Tasty Teja
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్‌బాస్ ఫేమ్ టేస్టీ తేజ, శోభ శెట్టి (ఫోటోలు)
-
బిగ్‌బాస్: తేజకు నాగార్జున బంపరాఫర్.. అతడి పెళ్లికి..!
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున ఒక టీచర్‌లాగా! పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోమని హెచ్చరిస్తాడు. మంచి చేస్తే చప్పట్లు కొడతాడు. బాధలో ఉంటే మోటివేట్ చేస్తాడు. సంతోషాన్ని నలుగురితో పంచుకోమంటాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్లకు గురువుగా, అండగా ఉండేది నాగార్జున ఒక్కరే!గత సీజన్లో..అయితే వీకెండ్లో నాగార్జున వేసుకొచ్చే షర్ట్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. పోయిన సీజన్లో షర్ట్ కావాలని శోభా శెట్టి ఇలా అడగ్గానే నాగ్ అలా ఇచ్చేశాడు. అమర్దీప్ అడిగితే మాత్రం అసలు లెక్కచేయలేదు. ఈ సీజన్లో టేస్టీ తేజ కూడా తనకు చొక్కా కావాలని సిగ్గు విడిచి అడిగాడు. సన్నబడితే షర్ట్ ఇస్తానని నాగ్ మాటిచ్చాడు. అందుకోసం తేజ కష్టపడ్డాడు కానీ ఫలితం లేకపోయింది. బరువు తగ్గకుండానే హౌస్ నుంచి వెళ్లిపోయాడు.నేను ఫిక్స్ చేస్తాతాజాగా ఫినాలేకు వచ్చిన తేజ మీ షర్ట్ దక్కలేదన్న కోరిక అలాగే మిగిలిపోయిందన్నాడు. అందుకు నాగ్ ముందు పెళ్లి ఫిక్స్ చేసుకో.. అప్పుడు నీకు పెళ్లి డ్రెస్ నేను ఫిక్స్ చేస్తా అని హామీ ఇచ్చాడు. ఊహించని బంపరాఫర్ తగలడంతో తేజ తెగ సంతోషపడిపోయాడు.చదవండి: కప్పు గెలిచేసిన నిఖిల్.. అడుగుదూరంలో ఆగిపోయిన గౌతమ్! -
'బిగ్ బాస్ అంటే ప్రేక్షకులకు ఫ్లవరు.. పార్టిసిపెంట్స్‌కు ఫైరు'
నిను వీడను నేను....అనే పాటలోని వాక్యం బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌కు సరిగ్గా సరిపోతుంది. ఏ సిరీస్ అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే...ఒక్కసారి బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళును జీవితకాలం బిగ్ బాస్ నీడలా వారి వెంట ఉంటాడు. అదెలాగంటారా..ప్రతి సీరిస్‌లో పాత వాళ్ళు వచ్చి పార్టిసిపెంట్స్ ను పలకరిస్తారు, వారి టాస్కులతో పులకరిస్తారు. ఇదే జరిగింది ఈ వారం బిగ్ బాస్‌లో. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ కోసం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు పాత సీజన్ల నుండి పార్టసిపెంట్సును తీసుకువచ్చి వారిచే టాస్కులు ఆడే ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. అలానే ఆ కంటెస్టెంట్లు టాస్కులతో పాటు కంటెస్టెంట్స్ మధ్య కాసింత గిల్లికజ్జాలు పెట్టి వెళ్ళారు. ఇదే ఈ వారం బిగ్ బాస్ ప్రేక్షకులకు పండుగ. అందరికీ తెలిసినట్టు హౌస్‌లో గ్రూపిజం బాగా కనపడుతుంది. ఒకటి మొదటి నుండి వున్న గ్రూప్ అయితే రెండోది వైల్డ్ కార్డ్ గ్రూప్. ఆ గ్రూపులు మధ్య ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ ఫైట్లు. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ ఫైనల్ టాస్కు ముందు ఈ గ్రూపుల మధ్య ఓ పెద్ద తగాదానే నడిచింది. ఆ తగాదా తినే దోశ కోసం ఎగ పడ్డారు. ఎపిసోడ్లో ఈ దోశ పంచాయితీ కనీసం పది నిమిషాల చూపించి ప్రేక్షకుల ఆరాటాన్ని బాగానే క్యాష్ చేసుకున్నాడు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ కోసం పెట్టిన టాస్కులలో విజేతగా నిలిచాడు అవినాష్. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా టేస్టీ తేజ , పృథ్వి ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లోపల, బయట చూసే ప్రేక్షకులు బిగ్ బాస్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో కాని సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్, గ్రూప్స్ ఆ పై సోషల్ యూజర్స్ మధ్య బిగ్ బాస్ గురించి కొట్లాట... ఇన్ని జరుగుతున్నాయి. అందుకే బిగ్ బాస్ అంటే ఫ్లవర్ కాదు బిగ్ బాస్ చేస్తున్నవాళ్ళకి, చూస్తున్నవాళ్ళకి వాళ్ళ మధ్య మంట పెట్టే ఫైరు. కాబట్టే బిగ్ బాస్ తగ్గేదేలే....-ఇంటూరు హరికృష్ణ -
బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?
బిగ్‌బాస్ 8 తెలుగు చివరకొచ్చేసింది. ఫినాలే కోసం నువ్వానేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఇందులో భాగంగా శనివారం ఎపిసోడ్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. తన కోరికని ఈ సీజన్లో నెరవేర్చుకున్న తేజ.. రెమ్యునరేషన్ కూడా బాగానే సంపాదించాడట. ఇంతకీ ఎన్ని లక్షలు అందుకున్నాడంటే?(ఇదీ చదవండి: నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ)అక్టోబరు 6న వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఒకడిగా టేస్టీ తేజ వచ్చాడు. ప్రారంభంలో ఉన్నంతలో బాగానే ఎంటర్టైన్ చేశాడు. తర్వాత తర్వాత అరుపులు గొడవలు ఎక్కువైపోయాయి. బాగా నస పెట్టేశాడు. దీంతో ఎలిమినేట్ కావడం అయితే పక్కా అనుకున్నారు. కాకపోతే అలా సేవ్ అయిపోతూ వచ్చాడు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్లలో ఒకడిగా బయటకొచ్చేశాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే తన తల్లి వస్తుందని ఆశపడ్డాడు. అనుకున్నట్లే అది నెరవేర్చుకున్నాడు.హౌసులో 8 వారాలు పాటు ఉన్న తేజ.. ఒక్కో వారానికిగానూ లక్షన్నర అందుకున్నాడట. అంటే 8 వారాలకు గానూ రూ.12 లక్షలు తేజకి రాబోతున్నాయట. ఓ రకంగా చూసుకుంటే తేజకి ఇది మంచి మొత్తమే అని చెప్పొచ్చు. ఇదలా ఉంచితే ఆదివారం ఎపిసోడ్లో కన్నడ బ్యాచ్‌లో ఒకడైన పృథ్వీ ఎలిమినేట్ అయి బయటకు రాబోతున్నాడు. బహుశా వచ్చే వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నాయండోయ్!(ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ
నాగార్జున వచ్చీరావడంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. అయితే టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకుని నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోయాడని గుడ్‌న్యూస్ చెప్పాడు. అంతేకాదు ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ అతడికి ఓ ట్రోఫీ కూడా ఇచ్చారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నోరు తీపి చేసిన బిగ్బాస్ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్‌ను మనసులో కోరిక చెప్పమనగా.. మందు బాటిల్స్, స్వీట్స్ కావాలంటూ చిట్టా బయటపెట్టాడు. మందు కుదరదు కానీ స్వీట్స్‌తో సరిపెట్టుకోమంటూ బిగ్‌బాస్ గులాబ్‌జామూన్ పంపించి హౌస్మేట్స్ నోరు తీపి చేశాడు. అలాగే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అతడికి హౌస్మేట్స్ పెట్టిన బ్యాడ్జ్ ప్రకారం రూ.4 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అలా ప్రైజ్‌మనీ రూ.54,30,000కి చేరింది.బ్లాక్ టికెట్.. గోల్డెన్ టికెట్తర్వాత నాగ్.. హౌస్‌లో కొందరికి బ్లాక్ టికెట్, మరికొందరికి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. ఎవరికి బ్లాక్ టికెట్ ఇవ్వాలని నిఖిల్‌ను అడగ్గా తేజ పేరు చెప్పాడు. గౌతమ్ వంతు రాగా.. అతిథులు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే వారితో సరిగా ప్రవర్తించలేదని ప్రేరణ పేరు సూచించాడు. దీంతో ఆమె ఫౌల్ గేమ్ ఆడిన వీడియో నాగ్ ప్లే చేశాడు. ఇలా ఆడితే బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వకపోతే ఏం చేస్తారన్నట్లు క్లాస్ పీకాడు. రోహిణి.. ఫౌల్ గేమ్ ఆడాడంటూ పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గేమ్స్ గెలిస్తే టైటిల్ రాదు!అవినాష్.. నబీల్‌కు, తేజ.. విష్ణుకు బ్లాక్ టికెట్ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఎవరు ఈ సీజన్ విన్నర్ అనుకుంటున్నావని విష్ణును అడగ్గా తనే గెలుస్తానంది. గెలవాలంటే ఈ ఆట సరిపోదుకదా అని నాగ్ అంటుంటే.. ఆటలన్నీ గెలిచినవారు టైటిల్ సాధించినట్లు బిగ్‌బాస్ చరిత్రలోనే చూడలేదని వేదాంతం చెప్పింది. అది తప్పని, జనాలు.. ఆట, మాట.. ఇలా ప్రతి ఒక్కటి చూస్తారని స్పష్టం చేశాడు.గౌతమ్‌కు గోల్డెన్ టికెట్ప్రేరణ.. గౌతమ్‌కు బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గౌతమ్ అందుకు అర్హుడంటూ నబీల్, విష్ణు, పృథ్వీ, నిఖిల్ కూడా చేయెత్తారు. అప్పటివరకు హౌస్మేట్స్ చెప్పిన అందరికీ బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటూ పోయిన నాగార్జున.. గౌతమ్‌కు మాత్రం బ్లాక్ టికెట్ ఇవ్వనంటూ గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అలాగే రోహిణి, నిఖిల్, అవినాష్‌కు సైతం గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అనంతరం దమ్ము-దుమ్ము అని ఓ గేమ్ ఆడించాడు. ట్రోఫీని పైకి ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్మయిపోయే వ్యక్తి ఎవరు? అనేది చెప్పాలన్నాడు. నిఖిల్ దమ్మున్న ప్లేయర్నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ.. నిఖిల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము అని తెలిపారు. రోహిణి.. గౌతమ్ దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ ఫినాలే వరకు రాకపోవచ్చంది. తేజ.. ఎంటర్టైనర్లు కూడా గెలవగలరని నిరూపిస్తారంటూ అవినాష్ దమ్మున్న ప్లేయర్ అన్నాడు. విష్ణు ఉట్టి దుమ్మున్న ప్లేయర్ అన్నాడు. గౌతమ్.. రోహిణి దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ దుమ్ము అని తెలిపాడు. అవినాష్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, ఫౌల్ గేమ్స్ ఆడతాడంటూ పృథ్వీని దుమ్ము కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు.గౌతమ్‌పై కోపాన్నంతా కక్కేసిన తేజతర్వాత తేజ.. గౌతమ్‌పై తన కోపాన్నంతా కక్కేశాడు. టికెట్ టు ఫినాలే ఆడే క్రమంలో ఓ గేమ్‌లో గౌతమ్ నా పేరు సెలక్ట్ చేయకపోవడంతో బాధేసిందని, అదే విషయం అతడిని నిలదీశానన్నాడు. నామినేషన్స్‌లో ప్రేరణతో అంత గొడవైనా కూడా ఆమెనే ఎందుకు సెలక్ట్ చేశాడు? అక్కడ నేను ఫ్రెండ్ కాబట్టి నన్ను సెలక్ట్ చేస్తే అతడికి సోలో బాయ్ అనే ట్యాగ్ పోతుందని వెనకడుగు వేశాడు. ప్రేరణను సెలక్ట్ చేస్తే తనకు మంచి పేరొస్తుందని లెక్కలు వేసుకున్నాడని తెలిపాడు.తేజ ఎలిమినేట్నా మనసుకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోయా.. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా అది నీ ఇష్టం అని గౌతమ్ ఒక్కముక్కలో తేల్చేశాడు. ఇక ప్రేరణ, నిఖిల్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము కంటెస్టెంట్ అని అభిప్రాయపడ్డారు. తేజ ఆడలేకపోతున్నాడని పేర్కొన్నాడు. అనంతరం నాగార్జున తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కల నెరవేర్చుకున్నాకే వెళ్లిపోతున్నానంటూ తేజ సంతోషపడితే అవినాష్ మాత్రం కంటనీరు పెట్టుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన తేజతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్‌మేట్స్‌ను కూరగాయలతో పోల్చాలన్నాడు. టాప్ 2లో గౌతమ్..అలా అవినాష్ ఉల్లిపాయ అని, ఈ సీజన్లో పెద్ద గెలుపు రోహిణిదేనంటూ బంగాళాదుంపతో పోల్చాడు. విష్ణుప్రియ కాకరకాయ అన్నాడు. ప్రేరణ.. మాట సరిగా లేకపోతే నెక్స్ట్ నువ్వే బయటకు వచ్చేస్తావని హెచ్చరిస్తూ బెండకాయ ఇచ్చాడు. పృథ్వీ.. విష్ణుప్రియను వదిలినట్లు కొన్ని గేమ్స్ కూడా వదిలేస్తున్నావంటూ పచ్చిమిర్చి ట్యాగ్ ఇచ్చాడు. గౌతమ్‌లో ఎన్ని పొరలుంటాయో వాడికే తెలీదంటూ క్యాబేజీతో పోల్చాడు. అతడు టాప్ 2లో పక్కాగా ఉంటాడనన్నాడు. నబీల్.. గేమ్‌లో కన్ఫ్యూజ్ అవుతున్నాడని, టాప్ 2లో ఉంటాడనుకుంటే ఇప్పుడు టాప్ 5కి వచ్చేశాడంటూ టమాటతో పోల్చాడు. నిఖిల్.. ఎమోషనల్‌గా వీక్ అంటూ అతడికి సోరకాయ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేక్షకులు అది పసిగడితే తేజ ఎలిమినేషన్ ఖాయం: ప్రేరణ
టికెట్ టు ఫినాలే గేమ్ తర్వాత హౌస్‌మేట్స్‌లో టెన్షన్ రెట్టింపైంది. ఎలాగైనా ఫైనల్లో చోటు దక్కించుకోవాలని అందరూ తాపత్రయపడుతున్నారు. కప్పు కొట్టాల్సిందేనని గట్టిగా ఫీలవుతున్నారు. అయితే బిగ్‌బాస్ 8 ట్రోఫీ ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్ముగా అయిపోయే కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నాడు నాగ్.ట్రోఫీ అందుకు దమ్ము ఎవరికి?అలా నబీల్.. తన తర్వాత నిఖిల్ గెలిచే ఛాన్స్ ఉందన్నాడు. రోహిణి.. గౌతమ్ గెలుస్తాడని, ఫినాలే వరకు ప్రేరణ రాలేదని అభిప్రాయపడింది. తేజ.. విష్ణు దుమ్ముగా అయిపోతుందన్నాడు. పృథ్వీయేమో తేజ ఫినాలే వరకు రాలేడన్నాడు. అవినాష్.. పృథ్వీ దుమ్ము అని తెలిపాడు. ప్రేరణ మాట్లాడుతూ.. అవసరం లేని చోట కూడా తేజ కంటెంట్ క్రియేట్ చేస్తాడు. అది ప్రేక్షకులు పసిగడితే అతడు ఫినాలేకు రాడు అని చెప్పింది. అన్నట్లుగానే ఈ రోజు తేజ ఎలిమినేట్ కానున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
డబుల్ ఎలిమినేషన్.. తేజ అవుట్.. మరి అవినాష్?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కథ కంచికి చేరే సమయం ఆసన్నమైంది. ఈ వారమంతా టికెట్ టు ఫినాలే కోసం హౌస్మేట్స్ పోటీపడ్డారు. అనూహ్యంగా అవినాష్ ఈ టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5కి చేరుకున్నాడు. అయితే ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడితేనే అది నెరవేరుతుంది.ఓటింగ్‌లో నిఖిల్ టాప్ఈ వారం రోహిణి తప్ప మిగతా ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఎప్పటిలాగే నిఖిల్ భారీ ఓటింగ్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. రెండో స్థానంలో గౌతమ్, మూడో స్థానంలో నబీల్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చిట్టచివరి స్థానాల్లో తేజ, అవినాష్ ఉన్నారు.తేజ ఎలిమినేట్!ఈ ఇద్దరిలో తేజను శనివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ చేసినట్లు ఓ వార్త బయటకు వచ్చింది. మొదట్లో బాగానే ఆడిన తేజకు ఈ వారం పెద్దగా కలిసిరాలేదు. పైగా మనవాడు అని చెప్పుకుతిరిగే గౌతమ్‌పైనే నిందలు వేయడం అతడికి మరింత మైనస్ అయింది. ఫలితంగా ఎలిమినేట్ అవక తప్పలేదు.డబుల్ ఎలిమినేషన్రెండో ఎలిమినేషన్ ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. అవినాష్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అని పక్కన పెడితే పృథ్వీని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి డబుల్ ఎలిమినేషన్లో బలయ్యే మరో కంటెస్టెంట్ ఎవరన్నది క్లారిటీ రావాలంటే సండే ఎపిసోడ్ షూటింగ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇన్నాళ్లకు విష్ణు కళ్లు తెరిపించిన శ్రీముఖి.. పృథ్వీతో కటీఫ్!
వైల్డ్కార్డ్స్కు టికెట్ టు ఫినాలే గెలిచే అర్హతే లేదన్నాడు పృథ్వీ.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అవినాష్ టికెట్ టు ఫినాలే ఎగరేసుకుపోయాడు. పృథ్వీ జపం చేస్తున్న విష్ణు కళ్లు తెరిపించింది శ్రీముఖి. మరి శ్రీముఖి ఏం చెప్పిందో నేటి (నవంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్ చూసేయండి..నాలుగో కంటెండర్‌గా తేజరోహిణి, అవినాష్, నిఖిల్ 'టికెట్ టు ఫినాలే' కంటెండర్లుగా నిలిచారు. వీరికి ఓ వ్యక్తిని కంటెండర్‌గా ఎన్నుకునే సూపర్ పవర్ ఇచ్చాడు. ముగ్గురూ కలిసి తేజ పేరు సూచించారు. ఇది పృథ్వీకి ఏమాత్రం నచ్చలేదు. తేజ, అవినాష్, రోహిణి.. ఈ ముగ్గురికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హత లేదన్నాడు. మరోవైపు తేజ, గౌతమ్‌తో గొడవపడ్డాడు. నువ్వు సోలోగా ఆడుతున్నావని చెప్పడానికి నన్ను ఆటలో సైడ్ చేశావంటూ నిందలు వేశాడు. నా నిర్ణయం నా ఇష్టం.. దానికి నువ్వు గౌరవమివ్వకపోతే నేనేం చేయలేను అని గౌతమ్ హర్టయ్యాడు.కరెక్ట్ గెస్ చేస్తే రూ.5 లక్షలుఅనంతరం యాంకర్ శ్రీముఖి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఎవరు టికెట్ టు ఫినాలే కొడతారో గెస్ చేయమని హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించింది. కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ అవుతాయంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది పందెమనే అనుకోవచ్చు. దీంతో ఇంటిసభ్యులు చర్చించుకుని నిఖిల్‌కు రూ.5 లక్షల బ్యాడ్జ్, అవినాష్‌కు రూ.4 లక్షలు, రోహిణికి రూ.3 లక్షలు, తేజకు రూ.2 లక్షలు అని రాసి ఉన్న బ్యాడ్జ్ ఇచ్చారు.నాకోసం అతడిని వదిలెయ్శ్రీముఖి.. విష్ణుప్రియ కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది. మొదటి మూడు వారాలు నువ్వు గెలుస్తావేమో అనిపించింది. ఆటలో కనెక్షన్స్ ఏర్పడతాయి. ఒకర్ని ఇష్టపడటం తప్పు కాదు. కానీ ఈ రెండు వారాలు నాకోసం ఆ అబ్బాయి(పృథ్వీ)తో స్నేహం వదిలెయ్. అతడు నాకిష్టం లేదు, ఆసక్తి లేదు అని అన్నిసార్లు చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు దిగజారి అతడి వెనకపడుతున్నావ్? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతడు ఆడడా? నీ ప్రేమకు విలువిచ్చి చెప్తున్నా.. ఒక్కరికే కాకుండా అందరినీ సపోర్ట్ చేయు అని మంచి మాటలు చెప్పింది. ఆశలు పెట్టుకోవద్దని చెప్పా: పృథ్వీఅటు పృథ్వీ దగ్గరకు వెళ్లి కూడా.. అందరూ మీ గురించి అడుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా అని అడిగింది. అందుకతడు.. నీపై ఆశలు పెట్టుకోవచ్చా? అని విష్ణు అడిగినప్పుడు కూడా నాపై ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పానన్నాడు. ఏదైనా ఉంటే షో అయిపోయాక చూసుకుందామని మీ ఇద్దరూ మాట్లాడుకోండని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో విష్ణు.. పృథ్వీతో తన స్నేహాన్ని పక్కనపెట్టి గేమ్‌పై ఫోకస్ చేస్తానని చెప్పింది.టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్అనంతరం గుర్తుపట్టు, గంట కొట్టు అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో తేజకు 1, రోహిణికి 2, అవినాష్‌కు 3, నిఖిల్‌కు 4 పాయింట్లు వచ్చాయి. తక్కువ పాయింట్లు వచ్చిన తేజ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత శ్రీముఖి అందరికోసం వంట చేయడం విశేషం. అనంతరం రోహిణి, అవినాష్, నిఖిల్‌కు.. కేవలం ఒక్క అడుగుదూరం అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ విజయం సాధించి టికెట్ టు ఫినాలే గెలిచాడు. తన కల నెరవేరడంతో అవినాష్ సంతోషంలో మునిగి తేలాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టికెట్ టు ఫినాలే: మూడో కంటెండర్‌గా నిఖిల్, షాక్‌లో తేజ
బిగ్‌బాస్ హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్ల రాక కొనసాగుతోంది. ఇప్పటివరకు అఖిల్, దేత్తడి హారిక, మానస్, ప్రియాంక జైన్ వచ్చి వెళ్లగా నేడు పునర్నవి, వితికా షెరు ఇంట్లో అడుగుపెట్టారు. వీరు గేమ్స్ ఆడేందుకు నిఖిల్, గౌతమ్‌ను సెలక్ట్ చేశారు. వీళ్లిద్దరూ మరో ఇద్దర్ని సెలక్ట్ చేయాల్సి రాగా నిఖిల్.. పృథ్వీ పేరు సూచించాడు. గౌతమ్ క్షణం ఆలోచించకుండా ప్రేరణ పేరు ఎంపిక చేశాడు.షాక్‌లో తేజతన పేరు చెప్తాడని ఊహించిన తేజకు ఇది పెద్ద షాకే! నన్నెందుకు సెలక్ట్ చేయలేదని తేజ హర్టయ్యాడు. గెలిచినా, గెలవకపోయినా అవకాశం వస్తుందేమో ఆడదామనుకున్నాను, ఇలా సెలక్ట్ చేయనప్పుడు బాధనిపిస్తుంది.. దీన్ని సింపతీ అనుకుంటే నేనేం చేయలేను అని తేజ ఫ్రస్టేట్ అయ్యాడు. ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ఫైనల్గా నిఖిల్ గెలిచి కంటెండర్ అవగా ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చినట్లు భోగట్టా! తనను టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తీసేయడంతో ప్రేరణ అస్సలు తట్టుకోలేకపోతుందట! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నా ప్రయాణం ముగిసింది.. ఓట్లు వేయొద్దు: నిఖిల్
చేయని తప్పుకు నిందలు పడటం ఎవరికైనా కష్టమే! అవతలివారిపై నోరుజారకుండా ఆచితూచి మాట్లాడే నిఖిల్.. అమ్మాయిలను గేమ్ కోసం వాడుకుంటాడని సీత పెద్ద నిందేసి వెళ్లిపోయింది. ఆ మాటను నిఖిల్ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని కెమెరాలకు గోడు వెల్లబోసుకున్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్‌కు సారీ చెప్పిన యష్మిఆడవాళ్లను ట్రాప్ చేస్తున్నావ్.. ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావ్ అని సీత ఇచ్చిన స్టేట్మెంట్ విని ప్రేక్షకులే కాదు హౌస్మేట్స్ కూడా షాకయ్యారు. తనవల్లే అలాంటి నిందలు వచ్చాయంటూ నిఖిల్‌కు యష్మి సారీ చెప్పింది. నా వల్లే ఇదంతా మొదలైంది.. మన ఇద్దరి గేమ్ పాడవుతుందంటే మనం మాట్లాడకుండా ఉండటమే నయమని చెప్పుకొచ్చింది. తర్వాత ఒంటరిగా కూర్చున్న నిఖిల్ బిగ్‌బాస్‌కు తన గోడు చెప్పుకున్నాడు. నాకు ఓటు వేయకండి: నిఖిల్ఒకర్ని తొక్కి ఆడాలని ఎన్నడూ అనుకోలేదు. నామినేషన్స్‌లో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ మహిళల్ని అడ్డుపెట్టుకుని గేమ్‌లో గెలవాలనుకోలేదు. మనసుకు ఏమనిపిస్తే అదే చేశాను. ఎవర్నీ తొక్కాలనుకోలేదు. ఈ వారం నామినేషన్లో ఉన్నాను, హౌస్ నుంచి వెళ్లిపోవాలనిపిస్తోంది. ఇక్కడ నా ప్రయాణం అయిపోయింది. దయచేసి ప్రేక్షకులు ఎవరూ నాకు ఓటు వేయకండి.. నన్ను ఎలిమినేట్ చేయండి అని కోరుకున్నాడు. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండిమరికాసేపట్లోనే మనసు మార్చుకుని.. నేనేంటో నిరూపించుకున్నాకే బయటకు వస్తాను. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండి. కప్పు తీసుకునే బయటకు వస్తా అని తనకు తాను ధైర్యం చెప్పుకుని కెమెరాలతో మాట్లాడాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ప్రేరణ.. ఎవరినైనా బాధపెట్టుంటే క్షమించమని కోరుతూ ఏడ్చేసింది. అది నా వ్యక్తిత్వం కాదుయష్మి మాట్లాడుతూ.. నిఖిల్ గేమ్కోసం అమ్మాయిలను వాడుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ మాట్లాడుతూ.. నన్ను తప్పు అని నిందవేసినచోటే నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఒకర్ని వాడుకుని గేమ్ ఆడే వ్యక్తిత్వం నాది కాదు అని తెలిపాడు. అనంతరం తేజ నిద్రపోయినందుకు చీఫ్ అవినాష్ పనిష్మెంట్ ఇచ్చాడు. షర్ట్ తీసేసి స్విమ్మింగ్ పూల్‌లో 10 సార్లు దూకాలన్నాడు. ఈ టాస్క్ పూర్తి చేస్తే యష్మి.. తేజకు ముద్దుపెడతానంది. ముద్దు కోసం తేజ ఆశఆశతో పూల్‌లో పదిసార్లు మునకేసిన తేజను కళ్లుమూసుకోమని పక్కనే నిలబడింది యష్మి. తీరా నిఖిల్ వచ్చి తేజ చెంపపై ముద్దుపెట్టాడు. ఆ విషయం తెలియని తేజ కుప్పిగంతులు వేశాడు. నీకంత సినిమాలేదు, నీకు కిస్ పెట్టింది నిఖిల్ అని నబీల్ అసలు విషయం బయటపెట్టాడు. అనంతరం ఈ సీజన్‌కే ఆఖరి మెగా చీఫ్ పోస్టును ప్రకటించాడు బిగ్‌బాస్. సమయానుసారం ఒక్కొక్కరి పేరుతో టీషర్ట్స్ గార్డెన్ ఏరియాలో వేస్తుంటాడు. మెగా చీఫ్ ఎవరంటే?ఆ టీషర్ట్‌ను చించకుండా భద్రంగా కాపాడుకున్నవారు కంటెండర్లవుతారు. అలా ఈ గేమ్‌లో ప్రేరణ, గౌతమ్, అవినాష్, నబీల్ ఓడిపోగా.. పృథ్వీ, తేజ, యష్మి, విష్ణుప్రియ కంటెండర్లయ్యారు. చివర్లో నిఖిల్, రోహిణి మాత్రమే మిగలగా.. వీరిలో ఎవరు కంటెండర్ అవ్వాలనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ ముగిసింది. అయితే రోహిణిని కంటెండర్ చేయగా చివరకు ఆవిడే మెగా చీఫ్ అయినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్ గొప్పతనాన్ని చెప్పిన అమర్, బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్
కొందరి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ శనివారం ఎపిసోడ్లో స్టేజీపైకి వచ్చేసి మాట్లాడారు. మిగిలినవారి ఫ్యామిలీస్ నేడు స్టేజీపై సందడి చేశారు. మరి ఎవరెవరు వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారు? అనేది నేటి (నవంబర్ 17) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మందు తాగుతానన్న యష్మియష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త స్టేజీపైకి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత యష్మిని మీరు చూడలేరని నాగార్జునతో అన్నారు. అందుకు కారణమేంటో ఎలాగైనా తెలుసుకోవాలనుకున్న నాగ్.. ఆ సీక్రెట్ చెప్తే ప్రైజ్‌మనీకి రూ.3 లక్షలు యాడ్ అవుతాయన్నారు. ఈ బంపరాఫర్‌కు టెంప్ట్ అయిపోయిన యష్మి.. తాను మందు తాగుతానని ఒప్పేసుకుంది. నిన్నటిలాగే వీరితోనూ టాప్ 5 ఎవరనేది గేమ్ ఆడించాడు. టాప్ 5లో ఎవరంటే?తమ కంటెస్టెంట్‌ను పక్కనపెట్టి మిగతావారిలో ఐదుగురిని ఫైనలిస్టులుగా సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా గౌతమ్ 1, నిఖిల్ 2, నబీల్, అవినాష్, ప్రేరణ మిగతా మూడు స్థానాల్లో ఉన్నారు. తర్వాత యష్మిని సేవ్ చేశారు. తేజ తండ్రి శ్రీనివాసరెడ్డి, ఫ్రెండ్ వీజే సన్నీ వచ్చారు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కలను నెరవేర్చుకున్నావు.. నిన్ను ఫినాలేలో చూడాలనుకున్న అమ్మ కలను కూడా నెరవేర్చు అని తేజపై భారం వేశాడు అతడి తండ్రి.అవినాష్‌తో సినిమాసన్నీ.. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్‌ను వరుసగా టాప్ 5లో పెట్టాడు. అందరి అంచనాలను మనం అందుకోలేము.. నువ్వు నీలా ఉండు అంటూ నిఖిల్‌కు గోల్డెన్ సలహా ఇచ్చాడు. అనంతరం ముక్కు అవినాష్ కోసం అతడి తమ్ముడు అశోక్‌తో పాటు దర్శకుడు కోన వెంకట్ వచ్చారు. బిగ్‌బాస్ నుంచే చాలామంది నటుల్ని తీసుకుంటున్నాను.. అవినాష్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు కోన వెంకట్. కంటెస్టెంట్లందరికీ తన సినిమా టైటిల్స్‌ను డెడికేట్ చేశాడు. అవినాష్ అదుర్స్, నబీల్ దూకుడుఅలా నిఖిల్‌కు బాద్షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకు నిన్ను కోరి, యష్మికి దేనికైనా రెడీ, ప్రేరణకు గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్‌కు శివమణి, అవినాష్‌కు అదుర్స్, తేజకు ఢీ, నబీల్‌కు దూకుడు సినిమా టైటిల్స్ అంకితమిచ్చాడు. వీరు.. నబీల్ను 1, నిఖిల్‌ను 2, రోహిణిని 3, విష్ణుప్రియను 4, గౌతమ్‌ను 5వ ర్యాంకులో ఉంచారు. తర్వాత నిఖిల్ కోసం అతడి తండ్రి శశికుమార్, నటుడు అమర్దీప్ వచ్చేశారు. రెండు రోజులు నాతోనేఅమర్దీప్ మాట్లాడుతూ.. ఓ షో తర్వాత నా రెండు కాళ్లు నొప్పితో కదల్లేని స్థితికి వచ్చేశాయి. పూర్తిగా బిగుసుకుపోయాయి. షో నుంచి ఇంటికి వెళ్లకుండా సరాసరి నాతో పాటే నా రూమ్‌కు వచ్చాడు. రెండు రోజులు నాతోనే ఉన్నాడు. నన్ను వాష్‌రూమ్‌కు కూడా ఎత్తుకుని తీసుకుపోయాడు అంటూ నిఖిల్ స్నేహానికిచ్చే విలువను చాటిచెప్పాడు. అలాగే విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, తేజకు వరుస ఐదు ర్యాంకులిచ్చాడు.మగాళ్లపై ఆడాళ్ల విజయంర్యాంకుల గోల అయిపోవడంతో నాగ్.. హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించాడు. అమ్మాయిలను, అబ్బాయిలను రెండు టీములుగా విడగొట్టాడు. సినిమా పేరు చెప్పగానే హీరో, దర్శకుడు, హీరోయిన్ ఫోటోలను బోర్డుపై పెట్టాలన్నాడు. అలా ఈ ఆటలో మహిళల టీమ్ గెలిచింది. తర్వాత విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించాడు.అవినాష్‌ను సేవ్ చేసిన నబీల్చివరగా అవినాష్, తేజ నామినేషన్లో మిగిలారు. ఈ క్రమంలో నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడిగాడు. నాకు షీల్డ్ రావడానికి అవినాష్ కూడా ఓ కారణమే.. అందుకే అతడి కోసం వాడాలనుకుంటున్నాను. నేను గేమ్ ద్వారా మాత్రమే ముందుకు వెళ్తాను అని నబీల్ తన నిర్ణయం చెప్పాడు. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్.. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడటం వల్ల అతడు సేవ్ అయినట్లు తెలిపాడు. టెన్షన్‌తో చచ్చిపోయిన తేజబిగ్బాస్ నాలుగో సీజన్లో ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ అయ్యానని.. ఇప్పుడు మరోసారి అదే షీల్డ్ తనను కాపాడిందన్నాడు అవినాష్ మరి నా పరిస్థితి ఏంటని తేజ అయోమయానికి లోనయ్యాడు. అతడిని కాసేపు టెన్షన్ పెట్టిన నాగ్.. చివరకు సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఈ వారం ఎలిమినేషనే లేదని తెలిపాడు. అయితే రేపు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ చేయించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో సోనియా.. నిఖిల్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఆ తతంగమంతా రేపు చూసేయండిమరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు నువ్వు కావాలి, అవసరమైతే లేపుకెళ్లిపోతా: నిఖిల్
హౌస్మేట్స్ తమ మొదటి ప్రేమకథ చెప్పాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో ఫస్ట్ లవ్‌స్టోరీ చెప్తూ కొందరు సిగ్గుపడితే మరికొందరు ఎమోషనలయ్యారు. ముందుగా యష్మి మాట్లాడుతూ.. నేను టీవీ యాంకర్‌గా ట్రై చేసినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మొదట ఫ్రెండయ్యాడు.. తర్వాత ప్రేమించుకున్నాం. కానీ ఒకానొక సమయంలో నాకు ఫ్యామిలీనే ముఖ్యమనిపించింది. అప్పుడు మా మధ్య కూడా విభేదాలు వచ్చాయి. ఒప్పుకోలేకపోతున్నా..ప్రేమ మీద నమ్మకం పోయింది. మా నాన్న తప్ప ఇంకెవరూ వద్దనుకున్నాను. కానీ ఈరోజుకూ ఆయన నాకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకో ఆయన్ను ఒప్పుకోలేకపోతున్నాను. కానీ ఈరోజుకూ నన్ను గైడ్ చేస్తూ ఫ్రెండ్‌గా ఉన్నాడు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అని యష్మి భావోద్వేగానికి లోనైంది.బాగోలేనని బ్రేకప్: తేజతేజ మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాం. ఓసారి ఇంటికెళ్లి రాగానే బ్రేకప్ చెప్పింది. తన పక్కన నేను బాగోలేనని వాళ్ల పేరెంట్స్ వద్దన్నారట! ఆమె పెళ్లికి కూడా వెళ్లాను. ఓసారి ఆమె సడన్‌గా కాల్ చేసి సారీ అంటూ ఏడ్చేసింది. నా లైఫ్‌లోకి వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా.. మా అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటానో, తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటా అని బిగ్‌బాస్ షో సాక్షిగా మాటిచ్చాడు.పృథ్వీ లవ్ స్టోరీపృథ్వీ.. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమించాం. ఇద్దరం ట్రై చేసుకుందాం, ఎవరికి పడితే వాళ్లకే ఆ అమ్మాయి సొంతం అని డీల్ మాట్లాడుకున్నాం. ఓసారి ఆమె దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్తే నీ పేరేంటి? అని అడిగింది. కాలేజీలో నా పేరు అందరికీ తెలుసు.. అలాంటిది ఆమె నా పేరు అడిగేసరికి ఇన్సల్ట్ అనిపించింది. తర్వాత ఆమె నా ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ తీసుకుని నాకు మెసేజ్‌లు చేసింది.మోసం చేశాడు: రోహిణిఓరోజు ప్రపోజ్ కూడా చేసింది. అంతా బాగానే సాగింది. త్వరగా పెళ్లి చేసుకుందామంది. నా కెరీర్ నాకు ముఖ్యం, పెళ్లికి సమయం పడుతుందని చెప్పేసరికి ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని తెలిపాడు. రోహిణి.. డైమండ్ రింగ్‌తో నాకు బాగా దగ్గరైన స్నేహితుడికి ప్రపోజ్ చేశాను. ఆర్థిక ఇబ్బందులున్నాయి. అవి క్లియర్ అయ్యాకే పెళ్లి చేసుకుందామన్నాడు. సరేనన్నాను. కట్ చేస్తే వేరే అమ్మాయితో రెండేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అది నా దగ్గర దాచాడు. తర్వాత సిల్లీగా బ్రేకప్ చెప్పాడు అంటూ ఎమోషనలైంది.నా భార్య అని ఫిక్సయ్యా: నిఖిల్నిఖిల్ వంతు రాగా.. తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే ఈ అమ్మాయి నా సొంతం అనిపించింది. అన్ని ప్రేమకథల్ని మరిపించేలా చేసింది. మాది ఆరేళ్ల రిలేషన్.. తను నా భార్య అని ఫిక్సయిపోయాను. కానీ ఫ్యామిలీ వల్ల మా మధ్య దూరం వచ్చింది. ఈ జన్మకు సరిపోయేటన్ని జ్ఞాపకాలనిచ్చింది. తిట్టు, కొట్టు..కోపంలో విడిపోయాం.. కానీ నా వల్ల కావట్లేదు. కచ్చితంగా తన దగ్గరకు వెళ్తా.. తిట్టు, కొట్టు, నువ్వు మళ్లీ ఒప్పుకునేవరకు నీ వెంటపడ్తాను. నాకు పిచ్చి లేసిందంటే మాత్రం లేపుకెళ్తాను. బిగ్‌బాస్ షో అయిపోగానే నీ కళ్ల ముందుంటాను. బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరకు తీసుకుంటుందో నువ్వూ అలాగే దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు కావాలి అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గాల్లో తేలుతున్న తేజ.. హింట్లు వదిలేసి ప్రేమ పంచిన శ్రీపాద
అమ్మను మించిన సెంటిమెంట్ మరొకటి ఏముంటుంది? మీ అమ్మ రాదు, రానివ్వను అని తేజను భయపెట్టి ఏడిపించిన బిగ్‌బాస్ చివరకు పట్టువదిలాడు. తల్లిని లోనికి పంపించాడు. దానికంటే ముందు, తర్వాత ఏం జరిగిందో నేటి (నవంబర్ 15) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..కటౌట్ తీసేయమన్న బిగ్బాస్ఫ్యామిలీ వీక్ అయిపోంది.. కాబట్టి ప్రేరణ.. తన భర్త శ్రీపాద కటౌట్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టేయాలన్నాడు బిగ్‌బాస్. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపటికే ఆమె పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.. శ్రీపాదను హౌస్‌లోకి పంపించాడు. అతడు రావడంతోనే భార్య నుదుటన తిలకం దిద్దాడు. వీరికి బ్యూటిఫుల్ డిన్నర్ డేట్ కూడా ఏర్పాటు చేయడం విశేషం.ప్రేమ కావాలి..అది చూసిన విష్ణు, రోహిణి తెగ ఫీలైపోయారు. విష్ణు అయితే.. పృథ్వీ తనను ప్రేమించట్లేదంటూ బాధపడింది. అతడికి నువ్వంటే ఇష్టం ఉంది కానీ ప్రేమ కాదు అని యష్మి క్లారిటీ ఇచ్చింది. అయినా సరే నాకు ప్రేమ కావాలని విష్ణు పిచ్చిపట్టినట్లే ప్రవర్తించింది. మరోవైపు శ్రీపాద.. గొడవలన్నింటికీ మూలకారణమైన కిచెన్ నుంచి బయటకు వచ్చేయమని ప్రేరణకు సూచించాడు. తెగేదాక గొడవలు లాక్కురావద్దన్నాడు. లవ్ సాంగ్తర్వాత భార్యతో కలిసి గేమ్ ఆడాడు. ఈ గేమ్ వల్ల కిచెన్ టైమర్‌కు రెండు గంటలు యాడ్ అయింది. అందరి ఫ్యామిలీస్ వచ్చాయి కానీ తన తల్లి మాత్రం రాలేదని తేజ బెంగపెట్టుకున్నాడు. అనంతరం బిగ్‌బాస్ సరదాగా లవ్ సాంగ్ ప్లే చేస్తే నిఖిల్-యష్మి, పృథ్వీ-విష్ణు అందులో లీనమై స్టెప్పులేశారు. తర్వాత మెగా చీఫ్ కోసం గేమ్ పెట్టారు. ఇందులో తేజ తప్ప మిగతా అందరూ పాల్గొనాల్సి ఉంటుందన్నాడు. ఏడుస్తుంటే చూడలేకపోతున్నా..ఈ గేమ్‌లో అవినాష్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. తల్లి కోసం తేజ ఏడుస్తూనే ఉన్నాడు. అతడి బాధను అర్థం చేసుకున్న బిగ్‌బాస్ ఆమెతో ఫోన్ కాల్ మాట్లాడిపించాడు. నేను రావట్లేదని బాధపడకు, నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా అని ఫోన్లో ఓదార్చింది. కాసేపటికే నేరుగా ప్రత్యక్షమైంది. అమ్మను చూడగానే తేజ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. గోరుముద్దలుతల్లి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. నువ్వు బాగా ఆడుతున్నావు. ఫినాలేలో చూడాలనుందని తన కోరిక బయటపెట్టింది. అలాగే తను ప్రేమగా వండుకొచ్చిన చికెన్, ఆలుగడ్డ కూరను అన్నంలో కలిపి అందరికీ గోరుముద్దలు తినిపించింది. అమ్మను బిగ్‌బాస్ షోలో చూపించాలన్న కల నెరవేరిందంటూ తేజ తెగ సంబరపడిపోయాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎట్టకేలకు బిగ్‌బాస్ హౌస్‌లో తేజ తల్లి.. కల నిజమైందోచ్!
అందరి అమ్మలు వస్తున్నారు.. ఒక్క మా అమ్మ తప్ప! అని కంటికి మిన్నుగా ఏడుస్తూనే ఉన్నాడు తేజ. అతడి కోసం రోహిణి, గౌతమ్ తమ పేరెంట్స్ రాకపోయినా పర్లేదు తేజ తల్లిని మాత్రం పంపించండని త్యాగానికి సిద్ధమయ్యారు. అందుకు బిగ్‌బాస్ ఒప్పుకోలేదు. ప్రేరణకు సర్ప్రైజ్హౌస్లో అందరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. రావట్లేదన్న ప్రేరణ భర్త కూడా నేడు హౌస్‌లో అడుగుపెట్టి సర్ప్రైజ్ చేశాడు. చిట్టచివరగా తేజకూ ఆ సర్ప్రైజ్ వచ్చేసింది. అయితే మొదట ఏడిపించాకే తర్వాత సంతోషాన్ని పంచాడు బిగ్‌బాస్. అతడి తల్లి హౌస్‌లోకి రాలేకపోతున్నానంటూ ఫోన్లో మాట్లాడటంతో మరింత కుమిలిపోయాడు. హౌస్‌లో తేజ తల్లికానీ కాసేపటికే ఆమె హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. తనను చూడగానే తేజ చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. తల్లిని బిగ్‌బాస్ హౌస్‌కు తీసుకురావాలన్న కల ఎట్టకేలకు నెరవేరిందోచ్ అంటూ తెగ సంబరపడిపోయాడు. ఈ ఆత్మీయ కలయిక చూసిన నబీల్.. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ సంపూర్ణమైందని పేర్కొన్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తల్లిని చూసి చిన్నపిల్లాడిలా ఏడ్చిన నిఖిల్.. మరి తేజ సంగతి?
బిగ్‌బాస్ షోకివ వచ్చినవాళ్లు కప్పు గెలవకపోయినా పర్లేదు కానీ తమ ఫ్యామిలీ మెంబర్‌ను ఒక్కసారైనా హౌస్‌కు తీసుకురావాలని తహతహలాడతారు. గంగవ్వ కూడా అదే ఆశపడింది. కానీ, ఆరోగ్యం సహకరించకపోవడంతో సడన్‌గా హౌస్ నుంచి నిష్క్రమించింది. అటు గతేడాది బిగ్‌బాస్‌కు వచ్చిన తేజ మరోసారి ఈ సీజన్లో అడుగుపెట్టడానికి ప్రధాన కారణం... తన తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలని!వరస్ట్ కంటెస్టెంట్కానీ మెజారిటీ హౌస్మేట్స్ తేజను వరస్ట్ కంటెస్టెంట్ అని తేల్చడంతో ఫ్యామిలీ వీక్‌లో అతడి కోసం ఎవరూ రారని నాగ్ తేల్చిచెప్పాడు.. ఎంతోమంది ఎన్నో తప్పులు చేసినా, చేస్తూనే ఉన్నా చూసీచూడనట్లు ఉన్న బిగ్‌బాస్ తేజకు మాత్రం ఇలాంటి దారుణమైన శిక్ష విధించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.నిఖిల్ పశ్చాత్తాపంఇది విన్నాక నిఖిల్ సైతం పశ్చాత్తాపపడ్డాడు. ఎందుకంటే తేజను వరస్ట్ కంటెస్టెంట్ అని డిసైడ్ చేసినవారిలో నిఖిల్ కూడా ఉన్నాడు. (విష్ణుప్రియ, పృథ్వీ కూడా తేజను చెత్తప్లేయర్గా పేర్కొన్నారు) తల్లిని హౌస్‌లోకి తీసుకురావడమే తేజ ఏకైక లక్ష్యం అని అందరికీ తెలుసు! అలాంటిది.. అతడి కోరిక నెరవేరకపోవడానికి తాను కూడా కారణమవుతున్నానని నిఖిల్ బాధపడ్డాడు.తేజ తల్లి వస్తుందా? రాదా?అయితే నిజంగా తేజ తల్లి హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశమే లేదా? అంటే కచ్చితంగా ఉంది. టీఆర్పీ కోసం తేజ ఎమోషన్స్‌ను వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందరి ఇంటివాళ్లు వచ్చి వెళ్లాక చివర్లో తేజ ఫ్యామిలీ మెంబర్ హౌస్‌లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఇక ఈరోజైతే నిఖిల్ తల్లి హౌస్‌లోకి వచ్చింది. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. అమ్మను చూడగానే నిఖిల్ చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్‌లోకి వచ్చిన నబీల్ తల్లి.. ఏడ్చేసిన టేస్టీ తేజ
బిగ్‌బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే మిగతా రోజులు హౌస్మేట్స్ ఎవరెలా ప్రవర్తించినా, ఎన్ని తిట్టుకున్నా సరే ఓ వారం మాత్రం అందరూ ఒక్కటైపోతారు. అదే 'ఫ్యామిలీ వీక్'. ప్రతి సీజన్లో ఉన్నట్లే ఈసారి కూడా వచ్చేసింది. ఈ వారమే కుటుంబ సభ్యులు.. హౌస్‌లోకి రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేశారు.షో ప్రారంభంలో కాస్త హడావుడి చేసిన ఓరుగల్లు కుర్రాడు నబీల్.. ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఫ్యామిలీ వీక్‌లో మొదటిగా ఇతడి తల్లి హౌస్‌లో అడుగుపెట్టింది. అంతకు ముందు నబీల్‌ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్‌బాస్.. తినమని స్వీట్స్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)మరోసారి లోపలికి పిలిచి కాసేపు అలానే ఉండమన్నాడు. ఆ తర్వాత టీవీ స్క్రీన్‌పై అమ్మ హౌసులోకి వచ్చిన విషయాన్ని చూపించాడు. దీంతో 70 రోజుల తర్వాత తల్లిని కలిసిన నబీల్.. ఎమోషనల్ అయ్యాడు. చాలాసేపు మాట్లాడుకున్నాడు. ఇదంతా చూసి టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు.గత వీకెండ్లో తేజకి చిన్న తప్పుకి పెద్ద క్లాస్ పీకిన నాగార్జున.. ఫ్యామిలీ వీక్కి అనర్హుడిని చేశాడు. అంటే తేజ కోసం కుటుంబ సభ్యులు ఎవరూ హౌస్‌లోకి రారు. దీంతో నబీల్ కోసం అతడి తల్లి రావడం చూసి.. ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు. దీంతో మిగతా హౌస్మేట్స్ అతడిని ఓదార్చుతూ కనిపించారు.(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?) -
యష్మి, నిఖిల్‌ను బుక్ చేసిన తేజ.. దమ్ము లేదంటూ రెచ్చగొట్టిన పృథ్వీ
కంటెస్టెంట్ల ఫోటోపై పెయింట్ వేసి నామినేట్ చేయాలి. బజర్ మోగినప్పుడు ముందుగా బ్రష్ పట్టుకున్న వారికే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్స్ అంటేనే గొడవలు కాబట్టి దానికి ఏమాత్రం కొదవ లేదు. యష్మి తప్పును తన నోటితోనే చెప్పించాడు తేజ.. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఫేవరిటిజం స్పష్టంగా కనిపిస్తోందిముందుగా మెగా చీఫ్ ప్రేరణ.. గౌతమ్ ఫోటోకు పెయింట్ పూస్తూ ప్రతీది ఆడియన్స్ ఏమనుకుంటారు? అనేది ఆలోచిస్తూ అడుగు వేస్తున్నాడు. అందరితో కలవట్లేదు, టీమ్ స్పిరిట్ లేదు అని కారణాలు చెప్పింది. ఆ కారణాలు గౌతమ్‌కు ఏమాత్రం మింగుడుపడలేదు. టీమ్ వర్క్ అంటే.. ఓడినా, గెలిచినా కలిసి పోరాడటం.. అంతే తప్ప నీవల్ల ఓడిపోయాం అంటూ గుచ్చిగుచ్చిచెప్పడం టీమ్ మెంబర్ లక్షణం కాదు. ఇక్కడ ఫేవరిటిజం, గ్రూపిజం స్పష్టంగా కనిపిస్తోంది అని ప్రేరణపై మండిపడ్డాడు.నాది తప్పయితే యష్మిది కూడా తప్పే!తర్వాత బజర్ మోగగానే బ్రష్ పట్టుకున్న నిఖిల్.. తేజను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అతడు కావాలని తప్పు చేశాడన్నాడు. దీనికి తేజ స్పందిస్తూ.. నేను తెలిసి తప్పు చేయలేదు. నేను గుడ్డు వేయడం తప్పయితే నా తర్వాత యష్మి చేసింది తప్పు కాదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం దాటవేస్తుంటే.. నీకు మాట్లాడటానికి భయం.. అంటూ రెచ్చగొట్టాడు. దాంతో నిఖిల్.. ఆమెది తప్పు కాదు, నీదే తప్పు అన్నాడు. దమ్ము లేదుఇంతలో నిఖిల్ గ్యాంగ్ వీళ్లను ఆపేందుకు రాగా.. ముగ్గురూ నాపై అటాక్ చేస్తున్నారా? అని తేజ అన్నాడు. దాంతో పృథ్వీ.. ఆ ముగ్గురు ఎవరని అడిగారు. నువ్వు అడిగితే నేను చెప్పను అని తేజ అంటే.. నీకు పేర్లు చెప్పే దమ్ము లేదు అంటూ తేజపై రెచ్చిపోయాడు. తర్వాత గౌతమ్.. అవతలి వ్యక్తులను అగౌరవపర్చడం అలవాటైపోయిందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.తల్లికి తేజ క్షమాపణలుదీని గురించి చర్చించే క్రమంలో.. నీ బెదిరింపులకు అందరూ భయపడతారేమో కానీ నేను కాదు అని గౌతమ్ అన్నాడు. నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావని పృథ్వీ ఆరోపించాడు. అనంతరం తేజ ముందుగా తన తల్లికి సారీ చెప్పాడు. నిన్ను హౌస్‌కు తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ మాటపై నిలబడలేకపోతున్నందుకు క్షమించమన్నాడు. ఇందుకు కారణమైన హౌస్‌మేట్స్‌కు థాంక్యూ చెప్పాడు. వరస్ట్ ప్లేయర్ అంటూతర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించకుండా నేను ఒక గుడ్డును పాము నోట్లో పెట్టాను. తర్వాత యష్మి కూడా ఆలోచించకుండా వెళ్లి మరో గుడ్డు పాము నోట్లో వేసింది. నేను చేసింది తప్పే.. అలాగే యష్మి చేసింది కూడా తప్పే! అన్నాడు. దీనిపై యష్మి.. తాను తప్పు చేయలేదని వాదించింది. ఈ క్రమంలో హే.. పో, కూర్చో అంటూ చిరాకుపడింది. వరస్ట్ ప్లేయర్ అంటూ తేజపై ముద్ర వేసింది. పృథ్వీ.. చీఫ్‌గా, సంచాలకుడిగా ఫెయిలయ్యావంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.మాట తప్పావ్రోహిణి.. చీఫ్ కంటెండర్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట తప్పావంటూ విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఆ రోజు అందుకే ఏడ్చానని రోహిణి పేర్కొంది. దీనికి విష్ణు తలతిక్క సమాధానమిచ్చింది. తొక్కలో మాట ఇచ్చుండకపోతే నాకు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్తున్నా.. నాకు అందరికంటే పృథ్వీయే ఎక్కువ అని ప్రకటించేసింది. ఇక ఈ వారం గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ర్యాంప్ ఆడించిన గౌతమ్, తేజ.. భయపడే రకం కాదు!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ పది మంది మాత్రమే మిగిలారు. మీలో మీరు కొట్టుకు చావండి అంటూ బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రక్రియ ఇచ్చాడు. నామినేట్ చేయాలనుకునే వ్యక్తి ఫోటోకు పెయింట్ వేసి పాడు చేయాలన్నాడు. అలా గౌతమ్.. పృథ్వీని, తేజ.. యష్మిని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో పెద్ద గొడవలే జరిగాయి.భయపడేదేలె..తనను నామినేట్ చేసిన పాయింట్ల గురించి పృథ్వీ చర్చ మొదలుపెట్టగా నీ మాటలకు వేరేవాళ్లు భయపడతారేమో.. నేను భయపడను అన్నాడు గౌతమ్. ఇక ఎవిక్షన్ షీల్డ్ టాస్క్‌లో జంటగా వెళ్లిన తేజ, యష్మి.. ఏకాభిప్రాయానికి రాకుండా ఎవరికి నచ్చిన వ్యక్తుల్ని వారు సైడ్ చేసేశారు. నాది తప్పే.. నీది కూడా తప్పేఅయితే మొదట తేజ ఆ పని చేయడంతో అందుకు తగ్గ పరిణామాల్ని ఎదుర్కొన్నాడు. కంటెండర్ రేసులో లేకుండా పోవడమే కాకుండా ఫ్యామిలీ వీక్ కూడా తనకు ఉండబోదని చెప్పాడు. ఏకాభిప్రాయానికి రాకముందే పాము నోట్లో తాను గుడ్డు వేయడం ఎంత తప్పో.. తను వేశాక కూడా యష్మి వచ్చి మరో గుడ్డు వేయడం అంతే తప్పు అని తేజ కుండబద్ధలు కొట్టి చెప్పాడు.ర్యాంప్ ఆడించారుఅది తప్పనుకుంటావో, ఒప్పనుకుంటావో నీ ఇష్టం అని యష్మి చెప్తుంటే అనుకోవడమేముంది.. అది తప్పే.. అని తేజ కౌంటరిచ్చాడు. నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను.. నా తర్వాత నీది కూడా తప్పే అని సమాధానమిచ్చాడు. దీంతో యష్మి నువ్వు చేసింది తప్పే.. అని అరిచింది. ప్రోమోలో అయితే గౌతమ్, తేజ ర్యాంప్ ఆడించినట్లు కనిపిస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?
బిగ్‌బాస్ 8లో పదోవారం కూడా అయిపోయింది. హరితేజ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఎప్పటిలానే సోమవారం వచ్చేసింది. దీంతో నామినేషన్స్ హంగామా మొదలైంది. హౌస్ట్ నాగార్జున ఇప్పటికే కన్నడ బ్యాచ్ చేసిన తప్పుల్ని చూసిచూడనట్లు వదిలేస్తున్నాడు. హౌస్‌లో మాత్రం అలా సాగదు కదా! తేజ, గౌతమ్ వాళ్లకు ఇచ్చిపడేశారు. ఈ ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు.11వ వారానికి సంబంధించిన నామినేషన్ వేసేందుకు ఈసారి హౌస్మేట్స్ పెయింటింగ్స్‌ని స్మాష్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ప్రేరణ.. గౌతమ్ ఫొటోని స్మాష్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాదన నడిచింది. నిఖిల్ వంత వచ్చేసరికి.. గతవారం తేజ చేసిన తప్పుని ఎత్తి చూపుతూ నామినేట్ చేశాడు. బయటకొచ్చిన తర్వాత తేజ వదల్లేదు. నేను చేసింది తప్పు సరే, యష్మీ చేసింది తప్పు కాదా అని ప్రశ్నించాడు. దానికి నేను సమాధానం చెప్పను అని నిఖిల్ మాట దాటవేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)అలా నిఖిల్-తేజ మధ్య చాలాసేపు గొడవ జరిగింది. ఇదంతా చూస్తుంటే హోస్ట్ నాగార్జున.. వీకెండ్ వచ్చి మిగతా వాళ్లు చేసిన తప్పుల్ని చెబుతున్నాడు. అదేదో పెద్ద పాపం అన్నట్లు రచ్చ చేస్తున్నాడు. సోమవారం వచ్చేసరికి దాన్నే కన్నడ బ్యాచ్.. నామినేషన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ వారం కూడా అదే జరిగేలా ఉంది. అలా ఈ వారం దాదాపు ఆరుగురు నామినేట్ అయినట్లు తెలుస్తోంది.నామినేట్ అయినవాళ్లలో పృథ్వీ, యష్మీ, విష్ణుప్రియ, గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్ ఉన్నట్లు సమాచారం. లిస్ట్ చూస్తుంటే నిఖిల్, ప్రేరణ లేరు కాబట్టి వాళ్ల ఫ్యాన్స్.. కన్నడ బ్యాచ్‌లో భాగమైన పృథ్వీ, యష్మీకి సపోర్ట్ చేస్తారు. మిగతా వాళ్లలో ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్లకు ఉంది. కానీ ఈసారి ఎందుకు విష్ణుప్రియ మీద దెబ్బపడుద్దా అనే సందేహం వస్తోంది. చూడాలి మరి ఈ వారం ఎవరు బలైపోతారో?(ఇదీ చదవండి: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్) -
హరితేజ ఎలిమినేట్.. నిఖిల్ సహా ఆ నలుగురు మాస్క్ తీయాల్సిందే!
ఈరోజు హౌస్ జంబలకిడిపంబగా మారిపోయింది. వాళ్లు వీళ్లయ్యారు, వీళ్లు వాళ్లయ్యారు. అదేనండి.. ఆడాళ్లు మగాళ్ల గెటప్‌లోకి. మగాళ్లు ఆడాళ్ల గెటప్‌లోకి మారిపోయారు. వీరినలా చూస్తుంటేనే ప్రేక్షకులు పడీపడీ నవ్వడం ఖాయం. అలా ఉన్నాయి ఒక్కొక్కరి అవతారాలు.. పైగా ఒకరి పాత్రల్లో మరొకరు లీనమై నటించారు. ముఖ్యంగా ప్రేరణ.. నిఖిల్‌గా నటించి అదరగొట్టేసింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఐటం సాంగ్నాగ్.. ప్రేరణ, గౌతమ్‌ను సేవ్ చేశాడు. తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజీపైకి వచ్చాడు. వచ్చీరావడంతోనే ఆడవేషంలో ఉన్న మగవారికి ఐటం సాంగ్ చేసే టాస్క్ ఇచ్చాడు. అలాగే మగవేషంలో ఉన్న ఆడపిల్లలు మాస్ పాటలకు చిందేయాలన్నాడు. పర్ఫామెన్స్ బట్టి మార్కులిస్తానన్నాడు. ఈ గేమ్‌లో నబీల్‌కు 6, రోహిణి, తేజ, విష్ణుప్రియకు 10, అవినాష్, ప్రేరణ, నిఖిల్, హరితేజలకు 9, యష్మికి 8, గౌతమ్‌కు 7 మార్కులిచ్చాడు. తేజ డ్యాన్స్‌కు ముచ్చెమటలుముఖ్యంగా తేజ పర్ఫామెన్స్కైతే వరుణ్‌తేజ్‌కు చెమటలు పట్టాయి. ఒక్కరు నవ్వకుండా ఉంటే ఒట్టు! ఆ రేంజ్లో ఉంది మనోడి పర్ఫామెన్స్. ఫైనల్‌గా ఈ గేమ్‌లో బాయ్స్ వేషంలో ఉన్న ఆడవారు గెలిచారు. అనంతరం వరుణ్ తన మనసుకు దగ్గరైనవారి గురించి మాట్లాడాడు. రామ్ చరణ్ తనకు సోదరుడని, ఏ సమస్య వచ్చినా అతడి దగ్గరకు వెళ్తానన్నాడు. నిహారిక కొడుతుందా?చిరంజీవి తన ఇన్స్పిరేషన్ అని, అల్లు అర్జున్ హార్డ్‌వర్కర్ అని, పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవన్నాడు. నిహారిక బెస్ట్‌ఫ్రెండ్ అని.. ఎప్పుడూ తనను కొడుతుందన్నాడు. తర్వాత సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు. ఇకపోతే కొన్ని హ్యాష్‌ట్యాగులు ఇచ్చిన బిగ్‌బాస్ అవి ఎవరికి సెట్టవుతాయో చెప్పాలన్నాడు. ముందుగా తేజ.. ఎవరికోసం ఆలోచించకుండా పండ్లు తినేసిన గౌతమ్‌కు సెల్ఫిష్ ట్యాగ్ ఇచ్చాడు. బిల్లు మాఫీ చేయించిన నాగ్ఈ క్రమంలో హౌస్‌లో జరుగుతున్న దొంగతనం గురించి నాగ్ ఆరా తీశాడు. సూపర్ మార్కెట్లో హౌస్మేట్స్ కొన్ని వస్తువులు దొంగతనం చేశారు. అందుకుగానూ బిగ్‌బాస్ రూ.1,85,000 బిల్లు వేశాడు. అసలు ఏమేం దొంగిలించారనేది నాగ్ వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. అయితే చిన్నచిన్న దొంగతనాలను చూసీ చూడనట్లు వదిలేయమని, ఆ బిల్లును ప్రైజ్‌మనీలో నుంచి కట్ చేయొద్దని నాగ్ బిగ్‌బాస్‌ను అభ్యర్థించడం విశేషం.అవినాష్ కట్టప్పహ్యాష్ట్యాగుల గేమ్ విషయానికి వస్తే.. విష్ణుప్రియ.. ప్రేరణ టేప్‌రికార్డర్ అని, హరితేజ.. తేజ లేజీబాయ్ అని, నబీల్.. ప్రేరణకు ఇగో ఎక్కువ, యష్మి.. అవినాష్ కట్టప్ప (వెన్నుపోటు), అవినాష్.. విష్ణుప్రియ ఓవర్ డ్రమటిక్, గౌతమ్.. ప్రేరణ కంట్రోల్ ఫ్రీక్, రోహిణి.. అవినాష్ అటెన్షన్ సీకర్, ప్రేరణ.. గౌతమ్ ఇరిటేటింగ్, పృథ్వీ.. నిఖిల్ ఇమ్మెచ్యూర్, నిఖిల్.. పృథ్వీ అటెన్షన్ సీకర్ అని పేర్కొన్నారు. తర్వాత విష్ణు, పృథ్వీ సేవ్ అయ్యారు.హరితేజ ఎలిమినేట్చివరగా హరితేజ, యష్మి మాత్రమే మిగిలారు. నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడగ్గా అతడు ఇప్పుడు వాడనని తేల్చిచెప్పాడు. దీంతో నాగ్ యష్మిని సేవ్ చేసి హరితేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. హరితేజ వెళ్లిపోతుంటే విష్ణుప్రియ వెక్కివెక్కి ఏడ్చింది. చివర్లో హరితేజ.. హౌస్‌లో ఎవరు మాస్కులు తీసేస్తే బెటరో చెప్పాలన్నాడు. ఐదుగురు మాస్క్ తీయాల్సిందే!అవినాష్, రోహిణి మాస్కు తీసేయాలని అభిప్రాయపడింది. తేజ.. రూల్స్ చెప్పడమే కాకుండా పాటించాలని సూచించింది. ప్రేరణ మంచి అమ్మాయే కానీ కొన్ని చెడు లక్షణాల వల్ల తన మంచి కనడకుండా పోతుందని తెలిపింది. నిఖిల్.. తన ఎమోషన్స్ బయటకు చూపించాలన్నాడు. అలా ఈ ఐదుగురు మాస్క్ తీసేస్తే బెటర్ అని చెప్పింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తేజకు దారుణమైన పనిష్మెంట్.. త్యాగానికి రోహిణి రెడీ!
టేస్టీ తేజకు దెబ్బమీద దెబ్బ పడింది. ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో అతడు చేసిన తప్పిదం వల్ల వచ్చేవారం కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయాడు. అటు హౌస్మేట్స్ వల్ల తన ఫ్యామిలీ హౌస్‌లోకి వచ్చే ఆస్కారమే లేదట.. అదెలాగో నేటి ఎపిసోడ్ (నవంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..సిగ్గు లేకుండా..మెగా చీఫ్ ప్రేరణ మాట ఎవరూ వినడం లేదు. పెండింగ్‌లో ఉన్న పని చేయమంటే విష్ణు కస్సుబుస్సులాడుతుంది. సీతాఫలం తినొద్దు అని చెప్పినా ఉన్న ఒక్కదాన్ని లటుక్కుమని గౌతమ్ ఆరగించేశాడు. వద్దని చెప్పినా ఎలా తిన్నావు? సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావని గౌతమ్‌పై ఫైర్ అయింది. అటు స్వీట్లు తినను అని బిగ్‌బాస్‌కు మాటిచ్చిన నబీల్.. హల్వా తిని ఆ నియమాన్ని ఉల్లంఘించాడు.తేజకు శిక్షఇక నాగార్జున వచ్చీరావడంతోనే ఎవిక్షన్ షీల్డ్ గేమ్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమైన తేజను వాయించాడు. నీకంటే ముందు వచ్చిన జంటలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. నువ్వు మాత్రం యష్మితో కలిసి ఒక అభిప్రాయానికి రాకుండా నీకు నచ్చింది చేశావని సీరియస్ అయ్యాడు. అతడు చేసిన తప్పుకుగానూ వచ్చేవారం చీఫ్ కంటెండర్‌వి కాలేవని శిక్ష విధించాడు.ఎవిక్షన్ షీల్డ్ ఎవరికివ్వాలో డిసైడ్ చేసిన ప్రేరణఇక ఎవిక్షన్ షీల్డ్ రేసులో మిగిలిన రోహిణి, నబీల్, నిఖిల్‌లలో ఎవరికి ఆ షీల్డ్ ఇవ్వాలో హౌస్మేట్స్ డిసైడ్ చేయాలన్నాడు. ఈ క్రమంలో రోహిణికి ప్రేరణ, గంగవ్వ, తేజ సపోర్ట్ చేయగా నిఖిల్‌కు హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ సపోర్ట్ చేశారు. నబీల్‌కు గౌతమ్, యష్మి, అవినాష్ మద్దతిచ్చారు. ముగ్గురికీ సమాన ఓట్లు పడటంతో చీఫ్ ప్రేరణపై భారం వేశారు. ఆమె నబీల్‌కు సపోర్ట్ ఇవ్వడంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ అందుకున్నాడు.అంతరాత్మపై ఒట్టేసి..అనంతరం నాగార్జున.. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలుస్తూ.. నీపై నువ్వు ప్రమాణం చేసుకుని ఈ సీజన్లో వరస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పాలన్నాడు. మొదటగా నబీల్.. తన ఫోటోపై ఒట్టేసి విష్ణుప్రియను వరస్ట్ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. నిఖిల్.. తప్పు చేసినా రుబాబు చూపిస్తాడు, వెటకారం ఎక్కువ అంటూ తేజ వరస్ట్ ప్లేయర్ అన్నాడు. హరితేజ, యష్మి.. రోహిణిని, గౌతమ్, తేజ.. పృథ్వీని, అవినాష్.. హరితేజను, రోహిణి, గంగవ్వ.. యష్మిని, విష్ణుప్రియ, పృథ్వీ.. తేజను చెత్త ప్లేయర్ అని పేర్కొన్నారు. తేజకు కోలుకోలేని దెబ్బప్రేరణ.. గెలవాలన్న ఆసక్తి లేదంటూ విష్ణుప్రియ వరస్ట్ ప్లేయర్ అని తెలిపింది. వరస్ట్ హౌస్మేట్స్ అని ఎక్కువ ఓట్లు పడ్డ వ్యక్తికి ఫ్యామిలీ వీక్‌లో వారి కుటుంబసభ్యులు రాబోరని నాగ్ బాంబు పేల్చాడు. ఈ సీజన్లో తేజను వరస్ట్ ప్లేయర్‌గా డిసైడ్ చేశారు. కేవలం తల్లిని తీసుకురావడానికే ఈ సీజన్‌కు వచ్చాను సర్ అంటూ తేజ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేశాడు.గంగవ్వ ఎలిమినేట్దీంతో రోహిణి.. నా ఫ్యామిలీకి బదులుగా నీ కుటుంబసభ్యులు రావాలని బిగ్‌బాస్‌ను అభ్యర్థిస్తానంది. అటు గంగవ్వ ఆరోగ్యం గురించి నాగ్ ఆరా తీశాడు. ఆమె తన ఒళ్లంతా మంట లేస్తోందంటూ.. సంతోషంగానే ఉన్నాను కానీ చేతనవడం లేదని తెలిపింది. దీంతో ఆమెను హౌస్ నుంచి పంపించేశారు. గంగవ్వ వెళ్లిపోతుంటే రోహిణి, తేజ గుక్కపెట్టి ఏడ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియకు చుక్కలు చూపిస్తున్న ప్రేరణ.. బలైపోయిన తేజ!
ఎన్నాళ్లనుంచో చీఫ్ పోస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రేరణ కల ఎట్టకేలకు సాకారమైంది. మెగా చీఫ్ పదవిని అధిరోహించింది. అలా డ్యూటీ ఎక్కిందో లేదో తన పనితనం మొదలుపెట్టేసింది. అప్పుడే విష్ణుప్రియకు చుక్కలు చూపించేస్తోంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..మాట తప్పాడన్న కోపంతో..మెగా చీఫ్ గేమ్‌లో పృథ్వీ, నబీల్ ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ముందుగానే డీల్ చేసుకున్నారు. కట్ చేస్తే నబీల్ను ఓడించమని నిఖిల్‌కు సూచించాడు పృథ్వీ. చేసిందంతా చేశాక తాను అలా అనలేదని మాట మార్చాడు. తను ఓడిపోవడంతో నబీల్ కూడా పృథ్వీని ఓడించాలని డిసైడయ్యాడు. ఈ క్రమంలో అతడు కూర్చున్న బాక్స్‌లో మూటలు వేశాడు. అయితే అవి తన మీద పడటం, అలాగే ఇచ్చిన మాట తప్పాడన్న కోపంతో పృథ్వీ.. నబీల్‌పై సీరియస్ అయ్యాడు. ఈ రౌండ్లో పృథ్వీ ఓడిపోయాడు.ప్రేరణ మెగా చీఫ్చివర్లో ప్రేరణ, రోహిణి ఇద్దరే మిగిలారు. విష్ణు, గంగవ్వ, అవినాష్, తేజ.. రోహిణికి సపోర్ట్ చేయగా మిగతా అందరూ ప్రేరణకు మద్దతిచ్చి ఆమెను చీఫ్ చేశారు. ఇకపోతే హరితేజ హౌస్‌లో ఉన్నవారందరిపైనా హరికథ చెప్పి అలరించింది. అనంతరం మెగా చీఫ్ అయిన ప్రేరణ మొదట విష్ణునే టార్గెట్ చేసినట్లు ఉంది. విష్ణును కప్బోర్డ్ ఖాళీ చేయమందట.. అలాగే విష్ణు బెడ్ దగ్గరున్న సామాను నీట్‌గా పెట్టుకోమని చెప్పింది. ఆమె వినకపోవడంతో ప్రేరణ వెళ్లి సర్దింది. ఇంట్లో చేయాల్సిన పనులు కూడా సరిగా చేయడం లేదని విష్ణును తప్పు పట్టింది.పాము- ఎగ్స్బిగ్బాస్ ఎవిక్షన్ షీల్డ్‌ను ప్రవేశపెట్టాడు. సమయానుసారం ఆకలిగా ఉన్న పాముకు గోల్డెన్ ఎగ్స్ ఇవ్వాలన్నాడు. ఎవరికి చెందిన గోల్డెన్ ఎగ్ పాముకు ఆహారమవుతుందో వారు ఎవిక్షన్ షీల్డ్‌కు దూరమవుతారు. మెగా చీఫ్ ప్రేరణ.. ఎవిక్షన్ షీల్డ్ రాకూడదనుకున్న ఐదుగురి ఎగ్స్ పాముకు ఆహారంగా పెట్టాలన్నాడు. అలా విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజ ఫోటోలున్న ఎగ్స్‌ను పాము నోట్లో వేసింది.అవినాష్‌పై ఎగిరెగిరి పడ్డ యష్మిఅనంతరం.. అవినాష్, నబీల్ను పిలిచి ఒక ఎగ్‌ను పాము నోట్లో పెట్టమన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయంతో యష్మి ఎగ్ తొలగించారు. అందుకు కారణం చెప్పమని యష్మి అడగ్గా.. నువ్వు వీక్ కాబట్టే నబీల్ నీకు సూట్‌కేస్ ఇచ్చాడు. అయినా ఈ వారం నీకు వచ్చిన అవకాశం సరిగా వాడుకోలేదని అవినాష్ అన్నాడు. ఆ మాటతో యష్మికి కోపం కట్టలు తెంచుకుంది. అందరూ అన్ని గేమ్స్ గెలవరు, స్ట్రాంగ్ ఉన్నవాళ్లు కూడా చాలా గేమ్స్‌లో ఓడిపోయారు.. నన్ను వీక్ అంటూ డీమోటివేట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.నిఖిల్ గేమ్‌ను అడ్డుకున్న గౌతమ్నిఖిల్, గౌతమ్ వంతు రాగా నిఖిల్ త్యాగం చేసేందుకు రెడీ అయ్యాడు. అందుకు గౌతమ్ ఒప్పుకోలేదు. ప్రేరణ ఎగ్ తీసేద్దామంటే నిఖిల్ ఒప్పుకోడు. చివరకు ఇద్దరూ కలిసి తేజను బలి చేశారు. విష్ణుప్రియ, పృథ్వీ వంతురాగా.. ప్రేరణ ఎగ్ తీసేశారు. తర్వాత రోహిణి, హరితేజ వంతు వచ్చింది. నిఖిల్ ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అవడానికి రెడీగా ఉన్నాడని రోహిణి అంటుంటే హరితేజ మాత్రం నామినేషన్స్‌లోకి రావట్లేదంటూ అవినాష్‌ను తీసేద్దామంది. అందుకు రోహిణి ఒప్పుకోలేదు. అటు హరితేజ కూడా వినకపోవడంతో తప్పని పరిస్థితిలో రోహిణి.. అవినాష్ ఎగ్‌ను పాము నోట్లో వేసింది.తేజ చేసిన పనికితేజ, యష్మి వంతు వచ్చింది. యష్మి.. ఎఫర్ట్స్ కనిపించడం లేదంటూ రోహిణి పేరు చెప్పగా తేజ.. నబీల్, నిఖిల్లో ఎవరైనా ఓకే అన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తేజ.. నబీల్, రోహిణి, నిఖిల్ అభిప్రాయాలు అడిగాడు. తనకు అక్కర్లేదని నిఖిల్ క్లియర్‌గా చెప్పడంతో మరో సెకన్ ఆలోచించకుండా అతడి ఎగ్‌ను పాము నోట్లో వేశాడు.నబీల్‌కు ఎవిక్షన్ షీల్డ్అది చూసిన యష్మి.. కావాలని రోహిణి ఎగ్ కూడా వేసేసింది. దీంతో నిఖిల్, పృథ్వీ, హరితేజ, విష్ణు.. అందరూ తేజపై పడి అరిచారు. ఏకాభిప్రాయానికి రాకుండా ఎగ్ ఎలా వేస్తావంటూ మండిపడ్డారు. కానీ ఏ ఒక్కరూ యష్మి ఎగ్ వేయడాన్ని తప్పుపట్టలేదు. చివర్లో నబీల్ ఎగ్ మాత్రమే మిగిలి ఉండటంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ గెలుపొందినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియ గుండె ముక్కలు.. కొత్త మెగా చీఫ్ ఎవరంటే?
మెగా చీఫ్ కంటెండర్‌షిప్ కోసం హౌస్‌లో పోటీలు జరిగాయి. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ.. ముగ్గురూ టఫ్ టాస్కులోనూ కష్టపడి ఆడారు. అటు బిగ్‌బాస్ గాసిప్స్ వినాలని తహతహలాడిపోయాడు. ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (నవంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..కీని పట్టు.. కంటెండర్‌షిప్‌ను గెలిచేట్టుఇప్పటికే రోహిణి, నబీల్ కంటెండర్‌షిప్ బ్యాడ్జులు గెలిచారు. మిగిలిన పృథ్వీ కోసం 'కీని పట్టు.. కంటెండర్‌షిప్‌ను గెలిచేట్టు' అనే గేమ్ ఇచ్చాడు. ముందుగా తాళాలు సంపాదించి అన్ని బాక్సులు ఓపెన్ చేసినవారు గెలుస్తారు. పృథ్వీతో ఎవరు తలబడాలనుకుంటున్నారో చెప్పాలనగా దాదాపు హౌస్మేట్స్ అందరూ ముందుకొచ్చారు. దీంతో పృథ్వీ.. అందరిలో నుంచి విష్ణుప్రియను సెలక్ట్ చేసుకున్నాడు. అలా పృథ్వీ, విష్ణు ఆడారు.విష్ణును బోల్తా కొట్టించిన పృథ్వీఈ గేమ్‌లో పృథ్వీ అతి తెలివితో విష్ణుప్రియను బురిడీ కొట్టించి గెలిచేశాడు. అలాగే కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ ధరించాడు. అతడి సూట్‌కేస్‌లో రూ.99,000 ఉండగా.. అవి ప్రైజ్‌మనీలో యాడ్ అయ్యాయి. పృథ్వీకి ఒకర్ని చీఫ్ కంటెండర్ చేసే ఛాన్స్ ఉండగా ఆ అవకాశాన్ని అతడు విష్ణుప్రియకు ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటావు.. నిన్ను ఆదర్శంగా తీసుకుని చాలా మారిపోయాను అంటూ విష్ణుతో కబుర్లాడాడు పృథ్వీ.మెలిక పెట్టిన బిగ్బాస్ఇకపోతే బ్యాడ్జులు గెలిచిన నబీల్, పృథ్వీ, రోహిణి.. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణలను కంటెండర్లుగా సెలక్ట్ చేశారు. ఈ ముగ్గురికీ బిగ్‌బాస్ ఇసుక బస్తాలతో గేమ్ పెట్టాడు. ఇందులో ప్రేరణ విజయం సాధించి కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ ధరించింది. అలాగే తన దగ్గరున్న సూట్‌కేసులో రూ.1 లక్ష ఉంది. ఇక్కడే బిగ్‌బాస్ ఓ మెలిక పెట్టాడు. ఈ సూట్కేసుకు బదులుగా మిస్టరీ సూట్‌కేస్ సెలక్ట్ చేసుకోవచ్చన్నాడు. దీంతో పాతది వదిలేసి మిస్టరీ సూట్‌కేస్ తెరిచింది. తీరా చూస్తే ఆశ్చర్యంగా అందులో రూ.2,10,00 ఉన్నాయి. ఇది విన్నర్ ప్రైజ్‌మనీలో జమైంది.అంతమాట అనేసిందేంటి?గంగవ్వ.. ప్రేమపక్షులు పృథ్వీ, విష్ణులను అన్నాచెల్లి అనేసింది. పృథ్వీకి విష్ణు చెల్లిలా అన్నీ దగ్గరుండి చేసి పెడుతుందని మెచ్చుకుంది. అక్కడ చెల్లి అనే పదం విని విష్ణు గుండె ముక్కలైంది. చెల్లి కాదు, అతడంటే ప్రేమ అని విష్ణు చెప్తున్నా కూడా అవన్నీ కుదరవని తీర్పు చెప్పింది. అనంతరం బిగ్‌బాస్.. తేజను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి అతడి ముందు కేక్ పెట్టాడు. కేక్ కావాలంటే ఇంటిసభ్యుల గురించి ఒక మంచి గాసిప్ చెప్పాలన్నాడు.అప్పట్లో ట్రయాంగిల్.. ఇప్పుడైతే..దీంతో తేజ.. గౌతమ్- యష్మి- నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నడిచిందని కానీ ఇప్పుడు అది లేదన్నాడు. గౌతమ్- యష్మి మధ్య అక్కాతమ్ముళ్ల అనుబంధం, నిఖిల్- యష్మి మధ్య ఫ్రెండ్షిప్ ఉందన్నాడు. నీకు ఎవరు క్రష్ అని బిగ్‌బాస్ అడగడంతో పడీపడీ నవ్విన తేజ.. క్రష్ కాదుగానీ ప్రేరణతో మంచి అనుబంధం ఏర్పడిందన్నాడు. కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తేజ అసలు విషయం చెప్పకుండా.. యష్మి సూట్‌కేస్ ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని బిగ్‌బాస్ చెప్పాడంటూ అబద్ధమాడాడు. తేజ పెట్టిన పెంటఅది నిజమని నమ్మిన యష్మి.. వెంటనే తన సూట్‌కేసును గౌతమ్‌కు ఇచ్చింది. పోయినవారం అతడిని రేస్ నుంచి తీసేసినందుకు ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంది. కానీ పృథ్వీ అందుకు ఒప్పుకోలేదు. అతడికెందుకు ఇస్తావంటూ కోపంగా మాట్లాడాడు. దీంతో యష్మి ఫీలైంది. అది చూసిన విష్ణు.. ఈ అబ్బాయిలు డిక్టేటర్‌గా మనల్ని రూల్ చేయడమేంటని అసహనం వ్యక్తం చేసింది.గాసిప్ చెప్తే కేక్ ఫ్రీఅటు ప్రేరణను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ ఏదైనా గాసిప్ చెప్తే కేక్ తినొచ్చన్నాడు. నిఖిల్‌కు యష్మి అంటే ఇష్టం.. కానీ, అందరి ముందు బయటపడటం లేదు అని తెలిపింది. ఈ ఇంట్లో అందరికంటే జెన్యూన్ ఎవరని అడగ్గా గంగవ్వ పేరు చెప్పింది. ఇకపోతే ఎంతోకాలంగా మెగా చీఫ్ పోస్ట్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ప్రేరణ ఎట్టకేలకు చీఫ్ పదవిని కైవసం చేసుకున్నట్లు భోగట్టా!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎంటర్టైనర్లు ఉట్టి జోకర్లేనా? విన్నర్‌గా పనికి రారా?
రియాలిటీ షో అంటేనే రియల్/నిజ స్వరూపం చూపించడం. ఎలా ఉంటున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం? భావోద్వేగాలను ఎలా నియంత్రించుకుంటున్నాం? ఇలా అన్నీ తెల్లకాగితంలా జనాలకు చూపించాలి. నచ్చినవాళ్లు ఓటేస్తారు, నచ్చనివాళ్లు లెక్క చేయరు .రియల్ ఎంటర్టైనర్స్ఎలాంటి ముసుగు లేకుండా స్వచ్ఛంగా ఉంటూ నలుగుర్ని నవ్వించేవారే రియల్ ఎంటర్టైనర్స్! కానీ ఇప్పటివరకు తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ప్రేక్షకుల్ని నవ్వించి కప్పు ఎగరేసుకుపోయినవాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. టాస్కులు ఆడినవారు లేదా సింపతీ సాధించినవారు, ఆల్రెడీ ఫ్యాన్‌బేస్ ఉన్నవాళ్లే విజేతలుగా నిలుస్తూ వస్తున్నారు తప్ప కమెడియన్లు కప్పు అందుకున్న దాఖలాలే లేవు. ఆ ఒక్కటి లేకపోతే అసంపూర్ణమే!అసలు వీళ్లు లేకపోతే బిగ్‌బాస్ షోనూ ఎవరూ పట్టించుకోరు. అన్నీ ఉన్నా వినోదం లేకపోతే అది సంపూర్ణంగా ఉండదు. అందుకే ఈ సీజన్లో రీలోడ్ పేరిట వైల్డ్‌కార్డ్స్‌ను దింపారు. ఇందులో ఎంటర్టైనర్స్ రోహిణి, అవినాష్, తేజ ఉన్నారు. ఫిజికల్ టాస్కులే కాకుండా బుర్రకు పదునుపెట్టే టాస్కుల్లోనూ ఒక అడుగు ముందే ఉన్నారు. వెనకాల గోతులు తవ్వడం, చాడీలు చెప్పడం, కావాలని గొడవపెట్టుకోవడం వంటి ఎన్నో అవలక్షణాలకు వీరు దూరంగా ఉన్నారు. ఈ లెక్కన విజేతగా నిలవడానికి ఆస్కారం ఉన్నవారు!టాప్ 5 మాత్రమేనా?కానీ రియాలిటీలో అది జరగడం లేదు. నిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వీడియో మెసేజ్‌లో నువ్వు టాప్ 5లో ఉండాలి అని తేజకు అతడి పేరెంట్స్ చెప్పారు. విన్నర్ అనకుండా టాప్ 5 అని ఎందుకన్నారు? అని తేజ అమాయకంగా రోహిణిని అడిగాడు. అప్పుడు రోహిణి కప్పు ఎలాగో రాదని తెలుసుగా.. అందుకే టాప్ 5 అన్నారు. మన పర్సనాలిటీలకు కప్పు రావురా.. ఏదో ఆడుకుంటూ వెళ్లిపోవడమే! నామినేషన్స్‌లో మేనరిజం చూపిస్తూ అరవడంలాంటివేమీ మనం చేయలేము అని చేదు సత్యాలను వివరించింది. కమెడియన్ విన్నర్ కాకూడదా?అందుకు తేజ.. ఎంటర్టైనర్లను ప్రేక్షకులు విన్నర్లుగా చూడరు అని అభిప్రాయపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కమెడియన్ విన్నర్ కాకూడదా? అన్న చర్చ మొదలైంది. జనాల్లోనూ ఈ ఆలోచన వస్తే ఎంటర్టైనర్లకు మంచి రోజులు వచ్చినట్లే! View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ మ్యాచ్‌ఫిక్సింగ్.. బిగ్‌బాస్ సర్ప్రైజ్లు.. కంటెస్టెంట్ల ఏడుపులు
బిగ్‌బాస్ హౌస్‌లో అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. దీపావళికి హౌస్‌మేట్స్‌కు వీడియో మెసేజ్‌ల రూపంలో కానుకలు అందాయి. తర్వాత అందరూ కలిసి సంతోషంగా డ్యాన్సులు వేశారు. దీంతో బిగ్‌బాస్ హౌస్ ఆనందాల హరివిల్లుగా మారింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అవినాష్‌తో డీల్నిన్న బిగ్‌బాస్ ఇచ్చిన బీన్ బ్యాగ్ గేమ్‌లో మొదట హరితేజ, తేజ ఎలిమినేట్ అయ్యారు. ఆ గేమ్ కొనసాగింపుతో నేటి ఎపిసోడ్ మొదలైంది. ఈ ఆటలో నిఖిల్.. నబీల్ను టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో నబీల్.. నిఖిల్‌ను మోచేయితో కొట్టాడు. నిఖిల్-ప్రేరణ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారని అర్థమైపోవడంతో నబీల్.. అవినాష్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. నిఖిల్‌ను అవుట్ చేద్దామని.. తర్వాత తాను ఓడిపోయి అవినాష్‌ను చీఫ్ చేస్తానని మాటిచ్చాడు. అలా చివరకు అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు.నబీల్‌కు స్వీట్లు తినే ఛాన్స్తర్వాత హౌస్‌లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో భాగంగా అబ్బాయిలు, అమ్మాయిలు అందంగా ముగ్గులు వేశారు. తర్వాత బిగ్‌బాస్ స్వీట్లు పంపించాడు. ఇక ఈ సీజన్ మొత్తం స్వీట్లు తిననని శపథం చేసిన నబీల్‌కు ఈ ఒక్కరోజు మాత్రం స్వీట్లు తినవచ్చని బిగ్‌బాస్ మినహాయింపు ఇచ్చాడు. అనంతరం బిగ్‌బాస్.. కంటెస్టెంట్ల ఇంటిసభ్యుల వీడియో సందేశాలను చూడవచ్చన్నాడు. ఎమోషనలైన తేజఅయితే ఇక్కడ కూడా అందరికీ అవకాశం ఇవ్వకుండా ప్రతి ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంటుందన్నాడు. అలా మొదటగా నబీల్, పృథ్వీలలో.. నబీల్‌కు అమ్మ, అన్నయ్య నుంచి వీడియో మెసేజ్ వచ్చింది. తల్లిని టీవీలో చూడగానే నబీల్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. రోహిణి, తేజలలో ఒకరికే వీడియో ఛాన్స్ అని బిగ్‌బాస్ చెప్పగా రోహిణి త్యాగంతో తేజకు ఫ్యామిలీ వీడియో ప్లే చేశాడు. తల్లిని స్క్రీన్‌పై చూడగానే తేజ ఎమోషనలయ్యాడు. యష్మి త్యాగంఅనంతరం నయని, యష్మిలలో ఒకరికే వీడియో ఛాన్స్ ఇవ్వగా నయనికి తల్లి మెసేజ్ ప్లే చేశారు. లైఫ్‌లో ఎన్నో ఎదుర్కొంటూ ఈ స్టేజ్‌కు వచ్చావు.. స్ట్రాంగ్‌గా ఆడు అని తల్లి ధైర్యం చెప్పడంతో నయని కళ్లలో నీళ్లు తిరిగాయి. అవినాష్ త్యాగంతో రోహిణి ఫ్యామిలీ వీడియో చూడగలిగింది. తర్వాత యష్మి త్యాగంతో విష్ణుప్రియ ఆంటీ వీడియో చూసి సంతోషపడిపోయింది. చివరగా యష్మి, అవినాష్, పృథ్వీలో ఒక్కరికే ఛాన్స్ అని చెప్పగా వీరు పృథ్వీ పేరు సూచించారు. అంతా ఏకమై సంతోషంగా..అలా పృథ్వీ తన తమ్ముడి వీడియో చూసి ఖుషీ అయ్యాడు. తర్వాత అందరూ పటాసులు కాల్చి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. పండగ పూట హౌస్‌మేట్స్‌ను బాధపట్టడం ఇష్టం లేని బిగ్‌బాస్ సడన్‌గా అవినాష్, యష్మి, హరితేజ ఫ్యామిలీ వీడియోస్ ప్లే చేశాడు. కూతురిపై బెంగ పెట్టుకున్న హరితేజ.. చిన్నారి భూమిని చూడగానే గుక్కపెట్టి ఏడ్చింది. భావోద్వేగాలతో గుండె భారమైన కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేక భోజనం పంపించడం విశేషం.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్టామినా లేదంటూ తేజ కన్నీళ్లు.. గౌతమ్‌ను మెంటల్ అన్న గంగవ్వ
బీబీ ఇంటికి దారేది గేమ్‌లో ఎల్లో టీమ్ ఎటూ కాకుండా పోయింది. కనీసం కంటెండర్లు కూడా అవలేకపోయారు. రెడ్ టీమ్‌లో నుంచి ఒకరు, గ్రీన్, బ్లూ టీమ్ నుంచి ఇద్దరు చొప్పున కంటెండర్లు అయ్యారు. ఇదిలా ఉంటే అవినాష్, రోహిణి వల్లే ఇంటిసభ్యులు పస్తులుండకుండా తినగలిగారు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 31)ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఏడుపు అనేది నా ఎమోషన్గేమ్లో కావాలనే ఏడ్చావ్ అంటూ యష్మిపై సెటైర్లు వేశాడు నిఖిల్. ఆ జోకుల్ని సరదాగా తీసుకోలేకపోయిన యష్మి నేను కష్టపడి ఆడాను.. ఏడుపు అనేది నా ఎమోషన్ అని సీరియస్‌గా బదులిచ్చింది. దీంతో నిఖిల్ చివరకు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే కిచెన్‌లో వంట చేసుకునేందుకు బిగ్‌బాస్ టైం కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే కదా! ఈరోజు వంట చేస్తుండగానే ఆ సమయం ముగియడంతో బిగ్‌బాస్ ఉన్నఫళంగా గ్యాస్ ఆఫ్ చేశాడు.ఆ ఇద్దరిల్లే అందరికీ భోజనం..దీంతో వంట చేసేదెలాగా? అని హౌస్మేట్స్ కంగారుపడ్డారు. అంతలోనే బిగ్‌బాస్.. ఆ టైం యాడ్ చేయాలంటే అవినాష్, రోహిణి చిన్న పిల్లలుగా మారి నవ్వించాలన్నాడు. ఎంటర్టైన్మెంట్ అనేది వీళ్లిద్దరికీ కొట్టిన పిండి కావడంతో పిల్లల్లా కాదు ఏకంగా చిచ్చర పిడుగుల్లా మారిపోయారు. వీరి వినోదాన్ని చూసి ముచ్చటపడిపోయిన బిగ్‌బాస్ కిచెన్ టైమర్‌కు రెండు గంటలపాటు టైం యాడ్ చేశాడు. దీంతో కంటెస్టెంట్లు వంట చేసుకుని తినగలిగారు.గౌతమ్ అవుట్ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్‌లో తాడోపేడో అని చివరి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో నిఖిల్ తన బ్లూ టీమ్‌ను గెలిపించాడు. బ్లూ టీమ్ లీడర్ హరితేజ రెండు సార్లు డైస్ రోల్ చేసే ఛాన్స్ పొందింది. అలా డైస్ ద్వారా వచ్చిన మూడు పాయింట్లను నిఖిల్‌కు ఇవ్వగా ఐదు పాయింట్లు తనకు ఇచ్చుకుంది. వీరికి రెండు ఎల్లో కార్డ్స్ రాగా.. అందులో ఒకటి రెడ్ టీమ్‌కు, మరొకటి గ్రీన్ టీమ్‌కు ఇచ్చారు. అలా రెడ్ టీమ్ నుంచి గౌతమ్, గ్రీన్ టీమ్ నుంచి విష్ణుప్రియ ఆటలో నుంచి వైదొలిగారు.కరివేపాకులా తీసిపారేసిన గంగవ్వగేమ్ నుంచి అవుట్ అవడంతో గౌతమ్ డీలా పడిపోయాడు. అదే విషయం విష్ణుప్రియ.. గంగవ్వతో చెప్తే.. అతడికేమైనా మెంటలా? ఎక్కువ ఆవేశపడతాడు. బిత్తిరి అంటూ.. కూరలో కరివేపాకులా తీసిపారేసింది. ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్‌లో బీబీ ఇంటికి చేరువైన హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజను కంటెండర్లుగా ప్రకటించారు. వీరికి తిరుగుతూనే ఉండు- గెలిచేవరకు అనే గేమ్ పెట్టాడు. ఇందులో పోటీదారులు బ్యాగులు ధరించి సర్కిల్లో తిరుగుతూ ఉండాలి.ఏడ్చేసిన తేజఫస్ట్ రౌండ్లో హరితేజ బాగానే ఆడింది కానీ తన బ్యాగు ఎక్కువ ఖాళీ అవడంతో ఆమె ఆటలో నుంచి అవుట్ అయింది. ఆటలో ఎన్నోసార్లు కింద పడుతూ లేస్తూ ఫైట్ చేసిన తేజ నెక్స్ట్ అవుట్ అయ్యాడు. దీంతో హర్టయిన తేజ.. తనకు స్టామినా ఉంటే బాగుండేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తయింది. ఇకపోతే ఈ గేమ్‌లో ఫైనల్ వరకు అవినాష్ నిలిచి మెగా చీఫ్ పదవి గెలిచాడని తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిపై ప్రేమను దాచేస్తున్న నిఖిల్.. కోపంతో తేజను కొట్టిన గంగవ్వ
రెండు రోజులుగా కొనసాగుతున్న బీబీ రాజ్యం ఛాలెంజ్ ఈరోజుతో పూర్తయింది. రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ను వెనక్కు నెట్టి ఓజీ టీమ్(పాత కంటెస్టెంట్లు) రాజ్యాన్ని కైవసం చేసుకుంది. అదొక హఠాత్పరిణామం.. అన్నట్లుగా విష్ణుప్రియ మెగా చీఫ్‌గా నిలిచింది. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పొడుపు కథబీబీ రాజ్యం చాలెంజ్‌లో భాగంగా మీలో ఎవరు తెలివైనవారు? అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌కు నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించాడు. '13 హార్ట్స్ ఉంటాయి.. కానీ మిగతా ఆర్గాన్స్ ఉండవు.. ఏంటి?' అన్న ప్రశ్నకు తేజ ప్లేయింగ్ కార్డ్స్ అని బదులిచ్చాడు. కొన్ని నెలలకు 31 రోజులుంటాయి కొన్ని నెలలకు 30రోజులుంటాయి. ఎన్ని నెలలకు 28 రోజులుంటాయన్న ప్రశ్నకు గౌతమ్ 12 నెలలు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు.బతికుండగానే పాతిపెడతారా?ఏపీ, తెలంగాణ సరిహద్దులో విమానం పడిపోతే అందులో ఉన్న సర్వైవర్లను ఎక్కడ పాతిపెడతారు? అని అడిగాడు. అందుకు నిఖిల్, నయని.. ఆంధ్ర, తెలంగాణ అంటూ శుద్ధ తప్పు సమాధానం చెప్పారు. బతికున్నవాళ్లను పాతిపెడతారా? అని బిగ్‌బాస్ కౌంటర్ వేయడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఇలాంటి ప్రశ్నలే మరికొన్ని వేయగా రెండు టీమ్స్‌కు టై అయింది. దీంతో చివరి ప్రశ్నగా.. కోతి, ఉడుత, పక్షిలో ఏది ముందుగా కొబ్బరిచెట్టు ఎక్కి అరటిపండు తెంపుతుందన్నాడు. తేజను వాయించిన గంగవ్వముందుగా బజర్ నొక్కిన ప్రేరణకు ప్రశ్న సరిగా అర్థం కాలేదు. ఆ క్వశ్చన్ రిపీట్ చేయడానికి వీల్లేదని తేజ వాదించాడు. కావాలంటే జంతువుల పేర్లను ఇంగ్లీష్‌లో చెప్పుకోవచ్చన్నాడు. దీంతో గంగవ్వ వచ్చి.. ప్రేరణకు ఎందుకు చెప్తున్నావు, నీకు ఆన్సర్ చెప్పొస్తలేదా? అని తేజను కొట్టింది. ఇంతలో ప్రేరణ కొబ్బరిచెట్టుపై నుంచి పండును ఏ జంతువూ తెంపలేదని పేర్కొంది.ప్రేరతో గౌతమ్ ఫైట్అలా ఈ గేమ్‌లో ఓజీ గెలిచి బీబీ రాజ్యంలో స్కూల్, న్యాయస్థానం గెలుచుకుంది. అలాగే తన టీమ్‌లో ప్రేరణను కంటెండర్‌గా ప్రకటించారు. రాయల్స్ టీమ్‌లో మెహబూబ్‌ను చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు. ఇంతలో గౌతమ్.. ప్రేరణతో ఏదో వాదులాటకు దిగగా మధ్యలో యష్మి వచ్చి సముదాయించబోయింది. మా ఇద్దరి మధ్యలోకి రాకు, వెళ్లిపో అని యష్మిపై అరిచాడు. కాసేపటికి వాళ్లిద్దరికీ సారీ కూడా చెప్పాడు. ప్రేమ ఉంది కాబట్టే అలా..మరోవైపు నిఖిల్, యష్మి మధ్య దోబూచులాట అవుతూనే ఉంది. నీకు, నాకు సెట్టవదు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు అంటూ ఏవేవో మాట్లాడుకున్నారు. నిఖిల్ ప్రవర్తన అంతుపట్టని యష్మి.. సడన్‌గా వచ్చి నాపై ఇంట్రస్ట్ ఉందన్నట్లు మాట్లాడతాడు. అలాగే నేను, గౌతమ్ డ్యాన్స్ చేస్తే జెలసీ ఫీల్ అయ్యాడు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. కెమెరా ముందు మంచోడిలా ఉండాలనుకుంటే ఉండు.. నేను మాత్రం ఫేక్‌గా ఉండలేను అంది. అలా ఈర్ష్యపడటం లవ్ లాంగ్వేజ్ అని ప్రేరణ నిర్ధారించింది.ఆరుగురు మెగా చీఫ్ కంటెండర్స్ఇక బీబీ రాజ్యం టాస్కు పూర్తయిందన్న బిగ్‌బాస్.. ఓజీ, రాయల్స్ నుంచి చెరొక కంటెండర్‌ను సెలక్ట్ చేయవచ్చన్నాడు. దీంతో విష్ణుప్రియ, తేజను ఎంపిక చేశారు. ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి, తేజలలో ఒకర్ని మెగా చీఫ్‌గా ఎన్నుకునే బాధ్యతను హౌస్‌మేట్స్‌పై వేశాడు. మెగా చీఫ్‌కు అనర్హులనుకునేవారికి మిరప దండ వేసి రేసు నుంచి తప్పించాలన్నాడు.కొత్త చీఫ్‌గా విష్ణుప్రియఅలా మొదటగా మెహబూబ్.. ప్రేరణను తప్పించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నబీల్.. రోహిణిని, అవినాష్.. పృథ్వీని అవుట్ చేశారు. చివరగా గౌతమ్.. నిఖిల్‌ను అవుట్ చేస్తూ విష్ణుప్రియను చీఫ్‌గా గెలిపించాడు. అయితే ఒక్కరికే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానంగా చూడాలని మాట తీసుకున్నాడు. ఇక విష్ణుప్రియకు ఇచ్చిన ఎన్విలాప్‌లో రూ.2 లక్షలు ఉండగా అది ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.40,16,000కు చేరింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హడలెత్తించిన నిఖిల్, పృథ్వీ.. కూతురి కోసం హరి కన్నీళ్లు!
ఫిజికల్ టాస్క్ వస్తే పృథ్వీకి తెలియకుండానే పూనకం వస్తుంది. మనుషుల్ని పిట్టల్లా విసిరేస్తూ, పురుగుల్లా నలిపేస్తుంటాడు. ఈ రోజూ ఇదే జరిగింది. ఈసారి నిఖిల్ తోడయ్యాడు. టాస్కులో ఈ దోస్తులిద్దరూ అరాచకం సృష్టించారు. మరి వీరితో పోటీపడిందెవరు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నిఖిల్, పృథ్వీ అరాచకంబీబీ రాజ్యం ఛాలెంజ్ కొనసాగింపుగా నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఎనిమిది ధాన్యపు బస్తాలను తోపుడు బండిపై ఎవరు ముందుగా పెడతారో ఆ టీమ్‌కు రాజ్యంలో వ్యవసాయం దక్కుతుందన్నాడు. ఓజీ టీమ్ నుంచి నిఖిల్, పృథ్వీ విజృంభించి ఆడారు. వారిని అడ్డుకునేందుకు గౌతమ్, మెహబూబ్ చాలావరకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొట్టుకున్నారు, తోసేసుకున్నారు. నానా అరాచకం సృష్టించడంతో బిగ్‌బాస్ కొన్ని సెకన్లపాటు గేమ్‌ను పాజ్ చేశాడు. అదుర్స్ అనిపించిన తేజ, అవినాష్అలాగే ఈ ఆటలో పోటీదారులను మార్చుకోవచ్చని వెసులుబాటు కల్పించాడు. అలా గౌతమ్, మెహబూబ్ స్థానంలోకి అవినాష్, తేజ వచ్చారు. వీళ్లు కూడా తమ శక్తికి మించి ప్రయత్నించి ఆడారు. వాళ్లు ఎంతో కష్టపడి ఓ సంచిని బండిపై పెట్టారు. కానీ అది ముందు ఓజీ తోపుడు బండికి టచ్ అయిందంటూ వారికే పాయింట్ ఇస్తానని సంచాలకురాలు యష్మి వితండ వాదం చేసింది. ఒక్క బస్తా కూడా రాయల్ టీమ్‌ను పెట్టనివ్వకపోవడం నిఖిల్, పృథ్వీల శక్తికి నిదర్శనం.మనలో ఒకరే విన్నర్ఫైనల్గా ఈ గేమ్‌లో ఓజీ టీమ్ గెలవడంతో వ్యవసాయ భూమి గెలిచారు. అలాగే తన టీమ్‌లో నుంచి పృథ్వీని మెగా చీఫ్ కంటెండర్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో కంటెండర్ అవ్వాలనుకున్న ప్రేరణకు, యష్మికి మధ్య గొడవ జరిగింది. ఈ ఇద్దరికీ సర్ది చెప్పిన నిఖిల్.. ఇది మన సీజన్.. మన టీమ్‌లోని ఒకరే ట్రోఫీ ఎత్తాలి. మనలో మనకు గొడవలొద్దు అని టీమ్ సభ్యులకు హితోపదేశం చేశాడు. ఓడిన రాయల్స్ టీమ్ నుంచి గంగవ్వను మెగా చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు.కూతుర్ని తల్చుకుని హరితేజ ఎమోషనల్వచ్చినప్పటినుంచి మేమే గెలిచాం అని రాయల్స్ ఫీల్ అవుతున్నారు. మనం మిగతా టాస్కులు గెలిచి ఆ పొగరును తగ్గించేయాలని ప్రేరణ.. నబీల్‌తో అంది. అన్నట్లుగానే తర్వాత టాస్కుల్లోనూ దూకుడు ప్రదర్శించారు. మరోవైపు హరితేజ.. తన కూతురు భూమిని తల్చుకుని ఎమోషనలైంది. అమ్మ గురించి బెంగపెట్టుకోకు, స్కూలుకు వెళ్లు, పిన్నితో ఆడుకో.. వీకెండ్లో నాన్న వస్తాడు. అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు, నీకోసం ఏడవట్లేదు. నువ్వు కూడా ఏడవొద్దంటూనే కన్నీళ్లు పెట్టుకుంది.మళ్లీ ఓజీ టీమ్‌దే గెలుపుబీబీ రాజ్యంలో సైన్యం, హాస్పిటల్‌ను పొందడానికి బిగ్‌బాస్ వైరల్ అటాక్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఓజీ టీమ్ నుంచి నిఖిల్, నబీల్ ఆడగా రాయల్ టీమ్ నుంచి గౌతమ్, తేజ ఆడారు. మరోసారి ఓజీ టీమ్ గెలిచి హాస్పిటల్, సైన్యం పొందింది. అలాగే తన టీమ్‌లో నుంచి నిఖిల్‌ను మెగా చీఫ్ కంటెండర్‌గా ప్రకటించారు. రాయల్స్ నుంచి గౌతమ్‌ను మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పించారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్‌పై మనసు పారేసుకున్న యష్మి, అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!
సమయం దొరికినప్పుడల్లా అవినాష్ అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. అటు తేజ, అవినాష్.. గంగవ్వను దెయ్యం పట్టినట్లు యాక్ట్ చేయమన్నారు. కానీ గంగవ్వ ఏకంగా జీవించేసింది. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..తిక్క కుదిర్చిన బిగ్బాస్ఇంటిని శుభ్రంగా ఉంచట్లేదని, తన ఆదేశాలను లెక్కచేయట్లేదని బిగ్‌బాస్ హర్టయ్యాడు. అందుకని ఈ వారం సూపర్మార్కెట్లో షాపింగ్ చేసే సమయాన్ని కాస్త కట్ చేసిపారేశాడు. దీంతో మెగా చీఫ్ గౌతమ్.. నిఖిల్‌ను మార్కెట్‌కు పంపించి అతడితో షాపింగ్ చేయించాడు.యష్మి- నిఖిల్ లవ్ ట్రాక్?ఇక యష్మి.. నిఖిల్‌ను తనతో మాట్లాడమని బతిమాలింది. ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడే బాగుండేది.. నా వల్ల నీ గేమ్‌కు ప్రాబ్లం కానివ్వను. నాది పడిపడి చచ్చే క్యారెక్టర్ అయితే కాదు, ఇకపై జస్ట్ ఫ్రెండ్‌గా ఉంటా అని చెప్పుకుంటూ పోయింది. నిఖిల్ శిలావిగ్రహంలా స్తబ్దుగా కూర్చోవడంతో కోపంతో వెళ్లిపోయింది. ఆమె అలకను తీర్చేందుకు నిఖిల్.. యష్మిని హత్తుకుని ముద్దిచ్చాడు.ఇంకా పృథ్వీ వెనకే పడుతోన్న విష్ణుపృథ్వీ మెడలో గోల్డ్ చెయిన్ చూసి నిలువెత్తు బంగారం.. మళ్లీ బంగారం వేసుకుని తిరగడమేంటో అని మురిసిపోయింది. ఈ మాట విన్న హౌస్మేట్స్ ఇక మా వల్లకాదు, వెళ్లిపోతాం అని జోక్ చేశారు. బిగ్‌బాస్ కూడా సరే, మీ సరదా నేనెందుకు కాదంటాను అన్నట్లు గేట్లు తెరిచాడు. దీంతో అబ్బాయిలంతా కలిసి అవినాష్‌ను లాక్కెళ్లి మరీ బయట పడేసేందుకు ప్రయత్నించారు.మనసు మార్చుకున్న బిగ్బాస్అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ మేరకు అవినాష్ జిమ్ ట్రైనర్‌గా మారి హౌస్‌మేట్స్‌తో చిత్రవిచిత్రమైన కసరత్తులు చేయించి నవ్వించాడు. దీంతో కిచెన్ టైమర్‌కు మరో రెండు గంటల సమయం యాడ్ చేశాడు. అలాగే మార్కెట్లో మర్చిపోయిన కూరగాయలు, పండ్లను సైతం పంపించి తన మనసు వెన్న అని నిరూపించుకున్నాడు.అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!అవినాష్, తేజ.. గంగవ్వను దెయ్యంలా రెడీ అయి భయపెట్టాలన్నాడు. ఇంకేముంది.. అర్ధరాత్రి గంగవ్వ జుట్టు విరబోసుకుని కేకలు వేయడంతో హౌస్మేట్స్ నిద్రలో నుంచి లేచి జడుసుకున్నారు. ఇది చూసిన తేజ.. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పక్కా అని భయపడిపోయాడు. నిఖిల్, పృథ్వీ, నబీల్ మాత్రం నిద్రలో నుంచి లేవలేదు. అయితే ఇది ప్రాంక్ అని, అవినాష్ చేయించి ఉంటాడని గౌతమ్ అనుమానపడ్డాడు.మెగా చీఫ్ కంటెండర్‌గా రోహిణిబీబీ రాజ్యం ఏర్పాటు చేసుకునేందుకు రెండు క్లాన్స్ పోటీపడతాయన్నాడు. మొదటగా అక్వేరియంలో నీళ్లను నింపే టాస్కులో రాయల్ టీమ్ గెలిచింది. అందుకు గానూ రాజ్యంలో మంచినీటి సరస్సును పొందారు. అలాగే రాయల్ టీమ్‌లో నుంచి రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అయింది. అలాగే ఓజీ టీమ్‌లో యష్మి మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పుకుంది. రోహిణిని కంటెండర్‌గా సెలక్ట్ చేయడంపై హరితేజ రాద్దాంతం చేసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తేజ చేతిలో మరొకరు బలి.. ఈ వేట ఆగదా?
మొన్నటి నామినేషన్స్‌లో తేజ సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడాడు. కరెక్ట్ పాయింట్లు చెప్తూ సీత, మణికంఠను నామినేట్ చేశాడు. అయితే మణికి ఒకే ఒక్క నామినేషన్ పడటంతో అతడు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. కానీ సీతకు ఏకంగా ఐదు పడటంతో నామినేషన్స్‌లోకి వచ్చింది. ఇప్పటికే సండే ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తవగా సీత ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది.నీళ్లు చల్లిందని నామినేట్..ఇంతకీ విషయమేంటంటే.. గత సీజన్లో తేజ ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు నేరుగా ఎలిమినేట్ అయిపోయారు. పైగా చెత్త కారణాలు చెప్పి నామినేట్ చేయడం మరింత విడ్డూరం. నిద్రపోతున్న తన మీద నాలుగు చుక్కల నీళ్లు చిలకరించిందంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజామూర్తిని నామినేట్ చేసి పంపించేశాడు.ఆరుగురిని పంపించేశాడుస్ట్రాంగ్ కంటెస్టెంట్, నామినేషన్స్‌లోకి వస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుందంటూ సందీప్ మాస్టర్‌ను పొగుడుతూ మరీ బయటకు తోసేశాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. దామిని భట్ల, రతిక రోజ్, నయని పావని, శుభశ్రీ.. వీళ్లంతా తేజ బాధితులే! ఆరుగురిని పంపించాక తొమ్మిదోవారం ఇతడు ఎలిమినేట్ అయ్యాడు. సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేయొద్దంటూ శివాజీ ఇతడిని నామినేట్ చేయగా అదే వారం వెళ్లిపోయాడు.ఈసారి కూడా సీన్ రిపీట్ఇప్పుడు తేజ వచ్చీరాగానే సీతను నామినేట్ చేయడం, ఆమె ఎలిమినేట్ అవడం చూస్తుంటే ఈసారి కూడా సీజన్ 7లో జరిగింది రిపీట్ అయ్యేట్లు కనిపిస్తోంది. ఇది గమనించిన కొందరు నెటిజన్లు.. నెక్స్ట్ వీక్ తేజ ఎవర్ని ఎలిమినేట్ చేస్తాడో చూడాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. మా ఫేవరెట్ కంటెస్టెంట్ తేజ చేతిలో పడకపోతే చాలని కోరుకుంటున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ముగ్గుర్ని బ్యాగులు సర్దమన్న నాగ్.. వాళ్లు పతనం, వీళ్ల ఎదుగుదల
నాలుగువారాలు చీఫ్‌గా కొనసాగిన నిఖిల్ ఈ వారం గేమ్‌లో కనిపించకుండా పోయాడు. అటు యష్మి హోటల్ టాస్క్‌ను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరిదే కాదు.. అందరి ఆట గురించి నాగ్ విశ్లేషించాడు. మరి ఆయన ఏమేం చెప్పాడో నేటి (అక్టోబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రైజింగ్ స్టార్స్బిగ్బాస్ హోటల్ టాస్క్‌లో అవినాష్, తేజ దొంగతనంగా గులాబ్ జామ్ తిన్నారు. అందుకని నాగార్జున ఓ గిన్నె నిండా గులాబ్ జామ్స్ పంపించి అవి ఆ ఇద్దరితో మాత్రమే తినిపించాడు. ఇక హౌస్మేట్స్ ఆటను బట్టి వారిని రైజింగ్ స్టార్స్, ఫాలింగ్ స్టార్స్‌గా నాగ్ విభజించాడు. గంగవ్వ, మెహబూబ్, అవినాష్, రోహిణి, నాగమణికంఠ, నయని, యష్మి.. రైజింగ్ స్టార్స్ అని పేర్కొన్నాడు.నాతో గేమ్స్ద్దునువ్వు బచ్చా అన్నందుకు మణికంఠ ఫీలయ్యాడని నాగ్ రోహిణితో అన్నాడు. అయితే మణి మాత్రం.. నేను మరీ అంత ఫీల్ అవలేదన్నాడు. దీంతో నాగ్.. ఇప్పుడు కవరింగ్ చేయకు, నా దగ్గర ఆటలాడొద్దంటూ అతడి నోరు మూయించాడు. నువ్వు గేమ్ సీరియస్‌గా తీసుకోకపోతే నిన్ను ఆడియన్స్ కూడా సీరియస్‌గా తీసుకోరని విష్ణుప్రియకు మరోసారి గుర్తు చేశాడు. మణికంఠలో ఎనర్జీ, ఫన్ మరో లెవల్లో ఉందంటూ ఓ వీడియో చూపించాడు.తేజకు పనిష్మెంట్నబీల్, గౌతమ్, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, నిఖిల్, సీతలను ఫాలింగ్ స్టార్స్‌గా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ.. నబీల్‌కు ఏదైనా సమస్య ఉంటే నేరుగా అందుకు కారణమైన వ్యక్తితోనే మాట్లాడాలన్నాడు. గతం గురించి ఆలోచించుకుంటే వర్తమానం మిస్ అయిపోతావ్ అని గౌతమ్‌కు సలహా ఇచ్చాడు. తేజ.. నయనిపావనిపై నోరు పారేసుకున్న వీడియోను ప్లే చేసి మరీ క్లాస్ పీకాడు. 10 పుషప్స్ తీయమని పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రేరణ వంతు రాగా ఆమె సగం రైజింగ్, సగం ఫాలింగ్ అని తెలిపాడు.అవినాష్ దృష్టిలో అతడు స్ట్రాంగ్ కాదట!ఇంట్లో ఉండేందుకు అర్హత లేని కంటెస్టెంట్ల బ్యాగుని ఎగ్జిట్ గేట్ దగ్గర పెట్టాలన్నాడు నాగ్. అయితే ఎవరి టీమ్‌లో నుంచి వాళ్లు కాకుండా.. అవతలి టీమ్‌లోని వారి పేర్లను మాత్రమే చెప్పాలన్నాడు. మొదటగా తేజ.. ఇంటి పనులు చేయట్లేదంటూ పృథ్వీ బ్యాగును పెట్టాడు. హరితేజ.. నబీల్‌కు క్లారిటీ తక్కువగా ఉందంది. అవినాష్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదంటూ నిఖిల్ బ్యాగు గేటు దగ్గర పెట్టాడు. గంగవ్వ.. మణి పేరును, రోహిణి.. ప్రేరణ, గౌతమ్.. సీత, మెహబూబ్.. పృథ్వీ పేర్లను సూచించారు. నయని.. విష్ణుప్రియలో ఇంప్రూవ్మెంట్ కనిపించలేదని పేర్కొంది.చివర్లో ముగ్గురి బ్యాగులుతర్వాత ఓజీ టీమ్సభ్యుల వంతు వచ్చింది. నాగమణికంఠ.. నా అంచనాలు అందుకోలేకపోయాడంటూ తేజ బ్యాగు ఎగ్జిట్ దగ్గర పెట్టాడు. సీత.. హోటల్ టాస్క్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేదంటూ గౌతమ్ పేరు చెప్పింది. పృథ్వీ, యష్మి.. బాగా ఆడలేదని తేజను, నిఖిల్, నబీల్.. గౌతమ్‌ను, విష్ణుప్రియ, ప్రేరణ.. నయని పేర్లను సూచించారు. చివర్లో ఎక్కువ ఓట్లు పడ్డ పృథ్వీ, తేజ, గౌతమ్ బ్యాగుల్ని సర్దేసి స్టోర్ రూమ్‌లో పెట్టాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తయింది. ఇక రేపటి ఎపిసోడ్లో సీత ఎలిమినేట్ కానుంది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్ బాస్ ఛాలెంజ్‌లో కిందపడిపోయిన టేస్టీ తేజ
బిగ్‌బాస్ షోలో రెండోరోజు కూడా 'హోటల్ టాస్క్' నడుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ టాస్క్‌లో ఎక్కువగా ఫన్ ఉంటుంది కాబట్టి ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. ఇప్పటికే వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారు రాయల్ టీమ్‌గా బిగ్‌బాస్ హోటల్‌కు అతిథులుగా వెళ్తారు. అయితే, ఓజీ(ఓల్డ్ కంటెస్టెంట్స్) హోటల్ స్టాఫ్‌గా ఉంటారు. తాజాగా విడుదలైన డే-39 ప్రోమో ఫన్‌తో మొదలయ్యి ఆసక్తికరమైన గేమ్‌తో ముగిసింది.సేవ్ ది వాటర్ ఛాలెంజ్ఈ టాస్క్‌లో ఇరు జట్లు పోటీపడుతాయి. గెలిచిన వారు రూ. 25వేలు ప్రైజ్ మనీ పొందవచ్చని బిగ్‌బాస్ చెబుతాడు. ఇరు జట్లకు కేటాయించిన ఆక్వేరియంలో ఏ టీమ్ సభ్యులు ఎక్కువ నీళ్లు నింపుతారనేది టాస్క్. అయితే, వాళ్లు నీళ్లు తీసుకునే వెళ్తున్న దారి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దానిని దాటుకుని వెళ్తున్న క్రమంలో టేస్టీ తేజ కిందపోడిపోతాడు. కొంత సమయం పాటు అతను అక్కడి నుంచి కదలలేని స్థితిలోనే కనిపించాడు. అతనికేమైనా గాయాలు తగిలి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన సన్నివేశాలు ప్రోమోలో కనిపిస్తున్నాయి. ఈ టాస్క్‌లో నయని పావని కూడా కిందపడిపోతుంది. -
నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని
ఈ సీజన్లో నామినేషన్స్ మరీ సప్పగా సాగేవి. కేవలం ఒక్కరోజులో పూర్తయిపోయేవి. అలాంటిది ఈ వారం మంగళవారం కూడా సాగింది. మరోవైపు డాక్టర్ బాబు గౌతమ్ ప్రతి దానిలో దూరుతున్నాడని నబీల్ ఇబ్బంది పడుతున్నాడు. గత సీజన్లో జరిగిన ఓ పని వల్ల టేస్టీ తేజ, నయని పావని మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఇంతకీ 37వ రోజు బిగ్‌బాస్ హౌసులో ఏం జరిగింది? అనేది హైలైట్స్‌లో చూద్దాం.(ఇదీ చదవండి: కార్తీ తప్పు లేకపోయినా సారీ చెప్పించారు: ప్రకాశ్ రాజ్)యష్మికి రోహిణి కౌంటర్స్యష్మిని రోహిణి నామినేట్ చేయడంతో ఈ రోజు ఎపిసోడ్ మొదలైంది. మెగా చీఫ్ టాస్క్‌లో నబీల్-పృథ్వీ ఆడుతున్న టైంలో సంచాలక్ ప్రేరణని తప్పు చేయమనే అర్థమొచ్చేలా పదేపదే చెప్పడం తనకు నచ్చలేదని రోహిణి కారణం చెప్పింది. యష్మి దీనికి ఎంతకీ ఒప్పుకోలేదు. రోహిణి కూడా ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్స్ వేసింది. అలానే మొదటితో పోలిస్తే విష్ణుప్రియ ఆట తగ్గిపోయిందని గ్రాఫ్ పెంచుకోమని చెప్పి రోహిణి ఈమెని నామినేట్ చేసింది.అలిగిన గంగవ్వరోహిణి తర్వాత గంగవ్వ వచ్చింది. గేమ్ ఆడట్లేదు, కాళ్లు చేతులు సక్కగా లేవా? ఉన్నా మరెందుకు ఆడట్లే, ఉత్తిగనే కూసుంటున్నావ్ అని చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేసింది. ఇక హౌసులోకి వచ్చిన తర్వాత తమ ఎనిమిది మందిని అస్సలు పలకరించట్లేదని, కనీసం టీ కూడా ఇవ్వలేదని చెప్పి యష్మిని నామినేట్ చేసింది. తెలంగాణ స్లాంగ్‌లో గంగవ్వ చెప్పిన మాటలు తొలుత యష్మికి అర్థం కాలేదు. నయని చెప్పడంతో అర్థం చేసుకుంది. ఈసారి రోజూ మాట్లాడతా, చాక్లెట్ కూడా షేర్ చేసుకుంటానని యష్మి చెప్పింది.(ఇదీ చదవండి: సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)కొత్తోళ్లు నామినేషన్స్‌లో ఎందుకు?చివరగా వచ్చిన అవినాష్.. పృథ్వీ, యష్మిని నామినేట్ చేశాడు. ప్రభావిత టాస్క్‌లో ఆడవాళ్లతో కాస్త హర్ష్‌గా ప్రవర్తించాడని, అలానే గేమ్ కనిపించట్లేదనే కారణంతో పృథ్వీకి కారణాలు చెప్పుకొచ్చాడు. ఇక కన్ఫెషన్ రూంలో మణికంఠకి ఫుడ్ ఇచ్చేసి ఉంటే బయటకొచ్చి అతడిని ఓదార్చే అవసరముండేది కాదు కదా అని యష్మిని నామినేట్ చేశాడు. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ నుంచి కూడా ఇద్దరిని నామినేట్ చేయాలని, వాళ్లిద్దరూ ఎవరూ ఓజీ క్లాన్ (హౌసులోని పాతోళ్లు) నిర్ణయించాలని అన్నాడు. అన్ని చర్చల తర్వాత మెహబూబ్, గంగవ్వని నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. హౌసులోకి వచ్చిన ఒక్కరోజులోనే వీళ్లని నామినేట్ చేయాలని ఎలా డిసైడ్ చేస్తారు? అనేది అర్థం కాలేదు.ఉప్పు ప్యాకెట్ రూ.50 వేలుఓవరాల్గా ఈ వారం పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, సీత, మెహబూబ్, గంగవ్వ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత రేషన్ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఇంట్లోని రేషన్ అంతా బిగ్‌బాస్‌కి ఇచ్చేయాలని అన్నాడు. బిగ్‌బాస్ మార్కెట్ ఉంటుందని, బజర్ మోగి, ఆగేలోపు ఎంత తీసుకొస్తే ఆ రేషన్‌ని ఇరు క్లాన్స్ పంచుకోవాలని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. నబీల్-నిఖిల్ అన్నీ తెచ్చారు కానీ ఉప్పు ప్యాకెట్ తీసుకురావడం మర్చిపోయారు. చివరకు బిగ్‌బాస్‌ని ప్రాధేయపడితే ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు తగ్గించుకుని సాల్ట్ ప్యాకెట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: 'దేవర' ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం)గౌతమ్ తీరుపై నబీల్ అసహనంఏదైనా అనౌన్స్మెంట్ మెగా చీఫ్‌గా తనకు బాధ్యత ఉందని, కానీ గౌతమ్ కృష్ణ ప్రతిసారీ వచ్చి తన చేతిలో పేపర్ లాగేసుకుని మరీ చదువుతున్నాడని నబీల్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నానని తన క్లాన్ సభ్యులతో అన్నాడు. అంటే వచ్చే వారం ఇదే కారణం చెప్పి గౌతమ్‌ని నబీల్ నామినేట్ చేయడం గ్యారంటీ.నోరు జారిన టేస్టీ తేజబయట లాన్లో అందరూ కూర్చున్న టైంలో అవినాష్, మెహబూబ్.. నయని పావనిని గత సీజన్లో నామినేట్ చేయడం గురించి మాట్లాడుకున్నారు. ఈసారి వైల్డ్ కార్డ్‌గా వచ్చిన తేజ కూడా తనని నామినేట్ చేశాడని నయని చెప్పింది. దీంతో దగ్గర్లో ఉన్న తేజ.. నామినేషన్ విషయంలో నిన్నే బండ బూతులు తిట్టారని, కావాలంటే బయటకెళ్లిన తర్వాత చూస్కో అని నోరు జారాడు. దీంతో నయని పావని వెక్కి వెక్కి ఏడ్చింది. చివరకు ఆమె దగ్గరకెళ్లి సారీ చెప్పాడు. నీకు ఎందుకురా అంత నోటి దూల అని తనని తానే తిట్టుకున్నాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.(ఇదీ చదవండి: సమంత-త్రివిక్రమ్‌తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) -
హింటిస్తే అర్థం చేసుకోరే..! మణిని చెడుగుడు ఆడుకున్న గంగవ్వ
వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడిపోయింది. సీజన్ ప్రారంభం అయినప్పుడు 14 మంది ఉన్నారు. కానీ వైల్డ్ కార్డ్స్ రాకతో కంటెస్టెంట్ల సంఖ్య 16కు చేరుకుంది. మరి వీళ్ల నామినేషన్స్ ఎలా ఉన్నాయో నేటి (అక్టోబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..గంగవ్వా.. మజాకా!వైల్డ్ కార్డ్స్‌ను చూసి హౌస్‌మేట్స్‌కు భయం పట్టుకుంది. ఎవరు ఎలాంటివాళ్లు, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చర్చించుకున్నారు. తర్వాతి రోజు ఉదయం గంగవ్వ మణికంఠను ఓ ఆటాడుకుంది. నీ పెండ్లాం, పిల్ల యాదొచ్చిందని ఏడ్చినవ్.. అంత యాదికొస్తే ఎందుకొచ్చినవ్ ఇక్కడికి అని కౌంటర్ వేసింది. నా బాధ తట్టుకోలేకున్నా అని మణి అంటే మరి ఈ వారం పోతవా అని మరో పంచ్ వేసింది. ఇకపోతే ప్రైజ్‌మనీ రూ.38 లక్షలకు చేరుకుంది.తేజకు శిక్షఓజీ టీమ్ పాలు సహా కొన్ని రేషన్ సామానును రాయల్ టీమ్‌కు ఇచ్చేందుకు తటపటాయించింది వచ్చీరావడంతోనే తనతో బోళ్లు తోమించారని అవినాష్ తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. దీంతో అతడికి హరితేజ, మణికంఠ సాయం చేశారు. ఆడుతూపాడుతూ బోళ్లన్నీ తోమేశారు. మరోవైపు టేస్టీ తేజ కూర్చోవడంతో కుర్చీ విరిగిపోయింది. బిగ్‌బాస్ ప్రాపర్టీ ధ్వంసం చేసిన పాపానికి కాసేపు అతడు కుక్కలా నటించాడు.మణికంఠను టార్గెట్ చేశావ్..తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రాయల్ టీమ్‌కు మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. మొదటగా హరితేజ.. గ్రూపిజం చేస్తున్నావు, మణికంఠను టార్గెట్ చేశావంటూ యష్మిని నామినేట్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావ్, సొంతంగా ఆడటం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. గౌతమ్.. నీ గేమ్ వదిలేసి వేరొకరి వెనకాల పడుతున్నావంటూ విష్ణుప్రియను, మణికంఠపై ప్రతీకారం తీర్చుకోవడం బాగోలేదని యష్మిని నామినేట్ చేశాడు. మణిని టార్గెట్ చేయడం వల్లే అతడికి సింపతీ వస్తోందని రాయల్ టీమ్ హింటిస్తోంది. కానీ దాన్ని యష్మీ అర్థం చేసుకోలేకపోయింది.మెహబూబ్ సిల్లీ నామినేషన్స్నయని వంతురాగా.. నీకసలు సీరియస్‌నెస్, ఇంట్రస్ట్ లేదంటూ విష్ణు మెడలో నామినేటెడ్ బోర్డు వేసింది. సీత మెడలోనూ బోర్డు వేస్తూ.. నామినేట్ చేయడం దేనికి? బయటకు వెళ్లిపోతుంటే ఏడ్వడం దేనికని ఆమె ఎమోషన్‌ను ప్రశ్నించింది. మెహబూబ్ వంతురాగా.. నువ్వు నాతో సరిగా మాట్లాడలేదంటూ సీతను నామినేట్ చేశాడు. మా రాకను జీర్ణించుకోలేకపోతున్నారంటూ యష్మి మెడలో బోర్డు వేశాడు. తేజ మాట్లాడుతూ.. చీఫ్‌గా ఫెయిలయ్యావంటూ సీతను నామినేట్ చేశాడు. ఒక్కో పాయింట్ కూడా తూటామణికంఠ మెడలో బోర్డు వేస్తూ కరెక్ట్ పాయింట్లు చెప్పాడు. 1. ఎప్పుడు చూసినా నీ గోడు చెప్పుకుంటూనే ఉంటావ్.. అది నీ గేమా? 2. సీత నీకు ఫ్రెండ్ అన్నావ్, కానీ బిగ్‌బాస్ అడిగినప్పుడు నబీల్, విష్ణు పేర్లు మాత్రమే చెప్పావ్, అంటే సీత నీ ఫ్రెండ్ కాదా? 3. తన ఫుడ్ వస్తే తీసుకోవద్దని పృథ్వీ మరీ మరీ చెప్పాడు, అయినా సరే యష్మిది పక్కనపెట్టి మరీ అతడికే ఫుడ్ తీసుకెళ్లావ్.. దీన్నెలా అర్థం చేసుకోవాలంటూ మణికంఠను నామినేట్ చేశాడు. యష్మి సైకోయిజం!ఈ నామినేషన్ జరుగుతున్నప్పుడు యష్మి ఆనందం అంతా ఇంతా కాదు. చప్పట్లు కొట్టి మరీ సంతోషించింది. మణికంఠ ఎప్పటిలాగే తడబడకుండా సమాధానాలిచ్చాడు. పదేపదే ఏడ్వడం మానుకుంటున్నానని, సీత ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాదని, మదర్ సెంటిమెంట్ వల్లే పృథ్వీకి ఫుడ్ ఇచ్చానని మూడింటికీ ఆన్సరిచ్చాడు. మిగతావారి నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లో ప్రసారం కానుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: పదమూడోవారం తేజ ఎలిమినేట్
తింటూ కూడా ఫేమస్ అవొచ్చని నిరూపించాడు టేస్టీ తేజ. హోటల్ ప్రమోషన్స్‌తో మొదలైన ఇతడి ప్రయాణం సినిమా ప్రమోషన్స్ వరకూ చేరుకుంది. తేజ అసలు పేరు తేజ్‌దీప్. తెనాలో పుట్టిపెరిగిన ఇతడు 2017లో సాఫ్ట్వేర్ ఉద్యోగం హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. చిన్నప్పటినుంచి నటన, సినిమాలంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసొచ్చాయి. 2020లో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు.ఆ వీడియో యూట్యూబ్‌లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్‌గా బిజీ అయిన తేజ సినిమాల్లోనూ కనిపించాడు. తర్వాత బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్‌లో ఉన్నాక షోకి టాటా బైబై చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తల్లిని ఎలాగైనా హౌస్‌లోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో వచ్చాడు. ఆ కల నెరవేర్చుకుని పదమూడోవారంలో ఎలిమినేట్ అయ్యాడు. -
బిగ్‌బాస్ 8 రీలోడ్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ.. వాటే ట్విస్ట్
గత ఏడు సీజన్లకంటే కూడా ఈసారి బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు అత్యధిక టీఆర్పీ వచ్చింది. కానీ కంటెస్టెంట్లు ఆ రేటింగ్‌ను అలాగే కాపాడుకోలేకపోయారు. నెమ్మదిగా షో బోరింగ్‌గా మారుతుండటంతో బిగ్‌బాస్ ఇక లాభం లేదనుకుని పాత సీజన్లలో పాల్గొన్న పలువురినే వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట హౌసులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం.. 'బిగ్‌బాస్ గ్రాండ్ రీలోడ్' పేరిట ఎపిసోడ్ ప్రసారమైంది. ఇంతకీ హౌస్‌లోకి వచ్చిందెవరో చూసేయండి..నైనిక ఎలిమినేట్'జవాన్' టైటిల్ సాంగ్, 'గేమ్ ఛేంజర్' నుంచి రీసెంట్గా రిలీజైన 'రా మచ్చా' పాటలకు స్టెప్పులేసి ఆదివారం ఎపిసోడ్‌కి హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ, విష్ణుప్రియ, నైనికని నిలబెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఎలా ఎదుర్కోబోతున్నారో ఎదుర్కోబోతున్నారని హౌస్‌మేట్స్‌ను అడగ్గా వారంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నైనిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో సీత ఎప్పటిలాగే కన్నీటి కుళాయిని ఓపెన్ చేస్తూ బోరున ఏడ్చేసింది.ఎవరికి ఏ ట్యాగ్?స్టేజీపైకి వచ్చిన నైనికని హౌసులో ఎవరు ఎలాంటి వారనేది నాగ్ అడగ్గా.. ప్రేరణ మ్యానిప్యులేటర్, మణికంఠ వెన్నుపోటు పొడిచే వ్యక్తి, విష్ణుప్రియ నకిలీ స్నేహితురాలు, పృథ్వీ అటెన్షన్ సీకర్, నబీల్ అవకాశవాది, సీత నిజమైన ఫ్రెండ్, నిఖిల్ గేమ్ ఛేంజర్, యష్మిది మంద బుద్ధి అని చెప్పుకొచ్చింది.ఉత్తరాలు వచ్చాయ్..ఈ వారం హౌస్మేట్స్ కోసం ఉత్తరాలు వచ్చాయి. కానీ అవి కొందరికి అందకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. వాటిని నాగ్ తిరిగి తీసుకొచ్చాడు. సీత, నబీల్, యష్మి, మణికంఠ తమ లెటర్స్ అందుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్‌లో ఉన్న ఎనిమిది మంది ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్) టీమ్‌గా, కొత్తగా వచ్చే ఎనిమిది వైల్డ్ కార్డ్స్ రాయల్ టీమ్‌గా ఉంటాయని నాగ్ వెల్లడించాడు.. తొలి వైల్డ్ కార్డ్‌గా హరితేజసీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది. యాక్టింగ్, యాంకరింగ్ రెండింట్లోనూ ఆరితేరిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తనకు నవదీప్.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో పంపించారు. అలానే హౌసులోకి వెళ్లేముందు స్టేజీపైకి హరితేజ కూతురుని తీసుకురావడంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.రెండో వైల్డ్ కార్డ్‌గా టేస్టీ తేజతేజ అసలు పేరు తేజ్‌దీప్. తెనాలో పుట్టిపెరిగిన ఇతడు 2017లో సాఫ్ట్వేర్ ఉద్యోగం హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. చిన్నప్పటినుంచి నటన, సినిమాలంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసొచ్చాయి. 2020లో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. ఆ వీడియో యూట్యూబ్‌లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్‌గా తిండి వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. అలా బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్‌లో ఉన్నాక షోకి టాటా బైబై చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అమ్మ చేసిన పాల తాళికలను నాగార్జున కోసం తీసుకొచ్చాడు. అలానే తేజకి శోభాశెట్టి బెస్ట్ విషెస్ చెప్పింది.మరో రూ.20 లక్షలుసెట్పైకి వచ్చిన స్వాగ్ టీమ్ (శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగార్కర్) తన సినిమా కబుర్లు చెప్పింది .తర్వాత హౌస్‌లోకి వెళ్లి హౌస్మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్‌తో గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు హరి-తేజ గెలిచి రూ.20 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అనంతరం మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నయని పావని హౌస్‌లో అడుగుపెట్టింది.మూడో వైల్డ్ కార్డ్‌గా నయని పావనిఈమె అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్ స్టార్‌గా ఫేమస్. షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. అయితే నయని నెక్స్ట్ సీజన్లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఇక శివాజీ.. నయనికి బెస్ట్ విషెస్ చెప్పాడు.నాలుగో వైల్డ్ కార్డ్‌గా మెహబూబ్డ్యాన్స్, యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.అలా తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగుపెట్టిన టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఇక మెహబూబ్ కోసం సొహైల్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలానే నాలుగో సీజన్లో ఎలా అయితే ఆడావో ఈసారి అంతకు మించి ఆడి గెలవాలన్నాడు.'జనక అయితే గనక' మూవీ ప్రమోషన్లో భాగంగా సుహాస్, దిల్ రాజ్ టీమ్ వచ్చారు. సుహాస్, హీరోయిన్ సంగీర్తన హౌసులోకి వెళ్లి ఓజీ, రాయల్ టీమ్స్‌తో గేమ్ ఆడించారు. ఇందులో గెలిచిన సీత-మణికంఠ.. బెడ్ రూమ్, రేషన్ కంట్రోల్ చేసే అధికారాన్ని సొంతం చేసుకున్నారు.ఐదో వైల్డ్ కార్డ్‌గా రోహిణిఒకప్పుడు సీరియల్స్‌లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. తన కామెడీ టైమింగ్స్‌తో అందరికీ వినోదాన్ని పంచుతోంది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్‌పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపిస్తోంది. బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న రోహిణి.. మరోసారి ఈ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక శివజ్యోతి.. రోహిణి కోసం స్పెషల్ వీడియో పంపింది. హౌసులో కామెడీ లోటు బాగా ఉందని, దాన్ని ఫుల్ ఫిల్ చేయాలంది.ఆరో వైల్డ్ కార్డ్‌గా గౌతమ్ కృష్ణగౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్‌బాస్ ఏడో సీజన్‌తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.బాలీవుడ్‌లోనూ సిద్దూ: ది రాక్‌స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్లో సీక్రెట్ రూమ్‌కు వెళ్లాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేకపోయాడు. తాజాగా మరోసారి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.ఏడో వైల్డ్ కార్డ్‌గా అవినాష్ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్‌గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్‌బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.ఆర్థిక అవసరాల వల్ల స్నేహితుల సాయం తీసుకుని మరీ ఆ డబ్బు కట్టేసి బిగ్‌బాస్‌కు వెళ్లాడు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్‌లో ఉండి ఎంటర్టైనర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడికి శ్రీముఖి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అలానే స్టేజీపై మణికంఠ, నబీల్, విష్ణుప్రియలా యాక్ట్ చేసి నవ్వించాడు.ఎనిమిదో వైల్డ్ కార్డ్‌గా గంగవ్వవయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్లో అడుగుపెట్టింది. స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్‌బాస్ 8లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.రాయల్ టీమ్‌కు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ టీమ్‌కు చివరగా మరో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ నుంచి అవినాష్, గంగవ్వ ఆడారు. ఓజీ టీమ్‌పై వీరు విజయం సాధించడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఈ వారం ఇమ్యూనిటీ లభించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టేస్టీ తేజ కొత్త బిజినెస్.. రేపే షురూ
టేస్టీ తేజ.. యూట్యూబర్. అతడి పేరులోనే తను చేసే పనేంటో అర్థమవుతోంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి హోటల్ ప్రమోషన్స్ చేసేవాడు. జబర్దస్త్‌లోనూ ఛాన్స్ సంపాదించుకున్నాడు. తర్వాత తన పాపులారిటీ పెరిగి సినిమా ప్రమోషన్స్ సైతం చేశాడు. మొన్నామధ్య బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌కు సైతం వెళ్లివచ్చాడు. నాలుగైదు సినిమాల్లోనూ నటించినట్లు తెలుస్తోంది తాజాగా తేజ ఓ కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నాడు. ఇరానీ నవాబ్స్ పేరిట ఛాయ్ హోటల్ పెడుతున్నట్లు వెల్లడించాడు. 'నేను కొత్తగా ఓ ప్రయాణం మొదలుపెడుతున్నాను. ఈ ప్రయాణంలో నాతోపాటు మీరు.. మనందరం కలిసి ఎదుగుదాం, సాధిద్దాం.. సంపాదిద్దాం..' అంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఏప్రిల్ 6న ఉప్పల్‌లో చాయ్ బిజినెస్ మొదలుపెడుతున్నట్లు పేర్కొన్నాడు. ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ ఔట్లెట్ ఓపెనింగ్‌కు బిగ్‌బాస్ ఫేం అమర్దీప్ ముఖ్య అతిథిగా హాజరవనున్నాడు. ఎవరీ తేజ తేజ అసలు పేరు కల్లం తేజ్‌దీప్. తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, ఆదిలక్ష్మి. హైస్కూలు వరకు తెనాలిలో చదివి తర్వాత విజ్ఞాన్ యూనివర్శిటీలో ఇంటర్, బీటెక్, ఎంటెక్ చేశాడు. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగంతో 2017లో హైదరాబాద్ వెళ్లాడు. వీకెండ్లో ఫుడ్ వీడియోలు చేసి పాపులర్ అయ్యాడు. View this post on Instagram A post shared by Irani Nawabs (@iraninawabs) చదవండి: OTT: నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం -
వాలెంటైన్స్ డే సందర్భంగా ‘6th జర్నీ’ నుంచి లవ్ సాంగ్
పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా ‘ఆకాశంలోని చందమామ’ అనే సాంగ్‌ను విడుదల చేశారు. మూవీకి ఎం.ఎన్.సింహ సంగీత సారథ్యం వహింస్తున్నారు. రామారావు మాతుమూరు రాసిన ఈ పాటను హరిచరణ్ ఆలపించారు. ఈ సందర్భంగా... దర్శకుడు బసీర్ ఆలూరి,నిర్మాత పాళ్యం రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా అరుణకుమారి ఫిలింస్ బ్యానర్లో రూపొందుతున్న ‘6జర్నీ’ మూవీ నుంచి ప్రేమికుల రోజు సందర్భంగా బ్యూటీఫుల్ లవ్ సాంగ్ ‘ఆకాశంలోని చందమామ..’ అనే పాటను విడుదల చేస్తున్నాం. ప్రేమ, థ్రిల్లింగ్ సహా అన్ని ఎలిమెంట్స్‌తో ‘6జర్నీ’ తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్రీకరణంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాలో రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి, అభిరాం, సంజయ్ ఆచార్య, జబర్దస్త్ చిట్టిబాబు తదితరులు నటించారు. బసీర్ అలూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. - పోడూరి నాగ ఆంజనేయులు -
'మీరు నాకు అన్యాయం చేశారు'.. ఆట సందీప్‌పై టేస్టీ తేజ పోస్ట్ వైరల్!
బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంతోమంది ఫేమస్ అవుతున్నారు. వారిలో చాలామంది సెలబ్రిటీలయ్యారు కూడా. అలానే ఈ ఏడాది సీజన్-7లో కొందరు సినీ ఇండస్ట్రీతో సంబంధంలేనివారు కూడా ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టగానే వారికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. అలాంటి వారిలో ఫేమస్ అయిన యూట్యూబర్, ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ. హౌస్‌లో అందరినీ అలరించిన టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అతనితో పాటు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న శుభశ్రీ రాయగురు, కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కూడా హోస్ నుంచి బయటకొచ్చేశారు. వీరంతా కలిసి బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లికి హాజరయ్యారు. అయితే వీరు ముగ్గురు కలిసి పెళ్లిలో సందడి చేశారు. డ్యాన్సులు చేస్తూ చిల్ అవుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే పెళ్లి వేడుకలో ఆటసందీప్, శుభశ్రీ కలిసి ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇది చూస్తూ పక్కనే ఉన్నా టేస్టీ తేజ వాళ్లద్దరి కెమిస్ట్రీని చూసి తట్టుకోలేకపోయారు. దీంతో వాళ్లిద్దరూ డ్యాన్స్ చేయడాన్ని చూస్తూ పక్కనే ఉన్న చెట్టుకు తల బాదుకుంటూ కనిపించారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఇది చాలా అన్యాయం సార్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇదంతా టేస్టీ తేజ సరదా కోసమే చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) -
ఆ ఒక్క ప్రశ్న అడగొద్దంటున్న తేజ.. ఇలా దొరికిపోయాడేంటి!
టేస్టీ తేజ.. సందీప్ మాస్టర్.. ఇద్దరూ హౌస్‌లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఎలిమినేట్ అయ్యాకే అసలు గొడవ మొదలైంది.. ఎనిమిది వారాలుగా నామినేషన్స్‌లోకి రాకుండా తనను తాను కాపాడుకుంటూ వస్తున్న సందీప్‌ను నామినేషన్స్‌లోకి లాక్కొచ్చాడు తేజ. దీంతో ఆ వారమే సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. దీన్ని ఆయన మనసులో పెట్టుకున్నాడు. అంతేకాదు, తేజ ఎలిమినేట్ అవుతున్నాడనగానే ఎగిరి గంతేశాడు. అందరినీ ఎలిమినేట్ చేస్తూ చివరకు తనే ఎలిమినేట్ అయ్యాడు అని సెటైర్లు కూడా వేశాడు. ఎవరు చెప్పేది నిజం? ఎవరు చెప్పేది అబద్ధం? అయితే సందీప్ మాస్టర్‌ను కావాలని నామినేట్ చేయలేదని, తనే అడిగి చేయించుకున్నాడని బిగ్‌బాస్ హౌస్‌లో కుండ బద్ధలు కొట్టి చెప్పాడు తేజ. అది అబద్ధం, నేనెందుకు అడిగి మరీ చేయించుకుంటానని ఆగ్రహించాడు సందీప్. ఈ విషయం దగ్గరే గొడవ మొదలైంది. వీరిద్దరిలో ఎవరు చెప్పేది నిజం? ఎవరు చెప్పేది అబద్ధం? అనేది అర్థం కాక అభిమానులు తల పట్టుకుంటున్నారు. తాజాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తేజకు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. సందీప్ మాస్టర్ నిన్ను అడిగి మరీ నామినేట్ చేయించుకున్నాడా? అని యాంకర్ అడిగాడు. తటపటాయించిన తేజ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు తేజ తటపటాయించాడు. 'హౌస్ లోపల ఏం జరిగిందనేది మీకు తెలియదు. దీని గురించి ఇప్పుడేం మాట్లాడదల్చుకోలేదు. సందీప్, నేను కలిసి ఈ విషయంపై ఓ వీడియో చేస్తాం' అంటూ ఆ ప్రశ్న దాటవేశాడు. తర్వాత ఏ ప్రశ్నలడిగినా టపీమని సమాధానాలు చెప్పుకుంటూ పోయిన తేజ ఈ ఒక్క విషయంపై మాత్రం మాట్లాడటానికే ఇష్టపడలేదు. దీంతో తప్పు తేజదేనా? అతడు కావాలనే అబద్ధం చెప్పి ఉంటాడా? అని అనుమానిస్తున్నారు జనాలు. సమాధానం చెప్పను అంటున్నాడంటే కచ్చితంగా తప్పు చేసినట్లే.. తేజ అడ్డంగా దొరికిపోయాడు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఓ టాస్కులో తనకు తెలియకుండానే గౌతమ్‌ను గట్టిగా కొట్టాడు తేజ. అందుకు అతడి ఇంటికి వెళ్లి మరీ గౌతమ్ పేరెంట్స్‌కు సారీ చెప్తానంటున్నాడు. చదవండి: తేజ తొమ్మిది వారాల్లో ఎంత సంపాదించాడంటే? -
తేజ ఎలిమినేట్.. వారికి రీ ఎంట్రీ ఛాన్స్
బిగ్ బాస్ సీజన్ - 7 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. 9 వారాల పాటు ఆటలొ కొనసాగిన ఆయన పాజిటివిటీని సంపాదించుకుని హౌస్ నుంచి వచ్చేశాడు. ఇలాంటి సమయంలో ఇప్పటికే 8 వారంలోనే ఎలిమినేట్ అయిన ఆట సందీప్ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందుకు వారు కొన్ని కారణాలను కూడా చెబుతున్నారు. ఎనిమిదో వారంలో సందీప్ నామినేషన్ లిస్ట్‌లోకి రావడానికి ప్రధాన కారణం తేజ అని తెలిసిందే.. అలా మొదటిసారి నామినేట్ కావడం ఆపై సందీప్ ఎలిమినేషన్ అవడం జరిగిపోయింది. అదే విధంగా తేజ ఎలిమినేషన్‌కు కారణం శివాజీ.. నామినేషన్ సమయంలో సందీప్ అంశాన్ని లేవనెత్తి తేజను నామినేట్ చేశాడు శివాజీ... ఇలా ఈ ముగ్గురి మధ్యనే గేమ్ నడిచింది. బిగ్ బాస్‌లో ఉన్నంత వరకు అమర్,శోభ బ్యాచ్‌లో సందీప్ ఉన్నాడు.. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా శివాజీ, పల్లవి ప్రశాంత్‌నే మెచ్చుకుంటూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదే సమయంలో అమర్,తేజ ఆట గురించి నెగటివ్‌గా మాట్లాడటం జరిగింది. ఇప్పటికే రతికా రోజ్‌కు రీ ఎంట్రీ అవకాశం ఇచ్చారు.. కానీ ఆమె అంతగా మెప్పించలేక పోయింది. దీంతో సందీప్‌కు ఉల్టాపుల్టా పేరుతో రీ ఎంట్రీ అవకాశం కల్పించాలని బిగ్‌బాస్ టీమ్ కూడా యోచిస్తుందట. అప్పుడు సందీప్ శివాజీ టీమ్ వైపు ఉంటాడా..? అమర్ బ్యాచ్ వైపు ఉంటాడా..? అనే విశయంలో రసవత్తరం మొదలౌతుంది. అన్నీ అనుకూలిస్తే మరో రెండు రోజుల్లో సందీప్ రీ ఎంట్రీ గ్యారెంటీ అని సమాచారం. బిగ్ బాస్‌లో సంచాలక్‌గా మాత్రమే ఆయన కొన్ని తప్పులు చేశాడు కానీ ఆటలో ఎక్కడా కూడా సహనం కోల్పోలేదు.. ఎలాంటి నెగటివ్ లేకుండా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. -
తేజ అవుట్.. తను లేకుండా ఉండలేనంటూ శోకమందుకున్న శోభ
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆల్రెడీ లీకవడంతో ఎపిసోడ్లో పెద్ద పస లేకుండా పోయింది. అయితే అటు తేజ కన్నా రతిక తానెక్కడ ఎలిమినేట్ అవుతుందోనని తెగ భయపడిపోయింది. ప్లీజ్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అని నాగ్‌ను అర్థించింది. ఇంతలో తేజ ఎలిమినేట్ అనడంతో ఊపిరి పీల్చుకుంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి(నవంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన.. నాగార్జున కొన్ని సామెతలను ఇచ్చి అది ఎవరికి బాగా సూటవుతుందో చెప్పాలన్నాడు. భోలె షావళి.. అమర్ది కుక్క తోక వంకర అన్నాడు. అమర్.. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అనే బోర్డును అశ్విని మెడకు తగిలించాడు. ప్రశాంత్ ఏకులా వచ్చి మేకులా తగిలాడన్నాడు అర్జున్. ఇక తేజ ఏమీ లేని ఆకులా ఎగిరెగిరిపడతాడని చెప్పాడు ప్రశాంత్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత అశ్వినికి బాగా సూటవుతుందని అభిప్రాయపడింది ప్రియాంక. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? భోలె షావళి.. ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న అని పేర్కొంది రతిక. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అనేది రతిక విషయంలో నిజమైందన్నాడు గౌతమ్. పొరుగింటి పుల్లకూర రుచి అనే బోర్డు భోలెకు వేశాడు తేజ. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమనే బోర్డు శివాజీకి వేశాడు ప్రిన్స్ యావర్. వేలు ఇస్తే చేయి గుంజినట్లు అనే బోర్డును ప్రియాంక మెడలో వేసింది అశ్విని. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? అనే సామెత తేజకు పర్ఫెక్ట్గా సూటవుతుందన్నాడు శివాజీ. ఇటు రా అంటే ఇల్లంత నాదే అన్నట్లుగా తేజ ప్రవర్తిస్తాడంది శోభ. ఎలిమినేషన్ భయంతో ఏడ్చేసిన రతిక తర్వాత జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్ర యూనిట్ రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. వీరు హౌస్‌మేట్స్‌తో హుక్ స్టెప్ గేమ్ ఆడించి వెళ్లిపోయారు. తర్వాత తెలుగమ్మాయి ఈషా రెబ్బ హౌస్‌లోకి వెళ్లి పీరియడ్స్ సమస్యల గురించి మాట్లాడి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అనంతరం నాగ్ అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరగా రతిక, తేజ మాత్రమే మిగిలారు. ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానోనని రతిక తెగ ఏడ్చేసింది. చివరకు తేజ ఎలిమినేట్ అనగానే రతికకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఇక తేజ ఏడవకూడదనుకుంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. శోభకు ఎక్కువ మార్కులిచ్చిన తేజ ఇక్కడ మరో విషయం ఏంటంటే.. తేజ కంటే శోభ ఎక్కువ ఏడ్చింది. అందరికీ వీడ్కోలు పలికేముందు హౌస్‌మేట్స్‌కు మార్కులు ఇచ్చాడు తేజ. శోభకు పదికి 20 మార్కులిచ్చాడు. గౌతమ్‌కు 8, అర్జున్‌కు 8 మార్కులిచ్చాడు. ప్రిన్స్ యావర్‌కు 10, భోలె షావళికి 7మార్చులిచ్చాడు. ఆటపరంగా ఓకే కానీ మాటతీరు మార్చుకోవాలంటూ అశ్వినికి 8 ఇచ్చాడు. ఓటమిని తీసుకోలేడంటూ ప్రశాంత్‌కు 9, వంటలక్క ప్రియాంకకు 10, అమర్‌దీప్‌కు 9, శివాజీకి 8, రతికకు 5 మార్కులిచ్చాడు. అంటూ ఏడుపందుకున్న శోభ సెలవు తీసుకోవడమే ఆలస్యం అనుకునే సమయానికి శోభ మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది. ఇక్కడ నువ్వు లేకుండా ఎలా ఉండాలో తెలియట్లేదు, భయమేస్తోంది తేజ అంటూ శోకమందుకుంది. నీతో ఒక్కరోజు మాట్లాడకుండా ఉన్నందుకే ఏదోలా ఉంది.. అలాంటిది నువ్వు లేకుండా హౌస్‌లో చాలా రోజులు ఉండాలంటే భయమేస్తోంది అని కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌లో ఉన్నప్పుడు నువ్వెవరు? అంటూ గడ్డిపోచ కన్నా హీనంగా చూసిన శోభ తనకోసం ఏడుస్తున్నందుకు సంతోషపడాలా? బాధపడాలా? తెలియని అయోమయంలో ఉన్న శోభ ఎప్పటిలాగే చిరునవ్వుతో వీడ్కోలు తీసుకున్నాడు. చదవండి: తొమ్మిది వారాల్లో తేజ అంత సంపాదించాడా? ఎలిమినేషన్‌కు కారణమిదే! -
బిగ్‌బాస్ 7: తొమ్మిది వారాలకు తేజ ఎంత సంపాదించాడంటే?
టేస్టీ తేజ.. పేరుకు తగ్గట్లే భోజన ప్రియుడు.. కాదు కాదు, భోజన ప్రియుడు కాబట్టే ఆ పేరు పెట్టుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లోనూ తన పేరుకు న్యాయం చేస్తూ గుడ్లు దొంగతనం చేస్తూ, స్ప్రైట్ల కోసం కక్కుర్తి పడేవాడు. ఈ పోరాటం ఏదో ఆటలో కూడా చూపిస్తే ఇంకొన్నాళ్లు ఉండేవాడు. కానీ, అన్నింటినీ లైట్ తీసుకుంటూ పోయే తేజను చూసి జనాలు కూడా లైట్ తీసుకున్నారు. అందుకే ఈవారం అతడిని బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు పంపించారు. గొప్పగా ఆడకపోవచ్చు. కానీ.. నిజానికి తేజ మరీ తొమ్మిది వారాలదాకా ఉంటానని అనుకోలేదట. ఏదో నాలుగువారాలు ఉండిపోదాంలే అనుకున్నాడట. కానీ తొమ్మిదివారాల దాకా ప్రేక్షకులు తనను హౌస్‌లో ఉంచడంతో తనను తనే నమ్మలేకపోతున్నాడు. నిజంగానే తేజ గొప్పగా ఆడకపోవచ్చు. కానీ కడుపుబ్బా నవ్వించాడు. అందరితోనూ కలుపుగోలుగా ఉన్నాడు. చిన్నపాటి గొడవలు జరిగినా సర్దుకుపోయే మనస్తత్వం తనది. అదే సమయంలో పుల్లలు పెట్టి అందరి మధ్య చిచ్చు పెట్టే నారదుడు కూడా! భలే సేఫ్‌గా ఆడేవాడు.. ఒకరి మాటను మరొకరికి చెప్పి వాళ్ల మధ్య అగ్గి రాజేసేవాడు. కొన్నిసార్లు అవతలి వారు ఏమీ అనకపోయినా నిన్నిలా అన్నారు, ఆ మాటన్నారు.. అని లేనిపోనివి చెప్పి కారాలు, మిరియాలు నూరేవాడు. కొన్నిసార్లు అడ్డంగా బుక్కయ్యాడు కూడా! నామినేషన్స్‌లోనూ భలే సేఫ్‌గా ఆడేవాడు. ఎదుటివారిని నొప్పించకుండా తను డేంజర్ జోన్లోకి రాకుండా విశ్వప్రయత్నాలు చేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను నామినేషన్స్‌లోకి పంపించేవాడు. రెమ్యునరేషన్ ఎంతంటే? అలా అతడు నామినేట్ చేసినవాళ్లు కొందరు ఎలిమినేట్ అయ్యారు కూడా!. కానీ ఈ వారం తేజ ఎలిమినేషన్ కత్తికి బలైపోయాడు. తొమ్మిది వారాలు హౌస్‌లో ఉన్న అతడు బాగానే వెనకేశాడు. వారానికి దాదాపు రూ.1.75 లక్షల మేర తీసుకున్నాడట. ఈ లెక్కన తొమ్మిది వారాలకుగానూ రూ.15 లక్షల పైనే వెనకేసినట్లు తెలుస్తోంది. -
బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్
మూడో వారంలో దామిని.. నాలుగో వారంలో రతిక.. ఐదో వారంలో శుభ శ్రీ.. ఆరో వారంలో నయని.. ఏడో వారంలో పూజా.. ఎనిమిదో వారంలో సందీప్.. ఇలా మూడో వారం నుంచి ఎనిమిదవ వారం వరకు వరుసగా తేజా ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోతూ వస్తున్నారు. అయితే వరుసగా అందర్ని బయటకు పంపిన తేజ.. ఇప్పుడు తనే బయటకు వచ్చేశాడు. అయితే ఇప్పటికీ అధికారికంగా తెలియదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం నామినేషన్లో శివాజీ, గౌతమ్, ప్రశాంత్, అశ్విని మినహా మిగతా అందరూ ఉన్నారు. ప్రతి వారం మాదిరే ఈ వారంలో కూడా శోభా ఎలిమినేట్ అవతుందని అందరూ భావిస్తున్న సమయంలో ఆమె కెప్టెన్ కావడంతో సస్పెన్స్ మొదలైంది. కెప్టెన్ పేరుతో శోభ సేవ్ అయితే.. టేస్టీ తేజ ఎలిమినేట్ కావడం దాదాపు గ్యారెంటీ అని తెలుస్తోంది. దీంతో తేజ గురించి పలు మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని ఆట సందీప్ షేర్ చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి వారం నుంచి ఇప్పటివరకు తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోయారనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు తేజ నామినేట్ చేసిన ఆరుగురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ లిస్ట్‌లో వరుసుగా దామిని భట్ల,రతికా రోజ్, శుభ శ్రీ, నయని పావని, పూజా,ఆట సందీప్ ఉన్నారు. ఇలా మూడో వారం నుంచి వరుసగా తేజా ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ కావడంతో ఆయనది ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఇలా అందరినీ హౌస్ నుంచి బయటకు పంపిన తేజా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంపై ఆట సందీప్, తేజ గురించి పలు మీమ్స్ ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్నింటిని సందీప్ షేర్ చేశాడు. 'కర్మ ఇట్స్ బ్యాక్.. హౌస్‌లో మంచి ప్లేయర్ అయిన సందీప్‌ను చెత్త కారణాలతో పంపించేశావ్.. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి చెత్త రీజన్‌తో బయటకు వస్తున్నావ్..' అంటూ సందీప్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అవన్నీ కూడా నవ్వులు పూయించేలా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by Anandani Evaru Koorukoru...🤔 (@anandani_evaru_koorukoru) -
బిగ్‌బాస్ 7: టేస్టీ తేజ అవుట్.. అతడి భయమే నిజమైంది!
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 12 మంది మిగిలారు. వీరిలో శివాజీ, గౌతమ్, ప్రశాంత్, అశ్విని మినహా మిగతా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఈసారి ఎలిమినేషన్ గురిం శోభా మీదే ఉంది. నిజానికి ఆమె గతవారమే ఎలిమినేట్ అవుతుందని అంతా ఊహించారు. కానీ బిగ్‌బాస్ వారి అంచనాలను తలకిందులు చేస్తూ సందీప్‌ను పంపించేసి ఆమెను హౌస్‌లో ఉంచేశాడు. ఈసారి కూడా బిగ్‌బాస్ అదే ప్లాన్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తన కోసం మరో కంటెస్టెంట్‌ను బలి చేస్తున్నారట.. ఇంతకీ ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు.. శోభా జిగిరీ దోస్త్ టేస్టీ తేజ. ఎలిమినేషన్స్ అంటేనే బెంబేలెత్తిపోతాడు తేజ. ఎవరైనా నామినేట్ చేస్తే నేనే పాపం చేశాను? నన్నెందుకు నామినేట్ చేశారు? అన్నట్లుగా అమాయకంగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. కానీ ఇతడు మాత్రం వేరేవాళ్లను చెత్త కారణాలతో నామినేట్ చేస్తుంటాడు. నిద్రపోతున్న తనమీద నాలుగు చుక్కల నీళ్లు చిలకరించిందని పూజాను నామినేట్ చేసి తనను బయటకు పంపించేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్, నామినేషన్స్‌లోకి వస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.. అదీ ఇదీ అంటూ సందీప్ మాస్టర్‌ను ఆకాశానికి ఎత్తేసి అవతలకు తోసేశాడు. నామినేషన్స్‌లో సిల్లీ రీజన్స్ చెప్పొద్దు అని అందరూ మొత్తుకున్నా తేజ తన తీరు మార్చుకోలేదు. గతవారం సందీప్‌ను ఏ కారణంతో అయితే నామినేట్ చేశాడో అదే కారణంతో అర్జున్ను నామినేట్ చేశాడు. ఇలా సిల్లీ రీజన్స్ వద్దని వార్నింగ్ ఇస్తూ తేజను నామినేట్ చేశాడు శివాజీ. అప్పటినుంచి ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానోనని భయంతో వణికిపోతున్నాడు తేజ. చివరకు అతడు అనుకున్నట్లే జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో టేస్టీ తేజ ప్రయాణం ముగిసినట్లు తెలుస్తోంది. ఒకరకంగా శోభ కోసం తేజ ఎలిమినేట్ అయిపోయాడు! చదవండి: శివాజీ వారిని చెడగొడుతున్నాడు.. మానస్ -
వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అమర్‌పై మళ్లీ విషం కక్కిన శివాజీ
కెప్టెన్ గౌతమ్ హౌస్‌లో కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఈ వారం ఆడపిల్లలు పనే చేయక్కర్లేదని బంపరాఫర్ ఇచ్చాడు. ఇంకేముంది.. లేడీ కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. అటు నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో కెప్టెన్సీ కంటెండర్ రేసు మొదలుపెట్టాడు బిగ్‌బాస్. మరి నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి.. మళ్లీ విషం కక్కిన శివాజీ బద్దకస్తుడైన తేజ శవాసనం వేస్తూ నేలకు అతుక్కుపోయాడు. ఇది గమనించిన బిగ్‌బాస్ తేజకు ఏదైనా శిక్ష వేయమని కెప్టెన్‌ను ఆదేశించాడు. కెప్టెన్ గౌతమ్.. తేజ అమ్మాయిలా చీర కట్టుకోవాలని చెప్పాడు. ఇంకేముంది, శోభ.. అతడికి చీర కట్టి రెడీ చేసింది. ఇదే అదను అనుకున్న తేజ.. అందరు అమ్మాయిలకు హగ్గులిచ్చుకుంటూ పోయాడు. ఇక పెద్దమనిషిని అని చెప్పుకునే శివాజీ ఎప్పటిలాగే అమర్‌పై విషం చిమ్మాడు. వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ప్రతి సీజన్లో అందరూ కలిసి ఒకర్ని హీరోను చేస్తే ఈ సీజన్లో నన్ను విలన్‌ను చేశారు అని తనకు తానే అనుకున్నాడు అమర్. చాలెంజ్ విసిరిన బిగ్‌బాస్ తర్వాత బిగ్‌బాస్.. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఓ గేమ్ ఇచ్చాడు. ఇందుకోసం ఇంటిసభ్యులను రెండు టీమ్‌లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్‌లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా మిగిలినవారంతా గర్జించే పులులు టీమ్‌లో ఉన్నారు. మొదట బాల్స్ టాస్కు పెట్టాడు కానీ ఫలితాలను ప్రకటించలేదు. తర్వాత పవర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. చాలెంజ్ గెలిచిన టీమ్‌కు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. మొదటి చాలెంజ్కే రైతుబిడ్డ అవుట్ మొదట జంపింగ్ జపాంగ్ అనే చాలెంజ్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో వీరికి అవతలి టీమ్‌లో ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందరూ చర్చించుకుని ప్రశాంత్‌ను గేమ్ నుంచి సైడ్ చేశారు. తనను ఆటలో నుంచి పక్కకు తోసేయడంతో రైతుబిడ్డ కంటతడి పెట్టుకున్నాడు. శివాజీ తన చేతుల మీదుగా డెడ్ బోర్డును ప్రశాంత్ మెడలో వేశాడు. అయితే ప్రశాంత్ కంటే భోలె ఎక్కువ ఫీలైపోయాడు. ప్రియుడి కోసం ఏడ్చేసిన శోభ మరోవైపు శోభ తన ప్రవర్తన మీద తనే డౌట్ పడింది. బయట ఉన్న ప్రియుడిని ఉద్దేశిస్తూ.. వాడు నన్ను అర్థం చేసుకుంటాడంటావా? అని తేజతో కబుర్లాడింది. 'వాడు చాలా మెచ్యూర్డ్.. అర్థం చేసుకుంటాడు.. కానీ నమ్మకంతో పాటు భయం కూడా ఉంది. ఒకవేళ వాడికి నచ్చనట్లు ఏమైనా ప్రవర్తించానా? నీ విషయంలో వేరేలా ఉన్నాను. అది తనకు నచ్చకపోవచ్చేమో.. ఎవరికి తెలుసు? అయినా ఏమీ అవదనే అనుకుంటున్నాను. పొరపాటున ఏదైనా జరిగితే నేనసలు తట్టుకోలేను. వాడు బాగా గుర్తొస్తున్నాడు' అంటూ శోభ ఏడ్చేసింది. ఇక రేపటి ఎపిసోడ్లో మిగతా చాలెంజ్‌లు ఎవరు గెలిచారు? ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారనేది చూడాలి! చదవండి: లావణ్య మెడలో మూడు ముళ్లు వేసిన వరుణ్ తేజ్ -
తేజ నిజస్వరూపం బయటపెట్టిన సందీప్.. వెనకాల గోతులు తవ్వడం..
బిగ్‌బాస్ హౌస్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్నవారిలో టేస్టీ తేజ ముందు వరుసలో ఉంటాడు. బలమైన కారణాలు లేకుండా కంటెస్టెంట్లను ఊరికనే నామినేట్ చేస్తూ ఉంటాడు. అతడి హ్యాండ్ మహిమో, మరేంటో కానీ తను ఎవరినైతే నామినేట్ చేస్తున్నాడో వారు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. దామిని, రతిక, శుభశ్రీ రాయగురు, నయని పావని, పూజా మూర్తి, సందీప్.. ఇలా ఎవరో ఒకరు తేజ చేతిలో బలవుతూ వస్తున్నారు. ఇక సందీప్ స్ట్రాంగ్ ప్లేయర్ అని.. ఒక్కసారైనా నామినేషన్స్‌లోకి వస్తే తనకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని.. పాజిటివ్ వైబ్స్‌తో నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. కట్ చేస్తే సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. తేజ ప్రవర్తనకు బాధేసింది సందీప్ ఎలిమినేషన్‌కు ఒకరకంగా నువ్వే కారణమంటూ తేజను శివాజీ నామినేట్ చేశాడు. అయితే అప్పుడు తేజ ఓ మాటన్నాడు. సందీప్‌ను కావాలని నామినేట్ చేయలేదని, తనే అడిగి మరీ చేయించుకున్నాడని చెప్పాడు. దీనిపై ఆట సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజా ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నామినేషన్స్‌లో తేజ అలా మాట్లాడటం చూసి చాలా బాధపడ్డాను, అదే స్థాయిలో కోపం కూడా వచ్చింది. నేను హౌస్‌లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా నువ్వేం బాధపడకురా.. ఇంటికే వెళ్తున్నాను కదా అని పాజిటివ్‌గా మాట్లాడి హగ్ చేసుకున్నాను. తేజది ఐరన్ లెగ్! అలాంటిది నేను లేని సమయం చూసుకుని నామీద అబద్ధం చెప్పాడు. నేనే నామినేట్ చేయమని చెప్పానని అనడం తప్పు. తేజ చెప్పింది 100% ఫేక్. ఈ ఒక్క పాయింట్‌తో తనను బయటకు లాగేయొచ్చు. తేజది ఐరన్ లెగ్.. అందుకే బయటకు వచ్చేశాననుకుందాం. తేజ నామినేట్ చేసిన ఆరుగురు అలాగే వచ్చారు. సరే, జనాలు నన్ను బయటకు పంపించేశారనుకుందాం. కానీ, నేను అక్కడ లేనప్పుడు తను నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి నా గురించి అబద్ధం ఆడటం తప్పు. నామినేషన్స్‌లోనూ అదే వెటకారం నన్ను ఎలాగైతే నామినేట్ చేశాడో అర్జున్ను కూడా అలాగే వెటకారంగా నామినేట్ చేశాడు. నేను ఎలిమినేట్ అయినప్పుడు తేజ వెక్కివెక్కి ఏడ్చాడు. ఎప్పుడూ ఏడవని తేజ ఆ రోజు సోఫా మీద దొర్లి మరీ ఏడ్చాడు. ఎమోషన్స్ ఉండవన్న తేజ ఆ రోజు ఎంతగానో ఏడ్చాడు ఇప్పుడు నాకు ఎవరేంటనేది అర్థమవుతోంది. తనది సెల్ఫిష్ గేమ్.. ఇలా ఎవరి వెనకాల గోతులు తవ్వకూడదు' అని సందీప్ చెప్పుకొచ్చాడు. చదవండి: గౌతమ్ మాస్టర్ మైండ్.. రైతుబిడ్డ అవుట్.. ఏడ్చేసిన ప్రశాంత్ -
పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్
ఈ ఏడాది తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 కాస్తా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. గతేడాది నిరాశపర్చిన బిగ్‌బాస్ ఈసారి ఉల్టా-పుల్టా అంటూ సరికొత్తగా పరిచయం చేశారు. ఆ తర్వాత షో జరిగిన ఐదు వారాలకు బిగ్‌బాస్ 2.0 అంటూ మరోసారి ఆసక్తిని పెంచేశారు. ఐదుగురిని ఎలిమినేట్ అవ్వగా.. కొత్తగా అంతేమందిని హౌస్‌లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ షో ఎనిమిదో వారానికి చేరుకుంది. ఈ వారంలో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరిదశకు చేరింది. బిగ్‌బాస్ మారథాన్‌లో గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన వారిలో అర్హతలేని వ్యక్తి మెడలో మిరపకాయల దండ వేయమని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు సూచించాడు. (ఇది చదవండి: రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!) కాగా.. ఈ వారం బిగ్‌బాస్ మారథాన్‌లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఈ క్రమంలో కెప్టెన్ అయ్యేందుకు అర్హతలేని వ్యక్తుల మెడలో మిరపకాయల దండ వేసి వాళ్లను ఎలిమినేట్ చేయాలని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు సూచించాడు. ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయినందుకు ప్రశాంత్‌కు వ్యతిరేకంగా అమర్దీప్ ఓటు వేస్తున్నట్లు ప్రకటిస్తాడు. కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి పల్లవి ప్రశాంత్ ఎలిమిషన్ కోసం మొదట అమర్దీప్ ఓటేస్తాడు. 'పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలిరా నీకు అంటూ అమర్దీప్ అంటాడు. ఏదైన చెప్పినప్పుడు తొడ కొట్టేది, మీసాలు తిప్పేది, మేలేసేది, పక్కవాళ్లు నవ్వితే సంక గుద్దేది కాదు.. అంటూ ప్రశాంత్‌ను ఉద్దేశించి మాట్లాడతాడు. ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ.. ప్రశాంత్ నీవు ఇప్పటికే కెప్టెన్ అయ్యావ్ కాబట్టి.. మరోసారి నీకు అవసరం లేదంటూ ప్రశాంత్ మెడలో మిరపకాయల దండ వేస్తాడు. దీనికి ప్రశాంత్ బదులిస్తూ.. మీరంతా నాపై ఇలా దండలు వేస్తుంటే రైతులు పండించిన పంట పూలమాలలా ఉంది.'అని నవ్వుతూ చెబుతాడు. అలాగే ప్రియాంక మెడలో భోలే షావలి మిరపకాయల దండ వేసి ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశాడు. ఇక శోభకు వ్యతిరేకంగా రతిక, యావర్‌లు ఓటేస్తారు. ఈ క్రమంలో శోభ, యావర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యావర్‌ను పిచ్చోడు అంటూ శోభ మాట్లాడటంతో ఆమెపై ఫైర్ అవుతాడు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఆ తర్వాత అశ్విని మాట్లాడుతూ.. ప్రశాంత్‌కు ఓటేయడానికి ఇక్కడున్న వారికి ఎవరికీ అర్హత లేదని అంటుంది. ఇది విన్న టేస్టీ తేజ ఆమెపై ఫైర్ అవుతాడు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? అని ప్రశ్నిస్తాడు. నేను అపోజిట్‌లో ఉన్నంత వరకు కెప్టెన్ అయినోన్ని ఇంకోసారి అవ్వనివ్వనని అమర్దీప్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు చూస్తే కెప్టెన్ ఎవరు అవుతారనే విషయంపై మరింత ఆసక్తి కలుగుతోంది. మరి ఇంటి సభ్యుల మనసు గెలుచుకుని ఈ వారం కెప్టెన్‌గా ఎవరు నిలిచారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే! -
రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ అనేది అమృతం కన్నా ఎంతో విలువైనది. కెప్టెన్సీ వస్తే ఒక వారం పాటు ఇమ్యూనిటీ లభించినట్లే! ఈ లెక్కన ఆ వారమంతా ఏ పనీ చేయనక్కర్లేదు, నామినేషన్స్ ఉండవు, ఎలిమినేషన్ భయమే లేదు. పైగా తన మాటే శాసనం అన్నట్లుగా కెప్టెన్ ఏది చెప్తే అదే నడుస్తుంది. అందుకే కెప్టెన్ అవ్వాలని కంటెస్టెంట్లు తహతహలాడిపోతుంటారు. కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెండర్లను ఎంపిక చేసేందుకు బిగ్‌బాస్ బీబీ మారథాన్ పోటీ పెట్టాడు. మరి ఈ మారథాన్‌లో ఏం జరిగింది? ఎవరు కంటెండర్లుగా నిలిచారు? అనేది తాజా(అక్టోబర్ 26) ఎపిసోడ్లో చూసేద్దాం.. నీటితో గేమ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఈ ఎపిసోడ్లో ముందుగా స్టోర్ ఇట్.. పోర్ ఇట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా షవర్ నుంచి వచ్చే నీళ్లను తలపై స్పాంజిలో నింపుకుని తమ కంటైననర్లో పిండుకోవాలి. ఈ గేమ్‌లో అర్జున్, అశ్విని, సందీప్, భోలె షావళి ఆడారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో అర్జున్ తోసేయడంతో అశ్విని కిందపడిపోయింది. ఇక బజర్ మోగిన ప్రతిసారి కంటైనర్‌లో తక్కువ నీళ్లు ఉన్నవారు అవుట్ అవుతారు. మొదట భోలె అవుట్ కాగా అతడు తన కంటైనర్‌లోని నీటిని అశ్వినికి ఇచ్చేశాడు. ఇద్దరి త్యాగాలు.. గెలిచిన సందీప్ తర్వాతి రౌండ్లో అశ్విని అవుట్ కాగా ఆమె తన నీటిని సందీప్ మాస్టర్‌కు ఇచ్చేసింది. మూడో రౌండ్లో అర్జున్ ఎంత కష్టపడ్డా సందీపే గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత అమర్‌తో సందీప్ ముచ్చట్లు పెట్టాడు. అర్జున్ సీరియస్‌గా ఆడుతున్నాడని, తను తోసేశాడని ఆరోపించాడు. ఎక్కడ కొడితే ఎక్కడ నొప్పి వస్తుందో నాకూ తెలుసు. నా మోచేయి చాలు తన హైట్‌కు.. అంటూ ఏదేదో మాట్లాడాడు. ఇక అర్జున్ తను గేమ్ ఆడేటప్పుడు ఎవరూ తనకు సపోర్ట్ చేయలేని తెగ ఫీలైపోయాడు. ఇంతకుముందు నో మాస్టర్ అనేవాళ్లు, ఇప్పుడు మాస్టర్ మాస్టర్ అంటున్నారనగానే శివాజీ.. అవన్నీ గచ్చిబౌలి స్ట్రాటజీస్ అంటూ చులకనగా మాట్లాడాడు. అక్కా అనొద్దంటూ వెంటపడ్డ రతిక హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చిన రతిక వచ్చినప్పటినుంచి ఇంకా ఏ అలజడి సృష్టించకుండా ఉందేంటా? అనుకునేలోపు మళ్లీ మొదలెట్టేసింది. యావర్‌తో నిన్ను, శివనన్నని తప్ప హౌస్‌లో ఎవరినీ నమ్మను.. మనం ఇద్దరం ఒకే ప్లేట్లో తింటుంటే ప్రియాంక.. మనల్ని లవ్‌బర్డ్స్ అందట. నీ మనసులో, నా మనసులో ఏం లేదు. ఫ్రెండ్లీగా ఉన్నాం.. లవ్ కనెక్షన్ ఎట్లా వస్తుంది అని మాట్లాడింది. మరోవైపు ప్రశాంత్‌తో తనను అక్కా అనొద్దంటూ సతాయించింది. అతడికేమో ఆమె పెట్టిన టార్చర్ గుర్తొచ్చి ఏడుస్తూ అక్కా అనే పిలుస్తా అన్నాడు. ఆమె మాత్రం అందుకొప్పుకోలేదు. చివర్లో శివాజీ కలగజేసుకుని అక్కా అని పిలవనవసరం లేదు అంటూ తీర్పునిచ్చాడు. కంటెండర్‌గా గౌతమ్ కాసేపటికి ఎంప్టీ ద కంటైనర్ టాస్క్ ఇచ్చాడు. దీంతో శోభా.. నేను ఆడతా.. నన్ను ఆడనివ్వకపోతే ఎవరినీ ఆడనివ్వను.. నేను ఆడాల్సిందే అంటూ ఓరకంగా వార్నింగే ఇచ్చింది. దీంతో అర్జున్.. ఆమెతో పోరు పడలేక శివాజీ, అశ్విని, గౌతమ్‌లతో పాటు శోభాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో గౌతమ్ గెలిచాడు. ఓటమిని తీసుకోలేని శోభ ఏడుపు మొదలెట్టేసింది. తర్వాత తేజ-శోభలను బిగ్‌బాస్ ఆటపట్టించాడు. తేజను తిననివ్వకుండా ఎందుకంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావ్.. స్వయంగా మీరే రెండు చపాతీలు చేసి తేజకు తినిపించాలంటూ శోభకు పనిష్మెంట్ ఇచ్చాడు. దీంతో లవ్ సింబల్ షేప్‌లో చపాతీ చేసి తేజ వద్దంటున్నా అతడి వెనకాలే వెళ్తూ ముద్దలు తినిపించింది. ఎట్టకేలకు కంటెండర్‌గా శోభా ఇక చివరగా వేర్ ఇట్ అండ్ విన్ ఇట్ గేమ్ పెట్టాడు. మళ్లీ శోభా.. నేను ఆడతా.. అంటూ మళ్లీ మొదలుపెట్టింది. అర్జున్ ఏదో ఆలోచిస్తుంటే అలిగి వెళ్లిపోయింది. దీంతో అశ్విని, అర్జున్ త్యాగం చేసి తేజ, యావర్, శోభాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో తేజకు అమర్, శోభాకు ప్రియాంక, యావర్‌కు ప్రశాంత్ సపోర్ట్ చేశాడు. ఈ గేమ్‌లో శోభా అత్యధికంగా 72 దుస్తులేసుకుని విన్నర్‌గా నిలిచింది. ఈ వారం బీబీ మారథాన్‌లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
లవ్‌బర్డ్స్ శోభా-తేజ మధ్య గొడవ.. పుల్ల పెట్టిన శివాజీ!
బిగ్‌బాస్ 7లో ఈ వారం నామినేషన్ హడావుడి ముగిసింది. 8 మంది లిస్టులో ఉన్నారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులు షురూ చేశాడు. ఓ రెండు గేమ్స్ జరిగాయి. మరోవైపు హౌసులో ఇప్పటికే మాటలతో మాయ చేస్తూ బండి లాక్కొచ్చేస్తున్న శివాజీ.. శోభా-తేజ మధ్య పుల్లపెట్టి మంట ఎక్కువ చేస్తే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 52 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అతి చేస్తున్న శివాజీ నామినేషన్స్ పూర్తవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ స్టార్టయింది. ఇక అయిపోయిన నామినేషన్ గురించి శివాజీ ఏదేదో మాట్లాడాడు. 'నామినేషన్ అనేది తెలివైన ప్రక్రియ. కానీ ఆ టైంలో కారణాలు లేకుండా, కొందరు హీరో అయిపోదామని ఎగిరెగిరి పడుతున్నారు. ఈ ప్రక్రియని అపహాస్యం చేస్తున్నారు' అని సీరియల్ బ్యాచ్‌ని ఉద్దేశిస్తూ అన్నాడు. అయితే ఆ ఎగిరెగిరి పడేవాళ్లలో ప్రశాంత్ కూడా ఉన్నాడు. అంటే శివాజీ లెక్క ప్రకారం.. ప్రశాంత్‌కి కూడా ఈ కామెంట్ వర్తిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ కూడా నామినేషన్స్‌లో తప్ప మిగతా రోజులు గేమ్స్ ఆడినా సరే ఉన్నాడా లేడా అన్నట్లు పవర్తిస్తుంటాడు. కన్నీళ్లు పెట్టుకున్న శోభా స్ట్రాంగ్‌గా ఉండే శోభా కన్నీళ్లు పెట్టుకుంది. గత నామినేషన్స్‌లో భోలె మెంటల్ అనడాన్ని గుర్తుచేసుకుని మరీ తేజతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత కాసేపటికి తన ఫ్రెండ్స్ అయిన అమర్-ప్రియాంక-సందీప్ దగ్గర మాట్లాడుతూ.. భోలె ఓ వేస్ట్ కేండిడేట్ అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!) కెప్టెన్సీ గేమ్స్ షురూ ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు 'BB మారథాన్' పేరుతో పోటీ పెట్టనున్నారు. ఇందులో పెట్టే ఒక్కో గేమ్‌లో నలుగురు పోటీ పడతారు. ఇందులో గెలిచిన వాళ్లు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. చివరి స్థానంలో ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతారు. అలా 'రిజల్ట్ ఏంటో గెస్ చేయాలంతే?' పేరుతో తొలి గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని వస్తువులు నీటిలో వేస్తారు. అవి తేలుతాయో, మునుగుతాయో చెప్పాలంతే.. ఈ పోటీలో ప్రియాంక విజేతగా నిలవగా, అమరదీప్ ఓడిపోయాడు. శోభా, తేజ మధ్య స్థానాలు సంపాదించారు. 'డబ్బాలు సెట్ చేయాలంతే' అనే రెండో గేమ్‌లో ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. రతిక ఎలిమినేట్ అయిపోయింది. గౌతమ్, యవర్ కూడా ఈ గేమ్ ఆడినప్పటికీ మధ్య స్థానాల్లో నిలబడ్డారు అంతే. పుల్లలు పెడుతున్న శివాజీ రెండో గేమ్‌లో రతిక ఓడిపోయిన తర్వాత తేజ ఆమెతో జోక్‌గా.. 'ఓడిపోయినందుకు నువ్వు కూడా అన్నం తిననని బిగ్‌బాస్‌తో చెప్పు' అన్నాడు. దీంతో శోభా రెచ్చిపోయింది. తేజతో గొడవ పెట్టుకుంది. ఎందుకలా అన్నావ్ అని గట్టిగా అరుస్తూ వాదన పెట్టుకుంది. మధ్యలో తేజతో మాట్లాడిన శివాజీ.. శోభా గురించి పుల్ల పెట్టే ప్రయత్నం చేశాడు. 'అతి సర్వత్రా వర్జయాత్' అని ఏవేవో సినిమా డైలాగ్స్ కొడుతూ తేజని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇలా చేస్తే తేజ.. శోభాకి దూరమై తన దగ్గరకు వచ్చేస్తాడని శివాజీ ఆశపడుతున్నట్లు ఉన్నాడు. ఒకటి రెండు రోజులు ముందు కూడా శోభా వెనక తిరుగుతున్నాడని తేజకి శివాజీ క్లాస్ పీకాడు. ఇవన్నీ చూస్తుంటే శివాజీ.. బిగ్‌బాస్‌లో ఆడకుండా రాజకీయాలు ఎక్కువ చేస్తున్నాడనిపిస్తోంది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) -
అమర్దీప్ మీద కేకలేసిన శోభ, కేక్ కోసం ఫైటింగ్!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు గులాబీపురం, జిలేబిపురం అనే గ్రామస్థులుగా విడిపోయారు. వీరిలో ఏ గ్రూపు గ్రహాంతరవాసులను మెప్పిస్తుందో ఆ గ్రూపులోని వారు కెప్టెన్సీకి పోటీపడతారు. ఇప్పటికే ఓ టాస్కులో జిలేబిపురం గెలిచింది. మరి తాజా(అక్టోబర్ 19) ఎపిసోడ్లో ఎవరు గెలిచారు? అనేది చూసేద్దాం.. మళ్లీ బుసలు కొట్టిన మోనిత గులాబీపురం, జిలేబిపురం గ్రామప్రజలుగా కంటెస్టెంట్లు జీవించేస్తున్నారు. ఇక తేజ అయితే పెళ్లి రోజు, తొలి రాత్రి అంటూ శోభా శెట్టితో సరసాలాడాడు. మిగతావారు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఎవరికి వారు తమ టాలెంట్ చూపించారు. ఇంతలో అండర్ వాటర్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో అమర్-సందీప్ బాగానే కష్టపడ్డారు. కానీ చివరకు జిలేబిపురాన్ని గెలిపించాడు సందీప్. దీంతో శోభాలో ఉన్న మోనిత ఒక్కసారిగా నిద్రలేచింది. గెలుస్తానన్న నమ్మకం లేకపోతే వెళ్లకూడదు.. ప్రతీది ఓడిపోతున్నాం అంటూ అమర్దీప్ మీద అరిచేసింది. బోణీ కొట్టిన గులాబీపురం.. తర్వాత స్పేస్ షిప్ ఛాలెంజ్‌లో ప్రశాంత్, గౌతమ్ పోటీపడ్డారు. ఈసారి టాస్కులో గౌతమ్.. గులాబీపురాన్ని గెలిపించాడు. దీంతో మొదటి బోణీ కొట్టడంతో గులాబీపురం గ్రామస్తుల ముఖాలు వికసించిపోయాయి. అయితే జిలేబీపురానికి చెందిన ప్రియాంక డల్‌గా కూర్చోవడంతో ఆమె దగ్గరకు వెళ్లిన అమర్.. మాకొచ్చింది ఒకటేలే.. సల్లబడు అన్నాడు. సల్లబడు ఏంటి? ఓవర్‌గా మాట్లాడకు అని ఫైర్ అయింది. నేను సరదాగా అన్నానంటూ అమర్ చెప్పినా తను పట్టించుకోలేదు. అలిగి వెళ్లిపోయింది. తర్వాత ప్రియాంక దగ్గరకు వెళ్లిన అమర్ సారీ చెప్పాడు. మొన్నటివరకు శివాజీ, ప్రశాంత్‌తో గొడవపడ్డ అమర్దీప్ ఈరోజు తన స్నేహితులిద్దరితోనూ మాటలు పడాల్సి వచ్చింది. శోభా పేరు పచ్చబొట్టు వేయించుకోమన్న బిగ్‌బాస్ ఇదిలా ఉంటే కిచెన్‌లో టాటూ గురించి కబుర్లు చెప్పుకున్నారు తేజ, శోభ, పూజా మూర్తి. ఇది విన్న బిగ్‌బాస్ పచ్చబొట్టు వేయించుకోవచ్చుగా అని తేజకు సలహా ఇచ్చాడు. సరదాగా అన్నాడేమో అని లైట్ తీసుకునేలోపే పదేపదే పచ్చబొట్టు విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. శోభ పేరు టాటూ వేయించుకోవాలని, ఏ డిజైన్ కావాలో సెలక్ట్ చేసుకో అని ఓ పేపర్ కూడా పంపించాడు. అసలే పెళ్లి కావాల్సినవాడిని, ఈ పచ్చబొట్టు నా వల్ల కాదంటూ బిగ్‌బాస్‌కు మొర పెట్టుకున్నాడు తేజ. బయటకు వెళ్లాక (పెళ్లికి) అవకాశముందని చెప్తే వేయించుకుంటానని తేజ అనగా వేయించుకో అని ఆటపట్టించింది శోభ. అమర్ మీద పడ్డ శోభ రాత్రి తేజ కోసం బిగ్‌బాస్ ఓ కేక్ పంపించాడు. దానిపై శోభ అని రాసి ఉంది. ఇది ముగింపు కాదు, ముందుంది ముసళ్ల పండగ అంటూ ఓ లేఖ సైతం పంపాడు. తనకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో అని జుట్టు పీక్కున్నాడు తేజ. ఇంతలో అమర్.. కేక్‌ను ఎంతసేపు చూస్తూ కూర్చోవాలని ఓ ముక్క లటుక్కున తినేశాడు. అప్పుడు తేజ, శోభ.. ఇద్దరూ అమర్ మీద అరిచారు. కేక్ మీద నా పేరుంది.. ఎలా తిన్నావని ఆగ్రహించింది శోభ. శోభకు ఐ లవ్ యూ చెప్పిన తేజ చాలా సేపు తల గోక్కున్న తర్వాత తేజ కేక్ కట్ చేసి అందరికీ తలా ఓ ముక్క ఇచ్చాడు. అంతా అయిపోయాక శోభను గార్డెన్‌కు పిలిచాడు. కేక్ ఎందుకు పంపించాడు? దానిపై నీ పేరు ఎందుకు రాశాడు? అంటూ ప్రశ్నల చిట్టా చదివాడు తేజ. ఏదో చెబుతావనుకుంటే సోది చెప్తున్నావంటూ శోభా కోపంగా లేచింది. దీంతో తేజ సడన్‌గా ఐ లవ్ యూ చెప్పడంతో థూ అని ఊసేసి ముందుకు వెళ్లిపోయింది శోభ. మొత్తానికి తేజ-శోభ లవ్ ట్రాక్ కోసం బిగ్‌బాస్ గట్టిగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. చదవండి: ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్ రివ్యూ -
ఎలిమినేషన్‌కి ముందే మరో ట్విస్ట్.. ఆ ముగ్గురిపై వేలాడుతున్న కత్తి!
బిగ్‌బాస్ మినిమమ్ జోష్ ఉంటది. ఎందుకంటే వారంలో కంటెస్టెంట్స్ అందరూ చేసిన చీటింగ్, పొరబాట్లు ఇలా ప్రతి ఒక్కదాని గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడుతాడు. ఈసారి కూడా అలానే ఒక్కొక్కరిని నిలబెట్టి మరీ కడిగేసే ప్రయత్నం చేశాడు. ఎలిమినేషన్ కంటే ముందు మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఆ ముగ్గురికి భయం పట్టుకుంది. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 34 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. అందరి తప్పులు శుక్రవారం ఏం జరిగిందనేది చూసిన నాగ్.. ప్రస్తుతానికి వచ్చేశాడు. అలా శనివారం ఎపిసోడ్ మొదలైంది. రావడంతో బెస్ట్ బడ్డీస్ జోడీలుగా కూర్చోవాలని చెప్పాడు. ఫస్ట్ ప్రియాంక-శోభాశెట్టిని నిలబెట్టి.. ఈ వారం మీరేం తప్పులు చేశారు? మీకేం అన్యాయం జరిగిందని అడిగాడు. స్మైల్ టాస్కులో మూడోసారి గంట కొట్టింది తామే అయినా స్టార్స్ రాలేదని ప్రియాంక చెప్పింది. అయితే తన బడ్డీ శోభా, ఆ గేమ్‌లో సంచాలక్ కావడం, మరో సంచాలక్ యవర్‌తో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవడంతో తానేం అనలేకపోయానని చెప్పింది. అయితే ఈ పోటీలో ప్రతిఒక్కరూ తప్పుగా ఆడారని నాగ్ చెప్పాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!) అమర్-సందీప్‌కి పడ్డాయ్ ఈ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా గేమ్స్ ఆడుతూ ఎక్కువ తప్పులు చేసింది అమరదీప్-సందీప్. రెగ్యులర్ గా ఎపిసోడ్స్ చూసేవాళ్లందరికీ ఇది తెలుసు. నాగ్ కూడా ఆయా తప్పులు సందీప్-అమరదీప్తో చెప్పించాడు. స్మూత్‌గా ఇచ్చిపడేశాడు. ఇక ప్రతి సంచాలక్ నిర్ణయాన్ని బొక్కలో జడ్జిమెంట్ అని అమర్ అనడంపై నాగ్ సీరియస్ అయ్యాడు. 'నువ్వే తొక్కలే సంచాలక్.. నీదే బొక్కలో జడ్జిమెంట్' అని అనడంతో అమర్ సైలైంట్ అయిపోయాడు. ఇలా అందరు చేసిన తప్పుల్ని ఎత్తిచూపిన నాగార్జున.. అందరూ దొరికిపోయేలా చేశాడు. అమర్ నిజస్వరూపం అయితే శివాజీ మాట్లాడుతూ.. అమరదీప్‌కి ఏం చెప్పినా వినట్లేదని, ఎవరూ ఫెయిర్ గేమ్ ఆడట్లేదని తన అభిప్రాయాన్ని చెప్పాడు. మరోవైపు దొంగ టాస్కులో భాగంగా అమరదీప్.. ప్రశాంత్‌ని ఉద్దేశిస్తూ రూంలో కూర్చుని 'వాడు మేకప్ వేయకపోయినా దొంగలానే ఉంటాడు' అని చెబుతున్న వీడియోని స్క్రీన్‌పై ప్లే చేసిన నాగ్.. అమర్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. దీంతో అతడిపై నెగిటివిటీ మరింత పెరిగిపోయింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్) ఆ ముగ్గురిపై అనర్హత? అయితే కంటెస్టెంట్స్ తప్పులు గురించి చెప్పి, అందరికీ స్మూత్ వార్నింగ్స్ ఇచ్చిన నాగార్జున చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. ఎలిమినేషన్ గురించి కాకుండా ఈ హౌసులో ఉండటానికి అర్హత లేని ముగ్గురు పేర్లు చెప్పాలని అందరితో అన్నాడు. హౌస్మేట్స్ శోభాశెట్టి, ప్రశాంత్, సందీప్ కాకుండా మిగిలిన ఏడుగురిలోని పేర్లు చెప్పాలని అన్నాడు. దీంతో అందరూ నామినేట్ చేసినోళ్ల పేర్లు, అందుకు కారణాలు చెప్పారు. శోభాశెట్టి.. తేజ, గౌతమ్, శివాజీ ప్రశాంత్.. తేజ, యవర్, అమరదీప్ సందీప్ .. గౌతమ్, శివాజీ, యవర్ ప్రియాంక.. గౌతమ్, శివాజీ, శుభశ్రీ అమరదీప్.. శుభశ్రీ, గౌతమ్, యవర్ శుభశ్రీ.. తేజ, ప్రియాంక, అమరదీప్ గౌతమ్.. తేజ, ప్రియాంక, అమరదీప్ శివాజీ.. అమరదీప్, ప్రియాంక, గౌతమ్ తేజ.. అమరదీప్, శుభశ్రీ, గౌతమ్ యవర్.. అమరదీప్, ప్రియాంక, తేజ అయితే హౌసులో ఉన్న వాళ్ల ప్రకారం.. అమరదీప్, తేజ, గౌతమ్ హౌసులోని అనర్హత కలిగిన ముగ్గురుగా నిలిచారు. కానీ ప్రేక్షకుల అంచనా ప్రకారం ఆ ముగ్గురు ఎవరనేది ఆదివారం చెబుతానని నాగ్ తిరకాసు పెట్టి ఎపిసోడ్‌ని ఆపేశాడు. అలానే ఆదివారం.. ఎవరూ ఊహించని విషయం చెబుతానని కంటెస్టెంట్స్ అందరితో చెప్పాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఇక ఆదివారం.. కొత్తగా హౌసులోకి మరో ఆరుగురు కంటెస్టెంట్స్ రాబోతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!
బిగ్‌బాస్ అంటేనే ఫిట్టింగ్ బాస్.. అన్నీ తేరగా ఇచ్చేయడు. కంటెస్టెంట్లను ముప్పలు తిప్పలు పెట్టి, ఏడిపించి చివరకు వారిక్కావాల్సింది ఇస్తాడు. బిగ్‌బాస్ ఇచ్చే అరకొరవాటి కోసం హౌస్‌లో నానా గొడవలే జరుగుతాయి. ఈసారి బిగ్‌బాస్.. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని చెప్తూనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తాజా(సెప్టెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. యావర్‌కు తెలుగు క్లాసులు బిగ్‌బాస్ ఇంట్లో కెప్లెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందుకోసం ఇంట్లోవారంతా జంటలు జంటలుగా విడిపోయారు. వీరిలో ఆటలో వెనుకబడి అందరికన్నా తక్కువ స్టార్లు సొంతం చేసుకున్న శోభా శెట్టి- ప్రియాంకలను బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు. మిగిలిన నాలుగు జంటలు అమర్ దీప్- సందీప్, శివాజీ- ప్రశాంత్, తేజ- యావర్, గౌతమ్- శుభశ్రీలు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లారు. ఇకపోతే తెలుగు కష్టంగా మాట్లాడుతున్న యావర్‌కు నాలుగు తెలుగు ముక్కలు నేర్పించాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో తేజ, అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ.. అతడికి తెలుగు క్లాసులు తీసుకున్నారు. రిక్వెస్ట్ చేయాల్సింది పోయి ఆర్డర్లు, వార్నింగ్‌లు.. అల్లరి విద్యార్థిగా యావర్ అదరగొట్టాడు. తెలుగు పండింతులైన తేజను ఓ ఆటాడుకున్నాడు. మరోవైపు శివాజీ ఎప్పటిలాగే అతి చేశాడు. కాఫీ కోసం బిగ్‌బాస్ మీదకే నిప్పులు చెరుగుతున్నాడు. కాఫీ ఇవ్వని బతుకు.. నాదీ ఓ బతుకేనా? కాఫీ ఇవ్వకపోతే హౌస్ నుంచి వెళ్లిపోతా.. అని మరోసారి బెదిరింపులకు దిగాడు. కాఫీ లేకపోతే ఏం ఆలోచించలేకపోతున్నా.. కామెడీ చేయమంటే ఎలా చేస్తాం.. వీడెవడ్రా బిగ్‌బాస్? కాఫీ ఇవ్వనంటాడు.. అని చిందులు తొక్కాడు. ఈయన ఓవరాక్షన్ చూసిన బిగ్‌బాస్ అతడికి కాఫీనే పంపించలేదు. ఎమోషనల్ టాస్క్.. ఇకపోతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా చిట్టి ఆయిరే అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లందరికీ ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని, కానీ ప్రతి జంటలో ఒకరు లెటర్ చదివితే మరొకరు త్యాగం చేయాలి.. త్యాగం చేసిన వారు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఎవరైతే లెటర్ చదువుతారో వారే కెప్టెన్సీ పోటీదారుడు అవుతారన్నమాట! త్యాగం చేసిన శుభ శ్రీ ఈ టాస్క్ గురించి ప్రకటించగానే శివాజీ.. నేను ఈ టాస్క్ ఆడటం లేదు అంటూ శివాజీ మైక్ కుర్చీలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. ప్రశాంత్‌తో.. నువ్వే ఆడు, లెటర్ తీసుకో అని చెప్పాడు. మరోవైపు గౌతమ్- శుభశ్రీ.. ఎవరు లెటర్ అందుకోవాలనే దాని గురించి కాసేపు వాదులాడి చివరకు త్యాగానికి పూనుకుంది శుభ. అటు గౌతమ్ తన తండ్రి రాసిన లేఖ చదివి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. తన లేఖను చించేసిన యావర్ యావర్- తేజా.. ఇద్దరూ త్యాగానికి సిద్ధపడ్డారు. ఒకరిని బాధపెట్టి ముందుకు వెళ్లలేనంటూ యావర్ తన లేఖను చింపేశాడు. దీంతో తేజా తన తండ్రి రాసిన లెటర్ చదివి చాలా ఎమోషనలయ్యాడు. ఏడవనంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి తర్వాతి ఎపిసోడ్లో ఎవరు త్యాగం చేస్తారు? ఇంకా ఎవరు కెప్టెన్సీ పోటీదారులవుతారో చూడాలి! -
చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ, అమ్మ అనారోగ్యంతో ఉందంటూ సందీప్..
బిగ్‌బాస్ గ్యారేజ్.. ఇచట అన్నిరకాల మనుషులు ఉంటారు. కోపిష్టిలు, సహనశీలులు, ఆవేశపరులు, ఆలోచనాపరులు, శక్తిమంతులు, బుద్ధిహీనులు, సహృదయులు, కఠినాత్ములు.. ఇలా భిన్నరకాల మనుషులుంటారు. హౌస్‌లోకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నా బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఎంతో కొంత నేర్చుకునే వెళ్తారు. ప్రస్తుత సీజన్లో ఇంటిసభ్యుల మధ్య ఆప్యాయత కన్నా కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాస్కుల్లో తెగ కష్టపడుతున్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఈరోజు గుడ్‌న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పనున్నట్లు కనిపిస్తోంది. ఈమేరకు తాజాగా ప్రోమో విడుదలైంది. ఇందులో బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటిసభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కానీ ఇప్పటికే కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే మరొకరు ఉత్తరం చదువుకోవాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్లు ఎమోషనలయ్యారు. చేతిదాకా వచ్చిన ఉత్తరాన్ని చదువుకునే భాగ్యం కూడా దక్కకుండా పోయిందేనని కొందరు ఏడ్చేశారు. ఇక సందీప్.. తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని.. తనకు ఈ ఉత్తరం ఎంతో అవసరమని చెప్తాడు. మదర్ సెంటిమెంట్ అయ్యేసరికి అమర్ తనతో వాదించలేకపోతాడు. అటు శుభశ్రీ సైతం తనకు ఈ లెటర్ కావాలని ఏడ్చేసింది. ఎప్పుడూ నవ్వించే తేజ కూడా ఉత్తరాన్ని చేతిలోకి తీసుకోగానే బోరుమని విలపించాడు. మరి ఎవరెవరికి ఉత్తరం చదివే ఛాన్స్ వచ్చింది? ఎవరు తమ లెటర్‌ను చింపేసి త్యాగానికి సిద్ధపడ్డారు? అనేది తెలియాలంటే నేటి ఎమోషనల్ ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక? -
వీడియోతో దొరికిపోయిన తేజ.. బయటకు పంపించేద్దామంటూ పనిష్మెంట్!
'బిగ్‌బాస్ హౌస్‌లో హింసకు చోటు లేదు' ఈ నియమం ఇప్పటిది కాదు. తొలి సీజన్నాటి నుంచే ఈ రూల్ ఉంది. అయినా టాస్కులు జరిగేటప్పుడు కొన్నిసార్లు ఈ రూల్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అప్పుడు నాగార్జున చేత కంటెస్టెంట్లకు కోటింగ్ కూడా ఉంటుంది. ఈ సారీ అదే జరిగింది. కాకపోతే ఇదేమీ కొట్టుకునేంత ఫిజికల్ టాస్క్ కాదు. అయినా తేజ బెల్ట్‌తో గౌతమ్‌ను టపాటపా కొట్టాడు. హౌస్‌లో ఉన్నవాళ్లకు ఎలా ఉందో కానీ చూసే జనాలకు మాత్రం గొడ్డును బాదినట్లు బాదాడనిపించింది. తను కావాలని చేయకపోయినా బెల్ట్‌తో మెడపై అంత గట్టిగా కొట్టడం.. అక్కడున్నవాళ్లు వద్దని హెచ్చరిస్తూ కేకలు పెడుతున్నా తన చర్యలు ఆపకోవడం గమనార్హం. ఇలాంటి అరాచకాన్ని ప్రశ్నించేందుకు రెడీ అయ్యాడు నాగార్జున. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గౌతమ్‌ను తేజ ఎలా బాదాడో వీడియో చూపించాడు నాగ్. సంచాలకుడిగా ఉన్న సందీప్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని విమర్శించాడు. అన్నింటికీ బాస్‌లా పోజు కొట్టే శివాజీ సైతం నిమ్మకు నోరెత్తనట్లు ఉండటంతో అతడినీ ఏకిపారేశాడు. మీ ఇద్దరికీ కళ్లు కనబడట్లేదా? అని తిట్టిపోశాడు. తర్వాత తప్పు చేసిన తేజను చెడుగుడు ఆడుకున్నాడు. అక్కడ అమ్మాయిలు భయంతో అరుస్తుంటే వినబడట్లేదా? అని నాగ్ ప్రశ్నించగా.. అది ఎంకరేజ్మెంట్ అనుకున్నానని నీళ్లు నమిలాడు తేజ. తేజ చేసిన తప్పుకు ఏ శిక్ష వేయాలని కంటెస్టెంట్లనే తిరిగి ప్రశ్నించాడు నాగ్. శుభశ్రీ.. అతడిని జైల్లో వేయాలంది. ప్రియాంక.. జైలు శిక్ష కూడా తక్కువేనంది. సందీప్ అయితే ఏకంగా అతడిని బయటకు పంపించేయాలన్నాడు. దీంతో తేజ తప్పు తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చదవండి: ఓటీటీలో నిత్యా జోరు, మరో కొత్త వెబ్ సిరీస్ డేట్ వచ్చేసింది.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా! -
'ఎవరు సార్ ఆయన.. నాకేంటి సంబంధం'.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ!
టేస్టీ తేజ.. మీలో ఈ పేరు ఎంతమందికి తెలుసు. దాదాపుగా చాలామందికి తెలియదనే చెబుతారు. ఎందుకంటే అతని అంతలా ఫేమ్ ఉన్న వ్యక్తి కాదు. అతన్ని గుర్తు పెట్టుకునేంత ఏం చేశాడని అంటారా?.. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేంత వరకు కూడా ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. బిగ్ బాస్ షోకు రాకముందు అతను ఏం చేశాడు? తొమ్మిదో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన టేస్టీ తేజను ఈ అవకాశం ఎలా వరించింది? ఆ వివరాల గురించి ఓసారి తెలుసుకుందాం. (ఇది చదవండి: సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?) జబర్దస్త్‌తో కెరియర్ స్టార్ చేసిన తేజ.. యూట్యూబర్‌గా ఫేమస్ అయ్యారు. తన సొంత యూట్యూబ్ ఛానల్తోనే పాపులరిటీ తెచ్చుకున్నారు. తేజా ఫుడ్ లవర్ కావడంతో అతని పేరు కాస్తా టేస్టీ తేజాగా మారింది. మొదట చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్‌తో తేజా ప్రయాణం మొదలై.. ఆ తర్వాత దూసుకెళ్లాడు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడలో కూడా సెలబ్రిటీలతో టేస్టీ తేజ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఏకంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. తేజాకి డబ్బులిచ్చి మరీ ఫుడ్ వీడియోలు చేయించుకుంటున్నారంటే మనోడి క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన టేస్టీ తేజ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన గురించి మాట్లాడుతూ ఫుల్ ఎమోషలయ్యారు. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. టేస్టీ తేజకు జబర్దస్త్ కమెడియన్‌గా రాణించేందుకు లైఫ్ ఇచ్చింది మాత్రం అదిరే అభి. ఇంటర్వ్యూలో అతని ఫోటో చూడగానే టేస్టీ తేజ కన్నీళ్లాగలేదు. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. (ఇది చదవండి: 'నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు'.. ఆసక్తిగా ట్రైలర్!) టేస్టీ తేజ మాట్లాడుతూ..'ఎవరు సార్ ఆయన.. ఆయనకు, నాకు ఏంటి సంబంధం సార్.. నాకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్? .. అంటూ అభిని చూస్తూ చిన్న పిల్లాడిలా బోరున విలపించాడు. తేజ వేరే వాళ్లతో వెళ్దామని చాలా మంది సలహాలిచ్చినా.. లేదు మనోడు చేస్తాడు.. అని నాతో చేయించాడు. ఎప్పుడు ఎక్కడికెళ్లినా ఈయనను మాత్రం మర్చిపోను సార్. జబర్దస్త్‌లో చేసిన పరిచయాల వల్లే నా సొంత యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఫేమస్ అయ్యాను. ఏ సినిమా ప్రమోషన్ అయినా టేస్టీ తేజ వీడియో కచ్చితంగా ఉంటుంది. ఇదంతా అన్న వల్లే సాధ్యమైంది. ఎక్కడున్న అన్న బాగుండాలి.. మాలాంటి వారికి ప్రోత్సహించాలి. అందుకే అన్నను చూడగానే ఏడుపు వచ్చేసింది.' అంటూ ఎమోషనల్ అయ్యారు. -
'బిగ్‌బాస్'లో అనుకున్నదే జరిగింది.. వెళ్తూ షకీలా ఏడిపించేసింది!
'బిగ్‌బాస్'లో మిగతా రోజుల సంగతెలా ఉన్న వీకెండ్ వస్తే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎలిమినేషన్ టెన్షన్ కచ్చితంగా ఉంటుంది. శనివారం అందరికీ ఓ రౌండ్ వేసిన నాగార్జున.. ప్రశంసలతో పాటు కౌంటర్స్ ఇచ్చేశాడు. ఇక ఆదివారం ఎపిసోడ్లో బోలెడంత ఫన్ ఇస్తూనే, చివర్లో ఎలిమినేషన్ కూడా చేశాడు. అనుకున్నట్లే ఆమె ఇంటినుంచి బయటకెళ్లినప్పటికీ.. కాస్త డిఫరెంట్‌గా జరిగింది. ఇంతకీ ఆదివారం (Day-14) హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!) శివాజీకి కౌంటర్స్ సోమవారం వినాయక చవితి కాబట్టి.. గణేశుడి పాటకు డ్యాన్స్ చేస్తూ హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. అయితే శనివారం ఎపిసోడ్లో పవరస్త్ర గెలుచుకున్న శివాజీ.. దాన్ని హాల్లో అలానే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో నాగ్ చిన్నగా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనే తీసుకుని ఉంటే, అది వాళ్లది అయ్యేదని చెప్పాడు. ఎవరూ తీసుకోకపోవడంతో దాన్ని శివాజీకే ఇచ్చేశారు. సండే ఫండే ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. అయితే దాని కంటే ముందు కాస్త హౌస్ అంతా ఫన్ జనరేట్ చేయడం కామన్. ఈసారి కూడా భళ్లాలదేవ, కట్టప్ప అని రెండు బొమ్మలు పెట్టారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్.. హౌసులో తనకి ఎవరు భళ్లాలదేవ? ఎవరు కట్టప్ప? అనేది చెప్పి కారణాలు చెప్పాలని నాగ్ 'BB సామ్రాజ్యం' అనే గేమ్ పెట్టాడు. ఇందులో తేజని నలుగురికి కట్టప్ప అయ్యాడు. గౌతమ్.. ముగ్గురికి కట్టప్ప అయ్యాడు. పూర్తి లిస్ట్ దిగువన ఉంది చూసేయండి. (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?) కంటెస్టెంట్ - కట్టప్ప, భళ్లాలదేవ శోభాశెట్టి.. గౌతమ్, ప్రిన్స్ గౌతమ్ - రతిక, ప్రిన్స్ రతిక - తేజ, గౌతమ్ తేజ - గౌతమ్, శివాజీ శివాజీ - తేజ, ప్రశాంత్ ప్రశాంత్ - తేజ, శివాజీ దామిని - శుభశ్రీ ,సందీప్ సందీప్ - శివాజీ, శుభశ్రీ శుభశ్రీ - తేజ , సందీప్ ప్రియాంక - శివాజీ , సందీప్ ప్రిన్స్ - సందీప్, శివాజీ అమరదీప్ - గౌతమ్, సందీప్ షకీలా - ప్రిన్స్, ప్రశాంత్ వాళ్లు సేఫ్ ఓవైపు పైన చెప్పిన జరుగుతుండగానే మరోవైపు మధ్యలో ఓసారి ఎలిమినేషన్ గురించి నాగ్ చెబుతూ వచ్చాడు. అలా తొలి రౌండులో ప్రిన్స్, రెండో రౌండులో రతిక, మూడో రౌండులో శోభాశెట్టి, ప్రశాంత్, నాలుగో రౌండులో గౌతమ్ సేవ్ అయ్యారు. ఇకపోతే ఎలిమినేషన్ కంటే ముందు 'కొంచెం గెస్ చేయ్ గురూ' అని నాగ్.. మరో గేమ్ పెట్టాడు. ఈ వారం ఆడిన రణధీర, మహాబలి గ్రూపులని ఇందులో అలానే పార్టిసిపేట్ చేయమన్నాడు. దీంతో మాయస్త్ర టాస్కులో ఓడిన మహబలి టీమ్ ఇక్కడ గెలిచారు. లగ్జరీ బడ్జెట్ సొంతం చేసుకున్నారు. (ఇదీ చదవండి: రజనీకాంత్‌తో ఉన్న ఈ పిల్లాడు స్టార్ హీరో.. గుర్తుపట్టారా!?) షకీలా ఎలిమినేట్ ఇక చివరగా మిగిలిన తేజ, షకీలా.. యాక్టివిటీ రూంలోకి వెళ్లారు. ఎవరి ఫొటో బయటకొస్తుందో వాళ్లు సేఫ్ అయినట్లు అని నాగ్ చెప్పారు. తేజ ఫొటో ఉండటంతో అతడు బతికిపోయాడు. షకీలా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఆమె వెళ్లిపోవడంతో సందీప్, అమర్దీప్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తేజ కూడా ఎమోషనల్ అయ్యాడు. షకీలా తనకు అమ్మలా అనిపించారని అన్నాడు. దామిని అయితే 'పెదవే పలికిన మాటల్లోనే' పాట పాడింది. అయితే ఈ సాంగ్ పాడుతున్నప్పుడు షకీలా.. భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అలా వెళ్తూ వెళ్తూ హౌసు మొత్తాన్ని ఏడిపించేశారు. అలా ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. షకీలా ఉండాల్సింది అయితే అప్పట్లో వ్యాంప్ తరహా పాత్రలతో కుర్రాళ్లని పిచ్చెక్కించిన షకీలా వేరు. హౌసులోకి వచ్చిన షకీలా వేరు. ఎందుకంటే 'బిగ్‌బాస్'లో చాలా హుందాగా ఉన్నారు. కాకపోతే నామినేషన్స్‌లో ఉన్నవాళ్లలో ఈమెకి తక్కువ ఓట్లు పడ్డాయి. బహుశా ఇంకొన్నాళ్లు హౌసులో షకీలా ఉండుంటే బాగుండేది. (ఇదీ చదవండి: నటుడు నరేశ్ ఎమోషనల్.. అది తలుచుకుని బాధపడి!) -
షకీలా ఎలిమినేట్.. ప్రోమోలోనే తెలిసిపోయిందిగా!
బిగ్‌బాస్ తెలుగు 7లో మరొకరిని ఎలిమినేట్ చేసే సమయం ఆసన్నమైంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రేపు గణపతి పండగ కావడంతో వినాయకుని పాటతోనే ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. కంటెస్టెంట్లతో ఈరోజు ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు. ఆటలో మీకు ఎవరు భళ్లాల దేవ? ఎవరు కట్టప్ప? అని ఆట ఆడించాడు. ప్రియాంక.. శివాజీని కట్టప్పగా పేర్కొంది. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. స్క్రీన్‌పై కాస్ట్యూమ్ కనిపిస్తుంది. ఆ కాస్ట్యూమ్ చూసి అదేం సినిమానో గుర్తు చేయాలి. ఇలాంటి ఫన్ గేమ్‌లు ఇస్తే మనోళ్లకు తెగ సంబరం.. పోటీపడి మరీ ఆడారు. మధ్యలో తేజ ఇంద్ర సినిమాలోని చిరంజీవి వీణ స్టెప్పు వేస్తానని ట్రై చేసి తన పరువు తానే తీసుకున్నాడు. చివర్లో ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ప్రశాంత్, షకీలా, గౌతమ్, శోభా శెట్టి, తేజకు కొమ్ములు పెట్టారు. అయితే అదే ప్రోమోలో షకీలా పక్కన తేజ, ప్రశాంత్ కొమ్ము లేకుండా కనపడ్డారు. మరో ప్రోమోలో కంటెస్టెంట్లు అందరూ ఎలిమినేట్ అయిన వ్యక్తి వెనకాల వెళ్తూ కనిపించారు. వారిలో శోభా, గౌతమ్ ఉన్నారు. మిగిలిందల్లా షకీలా ఒక్కరే.. దీంతో షకీలా అమ్మ ఎలిమినేట్ అయిందని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. చదవండి: హర్ష సాయి హీరోగా మెగా మూవీ.. టీజర్ చూశారా? డైలాగులు అదిరిపోయాయి! -
చిన్నప్పుడే సినిమా ఆఫర్.. ఒప్పుకోని టేస్టీ తేజ తండ్రి!
తెనాలి: ‘టేస్టి తేజ’.. యూట్యూబ్‌లో చిరపరిచితమైన పేరు. హోటల్ ప్రమోషన్స్‌తో ఆరంభించి సినిమా ప్రమోషన్స్‌తో సందడి చేస్తున్న చానల్ ఇది. మూడున్నర లక్షలకుపైగా సబ్‌స్రైబర్స్.. లక్షలాది వ్యూస్ సాధిస్తున్న ప్రోగ్రాం టేస్టి తేజ. దీని నిర్వాహకుడు ఇప్పుడు బిగ్‌బాస్–7 కంటెస్టెంట్‌గా వినోదాన్ని పంచుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే తన అభిరుచిని లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్న ఓ యువకుడి విజయగాధ ఇది. కుటుంబ నేపథ్యం అసలు పేరు కల్లం తేజ్‌దీప్. తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, ఆదిలక్ష్మి. హైస్కూలు వరకు తెనాలిలో చదివిన తేజ్‌దీప్, విజ్ఞాన్ యూనివర్శిటీలో ఇంటర్, బీటెక్, ఎంటెక్ చేశాడు. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగంతో 2017లో హైదరాబాద్ వెళ్లాడు. నటనపై ఆసక్తితో.. తేజ్దీప్కు చిన్నప్పటి నుంచీ నటన, సినిమాలంటే ఆసక్తి. 8వ తరగతిలో ఉండగా అతడిని బాల నటుడిగా పరిచయం చేస్తానంటూ తమిళ నిర్మాత ఒకరు సంప్రదించారు. అయితే తేజ్ తండ్రి అంగీకరించలేదు. పాఠశాలలో, కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ వచ్చిన తేజ్దీప్కు అనుకోకుండా కరోనా సెలవులు కలిసొచ్చాయి. అనుకోకుండా ఓ రోజు.. 2020లో వర్క్ ఫ్రం హోమ్‌లో ఉండగా, ఒకరోజు అనుకోకుండా తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లిన తేజ్ భోజనం చేస్తూ వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ రావటంతో హైదరాబాద్ వెళ్లాక టేస్టీ తేజ పేరుతో హోటళ్ల సందర్శన కొనసాగించాడు. సబ్స్క్రైబర్స్, వ్యూస్ పెరిగాయి. దీంతో జబర్దస్త్‌లోనూ అవకాశం లభించింది. గుర్తింపూ తెచ్చుకున్నాడు. జబర్దస్త్, టేస్టీ తేజతో బిజీగా మారాడు. సినిమా ప్రమోషన్లకు టేస్టీ తేజ చానల్ వేదికైంది. ఉద్యోగానికి ఆటంకం లేకుండా, వీకెండ్లోనే తేజ్ వీడియోలు చేస్తున్నాడు. నాలుగు సినిమాల్లోనూ తేజ్ మెరిశాడు. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఈనెల 3 తేదీ నుంచి జరుగుతున్న బిగ్‌బాస్ సీజన్–7లో కంటెస్టెంట్‌గా తేజ్ పోటీపడుతున్నాడు. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జున తనతో కూడా టేస్టీ తేజ ప్రోగ్రాం చేయాలని కోరారు. షోలో ఆద్యంతం వినోదాన్ని పంచుతున్న తేజ్ రెండో వారం నామినేషన్‌కు వచ్చాడు. దీంతో అతడికి ఓట్ చేయాలని తేజ్ తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను తల్చుకుని ఏడ్చేసిన రతిక.. పల్లవి ప్రశాంత్ ఫేక్!
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. బిగ్‌బాస్ టాస్క్ ఇస్తే ఆలస్యం గెలిచి తీరాల్సిందే అన్నంత కసిగా ఆడుతున్నారు. ఐదువారాల ఇమ్యూనిటీ పవర్ ఇస్తానని బిగ్‌బాస్ ఆశ పెట్టగానే హౌస్హేట్స్ మరింత అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో కొందరు మెప్పించగా మరికొందరు ఓవరాక్షన్ చేశారు. మరోపక్క అల్లరిపిల్లగా కనిపించే రతిక మాజీ ప్రియుడిని తలుచుకుంటూ కంటతడి పెట్టేసుకుంది. ఇంతకీ తాజా(సెప్టెంబర్ 7) ఎపిసోడ్లో ఏమేం జరిగాయో ఓసారి చూసేద్దాం.. లేడీ గెటప్‌లో ప్రిన్స్ బిగ్‌బాస్ తనను ఇంప్రెస్ చేసినవారికి ఇమ్యూనిటీ టాస్క్ బరిలో నిలిచే ఛాన్స్ ఇస్తానన్నాడు. దీంతో అమర్దీప్ అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ చారి పాత్రలో, రతిక.. బ్రహ్మీ క్యారెక్టర్లో ఇమిడిపోయారు. ప్రిన్స్ యావర్ లేడీ గెటప్ వేసుకుని ఇల్లంతా తిరిగాడు. అయితే శివాజీ మాత్రం ఇవన్నీ తన వల్ల అయ్యే పని కాదని తనలో ఉన్న ఫ్రస్టేషన్‌ను తీర్చుకునేందుకు నటన అనే సాకు అడ్డుపెట్టుకుని బిగ్‌బాస్‌ను చెడామడా తిట్టేశాడు. కెమెరాల ముందు మాత్రం ఇది యాక్టింగ్ మాత్రమే అని బుకాయించాడు. తనకు కాఫీ కావాలని మొన్నటి నుంచే అడుగుతున్నాడు శివాజీ. ఇప్పుడు మంచి ఛాన్స్ దొరకడంతో యాక్టింగ్ పేరుతో బిగ్‌బాస్‌ను నానామాటలు అని, అడ్డొచ్చిన వాళ్లను సైతం తిట్టి తన కోపాన్ని బయటకు కక్కాడు. మెలికలు తిరిగిన రతిక అటు గౌతమ్‌ను శివాజీ బీపీ చెక్ చేయమని, రతికను స్టెతస్కోప్‌తో అందరి గుండె ఏం చెప్తుందో చెప్పాలన్నాడు బిగ్‌బాస్. కానీ ఇక్కడ కూడా శివాజీ ఓవరాక్షన్ చేస్తూ వారు పని చేయకుండా అడ్డుకున్నాడు. ఇతడి అతి భరించలేక ఆఖరికి బిగ్‌బాస్ అతడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి కాఫీ ఇచ్చి అతడి నోటికి తాళం పడేలా చేశాడు. మరోవైపు శుభశ్రీ ఏ పిల్లగాడా.. అంటూ పాట పాడుతూ పరికిణీలో స్టెప్పులేసింది. ఇలా ఎవరికి వారు తంటాలు పడుతుండగా బిగ్‌బాస్ రతికను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు? అని అడగ్గా రతిక మెలికలు తిరిగిపోయింది. అమాయకంగా ఉండాలి, సంగీతంపై అవగాహన ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే నా మాజీ ప్రియుడిలా ఉండాలి అంది. ఏళ్లుగా మిస్ అవుతున్నా ఎవరినైనా మిస్ అవుతున్నావా? అని బిగ్‌బాస్ అడగ్గానే కన్నీళ్లు పెట్టుకుంది. 'మిస్ అవుతున్నావా? అని అడిగితే ఎవరైనా పేరెంట్స్ పేరు చెప్తారు. కానీ వాళ్లు దగ్గరున్నా కూడా ఇంకెవరినైనా మిస్ అవుతామా? అంటే అది ఆ వ్యక్తే! మిస్సింగ్ ఫీలింగ్ అనగానే అతడే గుర్తొచ్చాడు. కొన్ని ఏళ్ల నుంచి మిస్ అవుతున్నాను. ఈ టాపిక్ లేవనెత్తగానే నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను. ఈ బాధ నుంచి ఎప్పుడు బయటపడతానో అర్థం కావట్లేదు. బిగ్‌బాస్ హౌస్ ఈ విషయంలో ఉపయోగపడుతుందేమో చూస్తున్నాను' అని పేర్కొంది. దీనికి బిగ్‌బాస్ బదులిస్తూ.. ఇప్పటివరకు నువ్వు ఎన్నో పాటలు పాడావు కదా.. నీకోసం ఓ పాట వినిపిస్తాను అంటూ ఉడతా ఉడతా ఊచ్ అని పాట ప్లే చేశాడు. ప్రశాంత్ ఫేక్.. అనంతరం షకీలాను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి గాసిప్స్ సహా కొన్ని ముచ్చట్లు చెప్పాలన్నాడు. దీంతో షకీలా మాట్లాడుతూ.. 'ప్రశాంత్ స్ట్రాంగ్, కానీ ఫేక్ అనిపిస్తుంది. రతిక.. ప్రశాంత్‌ను ఇన్ఫ్లూయెన్స్ చేస్తుంది. గౌతమ్- శుభ్రీ రాత్రంతా ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఇంట్లో ఉన్న అన్ని బంధాలూ ఫేక్ రిలేషన్సే..' అని పేర్కొంది. టేస్టీ తేజ షో ప్రారంభంలో నాగ్ ఇచ్చిన బ్యాడ్జ్‌లను తాజా ఎపిసోడ్లో పంచాడు. పెరుగన్నం బ్యాడ్జ్ శుభశ్రీకి ఇచ్చాడు. ఇందుకోసం ఆమె 20 సెకన్లపాటు తేజను ఎత్తుకుంది. మిర్చి బ్యాడ్జ్‌కు గానూ శోభాశెట్టి తేజతో రొమాంటిక్ డ్యాన్స్ చేసింది. బర్గర్ బ్యాడ్జ్‌ను రతికకు ఇచ్చాడు. తన గురించి ఏదైనా పాట రూపంలో చెప్పాలన్నాడు. డాక్టర్‌బాబు- మోనితల ట్రాక్ ఇంతలో తేజను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ ఇంట్లోని గాసిప్స్ గురించి ఆరా తీశాడు. 'శోభాకు కనెక్ట్ అవుతున్నాడని గౌతమే నాతో స్వయంగా చెప్పాడు. డాక్టర్‌బాబు- మోనితల గురించి హౌస్‌లోనూ మాట్లాడుకుంటున్నారు. ప్రశాంత్‌ను ఫేక్ అని చెప్పలేను, కానీ.. కావాలని కింద కూర్చుంటూ, కింద పడుకున్నాడేమో అనిపిస్తోంది' అని తెలిపాడు. ఈ ఎపిసోడ్లో బిగ్‌బాస్ తనను ఇంప్రెస్ చేసిన కంటెస్టెంట్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. చదవండి: ఐ బొమ్మ వార్నింగ్ ఇవ్వడమేంటి?.. వైరలవుతున్న పోస్ట్! -
హీరోయిన్ను డైరెక్ట్‌గా ముద్దు పెట్టమని తేజ గోల.. చివరికి సాధించాడుగా!
బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడిప్పుడే టాస్కులు షురూ అవుతున్నాయి. ఇక్కడ అంతా ఉల్టా పల్టా అని ముందునుంచీ బిగ్‌బాస్ భయపెడుతూ ఉంటే దేనికైనా రెడీ అని హౌస్మేట్స్ తెగించి ఉన్నారు. ఓ పక్క టాస్కుల్లో ఉత్తేజంగా ఆడుతూనే మరోపక్క తోటి కంటెస్టెంట్లతో బంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఈ విషయంలో అందరికంటే యమ జోరుగా ఉన్నాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. హౌస్‌లోకి వచ్చిన రెండు రోజుల్లోనే హీరోయిన్ రతిక రోస్‌ను బుట్టలో పడేశాడు. తన మనసే ఇచ్చేస్తానని రతిక అనడంతో ప్రశాంత్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. తాజాగా టేస్టీ తేజ కూడా ఇలాంటిది తనకేమైనా వర్కవుట్ అవుతుందేమోనని ప్లాన్ చేశాడు. శుభశ్రీ రాయగురు తేజను అమ్మాయిలా రెడీ చేసేందుకు రెడీ అయింది. అతడి ముఖానికి మేకప్ అద్ది, పిలకజుట్టు వేసింది. అనంతరం లిప్‌స్టిక్ పూస్తుండగా డైరెక్ట్‌గా పెదాలతో లిప్‌స్టిక్ వేయొచ్చుగా అని అడిగాడు. తేజ మాటలు విని షాకైన శుభశ్రీ.. అలాంటి పప్పులు ఉడకవంటూ అతడి చెంపపై లిప్‌స్టిక్ రుద్దింది. అయినా సరే తేజ పట్టువిడవకుండా తనకు డైరెక్ట్‌గా లిప్‌స్టిక్ కావాలని గోల చేశాడు. దీంతో అక్కడే ఉన్న షకీలా.. ఓస్ అంతేనా.. అని అతడి బుగ్గన ముద్దు పెట్టింది. అలా అతడి బుగ్గపై షకీలా లిప్‌స్టిక్ మరకలు పడ్డాయి. దీంతో అక్కడున్నవారంతా నవ్వారు. అయితే తేజ తనకు దేవుడిచ్చిన కొడుకు అని చెప్పుకొచ్చింది షకీల. చదవండి: బిగ్‌బాస్: కండబలం కంటే బుద్ధిబలం గ్రేట్ అని నిరూపించారు! -
అందుకే అడల్ట్ సినిమాలు చేశా, ఎలాగో డబ్బులు కూడా బాగా వచ్చేవి..
ఇంద్రధనస్సులో ఏడు రంగులు.. బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు.. అన్నట్లుగా బిగ్‌బాస్ ఏడో సీజన్లోనూ ఎన్నో వింతలు- విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 20 మంది కంటెస్టెంట్లతో కళకళలాడే హౌస్‌లో ఈసారి కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. పోనీ వారికి సకల సౌకర్యాలు కల్పించారా? అంటే.. అదీ లేదు! 14 మందికి సరిపడా బెడ్స్ ఇవ్వకపోవడంతో కొందరు కంటెస్టెంట్లు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి. ఈ బెడ్స్ సంపాదించుకోవడానికి ఏదో టాస్క్ పెట్టేట్లు ఉన్నాడు బిగ్‌బాస్. అందరితో కలిసిపోయిన టేస్టీ తేజ అదేదో ఈపాటికే చేసి ఉంటే కంటెస్టెంట్లకు కొంత ఉపశమనం లభించేది, కంటి నిండా నిద్రపోయే భాగ్యం దక్కేది. ఇకపోతే ఈ వారం శోభా శెట్టి, రతిక, ప్రిన్స్ యావర్, ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్, షకీలా, దామిని నామినేషన్స్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే హౌస్‌లో టేస్టీ తేజ సరదాగా మాట్లాడుతూ అందరితో కలిసిపోయాడు. అలాగే అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్తూ గొడవలు కూడా పెట్టేస్తున్నాడు. యూట్యూబ్‌లో సెలబ్రిటీలతో భోజనాలు చేస్తూ ఇంటర్వ్యూ చేసే అతడు తాజాగా హౌస్‌లో షకీలాను సైతం ఇంటర్వ్యూ చేసి తన మనసులో సందేహాలను తీర్చేసుకున్నాడు. అసలు మీరెందుకు అలాంటి సినిమాలే చేశారు? అని అడిగాడు. 500కు పైగా సినిమాలు దీనికి షకీలా స్పందిస్తూ.. ఆ సమయంలో నాకు వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోయాను. అప్పట్లో నాకు అడల్ట్ సినిమా ఆఫర్లే వచ్చాయి. అంతకుముందు చిన్నచిన్న గ్లామర్ చిత్రాలు చేశాను. నిక్కర్లు వేసుకుని గ్లామర్‌గా డ్యాన్సులు చేసినప్పుడు లేని తప్పు.. అలాంటి సినిమాల్లో చేస్తే తప్పేంటనిపించింది అని బదులిచ్చింది. అలాంటి సినిమాలు ఎన్ని చేశారని అడగ్గా.. 500కు పైగా చేశానంది షకీలా. మరి మీ ఇంట్లో ఏమీ అనలేదా? అని అడగ్గా.. డబ్బులు బాగా వచ్చేవి కదా.. అందుకే ఏమీ అనలేదు. అయినా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావేంటి? అని అడిగేసరికి తేజ తన ప్రశ్నల పరంపరకు చెక్ పెట్టాడు. ట్రాన్స్జెండర్లే తన పిల్లలు అయితే తన సొంత సోదరే తన దగ్గరున్న డబ్బంతా తీసుకుని మోసం చేసిందని బిగ్‌బాస్ షో లాంచ్ రోజే తన ఏవీలో చెప్పుకుని బాధపడింది షకీల. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ట్రాన్స్జెండర్లను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటోంది. 2014లో కన్నడ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. కానీ నెల రోజులు తిరగకముందే ఎలిమినేట్ అయింది. చదవండి: అదితి శంకర్ రచ్చ.. నెక్స్ట్ టార్గెట్ విజయ్? అంటూ కామెంట్స్.. -
Bigg Boss 7: అందరితోనూ శోభా గొడవలు.. అడ్డంగా దొరికిపోయిన తేజ!
'బిగ్‌బాస్ 7' మొదలైన రెండో రోజుకే గొడవలు షురూ అయ్యాయి. సోమవారం ఎపిసోడ్లో శివాజీ, ప్రియాంక మాత్రమే నామినేషన్స్ పూర్తి చేశారు. మంగళవారం మిగిలిన వాళ్లందరూ తమ తమ నామినేషన్స్ కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే హౌస్ అంతా గొడవ గొడవగా మారింది. శోభాశెట్టి.. పలువురు కంటెస్టెంట్స్‌తో మాటామాటా అనుకుంది. టేస్టీ తేజ ఓ విషయమై అడ్డంగా దొరికిపోయాడు. ఇంతకీ రెండో రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు Day 2 హైలైట్స్‌లో చూద్దాం. గౌతమ్ vs శోభాశెట్టి మంగళవారం ఎపిసోడ్లో భాగంగా తొలుత శోభాశెట్టిని బిగ్‌బాస్.. యాక్టివిటీ రూంలోకి పిలిచారు. గౌతమ్, కిరణ్ రాథోడ్‌ని ఆమె నామినేట్ చేసింది. తెలుగు సరిగా రాకపోవడం, మాట్లాడని కారణంగా కిరణ్‌ని నామినేట్ చేశానని చెప్పింది. కనెక్ట్ కాకపోవడం, బాండింగ్ ఏర్పడకపోవడం, పాజిటివ్ వైబ్స్ రాకపోవడంతో గౌతమ్‌ని నామినేట్ చేసినట్లు చెప్పింది. బయటకొచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుతూ.. 'నువ్వు వినడానికే రెడీగా లేవు' అని గౌతమ్‌తో శోభాశెట్టి గొడవ పెట్టుకుంది. శోభా ఏడుపు ఆ తర్వాత దామిని.. రతికని నామినేట్ చేసింది. డల్‌గా ఉందని, కిచెన్‌లో హెల్ప్ చేయలేదని కారణం చెప్పింది. శోభాశెట్టిని నామినేట్ చేస్తూ.. డిన్నర్ తర్వాత ప్లేట్ కడగలేదని రీజన్ చెప్పింది. ఇకపోతే లాన్లో కూర్చుని టేస్టీ తేజ-శోభాశెట్టి మాట్లాడుకున్నారు. తాను సహాయం చేస్తున్న అందరూ తననే నామినేట్ చేస్తున్నారని శోభా వలవలా ఏడ్చేసింది. దొరికిపోయిన తేజ ఇక ప్రిన్స్.. షకీలా, గౌతమ్‌ని నామినేట్ చేశాడు. 'నువ్వు ప్రిన్సా, మీ ఫాదర్ కింగా' అని అన్నందకు షకీలాని నామినేట్ చేశానని అన్నాడు. 'షో హాఫ్' అని తనపై కామెంట్స్ చేసినందుకు గౌతమ్‌ని నామినేట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇది జరిగిన తర్వాత కంటెస్టెంట్స్ అందరిముందే తేజ ఏమన్నాడో గౌతమ్ కృష్ణ.. ప్రిన్స్‌తో చెప్పాడు. దీంతో తేజ అడ్డంగా దొరికిపోయినట్లు అయింది. దీనిపై మాట్లాడిన తేజ.. ఎవరేం చెప్పారో, ఎవరికేం చెప్పాలో అదే చెప్పానని తనని తాను సమర్థించుకున్నాడు. ఫైనల్‌గా తమ మధ్య మిస్ అండర్ స్టాండింగ్ వచ్చిందని ప్రిన్స్-గౌతమ్ హగ్ ఇచ్చుకున్నారు. కరెక్ట్ కాదని రతిక ఆట సందీప్.. రతికని నామినేట్ చేశాడు. కిచెన్‌లో కాస్త ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తించిందనే కారణం చెప్పాడు. పనిలో హెల్ప్ చేయట్లేదనే కారణంతో ప్రిన్స్‌ని నామినేట్ చేశాడు. అయితే ఇర్రెస్పాన్సిబుల్ అనే పదం తన గురించి ఉపయోగించడం కరెక్ట్ కాదని రతిక, సందీప్‌తో వాగ్వాదం పెట్టుకుంది. మరోవైపు దామిని తనని నామినేట్ చేయడంపై శోభాశెట్టి.. ప్రిన్స్‌తో చాలాసేపు మాట్లాడింది. ఆమె(దామిని) విధానం నచ్చలేదని అతడితో చెప్పుకొచ్చింది. చెత్త రీజన్ అని ప్రశాంత్ మరోవైపు షకీలా -ప్రిన్స్‌ని నామినేట్ చేసింది. తను సరదాగా 'మీ డాడీ కింగా?' అన్నానని, దానికి అతడు సీరియస్ అయినందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. పల్లవి ప్రశాంత్ తనకు ఎక్కడో కనెక్ట్ కాలేదని నామినేట్ చేసింది. ఏదైనా పని చెబుతుంటే సరిగా పలకట్లేదని కారణం చెప్పుకొచ్చింది. షకీలా తనని ఓ చెత్త రీజన్‌కి నామినేట్ చేశారని తనలో తానే ప్రశాంత్ అనుకున్నాడు. ఇక గౌతమ్.. అందరిలో తక్కువ పని చేశారనే కారణంతో శోభాశెట్టి, ప్రిన్స్‌ని నామినేట్ చేశాడు. బయటకొచ్చిన తర్వాత మరోసారి గౌతమ్-శోభాశెట్టి మాటలతో కొట్లాడుకున్నారు. శోభాశెట్టి పశ్చాత్తాపం శుభశ్రీ.. రతిక, శోభాశెట్టిని నామినేట్ చేసింది. వాళ్లిద్దరికీ కనెక్ట్ కాలేకపోయానని, అలానే హౌసులో వాళ్లు పెద్దగా పనిచేయట్లేదని కారణాలు చెప్పుకొచ్చింది. గౌతమ్ చెప్పడం వల్లే శుభశ్రీ తనని నామినేట్ చేసిందని, ఇలాంటి మనుషులతో ఉండలేను బాబోయ్ అని శోభా తెగ పశ్చాత్తాప పడిపోయింది. ఇకపోతే పల్లవి ప్రశాంత్.. వీక్‌గా ఉన్నారని చెప్పి షకీలా, కిరణ్ రాథోడ్‌ని నామినేట్ చేశాడు. అమర్దీప్.. ప్రిన్స్, తేజని నామినేట్ చేశాడు. కిరణ్ రాథోడ్.. ప్రశాంత్, శోభాశెట్టిని నామినేట్ చేసింది. టేస్టీ తేజ.. ప్రశాంత్, కిరణ్‌ని నామినేట్ చేశాడు. మరోవైపు రతిక.. ప్రియాంక, దామినిని నామినేట్ చేసింది. అయితే ప్రియాంకని నామినేట్ చేస్తానని ముందే ఆమెకు రతిక చెప్పి వెళ్లింది. ఓవరాల్‌గా ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్‌లో నిలిచారు. నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే శోభా రతిక ప్రిన్స్ ప్రశాంత్ కిరణ్ గౌతమ్ షకీలా దామిని -
'బిగ్‌బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!
బిగ్‌బాస్ 7వ సీజన్ లో అప్పుడే గొడవలు మొదలైపోయాయి. ఆదివారం అందరినీ హౌసులోకి పంపి హోస్ట్ నాగార్జున తాళం వేశారు. ఇక సోమవారం నామినేషన్స్ స్టార్ట్ అవగా, కంటెస్టెంట్స్ మధ్య రచ్చ షురూ అయిపోయింది. ఫస్ట్ డే శివాజీ, ప్రియాంక జైన్.. తమ తమ నామినేషన్స్ గురించి చెప్పారు. దీంతో నామినేట్ అయిన వాళ్లకు శివాజీ, ప్రియాంక జైన్ కి మధ్య హాట్ హాట్ డిస్కషన్ సాగింది. రెండో రోజు మరిన్ని గొడవలు జరిగినట్లు అనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో ఫస్ట్ డే హైలైట్స్.. గొడవలు,నామినేషన్లలో ఉన్నది వీళ్లే!) గొడవ షురూ చేసిన శోభా సోమవారం ఏడుస్తూ కాస్త డల్ అయిన శోభాశెట్టి.. నామినేషన్స్ లో మాత్రం రెచ్చిపోయింది. భాషకు సంబంధించిన కిరణ్ రాథోడ్ తో తనకు ఇబ్బందులు ఉన్నాయని ఆమెని, గౌతమ్ కృష్ణని కూడా నామినేట్ చేసింది. ఇక సింగర్ దామిని.. శోభాశెట్టిని నామినేట్ చేసింది. దీంతో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. హౌసులో తనని చివరి స్థానంలో ఉంచడం అనే కారణం తనకు నచ్చలేదని ఆమెతో గొడవ పెట్టుకుంది. అలానే దామిని.. తాను చేసింది తప్పే అయ్యుండొచ్చని అంటుండగానే.. అవును తప్పే అని గట్టిగా అరుస్తూ శోభాశెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తేజతో ఆడుకున్న బిగ్‌బాస్ మరోవైపు ప్రిన్స్, షకీలా.. ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇక టేస్టీ తేజ.. రూంలోకి వెళ్లిన తర్వాత కిరణ్, రతిక పేర్లు చెప్పాడు. అయితే వాళ్లని నామినేట్ చేయడానికి చెప్పిన కారణాలు సరిగా లేవని, నామినేట్ చేయడానికి భాష అనేది కారణం కాదని చెబుతూ.. కాసేపు తేజతో బిగ్‌బాస్ ఆటాడుకున్నాడు. అలానే అక్కడే నామినేషన్స్ రూంలో పడుకోమని చెప్పగా... 'బాయ్ బిగ్‌బాస్' తాను వెళ్లొస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా ఫన్నీ మేనర్లో జరిగింది. (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీ ఫారెన్ టూర్.. కారణం అదేనా?) -
'బిగ్‌బాస్ 7'లో తొలిరోజే గొడవ? నామినేషన్లలో ఉన్నది వీళ్లే!
'బిగ్‌బాస్ 7' అసలు గేమ్ మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్‌ని ఆదివారం లోపలికి పంపించిన నాగార్జున.. హౌస్‌కి లాక్ వేసేశాడు. అలా ఆదివారం ఎపిసోడ్‌కి ఎండ్ పడింది. ఇకపోతే సోమవారం నామినేషన్స్ షురూ అయ్యాయి. హౌసులో ఫస్ట్ లవ్ ట్రాక్ కూడా మొదలైపోయింది. టేస్టీ తేజ అప్పుడే ఇద్దరి మధ్య పుల్ల పెట్టేశాడు. వీటితో పాటు తొలిరోజు ఇంకా ఏమేం జరిగాయనేది.. ఇప్పుడు Day-1 హైలైట్స్‌లో డీటైల్‌గా చూద్దాం. టాస్క్ ఇచ్చిన పొలిశెట్టి మూవీ ప్రమోషన్లో భాగంగా హౌసులోకి వెళ్లిన హీరో నవీన్ పొలిశెట్టిని సీక్రెట్ రూంలో పెట్టి బిగ్‌బాస్ లాక్ చేశాడు. హౌసులోని అమ్మాయిలందరూ కలిసి అతడిని బయటకు తీసుకొచ్చారు. అందరూ తమని తాము పరిచయం చేసుకున్నారు. అనంతరం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలోని 'లేడీ లక్' పాటని గుర్తు చేసిన నవీన్.. హౌసులో అబ్బాయిలు, అమ్మాయిల్లో నచ్చినవాళ్లకు బ్యాండ్ కట్టాలని టాస్క్ ఇచ్చాడు. బ్యాండ్ కట్టేశారు దీంతో ఆట సందీప్-ప్రియాంక జైన్‌కు, గౌతమ్ కృష్ణ- దామినికి, అమరదీప్ - శోభాశెట్టికి, పల్లవి ప్రశాంత్- రతికకి, శివాజీ-శుభశ్రీకి, ప్రిన్స్ యవర్ - కిరణ్ రాథోడ్‌కి, టేస్టీ తేజ- షకీలాకి బ్యాండ్ కట్టారు. ఆ తర్వాత లేడీ లక్ పాటకు అందరితో కలిసి డ్యాన్స్ చేసిన నవీన్.. హౌసు నుంచి బయటకొచ్చేశాడు. నాగ్ ఇచ్చిన సంకెళ్ల టాస్కులో భాగంగా గౌతమ్ కృష్ణ.. తన చేతికి ఉన్న హ్యాండ్ కఫ్ని శుభశ్రీకి వేశాడు. కాసేపటి తర్వాత అందరితో మాట్లాడిన బిగ్‌బాస్.. హౌసులో ఎన్నో కొత్త విషయాలు, ఆశ్చర్యపరిచేవి ఎన్నో రెడీగా ఉన్నాయని చెప్పారు. హౌసులో ఉన్నంత మాత్రాన హౌజ్‌మేట్స్ అయినట్లు కాదని క్లారిటీ ఇచ్చాడు. పులిహోర షురూ బిగ్ బాస్ అంటేనే పులిహోర కంపల్సరీ. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్, రతికకు బ్యాండ్ కట్టాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఈ క్రమంలోనే అసలు బిగ్ బాస్ హౌసులోకి ఎందుకు రావాలనుకున్నావ్ అని ప్రశాంత్‌ని రతిక అడిగింది. 'ఫస్ట్ టైమ్ బిగ్‌బాస్ లోకి రావాలని అనిపించి ఓ వీడియో పెట్టాను. కానీ అందరూ తిట్టడంతో డిలీట్ చేశాను. అప్పుడే షోలోకి ఎలాగైనా రావాలని ఫిక్స్ అయ్యాను' అని ప్రశాంత్, రతికతో చెప్పాడు. శోభాశెట్టి ఏడుపు రాత్రి ఒంటి గంటకు లైట్ ఆపు చేయడంతో అందరూ నిద్రపోవడానికి రెడీ అయ్యారు. కానీ మంచిగా పడుకోవడానికి రెడీ అవుతున్న సందీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్‌ని.. రతిక, టాస్క్ పేరు చెప్పి భయపెట్టింది. దీంతో వాళ్లు నిద్రపోలేదు. మిగిలిన వాళ్లందరికీ బెడ్స్ లేకపోవడంతో కిచెన్‌లో మాట్లాడుతూ టైమ్ పాస్ చేశారు. మరోవైపు శోభాశెట్టి ఏడుపు మొదలుపెట్టేసింది. 'వీక్ అవ్వకూడదు.. వీక్ అవ్వకూడదు బీ స్ట్రాంగ్' అని తనకు తానే చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రతిక టాస్క్ తిప్పలు సోమవారం ఉదయం 10:15 గంటలకు కంటెస్టెంట్స్ అందరూ నిద్రలేచారు. 'భోళా శంకర్'లోని జాం జాం జజ్జనక పాటకు స్టెప్పులేసి బిగ్ బాస్‌కి గుడ్ మార్నింగ్ చెప్పారు. ఆ తర్వాత శివాజీకి పెళ్లయిందా? లేదా? అనే టాపిక్ పైన డిస్కషన్ పెట్టారు. తనకు పెళ్లి కాలేదని, బ్యాచిలర్ అని శివాజీ చెప్పాడు. నాగార్జున ఇచ్చిన బ్రోకన్ హార్ట్ టాస్క్ పూర్తి చేసేందుకు రతిక తిప్పలు పడింది. అమరదీప్-ప్రియాంక మధ్య గొడవ పెట్టమని.. శోభాశెట్టికి చెప్పగా ఆమె నో చెప్పింది. గెలిస్తే పర్లేదు లేదంటే తను నామినేట్ అయిపోతాను కదా అని భయపడింది. ఈ టాస్క్ వల్ల నీకు అడ్వాంటేజ్ దక్కుతుంది కదా అని రతికతో శోభాశెట్టి డిస్కషన్ పెట్టింది. రతికతో పల్లవి ప్రశాంత్ టాస్క్ పూర్తి చేసేందుకు రతిక.. పల్లవి ప్రశాంత్ దగ్గరకు వెళ్లింది. దీంతో 'నీకోసం ఏ రిస్క్ అయినా సరే చేస్తా' అని మనోడు రతికతో అన్నాడు. ఆమె అలా నవ్వుతూ ఉండిపోయింది. మరోవైపు టేస్టీ తేజ-షకీలా మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. అసలు వ్యాంప్ తరహా సినిమాలు ఎందుకు చేశారు? అని షకీలాని టేస్టీ తేజ అడగ్గా.. అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయని, అవే ఒప్పుకున్నానని షకీలా సమాధానమిచ్చింది. ఈ క్రమంలోనే షకీలా, కిరణ్ రాథోడ్.. ఇద్దరికీ(వేర్వేరుగా) పెళ్లి కాలేదనే విషయం బయటపడింది. గొడవకి తేజ రెడీ టాస్క్ చేయమని.. రతిక టేస్టీ తేజని కూడా బతిమాలాడింది. కానీ అతడు కనీసం పేర్లు కూడా చెప్పొద్దని ఆమెతో అన్నాడు. ఫైనల్‌గా ఒప్పుకున్నాడు. మరోవైపు బ్రోకన్ హార్ట్ ఫస్ట్ తీసుకుంది శోభాశెట్టి. దీంతో ఇది తీసుకున్నందుకు తను కచ్చితంగా నామినేషన్స్‌లో ఉంటానని భయపడిపోయింది. పుల్లపెట్టిన టేస్టీ తేజ టేస్టీ తేజ.. ప్రిన్స్ యవర్-గౌతమ్ కృష్ణ మధ్య పుల్ల పెట్టేశాడు. ఉదయం జిమ్ చేసే సమయంలో ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకోవడం గురించి ప్రిన్స్ చెప్పింది గౌతమ్ దగ్గరికి వెళ్లి చెప్పాడు. కానీ గౌతమ్ మాత్రం ప్రిన్స్‌తో మాట్లాడటానికి నో చెప్పాడు. ఈ క్రమంలోనే ఎవరివైపు నిలబడతావ్ అని గౌతమ్, శుభశ్రీని అడిగాడు. ఆమె.. నీవైపే అని గౌతమ్‌తో చెప్పుకొచ్చింది. నామినేషన్స్ షురూ సోమవారం సాయంత్రం 6 గంటలకు తొలివారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. యాక్టివిటీ ఏరియాని నరకంలా డిజైన్ చేశారు. బిగ్ బాస్ కూడా వాయిస్ మార్చి మాట్లాడాడు. యాక్టివిటీ ఏరియాకి వెళ్లి.. అక్కడ వేలాడదీసిన ఫొటొల్లో ఎవరిదైతే చింపి, నరకపు వోల్కనోలో వేస్తారో వాళ్లు నామినేట్ అయినట్లు. మొదటగా వెళ్లిన శివాజీ.. దామిని, గౌతమ్ కృష్ణని నామినేట్ చేశాడు. అయితే అతడు చెప్పిన కారణాలు బిగ్‌బాస్‌కి నచ్చలేదు. అది అయిపోయిన తర్వాత శివాజీ.. దామిని, గౌతమ్ కృష్ణతో మాట్లాడాడు. తర్వాత యాక్టివిటీ రూంలోకి వెళ్లిన ప్రియాంక జైన్.. పల్లవి ప్రశాంత్, రతికని నామినేట్ చేసింది. తనతో వాళ్లిద్దరూ పెద్దగా కలవకపోవడం వల్లే నామినేట్ చేశానని కారణం చెప్పింది. దీనికి ప్రశాంత్, రతిక ఇద్దరూ ఒప్పుకోలేదు. సరికదా ఈ విషయమై ప్రియాంకతో యాక్టివిటీ ఏరియా నుంచి బయటకొచ్చిన తర్వాత డిస్కషన్ పెట్టారు. అలా సోమవారం ఎపిసోడ్ ఎండ్ పూర్తయింది. -
భోజనప్రియుడిగా మారిన సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజ
టేస్టీ తేజ.. పేరుకు తగ్గట్లే ఉంటుంది అతడి వ్యవహారం. యూట్యూబ్‌లో ఎప్పుడు చూసినా ఫుడ్ వీడియోలు చేస్తూ ఉంటాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోని సెలబ్రిటీలను కలుస్తూ ఉంటాడు. సినిమా వాళ్లను కలుస్తాడు అంటే ఏదైనా ఇంటర్వ్యూలు చేస్తాడో, రీల్స్ చేస్తాడో అనుకునేరు... తనదైన స్టైల్లో సెలబ్రిటీలతో కలిసి మంచి విందు భోజనం చేస్తూ కబుర్లాడతాడు. పనిలో పనిగా భోజనం చేస్తూనే సినిమా ప్రమోషన్స్ చేస్తాడు. మొదట్లో జబర్దస్త్ షోలోనూ మెరిసిన ఇతడు ప్రస్తుతం మాత్రం యూట్యూబ్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. థర్మల్ ఇంజనీరింగ్‌లో తేజ ఎంటెక్ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశాడు. కానీ యూట్యూబ్‌లో ఎంటరై పూర్తి స్థాయిలో భోజనప్రియుడిగా మారాడు. 'మొరగని కుక్క లేదు, విమర్శించని జనమూ లేరు. ఈ రెండూ లేని ఊరే లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి.. అర్థమైందా రాజా.. ఆటకు రెడీ ఈ తేజ' అంటూ బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చాడు తేజ. మరి ఇతడికి తినడం వచ్చు, కానీ వండటం ఏమేరకు వచ్చన్నది రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది. -
'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే
తెలుగు రియాలిటీ షో పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేరు 'బిగ్‌బాస్'. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి కాగా, తాజాగా ఆదివారం ఏడో సీజన్ అట్టహాసంగా మొదలైంది. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వచ్చారు. తనదైన మార్క్ చమత్కారాలతో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ని ఎంటర్టైనింగ్గా నడిపించారు. స్టార్ మాలో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి జరిగిన ఈ షోకి ఎవరెవరు వచ్చారు? లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇకపోతే 'తార్ మార్ తక్కర్ మార్' సాంగ్‌తో హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. ఈ సీజన్ అంతా కూడా ఎవరి ఊహకు అందని విధంగా ఉల్టా పల్టాగా సాగబోతుందని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇక హౌసులోకి తొలి కంటెస్టెంటుగా 'జానకి కలగనలేదు' సీరియల్ నటి ప్రియాంక జైన్ హౌసులోకి అడుగుపెట్టింది. తొలి కంటెస్టెంట్ ప్రియాంక జైన్ బిగ్ బాస్ 7వ సీజన్లో తొలి కంటెస్టెంట్‌గా 'జానకి కలగనలేదు' సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది. తప్పకుండా ఈసారి గెలిచే.. హౌస్ నుంచి బయటకు వెళ్తానని శపథం చేసింది. ఈమె స్వతహాగా యూట్యూబర్ కావడంతో స్వయంగా బిగ్ బాస్ హౌస్ అంతా తిరిగి తిరిగి చూపించింది. అయితే ఈసారి హౌసులో మూడు బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఫర్నిచర్, హౌసులో ఉండే అర్హత కూడా మీరే సంపాదించుకోవాలి అని నాగార్జున ప్రియాంకతో చెప్పుకొచ్చారు. ఎవరీ ప్రియాంక? పేదింట పుట్టిన ప్రియాంక జైన్ స్వయంకృషితో పైకి ఎదిగిన అమ్మాయి. బెంగళూరులో చదువు పూర్తి చేసిన ఈ బ్యూటీ మొదట సినిమాలు చేసింది. 2015లో తమిళంలో రంగి తరంగ చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ మరుసటి ఏడాది గోలిసోడా మూవీతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. 2018లో చల్తే చల్తే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. కానీ సినిమాలు తనకు పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో బుల్లితెరపై తన లక్ పరీక్షించుకుంది. తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ సీరియల్ స్టార్‌గా వెలుగు వెలుగుతోంది. మౌనరాగంలో తనతో పాటు నటించిన శివకుమార్‌తో ప్రేమలో ఉందీ బ్యూటీ. ప్రస్తుతం తను నటిస్తున్న ఓ సీరియల్‌కు శుభం కార్డు పడటంతో బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టింది. మరి ప్రియాంక ఇక్కడ కూడా ఓ వెలుగు వెలుగుతుందా? లేదంటే వెనకబడిపోతుందా? అనేది చూడాలి.. ఫస్ట్ టాస్క్ ఇచ్చేసిన నాగ్ హాలోగ్రామ్ ద్వారా హౌసు లోపలికి వెళ్లిన నాగార్జున.. ప్రియాంకని యాక్టివిటీ రూమ్ దగ్గరకు రమ్మని చెప్పిన హౌస్ట్ నాగార్జున. వీకెండ్ మాత్రమే కాదు ఇకపై ప్రతి క్షణం హౌసులో ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తానని చెప్పారు. అలానే ఓ సూట్ కేసు చూపించి, ఎవరికీ కనిపించకుండా దాన్ని దాచేయమని నాగ్.. ప్రియాంకతో చెప్పారు. ఒకవేళ ఎవరికైనా అది దొరికితే అందులో ఉన్న పవర్ వాళ్లకు దక్కుతుందని నాగ్ చెప్పారు. దీంతో జైలు వాష్ రూమ్ లోని కమోడ్ వెనక ప్రియాంక ఆ సూట్ కేసుని దాచిపెట్టింది. రెండో కంటెస్టెంట్‌గా హీరో శివాజీ బిగ్ బాస్ హౌసులోకి రెండో కంటెస్టెంట్ గా ప్రముఖ హీరో శివాజీ ప్రవేశించారు. పలు తెలుగు సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. చాలారోజుల నుంచి సినిమాల్లో నటించట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌసులోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఎవరీ శివాజీ? బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించే స్థాయి నుంచి సినిమా హీరోగా మారాడు శివాజీ. హీరో ఫ్రెండ్ పాత్రలు చేసే స్థాయి నుంచి హీరో రేంజ్‌కు ఎదిగాడు. అతడు నటించిన తొలి సినిమా సీతారాముల కళ్యాణం చూతము రారండీ. కానీ ఫస్ట్ రిలీజైంది మాత్రం మాస్టర్. ఈ సినిమాకుగానూ అతడు రూ.15 వేలు అందుకున్నాడు. అందరు కుర్రాళ్లలాగే ఆ డబ్బుతో అమ్మకు బంగారం కొనిచ్చాడు శివాజి. మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, అదిరిందయ్యా చంద్ర, టాటా బిర్లా మధ్యలో లైలా, సత్యభామ, మా ఆయన చంటిపిల్లాడు.. ఇలా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. నితన్కు జయం, దిల్, సంబరం సినిమాల్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. 2018లో వచ్చిన గ్యాంగ్స్టర్స్ అనే వెబ్ సిరీస్‌లో చివరిసారిగా కనిపించాడు. రాజకీయాల్లో ప్రవేశించాక సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఇన్నాళ్లకు బిగ్‌బాస్‌తో అలరించేందుకు రెడీ అయ్యాడు. అమ్మ గుర్తొచ్చి ఎమోషనల్ నటుడిగా తన తొలి చెక్ నాగార్జున చేతుల మీదుగా తీసుకున్నానని శివాజీ అప్పటి రోజులని గుర్తుచేసుకున్నారు. అలానే నాగ్ సినిమా వచ్చిన ప్రతిసారి గ్లామర్ విషయంలో తనకు తిట్లు పడతుంటాయని అన్నారు. ఇకపోతే కోడిపిల్లల్ని పెంచి, సంక్రాంతికి వాటిని అమ్మి తమని పోషించేదని శివాజీ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమెకు గోల్డ్ చైన్ కొనిచ్చాని శివాజీ చెప్పుకొచ్చాడు. మూడో కంటెస్టెంట్‌గా సింగర్ దామిని తెలుగులో పలు సినిమాల్లో పాటలు పాడి గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న దామిని.. మూడో కంటెస్టెంట్ గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. బ్లాస్ట్ బేబీ పాటతో ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎవరీ దామిని? పచ్చబొట్టేసిన.. పిల్లగాడా నీతో.. పాటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది దామిని. ఈమె పుట్టి పెరిగింది రాజమండ్రిలో అయినా తర్వాతి కాలంలో తన కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. దామిని సోదరి మౌనిమ సైతం సింగర్‌గా రాణిస్తోంది. ఈమె బాహుబలి: ద కన్‌క్లూజన్‌లో పాటలు ఆలపించింది. కాగా దామిని.. 2011లో పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో రెండో స్థానంలో నిలిచింది. తన గాత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమెకు సినిమాలో పాడే అవకాశాలు వచ్చాయి. అయితే సినిమా పాటలే కాకుండా సొంతంగా ఆల్బమ్స్ కూడా చేస్తోంది దామిని. స్టేజీ షోల ద్వారా సైతం తన గాత్రంతో సంగీతప్రియులను ఉర్రూతలూగిస్తోంది. నాలుగో కంటెస్టెంట్‌గా ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ హౌసులోకి నాలుగో కంటెస్టెంట్‌గా మోడల్ ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చాడు. 'బ్యాడ్ బాయ్' పాటకు స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నాడు. ఎవరీ ప్రిన్స్ యావర్? ఇతడి బాడీ చూస్తే మీకీపాటికే అర్థమైపోయుంటుంది మోడల్ అని! ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఇతడు మోడలింగ్‌లో ఇప్పటికే సత్తా చాటాడు. కానీ తెలుగువారికి మాత్రం పెద్దగా పరిచయం లేడు. ఆ మధ్య తెలుగులో ఓ సీరియల్లో నటించినట్లు తెలుస్తోంది. ఏదైనా ఉద్యోగం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఇంత మంచి అవకాశాన్ని వదులుకునేందుకు ఎవరు మాత్రం ఇఇష్టపడతారు. అందుకే వెంటనే ఓకే చేశాడు. ఇప్పుడిప్పుడే తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఐదో కంటెస్టెంట్‌గా నటి శుభశ్రీ బిగ్ బాస్ హౌసులోకి ఐదో కంటెస్టెంట్‌గా యూట్యూబర్ శుభశ్రీ ప్రవేశించింది. ట్రెండింగ్ సాంగ్ 'సమ్మోహనుడా' స్టెప్పులేసి, గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎవరీ శుభశ్రీ? శుభశ్రీ రాయగురు ప్రొఫెషనల్‌గా లాయర్.. కానీ సినిమాలు చేస్తుంది. తెలుగు రాదు, కానీ తెలివి మాత్రం చాలా ఉందంటోంది శుభశ్రీ. ఒడిశాలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. ఐదుగురికి ఫస్ట్ టాస్క్ పెట్టిన నాగ్ తొలి కంటెస్టెంట్ ప్రియాంకకు ఇచ్చిన సూట్ కేసులో ఉన్న క్యాష్ తీసుకుని హౌసు నుంచి వెళ్లిపోమని ఆమెకు నాగ్ ఆఫర్ ఇచ్చారు. కానీ ఆమె నో చెప్పి క్యాన్సిల్ చేసుకుంది. మిగతా నలుగురు కంటెస్టెంట్స్ కూడా ఆ సూట్ కేసుని తీసుకుని బయటకెళ్లిపోవడానికి ససేమిరా అన్నారు. తొలుత రూ.20 లక్షలు, ఆ తర్వాత రూ.25 లక్షలు, అనంతరం రూ.30 లక్షలు అని హోస్ట్ నాగ్ ఆఫర్ చేసినా సరే అందరూ నో అంటే నో అని చెప్పేశారు. ఆరో కంటెస్టెంట్‌గా షకీలా బిగ్ బాస్ హౌసులోకి ఆరో కంటెస్టెంట్‌గా నటి షకీలా ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు అయినా ఈమె తన గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఒకప్పుడు షకీలా అని ఇప్పుడు షకీ అమ్మ అని చెప్పుకొచ్చింది. అలానే ఈమె చూసుకుంటున్న ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌ని(తంగం & షాషా) నాగ్ స్టేజీపైకి పిలిచారు. ఎవరీ షకీలా? బోల్డ్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు షకీల. వెండితెరపై బోల్డ్‌గా కనిపించే ఆమె నిజ జీవితంలోనూ అలాగే ఉంటారనుకుంటే పొరపాటే! రియల్ లైఫ్‌లో చాలా సాఫ్ట్‌గా కనిపించే ఆమె 18 ఏళ్లకే నటించడం మొదలుపెట్టింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన ఆమె గతంలోనూ బిగ్‌బాస్ షోలో పాల్గొంది. ఏడో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ బిగ్ బాస్ హౌసులోకి ఏడో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ ఎంట్రీ ఇచ్చారు. 'దళపతి' పాటకు స్టెప్పులేసి తన గ్రాండ్ ఎంట్రీని చాటుకున్నారు. ఇకపోతే ఈ మధ్య 'నీతోనే డ్యాన్స్' షోలో సందీప్ విజేతగా నిలవడం విశేషం. ఎవరీ సందీప్? టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్‌గా ఈయన చాలామందికి సుపరిచితం. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా డ్యాన్సరే! అయితే ఆట సందీప్‌కు తాను చెప్పింది తప్పితే ఎదుటివాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడడు, అసలు వినిపించుకోడు. ఇటీవలే అతడు తన భార్యతో కలిసి నీతోనే డ్యాన్స్ కప్ గెలిచాడు. అయితే ఈ షో జరిగినన్ని రోజులు గేమ్ అమర్ దీప్ ఫ్యాన్స్ వర్సెస్ ఆట సందీప్ ఫ్యాన్స్ అన్నట్లుగా నడిచింది. మరి బిగ్‌బాస్‌లోనూ వీరి మధ్య వార్ జరుగుతుందా? ఆట సందీప్ తన కోపాన్ని నిగ్రహించుకుని ఎక్కువ వారాలు కొనసాగుతాడా? అన్నది చూడాలి! ఎనిమిదో కంటెస్టెంట్‌గా నటి శోభాశెట్టి బిగ్ బాస్ హౌసులోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా కార్తీకదీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభాశెట్టి ఎంట్రీ ఇచ్చింది. జిమ్మిక్కి పొన్ను పాటకి మంచి స్టెప్పులేసి ఆకట్టుకుంది. అయితే శోభాశెట్టితో మాట్లాడిన హోస్ట్ నాగార్జున.. హౌసులో ఎవరైనా సరే బ్యూటీఫుల్ అని చెబితే శోభాకు వీకెండ్ లో పనిష్మెంట్ ఇస్తానని చెప్పారు. ఎవరీ శోభాశెట్టి? శోభా శెట్టి అంటే గుర్తుపడతారో లేదో కానీ కార్తీకదీపం మోనిత అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. డాక్టర్‌బాబును దక్కించుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నిన అందమైన విలనే మోనిత అలియాస్ శోభా శెట్టి. ఈమె స్వస్థలం కర్ణాటక అయినా అచ్చ తెలుగింటి అమ్మాయిగా సీరియల్లో నటించి విశేష అభిమానులను దక్కించుకుంది. ఇంత పాపులారిటీ ఉన్న చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడింది. ఇంటి నుంచి స్కూలుకు వెళ్లాలంటే కూడా కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేదట! ఈ క్రమంలో తన చెప్పులు తెగిపోతే కుట్టించుకోవడానికి కూడా డబ్బుల్లేక సేఫ్టీ పిన్ సాయంతో దాన్ని నెట్టుకొచ్చేదట. కొన్నిసార్లయితే కాళ్లకు చెప్పులు లేకుండానే స్కూలుకు నడిచి వెళ్లింది. నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కన్నడలో అంజనీపుత్ర సినిమాలో చిన్న పాత్రలో నటించింది. తెలుగు సీరియల్లో మోనిత పాత్రతో లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువైంది. మరి బిగ్‌బాస్ షోతో వారి మనసులు కూడా దోచుకుంటుందేమో చూడాలి! తొమ్మిదో కంటెస్టెంట్‌గా టేస్టీ తేజ ఫుడ్ వీడియోలతో పాపులర్ అయిన టేస్టీ తేజ.. బిగ్ బాస్ హౌసులోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ వచ్చాడు. తన గురించి చెబుతూ ఫన్ క్రియేట్ చేశాడు. ఈసారి హౌసులో ఇతడు మంచి కామెడీ జనరేట్ చేస్తాడని ఏవీ చూస్తేనే అర్థమైపోయింది. ఇకపోతే టేస్టీ తేజ.. థర్మల్ ఇంజినీరింగ్‌లో ఎమ్.టెక్ చేశాడు. ఎవరీ టేస్టీ తేజ? టేస్టీ తేజ.. పేరుకు తగ్గట్లే ఉంటుంది అతడి వ్యవహారం. యూట్యూబ్‌లో ఎప్పుడు చూసినా ఫుడ్ వీడియోలు చేస్తూ ఉంటాడు. తరచూ సెలబ్రిటీలను కలుస్తూ ఉంటాడు. సినిమా వాళ్లను కలుస్తాడు అంటే ఏదైనా ఇంటర్వ్యూలు చేస్తాడో, రీల్స్ చేస్తాడో అనుకునేరు... తనదైన స్టైల్లో సెలబ్రిటీలతో కలిసి మంచి విందు భోజనం చేస్తూ కబుర్లాడతాడు. పనిలో పనిగా భోజనం చేస్తూనే సినిమా ప్రమోషన్స్ చేస్తాడు. మొదట్లో జబర్దస్త్ షోలోనూ మెరిసిన ఇతడు ప్రస్తుతం మాత్రం యూట్యూబ్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. బిగ్‌బాస్ షోతో జనాలకు మరింత దగ్గరవ్వాలనుకుంటున్న ఇతడు ఏడో సీజన్లో పాల్గొన్నాడు. మరి అతడి కల ఎంతమేరకు నెరవేరుతుందో చూడాలి! పదో కంటెస్టెంట్‌గా నటి రతిక బిగ్ బాస్ హౌసులోకి యువ నటి రతిక.. పదో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈమె.. తనకు గుర్తింపు రాలేదని అందుకే హౌసులోకి వచ్చానని చెప్పుకొచ్చింది. ఎవరీ రతిక? రతిక రోజ్ అచ్చ తెలుగమ్మాయి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. ముందుగా మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ నటనపై ఆసక్తితో సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించలేదు. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీలో ఓ పాత్రలో నటించింది. నేను స్టూడెంట్ సర్ చిత్రంలో పోలీసాఫీసర్‌గా మెప్పించింది. తనకంటూ ఫేమ్ రావాలని బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేసింది. మరి ఈ అమ్మడు ఈ షో ద్వారా ఏ రేంజ్లో క్లిక్ అవుతుందో చూడాలి! స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ 'ఖుషి' ప్రమోషన్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ.. బిగ్ బాస్ హౌసులోకి స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. హోస్ట్ నాగ్ తో ఫన్ జనరేట్ చేశాడు. ఇక హీరోయిన్ సమంత ఎక్కడా అని నాగ్, విజయ్ దేవరకొండని అడగ్గా ఆమె అమెరికాలో ఉందని, త్వరలో తిరిగొస్తుందని చెప్పాడు. అలానే సీజన్ ప్రారంభమైన తొలిరోజే ఓ స్టార్.. హౌసులోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఫర్నిచర్ టాస్క్.. రూమ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇకపోతే హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన తొలి పదిమంది కంటెస్టెంట్స్ మధ్య.. గెస్టుగా వచ్చిన విజయ్ దేవరకొండ పర్యవేక్షణలో ఓ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా 7 నిమిషాల్లో స్టోర్ రూమ్ నుంచి ఫర్నిచర్.. బయట మార్క్ చేసిన ప్లేసులో పెడితే అవన్నీ కంటెస్టెంట్స్ కి చెందుతాయని నాగార్జున అన్నారు. అనంతరం వీళ్లలో బాగా కష్టపడిన శుభశ్రీకి డీలక్స్ రూమ్, ఆట సందీప్ కి స్టాండర్డ్ రూమ్ ఇచ్చారు. పదకొండో కంటెస్టెంట్‌గా హీరో గౌతమ్ బిగ్ బాస్ హౌసులోకి పదకొండో కంటెస్టెంట్‌గా డాక్టర్ గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో 'ఆకాశ వీధుల్లో' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఎంట్రీతోనే చేతికి బేడీలు వేసి, ఓ టాస్క్ కూడా ఇతడికి నాగార్జున ఇచ్చాడు. ఎవరీ గౌతమ్? డాక్టర్ గౌతమ్ కృష్ణ బిగ్‌బాస్ షోలో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్‌కు చిన్నప్పటి నుంచే రైటర్, డైరెక్టర్ కావాలని ఉండేదట. అయితే తన పేరెంట్స్‌కు మాత్రం సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒకరకమైన భయం. దీంతో వారికోసం చదువుపై దృష్టిపెట్టాడు. అలా డాక్టరయ్యాడు. అతడికి ఉన్న ఆసక్తి మేరకు హీరోగానూ మారాడు. ఆకాశవీధుల్లో సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన అతడు డాక్టర్‌ను కాబట్టి అందరికీ పనికొస్తాను, తనను నామినేట్ చేయొద్దు అంటున్నాడు. మరి ఈ డాక్టర్ బాబు హౌస్‌లో ఎన్నాళ్లు ఉంటాడో చూడాలి! పన్నెండో కంటెస్టెంట్‌గా కిరణ్ రాథోడ్ పలు దక్షిణాది సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ రాథోడ్.. పన్నెండో కంటెస్టెంట్ గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. తనకు బాగా పేరు తెచ్చిన 'జెమిని' సినిమాలోని పాటకు స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఎవరీ కిరణ్ రాథోడ్? కిరణ్ రాథోడ్.. ఈమె బాలీవుడ్ నటి రవీనా టండన్ కజిన్ కూడా! హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేను చిత్రంతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీకి రజనీకాంత్ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో ఈ ఛాన్స్ వదిలేసుకుంది. 2016లో భాజా భజంత్రీలు(డబ్బింగ్) సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈమె ప్రస్తుతం రీఎంట్రీకి రెడీ అయింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లియో సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇంతలో కిరణ్ రాథోడ్ బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టింది. మరి తన రీఎంట్రీకి బిగ్‌బాస్ 7 ఎలా ఉపయోగపడుతుందో చూడాలి! పదమూడో కంటెస్టెంట్‌గా పల్లవి ప్రశాంత్ గత కొన్నిరోజుల నుంచి అనుకున్నట్లుగానే యువరైతు, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ హౌసులోకి పదమూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తన గురించి ఎమోషనల్ అయ్యాడు. ఎవరీ పల్లవి ప్రశాంత్? వ్యవసాయం అంటేనే ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఓ యువకుడు మాత్రం దాన్నే నమ్ముకున్నాడు. ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వ్యవసాయాన్ని వదిలిపెట్టేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. అతడే యువ రైతు పల్లవి ప్రశాంత్.. తను చేసే ప్రతి పనిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. రైతు బిడ్డను అన్నా.. అంటూ ప్రతిసారి ఎమోషనల్ వీడియోలు చేస్తుంటాడు పల్లవి ప్రశాంత్. బిగ్‌బాస్‌కు వెళ్లాలనేది తన కల అని నిత్యం చెప్తూ ఉండే ఇతడు ఎట్టకేలకు ఆ కోరిక నెరవేర్చుకున్నాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. షోలో పార్టిసిపేట్ చేయాలన్న కల నెరవేర్చుకున్నాడు, అక్కడివరకు బానే ఉంది.. కానీ హౌస్‌లో కూడా సింపథీ ప్లాన్ వర్కవుట్ చేయాలనుకుంటే మాత్రం కష్టమే.. మరి ఇతడి గేమ్ ఎలా ఉండబోతుందో రానున్న రోజుల్లో తేలనుంది. పద్నాలుగో కంటెస్టెంట్‌గా అమర్దీప్ బిగ్ బాస్ హౌసులోకి పద్నాలుగో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు అమర్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. 'పూనకాలు లోడింగ్' పాటకు సూపర్ స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. ఎవరీ అమర్దీప్? తెలుగబ్బాయి అమర్దీప్. విదేశాల్లో చదువుకున్న ఇతడికి సినిమాలపై ఆసక్తి ఉండేది. మొదట పరిణయం అనే షార్ట్ ఫిలిం చేయగా అది బాగా క్లిక్ అయింది. దీంతో ఆఫర్స్ వచ్చాయి. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్ చేశాడు. అక్కడి నుంచి సినిమాలు, సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ వర్క్ చేశాడు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడు. జనాల్లో పాపులారిటీ పెరగడంతో సీరియల్ హీరోగా మారాడు. అప్పుడప్పుడూ షోలలోనూ కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. రాజుగారి కిడ్నాప్, అభిలాష, ఐరావతం, ప్రేమదేశం సినిమాలు కూడా చేశాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడు అమర్దీప్. అయితే బిగ్‌బాస్ ప్రేక్షకులకు మాత్రం ఐదో సీజన్లోనే ఇతడు దగ్గరయ్యాడు. అప్పుడు మానస్‌కు సపోర్ట్ చేసేందుకు బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చాడు అమర్. తన మాటలతో, ప్రవర్తనతో అందరినీ బుట్టలో వేసుకున్నాడు. ఇతడు నెక్స్ట్ సీజన్లో రావడం ఖాయం అనుకున్నారంతా! కానీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు షోలో అడుగుపెట్టాడు బుల్లితెర హీరో. గతేడాది నటి తేజస్వినిని పెళ్లి చేసుకున్న అమర్ భార్యతో కలిసి షోలో పాల్గొంటాడునుకున్నారు. కానీ చివరకు ఒక్కడే వచ్చేశాడు. ఇక పదిహేనో కంటెస్టెంట్ అనే నాగ్ చెప్పేసరికి హీరో నవీన్ పొలిశెట్టి వచ్చాడు. అతడిని హౌసులోకి పంపిన తర్వాత గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ని ముగించేశారు. సోమవారం ఎపిసోడ్ లో హౌస్‌మేట్స్‌తో అతడు చేసే ఎంటర్ టైన్మెంట్ చూపించనున్నారు. ఇప్పటివరకు 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే వచ్చారు. దాదాపు సోషల్ మీడియాలో వినిపించిన వాళ్లే హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గత సీజన్ 20 మంది.. లాంచ్ ఎపిసోడ్లో వచ్చారు. మరి ఈసారి ఆ నంబర్ తగ్గించారా? లేకపోతే మిగిలిన వాళ్లని వారం వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌసులోకి పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.