
బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7వ సీజన్‌లో ఎనిమిదో వారం ముగిసింది. అయితే ఈ సారి ఆ సంప్రదాయానికి బిగ్ బాస్ చెక్ పండిది. ఏడు వారాలుగా మహిళా కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ కాగా..ఈ సారి మేల్ కంటెస్టెంట్ బయటకొచ్చేశాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా స్ట్రాంగ్ వికెట్ ఎదిరిపోయింది. బలమైన కంటెస్టెంట్, టాప్-5లో ఉంటాడని భావించిన కొరియోగ్రాఫర్ ఆట సందీప్ బయటకొచ్చేశాడు. ఈ వారంలో ఆయనకే తక్కువ ఓట్లు పడటంతో హౌస్‌కు గుడ్ బై చెప్పక తప్పలేదు. ఽ
(ఇది చదవండి: అలాంటి నటించడమే తనకు చాలా ఇష్టం: యంగ్ హీరోయిన్)
అయితే దాదాపు రెండు నెలల పాటు హోస్‌లో ఉన్న సందీప్ కుటుంబానికి దూరమయ్యాడు. ఈ సమయంలో తమ ఫ్యామిలీస్ నుంచి లేఖలు కూడా అందుకున్నారు. అయితే సందీప్ భార్య జ్యోతిరాజ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో భర్తకు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చింది. కచ్చితంగా విన్నర్‌గానే బయటకొస్తాడని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. తాజాగా సందీప్ ఎలిమినేట్ కావడంతో తీవ్ర భావోద్వేగానికి గురైంది. భర్తపై తన ప్రేమను చాటుకుంది. ఇంటికి సందీప్‌కు భోజనం తినిపిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.
జ్యోతిరాజ్ రాస్తూ..'బిగ్‌బాస్ హౌస్‌లోకి చాలా బలంగా వెళ్లావ్. గట్టి పోటీ ఇచ్చావ్. అన్ని విధాలుగా నిరూపించుకున్నావ్. అంతే స్ట్రాంగ్‌గా బయటకొచ్చావ్. దీనికి ఇది మాత్రమే అంతం కాదు.' లవ్ సింబల్ జత చేస్తూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ సందీప్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఎనిమిది వారాల పాటు హౌస్‌లో ఉన్న సందీప్ దాదాపుగా రూ.22 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: వరుణ్- లావణ్య పెళ్లి.. నిహారికను ఫాలో అవుతోన్న కాబోయే కోడలు!)
Comments
Please login to add a commentAdd a comment