
బిగ్‌బాస్ హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్ల రాక కొనసాగుతోంది. ఇప్పటివరకు అఖిల్, దేత్తడి హారిక, మానస్, ప్రియాంక జైన్ వచ్చి వెళ్లగా నేడు పునర్నవి, వితికా షెరు ఇంట్లో అడుగుపెట్టారు. వీరు గేమ్స్ ఆడేందుకు నిఖిల్, గౌతమ్‌ను సెలక్ట్ చేశారు. వీళ్లిద్దరూ మరో ఇద్దర్ని సెలక్ట్ చేయాల్సి రాగా నిఖిల్.. పృథ్వీ పేరు సూచించాడు. గౌతమ్ క్షణం ఆలోచించకుండా ప్రేరణ పేరు ఎంపిక చేశాడు.

షాక్‌లో తేజ
తన పేరు చెప్తాడని ఊహించిన తేజకు ఇది పెద్ద షాకే! నన్నెందుకు సెలక్ట్ చేయలేదని తేజ హర్టయ్యాడు. గెలిచినా, గెలవకపోయినా అవకాశం వస్తుందేమో ఆడదామనుకున్నాను, ఇలా సెలక్ట్ చేయనప్పుడు బాధనిపిస్తుంది.. దీన్ని సింపతీ అనుకుంటే నేనేం చేయలేను అని తేజ ఫ్రస్టేట్ అయ్యాడు.
ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్
ఫైనల్‌గా నిఖిల్ గెలిచి కంటెండర్ అవగా ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చినట్లు భోగట్టా! తనను టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తీసేయడంతో ప్రేరణ అస్సలు తట్టుకోలేకపోతుందట!
Comments
Please login to add a commentAdd a comment