బిగ్‌బాస్ 7: సందీప్ ఎలిమినేట్.. ఏడుస్తూ ఆ నిజం చెప్పేసిన శోభా! | Bigg Boss 7 Telugu Day 56 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 56 Highlights: షాక్ ఇచ్చిన సందీప్ ఎలిమినేషన్.. ఫస్ట్ టైమ్ అలా!

Published Sun, Oct 29 2023 11:03 PM | Last Updated on Mon, Oct 30 2023 8:59 AM

Bigg Boss 7 Telugu Day 56 Episode Highlights - Sakshi

బిగ్‌బాస్ 7లో షాకింగ్ ఎలిమినేషన్. చివరివరకు ఉంటాడని చాలామంది ఊహించిన సందీప్ మాస్టర్ హౌస్ నుంచి బయటకెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే అతడు ఎలిమినేట్ కాగానే కొన్ని అసలు నిజాలు బయటపడ్డాయి. వీటిలో శివాజీ, శోభా బయటపెట్టారు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది  Day 56 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

గేమ్స్‌తో టైంపాస్
ఎలిమినేషన్ నుంచి ప్రియాంక, గౌతమ్ సేవ్ కావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. అలా సరదా సరదాగా పడవ గేమ్‌తో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. మీతో పాటు పడవలో తోడుగా ఇద్దరుంటే వాళ్లలో ఎవరిని తోసేస్తారు? ఎవరిని ఉంచుతారు అని గేమ్ పెట్టారు. అలానే డైలాగ్ కొట్టు గురు! అని మరో గేమ్ పెట్టారు. ఇవి టైమ్‌పాస్‌ తప్పితే పెద్దగా అలరించలేదు. 

(ఇదీ చదవండి: 'సీతారామం' బ్యూటీ తెలుగింటి కోడలు కానుందా?)

సందీప్ ఎలిమినేట్
ఆదివారం ఎపిసోడ్ లో వరసగా అశ్విని, అమరదీప్, శివాజీ, భోలె సేవ్ అయ్యారు. చివరగా శోభా, సందీప్ మిగిలారు. కాసేపు టెన్షన్ తర్వాత సందీప్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఇది చూసి తేజ, అమరదీప్ షాకయ్యారు. ఇక సందీప్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసి దగ్గర నుంచి శోభా ఏడుస్తూనే ఉంది. శివాజీ అయితే నువ్వు ఎలిమినేట్ అవుతావని అనుకోలేదని అన్నాడు. అంటే శోభా ఎలిమినేట్ అవుద్దని శివాజీ అనుకున్నాడు. కానీ అంచనా తప్పిందని బాధపడ్డాడు. ఇకపోతే వరసగా అమ్మాయిలు ఎలిమినేట్ కావడాన్ని సందీప్, తన ఎలిమినేషన్‪‌తో బ్రేక్ చేశాడు.

సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసి.. 'వెళ్లిపోవద్దు మాస్టర్, మీరెళ్లిపోతే నేను ఉండలేను' అని శోభా బోరున ఏడ్చేసింది. హౌస్ నుంచి స్టేజీపైకి వెళ్లిన తర్వాత కూడా సందీప్‌ని చూస్తూ శోభా ఏడుస్తూనే ఉంది. అయితే సందీప్ ఎలిమినేట్ కావడం తమ బ్యాచ్‌ని బలహీనంగా చేస్తుందని శోభాకి అర్థమైంది కాబట్టి ఏడుస్తూ.. మీరు లేకపోతే ఉండలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అలా ఓ నిజం బయటపడినట్లు అయింది. సందీప్ వెళ్లిపోయాడు కాబట్టి అమర్-ప్రియాంక-శోభాపై శివాజీ బ్యాచ్ ఇంకా పగ, ప్రతీకారాలు చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. 

(ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement