Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్‌బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్? | Bigg Boss 7 Telugu 14th Week Elimination Shobha Shetty | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: టాస్క్ పేరుతో ఫిట్టింగ్.. భయపడిపోయిన శోభాశెట్టి!

Published Tue, Dec 5 2023 7:12 PM | Last Updated on Tue, Dec 5 2023 7:25 PM

Bigg Boss 7 Telugu 14th Week Elimination Shobha Shetty - Sakshi

బిగ్‌బాస్ 7 చివరకొచ్చేసింది. 14వ వారానికి సంబంధించిన నామినేషన్స్ పూర్తయ్యాయి. దీంతో ఈ వారం బిగ్‌బాస్ ఏం ప్లాన్ చేశాడా? అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో అసలైన ఫిట్టింగ్ పెట్టేశాడు. ఎలిమినేషన్ గురించి చిన్న హింట్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, ఇది సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.

టాస్క్‌తో బిగ్‪‌బాస్ ట్విస్ట్
'టికెట్ టూ ఫినాలే' పోటీలో గెలిచి ఫైనలిస్ట్ అయిన అర్జున్.. చిట్టచివరి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. ఇతడు తప్పితే మిగతా ఆరుగురు(అమర్, ప్రశాంత్, శోభా, ప్రియాంక, యావర్, శివాజీ).. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. రాబోయే రెండు వారాలకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయాయని చెప్పిన బిగ్ బాస్.. తక్కువ ఓట్లు వచ్చిన చివరి వ్యక్తి 14వ వారం ఎలిమినేట్ అయిపోతాడని నామినేషన్స్ సందర్భంగా చెప్పారు. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!)

మంగళవారం ఎపిసోడ్‌లో భాగంగా 'వోట్ ఫర్ మీ' పేరుతో టాస్క్ పెట్టారు. బిగ్‌బాస్ మాట్లాడుతూ.. 'యావర్, శోభా.. మీరిద్దరూ మీ ఓటు అప్పీలు చేసేందుకు మిగతావారి కంటే చేరువలో ఉన్నారు. కానీ మీ ఇద్దరిలో నుంచి ఒక్కరికి మాత్రమే ఓటు అప్పీలు చేసుకునే వీలుంది. ఆ ఒక్కరు ఎవరు అనే విషయం మిగతా ఇంటి సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది' అని ఫిట్టింగ్ పెట్టాడు. 

ఈ టాస్క్‌లో భాగంగా యావర్‌కి శివాజీ, ప్రశాంత్ ఓటేశారు. శోభాకి ప్రియాంక, అమర్‌తో పాటు అర్జున్ కూడా ఓటేసినట్లు ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవాళ్లలో అర్జున్ ఫైనల్ వీక్‌కి అర్హత సాధించాడు. మిగతా ఆరుగురిలో శోభా, యావర్ మాత్రం చివరి స్థానాల్లో ఉంటారు. అంటే ఈ వారం వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోయే ఛాన్సులు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని టాస్క్ పేరు చెప్పి బిగ్‌బాస్ హింట్ ఇచ్చాడా అనే సందేహం వస్తోంది. అయితే ఈ టాస్కులో శోభా కాస్త భయపడినట్లు కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement