
'బిగ్‌బాస్ 7' షో ఇప్పుడు మంచి మజా ఇస్తోంది. ఎందుకంటే చోటామోటా కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయారు. సగం రోజులు కూడా అయిపోయాయి. దీంతో ఎవరికి వాళ్లు హౌసులో ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎంతటి గొడవకైనా వెనుకాడటం లేదు. మరోవైపు ఈసారి ఎనిమిది నామినేట్ కాగా అందులో ఓ స్టార్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ గట్టిగా ఉంది. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరో తెలుసా?
హౌసులో రెండు గ్రూపులు
బిగ్‌బాస్ షో నిర్వహకులు చెప్పేదాని ప్రకారం.. హౌసులో ఎవరికి వాళ్లు గేమ్ ఆడాలి. కానీ ప్రస్తుత సీజన్‌లో మాత్రం రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. పెద్ద మనిషి అని చెప్పుకొంటున్న శివాజీ.. యవర్, ప్రశాంత్, భోలెకి అండగా నిలుస్తున్నాడు. మొన్నటివరకు ఇది అంత పెద్దగా బయటపడలేదు. ఇప్పుడిప్పుడే అసలు నిజాలు బయటకొస్తున్నాయి. మరోవైపు అమరదీప్, శోభా, ప్రియాంకతో పాటు సందీప్ ఓ గ్రూపుగా ఉన్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)
ఎలిమినేషన్ మజా
ప్రతిసారి ఎలిమినేషన్‌లో ఎవరో ఒకరు వీక్ కంటెస్టెంట్ ఉండేవాళ్లు. దీంతో వాళ్లు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని తెలిసేది. కానీ ఈసారి అలా కాదు. శివాజీ, భోలె, అమరదీప్, సందీప్, శోభాశెట్టి, ప్రియాంక, గౌతమ్, అశ్విని.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లు.. స్ట్రాటజీలతో గేమ్ ఆడుతున్నారు. దీంతో ఎవరూ ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తి పెరిగింది.
శోభాకి గండం?
అయితే ఈసారి శివాజీకి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. అనుహ్యంగా భోలె రెండో స్థానంలో ఉన్నాడట. తర్వాతి స్థానాల్లో వరసగా అమరదీప్, అశ్విని, గౌతమ్, ప్రియాంక ఉన్నట్లు సమాచారం. ఇక చివరి రెండు స్థానాల్లో సందీప్, శోభాశెట్టి దాదాపు ఒకేలా ఓట్లు పడ్డాయట. కానీ శోభాశెట్టిపై ఎలిమినేషన్ వేటు తప్పదని అంటున్నారు. ఒకవేళ అలా కాదంటే మాత్రం సందీప్ మాస్టర్ బయటకెళ్లిపోవడం గ్యారంటీ. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా సరే పెద్ద షాకింగే అని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment