్‌నే మెచ్చుకుంటూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదే సమయంలో అమర్,తేజ ఆట గురించి నెగటివ్‌గా మాట్లాడటం జరిగింది. ఇప్పటికే రతికా రోజ్‌కు రీ ఎంట్రీ అవకాశం ఇచ్చారు.. కానీ ఆమె అంతగా మెప్పించలేక పోయింది. దీంతో సందీప్‌కు ఉల్టాపుల్టా పేరుతో రీ ఎంట్రీ అవకాశం కల్పించాలని బిగ్‌బాస్ టీమ్ కూడా యోచిస్తుందట. అప్పుడు సందీప్ శివాజీ టీమ్ వైపు ఉంటాడా..? అమర్ బ్యాచ్ వైపు ఉంటాడా..? అనే విశయంలో రసవత్తరం మొదలౌతుంది. అన్నీ అనుకూలిస్తే మరో రెండు రోజుల్లో సందీప్ రీ ఎంట్రీ గ్యారెంటీ అని సమాచారం. బిగ్ బాస్‌లో సంచాలక్‌గా మాత్రమే ఆయన కొన్ని తప్పులు చేశాడు కానీ ఆటలో ఎక్కడా కూడా సహనం కోల్పోలేదు.. ఎలాంటి నెగటివ్ లేకుండా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. -
బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్
మూడో వారంలో దామిని.. నాలుగో వారంలో రతిక.. ఐదో వారంలో శుభ శ్రీ.. ఆరో వారంలో నయని.. ఏడో వారంలో పూజా.. ఎనిమిదో వారంలో సందీప్.. ఇలా మూడో వారం నుంచి ఎనిమిదవ వారం వరకు వరుసగా తేజా ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోతూ వస్తున్నారు. అయితే వరుసగా అందర్ని బయటకు పంపిన తేజ.. ఇప్పుడు తనే బయటకు వచ్చేశాడు. అయితే ఇప్పటికీ అధికారికంగా తెలియదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం నామినేషన్లో శివాజీ, గౌతమ్, ప్రశాంత్, అశ్విని మినహా మిగతా అందరూ ఉన్నారు. ప్రతి వారం మాదిరే ఈ వారంలో కూడా శోభా ఎలిమినేట్ అవతుందని అందరూ భావిస్తున్న సమయంలో ఆమె కెప్టెన్ కావడంతో సస్పెన్స్ మొదలైంది. కెప్టెన్ పేరుతో శోభ సేవ్ అయితే.. టేస్టీ తేజ ఎలిమినేట్ కావడం దాదాపు గ్యారెంటీ అని తెలుస్తోంది. దీంతో తేజ గురించి పలు మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని ఆట సందీప్ షేర్ చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి వారం నుంచి ఇప్పటివరకు తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోయారనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు తేజ నామినేట్ చేసిన ఆరుగురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ లిస్ట్‌లో వరుసుగా దామిని భట్ల,రతికా రోజ్, శుభ శ్రీ, నయని పావని, పూజా,ఆట సందీప్ ఉన్నారు. ఇలా మూడో వారం నుంచి వరుసగా తేజా ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ కావడంతో ఆయనది ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఇలా అందరినీ హౌస్ నుంచి బయటకు పంపిన తేజా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంపై ఆట సందీప్, తేజ గురించి పలు మీమ్స్ ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్నింటిని సందీప్ షేర్ చేశాడు. 'కర్మ ఇట్స్ బ్యాక్.. హౌస్‌లో మంచి ప్లేయర్ అయిన సందీప్‌ను చెత్త కారణాలతో పంపించేశావ్.. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి చెత్త రీజన్‌తో బయటకు వస్తున్నావ్..' అంటూ సందీప్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అవన్నీ కూడా నవ్వులు పూయించేలా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by Anandani Evaru Koorukoru...🤔 (@anandani_evaru_koorukoru) -
అందుకే నన్ను పంపించేశారు.. అతనంటే భయమా?: ఆట సందీప్
ఉల్టా పుల్టా అంటూ మొదలైన బిగ్ బాస్ షో అభిమానులను అలరిస్తోంది. ఈ వారంలో హౌస్మేట్స్ మధ్య నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. నామినేట్ చేసే సమయంలో కంటెస్టెంట్స్ మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఈసారి కూడా మరింత హాట్‌హాట్‌గా మారిపోయింది. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తవ్వడంతో బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ కోసం కంటెస్టంట్స్‌కు గేమ్ టాస్కులు ఇచ్చాడు. ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్‌లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా.. పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీ, ప్రియాంక, అర్జున్, అశ్విని గర్జించే పులులు టీమ్‌లో ఉన్నారు. రైతుబిడ్డ అవుట్! అయితే రెండు టీమ్స్‌కు బిగ్‌బాస్ మొదట జంపింగ్ జపాంగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో వీరికి అవతలి టీమ్‌లో ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందరూ మాట్లాడుకుని పల్లవి ప్రశాంత్‌ను గేమ్ నుంచి తప్పించారు. తనను ఆటలో నుంచి పక్కకు తోసేయడంతో రైతుబిడ్డ ఏడ్చేశాడు. శివాజీ తన చేతుల మీదుగా డెడ్ బోర్డును ప్రశాంత్ మెడలో వేయించారు. అతనంటే భయమా? అయితే తాజాగా పల్లవి ప్రశాంత్‌ను గేమ్ నుంచి తప్పించడంపై ఎలిమినేట్ అయిన సందీప్ మాస్టర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పాపం రా.. ప్రశాంత్ మంచి ప్లేయర్ ఎందుకు గేమ్ నుంచి పక్కన పెట్టారు. అతనంటే భయపడుతున్నారా? అందుకే గేమ్ నుంచి తప్పించారా? అని ప్రశ్నించారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ను పక్కన పెడితే గేమ్‌లో అసలు కిక్కే ఉండదు అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. గేమ్‌లో గట్టి పోటీనిచ్చేవారితోనే ఆడాలి..నేను స్ట్రాంగ్ ప్లేయర్ అయినందుకే నన్ను హోస్ నుంచి బయటికి పంపారు.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. -
తేజ నిజస్వరూపం బయటపెట్టిన సందీప్.. వెనకాల గోతులు తవ్వడం..
బిగ్‌బాస్ హౌస్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్నవారిలో టేస్టీ తేజ ముందు వరుసలో ఉంటాడు. బలమైన కారణాలు లేకుండా కంటెస్టెంట్లను ఊరికనే నామినేట్ చేస్తూ ఉంటాడు. అతడి హ్యాండ్ మహిమో, మరేంటో కానీ తను ఎవరినైతే నామినేట్ చేస్తున్నాడో వారు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. దామిని, రతిక, శుభశ్రీ రాయగురు, నయని పావని, పూజా మూర్తి, సందీప్.. ఇలా ఎవరో ఒకరు తేజ చేతిలో బలవుతూ వస్తున్నారు. ఇక సందీప్ స్ట్రాంగ్ ప్లేయర్ అని.. ఒక్కసారైనా నామినేషన్స్‌లోకి వస్తే తనకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని.. పాజిటివ్ వైబ్స్‌తో నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. కట్ చేస్తే సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. తేజ ప్రవర్తనకు బాధేసింది సందీప్ ఎలిమినేషన్‌కు ఒకరకంగా నువ్వే కారణమంటూ తేజను శివాజీ నామినేట్ చేశాడు. అయితే అప్పుడు తేజ ఓ మాటన్నాడు. సందీప్‌ను కావాలని నామినేట్ చేయలేదని, తనే అడిగి మరీ చేయించుకున్నాడని చెప్పాడు. దీనిపై ఆట సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజా ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నామినేషన్స్‌లో తేజ అలా మాట్లాడటం చూసి చాలా బాధపడ్డాను, అదే స్థాయిలో కోపం కూడా వచ్చింది. నేను హౌస్‌లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా నువ్వేం బాధపడకురా.. ఇంటికే వెళ్తున్నాను కదా అని పాజిటివ్‌గా మాట్లాడి హగ్ చేసుకున్నాను. తేజది ఐరన్ లెగ్! అలాంటిది నేను లేని సమయం చూసుకుని నామీద అబద్ధం చెప్పాడు. నేనే నామినేట్ చేయమని చెప్పానని అనడం తప్పు. తేజ చెప్పింది 100% ఫేక్. ఈ ఒక్క పాయింట్‌తో తనను బయటకు లాగేయొచ్చు. తేజది ఐరన్ లెగ్.. అందుకే బయటకు వచ్చేశాననుకుందాం. తేజ నామినేట్ చేసిన ఆరుగురు అలాగే వచ్చారు. సరే, జనాలు నన్ను బయటకు పంపించేశారనుకుందాం. కానీ, నేను అక్కడ లేనప్పుడు తను నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి నా గురించి అబద్ధం ఆడటం తప్పు. నామినేషన్స్‌లోనూ అదే వెటకారం నన్ను ఎలాగైతే నామినేట్ చేశాడో అర్జున్ను కూడా అలాగే వెటకారంగా నామినేట్ చేశాడు. నేను ఎలిమినేట్ అయినప్పుడు తేజ వెక్కివెక్కి ఏడ్చాడు. ఎప్పుడూ ఏడవని తేజ ఆ రోజు సోఫా మీద దొర్లి మరీ ఏడ్చాడు. ఎమోషన్స్ ఉండవన్న తేజ ఆ రోజు ఎంతగానో ఏడ్చాడు ఇప్పుడు నాకు ఎవరేంటనేది అర్థమవుతోంది. తనది సెల్ఫిష్ గేమ్.. ఇలా ఎవరి వెనకాల గోతులు తవ్వకూడదు' అని సందీప్ చెప్పుకొచ్చాడు. చదవండి: గౌతమ్ మాస్టర్ మైండ్.. రైతుబిడ్డ అవుట్.. ఏడ్చేసిన ప్రశాంత్ -
పల్లవి ప్రశాంత్‌పై సందీప్ పాజిటివ్ కామెంట్స్.. అదే కారణమా?
బిగ్‌బాస్ సీజన్-7 ఎనిమిదో వారం ముగిసింది. అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా టాప్-5లో ఉంటాడని భావించిన ఆట సందీప్ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. ఈ వారం నామినేట్ అయినవారిలో శోభాశెట్టి, సందీప్‌కు తక్కువ ఓట్లు రాగా.. చివరికీ సందీప్ బయటకు రావాల్సి వచ్చింది. ఏడు వారాలుగా నామినేషన్స్‌లో లేని అతను బయటికి వస్తాడని ఎవరూ అనుకోలేదు. అయితే తాజాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సందీప్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతను హౌస్‌లో వందశాతం గేమ్ బాగా ఆడుతున్నాడని ప్రశంసలు కురిపించారు. (ఇది చదవండి: ఆట సందీప్‌ను కొట్టిన పల్లవి ప్రశాంత్ .. ఎమోషనల్ అయిన జ్యోతిరాజ్) సందీప్ మాట్లాడుతూ..'రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఫేక్ హా, జెన్యూన్ అని నేను చెప్పలేను. తాను వందశాతం గేమ్ ఆడుతున్నాడు. అతనితో పాటు అందరూ కూడా గట్టిగానే వందశాతం ఎఫర్ట్ చూపిస్తున్నారు. ఆడని వాళ్లు హౌస్‌లో చాలామంది ఉన్నారు. నేను అనుకోలేదు ఇలా బయటకొస్తానని. మీరు ఎలా అయితే అనుకుంటున్నారో.. ఆడనివాళ్లు బయటకొస్తారని నేను అదే అనుకున్నా. అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నా. కానీ నా ఎలిమినేషన్ ఊహించలేదు. అమర్ లాస్ట్ టైమ్ నామినేషన్స్‌లో ప్రశాంత్ పట్ల మాట్లాడింది తప్పు. ఏదైతే ఆ పదం ఉందో 'ఈ నా కొడుకు' అన్నది తప్పు అన్న. దాన్ని నేను కూడా అంగీకరించను.' అంటూ ప్రశాంత్ పట్ల పాజిటివ్ కామెంట్స్ చేశారు. సందీప్ మాట్లాడుతూ..'ఇప్పటికీ హౌస్‌లో నా కన్నా తక్కువగా ఆడుతున్న వాళ్లు ఉన్నారు. రతిక రోజ్, భోలే షావలి ఆడిందేమీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే నా కన్నా ముందే భోలే వెళ్ల పోవచ్చని అనుకున్నా. హౌస్‌లో ఉన్నప్పుడు నా ఆటను నేను బాగానే ఆడా. ఒక గ్రూప్ అంటూ మమ్మల్ని వేరు చేయటం సరికాదు. పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అమర్‌దీప్‌లు టాప్-3లో ఉంటారు' అని చెప్పుకొచ్చారు. సోషల్ వార్ అయితే సందీప్ హౌస్‌లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేసే విషయంలో ఇద్దరి మధ్య కాస్తా వాదన జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రశాంత్ సపోర్టర్స్‌కు, సందీప్ భార్య జ్యోతిరాజ్కు మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచింది. అదే సమయంలో సందీప్ భార్య జ్యోతిరాజ్ను ఓ వీడియోను రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. ఈ విషయాన్ని ఇటీవలే ఇంటర్వ్యూలోనూ జ్యోతిరాజ్ ప్రస్తావించింది. పల్లవి ప్రశాంత్ మద్దతుగా ఉండేవాళ్లే అతన్ని ఎలిమినేట్ అయ్యేలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. బిగ్ బాస్ అనేది ఒక షో అని.. ఇందులో కుటుంబ సభ్యులను లాగడం మంచిది కాదని ఆమె చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకే సందీప్ అలా మాట్లాడి ఉంటారని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్.. సందీప్ ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ వార్‌కు ఎండ్ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. (ఇది చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?) -
'గట్టి పోటీ ఇచ్చావ్.. కానీ.. సందీప్ భార్య ఎమోషనల్'!
బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7వ సీజన్లో ఎనిమిదో వారం ముగిసింది. అయితే ఈ సారి ఆ సంప్రదాయానికి బిగ్ బాస్ చెక్ పండిది. ఏడు వారాలుగా మహిళా కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ కాగా..ఈ సారి మేల్ కంటెస్టెంట్ బయటకొచ్చేశాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా స్ట్రాంగ్ వికెట్ ఎదిరిపోయింది. బలమైన కంటెస్టెంట్, టాప్-5లో ఉంటాడని భావించిన కొరియోగ్రాఫర్ ఆట సందీప్ బయటకొచ్చేశాడు. ఈ వారంలో ఆయనకే తక్కువ ఓట్లు పడటంతో హౌస్‌కు గుడ్ బై చెప్పక తప్పలేదు. ఽ (ఇది చదవండి: అలాంటి నటించడమే తనకు చాలా ఇష్టం: యంగ్ హీరోయిన్) అయితే దాదాపు రెండు నెలల పాటు హోస్లో ఉన్న సందీప్ కుటుంబానికి దూరమయ్యాడు. ఈ సమయంలో తమ ఫ్యామిలీస్ నుంచి లేఖలు కూడా అందుకున్నారు. అయితే సందీప్ భార్య జ్యోతిరాజ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో భర్తకు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చింది. కచ్చితంగా విన్నర్‌గానే బయటకొస్తాడని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. తాజాగా సందీప్ ఎలిమినేట్ కావడంతో తీవ్ర భావోద్వేగానికి గురైంది. భర్తపై తన ప్రేమను చాటుకుంది. ఇంటికి సందీప్‌కు భోజనం తినిపిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. జ్యోతిరాజ్ రాస్తూ..'బిగ్‌బాస్ హౌస్‌లోకి చాలా బలంగా వెళ్లావ్. గట్టి పోటీ ఇచ్చావ్. అన్ని విధాలుగా నిరూపించుకున్నావ్. అంతే స్ట్రాంగ్‌గా బయటకొచ్చావ్. దీనికి ఇది మాత్రమే అంతం కాదు.' లవ్ సింబల్ జత చేస్తూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ సందీప్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఎనిమిది వారాల పాటు హౌస్‌లో ఉన్న సందీప్ దాదాపుగా రూ.22 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: వరుణ్- లావణ్య పెళ్లి.. నిహారికను ఫాలో అవుతోన్న కాబోయే కోడలు!) View this post on Instagram A post shared by Jyoti Raj (@jyothiraj_sandeep) -
Bigg Boss 7: సందీప్ ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
బిగ్‌బాస్ 7వ సీజన్లో స్ట్రాంగ్ వికెట్ పడిపోయింది. బలమైన కంటెస్టెంట్, టాప్-5లో ఉంటాడని అందరూ అనుకున్న కొరియోగ్రాఫర్ సందీప్ ఎలిమినేట్ అయిపోయాడు. ఎనిమిదో వారం తక్కువ ఓట్లు పడటంతో హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. వెళ్తూ వెళ్తూ ఎమోనషల్ అయ్యాడు. అలానే ఇన్నాళ్లు హౌసులో ఉండి గట్టిగా సంపాదించాడు. ఇంతకీ ఎన్ని లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నాడో తెలుసా? సందీప్ ఎలిమినేట్ ఈ వారం మొత్తం ఎనిమిది నామినేట్ అయ్యారు. వీళ్లలో ప్రియాంక, గౌతమ్ సేవ్ అయినట్లు శనివారం ఎపిసోడ్లో నాగ్ ప్రకటించాడు. మిగతా వాళ్లలో శివాజీకి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. భోలె, అమరదీప్, అశ్విని కూడా తమ తమ ఓటు బ్యాంకుతో బతికిపోయారు. చివరి రెండు స్థానాల్లో నిలిచిన శోభా, సందీప్.. ఎవరు వెళ్తారా అని కాస్త సస్పెన్స్ నడిచింది. ఫైనల్‌గా సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: సందీప్ ఎలిమినేట్.. ఏడుస్తూ ఆ నిజం చెప్పేసిన శోభా!) సీరియల్ బ్యాచ్ కష్టమే ప్రస్తుతం బిగ్‌బాస్ హౌసులో రెండు గ్రూపులు తయారయ్యాయి. శివాజీ ఒక దాన్ని నడిపిస్తున్నాడు. మరోవైపు అమరదీప్, ప్రియాంక, శోభాశెట్టి, సందీప్, తేజ ఓ గ్రూపుగా ఆడుతున్నారు. మొన్నీ మధ్య ఈ గ్రూపుల బాగోతం బయటపడింది. ఇప్పుడు సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోవడంతో సీరియర్ బ్యాచ్ బలహీనమైపోయింది. వచ్చే వారం నుంచి శివాజీ గ్రూప్, వీళ్లపై మరింతగా రెచ్చిపోతారేమో! రెమ్యునరేషన్ అన్ని లక్షలా? వచ్చే తొలివారమే హౌస్‌మేట్ అయిన సందీప్ ఐదువారాల ఇమ్యూనిటీ దక్కించుకున్నాడు. అది అయిపోయిన తర్వాత కూడా నామినేషన్స్‌లోకి రాలేదు. ఈసారి తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఎలిమినేట్ అయిపోయాడు. అయితేనేం దాదాపు ఎనిమిది వారాలు ఇంట్లో ఉన్నాడు. వారానికి రూ.2.75 లక్షలు చొప్పున.. రూ.22 లక్షలు పైనే వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా చూసుకుంటే ఇది మంచి అమౌంట్ అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో సందీప్ ఎలిమినేషన్.. ఆ ఒక్కటే మైనస్ అయిందా?) -
'బిగ్‌బాస్ 7'లో సందీప్ ఎలిమినేషన్.. ఆ ఒక్కటే మైనస్ అయిందా?
'బిగ్‌బాస్ 7' నుంచి అనుకోని విధంగా సందీప్ ఎలిమినేట్ అయిపోయాడు. చాలామంది శోభాశెట్టి అనుకున్నారు కానీ చివరవరకు వచ్చి ఆమె బతికిపోయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్-5లో ఉంటాడనుకున్న సందీప్ మాస్టర్ ఇలా ఎలిమినేట్ కావడం అందరినీ షాకయ్యేలా చేసింది. అసలు దీనికి కారణం ఏంటి? అసలు ఈ ఎలిమినేషన్ కరెక్టేనా? సందీప్ బ్యాడ్ లక్ సందీప్ పేరు చెబితే చాలామందికి తెలియకపోవచ్చు గానీ ఆట సందీప్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. రియాలిటీ షోల్లో డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్.. ప్రస్తుతం కొరియోగ్రాఫర్‌గానూ చేస్తున్నాడు. బిగ్‌బాస్‌లోకి వచ్చిన వారంలోనే తొలి హౌస్‌మేట్ అయిపోయాడు. అలానే ఐదు వారాల ఇమ్యూనిటీ సంపాదించాడు. ఇకపోతే పోటీపడిన ప్రతి గేమ్‌లోనూ ఆకట్టుకున్న సందీప్.. ఎనిమిదో వారం తొలిసారి నామినేట్ అయ్యాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: సందీప్ ఎలిమినేట్.. ఏడుస్తూ ఆ నిజం చెప్పేసిన శోభా!) సందీప్‌కి అదే మైనస్ అయితే ఈసారి నామినేషన్స్‌లో ఉన్నోళ్లందరూ ఇప్పటికే ఆల్రెడీలో ఈ ప్రొసెస్ దాటి వచ్చారు. దీంతో వాళ్లందరికీ ఓటు బ్యాంక్ ఏర్పడింది. సందీప్ మాస్టర్‌కి మాత్రం ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అదే మైనస్ అయింది. దీంతో మిగతా వాళ్లకు ఓట్లు పడ్డాయి. సందీప్‌కి చాలా తక్కువ పడ్డాయి. ఒకానొక దశలో శోభాశెట్టి ఎలిమినేట్ అవుతుందనుకున్నారు. కానీ సందీప్ బలైపోయాడు. అలానే బిగ్‌బాస్ నిర్వహకులు శివాజీ బ్యాచ్‌పై చూపిస్తున్న పక్షపాతం కూడా సందీప్ ఎలిమినేషన్‌కి ఓ కారణమని చెప్పొచ్చు. రెమ్యునరేషన్ అన్ని లక్షలు? ఇకపోతే దాదాపు 8 వారాల పాటు బిగ్‌బాస్ హౌసులో ఉండటం అంటే మంచి విషయమే. తొలి కొన్ని వారాలు తప్పితే.. మిగతా రోజుల్లో పోటీల్లో బాగా ఆడాడు. కొన్నింట్లో గెలిచాడు కూడా. ఇకపోతే ముందుగానే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సందీప్.. ఒక్కో వారానికి రూ.2.75 లక్షల రెమ్యునరేషన్ మాట్లాడుకున్నాడట. మొత్తం ఎనిమిది వారాలకు గానూ రూ.22 లక్షలకు పైనే సంపాదించినట్లు టాక్. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) -
బిగ్‌బాస్ 7: సందీప్ ఎలిమినేట్.. ఏడుస్తూ ఆ నిజం చెప్పేసిన శోభా!
బిగ్‌బాస్ 7లో షాకింగ్ ఎలిమినేషన్. చివరివరకు ఉంటాడని చాలామంది ఊహించిన సందీప్ మాస్టర్ హౌస్ నుంచి బయటకెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే అతడు ఎలిమినేట్ కాగానే కొన్ని అసలు నిజాలు బయటపడ్డాయి. వీటిలో శివాజీ, శోభా బయటపెట్టారు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 56 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. గేమ్స్‌తో టైంపాస్ ఎలిమినేషన్ నుంచి ప్రియాంక, గౌతమ్ సేవ్ కావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. అలా సరదా సరదాగా పడవ గేమ్‌తో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. మీతో పాటు పడవలో తోడుగా ఇద్దరుంటే వాళ్లలో ఎవరిని తోసేస్తారు? ఎవరిని ఉంచుతారు అని గేమ్ పెట్టారు. అలానే డైలాగ్ కొట్టు గురు! అని మరో గేమ్ పెట్టారు. ఇవి టైమ్‌పాస్ తప్పితే పెద్దగా అలరించలేదు. (ఇదీ చదవండి: 'సీతారామం' బ్యూటీ తెలుగింటి కోడలు కానుందా?) సందీప్ ఎలిమినేట్ ఆదివారం ఎపిసోడ్ లో వరసగా అశ్విని, అమరదీప్, శివాజీ, భోలె సేవ్ అయ్యారు. చివరగా శోభా, సందీప్ మిగిలారు. కాసేపు టెన్షన్ తర్వాత సందీప్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఇది చూసి తేజ, అమరదీప్ షాకయ్యారు. ఇక సందీప్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసి దగ్గర నుంచి శోభా ఏడుస్తూనే ఉంది. శివాజీ అయితే నువ్వు ఎలిమినేట్ అవుతావని అనుకోలేదని అన్నాడు. అంటే శోభా ఎలిమినేట్ అవుద్దని శివాజీ అనుకున్నాడు. కానీ అంచనా తప్పిందని బాధపడ్డాడు. ఇకపోతే వరసగా అమ్మాయిలు ఎలిమినేట్ కావడాన్ని సందీప్, తన ఎలిమినేషన్‌తో బ్రేక్ చేశాడు. సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసి.. 'వెళ్లిపోవద్దు మాస్టర్, మీరెళ్లిపోతే నేను ఉండలేను' అని శోభా బోరున ఏడ్చేసింది. హౌస్ నుంచి స్టేజీపైకి వెళ్లిన తర్వాత కూడా సందీప్‌ని చూస్తూ శోభా ఏడుస్తూనే ఉంది. అయితే సందీప్ ఎలిమినేట్ కావడం తమ బ్యాచ్‌ని బలహీనంగా చేస్తుందని శోభాకి అర్థమైంది కాబట్టి ఏడుస్తూ.. మీరు లేకపోతే ఉండలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అలా ఓ నిజం బయటపడినట్లు అయింది. సందీప్ వెళ్లిపోయాడు కాబట్టి అమర్-ప్రియాంక-శోభాపై శివాజీ బ్యాచ్ ఇంకా పగ, ప్రతీకారాలు చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) -
శోభ శెట్టి సేఫ్.. షాకిచ్చిన బిగ్ బాస్.. వారిద్దరిలో ఒకరు ఔట్
బిగ్‌బాస్ సీజన్ 7 సగం పూర్తి అయింది. ఎనిమిది వారాల తర్వాత తొలిసారి ఓ మేల్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి పోతున్నాడు. మొదటి ఏడు వారాలు లేడీ కంటెస్టెంట్లే హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. ఈ వారం నామినేషన్స్‌లో శివాజీ, బోలే, సందీప్, శోభా శెట్టి, అశ్విని, గౌతమ్, ప్రియాంక, అమర్ దీప్ ఉన్నారు. బిగ్ ఫైట్‌లో గెలిచిన శోభ బిగ్‌బాస్‌లో శివాజీ బ్యాచ్‌ను ఢీ కొట్టేది శోభ మాత్రమే కాబట్టి ఆమెను ఎలిమినేషన్ చేయాలనే ప్లాన్‌లో బయట ఉన్న శివాజీ పీఆర్ టీమ్ చాలా గట్టిగానే పోరాడింది. అలా శివాజీకి డప్పు కొట్టే బ్యాచ్ మొత్తం శోభాశెట్టిని టార్గెట్ చేసింది. కొందరైతే ఆమెపై ఏదో వ్యక్తిగత కక్ష ఉన్నట్లుగా కామెంట్లు చేయడం దారుణం. నామినేషన్ లిస్ట్‌లో శోభ పేరు చేరగానే ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం చేయడం ప్రారంభించారు. చివరకు బిగ్‌బాస్ సీజన్ 6లో సామాన్యుడిలా వెళ్లి తెలుగు ప్రేక్షకుల ప్రేమకు దగ్గరైన ఆదిరెడ్డి కూడా శివాజీ బ్యాచ్‌లోని సభ్యులకే ఎక్కువ సపోర్ట్‌గా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆదిరెడ్డి కూడా.. హౌస్‌లో శివాజీ చేస్తున్న పొలంగట్టు పంచాయితీలనే వెనుకేసుకొస్తున్నారు. ఒకట్రెండు సందర్భాల్లో మినహా శివాజీ బ్యాచ్‌నే ఆదిరెడ్డి కూడా వెనుకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు ఏ చిన్న తప్పులు చేసినా.. వాటిని ఆదిరెడ్డి కూడా హైలెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆదిరెడ్డికి మంచి ఆదరణ ఉంది. అతనికంటూ మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అతను చెప్పే ప్రతి మాటకు ప్రస్తుతం ఒక వ్యాల్యూ ఉంది. అలాంటి వ్యక్తి కూడా ఎక్కువగా శివాజీ బ్యాచ్‌నే వెనుకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శివాజీ బ్యాచ్ సేఫ్ అవుతున్నారని చెప్పవచ్చు. తన ఆటతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించే భోలే కూడా శివాజీ బ్యాచ్ అండతో సేఫ్ అవుతున్నాడు. ఎందుకు సేఫ్ కొన్నిసార్లు ఆటలో శోభ కూడా తప్పులు చేసి ఉండవచ్చు.. ఆమెతో పాటు శివాజీ బ్యాచ్ కూడా ఎన్నో తప్పులు చేశారు. ఎందుకోగానీ శోభాశెట్టి మీద విపరీతమైన వ్యతిరేకత పెంచడానికి గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నయ్. వాటంన్నిటినీ ఆమె మళ్లీ తిప్పికొట్టింది. హౌస్‌లో నిలిచింది. శివాజీ బ్యాచ్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేస్తున్నందువల్ల కావచ్చు. శివాజీ టీమ్‌ను శోభ మాత్రమే ఢీ కొడుతుంది. అలాంటిది ఆమెను హౌస్ నుంచి పంపిస్తే ఆటలో మజా ఉండదు. షో రేటింగ్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆమె సేఫ్ అయినట్లు తెలుస్తోంది. శోభ కూడా ఆటలో ఫైట్ చేస్తుంది. రెచ్చగొడుతుంది.. అప్పుడే ఏడుస్తుంది. కానీ ఏ టాస్కులనూ వదలదు. తన శక్తిమేరకు పోరాడుతుంది. ఏదేమైన ఆటలో ఉండాల్సిన కేరక్టర్ శోభ అని చెప్పవచ్చు. శివాజీ బ్యాచ్ అండతో ఆయన సేఫ్ ఎనిమిదో వారం బిగ్‌బాస్ నుంచి ఆట సందీప్ ఎలిమినేషన్ జరిగిపోయింది.. దాదాపు ఇదే ఖాయం. మొదటి వారంలోనే లక్కీగా ఐదు వారాలు ఎలిమినేషన్ల నుంచి ఇమ్యూనిటీ పొందాడు. ఇదే అతనికి బిగ మైనస్ అయింది. ఓట్లు వేసే వాళ్లు అతనికి చేరవు కాకుండా చేసింది. ఏడు వారల తర్వాత ఆయన ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉండటంతో ఓట్లు వేసే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. ఈసారి నామినేషన్లలో చేరడంతో ఇక లీస్ట్ వోట్లతో హౌజ్ నుంచి వెనుతిరగక తప్పలేదు. ఆటలో మరీ అంత బ్యాడ్ పర్ఫామెన్స్ సందీప్ ఇవ్వలేదు. కానీ శివాజీ బ్యాచ్ కాదు.. శోభాశెట్టి బ్యాచ్… అందుకే తన మీద కూడా బాగా వ్యతిరేకతను బయట ఉండే వారు క్రియేట్ చేశారు. ఆటల్లో, టాస్కుల్లో తను యాక్టివ్గానే ఉన్నాడు. కానీ చివరకు ఔటవ్వక తప్పలేదు. వాస్తవానికి ఈ వారం లక్కీ పర్సన్ భోలే.. ఆతను శివాజీ బ్యాచ్‌లో చేరడం వల్లే సేఫ్ అయ్యాడు. మరోవైపు శివాజీ టీమ్‌కు శత్రువు అయిన శోభతో వైరం క్రియేట్ చేసుకున్నాడు. దీంతో ఆయన సేఫ్ అయ్యాడని తెలుస్తోంది. -
'నీ మొగుడు వేస్ట్.. నేను చెప్పకూడని మాటలన్నారు': జ్యోతిరాజ్ ఎమోషనల్
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7లో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి హౌస్‌లో చురుకుగా ఉంటున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే అని తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన భార్య జ్యోతిరాజ్ సందీప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్ తమపై చేసిన కామెంట్స్‌పై స్పందించారు. వీళ్లంతా కలిసి అతన్ని ఎలిమినేట్ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు ఉందని జ్యోతిరాజ్ అన్నారు. తమపై ట్రోల్స్‌ను తలుచుకుని ఎమోషనలయ్యారు. (ఇది చదవండి: పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్) జ్యోతిరాజ్ మాట్లాడుతూ..'రియాలిటీ షో ఆయనకేం కొత్తకాదు. ఒక్కసారి దిగారంటే కప్పు కొట్టాల్సిందే. బిగ్ బాస్ అనేది ఒక కొత్త అనుభవం. డ్యాన్స్ వేరు. రియాలిటీ షో వేరు. సందీప్ ఎవరితోనైనా కలవడానికి కాస్తా టైం తీసుకుంటారు. అతను ఇంట్రావర్ట్. హౌస్‌లో ఇంతమందిలో కలవాలంటే కాస్తా సమయం పడుతుంది. మాకు ఒక డ్రీమ్ ఉంది. అందుకోసమే బిగ్‌బాస్‌లో వెళ్లాలని నిర్ణయించుకున్నాం. తను ఫైనల్‌గా పెద్ద హీరోలతో కొరియోగ్రఫీ చేయాలన్నదే ఆశయం.'అని అన్నారు. పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్ ట్రోల్స్‌పై స్పందిస్తూ..'ప్రశాంత్‌కు వాళ్లు సపోర్ట్ చేయడం లేదు. ఇంకా చెడగొడుతున్నారు. మమ్మల్ని ఇంకా హార్ట్ చేస్తూనే ఉన్నారు. మాపై అసభ్యంగా ట్రోల్స్ చేయడం చాలా తప్పు. ఫ్యామిలీని ఇందులోకి లాగడం మంచిదేనా?. ఆ విషయంలో నేను వీడియో పెట్టగానే అసభ్యకరమైన కామెంట్స్. నీ మొగుడు వేస్ట్.. అంటూ చెప్పకూడని మాటలు అన్నారు. షోలో ఉన్నవారి కుటుంబాల గురించి మాట్లాడమేంటి? ప్రశాంత్‌తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ప్రశాంత్ జోలికొస్తే మిమ్మల్ని వదలం. నీ మొగుడికి చెప్పు.. ప్రశాంత్ జోలికి రావొద్దని. ఇంకా కొన్ని మాటలైతే నేను చెప్పలేనంత అసభ్యంగా మాట్లాడారు. దానివల్ల ఎవరికీ చెడ్డపేరు. తమ్ముడు ప్రశాంత్‌కే కదా. అతను లోపలికి వెళ్లేటప్పుడు నాకు సపోర్ట్ చేయండ్రా అని చెప్పేసి వెళ్లాడు. కానీ వీళ్లంతా కలిసి వాడిని ఎలిమినేట్ చేసేలా ఉన్నారు. వీళ్లంతా కలిసి ప్రశాంత్‌కు బ్యాడ్‌నేమ్ తెస్తున్నారు.' అని అన్నారు. (ఇది చదవండి: గ్రాండ్‌గా ఆ హీరో హీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా) కాగా.. ఇప్పటికే బిగ్‌బాస్‌లో ఉన్న సందీప్‌పై ట్రోల్స్‌పై జ్యోతిరాజ్ స్పందించారు. జీవితంలో సందీప్ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు.. ఆయనొక కళాకారుడిగా గుర్తింపు ఉంది. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగారు. అలాంటి వ్యక్తిపై కొందరు యూట్యూబర్స్ చీప్ థంబ్‌నైల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జ్యోతిరాజ్ ఆవేదన చెందారు. అందరిలాగే అతనికి కూడా ఫ్యామిలీ ఉందని మరిచిపోవద్దని తెలిపారు. అలాంటి వాటి వల్ల తామెంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. -
బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?
'బిగ్‌బాస్ 7' షో ఇప్పుడు మంచి మజా ఇస్తోంది. ఎందుకంటే చోటామోటా కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయారు. సగం రోజులు కూడా అయిపోయాయి. దీంతో ఎవరికి వాళ్లు హౌసులో ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎంతటి గొడవకైనా వెనుకాడటం లేదు. మరోవైపు ఈసారి ఎనిమిది నామినేట్ కాగా అందులో ఓ స్టార్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ గట్టిగా ఉంది. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరో తెలుసా? హౌసులో రెండు గ్రూపులు బిగ్‌బాస్ షో నిర్వహకులు చెప్పేదాని ప్రకారం.. హౌసులో ఎవరికి వాళ్లు గేమ్ ఆడాలి. కానీ ప్రస్తుత సీజన్లో మాత్రం రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. పెద్ద మనిషి అని చెప్పుకొంటున్న శివాజీ.. యవర్, ప్రశాంత్, భోలెకి అండగా నిలుస్తున్నాడు. మొన్నటివరకు ఇది అంత పెద్దగా బయటపడలేదు. ఇప్పుడిప్పుడే అసలు నిజాలు బయటకొస్తున్నాయి. మరోవైపు అమరదీప్, శోభా, ప్రియాంకతో పాటు సందీప్ ఓ గ్రూపుగా ఉన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఎలిమినేషన్ మజా ప్రతిసారి ఎలిమినేషన్లో ఎవరో ఒకరు వీక్ కంటెస్టెంట్ ఉండేవాళ్లు. దీంతో వాళ్లు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని తెలిసేది. కానీ ఈసారి అలా కాదు. శివాజీ, భోలె, అమరదీప్, సందీప్, శోభాశెట్టి, ప్రియాంక, గౌతమ్, అశ్విని.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లు.. స్ట్రాటజీలతో గేమ్ ఆడుతున్నారు. దీంతో ఎవరూ ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తి పెరిగింది. శోభాకి గండం? అయితే ఈసారి శివాజీకి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. అనుహ్యంగా భోలె రెండో స్థానంలో ఉన్నాడట. తర్వాతి స్థానాల్లో వరసగా అమరదీప్, అశ్విని, గౌతమ్, ప్రియాంక ఉన్నట్లు సమాచారం. ఇక చివరి రెండు స్థానాల్లో సందీప్, శోభాశెట్టి దాదాపు ఒకేలా ఓట్లు పడ్డాయట. కానీ శోభాశెట్టిపై ఎలిమినేషన్ వేటు తప్పదని అంటున్నారు. ఒకవేళ అలా కాదంటే మాత్రం సందీప్ మాస్టర్ బయటకెళ్లిపోవడం గ్యారంటీ. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా సరే పెద్ద షాకింగే అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
మా నాన్న కూడా ఊరోడే.. ఇప్పుడేంటి ప్రశాంత్?: నాగ్ ఫైర్
ఈ వారం నామినేషన్స్ భలే రసవత్తరంగా సాగాయి. భోలె బూతులు మాట్లాడటం.. అది వినలేక ప్రియాంక, శోభ చిందులు తొక్కడం.. ప్రశాంత్ తనను ఊరోడన్నారని బాధపడటం.. నేను అనలేదు మహాప్రభో అని సందీప్ మాస్టర్ తన కళ మీద ఒట్టేయడం.. ఇలా చాలానే జరిగాయి. వీటన్నింటి గురించి మాట్లాడేందుకు వచ్చేశాడు నాగార్జున. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. కుండ బద్ధలు కొట్టిన నాగ్ బిగ్‌బాస్ హౌస్‌లో కుండ బద్ధలు కొట్టి చెప్పాల్సిన నిజాలున్నాయంటూ నాగ్ మొదలుపెట్టాడు. మొదట అశ్విని కుండ బద్ధలు కొట్టిన నాగ్.. రేయ్, పోరా అని మాట్లాడుతున్నావ్ అని చెప్పగానే ఆమె బిక్కముఖం వేసింది. ఇక భోలె కుండ బద్ధలు కొట్టిన నాగ్.. ఎర్రగడ్డ అనే పదం ఎందుకు వచ్చింది? అని నిలదీశాడు. దీనికి భోలె.. శోభ సెన్స్ లేదు అనేసరికి అలా అనాల్సి వచ్చిందని చెప్పాడు. సెన్స్‌లెస్‌కు మెంటల్‌కు చాలా తేడా ఉందని గరమయ్యాడు కింగ్. అమర్ కేక్ తినడం అవసరమా? అమర్ కేక్ తిన్నప్పుడు బిగ్‌బాస్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. గ్రూపిజమా? అని శోభను ప్రశ్నించాడు నాగ్. తర్వాత అమర్‌తో మాట్లాడుతూ.. అంత ఆత్రంగా కేక్ తినడం అవసరమా? నువ్వు చేసిన పని వల్ల ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నావో తెలుసా? అని అడగడంతో నీళ్లు నమిలాడు అమర్. తేజ అందరినీ రెచ్చగొడుతున్నాడన్నాడు నాగ్. ఇక నామినేషన్స్‌లో సందీప్ మాస్టర్ తనను ఊరోడు అని చులకన చేశాడని నానా రభస చేసిన సంగతి తెలిసిందే! తాను అనలేదని సందీప్ ప్రమాణం వేసి మరీ చెప్పాడు. ఆ విషయాన్ని గుర్తు చేసిన నాగ్.. సందీప్ ఒట్టేసినప్పుడు నువ్వెందుకు వేయలేదని ప్రశ్నించాడు. ఏడుపందుకున్న ప్రశాంత్ 'ఒకరి మీద నింద వేసేటప్పుడు నిజమై ఉండాలి. ఇవన్నీ కాదు.. అసలు ఊరోడు అనడం తప్పా?' అని సూటిగా ప్రశ్నించాడు. 'అందరూ ఊరి నుంచే వచ్చారు. అందరికీ తిండి పెట్టేది ఊరే.. నేను గర్వంగా చెప్తున్నాను మా నాన్న ఊరోడు. సగర్వంగా చెప్తున్నా.. అందులో తప్పే లేదు' అని కౌంటరిచ్చాడు. దీంతో ప్రశాంత్ ఎప్పటిలాగే ఏడుపు అందుకున్నాడు. చదవండి: సింగర్ గీతా మాధురితో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన నందు! -
అమర్దీప్ మీద కేకలేసిన శోభ, కేక్ కోసం ఫైటింగ్!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు గులాబీపురం, జిలేబిపురం అనే గ్రామస్థులుగా విడిపోయారు. వీరిలో ఏ గ్రూపు గ్రహాంతరవాసులను మెప్పిస్తుందో ఆ గ్రూపులోని వారు కెప్టెన్సీకి పోటీపడతారు. ఇప్పటికే ఓ టాస్కులో జిలేబిపురం గెలిచింది. మరి తాజా(అక్టోబర్ 19) ఎపిసోడ్లో ఎవరు గెలిచారు? అనేది చూసేద్దాం.. మళ్లీ బుసలు కొట్టిన మోనిత గులాబీపురం, జిలేబిపురం గ్రామప్రజలుగా కంటెస్టెంట్లు జీవించేస్తున్నారు. ఇక తేజ అయితే పెళ్లి రోజు, తొలి రాత్రి అంటూ శోభా శెట్టితో సరసాలాడాడు. మిగతావారు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఎవరికి వారు తమ టాలెంట్ చూపించారు. ఇంతలో అండర్ వాటర్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో అమర్-సందీప్ బాగానే కష్టపడ్డారు. కానీ చివరకు జిలేబిపురాన్ని గెలిపించాడు సందీప్. దీంతో శోభాలో ఉన్న మోనిత ఒక్కసారిగా నిద్రలేచింది. గెలుస్తానన్న నమ్మకం లేకపోతే వెళ్లకూడదు.. ప్రతీది ఓడిపోతున్నాం అంటూ అమర్దీప్ మీద అరిచేసింది. బోణీ కొట్టిన గులాబీపురం.. తర్వాత స్పేస్ షిప్ ఛాలెంజ్‌లో ప్రశాంత్, గౌతమ్ పోటీపడ్డారు. ఈసారి టాస్కులో గౌతమ్.. గులాబీపురాన్ని గెలిపించాడు. దీంతో మొదటి బోణీ కొట్టడంతో గులాబీపురం గ్రామస్తుల ముఖాలు వికసించిపోయాయి. అయితే జిలేబీపురానికి చెందిన ప్రియాంక డల్‌గా కూర్చోవడంతో ఆమె దగ్గరకు వెళ్లిన అమర్.. మాకొచ్చింది ఒకటేలే.. సల్లబడు అన్నాడు. సల్లబడు ఏంటి? ఓవర్‌గా మాట్లాడకు అని ఫైర్ అయింది. నేను సరదాగా అన్నానంటూ అమర్ చెప్పినా తను పట్టించుకోలేదు. అలిగి వెళ్లిపోయింది. తర్వాత ప్రియాంక దగ్గరకు వెళ్లిన అమర్ సారీ చెప్పాడు. మొన్నటివరకు శివాజీ, ప్రశాంత్‌తో గొడవపడ్డ అమర్దీప్ ఈరోజు తన స్నేహితులిద్దరితోనూ మాటలు పడాల్సి వచ్చింది. శోభా పేరు పచ్చబొట్టు వేయించుకోమన్న బిగ్‌బాస్ ఇదిలా ఉంటే కిచెన్‌లో టాటూ గురించి కబుర్లు చెప్పుకున్నారు తేజ, శోభ, పూజా మూర్తి. ఇది విన్న బిగ్‌బాస్ పచ్చబొట్టు వేయించుకోవచ్చుగా అని తేజకు సలహా ఇచ్చాడు. సరదాగా అన్నాడేమో అని లైట్ తీసుకునేలోపే పదేపదే పచ్చబొట్టు విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. శోభ పేరు టాటూ వేయించుకోవాలని, ఏ డిజైన్ కావాలో సెలక్ట్ చేసుకో అని ఓ పేపర్ కూడా పంపించాడు. అసలే పెళ్లి కావాల్సినవాడిని, ఈ పచ్చబొట్టు నా వల్ల కాదంటూ బిగ్‌బాస్‌కు మొర పెట్టుకున్నాడు తేజ. బయటకు వెళ్లాక (పెళ్లికి) అవకాశముందని చెప్తే వేయించుకుంటానని తేజ అనగా వేయించుకో అని ఆటపట్టించింది శోభ. అమర్ మీద పడ్డ శోభ రాత్రి తేజ కోసం బిగ్‌బాస్ ఓ కేక్ పంపించాడు. దానిపై శోభ అని రాసి ఉంది. ఇది ముగింపు కాదు, ముందుంది ముసళ్ల పండగ అంటూ ఓ లేఖ సైతం పంపాడు. తనకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో అని జుట్టు పీక్కున్నాడు తేజ. ఇంతలో అమర్.. కేక్‌ను ఎంతసేపు చూస్తూ కూర్చోవాలని ఓ ముక్క లటుక్కున తినేశాడు. అప్పుడు తేజ, శోభ.. ఇద్దరూ అమర్ మీద అరిచారు. కేక్ మీద నా పేరుంది.. ఎలా తిన్నావని ఆగ్రహించింది శోభ. శోభకు ఐ లవ్ యూ చెప్పిన తేజ చాలా సేపు తల గోక్కున్న తర్వాత తేజ కేక్ కట్ చేసి అందరికీ తలా ఓ ముక్క ఇచ్చాడు. అంతా అయిపోయాక శోభను గార్డెన్‌కు పిలిచాడు. కేక్ ఎందుకు పంపించాడు? దానిపై నీ పేరు ఎందుకు రాశాడు? అంటూ ప్రశ్నల చిట్టా చదివాడు తేజ. ఏదో చెబుతావనుకుంటే సోది చెప్తున్నావంటూ శోభా కోపంగా లేచింది. దీంతో తేజ సడన్‌గా ఐ లవ్ యూ చెప్పడంతో థూ అని ఊసేసి ముందుకు వెళ్లిపోయింది శోభ. మొత్తానికి తేజ-శోభ లవ్ ట్రాక్ కోసం బిగ్‌బాస్ గట్టిగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. చదవండి: ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్ రివ్యూ -
నాగార్జునకు ఆ స్థాయి ఉంటే ఏదైనా అనేస్తాడా?: జ్యోతి రాజ్
బిగ్‌బాస్ షోలో పాపులారిటీ పెంచుకునేవాళ్లు, ఇమేజ్ డ్యామేజ్ చేసుకునేవాళ్లు.. ఇలా రెండు రకాలు ఉంటారు. ఇందులో ఆట సందీప్ రెండో కేటగిరీకి చెందుతాడు. కొరియోగ్రాఫర్‌గా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న అతడు ఆ మధ్య తన భార్య జ్యోతి రాజ్‌తో కలిసి నీతోనే డ్యాన్స్ షోలో పాల్గొన్నాడు. పార్టిసిపేట్ చేయడమే కాదు షో విజేతగానూ అవతరించారు. ప్రస్తుతం సందీప్ మాస్టర్ బిగ్‌బాస్ 7 తెలుగులో పాల్గొన్నాడు. ఇక్కడ తన మాటలతో, ప్రవర్తనతో ఎక్కడలేని నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. దీంతో అతడిని చాలాసార్లు నెటిజన్లే కాదు హోస్ట్ నాగార్జున సైతం తిట్టిపోశాడు. నీకు కళ్లు కనిపించడం లేదా? నువ్వేమైనా పిస్తావా? అంటూ విమర్శించాడు. నాగార్జున అలా అనడం నచ్చలే! అయితే ఈ విమర్శలను జీర్ణించుకోలేకపోయింది సందీప్ భార్య జ్యోతిరాజ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నాగార్జున సడన్‌గా అలా అనేశారేంటి? అనిపించింది. సందీప్ భార్యగా మాత్రం నాకది నచ్చలేదు. ఒక భార్యగా నా భర్త నాకు గొప్ప. అక్కడ ఉన్నది నాగార్జున అయినా మోదీ అయినా ఎలాంటి గొప్పవాళ్లు అయినా సరే నా భర్తే నాకు గొప్ప. అయినా నా భర్తను అలా అనేశాడేంటి? నాగార్జునకు ఆ స్థాయి ఉంటే ఎంత మాటైనా అనేస్తాడా? సర్లే.. ఇదొక గేమ్ షో కదా, తప్పదనుకున్నాను. నా భర్త నటించట్లేదు.. అదే నాగార్జునగారు సందీప్‌ను గ్రేట్ అన్నాడు, నువ్వేమైనా పిస్తావా? అన్నాడు. గేమ్ ఆయన చేతిలో ఉంది. మనం ఆయన బోనులోకి వెళ్లాం కాబట్టి పడాల్సిందే! ఇలాంటివి చూస్తున్నప్పుడు నేను బాధపడను. ఇండస్ట్రీలో పొగడ్తలు, విమర్శలు.. రెండూ ఉంటాయి. అన్నీ దాటుకుని ముందుకు వెళ్లినవారే సక్సెస్ అవుతారు. నా భర్త హౌస్‌లో నటిస్తున్నాడంటున్నారు. బిగ్‌బాస్ అనేది డ్యాన్స్ షో కాదు. అతడికి తన ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మాత్రమే అగ్రెషన్ ఉంటుంది. మిగతా సమయాల్లో కూల్‌గా ఉంటాడు. బిగ్‌బాస్ అనేది ఫ్యామిలీ షో. అక్కడ కోపం చూపించాలని తను అనుకోలేదు. కావాలని తనను డిస్టర్బ్ చేస్తున్నారు తనకు కాల్ వచ్చింది, వెళ్లాడు. గెలిచినా, ఓడినా.. ఆడియన్స్ మనసులు గెలుచుకుని రావాలని చెప్పాం. సందీప్ ఒరిజినాలిటీ ఇదీ అని అందరికీ తెలియాలన్నాం. సందీప్ మాస్టర్‌ను కావాలని కొందరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఆయన కూల్‌గా ఉండాలనే ప్రయత్నిస్తున్నాడు. ఆయన తిరిగిచ్చాడంటే తన ముందు ఎవరి నోళ్లు కూడా పనికిరావు. అంత డబుల్ ఇచ్చేస్తాడు. ఆయన టాస్కులపై ఫోకస్ పెడుతున్నాడు. బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. కొత్తగా బిగ్‌బాస్ నుంచి వచ్చే ఫేమ్ ఏముంది సందీప్‌కు? ఆల్రెడీ ఆయనేంటో నిరూపించుకున్నాడు' అని చెప్పుకొచ్చింది జ్యోతి రాజ్. చదవండి: రీఎంట్రీ ట్విస్ట్.. ప్రేక్షకులని మోసం చేస్తున్నారా? -
ఆట సందీప్‌ను కొట్టిన పల్లవి ప్రశాంత్ .. ఎమోషనల్ అయిన జ్యోతిరాజ్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్‌గా ఈయన చాలామందికి సుపరిచితం. బిగ్‌బాస్ సీజన్-7లో ఆయన టాప్ కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే అని తెలిసిందే. వారిద్దరూ డ్యాన్స్ బరిలో దిగితే గెలుపు ఖాయం అని తెలిసిందే. (ఇదీ చదవండి; గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. పెళ్లి తర్వాత ఈ పొరపాటు చేయడంతో) తాజాగా బిగ్‌బాస్‌లో ఉన్న సందీప్‌పై పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆయన భార్య జ్యోతిరాజ్ స్పందించారు. జీవితంలో సందీప్ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు.. ఆయనొక కళాకారుడిగా గుర్తింపు ఉంది. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అలాంటి వ్యక్తిపై కొందరు యూట్యూబర్స్ చీప్ థంబ్‌నైల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జ్యోతిరాజ్ ఆవేదన చెందారు. అందరిలాగే అతనికి కూడా ఫ్యామిలీ ఉందని మరిచిపోవద్దని తెలిపారు. అలాంటి వాటి వల్ల తామెంతో బాధపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. 'యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బు, వ్యూస్ కోసం ఒక మనిషిని ఎంత నీచంగా అయినా మాట్లాడుతారా.. అలాంటి తప్పుడు వీడియోలతో వచ్చిన డబ్బుతో ఎప్పటికీ బాగుపడరు. అన్యాయంగా ఒకరిని తొక్కుతూ.. మరోకడు పైకి రావాలని ఆకాంక్ష ఎందుకు..? బిగ్‌బాస్‌లో గెలిచేవాడు గెలుస్తాడు. ఆట నుంచి బయటకు వచ్చేవాడు వస్తాడు. అంతేగానీ ఈ చీప్ ట్రిక్స్ ఎందుకు..? అందరిలాగే ఆట సందీప్ కూడా బిగ్‌బాస్‌తో మంచిపేరు రావాలి.. ప్రజల్లో మరింత గుర్తింపు దక్కాలనే వెళ్లాడు. కానీ ఒకరిని గెలిపించేందుకు బయట కొందరు చేసే దందా ఎంతవరకు కరెక్ట్..? వారు కోరుకున్న వ్యక్తి గెలవాలని ఎదుటివారిపై నీచమైన కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారిలో కొందరు సందీప్‌పై చేస్తున్న కామెంట్ల వల్ల నాతో పాటు మా కుంటుంబం ఎంతో బాధపడుతుంది.' అని ఆమె భావోద్వేగానికి గురైయారు. ఆట సందీప్‌ను కొట్టిన పల్లవి ప్రశాంత్ 'ఆట సందీప్‌ను కొట్టిన పల్లవి ప్రశాంత్' అని పలువురు తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి వీడియో చేశారు. మరికొందరు అదే స్థాయిలో చెడు కామెంట్లు కూడా చేస్తున్నారని జ్యోతిరాజ్ ఇలా తెలిపారు. 'అసలు పల్లవి ప్రశాంత్ కుక్కకొట్టుడు కొట్టడం ఏంటి..? ఎవరు పల్లవి ప్రశాంత్..? ఎవరు ఆట సందీప్..? అదీ డబ్బుతో వచ్చే విలువ కాదు. కళతో వచ్చే విలువ. ఎంతో కష్టపడి సందీప్ ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. పల్లవి ప్రశాంత్ తమ్ముడికి అందరూ సపోర్ట్ చేయండి.. నేనూ కూడా చేస్తాను.. తప్పులేదు. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా అందరం గుర్తించాలి. ఎంతో కష్టపడి అతను కూడా ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇలాంటి థంబ్‌నైల్స్ పెట్టడంతో పాటు ఒక మనిషిని మరోక వ్యక్తితో పోల్చి డీగ్రేడ్ చేయకండి. ఇదీ చాలా తప్పు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్న. బిగ్‌బాస్‌లోని అమ్మాయిల్ని కూడా కొందరు నోటికి వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. వారందరూ కూడా తమ కుటుంబాన్ని వదిలేసి అక్కడ ఉన్నారు. అలాంటి వారి గురించి తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆట సందీప్ అంటే ఒక అబ్బాయి కాబట్టి సరేలే అనుకోవచ్చు కానీ ఒక అమ్మాయిని నీచంగా తిట్టడం వల్ల ఆమె కెరియర్ పరిస్థితి ఏంటి. దయచేసి బిగ్‌బాస్‌లోని ఆడపిల్లల గురించి చెడు కామెంట్లు చేయకండి.' అని జ్యోతిరాజ్ ఎమోషనల్ అయ్యారు. -
'బిగ్‌బాస్ 7' ఫస్ట్ కెప్టెన్‌గా రైతుబిడ్డ.. కానీ అతడిని గాయపరిచాడు!
బిగ్‌బాస్ హౌసులో రైతుబిడ్డ సత్తా చూపించాడు. చాలామంది ఇతడిని తక్కువ అంచనా వేశారు కానీ హౌస్ కి మొట్టమొదటి కెప్టెన్ అయి చూపించాడు. అయితే ఈ క్రమంలోనే గేమ్ ఆడుతూ ఓ కంటెస్టెంట్ ని గాయపరిచాడు. దీంతో ఆ గొడవ చాలా సీరియస్ అయ్యేసరికి మిగతా కంటెస్టెంట్స్ శాంతింపజేశారు. అలానే ప్రశాంత్ ఓ విషయంలో బతికిపోయాడు. ఇంతకీ ఏంటి సంగతి? అసలు శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day-33 హైలైట్స్‌లో చూద్దాం. సందీప్ గుక్కపట్టి ఏడుపు చిట్టి ఆయిరే అనే టాస్కులో మధ్యలో ఉండగానే గురువారం ఎపిసోడ్ పూర్తయింది. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. సందీప్-అమరదీప్ జోడీని పిలవగా.. అమ్మ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని చెబుతూ సందీప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు భార్య గురించి విని, ఆమె పేరు చూసి చాలారోజులైందని అమర్ ఏడ్చాడు. ఫైనల్‌గా అమరదీప్ త్యాగం చేయడంతో సందీప్ మాస్టర్ గుక్కపట్టి ఏడుస్తూ లెటర్ చదివాడు. అలానే కెప్టెన్సీ రేసులో నిలిచాడు. ప్రశాంత్ విషయంలో శివాజీ త్యాగం చేశాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) ఫైనల్ టాస్క్‌లో గోల ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా రెండు రౌండ్స్ దాటుకుని.. చివరగా తేజ, సందీప్, ప్రశాంత్, గౌతమ్ రేసులో నిలిచారు. వీళ్లకు 'రంగు పడుద్ది రాజా' అనే టాస్కుని బిగ్‌బాస్ నిర్వహించాడు. ఈ గేమ్‌లో భాగంగా ఓ సర్కిల్ ఉంటుంది. అందులో అందరూ నిలబడి ఒకరు మరొకరి టీ షర్ట్‌పై చేతులతో రంగు పూయాలి. ఎండ్ బజర్ మోగేలోపు ఎవరి టీ షర్ట్‌పై ఎక్కువ రంగుంటే వాళ్లు ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. తొలి రౌండులో భాగంగా సందీప్ మాస్టర్ టీ షర్ట్‌ని లాగేశాడు. అయితే లాగడంతోపాటు ముఖంపై కొట్టాడని సందీప్, ప్రశాంత్‌పై ఆరోపణలు చేశాడు. ఈ గొడవ చాలాసేపు నడిచింది. సంచాలక్ ప్రియాంక దీన్ని సరిదిద్దింది. అయితే తొలి రౌండ్లో సర్కిల్ దాటాడని తేజని ఎలిమినేట్ చేశారు. రెండో రౌండ్లో సందీప్ ఒక్కడిని.. గౌతమ్-ప్రశాంత్ కలిసి టార్గెట్ చేసి కలర్ ఎక్కువ పూశారు. దీంతో అతడు ఎలిమినేట్ అయిపోయాడు. ఫైనల్ రౌండ్లో గౌతమ్-ప్రశాంత్ ఒకరిపై ఒకరు పోటీపడి మరి కలర్స్ పూసుకున్నారు. రౌండ్ పూర్తయిన తర్వాత వీళ్లిద్దరినీ చాలాసేపు పరీక్షించిన ప్రియాంక.. ప్రశాంత్‌ని విజేతగా ప్రకటించింది. అతడికి కెప్టెన్ అని రాసున్న బ్యాడ్జి పంపారు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'మ్యాడ్' సినిమాలో కామెడీతో ఇచ్చిపడేశాడు.. ఈ కుర్రాడెవరో తెలుసా?) -
'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్‌పై శివాజీ ఎమోషనల్!
ఈ ఏడాది బిగ్‌బాస్ చూస్తున్న వారు ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఏదో గొడవ జరగడం తప్ప ఏముంది అని ఫీలవుతుంటారు. ఎందుకంటే మొదటి వారం నుంచే నామినేషన్స్, ఎలిమినేషన్స్‌తో హీటెక్కించారు. నాలుగు వారాలుగా హాట్‌హాట్‌గా సాగిన బిగ్‌బాస్.. ఐదో వారంలో మాత్రం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కి.. తమ కుటుంబ సభ్యుల పట్ల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. (ఇది చదవండి: త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!) తాజాగా ప్రోమో విడుదల కాగా.. అందులోని సీన్స్ ఆడియన్స్‌ను సైతం కంటతడి పెట్టించేలా ఉన్నాయి. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటి సభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కానీ కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! అలా ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే.. మరొకరికి మాత్రమే ఉత్తరం చదువుకునే అవకాశం ఉంది. అంటే ఎవరో ఒకరు తమ ఉత్తరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య ఫుల్ ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. అయితే ఈ ప్రోమోలో అమర్దీప్ తన భార్యను తలుచుకుని కంటతడిపెట్టాడు. అమర్దీప్ మాట్లాడుతూ.. ఇంతవరకు తేజును బాగా చూసుకున్నానో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని విలువలు తెలిసొచ్చాయి. కన్నాను చూడగానే అదే పిలిచినట్లు అనిపించింది. తేజు ఐ యామ్ సో సారీ. నీ విలువ తెలిసింది నాకు అంటూ బోరున ఏడ్చేశారు. ఆట సందీప్ కోసం తన భార్య పంపిన లెటర్‌ను అమర్ త్యాగం చేశాడని తెలుస్తోంది. (ఇది చదవండి: చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ, అమ్మ అనారోగ్యంతో ఉందంటూ సందీప్..) ఇక శివాజీ, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మధ్య ఎమోషన్స్‌తో హౌస్ నిండిపోయింది. శివాజీ మాట్లాడుతూ..'ఎక్కడో ఊరి నుంచి వచ్చావు.. అన్న అంటూ హగ్ చేసుకున్నావ్.. నేను నా లెటర్‌ను గివ్ అప్ చేస్తున్నా. నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంటది. తనను నేను ఎంత బాగా చూసుకున్నానో నాకు తెలవదు కానీ.. నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు నా మాట విను అంటూ' పల్లవి ప్రశాంత్ కోసం తన భార్య పంపిన లెటర్‌ను శివాజీ త్యాగం చేసినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమో చూస్తేనే కంటెస్టెంట్స్ మధ్య భావోద్వేగాలు ఆడియన్స్‌ను సైతం ఫుల్ ఎమోషనల్‌గా టచ్ చేశాయి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో ఎవరెవరు లెటర్స్‌ను త్యాగం చేశారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ, అమ్మ అనారోగ్యంతో ఉందంటూ సందీప్..
బిగ్‌బాస్ గ్యారేజ్.. ఇచట అన్నిరకాల మనుషులు ఉంటారు. కోపిష్టిలు, సహనశీలులు, ఆవేశపరులు, ఆలోచనాపరులు, శక్తిమంతులు, బుద్ధిహీనులు, సహృదయులు, కఠినాత్ములు.. ఇలా భిన్నరకాల మనుషులుంటారు. హౌస్‌లోకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నా బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఎంతో కొంత నేర్చుకునే వెళ్తారు. ప్రస్తుత సీజన్లో ఇంటిసభ్యుల మధ్య ఆప్యాయత కన్నా కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాస్కుల్లో తెగ కష్టపడుతున్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఈరోజు గుడ్‌న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పనున్నట్లు కనిపిస్తోంది. ఈమేరకు తాజాగా ప్రోమో విడుదలైంది. ఇందులో బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటిసభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కానీ ఇప్పటికే కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే మరొకరు ఉత్తరం చదువుకోవాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్లు ఎమోషనలయ్యారు. చేతిదాకా వచ్చిన ఉత్తరాన్ని చదువుకునే భాగ్యం కూడా దక్కకుండా పోయిందేనని కొందరు ఏడ్చేశారు. ఇక సందీప్.. తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని.. తనకు ఈ ఉత్తరం ఎంతో అవసరమని చెప్తాడు. మదర్ సెంటిమెంట్ అయ్యేసరికి అమర్ తనతో వాదించలేకపోతాడు. అటు శుభశ్రీ సైతం తనకు ఈ లెటర్ కావాలని ఏడ్చేసింది. ఎప్పుడూ నవ్వించే తేజ కూడా ఉత్తరాన్ని చేతిలోకి తీసుకోగానే బోరుమని విలపించాడు. మరి ఎవరెవరికి ఉత్తరం చదివే ఛాన్స్ వచ్చింది? ఎవరు తమ లెటర్‌ను చింపేసి త్యాగానికి సిద్ధపడ్డారు? అనేది తెలియాలంటే నేటి ఎమోషనల్ ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక? -
ఆ కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ బిగ్ షాక్.. అదేంటో తెలుసా?
ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఇక ఐదోవారం మొదలవ్వగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు పవర్ అస్త్రను సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. అయితే ఐదోవారం మొదటి రోజే పవరాస్త్రాలను బిగ్ బాస్ వెనక్కి తీసుకున్నారు. దీంతో హౌస్‌లో ఈ వారంలో నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పటికే ఈ రోజుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమోలో పవరాస్త్రాలను వెనక్కి తీసుకున్న తర్వాత కంటెస్టెంట్స్ రియాక్షన్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: 'బిగ్‌బాస్'కే నీతులు చెబుతున్న శివాజీ.. హౌస్‌లో ఇకపై కష్టమే!) ప్రోమో ప్రారంభంలోనే శుభశ్రీ, గౌతమ్ మధ్య రొమాంటిక్ సీన్స్‌తో మొదలైంది. నేను మాట్లాడికే ఇష్టం లేదా అంటూ గౌతమ్‌ను ప్రశ్నిస్తుంది శుభశ్రీ. దీనికి గౌతమ్ లాయల్టీ ఉంది కాబట్టి భరిస్తున్నా అంటాడు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాఫీ కూడా ఇవ్వలేని బతుకా నాది అనిపిస్తుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్‌గా మారిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ పవరాస్త్రాలను తిరిగివ్వాలని ఆదేశిస్తాడు. దీంతో ఆట సందీప్, పల్లవి ప్రశాంత్, శోభాశెట్టి తమ పవరాస్త్రాలను బిగ్ బాస్ చెప్పిన విధంగానే ఓ పెట్టెలో భద్రపరుస్తారు. దీంతో ఆ ముగ్గురి పవరాస్త్రాలు పోవడంతో శివాజీ అవహేళనగా మాట్లాడతాడు. శివాజీ హేళన చేయడం శోభాశెట్టికి ఆగ్రహం తెప్పిస్తుంది. కొందరు ఉంటారు.. మనం బాగుపడకపోయినా ఫరవాలేదు.. పక్కవాడు మాత్రం అస్సలు బాగుపడకూడదు అనేవాళ్లు అంటూ శివాజీని ఉద్దేశించి మాట్లాడింది. అయితే ఇప్పటికే శివాజీ తన పవర్ అస్త్రను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమో చూస్తే ఇక ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ మొదలవగా.. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్‌ను కూడా నామినేట్ చేసే అవకాశం వచ్చింది. మరీ ఈ వారంలో ఎవరూ సేఫ్ అవుతారో.. ఎవరెవరు నామినేషన్స్‌లో నిలుస్తారో వేచి చూడాల్సిందే. -
శివాజీ తిక్క కుదిర్చిన బిగ్‌బాస్.. ఇచ్చింది లాగేసుకున్నాడు!
బిగ్‌బాస్ షోలో మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా వీకెండ్ ఎపిసోడ్ మంచి క్రేజీగా ఉంటుంది. అయితే గత మూడు శనివారాలు పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోయాయి. ఈసారి మాత్రం వాదన-ప్రతివాదనలతో హీటెక్కిపోయింది. నాగార్జున ప్రతి ఒక్కరిపై కౌంటర్స్ వేశారు. మరి ఇంతకీ బిగ్‌బాస్ హౌసులో శనివారం ఏం జరిగిందనేది Day 27 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. సందీప్ గట్టిగా పడ్డాయ్ స్టేజీపైకి వచ్చీ రావడంతోనే శుక్రవారం ఏం జరిగిందో చూసిన నాగార్జున.. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేశారు. అస్సలు లేటు చేయకుండా సంచాలక్ సందీప్‌తో నాగ్ మాట్లాడారు. 'నువ్వేమైనా గుడ్డోడివా, నీ కళ్లముందు ఏం జరుగుతుందో కనబడట్లేదా?' అని స్మైల్ ప్లీజ్ టాస్కులో తేజ, గౌతమ్ మెడపై తాడు వేసి లాగడం గురించి అడిగారు. ఆ సమయంలో సంచాలక్ అయినా సైలెంట్‌గా ఉండటం తప్పే అని నాగ్ గట్టిగా ఇచ్చిపడేశాడు. సంచాలక్‌గా పూర్తిగా ఫెయిలయ్యావ్ అంటూ నాగ్ ఖరాఖండీగా చెప్పేశాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) శివాజీ పరువు పాయే అదే టాస్కులో ఫొటోలు తీస్తున్న మరో సంచాలక్ అయిన శివాజీపై కూడా నాగ్ కౌంటర్స్ వేశాడు. 'కెమెరా నుంచి నీకు ఏం జరుగుతుందో కనబడట్లేదా?' అని అన్నాడు. తాను అరిచానని శివాజీ చెబితే, నువ్వు గౌతమ్, తేజని లాగుతున్నప్పుడు అరిచావ్ తప్పితే తేజ, గౌతమ్ ని మెడపై తాడు పెట్టి లాగుతున్నప్పుడు అరవలేదని వీడియో ప్లే చేశాడు. దీంతో శివాజీ పరువు పోయినట్లయింది. 'హౌసులో నువ్వు వీక్ కంటెస్టెంట్స్ తరఫున, న్యాయం వైపు ఉంటావని నేను నమ్ముతున్నాను. కానీ ఇది చూసినప్పుడు నాకు న్యాయం అనిపించలేదు' అని శివాజీ బిహేవియర్ గురించి నాగ్ కుండబద్దలు కొట్టేశాడు. తేజకి పనిష్మెంట్ ఇక తప్పు చేసిన తేజని ఎందుకలా చేశావ్? అని నాగ్ అడగ్గా.. తనకు ఆ సమయంలో ఏం చేస్తున్నానో మొదట ఐడియా రాలేదని అన్నాడు. తెలిసిన తర్వాత ఆపేశానని తన వాదన చెప్పాడు. అయితే లేడీ కంటెస్టెంట్స్ ఆపమని చెబుతున్నా కూడా ఎందుకు ఆపలేదని నాగ్ అడగ్గా.. అది ఎంకరేజ్మెంట్ అనుకున్నానని తేజ అన్నాడు. దీనిపై నాగ్ మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరి తేజని ఏం చేద్దామంటావ్ అని సంచాలక్ సందీప్‌ని అడగ్గా.. హౌస్ నుంచి పంపేస్తే బెటర్ అని అన్నాడు. కానీ హౌసులో ఉన్నోళ్లు అందరి నిర్ణయం బట్టి.. తేజని జైలులో పెట్టడంతోపాటు ఇంటి పనులన్నీ చేయాలని పనిష్మెంట్ ఇచ్చారు. ఈ తప్పు చేసినందుకు గానూ వచ్చే వారం నేరుగా నామినేట్ చేస్తున్నట్లు నాగ్ అల్టిమేటం ఇచ్చారు. (ఇదీ చదవండి: రతిక మంచి అమ్మాయి, తనను వాడుకున్నారు.. స్క్రీన్‌షాట్ వైరల్) శుభశ్రీ, గౌతమ్‌పై కౌంటర్స్ క్యాష్ టాస్కులో శివాజీ.. తన పైపైకి రావడం గురించి శుభశ్రీ చెప్పింది. తనకు ఇబ్బందిగా అనిపించదని అనగా.. హౌస్మేట్స్ అందరితో మాట్లాడిన తర్వాత అది గేమ్‌లో భాగంగా జరిగిందని నాగ్ అన్నాడు. అలానే నామినేషన్స్‌లో భాగంగా ప్రశాంత్ చెప్పిన విషయమై గౌతమ్‌ని నాగ్ అడిగాడు. వీడియో ప్లే చేయగా ప్రశాంత్ చెప్పిందే నిజమని తేలింది. దీని తర్వాత ఇప్పటికే హౌస్మేట్స్ అయిన వారిలో ఎవరు అనర్హులు అనుకుంటున్నారని.. కన్ఫెషన్ రూంలోకి ఒక్కొక్కరికి పిలిచి మరీ నాగ్ అడిగాడు. కంటెస్టెంట్- చెప్పిన హౌస్‌మేట్ పేరు యవర్ - సందీప్ రతిక - శివాజీ అమరదీప్ - శివాజీ తేజ - ఎవరూ లేరు ప్రశాంత్ - సందీప్ శుభశ్రీ - సందీప్ ప్రియాంక - ఎవరూ లేరు గౌతమ్ - శివాజీ అయితే కన్ఫెషన్ రూంలోకి పిలిచి అడగ్గా.. సందీప్, శివాజీని చెరో ముగ్గురు నామినేట్ చేశారు. మళ్లీ బయటకొచ్చిన తర్వాత అందరినీ అడగ్గా.. సందీప్‌ని ముగ్గురు, శివాజీని ఏకంగా ఆరుగురు నామినేట్ చేస్తున్నట్లు చేతులు పైకెత్తారు. కన్ఫెషన్ రూంలో ఎవరి పేరు చెప్పన ప్రియాంక-తేజ.. బయటకొచ్చిన తర్వాత శివాజీ పేరు చెప్పారు. శోభాశెట్టి కూడా శివాజీ పేరు చెప్పింది. అలా హౌస్‌మేట్‌గా ఉన్న శివాజీ తన ప్రవర్తన కారణంగా హౌసులోని వాళ్లకు నచ్చక తిరిగి కంటెస్టెంట్ అయ్యాడు. దీంతో అతడి పవరస్త్రని వెనక్కి తీసుకున్నారు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఈ వారం ఎలిమినేట్ కాబోయే ఆ దురదృష్టవంతులు ఎవరనేది తెలుస్తుంది. అప్పటివరకు Stay Tune To సాక్షి! (ఇదీ చదవండి: 'వినయ విధేయ రామ' బ్యూటీపై క్యాస్టింగ్ కౌచ్.. షాకింగ్ కామెంట్స్) -
వీడియోతో దొరికిపోయిన తేజ.. బయటకు పంపించేద్దామంటూ పనిష్మెంట్!
'బిగ్‌బాస్ హౌస్‌లో హింసకు చోటు లేదు' ఈ నియమం ఇప్పటిది కాదు. తొలి సీజన్నాటి నుంచే ఈ రూల్ ఉంది. అయినా టాస్కులు జరిగేటప్పుడు కొన్నిసార్లు ఈ రూల్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అప్పుడు నాగార్జున చేత కంటెస్టెంట్లకు కోటింగ్ కూడా ఉంటుంది. ఈ సారీ అదే జరిగింది. కాకపోతే ఇదేమీ కొట్టుకునేంత ఫిజికల్ టాస్క్ కాదు. అయినా తేజ బెల్ట్‌తో గౌతమ్‌ను టపాటపా కొట్టాడు. హౌస్‌లో ఉన్నవాళ్లకు ఎలా ఉందో కానీ చూసే జనాలకు మాత్రం గొడ్డును బాదినట్లు బాదాడనిపించింది. తను కావాలని చేయకపోయినా బెల్ట్‌తో మెడపై అంత గట్టిగా కొట్టడం.. అక్కడున్నవాళ్లు వద్దని హెచ్చరిస్తూ కేకలు పెడుతున్నా తన చర్యలు ఆపకోవడం గమనార్హం. ఇలాంటి అరాచకాన్ని ప్రశ్నించేందుకు రెడీ అయ్యాడు నాగార్జున. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గౌతమ్‌ను తేజ ఎలా బాదాడో వీడియో చూపించాడు నాగ్. సంచాలకుడిగా ఉన్న సందీప్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని విమర్శించాడు. అన్నింటికీ బాస్‌లా పోజు కొట్టే శివాజీ సైతం నిమ్మకు నోరెత్తనట్లు ఉండటంతో అతడినీ ఏకిపారేశాడు. మీ ఇద్దరికీ కళ్లు కనబడట్లేదా? అని తిట్టిపోశాడు. తర్వాత తప్పు చేసిన తేజను చెడుగుడు ఆడుకున్నాడు. అక్కడ అమ్మాయిలు భయంతో అరుస్తుంటే వినబడట్లేదా? అని నాగ్ ప్రశ్నించగా.. అది ఎంకరేజ్మెంట్ అనుకున్నానని నీళ్లు నమిలాడు తేజ. తేజ చేసిన తప్పుకు ఏ శిక్ష వేయాలని కంటెస్టెంట్లనే తిరిగి ప్రశ్నించాడు నాగ్. శుభశ్రీ.. అతడిని జైల్లో వేయాలంది. ప్రియాంక.. జైలు శిక్ష కూడా తక్కువేనంది. సందీప్ అయితే ఏకంగా అతడిని బయటకు పంపించేయాలన్నాడు. దీంతో తేజ తప్పు తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చదవండి: ఓటీటీలో నిత్యా జోరు, మరో కొత్త వెబ్ సిరీస్ డేట్ వచ్చేసింది.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా! -
హౌస్‌లో అందాల పోటీ.. నాకేం తక్కువా అంటూ అమర్ దీప్ ఫైర్!!
బిగ్ బాస్ సీజన్-7 తెలుగు ఈ ఏడాది ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే మూడు వారాల్లో వరుసగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాలుగో వారానికి సంబంధించి ఇప్పటికే ఆరుగురు నామినేషన్స్‌కు ఎంపికయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, ప్రియాంక జైన్, రతిక రోజ్, ప్రిన్స్ యావర్ ఉన్నారు. అయితే హౌస్‌లో కొత్త కొత్త టాస్క్‌లు ఇస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు పరీక్ష పెడుతున్నారు. తాజాగా ఇవాళ రిలీజైన బిగ్ బాస్ ప్రోమోలో సరికొత్త టాస్క్‌ను పరిచయం చేశారు. ఈ ప్రోమో చూస్తే హౌస్మేట్స్ మధ్య అందాల పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ విచిత్రమైన గెటప్స్‌లో కనిపించి సందడి చేశారు. అయితే ఈ పోటీల్లో ఎవరో ఒకరిని విజేతగా ప్రకటించాల్సిన బాధ్యత జడ్జిలుగా వ్యవహరిస్తున్న శివాజీ, ఆట సందీప్, శోభాశెట్టిపైనే ఉంది. అయితే అందాల పోటీల్లో కంటెస్టెంట్స్ అందరూ ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత ఈ పోటీలో విజేతగా శుభ శ్రీ అంటూ జడ్జిలు ప్రకటిస్తుండగా.. అమర్ దీప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మీ జడ్జ్‌మెంట్‌పై నాకు అనుమానం ఉంది. నేను మాట్లాడాక చెప్పండి అన్నాడు. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ నేను మీకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించాడు. దీంతో హౌస్ ఒక్కసారిగా హాట్ హాట్‌గా మారిపోయింది. మీకు ఇష్టమైనవారినే విజేతలుగా నిర్ణయిస్తారా అంటూ ఫైరయ్యాడు. అయితే దీనికి శివాజీ సైతం రిప్లై ఇచ్చాడు. సుబ్బు ఇన్నోవేటివ్‌గా అనిపించింది చెప్పిన డ్రెస్సెస్ ప్రకారం.. ముందు నువ్వు రూల్ బుక్ చూసి మాట్లాడు అంటూ అమర్‌దీప్‌కు కౌంటరిచ్చాడు. అయితే ఇవన్నీ వాడుకోమని చెప్పారు.. కానీ ఇవన్నీ చెప్పలేదు సార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోమో చూస్తే ఈ రోజు జరగనున్న ఎపిసోడ్లో అందాల పోటీ మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు కనిపస్తోంది. -
సీరియల్ బ్యాచ్‌ని వాయించేసిన నాగార్జున.. తప్పుల్ని గుర్తుచేస్తూ!
'బిగ్‌బాస్' షో అంటే నామినేషన్స్, కంటెస్టెంట్స్ మధ్యగొడవలు, వీకెండ్ లో నాగార్జున ప్రతి ఒక్కరికీ వేసే కౌంటర్స్ ఇలా ఉండాలి. కానీ ఈసారి అలాంటివి ఏం లేకుండా మూడో వారం చివరకొచ్చేసింది. ఇలాంటి టైంలో నాగ్ రూట్ మార్చారు. హౌసులో సీరియల్ బ్యాచ్‌గా పేరు తెచ్చుకున్న అమరదీప్, శోభాశెట్టిని నాగ్ ఓ రేంజులో ఆటాడేసుకున్నాడు. ఇంతకీ ప్రోమోలో ఏముంది? ముందు పెట్టిన గేమ్‌లో అమరదీప్తో మరో ఇద్దరు కూడా ఫెయిలయ్యారు. ఈ కారణంతో అతడు గేమ్ ఆడటానికి అనర్హుడని ప్రియాంక చెప్పింది. ఈ విషయాన్ని పాయింట్ ఔట్ చేసిన నాగ్.. దీన్ని ఒప్పుకొంటున్నావా? అని అమరదీప్ నే డైరెక్ట్‌గా అడిగేశాడు. దీంతో అతడు తల అడ్డంగా ఊపుతూ నో అన్నాడు. అలాంటప్పుడు నీ పాయింట్ ఎందుకు బయటపెట్టుకోలేదని అమర్‌ని నాగ్ అడిగాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) 'అసలు నువ్వు నీకోసం ఆడుతున్నావా? ప్రియాంక కోసం ఆడుతున్నావా?' అని ఓ రేంజులో అమరదీప్‌కి నాగార్జున ఇచ్చిపడేశాడు. తన కోసమే తాను ఆడుతున్నా అని అమర్ చెప్పగా.. మరే అదే పాయింట్ ప్రశాంత్ చెబితే ఎందుకు గోల చేశావ్ అని నాగ్ ఆటాడేసుకున్నాడు.వీకెస్ట్ (బలహీనమైన) కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేయమన్నారు, మరి నువ్వేమన్నావ్.. యవర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి, సైడ్ చేసేశావ్. అంటే దీనిబట్టి నువ్వు వీక్ కంటెస్టెంట్ అని ఒప్పుకొంటున్నట్లే కదా అని శోభాశెట్టితో నాగ్ అన్నాడు. దీంతో ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలానే సంచాలక్‌గా సందీప్ ఫెయిలయ్యాడని నాగ్ ఇచ్చిపడేశాడు. ఆట మధ్యలో అసలు ఇన్వాల్స్ కాకూడదు, మరి నువ్వు ఎందుకు పాయింట్స్ ఇస్తున్నావ్ అని సందీప్‌ని ఓ రేంజులో ఆడేసుకున్నాడు. హౌజులో ఉన్నవాళ్ల అభిప్రాయం తీసుకుని.. అతడి బ్యాటరీ లెవల్ పచ్చ నుంచి పసుపునకు తగ్గించాడు. ప్రోమో చూస్తుంటే ఈసారి మంచి హీట్ ఉండబోతుందనిపిస్తుంది. అదే టైంలో ప్రోమో చూసి మోసపోవద్దని కూడా అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?) -
పాపం గౌతమ్.. కష్టమంతా వృథా! బిగ్‌బాస్ ప్లాన్ అదేనా?
బిగ్‌బాస్ ఇంట్లో మూడో హౌస్‌మేట్‌గా ప్రమోషన్ పొందేందుకు కంటెస్టెంట్లు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో చిత్రవిచిత్ర టాస్క్లుపెడుతున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే పవరస్త్ర కోసం సెలక్ట్ చేసిన ముగ్గురికే కాకుండా వారిని ఛాలెంజ్ చేసిన వారికి సైతం టాస్కులు ఇచ్చాడు. ఇంతకీ హౌస్‌లో తాజా ఎపిసోడ్లో (సెప్టెంబర్ 21) ఏమేం జరిగిందో చూసేద్దాం.. చికెన్ ముక్కల్ని లాగించిన శోభా మూడో పవరాస్త్ర కోసం బిగ్‌బాస్.. ప్రిన్స్ యావర్, అమర్దీప్, శోభా శెట్టిని సెలక్ట్ చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులో గెలిచి తాను కంటెండర్‌గా పోటీ చేసేందుకు అర్హుడినేనని నిరూపించుకున్నాడు ప్రిన్స్. ఈరోజు మిగతా ఇద్దరి వంతు వచ్చింది. మొదటగా శోభా శెట్టిని పిలిచాడు బిగ్‌బాస్. అసలు కారమే అలవాటు లేని తన ముందు అత్యంత కారమైన చికెన్ ముక్కలు పెట్టి వీలైనన్ని ఎక్కువ తినాలని టాస్క్ ఇచ్చాడు. ఎంతో కారంగా ఉన్నా సరే 27 ముక్కల్ని లాగించేసింది శోభా. గౌతమ్ కదా విన్నర్? ఇక ఆమె కంటెండర్‌గా పోటీ చేయడాన్ని ఛాలెంజ్ చేసిన పల్లవి ప్రశాంత్, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణలకు సేమ్ టాస్క్ ఇచ్చాడు. తక్కువ సమయంలో 28 చికెన్ పీసులు తినాలని చెప్తూ సందీప్‌ను సంచాలకుడిగా నియమించాడు. గౌతమ్ 28 తినేసి బెల్ కొట్టాడు. అయితే అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న సంచాలక్.. తర్వాత మాత్రం ఒక పీస్ కొద్దిగా వదిలేశావంటూ ఒక నెంబర్ తగ్గించి 27 పీసులే తిన్నట్లు పేర్కొన్నాడు. శోభా శెట్టి కంటే ఎక్కువ తినలేకపోవడంతో బిగ్‌బాస్ ఆమెనే కంటెండర్‌గా ఎంపిక చేశాడు. గుండు గీయించుకునేందుకు భయపడ్డ అమర్ ఇక శివాజీ పవరాస్త్రను కొట్టేసిన అమర్దీప్.. చివరకు దాన్ని వెనక్కు ఇచ్చేశాడు. అనంతరం అసలు సిసలైన ఫిట్టింగ్ పెట్టాడు బిగ్‌బాస్. అమర్‌దీప్‌ను గుండు గీయించుకోవాలన్నాడు. లేదంటే అతడిని ఛాలెంజ్ చేసిన ప్రియాంక బేబీకట్ చేయించుకోవాలన్నాడు. తను గుండు గీయించుకోవడమా? నెవర్.. ఆ ఊహే భయంకరంగా ఉందన్నట్లుగా వణికిపోయాడు అమర్. ఓపక్క ఏడుస్తూనే అమ్మాయిలకు ఇలాంటి హెయిర్‌కట్ అంటే మామూలు విషయం కాదంటూ హెయిర్‌కట్‌కు రెడీ అయిపోయింది ప్రియాంక. అప్పటిదాకా కన్నీళ్లు.. అద్దంలో చూసుకున్నాక.. అప్పటివరకు కన్నీళ్లు పెట్టుకున్న ఆమె తర్వాత మాత్రం.. గతంలో ఇలా చిన్నగా హెయిర్‌కట్ చేయించుకోవాలనుకున్నాను. క్యూట్‌గా ఉన్నాను అంటూ మురిసిపోయింది. ఇదంతా చూస్తుంటే ఈసారి పవరాస్త్రను బిగ్‌బాస్ ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మాయిలకే ఇవ్వాలని ఫిక్సయిపోయినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ప్రిన్స్‌ను ఓడించి శోభా, ప్రియాంకలలో ఎవరైనా ఒకరు పవరాస్త్ర గెలుచుకుని మూడో హౌస్‌మేట్‌గా ప్రమోషన్ పొందుతారా? లేదా? అనేది చూడాలి. చదవండి: ఆ వ్యాధి వల్ల సినిమాలు, ఊరు వదిలేసి వెళ్లిపోయా: మమతా -
వీళ్లంతా బఫూన్స్.. ఏంది రతిక.. నీ లొల్లి.. హౌస్ మొత్తానికి బీపీ తెప్పించావ్!
బిగ్‌బాస్ 7లో ఉన్నవారంతా కంటెస్టెంట్లే.. హౌస్‌మేట్స్‌గా ప్రమోషన్ పొందాలంటే తను పెట్టే టాస్కులు గెలవాలి, తనను ఇంప్రెస్ చేయాలి.. అప్పుడే ఇంటిసభ్యులవుతారని బిగ్‌బాస్ మెలిక పెట్టిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఉన్న 14 మందిలో ఆట సందీప్ తొలి ఇంటిసభ్యుడిగా పేరు తెచ్చుకోగా మిగతావారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం హౌస్‌లో మాయాస్త్ర టాస్క్ నడుస్తోంది. మరి ఈ టాస్కులో ఏం జరిగాయి? హౌస్‌లో ఏం జరిగింది అనేది తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 9)లో చదివేద్దాం. దొరికేసిన పవరాస్త్ర శుభశ్రీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎలాగో మాయాస్త్రలో ఏ పవర్ అస్త్రను గెలవలేకపోయాం కదా అని సందీప్ మాస్టర్ దగ్గరున్న పవర్ అస్త్రను కొట్టేసింది. పోనీ.. అదైనా జాగ్రత్తగా దాచిందా అంటే అదీ లేదు. కిచెన్‌లో దాయడం, అప్పటికే సందీప్ మాస్టర్ సహా పలువురు దానికోసం వెతుకులాట మొదలుపెట్టడం, అమర్దీప్ దాన్ని వెతికి మాస్టర్ చేతికివ్వడం జరిగిపోయింది. దీంతో శుభశ్రీ అంత ఈజీగా దొరికిపోయిందేంటి అని బిత్తరముఖం వేసుకుంది. బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ తెల్లారిన తర్వాత బిగ్‌బాస్ మాయాస్త్ర టాస్క్‌ను తిరిగి కంటిన్యూ చేశాడు. ఈ మాయాస్త్ర ద్వారా నాలులుగు వారాల ఇమ్యూనిటీతో పాటు ఈ వారం కూడా ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. మహాబలి టీం సభ్యులు.. రణధీర సమూహంలో ఎవరైతే పవరాస్త్ర పొందేందుకు అనర్హులో కారణం చెప్పి వారి దగ్గరున్న మాయాస్త్ర భాగాన్ని అదే గ్రూప్‌లోని మరో సభ్యుడికి ఇవ్వాల్సి ఉంటుంది. చివర్లో ఏ ఇద్దరి దగ్గర ఎక్కువ మాయాస్త్ర భాగాలు ఉంటే వారు పవరాస్త్ర కోసం పోటీ పడతారు. మొదటగా శుభశ్రీ వెళ్లి.. శోభా శెట్టి దగ్గరున్న మాయాస్త్ర భాగాన్ని ప్రిన్స్ యావర్‌కు ఇచ్చింది. మూడు చెరువుల నీళ్లు తాగించిన రతిక పల్లవి ప్రశాంత్.. అమర్ దగ్గరున్నది తీసి శివాజీకి ఇచ్చాడు. తర్వాత మొదలైంది అసలు రచ్చ.. నెక్స్ట్ రతిక వెళ్లాలని మహాబలి టీం ఫిక్స్ చేసింది. లేదు, నేను చివర్లోనే వెళ్తానని తెగేసి చెప్పింది రతిక. లేదు, నేనే చివర్లో వెళ్తానని టేస్టీ తేజ, గౌతమ్‌లు వాదించారు. తనకు ఎంత సర్ది చెప్పాలని చూసినా వినిపించుకోలేదు. శివాజీని గెలిపించాలని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయిన రతిక అందుకోసం తన టీమ్మేట్స్ మీద అరిచి గోల చేసింది. దామినితో అయితే మాటల పోట్లాటకు దిగింది. మనకంటే ఆ టీమ్ బెస్ట్ అని రతిక అనడంతో ఆ టీమ్‌లోకే వెళ్లు అని చెప్పింది దామిని. అసలు నువ్వు ఎవరు? ఆ టీమ్‌లోకి వెళ్లు, ఈ టీమ్‌లోకి వెళ్లు అని చెప్పడానికి అని మరింత రెచ్చిపోయింది రతిక. ఛీఛీ.. వీళ్లంతా జోకర్స్.. బఫూన్స్ టీఆర్పీ కోసమే కదా రెచ్చిపోతున్నావ్ అని ఉన్నమాట అనేసింది సింగర్. కానీ తర్వాత మాత్రం తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయింది. దీనికి బుర్ర లేదు, బుద్ధి లేదు, రెస్పెక్ట్ లేదు.. ప్రతీది టీఆర్పీ కోసమే చేస్తుంది అని ఏడ్చేసింది. ఏదేమైనా రతిక మాత్రం వెనక్కు తగ్గలేదు. చివర్లోనే వెళ్తానని డిసైడ్ అయింది. ఈ సమస్యను తేల్చేందుకు మూడో స్థానంలో ఎవరు వెళ్లాలని ఓటింగ్ పెట్టారు. అందరూ రతిక వెళ్లాలని చేతులు ఎత్తారు. దీంతో ఆమె ఛీఛీ.. వీళ్లంతా జోకర్స్లా ఉన్నారు, ఈ టీమ్‌లో ఉండటానికే చెండాలంగా ఉంది. వీళ్లంతా బఫూన్స్ అంటూ నోటికొచ్చింది వాగింది. ఒకసారి ఫస్ట్ వెళ్తానంటది, సెకండ్ అంటది, ఫోర్త్, లాస్ట్.. అంటుంది. ఈమెకే క్లారిటీ లేదు. మళ్లీ నోరు జారుతుంది అని సీరియస్ అయ్యాడు డాక్టర్ బాబు గౌతమ్. సందీప్ మాస్టర్‌కు బీపీ తెప్పించిన రతిక మధ్యలో కలగజేసుకున్న సంచాలక్ సందీప్.. రెండు రోజులుగా ఆ టీమ్‌లో ఉన్నావ్.. ఇప్పుడు వాళ్లను బఫూన్స్ అంటున్నావ్.. కరెక్ట్ కాదు అని చెప్పాడు. రతిక పాప వింటే కదా.. వాళ్లు అలాగే ప్రవర్తిస్తున్నారు.. ఏమనాలి మరి? అని తిరిగి ప్రశ్నించింది. టీమ్ మెంబర్స్ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సంచాలకుడైన సందీప్ మాస్టర్ మూడో స్థానంలో రతికను రమ్మని ఆదేశించాడు. అబ్బే.. నేను మోనార్క్‌ను, ఎవరి మాటా వినను అన్న స్టైల్లో తను రానని తెగేసి చెప్పింది. దీంతో సందీప్ మాస్టర్‌కు సైతం బీపీ వచ్చి ఆవేశపడ్డాడు. ఎవరేమనుకున్నా, ఎన్ని గంటలు సాగదీసినా సరే ఐ డోంట్ కేర్ అని లైట్ తీసుకుంది రతిక పాప. ఇచ్చిపడేసిన బిగ్‌బాస్ ఇదంతా చూసిన షకీల అమ్మ.. రేయ్, ఆమె కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది.. ఇవ్వనివ్వండి అని అనుభవంతో మాట్లాడింది. ఇలాగైతే టాస్క్ ముందుకు వెళ్లేలా లేదని దామిని మూడో స్థానంలో వెళ్లింది. ప్రియాంక దగ్గరున్న మాయాస్త్రను షకీలాకు ఇచ్చింది. కనీసం నాలుగో స్థానంలో అయినా వెళ్లమని బతిమాలినా రతిక వినలేదు. దీంతో బిగ్‌బాస్ కలుగజేసుకున్నాడు. మహాబలి టీమ్‌కు సరిపడ సమయం ఇచ్చినా టాస్క్ పూర్తి చేయనందున ఎవరు నాలుగు, ఐదారు స్థానాల్లో రావాలో రణధీర టీమ్ నిర్ణయించాలని మెలిక పెట్టాడు. అంతేకాదు, అప్పటివరకు మాయాస్త్ర భాగాలను పొందినవారికి మాత్రమే మిగిలిన భాగాలు ఇవ్వాలని కండీషన్ పెట్టాడు. ఆటలో అరటిపండుగా మారిన సీరియల్ బ్యాచ్ ఈ నిర్ణయంతో ఆట సందీప్.. రతికను చూస్తూ చప్పట్లు కొట్టాడు. కానీ ఈ నిర్ణయంతో మాయాస్త్ర భాగాలు కోల్పోయిన అమర్, ప్రియాంక, శోభా శెట్టి ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మూడు రోజుల కష్టమంతా వృథా అయిందని ఆవేదన చెందాడు అమర్దీప్. వాష్‌రూమ్‌లోకి వెళ్లి.. మీ ఈగో వల్ల మా గేమ్ పోయింది అంటూ పచ్చి బూతులు మాట్లాడుతూ ఏడ్చేశాడు. దీంతో ప్రియాంక, శోభా అతడిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. మొత్తానికి రతి పాప పంతం వల్ల సీరియల్ బ్యాచ్ ఆటలోనే లేకుండా పోయింది. చదవండి: సంచలనాలకు కేరాఫ్‌గా బిగ్ బాస్ సీజన్-7..! -
పవర్ అస్త్ర చోరీ.. అంత చీప్ మైండా?: ఆట సందీప్ ఫైర్
బిగ్‌బాస్ కంటెస్టెంట్లను రెండు టీములుగా విడగొట్టి మాయ అస్త్ర అనే పోటీ పెట్టారు. ఈ పోటీలో మహాబలి టీమ్‌ను ఓడించి రణధీర సమూహం (శివాజీ, అమర్దీప్, ప్రిన్స్, ప్రియాంక, శోభాశెట్టి, షకీలా) విజయం సాధించి మాయ అస్త్రను కైవసం చేసుకుంది. అయితే మహాబలి టీమ్ మరోలా ఆలోచించింది. మాయ అస్త్ర పోతే పోయింది కనీసం పవర్ అస్త్ర అయినా గెలుద్దామని ఆట సందీప్ కష్టపడి దక్కించుకున్న ఆ పవర్ఫుల్ అస్త్రాన్ని కొట్టేసింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించాడు సందీప్. పవర్ అస్త్రను నా భార్యాపిల్లలకు అంకితమిచ్చాను. దాన్ని దొంగిలించారు. అంత చీప్ మైండెడ్ ఉంటే వర్కవుట్ కాదు అని అసహనానికి లోనయ్యాడు. అయితే తను గెల్చుకుంది పోయిందని సందీప్ ఏడుస్తుంటే చీప్ అనే పదాలు వాడొద్దని టేస్టీ తేజ హెచ్చరించాడు. తర్వాత దానికోసం రాత్రిపూట ఇల్లంతా వెతుకులాట మొదలుపెట్టారు. అయితే లైవ్‌లో సందీప్ పవర్ అస్త్రను తిరిగి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్: పాపం.. నిద్ర మానుకుని తెగ కష్టపడ్డారు కానీ! -
ఫైర్ మీదున్న అమర్.. రెండో వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?
సండే ఫండే అంటాడు నాగార్జున.. కానీ ప్రేక్షకులకు మాత్రం అసలైన ఫండే మండేనే అంటుంటారు. ఎందుకంటే అప్పుడే కదా అసలైన కార్చిచ్చు రగిలేది! నామినేషన్స్ ప్రక్రియతో హౌస్‌లో మంట రగిల్చేందుకు రెడీ అయ్యాడు బిగ్‌బాస్. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. కంటెస్టెంట్లు తాము నామినేట్ చేయాలనుకున్నవారిని పిట్లో నిలబెట్టి అందుకు గల కారణాలు చెప్పి బజర్ నొక్కాల్సి ఉంటుంది. బజర్ నొక్కినప్పుడు పిట్లో పైన ఉన్న బకెట్‌లోని రంగు వారిపై పడుతుంది. నామినేషన్స్ డే కావడంతో హౌస్మేట్స్ ఫన్ వదిలి ఫైర్ మీదున్నారు. ఆట సందీప్ తనను టార్గెట్ చేస్తున్నాడని ఫీలయ్యాడు ప్రిన్స్ యావర్. శివాజీ ఎవరినీ మాట్లాడనివ్వట్లేదంటూ అతడిపై గరమైంది ప్రియాంక జైన్. బిగ్‌బాస్ మాట తప్ప ఎవరి మాటా వినను అని శివాజీ బదులివ్వగా.. నాతో అలా మాట్లాడకు అని హెచ్చరించింది ప్రియాంక. అటు అమర్దీప్.. మరోసారి పల్లవి ప్రశాంత్‌ను మధ్యలోకి లాక్కొచ్చాడు. ప్రశాంత్ వేటాడటానికి వచ్చాడంటే నేనేమైనా పేకాడేందుకు వచ్చానా? అని శివాజీ సెటైర్ల మీద విరుచుకుపడ్డాడు. ఇకపోతే పవర్ అస్త్ర గెలుచుకున్న ఆట సందీప్ ఇంటిసభ్యుల్లో ఒకరిని నేరుగా నామినేషన్స్‌కు పంపించవచ్చని ఆఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. మరి అతడు ఎవరిని నామినేట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ వారం శివాజీ, శోభ, తేజ, రతిక, ప్రిన్స్ యావర్, షకీలా.. నామినేషన్స్‌లో ఉన్నారంటూ ప్రచారం నడుస్తోంది. మరి వీరిలో ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారనే విషయంపై క్లారిటీ రావాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: డ్రగ్స్‌కు బానిసయ్యా, మా నాన్నను నోటికొచ్చింది తిట్టా.. ఇంట్లో నుంచి గెంటేశాడు: జైలర్ హీరో -
బిగ్‌బాస్7: టాప్ లేపిన రతిక.. 'పవర్ అస్త్ర' గెలిచిన ఆ ఒక్కరు
'బిగ్‌బాస్'లో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే వీకెండ్ వచ్చేసరికి మాత్రం అంతా కలర్‌ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్స్.. వారం రోజుల పాటు చేసిన సంగతుల్ని స్టేజీపై మరోసారి డిస్కస్ చేస్తాడు. ఇందులో భాగంగా మెచ్చుకుంటాడు. అవసరమైతే అక్కడే కడిగి పారేస్తాడు. అలా ఈ శనివారం.. ఏం జరిగింది? ఆరో రోజు హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీకి యాక్సిడెంట్.. జరిగింది ఇదే!) రతికకి ప్రపోజ్ ఇకపోతే 'జవాన్' పాటతో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. వచ్చీ రాగానే శుక్రవారం ఏం జరిగిందనేది స్క్రీన్‌పై చూపించారు. అలా లాన్ లో కూర్చుని మాట్లాడుతున్న క్రమంలో.. సందీప్, అమర్దీప్ కచ్చితంగా టాప్-5లో ఉంటారని షకీలా జోస్యం చెప్పింది. మరోవైపు ప్రశాంత్.. రతికతో తెగ పులిహోర కలిపేశాడు. బ్రేకప్ హార్ట్ ని చేతిలో పట్టుకుని, మోకాలిపై కూర్చుని రతికకు ప్రపోజ్ చేస్తున్న పోజు పెట్టాడు. మరోవైపు రతిక భోజనం చేస్తుంటే.. ఆమెకు దగ్గరకెళ్లి తినిపించమని మారం చేశాడు. ఇదంతా ఫన్నీగా సాగింది. శోభాకి పనిష్మెంట్ ఇకపోతే శుక్రవారం ఎపిసోడ్‌లోనే ప్రిన్స్.. శుభశ్రీతో మాట్లాడుతూ యూజ్లెస్ అనే పదం ఉపయోగించాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. శనివారం ఎపిసోడ్లో నాగ్ ఈ గొడవ గురించి మాట్లాడుతూ.. ప్రిన్స్‌కి క్లాస్ పీకాడు. మరోవైపు అప్పుడప్పుడు ఏడుస్తున్న శోభాకి చిన్న వార్నింగ్ ఇచ్చాడు.ప్రేక్షకులకు ఇదంతా నచ్చదని, టాప్-5లో ఉంచరని అన్నాడు. అలానే.. హౌసులోకి వెళ్లేటప్పుడు ఇచ్చిన టాస్కులో (టేస్టీ తేజ ఈమెని హాట్ అన్నాడు) ఫెయిలైనందుకు వారం రోజులు వాష్‌రూమ్ క్లీన్ చేయాలని.. నాగ్ పనిష్మెంట్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: ఆగిపోయిన తెలుగు 'బిగ్‌బాస్ 7'.. కారణం అదే?) టాప్‌లో రతిక ఇకపోతే వీకెండ్ లో వచ్చిన నాగార్జున పై విషయాల్ని ముచ్చటిస్తూ.. 'ఫ్యాన్స్ పల్స్' అనేది ఉందని, దీని ద్వారా బయట ఉండే అభిమానులు తమ గురించి ఏమనుకుంటున్నారు? ఎన్ని మార్కులు వేశారు అనేది చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మొదటి స్థానంలో 80 మార్కులతో రతిక నిలిచింది. ఆమెకు అత్యధికంగా 80 మార్కులు వచ్చాయి. యాక్టివిటీ రూంలో రతిక ఉన్నప్పుడు.. దాదాపు రెండున్నర గంటలపాటు్టఉడత ఉడత ఊచ్' అనే పాట లూప్ లో ప్లే చేశారని, మొత్తం ఉడత అనే పదం ఎన్నిసార్లు ఉందని అడగ్గా.. 1056 సార్లు అని చెప్పిన రతిక గ్రేట్ అని నాగ్ మెచ్చుకున్నాడు. ఫ్యాన్స్ పల్స్ (కంటెస్టెంట్స్ వేసుకున్న మార్కులు) ప్రియాంక - 71 (100 మార్కులు) శివాజీ - 74 (90 మార్కులు) దామిని - 62 (95 మార్కులు) ప్రిన్స్ - 69 (94 మార్కులు) షకీలా - 69 (85 మార్కులు) సందీప్ - 72 (90 మార్కులు) శోభాశెట్టి - 76 (93 మార్కులు) టేస్టీ తేజ - 77 (100 మార్కులు) రతిక - 80 (90 మార్కులు) గౌతమ్ - 60 (100 మార్కులు) కిరణ్ రాథోడ్ - 50 (100 మార్కులు) ప్రశాంత్ - 74 (78 మార్కులు) శుభశ్రీ - 65 (98 మార్కులు) అమర్దీప్ - 60 (97 మార్కులు) 'పవర్ అస్త్ర' గెలిచిన సందీప్ షో ప్రారంభమైన రోజే చెప్పినట్లు 'పవర్ అస్త్ర' సాధిస్తేనే హౌస్‌మేట్‌గా కన్ఫర్మ్ అవుతారని నాగ్ చెప్పాడు. అలానే పలు టాస్కులు పెట్టగా వాటిలో గెలిచిన ప్రియాంక జైన, ఆట సందీప్.. ఫైనల్ గేమ్ వరకు వచ్చారు. వీళ్లిద్దరి మధ్య అటు ఇటు ఊగే బెంచిపై పరుగెత్తుతూ బుట్టలో బాల్ వేయాలనే గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా సందీప్ మాస్టర్ 53 బంతుల్ని బుట్టలో వేయగా, ప్రియాంక 34 బంతులు వేసింది. తద్వారా ఫస్ట్ విన్నర్‌గా నిలిచిన సందీప్.. పవర్ అస్త్ర గెలుచుకుని 'బిగ్‌బాస్ 7' తొలి హౌస్‌మేట్ అయిపోయాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఆదివారం.. ఎలిమినేషన్ అనేది ఉంటుందా లేదా అనేది తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: శోభా కన్నీళ్లు.. టాప్-5లో ఉండవని నాగ్ కౌంటర్!) -
హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?
'బిగ్‌బాస్ 7' సీజన్ మొదలవడానికి ముందు హోస్ట్ నాగార్జున.. ఈసారి అలా కాదు ఇలా, ఇలా కాదు అని ఏదేదో చెప్పారు. 'ఉల్టా పల్టా' ఉండబోతుందన్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే.. సేమ్ రొటీన్ స్టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు లవర్స్ మధ్య సమస్యలు, మరోవైపు కొత్త గొడవలు పుట్టుకొస్తున్నాయి. ఇంతకీ హౌసులో ఏం జరుగుతోంది? లవర్స్- మనస్పర్థలు బిగ్‌బాస్‌లో ఏ సీజన్ తీసుకున్నా సరే.. దాన్ని ప్రేమ అనొచ్చే లేదో తెలీదు గానీ కొందరైతే జంటలు అవుతుంటారు. అలా ఈ సీజన్ లో డాక్టర్-లాయర్ జంట ఒకటి ఉంది. అదే గౌతమ్-శుభశ్రీ జోడీ. వచ్చిన తొలిరోజు నుంచి కలిసి కనిపిస్తూ వచ్చారు. తాజాగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయేమో అనిపిస్తుంది. తేజతో శుభశ్రీ డ్యాన్స్ చేస్తుండగా.. గౌతమ్ కాస్త డల్ అయిపోయాడు. ఆ తర్వాత వీళ్ల మధ్య జరిగిన సంభాషణ కూడా స్పర్థలు వచ్చినట్లు హింట్ ఇచ్చేస్తోంది. (ఇదీ చదవండి: హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్') రతిక వార్నింగ్ ఇమ్యూనిటీ టాస్క్‌లో సందీప్, ప్రియాంక జైన్ గెలిచారు. మరోవైపు బిగ్‌బాస్‌ని ఇంప్రెస్ చేసిన శివాజీ, రతిక కూడా ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. ఇక్కడే మరో ట్విస్ట్ వచ్చి పడింది. వీళ్ల నలుగురిలో ఎవరికి అర్హత లేదో చెప్పమని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. దీంతో పలువురు రతిక పేరు చెప్పారు. ఈ క్రమంలోనే దామిని, రతిక మధ్య గొడవ జరిగింది. నోరు అదుపులో పెట్టుకో అని దామినికి రతిక వార్నింగ్ ఇచ్చింది. టార్గెట్ ఆమెనే అయితే ప్రస్తుతం హౌసులో పరిస్థితి అంతా చూస్తుంటే దాదాపు చాలామంది రతికనే టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఓ విధంగా ఆమెకు ప్లస్ కావొచ్చు కూడా. కానీ ఎవరికీ అది అర్థం కావడం లేదేమో అనిపిస్తుంది. మరోవైపు సింక్‌లో ప్లేట్లు కడగకుండా పెట్టేస్తున్నారని ప్రియాంక గట్టిగా అరిచింది. దీనిపై దామిని రియాక్ట్ కాగా.. అప్పుడు ప్రియాంక-దామిని మాటమాట అనుకున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో రిలీజైన సూపర్‌హిట్ సినిమా.. కానీ?) -
'బిగ్‌బాస్ 7' Day-3 హైలైట్స్.. టాస్క్‌లో గెలిచిన ఇద్దరు!
'బిగ్‌బాస్ 7' సీజన్లో నామినేషన్స్ గొడవ అయిపోయింది. ఒకరిని ఒకరి నామినేట్ చేసుకోవడం అనే తంతు ముగిసింగి. మొత్తంగా 8 మంది లిస్టులో ఉన్నారు. ఇకపోతే బిగ్ బాస్.. 14 మంది కంటెస్టెంట్స్‌కి తొలి టాస్క్ ఇచ్చి, ఓ గేమ్ పెట్టేశాడు. ఇందులో అందరూ కండబలంతో ఆడితే.. ఓ ఇద్దరు మాత్రం బుద్ది బలంతో ఆడి, విజయం సాధించారు. ఇంతకీ మూడో రోజు హౌసులో ఏమేం జరిగింది? బిగ్‌బాస్ Day-3 హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో తొలివారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?) ఫస్ట్ టాస్క్ నిద్ర లేవడంతో మూడో రోజు ఎపిసోడ్ ప్రారంభమైంది. 14 మంది కూర్చున్న తర్వాత.. బిగ్‌బాస్ మరోసారి అందరికీ గీతోపదేశం చేశాడు. ఇంట్లో ఉన్నంత మాత్రాన ఇంటి సభ్యులు కాదని, కంటెస్టెంట్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. 'ఫేస్ ద బీస్ట్' అనే గేమ్‌లో గెలిచిన వాళ్లకు హౌసులో కన్ఫర్మేషన్తోపాటు ఐదు వారాల ఇమ్యూనిటీ పొందే అవకాశం దక్కుతుందని చెప్పాడు. గెలిచిన వాళ్లు.. నామినేషన్, ఎలిమినేషన్ నుంచి కూడా సేవ్ అవుతారని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు. తేజకి షకీలా ముద్దు ఇకపోతే తేజని అందరూ కలిసి ముస్తాబు చేశారు. శుభశ్రీ అతడికి బ్రష్‌తో బుగ్గపై లిప్‌స్టిక్ పెట్టేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే అతడు.. తన బుగ్గపై కూడా ఎవరైనా ముద్దు పెడితే బాగుంటుందని ఫన్నీగా అన్నాడు. పక్కనే ఉన్న షకీలా.. తేజ బుగ్గపై ముద్దు పెట్టింది. ఇది అయిపోయిన తర్వాత 'ఫేస్ ద బీస్ట్' టాస్క్ మొదలైంది. ఈ గేమ్‌లో భాగంగా రింగ్‌లో ఎక్కువసేపు ఉన్నవాళ్లు గెలుస్తారని బిగ్‌బాస్ చెప్పాడు. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా!?) కొందరు మాత్రమే బయట వర్షం పడుతుండటం వల్ల లాన్లో కాకుండా ఇన్‌డోర్‌లో 'ఫేస్ ద బీస్ట్' గేమ్ నిర్వహించారు. 14 మందిలో దాదాపు అందరూ చేతులెత్తేశారు. ఆట సందీప్ , ప్రియాంక, శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ.. మిగతా వారి కంటే ఎక్కువ సేపు రింగ్‌లో ఉండి ఫైట్ చేశారు. ఫలితంగా అబ్బాయిల్లో ఎక్కువసేపు ఉన్న ఆట సందీప్, అమ్మాయిల్లో ప్రియాంక టాప్‌లో నిలిచి.. తర్వాత స్టేజీకి అర్హత సాధించారు. వీళ్లిద్దరి మధ్య విన్నర్ ఎవరనేది తర్వాత టాస్కులో తెలుస్తుంది. బుద్దిబలంతో గెలిచారు అయితే ఈ గేమ్ జరుగుతున్నంతసేపు ఆట సందీప్, ప్రియాంక పెద్దగా ఎనర్జీ వేస్ట్ చేసుకోలేదు. ఏ మాత్రం అరవకపోయినప్పటికీ, అందరినీ ఎంకరేజ్ చేశారు. వచ్చినప్పటి నుంచి కండలు చూపిస్తూ ఎక్స్పోజ్ చేసిన ప్రిన్స్.. ఈ గేమ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 32 సెకన్లు మాత్రమే మ్యాట్‌పై ఉండగలిగాడు. దీన్నిబట్టి కండలు ఉంటే సరిపోదని అతడికి అర్థమైందనుకుంటా! తర్వాత టాస్కుల్లో అతడు ఈ విషయం గుర్తుపెట్టుకుంటే బెటర్. ప్రశాంత్, గౌతమ్ ఏడుపు ఈ గేమ్‌లో భాగంగా ఆట సందీప్ (1 min 49 సెకన్లు) తో టాప్‌లో నిలవగా, తర్వాత స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అయితే గెలవలేకపోయినందుకు ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు గౌతమ్ కూడా తనకు ఇల్లు గుర్తొస్తుందని ఎమోషనల్ అయ్యాడు. ఆ వెంటనే.. ఎలాగైనా సరే ఆడి తీరాల్సిందే, స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే అని తనకు తానే చెప్పుకున్నాడు. అలా మూడో రోజు పూర్తయింది. (ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకే ఇంట్లో కలిసుంటున్నారా!?) -
డ్యాన్స్ షో విజేతగా ఆట సందీప్.. బిగ్‌బాస్ కూడా గెలుస్తానంటూ..
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్‌గా ఈయన చాలామందికి సుపరిచితం. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా డ్యాన్సరే! అయితే ఆట సందీప్‌కు తాను చెప్పింది తప్పితే ఎదుటివాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడడు, అసలు వినిపించుకోడు. ఇటీవలే అతడు తన భార్యతో కలిసి 'నీతోనే డ్యాన్స్' కప్ గెలిచాడు. అయితే ఈ షో జరిగినన్ని రోజులు గేమ్ అమర్ దీప్ ఫ్యాన్స్ వర్సెస్ ఆట సందీప్ ఫ్యాన్స్ అన్నట్లుగా నడిచింది. మరి బిగ్‌బాస్‌లోనూ వీరి మధ్య వార్ జరుగుతుందా? ఆట సందీప్ తన కోపాన్ని నిగ్రహించుకుని ఎక్కువ వారాలు కొనసాగుతాడా? అన్నది చూడాలి!