చాలామంది ప్రేక్షకులు ఎప్పటినుంచో తెగ ఆరాటపడుతున్నట్లు.. శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోయింది. 14వ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే ఇది ఆమెకు ఇది పెద్ద షాకింగ్ విషయమేం కాదు. ఎందుకంటే ఇలా జరుగుతుందని ముందే ఊహించింది. ఇంతకీ శోభా ఎలిమినేషన్‌కి కారణమేంటి? మొత్తంగా రెమ్యునరేషన్ ఎంత సంపాదించింది?
శోభా ఎలిమినేషన్ కరెక్టేనా?
శోభాశెట్టి.. బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్‌లో సీరియల్ బ్యాచ్‌కి లీడర్. ఫస్ట్ నుంచి అమర్-ప్రియాంకకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. లెక్క ప్రకారం చూస్తే ఈమె చాన్నాళ్ల క్రితమే ఎలిమినేట్ అయిపోవాలి. కానీ షో ఆర్గనైజర్స్ అలా చేయలేదు. శోభాశెట్టిలో వీళ్లకు టీఆర్పీ కనిపించింది. దీంతో మోస్తరుగా ఆడినా సరే ఆమెని చివరివరకు లాక్కొచ్చేశారు. ఎందుకంటే అవసరం అలాంటిది మరి. అలానే శివాజీతో ఢీ అంటే ఢీ అనేలా ఫైట్ చేసింది కూడా ఈమె ఒక్కతే. అలాంటి శోభాని ముందే పంపేంచేసి ఉంటే షోలో మజా ఉండేది కాదు. ఇన్నాళ్లకు శోభా అవసరం తీరిపోయింది. దీనికి తోడు ప్రస్తుతమున్న వాళ్లలో ఓటింగ్ శాతం శోభాదే తక్కువ. అలా ఈమె ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది.
శివాజీ పరువు పాయే
ఈ సీజన్‌లో సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్.. అందరికి అందరూ అలానే తయారయ్యారు. గేమ్స్ పరంగా అర్జున్, ప్రియాంక మినహా ఒక్కరు కూడా తిన్నగా ఆడలేదు. దీని గురించి పక్కనబెడితే 14 వారాలుగా అమర్‌ని పురుగు కంటే హీనంగా చూసిన శివాజీ.. నోటికి ఎన్ని వస్తే అన్ని మాటలు అన్నాడు. 'పనికిమాలినోడా' లాంటి చీప్ కామెంట్స్ చేశాడు. అయినా సరే అమర్.. వీటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ వారం.. ఓ టాస్క్ సందర్భంగా జస్ట్ పదే పదే నిమిషాల్లో శివాజీని ఆడేసుకుంది. దీంతో సోఫాజీ ట్రిగ్గర్ అయిపోయాడు. కట్ చేస్తే.. ఆడపిల్లల్ని పీకుతా, పీకమీద కాలేసి తొక్కుతా అని శివాజీ చిల్లర కామెంట్స్ చేశాడు. దీంతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోయింది. దీన్ని కవర్ చేసేందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో శివాజీ బ్యాచ్ పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో శోభా సూపర్ ఆడింది అని చెప్పం గానీ ఎలిమినేట్ అయి వెళ్తూ వెళ్తూ శివాజీ పరువు మాత్రం తీసేసి వెళ్లిపోయింది.
రెమ్యునరేషన్ ఎంత?
సీరియల్ నటిగా శోభాకి కాస్త పేరుంది. అలానే వారానికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అంటే 14 వారాలకుగానూ మొత్తం రూ.35 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయినవాళ్ల పరంగా చూసుకుంటే మాత్రం శోభాదే హయస్ట్ అని చెప్పొచ్చు. సో అదన్నమాట విషయం.
Comments
Please login to add a commentAdd a comment