బిగ్‌బాస్ రియాలిటీ షో మొదలై ఎనిమిదేళ్లు కావస్తోంది. కానీ ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా టైటిల్ గెలవలేదు. ఎలాగైనా సరే ఈసారి ట్రోఫీ అందుకుని చరిత్ర తిరగరాయాలని ప్రేరణ బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లుగానే ఎంతో కష్టపడింది. అబ్బాయిలతోనూ ధీటుగా పోరాడింది. తను పాల్గొన్న ప్రతి టాస్కులోనూ విజృంభించి ఆడింది. లేడీ ఫైటర్ అని పేరు తెచ్చుకుంది.
టాప్ 3లో కూడా చోటు దక్కించుకోని ప్రేరణ
కానీ మైక్రో మేనేజ్‌మెంట్ వల్ల విమర్శలపాలైంది. అందరికీ ఓపికగా వంటచేసినప్పటికీ కిచెన్‌లో గొడవలు పడి నెగెటివిటీ మూటగట్టుకుంది. ప్రేరణ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే స్థాయి నుంచి ఈమె ఫైనల్‌కు అయినా వస్తుందా? అనే స్థాయికి పడిపోయింది. అందుకే టాప్3లో కూడా స్థానం దక్కించుకోలేదు.
విజేత ఎవరు?
ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ 8 గ్రాండ్ ఫినాలే షూటింగ్ సగం పూర్తయింది. మొదటగా ముక్కు అవినాష్‌ను ఎలిమినేట్ చేయగా నాలుగో స్థానంలో ప్రేరణను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. టాప్ 3లో నిఖిల్, నబీల్, గౌతమ్ కృష్ణ మిగిలారు. మూడో స్థానం నబీల్‌దే అన్న విషయం అందరికీ తెలుసు.. ఇక విన్నర్, రన్నర్ ఎవరనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment