నాగార్జునకు ఆ స్థాయి ఉంటే ఏదైనా అనేస్తాడా?: జ్యోతి రాజ్‌ | Bigg Boss Telugu 7: Aata Sandeep Wife Jyoti Raj Disappointment over Nagarjuna Comments | Sakshi
Sakshi News home page

Jyoti Raj: నా భర్త రివర్స్‌ అయితే ఎవరూ పనికి రారు, డబుల్‌ ఇచ్చిపడేస్తాడు.. సందీప్‌ మాస్టర్‌ భార్య ఫైర్‌

Published Sun, Oct 15 2023 1:12 PM | Last Updated on Mon, Oct 16 2023 11:03 AM

Bigg Boss Telugu 7: Aata Sandeep Wife Jyoti Raj Disappointment over Nagarjuna Comments - Sakshi

బిగ్‌బాస్‌ షోలో పాపులారిటీ పెంచుకునేవాళ్లు, ఇమేజ్‌ డ్యామేజ్‌ చేసుకునేవాళ్లు.. ఇలా రెండు రకాలు ఉంటారు. ఇందులో ఆట సందీప్‌ రెండో కేటగిరీకి చెందుతాడు. కొరియోగ్రాఫర్‌గా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న అతడు ఆ మధ్య తన భార్య జ్యోతి రాజ్‌తో కలిసి నీతోనే డ్యాన్స్‌ షోలో పాల్గొన్నాడు. పార్టిసిపేట్‌ చేయడమే కాదు షో విజేతగానూ అవతరించారు. ప్రస్తుతం సందీప్‌ మాస్టర్‌ బిగ్‌బాస్‌ 7 తెలుగులో పాల్గొన్నాడు. ఇక్కడ తన మాటలతో, ప్రవర్తనతో ఎక్కడలేని నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. దీంతో అతడిని చాలాసార్లు  నెటిజన్లే కాదు హోస్ట్‌ నాగార్జున సైతం తిట్టిపోశాడు. నీకు కళ్లు కనిపించడం లేదా? నువ్వేమైనా పిస్తావా? అంటూ విమర్శించాడు.

నాగార్జున అలా అనడం నచ్చలే!
అయితే ఈ విమర్శలను జీర్ణించుకోలేకపోయింది సందీప్‌ భార్య జ్యోతిరాజ్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నాగార్జున సడన్‌గా అలా అనేశారేంటి? అనిపించింది. సందీప్‌ భార్యగా మాత్రం నాకది నచ్చలేదు. ఒక భార్యగా నా భర్త నాకు గొప్ప. అక్కడ ఉన్నది నాగార్జున అయినా మోదీ అయినా ఎలాంటి గొప్పవాళ్లు అయినా సరే నా భర్తే నాకు గొప్ప. అయినా నా భర్తను అలా అనేశాడేంటి? నాగార్జునకు ఆ స్థాయి ఉంటే ఎంత మాటైనా అనేస్తాడా? సర్లే.. ఇదొక గేమ్‌ షో కదా, తప్పదనుకున్నాను.

నా భర్త నటించట్లేదు..
అదే నాగార్జునగారు సందీప్‌ను గ్రేట్‌ అన్నాడు, నువ్వేమైనా పిస్తావా? అన్నాడు. గేమ్‌ ఆయన చేతిలో ఉంది. మనం ఆయన బోనులోకి వెళ్లాం కాబట్టి పడాల్సిందే! ఇలాంటివి చూస్తున్నప్పుడు నేను బాధపడను. ఇండస్ట్రీలో పొగడ్తలు, విమర్శలు.. రెండూ ఉంటాయి. అన్నీ దాటుకుని ముందుకు వెళ్లినవారే సక్సెస్‌ అవుతారు. నా భర్త హౌస్‌లో నటిస్తున్నాడంటున్నారు. బిగ్‌బాస్‌ అనేది డ్యాన్స్‌ షో కాదు. అతడికి తన ప్రొఫెషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే అగ్రెషన్‌ ఉంటుంది. మిగతా సమయాల్లో కూల్‌గా ఉంటాడు. బిగ్‌బాస్‌ అనేది ఫ్యామిలీ షో. అక్కడ కోపం చూపించాలని తను అనుకోలేదు.

కావాలని తనను డిస్టర్బ్‌ చేస్తున్నారు
తనకు కాల్‌ వచ్చింది, వెళ్లాడు. గెలిచినా, ఓడినా.. ఆడియన్స్‌ మనసులు గెలుచుకుని రావాలని చెప్పాం. సందీప్‌ ఒరిజినాలిటీ ఇదీ అని అందరికీ తెలియాలన్నాం. సందీప్‌ మాస్టర్‌ను కావాలని కొందరు డిస్టర్బ్‌ చేస్తున్నారు. ఆయన కూల్‌గా ఉండాలనే ప్రయత్నిస్తున్నాడు. ఆయన తిరిగిచ్చాడంటే తన ముందు ఎవరి నోళ్లు కూడా పనికిరావు. అంత డబుల్‌ ఇచ్చేస్తాడు. ఆయన టాస్కులపై ఫోకస్‌ పెడుతున్నాడు. బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. కొత్తగా బిగ్‌బాస్‌ నుంచి వచ్చే ఫేమ్‌ ఏముంది సందీప్‌కు? ఆల్‌రెడీ ఆయనేంటో నిరూపించుకున్నాడు' అని చెప్పుకొచ్చింది జ్యోతి రాజ్‌.

చదవండి: రీఎంట్రీ ట్విస్ట్.. ప్రేక్షకులని మోసం చేస్తున్నారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement