Prerana Kambam
-
బిగ్‌బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?
అందాల రాక్షసి.. బిగ్‌బాస్ ప్రేరణకు అంకితమిచ్చిన ట్యాగ్‌లైన్ ఇది. ఈ అందాల భామకు ముక్కు మీద కోపం. ఎవరైనా ఒక్క మాటంటే దానికి పది మాటలు తిప్పి కొడుతుంది. తనను చులకన చేస్తే బుసకొట్టిన పాములా లేస్తుంది. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడుతుంది. మగవాళ్లకు బలమైన పోటీ ఇస్తుంది. బుద్ధిబలం కూడా మెండు.విపరీతమైన నెగెటివిటీకానీ నోటిదురుసే ఎక్కువ! సిగ్గు లేదా? క్యారెక్టర్‌లెస్? ఆ ముఖం చూడు.. ఇలాంటి మాటలన్నీ తన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలే! మెగా చీఫ్ అయ్యాక నా మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తించింది. తిండి దగ్గర కూడా ఆంక్షలు పెట్టి అభాసుపాలైంది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. పారితోషికం ఎంతంటే?కానీ తప్పు ఎక్కడ జరుగుతుందో వెంటనే తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అందుకే టాప్ 5లో నిలబడిన ఏకైక మహిళగా నిలిచింది. తనకు సూట్‌కేస్ ఆఫర్ చేసినా నిర్మొహమాటంగా నో చెప్పింది. ప్రేక్షకులు తనను ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్తానని నిలబడింది. నాలుగో స్థానంలో వీడ్కోలు తీసుకుంది. ప్రేరణ వారానికి రూ.2 లక్షల చొప్పున పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.30 లక్షలు వెనకేసిందట!చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం.. -
బిగ్‌బాస్ 8: ప్రేరణ, అవినాష్ ఎలిమినేట్!
బిగ్‌బాస్ రియాలిటీ షో మొదలై ఎనిమిదేళ్లు కావస్తోంది. కానీ ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా టైటిల్ గెలవలేదు. ఎలాగైనా సరే ఈసారి ట్రోఫీ అందుకుని చరిత్ర తిరగరాయాలని ప్రేరణ బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లుగానే ఎంతో కష్టపడింది. అబ్బాయిలతోనూ ధీటుగా పోరాడింది. తను పాల్గొన్న ప్రతి టాస్కులోనూ విజృంభించి ఆడింది. లేడీ ఫైటర్ అని పేరు తెచ్చుకుంది. టాప్ 3లో కూడా చోటు దక్కించుకోని ప్రేరణకానీ మైక్రో మేనేజ్మెంట్ వల్ల విమర్శలపాలైంది. అందరికీ ఓపికగా వంటచేసినప్పటికీ కిచెన్‌లో గొడవలు పడి నెగెటివిటీ మూటగట్టుకుంది. ప్రేరణ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే స్థాయి నుంచి ఈమె ఫైనల్‌కు అయినా వస్తుందా? అనే స్థాయికి పడిపోయింది. అందుకే టాప్3లో కూడా స్థానం దక్కించుకోలేదు.విజేత ఎవరు?ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ 8 గ్రాండ్ ఫినాలే షూటింగ్ సగం పూర్తయింది. మొదటగా ముక్కు అవినాష్‌ను ఎలిమినేట్ చేయగా నాలుగో స్థానంలో ప్రేరణను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. టాప్ 3లో నిఖిల్, నబీల్, గౌతమ్ కృష్ణ మిగిలారు. మూడో స్థానం నబీల్దే అన్న విషయం అందరికీ తెలుసు.. ఇక విన్నర్, రన్నర్ ఎవరనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎవర్నీ వాడుకోలేదన్న నిఖిల్.. ప్రేరణ బెస్ట్ మెగా చీఫ్!
టాప్ 5 ఫైనలిస్టుల్లో గౌతమ్, అవినాష్ జర్నీ వీడియోలు అయిపోయాయి. ఈరోజు మిగతా ముగ్గురి వీడియోలు ప్లే చేశారు. మరి బిగ్‌బాస్ వారిని ఏ రేంజ్లో పొగిడారో నేటి (డిసెంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మీ మనసు ఒప్పుకోలేదుఒక్క బొట్టుతో మొదలై మహానదిగా మారే నదిలా మీ ప్రయాణం సాగింది. ఎన్నో నిందలు వేసినా ఏకాగ్రత కోల్పోలేదు. ఎన్నో బంధాలు మీతో చివరివరకు కలిసి నడవలేకపోయాయి. ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. మీరిద్దరూ ఒకరితో ఒకరు, ఒకరికోసం ఒకరు నిలబడ్డారు, ప్రత్యర్థులతో తలపడ్డారు. గ్రూప్ గేమ్ అని మీ ఆటను వేలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు మీ స్నేహం కోసం ఆడారు. రక్తాన్ని చిందించావ్మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. అప్పుడు మీ మనసుకైన గాయాన్ని మనసులోనే దాచుకున్నారు. మీరొక స్మార్ట్ గేమర్. మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్‌గా ఉన్నారు. మీ సత్తాను పరీక్షించే టాస్కుల్లో రక్తాన్ని సైతం చిందించి దూకుడు చూపించారు. మీరు నిజమైన జెంటిల్మెన్. రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ఇంట్లోకి వచ్చినప్పుడు ఓజీ (పాత కంటెస్టెంట్ల)కోసం లీడర్లా నిలబడ్డారు. మీకన్నా ఇంటికోసమే ఎక్కువ ఆలోచించారు. ఆ లోటు నాకు తెలుసుసరదాకు మీరేం చేసినా హద్దులు దాటలేదు. మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చినా మీ మనసులోని ఆ ఒక్క లోటు నాకు తెలుసు. మనసుకు దగ్గరైన ప్రతీది మీకు దక్కాలని కోరుకుంటున్నా అంటూ అతడి ప్రియురాలు కావ్య తిరిగి అతడితో కలిసిపోవాలని పరోక్షంగా కోరుకున్నాడు. తర్వాత జర్నీ వీడియోలో నిఖిల్‌కు రాఖీ భాయ్ లెవల్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనన్న నిఖిల్. ఎవరినీ ఆడుకుని, వాడుకుని ఇక్కడిదాకా రాలేదని కుండబద్ధలు కొట్టి చెప్పాడు.ఆ పట్టుదల వల్లే..తర్వాత ప్రేరణ వంతు రాగా.. సందర్భోచితంగా మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరే ఈ స్థాయిలో నిలబెట్టింది. పసిపాపలాంటి అమాయకత్వం అందరికీ దగ్గర చేసింది. ఓటమిని ఒప్పుకోని తత్వమే మిమ్మల్ని ఎన్నోసార్లు గెలుపు అంచులవరకూ తీసుకెళ్లింది. ఆ పట్టుదల వల్లే మెగా చీఫ్ అయ్యారు. కానీ అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తనమన బేధం లేకుండా మెగా చీఫ్‌గా వ్యవహరించారు. కానీ ఇంటిసభ్యుల దృష్టిలో వరస్ట్ మెగా చీఫ్ అయ్యారు. మనసారా ఏడ్చేసిన ప్రేరణఅయితే బిగ్‌బాస్ దృష్టిలో మాత్రం మీరు బెస్ట్ మెగా చీఫ్. తప్పు జరిగితే స్నేహితుల్నైనా నామినేట్ చేసేందుకు వెనుకాడలేదు. మీలోని మొండిఘటం మిమ్మల్ని ప్రశ్నించినవారికి చెమటలు పట్టించింది. ఆ లక్షణమే టాప్ 5కు తీసుకొచ్చింది. వివాహితలు కూడా ఎంతో సాధించివచ్చని, మీ ప్రయాణంతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారని భావిస్తున్నా.. అంటూ బిగ్‌బాస్ తన జర్నీ వీడియో చూపించాడు. దీన్నంతటినీ ఆస్వాదిస్తూనే మనసారా ఏడ్చేసింది ప్రేరణ.వరంగల్ కా షేర్ నబీల్అనంతరం నబీల్ అఫ్రిది గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. వరంగల్ కా షేర్ నబీల్ అన్న పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో సుపరిచితం. మీ టాలెంట్, వ్యక్తిత్వాన్ని కోట్లమందికి తెలియజేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎవిక్షన్ షీల్డ్ త్యాగం చేసి ఉన్నతంగా ఆలోచించే గుణానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. మీరు సెల్ఫ్ మేడ్. అందుకే ఆత్మగౌరవం కూడా ఎక్కువే. దాన్ని ప్రశ్నించినవారికి ఆటతోనే ధీటుగా జవాబిచ్చారు. బలహీనత కాదు బలంఈ ఇంటి మొదటి మెగా చీఫ్‌గా నిలిచారు. మీలో ఫైర్ తగ్గిందన్నప్పుడు మీ సామర్థ్యాన్ని ప్రశ్నించుకున్నారు. మీ చుట్టూ ఉన్న తారల తళుకుబెళుకుల మధ్య ఒక సామాన్యుడిలా ఒంటరై నిల్చున్నట్లు మీకనిపించింది. కానీ అది మీ బలహీనత కాదు మీ బలం అంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు. అది చూసి నబీల్ ఓపక్క సంతోషిస్తూనే మరోపక్క కంటతడి పెట్టుకున్నాడు. మొత్తానికి అందరి జర్నీ వీడియోలు పూర్తయ్యాయి. ఇక విన్నర్‌ను తేల్చడం మాత్రమే మిగిలింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ ముగ్గురికి బిగ్‌బాస్ అన్యాయం.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ప్రేరణ
బిగ్‌బాస్ ఫైనల్ వీక్‌లో టాప్ 5 కంటెస్టెంట్లు ఆడుతూపాడుతూ గడిపేస్తారు. అలాగే తమ జర్నీ వీడియోలు చూసుకుని మురిసిపోతుంటారు. అయితే సగం వారం అయిపోయాకగానీ ఈ జర్నీ వీడియోలు ప్లాన్ చేయలేదు బిగ్‌బాస్. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లయిన అవినాష్, గౌతమ్‌ల స్పెషల్ జర్నీని నిన్నటి ఎపిసోడ్లో చూపించాడు. పక్షపాతం?సీజన్ ప్రారంభం నుంచి ఉన్న కంటెస్టెంట్లు ప్రేరణ, నిఖిల్, నబీల్ జర్నీ వీడియోలు ఈరోజు ప్లే చేయనున్నాడు. 70 రోజులు హౌస్‌లో ఉన్న ఇద్దరి కోసం ఒక ఎపిసోడ్ అంతా కేటాయిస్తే వంద రోజులకు పైగా ఉన్న ముగ్గురినీ ఒకే ఎపిసోడ్లో సర్దేయడమేంటని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రేరణగా నిలిచావ్ఇక తాజా ప్రోమోలో ప్రేరణ భావోద్వేగానికి లోనైంది. పసిపాపలా హౌస్‌లో అడుగుపెట్టావ్.. పెళ్లి దేనికీ అడ్డుకాదని, పెళ్లయిన మహిళలు కూడా ఎంతో సాధించవచ్చని ఎంతోమందికి ప్రేరణగా నిలిచావంటూ బిగ్‌బాస్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇంటి సభ్యుల దృష్టిలో వరస్ట్ మెగా చీఫ్ కానీ నా దృష్టిలో మాత్రం బెస్ట్ మెగా చీఫ్ అని చెప్పడంతో ప్రేరణ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణకు కలిసొచ్చిన లక్.. టాప్ 5పై గెలవని సీరియల్ బ్యాచ్
మరో ఐదు రోజుల్లో కంటెస్టెంట్లు ఉండరు, బిగ్‌బాస్ హౌసూ ఉండదు. ఉన్న నాలుగురోజులైనా టాప్ 5 కంటెస్టెంట్లను, వారి జర్నీని, బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌ను ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందామంటే బిగ్‌బాస్ ఆ ఛాన్సే ఇవ్వట్లేదు. వరుసపెట్టి సీరియల్ ఆర్టిస్టులను పంపిస్తూనే ఉన్నాడు. సీరియల్స్ ప్రమోషన్ జరిపిస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజెవరొచ్చారో నేటి (డిసెంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..సీరియల్ బ్యాచ్‌పై గెలుపువంటలక్క సీరియల్ టీమ్ హౌస్‌లోకి వచ్చింది. వీరితో ప్రేరణ, అవినాష్ గేమ్ ఆడి గెలిచారు. దీంతో బిగ్‌బాస్ రూ.10,928 ప్రైజ్‌మనీలో యాడ్ చేశాడు. తర్వాత మగువ.. ఓ మగువ సీరియల్ టీమ్ హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్ చేసింది. అప్పుడు కూడా అవినాష్ తన కామెడీ యాంగిల్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అనంతరం అందరూ కలిసి ఓ ఫన్ గేమ్ ఆడారు. ప్రేరణ నోటికి తాళంమ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు ఒకరి చేతిలోని బాక్స్‌ను మరొకిరి ఇస్తూ పోవాలి. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఎవరి చేతిలో అయితే ఆ బాక్స్ ఉంటుందో దాన్ని తెరిచి అందులో ఏది రాసుంటే అది ఫాలో అయిపోవాలి. అలా మొదటగా ప్రేరణ చేతిలో బాక్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ ఆగిపోయింది. అందులో గేమ్ అయిపోయేవరకు ప్రేరణ నోరు తెరవకూడదని ఉంది. ఆమె తరపున అవినాష్ మాట్లాడాలని ఉంది. దెబ్బలు తిన్నాడ్రోయ్రెండో రౌండ్లో అవినాష్ వంతురాగా.. తనకు ఇచ్చిన టాస్క్ ప్రకారం అందరిపై ఫేక్ పొగడ్తలు కురిపించాడు. తర్వాత నిఖిల్ మార్నింగ్ పనులను డ్యాన్స్ రూపంలో చేయగా.. నబీల్ రెండు పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తిన్నాడు. చివర్లో అవినాష్ అందరితో దెబ్బలు తిన్నాడు. అనంతరం మగువ ఓ మగువ టీమ్‌తో ప్రేరణ, గౌతమ్ టాస్క్ ఆడి రూ.10,0010 గెలిచారు.ప్రేరణకు కలిసొచ్చిన అదృష్టంబీబీ పరివారంపై మా పరివారం ఇప్పటివరకు ఒక్క టాస్క్ గెలిచిందే లేదు! మరి రేపటి ఎపిసోడ్లో అయినా ఈ రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారేమో చూడాలి! అలాగే వచ్చిన అందరూ.. హౌస్‌లో ఒక్క అమ్మాయే ఉందంటూ ప్రతి గేమ్‌లోనూ తననే సెలక్ట్ చేసుకుంటున్నారు. అలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వందశాతం ఉపయోగించుకుంటోంది ప్రేరణ. ఈ టాస్కుల్లో తన కష్టాన్ని చూసి ప్రేరణకు మరిన్ని ఓట్లు పడే అవకాశం లేకపోలేదు. -
ప్రేమ పెళ్లి ముద్దు అన్న నిఖిల్.. అవినాష్‌ను ఆడుకున్న బిగ్‌బాస్
నామినేషన్స్ అయిపోయాయి. బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5 ఫైనలిస్టులు మాత్రమే మిగిలారు. ఈ చివరివారంలో కూడా ప్రైజ్‌మనీ పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ గేమ్స్‌లో గెలవకపోతే ప్రైజ్‌మనీ కట్ అవుతుందన్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సీరియల్ పరివారం వర్సెస్ బీబీ పరివారంసీరియల్ సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌కు వస్తారని చెప్పాడు బిగ్‌బాస్. మా సీరియల్ పరివారంతో బీబీ పరివారం పోటీపడి ఆటలు ఆడి గెలిచి ప్రైజ్‌మనీని పెంచుకోవచ్చన్నాడు. ఓడిపోతే ప్రైజ్‌మనీ కూడా తగ్గుందన్నాడు. మొదటగా నువ్వుంటే నా జతగా సీరియల్ టీమ్ అర్జున్ కళ్యాణ్, అను హౌస్‌లోకి వచ్చారు. వీరితో ఆడాల్సిన గేమ్‌కు రూ.12,489 ప్రైజ్‌మనీ నిర్ణయించారు. ఒగ్గుకథ చెప్పిన అవినాష్ఈ ఆటలో సీరియల్ పరివారంతో నబీల్-ప్రేరణ ఆడి గెలిచారు. అలా పన్నెండువేల రూపాయల్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. తర్వాత అవినాష్ టాప్ 5 ఫైనలిస్టులపై ఒగ్గుకథ చెప్పి అలరించాడు. ఇప్పుడెలాగూ చేసేదేం లేదని కాసేపు దాగుడుమూతలు ఆడారు. ఈ క్రమంలో అవినాష్ యాక్షన్ రూమ్‌లో దాక్కున్నాడు. ఇంతలో బిగ్‌బాస్ ఆ గదికి తాళం వేసి లైట్లు ఆఫ్ చేశాడు. కాసేపటికి ఘల్లు ఘల్లుమంటూ గజ్జెల శబ్దం ప్లే చేశాడు.అవినాష్‌ను ఆటాడుకున్న బిగ్బాస్దీంతో అవినాష్ దడుసుకుని చచ్చాడు. తలుపు తీయండి బిగ్‌బాస్ అని వేడుకున్నా కనికరించలేదు. దెయ్యం కేకలు, కాంచన అరుపుల సౌండ్స్ వినిపించడంతో అవినాష్ ఏడ్చినంత పని చేశాడు. చివరకు గది తాళం తీయడంతో బయటకు పరిగెత్తాడు. అతడిని చూసి హౌస్మేట్స్ అందరూ ఘొల్లుమని నవ్వారు.ప్రేమ వివాహం చేసుకుంటా: నిఖిల్అనంతరం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్ నుంచి ప్రభాకర్, ఆమని వచ్చారు. తమ సీరియల్ స్టోరీలైన్ గురించి చెప్తూ హౌస్‌మేట్స్‌ను మీలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని అడిగారు. అందుకు నిఖిల్.. ప్రేమవివాహం చేసుకుంటానన్నాడు. పెద్దలను ఒప్పించాకే తన పెళ్లి జరుగుతుందన్నాడు. ఇక ప్రభాకర్- ఆమనితో ప్రేరణ - అవినాష్ బాల్స్ గేమ్ ఆడారు. ఇందులో సీరియల్ పరివారంపై బీబీ పరివారం గెలిచి రూ.15,113 పొందారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నువ్వేం ఆడావో తెలీట్లేదు.. గౌతమ్‌పై విషం కక్కిన విష్ణు
ప్రైజ్‌మనీ గెలిస్తే ఏం చేస్తావ్? ప్రతి సీజన్లో అడిగినట్లే ఈ సీజన్లోనూ టాప్ 6 కంటెస్టెంట్లను ఇదే ప్రశ్న అడిగాడు నాగార్జున. ముందుగా అవినాష్.. మా అన్నయ్యకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో పెద్దమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని తన గొప్ప ఆలోచనను బయటపెట్టాడు. మరి మిగతావారు ఏమేం అన్నారు? విష్ణు వెళ్లేముందు ఏం చెప్పిందో తెలియాలంటే నేటి (డిసెంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే!అందరికీ పంచిపెడతానన్న విష్ణునబీల్ ప్రైజ్‌మనీ గెలిస్తే తన కెరీర్‌పై ఇన్వెస్ట్ చేస్తానని, మంచి సినిమా తీస్తానని చెప్పాడు. ప్రేరణ.. నా పేరెంట్స్‌కు ఉన్న అప్పులు తీర్చేస్తా.. మిగిలిన డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడతా అని తెలిపింది. విష్ణుప్రియ.. అభయ్ నవీన్ ఫారిన్ ట్రిప్‌కు రూ.2 లక్షలు, మణికంఠ కారుకు రూ.1.5 లక్ష, గంగవ్వ ఇంటికోసం రూ.5 లక్షలు, పృథ్వీకి గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇలా అందరికీ పంచాలనుకుంటున్నాను అని చెప్పింది.ప్రైజ్‌మనీతో ఏం చేస్తానంటే?నిఖిల్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నా.. అమ్మానాన్నలకు ఓ ఇల్లు కట్టాలి. ఇప్పటిదాకా నాకోసం ఎంతో ఖర్చుపెట్టిన మా అన్న, తమ్ముడి కోసం ఈ డబ్బు ఉపయోగిస్తాను అన్నాడు. గౌతమ్.. మా అమ్మానాన్న రిటైర్మెంట్ కోసం ప్రైజ్‌మనీ వాడతాను. అలాగే గంగవ్వ తన కూతురికి కట్టివ్వాలనుకున్న ఇంటి కోసం రూ.10 లక్షలు ఇద్దామనుకుంటున్నాను అని తెలిపాడు.మీ వాడిగా స్వీకరించారు: నిఖిల్అనంతరం నాగార్జున నిఖిల్‌ను సెకండ్ ఫైనలిస్ట్‌గా ప్రకటించాడు. ఈ సందర్భంగా నిఖిల్.. నేను ఆర్టిస్టుగా ఇక్కడికి వచ్చినప్పుడు బయటివాడిని అని కామెంట్స్ చేశారు. కానీ మీరు అది తప్పని రుజువు చేశారు. నన్ను మీ వాడిగా స్వీకరించారు అని ఎమోషనలయ్యాడు. మూడో ఫైనలిస్ట్‌గా గౌతమ్‌ను ప్రకటించాడు. నాలుగో ఫైనలిస్ట్‌గా ప్రేరణను ప్రకటించగానే ఆమె షాకై, ఆ వెంటనే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.నిఖిల్‌కు ముద్దుపెట్టిన గౌతమ్ఈ సీజన్లో ఎవరికైనా థాంక్యూ, సారీ చెప్పాలనుకుంటే చెప్పేయమన్నాడు నాగ్. విష్ణుప్రియ.. తనతో స్నేహం చేసిన సీతకు థాంక్యూ.. తెలిసీతెలియకుండా కొన్నిసార్లు బాధపెట్టినందుకు రోహిణికి సారీ చెప్పింది. నబీల్.. ఏదున్నా మణికంఠకు షేర్‌తో చేసుకునేవాడినంటూ అతడికి థాంక్యూ.. ప్రేరణను నామినేట్ చేసినందుకు సారీ చెప్పాడు. నిఖిల్.. నేనెలా ఉన్నానో అలాగే యాక్సెప్ట్ చేసినందుకు పృథ్వీకి థ్యాంక్స్.. గౌతమ్‌పై నోరు జారినందుకు క్షమించమన్నాడు. ఈ సందర్భంగా గౌతమ్.. నిఖిల్‌కు బుగ్గపై ముద్దు పెట్టాడు.థాంక్స్, సారీ.. రెండూ నిఖిల్‌కు చెప్పిన గౌతమ్అవినాష్.. ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన నబీల్‌కు థాంక్స్.. నా ఫ్రెండ్ అయిన విష్ణును నామినేట్ చేసినందుకు సారీ అన్నాడు. గౌతమ్ వంతు రాగా.. ఇప్పటివరకు జరిగిన అన్నింటికీ సారీ అంటూ నిఖిల్‌ను హత్తుకున్నాడు. అలాగే అందరికీ వండిపెట్టినందుకు అతడికి థాంక్యూ చెప్పాడు. ప్రేరణ.. ప్రతీది నబీల్‌కు చెప్పుకుంటానని అతడికి థాంక్యూ చెప్పింది. విష్ణుపై నోరు జారినందుకు క్షమాపణలు తెలిపింది. చివరగా నాగ్.. నబీల్ను ఐదో ఫైనలిస్ట్‌గా పేర్కొంటూ విష్ణు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.గౌతమ్‌పై విష్ణు సెటైర్లుఎప్పుడూ గ్రహాలు అంటూ వేదాంతం మాట్లాడే విష్ణుతో అందుకు సంబంధించిన గేమ్ ఆడించాడు నాగ్. ట్రోఫీ అనే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం/ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నాడు. దీంతో విష్ణు.. గౌతమ్ ఆట ఇప్పటికీ తెలియట్లేదు.. అర్జంట్‌గా నువ్వేం ఆడావో చూసేయాలంటూ అతడిని ఐదో స్థానంలో పెట్టింది. అవినాష్‌ను నాలుగు, నబీల్ను మూడో స్థానంలో ఉంచింది. ప్రేరణ గెలవాలంటూనే ఆమెను రెండో స్థానంలో పెట్టింది.డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలేట్రోఫీకి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం నిఖిల్ అంటూ అతడికి విన్నర్ స్థానంలో కూర్చోబెట్టింది. ఈ పిచ్చిపిల్లను, నత్తిబుర్రను ఇన్నాళ్లు భరించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ వీడ్కోలు తీసుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే అని ప్రకటించిన నాగార్జున.. ఎపిసోడ్ అయిపోయిన క్షణం నుంచి శుక్రవారం వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయన్నాడు. మరి నబీల్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్, అవినాష్‌లలో ఎవరు గెలవాలనుకుంటున్నారో వారికి ఓట్లు వేసేయండి.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రోహిణి ఎలిమినేట్.. తప్పు ఒప్పుకొన్న ప్రేరణ
బిగ్‌బాస్ 8 ముగింపుకు ముహూర్తం పెట్టేసినట్లు నాగార్జునే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉండగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌తో ఇద్దర్ని పంపించేస్తున్నట్లు తెలిపాడు. ఈ పద్నాలుగు వారాల జర్నీలో మీరు రిగ్రెట్ ఫీలైన వారమేంటో చెప్పాలన్నాడు. అందుకు ప్రేరణ పదకొండో వారం అని చెప్పింది. మెగా చీఫ్ అయినప్పుడు సాఫ్ట్‌గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయానని తప్పు ఒప్పేసుకుంది. సంచాలక్‌గా బాగా చేశావా?నిజమే, అప్పటిదాకా ప్రేరణ గ్రాఫ్ రయ్యిమని పైకెళ్లింది. కానీ మెగా చీఫ్ అయిన వెంటనే తన డౌన్‌ఫాల్ మొదలైంది. ఇక నిన్నటి రంగుపడుద్ది టాస్క్‌లో సంచాలక్‌గా బాగా చేశావని అనుకుంటున్నావా? అని నాగ్ ప్రశ్నించగా లేదంటూ నిజం ఒప్పేసుకుంది. మరోవైపు పోల్‌కు సరిగా తాడు చుట్టాల్సిన గేమ్‌లో నబీల్ ఇష్టమొచ్చినట్లు తాడును కట్టి తానే గెలిచానని వాదించాడు. అప్పుడు స్వయంగా బిగ్‌బాసే కలగజేసుకుని అది చుట్టడమా? అని కౌంటర్ ఇచ్చాడు. స్వార్థంగా ఆలోచించా..ఇప్పుడు నాగ్ కూడా సరిగ్గా చుట్టడమేంటో ఏంటో తెలుసా? అంటూ అతడికి క్లాస్ పీకాడు. నీ తిత్తర ఎప్పుడు తగ్గుతుంది? అని ప్రశ్నించాడు.ఫైనలిస్ట్ అవడం కోసం చెక్‌పై రూ.15 లక్షలు రాశావు, అలాంటప్పుడు దాన్ని ఎందుకు చించేశావని అడిగాడు. కొంచెం సెల్ఫిష్‌గా ఉందామనే రాశా.. కానీ తర్వాత మరీ ఎక్కువ డబ్బు రాసేశాననిపించింది అని తెలిపాడు. డబుల్ ఎలిమినేషన్సెల్ఫిష్గా ఉండి గేమ్ సరిగా ఆడకపోతే ఎవరూ గెలవలేరన్నాడు నాగ్. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్నాడు. ఇప్పటికే శనివారం షూటింగ్ పూర్తవగా అందులో రోహిణిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇంకో ఎలిమినేషన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ను తప్పుపట్టిన బిగ్‌బాస్.. అయినా అతడిదే గెలుపు!
ప్రేరణ ఆటలో గెలిచింది. కానీ సంచాలకురాలిగా మాత్రం తడబడింది. నిన్న ప్రేరణ ఓట్లు అడిగే ఛాన్స్ పొందగా నేడు ఆ అదృష్టం నబీల్ను వరించింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అడ్డదిడ్డంగా చుట్టేసిన నబీల్ఓట్ అప్పీల్ గెలిచేందుకు బిగ్‌బాస్ క్రాసింగ్ పాత్ అనే మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో నబీల్ అడ్డదిడ్డంగా తన తాడును పోల్‌కు చుట్టేసి అందరికంటే ముందు గంట కొట్టాడు. తర్వాత రోహిణి గంట కొట్టింది. అనంతరం ప్రేరణ, గౌతమ్, నిఖిల్ వరుసగా గంట కొట్టారు. అయితే నిఖిల్ తన పోల్‌కు బదులు వేరేవారి పోల్‌కు తాడు చుట్టాడు. దీంతో నాలుక్కరుచుకుని మళ్లీ తన పోల్‌కు తిరిగి చుట్టాడు. విష్ణుప్రియ, అవినాష్ చివరి స్థానాల్లో ఉన్నారు.నేనే గెలిచా: ప్రేరణహౌస్మేట్స్ అందరూ కలిసి ఎవరు గెలిచారో చెప్పాలన్నాడు. నబీల్ తాడు సరిగా చుట్టలేదని, తానే గెలిచానని ప్రేరణ వాదించింది. లేదు, నేనే ఫస్ట్ అని నబీల్ అరుస్తూ ఉండటంతో ఆమె అతడిని ఇమిటేట్ చేసింది. ఇన్నాళ్లూ అవతలివారిని వెక్కిరించిన నబీల్.. తనను ఒకరు ఇమిటేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు. నన్ను వెక్కిరిస్తే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చాడు.నబీల్‌కు బిగ్‌బాస్ కౌంటర్చివరకు అందరూ కలిసి నబీల్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పుడు బిగ్‌బాస్.. మీరు తాడును సరిగా చుట్టారని అనుకుంటున్నారా? అని అడగడంతో అందరూ మనసు మార్చుకుని ప్రేరణ పేరు చెప్పారు. అయినా నబీల్ తనది కరెక్టే అనడంతో మీకు చుట్టడమంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించాడు. దీంతో అతడు కిక్కురుమనకుండా ఉండిపోయాడు.అయోమయం.. గందరగోళంఈ ఆటలో ఎవరు ఓడిపోయారని ప్రేరణను అడగ్గా ఆమె మొదట అవినాష్ పేరు చెప్పింది. గంట కొట్టేశాక మళ్లీ ఆడటం తప్పు కాదా? అని అవినాష్ అడగడంతో ఆమె మనసు మార్చుకుని నిఖిల్ పేరు చెప్పింది. అందుకతడు అభ్యంతరం చెప్పడంతో ఆమె మళ్లీ యూటర్న్ తీసుకుని అవినాష్ పేరు చెప్పి ఇదే ఫైనల్ నిర్ణయమంది. దాంతో అవినాష్ రేసు నుంచి తప్పుకున్నాడు.నబీల్‌కు ఓట్లు అడిగే ఛాన్స్టర్ఫ్ వార్ అని బిగ్‌బాస్ మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో చివరివరకు సర్కిల్లో ఉన్నవారు విజేతగా నిలుస్తారు. మొదటగా ప్రేరణను తోసేశారు. తర్వాత వరుసగా గౌతమ్, నిఖిల్, రోహిణిని తోసేశారు. చివర్లో నబీల్, విష్ణుప్రియ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ పొందాలో ఇంటిసభ్యులు నిర్ణయించాలన్నాడు. అందరూ కలిసి నబీల్ను సెలక్ట్ చేశారు.ప్రాణం పోయినా సరేనని..నబీల్ మాట్లాడుతూ.. నేనొక సామాన్యుడిని. సినిమాల్లో నటుడవ్వాలని కలలు కన్నాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా ఎక్కడా అవకాశం రాలేదు. ఎవరో అవకాశాలివ్వడమేంటని సోషల్ మీడియాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. తొమ్మిది సంవత్సరాల్లో నాకు వచ్చిన పెద్ద అవకాశం బిగ్‌బాస్. ప్రాణం పోయినా సరే అని టాస్కులు గెలవాలని ఆడాను. నన్ను విజేతగా చూడాలన్నది మా అమ్మ కల. దాన్ని మీరే నిజం చేయాలి అంటూ ప్రేక్షకులను ఓట్లు వేయమని అభ్యర్థించాడు.ఎన్నాళ్లకెన్నాళ్లకు..అనంతరం ప్రముఖ చెఫ్ సంజయ్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. అలాగే వారికోసం రుచికరమైన భోజనం వండి మరీ తీసుకొచ్చాడు. నిఖిల్, గౌతమ్ మధ్య దూరాన్ని చెరిపేస్తూ ఒకరికొకరు ఫుడ్ తినిపించుకోమన్నాడు. స్టార్టర్, బిర్యానీ, ఐస్‌క్రీమ్స్ అన్నీ కడుపారా తిన్న కంటెస్టెంట్లు ఇది జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమంటూ ఫుల్ ఖుషీ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: తనదే కరెక్ట్ అన్న ప్రేరణ.. ఒప్పుకోని నబీల్
హౌస్‌లో నామినేషన్స్‌కు స్వస్తి పలికారు. బిగ్‌బాసే స్వయంగా అందర్నీ(ఫైనలిస్ట్ అవినాష్ మినహా) నామినేట్ చేశారు. అంటే ఇకనుంచి ఇంట్లో కొట్లాటలుండవా.. ఈ రెండువారాలు పిక్నిక్లా ఎంజాయ్ చేస్తారా? అనుకునేరు. ఫినాలేకు ఇంకో రెండురోజులుందనగా కూడా మేము గొడవపడేందుకు రెడీ అన్నట్లుగానే ఉన్నారు కంటెస్టెంట్లు.ఓట్ అప్పీల్ఓట్ అప్పీల్ కోసం బిగ్‌బాస్ టాస్కులు ఇస్తున్నాడు. ఇప్పటికే ఓసారి ప్రేరణ గెలిచి ప్రేక్షకుల్ని తనకు ఓటేయమని అభ్యర్థించే ఛాన్స్ గెలిచింది. నేడు మరొకరికి ఛాన్స్ ఇచ్చేందుకు రెండు గేమ్స్ పెట్టనున్నాడు. అందులో మొదటిదే క్రాసింగ్ పాత్స్. ఇందులో నిఖిల్ తన తాళ్లను తనకు సంబంధించిన పోల్‌కు కాకుండా మరో పోల్‌కు పెట్టి బెల్ కొట్టాడు. నిఖిల్‌ను విజేతగా ప్రకటించిన ప్రేరణఈ తప్పు గురించి అవినాష్ అడుగుతుంటే అదసలు తప్పే కాదని వాదించింది ప్రేరణ. అటు నబీల్ తన తాడును అడ్డదిడ్డంగా కట్టడంతో అతడినసలు లెక్కలోకే తీసుకోలేదు. దీంతో నబీల్ గొడవకు దిగాడు. నా పోల్ సరిగ్గానే ఉంది.. నువ్వే కావాలని నేను చుట్టిన తాడును చెడగొడుతున్నావ్.. అని మండిపడ్డాడు. దీంతో ప్రేరణ ఇమిటేట్ చేయగా.. నన్ను వెక్కిరించకు, ఇది జోక్ కాదంటూ గద్దించాడు. మొత్తానికి ఈ గేమ్‌లో ప్రేరణ గెలిచింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్‌ని ఓడించిన ప్రేరణ.. సారీ చెప్పిన గౌతమ్
మరో వారం పదిరోజుల్లో బిగ్ బాస్ ఫినాలే ఉండొచ్చు. దీంతో ఈసారి నామినేషన్స్ హడావుడి పెద్దగా లేదు. ఫైనలిస్ట్ అయిన అవినాష్ తప్పితే అందరూ లిస్టులో ఉన్నారు. అంటే గౌతమ్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నట్లే. అయితే బిగ్‌బాస్ ఈ వారమంతా కొన్ని గేమ్స్ పెడుతుంటాడు. వాటిలో ఎవరైతే గెలుస్తారో.. వాళ్లకు ఓట్లు అడుక్కునే అవకాశం దక్కుతుంది. మంగళవారం ఎపిసోడ్‌తో ఈ తంతు మొదలైంది. ఇంతకీ 93వ రోజు ఏమేం జరిగిందనేది హైలైట్స్‌లో చూద్దాం.(ఇదీ చదవండి: బండ్ల గణేశ్ సినిమాకు ఓకే చెప్పా.. కానీ మోసం చేశాడు: టాలీవుడ్ కమెడియన్)అయితే ఓటింగ్ రిక్వెస్ట్ కోసం జంటలుగా కొన్ని ఛాలెంజెస్లో పాల్గొనాలి. ఎవరికైతే జంట ఉండదో వారు ఈ ఓట్ అప్పీల్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ జంటలని ఎంచుకొని చెప్పండని బిగ్‌బాస్ చెప్పాడు. అలా అవినాష్-నబీల్, ప్రేరణ-నిఖిల్, విష్ణు-రోహిణి జంటలుగా సెట్ అవగా.. గౌతమ్ ఏకాకిగా మిగిలిపోయాడు. ఇంతలో ట్విస్ట్ ఇచ్చిన నబీల్.. అవినాష్‌ని వదిలేసి గౌతమ్‌తో జోడీ కట్టాడు.మూడు జంటలకు తొలి పోటీగా 'నా టవర్ ఎత్తయినది' అనే గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా జంటలు ఎవరికి వాళ్లు ఓ టవర్ నిర్మించాల్సి ఉంటుంది. నిలబెట్టిన దాన్ని వేరే జోడీలు పడగొట్టొచ్చు. బజర్ మోగేసరికి ఎవరిదైతే ఎత్తుగా ఉంటుందో వాళ్లు గెలిచినట్లు. ఇందులో అందరూ బాగానే ఆడతారు గానీ ప్రేరణ-నిఖిల్ తొలి స్థానంలో నిలుస్తారు. రోహిణి-విష్ణుప్రియ రెండో స్థానం సొంతం చేసుకుంటారు. చివర్లో నిలిచిన గౌతమ్-నబీల్.. ఓటు అప్పీల్ రేసు నుంచి తప్పుకొన్నారు.(ఇదీ చదవండి: 'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ))మొదటి పోటీ తర్వాత రెండో పోటీ పెట్టారు. 'టక్ టకాటక్' అనే గేమ్‌లో భాగంగా తమ తమ ప్లేసులో ఉండే డిస్కులు.. పక్క వాళ్ల ప్లేసులోకి తోసేయాలి. ఈ పోటీని ఒక్కొక్కరుగా ఆడాలి. దీంతో ప్రేరణ-నిఖిల్ ఉంటారు. విష్ణు-రోహిణిలలో ఒక్కరే ఆడాలని బిగ్ బాస్ చెప్పగా.. రోహిణి ముందుకొస్తుంది. ఈ పోటీలో గెలిచిన ప్రేరణ.. ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దక్కించుకున్న తొలి విజేతగా నిలిచింది. దీంతో ఈమెని ఇన్ఫినిటీ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ప్రేక్షకుల్ని ఓట్లు అప్పీలు చేసుకోమన్నాడు.'బిగ్‌బాస్ జర్నీలో ఇక్కడ ఉంటానని అనుకోలేదు. తెలుగు ప్రేక్షకుల నుంచి చాలా ప్రేమ, సపోర్ట్ దొరికింది. ఇక్కడికి వచ్చి నాలాగా ఉండాలనుకున్నాను, ఉంటున్నాను. కచ్చితంగా కొన్నిసార్లు తప్పు చేశా. ఎవరూ ఫెర్ఫెక్ట్గా ఉండరు. నేను తప్పులు చేశాను. ఎవరు చెప్పినా వాటి నుంచి నేర్చుకున్నాను. నా గురించి నాకే కొన్ని మంచి, కొన్ని చెడు అంశాలు తెలిశాయి. ఇప్పటివరకు 13 వారాలు సేవ్ అయ్యాను. ఇది దాటేస్తే ఇక ఫైనల్స్. మీ ఓట్స్ నాకు ఇవ్వండి. బిగ్‌బాస్ హిస్టరీలోనే తొలి మహిళా విన్నర్ అవ్వాలని ఆశ ఉంది. అది మీ వల్లే అవుతుంది. ఓటు మీది గెలుపు నాది' అని ప్రేరణ రిక్వెస్ట్ చేసింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?)సోమవారం నామినేషన్స్ లేకపోయినా సరే గౌతమ్-నిఖిల్ మధ్య పెద్ద వాగ్వాదమే నడిచింది. 'యష్మిని వాడుకున్నావ్' అని నిఖిల్‌పై నోరు జారిన గౌతమ్.. మంగళవారం ఎపిసోడ్లో మాత్రం అందరిముందు క్షమాపణలు చెప్పాడు. ఎవరిది తప్పు ఎవరిది కాదు అని నేను చెప్పను. వాడుకున్నావ్ అన్నది వేరే రకంగా అనలే, గేమ్‌లో నువ్వు ఆటాడుతున్నావ్ అని ఎట్ల అన్నావో నేను వాడుతున్నా అని అట్ల అన్నా.. దానికి నువ్వు హర్ట్ అయ్యావనిపించింది కాబట్టి నేను అన్న ఆ మాటని వెనక్కి తీసుకుంటూ ఆ బాధ్యత వహిస్తూ ఐయామ్ రియల్లీ సారీ నిఖిల్.. మరోసారి నీ దగ్గర నోరు జారకుండా జాగ్రత్త పడతానని గౌతమ్ అన్నాడు.దీనికి స్పందించిన నిఖిల్.. నాకు తెలినంతవరకూ నిన్న మాట్లాడింది నీది కానీ ఇంకెవరిదైనా పర్సనల్ విషయం నేను తీయలేదు. ఒకవేళ నీకు అలా అనిపించి ఉంటే ఐ యామ్ సారీ. వేరే ఎక్కడా నేను ఇప్పటివరకూ నోరు జారలేదు.. మూస్కొని నొక్కు అన్న మాట వాడినందుకు సారీ.. దానికి నేను నిజంగా సారీ చెబుతున్నా అని చెప్పాడు. వెంటనే ఇద్దరూ ఒకరికొకరు హగ్ ఇచ్చుకున్నారు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్) -
నీచంగా మాట్లాడిన గౌతమ్.. కొంపముంచేంత పని చేసిన నబీల్!
నిన్నమొన్నటివరకు కిచెన్‌లో ఎంత సేపు వంట చేసుకోవాలన్నది బిగ్‌బాసే డిసైడ్ చేసేవాడు. గంట, రెండు గంటలు మాత్రమే టైమ్ ఇచ్చేవాడు. సీజన్ ముగింపుకు వచ్చేసిన సందర్భంగా కిచెన్ టైమర్‌ను అన్లిమిటెడ్ చేసేశాడు. నామినేషన్స్ లేకపోయినా అలాంటి ఓ ప్రక్రియ పెట్టడంతో గౌతమ్, నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుకున్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రోహిణిని ఆటపట్టించిన గౌతమ్చాలాకాలంగా మనసులో దాచుకున్న మాటను చెప్పేస్తున్నానంటూ రోహిణి దగ్గర తెగ సిగ్గుపడిపోయాడు గౌతమ్. కానీ నోరు తెరుస్తూనే.. ఈ హౌస్‌లో ఉన్న అమ్మాయిలందరూ నా అక్కలు. ఓ సహోదరుడిగా నీకు ఎల్లప్పటికీ తోడుగా, నీడగా ఉంటాను అని చెప్పాడు. ఆ మాటతో అవాక్కయిన రోహిణి.. ఎవడ్రా నీకు అక్క అంటూ గౌతమ్‌ను సరదాగా తిట్టిపోసింది.సెకండ్ ఫైనలిస్ట్ ఎంపికతర్వాత బిగ్‌బాస్.. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ మినహా మిగతా అందరూ నేరుగా నామినేట్ అయినట్లు ప్రకటించాడు. రెండో ఫైనలిస్ట్ ఎంపిక కోసం ఓ టాస్క్ పెట్టాడు. ఎవరైతే ఫినాలేలో ఉండకూడదనుకుంటున్నారో వారి ఫోటోను కాల్చేయాలన్నాడు. చివరకు ఎవరి ఫోటో అయితే కాలకుండా ఉంటుందో వాళ్లు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. మొదటగా అవినాష్.. విష్ణుప్రియ ఫోటో కాల్చేశాడు. విష్ణుప్రియ వంతురాగా.. ఎవరితోనూ ఎక్కువగా కలవట్లేదు, నీ గేమ్ అర్థం కావట్లేదంటూ గౌతమ్ ఫోటో కాల్చేసింది. అమ్మాయిలను వాడుకున్నావ్గౌతమ్.. పదేపదే పోట్రే చేస్తున్నానని నాపై లేనిపోని నింద వేశావంటూ నిఖిల్‌ను రేసులో నుంచి తీసేయాలనుకున్నాడు. నిఖిల్ స్పందిస్తూ.. వచ్చినప్పటినుంచి నువ్వు అదే చేస్తున్నావని వాదనకు దిగాడు. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని వాడుకుంది నువ్వు, అమ్మాయిలను వాడుకున్నావ్ అంటూ నీచంగా మాట్లాడాడు. ఇలానే మరోసారి కాస్త వల్గర్‌గా మాట్లాడటంతో నిఖిల్ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఇంకోసారి నోరు జారి మాట్లాడితే బాగోదని హెచ్చరించాడు.రోహిణిని తప్పించిన నిఖిల్ఈ గొడవను ఆపేయమని చెప్తున్నా కూడా.. గౌతమ్ వినకుండా విషయాన్ని సాగదీస్తూనే ఉన్నాడు. యష్మికి గాజులు సెట్ చేస్తూ ఆమెకు హోప్స్ పెట్టడం తప్పంటూ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి మరింత ఇరిటేషన్ తెప్పించాడు. అనంతరం నిఖిల్.. నామినేషన్స్‌లోకి రాలేదంటూ రోహిణిని రేసు నుంచి తప్పించాడు. నామినేషన్స్‌లోకి రాకపోయినా నేను అన్ని గేమ్స్ గట్టిగానే ఆడాను అని రోహిణి సమాధానమిచ్చింది. చివర్లో ప్రేరణ, నబీల్.. ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరికి బిగ్‌బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఇమ్యూనిటీ కొనుక్కోవాలన్న బిగ్బాస్మీ ముందున్న చెక్‌పై రూ.15 లక్షల వరకు ఎంతైనా రాసి ఇమ్యూనిటీ కొనుక్కోవచ్చన్నాడు. ఆ డబ్బు విన్నర్ ప్రైజ్‌మనీలో నుంచి కట్ అవుతాయన్నాడు. కాసేపు ఆలోచించుకున్నాక ఇద్దరూ తమకు తోచినంత అమౌంట్ రాశారు. ఇంతలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇమ్యూనిటీ కొనుక్కోకుండా వారిని నామినేషన్స్‌లో ఉంచేందుకు హౌస్మేట్స్ ఒప్పించవచ్చన్నాడు.చెక్కులు చింపేయమన్న హౌస్మేట్స్ప్రైజ్మనీని ఒక్కో రూపాయి సంపాదిస్తూ ఇక్కడివరకు తేవడానికి అందరం ఎంతో కష్టపడ్డాం. మీకు జనాలు ఓటు వేశారు కాబట్టే పద్నాలుగోవారం దాకా వచ్చారు అని నిఖిల్ చెక్ చించేయమన్నాడు. మిగతావాళ్లు కూడా అదే సలహా ఇచ్చి ఎలాగోలా ఒప్పించడంతో ప్రేరణ, నబీల్.. ఫైనలిస్ట్ స్థానాన్ని కొనుక్కోవాలనుకోవడం లేదని చెప్పారు. రాసిన చెక్కులు చింపేయడానికంటే ముందు ఇద్దరు ఎంత రాశారో చెప్పాలన్నాడు. నబీల్ స్వార్థంప్రేరణ.. రూ.4,30,000 రాయగా నబీల్ ఏకంగా రూ.15 లక్షలు రాసేశాడు. అది విని హౌస్మేట్స్ నోరెళ్లబెట్టారు. కంటెస్టెంట్లే కాదు చూసే జనాలు కూడా వీళ్లు ఇంత స్వార్థంగా ఉన్నారేంటని ఈసడించుకోవడం ఖాయం. ఏదేమైనా వీరిద్దరూ మనసులు మార్చుకుని చెక్కులు చించేయడంతో నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. ఈ వారం గౌతమ్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణ అందాల రాక్షసి, రోహిణి అరుంధతి, మరి విష్ణు?
టేస్టీ తేజ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఈ రోజు పృథ్వీ హౌస్ నుంచి వెళ్లిపోనున్నాడు. దానికంటే ముందు హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్ ఆడించాడు. అలాగే కంటెస్టెంట్లకు ఒక్కో సినిమా టైటిల్ అంకితమచ్చాడు.నబీల్‌కు డబుల్ ఇస్మార్ట్, పృథ్వీ-విష్ణుప్రియకు నిన్నుకోరి, గౌతమ్‌కు ఏక్ నిరంజన్, రోహిణికి అరుంధతి టైటి్ ఇచ్చారు. ప్రేరణకు అందాల రాక్షసి, నిఖిల్‌కు ద ఫ్యామిలీ మ్యాన్, అవినాష్‌కు సుడిగాడు అనే టైటిల్స్ అంకితమిచ్చారు. ఆ పోస్టర్స్ చూసి హౌస్మేట్స్ ఆశ్చర్యపోతూనే నవ్వుకున్నారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ
నాగార్జున వచ్చీరావడంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. అయితే టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకుని నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోయాడని గుడ్‌న్యూస్ చెప్పాడు. అంతేకాదు ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ అతడికి ఓ ట్రోఫీ కూడా ఇచ్చారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నోరు తీపి చేసిన బిగ్బాస్ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్‌ను మనసులో కోరిక చెప్పమనగా.. మందు బాటిల్స్, స్వీట్స్ కావాలంటూ చిట్టా బయటపెట్టాడు. మందు కుదరదు కానీ స్వీట్స్‌తో సరిపెట్టుకోమంటూ బిగ్‌బాస్ గులాబ్‌జామూన్ పంపించి హౌస్మేట్స్ నోరు తీపి చేశాడు. అలాగే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అతడికి హౌస్మేట్స్ పెట్టిన బ్యాడ్జ్ ప్రకారం రూ.4 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అలా ప్రైజ్‌మనీ రూ.54,30,000కి చేరింది.బ్లాక్ టికెట్.. గోల్డెన్ టికెట్తర్వాత నాగ్.. హౌస్‌లో కొందరికి బ్లాక్ టికెట్, మరికొందరికి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. ఎవరికి బ్లాక్ టికెట్ ఇవ్వాలని నిఖిల్‌ను అడగ్గా తేజ పేరు చెప్పాడు. గౌతమ్ వంతు రాగా.. అతిథులు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే వారితో సరిగా ప్రవర్తించలేదని ప్రేరణ పేరు సూచించాడు. దీంతో ఆమె ఫౌల్ గేమ్ ఆడిన వీడియో నాగ్ ప్లే చేశాడు. ఇలా ఆడితే బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వకపోతే ఏం చేస్తారన్నట్లు క్లాస్ పీకాడు. రోహిణి.. ఫౌల్ గేమ్ ఆడాడంటూ పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గేమ్స్ గెలిస్తే టైటిల్ రాదు!అవినాష్.. నబీల్‌కు, తేజ.. విష్ణుకు బ్లాక్ టికెట్ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఎవరు ఈ సీజన్ విన్నర్ అనుకుంటున్నావని విష్ణును అడగ్గా తనే గెలుస్తానంది. గెలవాలంటే ఈ ఆట సరిపోదుకదా అని నాగ్ అంటుంటే.. ఆటలన్నీ గెలిచినవారు టైటిల్ సాధించినట్లు బిగ్‌బాస్ చరిత్రలోనే చూడలేదని వేదాంతం చెప్పింది. అది తప్పని, జనాలు.. ఆట, మాట.. ఇలా ప్రతి ఒక్కటి చూస్తారని స్పష్టం చేశాడు.గౌతమ్‌కు గోల్డెన్ టికెట్ప్రేరణ.. గౌతమ్‌కు బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గౌతమ్ అందుకు అర్హుడంటూ నబీల్, విష్ణు, పృథ్వీ, నిఖిల్ కూడా చేయెత్తారు. అప్పటివరకు హౌస్మేట్స్ చెప్పిన అందరికీ బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటూ పోయిన నాగార్జున.. గౌతమ్‌కు మాత్రం బ్లాక్ టికెట్ ఇవ్వనంటూ గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అలాగే రోహిణి, నిఖిల్, అవినాష్‌కు సైతం గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అనంతరం దమ్ము-దుమ్ము అని ఓ గేమ్ ఆడించాడు. ట్రోఫీని పైకి ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్మయిపోయే వ్యక్తి ఎవరు? అనేది చెప్పాలన్నాడు. నిఖిల్ దమ్మున్న ప్లేయర్నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ.. నిఖిల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము అని తెలిపారు. రోహిణి.. గౌతమ్ దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ ఫినాలే వరకు రాకపోవచ్చంది. తేజ.. ఎంటర్టైనర్లు కూడా గెలవగలరని నిరూపిస్తారంటూ అవినాష్ దమ్మున్న ప్లేయర్ అన్నాడు. విష్ణు ఉట్టి దుమ్మున్న ప్లేయర్ అన్నాడు. గౌతమ్.. రోహిణి దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ దుమ్ము అని తెలిపాడు. అవినాష్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, ఫౌల్ గేమ్స్ ఆడతాడంటూ పృథ్వీని దుమ్ము కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు.గౌతమ్‌పై కోపాన్నంతా కక్కేసిన తేజతర్వాత తేజ.. గౌతమ్‌పై తన కోపాన్నంతా కక్కేశాడు. టికెట్ టు ఫినాలే ఆడే క్రమంలో ఓ గేమ్‌లో గౌతమ్ నా పేరు సెలక్ట్ చేయకపోవడంతో బాధేసిందని, అదే విషయం అతడిని నిలదీశానన్నాడు. నామినేషన్స్‌లో ప్రేరణతో అంత గొడవైనా కూడా ఆమెనే ఎందుకు సెలక్ట్ చేశాడు? అక్కడ నేను ఫ్రెండ్ కాబట్టి నన్ను సెలక్ట్ చేస్తే అతడికి సోలో బాయ్ అనే ట్యాగ్ పోతుందని వెనకడుగు వేశాడు. ప్రేరణను సెలక్ట్ చేస్తే తనకు మంచి పేరొస్తుందని లెక్కలు వేసుకున్నాడని తెలిపాడు.తేజ ఎలిమినేట్నా మనసుకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోయా.. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా అది నీ ఇష్టం అని గౌతమ్ ఒక్కముక్కలో తేల్చేశాడు. ఇక ప్రేరణ, నిఖిల్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము కంటెస్టెంట్ అని అభిప్రాయపడ్డారు. తేజ ఆడలేకపోతున్నాడని పేర్కొన్నాడు. అనంతరం నాగార్జున తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కల నెరవేర్చుకున్నాకే వెళ్లిపోతున్నానంటూ తేజ సంతోషపడితే అవినాష్ మాత్రం కంటనీరు పెట్టుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన తేజతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్‌మేట్స్‌ను కూరగాయలతో పోల్చాలన్నాడు. టాప్ 2లో గౌతమ్..అలా అవినాష్ ఉల్లిపాయ అని, ఈ సీజన్లో పెద్ద గెలుపు రోహిణిదేనంటూ బంగాళాదుంపతో పోల్చాడు. విష్ణుప్రియ కాకరకాయ అన్నాడు. ప్రేరణ.. మాట సరిగా లేకపోతే నెక్స్ట్ నువ్వే బయటకు వచ్చేస్తావని హెచ్చరిస్తూ బెండకాయ ఇచ్చాడు. పృథ్వీ.. విష్ణుప్రియను వదిలినట్లు కొన్ని గేమ్స్ కూడా వదిలేస్తున్నావంటూ పచ్చిమిర్చి ట్యాగ్ ఇచ్చాడు. గౌతమ్‌లో ఎన్ని పొరలుంటాయో వాడికే తెలీదంటూ క్యాబేజీతో పోల్చాడు. అతడు టాప్ 2లో పక్కాగా ఉంటాడనన్నాడు. నబీల్.. గేమ్‌లో కన్ఫ్యూజ్ అవుతున్నాడని, టాప్ 2లో ఉంటాడనుకుంటే ఇప్పుడు టాప్ 5కి వచ్చేశాడంటూ టమాటతో పోల్చాడు. నిఖిల్.. ఎమోషనల్‌గా వీక్ అంటూ అతడికి సోరకాయ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేక్షకులు అది పసిగడితే తేజ ఎలిమినేషన్ ఖాయం: ప్రేరణ
టికెట్ టు ఫినాలే గేమ్ తర్వాత హౌస్‌మేట్స్‌లో టెన్షన్ రెట్టింపైంది. ఎలాగైనా ఫైనల్లో చోటు దక్కించుకోవాలని అందరూ తాపత్రయపడుతున్నారు. కప్పు కొట్టాల్సిందేనని గట్టిగా ఫీలవుతున్నారు. అయితే బిగ్‌బాస్ 8 ట్రోఫీ ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్ముగా అయిపోయే కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నాడు నాగ్.ట్రోఫీ అందుకు దమ్ము ఎవరికి?అలా నబీల్.. తన తర్వాత నిఖిల్ గెలిచే ఛాన్స్ ఉందన్నాడు. రోహిణి.. గౌతమ్ గెలుస్తాడని, ఫినాలే వరకు ప్రేరణ రాలేదని అభిప్రాయపడింది. తేజ.. విష్ణు దుమ్ముగా అయిపోతుందన్నాడు. పృథ్వీయేమో తేజ ఫినాలే వరకు రాలేడన్నాడు. అవినాష్.. పృథ్వీ దుమ్ము అని తెలిపాడు. ప్రేరణ మాట్లాడుతూ.. అవసరం లేని చోట కూడా తేజ కంటెంట్ క్రియేట్ చేస్తాడు. అది ప్రేక్షకులు పసిగడితే అతడు ఫినాలేకు రాడు అని చెప్పింది. అన్నట్లుగానే ఈ రోజు తేజ ఎలిమినేట్ కానున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8: ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు వచ్చేసింది. డైరెక్ట్‌గా ఫినాలేలో అడుగుపెట్టేందుకు ఎప్పటిలాగే బిగ్‌బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇప్పటికే ఈ టాస్క్‌లో అవినాష్, రోహిణి, నిఖిల్ కంటెండర్లుగా నిలిచారు. నేడు హౌస్‌లోకి వచ్చిన యాంకర్ శ్రీముఖి వారిలో ఒకర్ని ఫైనలిస్టుగా ప్రకటించనుంది.కిచెన్‌లో మళ్లీ కయ్యంఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. అయితే ఎప్పటిలాగే మరోసారి కిచెన్‌లో కయ్యం మొదలైంది. ఒక్కొక్కరికి రెండు దోశలు వేస్తోంది ప్రేరణ. తనకు ఒక చీజ్ దోశ కావాలని రోహిణి అడిగితే అందుకు ప్రేరణ ఒప్పుకోలేదు. చీజ్ దోశ తిన్నవాళ్లు ప్లేన్ దోశ తినలేరంటూ అడ్డు చెప్పింది. దానికి తేజ అభ్యంతరం చెప్పాడు. ఇలా మధ్యలో దూరడం తప్పని ప్రేరణ అనగా.. అందరికీ సమానంగా పెట్టమని చెప్పానంతేనని తేజ బదులిచ్చాడు.టికెట్ టు ఫినాలే ఎవరి సొంతం?తర్వాత శ్రీముఖి హౌస్‌లో అడుగుపెట్టింది. ఇకపోతే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినట్లు ఓ వార్త వైరలవుతోంది. అదే నిజమైతే ఈ సీజన్లో ఫినాలేలో అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ అవినాష్ అవుతాడు. అయితే ఈ వారం గండం గట్టెక్కితేనే అది సాధ్యమవుతుంది. అసలే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. పైగా అవినాష్ నామినేషన్స్‌లో ఉన్నాడు. ఈ ఒక్కవారం సేవ్ అయ్యాడంటే టాప్ 5లో బెర్త్ కన్ఫామ్ అయినట్లే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టికెట్ టు ఫినాలే: మూడో కంటెండర్‌గా నిఖిల్, షాక్‌లో తేజ
బిగ్‌బాస్ హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్ల రాక కొనసాగుతోంది. ఇప్పటివరకు అఖిల్, దేత్తడి హారిక, మానస్, ప్రియాంక జైన్ వచ్చి వెళ్లగా నేడు పునర్నవి, వితికా షెరు ఇంట్లో అడుగుపెట్టారు. వీరు గేమ్స్ ఆడేందుకు నిఖిల్, గౌతమ్‌ను సెలక్ట్ చేశారు. వీళ్లిద్దరూ మరో ఇద్దర్ని సెలక్ట్ చేయాల్సి రాగా నిఖిల్.. పృథ్వీ పేరు సూచించాడు. గౌతమ్ క్షణం ఆలోచించకుండా ప్రేరణ పేరు ఎంపిక చేశాడు.షాక్‌లో తేజతన పేరు చెప్తాడని ఊహించిన తేజకు ఇది పెద్ద షాకే! నన్నెందుకు సెలక్ట్ చేయలేదని తేజ హర్టయ్యాడు. గెలిచినా, గెలవకపోయినా అవకాశం వస్తుందేమో ఆడదామనుకున్నాను, ఇలా సెలక్ట్ చేయనప్పుడు బాధనిపిస్తుంది.. దీన్ని సింపతీ అనుకుంటే నేనేం చేయలేను అని తేజ ఫ్రస్టేట్ అయ్యాడు. ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ఫైనల్గా నిఖిల్ గెలిచి కంటెండర్ అవగా ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చినట్లు భోగట్టా! తనను టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తీసేయడంతో ప్రేరణ అస్సలు తట్టుకోలేకపోతుందట! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అమ్మలా ప్రేమను పంచాడు, నెత్తిన పెట్టుకున్నాడు: విష్ణుప్రియ లవ్‌స్టోరీ
అవినాష్‌ను తక్కువ అంచనా వేసిన నబీల్, ప్రేరణకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. ఇచ్చిన రెండు గేమ్స్‌లోనూ అతడే గెలిచి విన్నరయ్యాడు. కంటెండరవ్వాలనుకున్న నబీల్ రేసులోనే లేకుండా పోయాడు. అటు విష్ణుప్రియ... తన మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుంది. తన ప్రేమ కహానీని పృథ్వీతో పంచుకుంది. అదేంటో నేటి (నవంబర్ 27) ఎపిసోడ హైలైట్స్‌లో చదివేయండి..తక్కువ అంచనా వేశారుటికెట్ టు ఫినాలే కోసం హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించేందుకు మానస్, ప్రియాంక జైన్ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చారు. వీళ్లు ప్రేరణ, నబీల్ను గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేశారు. అయితే ఈ రోజు బ్రెయిన్ గేమ్‌లో నలుగురు ఆడే ఛాన్స్ ఉందంటూ మరో ఇద్దర్ని ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో ప్రేరణ, నబీల్.. ఐక్యూ అంతగా లేదు, బ్రెయిన్ గేమ్ ఆడలేరంటూ అవినాష్, పృథ్వీని సెలక్ట్ చేశారు.సుడోకు గేమ్అలా ఈ నలుగురికి సుడోకు గేమ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ముందుగా నబీల్ గంట కొట్టి గెలిచేసినంత బిల్డప్ ఇచ్చాడు. తీరా చూస్తే అన్నీ తప్పులతడకగానే ఉంది. ఏ ఒక్కరూ సుడోకు పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ అందుకుని అవినాష్ చకచకా సుడోకు పూర్తి చేసి గంట కొట్టాడు. తర్వాత ప్రేరణ, పృథ్వీ, నబీల్ గేమ్ కంప్లీట్ చేశారు. వీళ్లందరికీ బిగ్‌బాస్ కొన్ని మూటలు ఇచ్చాడు. అందులో అవినాష్‌కు 8 బాల్స్, ప్రేరణకు 6, పృథ్వీకి 5, నబీల్‌కు 4 బంతులు ఉన్నాయి.అవినాష్ గెలుపుపై నబీల్ డౌట్అవినాష్ గెలుపుపై నబీల్ అనుమానపడ్డాడు. తేజ, నువ్వేమైనా సాయం చేశావా? అని అడిగాడు. ఎవరూ సాయం చేయలేదని హౌస్మేట్స్ అందరూ క్లారిటీ ఇచ్చారు. అంతా అయిపోయాక నబీల్.. నువ్వు ఆడలేవని అనలేదు, ఎవరైనా సాయం చేశారనిపించి అడిగానంతే.. నీకు కోపం వస్తే అప్పుడే తిట్టాల్సిందంటూ అవినాష్‌కు సారీ చెప్పాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ కలిసి కామెడీ స్కిట్‌తో కడుపుబ్బా నవ్వించారు.మళ్లీ గెలిచేసిన అవినాష్అనంతరం పృథ్వీ, ప్రేరణ, అవినాష్, నబీల్.. వారు పొందిన బంతులతో నేర్పుగా సాగు- స్కోర్ పొందు అని మరో గేమ్ ఆడారు. ఈ టాస్క్‌లో అవినాష్ అందరికంటే ఎక్కువగా 43 పరుగులు చేసి గెలిచాడు. పృథ్వీ, ప్రేరణ.. 30 పరుగులు చేయగా, నబీల్ 24 పరుగులు చేశాడు. చివర్లో రెండు బంతుల్ని ఎవరికైనా ఇవ్వొచ్చు అని మానస్, ప్రియాంకకు బిగ్‌బాస్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ వాళ్లు అందుకు అంగీకరించలేదు.విష్ణుప్రియ బ్రేకప్ స్టోరీరెండు టాస్కులు గెలిచిన అవినాష్‌కు కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. నబీల్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తొలగించారు. చివర్లో విష్ణు, మానస్ కలిసి జరీజరీ పంచె కట్టి.. పాటకు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. మాజీ బాయ్‌ఫ్రెండ్ గుర్తురావడంతో అర్ధరాత్రి పృథ్వీపక్కన చేరి ముచ్చట్లు పెట్టింది విష్ణు. కలలో తనకు మాజీ బాయ్‌ఫ్రెండ్ వచ్చాడంది. బ్రేకప్ నువ్వు చెప్పావా? అని పృథ్వీ అడగ్గా.. అవును, నేనే బ్రేకప్ చెప్పానంది. తల్లి స్థానమిచ్చా..తెలీకుండా రెండు తప్పులు చేశాడు. నా మంచి కోసమే చేశాడు. నాకు తెలిస్తే భరించలేనని చెప్పలేదు. తీరా తెలిశాక నేను నిజంగా భరించలేకపోయాను. నాకోసమే కొన్ని పనులు చేసినా అవి నాకస్సలు నచ్చలేదు. అవి నా ముఖంపై చెప్పేంత ధైర్యం లేని వ్యక్తితో ఉండకూడదనుకున్నాను, బ్రేకప్ చెప్పాను. కానీ అతడికి నా తల్లి స్థానమిచ్చాను.నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడుకాబట్టి తనను చూడకుండా ఉండలేకపోతున్నాను. అతడు నా బలం. తనను హత్తుకుంటే మా అమ్మను హత్తుకున్నట్లే ఉంటుంది. నన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు. అమ్మలాగా స్వచ్ఛంగా ప్రేమించాడు అంటూ అతడి జ్ఞాపకాలను పృథ్వీతో పంచుకుంది. అయితే అతడెవరనేది మాత్రం బయటపెట్టలేదు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓపక్క తిట్టుకుంటూ మరోపక్క బుగ్గ గిల్లుతూ నామినేషన్స్
నామినేషన్స్‌లో ఫైర్ చూపించాలని నబీల్ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో, ఏమోకానీ ఓపక్క కోప్పడుతూనే మరోపక్క బాధపడుతున్నట్లు కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఫైర్ లేదుబిగ్బాస్ హౌస్‌లో పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టుగా చూడకూడదనుకుంటున్న ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా నబీల్.. నామినేషన్స్‌లో తప్ప గేమ్‌లో ఫైర్ లేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. నబీల్‌తో పెట్టుకుంటే బొరాన్ ఉంటదంటూ దమ్కీ ఇచ్చాడు.ఆ ఫోకస్ గేమ్‌పై చూపించునీ గేమ్ కనిపించడం లేదు, నీకు సీరియస్‌నెస్ లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్ గేమ్‌పై పెడ్తే గెలుస్తావని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా.. అమ్మాయిలు గొడవపడ్తున్నప్పుడు మెగా చీఫ్‌గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.తొడగొట్టిన అవినాష్ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయట్లేదు, ఆడియన్స్ నిన్ను నామినేషన్స్‌లోకి వచ్చినవారమే ఎలిమినేట్ చేశారు, కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్.. నేను వచ్చిన ఏడువారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యానంటూ తొడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ.. కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్లిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం.విష్ణు ఎవర్ని నామినేట్ చేసిందంటే?ప్రేరణ.. గెలవాలన్న స్పిరిట్ నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్ చాలాసేపు గొడవపడ్డారు. తేజ.. నీ గేమ్ నచ్చలేదంటూ విష్ణును, ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. తేజను, ప్రేరణను నామినేట్ చేసింది.మాట తప్పావ్: గౌతమ్గౌతమ్.. ఫిజికల్ అవకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్‌లో ఫిజికల్ అయ్యావని నిఖిల్‌ను నామినేట్ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతడినెందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు. వీళ్లిద్దరూ గొడవపడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికిచిలికి గాలివానలా మారింది.నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణతర్వాత ప్రేరణను నామినేట్ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తావని ఆమె అనడంతో.. నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ.. నేను ట్రిగ్గర్ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్ ఫ్రస్టేట్ అయ్యాడు. అవినాష్ వంతు రాగా.. మూటల టాస్క్‌లో ఫౌల్ గేమ్ ఆడావు, ఎదుటివారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని, కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.మెగా చీఫ్ తప్ప అందరూ నామినేషన్లోనిఖిల్ వంతు రాగా గౌతమ్, ప్రేరణను నామినేట్ చేశాడు. చివరగా మెగా చీఫ్ రోహిణి.. నేను పక్కవాళ్లను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్ చేసింది. గేమ్‌లో నిన్నెవరైనా సైడ్ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్ అన్నావంటూ నబీల్ను నామినేట్ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అర్హత లేదన్న ప్రేరణ.. కాళ్లు మొక్కుతానన్న గౌతమ్
నామినేషన్స్.. ఈ రోజు కోసమే కదా ప్రేక్షకులు ఎదురుచూసేది! వారికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరికేది నామినేషన్స్‌లోనే! తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో విష్ణుప్రియ.. నిన్ను విజేతగా చూడలేనంటూ ప్రేరణను నామినేట్ చేసింది. ఇక గౌతమ్.. నిఖిల్, ప్రేరణ, పృథ్వీతో గొడవపడ్డాడు.నీకోసం కట్టుకోలేదునువ్వు కట్టుకున్న చీర నచ్చలేదని గౌతమ్ అనగా నీకోసం నేను ఈ చీర కట్టుకోలేదని ప్రేరణ అంది. కదా.. మరి నేను కూడా నీకోసం ఇక్కడ ఉండటానికి రాలేదు అని సోలో బాయ్ సెటైర్లు వేశాడు. ఇమ్యూనిటీ షీల్డ్ రావడానికి నీకు అర్హత లేదని ప్రేరణ అనగా.. దేనికీ నాకు అర్హత లేదు కదా గౌతమ్ అసహనం వ్యక్తం చేశాడు.నీ కాళ్లపై పడి దండం పెట్టాలానువ్వు మనుషుల్ని ట్రిగ్గర్ చేస్తావని ప్రేరణ అనడంతో.. ట్రిగ్గర్ చేయాలని చేయలేదు.. నీ కాళ్లపై పడి దండం పెట్టాలా చెప్పు? ఇలా అంటారనే నేను సైలెంట్ అయిపోయా.. అంటూ ఫ్రస్టేట్ అయ్యాడు. ఇక అవినాష్.. పృథ్వీని నామినేట్ చేస్తుంటే అతడి కనీసం లేచి నిలబడలేదు. నిల్చుని మాట్లాడితేనే నామినేట్ చేస్తానన్నాడు అవినాష్. మెగా చీఫ్ రోహిణి, నబీల్ మినహా మిగతా అందరూ ఈ వారం నామినేట్ అయ్యారు. -
గ్రూప్ గేమ్ ఆడినోళ్లను మడతెట్టేశారు.. గౌతమ్‌పై ప్రేరణ కుళ్లు
బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చి వారితో నామినేషన్స్ వేయించాడు. వచ్చిన ప్రతిఒక్కరూ నిఖిల్ గ్యాంగ్పైనే విరుచుకుపడ్డారు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (నవంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..గౌతమ్‌పై ప్రేరణ కుళ్లుగత వారం అవినాష్, తేజ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే వీరికి బదులు గౌతమ్ ఉండాల్సిందని ప్రేరణ అభిప్రాయపడింది. వచ్చినవారమే గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సింది.. ఇప్పుడు ఏకంగా స్ట్రాంగ్ ప్లేయర్ అయి కూర్చున్నాడు. అదెలాగో నాకర్థం కావట్లేదు. ఈ వారం గౌతమ్, విష్ణుప్రియ, యష్మిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నాను. అంతా రివర్స్‌లో జరుగుతోంది అని నబీల్‌తో ముచ్చట్లు పెట్టింది.వచ్చావా అక్క..తర్వాత బిగ్‌బాస్ ఆసక్తికర ఘట్టానికి తెరదీశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి ఇద్దర్ని నామినేట్ చేస్తారన్నాడు. మొదటగా సోనియా.. ప్రేరణను నామినేట్ చేసింది. వచ్చావా అక్క అని ప్రేరణ అనడంతో గొడవ పీక్స్‌కు వెళ్లింది. నాకు అక్క కాదు, నిఖిల్‌కు అక్కవి అని ప్రేరణ సంజాయిషీ ఇవ్వడంతో సోనియాకు మరింత తిక్క రేగింది. అతడికి అక్కను అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? అంటూ గట్టిగా నిలదీసింది. అందుకు బదులుగా దాదాపు మూడునాలుగుసార్లు ప్రేరణతో సారీ చెప్పించుకుంది.తేజది తప్పయినప్పుడు యష్మిది కూడా తప్పేగా?అనంతరం నా పెద్ద కొడుకు నిఖిల్‌ను నామినేట్ చేస్తున్నా అంటూ నైస్‌గా మొదలుపెట్టి వైల్డ్‌గా మారిపోయింది. అప్పట్లో పృథ్వీని చిన్న కారణంతో నామినేట్ చేశావు. ఎప్పుడైనా కరెక్ట్ కారణంతో ఎవర్నైనా నామినేట్ చేశావా? యష్మి, ప్రేరణను ఎందుకు నామినేట్ చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవిక్షన్ షీల్డ్గేమ్లో తేజ ముందుగా ఎగ్ వేశాడని అతడిని వరస్ట్ కంటెస్టెంట్ అన్నావు.. మరి తేజ ఎగ్ వేసేవరకు ఆగి కావాలని యష్మి మరో గుడ్డు వేసింది. ఆమె చేసింది తప్పని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని నిలదీసింది.ఆమె ముందు మాట్లాడు.. నిఖిల్‌కు సలహాఅతడి లవ్‌ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి నీపై ఫీలింగ్స్ చూపించింది.. ఒక మహిళకు గౌరవమిచ్చేవాడివే అయితే.. ఆమె రిలేషన్షిప్ కోసం హౌస్‌కు రాలేదు, ఆమె ఏం చేస్తే అది పడటానికి రాలేదు అని తన వెనకాల మాట్లాడాల్సిన అవసరం లేదు. అవన్నీ తన ముందే చెప్పాలని గద్దించింది. తన మీద ఇష్టం లేనప్పుడు ఆమె జోలికి వెళ్లకూడదు అని తేల్చేసింది.ఏడ్చేసిన యష్మిసోనియా మాటలతో యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు క్లారిటీగా చెప్పుంటే నీ జోలికే వచ్చేదాన్ని కాదని నిఖిల్‌పై మండిపడింది. నిఖిల్‌తో ఒక కలగన్నానే తప్ప తనపై నాకు పెద్ద ఫీలింగ్సే లేవని ప్లేటు తిప్పేసింది యష్మి. చివరగా సోనియా.. నువ్వు నీలా ఉండు నిఖిల్, నువ్వు గెలిస్తే సంతోషపడే మొదటి వ్యక్తిని నేనే అంటూ అతడి తలపై గాజు బాటిల్ పగలగొట్టింది.బేబక్కపై సెటైర్లుతర్వాత బేబక్క హౌస్‌లోకి వచ్చి అవతలివాళ్లను తక్కువ చేయడం నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో అతడు.. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇక్కడిదాకా ఉంచారు. మీకు ఓట్లు వేయకుండా ఎలిమినేట్ చేశారంటూ సెటైర్లు వేశాడు. చీఫ్‌గా ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయలేదంటూ బేబక్క.. నిఖిల్‌ను నామినేట్ చేసింది.గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్అనంతరం శేఖర్ బాషా హౌస్‌లో అడుగుపెట్టాడు. ప్రేరణలో చిన్నపిల్లల మనస్తత్వం ఎంతో నచ్చేవి. కానీ రానురానూ రూడ్‌గా మారిపోయింది.. కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తోందంటూ ఆమెను నామినేట్ చేశాడు. గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్ అని సలహా ఇచ్చాడు. యష్మిని సైతం గ్రూపిజం కనిపిస్తోందంటూ నామినేట్ చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గ్రూప్ గేమ్ బండారం బయటపెట్టిన బాషా.. నిఖిల్‌కు పెద్ద మైనస్
నిఖిల్ అంటే ఇష్టమని అతడి వెంట తిరిగింది యష్మి. తనకు అలాంటి ఫీలింగ్స్ లేవని నిఖిల్ క్లియర్‌గా చెప్పకుండా చెప్పీచెప్పినట్లు చెప్పి తప్పించుకున్నాడు. పైగా యష్మి.. గౌతమ్ షర్ట్ వేసుకున్నప్పుడు అలగడం, వేరే ఎవరితోనైనా డ్యాన్స్ వేస్తే కుళ్లుకోవడం, తనను హత్తుకుని ముద్దుపెట్టడం వంటివి చూసినప్పుడు నిఖిల్‌కు కూడా ఆమె అంటే ఇష్టముందేమో అన్న సంకేతాలు కనిపించాయి.ముసుగులో గుద్దులాటఈ ముసుగులో గుద్దులాట దేనికి? అసలు నీ అభిప్రాయమేంటి? అని నిఖిల్‌ను ముఖం పట్టుకుని అడిగేసింది సోనియా. అందుకతడు ఆ మ్యాటర్‌ను ఎప్పుడో కట్ చేశానని, యష్మిపై తనకలాంటి ఉద్దేశమే లేదన్నాడు. అయితే యష్మి మాత్రం అది అబద్ధమని, తనకు ఏదీ క్లారిటీగా చెప్పలేదని వాదించింది. దీంతో నిఖిల్‌కు ఈ ఎపిసోడ్ కొంత మైనస్‌గా మారేట్లు కనిపిస్తోంది.పురుగుల్ని చూసినట్లు చూస్తావుఇక బేబక్క.. మనుషుల్ని చాలా తక్కువ చేసి చూస్తుంటావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆర్జే శేఖర్ బాషా.. ప్రేరణను నామినేట్ చేస్తూ అదిరిపోయే పాయింట్లు చెప్పాడు. అవతలివారిని కించపరిచేట్లుగా మాట్లాడతావ్.. కొన్నిసార్లు కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తావు.. పానీపట్టు టాస్క్‌లో నిఖిల్ నిన్ను, యష్మిని రఫ్‌గా హ్యాండిల్ చేశాడు. ఆ పాయింట్‌తో నువ్వు నిఖిల్‌ను నామినేట్ చేయొచ్చు. కానీ అది వదిలేసి నీ టీమ్ మెంబర్ అయిన గౌతమ్‌ను ఎందుకు నామినేట్ చేశావు? అని ప్రశ్నించాడు.నిఖిల్‌కు లేని బాధ నీకెందుకు?అటు యష్మిని సైతం నామినేట్ చేస్తూ.. అవినాష్.. రోహిణిని సేవ్ చేసి నిఖిల్‌ను నామినేట్ చేశాడు. అక్కడ నిఖిలే లైట్ తీసుకున్నాడు, కానీ నువ్వెందుకు బాధపడ్డావు? మీ ముగ్గురూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని జనాలకు తెలిసిపోయింది అంటూ యష్మిని నామినేట్ చేశాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నెం.1 స్థానంలో నిఖిల్.. గౌతమ్ సాయాన్ని మర్చిపోని సోహైల్
వారమంతా కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చారు. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కంటెస్టెంట్ల ఫ్రెండ్స్ కూడా స్టేజీపైకి వచ్చారు. వారికి నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. తమ కుటుంబ సభ్యుడిని మినహాయించి మిగతావారిలో ఎవరు టాప్ 5లో ఉంటారో చెప్పాలన్నాడు. మరి ఎవరెవరు ఏయే కంటెస్టెంట్లను టాప్ 5లో పెట్టారో నేటి (నవంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..టాప్ 5 ర్యాంకులుమొదట ప్రేరణ తల్లి రూప, చెల్లి ప్రకృతితో పాటు నటి ప్రియ వచ్చారు. ప్రకృతి మిస్ ఇండియా తెలంగాణతో పాటు బెనెటి యూనివర్సిటీ మిస్ సుడోకుగా నిలిచిందంటూ నాగ్ అభినందించాడు. తర్వాత ప్రేరణ తల్లి.. నిఖిల్‌ను మొదటి స్థానంలో, నబీల్ను రెండో స్థానంలో, గౌతమ్, యష్మి, రోహిణిలను మిగతా మూడు స్థానాల్లో పెట్టారు.రవి సలహాను లెక్కచేయని విష్ణుతర్వాత విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి పావని, యాంకర్ రవి వచ్చారు. నీకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చుకోకపోతే జనాలు నీకెందుకు ఓట్లు వేస్తారు? ముందు నీకు నువ్వు ముఖ్యం అనుకుని గేమ్ ఆడమని రవి సలహా ఇచ్చాడు. కానీ విష్ణుప్రియ వింటేగా..? నాకోసం నేను ఆలోచిస్తే అహంకారమంటూ పిచ్చిగా మాట్లాడింది. దీంతో పావని నీపై నువ్వు ఫోకస్ చేయు అని హెచ్చరించడంతో కాస్త వెనక్కు తగ్గింది.కోవై సరళ కంటే పెద్ద ఆర్టిస్టు..వీరు గౌతమ్‌ను 1, నిఖిల్‌ను 2, నబీల్ను 3, పృథ్వీని 4, రోహిణిని 5వ స్థానంలో పెట్టారు. రోహిణి కోసం నాన్నతో పాటు నటుడు శివాజీ స్టేజీపైకి వచ్చారు. కోవై సరళ కంటే కూడా పెద్ద ఆర్టిస్టు అవుతావు అని శివాజీ.. రోహిణిని మెచ్చుకున్నాడు. టాప్ 5 గురించి మాట్లాడుతూ.. విష్ణు 1, నబీల్ 2, నిఖిల్ 3, గౌతమ్ 4, తేజ 5వ స్థానంలో ఉంటారన్నాడు.గౌతమ్ సాయం మర్చిపోని సోహైల్పృథ్వీ కోసం తమ్ముడు విక్రమ్, నటి దర్శిని వచ్చారు. నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియను టాప్ 5లో వరుస స్థానాల్లో ఉంచారు. పృథ్వీ సేవ్ అయినట్లు ప్రకటించారు. గౌతమ్ తల్లి మంగమ్మతో పాటు నటుడు సోహైల్ వచ్చారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. నా సినిమా రిలీజ్ సమయంలో 120 టికెట్లు స్పాన్సర్ చేసి జనాలకు చూపించాడు అని తెలిపాడు.నబీల్ కోసం భోలెఇక నబీల్ను 1, నిఖిల్‌ను 2, ప్రేరణను 3, తేజను 4, అవినాష్‌ను 5వ స్థానాల్లో పెట్టారు. తర్వాత గౌతమ్‌ను సేవ్ చేశారు. నబీల్ కోసం అతడి సోదరుడు సజీల్తో పాటు సింగర్ భోలె షావళి వచ్చారు. వీళ్లు నిఖిల్, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణుప్రియకు టాప్ 5 ర్యాంకుల్ని వరుసగా ఇచ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గాల్లో తేలుతున్న తేజ.. హింట్లు వదిలేసి ప్రేమ పంచిన శ్రీపాద
అమ్మను మించిన సెంటిమెంట్ మరొకటి ఏముంటుంది? మీ అమ్మ రాదు, రానివ్వను అని తేజను భయపెట్టి ఏడిపించిన బిగ్‌బాస్ చివరకు పట్టువదిలాడు. తల్లిని లోనికి పంపించాడు. దానికంటే ముందు, తర్వాత ఏం జరిగిందో నేటి (నవంబర్ 15) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..కటౌట్ తీసేయమన్న బిగ్బాస్ఫ్యామిలీ వీక్ అయిపోంది.. కాబట్టి ప్రేరణ.. తన భర్త శ్రీపాద కటౌట్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టేయాలన్నాడు బిగ్‌బాస్. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపటికే ఆమె పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.. శ్రీపాదను హౌస్‌లోకి పంపించాడు. అతడు రావడంతోనే భార్య నుదుటన తిలకం దిద్దాడు. వీరికి బ్యూటిఫుల్ డిన్నర్ డేట్ కూడా ఏర్పాటు చేయడం విశేషం.ప్రేమ కావాలి..అది చూసిన విష్ణు, రోహిణి తెగ ఫీలైపోయారు. విష్ణు అయితే.. పృథ్వీ తనను ప్రేమించట్లేదంటూ బాధపడింది. అతడికి నువ్వంటే ఇష్టం ఉంది కానీ ప్రేమ కాదు అని యష్మి క్లారిటీ ఇచ్చింది. అయినా సరే నాకు ప్రేమ కావాలని విష్ణు పిచ్చిపట్టినట్లే ప్రవర్తించింది. మరోవైపు శ్రీపాద.. గొడవలన్నింటికీ మూలకారణమైన కిచెన్ నుంచి బయటకు వచ్చేయమని ప్రేరణకు సూచించాడు. తెగేదాక గొడవలు లాక్కురావద్దన్నాడు. లవ్ సాంగ్తర్వాత భార్యతో కలిసి గేమ్ ఆడాడు. ఈ గేమ్ వల్ల కిచెన్ టైమర్‌కు రెండు గంటలు యాడ్ అయింది. అందరి ఫ్యామిలీస్ వచ్చాయి కానీ తన తల్లి మాత్రం రాలేదని తేజ బెంగపెట్టుకున్నాడు. అనంతరం బిగ్‌బాస్ సరదాగా లవ్ సాంగ్ ప్లే చేస్తే నిఖిల్-యష్మి, పృథ్వీ-విష్ణు అందులో లీనమై స్టెప్పులేశారు. తర్వాత మెగా చీఫ్ కోసం గేమ్ పెట్టారు. ఇందులో తేజ తప్ప మిగతా అందరూ పాల్గొనాల్సి ఉంటుందన్నాడు. ఏడుస్తుంటే చూడలేకపోతున్నా..ఈ గేమ్‌లో అవినాష్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. తల్లి కోసం తేజ ఏడుస్తూనే ఉన్నాడు. అతడి బాధను అర్థం చేసుకున్న బిగ్‌బాస్ ఆమెతో ఫోన్ కాల్ మాట్లాడిపించాడు. నేను రావట్లేదని బాధపడకు, నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా అని ఫోన్లో ఓదార్చింది. కాసేపటికే నేరుగా ప్రత్యక్షమైంది. అమ్మను చూడగానే తేజ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. గోరుముద్దలుతల్లి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. నువ్వు బాగా ఆడుతున్నావు. ఫినాలేలో చూడాలనుందని తన కోరిక బయటపెట్టింది. అలాగే తను ప్రేమగా వండుకొచ్చిన చికెన్, ఆలుగడ్డ కూరను అన్నంలో కలిపి అందరికీ గోరుముద్దలు తినిపించింది. అమ్మను బిగ్‌బాస్ షోలో చూపించాలన్న కల నెరవేరిందంటూ తేజ తెగ సంబరపడిపోయాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణ నుంచి హౌస్‌మేట్స్‌కు విముక్తి.. కొత్త చీఫ్ ఎవరంటే?
ఏంటో.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి గ్రాఫ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరూ ఊహించలేరు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ అదే వారం బ్యాగు సర్దుకుని వెళ్లాల్సింది. కానీ ఇప్పుడేకంగా విన్నర్ రేసులో నిలబడ్డాడు. వార్ వన్ సైడ్ అయింది, నిఖిల్ ట్రోఫీ ఎత్తడం ఖాయమనుకుంటే అతడికే పోటీ ఇస్తున్నాడు.అంతా తలకిందులువిష్ణుప్రియ.. పృథ్వీపైనే కోపం తెచ్చుకుని రెబల్‌గా మారిందనుకునేలోపే అతడిని కన్నందుకు థాంక్యూ అంటూ ఏకంగా పృథ్వీ తల్లి కాళ్లపై పడింది. ఎంతో కూల్‌గా ఉండే తేజ ఈమధ్య ఆవేశం స్టార్‌గా మారిపోయాడు. చాలామందికంటే ప్రేరణ నయం అనుకునేలోపే ఆమె తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. చీఫ్ అయ్యాక చీప్‌గా..అందరి మీదా నోరు పారేసుకుని విపరీతమైన నెగెటివిటీ సంపాదించుకుంది. మెగా చీఫ్ అవ్వాలని ఫస్ట్ వీక్ నుంచి ఆశపడింది. ఎట్టకేలకు పదోవారంలో చీఫ్ అయింది.. కానీ చీప్ బిహేవియర్‌తో తన గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. ఆమె.. విష్ణుప్రియ, గౌతమ్‌లను టార్గెట్ చేయడం జనాలకు అస్సలు మింగుడుపడలేదు. చీఫ్ అయ్యాక తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కొత్త చీఫ్‌గా అవినాష్మొత్తానికి హౌస్‌లో ఆమె చీఫ్ పదవి ముగిసినట్లు తెలుస్తోంది. ఈసారి అందరూ చీఫ్ పదవి కోసం పోటీపడగా ముక్కు అవినాష్‌కే ఆ పోస్టు దక్కినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. హౌస్‌మేట్స్‌కు ప్రేరణ నుంచి విముక్తి లభించినట్లేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణకు భంగపాటు.. మోసం చేయడం మానుకోమన్న పృథ్వీ తల్లి
ఫ్యామిలీ వీక్‌తో కంటెస్టెంట్ల ముఖాలు వెలిగిపోతున్నాయి. తేజ మాత్రం తిరునాళ్లలో తప్పిపోయిన చిన్నపిల్లాడిలా తల్లికోసం ఏడుస్తూనే ఉన్నాడు. ఈ రోజు (నవంబర్ 14) ఎవరెవరు హౌస్‌లోకి వచ్చారో చూసేద్దాం..స్ట్రాటజీ ప్రకారం లవ్ ట్రాక్?మొదటగా విష్ణుప్రియ తండ్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమెతో.. గ్రూప్ గేమ్ వద్దు, నీ ఆట నువ్వు ఆడు. నువ్వు కష్టపడితే కప్పు గెలుస్తావు. నువ్వు కొద్దిగా అటువైపు (పృథ్వీతో) ఉంటున్నావని నీ అభిమానులే బాధపడుతున్నారు. నువ్వు స్ట్రాటజీ ప్రకారం అతడితో లవ్ ట్రాక్ నడుపుతూ గేమ్ ఆడుతున్నావు. అదంతా జనాలు నిజమనుకుంటారు అని చెప్పుకుంటూ పోయాడు.అతడి వల్లే ఉండగలుగుతున్నాఇంతలో విష్ణు మధ్యలో కలగజేసుకుంటూ అది స్ట్రాటజీ కాదని, తన ఫీలింగ్స్ నిజమేనని తెలిపింది. ఇది ప్రేమ కాదు, ఒకలాంటి ఇష్టం తనపై ఉంది.. అతడి వల్లే ఎన్నిరోజులైనా హౌస్‌లో ఉండగలుగుతానన్న ధైర్యం వచ్చింది. నాకు తనపై ఫీలింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కప్పేయాలి? అని ప్రశ్నించింది. అందుకాయన నవ్వుతూ నీ గేమ్ నువ్వు ఆడు అని సలహా ఇచ్చాడు.అన్యాయం చేశావిష్ణుకు తండ్రి ప్రేమ అందించలేకపోయానని ఎమోషనల్ అయ్యాడు. విష్ణు పుట్టాక చాలారోజులు తన దగ్గరకు వెళ్లలేదు. తన చిన్నతనంలో సంతోషాన్ని పంచలేకపోయాను. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాను. వాళ్లకు అన్యాయం చేశాను. పైసా కూడా వాళ్లకు పెట్టలేకపోయాను. అందుకు ఇప్పటికీ నేను సారీ చెప్తున్నాను అన్నాడు.పృథ్వీతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పెళ్లి ప్రస్తావన రాగా విష్ణుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేస్తానన్నాడు. పృథ్వీతో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. అదంతా కేవలం ఈ హౌస్‌లోనే.. గేమ్ అయిపోయాక ఏముండదు అన్నాడు. దాంతో విష్ణు.. ఏమో, అదిప్పుడే చెప్పలేమని సిగ్గుపడగా తనకు ఎవరైనా ఓకే అంటూ తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత ఆయన ఓ గేమ్ ఆడి కూతురి కోసం బర్గర్ సంపాదించాడు.విష్ణు నచ్చేసిందన్న పృథ్వీ తల్లిఅనంతరం అమ్మ పాట రాగానే తేజ కన్నీటితో ఆశగా గేటువైపు చూశాడు. కానీ అక్కడ పృథ్వీ తల్లి సత్యభామ లోనికి వచ్చింది. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ణును మాత్రం ప్రేమగా హత్తుకుంది. పృథ్వీని కన్నందుకు థాంక్యూ అంటూ విష్ణు ఆమె పాదాలపై పడింది. కోడలిగా విష్ణుప్రియ ఓకేనా అని నిఖిల్ అడగ్గా.. అన్నీ వాడిష్టం.. వాడికి నచ్చితే ఓకే అని సిగ్నల్ ఇచ్చేసింది.ఇన్ని రోజులు ఉంటావనుకోలేదుఅందరితో కలిసుండు, ఎవరితోనూ గొడవపడకు. నామినేషన్ చేసేటప్పుడు వాళ్లతో వీళ్లతో చెప్పకు. ఎవరి గురించో నామినేట్ చేయకు. నీ గురించి చేయు. నీ టాలెంట్ చూపించుకోవడానికి బిగ్‌బాస్ మంచి ఛాన్స్. ఇన్ని రోజులు ఉంటావనుకోలేదు. గేమ్‌లో మోసం చేయకుండా నిజాయితీగా ఆడు అని సలహాలు, సూచనలు ఇచ్చింది.ప్రేరణకు భంగపాటుఎవరు ఎక్కువ ఇష్టమని పృథ్వీ అడగ్గా విష్ణు పేరు చెప్పింది. డ్యాన్స్ బాగా చేస్తుంది, దేవుడి భక్తురాలు, జెన్యూన్ అంది. సత్యభామ తన కొడుకుతో పాటు విష్ణుకు సైతం గోరుముద్దలు తినిపించింది. భర్త రాక కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేరణకు భంగపాటు ఎదురైంది. హౌస్‌లోకి రాలేకపోతున్నానంటూ తన కటౌట్‌ను పంపించాడు. నువ్వు ట్రోఫీ ఎత్తినప్పుడు వస్తానంటూ వీడియో సందేశం పంపాడు.నిన్ను టార్గెట్ చేయరుఅనంతరం గౌతమ్ అన్నయ్య డాక్టర్ జగదీష్ వచ్చాడు. అందరికీ ఇన్పుట్స్ వచ్చాయి కాబట్టి నిన్ను టార్గెట్ చేయరు. సోలోగానే ఆడు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు వద్దు.. మరీ ఎక్కువ కోప్పడకు. అనుకున్న లక్ష్యానికి దగ్గరలో ఉన్నావు అని చెప్పాడు. చివరగా తమ్ముడితో కలిసి ఓ గేమ్ ఆడి రూ.51 వేలు గెలిచారు. అది ప్రైజ్‌మనీలో యాడ్ చేయగా మొత్తం రూ.50,30,000కు చేరింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణు చెంప చెళ్లుమనిపిస్తానన్న నిఖిల్ తల్లి.. ఎందుకంటే?
తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజయవంతంగా పది వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు పదకొండో వారం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ తల్లి, అవినాష్ భార్య, యష్మి తండ్రి హౌస్‌లో అడుగుపెట్టారు. అయితే ఏ ఫ్యామిలీ మెంబర్ ఇవ్వనన్ని హింట్లు నిఖిల్ తల్లి.. తన కొడుక్కి ఇచ్చింది.నిఖిల్‌ను ఆదేశించిన తల్లిఏమాత్రం సంకోచించకుండా చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసింది. గౌతమ్‌తో గొడవపెట్టుకోవద్దని, అతడిని నామినేట్ చేయొద్దని సూచించింది. యష్మిని కంట్రోల్లో పెట్టమంది. ప్రేరణకు బయట నెగెటివిటీ పెరిగిపోతోందని పరోక్షంగా చెప్తూ తనతో దూరంగా ఉండమంది. యష్మి, ప్రేరణ, నిఖిల్ అంతా ఒకే గ్రూప్.. కానీ ఇక మీదట గ్రూప్ గేమ్స్ వద్దు, ఒంటరిగా నీ ఆట నువ్వు ఆడు అని నొక్కి చెప్పింది. విష్ణుపై ఎందుకంత కోపం?ఈ క్రమంలో నిఖిల్ తల్లి సోషల్ మీడియాలో చేసిన పాత పోస్టులు కొన్ని వైరల్‌గా మారాయి. అందులో ఆమె విష్ణుప్రియపై దారుణ కామెంట్లు చేసింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ ముఖంపై లాగిపెట్టి కొట్టాలనుందని ఓ పోస్ట్ పెట్టింది. అందులో విష్ణును డ్రామా క్వీన్ అని విమర్శించింది. దీనిపై ఓ వ్యక్తి స్పందిస్తూ.. విష్ణు కనీసం డ్రామా అయినా చేస్తుంది.. మరి నిఖిల్ ఏం చేస్తున్నాడు? అని కామెంట్ పెట్టాడు. అందుకామె.. నిఖిల్ తన గేమ్ ఆడుతున్నాడు.. టాస్కులు గెలుస్తున్నాడు. విష్ణు మాత్రం కేవలం డ్రామానే చేస్తుందని విమర్శించింది. ఇతర కంటెస్టెంట్లను తిట్టడమేంటి?ప్రేరణను వీడియోను షేర్ చేస్తూ.. వావ్. ఆ కల్చర్ ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? ఆ లాంగ్వేజ్ ఏంటి? అని విమర్శించింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లు నెట్టింట ప్రత్యక్షం కావడంతో బిగ్‌బాస్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఫ్యామిలీ తన కంటెస్టెంట్ గురించి పోస్టులు పెట్టాలి కానీ ఇలా ఇతర కంటెస్టెంట్లను తిడుతూ పోస్టులు పెట్టడం తప్పని పలువురూ అభిప్రాయపడుతున్నారు. నిఖిల్‌ను తిడుతుంటే ఎలా ఊరుకుంటుంది?ఓ టాస్కులో ప్రేరణ, విష్ణుప్రియ.. నిఖిల్‌పై నోరుపారేసుకోవడం వల్లే ఆ తల్లి తట్టుకోలేక అలాంటి కామెంట్స్ చేసిందని నిఖిల్ అభిమానులు ఆమెను వెనకేసుకొస్తున్నారు. నిఖిల్ చేతికి గాజులు వేసుకుని బొట్టు పెట్టుకోవాలి అని విష్ణు తిట్టినందుకే అతడి తల్లి ఆమె చెంప పగలగొడతానందని.. అందులో తప్పేముందని కామెంట్లు చేస్తున్నారు. WTH 🤯🤯🤯This is absolutely rude & disgusting!!Being a contestant’s mom posting so harshly with such a unnecessary rude description on #VishnuPriya & #Prerana is absolutely worst 👎🏻👎🏻Didn’t expect this from #NikhilMaliyakkal mom 🤢🤢#BiggBossTelugu8 pic.twitter.com/fYCl3SN7QU— Vamc Krishna (@lyf_a_zindagii) November 14, 2024 మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి, నిఖిల్‌ను బుక్ చేసిన తేజ.. దమ్ము లేదంటూ రెచ్చగొట్టిన పృథ్వీ
కంటెస్టెంట్ల ఫోటోపై పెయింట్ వేసి నామినేట్ చేయాలి. బజర్ మోగినప్పుడు ముందుగా బ్రష్ పట్టుకున్న వారికే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్స్ అంటేనే గొడవలు కాబట్టి దానికి ఏమాత్రం కొదవ లేదు. యష్మి తప్పును తన నోటితోనే చెప్పించాడు తేజ.. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఫేవరిటిజం స్పష్టంగా కనిపిస్తోందిముందుగా మెగా చీఫ్ ప్రేరణ.. గౌతమ్ ఫోటోకు పెయింట్ పూస్తూ ప్రతీది ఆడియన్స్ ఏమనుకుంటారు? అనేది ఆలోచిస్తూ అడుగు వేస్తున్నాడు. అందరితో కలవట్లేదు, టీమ్ స్పిరిట్ లేదు అని కారణాలు చెప్పింది. ఆ కారణాలు గౌతమ్‌కు ఏమాత్రం మింగుడుపడలేదు. టీమ్ వర్క్ అంటే.. ఓడినా, గెలిచినా కలిసి పోరాడటం.. అంతే తప్ప నీవల్ల ఓడిపోయాం అంటూ గుచ్చిగుచ్చిచెప్పడం టీమ్ మెంబర్ లక్షణం కాదు. ఇక్కడ ఫేవరిటిజం, గ్రూపిజం స్పష్టంగా కనిపిస్తోంది అని ప్రేరణపై మండిపడ్డాడు.నాది తప్పయితే యష్మిది కూడా తప్పే!తర్వాత బజర్ మోగగానే బ్రష్ పట్టుకున్న నిఖిల్.. తేజను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అతడు కావాలని తప్పు చేశాడన్నాడు. దీనికి తేజ స్పందిస్తూ.. నేను తెలిసి తప్పు చేయలేదు. నేను గుడ్డు వేయడం తప్పయితే నా తర్వాత యష్మి చేసింది తప్పు కాదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం దాటవేస్తుంటే.. నీకు మాట్లాడటానికి భయం.. అంటూ రెచ్చగొట్టాడు. దాంతో నిఖిల్.. ఆమెది తప్పు కాదు, నీదే తప్పు అన్నాడు. దమ్ము లేదుఇంతలో నిఖిల్ గ్యాంగ్ వీళ్లను ఆపేందుకు రాగా.. ముగ్గురూ నాపై అటాక్ చేస్తున్నారా? అని తేజ అన్నాడు. దాంతో పృథ్వీ.. ఆ ముగ్గురు ఎవరని అడిగారు. నువ్వు అడిగితే నేను చెప్పను అని తేజ అంటే.. నీకు పేర్లు చెప్పే దమ్ము లేదు అంటూ తేజపై రెచ్చిపోయాడు. తర్వాత గౌతమ్.. అవతలి వ్యక్తులను అగౌరవపర్చడం అలవాటైపోయిందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.తల్లికి తేజ క్షమాపణలుదీని గురించి చర్చించే క్రమంలో.. నీ బెదిరింపులకు అందరూ భయపడతారేమో కానీ నేను కాదు అని గౌతమ్ అన్నాడు. నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావని పృథ్వీ ఆరోపించాడు. అనంతరం తేజ ముందుగా తన తల్లికి సారీ చెప్పాడు. నిన్ను హౌస్‌కు తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ మాటపై నిలబడలేకపోతున్నందుకు క్షమించమన్నాడు. ఇందుకు కారణమైన హౌస్‌మేట్స్‌కు థాంక్యూ చెప్పాడు. వరస్ట్ ప్లేయర్ అంటూతర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించకుండా నేను ఒక గుడ్డును పాము నోట్లో పెట్టాను. తర్వాత యష్మి కూడా ఆలోచించకుండా వెళ్లి మరో గుడ్డు పాము నోట్లో వేసింది. నేను చేసింది తప్పే.. అలాగే యష్మి చేసింది కూడా తప్పే! అన్నాడు. దీనిపై యష్మి.. తాను తప్పు చేయలేదని వాదించింది. ఈ క్రమంలో హే.. పో, కూర్చో అంటూ చిరాకుపడింది. వరస్ట్ ప్లేయర్ అంటూ తేజపై ముద్ర వేసింది. పృథ్వీ.. చీఫ్‌గా, సంచాలకుడిగా ఫెయిలయ్యావంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.మాట తప్పావ్రోహిణి.. చీఫ్ కంటెండర్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట తప్పావంటూ విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఆ రోజు అందుకే ఏడ్చానని రోహిణి పేర్కొంది. దీనికి విష్ణు తలతిక్క సమాధానమిచ్చింది. తొక్కలో మాట ఇచ్చుండకపోతే నాకు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్తున్నా.. నాకు అందరికంటే పృథ్వీయే ఎక్కువ అని ప్రకటించేసింది. ఇక ఈ వారం గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తేజకు దారుణమైన పనిష్మెంట్.. త్యాగానికి రోహిణి రెడీ!
టేస్టీ తేజకు దెబ్బమీద దెబ్బ పడింది. ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో అతడు చేసిన తప్పిదం వల్ల వచ్చేవారం కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయాడు. అటు హౌస్మేట్స్ వల్ల తన ఫ్యామిలీ హౌస్‌లోకి వచ్చే ఆస్కారమే లేదట.. అదెలాగో నేటి ఎపిసోడ్ (నవంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..సిగ్గు లేకుండా..మెగా చీఫ్ ప్రేరణ మాట ఎవరూ వినడం లేదు. పెండింగ్‌లో ఉన్న పని చేయమంటే విష్ణు కస్సుబుస్సులాడుతుంది. సీతాఫలం తినొద్దు అని చెప్పినా ఉన్న ఒక్కదాన్ని లటుక్కుమని గౌతమ్ ఆరగించేశాడు. వద్దని చెప్పినా ఎలా తిన్నావు? సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావని గౌతమ్‌పై ఫైర్ అయింది. అటు స్వీట్లు తినను అని బిగ్‌బాస్‌కు మాటిచ్చిన నబీల్.. హల్వా తిని ఆ నియమాన్ని ఉల్లంఘించాడు.తేజకు శిక్షఇక నాగార్జున వచ్చీరావడంతోనే ఎవిక్షన్ షీల్డ్ గేమ్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమైన తేజను వాయించాడు. నీకంటే ముందు వచ్చిన జంటలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. నువ్వు మాత్రం యష్మితో కలిసి ఒక అభిప్రాయానికి రాకుండా నీకు నచ్చింది చేశావని సీరియస్ అయ్యాడు. అతడు చేసిన తప్పుకుగానూ వచ్చేవారం చీఫ్ కంటెండర్‌వి కాలేవని శిక్ష విధించాడు.ఎవిక్షన్ షీల్డ్ ఎవరికివ్వాలో డిసైడ్ చేసిన ప్రేరణఇక ఎవిక్షన్ షీల్డ్ రేసులో మిగిలిన రోహిణి, నబీల్, నిఖిల్‌లలో ఎవరికి ఆ షీల్డ్ ఇవ్వాలో హౌస్మేట్స్ డిసైడ్ చేయాలన్నాడు. ఈ క్రమంలో రోహిణికి ప్రేరణ, గంగవ్వ, తేజ సపోర్ట్ చేయగా నిఖిల్‌కు హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ సపోర్ట్ చేశారు. నబీల్‌కు గౌతమ్, యష్మి, అవినాష్ మద్దతిచ్చారు. ముగ్గురికీ సమాన ఓట్లు పడటంతో చీఫ్ ప్రేరణపై భారం వేశారు. ఆమె నబీల్‌కు సపోర్ట్ ఇవ్వడంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ అందుకున్నాడు.అంతరాత్మపై ఒట్టేసి..అనంతరం నాగార్జున.. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలుస్తూ.. నీపై నువ్వు ప్రమాణం చేసుకుని ఈ సీజన్లో వరస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పాలన్నాడు. మొదటగా నబీల్.. తన ఫోటోపై ఒట్టేసి విష్ణుప్రియను వరస్ట్ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. నిఖిల్.. తప్పు చేసినా రుబాబు చూపిస్తాడు, వెటకారం ఎక్కువ అంటూ తేజ వరస్ట్ ప్లేయర్ అన్నాడు. హరితేజ, యష్మి.. రోహిణిని, గౌతమ్, తేజ.. పృథ్వీని, అవినాష్.. హరితేజను, రోహిణి, గంగవ్వ.. యష్మిని, విష్ణుప్రియ, పృథ్వీ.. తేజను చెత్త ప్లేయర్ అని పేర్కొన్నారు. తేజకు కోలుకోలేని దెబ్బప్రేరణ.. గెలవాలన్న ఆసక్తి లేదంటూ విష్ణుప్రియ వరస్ట్ ప్లేయర్ అని తెలిపింది. వరస్ట్ హౌస్మేట్స్ అని ఎక్కువ ఓట్లు పడ్డ వ్యక్తికి ఫ్యామిలీ వీక్‌లో వారి కుటుంబసభ్యులు రాబోరని నాగ్ బాంబు పేల్చాడు. ఈ సీజన్లో తేజను వరస్ట్ ప్లేయర్‌గా డిసైడ్ చేశారు. కేవలం తల్లిని తీసుకురావడానికే ఈ సీజన్‌కు వచ్చాను సర్ అంటూ తేజ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేశాడు.గంగవ్వ ఎలిమినేట్దీంతో రోహిణి.. నా ఫ్యామిలీకి బదులుగా నీ కుటుంబసభ్యులు రావాలని బిగ్‌బాస్‌ను అభ్యర్థిస్తానంది. అటు గంగవ్వ ఆరోగ్యం గురించి నాగ్ ఆరా తీశాడు. ఆమె తన ఒళ్లంతా మంట లేస్తోందంటూ.. సంతోషంగానే ఉన్నాను కానీ చేతనవడం లేదని తెలిపింది. దీంతో ఆమెను హౌస్ నుంచి పంపించేశారు. గంగవ్వ వెళ్లిపోతుంటే రోహిణి, తేజ గుక్కపెట్టి ఏడ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియకు చుక్కలు చూపిస్తున్న ప్రేరణ.. బలైపోయిన తేజ!
ఎన్నాళ్లనుంచో చీఫ్ పోస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రేరణ కల ఎట్టకేలకు సాకారమైంది. మెగా చీఫ్ పదవిని అధిరోహించింది. అలా డ్యూటీ ఎక్కిందో లేదో తన పనితనం మొదలుపెట్టేసింది. అప్పుడే విష్ణుప్రియకు చుక్కలు చూపించేస్తోంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..మాట తప్పాడన్న కోపంతో..మెగా చీఫ్ గేమ్‌లో పృథ్వీ, నబీల్ ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ముందుగానే డీల్ చేసుకున్నారు. కట్ చేస్తే నబీల్ను ఓడించమని నిఖిల్‌కు సూచించాడు పృథ్వీ. చేసిందంతా చేశాక తాను అలా అనలేదని మాట మార్చాడు. తను ఓడిపోవడంతో నబీల్ కూడా పృథ్వీని ఓడించాలని డిసైడయ్యాడు. ఈ క్రమంలో అతడు కూర్చున్న బాక్స్‌లో మూటలు వేశాడు. అయితే అవి తన మీద పడటం, అలాగే ఇచ్చిన మాట తప్పాడన్న కోపంతో పృథ్వీ.. నబీల్‌పై సీరియస్ అయ్యాడు. ఈ రౌండ్లో పృథ్వీ ఓడిపోయాడు.ప్రేరణ మెగా చీఫ్చివర్లో ప్రేరణ, రోహిణి ఇద్దరే మిగిలారు. విష్ణు, గంగవ్వ, అవినాష్, తేజ.. రోహిణికి సపోర్ట్ చేయగా మిగతా అందరూ ప్రేరణకు మద్దతిచ్చి ఆమెను చీఫ్ చేశారు. ఇకపోతే హరితేజ హౌస్‌లో ఉన్నవారందరిపైనా హరికథ చెప్పి అలరించింది. అనంతరం మెగా చీఫ్ అయిన ప్రేరణ మొదట విష్ణునే టార్గెట్ చేసినట్లు ఉంది. విష్ణును కప్బోర్డ్ ఖాళీ చేయమందట.. అలాగే విష్ణు బెడ్ దగ్గరున్న సామాను నీట్‌గా పెట్టుకోమని చెప్పింది. ఆమె వినకపోవడంతో ప్రేరణ వెళ్లి సర్దింది. ఇంట్లో చేయాల్సిన పనులు కూడా సరిగా చేయడం లేదని విష్ణును తప్పు పట్టింది.పాము- ఎగ్స్బిగ్బాస్ ఎవిక్షన్ షీల్డ్‌ను ప్రవేశపెట్టాడు. సమయానుసారం ఆకలిగా ఉన్న పాముకు గోల్డెన్ ఎగ్స్ ఇవ్వాలన్నాడు. ఎవరికి చెందిన గోల్డెన్ ఎగ్ పాముకు ఆహారమవుతుందో వారు ఎవిక్షన్ షీల్డ్‌కు దూరమవుతారు. మెగా చీఫ్ ప్రేరణ.. ఎవిక్షన్ షీల్డ్ రాకూడదనుకున్న ఐదుగురి ఎగ్స్ పాముకు ఆహారంగా పెట్టాలన్నాడు. అలా విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజ ఫోటోలున్న ఎగ్స్‌ను పాము నోట్లో వేసింది.అవినాష్‌పై ఎగిరెగిరి పడ్డ యష్మిఅనంతరం.. అవినాష్, నబీల్ను పిలిచి ఒక ఎగ్‌ను పాము నోట్లో పెట్టమన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయంతో యష్మి ఎగ్ తొలగించారు. అందుకు కారణం చెప్పమని యష్మి అడగ్గా.. నువ్వు వీక్ కాబట్టే నబీల్ నీకు సూట్‌కేస్ ఇచ్చాడు. అయినా ఈ వారం నీకు వచ్చిన అవకాశం సరిగా వాడుకోలేదని అవినాష్ అన్నాడు. ఆ మాటతో యష్మికి కోపం కట్టలు తెంచుకుంది. అందరూ అన్ని గేమ్స్ గెలవరు, స్ట్రాంగ్ ఉన్నవాళ్లు కూడా చాలా గేమ్స్‌లో ఓడిపోయారు.. నన్ను వీక్ అంటూ డీమోటివేట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.నిఖిల్ గేమ్‌ను అడ్డుకున్న గౌతమ్నిఖిల్, గౌతమ్ వంతు రాగా నిఖిల్ త్యాగం చేసేందుకు రెడీ అయ్యాడు. అందుకు గౌతమ్ ఒప్పుకోలేదు. ప్రేరణ ఎగ్ తీసేద్దామంటే నిఖిల్ ఒప్పుకోడు. చివరకు ఇద్దరూ కలిసి తేజను బలి చేశారు. విష్ణుప్రియ, పృథ్వీ వంతురాగా.. ప్రేరణ ఎగ్ తీసేశారు. తర్వాత రోహిణి, హరితేజ వంతు వచ్చింది. నిఖిల్ ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అవడానికి రెడీగా ఉన్నాడని రోహిణి అంటుంటే హరితేజ మాత్రం నామినేషన్స్‌లోకి రావట్లేదంటూ అవినాష్‌ను తీసేద్దామంది. అందుకు రోహిణి ఒప్పుకోలేదు. అటు హరితేజ కూడా వినకపోవడంతో తప్పని పరిస్థితిలో రోహిణి.. అవినాష్ ఎగ్‌ను పాము నోట్లో వేసింది.తేజ చేసిన పనికితేజ, యష్మి వంతు వచ్చింది. యష్మి.. ఎఫర్ట్స్ కనిపించడం లేదంటూ రోహిణి పేరు చెప్పగా తేజ.. నబీల్, నిఖిల్లో ఎవరైనా ఓకే అన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తేజ.. నబీల్, రోహిణి, నిఖిల్ అభిప్రాయాలు అడిగాడు. తనకు అక్కర్లేదని నిఖిల్ క్లియర్‌గా చెప్పడంతో మరో సెకన్ ఆలోచించకుండా అతడి ఎగ్‌ను పాము నోట్లో వేశాడు.నబీల్‌కు ఎవిక్షన్ షీల్డ్అది చూసిన యష్మి.. కావాలని రోహిణి ఎగ్ కూడా వేసేసింది. దీంతో నిఖిల్, పృథ్వీ, హరితేజ, విష్ణు.. అందరూ తేజపై పడి అరిచారు. ఏకాభిప్రాయానికి రాకుండా ఎగ్ ఎలా వేస్తావంటూ మండిపడ్డారు. కానీ ఏ ఒక్కరూ యష్మి ఎగ్ వేయడాన్ని తప్పుపట్టలేదు. చివర్లో నబీల్ ఎగ్ మాత్రమే మిగిలి ఉండటంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ గెలుపొందినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: ఎవిక్షన్ షీల్డ్ గెలిచిన ఓరుగల్లు బిడ్డ
ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి లేదా ఎలిమినేషన్లో ఉన్నవారిని సేవ్ చేయడానికి బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెడుతుంటాడు. అలా ఈసారి కూడా ఎవిక్షన్ షీల్డ్ తీసుకొచ్చాడు. ఈ షీల్డ్ గెలిచినవారు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా సేవ్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే అది ఒక్కవారమా? ఏంటనేది క్లారిటీ లేదు.ఆటలో ఐదుగుర్ని తీసేసిన మెగా చీఫ్అయితే ఎవిక్షన్ షీల్డ్‌కు అర్హత లేదనకున్న ఐదుగురురిని గేమ్‌లో నుంచి తీసేయాలని మెగా చీఫ్ ప్రేరణకు బాధ్యత అప్పగించాడు. అలా ప్రేరణ.. పృథ్వీ, గౌతమ్, గంగవ్వ, హరితేజ, విష్ణుప్రియలను సైడ్ చేసేసింది. మిగిలిన హౌస్మేట్స్ షీల్డ్ కోసం పోటీపడ్డారు.ఎవిక్షన్ షీల్డ్ఈ క్రమంలో నబీల్.. యష్మిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అవినాష్ వివరణ ఇస్తుండగా యష్మి ఒంటికాలిపై లేచింది. ఒకర్ని వీక్ అని చెప్పొద్దు.. స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్స్ కూడా చాలా గేమ్స్‌లో ఓడిపోయారు అని పేర్కొంది. ఇకపోతే ఎవిక్షన్ షీల్డ్ చివరకు నబీల్ను వరించినట్లు తెలుస్తోంది. నబీల్‌కు మైనస్?అయితే ఇది అతడికి ఏరకంగా ప్లస్ అయ్యేట్లు లేదు. నామినేషన్లో ఉంటేనే జనాలు ఓట్లు గుద్దుతూ అతడికి అండగా ఉంటారు. ఇలా నామినేషన్స్‌లో లేకుండా ఉంటే అతడికి ఓట్లు వేసేవారందరూ మిగతా హౌస్‌మేట్స్‌కు ఓట్లు వేసే ఆస్కారం ఉంది. అలా తన ఓట్ బ్యాంక్ పడిపోయే ఆస్కారం ఉంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీనే కొట్టాలనుకున్న విష్ణు.. యష్మి ఎంత పని చేసింది?
డంబ్.. ఈ ఒక్కమాటతో విష్ణుప్రియ పృథ్వీపై కోపం పెంచుకుంది. లాగి పెట్టి కొట్టాలన్నంత కోపమొచ్చింది. అతడికి ఆ మాట అన్నాడని కూడా గుర్తు లేదట.. అయినా సారీ చెప్పడంతో విష్ణు ఇట్టే కరిగిపోయింది. తాను కూడా ఏమైనా హర్ట్ చేసుంటే సారీ అంటూ మళ్లీ అతడి మాయలోనే పడింది. మరి హౌస్‌లో ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (నవంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..తప్పులో కాలేసిన యష్మిబిగ్బాస్ చిట్టచివరగా స్క్రూను తిప్పు-కంటెండర్ పట్టు అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో విష్ణుప్రియను ఓడించి యష్మి విజేతగా నిలిచి కంటెండర్ బ్యాడ్జ్ ధరించింది. అయితే పొరపాటున యష్మి.. తన సూట్‌కేస్‌కు బదులు విష్ణు సూట్‌కేస్ తెచ్చి ఓపెన్ చేసింది. అందులో ఉన్న రూ.75 వేలున్నాయి. అంతలోనే తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకున్న యష్మి.. తప్పయిపోయింది బిగ్‌బాస్ అంటూ తన ఒరిజినల్ సూట్‌కేస్ ఓపెన్ చేసింది. అందులో రూ.1,84,000 ఉన్నాయి. కానీ బిగ్‌బాస్ దానికి ఒప్పుకోకుండా ముందుదాని ప్రకారం రూ.75 వేలను ప్రైజ్‌మనీలో యాడ్ చేశాడు.పృథ్వీ, విష్ణు మధ్య దూరంమరోవైపు పృథ్వీ ప్రవర్తనకు విష్ణుకు చిర్రెత్తిపోయింది. నన్ను డంబ్ అన్నాడు. నన్ను హర్ట్ చేసి తను మాత్రం సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి నాకొద్దు. ఫస్ట్ టైమ్ అతడికి పంచ్ ఇవ్వాలనిపించింది అని తన కోపాన్ని, బాధనంతా యష్మి ముందు కక్కేసింది. ఇంతలో పృథ్వీ అటుగా రావడంతో యష్మి.. వీరిద్దరికీ సయోధ్య కుదర్చాలని ప్రయత్నించింది. ఆమెకు సారీ చెప్పమని అడిగింది. మనసులో స్థానం కోల్పోయాడంటూ భారీ డైలాగ్స్అతడు నో అనేసరికి నేనేమీ సారీ అడగలేదని విష్ణు అంది. అది విన్న పృథ్వీ.. నేను నీతో మాట్లాడట్లేదు అని సీరియస్‌గా అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కోపం వల్లే అతడు తన మనసులో స్థానం కోల్పోయాడని విష్ణు నిఖిల్‌తో చెప్పింది. చివరకు పృథ్వీ సారీ చెప్పడంతో విష్ణు ఆవేశమంతా చప్పున చల్లారింది. బిగ్‌బాస్ ఓ ఫన్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా అవినాష్ ఫేమస్ డైరెక్టర్, రోహిణి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.ఏబీసీ.. సినిమావీరిద్దరూ ఆడిషన్ కోసం బిగ్‌బాస్ హౌస్‌కు వస్తారు. ఇంకేముంది.. హౌస్మేట్స్ తమ కళలు చూపిస్తూ ఛాన్స్ పొందాలని ప్రయత్నించారు. ఏబీసీ అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా తీద్దామనుకుంటున్నా.. అక్కా బావ ఎక్కడ? అనేది క్యాప్షన్ అన్నాడు అవినాష్. సినిమా పేరుకు తగ్గట్లే ఓ రియల్ సీన్ చేసి చూపించారు నిఖిల్, యష్మి, గౌతమ్. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని అక్కా అని పిలిస్తే నిఖిల్ వద్దని వారించాడు. యష్మిని అక్కా అని పిలుస్తావా?దీంతో గౌతమ్.. సరే నేను పిలవను, మరి నువ్వు యష్మిని అక్కా అని పిలుస్తావా? అని ప్రశ్నించాడు. ఈ మాటతో అక్కడున్న అందరూ పడీపడీ నవ్వారు. ఇలా ఫన్ టాస్క్ ద్వారా కిచెన్ టైమర్‌కు మరో రెండు గంటలు జమైంది. పృథ్వీ తనకు అక్కర్లేదన్న విష్ణుప్రియ చివరకు అతడి దగ్గరకు వెళ్లి సారీ చెప్పి మళ్లీ అతడి మైకంలోనే పడిపోయింది.మూట ముఖ్యం బిగిలు మెగా చీఫ్ కంటెండర్లు రోహిణి, ప్రేరణ, నబీల్, పృథ్వీ, యష్మిలకు మూట ముఖ్యం బిగిలు అన్న గేమ్ ఇచ్చాడు. ఎవరు చీఫ్ కాకూడదని కోరుకుంటున్నారో వారి డబ్బాలో హౌస్మేట్స్ మూటలు వేయాలన్నాడు. అలా మొదటి రౌండ్లో యష్మి, రెండో రౌండ్లో నబీల్ ఓడిపోయారు. అంతటితో ఎపిసోడ్ ముగిసింది. ఇకపోతే ప్రేరణ మెగా చీఫ్ అయినట్లు సమాచారం.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియ గుండె ముక్కలు.. కొత్త మెగా చీఫ్ ఎవరంటే?
మెగా చీఫ్ కంటెండర్‌షిప్ కోసం హౌస్‌లో పోటీలు జరిగాయి. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ.. ముగ్గురూ టఫ్ టాస్కులోనూ కష్టపడి ఆడారు. అటు బిగ్‌బాస్ గాసిప్స్ వినాలని తహతహలాడిపోయాడు. ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (నవంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..కీని పట్టు.. కంటెండర్‌షిప్‌ను గెలిచేట్టుఇప్పటికే రోహిణి, నబీల్ కంటెండర్‌షిప్ బ్యాడ్జులు గెలిచారు. మిగిలిన పృథ్వీ కోసం 'కీని పట్టు.. కంటెండర్‌షిప్‌ను గెలిచేట్టు' అనే గేమ్ ఇచ్చాడు. ముందుగా తాళాలు సంపాదించి అన్ని బాక్సులు ఓపెన్ చేసినవారు గెలుస్తారు. పృథ్వీతో ఎవరు తలబడాలనుకుంటున్నారో చెప్పాలనగా దాదాపు హౌస్మేట్స్ అందరూ ముందుకొచ్చారు. దీంతో పృథ్వీ.. అందరిలో నుంచి విష్ణుప్రియను సెలక్ట్ చేసుకున్నాడు. అలా పృథ్వీ, విష్ణు ఆడారు.విష్ణును బోల్తా కొట్టించిన పృథ్వీఈ గేమ్‌లో పృథ్వీ అతి తెలివితో విష్ణుప్రియను బురిడీ కొట్టించి గెలిచేశాడు. అలాగే కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ ధరించాడు. అతడి సూట్‌కేస్‌లో రూ.99,000 ఉండగా.. అవి ప్రైజ్‌మనీలో యాడ్ అయ్యాయి. పృథ్వీకి ఒకర్ని చీఫ్ కంటెండర్ చేసే ఛాన్స్ ఉండగా ఆ అవకాశాన్ని అతడు విష్ణుప్రియకు ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటావు.. నిన్ను ఆదర్శంగా తీసుకుని చాలా మారిపోయాను అంటూ విష్ణుతో కబుర్లాడాడు పృథ్వీ.మెలిక పెట్టిన బిగ్బాస్ఇకపోతే బ్యాడ్జులు గెలిచిన నబీల్, పృథ్వీ, రోహిణి.. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణలను కంటెండర్లుగా సెలక్ట్ చేశారు. ఈ ముగ్గురికీ బిగ్‌బాస్ ఇసుక బస్తాలతో గేమ్ పెట్టాడు. ఇందులో ప్రేరణ విజయం సాధించి కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ ధరించింది. అలాగే తన దగ్గరున్న సూట్‌కేసులో రూ.1 లక్ష ఉంది. ఇక్కడే బిగ్‌బాస్ ఓ మెలిక పెట్టాడు. ఈ సూట్కేసుకు బదులుగా మిస్టరీ సూట్‌కేస్ సెలక్ట్ చేసుకోవచ్చన్నాడు. దీంతో పాతది వదిలేసి మిస్టరీ సూట్‌కేస్ తెరిచింది. తీరా చూస్తే ఆశ్చర్యంగా అందులో రూ.2,10,00 ఉన్నాయి. ఇది విన్నర్ ప్రైజ్‌మనీలో జమైంది.అంతమాట అనేసిందేంటి?గంగవ్వ.. ప్రేమపక్షులు పృథ్వీ, విష్ణులను అన్నాచెల్లి అనేసింది. పృథ్వీకి విష్ణు చెల్లిలా అన్నీ దగ్గరుండి చేసి పెడుతుందని మెచ్చుకుంది. అక్కడ చెల్లి అనే పదం విని విష్ణు గుండె ముక్కలైంది. చెల్లి కాదు, అతడంటే ప్రేమ అని విష్ణు చెప్తున్నా కూడా అవన్నీ కుదరవని తీర్పు చెప్పింది. అనంతరం బిగ్‌బాస్.. తేజను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి అతడి ముందు కేక్ పెట్టాడు. కేక్ కావాలంటే ఇంటిసభ్యుల గురించి ఒక మంచి గాసిప్ చెప్పాలన్నాడు.అప్పట్లో ట్రయాంగిల్.. ఇప్పుడైతే..దీంతో తేజ.. గౌతమ్- యష్మి- నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నడిచిందని కానీ ఇప్పుడు అది లేదన్నాడు. గౌతమ్- యష్మి మధ్య అక్కాతమ్ముళ్ల అనుబంధం, నిఖిల్- యష్మి మధ్య ఫ్రెండ్షిప్ ఉందన్నాడు. నీకు ఎవరు క్రష్ అని బిగ్‌బాస్ అడగడంతో పడీపడీ నవ్విన తేజ.. క్రష్ కాదుగానీ ప్రేరణతో మంచి అనుబంధం ఏర్పడిందన్నాడు. కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తేజ అసలు విషయం చెప్పకుండా.. యష్మి సూట్‌కేస్ ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని బిగ్‌బాస్ చెప్పాడంటూ అబద్ధమాడాడు. తేజ పెట్టిన పెంటఅది నిజమని నమ్మిన యష్మి.. వెంటనే తన సూట్‌కేసును గౌతమ్‌కు ఇచ్చింది. పోయినవారం అతడిని రేస్ నుంచి తీసేసినందుకు ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంది. కానీ పృథ్వీ అందుకు ఒప్పుకోలేదు. అతడికెందుకు ఇస్తావంటూ కోపంగా మాట్లాడాడు. దీంతో యష్మి ఫీలైంది. అది చూసిన విష్ణు.. ఈ అబ్బాయిలు డిక్టేటర్‌గా మనల్ని రూల్ చేయడమేంటని అసహనం వ్యక్తం చేసింది.గాసిప్ చెప్తే కేక్ ఫ్రీఅటు ప్రేరణను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ ఏదైనా గాసిప్ చెప్తే కేక్ తినొచ్చన్నాడు. నిఖిల్‌కు యష్మి అంటే ఇష్టం.. కానీ, అందరి ముందు బయటపడటం లేదు అని తెలిపింది. ఈ ఇంట్లో అందరికంటే జెన్యూన్ ఎవరని అడగ్గా గంగవ్వ పేరు చెప్పింది. ఇకపోతే ఎంతోకాలంగా మెగా చీఫ్ పోస్ట్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ప్రేరణ ఎట్టకేలకు చీఫ్ పదవిని కైవసం చేసుకున్నట్లు భోగట్టా!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అక్క అనడం తప్పన్న నిఖిల్, ఫ్రెండ్‌ను కాపాడిన అవినాష్
నామినేషన్స్ అంటే మాటల యుద్ధమే.. ఎప్పుడూ ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పే బిగ్‌బాస్ ఈసారి మాత్రం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలన్నాడు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..హరితే, ప్రేరణ.. ఇద్దరూ ఇద్దరే!మొదటగా పృథ్వీ.. నాకు నెక్ ఫాంటసీ ఉందనడం నచ్చలేదంటూ రోహిణిని నామినేట్ చేశాడు. నెక్ ఫాంటసీ అన్నది బూతు పదమా? అని రోహిణి ఆశ్చర్యపోయింది. హరితేజ.. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది.. నోటికొచ్చిన మాటలు అనేయొద్దని ప్రేరణను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ వాదులాడుకున్నారు. హరితేజ చెప్పే పాయింట్లు కరెక్టే ఉన్నా కాస్త యాక్టింగ్ చేస్తూ చెప్పడం అతిగా అనిపించింది. తెలుగులో కొత్త బూతు 'అక్క'అటు ప్రేరణ కూడా ఈమెపై రివేంజ్ నామినేషన్ చేసింది. అంత అరుచుకున్నాక చివర్లో ఇద్దరూ కలిసిపోయి హగ్గులిచ్చుకోవడం గమనార్హం. నిఖిల్ వంతురాగా.. ఒకమ్మాయి తనను అక్కా అని అనొద్దని చెప్తున్నా పదేపదే అనడం బుల్లీయింగ్ అంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. అక్కా అనడంలో తప్పేముంది? అని గౌతమ్ అంటే అశ్వత్థామ అని పిలిస్తే నువ్వు హర్టయినప్పుడు.. ఆమె వద్దంటున్నా అక్కా అని పిలవడం కూడా తప్పేనని లాజిక్ లేని సమాధానమిచ్చాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.దీంతో చిర్రెత్తిన గౌతమ్.. ఇప్పుడు చెప్తున్నా.. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. నన్ను ట్రోల్ చేసుకోండి.. ఏమైనా చేసుకోర్రి అన్నాడు. ఇద్దరూ అరుచుకుని కాసేపటికి నిఖిల్.. అమ్మతోడు, గేటు తీయమను.. బయటకెళ్లి చూసుకుందాం అని రెచ్చగొట్టాడు. నా ప్రవర్తన తప్పు అంటున్నావ్.. మరి నా మీద కోపాన్ని టాస్కులో అమ్మాయిలపై చూపించడం తప్పు కాదా? ఎవరేంటో నాకర్థమైంది.. ఇప్పుడు నాకు భయం లేదు, ఎవరికీ వినేది లేదు, తగ్గేది లేదు అని గౌతమ్ ఆవేశంతో మాట్లాడుతుంటే రోహిణి, హరితేజ చప్పట్లు కొట్టారు.నువ్వే ఆ ఛాన్సిచ్చావువిష్ణుప్రియ వంతు రాగా.. నేను నిన్ను నామినేట్ చేయకూడదనుకున్నాను.. కానీ నువ్వే ఆ ఛాన్సిచ్చావు! ఈ వారం చాలా తప్పులు చేశావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. నబీల్.. పోయినవారం నామినేషన్స్‌లో ఫేవరెటిజం చూపించావు, మెగా చీఫ్‌గా ఫెయిలయ్యావంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.చప్పట్లు కొట్టిన గంగవ్వగంగవ్వ.. యష్మిని అశ్విని అనడంతో అందరూ పడీపడీ నవ్వాడు. గౌతమ్ బాగా ఆడతాడు. చిన్నదానికీ పెద్దదానికీ నువ్వు, ప్రేరణ ఇద్దరూ అతడిపై అరుస్తారు. ఆటలో గెలవకపోతే మాత్రం చీదరించుకుంటావు అని చెప్పింది. నామినేట్ అయినందుకుగానూ యష్మిపై ఆయిల్ పెయింట్ పడటంతో గంగవ్వ చప్పట్లు కొట్టింది. రోహిణి.. మెగా చీఫ్ కంటెండర్‌షిప్ గేమ్‌లో నీకంటే ఒక అడుగు ముందున్న గౌతమ్‌ను సైడ్ చేయడం బాగోలేదని యష్మిని నామినేట్ చేసింది. బిగ్‌బాస్‌కు గౌరవం ఇవ్వలేదుగౌతమ్ వంతు రాగా.. టీమ్‌లీడర్‌గా ఉన్నప్పుడు పదేపదే ఇరిటేట్ అయ్యావ్.. రెండోది నన్ను గేమ్‌లో సైడ్ చేసినప్పుడు నాకో కారణం చెప్పావ్.. కానీ వెనకాల మరో కారణం చెప్పావ్.. అంటూ యష్మిని నామినేట్ చేశాడు. తేజ.. నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో నువ్వు స్మోకింగ్ జోన్లో సిగరెట్ తాగుతూ కూర్చున్నావు.. ఇది బిగ్‌బాస్‌ను అగౌరవపర్చాడంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.ఆమెను సేవ్ చేసిన అవినాష్యష్మి.. నువ్వు నన్ను అక్కా అని పిలవడం నచ్చలేదు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. ఫ్లిప్ అవుతున్నావు అంటూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. చివర్లో ఒకరిని స్వాప్ చేసే అధికారం మెగా చీఫ్ అవినాష్‌కు ఇవ్వడంతో అతడు రోహిణిని సేవ్ చేసి ఆమె స్థానంలో నిఖిల్‌ను నామినేట్ చేశాడు. అలా ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ అయ్యారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: తిడుతుంటే నవ్వుతుందేంటి? ఈ పగ చల్లారదు!
గంగవ్వ హౌస్‌లో అడుగుపెట్టి నాలుగువారాలవుతోంది కానీ కొందరి పేర్లు ఇప్పటికీ తనకు నోరు తిరగదు. యష్మిని కాస్త అశ్విని అనేసింది. దీంతో నామినేషన్స్‌లో అందరూ పడీపడీ నవ్వారు. గంగవ్వ యష్మిని నామినేట్ చేస్తూ.. గౌతమ్ బాగానే ఆడుతున్నాడుడు. కానీ నువ్వు.. ఆటలో గెలవకపోతే మాత్రం చించి సంచి కోసుకుంటవ్ అంటూ పక్కా తెలంగాణ యాసలో సెటైర్లు వేసింది. నబీల్ రివేంజ్ నామినేషన్?అది ఆమెకు ఏమర్థమైందో కానీ పకాపకా నవ్వింది. విష్ణుప్రియ.. ప్రేరణను అగ్రెసివ్ అంటూ నామినేట్ చేసింది. ఇక ఈ రోజు కోసం నబీల్ వారం రోజులనుంచి ఎదురుచూస్తున్నాడు. పోయినవారం మన క్లాన్లోని వారిని నామినేట్ చేసుకోవద్దని మరీ చెప్పాడు నబీల్. కట్ చేస్తే విష్ణుప్రియ నబీల్ను నామినేట్ చేసింది. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?అది గుర్తుపెట్టుకుని మరీ విష్ణుప్రియపై ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక హరితేజ, ప్రేరణల మధ్య సైలెంట్‌వార్ కొనసాగుతూనే ఉంది. మొత్తానికి ఈ వారం హరితేజ, గౌతమ్, ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ నామినేషన్స్‌లో ఉన్నారు. -
నవ్వుతూ వెళ్లిన నయని.. ఆ ఐదుగురు డమ్మీ ప్లేయర్స్ అంటూ..
సండే అంటే ఫన్డే.. ఆటలు, పాటలు, డ్యాన్సులు.. మొత్తం ఇవే ఉంటాయి. ఇలాంటి ఫన్ గేమ్‌తోనే ఎపిసోడ్ మొదలైంది. అంతకంటే ముందు గౌతమ్‌ను సేవ్ చేశాడు. తర్వాత ఏం జరిగిందో నేటి (నవంబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..విష్ణుప్రియ టీమ్ గెలుపునిఖిల్, రోహిణి, ప్రేరణ, నయని పావని, విష్ణుప్రియ, తేజను టీమ్ 'A'గా మిగతావాళ్లందరినీ టీమ్ 'B'గా విభజించారు. ఈ గేమ్‌లో భాగంగా ఒక చీటీ తీసి అందులో ఇంగ్లీష్‌లో రాసి ఉన్న వాక్యాలు చదివి తెలుగులో పాటను గెస్ చేయాలి. చిన్నపిల్లలు కూడా ఆడగలిగేలా సింపుల్‌గా ఉన్న ఈ గేమ్‌లో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. తర్వాత యష్మి సేవ్ అయినట్లు ప్రకటించాడు.నిఖిల్ వెంటే గెలుపుఅనంతరం అందరూ పక్షుల్లా మారిపోయారు. ఆకాశం, సముద్రం, పర్వతాలు.. వీటిలో నాగ్ ఏ పేరు చెప్తే ఆ పేరు రాసున్న బోర్డ్‌పై కంటెస్టెంట్లు నిలబడాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో కూడా నిఖిలే ఆఖరివరకు చేరుకుని గెలిచాడు. అలాగే లక్ష రూపాయలు ప్రైజ్‌మనీలో యాడ్ చేయడంతో విన్నింగ్ ప్రైజ్‌మనీ రూ.42,16,000కు చేరింది.జ్యూస్‌లకు మారు పేర్లుతర్వాత కొన్ని జ్యూస్‌లకు స్వార్థం, కోపిష్టి, ఫేక్.. ఇలా పలురకాల పేర్లు ఇచ్చారు. అవి ఎవరికి సూట్ అవుతాయో వారితో ఆ జ్యూస్ తాగించాలన్నాడు. మొదటగా గౌతమ్.. ఆనియన్ (నకిలీ), టమాటో (స్వార్థం) జ్యూస్‌ను యష్మీకి ఇచ్చాడు. రోహిణి.. కీరా దోస(బాధ్యతారాహిత్యం), చిల్లీ (కోపిష్టి) జ్యూస్‌ను గౌతమ్‌కు ఇచ్చింది. విష్ణుప్రియ.. చిల్లీ, లెమన్ (నోటిదురుసు) జ్యూస్‌ను ప్రేరణకు ఇచ్చింది. ఆమెకు నోటిదురుసు ఎక్కువహరితేజ.. చిల్లీ, ఆమ్ల జ్యూస్‌ను నిఖిల్‌తో తాగిపించింది. పృథ్వీ.. ప్రేరణకు జ్యూస్ ఇస్తూ తనకు నోటిదురుసు ఉందని, కోపిష్టి అన్నాడు. అవినాష్.. గౌతమ్‌కు నోటిదురుసు, బాధ్యతారాహిత్యం ఉందంటూ అతడితో లెమన్, కీరా జ్యూస్ తాగిపించాడు. తేజ.. ప్రేరణకు నోటిదురుసు, మందబుద్ధి ఉందన్నాడు. నబీల్.. అవినాష్ డంబ్ అండ్ టాక్సిక్ అన్నాడు. ప్రేరణ వంతు రాగా.. హరితేజ ఫేక్ అంటూ ఆనియన్, ఆమ్లా జ్యూస్ తాగిపించింది. ఎక్కువ జ్యూస్‌లు ఎవరికంటే?యష్మి.. గౌతమ్ ఫేక్ అంటూ ఆనియన్ జ్యూస్ ఇచ్చింది. గంగవ్వ.. రోహిణికి మందబుధ్ది, నోటిదురుసు ఉందని తెలిపింది. నయని కూడా ప్రేరణకు కోపమెక్కువ అంటూ నిమ్మ, మిర్చి జ్యూస్ కలిపిచ్చింది. నిఖిల్.. గౌతమ్ బాధ్యతారాహిత్యంగా ఉంటాడంటూ అతడికి లెమన్, కీర జ్యూస్ కలిపిచ్చాడు. అలా ప్రేరణ, గౌతమ్ అందరికంటే ఎక్కువ జ్యూస్‌లు తాగారు.నయని ఎలిమినేట్తర్వాత నాగ్ హరితేజను సేవ్ చేసి నయని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ప్రతిదానికి కన్నీళ్లు పెట్టుకునే నయని ఈసారి తన దుఃఖాన్ని దిగమింగుకుని నవ్వుతూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకోవడం విశేషం. స్టేజీపైకి వచ్చాక .. గంగవ్వ, రోహిణి, ప్రేరణ, గౌతమ్, విష్ణును డమ్మీ ప్లేయర్స్ అంది. హరితేజ, నిఖిల్, పృథ్వీ బెస్ట్ ప్లేయర్స్ అని కితాబిచ్చింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాగ్ సీరియస్.. నిరూపిస్తే షో నుంచి వెళ్లిపోతానన్న గౌతమ్
ఆవేశం అందరికీ వస్తుంది.. కానీ ఎంత ఆవేశం వచ్చినా, కోపమొచ్చినా మాట అదుపులో పెట్టుకోవాలి. ఒక్కసారి నోరు జారితే ఆ మాటను వెనక్కు తీసుకోలేం. ఈ విషయాన్ని నాగార్జున పృథ్వీకి ఎన్నోసార్లు చెప్పాడు. ఇప్పుడు పృథ్వీ బాగానే ఉన్నాడు కానీ మరో ఇద్దరికీ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది.ప్రేరణ, గౌతమ్‌లపై సీరియస్తాజాగా రిలీజైన ప్రోమోలో నాగ్.. ప్రేరణ, గౌతమ్‌లపై సీరియస్ అయ్యాడు. పుడింగి ప్రేరణ.. అందరికీ మైండ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్తుంటావ్.. మరి నీ నోరు అదుపులో పెట్టుకున్నావా? అని అడిగాడు. నిఖిల్‌పై నోరు జారిన వీడియోను ప్లే చేసి ఇది కరెక్టేనా? అని అడిగాడు.వీడియో ప్లే చేసి మరీ..అటు నిఖిల్పైనా మండిపడ్డాడు. ఆటలో అంత అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం లేదని చురకలంటించాడు. అటు గౌతమ్ నిఖిల్‌పై అరిచిన వీడియో ప్లే చేసి అక్కడ ఏం అన్నావ్? అని నిలదీశాడు. నేను ఏదో నసిగినట్లు పెదాలాడించానే తప్ప ఎలాంటి బూతు మాట్లాడలేదు అన్నాడు. తల్లిపై ప్రమాణంచాలా తెలివిగా వాడాల్సిన పదం వాడేశావ్ అని నాగ్ అనగా.. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా.. నేను నిజంగా అలా అన్నట్లు నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతానన్నాడు. అయితే అతడు ఏమీ అనలేదని నమ్ముతున్నారా? అని అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు స్టూడియోలో ఉన్న ప్రేక్షకులను అడగా ఏ ఒక్కరూ నమ్ముతున్నట్లు చెప్పలేదు. దీంతో గౌతమ్ బిక్కముఖం వేశాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గర్వం నెత్తికెక్కిందన్న ప్రేరణ.. అణచివేసిన ఓజీ టీమ్!
బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ టాస్కులు ఎక్కువైపోయాయి. అందుకే బీబీ రాజ్యం అంటూ ఓ ఆసక్తికర ఛాలెంజ్ విసిరాడు. రెండు టీముల్లో ఏది ముందుగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటోందో చూద్దామన్నాడు. ఈ క్రమంలోనే వరుస టాస్కులిస్తున్నాడు. నిన్నటి వాటర్ టాస్కులో రాయల్ టీమ్ గెలిచింది. నిజానికి వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటినుంచి తెగ దూకుడుగా ఆడుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.ఆ పొగరు తగ్గాలిదీనివల్ల వారికి గర్వం నెత్తికెక్కిందంటోంది ప్రేరణ. అన్నీ మేమే గెలిచాం అంటున్నారు. ఆ పొగరు కొంత తగ్గాలి అని నబీల్‌తో అంది. అటు నిఖిల్ సైతం తన ఓజీ టీమ్‌తో.. ఇది మన సీజన్. ట్రోఫీ ఎవరైనా ఎత్తాలంటే మన టీమ్‌లోనే ఒకరై ఉండాలి అని సభ్యుల్లో ధైర్యం నింపాడు. తర్వాత రెండు క్లాన్స్‌కు గేమ్స్ పెట్టాడు.గర్వం అణిచేసిన ఓజీ టీమ్ఇందులో ఓజీ టీమ్ గెలిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు బీబీ రాజ్యంలో ఇచ్చే టాస్కుల్లో ఎక్కువ టాస్కులు ఓజీ టీమ్ గెలిచి రాయల్స్ గర్వాన్ని అణగదొక్కిందని సమాచారం.! మరి ఏయే టీమ్ ఏయే టాస్కు గెలిచిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8: వెనకబడ్డ నిఖిల్.. విన్నింగ్ రేస్‌లో ప్రేరణ!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో విన్నర్ అయ్యే లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా? అంటే అది నిఖిల్‌కే అని బలంగా వినిపించింది. అందుకు తగ్గట్లుగానే అతడి ఆట ఉంటోంది. నాలుగైదు సార్లు మెగా చీఫ్ అవడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు కండబలం, బుద్ధి బలం రెండూ ఉండటం అతడికి ప్లస్. తను స్లో అయిపోతున్నాడని హౌస్మేట్స్ అంటున్నారు. కానీ టాస్కులు వస్తే చెలరేగిపోతాడు.ఓటింగ్‌లో టాప్తనంతట తానుగా ఏ గొడవలోనూ దూరడు. అందుకే ప్రతి వారం ఓటింగ్‌లో నిఖిల్ టాప్ ప్లేస్‌లో ఉంటాడు. కానీ ఈ వారం లెక్కలు మారాయి. నిఖిల్‌ను వెనక్కు నెట్టి ప్రేరణ మొదటి స్థానంలో ఉంది. నామినేషన్స్‌లో ఉన్నవారికంటే ప్రేరణకే ఎక్కువ ఓట్లు పడుతున్నాయట! ఆటలో శివంగిలా పోరాడుతుంది. ఎవరి సపోర్ట్ లేకపోయినా సింగిల్‌గా ఫైట్ చేస్తుంది. ఈ మధ్య పృథ్వీ ఆమెను టార్గెట్ చేయడంతో తనపై కాస్త సింపతీ కూడా వర్కవుట్ అయింది. టార్గెట్ వల్ల మేలు జరిగిందా?గత సీజన్ హౌస్ అంతా కలిసి పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేశారు. కట్ చేస్తే అతడు విన్నర్ అయి కూర్చున్నాడు. ఈ సీజన్లో హౌస్ అంతా మణికంఠకు వ్యతిరేకంగా నిలబడ్డారు. దీంతో ప్రతివారం నామినేషన్లో ఉన్నా సరే సేవ్ అవుతూ వచ్చాడు. చివరకు ఒత్తిడి తట్టుకోలేక తనంతట తానే ఎలిమినేట్ అయ్యాడు. పోయినవారం నామినేషన్స్ డిసైడ్ చేసే పవర్స్ కిల్లర్ గర్ల్స్ హరితేజ, ప్రేరణకు లభించింది. ఫైటర్అప్పుడు పృథ్వీ, నయని ప్రేరణను ఆడనివ్వకుండా అడ్డుపడ్డారు. అప్పుడామె కన్నీళ్లు పెట్టుకుంటే కూడా హౌస్‌లో ఎవరూ తనను ఓదార్చలేదు, సపోర్ట్ చేయలేదు. చివరాఖరకు యష్మి సపోర్ట్‌గా నిలబడ్డప్పటికీ ఆమె మొసలి కన్నీళ్లను ఎవరూ నమ్మలేదు. మరి ప్రేరణ మున్ముందు వారాల్లోనూ ఓటింగ్‌లో ఇదే దూకుడు ప్రదర్శిస్తే బిగ్‌బాస్ విన్నర్ కావడం తథ్యం!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పాపం గౌతమ్.. వెళ్లిపోయేముందు వాళ్లను ముంచేసిన మణికంఠ
బిగ్‌బాస్ అనేది గోల్డెన్ ఛాన్స్. ప్రేక్షకులకు దగ్గరచేసే సాధనం, ఫ్రీ పబ్లిసిటీ! అలాంటిది.. ప్రేక్షకులు తనను సేవ్ చేసినా కాదనుకుని వెళ్లిపోయాడు. షో గెలుస్తానన్న అతడు ఏడువారాలకే తన వల్ల కావట్లేదని చేతులెత్తేశాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..రెండు జంటల డ్యాన్స్ హైలైట్బిగ్బాస్ హౌస్‌లో అందరూ సమానమే.. లింగబేధం, కమ్యూనిటీ బేధాలుండవని నాగార్జున హౌస్‌మేట్స్‌కు నొక్కి చెప్పాడు. దీంతో కమ్యూనిటీ గురించి మాట్లాడిన నబీల్, మెహబూబ్ ముఖం వాడిపోయింది. తర్వాత నాగ్.. యష్మిని సేవ్ చేసి హౌస్‌మేట్స్‌తో చిత్రం భళారే విచిత్రం గేమ్ ఆడించాడు. ఇందులో అబ్బాయిల టీమ్ విజయం సాధించింది. ఈ గేమ్‌లో విష్ణు-పృథ్వీ, యష్మి- గౌతమ్ జంటల డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. తర్వాత నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.డైలాగ్ డెడికేషన్హౌస్మేట్స్పై సోషల్ మీడియాలో వైరలవుతున్న కొన్ని మీమ్స్ చూపించడంతో అందరూ పగలబడి నవ్వారు. నబీల్ను సేవ్ చేసిన అనంతరం డైలాగ్ డెడికేషన్ అని మరో గేమ్ ఆడించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా కొన్ని డైలాగులను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. అలా మొదటగా నిఖిల్.. నువ్వు ఊరుకోమ్మా.. ఊరికే తుత్తుత్తు అంటావ్.. అన్న డైలాగ్ బోర్డును ప్రేరణ మెడలో వేశాడు. హరితేజ.. వీడిని ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా డైలాగ్ నాగమణికంఠకు అంకితమచ్చింది. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారుతేజ.. అదంతా అప్పుడండి.. ఇప్పుడు నేను మారిపోయాను డైలాగ్ అవినాష్‌కు సూట్ అవుతుందన్నాడు. విష్ణుప్రియ.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు డైలాగ్ గంవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందంది. తు సమ్జా.. నై సమ్జా డైలాగ్ పృథ్వీకి సరిపోతుందన్నాడు మెహబూబ్. ఇక నయని.. నవ్వాపుకుంటున్నావ్ కదరా డైలాగ్ బోర్డును విష్ణు మెడలో వేసింది. అన్న రూల్స్ పెడ్తాడు కానీ ఫాలో అవడు డైలాగ్ నిఖిల్‌కు సెట్ అవుతుందన్నాడు గౌతమ్. సరె సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి? అన్న డైలాగ్‌ను విష్ణు మెడలో వేసింది రోహిణి. బేసిక్ సెన్స్ ఉండదునాకు అర్థం కాలేదు సార్ డైలాగ్ పృథ్వీకి సెట్ అవుతుందన్నాడు మణి. నువ్వు అంత హార్ష్‌గా మాట్లాడకు, ఫీల్ అవుతాను డైలాగ్ తేజకు డెడికేట్ చేసింది యష్మి. నబీల్ వంతు రాగా.. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం డైలాగ్‌ను గౌతమ్‌కు అంకితమిచ్చాడు. గంగవ్వ.. బేసిక్ సెన్స్ ఉండదు, అంటే ఏమో హర్ట్ అయిపోతారు అన్న డైలాగ్ నయనికి డెడికేట్ చేసింది. ఓవరాక్షన్ చేస్తున్నావేంట్రా, ఓవరాక్షన్ అన్న బోర్డును అవినాష్.. పృథ్వీకి ఇచ్చాడు. నాకు ఇంట్రస్ట్ పోయింది సర్ అన్న డైలాగ్‌ను మణికి డెడికేట్ చేసింది ప్రేరణ. మండుతున్నట్లుంది డైలాగ్‌ను మెహబూబ్‌కు అంకితమిచ్చాడు పృథ్వీ. మణికంఠ ఎలిమినేట్తర్వాత నాగ్.. పృథ్వీని సేవ్ చేశాడు. చివర్లో గౌతమ్, మణికంఠ మిగిలారు. ఈ క్రమంలో మణి తనవల్ల కావట్లేదు, వెళ్లిపోతానన్న వీడియను హౌస్‌మేట్స్‌కు ప్లే చేసి చూపించాడు నాగ్. అతడు ఉండాలా? వద్దా? అని హౌస్‌మేట్స్‌ను అడగ్గా మెజారిటీసభ్యులు మణి వెళ్లడమే బెటర్ అన్నారు. చివరిసారి మణికంఠను అడిగి చూశాడు నాగ్. అప్పటికీ అతడు వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. దీంతో మణికంఠ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అయితే మణికంఠ కంటే గౌతమ్‌కు తక్కువ ఓట్లు పడ్డాయన్నాడు. నిజానికి ఎలిమినేట్ కావాల్సింది గౌతమ్ అని చెప్పాడు. ఎక్కడ తప్పు జరుగుతోందని గౌతమ్ ఆలోచనలో పడిపోయాడు. ఆ ఐదుగురినీ బోటు ఎక్కించాడుఅటు మణికంఠ.. జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలా నవ్వుతూ వెళ్లిపోయాడు. పోరాడలేకపోయాను, నా ఓపిక అయిపోయిందంటూ హౌస్మేట్స్ దగ్గర సెలవు తీసుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన మణికంఠతో నాగ్ ఓ గేమ్ ఆడించారు. అందులో భాగంగా మణి.. నయని, విష్ణుప్రియ, నబీల్, హరితేజ, మెహబూబ్ ఫోటోలను బోటు ఎక్కించాడు. మెహబూబ్‌కు విన్నర్‌కు కావాల్సిన లక్షణాలున్నాయన్నాడు. అనంతరం ఆటలో ఒకప్పుడు ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు, ఫినాలే వరకు వస్తావని ఆశిస్తున్నానంటూ నిఖిల్ ఫోటోను నీటిలో ముంచేశాడు. మునిగిపోతావ్, జాగ్రత్త..తేజ ఎనర్జీ చూపించకపోతే ముగిపోతాడన్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆడితే బెటర్ అంటూ పృథ్వీని ముంచాడు. అవసరమైనప్పుడే నోరు విప్పు.. వచ్చిన మొదటివారమే చీఫ్ అయ్యావ్.. ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయకపోతే ఆటలో మునిగిపోతావని గౌతమ్‌ను హెచ్చరించాడు. అనవసరమైన చోట నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం వల్ల నీ ఆటకే ఎసరు పడుతుందని ప్రేరణ ఫోటోను ముంచాడు. చివర్లో ప్రేక్షకుల ఓట్లను కాదని వెళ్లిపోయినందుకు తనను క్షమించమని వేడుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణిని అలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా!
ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమినేషన్ కాస్త వింతగా జరగనుంది. పృథ్వీ స్థానంలో మణికంఠ ఎలిమినేట్ కానున్నాడు. తను ఫిట్‌గా ఉన్నాడని వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చినా సరే చేతనైతలేదంటూ పంపించేయమని వేడుకున్నాడు. అతడు అంతలా అడిగితే కాదనలేక గేట్లు ఎత్తి మరీ బయటకు తీసుకొచ్చేశారని సమాచారం.డైలాగ్ డెడికేషన్..ఇక ఈ ఎలిమినేషన్ కంటే ముందు ఫన్ టాస్కులు జరిగాయి. అందులో ఒకటే డైలాగ్ డెడికేషన్. ఈ క్రమంలో నిఖిల్.. నువ్వు ఊరుకోమ్మా.. అన్నింటికీ తుత్తుత్తు అంటావ్.. అన్న డైలాగ్‌ను ప్రేరణకు అంకితం చేశాడు. వాడినలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా.. అన్న డైలాగ్‌ను హరితేజ మణికి అంకితమిచ్చింది. డైలాగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందని అందరూ చప్పట్లు కొట్టారు.మస్తు షేడ్స్ ఉన్నయ్..అవును మరి మణి వాలకం అలా ఉంది.. భార్యాబిడ్డలు తిరిగి తన దగ్గరకు రావాలంటే ఈ షో గెలవాలి, ఈ బిగ్‌బాస్ తనకు చాలా ముఖ్యం అంటూ ఎన్నోసార్లు ఏడ్చాడు. కట్ చేస్తే ఈ వారం శరీరం సహకరించడం లేదంటూ, మైండ్ కూడా పని చేయట్లేదంటూ ఇంటికెళ్లిపోతానన్నాడు. తనకు ఓట్లు వేయొద్దని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఇదే వారం తాను సేవ్ అయితే అరతులం బంగారం ఇస్తానని గంగవ్వకు మాటిచ్చాడు. అంతలోనే ఇన్ని షేడ్స్ చూపించాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సిగరెట్ తాగడం తప్ప ఏం చేశావన్న గంగవ్వ.. ఆ కోపం ప్రేరణపై..!
బిగ్‌బాస్ హౌస్‌లో ఏడోవారం నామినేషన్స్ జరిగాయి. అయితే కిల్లర్ గర్ల్స్ చేతికి నామినేషన్స్‌ను ఫైనల్ చేసే అధికారం ఇచ్చారు. మరి ఆ కిల్లర్ గర్ల్స్ ఎవరు? వీళ్లు ఎవర్ని నామినేట్ చేశారు? ఎవర్ని సేవ్ చేశారనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే!ఆ ఇద్దరికీ స్పెషల్ డ్రెస్గౌతమ్, తేజ, పృథ్వీ.. ఈ ముగ్గురిలో గౌతమ్ సూట్ కేసు మాత్రమే వెనక్కు వచ్చింది. దీంతో మిగతా ఇద్దరు బిగ్‌బాస్ ఇచ్చిన చిరిగిన బస్తా డ్రెస్ వేసుకున్నారు. ఆ వెంటనే నామినేషన్స్ మొదలయ్యాయి. బిగ్‌బాస్ ప్రేరణ, హరితేజను కిల్లర్ గర్ల్స్‌గా నియమించాడు. గుర్రం సౌండ్ వినిపించినప్పుడు ప్లాట్‌ఫామ్స్‌పై నిలబడే ఇద్దరు హౌస్మేట్స్ ఇంటిసభ్యులను నామినేట్ చేస్తారు. అందులో ఒకరి నామినేషన్‌ను అంగీకరించి, మరొకరి నామినేషన్ తిరస్కరించే హక్కు హ్యాట్ మొదట పట్టుకున్న కిల్లర్ గర్ల్‌కు ఉంటుంది.అతిగా రియాక్టయిన అవినాష్మొదటగా రోహిణి.. నీకు బాధేసినప్పుడు మైక్ విసిరేయడం నచ్చలేదని గౌతమ్‌ను నామినేట్ చేసింది. అందుకు గౌతమ్ స్పందిస్తూ.. అవినాష్ చేసిన కామెడీ తనకు బుల్లీయింగ్లా ఉందన్నాడు. దీంతో అవినాష్ మధ్యలో కలగజేసుకుంటూ కామెడీ తీసుకోకపోతే షోకి రావొద్దంటూ చొక్కా విప్పి మరీ ఫైర్ అయ్యాడు. ఇది కామెడీ షో కాదని గౌతమ్ అనడంతో.. అంతలోనే సారీ భయ్యా, తెలియక అనేశాను.. అంటూ అవినాష్ చేతులు జోడిస్తూ కాస్త అతిగా రియాక్టయ్యాడు. నిఖిల్.. తేజ యాక్టివ్‌గా లేడని నామినేట్ చేశాడు.ఏడ్చేసిన గౌతమ్హ్యాట్ అందుకున్న కిల్లర్ గర్ల్ ప్రేరణ.. రోహిణి చెప్పిన పాయింట్లకు ఏకీభవిస్తూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. అయిపోయినదాన్ని (ట్రోలింగ్ గుర్తు చేస్తున్నారంటూ..) మళ్లీ మళ్లీ తీసుకొస్తున్నారంటూ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు బుల్లీయింగ్ అనడం ఎంత పెద్ద తప్పు? అసలు ఆ పదానికి అర్థం తెలుసా? అని రోహిణి, అవినాష్ సీరియసయ్యారు. రెండో రౌండ్లో నిఖిల్, గంగవ్వ ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్నారు. నిఖిల్ మరోసారి తేజను నామినేట్ చేశాడు. ప్రేరణపై పీకలదాకా కోపం..గంగవ్వ.. నాతో మాట్లాడట్లేదు, హోటల్ టాస్క్‌లో పెద్దగా ఆడలేదు.. సిగరెట్ తాగుతూ కూర్చుంటావంటూ పృథ్వీని నామినేట్ చేసింది. ఇద్దరి పాయింట్లు విన్న ప్రేరణ.. పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో ప్రేరణపై పగ పెంచుకున్న పృథ్వీ.. ఆమె హ్యాట్ పట్టుకోనివ్వకుండా అడ్డుకున్నాడు. తను నామినేట్ అవ్వాల్సిందేనని బలంగా కోరుకున్నాడు. అతడికి సపోర్ట్‌గా నయని కూడా దిగింది. ప్రేరణ నామినేట్ అవడమే తనకూ కావాలంది.నీ గ్రాఫ్ పడిపోయిందిపృథ్వీకి నిఖిల్ సర్ది చెప్పాలని చూశాడు కానీ వర్కవుట్ కాలేదు. నాకు అన్యాయం జరిగింది.. ఇల్లు మొత్తం అడ్డొచ్చినా నేను తను నామినేట్ అయ్యేలా చూస్తానన్నాడు. అది విని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. మూడో రౌండ్లో యష్మి.. హోటల్ టాస్క్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేదంటూ తేజ పేరు చెప్పింది. నాగమణికంఠ.. గ్రాఫ్ పడిపోయిందని, హోటల్ టాస్క్‌లో ఫన్ చేయలేదని నిఖిల్ పేరు చెప్పాడు. హ్యాట్ పట్టుకున్న హరితేజ.. నిఖిల్‌ను నామినేషన్స్‌లో వేసింది.యష్మి ఎమోషనల్నాలుగో రౌండ్లో అవినాష్.. టాస్కుల్లో వీక్ అనిపించాడంటూ మణికంఠ పేరు చెప్పాడు. గౌతమ్.. హోటల్ టాస్క్‌లో పెద్దగా ఆసక్తి చూపించలేదంటూ విష్ణుప్రియ పేరు చెప్పాడు. పృథ్వీ.. ప్రేరణను అడ్డుకోవడంతో మరోసారి హరితేజ హ్యాట్ పట్టుకుంది. ఈమె మణికంఠను నామినేట్ చేసింది. ఇక పృథ్వీ ప్రవర్తన చూసి బెంబేలెత్తిపోయిన యష్మి అది కరెక్ట్ కాదంటూ ఏడ్చేసింది. ఈ నామినేషన్స్ రేపటి ఎపిసోడ్‌లోనూ కొనసాగనున్నాయి. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణపై పగబట్టిన పృథ్వీ.. నామినేషన్స్‌లో తొమ్మిదిమంది!
బిగ్‌బాస్ ఈరోజు నామినేషన్స్ కాస్త వెరైటీగా ఉండేలా ప్లాన్ చేశాడు. హౌస్మేట్స్ భవిష్యత్తును ప్రేరణ, హరితేజ చేతిలో పెట్టారు. హారన్ మోగిన ప్రతిసారి వీళ్లలో ఎవరైతే ముందుగా హ్యాట్ పట్టుకుంటారో వారికి నామినేషన్స్‌లో కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. హౌస్మేట్స్ ఇద్దర్ని నామినేట్ చేస్తే అందులో ఎవరిని సేవ్ చేయాలి? ఎవర్ని నామినేషన్లోకి పంపాలి? అనేది టోపీ అందుకున్న వ్యక్తి నిర్ణయిస్తారన్నమాట!ఆమె నా అసిస్టెంటా?తాజాగా ఈ నామినేషన్స్‌కు సంబంధించి ఓ ప్రోమో రిలీజైంది. బీబీ హోటల్ టాస్క్‌లో సరిగా ఆడలేదంటూ గంగవ్వ.. పృథ్వీని నామినేట్ చేసింది. ఆ టాస్క్‌లో మహారాణి (గంగవ్వ) దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన నయనిని నా పర్ఫామెన్స్ గురించి అడగండి అన్నాడు పృథ్వీ.. ఇంతలో గంగవ్వ.. ఆమె నా దగ్గరే సరిగా ఉండలేకపోయింది, తను నా అసిస్టెంటా? అని నయనిపైనా ఫైర్ అయింది.పగబట్టిన పృథ్వీఇక గంగవ్వ చెప్పినదానితో ప్రేరణ ఏకీభవించింది. అలా పృథ్వీ నామినేట్ అయ్యాడు. కానీ అందుకు కారణమైన ప్రేరణపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రేరణ నామినేట్ కావాల్సిందే అన్నాడు. ఇది గమనించిన ప్రేరణ.. అతడిని ఎలాగైనా ఆపమని నిఖిల్‌తో చెప్పింది. నువ్వు తనకు సాయం చేస్తే నీకు, నాకూ పెద్ద గొడవ అవుతుందని హెచ్చరించాడు. మరి నిఖిల్ ఎటువైపు నిలబడ్డాడన్నది ఆసక్తికరంగా మారింది.నామినేషన్స్‌లో తొమ్మిదిమందిఇకపోతే ఈ ఏడోవారం నిఖిల్, పృథ్వీ, గౌతమ్, యష్మి, నబీల్, తేజ, మణికంఠ, అవినాష్, ప్రేరణ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇమ్యూనిటీ షీల్డ్‌తో ఒకర్ని స్వాప్ చేసే ఛాన్స్ రావడంతో రాయల్ టీమ్ అవినాష్‌ను సేవ్ చేసి అతడి స్థానంలో హరితేజను నామినేషన్స్‌లోకి పంపారు. అలా ఈ వారం మొత్తం తొమ్మిదిమంది నామినేషన్స్‌లో ఉన్నారు. -
నబీల్ ఇమ్మెచ్యూర్ అన్న ప్రేరణ.. మణికి గోల్డెన్ ఛాన్స్
బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన హోటల్ టాస్క్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా? అని ఎదురు చూశారు. అంత నీరసంగా సాగింది. టాస్క్ అయిపోగానే బెస్ట్ పర్ఫామర్లను సెలక్ట్ చేయాలన్నాడు. వీరే మెగా చీఫ్ కోసం పోటీపడతారని పేర్కొన్నాడు. ఓజీ టీమ్‌లో మెగా చీఫ్ కంటెండర్‌ను సెలక్ట్ చేసే క్రమంలో ప్రేరణ, నబీల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇమ్మెచ్యూర్..నీ మైండ్‌లో నాకు వ్యతిరేకంగా ఆలోచన పెట్టుకున్నావ్.. అందులే అలా ప్రవర్తిస్తున్నావ్ అని ప్రేరణ అనేసింది. నీ మాట వినకుండా ఆయన చెప్పింది మాత్రమే చేసినప్పుడు నాది తప్పు అను అని నబీల్ రిప్లై ఇచ్చాడు. అయినా తగ్గని ప్రేరణ.. వెటకారం వద్దు.. నువ్వు నన్ను నమ్మట్లేదు.. నువ్వు ఇమ్మెచ్యూర్ అనేయడంతో నబీల్ నేను ఇమ్మెచ్యూర్ కాదని అరిచాడు.బెస్ట్ పర్ఫామర్లు ఎవరంటే?ఓజీ టీమ్ నుంచి మణికంఠ, రాయల్ టీమ్ నుంచి అవినాష్, రోహిణి, హరితేజ, నయని పావని, మెహబూబ్, గౌతమ్‌లను బెస్ట్ పర్ఫామర్లుగా ఎంపిక చేశారు. తమ టీమ్‌లోని మిగతా ఇద్దరు కూడా బానే చేశారని అవినాష్ అనగా.. అలాంటప్పుడు ఫస్ట్ తమ పేరెందుకు చెప్పలేదని గంగవ్వ నిలదీసింది. కడిగి పారేసిన గంగవ్వనేను మహారాణి అయినప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరైనా సేవలు చేశారా? అని ప్రశ్నించింది. అందుకు విష్ణు.. నేను పెరుగన్నం తినిపించా కదా అని గుర్తు చేయగా డబ్బులిస్తే ఆ పని చేశావని గంగవ్వ కౌంటరిచ్చింది. గంగవ్వలో ఈ ఫైర్ చూసి అటు హౌస్మేట్స్, ఇటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టాటూ సీక్రెట్ బయటపెట్టిన యష్మి.. మణికంఠ సింపతీ డ్రామాలొద్దు!
వైల్డ్‌కార్డులు లేకుండా ఈరోజే లాస్ట్డే.. రేపు ఈ సమయానికల్లా ఎనిమిది మంది మాజీలు హౌస్‌లో తిష్ట వేస్తారు. సింపతీ ఏడుపులు వద్దంటూ నాగార్జున నాగమణికంఠకు క్లాసు పీకాడు. ఇదే మంచి తరుణమని హౌస్మేట్స్ అంతా కూడా మణిపైనే పడ్డారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే నేటి(అక్టోబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..మణికంఠకు క్లాస్ పీకిన నాగ్నాగార్జున వచ్చీరావడంతోనే సింపతీకి ఫుల్స్టాప్ పెట్టమని మణికంఠకు గట్టిగా క్లాస్ పీకాడు. ఎంత బాధున్నా ఇప్పుడే ఏడ్చేసేయ్, కానీ తర్వాత మాత్రం ఏడవడానికి వీల్లేదన్నాడు. అయినా మణి కంట నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. దీంతో నాగ్.. నీ భార్య నీదగ్గరకు రానంటే ఏం చేస్తావ్? నీకు ఫుడ్ పంపించింది కూడా నీ భార్య కాదు ఫ్రెండ్ రాహుల్ అని చెప్పడంతో మణి ఏడ్చేశాడు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఏడుస్తూ సింపతీ కోరుకుంటావని తిట్టాడు.ఫైర్? అదెలా ఉంటుంది సర్?మణికి ఈ రేంజ్లో క్లాస్ పీకడంతో హౌస్మేట్స్ అంతా కూడా అతడి మీదే పడ్డారు. మొదటగా ప్రేరణ.. మణి అందరూ తన గురించే ఆలోచించాలనుకుంటాడంది. విష్ణుప్రియ, పృథ్వీ కూడా అతడిని సెల్ఫిష్ అనేశారు. ఈ సందర్భంగా నాగ్.. విష్ణుప్రియలో ఫైర్ చూడాలనుందనగా.. అదెలా ఉంటుంది సర్? అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది విష్ణు. దీంతో నాగార్జున మారు మాట్లాడలేక తన నోటికి తాళం వేసుకున్నాడు. ప్రేరణను సెల్ఫిష్ అనేసిన యష్మినబీల్ వంతురాగా.. తాను గెలిచినప్పుడు యష్మి జెలసీతో ఏడ్చేసిందన్నాడు. యష్మి మళ్లీ మణి దగ్గరకే వచ్చి అతడు ప్రవర్తన అన్నోయింగ్గా అనిపిస్తుందంది. అలాగే ప్రేరణ సెల్ఫిష్‌గా అనిపిస్తోందని అభిప్రాయపడింది. నాగ్ మాత్రం.. ప్రేరణ గేమ్ అద్భుతంగా ఆడుతుందని మెచ్చుకున్నాడు. ఇక యష్మికి తండ్రి పంపిన మెసేజ్ చెప్తానన్నాడు నాగ్. కాకపోతే ఏదైనా సీక్రెట్ చెప్పాలని షరతు విధించాడు. మోసపోయిన యష్మిదీంతో యష్మి ఓపెన్ అవుతూ.. కాలేజీలో ఒకర్ని ప్రేమించాను.. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మా ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలను చైనీస్ భాషలో పచ్చబొట్టు వేయించుకున్నాను. తర్వాత తెలిసిందేంటంటే.. ఇది జపనీస్ భాష అంట.. పైగా ఈ అక్షరాలకు అసలు అర్థమే లేదంటూ తను మోసపోయిన విషయం బయటపెట్టింది. సీక్రెట్ బయటపెట్టిన యష్మికి తండ్రి పంపిన మెసేజ్‌ను తెలియజేశాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది, వారియర్‌లా పోరాడు, మిస్ అవుతున్నానని సందేశం పంపాడన్నాడు. మణికంఠ కన్నీళ్లుసీతకు ఈర్ష్య ఉందని పృథ్వీ, ప్రేరణ అభిప్రాయపడ్డారు. మణి కన్నింగ్ అని నిఖిల్, మణి టాక్సిక్ అని నైనిక పేర్కొన్నారు. మణికంఠ వంతు వచ్చేసరికి.. ఎవరినీ జడ్జ్ చేసే పరిస్థితిలో లేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ఆడాల్సిందే అని నాగ్ గద్దించడంతో సీతకు జెలసీ ఉందన్నాడు. నేను ఎలా సేవ్ అవుతున్నానో అర్థం కావడం లేదనేసిందని చెప్పాడు. కిచెన్‌లో ప్రేరణ ప్రవర్తించిన తీరు నచ్చలేదన్నాడు. ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్, నబీల్ను సేవ్ చేశారు.ఆ నలుగురికీ ఆదిత్య పంచ్తర్వాత వారం మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఆదిత్యను స్టేజీపైకి పిలిచి జర్నీ చూపించాడు. అతడితో హగ్ అండ్ పంచ్ గేమ్ ఆడించాడు. నబీల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్‌కు హగ్స్ ఇచ్చిన ఆదిత్య.. యష్మి, నైనిక, సీత, నాగమణికంఠకు పంచ్ ఇచ్చాడు. ఒక్కవారమైనా ఏ గొడవా లేకుండా ఆడమని మణికి సలహా ఇచ్చాడు. ఇక పుట్టినరోజునాడే ఆదిత్య బిగ్‌బాస్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిని ఆడుకున్న బిగ్‌బాస్.. ఏడ్చినా కరుణించలేదు!
ఆదిత్య ఎలిమినేషన్‌తో హౌస్‌లో తొమ్మిది మందే మిగిలారు. వీరికోసం బిగ్‌బాస్ అదిరిపోయే డీల్ తీసుకొచ్చాడు. ఇంటి వంటను కళ్లముందుంచాడు. కానీ దాన్ని తినే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. మరి ఎవరెవరు ఇంటి భోజనం అందుకున్నారో తెలియాలంటే నేటి (అక్టోబర్ 04) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..జాతకం చెప్పిన మణిమణికంఠకు సపోర్ట్ చేస్తే ఆడియన్స్ దృష్టిలో మనల్నే విలన్ చేస్తున్నాడని సీత అభిప్రాయపడింది. అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడంది. ఇదిలా ఉంటే తర్వాతి రోజు మార్నింగ్ మస్తీ పేరిట బిగ్‌బాస్ మణికంఠతో హౌస్‌మేట్స్‌కు జ్యోతిష్యం చెప్పించాడు. ఈ సందర్భంగా మణి తనలోని ఫన్ యాంగిల్‌ను బయటపెట్టాడు. తర్వాత హౌస్మేట్స్ మణి జాతకం చెప్పారు. ఈ వారం వెళ్లిపోయేలా ఉన్నావని నబీల్, ప్రతిదానికి ఏడవొద్దని యష్మి సెటైర్లు వేశారు.భార్య మెసేజ్ కోసం మణి ఆరాటంఅనంతరం అసలైన ఆట మొదలుపెట్టాడు. మొదటగా యష్మిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. నిఖిల్ కోసం అతడి అమ్మ చేసిన వంటను, నాగమణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను ముందు పెట్టాడు. వీరికి మెసేజెస్ కూడా వచ్చాయన్నాడు. అయితే ఇద్దరిలో ఒకరినే సెలక్ట్ చేసుకుని వారికి ఫుడ్, లెటర్ ఇవ్వాలన్నాడు. యష్మి.. క్షణం ఆలోచించకుండా నిఖిల్ పేరు చెప్పింది. అది విని మణికంఠ గుండె బద్ధలయ్యింది. తన భార్య ఏమని మెసేజ్ పంపిందోనని దిగులు చెందాడు. అంతలోనే తనకోసం బిర్యానీ చేసి పంపినందుకు తినకపోయినా మనసు నింపుకున్నాడు.నువ్వు వారియర్‌వి..అమ్మ చేతి వంట తిన్న తర్వాత నిఖిల్.. 'ఎవరి కోసమూ మారాల్సిన అవసరం లేదు, లక్ష్యాన్ని మర్చిపోకు' అంటూ తల్లి పంపిన మెసేజ్ చూసుకుని మురిసిపోయాడు. తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన పృథ్వీ విష్ణుప్రియకు బదులుగా నైనిక కోసం ఆమె తల్లి చేసిన ఇడ్లీసాంబార్ తీసుకెళ్తానన్నాడు. విష్ణు ముందుగానే త్యాగం చేసేందుకు రెడీ అని హింటివ్వడంతోనే పృథ్వీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు వారియర్‌వి, నీ బలం చూపించు అంటూ అమ్మ పంపిన మెసేజ్ చూసి నైనిక మురిసిపోయింది.యష్మి ఎమోషన్స్‌తో ఆడుకున్న బిగ్బాస్మణికంఠ వంతురాగా యష్మీని పక్కన పెట్టేసి పృథ్వీ ఫుడ్ తీసుకెళ్లిచ్చాడు. దీంతో యష్మి బోరుమని ఏడ్చేసింది. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అంటూ తల్లి నుంచి వచ్చిన మెసేజ్ చూసి పృథ్వీ ఖుషీ అయ్యాడు. ఇంతలో బిగ్‌బాస్ యష్మి కోసం తండ్రి పంపిన మెసేజ్‌ను సైతం టీవీలో వేశాడు. కానీ ఒక లైన్ చదివేలోపే దాన్ని తీసేయడంతో యష్మి ఒక్కసారి మెసేజ్ చూపించు బిగ్‌బాస్ అని ఏడుస్తూ వేడుకుంది. కానీ బిగ్‌బాస్ కనికరించలేదు. ఒంటరి పోరాటం..ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముందంటే.. హాయ్ అమ్మూ, నువ్వు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే నీ పోరాటాలను ఎదుర్కొన్నావు.. ఆ సమయంలో నీకు తోడుగా లేను. నీ కలలను సాకారం చేసుకునేటప్పుడు కుటుంబంలో ఎవరమూ నీకు సపోర్ట్ చేయలేదు. అయినా నువ్వు వారియర్‌లా పోరాడావు, మేము తప్పని నిరూపించావు. మేము గర్వపడేలా చేశావు. ధైర్యంగా ఉండు, మిస్ యూ మగలే.. ఇట్లు నీ పప్పా అని రాసి ఉంది.పెళ్లయి 10 నెలలే..తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన నిఖిల్.. ప్రేరణ, నబీల్, సీత.. ముగ్గురిలో ప్రేరణను సెలక్ట్ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన పావ్ బాజీని ప్రేరణ ఆవురావురుమని ఆరగించింది. 'మన పెళ్లయి పది నెలలే అవుతోంది.. నీకు ఈ షో ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నిన్ను కలవలేనప్పటికీ టీవీలో సంతోషంగా చూస్తున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను. మిస్ యూ.. ఇట్లు నీ పుట్టు' అని భర్త మెసేజ్ చదివి సంతోషించింది.విష్ణుకు మెసేజ్చివరగా ఇంటి నుంచి భోజనం అందుకోలేకపోయినవారికోసం బిగ్‌బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. నిఖిల్, నైనిక, ప్రేరణ, పృథ్వీ కలిసి.. మిగతా హౌస్‌మేట్స్‌లో ఒకరికి ఫుడ్ తీసుకెళ్లొచ్చనగా అందరూ విష్ణుప్రియ పేరు చెప్పారు. చెల్లి పంపిన చికెన్ బిర్యానీ చూసి విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఏమని మెసేజ్ వచ్చిందంటే. ఆట మీద దృష్టి పెట్టి రేసుగుర్రంలా ఆడు, సైలెంట్‌గా ఉండటం వల్ల నీ గేమ్ డల్ అవుతుంది. టాస్కుల్లో ఫైర్ చూపించు.. ప్రేక్షకుల మనసు గెలుచుకో అని రాసుంది. మరి ఇప్పుడైనా విష్ణు.. పృథ్వీపైనే కాకుండా గేమ్‌పై ఫోకస్ పెడుతుందేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణపై విషం కక్కిన యష్మి, ఆదిత్యను దగ్గరుండి సాగనంపారు!
బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త చీఫ్ సెలక్ట్ అయ్యాడు. ఓరుగల్లు పిలగాడు నబీల్ అఫ్రిది చీఫ్ పోస్ట్ దక్కించుకున్నాడు. అలాగే నాగార్జున చెప్పినట్లు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఆదిత్య ఓంను బయటకు పంపించారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పోరాడి ఓడిన ప్రేరణహ్యాపీ పప్పీ టాస్క్‌లో నబీల్, ఆదిత్య, ప్రేరణ, నిఖిల్ మాత్రమే మిగిలారు. ఎలాగైనా చీఫ్ అవ్వాలని ప్రేరణ చివరిదాకా ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. అందరినీ వెనక్కు నెట్టి చివరకు నబీల్ చీఫ్ కంటెండర్‌గా నిలిచాడు. చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోయిందని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. పృథ్వీ, నబీల్‌లకు బిగ్‌బాస్ 'రాజయ్యేది ఎవరు?' అన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో పృథ్వీ మొదటగా టాస్క్ పూర్తి చేశాడు. కానీ చిన్న పొరపాటు చేయడంతో ఓడిపోయాడు.ఫ్రెండ్ అని ఊరుకున్నా..ఆలస్యంగానైనా నబీల్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. పృథ్వీ గెలవనందుకు యష్మి ఏడ్చేసింది. సంచాలకురాలిగా ప్రేరణ.. నబీల్‌కే ఫేవర్ చేసిందని ఆరోపించింది, అతడే గెలవాలని తన మనసులో ఉందంటూ ఏవేవో నిందలు వేసింది. ఫ్రెండ్ అని సైలెంట్‌గా ఊరుకుంటున్నాను, లేకపోయుంటే మాత్రం వదిలేసేదాన్నే కాదని నిఖిల్, పృథ్వీ దగ్గర ఫైర్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేరణ కనిపిస్తే కూడా.. పృథ్వీ మిస్టేక్ చేసినప్పుడు సరిచేయొచ్చు కదా అని నిలదీసింది. సంచాలకురాలిగా ఉన్నప్పుడు ఎవరికీ సాయం చేయనని ప్రేరణ మొహం మీదే చెప్పేసింది.లేడీస్ గ్యాంగ్ ఏడుపురాత్రిపూట బిగ్‌బాస్ మిడ్‌వీక్ ఎలిమినేషన్ అంటూ బాంబు పేల్చాడు. నామినేషన్లో ఉన్నవారిలో నిఖిల్, నబీల్, మణికంఠ.. ఈరోజుకైతే సేఫ్ అని తెలిపాడు. విష్ణుప్రియ, ఆదిత్య, నైనికలలో ఒకరు ఈరోజు బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతారని పేర్కొన్నాడు. దీంతో నైనిక ఏడుపందుకుంది. వాళ్లను చూసి సీత సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత బిగ్‌బాస్.. ఆదిత్య, నైనిక, విష్ణుప్రియను వరుసగా నిల్చోబెట్టి.. వీరిలో ఎవరు ఈరోజు వెళ్లిపోతారని భావిస్తున్నారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు.ఆదిత్య ఎలిమినేట్కొన్ని విషయాల్లో ఆదిత్య వెనకబడుతున్నాడని, అతడు ఎలిమినేట్ అవుతాడని నిఖిల్ అభిప్రాయపడ్డాడు. మణికంఠ, సీత, యష్మి సైతం.. ఆదిత్య వెళ్లిపోతాడని భావించారు. నబీల్ వంతురాగా.. మాటలు జారిన విష్ణుప్రియ హౌస్ నుంచి వెళ్లిపోవచ్చేమోనని గెస్ చేశాడు. ప్రేరణ, పృథ్వీ.. నైనిక వెళ్లిపోతుందేమోనని అభిప్రాయపడ్డారు. చివర్లో బిగ్‌బాస్.. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఆదిత్య ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించాడు. దీంతో ఎప్పటిలాగే ఆదిత్య అందరికీ ఓ ఫ్లయింగ్ కిస్ వదిలి హౌస్ నుంచి నిష్క్రమించాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'నీకే నోటిదూల'.. కోపంతో మంటల్లో చేయి పెట్టిన ఆదిత్య!
గమ్యం లేకుండా ఆట ఆడుతున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? అంటే విష్ణుప్రియ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఆదిత్య కూడా అసలు హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్నట్లుగానే ఉన్నాడు కానీ తనకు ఈ షో అవసరమని ఒకానొక సందర్భంలో చెప్పాడు.గేమ్‌ను లైట్ తీసుకున్న విష్ణు?విష్ణుప్రియ మాత్రం అవసరం కాదుకదా టైం పాస్ అన్నట్లుగా గేమ్‌ను లైట్ తీసుకుంటోంది.. పృథ్వీతో లవ్ యాంగిల్ ట్రై చేస్తూ గేమ్‌ను పక్కన పడేసింది. పైగా నోటికి ఎంతొస్తే అంత వాగేస్తోంది. పతివ్రత, పుణ్యస్త్రీ వంటి పదాలు వాడిన ఆమె పోయినవారం నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టు ఒక్కటే తక్కువయ్యాయంటూ దారుణంగా మాట్లాడింది.ఈయనకే నోటిదూలఇదే పాయింట్‌ను ప్రస్తావిస్తూ నిఖిల్.. విష్ణుప్రియను నామినేట్ చేశాడు. కానీ దాన్ని ఒప్పుకోని విష్ణు.. ఈయనకే పెద్ద నోటిదూల ఉంది, అయినా నా దగ్గరకు వచ్చి ఎలా చెప్తున్నాడో అర్థం కావట్లేదని నవ్వేసింది. తర్వాత నిఖిల్.. మణికంఠను నామినేట్ చేశాడు.మంటలో చేయి పెట్టిన ఆదిత్యప్రేరణ వంతు రాగా.. ఎక్కువ మంచిమాటలు చెప్పి నెగెటివ్ విషయాల్ని మాత్రం చెప్పడం లేదని ఆదిత్యను నామినేట్ చేశాడు. నాజీవితంలో ఇలాగే ఉంటాను.. వచ్చేవారం కూడా ఇలాగే ఉంటానని ఆదిత్యబదులిచ్చాడు. వచ్చేవారం దాకా హౌస్‌లోనే ఉంటావన్న నమ్మకం నీకు లేదటూ ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది. ఈ నామినేషన్‌ను ఒప్పుకోని ఆదిత్య మంటల్లో చేయి పెట్టి తన ఫోటో బయట పడేశాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాగ్‌తో అడ్డంగా వాదించిన సోనియా.. హౌస్‌లో జీరో అతడే!
మాటలు హద్దులు దాటడంతో యష్మి, విష్ణు, సోనియాకు నాగ్ గట్టిగానే క్లాస్ పీకాడు. మణికంఠను అబ్బాయే కాదంటావా? నిఖిల్ చేతికి గాజులు ఒక్కటే తక్కువయ్యాయా? యష్మి దృష్టి ఎంతసేపూ ఇద్దరబ్బాయిల మీదే ఉందా? అని ముగ్గురిపైనా విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఎవరిపై ఏ రేంజులో ఫైర్ అయ్యాడో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హీరోగా నబీల్నాగార్జున వచ్చీరావడంతోనే హీరో-జీరో గేమ్ ఆడించాడు. మొదటగా మణికంఠ.. సీత హీరోలా గేమ్ ఆడుతుందని, నైనిక గేమ్‌లో జీరోలా అయిపోతోందని చెప్పాడు. మణికంఠ కరెక్ట్‌గా చెప్పాడని నాగ్ మెచ్చుకున్నాడు. తర్వాత యష్మి.. నబీల్ను హీరో, నైనికను జీరో అనేసింది. ఇక్కడ నాగ్.. నబీల్ ఆటకు చప్పట్లు కొట్టడమే కాకుండా ఆడియన్స్‌తోనూ సూపర్ అనిపించాడు. ఇతడు పృథ్వీ హీరో, మణిని జీరో అని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా మణికంఠ డబుల్ యాక్షన్ చేసిన వీడియోలు ప్లే చేశారు. గేమ్‌లో త్యాగం చేయలేదని ఓసారి, తనే త్యాగం చేశానని మరోసారి చెప్పాడు. ఏదైనా ఒక్కదానిపైనే నిలబడు, అతిగా ఆలోచించకు అని నాగ్ మణికి సలహా ఇచ్చాడు.సీత హీరో, మణి జీరోఆదిత్య వంతురాగా.. నిఖిల్ హీరో, మణి జీరో అని పేర్కొన్నాడు. నైనిక.. సీత హీరో, మణి జీరో అని తెలిపింది. ప్రేరణ వంతురాగా.. నబీల్‌కు హీరోగా కిరీటం పెట్టింది. పప్పులా ఆడుతున్నాడా? ఎవరి వల్లయినా ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడా? అనేది అర్థం కావట్లేదంటూ నిఖిల్‌ను జీరోగా అనేసింది. ఎందుకలా? అని నాగ్ అడగ్గా మిస్ బ్యాలెన్స్ అయ్యానని నిఖిల్ చెప్పాడు. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? అని నిలదీశాడు. అంతేకాకుండా నీ క్లాన్లోకి రావడానికి హౌస్ అంతా ఇష్టపడలేదు, ఎందుకో తెలుసా? నీ ఆట నువ్వు ఆడట్లేదు, ఈజీగా ఇన్ఫ్లూయెన్స్ అయిపోతున్నావు.. అనే ఎవరూ ఇష్టపడలేదు అని అర్థమయ్యేలా వివరించాడు. చదవండి: సోనియా ఎలిమినేట్.. సీక్రెట్ రూంలాంటి ట్విస్టులేమైనా..?నా ఆట నేనే ఆడతాసోనియా, నిఖిల్.. పృథ్వీని హీరోగా, మణికంఠను జీరోగా అభిప్రాయపడ్డారు. సీత.. నబీల్ను హీరోగా పేర్కొనగా.. ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ నిఖిల్‌ను జీరోగా అభిప్రాయపడింది. నెమ్మదిగా విషయం బోధపడుతున్న నిఖిల్.. ఇకమీదట నా ఆట నేనే ఆడతా, నా నిర్ణయాలు నేనే తీసుకుంటా అని మాటిచ్చాడు. పృథ్వీ.. నబీల్ను హీరోగా.. మణికంఠను జీరోగా పేర్కొన్నాడు. తర్వాత నాగ్ సోనియాకు క్లాస్ పీకాడు.. విష్ణును అడల్ట్రేటెడ్ కామెడీ అన్నావ్.. మరి నామినేషన్లో నువ్వు చేసిందేంటి? అని వీడియో ప్లే చేశాడు.నాగ్‌తో వాదించిన సోనియాఅందులో సోనియా.. ఎంతసేపు పృథ్వీ, నిఖిల్‌నే చూస్తే ఎలా? మమ్మల్ని కూడా చూడు అంటూ యష్మిపై సెటైర్లు వేసింది. ఇది తప్పు కాదా? అని నిఖిల్, పృథ్వీని ప్రశ్నించగా అబ్బే, తన ఉద్దేశం అది కాదంటూ వీళ్లు ఆమెను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో ప్రేరణ అందుకుని.. ఇందుకే, ఇలా తప్పు చేసినా సరే వారిని వారే సమర్థించుకోవడం వల్లే ఎవరూ ఆ క్లాన్లోకి వెళ్లలేదని ఉన్నమాట అనేసింది. తర్వాత సోనియా లేచి.. గేమ్‌లో వాళ్లతో పాటు నన్ను కూడా చూడు అని చెప్పానే తప్ప అందులో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదని వాదించింది. ఇది జోక్ కాదువిష్ణుప్రియ.. ప్రేరణకు హీరోగా కిరీటం ఇవ్వగా, సోనియా జీరో అని తేల్చింది. ఈ సందర్భంగా విష్ణు.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువ అని హేళన చేసిన వీడియోను నాగ్ ప్లే చేశాడు. అది సరదాగా అన్నానని విష్ణు నవ్వడంతో.. ఇది జోక్ కాదు, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావ్? ఇలాంటివి మళ్లీ రిపీట్ కావొద్దని నాగ్ హెచ్చరించాడు. అనంతరం మణికంఠను అబ్బాయిల లిస్టులో నుంచి పక్కనపడేసిన వీడియో ప్లే చేశారు.యష్మిపై ఫైర్అందులో.. ఇంట్లో నలుగురు అబ్బాయిలే ఉన్నామా? అయినా మణికంఠ ఉన్నాడుగా అని పృథ్వీ అనగా వాడు లెక్కలో లేడు అని యష్మి అనేసింది. ఇది చూసి నోరెళ్లబెట్టిన యష్మి.. అమ్మతోడు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, గేమ్పరంగా అతడు లెక్కలో లేడు అన్నానే తప్ప మరే ఉద్దేశం లేదంటూ క్షమాపణలు చెప్పింది. ఫైనల్‌గా నాగ్ ఈ రోజు నబీల్ ఒక్కడినే సేవ్ చేశాడు. రేపు సోనియా ఎలిమినేట్ అన్న విషయం అందరికీ తెలిసిందే!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుకు మొట్టికాయలు.. సోనియా గ్యాంగ్‌కు క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ 8 ప్రారంభమైన తొలినాళ్లలో సోనియా.. తన తెలివిని ఉపయోగించి ఆటలో ముందుకు సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె అతి తెలివి ఉపయోగించడం వల్ల మొదటికే మోసం వచ్చింది. గ్రూప్ గేమ్ అంటూ నిఖిల్, యష్మిలపై నింద వేసిన ఆమె ఇప్పుడు నిఖిల్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతోంది. ఇది చూసిన జనాలు సోనియాకు నిందించకుండా ఎలా ఉంటారు?గ్రూప్ గేమ్పైగా ఫైర్ బ్రాండ్లా ఉండే నిఖిల్.. సోనియా చెంత చేరాక ఆమె చేతిలో కీలుబొమ్మలా మారాడు. ఇక సోనియాను ఎవరైనా ఏమైనా అంటే చాలు నిఖిల్, పృథ్వి.. వారి మీద పడిపోయేవారు. ఈ ఇద్దరిని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడే సోనియా.. నామినేషన్లోనూ యష్మి.. ఆ ఇద్దరు అబ్బాయిలనే చూస్తోందని చులకనగా మాట్లాడింది. ఈ గ్రూప్ గేమ్‌ను చూసీచూడనట్లు ఊరుకున్న నాగ్ ఇన్నాళ్లకు పెదవి విప్పాడు. సోనియా ఆట కూడా చెడగొట్టండితాజా ప్రోమోలో.. నీ ఆట కనిపించడం లేదంటూ యష్మి సోనియాను నామినేట్ చేసింది. ఆ సమయంలో నిఖిల్, పృథ్వి పేర్లు ఎందుకు బయటకు వచ్చాయి? అని నాగ్ సూటిగా ప్రశ్నించాడు. ఇక్కడ పృథ్వీ సోనియాను వెనకేసుకురాబోయాడు. కానీ నాగ్ అందుకు ఒప్పుకోలేదు. ఇలాగే ఏం అర్థం చేసుకోకుండా మీ ఆటను పాడు చేసుకోండి.. అలాగే సోనియా ఆట కూడా చెడగొట్టండని క్లాస్ పీకాడు.బొట్టు ఒక్కటే తక్కువఇక బిగ్‌బాస్ షోకు పిక్నిక్ కోసమే వచ్చిన విష్ణుప్రియ.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టు ఒక్కటే తక్కువయ్యాయంటూ హేళన చేయడాన్ని సైతం తప్పుపట్టాడు. ఇది చాలా తప్పని నాగ్ చెప్తున్నా సరే విష్ణు దాన్ని నెత్తినెక్కించుకోకుండా ఊరికే నిఖిల్‌ను కాంచన అని ఆటపట్టిస్తామని కవర్ చేసేందుకు ప్రయత్నించింది. ఇది జోక్ కాదని, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావని గద్దించడంతో అప్పుడు తన గొంతు తగ్గించింది. మరి ఇప్పటికైనా విష్ణు తన నోటిని అదుపులో పెట్టుకుంటుందేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హీరో నుంచి జీరో స్థాయికి పడిపోయిన నిఖిల్.. క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ ప్రోమో రానే వచ్చింది.. కింగ్ నాగార్జున ఇంటిసభ్యులతో హీరో- జీరో గేమ్ ఆడించాడు. అంటే హౌస్‌లో మీకు హీరోగా కనిపించిన వ్యక్తికి రాజకిరీటం పెట్టమని.. ఆటలో జీరో అనిపించిన వ్యక్తి ముఖంపై రాంగ్ సింబల్ అచ్చు దింపాలని ఆదేశించాడు. అలా ఎక్కువమంది నబీల్, నిఖిల్, సీత హీరో అని అభిప్రాయపడగా నైనిక, మణికంఠను ఎక్కువమంది జీరో అని తేల్చేశారు.కేవలం శక్తి టీమ్ విజయం కోసంఈ క్రమంలో ప్రేరణ.. నిఖిల్‌కు జీరో ట్యాగ్ ఇచ్చింది. అందుకు బలమైన పాయింట్ కూడా చెప్పింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను ఆపడానికి హౌస్ అంతా కలిసి ఆడదామన్నాడు. కానీ చివరికి తన టీమ్ కోసం హౌస్‌ను పక్కనపడేశాడంది. అందుకు నాగార్జున సైతం తనకూ అలాగే అనిపించిందన్నాడు. నబీల్ను గేమ్‌లో నుంచి తీసేయడం కరెక్టేనా? అని అడగ్గా.. అందుకు నిఖిల్ ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయిందన్నాడు. బ్యాలెన్స్ తప్పడానికి ఏ మిస్ కారణం? అని నిలదీయడంతో నిఖిల్ బిక్కముఖం వేశాడు.ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు క్లాన్ చీఫ్ (టీమ్ లీడర్)గా ఉన్నప్పుడు హౌస్ అంతా కూడా నీ టీమ్‌లోకి రావడానికి ఇష్టపడలేదు. అది ఎందుకో ఒక్కసారైనా ఆలోచించావా? అని నాగ్ సూటిగా అడిగాడు. ఏం చేసినా మేం ముగ్గురమే కలిసి చేస్తున్నామని అందరూ అనుకుంటున్నారని తెలిపాడు నిఖిల్. అది నిజమేనా? అని నాగ్ అడగ్గా హౌస్ అంతా కూడా అవును అని బదులిచ్చింది.చదవండి: -
ఆడాళ్ల ప్రతాపం.. మాట్లాడాలంటే భయమేస్తోందని ఏడ్చిన మణి
పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని బాంబు పేల్చిన బిగ్‌బాస్.. వాటిని వీలైనంతవరకు తగ్గించవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అలా ఐదు ఛాలెంజ్‌లు ఇచ్చాడు. కానీ అందులో మూడు మాత్రమే గెలవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్యను తొమ్మిది వరకే నరుక్కుంటూ రాగలిగారు. ఈ ఛాలెంజ్‌ల మధ్యలో బోలెడు గొడవలు. అవేంటో నేటి (సెప్టెంబర్ 26) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అదుర్స్ అనిపించిన నబీల్, పృథ్వీవైల్డ్కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు బిగ్‌బాస్ మూడో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో నబీల్, పృథ్వి పోటీపడ్డారు. పావుగంటసేపు బెలూన్ పగలకుండా చూసుకోమంటే వీళ్లు ఏకంగా మూడుగంటలకుపైగా అలానే ధ్వజస్థంభాల్లా నిలబడి ఔరా అనిపించారు. ఈ గేమ్‌లో పృథ్వి (శక్తి) టీమ్ విజయం సాధించడంతో 11 మందిలో ఒక వైల్డ్‌కార్డ్ ఎంట్రీని అరికట్టారు. అంతేకాదు, అవతలి టీమ్‌లో నుంచి ఒకరిని గేమ్‌లో నుంచి తీసేసే పవర్‌ను శక్తి టీమ్‌కు ఇచ్చాడు. చిల్లర గేమ్..దొరికిందే ఛాన్స్ అనుకున్న శక్తి క్లాన్.. కాంతార టీమ్‌లో నుంచి నబీల్ను అవుట్ చేసింది. బాగా ఆడే వ్యక్తిని ఎలా గేమ్‌లో నుంచి తీసేస్తారని కాంతార టీమ్ ఉడికిపోయింది. చిల్లర గేమ్ ఆడుతున్నారని ప్రేరణ మండిపడింది. సీత అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కలిసి ఆపుదామనుకున్నాక మళ్లీ నీ టీమ్ కోసం స్వార్థంగా ఆలోచించావని నిఖిల్‌ను తప్పుపట్టింది. విష్ణుప్రియ అయితే.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువైంది.. అలా అని ఆడవాళ్లను తక్కువ చేయట్లేదు అంటూనే నిఖిల్ మీద సెటైర్లు వేసింది. బలవంతమైన త్యాగం!అసలు శక్తి టీమ్‌లో మణిని ఎలా సైడ్ చేశారన్న డౌట్ ప్రేరణకు వచ్చింది. అదే ప్రశ్నను ముక్కుసూటిగా అడగ్గా మణికంఠయే స్వయంగా త్యాగం చేశాడని సోనియా అంది. అందుకు మణి.. అది నిజం కాదంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో శక్తి టీమ్ బిక్కముఖం వేసింది. మన టీమ్‌లోని ముగ్గురు నేను సైడ్ అవ్వాలని కోరుకున్నారు. అందుకే నేను కూడా పక్కకు తప్పుకున్నానే తప్ప నా అంతట నేనుగా త్యాగం చేయాలనుకోలేదని మణి క్లారిటీ ఇచ్చాడు. కన్నీళ్లు పెట్టుకున్న మణికంఠఅయినా వెనక్కు తగ్గని సోనియా, యష్మి .. అప్పటిదాకా త్యాగం అని చెప్పి ఇప్పుడేమో మాట మార్చేశాడంటూ నోరేసుకుని పడిపోయారు. నీ వయసెంత? చిన్నపిల్లాడిలా ప్రవర్తించకు. ఎవర్నీ బ్యాడ్ చేయొద్దంటూ యష్మి వార్నింగే ఇచ్చింది. దీంతో ఎమోషనలైన మణి.. తప్పంతా నాదే! ఇకమీదట నోరు మూసుకుని కూర్చుంటాను అంటూ ఎమోషనలయ్యాడు. వీళ్ల అరుపులతో పసిపిల్లాడిలా భయపడిపోయిన మణికంఠ.. మాట్లాడాలంటేనే భయమేస్తోందంటూ ఏడ్చేశాడు. ధైర్యం నూరిపోసిన నబీల్అతడి బాధను అర్థం చేసుకున్న నబీల్.. ఎవరికీ భయపడాల్సిన పని లేదు, నీకు మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడాలంతే. అని తనకు ధైర్యం చెప్పాడు. ఇక బిగ్‌బాస్ రంగురంగుల పజిళ్లు అనే నాలుగో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో ఏ టీమ్ గెలవకలేకపోయింది. నచ్చిన స్టెప్పులేసుకోండి అంటూ ఐదో ఛాలెంజ్ ఇవ్వగా ఈ గేమ్‌లో శక్తి టీమ్ గెలుపొందింది. దీంతో 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కాస్తా తొమ్మిదికి చేరాయి. 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా..అప్పుడే బిగ్‌బాస్ ఓ బాంబు పేల్చాడు. ఇంతటితో ఛాలెంజ్‌లు పూర్తయ్యాయని, ఇప్పటివరకు మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మాత్రమే ఆపగలిగారని చెప్పాడు. అంటే ఇంకా తొమ్మిదిమంది హౌస్‌లోకి వచ్చేస్తున్నారని హౌస్మేట్స్ గుండెల్లో గుబులు పుట్టించాడు. వీరిలో ఆరేడుగురు మాజీ కంటెస్టెంట్లు కాగా మరో ఇద్దరు ఈ సీజన్లో ఎలిమినేట్ అయినవారితో రీఎంట్రీ ప్లాన్ చేయిస్తున్నట్లు టాక్!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇంట్లో నుంచి వెళ్లిపోమన్న సోనియా.. నామినేషన్స్ ఆరుగురు!
నీళ్ల ట్యాంకర్ దగ్గర గొడవపడ్డట్లు ఆ కొట్లాటలేంటి? ఆ మాటలేంటి? అని విష్ణుప్రియ, ప్రేరణ.. ఇద్దరికీ క్లాస్ పీకాడు నాగ్. పోయినవారం గుడ్డు దగ్గర మొదలైన వైరం గుడ్డుతోనే ముగిసిపోవాలని ఐదు ఎగ్స్ ఇచ్చి మరీ ఒకరికొకరు తినిపించుకోమన్నాడు. అప్పుడు సరేనంటూ తలూపిన వీళ్లు నామినేషన్స్ రాగానే మళ్లీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి దిగిపోయారు.నబీల్ వర్సెస్ సోనియావిష్ణుప్రియ.. ప్రేరణను నామినేట్ చేయడంతో ఆమె షాకైంది. అయితే ప్రేరణ మాత్రం విష్ణును వదిలేసి నైనిక, మణికంఠలను నామినేట్ చేసింది. ఇక సోనియా.. తన యాటిట్యూడ్ చూపించింది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని నబీల్‌కు ట్యాగ్ ఇచ్చింది. అటు ఆదిత్య ఓంను నామినేట్ చేస్తూ.. మీరేం పర్ఫామెన్స్ ఇవ్వలేదు కాబట్టి చెప్పడానికి పెద్దగా పాయింట్లు కూడా లేవంది.వెళ్తాననుకున్నారుగా.. వెళ్లిపోండిఎలాగో ఈవారం వెళ్తాననుకున్నారు కదా.. కాబట్టి ఈ హౌస్ నుంచి వెళ్లిపోండి అని ఆదిత్య ముఖం మీదే చెప్పింది. మొత్తానికి ఈ వారం ప్రేరణ, నబీల్, ఆదిత్య, సోనియా, పృథ్వి, మణి ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. నిజానికి నైనిక కూడా నామినేషన్లో ఉండాల్సింది కానీ తనను నిఖిల్ సేవ్ చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కుమ్మేసిన లేడీస్.. ప్రైజ్‌మనీ డబుల్! అభయ్, మణికి వార్నింగ్
ఈ వారం ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవకుండా చూసినవాళ్లకు నాగార్జున ఎవరికి క్లాస్ పీకనున్నాడనేది ముందే తెలుసు. అయితే అందరూ ఊహించినదానికన్నా రెట్టింపు స్థాయిలో నాగ్ ఫైర్ అయ్యాడు. అభయ్ నవీన్‌ను మెడ పట్టి బయటకు గెంటినంత పని చేశాడు. కానీ బూతులు మాట్లాడిన పృథ్వీని సుతిమెత్తగా మందలించడం గమనార్హం. మరి ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అభయ్కు రెడ్ కార్డ్నాగార్జున వచ్చీరాగానే అభయ్‌ను వాయించడం మొదలుట్టాడు. మొదట బెలూన్ గేమ్ గురించి, తర్వాత బిగ్‌బాస్‌ను చులకన చేస్తూ తిట్టిన వీడియో ప్లే చేశాడు. సైకోలా ఉన్నావ్.. మనిషి పుట్టుక పుట్టావా? అన్నీ నీమాటలే అంటూ నాగ్.. అభయ్‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు. బిగ్‌బాస్‌కు గౌరవం ఇవ్వకపోతే నేను సహించను. ఇది మళ్లీ రిపీట్ అవకూడదు అంటూ అభయ్కు రెడ్ కార్డ్ చూపించాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోమన్నాడు. దీంతో అభయ్ మోకాళ్లపై కూర్చుని తనను క్షమించమని వేడుకున్నాడు.అభయ్ తరపున నాగార్జున క్షమాపణ..ఒక్క ఛాన్స్ ఇవ్వండి సర్.. నేను ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు అనేది నేర్చుకోవడానికి లైఫ్‌లో దొరికిన అదృష్టం సర్ ఇది అని దండం పెట్టి బతిమాలాడు. బిగ్‌బాస్ హౌస్‌లో నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలేనన్న నాగ్ ఇక్కడ బిగ్‌బాస్ కంటే ఎవరూ తోపు కాదని నొక్కి చెప్పాడు. అభయ్ తరపున నాగార్జున బిగ్‌బాస్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇంట్లో వాళ్లందరూ అభయ్కు ఒక్క ఛాన్స్ ఇద్దామనడంతో నాగ్ శాంతించాడు.రూ.6 లక్షలు గెలుచుకున్న లేడీస్తర్వాత ఎగ్ టాస్క్ గురించి ప్రస్తావించాడు. లేడీస్‌లో ఎవరు బాగా ఆడారన్న ప్రశ్నకు నిఖిల్.. సీత పేరు చెప్పాడు. దీంతో నాగ్.. కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకు ఇచ్చావని కౌంటరిచ్చాడు. ఎగ్స్ టాస్క్ లేడీస్ అందరూ కుమ్మేశారని నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంతేకాదు వారి పర్ఫామెన్స్ మెచ్చి ఏకంగా రూ.6 లక్షల్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.11,60,000కు చేరుకుంది. క్లాస్ పీకిన నాగ్తర్వాత ప్రేరణ, విష్ణు మధ్య గొడవను నాగ్ లేవనెత్తాడు. ముందుగా ప్రేరణ మాట్లాడుతూ..నేను పర్సనల్‌గా కనెక్ట్ అయింది విష్ణుతో! కానీ, తనను నామినేట్ చేసినప్పటి నుంచి ఆమెలో చాలా మార్పులు కనిపించాయి. నాపై ద్వేషం పెంచుకుంది. ఆ ద్వేషంతోనే గేమ్‌లో నాపై రక్కింది అని చెప్పింది. అప్పుడు.. సీతను తన్నిన, విష్ణుప్రియను క్యారెక్టర్‌లెస్ అన్న వీడియో ప్లే చేసి మరీ ప్రేరణకు నాగ్ క్లాస్ పీకాడు.పతివ్రత..పంపులదగ్గర కొట్టుకున్నట్లు ఆ మాటలేంటి? అని గద్దించగా ప్రేరణ.. తప్పు పదం వాడేశానని, అందుకు సారీ చెప్పానంటూనే మరోసారి క్షమాపణలు చెప్పింది. అటు విష్ణుప్రియ కూడా పతివ్రత పదం వాడిందని, మరోసారి అలాంటి పదాలు రిపీట్ కావద్దని నాగ్ హెచ్చరించాడు. గుడ్డు దగ్గరే గొడవ మొదలు కావడంతో వీళ్లిద్దరికీ కలిపి ఐదు గుడ్లు పంపించి శత్రువులను మిత్రువులు చేశారు.ఎందుకంత సీన్ చేశారు?తర్వాత దోస వివాదానికి చెక్ పెడుతూ ఓ వీడియో ప్లే చేశారు. అందులో ప్రేరణ.. విష్ణుకు మామూలుగానే దోస వేసి ఇచ్చింది. అడుక్కునేవారికి వేసినట్లు వేయలేదుగా.. దానికి మణి, విష్ణు ఎందుకంత సీన్ చేశారని నాగ్ అడిగాడు. మధ్యలో నువ్వు ఉండటం వల్లే ఆ గొడవ పెద్దదైందని, నీ గేమ్ నువ్వు ఆడు అని మణికి సలహా ఇచ్చాడు.ఆడపిల్ల ఇబ్బందిపడితే..తర్వాత అతడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి తన హగ్గుల వల్ల యష్మి ఇబ్బందిపడుతున్న విషయాన్ని వీడియో ద్వారా చూపించారు. నీ వల్ల ఆడపిల్ల ఇబ్బందిపడితే బయటకు పంపించేస్తానని నాగ్ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఈ షోకి ఎందుకు వచ్చావన్నది గుర్తుపెట్టుకుని ఆడమని చెప్పాడు. ఒక్క యష్మి విషయంలోనే కాదని, ఇది చాలాసార్లు రిపీట్ అవుతోందని తెలిపాడు.తప్పు తెలుసుకున్న మణిమొత్తానికి తప్పు తెలుసుకున్న మణి.. ఇంకోసారి అలా జరగదని మాటిచ్చాడు. కొత్తగా చాలామంది ఫ్రెండ్స్ అయ్యేసరికి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయానన్నాడు. పృథ్వీకి తన కోపమే బలహీనతగా మారిపోతుందని, బూతులు తగ్గించుకోవాలన్నాడు. వరుసగా చీఫ్ అవుతున్న నిఖిల్‌ను అభినందించాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ గెలవాలంటే ఈ ఐదు తప్పనిసరి!
తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని ఏలవచ్చని అందరూ చెప్తుంటారు. కానీ జీవితంలో గెలవాలంటే తెలివితేటలు (Intelligence Quotient) మాత్రమే ఉంటే సరిపోదని భావోద్వేగ ప్రజ్ఞ/ ఈక్యూ (Emotional Intelligence) అవసరమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఐక్యూ వ్యక్తి మేధస్సును, విశ్లేషణా సామర్థ్యాలను, సమస్యలను పరిష్కరించే ప్రతిభను కొలుస్తుంది. ఈక్యూ భావోద్వేగాలను గుర్తించడం, నియంత్రించడం, ఇతరులతో సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఐక్యూ ఉంటే విద్య, వృత్తి రంగాల్లో గొప్ప విజయాలు సాధించవచ్చేమో కాని సంతోషంగా జీవిస్తారన్న గ్యారంటీ లేదని టర్మన్ (1921) అధ్యయనంలో తెలిసింది. ఈక్యూ ఉంటే నాయకులుగా ఎదుగుతారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2001లో నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈక్యూ ఉన్న వ్యక్తులు వృత్తిలో నాలుగురెట్లు ఎక్కువ విజయం సాధిస్తారని గోల్మన్ పరిశోధన పేర్కొంది. ఉద్యోగుల విజయంలో ఈక్యూ 30శాతం ప్రభావం చూపగా, ఐక్యూ 20శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని మరొక పరిశోధనలో వెల్లడైంది. అంటే, ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా, బిగ్ బాస్లోనైనా నిలవాలంటే, గెలవాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినవారు సుఖంగా, సంతోషంగా జీవిస్తారు.ఈక్యూలో ఐదు ప్రధాన అంశాలు ఉంటాయని డేనియల్ గోల్మన్ తన ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ పుస్తకంలో ప్రతిపాదించాడు. 1. స్వీయ అవగాహన: వ్యక్తి తన భావోద్వేగాలను తెలుసుకోవడం.2. స్వీయ నియంత్రణ: కఠిన పరిస్థితుల్లో భావాలను నియంత్రించడం.3. ప్రేరణ: బాహ్య ప్రేరణ కంటే అంతర్గత విలువల ద్వారా ప్రేరేపించడం.4. సహానుభూతి: ఇతరుల భావాలను అర్థం చేసుకొని స్పందించడం.5. సామాజిక నైపుణ్యాలు: సంబంధాలను నిర్వహించడం, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం.ఈక్యూ ఉన్నవారే బిగ్ బాస్..సరే, ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చేద్దాం. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి వాతావరణంలో పార్టిసిపెంట్స్ ప్రవర్తన, నిర్ణయాలు, మాటలు వారి భావోద్వేగ ప్రజ్నను ప్రతిబింబిస్తాయి. మూడో వారం జరిగిన సంఘటనల్లో గ్రూప్ డైనామిక్స్, నిర్ణయం తీసుకోవడం, గొడవల పరిష్కారంలో ఈక్యూ ఎలాంటి పాత్ర పోషించిందనే విషయం తెలుసుకుందాం.స్వీయ అవగాహన (Self-Awareness)మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోవడమే స్వీయ అవగాహన. ఈ అవగాహన లేకనే విష్ణుప్రియ అనుమతి లేకుండా గుడ్లు తినేసింది. ఆ విషయంలో ప్రేరణతో గొడవకు దారితీసింది. యష్మి, మణికంఠల మధ్య గొడవలకు కూడా ఇదే కారణం. ఒక వ్యక్తి తన ఎమోషన్స్ ను అర్థం చేసుకుని, ఎలా స్పందించాలో తెలుసుకుంటే బిగ్ బాస్ షోలోనైనా, జీవితంలోనైనా గొడవలు తగ్గుతాయి.స్వీయ నియంత్రణ (Self-Regulation)పృథ్వి ప్రతి ఆటలోనూ ఆవేశంగా కనిపించాడు. అతని భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో అతని ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కోసారి అదుపుతప్పి బూతులు కూడా మాట్లాడుతున్నాడు. విష్ణుప్రియ ‘పతివ్రత’ అనే పదాన్ని మళ్లీ వాడేసింది. మరోవైపు మణికంఠ తరచూ ఎమోషన్స్ వాడి ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనివల్ల మొదట్లో కొంత సానుభూతి ఏర్పడినా, తరచూ ప్రదర్శించడం చిరాకుకు దారితీస్తుంది. ఇక అభయ్ నేరుగా ‘బిగ్‌బాస్ వరస్ట్’ అంటూ కామెంట్స్ చేయడం అతనికి ఎమోషనల్ రెగ్యులేషన్ లేదనే విషయాన్ని సూచిస్తుంది. అందుకే ఎమోషన్స్ ను నియంత్రించుకోవడం, సరైన స్థాయిలో, సరైన రీతిలో ప్రదర్శించడం అవసరం.సహానుభూతి (Empathy)నిఖిల్ తన ప్రతి నిర్ణయం కోసం సోనియాను సలహా అడగడం సహానుభూతిని సూచిస్తుంది. కానీ, దాన్ని బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల సోనియాపట్ల పక్షపాతం చూపిస్తున్నాడనే అభిప్రాయం ఏర్పడుతోంది. మరోవైపు సోనియా గొడవలకు దూరంగా ఉండి సేఫ్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఆమె ఎమోషనల్ బ్యాలెన్స్‌తో ఉన్నట్లు కనిపించినా, ప్రేక్షకులు ఆమెను బలహీనంగా భావించే ప్రమాదం ఉంది. ఇతరులపట్ల సహానుభూతి ఉండాలి, కానీ అది బలహీనతగా మారకూడదు.సామాజిక నైపుణ్యాలు (Social Skills)ప్రేరణ, విష్ణుప్రియల మధ్య వాగ్వాదంలో 'బ్రెయిన్లెస్', 'యూజ్లెస్' వంటి పదాలను ఉపయోగించడం సంఘర్షణలను మరింత పెంచుతుంది. మరోవైపు క్లాన్ లీడర్ కంటెస్టెంట్‌గా తనను పరిగణించనందుకు సీత బాధపడింది. కానీ ఆ విషయం నేరుగా నిఖిల్ కు చెప్పకుండా మరొకరితో చెప్పుకుని బాధపడింది. వ్యక్తి తన ఎమోషన్స్‌ను వ్యక్తీకరించాలి. కానీ వ్యక్తిగత దూషణలు లేకుండా. ఇదో ముఖ్యమైన సోషల్ స్కిల్. ఇది గొడవలు రాకుండా నిరోధిస్తుంది.ప్రేరణ (Motivation)అనేక నామినేషన్లు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ యష్మి తన నాయకత్వ శైలి సరైనదేనని కట్టుబడి ఉంది. ఇది తనలో మోటివేషన్ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. కానీ తన మోటివేషన్ తో పాటు క్లాన్ ఎమోషనల్ ఫీలింగ్స్ ను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే అనేక నామినేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. పృథ్వి హై కాంపిటీటివ్ నైజం అతని తపనను చూపిస్తుంది. కానీ నియంత్రణ లేకపోవడం గ్రూప్ లో విభేదాలకు, గొడవలకు కారణమవుతుంది.ఎవరు ఎలిమినేట్ కావచ్చు? ప్రేక్షకులు సాధారణంగా భావోద్వేగ పరిపక్వత కలిగిన ఆటగాళ్లను కోరుకుంటారు. ఎక్కువ ఆవేశంగా ప్రవర్తించే పృథ్వి వంటి ఆటగాళ్లను నెగెటివ్‌గా పరిగణించే అవకాశం ఉంది. అదే విధంగా, మణికంఠ లాంటి ఆటగాళ్లు ఎమోషనల్ డ్రామాను ఉపయోగించడం వల్ల నమ్మకం కోల్పోతారు. ఇతరుల కేరక్టర్ పై తరచూ తప్పుడు కామెంట్స్ చేయడం విష్ణుప్రియకు నెగెటివ్ గా మారవచ్చు.నా పరిశీలన మేరకు నిఖిల్ లో మంచి ఐక్యూ కనిపిస్తోంది. షో చివరి వరకూ ఇలాగే ఉంటుందో లేదో పరిశీలించాలి. కోపం అందరికీ వస్తుంది. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో ప్రదర్శించాలన్నది తెలుసుకున్నవారే సంతోషంగా జీవిస్తారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. జీవితంలోనైనా, బిగ్ బాస్ షోలోనైనా ఈక్యూ ఉన్నవారే విజేతగా నిలుస్తారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comబిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కొట్టుకు చస్తుంటే సినిమా చూస్తాడేంట్రా బాబూ.. చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్!
లీడర్ అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ముందుండి నడిపించాలి. అంతేకానీ ఏదైతే నాకేంటి? ఎవరెటు పోతే నాకేంటి? అనుకోకూడదు. కానీ అభయ్ అచ్చంగా అదే చేశాడు. తన టీమ్ కష్టపడి సంపాదించిన గుడ్లను కాపాడటం కూడా చేతకాలేదు. పైగా తమ గుడ్లు పోతున్నాయని టీమ్ మెంబర్స్ లబోదిబోమంటే అరవకుండా ఊరుకోమని చెప్తున్నాడు. ఇంకా హౌస్‌లో ఏమేం వింతలు, విశేషాలు జరిగాయో నేటి (సెప్టెంబర్ 19) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..కాంతార టీమ్‌పై విరుచుకుపడ్డ శక్తి టీమ్బిగ్బాస్ హౌస్‌లో నిన్నటి గుడ్ల టాస్క్ నేడు కూడా కొనసాగింది. కోడికూత వినబడగానే కంటెస్టెంట్లు ముందూవెనకా చూసుకోకుండా పరిగెత్తి మరీ గుడ్లను సంపాదిస్తున్నారు. వాటిని జేబుల్లో, టీషర్ట్స్‌లో.. ఎక్కడపడితే అక్కడ దాచేసుకున్నారు. తర్వాత తీరికగా బుట్టల్లో భద్రపరుస్తున్నారు. ఇంతలో కాంతార టీమ్ దగ్గరి నుంచి శక్తి టీమ్ గుడ్లు దొంగిలించింది. ఈ విషయాన్ని టీమ్ సభ్యులు తమ చీఫ్ అభయ్కు చెప్పినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. నబీల్‌పై నింద వేశా: విష్ణుప్రియకానీ యష్మి, ప్రేరణ మాత్రం దాన్ని అలాగే వదిలేసి ఉండలేకపోయారు. నువ్వానేనా చూసుకుందామన్నరీతిలో పోట్లాడారు. ఈ రౌండ్లో శక్తి 66, కాంతార 30 గుడ్లు సంపాదించింది. తర్వాత పెట్టిన గేమ్‌లో కాంతార టీమ్ గెలిచి 90 గుడ్లు సంపాదించింది. ఇక నబీల్ తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడన్న విష్ణుప్రియ ఈరోజు దానిపై క్లారిటీ ఇచ్చింది. అతడు తనను టచ్ చేయలేదని, ఎక్కడ టచ్ చేస్తాడోనన్న భయంతో అలా అరిచానంది. నబీల్ మంచి బాలుడు అని సర్టిఫికెట్ ఇస్తూ సారీ చెప్పింది. సైకోగాళ్లు.. బిగ్‌బాస్‌నే తిట్టిన అభయ్కిచెన్ విషయంలో బిగ్‌బాస్ మరిన్ని ఆంక్షలు విధించాడు. ఒక సమయంలో ఒక టీమ్‌కు సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్‌లో వంట చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. వారిది పూర్తయ్యాకే మరో టీమ్ కిచెన్‌లో అడుగుపెట్టాలన్నాడు. ఈ నిర్ణయం విన్న అభయ్.. వీళ్లేమైనా మనిషి పుట్టుక పుట్టారా? దిమాక్ లేదు, సైకోగాళ్లు అంటూ బిగ్‌బాస్‌నే ధిక్కరించాడు. కానీ బిగ్‌బాస్ ఆదేశించాక ఇంకా ఆలోచించాల్సిందేం ఉండదు గనుక హౌస్మేట్స్ వెంటనే ఆ రూల్ ఫాలో అయిపోయారు.రాక్షసుడిలా పృథ్వీతర్వాతి రోజు నిఖిల్ ప్రభావతి కోడి దగ్గర ఎర్రగుడ్డు ఉండటం చూశాడు. అదే విషయం తన టీమ్ దగ్గరకు వెళ్లి చెప్పగా వెంటనే వెళ్లి తీసుకోమని సీత తొందరపెట్టింది. ఆమె సూచనతో ఎవరికీ కనబడకుండా ఎగ్ తీసుకొచ్చాడు. అటు సోనియాకు ఏమైందో ఏమో కానీ సడన్‌గా నైనిక మీదకెళ్లి ముద్దులు పెట్టింది. అనంతరం గేమ్ మొదలవగానే పృథ్వీ మళ్లీ రాక్షసుడిగా మారిపోయాడు. ఎటుపడితే అటు తోసేసి, రక్కేసి, లాగేసి, నెట్టేసి చూసేవారినే భయపెట్టించేశాడు.చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్అటు కాంతార చీఫ్ అభయ్ మాత్రం మరోసారి తన టీమ్‌కు సపోర్ట్ చేయడం మానేసి ఏం జరిగినా సరే ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించాడు. తనటీమ్ కష్టపడి సాధించిన గుడ్లకు కాపలాగా ఉన్న అభయ్.. తన కళ్లముందే ఎగ్స్ ఎత్తుకుపోతుంటే కూడా పోతే పోనీ అని చూస్తూ ఊరుకుండిపోయాడు. పోయినవాటిని తిరిగి తీసుకొద్దామని యష్మి, ప్రేరణ ప్రయత్నిస్తే కూడా అందుకు అభయ్ ఒప్పుకోలేదు. తన టీమ్ ఓడిపోవడానికి అభయే ప్రత్యక్ష కారకుడయ్యాడు. అతడి నిర్లక్ష్యం వల్ల అవతలి టీమ్ మరింత రెచ్చిపోయారు.తన్నుకున్న లేడీ కంటెస్టెంట్లుఆడాళ్లు అయితే కిందపడి కొట్టుకున్నారు, తన్నుకున్నారు, జుట్టు పీక్కున్నారు. ప్రేరణపై విష్ణుప్రియ, సీత దాడి చేయడంతో ఆమె ఆవేశంలో విష్ణును క్యారెక్టర్‌లెస్ అనేసింది. అటు సోనియా మీద నబీల్ అరవడంతో పృథ్వీ, నిఖిల్ అతడి మీదకు దూసుకెళ్లిపోయారు. చివరగా ఈ రౌండ్లో శక్తి టీమ్ దగ్గర 263, కాంతార టీమ్ దగ్గర 25 గుడ్లు మాత్రమే మిగిలాయి. లీడ్‌లో ఉన్న శక్తి టీమ్ కాంతార టీమ్‌లో నుంచి ప్రేరణను గేమ్‌లో నుంచి ఎలిమినేట్ చేసింది. అయితే ఈ రోజు గేమ్‌లో యష్మి, ప్రేరణ శివంగిలా ఫైట్ చేశారని తప్పకుండా చెప్పుకుని తీరాల్సిందే!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ అభ్యంతరకరంగా టచ్ చేశాడన్న విష్ణుప్రియ
బిగ్‌బాస్ ఐదో సీజన్లో వచ్చిన ప్రభావతి అలియాస్ కోడిగుడ్డు టాస్క్ మళ్లీ రిపీట్ అయింది. గుడ్డు పోయిందని కంటెస్టెంట్లు అరిచిగోల చేయలేదు, ఏకంగా కిందపడేసి రక్కి మరీ అవతలివారి దగ్గరనుంచి సాధించారు. ఈ గుడ్డు కంటే ముందు దోస గురించి ప్రేరణ, విష్ణుప్రియ పంచాయితీ పెట్టుకున్నారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..'శక్తి'కి లగ్జరీ రేషన్ఆడింది అయిదునిమిషాలైతే అరుచుకోవడం అరగంట.. కాదు, హాఫ్‌డే అన్నట్లుంది బిగ్‌బాస్ హౌస్ పరిస్థితి. రేషన్ కోసం పెట్టిన గేమ్ శక్తి టీమ్ గెలవడంతో వారికి లగ్జరీ రేషన్ అందింది. ఓడిన కాంతార టీమ్ కేవలం ఆకుకూరలు, కూరగాయలతోనే సరిపెట్టుకుంది. మరోవైపు వంటరాని విష్ణుప్రియ ఒక దోసె అడిగితే చేసివ్వడానికి ప్రేరణ ఒప్పుకోలేదు. తనకు దోసె వేసుకోవడం రాదు, కాబట్టి ఒకటి వేసిస్తే తప్పేంటని మణి నచ్చజెప్పడంతో ప్రేరణ అయిష్టంగానే దోసె వేసిచ్చింది.ఏడుపందుకున్న విష్ణుఇలా ముఖం మాడ్చుకుని ఫుడ్ విసిరేయడం నచ్చలేదంటూ విష్ణు శోకమందుకుంది. తిండి విషయంలో ఎందుకీ గొడవలు? అని మణి, నిఖిల్ చెప్పడంతో ప్రేరణకు మరింత చిరాకెత్తిపోయింది. అటు విష్ణుప్రియ తనకొద్దని మారాం చేయడంతో పృథ్వీ వెళ్లి ప్రేమగా తినిపించడంతో కూల్ అయింది. తర్వాత కాసేపటికి ప్రేరణ కూడా వెళ్లి తాను కావాలని అలా చేయలేదని విష్ణుకు క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా మణి వల్లే ఈ గొడవ పెద్దదైందని అతడిని చులకన చేస్తూ మాట్లాడింది.సోనియాకు దూరంగా పృథ్వీ?ఇదిలా ఉంటే 'నువ్వెవడివిరా నాకు చెప్పడానికి..' అని సోనియా అన్న మాటను మర్చిపోలేక పృథ్వీ బాధపడుతూనే ఉన్నాడు. తన వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుందని ఏకంగా సోనియానే దూరంగా పెట్టాలనుకున్నాడు. కానీ నిఖిల్ అది జరగనిస్తాడా? తెల్లారే సోనియా చెవిలో జారేశాడు. అలా ఆమె పృథ్వీని ఎలా కూల్ చేయాలా? అన్న ఆలోచనలో పడింది.సోనియా ప్రేమ కబుర్లుతర్వాత సోనియా.. ప్రేరణతో తన ప్రేమవిషయాలను పంచుకుంది. మేము మూడేళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. నేను ప్రారంభించిన ఒక ఎన్జీవోకు అతడు వెబ్ డిజైనింగ్‌లో సహాయపడ్డాడు, అలాగే అమెరికా నుంచి తనొక స్పాన్సర్ కూడా! అయితే ఇంతవరకు నేను ప్రపోజ్ చేయలేదు. తను నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఇప్పటికీ ఆయన నా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు అని చెప్పింది.14 గంటల టైమ్లైన్అనంతరం బిగ్‌బాస్ కిచెన్ విషయంలో ఓ బాంబు పేల్చాడు. కిచెన్‌లో వంట చేసుకునేందుకు వారమంతా కలిపి కేవలం 14 గంటలు మాత్రమే కేటాయిస్తునట్లు తెలిపాడు. ఆ సమయం గడిచిపోయాక వంటగ్యాస్ ఆన్ చేసేదే లేదన్నాడు. తర్వాత బంగారుకోడిపెట్ట ప్రభావతి 2.0 హౌస్‌లోకి వచ్చింది. ప్రభావతి వదిలే గుడ్లు పట్టుకునేందుకు, పట్టుకున్నవాళ్ల దగ్గర లాక్కునేందుకు రెండు టీమ్స్ బాగానే కష్టపడ్డాయి. తోసుకుని, నెట్టేసుకుని, లాగేసి, కిందామీద పడేసి నానాతంటాలు పడ్డారు.చలనం లేకుండా పడి ఉన్న మణిమొదటి రౌండ్లో శక్తి టీమ్ 21, కాంతార టీమ్ 10 గుడ్లు సంపాదించింది. కామన్సెన్స్, బ్రెయిన్ వాడని ఒకే ఒక్క వరస్ట్ పర్ఫామర్ పృథ్వీ అని అభయ్ మండిపడ్డాడు. నిఖిల్ అయితే నాగమణికంఠను లాగి పడేయడంతో అతడు కొద్ది క్షణాలపాటు లేవలేకపోయాడు. అతడి పరిస్థితి చూసి తలపగిలిందేమోనని కాంతార టీమ్ లీడర్ అభయ్ పరిగెత్తుకు వచ్చాడు. తనకేదైనా అవుతుందేమోనన్న భయంతో గేమ్‌లో నుంచి పక్కన పెట్టాలనుకున్నాడు. దీంతో హర్ట్ అయిన మణి కెమెరాలకు కనిపించకుండా గోడకు అతుక్కుని వెక్కివెక్కి ఏడ్చాడు. బిగ్‌బాస్ షో.. నా జీవితంనీకేమైనా అయితే ఎలా? నిన్ను నమ్ముకుని ఇద్దరున్నారని అభయ్ అనడంతో ఈ షోయే నా జీవితం, నా పెళ్లాంబిడ్డలు కావాలంటే ఈ షో విన్ అవ్వాలి అని ఏడుపు కొనసాగించాడు. సరే, ఆడుదువులేనని అభయ్ సముదాయించాడు. అటు నబీల్ తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడని విష్ణుప్రియ అనగా.. తాను కేవలం గుడ్లు తీసుకునేందుకు మాత్రమే ప్రయత్నించానని, అనవసరంగా నిందలు వేయొద్దని నబీల్ మండిపడ్డాడు. అటు పృథ్వీ ఆవేశంలో బూతులు అనేసి తలపట్టుకున్నాడు.నబీల్ అవుట్ఇంతలో బిగ్‌బాస్ రెండు టీమ్స్ ఎగ్స్ లెక్కపెట్టమన్నాడు. అలా శక్తి టీమ్ దగ్గర 66, కాంతార వద్ద 34 గుడ్లు ఉన్నాయి. దీంతో కాంతార టీమ్‌లో ఒకర్ని సైడ్ చేసే ఛాన్స్ శక్తి టీమ్‌కు ఇచ్చాడు. అలా వాళ్లు నబీల్ను గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడంతో ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: కన్నీళ్లు పెట్టుకున్న విష్ణుప్రియ.. ఏమైందంటే?
బిగ్‌బాస్ 8లో రోజులు మారుతున్నకొద్దీ హౌస్మేట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్ సందర్భంగా రేషన్ కోసం మూడు గేమ్స్ పెట్టారు. సంచాలక్స్ వ్యవహరించిన మణికంఠపై ప్రేరణ, సోనియాపై యష్మిపై తెగ అరిచేశారు. ఇదలా ఉండగానే ఇప్పుడు మరో కొత్త రచ్చ మొదలైంది. ఫుడ్ విషయంల ప్రేరణ ప్రవర్తన వల్ల విష్ణుప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. తాజా ప్రోమోలో ఇదే తంతు.(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?)16 రోజులు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ 8 నుంచి బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం ఇప్పటికే నామినేషన్స్ పూర్తి కాగా 8 మంది లిస్టులో ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియట్లేదు. మరోవైపు ప్రేరణ తనకు ఫుడ్ ప్లేట్లో వడ్డించకుండా, విసిరేస్తుందని విష్ణుప్రియ బాధపడింది. మిగతా వాళ్లు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కన్నీళ్లు పెట్టుకుంది.ఈ గొడవ మధ్యలో దూరిన మణికంఠ.. ప్రేరణకి యాటిట్యూడ్ తగ్గించుకోమని ఏదో చెప్పబోయాడు. కానీ ఏమైనా చేసుకో పో అని ప్రేరణ అనడాన్ని ప్రోమోలో చూపించారు. అంటే బుధవారం ఎపిసోడ్లో ఈ గొడవని ఎక్కువ హైలైట్ చేసేలా ఉన్నారు. ఈ వారం గేమ్స్‌తో పాటే ఏడుపులు, అరుపులు ఎక్కువగానే ఉన్నట్లు లేటెస్ట్ ప్రోమోలు చూస్తుంటే అర్థమవుతోంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?) -
Bigg Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం
బిగ్‌బాస్ 8 హౌస్ మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరిగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ కాగా మిగిలిన ఇంటి సభ్యులు కాస్త గట్టిగానే గొడవలు పడుతున్నారు. ఎవరికి వాళ్లే హైలైట్ అయ్యే పనిలో ఉన్నారు. ఇదంతా పక్కనబెడితే హౌసులో ఉన్న ప్రేరణ ఇంట్లో విషాదం. ఈమె భర్త వాళ్ల అమ్మమ్మ చనిపోయిందట. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్)గత వారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన శేఖర్ భాషాకు అంతకు రెండు రోజుల క్రితమే కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని శనివారం ఎపోసిడ్‌లో నాగార్జున చెప్పాడు. ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి తనని బయటకొచ్చేస్తానని కెమెరాలకి చెప్పాడు. అవకాశముంటే తనని ఎలిమినేట్ అయ్యేలా చూడమని మిగిలిన హౌస్‌మేట్స్‌తోనూ అన్నాడు. అయితే ఈ ఫుటేజీని నిర్వహకులు ఎపిసోడ్లో చూపించలేదు. బయటకొచ్చిన తర్వాత శేఖర్ భాషా ఇదంతా చెప్పాడు.ఇక ప్రేరణ విషయానికొస్తే.. కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. పేరుకే కన్నడ అమ్మాయి గానీ తెలుగు సీరియల్స్ చేస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం టాప్-3లో కొనసాగుతోంది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయం మంగళవారం ఎపిసోడ్లో ఈమెకు చెప్పే అవకాశముంది. ఒకవేళ చెబితే ఈమె ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. అలానే ఇంట్లో బాధతో గేమ్‌పై దృష్టి పెడుతుందా లేదంటే హౌస్ నుంచి బయటకు పంపే ప్లాన్ ఏమైనా చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ సొహెల్ ఇంట్లో విషాదం.. ఏమైంది?) -
విష్ణుప్రియ స్వార్థాన్ని బయటపెట్టిన ప్రేరణ.. యష్మి మైండ్‌లో విషం!
శేఖర్ బాషా ఎలిమినేషన్‌తో హౌస్‌లో పన్నెండుమంది మిగిలారు. వీరిలో మళ్లీ ఒకర్ని పంపించడానికి అవసరమైన నామినేషన్ నేడు వాడివేడిగా జరిగింది. ఎప్పుడూ ఎదుటివాళ్లమీద నోరు పారేసుకునే సోనియాకు యష్మి చుక్కలు చూపించింది. అటు మణికంఠ మీద కూడా బాగానే ఫైర్ అయింది. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఇంట్లో ఉండి వ్యర్థంఇంట్లో ఉండి వేస్ట్ అనుకునేవాళ్లపై చెత్త గుమ్మరించి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా సీత.. మీ టీమ్ సభ్యుల ప్రవర్తన లేదంటూ యష్మిని, పక్కవాళ్లను తొక్కేసి గెలవాలనుకోవడం నచ్చలేదని పృథ్వీపై చెత్త గుమ్మరించింది. విష్ణుప్రియ వంతురాగా.. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, అలాగే నేను పిలుస్తుంటే కూడా పలకట్లేదని ప్రేరణను నామినేట్ చేసింది. మీ టీమ్‌సభ్యులు తొండాట ఆడారని, చీఫ్‌గా నువ్వు దాన్ని ఆపలేదంటూ యష్మిని నామినేట్ చేసింది.ప్రతిదాంట్లో జోక్యం అవసరమా?నాగమణికంఠ మాట్లాడుతూ.. ప్రతిదాంట్లో దూరడం నచ్చడం లేదదని యష్మిని నామినేట్ చేశాడు. అందుకు యష్మి.. అప్పుడు చీఫ్‌గా ఉన్నాను కాబట్టే ప్రతి విషయంలోనూ కలగజేసుకున్నానంది. నువ్వు ఫ్రెండ్ అంటూ డ్రామాలు చేశావు, ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావు, నువ్వు ఫేక్ అని అరిచేసింది. ఫ్రెండ్ అయినా సరే నాకు ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్తానన్నాడు మణికంఠ. పృథ్వీలో క్షణికావేశం నచ్చడం లేదని అతడిపై మణి చెత్త గుమ్మరించాడు. అయినా సరే తన కోపాన్ని మార్చుకునేదే లేదన్నాడు పృథ్వీ.విష్ణుప్రియ స్వార్థబుద్ధిఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయని సీతను ప్రేరణ నామినేట్ చేసింది. ఎమోషన్స్ లేకుండా బండరాయిలా ఉండాలా? అని సీత సెటైర్ వేయగా నీకసలు కామన్సెన్స్ లేదంటూ ఏదేదో అరిచింది. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ.. ఉన్నవే ఐదు గుడ్లు అయితే ఎవరి గురించి ఆలోచించకుండా అందులో రెండు గుడ్లు ఒక్కదానివే తినేశావంది. ఈ క్రమంలో బ్రెయిన్లెస్ పీపుల్ అని విష్ణు, యూజ్లెస్ పీపుల్ అని ప్రేరణ ఒకరినొకరు తిట్టుకున్నారు.నువ్వసలు కాంపిటీషనే కాదుఆదిత్య వంతురాగా.. ఎవరితో కలవనంత మాత్రాన నాలో నాయకత్వ లక్షణాలు లేవనడం బాధేసిందని విష్ణుప్రియను నామినేట్ చేశాడు. నీకు ఎంతో సపోర్ట్ చేస్తే విక్టిమ్ కార్డ్ వాడుతున్నావని మణికంఠను నామినేట్ చేశాడు. నైనిక మాట్లాడుతూ.. నాకసలు కాంపిటీషనే అనిపించడం లేదని సోనియాను, సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. యష్మి వంతురాగా.. ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసి నా హార్ట్ బ్రేక్ చేశావు కాబట్టి ఈ హౌస్‌కే నువ్వు డేంజరస్‌గా కనిపిస్తున్నావు అంటూ మణికంఠపై చెత్త వేసింది. చిన్నపిల్లల్లా వెక్కిరింతలేంటో!ఇందుకు మణికంఠ స్పందిస్తూ.. ఫ్రెండ్షిప్ను, గేమ్‌ను తాను మిక్స్ చేయను అని క్లారిటీ ఇచ్చాడు. తర్వాత యష్మి.. పనులు సరిగా చేయడం లేదంటూ నైనికను నామినేట్ చేసింది. నబీల్ వంతురాగా.. ఒక గేమ్‌లో సంచాలకురాలు ప్రేరణను మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించావంటూ యష్మిపై చెత్త గుమ్మరించాడు. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, నీ వల్ల నేను రూ.1 లక్ష గెలిచే ఛాన్స్ కోల్పోయానని ప్రేరణను నామినేట్ చేశాడు.నీ మైండ్‌లో విషం.. ఈ క్రమంలో ప్రేరణ, నబీల్ ఒకరినొకరు వెక్కిరించుకుంటూ వాదించుకున్నారు. తర్వాత పృథ్వీ.. సీత, నైనికలను నామినేట్ చేశాడు. సోనియా వంతురాగా.. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్, లీడర్‌గా నీకు మంచి లక్షణాలు లేవంటూ నైనికను నామినేట్ చేసింది. తర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. నీ మైండ్‌ను పాజిటివ్ వైపు తీసుకెళ్తే బాగుంటుంది, లేదంటే అది విషంగా మారుతుందని, అది ఎవరికీ మంచిది కాదని పేర్కొంది. ఏడ్చేసిన యష్మిఆమె మాటలతో షాకైన యష్మి.. నువ్వు నిఖిల్, పృథ్వీ, అభయ్ మీద చూపించిన ఇంట్రస్ట్ టీమ్‌పై చూపించలేదు అని ఉన్నమాట అనేసింది. ఎప్పుడూ సంచాలకురాలిగా ఉంటానన్నావే తప్ప ఎక్కడా గేమ్ ఆడేందుకు ముందుకు రాలేదు అంటూ ఇచ్చిపడేసింది. ఇంత మాట్లాడిన యష్మి.. సోనియా అన్న సూటిపోటి మాటలకు హర్టయి ఏడ్చేసింది. దీంతో సోనియా వెళ్లి తనను ఓదార్చడం గమనార్హం. నామినేషన్స్‌లో అభయ్చివర్లో నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్‌లలో ఒకరికే నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు బిగ్‌బాస్. దీంతో అభయ్.. తనకు సేవ్ అవుతానన్న నమ్మకం ఉందంటూ నామినేషన్స్‌లోకి వచ్చేందుకు అంగీకరించాడు. అలా ఈ వారం ప్రేరణ, పృథ్వి, మణికంఠ, విష్ణుప్రియ, సీత, నైనిక, యష్మి, అభయ్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.చదవండి: జరిగింది చూపించలేదు.. శేఖర్ బాషా ఎలిమినేషన్ వెనక అసలు రహస్యం -
సోనియాని ఏకిపారేసిన యష్మి.. నామినేషన్లో ఎవరున్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. అప్పుడే అందులో ఇద్దర్ని బయటకు పంపించేశారు. ఒకరేమో చిచ్చుబుడ్డిలా ఫైర్ అయ్యే బేబక్క అయితే మరొకరు నవ్వులు పంచే ఎంటర్టైనర్ బాషా. ఈ ఇద్దరూ వెళ్లిపోవడంతో హౌస్‌లో 12 మంది మిగిలారు.త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుఆటలో తప్ప మాటలో మాత్రమే పౌరుషం చూపించే కంటెస్టెంట్లు హౌస్‌లో చాలామందే ఉన్నారు. ఇలాగైతే షోను నెట్టుకురావడం కష్టమేనని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేస్తోంది. మరోవైపు హౌస్‌లో యథాతథంగా నామినేషన్స్ జరిగాయి. ఇందుకు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలైంది.గాలి తీసేసిన నైనికఇందులో పృథ్వీ, సోనియా.. నైనికపై చెత్త వేసి నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నైనిక.. నాకు మీరిప్పుడు కాంపిటీషనే అనిపించట్లేదని సోనియా గాలి తీసేసింది. అటు యష్మి కూడా.. నిఖిల్, అభయ్, పథ్వీ మీద చూపించిన ఇంట్రస్ట్ క్లాన్లో చూపించలేదు అని సోనియాను ఏకిపారేసింది.ఫుల్ టార్గెట్ నువ్వేతనకైతే మణికంఠ డేంజర్‌గా అనిపిస్తున్నాడని, హౌస్‌లో ఉన్నన్ని రోజులు అతడినే నామినేట్ చేస్తానంది యష్మి. విష్ణుప్రియ, ప్రేరణ మధ్య కూడా బాగానే ఫైట్ నడిచినట్లుంది. ఒకరిపై మరొకరు చెత్త గుమ్మరించి నామినేట్ చేసుకుంటూ బ్రెయిన్లెస్ పీపుల్, యూజ్లెస్ పీపుల్ అని తిట్టుకున్నారు.నామినేషన్లో ఎవరున్నారంటే?చివర్లో నబీల్.. అరుస్తే గెలుస్తామంటే నేను అందరికంటే ఎక్కువ అరవగలను అని ప్రేరణకు కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి ఈ వారం యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, నైనిక, నాగమణికంఠతో పాటు చీఫ్ అభయ్ నామినేషన్లో ఉన్నారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అర్ధరాత్రి బిగ్‌బాస్ వార్నింగ్.. సోనియా కాళ్లు మొక్కిన విష్ణుప్రియ
నేను మరీ అంత చెడ్డోడిని కాదంటూనే తన సైకోయిజాన్ని చూపిస్తున్నాడు బిగ్‌బాస్. కెరటం టీమ్(నిఖిల్, మణికంఠ) ఆకలేస్తుందని అర్ధరాత్రి దొంగల్లా దోసెలు తిన్నందుకు అందరినీ నిద్రలేపి మరీ క్లాసు పీకాడు. ఇంకోసారి ఇలా ఫుడ్ తింటే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు లూజర్ అని సోనియాతో మాటలు పడ్డ నిఖిల్ తన సత్తా చూపించాడు. ఓడిపోయేవాళ్లంటేనే గిట్టదన్న సోనియా ఒక్క గేమ్‌లో కూడా గెలవలేదు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ప్రైజ్‌మనీ పెంచుకునే ఛాన్స్ఈ సీజన్లో అంతులేనంత డబ్బు ప్రైజ్‌మనీగా సంపాదించుకునే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. తాను ఇచ్చే ఛాలెంజ్‌లలో మూడు టీమ్స్ పాల్గొని డబ్బు సంపాదించుకోవాలన్నాడు. ఏ టీమ్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే అది ప్రైజ్‌మనీలో యాడ్ అవుతుందన్నాడు. మొదటి ఛాలెంజ్‌లో మణి, విష్ణుప్రియ, సోనియాను స్విమ్మింగ్ పూల్‌లో దూకాలన్నాడు. సోనియా మధ్యలోనే కిందపడిపోగా మణికంఠను పృథ్వీ ముందుకు వెళ్లనీయకుండా గట్టిగా పట్టేసుకోవడంతో అతడు వెనకబడిపోయాడు. విష్ణు మొదటగా దూకేసి తన అంతులేని వీరుల టీమ్ ఖాతాలో రూ.25 వేలు పడేలా చేసింది.ఎగిసిపడ్డ కెరటంబిగ్బాస్.. రెండో ఛాలెంజ్ విలువను రూ.50 వేలుగా ప్రకటించాడు. ఈ కలర్ బాల్స్ గేమ్‌లో పృథ్వీ, నబీల్, నిఖిల్ హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ గెలవడంతో కెరటం టీమ్ ఖాతాలో అర లక్ష పడింది. మూడో ఛాలెంజ్ విలువను రూ.70 వేలుగా ప్రకటించాడు. ఈ స్పెల్లింగ్ గేమ్‌లో యష్మి, మణికంఠ, నైనిక పాల్గొన్నారు. ఇందులో ఎక్కువ పదాలు కరెక్ట్‌గా రాసిన మణికంఠ కెరటం టీమ్ ఖాతాలో రూ.70 వేలు పడేలా చేశాడు.ఆకలితో అలమటించిన నిఖిల్రేషన్ లేకపోవడంతో కేవలం రాగిజావతో సరిపెట్టుకుంటున్న మణి, నిఖిల్ అర్ధరాత్రి ఆకలేసింది. దీంతో దొంగచాటుగా పక్క టీమ్ చేసుకున్న దోశలు ఆరగించారు. ఇది చూసిన బిగ్‌బాస్ హౌస్మేట్స్ అందర్నీ నిద్రలో నుంచి లేపి మరీ వార్నింగ్ ఇచ్చాడు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గుర్తుచేశాడు. ఇంట్లో ఫుడ్ దొంగతనం మొదలుపెట్టిన యష్మికి.. తమ పాలప్యాకెట్ అవతలివారు ఎత్తుకుపోయేసరికి ఉక్రోశం పట్టలేకపోయింది. విష్ణుప్రియతో గొడవకు దిగింది. దబాయించిన యష్మిమా చికెన్ దొంగిలించలేదా? అని విష్ణు ఎదురుతిరిగితే.. నీ దగ్గర సాక్ష్యం ఉందా? అని దబాయించింది. ఎందుకు అరుస్తున్నావంటే నేనిలాగే అరుస్తానని యష్మి తెగేసి చెప్పింది. నాలుగో ఛాలెంజ్ విలువ ఏకంగా రూ.1,50,000గా ప్రకటించాడు. ఈ గేమ్‌లో అభయ్, ఆదిత్య, నిఖిల్ పోటీపడ్డారు. ఆదిత్య ఓడిపోగా.. అభయ్(అఖండ టీమ్), నిఖిల్(కెరటం టీమ్) గెలిచి చెరో రూ.75 వేలు గెలుచుకున్నారు. ఐదో ఛాలెంజ్ విలువను రూ.50 వేలుగా ప్రకటించాడు. నిఖిల్, నబీల్, పృథ్వీ వ్యాక్స్ చేయించుకోవాలన్నాడు. కాళ్లు మొక్కిన విష్ణుప్రియఅయితే ఆ నొప్పి భరించలేక తన వల్లకాదని పృథ్వీ మధ్యలోనే చేతులెత్తేశాడు. సోనియా.. నబీల్ (అంతులేని వీరులు టీమ్)ను విజేతగా ప్రకటించడంతో ఆనందం పట్టలేకపోయిన విష్ణుప్రియ ఏకంగా ఆమె కాళ్లకు నమస్కరించింది. ఆరో ఛాలెంజ్ విలువ బిగ్‌బాస్ రూ.1 లక్షగా ప్రకటించాడు. చివరి బజర్ వరకు కాళ్లకు సాక్స్ ఉండేలా చూసుకోవాలన్నాడు. ఈ గేమ్‌లో విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, నబీల్, అభయ్, పృథ్వీ పాల్గొన్నారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో సంచాలకురాలు ప్రేరణ అందరిమీద గరమైంది. ఈ తోసుకోవడాలు, కొట్టుకోవడాలు ఆపండని అరిచింది.బిగ్‌బాస్ నుంచే వెళ్లిపోతా..పాపం, తన మాటల్ని ఎవరూ లెక్క చేయలేదు. పృథ్వీ తర్వాత విష్ణుప్రియ అవుట్ అయింది. అయితే అభయ్ నెట్టడం వల్లే తాను కిందపడ్డానని విష్ణుప్రియ, అది నిజమైతే బిగ్‌బాస్ హౌస్ నుంచే వెళ్లిపోతానని అభయ్ వాదించాడు. కాసేపటికి విష్ణుప్రియను మళ్లీ ఆడించినా చివరికి అవుట్ అయింది. అనంతరం నబీల్ను కూడా ఎలిమినేట్ చేయడంతో అతడు గరమయ్యాడు. చివర్లో నిఖిల్, అభయ్కు టై అయినట్లు ప్రకటించడంతో ఇరు టీమ్స్‌కు చెరి రూ.50 వేలు లభించాయి. ఫైనల్‌గా రూ.2,45,000తో కెరటం టీమ్ లీడ్‌లో ఉంది.బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈ వారం నామినేషన్స్‌లో ఎనిమిదిమంది.. ఎవరెవరంటే?
బిగ్‌బాస్ షో రోజురోజుకీ రంజుగా మారుతోంది. ఫస్ట్ వీక్‌లోనే కంటెస్టెంట్లు తమ సత్తా ఏంటో చూపించారు. ఎవరికి ఏయే కళల్లో ప్రావీణ్యం ఉందో బయటపెట్టారు. ఒక్క టాస్కుల్లోనే ఇంకా అందరి బలం బయటపడలేదు. ఫస్ట్ వీక్ బేబక్క ఎలిమినేషన్‌తో హౌస్ కాస్త నిశ్శబ్ధంగా మారింది. ఈ సైలైన్స్ నాకు నచ్చదన్నట్లుగా బిగ్‌బాస్ వెంటనే రెండోవారం నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాడు. ఆ హక్కు లేదుఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నామన్నట్లుగా కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఓ ప్రోమో విడుదలైంది. బయట ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్షిప్ను మీరు ఇంట్లో ఫాలో అవండి, కానీ పక్కవాళ్లు కూడా ఫాలో అవాలని చెప్పే హక్కు నీకు లేదంటూ ప్రేరణను నామినేట్ చేసింది సీత.మెచ్యూరిటీ రావాలి!ఈ సమయంలో వీరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. సోనియా.. నీకు పర్సనాలిటీ ప్రాబ్లమ్ ఉంది, నీకింకా మెచ్యూరిటీ రావాలని సూక్తులు చెప్పడంతో సీతకు మండిపోయింది. నాకెంత క్లారిటీ ఉందో నాకు తెలుసు, ముందు నువ్వు గేమ్‌ను అర్థం చేసుకుని నాకు వివరించు, అసలు నీకు క్లారిటీ లేదు.. అని ఇచ్చిపడేసింది. నామినేషన్లో..దీంతో సోనియా.. ఎక్కువ మాట్లాడొద్దు, పిచ్చి మాటలు మాట్లాడకు అని సీరియస్ అయింది. మొత్తానికి ఈ వారం నిఖిల్, నైనిక, సీత, మణికంఠ, శేఖర్ బాషా, ఆదిత్య, పృథ్వీ, విష్ణుప్రియ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
నిఖిల్‌కు హ్యాండిచ్చిన ఆ ఇద్దరు.. విష్ణుప్రియకు ఘోర అవమానం!
నామినేషన్స్‌లో ఉండటంతో నాగమణికంఠ సైలెంట్ అయిపోయాడు. బోలాగా మాట్లాడే విష్ణుప్రియను టీమ్‌లోకి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.. యష్మి తనను నమ్మినందుకు అభయ్.. ఆమెను గెలిపించాడు.. ఇలాంటి ఎన్నో సంగతులను నేటి (సెప్టెంబర్ 5)ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఫేస్‌వాష్‌తో బ్రషింగ్!నామినేషన్స్ రోజు మొదలుపెట్టిన ఏడుపును మణికంఠ ఇంకా ఆపలేదు. బహుశా ఎలిమినేషన్ భయం పట్టుకుందో, ఏమో కానీ ఓరకమైన శూన్యంలోకి వెళ్లిపోయాడు. తన జీవితం ఏమవుతుందో తెలియడం లేదంటూ మళ్లీ కంటతడి పెట్టుకున్నాడు. మరోవైపు బాత్రూమ్లో పృథ్వీ తనకు తెలియకుండా చేసిన పనితో అందరినీ నవ్వించాడు. టూత్‌పేస్ట్ అనుకుని అతడు తన బ్రష్‌కు ఫేస్‌వాష్ క్రీమ్ పెట్టుకోవడంతో అక్కడున్న అందరూ ఫక్కుమని నవ్వారు.చీఫ్‌లకు టీమ్స్ఇక నైనిక ప్రేమ వ్యవహారాన్ని నిఖిల్ బయటకు లాగాలని ప్రయత్నించాడు. కానీ దానికింకా టైముందన్నట్లు ఒక్క ముక్క కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. పైగా అబ్బాయి పేర్లు గెస్ చేయనా అంటుంటే కూడా వద్దంటూ తెగ సిగ్గుపడిపోయింది. ఇంతలో బిగ్‌బాస్ ముగ్గురు చీఫ్‌లకు ఓ టాస్క్ ఇచ్చాడు. రాజుకు సైన్యం ఉన్నట్లే చీఫ్‌లకు క్లాన్ ఉండాలని, అది వారే నిర్మించుకోవాలని చెప్పాడు. ఆ ముగ్గురూ చెరొకరిని..చీఫ్ అవడానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయిన బాషా, బేబక్క, అఫ్రిదిలకు మాత్రం ఏ చీఫ్ కింద చేరాలనేది సొంతంగా నిర్ణయించుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో బాషా.. యష్మిని, బేబక్క.. నిఖిల్‌ను, అఫ్రిది.. నైనికను సెలక్ట్ చేసుకున్నారు. మిగతా ఇంటిసభ్యుల్లో ఎవరు ఎవరికి కావాలనేది చీఫ్‌లు నిర్ణయించుకోవాలన్నాడు. ప్రేరణ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ కోరారు. అయితే ప్రేరణ.. యష్మి టీమ్‌లోకి వెళ్లడానికే మొగ్గు చూపుంది. నిఖిల్ టీమ్‌లో మణికంఠఅలాగే అభయ్ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే యష్మి టీమ్‌కు బలం కావాలని కోరిందని, దాన్ని నెరవేర్చేందుకు ఆమె టీమ్‌లోకి అడుగుపెడుతున్నానన్నాడు అభయ్. నాగమణికంఠకు తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వాలనుకుంటున్నానంటూ అతడిని తన టీమ్‌లో చేర్చుకున్నాడు నిఖిల్. పృథ్వీ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే పృథ్వీ యష్మిని ఎంపిక చేసుకోవడం గమనార్హం.విష్ణుప్రియ వంతు వచ్చేసరికి..చీఫ్ నైనిక.. తన నిర్ణయాలు బాగుంటాయంటూ ఆదిత్యను, బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ సీతను తన టీమ్‌లో చేర్చుకుంది. విష్ణుప్రియ పేరెత్తేసరికి ఎవరూ తనను తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కొన్ని క్షణాల తర్వాత నైనిక.. విష్ణుప్రియను తీసుకుంది. యష్మి, నైనిక టీమ్‌లో నలుగురు చొప్పున ఉండటంతో సోనియాకు ఇంకో ఆప్షన్ లేక నిఖిల్ టీమ్‌లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె.. నిఖిల్లో నాయకత్వ లక్షణాలున్నాయి, ఈ ఆడపులి నీ టీమ్‌లో ఉంటే విజయం తథ్యమన్నట్లుగా తనకు తానే డప్పు కొట్టుకుంది.నిఖిల్ ఎమోషనల్కాసేపటి తర్వాత తననెందుకు సెలక్ట్ చేసుకోలేదని విష్ణుప్రియ వెళ్లి నిలదీయడంతో నిఖిల్ ఎమోషనలయ్యాడు. తన ఉద్దేశం అది కాదంటూ కంటతడి పెట్టుకున్నాడు. మణికంఠను నేను తీసుకోకపోతే ఇంకెవ్వరూ తీసుకోరు, అందుకే అతడిని చేర్చుకున్నాను.. నిన్నెవరైనా తీసుకుంటారనే ఊరుకున్నట్లు పేర్కొన్నాడు.వింత అలవాటుపృథ్వీ ఊరికనే కప్పు కూర తినే అలవాటు చూసి బేబక్క షాక్ అయింది. అలాంటి పద్ధతులు ఇక్కడ కష్టమని పరోక్షంగా హెచ్చరించింది. అటు ప్రేరణ.. తన టవల్‌ను ఆదిత్య చూసుకోకుండా వాడేశాడంటూ తెగ ఫ్రస్టేట్ అయింది. చూసుకోలేదు, తప్పయిపోయిందంటూ ఆదిత్య పదిసార్లు క్షమాపణ చెప్పినా ఆమె మాత్రం అదే పాఠం అప్పజెబుతూనే ఉంది. దీంతో ఈ గోడు వినలేక బిగ్‌బాస్ తనకు కొత్త టవల్ పంపించాడు. బాత్రూమ్ను క్లీన్‌గా ఉంచడం లేదంటూ యష్మి, ప్రేరణ, సోనియా కాసేపు వాదులాడుకున్నారు.మాట మీద నిలబడ్డాడుగేమ్ విషయానికి వస్తే.. యష్మి, నైనిక టీమ్స్‌లో నలుగురు చొప్పున ఉండటంతో ఈ రెండు టీమ్‌లకు బాల్ పట్టు- గోల్ కొట్టు అనే టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో నైనిక టీమ్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. యష్మి టీమ్‌లో అభయ్.. ఒక గోల్ చేయడంతో వీరి టీమ్ గెలుపొందింది. గెలిచిన యష్మి టీమ్.. ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్న నిఖిల్ టీమ్‌లో నుంచి ఒకరిని లాక్కునే ఛాన్స్ ఉంది. అయితే వాళ్లు సోనియాను లాక్కున్నారని తెలుస్తోంది. ఇలాగైతే నిఖిల్ టీమ్‌లో ఇద్దరు మాత్రమే మిగులుతారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నా భార్య నాక్కావాలి, అత్తామామ దగ్గర గౌరవం కావాలి: మణి
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో మొదటివారం నామినేషన్ ప్రక్రియలోనే కన్నీళ్ల వరద పారింది. తాను ఏడుస్తూ పక్కవాళ్లను కూడా ఏడిపించాడు మణికంఠ. అసలేం జరిగిందో, నేటి(సెప్టెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి..పని చేయట్లేదంటూ..ఆదిత్య ఓం.. వాలంటీర్‌గా పనులు చేయడం లేదని శేఖర్ బాషాను, తక్కువ పని చేస్తున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ ఇద్దరిలో చీఫ్ యష్మి.. శేఖర్ బాషా నామినేషన్‌కు మద్దతిచ్చి పృథ్వీని సేవ్ చేసింది. సీత.. బేబక్క, ప్రేరణను నామినేట్ చేసింది. వీరిలో బేబక్క నామినేషన్‌ను చీఫ్ నైనిక ఫైనల్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. తర్వాత విష్ణుప్రియ.. బాషా, సోనియాను నామినేట్ చేయగా చీఫ్ నిఖిల్ బాషా నామినేషన్నే ఫైనలైజ్ చేసి సోనియాను సేవ్ చేశాడు. అన్‌ఫిట్ అయితే పోతా..అనంతరం అభయ్ నవీన్.. నాగమణికంఠను నామినేట్ చేశాడు. ఎవ్వరి ఫ్లాష్‌బ్యాక్ ఎవడికీ అవసరం లేదు. నీకు ఎన్ని సమస్యలున్నా నాకనవసరం. గేమ్‌లో నాకేదైనా నచ్చలేదంటే చెప్పే హక్కు నాకుంది. ఈ గేమ్‌లో ఏం జరిగినా తీసుకోవడానికి రెడీ అనుకునేవాళ్లే హౌస్‌లో ఉండాలి. నీలో ఆ లక్షణం లేదని తేల్చాడు. దీంతో నాగమణికంఠ.. నేను అన్‌ఫిట్ అయితే ఈ వారమే వెళ్లిపోతానని ఫ్రస్టేట్ అయ్యాడు. అనంతరం అభయ్.. బేబక్కను నామినేట్ చేశాడు. పుండు మీద కారం చల్లినట్లు చీఫ్ యష్మి.. నాగమణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది.మళ్లీ బాధలు చెప్పుకున్న మణితర్వాత ప్రేరణ.. నాగమణికంఠ పేరెత్తడంతో అందరూ నాపై ఇలా పడ్డారేంటని బోరుమని ఏడ్చేశాడు. ఏడో తరగతి నుంచి నానాకష్టాలు పడ్డాను. కన్నతండ్రిని పోగొట్టుకున్నా, సవతి తండ్రి చేతిలో అవమానాలు ఎదుర్కొన్నా. అమ్మ చనిపోతే అందరి దగ్గర డబ్బు అడుక్కుని అంత్యక్రియలు చేశాను. నాకు అందరి మీదా నమ్మకం పోయింది. నా కూతురు దూరమైన సమయంలో, చచ్చిపోదామనుకుంటున్న క్షణంలో నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఇది నాకు చాలా అవసరం. అది మీకెవరికీ అర్థం కావడం లేదు. నేనెక్కడా విక్టిమ్ కార్డ్ వాడటం లేదు.నా జీవితం దగ్గరుండి చూశారా? నా కర్మ కాలి మొదటి రోజు నిజంగా ఎలిమినేట్ చేస్తున్నారన్న బాధలో మీకు నా గురించి తెలీదు, నేను వెళ్లిపోతున్నానంటూ కోప్పడ్డాను. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని పదేపదే నా మీద పడుతున్నారు. మీరేమైనా నా జీవితం చూశారా? అని అందరినీ నిలదీస్తూనే.. ఎమోషనల్‌గా ఉన్నప్పుడు మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు. మిమ్మల్ని ఏమైనా అనుంటే సారీ.. అని అపరిచితుడిలో రాములా మారిపోయాడు.ఏడిపించేసిన మణినేను గేమ్ గెలవాలనుకున్నాను. కనీసం ఐదు వారాలైనా ఉండాలనుకున్నానంటూ ఏడుస్తూనే మాట్లాడాడు. నాగమణికంఠ పడ్డ బాధలు విన్నాక అతడి కంటే కూడా యష్మినే ఎక్కువ గుక్కపెట్టి ఏడ్చింది. తర్వాత ప్రేరణ.. సోనియాను నామినేట్ చేసింది. ఇద్దరికి చెప్పిన కారణాలు విన్నాక చీఫ్.. నాగమణికంఠను సేవ్ చేసి సోనియాను నామినేట్ చేశాడు.అందుకే తిరిగావా?నాగమణికంఠ.. నేను క్యూట్‌గా ఉన్నాను, నాలో ఫెమినిజం ఉందని విష్ణుప్రియ చెప్పిన మాట నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు. పైగా విష్ఱుప్రియ ఏమైనా పదాలు జారుతుందేమోనని మూడురోజులుగా తనతో తిరుగుతున్నానని చెప్పాడు. అంటే ఇన్నిరోజులు ఫ్రెండ్‌గా ఉండలేదా? నన్ను చెక్ చేస్తున్నావా? అని విష్ణుప్రియ ఎమోషనలైంది.సింపతీ కార్డ్అనంతరం బాషాను నామినేట్ చేస్తూ తినే పండ్లతో ఆడటం నచ్చలేదన్నాడు. అలాగైతే నువ్వు నిద్రపోతే కుక్క మొరిగిందిగా, అది తప్పు కాదా అని బాషా కౌంటరిచ్చాడు. ప్రతి ఒక్కరికీ ఫ్లాష్‌బ్యాక్ ఉంది, అందరూ అది చెప్పుకుని ఏడవట్లేదు.. నువ్వు ఏదో సింపతీ, రాజకీయం క్రియేట్ చేస్తున్నావని ఇచ్చిపడేశాడు. ఈ వాదనలు విన్న చీఫ్ యష్మి.. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ బాషాను సేవ్ చేశాడు.నామినేషన్లో ఎవరంటే?తర్వాత పృథ్వీ.. నీకు సీరియస్‌నెస్ లేదంటూ బేబక్కను, సింపతీ కార్డ్ వాడుతున్నావు, రెండు నాలుకలు ఉన్నాయంటూ నాగమణికంఠను నామినేట్ చేశాడు. మొత్తంగా మొదటివారం బేబక్క, సోనియా, శేఖర్ బాషా, విష్ణుప్రియ, పృథ్వీ, నాగమణికంఠలు నామినేట్ అయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కూడా మణికంఠ ఏడుపు ఆపలేదు. నా చివరి యుద్ధండ్యాం గేట్లు ఎత్తినట్లు ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు. నాకు ఏ దిక్కూ లేదు, నా దగ్గర ఒక్క రూపాయి లేదు, రేపు నేను బయటకు వెళ్లాక నన్ను నెగెటివ్ అనుకుంటారు. ఇది నా చివరి యుద్ధం. గేమ్ ఎలా ఆడాలో అర్థం కావట్లేదని కన్నీళ్లు పెట్టుకుంటూనే విగ్ నేలకేసి కొట్టాడు. దీంతో నిఖిల్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు.నా భార్య నాక్కావాలిఅతడు కన్నీళ్ల టాప్‌ను కట్టేయకపోవడంతో బిగ్‌బాస్ నను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు. అక్కడ.. నా భార్య నాక్కావాలి, అత్తామామ దగ్గర నాకు గౌరవం కావాలి. నా సవతి తండ్రి నాక్కావాలి. నా పాప నాకు కావాలి. నాకు మనుషులు కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను.. నాపై నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నా మైండ్ సెట్ మార్చుకోవాలనుకున్నాను. కానీ నా వల్ల కావట్లేదంటూ మళ్లీ విలపించాడు. దీంతో బిగ్‌బాస్.. నిన్ను నువ్వు నమ్ము, ధైర్యాన్ని కోల్పోకు అని నాలుగు మంచి మాటలు చెప్పి పంపించేశాడు.మరిన్నిబిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8లోకి హీరోయిన్ రష్మిక బెస్ట్ ఫ్రెండ్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
Bigg Boss 8: నాలుగో స్థానంలో ప్రేరణ ఎలిమినేట్
కృష్ణ ముకుంద మురారీ సీరియల్‌తో నటి ప్రేరణ కంభం ఎక్కువ పాపులర్ అయింది. ఇందులో అమాయకంగా కనిపించే ప్రేరణ క్యూట్ యాక్టింగ్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. ఈ ధారావాహికలో కృష్ణగా ప్రేరణ, ముకుందగా యష్మి గౌడ నటించారు. సీరియల్లో మురారి కోసం కొట్టుకున్నట్లే బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో వీరిద్దరు టైటిల్ కోసం పోటీపడటం ఖాయంగా కనిపిస్తోంది. బయట అన్నిరకాల స్పోర్ట్స్ ఆడతానంటున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్‌లో ఏం గేమ్ ఆడుతుందో చూడాలి. అలాగే తన గురించి తనకేం బాధ లేదని, కానీ, తనతో పోటీపడే కంటెస్టెంట్ల పరిస్థితి ఎలాగోనంటూ బాధపడుతోంది ప్రేరణ. రష్మిక మందన్నాకు ఈమె క్లోజ్ ఫ్రెండ్ కూడా! పెళ్లయి ఎనిమిది నెలలే అవుతున్న ఈ బ్యూటీ భర్తను వదిలేసి బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఈ చలాకీ బ్యూటీ ఈ సీజన్లో ఫైనల్స్‌లో అడుగుపెట్టిన ఏకైక మహిళగా నిలిచింది. అయితే నాలుగో స్థానంలో ఉండగానే ఎలిమినేట్ అయింది.