'బిగ్‌బాస్‌ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్ | Bigg Boss 7 Shobha Shetty Gets Rashtriya Gaurav Award For Best Negative Lead, Deets Inside - Sakshi
Sakshi News home page

Shobha Shetty: 'కార్తీకదీపం' మోనితకు ఆ అవార్డు.. ఫొటోలు వైరల్

Published Wed, Dec 27 2023 7:46 AM | Last Updated on Wed, Dec 27 2023 9:58 AM

Bigg Boss 7 Shobha Shetty Rashtriya Gaurav Award For Best Negative Lead - Sakshi

ఈసారి బిగ్‌బాస్ సీజన్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరీ ముఖ్యంగా ఇందులో పాల్గొన్న సీరియల్ నటి శోభాశెట్టి ఇంకా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆట కంటే గొడవలతో చాలా ఫేమ్ తెచ్చుకుంది. అదే టైంలో విపరీతమైన ట్రోలింగ్ కూడా ఫేస్ చేసింది. బిగ్‌బాస్ ట్రోఫీ కచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పిన శోభా.. 14వ వారం ఎలిమినేట్ అయి ఆ కల నెరవేర్చుకోలేకపోయింది. అయితేనేం ఇప్పుడో అవార్డ్ గెలుచుకుని మళ్లీ వార్తల్లో నిలిచింది.

(ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా?)

శోభాశెట్టి అంటే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. 'కార్తీకదీపం' మోనిత అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్‌లో లేడీ విలన్‌గా చేసి చాలా పేరు తెచ్చుకుంది. అలా ఈసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది. కానీ ఆట, గెలుపు కంటే గొడవలు పెట్టుకోవడంతోనే ఈమె బాగా ఫేమస్ అయింది. ఒకానొక టైంలో ఈమెని ఎలిమినేట్ చేయకుండా ఇంకా ఉంచుతున్నారేంట్రా బాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇలాంటి క్యారెక్టర్ షోలో లేకపోతే పెద్దగా మజా ఉండదు.

సోఫాజీ అలియాస్ శివాజీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గని శోభా.. దాదాపు చివరి వరకు వచ్చేసింది. ఫినాలేకి వారం ఉందనగా ఎలిమినేట్ అయిపోయింది. తాజాగా ఈమెకు ఉత్తమ ప్రతినాయకగా రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్ వచ్చింది. ఈ విషయాన్ని శోభానే స్వయంగా తన ఇన్ స్టాలో ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. ప్రస్తుతానికైతే ఈమె కొత్త సీరియల్స్ ఏం చేయట్లేదు. త్వరలో షోల్లో గానీ, సీరియల్స్‌లో గానీ శోభా మళ్లీ కనిపించే అవకాశముంది.

(ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement