Karthika Deepam Actress Shobha Shetty New House Warming Ceremony, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Shobha Shetty New House Video: శోభాశెట్టి గృహప్రవేశం.. సందడి చేసిన బిగ్‌బాస్ ఫ్రెండ్స్

Published Tue, Apr 30 2024 2:40 PM | Last Updated on Tue, Apr 30 2024 4:03 PM

Karthika Deepam Actress Shobha Shetty New House Video

'కార్తీకదీపం' సీరియల్, 'బిగ్‌బాస్ 7' షోతో గుర్తింపు తెచ్చుకున్న శోభాశెట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేసింది. సోమవారం గృహ ప్రవేశం జరగ్గా.. బిగ్‌బాస్ షోలో తనతో పాటు పాల్గొన్న తేజ, ప్రియాంక, గౌతమ్, సందీప్ మాస్టర్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్)

కర్ణాటకకు చెందిన శోభాశెట్టి.. కన్నడలో పలు షోలు చేసింది. తెలుగులోకి 'కార్తీకదీపం' సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మోనిత అనే విలన్‌గా ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ చేసింది. గతేడాది బిగ్‌బాస్ 7వ సీజన్‌లో పాల్గొన్న ఈమె.. ఫైనల‍్ వరకు వచ్చింది కానీ విజేత కాలేకపోయింది. మరోవైపు ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డి అని పరిచయం చేసింది. వీళ్లకు ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది.

ప్రస్తుతం శోభాశెట్టి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేసింది. ఈ గృహ ప్రవేశానికి బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అయితే షోలో పాల్గొన్న తర్వాత వచ్చిన డబ్బులతోనే శోభా ఇల్లు కట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా శోభా కొత్త ఇంట్లో ఉన్న వీడియోని టేస్టీ తేజ తన యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement