బిగ్‌బాస్ 7వ సీజన్ 14వ వారం కూడా పూర్తయిపోయింది. అనుకున్నట్లే శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోయింది. అయితే చివరకొచ్చేసరికి కాస్త టెన్షన్ పెట్టారు గానీ అప్పటికే అందరికీ సీన్ అర్థమైపోయింది. అయితే శోభా.. ఎలిమినేట్ కావడం మాటేమో గానీ సడన్‌గా తనలో ఓ మార్పు చూపించి అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఆదివారం ఏం జరిగిందనేది Day 98 ఎపిసోడ్ హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?)
పశ్చాత్తాపం టాస్క్
శనివారం అందరినీ ఓ ఆటాడేసుకున్న హోస్ట్ నాగార్జున.. ఆదివారం వచ్చేసరికి ఫుల్ కూల్ అయిపోయాడు. 14 వారాల్లో ఏ వారం మీరు పశ్చాత్తాపంగా ఫీలయ్యారు? ఎందుకు? అనే చిన్న గేమ్ ఒకటి పెట్టాడు. ప్రియాంక.. 7వ వారంలో భోలెని ఓ మాట అనకుండా ఉండాల్సిందని చెప్పింది. శోభాశెట్టి.. 9వ వారం యావర్‌ని పిచ్చోడని అనకుండా ఉండాల్సిందని చెప్పింది. అమర్.. 14వ వారం తను ఎందుకలా పిచ్చోడిలా ప్రవర్తించానే అర్థం కాలేదని అన్నాడు. శివాజీ.. 14వ వారంలో ఆడపిల్లల గురించి ఉపయోగించిన పదాలు వ్యక్తిగతంగా ఫీలయ్యాను కానీ మిగతావాళ్లకు అవి టచ్ అయ్యాయని, ఈ విషయంలో పశ్చాత్తాపపడ్డానిని సంజాయిషీ ఇచ్చుకున్నారు. మిగతా వాళ్లందరూ ఒక్క ముక్కలో చెబితే.. శివాజీ మాత్రం సీరియల్ సాగదీసినట్లు చాంతాడంత చెప్పాడు. పోనీ అదైనా చక్కగా ఉందా అంటే.. మొత్తం యాక్టింగే కనిపించింది.
ఎవరు ఏం నేర్చుకున్నారు?
ఇక పశ్చాత్తాపం గేమ్ పూర్తయిన తర్వాత 14 వారాల్లో ఒక్కో కంటెస్టెంట్.. ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నారో చెప్పాలని నాగ్ చెప్పాడు. దీంతో ఫస్ట్ మాట్లాడిన అమర్.. ప్రశాంత్ దగ్గర నుంచి గేమ్ ఆడటం నేర్చుకున్నాను. అర్జున్ దగ్గర నిజాయతీ నేర్చుకున్నానని అన్నాడు. శివాజీ దగ్గర ఓపికగా ఉండటం నేర్చుకున్నానని యావర్ అన్నాడు. అమర్‌లా ఫౌల్ గేమ్స్ ఆడొద్దని నేర్చుకున్నానని ప్రియాంక చెప్పింది. శివాజీ దగ్గర లౌక్యం, యావర్ దగ్గర పట్టుదల, ప్రశాంత్ దగ్గర కలిసిపోయి నవ్వుతూ మాట్లాడటం, ప్రియాంక దగ్గర నవ్వుతూ మాట్లాడటం నేర్చుకున్నానని అర్జున్ చెప్పాడు. శోభా మాత్రం.. ఎవరి దగ్గర ఏం నేర్చుకోలేదు కానీ ఫోన్ లేకుండా బతకడం నేర్చుకున్నానని డిఫరెంట్‌గా చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్ నటుడు, ఫోటోలు వైరల్)
ఫైనలిస్టులుగా వాళ్లు
గతవారం టికెట్ టూ ఫినాలే పోటీల్లో గెలిచి చివరివరకు నిలిచిన అర్జున్.. తొలి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఇక ఇప్పుడు సేవింగ్, ఎలిమినేషన్ లాంటిది కాకుండా ఎవరెవరు ఫైనలిస్ట్ అయ్యారనేది నాగార్జున ప్రకటించాడు. వరసగా ప్రియాంక, యావర్, అమర్, ప్రశాంత్.. ఫినాలే వీక్‌లోకి అడుగుపెట్టినట్లు చిన్నచిన్న హింట్స్ రూపంలో రివీల్ చేశారు. చివరగా శోభా-శివాజీ మిగలగా.. కాసేపు సస్పెన్స్ తర్వాత శోభా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే తాను బయటకెళ్లిపోతానని ముందే తెలుసో ఏమో గానీ పెద్దగా రియాక్ట్ కాలేదు. సైలెంట్‌గా స్టేజీపైకి వచ్చేసింది. అయితే ఆమె ఓవరాల్ జర్నీ వీడియో చూపించినప్పుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది.
అలానే ఇన్నిరోజులు హౌసులో అందరితో పోట్లాడిన శోభా.. ఎలిమినేట్ అయిన తర్వాత మాత్రం శాంతమూర్తిలా అందరి గురించి మంచిగా చెబుతూ కనిపించేసరికి.. ఈమెలో ఏంట్రా ఈ మార్పు అని అనుకున్నారు. అయితే ఎలిమినేట్ అవుతానని తెలియడం వల్లనో ఏమో గానీ శివాజీ, యావర్‌లని గేమ్స్ పేరుతో ట్రిగ్గర్ చేసి, వాళ్ల నిజస్వరూపాల్ని బయటపెట్టి వెళ్లిపోయింది. ఇప్పుడున్న వాళ్లతో శోభాతో కొన్ని విషయాల్లో బ్యాడ్ అయ్యిండొచ్చు కానీ ఆమెని చివరి వారం కూడా ఉంచుంటే శివాజీని ఆడుకునేది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోవడం.. ఆమె అభిమానులకు చిన్న అసంతృప్తిని మిగిల్చింది. ఇకపోతే టాప్-6 సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: ముంబైలో లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. రామ్ చరణ్ ఆస్తులెంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment