
బిగ్‌బాస్ హౌస్‌లో ఏడోవారం నామినేషన్స్ జరిగాయి. అయితే కిల్లర్ గర్ల్స్ చేతికి నామినేషన్స్‌ను ఫైనల్ చేసే అధికారం ఇచ్చారు. మరి ఆ కిల్లర్ గర్ల్స్ ఎవరు? వీళ్లు ఎవర్ని నామినేట్ చేశారు? ఎవర్ని సేవ్ చేశారనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే!

ఆ ఇద్దరికీ స్పెషల్ డ్రెస్
గౌతమ్, తేజ, పృథ్వీ.. ఈ ముగ్గురిలో గౌతమ్ సూట్ కేసు మాత్రమే వెనక్కు వచ్చింది. దీంతో మిగతా ఇద్దరు బిగ్‌బాస్ ఇచ్చిన చిరిగిన బస్తా డ్రెస్ వేసుకున్నారు. ఆ వెంటనే నామినేషన్స్ మొదలయ్యాయి. బిగ్‌బాస్ ప్రేరణ, హరితేజను కిల్లర్ గర్ల్స్‌గా నియమించాడు. గుర్రం సౌండ్ వినిపించినప్పుడు ప్లాట్‌ఫామ్స్‌పై నిలబడే ఇద్దరు హౌస్‌మేట్స్ ఇంటిసభ్యులను నామినేట్ చేస్తారు. అందులో ఒకరి నామినేషన్‌ను అంగీకరించి, మరొకరి నామినేషన్ తిరస్కరించే హక్కు హ్యాట్ మొదట పట్టుకున్న కిల్లర్ గర్ల్‌కు ఉంటుంది.

అతిగా రియాక్టయిన అవినాష్
మొదటగా రోహిణి.. నీకు బాధేసినప్పుడు మైక్ విసిరేయడం నచ్చలేదని గౌతమ్‌ను నామినేట్ చేసింది. అందుకు గౌతమ్ స్పందిస్తూ.. అవినాష్ చేసిన కామెడీ తనకు బుల్లీయింగ్‌లా ఉందన్నాడు. దీంతో అవినాష్ మధ్యలో కలగజేసుకుంటూ కామెడీ తీసుకోకపోతే షోకి రావొద్దంటూ చొక్కా విప్పి మరీ ఫైర్ అయ్యాడు. ఇది కామెడీ షో కాదని గౌతమ్ అనడంతో.. అంతలోనే సారీ భయ్యా, తెలియక అనేశాను.. అంటూ అవినాష్ చేతులు జోడిస్తూ కాస్త అతిగా రియాక్టయ్యాడు. నిఖిల్.. తేజ యాక్టివ్‌గా లేడని నామినేట్ చేశాడు.

ఏడ్చేసిన గౌతమ్
హ్యాట్ అందుకున్న కిల్లర్ గర్ల్ ప్రేరణ.. రోహిణి చెప్పిన పాయింట్లకు ఏకీభవిస్తూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. అయిపోయినదాన్ని (ట్రోలింగ్ గుర్తు చేస్తున్నారంటూ..) మళ్లీ మళ్లీ తీసుకొస్తున్నారంటూ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు బుల్లీయింగ్ అనడం ఎంత పెద్ద తప్పు? అసలు ఆ పదానికి అర్థం తెలుసా? అని రోహిణి, అవినాష్ సీరియసయ్యారు. రెండో రౌండ్‌లో నిఖిల్, గంగవ్వ ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్నారు. నిఖిల్ మరోసారి తేజను నామినేట్ చేశాడు.

ప్రేరణపై పీకలదాకా కోపం..
గంగవ్వ.. నాతో మాట్లాడట్లేదు, హోటల్ టాస్క్‌లో పెద్దగా ఆడలేదు.. సిగరెట్ తాగుతూ కూర్చుంటావంటూ పృథ్వీని నామినేట్ చేసింది. ఇద్దరి పాయింట్లు విన్న ప్రేరణ.. పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో ప్రేరణపై పగ పెంచుకున్న పృథ్వీ.. ఆమె హ్యాట్ పట్టుకోనివ్వకుండా అడ్డుకున్నాడు. తను నామినేట్ అవ్వాల్సిందేనని బలంగా కోరుకున్నాడు. అతడికి సపోర్ట్‌గా నయని కూడా దిగింది. ప్రేరణ నామినేట్ అవడమే తనకూ కావాలంది.

నీ గ్రాఫ్ పడిపోయింది
పృథ్వీకి నిఖిల్ సర్ది చెప్పాలని చూశాడు కానీ వర్కవుట్ కాలేదు. నాకు అన్యాయం జరిగింది.. ఇల్లు మొత్తం అడ్డొచ్చినా నేను తను నామినేట్ అయ్యేలా చూస్తానన్నాడు. అది విని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. మూడో రౌండ్‌లో యష్మి.. హోటల్ టాస్క్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేదంటూ తేజ పేరు చెప్పింది. నాగమణికంఠ.. గ్రాఫ్ పడిపోయిందని, హోటల్ టాస్క్‌లో ఫన్ చేయలేదని నిఖిల్ పేరు చెప్పాడు. హ్యాట్ పట్టుకున్న హరితేజ.. నిఖిల్‌ను నామినేషన్స్‌లో వేసింది.

యష్మి ఎమోషనల్
నాలుగో రౌండ్‌లో అవినాష్.. టాస్కుల్లో వీక్ అనిపించాడంటూ మణికంఠ పేరు చెప్పాడు. గౌతమ్.. హోటల్ టాస్క్‌లో పెద్దగా ఆసక్తి చూపించలేదంటూ విష్ణుప్రియ పేరు చెప్పాడు. పృథ్వీ.. ప్రేరణను అడ్డుకోవడంతో మరోసారి హరితేజ హ్యాట్ పట్టుకుంది. ఈమె మణికంఠను నామినేట్ చేసింది. ఇక పృథ్వీ ప్రవర్తన చూసి బెంబేలెత్తిపోయిన యష్మి అది కరెక్ట్ కాదంటూ ఏడ్చేసింది. ఈ నామినేషన్స్ రేపటి ఎపిసోడ్‌లోనూ కొనసాగనున్నాయి.







Comments
Please login to add a commentAdd a comment