టేస్టీ తేజ.. సందీప్ మాస్టర్.. ఇద్దరూ హౌస్‌లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఎలిమినేట్ అయ్యాకే అసలు గొడవ మొదలైంది.. ఎనిమిది వారాలుగా నామినేషన్స్‌లోకి రాకుండా తనను తాను కాపాడుకుంటూ వస్తున్న సందీప్‌ను నామినేషన్స్‌లోకి లాక్కొచ్చాడు తేజ. దీంతో ఆ వారమే సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. దీన్ని ఆయన మనసులో పెట్టుకున్నాడు. అంతేకాదు, తేజ ఎలిమినేట్ అవుతున్నాడనగానే ఎగిరి గంతేశాడు. అందరినీ ఎలిమినేట్ చేస్తూ చివరకు తనే ఎలిమినేట్ అయ్యాడు అని సెటైర్లు కూడా వేశాడు.
ఎవరు చెప్పేది నిజం? ఎవరు చెప్పేది అబద్ధం?
అయితే సందీప్ మాస్టర్‌ను కావాలని నామినేట్ చేయలేదని, తనే అడిగి చేయించుకున్నాడని బిగ్‌బాస్ హౌస్‌లో కుండ బద్ధలు కొట్టి చెప్పాడు తేజ. అది అబద్ధం, నేనెందుకు అడిగి మరీ చేయించుకుంటానని ఆగ్రహించాడు సందీప్. ఈ విషయం దగ్గరే గొడవ మొదలైంది. వీరిద్దరిలో ఎవరు చెప్పేది నిజం? ఎవరు చెప్పేది అబద్ధం? అనేది అర్థం కాక అభిమానులు తల పట్టుకుంటున్నారు. తాజాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తేజకు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. సందీప్ మాస్టర్ నిన్ను అడిగి మరీ నామినేట్ చేయించుకున్నాడా? అని యాంకర్ అడిగాడు.
తటపటాయించిన తేజ
ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు తేజ తటపటాయించాడు. 'హౌస్ లోపల ఏం జరిగిందనేది మీకు తెలియదు. దీని గురించి ఇప్పుడేం మాట్లాడదల్చుకోలేదు. సందీప్, నేను కలిసి ఈ విషయంపై ఓ వీడియో చేస్తాం' అంటూ ఆ ప్రశ్న దాటవేశాడు. తర్వాత ఏ ప్రశ్నలడిగినా టపీమని సమాధానాలు చెప్పుకుంటూ పోయిన తేజ ఈ ఒక్క విషయంపై మాత్రం మాట్లాడటానికే ఇష్టపడలేదు. దీంతో తప్పు తేజదేనా? అతడు కావాలనే అబద్ధం చెప్పి ఉంటాడా? అని అనుమానిస్తున్నారు జనాలు. సమాధానం చెప్పను అంటున్నాడంటే కచ్చితంగా తప్పు చేసినట్లే.. తేజ అడ్డంగా దొరికిపోయాడు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఓ టాస్కులో తనకు తెలియకుండానే గౌతమ్‌ను గట్టిగా కొట్టాడు తేజ. అందుకు అతడి ఇంటికి వెళ్లి మరీ గౌతమ్ పేరెంట్స్‌కు సారీ చెప్తానంటున్నాడు.
చదవండి: తేజ తొమ్మిది వారాల్లో ఎంత సంపాదించాడంటే?
Comments
Please login to add a commentAdd a comment