'నీ మొగుడు వేస్ట్.. నేను చెప్పకూడని మాటలన్నారు': జ్యోతిరాజ్ ఎమోషనల్ | Bigg Boss 7 Telugu: Aata Sandeep Wife Jyoti Raj Emotional Comments On Trolls In Social Media - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu-Jyoti Raj: 'ప్రశాంత్ జోలికొస్తే మిమ్మల్ని వదలం.. నీ భర్తకు చెప్పు అంటూ చాలా దారుణంగా!

Oct 27 2023 6:50 PM | Updated on Oct 27 2023 7:41 PM

Aata Sandeep Wife Jyoti Raj Emotional Comments On Trolls - Sakshi

తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7లో కొరియోగ్రాఫర్ ఆట సందీప్‌ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి హౌస్‌లో చురుకుగా ఉంటున్నారు.  ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్‌ సీజన్‌లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్‌ కూడా మంచి డ్యాన్సరే అని తెలిసిందే.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన భార్య జ్యోతిరాజ్ సందీప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్ తమపై చేసిన కామెంట్స్‌పై స్పందించారు. వీళ్లంతా కలిసి అతన్ని ఎలిమినేట్ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు ఉందని జ్యోతిరాజ్ అన్నారు. తమపై ట్రోల్స్‌ను తలుచుకుని ఎమోషనలయ్యారు. 

(ఇది చదవండి: పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్‌దీప్‌ కౌంటర్‌)

జ్యోతిరాజ్ మాట్లాడుతూ..'రియాలిటీ షో ఆయనకేం కొత్తకాదు. ఒక్కసారి దిగారంటే కప్పు కొట్టాల్సిందే. బిగ్ బాస్ అనేది ఒక కొత్త అనుభవం. డ్యాన్స్ వేరు. రియాలిటీ షో వేరు. సందీప్ ఎవరితోనైనా కలవడానికి కాస్తా టైం తీసుకుంటారు. అతను ఇంట్రావర్ట్. హౌస్‌లో ఇంతమందిలో కలవాలంటే కాస్తా సమయం పడుతుంది. మాకు ఒక డ్రీమ్ ఉంది. అందుకోసమే బిగ్‌బాస్‌లో వెళ్లాలని నిర్ణయించుకున్నాం. తను ఫైనల్‌గా పెద్ద హీరోలతో కొరియోగ్రఫీ చేయాలన్నదే ఆశయం.'అని అన్నారు.

పల్లవి ప్రశాంత్‌ సపోర్టర్స్ ట్రోల్స్‌పై స్పందిస్తూ..'ప్రశాంత్‌కు వాళ్లు సపోర్ట్ చేయడం లేదు. ఇంకా చెడగొడుతున్నారు. మమ్మల్ని ఇంకా హార్ట్ చేస్తూనే ఉన్నారు. మాపై అసభ్యంగా ట్రోల్స్ చేయడం చాలా తప్పు. ఫ్యామిలీని ఇందులోకి లాగడం మంచిదేనా?. ఆ విషయంలో నేను వీడియో పెట్టగానే అసభ్యకరమైన కామెంట్స్. నీ మొగుడు వేస్ట్.. అంటూ చెప్పకూడని మాటలు అన్నారు. షోలో ఉన్నవారి కుటుంబాల గురించి మాట్లాడమేంటి? ప్రశాంత్‌తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ప్రశాంత్ జోలికొస్తే మిమ్మల్ని వదలం. నీ మొగుడికి చెప్పు.. ప్రశాంత్‌ జోలికి రావొద్దని. ఇంకా కొన్ని మాటలైతే నేను చెప్పలేనంత అసభ్యంగా మాట్లాడారు. దానివల్ల ఎవరికీ చెడ్డపేరు. తమ్ముడు ప్రశాంత్‌కే కదా. అతను లోపలికి వెళ్లేటప్పుడు నాకు సపోర్ట్ చేయండ్రా అని చెప్పేసి వెళ్లాడు. కానీ వీళ్లంతా కలిసి వాడిని ఎలిమినేట్ చేసేలా ఉన్నారు. వీళ్లంతా కలిసి ప్రశాంత్‌కు బ్యాడ్‌నేమ్ తెస్తున్నారు.' అని అన్నారు. 

(ఇది చదవండి: గ్రాండ్‌గా ఆ హీరో హీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా)

కాగా.. ఇప్పటికే బిగ్‌బాస్‌లో ఉన్న సందీప్‌పై ట్రోల్స్‌పై జ్యోతిరాజ్‌ స్పందించారు. జీవితంలో సందీప్‌ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు.. ఆయనొక కళాకారుడిగా గుర్తింపు ఉంది. ఎవరి సపోర్ట్‌ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగారు. అలాంటి వ్యక్తిపై కొందరు యూట్యూబర్స్‌ చీప్‌ థంబ్‌నైల్స్‌ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జ్యోతిరాజ్‌ ఆవేదన చెందారు. అందరిలాగే అతనికి కూడా ఫ్యామిలీ ఉందని మరిచిపోవద్దని తెలిపారు. అలాంటి వాటి వల్ల తామెంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement