Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ! | Bigg Boss 7 Telugu Day 97 Promo: Nagarjuna Full Fires On Shobha Shetty - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Shobha Shetty: శోభా ట్రాప్‌లో పడ్డ హోస్ట్ నాగార్జున.. బొమ్మ చూపించేసిందిగా!

Dec 9 2023 6:40 PM | Updated on Dec 9 2023 6:50 PM

 Bigg Boss 7 Telugu Latest Promo Day 97 Shobha Shetty - Sakshi

మిగతా సీజన్లతో పోలిస్తే గొడవలు, గ్రూపుల గోల వల్ల బిగ్‌బాస్.. ఈసారి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. అయితే ఈ మొత్తం వివాదంలో శోభాశెట్టి అనే ఓ క్యారెక్టర్ వల్ల ఎక్కడలేని మజా వచ్చింది. ఈసారి ఆమె ఎలిమినేట్ అయిపోయిందని అంటున్నారు. సరే దాని గురించి పక్కనబెడితే మాత్రం.. కొన్ని నిజాల్ని స్వయంగా నాగార్జున ముందే ఒప్పేసుకుంది. కాకపోతే హోస్ట్‌కే బొమ్మ చూపించింది.

శోభా ట్రాపులో నాగార్జున
14వ వారం వీకెండ్‌కి వచ్చేసింది. అంటే మరో వారం రోజుల పాటు షో నడుస్తుంది అంతే. ఈ విషయం శోభాకి కూడా తెలుసు. ఎలానూ కప్ గెలుస్తానని నమ్మకం అయితే లేదు. ఏదైతే అది అయిందని చెప్పి, మొత్తానికే తెగించేసింది. వీకెండ్ వస్తే నాగార్జున.. కచ్చితంగా అడుగుతాడని తెలిసే శివాజీ, యావర్‌తో కావాలనే గొడవలు పెట్టుకుంది. కరెక్ట్‌గా ఆమె ఊహించినట్లే నాగ్.. వీటి గురించే అడిగి శోభా ట్రాపులో పడ్డాడు.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ.. అక్కడే స్ట్రీమింగ్‌..)

ఫేవరిజం నిజమే!
శివాజీ సరే.. ఫేవరిజం  అని ప్రతిసారి అంటున్నారు. నాక్కూడా క్లారిటీ కావాలని ఆయన్ని అడుగుదామనుకున్నానని శోభా.. నాగార్జునతో శోభా చెప్పింది. మరి టాస్క్ సందర్భంగా ప్రియాంకని నువ్వు ఎంకరేజ్ చేయడం కరెక్టేనా? అని నాగ్ అడిగితే.. అవును ప్రియాంక అంటే ఇష్టం, అందుకే సపోర్ట్ చేశానని శోభా ఒప్పుకొంది. అలా తన బ్యాచ్ అంటే ఫేవరిజం ఉందని పరోక్షంగా అంగీకరించింది. ఇంకా డెప్త్‌గా నాగ్ అడుగుతుండేసరికి.. ఈ వారం నా మైండ్ అంతా డిస్ట్రబెన్స్‌గా ఉందని చెప్పి మొత్తం సీన్ మార్చేసింది. దీంతో నాగ్ కూడా ఏం అనలేకపోయాడు. 

శోభాకి అది ముందే తెలుసా?
బహుశా శోభాకి కూడా ఈసారి తానే ఎలిమినేషన్ అవుతానని ముందే తెలిసినట్లుంది. అందుకే మొత్తానికే తెగించేసి.. ఏదైతే అది అవుతుందని తెలిసి అందరితో గొడవలు పెట్టేసుకుంది. మరీ ముఖ్యంగా తనని మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్న శివాజీ, యావర్‌కి రైట్ లెఫ్ట్ ఇచ్చిపడేసింది. ఈమె దెబ్బకు వీళ్లిద్దరూ అసలు రంగు బయటపడింది. దీని వల్ల శోభా కంటే వాళ్లిద్దరికే డ్యామేజ్ ఎక్కువ ఉండొచ్చు. తీరా వీటన్నింటి గురించి నాగ్ అడిగేసరికి.. మైండ్ డిస్ట్రబ్ అని ప్లేట్ మార్చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో శోభా.. తను అనుకున్నది సాధించినట్లే కనిపిస్తోంది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement