Jyoti Raj
-
బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్.. లీక్ చేసిన సందీప్ భార్య!
బిగ్‌బాస్ జర్నీ.. జీవితంలో ఒక్కసారైనా ఈ షోకి వెళ్లాలని చాలామంది అనుకుంటారు. కానీ కొందరికే ఆ అవకాశం వరిస్తుంది. అందులో అతికొంతమందే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు. జీవిత పాఠాలు తెలుసుకుంటారు. అందుకే ఈ రియాలిటీ షో ఏళ్లతరబడి హిట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఏడో సీజన్ ముగింపుకు వచ్చింది. నేటితో బిగ్‌బాస్ 7 చాప్టర్ క్లోజ్ కానుంది. మరికాసేపట్లో విజేత ఎవరనేది తేలిపోనుంది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఫినాలేలో అడుగుపెట్టగా అందులో ముగ్గురు.. అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ నిన్నే అయిపోయింది. కష్టం ఎప్పటికీ వృథా పోదు.. ఈరోజు మిగతా ముగ్గురిలో విజేత ఎవరనేది నిర్ణయించనున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ 7 విన్నర్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్. 'పడ్డ కష్టం ఎన్నటికీ వృథా కాదు.. దేవుడు నిన్ను చల్లగా చూడాలిరా తమ్ముడు' అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో స్పై(శివాజీ, ప్రశాంత్, ప్రిన్స్ యావర్) బ్యాచ్ అభిమానులు ఆదివారం రాత్రి 8.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోకి రావాలని ఉంది. అసలే సందీప్ మాస్టర్ ఫినాలే షూటింగ్లో ఉండటంతో ఈ పోస్ట్ నిజమయ్యే ఛాన్స్ ఉందని అభిమానులు ఖుషీ అవుతున్నారు. న్యాయం కోసం ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టేశాడు! ఇక మరో పోస్ట్‌లో సందీప్ మాస్టర్ న్యాయం కోసం ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టాడని చెప్పుకొచ్చింది. అయితే ఇదే కాస్త అతిగా ఉంది. సందీప్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు అమర్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ప్రశాంత్ పేరెత్తినా కూడా చిరాకుపడేవాడు. కానీ షో నుంచి బయటకు రాగానే ప్రశాంత్‌కు ఏ లెవల్లో సపోర్ట్ ఉందో బాగా అర్థమైంది సందీప్‌కు. దీంతో అమర్‌ను పక్కన పెట్టేసి ప్రశాంత్‌కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. నిజానికి అమర్‌కు ఫౌల్ గేమ్స్ అనే ట్యాగ్ రావడానికి సందీప్ కూడా ఓ కారణమే! కానీ బయటకు వచ్చాక మాత్రం ఆ ట్యాగ్‌కు, తనకు ఏ సంబంధం లేదన్నట్లు వ్యవహరించాడు. చదవండి: క్రేజీ ఆఫర్.. 7 సెకన్ల టైమ్.. అమర్దీప్ అంత వేగంగా! -
'గట్టి పోటీ ఇచ్చావ్.. కానీ.. సందీప్ భార్య ఎమోషనల్'!
బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7వ సీజన్లో ఎనిమిదో వారం ముగిసింది. అయితే ఈ సారి ఆ సంప్రదాయానికి బిగ్ బాస్ చెక్ పండిది. ఏడు వారాలుగా మహిళా కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ కాగా..ఈ సారి మేల్ కంటెస్టెంట్ బయటకొచ్చేశాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా స్ట్రాంగ్ వికెట్ ఎదిరిపోయింది. బలమైన కంటెస్టెంట్, టాప్-5లో ఉంటాడని భావించిన కొరియోగ్రాఫర్ ఆట సందీప్ బయటకొచ్చేశాడు. ఈ వారంలో ఆయనకే తక్కువ ఓట్లు పడటంతో హౌస్‌కు గుడ్ బై చెప్పక తప్పలేదు. ఽ (ఇది చదవండి: అలాంటి నటించడమే తనకు చాలా ఇష్టం: యంగ్ హీరోయిన్) అయితే దాదాపు రెండు నెలల పాటు హోస్లో ఉన్న సందీప్ కుటుంబానికి దూరమయ్యాడు. ఈ సమయంలో తమ ఫ్యామిలీస్ నుంచి లేఖలు కూడా అందుకున్నారు. అయితే సందీప్ భార్య జ్యోతిరాజ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో భర్తకు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చింది. కచ్చితంగా విన్నర్‌గానే బయటకొస్తాడని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. తాజాగా సందీప్ ఎలిమినేట్ కావడంతో తీవ్ర భావోద్వేగానికి గురైంది. భర్తపై తన ప్రేమను చాటుకుంది. ఇంటికి సందీప్‌కు భోజనం తినిపిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. జ్యోతిరాజ్ రాస్తూ..'బిగ్‌బాస్ హౌస్‌లోకి చాలా బలంగా వెళ్లావ్. గట్టి పోటీ ఇచ్చావ్. అన్ని విధాలుగా నిరూపించుకున్నావ్. అంతే స్ట్రాంగ్‌గా బయటకొచ్చావ్. దీనికి ఇది మాత్రమే అంతం కాదు.' లవ్ సింబల్ జత చేస్తూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ సందీప్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఎనిమిది వారాల పాటు హౌస్‌లో ఉన్న సందీప్ దాదాపుగా రూ.22 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: వరుణ్- లావణ్య పెళ్లి.. నిహారికను ఫాలో అవుతోన్న కాబోయే కోడలు!) View this post on Instagram A post shared by Jyoti Raj (@jyothiraj_sandeep) -
'నీ మొగుడు వేస్ట్.. నేను చెప్పకూడని మాటలన్నారు': జ్యోతిరాజ్ ఎమోషనల్
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7లో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి హౌస్‌లో చురుకుగా ఉంటున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే అని తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన భార్య జ్యోతిరాజ్ సందీప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్ తమపై చేసిన కామెంట్స్‌పై స్పందించారు. వీళ్లంతా కలిసి అతన్ని ఎలిమినేట్ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు ఉందని జ్యోతిరాజ్ అన్నారు. తమపై ట్రోల్స్‌ను తలుచుకుని ఎమోషనలయ్యారు. (ఇది చదవండి: పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్) జ్యోతిరాజ్ మాట్లాడుతూ..'రియాలిటీ షో ఆయనకేం కొత్తకాదు. ఒక్కసారి దిగారంటే కప్పు కొట్టాల్సిందే. బిగ్ బాస్ అనేది ఒక కొత్త అనుభవం. డ్యాన్స్ వేరు. రియాలిటీ షో వేరు. సందీప్ ఎవరితోనైనా కలవడానికి కాస్తా టైం తీసుకుంటారు. అతను ఇంట్రావర్ట్. హౌస్‌లో ఇంతమందిలో కలవాలంటే కాస్తా సమయం పడుతుంది. మాకు ఒక డ్రీమ్ ఉంది. అందుకోసమే బిగ్‌బాస్‌లో వెళ్లాలని నిర్ణయించుకున్నాం. తను ఫైనల్‌గా పెద్ద హీరోలతో కొరియోగ్రఫీ చేయాలన్నదే ఆశయం.'అని అన్నారు. పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్ ట్రోల్స్‌పై స్పందిస్తూ..'ప్రశాంత్‌కు వాళ్లు సపోర్ట్ చేయడం లేదు. ఇంకా చెడగొడుతున్నారు. మమ్మల్ని ఇంకా హార్ట్ చేస్తూనే ఉన్నారు. మాపై అసభ్యంగా ట్రోల్స్ చేయడం చాలా తప్పు. ఫ్యామిలీని ఇందులోకి లాగడం మంచిదేనా?. ఆ విషయంలో నేను వీడియో పెట్టగానే అసభ్యకరమైన కామెంట్స్. నీ మొగుడు వేస్ట్.. అంటూ చెప్పకూడని మాటలు అన్నారు. షోలో ఉన్నవారి కుటుంబాల గురించి మాట్లాడమేంటి? ప్రశాంత్‌తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ప్రశాంత్ జోలికొస్తే మిమ్మల్ని వదలం. నీ మొగుడికి చెప్పు.. ప్రశాంత్ జోలికి రావొద్దని. ఇంకా కొన్ని మాటలైతే నేను చెప్పలేనంత అసభ్యంగా మాట్లాడారు. దానివల్ల ఎవరికీ చెడ్డపేరు. తమ్ముడు ప్రశాంత్‌కే కదా. అతను లోపలికి వెళ్లేటప్పుడు నాకు సపోర్ట్ చేయండ్రా అని చెప్పేసి వెళ్లాడు. కానీ వీళ్లంతా కలిసి వాడిని ఎలిమినేట్ చేసేలా ఉన్నారు. వీళ్లంతా కలిసి ప్రశాంత్‌కు బ్యాడ్‌నేమ్ తెస్తున్నారు.' అని అన్నారు. (ఇది చదవండి: గ్రాండ్‌గా ఆ హీరో హీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా) కాగా.. ఇప్పటికే బిగ్‌బాస్‌లో ఉన్న సందీప్‌పై ట్రోల్స్‌పై జ్యోతిరాజ్ స్పందించారు. జీవితంలో సందీప్ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు.. ఆయనొక కళాకారుడిగా గుర్తింపు ఉంది. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగారు. అలాంటి వ్యక్తిపై కొందరు యూట్యూబర్స్ చీప్ థంబ్‌నైల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జ్యోతిరాజ్ ఆవేదన చెందారు. అందరిలాగే అతనికి కూడా ఫ్యామిలీ ఉందని మరిచిపోవద్దని తెలిపారు. అలాంటి వాటి వల్ల తామెంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. -
నాగార్జునకు ఆ స్థాయి ఉంటే ఏదైనా అనేస్తాడా?: జ్యోతి రాజ్
బిగ్‌బాస్ షోలో పాపులారిటీ పెంచుకునేవాళ్లు, ఇమేజ్ డ్యామేజ్ చేసుకునేవాళ్లు.. ఇలా రెండు రకాలు ఉంటారు. ఇందులో ఆట సందీప్ రెండో కేటగిరీకి చెందుతాడు. కొరియోగ్రాఫర్‌గా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న అతడు ఆ మధ్య తన భార్య జ్యోతి రాజ్‌తో కలిసి నీతోనే డ్యాన్స్ షోలో పాల్గొన్నాడు. పార్టిసిపేట్ చేయడమే కాదు షో విజేతగానూ అవతరించారు. ప్రస్తుతం సందీప్ మాస్టర్ బిగ్‌బాస్ 7 తెలుగులో పాల్గొన్నాడు. ఇక్కడ తన మాటలతో, ప్రవర్తనతో ఎక్కడలేని నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. దీంతో అతడిని చాలాసార్లు నెటిజన్లే కాదు హోస్ట్ నాగార్జున సైతం తిట్టిపోశాడు. నీకు కళ్లు కనిపించడం లేదా? నువ్వేమైనా పిస్తావా? అంటూ విమర్శించాడు. నాగార్జున అలా అనడం నచ్చలే! అయితే ఈ విమర్శలను జీర్ణించుకోలేకపోయింది సందీప్ భార్య జ్యోతిరాజ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నాగార్జున సడన్‌గా అలా అనేశారేంటి? అనిపించింది. సందీప్ భార్యగా మాత్రం నాకది నచ్చలేదు. ఒక భార్యగా నా భర్త నాకు గొప్ప. అక్కడ ఉన్నది నాగార్జున అయినా మోదీ అయినా ఎలాంటి గొప్పవాళ్లు అయినా సరే నా భర్తే నాకు గొప్ప. అయినా నా భర్తను అలా అనేశాడేంటి? నాగార్జునకు ఆ స్థాయి ఉంటే ఎంత మాటైనా అనేస్తాడా? సర్లే.. ఇదొక గేమ్ షో కదా, తప్పదనుకున్నాను. నా భర్త నటించట్లేదు.. అదే నాగార్జునగారు సందీప్‌ను గ్రేట్ అన్నాడు, నువ్వేమైనా పిస్తావా? అన్నాడు. గేమ్ ఆయన చేతిలో ఉంది. మనం ఆయన బోనులోకి వెళ్లాం కాబట్టి పడాల్సిందే! ఇలాంటివి చూస్తున్నప్పుడు నేను బాధపడను. ఇండస్ట్రీలో పొగడ్తలు, విమర్శలు.. రెండూ ఉంటాయి. అన్నీ దాటుకుని ముందుకు వెళ్లినవారే సక్సెస్ అవుతారు. నా భర్త హౌస్‌లో నటిస్తున్నాడంటున్నారు. బిగ్‌బాస్ అనేది డ్యాన్స్ షో కాదు. అతడికి తన ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మాత్రమే అగ్రెషన్ ఉంటుంది. మిగతా సమయాల్లో కూల్‌గా ఉంటాడు. బిగ్‌బాస్ అనేది ఫ్యామిలీ షో. అక్కడ కోపం చూపించాలని తను అనుకోలేదు. కావాలని తనను డిస్టర్బ్ చేస్తున్నారు తనకు కాల్ వచ్చింది, వెళ్లాడు. గెలిచినా, ఓడినా.. ఆడియన్స్ మనసులు గెలుచుకుని రావాలని చెప్పాం. సందీప్ ఒరిజినాలిటీ ఇదీ అని అందరికీ తెలియాలన్నాం. సందీప్ మాస్టర్‌ను కావాలని కొందరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఆయన కూల్‌గా ఉండాలనే ప్రయత్నిస్తున్నాడు. ఆయన తిరిగిచ్చాడంటే తన ముందు ఎవరి నోళ్లు కూడా పనికిరావు. అంత డబుల్ ఇచ్చేస్తాడు. ఆయన టాస్కులపై ఫోకస్ పెడుతున్నాడు. బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. కొత్తగా బిగ్‌బాస్ నుంచి వచ్చే ఫేమ్ ఏముంది సందీప్‌కు? ఆల్రెడీ ఆయనేంటో నిరూపించుకున్నాడు' అని చెప్పుకొచ్చింది జ్యోతి రాజ్. చదవండి: రీఎంట్రీ ట్విస్ట్.. ప్రేక్షకులని మోసం చేస్తున్నారా?