Bigg Boss 8 Telugu Review
-
బిగ్‌బాస్ 8: టాప్ 5 ఫైనలిస్టుల బ్యాక్‌గ్రౌండ్ ఇదే! (ఫోటోలు)
-
బిగ్‌బాస్ 8 హైలైట్స్: ఈ విషయాలు గమనించారా?
ఎన్నో ట్విస్టులు, టర్నులతో బిగ్‌బాస్ 8 మొదలైంది. అన్లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంటూ షో మొదలుపెట్టాడు హోస్ట్ నాగార్జున. రానురానూ ఫన్ తగ్గిపోవడంతో వైల్డ్‌కార్డ్స్‌ను రంగంలోకి దింపాడు. అప్పటినుంచి షోపై హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగానే కంటెస్టెంట్లు కూడా హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ విజేతగా నిలిచాడు. మరి 105 రోజుల జర్నీలో ఏమేం జరిగాయో హైటైల్స్లో చూసేద్దాం..⇒ సెప్టెంబర్ 1న బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం⇒ లాంచింగ్ రోజు హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు.. వీరిని జంటలుగా పంపించిన బిగ్‌బాస్⇒ ప్రైజ్‌మనీని జీరోగా ప్రకటించిన నాగార్జున.. హౌస్‌మేట్సే దాన్ని సంపాదించాలని వెల్లడి⇒ రెండో వారం శేఖర్ బాషాను పంపించేసిన హౌస్మేట్స్⇒ అక్టోబర్6న రీలోడ్ ఈవెంట్ ద్వారా 8 మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ⇒ ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ గత సీజన్స్‌లో వచ్చినవాళ్లే కావడం గమనార్హం⇒ పాతవారిని ఓజీగా, వైల్డ్‌కార్డ్స్‌ను రాయల్స్ క్లాన్‌గా విభజించిన బిగ్‌బాస్⇒ తొమ్మిదోవారంలో క్లాన్స్ తీసేసి అందర్నీ కలిపేసిన బిగ్‌బాస్⇒ ఈ సీజన్లో కెప్టెన్ పదవికి బదులుగా మెగా చీఫ్ పదవిని పెట్టారు⇒ రేషన్ కూడా కంటెస్టెంట్లే సంపాదించుకోవాలన్నారు, కిచెన్‌లో టైమర్ ఏర్పాటు చేశారు⇒ ఈ సీజన్లో జైలుకు వెళ్లిన ఏకైక కంటెస్టెంట్ మణికంఠ⇒ ఏడోవారంలో నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల బతికిపోయిన గౌతమ్⇒ పదోవారంలో గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్⇒ 12 వారం.. ఎలిమినేట్ అయినవారితో నామినేషన్స్⇒ ఎవిక్షన్ షీల్డ్ గెలిచిన నబీల్⇒ పదమూడోవారంలో ఎవిక్షన్ షీల్డ్‌ను అవినాష్‌కు వాడిన నబీల్.. ఫలితంగా తేజ ఎలిమినేట్⇒ ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్⇒ బీబీ పరివారం వర్సెస్ మా పరివారం ఛాలెంజ్‌లో అన్ని గేముల్లోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లదే గెలుపు⇒ ఈ సీజన్ చిట్టచివరి టాస్క్ గెలిచి ప్రైజ్‌మనీకి రూ.1 యాడ్ చేసిన గౌతమ్⇒ దీంతో టోటల్ ప్రైజ్‌మనీ రూ.55 లక్షలకు చేరింది.⇒ తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ⇒ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్⇒ బిగ్‌బాస్ 8 విన్నర్‌గా నిఖిల్, రన్నరప్‌గా గౌతమ్⇒ తర్వాతి మూడు స్థానాల్లో నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు.నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవకపోయినా, నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడకపోయినా గౌతమ్, అవినాష్ ఫైనల్స్‌లో ఉండేవారే కాదు. అప్పుడు వీళ్లకు బదులుగా వేరే ఇద్దరికి ఫైనల్స్‌లో చోటు లభించేది!చదవండి: ఫినాలేలో గౌతమ్‌పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..! -
ఫినాలేలో గౌతమ్‌పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..!
కష్టపడు.. ఫలితం ఆశించకు అంటుంటారు. కానీ బిగ్‌బాస్ షోలో ఫలితం ఆశించి కష్టపడ్డా కొన్నిసార్లు ప్రతిఫలం దక్కదు. ఈ సీజన్లో వైల్డ్ ఫైర్‌లా మారిన గౌతమ్ కృష్ణ గత సీజన్లోనూ పాల్గొన్నాడు. అప్పుడు కూడా గ్రూప్ గేమ్స్ జోలికి వెళ్లకుండా సోలో బాయ్‌లా ఆడాడు. అయితే కొన్నిసార్లు నువ్వెంత ప్రయత్నించావన్నదానికి బదులు ఎన్ని గెలిచావన్నదే చూస్తారు. ఈ విషయంలో గౌతమ్ వెనకబడిపోయాడు.బెడిసికొట్టిన అశ్వత్థామ బిరుదుకానీ శివాజీ కపట నాటకాన్ని వేలెత్తి చూపించి హైలైట్ అయ్యాడు. అయితే బిగ్‌బాస్‌కు కూడా కొందరు ఫేవరెట్స్ ఉంటారు. వాళ్లనేమైనా అంటే ఆ కంటెస్టెంట్ గేటు బయట ఉండాల్సిందే! హోస్ట్ నాగార్జున కూడా అతడి నోరు నొక్కేసి నానామాటలన్నారు. చివరకు 13వ వారంలో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. అశ్వత్థామ 2.0 అంటూ తనకు తాను ఇచ్చుకున్న బిరుదు కూడా జనాలకు రుచించలేదు, ట్రోల్ చేశారు.దారి తప్పిన గౌతమ్అయితే ఎక్కడ తగ్గాడో అక్కడే నెగ్గాలనుకున్నాడు. మళ్లీ బిగ్‌బాస్ 8లో అడుగుపెట్టాడు. ఈసారి ఏదేమైనా వెనక్కు తగ్గకూడదని బలంగా ఫిక్సయ్యాడు. కానీ వచ్చినవారంలోనే క్రష్ అంటూ యష్మిపై ఫీలింగ్స్ బయటపెట్టడంతో జనం అతడిని తిరస్కరించాడు. వెంటనే ఎక్కడ తప్పు చేశానన్నది గ్రహించి తనను మార్చుకున్నాడు. కేవలం ఆటపైనే దృష్టిసారించాడు. తప్పు జరుగుతుంటే వేలెత్తి చూపించాడు. (చదవండి: ఆడు మగాడ్రా బుజ్జి.. గౌతమ్ కృష్ణ సంపాదన ఎంతంటే?)ఆ ఒక్క మాటతో విపరీతమైన నెగెటివిటీగ్రూప్ గేమ్స్ తప్పు కాదని హోస్ట్ చెప్తున్నా సరే అది తప్పని వాదించాడు. అతడి గుండెధైర్యానికి జనాలు ఫిదా అయ్యారు. అతడి ప్రవర్తన, మాటతీరుకు సెల్యూట్ చేశారు. గెలుపు ఖాయం అనుకుంటున్న సమయంలో నిఖిల్‌పై అనవసరంగా నోరు జారాడు. అమ్మాయిలను వాడుకుంటున్నావ్ అనడంతో గౌతమ్‌పై ఉన్న పాజిటివిటీ కాస్త తగ్గిపోయింది. అది ఎంత పెద్ద మాట అని నాగార్జున చెప్తున్నా కూడా అతడికి చెవికెక్కలేదు. వివరణ ఇస్తూనే పోయాడు. ఈ వ్యవహారం అతడికి మైనస్ అయింది.సెటైర్.. అంతలోనే ప్రశంసగౌతమ్ ఎదుటివారు చెప్పేది వినిపించుకోకుండా తన పాయింట్స్ తను చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. ఫినాలేలో గౌతమ్ తండ్రి కూడా అలా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అది చూసిన నాగ్.. ఎవరైనా మాట్లాడుతుంటే వినకుండా నీ వర్షన్ నువ్వు చెప్పే క్వాలిటీ మీ తండ్రి నుంచే వచ్చిందా? అని సెటైర్ వేశాడు. అయితే ఎక్కువగా తన చేతిలో తిట్లు తినే గౌతమ్‌ను చిట్టచివరిసారి మెచ్చుకున్నాడు నాగార్జున. గౌతమ్‌ను రన్నరప్‌గా ప్రకటించినప్పుడు.. గర్వించే కొడుకును కన్నారంటూ అతడి పేరెంట్స్‌ను ప్రశంసించాడు. అది చూసిన ఫ్యాన్స్.. ఇది కదా సక్సెస్ అంటే, నువ్వు జనాల మనసులు గెలిచేశావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.తెర వెనక 'బిగ్‌బాస్ 8' ఫినాలే హంగామా.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు విజేతలు వీళ్లే.. (ఫొటోలు)
-
తెర వెనక 'బిగ్‌బాస్ 8' ఫినాలే హంగామా (ఫొటోలు)
-
బిగ్‌బాస్ 8 రన్నరప్‌గా గౌతమ్.. ఏమేం గెలుచుకున్నాడు? (ఫొటోలు)
-
బిగ్‌బాస్ 8 విజేతగా నిఖిల్.. ఏమేం గెలుచుకున్నాడు? (ఫొటోలు)
-
టాప్ 2కి మనీ ఆఫర్.. ఫైనల్‌గా నిఖిల్ విన్నర్!
బిగ్‌బాస్ ఫైనల్లో సూట్‌కేస్ ఆఫర్ చేయడమనేది గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ! అయితే మధ్యలోనే టెంప్ట్ అయి సూట్‌కేస్ తీసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. దీనివల్ల విన్నర్ ఫుల్ ప్రైజ్‌మనీ అందుకోలేకపోతున్నాడు. పైగా ఈసారి కంటెస్టెంట్లకు చాలా హింట్స్ వెళ్లాయి.సూట్‌కేస్ ఆఫర్అసలు సిసలైన పోటీ నిఖిల్, గౌతమ్ మధ్యే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అందుకే టాప్ 5 మెంబర్స్‌కు సూట్‌కేస్ ఆఫర్ చేయలేదు. కానీ ఎవరూ మొగ్గు చూపలేదట.. తర్వాత ముగ్గురు మిగిలినప్పుడు టెంప్ట్ చేసే ప్రయత్నం చేయగా ఎవరూ తలొంచలేదట!అడుగు దూరంలో ఆగిపోయిన గౌతమ్చివరి ప్రయత్నంగా టాప్ 2 అంటే నిఖిల్, గౌతమ్‌లకు సూట్‌కేస్ ఆఫర్ చేసినప్పటికీ తీసుకోవడానికి ఇద్దరూ వెనకడుగు వేశాడు. దీంతో విన్నర్‌కు రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందింది. మరి ఈ మొత్తం అందుకున్న కంటెస్టెంట్ ఎవరనేది ఆల్రెడీ లీకైపోయింది. గెస్టుగా వచ్చిన రామ్‌చరణ్.. నిఖిల్ మళయక్కల్ను విన్నర్‌గా ప్రకటించినట్లు సమాచారం. దీంతో గౌతమ్ కృష్ణ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘బిగ్‌బాస్ సీజన్ 8’ గ్రాండ్ ఫినాలే...హైలెట్స్ (ఫొటోలు)
-
ఆ బాధతో 18వ అంతస్తు నుంచి దూకేద్దామనుకున్న గౌతమ్..
గత కొన్నిరోజులుగా నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేస్తున్న ఫైనలిస్టులను చివరిసారి ఏడిపించే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. మీ జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటనను పంచుకోమని చెప్పడంతో అందరూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. మరి ఎవరెవరు ఏమేం చెప్పారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సోనియాను బ్లాక్ చేస్తానన్న ప్రేరణషో అయిపోయాక ఎవరితో కలిసుండాలనుకుంటున్నారు? ఎవరిని కలవకూడదనుకుంటున్నారో చెప్పమంటూ ఫాలో- బ్లాక్ గేమ్ ఆడించాడు బిగ్‌బాస్. దాదపు అందరితోనూ కలవాలనుకుంటున్న చెప్పారు టాప్ 5 కంటెస్టెంట్లు. ఎవరిని కలవకూడదన్న విషయానికి వస్తే.. సోనియా పర్సనాలిటీ నచ్చలేదంటూ తనను బ్లాక్ చేస్తానంది ప్రేరణ. తక్కువ పరిచయం వల్ల పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేశాడు గౌతమ్. నబీల్.. హరితేజ, సోనియాను బ్లాక్ చేస్తానన్నాడు. నిఖిల్.. బేబక్క, సీతను బ్లాక్ చేశాడు. అవినాష్.. పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేస్తానన్నాడు.మూడేళ్లు ఇంట్లో ఖాళీగా..తర్వాత చలిమంట వేసిన బిగ్‌బాస్.. జీవితంలోని బెస్ట్, వరస్ట్ సంఘటనలను పంచుకోమన్నాడు. నబీల్ మాట్లాడుతూ.. బైక్ యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్పాలయ్యాను. అదే నా చేదు జ్ఞాపకం అన్నాడు. నిఖిల్ మాట్లాడుతూ.. నేను ఆర్కిటెక్ట్ కోర్స్ చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్ వచ్చింది. చదువు మధ్యలోనే వదిలేశాను. మూడేళ్లపాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. రోజూ అమ్మ దగ్గర రూ.30 అడుక్కునేవాడిని. నువ్వు ఇంటికి భారమయ్యావు, నీకు తిండి పెట్టడమే కాకుండా ఖర్చులకు కూడా డబ్బివ్వాలా? అని తిట్టింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చాకే..తర్వాత కన్నడ సీరియల్లో ఆఫర్ వచ్చింది. రోజుకు రూ.2500 ఇస్తామన్నారు. అంటే నెలకు రూ.75వేలు వస్తాయనుకున్నాను. కానీ పదిరోజులే షూటింగ్ జరిగింది. ఆ తర్వాత తెలుగు సీరియల్ చేశాను. అప్పటినుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు అని చెప్పాడు. ప్రేరణ నానమ్మ చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేసింది.ఏ పాపం చేశానో..గౌతమ్ మాట్లాడుతూ.. మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒకమ్మాయితో బ్రేకప్ అయింది. ఆ బాధ తట్టుకోలేక నేను ఉంటున్న 18వ అంతస్థులోని బాల్కనీలో నుంచి దూకి చనిపోదామనుకున్నాను. కానీ నాతోపాటు నన్ను ప్రేమించేవాళ్లు గర్వపడేలా చేస్తే ఈ ప్రపంచమే దాసోహం అవుతుందని ఆలోచించి ఆగిపోయాను అన్నాడు. అవినాష్ మాట్లాడుతూ.. నేను, నా భార్య అను ఎన్నో కలలు కన్నాం. ఏ జన్మలో ఏ తప్పు చేశానో మాకు బాబు పురిటిలోనే చనిపోయాడు. నా చేతిలో కొడుకున్నాడు, కానీ వాడికి ప్రాణం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై ఫీలింగ్స్?తర్వాత యాంకర్ సుమ వచ్చి సరదా టాస్కులు ఆడించింది. అలాగే ప్రేక్షకుల మనసులోని ప్రశ్నలను ఫైనలిస్టులను అడిగేసింది. కావాలని స్ట్రాటజీతో రెచ్చగొట్టి గొడవలు పెట్టుకుంటారా? అని గౌతమ్‌ను అడగ్గా అలా ఏం లేదని, దేనికైనా హర్ట్ అయితేనే గొడవపడతానన్నాడు. యష్మిపై నీకు నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయా? లేదా లవ్ యాంగిల్ కోసం వేసిన స్ట్రాటజీయా? అని అడగ్గా మొదట్లో కొంచెం ఫీల్ ఉండేది కానీ ఒకసారి అక్క అన్నాక అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవని గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు.ఫైర్ తగ్గలేదన్న నబీల్రాయల్స్(వైల్డ్ కార్డ్స్) వచ్చాక నీలో ఎందుకు ఫైర్ తగ్గింది? అని నబీల్ను అడగ్గా.. తనలో ఫైర్ ఎక్కడా తగ్గలేదని, కాకపోతే కొన్నిసార్లు కనిపించకపోయుండొచ్చన్నాడు. పృథ్వీ కాకుండా ఈ ఇంట్లో ఎవరిని ఎక్కువ నమ్ముతారు? అని నిఖిల్‌ను అడగ్గా ఆ రేంజ్లో ఎవరినీ నమ్మలేనన్నాడు. సీజన్ 4 లేదా సీజన్ 8లో ఏది బెస్ట్ అని ప్రశ్నించగా అవినాష్ క్షణం ఆలోచించుకోకుండా నాలుగో సీజన్ అని చెప్పాడు.అక్కడే అసలు గొడవనిఖిల్, గౌతమ్.. మీరిద్దరూ ఎందుకు ఎప్పుడూ గొడవపడతారు? అన్న ప్రశ్నకు అభిప్రాయబేధాలు అని ఇద్దరూ బదులిచ్చారు. తర్వాత ఓ టాస్క్‌లో నిఖిల్ గెలవడంతో అతడి తమ్ముడి వీడియో సందేశాన్ని చూపించాడు. అనంతరం ప్రేరణ గెలవడంతో తనకు ఓ ఫోటోఫ్రేమ్ ఇచ్చారు. అలా ఎమోషన్స్, ఆటపాటలతో ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎవర్నీ వాడుకోలేదన్న నిఖిల్.. ప్రేరణ బెస్ట్ మెగా చీఫ్!
టాప్ 5 ఫైనలిస్టుల్లో గౌతమ్, అవినాష్ జర్నీ వీడియోలు అయిపోయాయి. ఈరోజు మిగతా ముగ్గురి వీడియోలు ప్లే చేశారు. మరి బిగ్‌బాస్ వారిని ఏ రేంజ్లో పొగిడారో నేటి (డిసెంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మీ మనసు ఒప్పుకోలేదుఒక్క బొట్టుతో మొదలై మహానదిగా మారే నదిలా మీ ప్రయాణం సాగింది. ఎన్నో నిందలు వేసినా ఏకాగ్రత కోల్పోలేదు. ఎన్నో బంధాలు మీతో చివరివరకు కలిసి నడవలేకపోయాయి. ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. మీరిద్దరూ ఒకరితో ఒకరు, ఒకరికోసం ఒకరు నిలబడ్డారు, ప్రత్యర్థులతో తలపడ్డారు. గ్రూప్ గేమ్ అని మీ ఆటను వేలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు మీ స్నేహం కోసం ఆడారు. రక్తాన్ని చిందించావ్మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. అప్పుడు మీ మనసుకైన గాయాన్ని మనసులోనే దాచుకున్నారు. మీరొక స్మార్ట్ గేమర్. మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్‌గా ఉన్నారు. మీ సత్తాను పరీక్షించే టాస్కుల్లో రక్తాన్ని సైతం చిందించి దూకుడు చూపించారు. మీరు నిజమైన జెంటిల్మెన్. రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ఇంట్లోకి వచ్చినప్పుడు ఓజీ (పాత కంటెస్టెంట్ల)కోసం లీడర్లా నిలబడ్డారు. మీకన్నా ఇంటికోసమే ఎక్కువ ఆలోచించారు. ఆ లోటు నాకు తెలుసుసరదాకు మీరేం చేసినా హద్దులు దాటలేదు. మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చినా మీ మనసులోని ఆ ఒక్క లోటు నాకు తెలుసు. మనసుకు దగ్గరైన ప్రతీది మీకు దక్కాలని కోరుకుంటున్నా అంటూ అతడి ప్రియురాలు కావ్య తిరిగి అతడితో కలిసిపోవాలని పరోక్షంగా కోరుకున్నాడు. తర్వాత జర్నీ వీడియోలో నిఖిల్‌కు రాఖీ భాయ్ లెవల్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనన్న నిఖిల్. ఎవరినీ ఆడుకుని, వాడుకుని ఇక్కడిదాకా రాలేదని కుండబద్ధలు కొట్టి చెప్పాడు.ఆ పట్టుదల వల్లే..తర్వాత ప్రేరణ వంతు రాగా.. సందర్భోచితంగా మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరే ఈ స్థాయిలో నిలబెట్టింది. పసిపాపలాంటి అమాయకత్వం అందరికీ దగ్గర చేసింది. ఓటమిని ఒప్పుకోని తత్వమే మిమ్మల్ని ఎన్నోసార్లు గెలుపు అంచులవరకూ తీసుకెళ్లింది. ఆ పట్టుదల వల్లే మెగా చీఫ్ అయ్యారు. కానీ అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తనమన బేధం లేకుండా మెగా చీఫ్‌గా వ్యవహరించారు. కానీ ఇంటిసభ్యుల దృష్టిలో వరస్ట్ మెగా చీఫ్ అయ్యారు. మనసారా ఏడ్చేసిన ప్రేరణఅయితే బిగ్‌బాస్ దృష్టిలో మాత్రం మీరు బెస్ట్ మెగా చీఫ్. తప్పు జరిగితే స్నేహితుల్నైనా నామినేట్ చేసేందుకు వెనుకాడలేదు. మీలోని మొండిఘటం మిమ్మల్ని ప్రశ్నించినవారికి చెమటలు పట్టించింది. ఆ లక్షణమే టాప్ 5కు తీసుకొచ్చింది. వివాహితలు కూడా ఎంతో సాధించివచ్చని, మీ ప్రయాణంతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారని భావిస్తున్నా.. అంటూ బిగ్‌బాస్ తన జర్నీ వీడియో చూపించాడు. దీన్నంతటినీ ఆస్వాదిస్తూనే మనసారా ఏడ్చేసింది ప్రేరణ.వరంగల్ కా షేర్ నబీల్అనంతరం నబీల్ అఫ్రిది గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. వరంగల్ కా షేర్ నబీల్ అన్న పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో సుపరిచితం. మీ టాలెంట్, వ్యక్తిత్వాన్ని కోట్లమందికి తెలియజేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎవిక్షన్ షీల్డ్ త్యాగం చేసి ఉన్నతంగా ఆలోచించే గుణానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. మీరు సెల్ఫ్ మేడ్. అందుకే ఆత్మగౌరవం కూడా ఎక్కువే. దాన్ని ప్రశ్నించినవారికి ఆటతోనే ధీటుగా జవాబిచ్చారు. బలహీనత కాదు బలంఈ ఇంటి మొదటి మెగా చీఫ్‌గా నిలిచారు. మీలో ఫైర్ తగ్గిందన్నప్పుడు మీ సామర్థ్యాన్ని ప్రశ్నించుకున్నారు. మీ చుట్టూ ఉన్న తారల తళుకుబెళుకుల మధ్య ఒక సామాన్యుడిలా ఒంటరై నిల్చున్నట్లు మీకనిపించింది. కానీ అది మీ బలహీనత కాదు మీ బలం అంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు. అది చూసి నబీల్ ఓపక్క సంతోషిస్తూనే మరోపక్క కంటతడి పెట్టుకున్నాడు. మొత్తానికి అందరి జర్నీ వీడియోలు పూర్తయ్యాయి. ఇక విన్నర్‌ను తేల్చడం మాత్రమే మిగిలింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8కు అందుకే వచ్చానన్న గౌతమ్.. ఏడ్చేసిన అవినాష్!
ఆటలు, పాటలు.. అడ్డంకులు, ఆటుపోట్లు.. ఇలా ఎన్నింటినో దాటుకుని బిగ్‌బాస్ ఫైనల్ వీక్‌కు ఐదుగురు మాత్రమే చేరుకున్నారు. ఇంటిని, బయటి ప్రపంచాన్ని వదిలేసి బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజులుగా ఉంటున్నారు. వీరి జర్నీ తుది అంకానికి చేరుకున్న సందర్భంగా ఫైనలిస్టుల కష్టాలను, ఆనందాలను గుర్తు చేస్తూ బిగ్‌బాస్ జర్నీ వీడియోలు ప్లాన్ చేశాడు. ఆ విశేషాలు నేటి (డిసెంబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..తన్మయత్వంలో గౌతమ్బిగ్బాస్ హౌస్‌లో గడిచిన ప్రయాణాన్ని గుర్తు చేసేలా గార్డెన్ ఏరియాలో అదిరిపోయే సెటప్ ఏర్పాటు చేశాడు బిగ్‌బాస్. కంటెస్టెంట్ల ఫోటోలు, టాస్క్ ప్రాపర్టీస్.. ఇలా అన్నింటినీ అందంగా అమర్చాడు. మొదటగా గౌతమ్ గార్డెన్ ఏరియాలోకి వచ్చి తన ఫోటోలు చూసుకుని, ఆడిన టాస్కుల్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.అదే మీ స్ట్రాటజీతర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. బలవంతుడితో ఎలాగోలా గెలవొచ్చు. కానీ మొండివాడితో గెలవలేము. మీ మొండితనంలో నిజాయితీ ఉంది. మునుపటిసారి ఇంట్లో వచ్చినప్పుడు జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని పర్ఫెక్ట్ ప్లేయర్‌గా మిమ్మల్ని మీరు మల్చుకోవడానికి చేసిన కృషి ప్రశంసనీయం. లక్ష్యాన్ని చేధించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. మీ స్ట్రాటజీ ఏంటో మిగతావారికి అర్థం కాకపోవడమే మీ స్ట్రాటజీగా మార్చుకున్నారు. ఊహించని విధంగా వారిపై దాడి చేశారు. ఒక యోధుడిలా..స్త్రీల పట్ల మీకున్న గౌరవం మీ మాటలో, ఆటలో స్పష్టంగా ప్రతిబింబించింది. ఎలిమినేషన్ అంచులవరకు వెళ్లినప్పుడు మీ మనసు చెలించింది. మీ ప్రణాళికను మార్చేసుకుని బుద్ధిబలం, భుజబలంతో ఒక యోధుడిగా పాదరసంలా కదులుతూ ఏ ఆటంకం లేకుండా మీ ఆట ముందుకు సాగింది. మీరు కోరుకున్న (యష్మి దగ్గర) ప్రేమ మీకు లభించకపోయినా అది మీ ఆటను ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. అమ్మ మాట వినే...గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అది నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరం. ఈ రెండూ కనబర్చిన మీ ప్రయాణాన్ని ఓసారి చూసేద్దాం అంటూ పొగడ్తల అనంతరం జర్నీ వీడియో ప్లే చేశాడు. అది చూసిన గౌతమ్.. బిగ్‌బాస్ 8 నా జీవితంలోనే ఒక మైల్ స్టోన్. 'నీ లైఫ్‌లో ఎవరూ నీ కోసం ఏదీ చేయరు, ఒక్కడివే నిలబడు, ఒక్కడివే పోరాడు' అని అమ్మ చెప్పింది. ఆ గౌరవం కోసమే వచ్చాతను చెప్పింది వినే ఇక్కడిదాకా వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకెప్పుడూ గౌరవం లభించలేదు. దానికోసమే ఈ సీజన్‌కు వచ్చాను. గౌరవం సంపాదించుకున్నాను. జీవితంలో ముగ్గురే ముఖ్యమైన వారు తల్లి, తండ్రి, గురువు. మీరు నా గురువు బిగ్‌బాస్ అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత అవినాష్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు బిగ్‌బాస్. మీరు చుట్టూ ఉంటే ఉష్ణోగ్రత తనకు తానే కొన్ని డిగ్రీలు కోల్పోతుంది. జస్ట్ కమెడియన్ కాదుఎన్ని డిగ్రీలు పొందినవారికైనా అది సాధ్యమవుతుందా? నవ్వుకున్న బలం అలాంటిది! ఈ ఇంట్లో కొందరే మీ స్నేహితులైనా అందరూ మీ ఆప్తులే.. వారందరూ నవ్వు మీకిచ్చిన బంధువులే! రింగుల జుట్టు మీ భార్యకు ఇష్టమైనప్పటికీ ఆటకోసం త్యాగం చేశారు. కొందరు మిమ్మల్ని జస్ట్ కమెడియన్ అన్నా, మీ కామెడీ వారికి రుచించలేదని నిందించినా మీరు కుంగిపోలేదు. కమెడియన్ అనే బిరుదును గర్వంగా ధరించి ధీటుగా జవాబిచ్చారు. ఎవరికీ తక్కువ కాదుఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చేయగలిగే జస్ట్ కమెడియన్ మాత్రమే కాదు, అన్నీ చేయగలిగే కంప్లీట్ ఎంటర్టైనర్గా ఆవిష్కరించుకున్నారు. మిమ్మల్ని వేలెత్తి చూపినవారు కూడా ఈ విషయం ఒప్పుకోక తప్పదు. రెండుసార్లు మెగా చీఫ్‌గా, అందరికంటే ముందు ఫైనలిస్టుగా నిలిచి.. ఆటలో, మాటలో, పోటీలో ఎవరికీ తక్కువ కాదని తెలిసేలా చేశారు అంటూ జర్నీ వీడియో చూపించాడు.మనిషిగా నేను గెలిచాఅది చూసి భావోద్వేగానికి లోనైన అవినాష్.. నాకు గొడవపెట్టుకోవడం రాదు. మనసున్న మనిషిగా నేను గెలిచాను బిగ్‌బాస్. బాగా ఆడే నా ఫ్రెండ్ రోహిణి ఓడిపోతుంటే నాతోపాటు ముందుకెళ్లాలని ఆలోచించాను. కమెడియన్స్ ఎందుకు గెలవకూడదు? అని బిగ్‌బాస్ నాలుగో సీజన్ నుంచి నాలో మెదులుతున్న ప్రశ్న. కానీ జనాలు అనుకుంటే ఏదైనా అవుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిగతావారి జర్నీలు రేపటి ఎపిసోడ్లో ఉండనున్నాయి.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణకు కలిసొచ్చిన లక్.. టాప్ 5పై గెలవని సీరియల్ బ్యాచ్
మరో ఐదు రోజుల్లో కంటెస్టెంట్లు ఉండరు, బిగ్‌బాస్ హౌసూ ఉండదు. ఉన్న నాలుగురోజులైనా టాప్ 5 కంటెస్టెంట్లను, వారి జర్నీని, బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌ను ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందామంటే బిగ్‌బాస్ ఆ ఛాన్సే ఇవ్వట్లేదు. వరుసపెట్టి సీరియల్ ఆర్టిస్టులను పంపిస్తూనే ఉన్నాడు. సీరియల్స్ ప్రమోషన్ జరిపిస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజెవరొచ్చారో నేటి (డిసెంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..సీరియల్ బ్యాచ్‌పై గెలుపువంటలక్క సీరియల్ టీమ్ హౌస్‌లోకి వచ్చింది. వీరితో ప్రేరణ, అవినాష్ గేమ్ ఆడి గెలిచారు. దీంతో బిగ్‌బాస్ రూ.10,928 ప్రైజ్‌మనీలో యాడ్ చేశాడు. తర్వాత మగువ.. ఓ మగువ సీరియల్ టీమ్ హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్ చేసింది. అప్పుడు కూడా అవినాష్ తన కామెడీ యాంగిల్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అనంతరం అందరూ కలిసి ఓ ఫన్ గేమ్ ఆడారు. ప్రేరణ నోటికి తాళంమ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు ఒకరి చేతిలోని బాక్స్‌ను మరొకిరి ఇస్తూ పోవాలి. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఎవరి చేతిలో అయితే ఆ బాక్స్ ఉంటుందో దాన్ని తెరిచి అందులో ఏది రాసుంటే అది ఫాలో అయిపోవాలి. అలా మొదటగా ప్రేరణ చేతిలో బాక్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ ఆగిపోయింది. అందులో గేమ్ అయిపోయేవరకు ప్రేరణ నోరు తెరవకూడదని ఉంది. ఆమె తరపున అవినాష్ మాట్లాడాలని ఉంది. దెబ్బలు తిన్నాడ్రోయ్రెండో రౌండ్లో అవినాష్ వంతురాగా.. తనకు ఇచ్చిన టాస్క్ ప్రకారం అందరిపై ఫేక్ పొగడ్తలు కురిపించాడు. తర్వాత నిఖిల్ మార్నింగ్ పనులను డ్యాన్స్ రూపంలో చేయగా.. నబీల్ రెండు పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తిన్నాడు. చివర్లో అవినాష్ అందరితో దెబ్బలు తిన్నాడు. అనంతరం మగువ ఓ మగువ టీమ్‌తో ప్రేరణ, గౌతమ్ టాస్క్ ఆడి రూ.10,0010 గెలిచారు.ప్రేరణకు కలిసొచ్చిన అదృష్టంబీబీ పరివారంపై మా పరివారం ఇప్పటివరకు ఒక్క టాస్క్ గెలిచిందే లేదు! మరి రేపటి ఎపిసోడ్లో అయినా ఈ రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారేమో చూడాలి! అలాగే వచ్చిన అందరూ.. హౌస్‌లో ఒక్క అమ్మాయే ఉందంటూ ప్రతి గేమ్‌లోనూ తననే సెలక్ట్ చేసుకుంటున్నారు. అలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వందశాతం ఉపయోగించుకుంటోంది ప్రేరణ. ఈ టాస్కుల్లో తన కష్టాన్ని చూసి ప్రేరణకు మరిన్ని ఓట్లు పడే అవకాశం లేకపోలేదు. -
ప్రేమ పెళ్లి ముద్దు అన్న నిఖిల్.. అవినాష్‌ను ఆడుకున్న బిగ్‌బాస్
నామినేషన్స్ అయిపోయాయి. బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5 ఫైనలిస్టులు మాత్రమే మిగిలారు. ఈ చివరివారంలో కూడా ప్రైజ్‌మనీ పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ గేమ్స్‌లో గెలవకపోతే ప్రైజ్‌మనీ కట్ అవుతుందన్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సీరియల్ పరివారం వర్సెస్ బీబీ పరివారంసీరియల్ సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌కు వస్తారని చెప్పాడు బిగ్‌బాస్. మా సీరియల్ పరివారంతో బీబీ పరివారం పోటీపడి ఆటలు ఆడి గెలిచి ప్రైజ్‌మనీని పెంచుకోవచ్చన్నాడు. ఓడిపోతే ప్రైజ్‌మనీ కూడా తగ్గుందన్నాడు. మొదటగా నువ్వుంటే నా జతగా సీరియల్ టీమ్ అర్జున్ కళ్యాణ్, అను హౌస్‌లోకి వచ్చారు. వీరితో ఆడాల్సిన గేమ్‌కు రూ.12,489 ప్రైజ్‌మనీ నిర్ణయించారు. ఒగ్గుకథ చెప్పిన అవినాష్ఈ ఆటలో సీరియల్ పరివారంతో నబీల్-ప్రేరణ ఆడి గెలిచారు. అలా పన్నెండువేల రూపాయల్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. తర్వాత అవినాష్ టాప్ 5 ఫైనలిస్టులపై ఒగ్గుకథ చెప్పి అలరించాడు. ఇప్పుడెలాగూ చేసేదేం లేదని కాసేపు దాగుడుమూతలు ఆడారు. ఈ క్రమంలో అవినాష్ యాక్షన్ రూమ్‌లో దాక్కున్నాడు. ఇంతలో బిగ్‌బాస్ ఆ గదికి తాళం వేసి లైట్లు ఆఫ్ చేశాడు. కాసేపటికి ఘల్లు ఘల్లుమంటూ గజ్జెల శబ్దం ప్లే చేశాడు.అవినాష్‌ను ఆటాడుకున్న బిగ్బాస్దీంతో అవినాష్ దడుసుకుని చచ్చాడు. తలుపు తీయండి బిగ్‌బాస్ అని వేడుకున్నా కనికరించలేదు. దెయ్యం కేకలు, కాంచన అరుపుల సౌండ్స్ వినిపించడంతో అవినాష్ ఏడ్చినంత పని చేశాడు. చివరకు గది తాళం తీయడంతో బయటకు పరిగెత్తాడు. అతడిని చూసి హౌస్మేట్స్ అందరూ ఘొల్లుమని నవ్వారు.ప్రేమ వివాహం చేసుకుంటా: నిఖిల్అనంతరం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్ నుంచి ప్రభాకర్, ఆమని వచ్చారు. తమ సీరియల్ స్టోరీలైన్ గురించి చెప్తూ హౌస్‌మేట్స్‌ను మీలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని అడిగారు. అందుకు నిఖిల్.. ప్రేమవివాహం చేసుకుంటానన్నాడు. పెద్దలను ఒప్పించాకే తన పెళ్లి జరుగుతుందన్నాడు. ఇక ప్రభాకర్- ఆమనితో ప్రేరణ - అవినాష్ బాల్స్ గేమ్ ఆడారు. ఇందులో సీరియల్ పరివారంపై బీబీ పరివారం గెలిచి రూ.15,113 పొందారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నువ్వేం ఆడావో తెలీట్లేదు.. గౌతమ్‌పై విషం కక్కిన విష్ణు
ప్రైజ్‌మనీ గెలిస్తే ఏం చేస్తావ్? ప్రతి సీజన్లో అడిగినట్లే ఈ సీజన్లోనూ టాప్ 6 కంటెస్టెంట్లను ఇదే ప్రశ్న అడిగాడు నాగార్జున. ముందుగా అవినాష్.. మా అన్నయ్యకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో పెద్దమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని తన గొప్ప ఆలోచనను బయటపెట్టాడు. మరి మిగతావారు ఏమేం అన్నారు? విష్ణు వెళ్లేముందు ఏం చెప్పిందో తెలియాలంటే నేటి (డిసెంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే!అందరికీ పంచిపెడతానన్న విష్ణునబీల్ ప్రైజ్‌మనీ గెలిస్తే తన కెరీర్‌పై ఇన్వెస్ట్ చేస్తానని, మంచి సినిమా తీస్తానని చెప్పాడు. ప్రేరణ.. నా పేరెంట్స్‌కు ఉన్న అప్పులు తీర్చేస్తా.. మిగిలిన డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడతా అని తెలిపింది. విష్ణుప్రియ.. అభయ్ నవీన్ ఫారిన్ ట్రిప్‌కు రూ.2 లక్షలు, మణికంఠ కారుకు రూ.1.5 లక్ష, గంగవ్వ ఇంటికోసం రూ.5 లక్షలు, పృథ్వీకి గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇలా అందరికీ పంచాలనుకుంటున్నాను అని చెప్పింది.ప్రైజ్‌మనీతో ఏం చేస్తానంటే?నిఖిల్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నా.. అమ్మానాన్నలకు ఓ ఇల్లు కట్టాలి. ఇప్పటిదాకా నాకోసం ఎంతో ఖర్చుపెట్టిన మా అన్న, తమ్ముడి కోసం ఈ డబ్బు ఉపయోగిస్తాను అన్నాడు. గౌతమ్.. మా అమ్మానాన్న రిటైర్మెంట్ కోసం ప్రైజ్‌మనీ వాడతాను. అలాగే గంగవ్వ తన కూతురికి కట్టివ్వాలనుకున్న ఇంటి కోసం రూ.10 లక్షలు ఇద్దామనుకుంటున్నాను అని తెలిపాడు.మీ వాడిగా స్వీకరించారు: నిఖిల్అనంతరం నాగార్జున నిఖిల్‌ను సెకండ్ ఫైనలిస్ట్‌గా ప్రకటించాడు. ఈ సందర్భంగా నిఖిల్.. నేను ఆర్టిస్టుగా ఇక్కడికి వచ్చినప్పుడు బయటివాడిని అని కామెంట్స్ చేశారు. కానీ మీరు అది తప్పని రుజువు చేశారు. నన్ను మీ వాడిగా స్వీకరించారు అని ఎమోషనలయ్యాడు. మూడో ఫైనలిస్ట్‌గా గౌతమ్‌ను ప్రకటించాడు. నాలుగో ఫైనలిస్ట్‌గా ప్రేరణను ప్రకటించగానే ఆమె షాకై, ఆ వెంటనే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.నిఖిల్‌కు ముద్దుపెట్టిన గౌతమ్ఈ సీజన్లో ఎవరికైనా థాంక్యూ, సారీ చెప్పాలనుకుంటే చెప్పేయమన్నాడు నాగ్. విష్ణుప్రియ.. తనతో స్నేహం చేసిన సీతకు థాంక్యూ.. తెలిసీతెలియకుండా కొన్నిసార్లు బాధపెట్టినందుకు రోహిణికి సారీ చెప్పింది. నబీల్.. ఏదున్నా మణికంఠకు షేర్‌తో చేసుకునేవాడినంటూ అతడికి థాంక్యూ.. ప్రేరణను నామినేట్ చేసినందుకు సారీ చెప్పాడు. నిఖిల్.. నేనెలా ఉన్నానో అలాగే యాక్సెప్ట్ చేసినందుకు పృథ్వీకి థ్యాంక్స్.. గౌతమ్‌పై నోరు జారినందుకు క్షమించమన్నాడు. ఈ సందర్భంగా గౌతమ్.. నిఖిల్‌కు బుగ్గపై ముద్దు పెట్టాడు.థాంక్స్, సారీ.. రెండూ నిఖిల్‌కు చెప్పిన గౌతమ్అవినాష్.. ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన నబీల్‌కు థాంక్స్.. నా ఫ్రెండ్ అయిన విష్ణును నామినేట్ చేసినందుకు సారీ అన్నాడు. గౌతమ్ వంతు రాగా.. ఇప్పటివరకు జరిగిన అన్నింటికీ సారీ అంటూ నిఖిల్‌ను హత్తుకున్నాడు. అలాగే అందరికీ వండిపెట్టినందుకు అతడికి థాంక్యూ చెప్పాడు. ప్రేరణ.. ప్రతీది నబీల్‌కు చెప్పుకుంటానని అతడికి థాంక్యూ చెప్పింది. విష్ణుపై నోరు జారినందుకు క్షమాపణలు తెలిపింది. చివరగా నాగ్.. నబీల్ను ఐదో ఫైనలిస్ట్‌గా పేర్కొంటూ విష్ణు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.గౌతమ్‌పై విష్ణు సెటైర్లుఎప్పుడూ గ్రహాలు అంటూ వేదాంతం మాట్లాడే విష్ణుతో అందుకు సంబంధించిన గేమ్ ఆడించాడు నాగ్. ట్రోఫీ అనే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం/ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నాడు. దీంతో విష్ణు.. గౌతమ్ ఆట ఇప్పటికీ తెలియట్లేదు.. అర్జంట్‌గా నువ్వేం ఆడావో చూసేయాలంటూ అతడిని ఐదో స్థానంలో పెట్టింది. అవినాష్‌ను నాలుగు, నబీల్ను మూడో స్థానంలో ఉంచింది. ప్రేరణ గెలవాలంటూనే ఆమెను రెండో స్థానంలో పెట్టింది.డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలేట్రోఫీకి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం నిఖిల్ అంటూ అతడికి విన్నర్ స్థానంలో కూర్చోబెట్టింది. ఈ పిచ్చిపిల్లను, నత్తిబుర్రను ఇన్నాళ్లు భరించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ వీడ్కోలు తీసుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే అని ప్రకటించిన నాగార్జున.. ఎపిసోడ్ అయిపోయిన క్షణం నుంచి శుక్రవారం వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయన్నాడు. మరి నబీల్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్, అవినాష్‌లలో ఎవరు గెలవాలనుకుంటున్నారో వారికి ఓట్లు వేసేయండి.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్‌కు హ్యాట్సాఫ్ చెప్తూ.. నిఖిల్‌ను విలన్ చేసిన రోహిణి
ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ నాగార్జున బాంబు పేల్చాడు. వచ్చేవారం ఫినాలే జరగబోతుందని తెలిపాడు. ఇక ఇన్నివారాల ప్రయాణంలో ఏ విషయంలో రిగ్రెట్ ఫీలయ్యారు? అది ఏ వారమో చెప్పాలన్నాడు నాగ్. మరి ఎవరెవరు ఏమేం చెప్పారో నేటి (డిసెంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మెగా చీఫ్ నా కొంప ముంచిందిమొదటగా అవినాష్.. 12వ వారంలో నేను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు విష్ణు, రోహిణి మధ్య గొడవను పరిష్కరించలేకపోయానన్నాడు. ప్రేరణ.. పదకొండోవారంలో నేను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు సాఫ్ట్‌గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయాను. దానివల్ల నాకు, హౌస్‌మేట్స్‌కు ఎఫెక్ట్ అయిందని చెప్పుకొచ్చింది. నబీల్.. తొమ్మిదో వారంలో మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ, ఏదో బాధలో ఉండటంతో ఆ అవకాశాన్ని ఈజీగా వదిలేసుకుని తప్పు చేశానన్నాడు. ఎందుకంత తుత్తర? ఈ సందర్భంగా నాగ్.. టాస్కులు సరిగా పూర్తిచేయకముందే ఎందుకు గంట కొడతావ్? ఎందుకంత తుత్తర? అని ప్రశ్నించాడు. అలాగే ఫైనలిస్ట్ అవడానికి చెక్‌పై రూ.15 లక్షలు రాసి, దాన్నెందుకు చించేశావని సూటిగా అడిగాడు. మొదట నా స్వార్థం కొద్దీ రాశాను కానీ తర్వాత మనసొప్పకపోవడంతో దాన్ని చింపేశానని తెలిపాడు. రోహిణి వంతురాగా పదోవారం ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అవినాష్ గుడ్డు పాము నోట్లో వేసినందుకు ఎన్నోసార్లు బాధపడ్డానంది. పృథ్వీతో ఫ్లర్ట్ చేశావిష్ణుప్రియ వంతురాగా.. పృథ్వీతో ఫ్లర్ట్ చేయడం వల్ల అతడి గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందేమోనని బాధపడుతున్నాను. అలాగే తొమ్మిదో వారంలో నేను చీఫ్ అయినప్పుడు ఐదుగుర్ని నామినేట్ చేయమన్నారు. అప్పుడు నబీల్ను నామినేట్ చేసినందుకు రిగ్రెట్ అయ్యానంది. గౌతమ్.. ఆరో వారంలో కామెడీ టాస్క్‌లో నన్ను అశ్వత్థామ అన్నందుకు ఫీలయ్యాను. అది నామినేషన్స్ దాకా వెళ్లింది. అక్కడ ఫీలయ్యాను అని చెప్పాడు. సారీ చెప్పాలి కదా!ఈ సందర్భంగా నిఖిల్‌తో గొడవ గురించి అడిగాడు నాగ్. నా క్యారెక్టర్ గురించి తప్పుగా అనడంతో నేనూ నోరు జారానన్నాడు. వాడుకున్నావ్ అనేది ఎంత పెద్ద మాటో తెలుసా? అని నాగ్ చెప్తుంటే గౌతమ్.. తాను చేసింది తప్పని, కానీ వేరే ఉద్దేశంలో అనలేదన్నాడు. తప్పు ఎలా చేసినా తప్పే.. మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి కదా అని క్లాస్ పీకడంతో గౌతమ్ మరోసారి నిఖిల్‌ను అందరి ముందు క్షమాపణలు కోరాడు.వీడియోతో క్లారిటీనిఖిల్ వంతు రాగా.. ఎన్నడూ నోరు జారని నేను పద్నాలుగోవారంలో గౌతమ్‌పై నోరు పారేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నానన్నాడు. రంగుపడుద్ది టాస్క్‌లో గౌతమ్ నిఖిల్‌ను కావాలని కొట్టాడా? లేదా? అనేది వీడియో ప్లే చేసి చూపించాడు. అది అనుకోకుండా తగిలిందని క్లారిటీ రావడంతో నిఖిల్ సైతం అతడికి సారీ చెప్పాడు. తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో అవిష్ను గెస్ చేయమన్నాడు నాగ్. అవినాష్ ఊహించిందే నిజమైందిఫస్ట్ టైమ్ నామినేషన్స్‌కు రావడం పెద్ద మైనస్.. కాబట్టి రోహిణి ఎలిమినేట్ అవుతుందని అంచనా వేశాడు. అతడు చెప్పిందే నిజమైంది. రోహిణి ఎలిమినేట్ అయింది. అయితే హౌస్‌లో ఆమె మాటతీరు, ఆటతీరును ప్రశంసిసిస్తూ చప్పట్లు కొట్టి, సెల్యూట్ చేసి మరీ సెండాఫ్ ఇచ్చారు. స్టేజీపైకి వచ్చిన రోహిణి.. అవినాష్, గౌతమ్, ప్రేరణను హీరోలుగా పేర్కొంది. ఆ ముగ్గురు హీరోలు: రోహిణిగౌతమ్తో.. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన మొదటివారమే ఎలిమినేషన్ అంచుల దాకా వెళ్లొచ్చావ్.. అలా ఎందుకు జరిగిందన్న ఆలోచనతో ఆ తర్వాతి వారం నుంచి నువ్వు ఆడిన విధానానికి హ్యాట్సాఫ్. సోలో.. సోలో అంటూ ఫైనల్‌కు వచ్చేశావ్.. ఫ్రెండ్స్‌తో ఉండటం తప్పేం కాదు, అందరికీ కాసేపు సమయం కేటాయించు సలహా ఇచ్చింది. విష్ణు, నబీల్, నిఖిల్‌ను విలన్లుగా పేర్కొంది. ట్రోఫీ గెలవకపోయినా రోహిణి సగర్వంగా విన్నర్లా బయటకు వెళ్లిపోయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మీ ఇంటిబిడ్డగా అడుగుతున్నా, గెలిపించండి: నిఖిల్
చివరి ఓటు అప్పీల్ ఛాన్స్ పొందేందుకు గౌతమ్, నిఖిల్ హోరాహోరీగా ఆడారు. అటు ఓంకార్ హౌస్‌లోకి వచ్చి తన ఇస్మార్ట్ జోడీకోసం ఓ జంటను బుక్ చేసుకుని వెళ్లాడు. మరి మౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రంగు పడుద్దిగత వీకెండ్లో గోల్డెన్ టికెట్ పొందిన నిఖిల్, రోహిణి, గౌతమ్‌కు ఓట్ అప్పీల్ గేమ్‌లో పాల్గొనేందుకు చివరి ఛాన్స్ ఇచ్చాడు. ముందుగా కేక్ గేమ్ పెట్టాడు. కేక్‌పై ఉన్న ఎనిమిది నెంబర్ కిందపడకుండా కేక్ కట్ చేయాలన్నాడు. ఈ ఆటలో రోహిణి ఓడిపోయింది. నిఖిల్, గౌతమ్‌కు రంగుపడుద్ది అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ప్రత్యర్థి టీ షర్ట్‌పై ఎవరు ఎక్కువ రంగు పూస్తే వారే విజేతగా నిలుస్తారు. ఈ గేమ్‌లో కొట్టుకుంటూ తోసుకుంటూ, లాగుతూ, ఈడడ్చుకెళ్తూ భీకరంగా ఆడారు.కొట్టుకున్న గౌతమ్, నిఖిల్మొదటి రౌండ్లో గౌతమ్ గెలిచాడు. రెండో రౌండ్ అయిపోయేసరికి గౌతమ్ కొడుతున్నాడని నిఖిల్ ఆరోపించాడు. నేను కావాలని కొట్టలేదు, నీకు తగిలిందనగానే సారీ చెప్పాను. మరి నువ్వు నన్ను లాక్కెళ్లలేదా? అని ప్రశ్నించాడు. పక్కకెళ్లి కూసోబే అని నిఖిల్ అనడంతో గౌతమ్.. బే అని ఎవడ్ని అంటున్నావ్? ఎక్కువ తక్కువ మాట్లాడకు అని మండిపడ్డాడు. ఆడే విధానం తెలియదు, ముఖం మీద కొట్టావ్.. అని నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుతూనే ఉన్నాడు. నలిగిపోయిన ప్రేరణవీళ్లిద్దరికీ సర్ది చెప్పలేక సంచాలకురాలు ప్రేరణ మధ్యలో నలిగిపోయింది. మొన్న నేను నోరు జారినప్పుడు హౌస్ అందరూ నన్ను తప్పని వేలెత్తి చూపారు.. మరి ఇప్పుడు నిఖిల్ నోరు జారితే ఎవరూ ఎందుకు స్పందించట్లేదని గౌతమ్ హౌస్‌మేట్స్‌ను ప్రశ్నించాడు. అందుకు వాళ్లు.. అమ్మాయిని వాడుకుంటున్నావ్? అనడం చాలా పెద్ద తప్పు కాబట్టే ఆరోజు మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఇకపోతే రెండు, మూడవ రౌండ్స్‌లో నిఖిల్ గెలిచాడు. ఎక్కువ రౌండ్లు నిఖిల్ గెలవడంతో ప్రేక్షకులను ఓట్లు అడిగే చాన్స్ పొందాడు.ఎప్పటికీ రుణపడి ఉంటానిఖిల్ మాట్లాడుతూ.. ఇన్నివారాలు నన్ను సేవ్ చేసినందుకు థాంక్యూ.. నేనెంతో కష్టపడ్డా.. మీరూ అంతే ఇష్టపడి నన్ను సేవ్ చేశారు. నేను విజేత అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసం ఇంకా ఎంతైనా కష్టపడతాను. ఈ ఒక్కసారి మీ నిఖిల్‌ను గెలిపించండి. ఇప్పటికీ, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. తెలిసో తెలియక తప్పులు చేశాను. అందుకు నన్ను క్షమించండి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నిఖిల్ ఒకేలా ఉంటాడు. ఓటు వేయండిమీ ప్రేమాభిమానాలు కూడా ఎప్పటికీ ఇలాగే ఉంటాయని నా గట్టి నమ్మకం. ఈ షో గెలవాలంటే మీ ఓట్లు కావాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను మీ ఇంటిబిడ్డగా భావించి ఓటు వేయమని కోరుతున్నాను అని అభ్యర్థించాడు. తర్వాత యాంకర్ ఓంకార్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇస్మార్ట్ జోడీ మూడో సీజన్ రాబోతుందంటూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. తర్వాత అతడు కంటెస్టెంట్లతో చిన్న గేమ్ ఆడించాడు. నీ పార్ట్నర్ కోసం నీలో ఏ లక్షణాన్ని దూరం చేస్తావని అడగ్గా నిఖిల్ తన చిరాకును వదిలేస్తానన్నాడు. బిగ్‌బాస్ ఇస్మార్ట్ జోడీతర్వాత అందర్నీ జంటలుగా విడగొట్టి డ్యాన్సులు చేయించాడు. అయితే వీళ్లందరూ పేపర్ పైన స్టెప్పులేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్‌కు ఆ పేపర్ సైజ్‌ను తగ్గిస్తూ ఉంటారు. పేపర్ దాటి అడుగు బయట పెట్టిన జంట అవుట్.. అలా మొదటి రౌండ్లో గౌతమ్-రోహిణి అవుట్ కాగా తర్వాత నిఖిల్- విష్ణు ఎలిమినేట్ అయ్యారు. ప్రేరణ నబీల్ను ఎత్తుకుని మరీ డ్యాన్స్ చేసి గెలిచేసింది. పెళ్లి వీడియో చూసుకుని మురిసిపోయిన ప్రేరణనబీల్ తనకు తందూరి చికెన్ బర్గర్+ సాఫ్ట్ డ్రింక్ కావాలని కోరగా.. ప్రేరణ.. తన పెళ్లి వీడియో అందరికీ చూపించాలని ఉందంది. నబీల్ను ఒప్పించి ప్రేరణ తన పెళ్లి వీడియో వచ్చేలా చేసింది. తన పెళ్లి క్షణాలను చూసుకుని ఆమె భావోద్వేగానికి లోనైంది. ఇంతలో ఓంకార్ ట్విస్ట్ ఇచ్చాడు. నీ కోరిక తీర్చినందుకుగాను నువ్వు, నీ భర్తతో ఇస్మార్ట్ జోడీలో తప్పకుండా పాల్గొనాలంటూ మాట తీసుకున్నాడు. అందుకామె సంతోషంగా ఒప్పుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ త్యాగం వృథా.. విన్నర్‌ను చేయమంటూ విష్ణు రిక్వెస్ట్
బిగ్‌బాస్ సీజన్ ఎండింగ్‌కు వచ్చేసింది. విన్నర్‌గా గెలిపించమని ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ పొందాలంటే తాను పెట్టే టాస్కులు గెలవాలన్నాడు బిగ్‌బాస్. అలా మొన్న ప్రేరణ, నిన్న నబీల్, నేడు విష్ణుప్రియ ఓట్ అప్పీల్ ఛాన్స్ పొందరు. ఆమె ఎలా గెలిచింది? ఏం మాట్లాడిందన్నది నేటి (డిసెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అదరగొట్టిన గౌతమ్బిగ్బాస్ ఈ రోజు మొదటగా పవర్ ఫ్లాగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. బజర్ మోగినప్పుడు ఫ్లాగ్ పట్టుకున్నవారు ఆ రౌండ్లో ఒకరిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో గౌతమ్ గెలిచి నబీల్ను రేసు నుంచి తప్పించాడు. తర్వాతి రౌండ్లలో కూడా గౌతమ్ ఒక్కడు ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా ఆట కొనసాగింది. గౌతమ్ దగ్గరి నుంచి జెండా లాక్కునేందుకు అందరూ కలిసి ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలా మిగతా రెండు రౌండ్లలో గౌతమ్.. ప్రేరణ, నిఖిల్‌ను తీసేశాడు.గౌతమ్ దూకుడుకు బ్రేక్ వేసిన రోహిణితర్వాతి రౌండ్లో మిగిలినవాళ్లు గౌతమ్‌ను లాక్ చేశారు. అలా అతడి దగ్గరి నుంచి రోహిణి జెండా తీసుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ గౌతమ్‌ను రేసులో నుంచి తొలగించింది. అనంతరం అవినాష్.. విష్ణును రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. చివర్లో అవినాష్, రోహిణి మాత్రమే మిగిలారు. స్నేహితురాలిని గెలిపించడం కోసం అవినాష్ జెండా త్యాగం చేయడంతో రోహిణి కంటెండర్‌గా నిలిచింది. తనకోసం అవినాష్ త్యాగం చేయడంతో ఆమె చిన్నపిల్లలా ఏడ్చేసింది.ఆగమైన సంచాలక్బిగ్బాస్ నిలబెట్టు-పడగొట్టు అనే రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. అర్హత లేదనుకున్న వ్యక్తి ఫోటోను వేస్ట్ బాక్స్‌లో పడేయాలి. ఇందులో అందరూ వారు తెచ్చుకున్న ఫోటోలు పడేయగా గౌతమ్ తాను తీసుకున్న నబీల్ ఫోటో పడేయలేకపోయాడు. దీంతో సంచాలక్ రోహిణి.. నబీల్ను విజేతగా ప్రకటించింది. ఇక్కడే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ గేమ్ సరిగానే ఆడారా? అని ప్రశ్నించాడు. విష్ణు గెలుపుదీంతో ఆలోచనలో పడ్డ రోహిణి.. టాస్క్‌ను ప్రేరణ, విష్ణు మినహా ఎవరూ సరిగా ఆడనట్లు గుర్తించింది. చర్చోపచర్చల అనంతరం విష్ణు గెలిచినట్లు తెలిపింది. రోహిణి, విష్ణుప్రియలో ఎవరు ఓట్ అప్పీల్ చేయాలో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అవినాష్ మినహా మిగతా అందరూ విష్ణుకు సపోర్ట్ చేయడంతో ఆమె ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం పొందింది.మహిళా విజేతగా నిలవాలనుందివిష్ణుప్రియ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా వివిధ షోలలో నన్ను చూసి, ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను నన్నుగా ప్రేమించి పద్నాలుగువారాల వరకు తీసుకొచ్చినవారికి థ్యాంక్స్. నా ప్రవర్తన నచ్చనివారికి సారీ.. ఇంకా ఒక్కవారమే ఉంది. మీ ప్రేమాభినాలు ఇలాగే కొనసాగించి నన్ను విజేతను చేస్తారని కోరుకుంటున్నాను. వీలైనంతవరకు నిజాయితీగా ఉన్నాను. బిగ్‌బాస్ చరిత్రలో మహిళా విజేత అవ్వాలన్నది నా కోరిక.. అందుకు మీ సాయం కావాలి. మీ ఓటే నా గెలుపు అని ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించింది.సంగీత కచేరీఇక టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేకంగా సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. జామర్స్ బ్యాండ్‌ను పిలిచి లైవ్ కన్సర్ట్ ద్వారా వినోదాన్ని పంచాడు. సంగీతంతో హౌస్మేట్స్ తమ బాధలన్నీ మర్చిపోయి రిలాక్స్ అయ్యారు. పాదమెటు పోతున్నా.. అనే ఫ్రెండ్షిప్ పాటకైతే అందరూ కలిసిపోయి డ్యాన్స్ చేయడం కన్నులపండగ్గా ఉంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ను తప్పుపట్టిన బిగ్‌బాస్.. అయినా అతడిదే గెలుపు!
ప్రేరణ ఆటలో గెలిచింది. కానీ సంచాలకురాలిగా మాత్రం తడబడింది. నిన్న ప్రేరణ ఓట్లు అడిగే ఛాన్స్ పొందగా నేడు ఆ అదృష్టం నబీల్ను వరించింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అడ్డదిడ్డంగా చుట్టేసిన నబీల్ఓట్ అప్పీల్ గెలిచేందుకు బిగ్‌బాస్ క్రాసింగ్ పాత్ అనే మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో నబీల్ అడ్డదిడ్డంగా తన తాడును పోల్‌కు చుట్టేసి అందరికంటే ముందు గంట కొట్టాడు. తర్వాత రోహిణి గంట కొట్టింది. అనంతరం ప్రేరణ, గౌతమ్, నిఖిల్ వరుసగా గంట కొట్టారు. అయితే నిఖిల్ తన పోల్‌కు బదులు వేరేవారి పోల్‌కు తాడు చుట్టాడు. దీంతో నాలుక్కరుచుకుని మళ్లీ తన పోల్‌కు తిరిగి చుట్టాడు. విష్ణుప్రియ, అవినాష్ చివరి స్థానాల్లో ఉన్నారు.నేనే గెలిచా: ప్రేరణహౌస్మేట్స్ అందరూ కలిసి ఎవరు గెలిచారో చెప్పాలన్నాడు. నబీల్ తాడు సరిగా చుట్టలేదని, తానే గెలిచానని ప్రేరణ వాదించింది. లేదు, నేనే ఫస్ట్ అని నబీల్ అరుస్తూ ఉండటంతో ఆమె అతడిని ఇమిటేట్ చేసింది. ఇన్నాళ్లూ అవతలివారిని వెక్కిరించిన నబీల్.. తనను ఒకరు ఇమిటేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు. నన్ను వెక్కిరిస్తే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చాడు.నబీల్‌కు బిగ్‌బాస్ కౌంటర్చివరకు అందరూ కలిసి నబీల్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పుడు బిగ్‌బాస్.. మీరు తాడును సరిగా చుట్టారని అనుకుంటున్నారా? అని అడగడంతో అందరూ మనసు మార్చుకుని ప్రేరణ పేరు చెప్పారు. అయినా నబీల్ తనది కరెక్టే అనడంతో మీకు చుట్టడమంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించాడు. దీంతో అతడు కిక్కురుమనకుండా ఉండిపోయాడు.అయోమయం.. గందరగోళంఈ ఆటలో ఎవరు ఓడిపోయారని ప్రేరణను అడగ్గా ఆమె మొదట అవినాష్ పేరు చెప్పింది. గంట కొట్టేశాక మళ్లీ ఆడటం తప్పు కాదా? అని అవినాష్ అడగడంతో ఆమె మనసు మార్చుకుని నిఖిల్ పేరు చెప్పింది. అందుకతడు అభ్యంతరం చెప్పడంతో ఆమె మళ్లీ యూటర్న్ తీసుకుని అవినాష్ పేరు చెప్పి ఇదే ఫైనల్ నిర్ణయమంది. దాంతో అవినాష్ రేసు నుంచి తప్పుకున్నాడు.నబీల్‌కు ఓట్లు అడిగే ఛాన్స్టర్ఫ్ వార్ అని బిగ్‌బాస్ మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో చివరివరకు సర్కిల్లో ఉన్నవారు విజేతగా నిలుస్తారు. మొదటగా ప్రేరణను తోసేశారు. తర్వాత వరుసగా గౌతమ్, నిఖిల్, రోహిణిని తోసేశారు. చివర్లో నబీల్, విష్ణుప్రియ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ పొందాలో ఇంటిసభ్యులు నిర్ణయించాలన్నాడు. అందరూ కలిసి నబీల్ను సెలక్ట్ చేశారు.ప్రాణం పోయినా సరేనని..నబీల్ మాట్లాడుతూ.. నేనొక సామాన్యుడిని. సినిమాల్లో నటుడవ్వాలని కలలు కన్నాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా ఎక్కడా అవకాశం రాలేదు. ఎవరో అవకాశాలివ్వడమేంటని సోషల్ మీడియాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. తొమ్మిది సంవత్సరాల్లో నాకు వచ్చిన పెద్ద అవకాశం బిగ్‌బాస్. ప్రాణం పోయినా సరే అని టాస్కులు గెలవాలని ఆడాను. నన్ను విజేతగా చూడాలన్నది మా అమ్మ కల. దాన్ని మీరే నిజం చేయాలి అంటూ ప్రేక్షకులను ఓట్లు వేయమని అభ్యర్థించాడు.ఎన్నాళ్లకెన్నాళ్లకు..అనంతరం ప్రముఖ చెఫ్ సంజయ్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. అలాగే వారికోసం రుచికరమైన భోజనం వండి మరీ తీసుకొచ్చాడు. నిఖిల్, గౌతమ్ మధ్య దూరాన్ని చెరిపేస్తూ ఒకరికొకరు ఫుడ్ తినిపించుకోమన్నాడు. స్టార్టర్, బిర్యానీ, ఐస్‌క్రీమ్స్ అన్నీ కడుపారా తిన్న కంటెస్టెంట్లు ఇది జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమంటూ ఫుల్ ఖుషీ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నీచంగా మాట్లాడిన గౌతమ్.. కొంపముంచేంత పని చేసిన నబీల్!
నిన్నమొన్నటివరకు కిచెన్‌లో ఎంత సేపు వంట చేసుకోవాలన్నది బిగ్‌బాసే డిసైడ్ చేసేవాడు. గంట, రెండు గంటలు మాత్రమే టైమ్ ఇచ్చేవాడు. సీజన్ ముగింపుకు వచ్చేసిన సందర్భంగా కిచెన్ టైమర్‌ను అన్లిమిటెడ్ చేసేశాడు. నామినేషన్స్ లేకపోయినా అలాంటి ఓ ప్రక్రియ పెట్టడంతో గౌతమ్, నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుకున్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రోహిణిని ఆటపట్టించిన గౌతమ్చాలాకాలంగా మనసులో దాచుకున్న మాటను చెప్పేస్తున్నానంటూ రోహిణి దగ్గర తెగ సిగ్గుపడిపోయాడు గౌతమ్. కానీ నోరు తెరుస్తూనే.. ఈ హౌస్‌లో ఉన్న అమ్మాయిలందరూ నా అక్కలు. ఓ సహోదరుడిగా నీకు ఎల్లప్పటికీ తోడుగా, నీడగా ఉంటాను అని చెప్పాడు. ఆ మాటతో అవాక్కయిన రోహిణి.. ఎవడ్రా నీకు అక్క అంటూ గౌతమ్‌ను సరదాగా తిట్టిపోసింది.సెకండ్ ఫైనలిస్ట్ ఎంపికతర్వాత బిగ్‌బాస్.. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ మినహా మిగతా అందరూ నేరుగా నామినేట్ అయినట్లు ప్రకటించాడు. రెండో ఫైనలిస్ట్ ఎంపిక కోసం ఓ టాస్క్ పెట్టాడు. ఎవరైతే ఫినాలేలో ఉండకూడదనుకుంటున్నారో వారి ఫోటోను కాల్చేయాలన్నాడు. చివరకు ఎవరి ఫోటో అయితే కాలకుండా ఉంటుందో వాళ్లు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. మొదటగా అవినాష్.. విష్ణుప్రియ ఫోటో కాల్చేశాడు. విష్ణుప్రియ వంతురాగా.. ఎవరితోనూ ఎక్కువగా కలవట్లేదు, నీ గేమ్ అర్థం కావట్లేదంటూ గౌతమ్ ఫోటో కాల్చేసింది. అమ్మాయిలను వాడుకున్నావ్గౌతమ్.. పదేపదే పోట్రే చేస్తున్నానని నాపై లేనిపోని నింద వేశావంటూ నిఖిల్‌ను రేసులో నుంచి తీసేయాలనుకున్నాడు. నిఖిల్ స్పందిస్తూ.. వచ్చినప్పటినుంచి నువ్వు అదే చేస్తున్నావని వాదనకు దిగాడు. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని వాడుకుంది నువ్వు, అమ్మాయిలను వాడుకున్నావ్ అంటూ నీచంగా మాట్లాడాడు. ఇలానే మరోసారి కాస్త వల్గర్‌గా మాట్లాడటంతో నిఖిల్ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఇంకోసారి నోరు జారి మాట్లాడితే బాగోదని హెచ్చరించాడు.రోహిణిని తప్పించిన నిఖిల్ఈ గొడవను ఆపేయమని చెప్తున్నా కూడా.. గౌతమ్ వినకుండా విషయాన్ని సాగదీస్తూనే ఉన్నాడు. యష్మికి గాజులు సెట్ చేస్తూ ఆమెకు హోప్స్ పెట్టడం తప్పంటూ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి మరింత ఇరిటేషన్ తెప్పించాడు. అనంతరం నిఖిల్.. నామినేషన్స్‌లోకి రాలేదంటూ రోహిణిని రేసు నుంచి తప్పించాడు. నామినేషన్స్‌లోకి రాకపోయినా నేను అన్ని గేమ్స్ గట్టిగానే ఆడాను అని రోహిణి సమాధానమిచ్చింది. చివర్లో ప్రేరణ, నబీల్.. ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరికి బిగ్‌బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఇమ్యూనిటీ కొనుక్కోవాలన్న బిగ్బాస్మీ ముందున్న చెక్‌పై రూ.15 లక్షల వరకు ఎంతైనా రాసి ఇమ్యూనిటీ కొనుక్కోవచ్చన్నాడు. ఆ డబ్బు విన్నర్ ప్రైజ్‌మనీలో నుంచి కట్ అవుతాయన్నాడు. కాసేపు ఆలోచించుకున్నాక ఇద్దరూ తమకు తోచినంత అమౌంట్ రాశారు. ఇంతలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇమ్యూనిటీ కొనుక్కోకుండా వారిని నామినేషన్స్‌లో ఉంచేందుకు హౌస్మేట్స్ ఒప్పించవచ్చన్నాడు.చెక్కులు చింపేయమన్న హౌస్మేట్స్ప్రైజ్మనీని ఒక్కో రూపాయి సంపాదిస్తూ ఇక్కడివరకు తేవడానికి అందరం ఎంతో కష్టపడ్డాం. మీకు జనాలు ఓటు వేశారు కాబట్టే పద్నాలుగోవారం దాకా వచ్చారు అని నిఖిల్ చెక్ చించేయమన్నాడు. మిగతావాళ్లు కూడా అదే సలహా ఇచ్చి ఎలాగోలా ఒప్పించడంతో ప్రేరణ, నబీల్.. ఫైనలిస్ట్ స్థానాన్ని కొనుక్కోవాలనుకోవడం లేదని చెప్పారు. రాసిన చెక్కులు చింపేయడానికంటే ముందు ఇద్దరు ఎంత రాశారో చెప్పాలన్నాడు. నబీల్ స్వార్థంప్రేరణ.. రూ.4,30,000 రాయగా నబీల్ ఏకంగా రూ.15 లక్షలు రాసేశాడు. అది విని హౌస్మేట్స్ నోరెళ్లబెట్టారు. కంటెస్టెంట్లే కాదు చూసే జనాలు కూడా వీళ్లు ఇంత స్వార్థంగా ఉన్నారేంటని ఈసడించుకోవడం ఖాయం. ఏదేమైనా వీరిద్దరూ మనసులు మార్చుకుని చెక్కులు చించేయడంతో నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. ఈ వారం గౌతమ్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'బిగ్ బాస్ అంటే ప్రేక్షకులకు ఫ్లవరు.. పార్టిసిపెంట్స్‌కు ఫైరు'
నిను వీడను నేను....అనే పాటలోని వాక్యం బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌కు సరిగ్గా సరిపోతుంది. ఏ సిరీస్ అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే...ఒక్కసారి బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళును జీవితకాలం బిగ్ బాస్ నీడలా వారి వెంట ఉంటాడు. అదెలాగంటారా..ప్రతి సీరిస్‌లో పాత వాళ్ళు వచ్చి పార్టిసిపెంట్స్ ను పలకరిస్తారు, వారి టాస్కులతో పులకరిస్తారు. ఇదే జరిగింది ఈ వారం బిగ్ బాస్‌లో. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ కోసం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు పాత సీజన్ల నుండి పార్టసిపెంట్సును తీసుకువచ్చి వారిచే టాస్కులు ఆడే ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. అలానే ఆ కంటెస్టెంట్లు టాస్కులతో పాటు కంటెస్టెంట్స్ మధ్య కాసింత గిల్లికజ్జాలు పెట్టి వెళ్ళారు. ఇదే ఈ వారం బిగ్ బాస్ ప్రేక్షకులకు పండుగ. అందరికీ తెలిసినట్టు హౌస్‌లో గ్రూపిజం బాగా కనపడుతుంది. ఒకటి మొదటి నుండి వున్న గ్రూప్ అయితే రెండోది వైల్డ్ కార్డ్ గ్రూప్. ఆ గ్రూపులు మధ్య ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ ఫైట్లు. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ ఫైనల్ టాస్కు ముందు ఈ గ్రూపుల మధ్య ఓ పెద్ద తగాదానే నడిచింది. ఆ తగాదా తినే దోశ కోసం ఎగ పడ్డారు. ఎపిసోడ్లో ఈ దోశ పంచాయితీ కనీసం పది నిమిషాల చూపించి ప్రేక్షకుల ఆరాటాన్ని బాగానే క్యాష్ చేసుకున్నాడు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ కోసం పెట్టిన టాస్కులలో విజేతగా నిలిచాడు అవినాష్. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా టేస్టీ తేజ , పృథ్వి ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లోపల, బయట చూసే ప్రేక్షకులు బిగ్ బాస్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో కాని సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్, గ్రూప్స్ ఆ పై సోషల్ యూజర్స్ మధ్య బిగ్ బాస్ గురించి కొట్లాట... ఇన్ని జరుగుతున్నాయి. అందుకే బిగ్ బాస్ అంటే ఫ్లవర్ కాదు బిగ్ బాస్ చేస్తున్నవాళ్ళకి, చూస్తున్నవాళ్ళకి వాళ్ళ మధ్య మంట పెట్టే ఫైరు. కాబట్టే బిగ్ బాస్ తగ్గేదేలే....-ఇంటూరు హరికృష్ణ -
పృథ్వీ ఎలిమినేట్.. నిజాయితీగా ఎలా ఉండాలో నేర్చుకోమన్న విష్ణు
ఈరోజు మొదటగా గౌతమ్‌ను సేవ్ చేశాడు నాగార్జున. తర్వాత ఓ ఫన్ గేమ్ కోసం హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్స్‌గా విడగొట్టాడు. అవినాష్, రోహిణి, నబీల్, గౌతమ్ ఒక టీమ్ కాగా మిగతావారంతా విష్ణుప్రియ టీమ్‌గా విభజించాడు. హుక్ స్టెప్ వేస్తే ఆ సాంగ్ ఏంటో గెస్ చేయాలన్నదే గేమ్. ఇందులో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. మరి తర్వాత ఏం జరిగిందో నేటి (డిసెంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..షాక్‌లో ప్రేరణఈ వారం ప్రేరణ సేవ్ అవుతుందని కలలో కూడా అనుకోలేదేమో! ఆమె సేవ్ అయినట్లు చెప్పగానే నమ్మలేనట్లు నోరెళ్లబెట్టింది. వెంటనే తేరుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఆ వెంటనే నిఖిల్‌ను సైతం సేవ్ చేశాడు. తర్వాత కళ్లకు గంతలు కట్టి మ్యూజికల్ చెయిర్ గేమ్ ఆడించాడు. ఇందులో నిఖిల్, అవినాష్‌ను సంచాలకులుగా పెట్టారు. ఇందులో పృథ్వీ గెలిచాడు.టాప్ 8 కోసం స్పెషల్ పోస్టర్స్హౌస్లో ఉన్న ఎనిమిది కోసం బిగ్‌బాస్ స్పెషల్ పోస్టర్స్ క్రియేట్ చేశాడు. అలా నబీల్ కోసం డబుల్ ఇస్మార్ట్, విష్ణుప్రియ కోసం నిన్ను కోరి, పృథ్వీ కోసం యానిమల్, గౌతమ్ కోసం ఏక్ నిరంజన్, రోహిణి కోసం అరుంధతి, ప్రేరణకు అందాల రాక్షసి, నిఖిల్‌కు ద ఫ్యామిలీ స్టార్, అవినాష్ కోసం సుడిగాడు పోస్టర్స్ వేశాడు.ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండటం ఎలా?అనంతరం నబీల్ను సేవ్ చేసినట్లు ప్రకటించాడు. నెక్స్ట్ ఓ చిన్న టాస్క్ పెట్టాడు. కొన్ని టైటిల్స్ రాసున్న బుక్స్‌ను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని ప్రేరణ.. అవినాష్‌కు డెడికేట్ చేసింది. సరైన కారణాలు లేకుండా నామినేట్ చేయడం ఎలా? పుస్తకాన్ని గౌతమ్ నిఖిల్‌కు ఇచ్చాడు.బ్రెయిన్ వాడమన్న అవినాష్బ్రెయిన్ వాడి ఆడటం ఎలా? పుస్తకాన్ని అవినాష్.. విష్ణుప్రియకు ఇచ్చాడు. సపోర్ట్ కోరుకోకుండా ఉండటం నేర్చుకో అన్న పుస్తకాన్ని నబీల్.. రోహిణికి డెడికేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడకుండా ఉండటం ఎలా? అనేది అవినాష్‌కు ఇచ్చాడు పృథ్వీ. నిజాయితీగా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని విష్ణు.. అవినాష్‌కు ఇచ్చింది.పృథ్వీ ఎలిమినేట్ఒక్కరిని టార్గెట్ చేయకుండా ఉండటం ఎలా? అన్న బుక్‌ను నిఖిల్.. అవినాష్‌కు ఇచ్చాడు. తర్వాత నాగార్జున విష్ణును సేవ్ చేసి పృథ్వీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దాంతో విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు గొప్ప మనిషివి పృథ్వీ, ఐ మిస్ యూ అంటూ ఏడ్చేసింది.కన్నీళ్లు పెట్టుకున్న పృథ్వీఅటు స్టేజీపైకి వచ్చిన పృథ్వీ తన జర్నీ చూసుకుని ఎమోషనలయ్యాడు. కాసేపటికి తేరుకున్నాక హౌస్‌మేట్స్‌తో మాట్లాడాడు. నిఖిల్, నబీల్, విష్ణు సూపర్ హిట్ అని.. రోహిణి, అవినాష్ సూపర్ ఫ్లాప్ అని చెప్పాడు. నిఖిల్, నబీల్, విష్ణు, ప్రేరణకు తప్పకుండా ఓటేస్తానన్నాడు. చివర్లో నాగార్జున ఓ సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఈ సీజన్ విజేతకు ట్రోఫీ, ప్రైజ్‌మనీతో పాటు బ్రాండెడ్ కారు కూడా లభిస్తుందని చెప్పాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ
నాగార్జున వచ్చీరావడంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. అయితే టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకుని నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోయాడని గుడ్‌న్యూస్ చెప్పాడు. అంతేకాదు ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ అతడికి ఓ ట్రోఫీ కూడా ఇచ్చారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నోరు తీపి చేసిన బిగ్బాస్ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్‌ను మనసులో కోరిక చెప్పమనగా.. మందు బాటిల్స్, స్వీట్స్ కావాలంటూ చిట్టా బయటపెట్టాడు. మందు కుదరదు కానీ స్వీట్స్‌తో సరిపెట్టుకోమంటూ బిగ్‌బాస్ గులాబ్‌జామూన్ పంపించి హౌస్మేట్స్ నోరు తీపి చేశాడు. అలాగే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అతడికి హౌస్మేట్స్ పెట్టిన బ్యాడ్జ్ ప్రకారం రూ.4 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అలా ప్రైజ్‌మనీ రూ.54,30,000కి చేరింది.బ్లాక్ టికెట్.. గోల్డెన్ టికెట్తర్వాత నాగ్.. హౌస్‌లో కొందరికి బ్లాక్ టికెట్, మరికొందరికి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. ఎవరికి బ్లాక్ టికెట్ ఇవ్వాలని నిఖిల్‌ను అడగ్గా తేజ పేరు చెప్పాడు. గౌతమ్ వంతు రాగా.. అతిథులు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే వారితో సరిగా ప్రవర్తించలేదని ప్రేరణ పేరు సూచించాడు. దీంతో ఆమె ఫౌల్ గేమ్ ఆడిన వీడియో నాగ్ ప్లే చేశాడు. ఇలా ఆడితే బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వకపోతే ఏం చేస్తారన్నట్లు క్లాస్ పీకాడు. రోహిణి.. ఫౌల్ గేమ్ ఆడాడంటూ పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గేమ్స్ గెలిస్తే టైటిల్ రాదు!అవినాష్.. నబీల్‌కు, తేజ.. విష్ణుకు బ్లాక్ టికెట్ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఎవరు ఈ సీజన్ విన్నర్ అనుకుంటున్నావని విష్ణును అడగ్గా తనే గెలుస్తానంది. గెలవాలంటే ఈ ఆట సరిపోదుకదా అని నాగ్ అంటుంటే.. ఆటలన్నీ గెలిచినవారు టైటిల్ సాధించినట్లు బిగ్‌బాస్ చరిత్రలోనే చూడలేదని వేదాంతం చెప్పింది. అది తప్పని, జనాలు.. ఆట, మాట.. ఇలా ప్రతి ఒక్కటి చూస్తారని స్పష్టం చేశాడు.గౌతమ్‌కు గోల్డెన్ టికెట్ప్రేరణ.. గౌతమ్‌కు బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గౌతమ్ అందుకు అర్హుడంటూ నబీల్, విష్ణు, పృథ్వీ, నిఖిల్ కూడా చేయెత్తారు. అప్పటివరకు హౌస్మేట్స్ చెప్పిన అందరికీ బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటూ పోయిన నాగార్జున.. గౌతమ్‌కు మాత్రం బ్లాక్ టికెట్ ఇవ్వనంటూ గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అలాగే రోహిణి, నిఖిల్, అవినాష్‌కు సైతం గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అనంతరం దమ్ము-దుమ్ము అని ఓ గేమ్ ఆడించాడు. ట్రోఫీని పైకి ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్మయిపోయే వ్యక్తి ఎవరు? అనేది చెప్పాలన్నాడు. నిఖిల్ దమ్మున్న ప్లేయర్నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ.. నిఖిల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము అని తెలిపారు. రోహిణి.. గౌతమ్ దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ ఫినాలే వరకు రాకపోవచ్చంది. తేజ.. ఎంటర్టైనర్లు కూడా గెలవగలరని నిరూపిస్తారంటూ అవినాష్ దమ్మున్న ప్లేయర్ అన్నాడు. విష్ణు ఉట్టి దుమ్మున్న ప్లేయర్ అన్నాడు. గౌతమ్.. రోహిణి దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ దుమ్ము అని తెలిపాడు. అవినాష్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, ఫౌల్ గేమ్స్ ఆడతాడంటూ పృథ్వీని దుమ్ము కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు.గౌతమ్‌పై కోపాన్నంతా కక్కేసిన తేజతర్వాత తేజ.. గౌతమ్‌పై తన కోపాన్నంతా కక్కేశాడు. టికెట్ టు ఫినాలే ఆడే క్రమంలో ఓ గేమ్‌లో గౌతమ్ నా పేరు సెలక్ట్ చేయకపోవడంతో బాధేసిందని, అదే విషయం అతడిని నిలదీశానన్నాడు. నామినేషన్స్‌లో ప్రేరణతో అంత గొడవైనా కూడా ఆమెనే ఎందుకు సెలక్ట్ చేశాడు? అక్కడ నేను ఫ్రెండ్ కాబట్టి నన్ను సెలక్ట్ చేస్తే అతడికి సోలో బాయ్ అనే ట్యాగ్ పోతుందని వెనకడుగు వేశాడు. ప్రేరణను సెలక్ట్ చేస్తే తనకు మంచి పేరొస్తుందని లెక్కలు వేసుకున్నాడని తెలిపాడు.తేజ ఎలిమినేట్నా మనసుకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోయా.. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా అది నీ ఇష్టం అని గౌతమ్ ఒక్కముక్కలో తేల్చేశాడు. ఇక ప్రేరణ, నిఖిల్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము కంటెస్టెంట్ అని అభిప్రాయపడ్డారు. తేజ ఆడలేకపోతున్నాడని పేర్కొన్నాడు. అనంతరం నాగార్జున తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కల నెరవేర్చుకున్నాకే వెళ్లిపోతున్నానంటూ తేజ సంతోషపడితే అవినాష్ మాత్రం కంటనీరు పెట్టుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన తేజతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్‌మేట్స్‌ను కూరగాయలతో పోల్చాలన్నాడు. టాప్ 2లో గౌతమ్..అలా అవినాష్ ఉల్లిపాయ అని, ఈ సీజన్లో పెద్ద గెలుపు రోహిణిదేనంటూ బంగాళాదుంపతో పోల్చాడు. విష్ణుప్రియ కాకరకాయ అన్నాడు. ప్రేరణ.. మాట సరిగా లేకపోతే నెక్స్ట్ నువ్వే బయటకు వచ్చేస్తావని హెచ్చరిస్తూ బెండకాయ ఇచ్చాడు. పృథ్వీ.. విష్ణుప్రియను వదిలినట్లు కొన్ని గేమ్స్ కూడా వదిలేస్తున్నావంటూ పచ్చిమిర్చి ట్యాగ్ ఇచ్చాడు. గౌతమ్‌లో ఎన్ని పొరలుంటాయో వాడికే తెలీదంటూ క్యాబేజీతో పోల్చాడు. అతడు టాప్ 2లో పక్కాగా ఉంటాడనన్నాడు. నబీల్.. గేమ్‌లో కన్ఫ్యూజ్ అవుతున్నాడని, టాప్ 2లో ఉంటాడనుకుంటే ఇప్పుడు టాప్ 5కి వచ్చేశాడంటూ టమాటతో పోల్చాడు. నిఖిల్.. ఎమోషనల్‌గా వీక్ అంటూ అతడికి సోరకాయ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇన్నాళ్లకు విష్ణు కళ్లు తెరిపించిన శ్రీముఖి.. పృథ్వీతో కటీఫ్!
వైల్డ్కార్డ్స్కు టికెట్ టు ఫినాలే గెలిచే అర్హతే లేదన్నాడు పృథ్వీ.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అవినాష్ టికెట్ టు ఫినాలే ఎగరేసుకుపోయాడు. పృథ్వీ జపం చేస్తున్న విష్ణు కళ్లు తెరిపించింది శ్రీముఖి. మరి శ్రీముఖి ఏం చెప్పిందో నేటి (నవంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్ చూసేయండి..నాలుగో కంటెండర్‌గా తేజరోహిణి, అవినాష్, నిఖిల్ 'టికెట్ టు ఫినాలే' కంటెండర్లుగా నిలిచారు. వీరికి ఓ వ్యక్తిని కంటెండర్‌గా ఎన్నుకునే సూపర్ పవర్ ఇచ్చాడు. ముగ్గురూ కలిసి తేజ పేరు సూచించారు. ఇది పృథ్వీకి ఏమాత్రం నచ్చలేదు. తేజ, అవినాష్, రోహిణి.. ఈ ముగ్గురికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హత లేదన్నాడు. మరోవైపు తేజ, గౌతమ్‌తో గొడవపడ్డాడు. నువ్వు సోలోగా ఆడుతున్నావని చెప్పడానికి నన్ను ఆటలో సైడ్ చేశావంటూ నిందలు వేశాడు. నా నిర్ణయం నా ఇష్టం.. దానికి నువ్వు గౌరవమివ్వకపోతే నేనేం చేయలేను అని గౌతమ్ హర్టయ్యాడు.కరెక్ట్ గెస్ చేస్తే రూ.5 లక్షలుఅనంతరం యాంకర్ శ్రీముఖి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఎవరు టికెట్ టు ఫినాలే కొడతారో గెస్ చేయమని హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించింది. కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ అవుతాయంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది పందెమనే అనుకోవచ్చు. దీంతో ఇంటిసభ్యులు చర్చించుకుని నిఖిల్‌కు రూ.5 లక్షల బ్యాడ్జ్, అవినాష్‌కు రూ.4 లక్షలు, రోహిణికి రూ.3 లక్షలు, తేజకు రూ.2 లక్షలు అని రాసి ఉన్న బ్యాడ్జ్ ఇచ్చారు.నాకోసం అతడిని వదిలెయ్శ్రీముఖి.. విష్ణుప్రియ కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది. మొదటి మూడు వారాలు నువ్వు గెలుస్తావేమో అనిపించింది. ఆటలో కనెక్షన్స్ ఏర్పడతాయి. ఒకర్ని ఇష్టపడటం తప్పు కాదు. కానీ ఈ రెండు వారాలు నాకోసం ఆ అబ్బాయి(పృథ్వీ)తో స్నేహం వదిలెయ్. అతడు నాకిష్టం లేదు, ఆసక్తి లేదు అని అన్నిసార్లు చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు దిగజారి అతడి వెనకపడుతున్నావ్? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతడు ఆడడా? నీ ప్రేమకు విలువిచ్చి చెప్తున్నా.. ఒక్కరికే కాకుండా అందరినీ సపోర్ట్ చేయు అని మంచి మాటలు చెప్పింది. ఆశలు పెట్టుకోవద్దని చెప్పా: పృథ్వీఅటు పృథ్వీ దగ్గరకు వెళ్లి కూడా.. అందరూ మీ గురించి అడుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా అని అడిగింది. అందుకతడు.. నీపై ఆశలు పెట్టుకోవచ్చా? అని విష్ణు అడిగినప్పుడు కూడా నాపై ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పానన్నాడు. ఏదైనా ఉంటే షో అయిపోయాక చూసుకుందామని మీ ఇద్దరూ మాట్లాడుకోండని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో విష్ణు.. పృథ్వీతో తన స్నేహాన్ని పక్కనపెట్టి గేమ్‌పై ఫోకస్ చేస్తానని చెప్పింది.టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్అనంతరం గుర్తుపట్టు, గంట కొట్టు అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో తేజకు 1, రోహిణికి 2, అవినాష్‌కు 3, నిఖిల్‌కు 4 పాయింట్లు వచ్చాయి. తక్కువ పాయింట్లు వచ్చిన తేజ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత శ్రీముఖి అందరికోసం వంట చేయడం విశేషం. అనంతరం రోహిణి, అవినాష్, నిఖిల్‌కు.. కేవలం ఒక్క అడుగుదూరం అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ విజయం సాధించి టికెట్ టు ఫినాలే గెలిచాడు. తన కల నెరవేరడంతో అవినాష్ సంతోషంలో మునిగి తేలాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణతో వచ్చిన తంటా ఇదే! పృథ్వీ పొరపాటు నిఖిల్‌కు కలిసొచ్చింది!
గెస్టులుగా వస్తున్న మాజీ కంటెస్టెంట్లు అందరూ విష్ణు-పృథ్వీ లవ్ట్రాక్పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందరికీ మామీద ఎందుకంత ఇంట్రస్ట్ అని విష్ణుప్రియ కాస్త అసహనానికి లోనైంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..హౌస్‌లో వితికా, పునర్నవిఅవినాష్ టికెట్ టు ఫినాలే కంటెండర్ అవడాన్ని ప్రేరణ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అవినాష్ ఓవర్ స్మార్ట్ అనుకున్నానే తప్ప అతడికంత దమ్ముందని అనుకోలేదంది. ఇంతలో మాజీ కంటెస్టెంట్లు వితికా షెరు, పునర్నవి భూపాలం హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌మేట్స్‌తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించారు. క్రష్ కోసం ఫ్రెండ్‌ను వదులుకున్నావా? అని పృథ్వీని అడగ్గా లేదని బదులిచ్చాడు.అబద్ధం చెప్పానన్న నిఖిల్మీరు ఆడిన అతిపెద్ద అబద్ధమేంటన్న ప్రశ్నకు నిఖిల్.. మెంటల్‌గా నేను స్ట్రాంగ్ అని అబద్ధమాడానన్నాడు. ట్రూలవ్ - నో ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్- నో లవ్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటావని నబీల్ను ప్రశ్నించగా అతడు క్షణం ఆలోచించకుండా ఫ్రెండ్స్ కన్నా ప్రేమే ముఖ్యమని బదులిచ్చాడు. ప్రస్తుతానికైతే సింగిల్ కింగునని తెలిపాడు.సింపతీ కార్డు?తర్వాత పునర్నవి విష్ణు-పృథ్వీలను ఇంటరాగేట్ చేసింది. విష్ణు ఫ్రెండ్ అని పృథ్వీ.. పృథ్వీ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని విష్ణు చెప్పారు. ఈ స్నేహం వల్ల మీ గేమ్ పాడవుతుందనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. అలా ఏం లేదన్నాడు పృథ్వీ. విష్ణును సింపతీ కార్డులా వాడుతున్నావని పునర్నవి అనగా అలాంటి కార్డు తనకక్కర్లేదన్నాడు. అనంతరం వితికా, పునర్నవి.. గేమ్ కోసం నిఖిల్, గౌతమ్‌ను సెలక్ట్ చేశారు. వీళ్లిద్దరూ పృథ్వీ, ప్రేరణను ఎంపిక చేశారు. పృథ్వీకి అన్యాయంతన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో తేజ హర్టయ్యాడు. జారుతూ గెలువు అని బిగ్‌బాస్ గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో నిఖిల్ 9, పృథ్వీ 10, ప్రేరణ, గౌతమ్ చెరో 5 డిస్కులు బాస్కెట్లో వేశారు. పృథ్వీ గేమ్‌లో చిన్న పొరపాటు చేశాడని అతడికి బదులుగా నిఖిల్‌ను విజేతగా ప్రకటించడం గమనార్హం. అలా పృథ్వీకి 2, ప్రేరణకు 3, గౌతమ్‌కు 4వ ర్యాంక్ ఇచ్చారు.ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ఈ గ్యాప్‌లో అవినాష్, రోహిణి, తేజ కామెడీ స్కిట్‌తో తెగ నవ్వించారు. తర్వాత రెండో గేమ్ ఆడించారు. కానీ ఇక్కడ ముగ్గురికే ఛాన్స్ ఉంటుందనడంతో ప్రేరణను తప్పించి మిగతా ముగ్గురితో ఆడించారు. సంచాలక్‌గా ఉన్నప్పుడు తమ మాట వినలేదంటూ ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఆ బ్యాడ్జ్ తనకెలా ఇస్తారని గెస్టులతో వాగ్వాదానికి దిగింది. ఇంతలో బిగ్‌బాస్.. టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ప్రేరణను తొలగించినట్లు ప్రకటించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.కోపం, బాధర్యాంకుల ఆధారంగా బిగ్‌బాస్ ఇచ్చిన అడ్వాంటేజ్‌తో నిఖిల్, పృథ్వీ, గౌతమ్ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో నిఖిల్ గెలవగా గౌతమ్ రెండో స్థానంలో, పృథ్వీ మూడో స్థానంలో నిలిచారు. రెండు గేమ్స్‌లో నిఖిల్‌నే విజేతగా ప్రకటించడంతో అతడికే కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. గెస్టులు వెళ్లిపోతుంటే కూడా ప్రేరణ వారితో మాట్లాడేందుకు నిరాసక్తత చూపించింది. హత్తుకునేందుకు వస్తే కూడా ముఖం తిప్పేసుకుంది. రేసు నుంచి తీసేశారన్న బాధ ఉండటం సహజమే.. కానీ దాన్నిలా రూడ్‌గా వ్యక్తం చేయడం వల్లే తనకు మైనస్ అవుతోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓపక్క తిట్టుకుంటూ మరోపక్క బుగ్గ గిల్లుతూ నామినేషన్స్
నామినేషన్స్‌లో ఫైర్ చూపించాలని నబీల్ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో, ఏమోకానీ ఓపక్క కోప్పడుతూనే మరోపక్క బాధపడుతున్నట్లు కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఫైర్ లేదుబిగ్బాస్ హౌస్‌లో పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టుగా చూడకూడదనుకుంటున్న ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా నబీల్.. నామినేషన్స్‌లో తప్ప గేమ్‌లో ఫైర్ లేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. నబీల్‌తో పెట్టుకుంటే బొరాన్ ఉంటదంటూ దమ్కీ ఇచ్చాడు.ఆ ఫోకస్ గేమ్‌పై చూపించునీ గేమ్ కనిపించడం లేదు, నీకు సీరియస్‌నెస్ లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్ గేమ్‌పై పెడ్తే గెలుస్తావని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా.. అమ్మాయిలు గొడవపడ్తున్నప్పుడు మెగా చీఫ్‌గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.తొడగొట్టిన అవినాష్ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయట్లేదు, ఆడియన్స్ నిన్ను నామినేషన్స్‌లోకి వచ్చినవారమే ఎలిమినేట్ చేశారు, కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్.. నేను వచ్చిన ఏడువారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యానంటూ తొడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ.. కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్లిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం.విష్ణు ఎవర్ని నామినేట్ చేసిందంటే?ప్రేరణ.. గెలవాలన్న స్పిరిట్ నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్ చాలాసేపు గొడవపడ్డారు. తేజ.. నీ గేమ్ నచ్చలేదంటూ విష్ణును, ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. తేజను, ప్రేరణను నామినేట్ చేసింది.మాట తప్పావ్: గౌతమ్గౌతమ్.. ఫిజికల్ అవకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్‌లో ఫిజికల్ అయ్యావని నిఖిల్‌ను నామినేట్ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతడినెందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు. వీళ్లిద్దరూ గొడవపడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికిచిలికి గాలివానలా మారింది.నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణతర్వాత ప్రేరణను నామినేట్ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తావని ఆమె అనడంతో.. నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ.. నేను ట్రిగ్గర్ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్ ఫ్రస్టేట్ అయ్యాడు. అవినాష్ వంతు రాగా.. మూటల టాస్క్‌లో ఫౌల్ గేమ్ ఆడావు, ఎదుటివారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని, కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.మెగా చీఫ్ తప్ప అందరూ నామినేషన్లోనిఖిల్ వంతు రాగా గౌతమ్, ప్రేరణను నామినేట్ చేశాడు. చివరగా మెగా చీఫ్ రోహిణి.. నేను పక్కవాళ్లను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్ చేసింది. గేమ్‌లో నిన్నెవరైనా సైడ్ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్ అన్నావంటూ నబీల్ను నామినేట్ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ నలుగురు ఫ్రెండ్స్.. గౌతమ్ శత్రువన్న యష్మి.. అతడిపైనే బిగ్‌బాంబ్
ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నేను చెప్పేదే నిజంనాగార్జున.. ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్‌సెట్ నుంచి బయటకు రావాలని నబీల్, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు. గౌతమ్‌పై వచ్చిన కంప్లైంట్స్..అన్‌ప్రిడక్టబుల్‌గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ .. గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు. ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలీదునీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్‌లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్.. విష్ణు గురించి కంప్లైంట్ చేశారు.ఎక్కువ విని తక్కువ మాట్లాడాలినువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్.. ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్.. అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తావ్.. అని గౌతమ్.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్, మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్.. ప్రేరణకు చెప్పారు.నబీల్‌పై ఫిర్యాదులుకామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్‌పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్.. నబీల్ గురించి తెలిపారు.యష్మి ఎలిమినేట్మనసులో మాట డైరెక్ట్‌గా చెప్పుంటే నా గేమ్ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్.. అతడి గేమ్ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్, పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. నిఖిల్ నా ఫేవరెట్ ఫ్రెండ్స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్‌లో గౌతమ్, అవినాష్, రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్‌లో గౌతమ్, నిఖిల్ పాములని మెజారిటీ హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్‌పై బిగ్‌బాంబ్ వేసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విన్నర్లు కాదు, పాములు.. గ్రూప్ గేమ్ తప్పు కాదన్న నాగ్..
విష్ణుప్రియ- రోహిణి, గౌతమ్-పృథ్వీల గొడవలు పరిష్కరించడానికి నాగార్జున తలప్రాణం తోకకొచ్చింది. గేమ్‌లో మిమ్మల్ని వెనక్కు లాగుతుందెవరు? అన్నప్పుడు గౌతమ్, నిఖిల్ పేర్లే ఎక్కువమంది చెప్పడం గమనార్హం. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..క్యారెక్టర్‌లెస్ అనలేదుగా: విష్ణునువ్వు జీరో, నీకు అర్హత లేదు.. అని నానామాటలన్నవారికి నీ విజయంతోనే సమాదానం చెప్పావంటూ నాగార్జున.. మెగా చీఫ్ రోహిణిని మెచ్చుకున్నాడు. ఆ వెంటనే రోహిణి, విష్ణును కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి వీళ్లిద్దరి గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ చూపించాడు. క్యారెక్టర్ అని తన వ్యక్తిత్వం గురించి అన్నానే తప్ప క్యారెక్టర్‌లెస్ అనలేదంది విష్ణు. దీనికి నాగ్.. ఆ పదం వాడినప్పుడే నీ క్యారెక్టర్ కనిపించిందన్నాడు.నిఖిల్‌కు ట్రై చేశా అనలేదునిఖిల్కు ట్రై చేశా వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా.. అని విష్ణు నిజంగానే అందా? అని రోహిణిని అడిగాడు. అందుకామె అవునని తలూపింది. అదే తన ప్లానా? అంటే కాదని చెప్పింది. దీనిపై విష్ణు స్పందిస్తూ.. నిఖిల్, నేను కలిసి బయట ఓ షో చేశాం. తన పర్సనాలిటీ అంటే ఇష్టమని చెప్పానే తప్ప ట్రై చేశాననలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏ ప్లాన్ వర్కవుట్ అయిందని విష్ణు హౌస్‌లో ఉంటోందన్నావని రోహిణిని అడగ్గా.. పృథ్వీతో లవ్ ట్రాక్ వల్లే ఆమె హౌస్‌లో ఉంటుందనిపిస్తోందని రోహిణి అభిప్రాయపడింది. తర్వాత ఇద్దరూ క్షమాపణలు చెప్పుకున్నారు.గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటన్న నాగ్పృథ్వీ, గౌతమ్ గొడవ గురించి నాగ్ చర్చించాడు. వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేయాలని గ్రూప్ గేమ్ ఆడారని గౌతమ్ చెప్పగా.. అందులో తప్పేముందన్నాడు నాగ్. నా ఉద్దేశంలో తప్పేనంటూ హోస్ట్పైకే తిరగబడ్డాడు గౌతమ్. పెద్ద తప్పు చేసినవారినే నామినేట్ చేయాలే తప్ప వైల్డ్ కార్డ్ అన్న కారణంతో నామినేట్ చేయడం ముమ్మాటికీ తప్పేనని వాదించాడు. ఇంతలో పృథ్వీ.. అతడు ఇండివిడ్యువల్ ప్లేయర్ అని నిరూపించుకోవడానికి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.నోర్మూయ్.. నాగ్ సీరియస్ఆట అయిపోయాక కెమెరాలతో మాట్లాడతావు, నీ ఆట ఎవరూ నొక్కలేరు అని నాగార్జున గౌతమ్‌పై సెటైర్లు వేశాడు. అప్పటికీ గౌతమ్ మాట్లాడుతూనే ఉండటంతో బీపీ తెచ్చుకున్న నాగ్.. నోర్మూయ్, నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకు అని తిట్టిపోశాడు. మనిషి పైపైకి వెళ్లడం తప్పని పృథ్వీని సైతం హెచ్చరించాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు.నిచ్చెన- పాముఆటలో మిమ్మల్ని ముందుకు తోస్తున్నదెవరు?(నిచ్చెన), వెనక్కు లాగుతుందెవరు?(పాము) చెప్పాలన్నాడు. రోహిణి.. అవినాష్ నిచ్చెన అని, పృథ్వీ పాము అని పేర్కొంది. అవినాష్.. తేజ నిచ్చెన, పృథ్వీ పాము అని తెలిపాడు. నబీల్.. పృథ్వీ నిచ్చెన, నిఖిల్ పాము అని పేర్కొన్నాడు. పృథ్వీ.. నబీల్ నిచ్చెన, గౌతమ్ పాము అన్నాడు. గౌతమ్.. రోహిణి నిచ్చెన, నిఖిల్ పాము అని చెప్పాడు.రెండు పాములునిఖిల్.. పృథ్వీ నిచ్చెన, గౌతమ్ పాము అంది. యష్మి.. ప్రేరణ నిచ్చెన, నిఖిల్ పాము అని తెలిపింది. తేజ.. అవినాష్ నిచ్చెన, విష్ణుప్రియ పాము అన్నాడు. విష్ణుప్రియ వంతురాగా పృథ్వీ వల్లే తనకు ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ అందుతున్నాయంటూ.. చివరకు నబీల్‌కు నిచ్చెన ఇచ్చింది. రోహిణికి పాము ఇచ్చేసింది. ప్రేరణ.. రోహిణి నిచ్చెన, గౌతమ్ పాము అని పేర్కొంది. నిఖిల్, గౌతమ్‌కు పాముగా సమాన ఓట్లు పడ్డాయని, వీరిలో ఒకరిపై బిగ్‌బాంబ్ పడబోతుందన్నాడు నాగ్. నిఖిల్‌ను సేవ్ చేయడంతో నేటి ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఫ్రాక్చర్ అయిన కాలుతో గేమ్ ఆడి గెల్చిన రోహిణి.. ప్లేటు మార్చిన విష్ణు!
తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లోనే ఇదొక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. రోహిణిని గడ్డిపరకలా తీసిపారేసింది విష్ణు.. అసలు పరిగెత్తడం వచ్చా.. అని వంకరగా చూస్తూ బాడీ షేమింగ్ చేశాడు పృథ్వీ. ఫ్రాక్చర్ అయిన కాలుతోనే గేమ్ ఆడి ఈ ఇద్దరినీ ఓడించి లేడీ టైగర్ అనిపించుకుంది రోహిణి. మరిన్ని విశేషాలు నేటి (నవంబర్ 22) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..యష్మి బకరామెగా చీఫ్ కంటెండర్లకు బిగ్‌బాస్ ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. చివరి వరకు ఆటోలో ఉన్నవారు ఎక్కువ పాయింట్లు గెలుస్తారన్నాడు. యష్మి, పృథ్వీ, విష్ణు కలిసి. తేజ, రోహిణిని తోసేశారు. పృథ్వీ, విష్ణు కలిసి యష్మిని తోయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నీకు సపోర్ట్ చేస్తే నువ్వేమో తోశావ్.. అలాంటప్పుడు నాకు సాయం చేస్తానని ఎందుకన్నావ్? మీరిద్దరూ ఎలా ఆడతారో చూస్తా.. అని నిలదీసింది.నీ ఒంట్లో ఫైర్ లేదు: విష్ణుఅందుకు రోహిణి.. వాళ్లు ఆడరు, ఒకరికోసం ఒకరు కాంప్రమైజ్ అవుతారంది. ఇంకేం చూస్తావులే, దిగు అని విష్ణుప్రియకు చెప్పింది. దీంతో విష్ణుకు బీపీ వచ్చింది. నీది నువ్వు చూసుకో, నీ ఒంట్లో ఫైర్ లేదు, పక్కనోళ్ల గేమ్ గురించి మాట్లాడకు. నువ్వు జీరో అని చీప్‌గా మాట్లాడింది. రోహిణి కూడా నువ్వే జీరో అనడంతో.. నీకన్నా ఎక్కువ వారాలున్నానంది. ఎందుకున్నావో నీకూ తెలుసు, నీ ప్లాన్ వర్కవుట్ అయింది, అందుకే ఉన్నావని రోహిణి ఉన్నమాట అనేసింది. విష్ణు బండారం బట్టబయలుదీంతో విష్ణు.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని నోరు జారింది. ఆ మాటతో రోహిణి.. ఫస్ట్ నిఖిల్‌కు ట్రై చేశా, వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని నువ్వే కదా చెప్పావు అని తన బండారం బయటపెట్టేసింది. ఈ గొడవ చల్లారాక విష్ణుప్రియను తోసేసి పృథ్వీ గెలిచాడు. టాస్క్ అయ్యాక విష్ణు.. రోహిణితో మళ్లీ వాదనకు దిగింది. తనే ఒప్పని నిరూపించుకోవాలని చూసింది. కానీ తన దగ్గర పప్పులు ఉడకనివ్వలేదు రోహిణి. నోరు అదుపులో పెట్టుకోఫైర్ లేదు, జీరో, క్యారెక్టర్ అంటూ నోరు జారుతున్నావ్.. నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించింది. అనంతరం తెడ్డు మీద గ్లాస్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో రోహిణి గెలవగా పృథ్వీ, తేజ, విష్ణుప్రియ, యష్మి తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా చివరి స్థానాల్లో ఉన్న యష్మి, విష్ణుప్రియను గేమ్ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్... పృథ్వీ, తేజ, రోహిణికి ఫైనల్ గేమ్ పెట్టాడు. సంచాలక్ కూడా గేమ్ ఆడింది!ఈ ఛాలెంజ్‌లో కంటెండర్లు.. కుండను కిందపడకుండా చూసుకోవాలి. బజర్ మోగినప్పుడల్లా హౌస్‌మేట్స్‌లో ఒకరు.. మెగా చీఫ్ అవకూడదనుకుంటున్న కంటెస్టెంట్ కుండలో రెండుసార్లు ఇసుక పోయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో యష్మి సంచాలక్‌గా వ్యవహరించింది. సంచాలక్ అయినప్పటికీ మధ్యమధ్యలో తను వెళ్లి అందరి కుండలు బ్యాలెన్స్ చేస్తానంటూ కేవలం రోహిణి కుండలోనే పదేపదే ఇసుక పోయడం గమనార్హం.రోహిణి ఎమోషనల్ఈ గేమ్‌లో అద్భుతంగా ఆడిన రోహిణి.. తేజ, పృథ్వీలను మట్టికరిపించింది. ఫ్రాక్చర్ అయిన కాలుతో రెండున్నర గంటలపాటు కుండను బ్యాలెన్స్ చేసింది. నేను మెగా చీఫ్ అయ్యాను.. ఆడి గెలుచుకున్నా అంటూ రోహిణి ఏడ్చేసింది. ఇక టాస్క్ మధ్యలో రోహిణిని నిఖిల్ పొగుడుతుంటే అవసరమా? అంటూ కన్నెర్రజేసిన విష్ణు.. చివర్లో మాత్రం నువ్వు హీరో అని అరవడం డ్రామాలాగే కనిపించింది.బాధలో పృథ్వీఒక్కసారి కూడా మెగా చీఫ్ కాలేకపోయినందుకు పృథ్వీ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇక చివరి మెగా చీఫ్ అయిన రోహిణి కోసం బిగ్‌బాస్ శివంగివే.. పాట ప్లే చేశాడు. బాడీ షేమింగ్ చేసిన పృథ్వీపై, జీరో అని హేళన చేసిన విష్ణుప్రియపై రోహిణి పైచేయి సాధించి తన సత్తా చూపించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!
ఈసారి మెగా చీఫ్ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్‌బాస్ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్‌లో చివరిసారి చీఫ్ అవుతారు. ఇకపోతే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హౌస్‌లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి షోలో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చివరి కంటెండర్పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్ కంటెండర్లవగా చివరగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవర్ని కంటెండర్ చేస్తారో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్.. చాలామంది వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్ చేశారు. అవన్నీ తట్టుకుని రోహిణి ఇక్కడిదాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్ ఇచ్చారు.గ్రూప్ గేమ్‌ను ప్రశ్నించిన గౌతమ్విష్ణుప్రియ నిఖిల్‌కు మద్దతిచ్చింది. ఇక పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్‌ను పంపించేయాలని ప్లాన్ చేశామన్నారు. ఓజీ, రాయల్ టీమ్స్‌గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్ ఏవీ చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్‌కు సపోర్ట్ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్.. పృథ్వీతో గొడవపడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకువచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. నా వెంట్రుక కూడా పీకలేవుపృథ్వీ.. గౌతమ్ పైపైకి వెళ్తూ వాడు, వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవొద్దని చెప్తున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్ అయింది. విశ్వక్సేన్ ఎంట్రీమెగా చీఫ్ అవడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్‌బాస్. అలా మొదటగా పట్టువదలని విక్రమార్కుడు టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10, యష్మి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ కక్కుర్తివస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకువచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వక్ కోరిక మేరకు తేజ, అవినాష్ పోల్ డ్యాన్స్ చేశారు. అనంతరం రోహిణి, అవినాష్‌తో కలిసి విశ్వక్ స్కిట్ కూడా చేశాడు. తర్వాత అవినాష్.. విశ్వక్ దగ్గర టీషర్ట్ దోచేశాడు. చివరగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నా ప్రయాణం ముగిసింది.. ఓట్లు వేయొద్దు: నిఖిల్
చేయని తప్పుకు నిందలు పడటం ఎవరికైనా కష్టమే! అవతలివారిపై నోరుజారకుండా ఆచితూచి మాట్లాడే నిఖిల్.. అమ్మాయిలను గేమ్ కోసం వాడుకుంటాడని సీత పెద్ద నిందేసి వెళ్లిపోయింది. ఆ మాటను నిఖిల్ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని కెమెరాలకు గోడు వెల్లబోసుకున్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్‌కు సారీ చెప్పిన యష్మిఆడవాళ్లను ట్రాప్ చేస్తున్నావ్.. ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావ్ అని సీత ఇచ్చిన స్టేట్మెంట్ విని ప్రేక్షకులే కాదు హౌస్మేట్స్ కూడా షాకయ్యారు. తనవల్లే అలాంటి నిందలు వచ్చాయంటూ నిఖిల్‌కు యష్మి సారీ చెప్పింది. నా వల్లే ఇదంతా మొదలైంది.. మన ఇద్దరి గేమ్ పాడవుతుందంటే మనం మాట్లాడకుండా ఉండటమే నయమని చెప్పుకొచ్చింది. తర్వాత ఒంటరిగా కూర్చున్న నిఖిల్ బిగ్‌బాస్‌కు తన గోడు చెప్పుకున్నాడు. నాకు ఓటు వేయకండి: నిఖిల్ఒకర్ని తొక్కి ఆడాలని ఎన్నడూ అనుకోలేదు. నామినేషన్స్‌లో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ మహిళల్ని అడ్డుపెట్టుకుని గేమ్‌లో గెలవాలనుకోలేదు. మనసుకు ఏమనిపిస్తే అదే చేశాను. ఎవర్నీ తొక్కాలనుకోలేదు. ఈ వారం నామినేషన్లో ఉన్నాను, హౌస్ నుంచి వెళ్లిపోవాలనిపిస్తోంది. ఇక్కడ నా ప్రయాణం అయిపోయింది. దయచేసి ప్రేక్షకులు ఎవరూ నాకు ఓటు వేయకండి.. నన్ను ఎలిమినేట్ చేయండి అని కోరుకున్నాడు. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండిమరికాసేపట్లోనే మనసు మార్చుకుని.. నేనేంటో నిరూపించుకున్నాకే బయటకు వస్తాను. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండి. కప్పు తీసుకునే బయటకు వస్తా అని తనకు తాను ధైర్యం చెప్పుకుని కెమెరాలతో మాట్లాడాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ప్రేరణ.. ఎవరినైనా బాధపెట్టుంటే క్షమించమని కోరుతూ ఏడ్చేసింది. అది నా వ్యక్తిత్వం కాదుయష్మి మాట్లాడుతూ.. నిఖిల్ గేమ్కోసం అమ్మాయిలను వాడుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ మాట్లాడుతూ.. నన్ను తప్పు అని నిందవేసినచోటే నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఒకర్ని వాడుకుని గేమ్ ఆడే వ్యక్తిత్వం నాది కాదు అని తెలిపాడు. అనంతరం తేజ నిద్రపోయినందుకు చీఫ్ అవినాష్ పనిష్మెంట్ ఇచ్చాడు. షర్ట్ తీసేసి స్విమ్మింగ్ పూల్‌లో 10 సార్లు దూకాలన్నాడు. ఈ టాస్క్ పూర్తి చేస్తే యష్మి.. తేజకు ముద్దుపెడతానంది. ముద్దు కోసం తేజ ఆశఆశతో పూల్‌లో పదిసార్లు మునకేసిన తేజను కళ్లుమూసుకోమని పక్కనే నిలబడింది యష్మి. తీరా నిఖిల్ వచ్చి తేజ చెంపపై ముద్దుపెట్టాడు. ఆ విషయం తెలియని తేజ కుప్పిగంతులు వేశాడు. నీకంత సినిమాలేదు, నీకు కిస్ పెట్టింది నిఖిల్ అని నబీల్ అసలు విషయం బయటపెట్టాడు. అనంతరం ఈ సీజన్‌కే ఆఖరి మెగా చీఫ్ పోస్టును ప్రకటించాడు బిగ్‌బాస్. సమయానుసారం ఒక్కొక్కరి పేరుతో టీషర్ట్స్ గార్డెన్ ఏరియాలో వేస్తుంటాడు. మెగా చీఫ్ ఎవరంటే?ఆ టీషర్ట్‌ను చించకుండా భద్రంగా కాపాడుకున్నవారు కంటెండర్లవుతారు. అలా ఈ గేమ్‌లో ప్రేరణ, గౌతమ్, అవినాష్, నబీల్ ఓడిపోగా.. పృథ్వీ, తేజ, యష్మి, విష్ణుప్రియ కంటెండర్లయ్యారు. చివర్లో నిఖిల్, రోహిణి మాత్రమే మిగలగా.. వీరిలో ఎవరు కంటెండర్ అవ్వాలనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ ముగిసింది. అయితే రోహిణిని కంటెండర్ చేయగా చివరకు ఆవిడే మెగా చీఫ్ అయినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గ్రూప్ గేమ్ ఆడినోళ్లను మడతెట్టేశారు.. గౌతమ్‌పై ప్రేరణ కుళ్లు
బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చి వారితో నామినేషన్స్ వేయించాడు. వచ్చిన ప్రతిఒక్కరూ నిఖిల్ గ్యాంగ్పైనే విరుచుకుపడ్డారు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (నవంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..గౌతమ్‌పై ప్రేరణ కుళ్లుగత వారం అవినాష్, తేజ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే వీరికి బదులు గౌతమ్ ఉండాల్సిందని ప్రేరణ అభిప్రాయపడింది. వచ్చినవారమే గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సింది.. ఇప్పుడు ఏకంగా స్ట్రాంగ్ ప్లేయర్ అయి కూర్చున్నాడు. అదెలాగో నాకర్థం కావట్లేదు. ఈ వారం గౌతమ్, విష్ణుప్రియ, యష్మిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నాను. అంతా రివర్స్‌లో జరుగుతోంది అని నబీల్‌తో ముచ్చట్లు పెట్టింది.వచ్చావా అక్క..తర్వాత బిగ్‌బాస్ ఆసక్తికర ఘట్టానికి తెరదీశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి ఇద్దర్ని నామినేట్ చేస్తారన్నాడు. మొదటగా సోనియా.. ప్రేరణను నామినేట్ చేసింది. వచ్చావా అక్క అని ప్రేరణ అనడంతో గొడవ పీక్స్‌కు వెళ్లింది. నాకు అక్క కాదు, నిఖిల్‌కు అక్కవి అని ప్రేరణ సంజాయిషీ ఇవ్వడంతో సోనియాకు మరింత తిక్క రేగింది. అతడికి అక్కను అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? అంటూ గట్టిగా నిలదీసింది. అందుకు బదులుగా దాదాపు మూడునాలుగుసార్లు ప్రేరణతో సారీ చెప్పించుకుంది.తేజది తప్పయినప్పుడు యష్మిది కూడా తప్పేగా?అనంతరం నా పెద్ద కొడుకు నిఖిల్‌ను నామినేట్ చేస్తున్నా అంటూ నైస్‌గా మొదలుపెట్టి వైల్డ్‌గా మారిపోయింది. అప్పట్లో పృథ్వీని చిన్న కారణంతో నామినేట్ చేశావు. ఎప్పుడైనా కరెక్ట్ కారణంతో ఎవర్నైనా నామినేట్ చేశావా? యష్మి, ప్రేరణను ఎందుకు నామినేట్ చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవిక్షన్ షీల్డ్గేమ్లో తేజ ముందుగా ఎగ్ వేశాడని అతడిని వరస్ట్ కంటెస్టెంట్ అన్నావు.. మరి తేజ ఎగ్ వేసేవరకు ఆగి కావాలని యష్మి మరో గుడ్డు వేసింది. ఆమె చేసింది తప్పని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని నిలదీసింది.ఆమె ముందు మాట్లాడు.. నిఖిల్‌కు సలహాఅతడి లవ్‌ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి నీపై ఫీలింగ్స్ చూపించింది.. ఒక మహిళకు గౌరవమిచ్చేవాడివే అయితే.. ఆమె రిలేషన్షిప్ కోసం హౌస్‌కు రాలేదు, ఆమె ఏం చేస్తే అది పడటానికి రాలేదు అని తన వెనకాల మాట్లాడాల్సిన అవసరం లేదు. అవన్నీ తన ముందే చెప్పాలని గద్దించింది. తన మీద ఇష్టం లేనప్పుడు ఆమె జోలికి వెళ్లకూడదు అని తేల్చేసింది.ఏడ్చేసిన యష్మిసోనియా మాటలతో యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు క్లారిటీగా చెప్పుంటే నీ జోలికే వచ్చేదాన్ని కాదని నిఖిల్‌పై మండిపడింది. నిఖిల్‌తో ఒక కలగన్నానే తప్ప తనపై నాకు పెద్ద ఫీలింగ్సే లేవని ప్లేటు తిప్పేసింది యష్మి. చివరగా సోనియా.. నువ్వు నీలా ఉండు నిఖిల్, నువ్వు గెలిస్తే సంతోషపడే మొదటి వ్యక్తిని నేనే అంటూ అతడి తలపై గాజు బాటిల్ పగలగొట్టింది.బేబక్కపై సెటైర్లుతర్వాత బేబక్క హౌస్‌లోకి వచ్చి అవతలివాళ్లను తక్కువ చేయడం నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో అతడు.. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇక్కడిదాకా ఉంచారు. మీకు ఓట్లు వేయకుండా ఎలిమినేట్ చేశారంటూ సెటైర్లు వేశాడు. చీఫ్‌గా ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయలేదంటూ బేబక్క.. నిఖిల్‌ను నామినేట్ చేసింది.గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్అనంతరం శేఖర్ బాషా హౌస్‌లో అడుగుపెట్టాడు. ప్రేరణలో చిన్నపిల్లల మనస్తత్వం ఎంతో నచ్చేవి. కానీ రానురానూ రూడ్‌గా మారిపోయింది.. కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తోందంటూ ఆమెను నామినేట్ చేశాడు. గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్ అని సలహా ఇచ్చాడు. యష్మిని సైతం గ్రూపిజం కనిపిస్తోందంటూ నామినేట్ చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: ఫ్యామిలీని కూడా వదలని బిగ్‌బాస్.. వారమంతా ఏడిపించి, చివర్లో అలా..
అప్పట్లో ఓ సినిమాలో ఓ విలన్ అంటాడు, నాకు నా శత్రువే కాదు, శత్రువు కుటుంబ సభ్యులు కూడా అవసరం. అలానే బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ మాత్రమే కాదు, వారికి సంబంధించిన కుటుంబసభ్యులను కూడా తన షోలో వినియోగించుకున్నాడు బిగ్ బాస్. హౌస్ లోని పార్టిసిపెంట్స్ కుటుంబసభ్యులను మాంచి డ్రామా రూపంలో దశలవారిగా పార్టిసిపెంట్స్ కు కలిపించి వారి మధ్య జరిగిన భావావేశాలను ప్రేక్షకులకు యధావిధిగా వండి వార్చాడు సదరు బిగ్ బాస్. కుటుంబ సభ్యులను పార్టిసిపెంట్స్ కలవడం లో పెద్ద వింతేమీ లేదు కాని, ఆ పార్టిసిపెంట్స్ తో హౌస్ లో జరుగుతున్న విషయాలను బాహటంగానే కుటుంబ సభ్యులు చర్చించడం అటు పార్టిసిపెంట్స్ కు ఇటు ప్రేక్షకులకు చిన్న పాటి ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా యశ్మి, ప్రేరణ, నిఖిల్, విష్ణు తదితరల పార్టిసిపెంట్స్ తమ కుటుంబ సభ్యులను కలవడంలో పడ్డ ఆనందం కన్నా ఆ తరువాత వాళ్ళతో మాట్లాడినపుడు ఎక్కువగా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా హౌస్ లో జరిగే ప్రేమాయణాల నుండి గిల్లికజ్జాల వరకు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడటం చాలా ఎబ్బెట్టుగా ఉంది.అంతేనా బిగ్ బాస్ ప్రేక్షకులకు ఇంత చిన్న మసాలా అయితే ఎలా సరిపోతుంది అనుకున్న బిగ్ బాస్ ఒక పార్టిసిపెంట్ ను వారమంతా ఏడిపించి వారం చివర్లో వాళ్ళ ఫ్యామిలీని కలిపించి ప్రేక్షకులకు ఓ మాంచి మసాలానే చూపించాడు బిగ్ బాస్. ఆ పార్టిసిపెంటే టేస్టీ తేజ. ఓ రకంగా చెప్పాలంటే ఈ వారమంతా బిగ్ బాస్ ఎపిసోడ్లలో ఈ తేజ ఏడుపునే అమ్ముకున్నాడు బిగ్ బాస్. అంతేనా అదే తేజను ఎలిమినేషన్లో పెట్టి నాటకీయంగా నో ఎలిమినేషన్ అని చెప్పింది ఈ వారానికి తేజకు కథ సుఖాంతం చేశాడు. ఒక్క విషయం మాత్రం అటు ప్రేక్షకులు ఇటు పార్టిసిపెంట్స్ గుర్తు పెట్టుకోవాలి, అదేంటంటే బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూడడం లేదా పార్టిసిపెంట్ చేయడమంటే కాస్త గుండె దిటవుతో ఉండాలి. ఎందుకంటే బిగ్ బాస్ తన కార్యక్రమాన్ని నార్మల్ ప్యాక్ లో చేయడు ఫ్యామిలీ ప్యాక్ తప్ప.-ఇంటూరు హరికృష్ణ -
నిఖిల్ గొప్పతనాన్ని చెప్పిన అమర్, బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్
కొందరి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ శనివారం ఎపిసోడ్లో స్టేజీపైకి వచ్చేసి మాట్లాడారు. మిగిలినవారి ఫ్యామిలీస్ నేడు స్టేజీపై సందడి చేశారు. మరి ఎవరెవరు వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారు? అనేది నేటి (నవంబర్ 17) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మందు తాగుతానన్న యష్మియష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త స్టేజీపైకి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత యష్మిని మీరు చూడలేరని నాగార్జునతో అన్నారు. అందుకు కారణమేంటో ఎలాగైనా తెలుసుకోవాలనుకున్న నాగ్.. ఆ సీక్రెట్ చెప్తే ప్రైజ్‌మనీకి రూ.3 లక్షలు యాడ్ అవుతాయన్నారు. ఈ బంపరాఫర్‌కు టెంప్ట్ అయిపోయిన యష్మి.. తాను మందు తాగుతానని ఒప్పేసుకుంది. నిన్నటిలాగే వీరితోనూ టాప్ 5 ఎవరనేది గేమ్ ఆడించాడు. టాప్ 5లో ఎవరంటే?తమ కంటెస్టెంట్‌ను పక్కనపెట్టి మిగతావారిలో ఐదుగురిని ఫైనలిస్టులుగా సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా గౌతమ్ 1, నిఖిల్ 2, నబీల్, అవినాష్, ప్రేరణ మిగతా మూడు స్థానాల్లో ఉన్నారు. తర్వాత యష్మిని సేవ్ చేశారు. తేజ తండ్రి శ్రీనివాసరెడ్డి, ఫ్రెండ్ వీజే సన్నీ వచ్చారు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కలను నెరవేర్చుకున్నావు.. నిన్ను ఫినాలేలో చూడాలనుకున్న అమ్మ కలను కూడా నెరవేర్చు అని తేజపై భారం వేశాడు అతడి తండ్రి.అవినాష్‌తో సినిమాసన్నీ.. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్‌ను వరుసగా టాప్ 5లో పెట్టాడు. అందరి అంచనాలను మనం అందుకోలేము.. నువ్వు నీలా ఉండు అంటూ నిఖిల్‌కు గోల్డెన్ సలహా ఇచ్చాడు. అనంతరం ముక్కు అవినాష్ కోసం అతడి తమ్ముడు అశోక్‌తో పాటు దర్శకుడు కోన వెంకట్ వచ్చారు. బిగ్‌బాస్ నుంచే చాలామంది నటుల్ని తీసుకుంటున్నాను.. అవినాష్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు కోన వెంకట్. కంటెస్టెంట్లందరికీ తన సినిమా టైటిల్స్‌ను డెడికేట్ చేశాడు. అవినాష్ అదుర్స్, నబీల్ దూకుడుఅలా నిఖిల్‌కు బాద్షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకు నిన్ను కోరి, యష్మికి దేనికైనా రెడీ, ప్రేరణకు గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్‌కు శివమణి, అవినాష్‌కు అదుర్స్, తేజకు ఢీ, నబీల్‌కు దూకుడు సినిమా టైటిల్స్ అంకితమిచ్చాడు. వీరు.. నబీల్ను 1, నిఖిల్‌ను 2, రోహిణిని 3, విష్ణుప్రియను 4, గౌతమ్‌ను 5వ ర్యాంకులో ఉంచారు. తర్వాత నిఖిల్ కోసం అతడి తండ్రి శశికుమార్, నటుడు అమర్దీప్ వచ్చేశారు. రెండు రోజులు నాతోనేఅమర్దీప్ మాట్లాడుతూ.. ఓ షో తర్వాత నా రెండు కాళ్లు నొప్పితో కదల్లేని స్థితికి వచ్చేశాయి. పూర్తిగా బిగుసుకుపోయాయి. షో నుంచి ఇంటికి వెళ్లకుండా సరాసరి నాతో పాటే నా రూమ్‌కు వచ్చాడు. రెండు రోజులు నాతోనే ఉన్నాడు. నన్ను వాష్‌రూమ్‌కు కూడా ఎత్తుకుని తీసుకుపోయాడు అంటూ నిఖిల్ స్నేహానికిచ్చే విలువను చాటిచెప్పాడు. అలాగే విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, తేజకు వరుస ఐదు ర్యాంకులిచ్చాడు.మగాళ్లపై ఆడాళ్ల విజయంర్యాంకుల గోల అయిపోవడంతో నాగ్.. హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించాడు. అమ్మాయిలను, అబ్బాయిలను రెండు టీములుగా విడగొట్టాడు. సినిమా పేరు చెప్పగానే హీరో, దర్శకుడు, హీరోయిన్ ఫోటోలను బోర్డుపై పెట్టాలన్నాడు. అలా ఈ ఆటలో మహిళల టీమ్ గెలిచింది. తర్వాత విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించాడు.అవినాష్‌ను సేవ్ చేసిన నబీల్చివరగా అవినాష్, తేజ నామినేషన్లో మిగిలారు. ఈ క్రమంలో నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడిగాడు. నాకు షీల్డ్ రావడానికి అవినాష్ కూడా ఓ కారణమే.. అందుకే అతడి కోసం వాడాలనుకుంటున్నాను. నేను గేమ్ ద్వారా మాత్రమే ముందుకు వెళ్తాను అని నబీల్ తన నిర్ణయం చెప్పాడు. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్.. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడటం వల్ల అతడు సేవ్ అయినట్లు తెలిపాడు. టెన్షన్‌తో చచ్చిపోయిన తేజబిగ్బాస్ నాలుగో సీజన్లో ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ అయ్యానని.. ఇప్పుడు మరోసారి అదే షీల్డ్ తనను కాపాడిందన్నాడు అవినాష్ మరి నా పరిస్థితి ఏంటని తేజ అయోమయానికి లోనయ్యాడు. అతడిని కాసేపు టెన్షన్ పెట్టిన నాగ్.. చివరకు సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఈ వారం ఎలిమినేషనే లేదని తెలిపాడు. అయితే రేపు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ చేయించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో సోనియా.. నిఖిల్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఆ తతంగమంతా రేపు చూసేయండిమరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నెం.1 స్థానంలో నిఖిల్.. గౌతమ్ సాయాన్ని మర్చిపోని సోహైల్
వారమంతా కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చారు. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కంటెస్టెంట్ల ఫ్రెండ్స్ కూడా స్టేజీపైకి వచ్చారు. వారికి నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. తమ కుటుంబ సభ్యుడిని మినహాయించి మిగతావారిలో ఎవరు టాప్ 5లో ఉంటారో చెప్పాలన్నాడు. మరి ఎవరెవరు ఏయే కంటెస్టెంట్లను టాప్ 5లో పెట్టారో నేటి (నవంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..టాప్ 5 ర్యాంకులుమొదట ప్రేరణ తల్లి రూప, చెల్లి ప్రకృతితో పాటు నటి ప్రియ వచ్చారు. ప్రకృతి మిస్ ఇండియా తెలంగాణతో పాటు బెనెటి యూనివర్సిటీ మిస్ సుడోకుగా నిలిచిందంటూ నాగ్ అభినందించాడు. తర్వాత ప్రేరణ తల్లి.. నిఖిల్‌ను మొదటి స్థానంలో, నబీల్ను రెండో స్థానంలో, గౌతమ్, యష్మి, రోహిణిలను మిగతా మూడు స్థానాల్లో పెట్టారు.రవి సలహాను లెక్కచేయని విష్ణుతర్వాత విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి పావని, యాంకర్ రవి వచ్చారు. నీకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చుకోకపోతే జనాలు నీకెందుకు ఓట్లు వేస్తారు? ముందు నీకు నువ్వు ముఖ్యం అనుకుని గేమ్ ఆడమని రవి సలహా ఇచ్చాడు. కానీ విష్ణుప్రియ వింటేగా..? నాకోసం నేను ఆలోచిస్తే అహంకారమంటూ పిచ్చిగా మాట్లాడింది. దీంతో పావని నీపై నువ్వు ఫోకస్ చేయు అని హెచ్చరించడంతో కాస్త వెనక్కు తగ్గింది.కోవై సరళ కంటే పెద్ద ఆర్టిస్టు..వీరు గౌతమ్‌ను 1, నిఖిల్‌ను 2, నబీల్ను 3, పృథ్వీని 4, రోహిణిని 5వ స్థానంలో పెట్టారు. రోహిణి కోసం నాన్నతో పాటు నటుడు శివాజీ స్టేజీపైకి వచ్చారు. కోవై సరళ కంటే కూడా పెద్ద ఆర్టిస్టు అవుతావు అని శివాజీ.. రోహిణిని మెచ్చుకున్నాడు. టాప్ 5 గురించి మాట్లాడుతూ.. విష్ణు 1, నబీల్ 2, నిఖిల్ 3, గౌతమ్ 4, తేజ 5వ స్థానంలో ఉంటారన్నాడు.గౌతమ్ సాయం మర్చిపోని సోహైల్పృథ్వీ కోసం తమ్ముడు విక్రమ్, నటి దర్శిని వచ్చారు. నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియను టాప్ 5లో వరుస స్థానాల్లో ఉంచారు. పృథ్వీ సేవ్ అయినట్లు ప్రకటించారు. గౌతమ్ తల్లి మంగమ్మతో పాటు నటుడు సోహైల్ వచ్చారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. నా సినిమా రిలీజ్ సమయంలో 120 టికెట్లు స్పాన్సర్ చేసి జనాలకు చూపించాడు అని తెలిపాడు.నబీల్ కోసం భోలెఇక నబీల్ను 1, నిఖిల్‌ను 2, ప్రేరణను 3, తేజను 4, అవినాష్‌ను 5వ స్థానాల్లో పెట్టారు. తర్వాత గౌతమ్‌ను సేవ్ చేశారు. నబీల్ కోసం అతడి సోదరుడు సజీల్తో పాటు సింగర్ భోలె షావళి వచ్చారు. వీళ్లు నిఖిల్, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణుప్రియకు టాప్ 5 ర్యాంకుల్ని వరుసగా ఇచ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు నువ్వు కావాలి, అవసరమైతే లేపుకెళ్లిపోతా: నిఖిల్
హౌస్మేట్స్ తమ మొదటి ప్రేమకథ చెప్పాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో ఫస్ట్ లవ్‌స్టోరీ చెప్తూ కొందరు సిగ్గుపడితే మరికొందరు ఎమోషనలయ్యారు. ముందుగా యష్మి మాట్లాడుతూ.. నేను టీవీ యాంకర్‌గా ట్రై చేసినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మొదట ఫ్రెండయ్యాడు.. తర్వాత ప్రేమించుకున్నాం. కానీ ఒకానొక సమయంలో నాకు ఫ్యామిలీనే ముఖ్యమనిపించింది. అప్పుడు మా మధ్య కూడా విభేదాలు వచ్చాయి. ఒప్పుకోలేకపోతున్నా..ప్రేమ మీద నమ్మకం పోయింది. మా నాన్న తప్ప ఇంకెవరూ వద్దనుకున్నాను. కానీ ఈరోజుకూ ఆయన నాకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకో ఆయన్ను ఒప్పుకోలేకపోతున్నాను. కానీ ఈరోజుకూ నన్ను గైడ్ చేస్తూ ఫ్రెండ్‌గా ఉన్నాడు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అని యష్మి భావోద్వేగానికి లోనైంది.బాగోలేనని బ్రేకప్: తేజతేజ మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాం. ఓసారి ఇంటికెళ్లి రాగానే బ్రేకప్ చెప్పింది. తన పక్కన నేను బాగోలేనని వాళ్ల పేరెంట్స్ వద్దన్నారట! ఆమె పెళ్లికి కూడా వెళ్లాను. ఓసారి ఆమె సడన్‌గా కాల్ చేసి సారీ అంటూ ఏడ్చేసింది. నా లైఫ్‌లోకి వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా.. మా అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటానో, తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటా అని బిగ్‌బాస్ షో సాక్షిగా మాటిచ్చాడు.పృథ్వీ లవ్ స్టోరీపృథ్వీ.. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమించాం. ఇద్దరం ట్రై చేసుకుందాం, ఎవరికి పడితే వాళ్లకే ఆ అమ్మాయి సొంతం అని డీల్ మాట్లాడుకున్నాం. ఓసారి ఆమె దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్తే నీ పేరేంటి? అని అడిగింది. కాలేజీలో నా పేరు అందరికీ తెలుసు.. అలాంటిది ఆమె నా పేరు అడిగేసరికి ఇన్సల్ట్ అనిపించింది. తర్వాత ఆమె నా ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ తీసుకుని నాకు మెసేజ్‌లు చేసింది.మోసం చేశాడు: రోహిణిఓరోజు ప్రపోజ్ కూడా చేసింది. అంతా బాగానే సాగింది. త్వరగా పెళ్లి చేసుకుందామంది. నా కెరీర్ నాకు ముఖ్యం, పెళ్లికి సమయం పడుతుందని చెప్పేసరికి ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని తెలిపాడు. రోహిణి.. డైమండ్ రింగ్‌తో నాకు బాగా దగ్గరైన స్నేహితుడికి ప్రపోజ్ చేశాను. ఆర్థిక ఇబ్బందులున్నాయి. అవి క్లియర్ అయ్యాకే పెళ్లి చేసుకుందామన్నాడు. సరేనన్నాను. కట్ చేస్తే వేరే అమ్మాయితో రెండేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అది నా దగ్గర దాచాడు. తర్వాత సిల్లీగా బ్రేకప్ చెప్పాడు అంటూ ఎమోషనలైంది.నా భార్య అని ఫిక్సయ్యా: నిఖిల్నిఖిల్ వంతు రాగా.. తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే ఈ అమ్మాయి నా సొంతం అనిపించింది. అన్ని ప్రేమకథల్ని మరిపించేలా చేసింది. మాది ఆరేళ్ల రిలేషన్.. తను నా భార్య అని ఫిక్సయిపోయాను. కానీ ఫ్యామిలీ వల్ల మా మధ్య దూరం వచ్చింది. ఈ జన్మకు సరిపోయేటన్ని జ్ఞాపకాలనిచ్చింది. తిట్టు, కొట్టు..కోపంలో విడిపోయాం.. కానీ నా వల్ల కావట్లేదు. కచ్చితంగా తన దగ్గరకు వెళ్తా.. తిట్టు, కొట్టు, నువ్వు మళ్లీ ఒప్పుకునేవరకు నీ వెంటపడ్తాను. నాకు పిచ్చి లేసిందంటే మాత్రం లేపుకెళ్తాను. బిగ్‌బాస్ షో అయిపోగానే నీ కళ్ల ముందుంటాను. బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరకు తీసుకుంటుందో నువ్వూ అలాగే దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు కావాలి అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గాల్లో తేలుతున్న తేజ.. హింట్లు వదిలేసి ప్రేమ పంచిన శ్రీపాద
అమ్మను మించిన సెంటిమెంట్ మరొకటి ఏముంటుంది? మీ అమ్మ రాదు, రానివ్వను అని తేజను భయపెట్టి ఏడిపించిన బిగ్‌బాస్ చివరకు పట్టువదిలాడు. తల్లిని లోనికి పంపించాడు. దానికంటే ముందు, తర్వాత ఏం జరిగిందో నేటి (నవంబర్ 15) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..కటౌట్ తీసేయమన్న బిగ్బాస్ఫ్యామిలీ వీక్ అయిపోంది.. కాబట్టి ప్రేరణ.. తన భర్త శ్రీపాద కటౌట్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టేయాలన్నాడు బిగ్‌బాస్. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపటికే ఆమె పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.. శ్రీపాదను హౌస్‌లోకి పంపించాడు. అతడు రావడంతోనే భార్య నుదుటన తిలకం దిద్దాడు. వీరికి బ్యూటిఫుల్ డిన్నర్ డేట్ కూడా ఏర్పాటు చేయడం విశేషం.ప్రేమ కావాలి..అది చూసిన విష్ణు, రోహిణి తెగ ఫీలైపోయారు. విష్ణు అయితే.. పృథ్వీ తనను ప్రేమించట్లేదంటూ బాధపడింది. అతడికి నువ్వంటే ఇష్టం ఉంది కానీ ప్రేమ కాదు అని యష్మి క్లారిటీ ఇచ్చింది. అయినా సరే నాకు ప్రేమ కావాలని విష్ణు పిచ్చిపట్టినట్లే ప్రవర్తించింది. మరోవైపు శ్రీపాద.. గొడవలన్నింటికీ మూలకారణమైన కిచెన్ నుంచి బయటకు వచ్చేయమని ప్రేరణకు సూచించాడు. తెగేదాక గొడవలు లాక్కురావద్దన్నాడు. లవ్ సాంగ్తర్వాత భార్యతో కలిసి గేమ్ ఆడాడు. ఈ గేమ్ వల్ల కిచెన్ టైమర్‌కు రెండు గంటలు యాడ్ అయింది. అందరి ఫ్యామిలీస్ వచ్చాయి కానీ తన తల్లి మాత్రం రాలేదని తేజ బెంగపెట్టుకున్నాడు. అనంతరం బిగ్‌బాస్ సరదాగా లవ్ సాంగ్ ప్లే చేస్తే నిఖిల్-యష్మి, పృథ్వీ-విష్ణు అందులో లీనమై స్టెప్పులేశారు. తర్వాత మెగా చీఫ్ కోసం గేమ్ పెట్టారు. ఇందులో తేజ తప్ప మిగతా అందరూ పాల్గొనాల్సి ఉంటుందన్నాడు. ఏడుస్తుంటే చూడలేకపోతున్నా..ఈ గేమ్‌లో అవినాష్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. తల్లి కోసం తేజ ఏడుస్తూనే ఉన్నాడు. అతడి బాధను అర్థం చేసుకున్న బిగ్‌బాస్ ఆమెతో ఫోన్ కాల్ మాట్లాడిపించాడు. నేను రావట్లేదని బాధపడకు, నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా అని ఫోన్లో ఓదార్చింది. కాసేపటికే నేరుగా ప్రత్యక్షమైంది. అమ్మను చూడగానే తేజ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. గోరుముద్దలుతల్లి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. నువ్వు బాగా ఆడుతున్నావు. ఫినాలేలో చూడాలనుందని తన కోరిక బయటపెట్టింది. అలాగే తను ప్రేమగా వండుకొచ్చిన చికెన్, ఆలుగడ్డ కూరను అన్నంలో కలిపి అందరికీ గోరుముద్దలు తినిపించింది. అమ్మను బిగ్‌బాస్ షోలో చూపించాలన్న కల నెరవేరిందంటూ తేజ తెగ సంబరపడిపోయాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణకు భంగపాటు.. మోసం చేయడం మానుకోమన్న పృథ్వీ తల్లి
ఫ్యామిలీ వీక్‌తో కంటెస్టెంట్ల ముఖాలు వెలిగిపోతున్నాయి. తేజ మాత్రం తిరునాళ్లలో తప్పిపోయిన చిన్నపిల్లాడిలా తల్లికోసం ఏడుస్తూనే ఉన్నాడు. ఈ రోజు (నవంబర్ 14) ఎవరెవరు హౌస్‌లోకి వచ్చారో చూసేద్దాం..స్ట్రాటజీ ప్రకారం లవ్ ట్రాక్?మొదటగా విష్ణుప్రియ తండ్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమెతో.. గ్రూప్ గేమ్ వద్దు, నీ ఆట నువ్వు ఆడు. నువ్వు కష్టపడితే కప్పు గెలుస్తావు. నువ్వు కొద్దిగా అటువైపు (పృథ్వీతో) ఉంటున్నావని నీ అభిమానులే బాధపడుతున్నారు. నువ్వు స్ట్రాటజీ ప్రకారం అతడితో లవ్ ట్రాక్ నడుపుతూ గేమ్ ఆడుతున్నావు. అదంతా జనాలు నిజమనుకుంటారు అని చెప్పుకుంటూ పోయాడు.అతడి వల్లే ఉండగలుగుతున్నాఇంతలో విష్ణు మధ్యలో కలగజేసుకుంటూ అది స్ట్రాటజీ కాదని, తన ఫీలింగ్స్ నిజమేనని తెలిపింది. ఇది ప్రేమ కాదు, ఒకలాంటి ఇష్టం తనపై ఉంది.. అతడి వల్లే ఎన్నిరోజులైనా హౌస్‌లో ఉండగలుగుతానన్న ధైర్యం వచ్చింది. నాకు తనపై ఫీలింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కప్పేయాలి? అని ప్రశ్నించింది. అందుకాయన నవ్వుతూ నీ గేమ్ నువ్వు ఆడు అని సలహా ఇచ్చాడు.అన్యాయం చేశావిష్ణుకు తండ్రి ప్రేమ అందించలేకపోయానని ఎమోషనల్ అయ్యాడు. విష్ణు పుట్టాక చాలారోజులు తన దగ్గరకు వెళ్లలేదు. తన చిన్నతనంలో సంతోషాన్ని పంచలేకపోయాను. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాను. వాళ్లకు అన్యాయం చేశాను. పైసా కూడా వాళ్లకు పెట్టలేకపోయాను. అందుకు ఇప్పటికీ నేను సారీ చెప్తున్నాను అన్నాడు.పృథ్వీతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పెళ్లి ప్రస్తావన రాగా విష్ణుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేస్తానన్నాడు. పృథ్వీతో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. అదంతా కేవలం ఈ హౌస్‌లోనే.. గేమ్ అయిపోయాక ఏముండదు అన్నాడు. దాంతో విష్ణు.. ఏమో, అదిప్పుడే చెప్పలేమని సిగ్గుపడగా తనకు ఎవరైనా ఓకే అంటూ తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత ఆయన ఓ గేమ్ ఆడి కూతురి కోసం బర్గర్ సంపాదించాడు.విష్ణు నచ్చేసిందన్న పృథ్వీ తల్లిఅనంతరం అమ్మ పాట రాగానే తేజ కన్నీటితో ఆశగా గేటువైపు చూశాడు. కానీ అక్కడ పృథ్వీ తల్లి సత్యభామ లోనికి వచ్చింది. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ణును మాత్రం ప్రేమగా హత్తుకుంది. పృథ్వీని కన్నందుకు థాంక్యూ అంటూ విష్ణు ఆమె పాదాలపై పడింది. కోడలిగా విష్ణుప్రియ ఓకేనా అని నిఖిల్ అడగ్గా.. అన్నీ వాడిష్టం.. వాడికి నచ్చితే ఓకే అని సిగ్నల్ ఇచ్చేసింది.ఇన్ని రోజులు ఉంటావనుకోలేదుఅందరితో కలిసుండు, ఎవరితోనూ గొడవపడకు. నామినేషన్ చేసేటప్పుడు వాళ్లతో వీళ్లతో చెప్పకు. ఎవరి గురించో నామినేట్ చేయకు. నీ గురించి చేయు. నీ టాలెంట్ చూపించుకోవడానికి బిగ్‌బాస్ మంచి ఛాన్స్. ఇన్ని రోజులు ఉంటావనుకోలేదు. గేమ్‌లో మోసం చేయకుండా నిజాయితీగా ఆడు అని సలహాలు, సూచనలు ఇచ్చింది.ప్రేరణకు భంగపాటుఎవరు ఎక్కువ ఇష్టమని పృథ్వీ అడగ్గా విష్ణు పేరు చెప్పింది. డ్యాన్స్ బాగా చేస్తుంది, దేవుడి భక్తురాలు, జెన్యూన్ అంది. సత్యభామ తన కొడుకుతో పాటు విష్ణుకు సైతం గోరుముద్దలు తినిపించింది. భర్త రాక కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేరణకు భంగపాటు ఎదురైంది. హౌస్‌లోకి రాలేకపోతున్నానంటూ తన కటౌట్‌ను పంపించాడు. నువ్వు ట్రోఫీ ఎత్తినప్పుడు వస్తానంటూ వీడియో సందేశం పంపాడు.నిన్ను టార్గెట్ చేయరుఅనంతరం గౌతమ్ అన్నయ్య డాక్టర్ జగదీష్ వచ్చాడు. అందరికీ ఇన్పుట్స్ వచ్చాయి కాబట్టి నిన్ను టార్గెట్ చేయరు. సోలోగానే ఆడు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు వద్దు.. మరీ ఎక్కువ కోప్పడకు. అనుకున్న లక్ష్యానికి దగ్గరలో ఉన్నావు అని చెప్పాడు. చివరగా తమ్ముడితో కలిసి ఓ గేమ్ ఆడి రూ.51 వేలు గెలిచారు. అది ప్రైజ్‌మనీలో యాడ్ చేయగా మొత్తం రూ.50,30,000కు చేరింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్‌కు హింట్లిస్తూనే హెచ్చరించిన తల్లి.. గౌతమ్ జోలికి మాత్రం..!
ఫ్యామిలీ వీక్ అంటేనే సంతోషం, దుఃఖం రెండూ కలగలసి ఉంటాయి. అయితే అవినాష్ మాత్రం దుఃఖాన్ని దాచేస్తూ సంతోషాన్ని పంచేందుకే ప్రయత్నించాడు. అటు నిఖిల్ తల్లి.. ఏమాత్రం సంకోచించకుండా చెప్పాల్సిన హింట్లన్నీ చెప్పేసింది. అవేంటో నేటి (నవంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..యష్మికి హింట్ ఇచ్చిన తండ్రితండ్రిని చూడగానే యష్మి.. పప్పా అంటూ సంతోషంతో ఏడ్చింది. కూతుర్ని ఓదార్చిన ఆయన అందరితోనూ కలివిడిగా మాట్లాడారు. తర్వాత కూతురికి అవసరమైనన్ని హింట్లు ఇచ్చాడు. 'నువ్వు నీకోసమే ఆడాలి.. ఇండివిడ్యువల్ గేమ్ ఆడు.. టాస్కులు ఆడకుండా ఊరికే కూర్చుంటే నీపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. నువ్వు మనసులో అనుకుంది అందరికీ చెప్పేయకు.. నువ్వు చేయాలనుకుంది నేరుగా చేసేయు. కూతురి తరపున సారీఇన్నివారాలున్నావ్.. నిన్ను స్టేజీపై చూడాలనుంది. నీకోసమే ఆడితే కప్పు గెలుస్తావు.. నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు అని చెప్పాడు. గారాలపట్టికి గోరుముద్దలు కూడా తినిపించాడు. నాన్నతో యష్మి డ్యాన్స్ చేస్తుంటే.. నబీల్‌కు తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. యష్మి తండ్రి ఆడిన గేమ్‌లో వచ్చిన రూ.21 వేలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. వెళ్లిపోయేముందు.. నా కూతురు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే.. దయచేసి ఎవరూ ఏమనుకోవద్దు అంటూ కూతురి తరపున క్షమాపణలు చెప్పి ఓ మెట్టు పైకి ఎక్కేశాడు. .కుమిలిపోతున్న తేజఆయన వెళ్లిపోతుంటే యష్మితో పాటు తేజ కూడా ఏడ్చేశాడు. అందరి పేరెంట్స్ వచ్చినప్పుడల్లా కుమిలి కుమిలి ఏడుస్తున్న తేజను ఎలా ఓదార్చాలో హౌస్‌మేట్స్‌కు అర్థం కాలేదు. అతడి బాధను చూడలేకపోయిన గౌతమ్.. తన ఫ్యామిలీకి బదులుగా తేజ పేరెంట్స్‌ను పంపించమని బిగ్‌బాస్‌ను అభ్యర్థించాడు. అనంతరం నిఖిల్ తల్లి హౌస్‌లో అడుగుపెట్టింది. ఏయే కారణాల వల్ల నిఖిల్ గ్రాఫ్ పడిపోతుందో.. అవన్నీ పూసగుచ్చినట్లు చెప్పి మార్చుకోమని సూచించింది. నిఖిల్‌ను జాగ్రత్తపడమన్న తల్లిగ్రూప్ గేమ్ ఆడకు, ఇకపై ఇండివిడ్యువల్‌గానే ఆడు. నెల రోజులు మాత్రమే ఉంది. G (గౌతమ్)తో ఎక్కువగా ఫైట్, డిఫెన్స్‌కు వెళ్లొద్దు, నామినేషన్ దాకా అసలే వెళ్లొద్దు అని హింట్లు ఇచ్చింది. తప్పు చేస్తేనే నామినేట్ చేస్తున్నా అని నిఖిల్ సంజాయిషీ ఇవ్వగా.. నీతో జరిగిన దానికే మాత్రమే నామినేట్ చేయు, వేరే వాళ్ల గురించి చేయకు. Y(యష్మి)ని కొంచెం కంట్రోల్ చేయు. ఆమెకు దూరంగా ఉండుP (ప్రేరణ) అనే అమ్మాయి నుంచి కొంచెం దూరంగా ఉండు.. గ్రూపిజం ఆడకు.. నీకోసమే ఆడు అంటూ ఎవరూ ఇవ్వనన్ని హింట్లు ఇచ్చేసింది. తర్వాత ఆమె గేమ్ ఆడి మటన్ సంపాదించింది. తమకు నాన్‌వెజ్ రావడంతో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆమె వెళ్లిపోయాక బిగ్‌బాస్ హౌస్మేట్స్ అందరికీ ఓ గంటసేపు నిద్రపోయే అవకాశం ఇచ్చాడు. ఈ సమయంలో అనూజ వచ్చి నిద్రలో ఉన్న అవినాష్‌ను హత్తుకుంది.భార్య కోసం డ్రెస్ మార్చుకున్న అవినాష్భార్యను చూడగానే దెబ్బకు నిద్రమత్తు వదిలింది. అనూజ బ్లాక్ డ్రెస్‌లో వచ్చిందని వెంటనే అతడు కూడా వెళ్లి డ్రెస్ మార్చుకున్నాడు. బిగ్‌బాస్ వీళ్లిద్దరికీ కంపారిబులిటీ టెస్ట్ పెట్టాడు. ఈ గేమ్ ద్వారా రూ.51,000 ప్రైజ్‌మనీ కావాలా? లేదా మూడుగంటలు కిచెన్ టైమింగ్ కావాలా? అని అడిగాడు. అందుకు వీళ్లు ప్రైజ్‌మనీని ఎంచుకున్నారు. ఇక ఈ దంపతుల కోసం బిగ్‌బాస్ పెద్ద జే ప్లాన్ చేశాడు. బిగ్‌బాస్ సర్ప్రైజ్యాక్షన్ రూమ్‌ను హార్ట్ షేప్ బెలూన్లతో నింపేసి డిన్నర్ డేట్ ఏర్పాటు చేశాడు. అది చూసి మురిసిపడ్డ అవినాష్.. ఇది తన జీవితంలోనే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఇంతలో బిగ్‌బాస్ అవినాష్ ముచ్చటపడినట్లుగా లైట్లు ఆఫ్ చేశాడు. దాంతో అతడు తన భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. చివరగా అనూజ నవ్వుతూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి, నిఖిల్‌ను బుక్ చేసిన తేజ.. దమ్ము లేదంటూ రెచ్చగొట్టిన పృథ్వీ
కంటెస్టెంట్ల ఫోటోపై పెయింట్ వేసి నామినేట్ చేయాలి. బజర్ మోగినప్పుడు ముందుగా బ్రష్ పట్టుకున్న వారికే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్స్ అంటేనే గొడవలు కాబట్టి దానికి ఏమాత్రం కొదవ లేదు. యష్మి తప్పును తన నోటితోనే చెప్పించాడు తేజ.. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఫేవరిటిజం స్పష్టంగా కనిపిస్తోందిముందుగా మెగా చీఫ్ ప్రేరణ.. గౌతమ్ ఫోటోకు పెయింట్ పూస్తూ ప్రతీది ఆడియన్స్ ఏమనుకుంటారు? అనేది ఆలోచిస్తూ అడుగు వేస్తున్నాడు. అందరితో కలవట్లేదు, టీమ్ స్పిరిట్ లేదు అని కారణాలు చెప్పింది. ఆ కారణాలు గౌతమ్‌కు ఏమాత్రం మింగుడుపడలేదు. టీమ్ వర్క్ అంటే.. ఓడినా, గెలిచినా కలిసి పోరాడటం.. అంతే తప్ప నీవల్ల ఓడిపోయాం అంటూ గుచ్చిగుచ్చిచెప్పడం టీమ్ మెంబర్ లక్షణం కాదు. ఇక్కడ ఫేవరిటిజం, గ్రూపిజం స్పష్టంగా కనిపిస్తోంది అని ప్రేరణపై మండిపడ్డాడు.నాది తప్పయితే యష్మిది కూడా తప్పే!తర్వాత బజర్ మోగగానే బ్రష్ పట్టుకున్న నిఖిల్.. తేజను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అతడు కావాలని తప్పు చేశాడన్నాడు. దీనికి తేజ స్పందిస్తూ.. నేను తెలిసి తప్పు చేయలేదు. నేను గుడ్డు వేయడం తప్పయితే నా తర్వాత యష్మి చేసింది తప్పు కాదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం దాటవేస్తుంటే.. నీకు మాట్లాడటానికి భయం.. అంటూ రెచ్చగొట్టాడు. దాంతో నిఖిల్.. ఆమెది తప్పు కాదు, నీదే తప్పు అన్నాడు. దమ్ము లేదుఇంతలో నిఖిల్ గ్యాంగ్ వీళ్లను ఆపేందుకు రాగా.. ముగ్గురూ నాపై అటాక్ చేస్తున్నారా? అని తేజ అన్నాడు. దాంతో పృథ్వీ.. ఆ ముగ్గురు ఎవరని అడిగారు. నువ్వు అడిగితే నేను చెప్పను అని తేజ అంటే.. నీకు పేర్లు చెప్పే దమ్ము లేదు అంటూ తేజపై రెచ్చిపోయాడు. తర్వాత గౌతమ్.. అవతలి వ్యక్తులను అగౌరవపర్చడం అలవాటైపోయిందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.తల్లికి తేజ క్షమాపణలుదీని గురించి చర్చించే క్రమంలో.. నీ బెదిరింపులకు అందరూ భయపడతారేమో కానీ నేను కాదు అని గౌతమ్ అన్నాడు. నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావని పృథ్వీ ఆరోపించాడు. అనంతరం తేజ ముందుగా తన తల్లికి సారీ చెప్పాడు. నిన్ను హౌస్‌కు తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ మాటపై నిలబడలేకపోతున్నందుకు క్షమించమన్నాడు. ఇందుకు కారణమైన హౌస్‌మేట్స్‌కు థాంక్యూ చెప్పాడు. వరస్ట్ ప్లేయర్ అంటూతర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించకుండా నేను ఒక గుడ్డును పాము నోట్లో పెట్టాను. తర్వాత యష్మి కూడా ఆలోచించకుండా వెళ్లి మరో గుడ్డు పాము నోట్లో వేసింది. నేను చేసింది తప్పే.. అలాగే యష్మి చేసింది కూడా తప్పే! అన్నాడు. దీనిపై యష్మి.. తాను తప్పు చేయలేదని వాదించింది. ఈ క్రమంలో హే.. పో, కూర్చో అంటూ చిరాకుపడింది. వరస్ట్ ప్లేయర్ అంటూ తేజపై ముద్ర వేసింది. పృథ్వీ.. చీఫ్‌గా, సంచాలకుడిగా ఫెయిలయ్యావంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.మాట తప్పావ్రోహిణి.. చీఫ్ కంటెండర్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట తప్పావంటూ విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఆ రోజు అందుకే ఏడ్చానని రోహిణి పేర్కొంది. దీనికి విష్ణు తలతిక్క సమాధానమిచ్చింది. తొక్కలో మాట ఇచ్చుండకపోతే నాకు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్తున్నా.. నాకు అందరికంటే పృథ్వీయే ఎక్కువ అని ప్రకటించేసింది. ఇక ఈ వారం గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ అంటేనే ఇమేజ్ డ్యామేజ్.. ఎప్పుడు తెలుసుకుంటారో?
కళ అనేది ప్రేక్షకుడికి ఆనందం, కళాకారుడికి జీవితం ఇస్తుంది. ఏ కళాకారుడైనా తన కళను నమ్ముకునే జీవిస్తాడు. ముఖ్యంగా నేటి కళాకారులు తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ కష్టాన్ని, నష్టాన్ని బేరీజు వేసుకోకుండా ఆఖరికి తమ జీవితాన్ని కూడా పణంగా పెట్టి కళకు అంకితమవుతున్నారు. కానీ దురదృష్ణమేమిటంటే ఎంతటి కళాకారులనైనా కనుమరుగు చేస్తూ క్యాష్ చేసుకుంటుంది బిగ్ బాస్ లాంటి కార్యక్రమం. అదెలాగంటారా చూడండి...ఇమేజ్ పెంచుకోవడానికే..బిగ్ బాస్ కార్యక్రమం దాదాపు 8 సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయం. 8 సీరిస్ లలో వచ్చిన పార్టిసిపెంట్స్ మళ్ళీ ఎక్కడా కనబడట్లేదు. కనీసం విన్నర్స్ ఎవరైనా ఎక్కడైనా కనబడతారనుకున్నా పొరపాటే. బిగ్‌బాస్ కార్యక్రమ రూపేణా ప్రేక్షకాదరణ విపరీతంగా ఉంటుంది. దాన్ని చూసే ప్రతి కళాకారుడు బిగ్‌బాస్‌కు వెళ్ళి తన ఇమేజ్ పెంచుకోవాలనుకుంటాడు. కట్ చేస్తే తాను బిగ్ బాస్ బ్యాలెన్స్ పెంచుతాడే కానీ తన ఇమేజ్ డామేజ్ కాకుండా చూసుకోలేడు.అదెలాగో ఇంకాస్త వివరంగా చెబుకుందాం.హౌస్‌లో గిల్లికజ్జాలుబిగ్ బాస్ హౌస్ అంటే ఏమిటి ? ఏ సంబంధం లేని నలుగురు పబ్లిక్ ఇమేజ్ ఉన్నవాళ్ళని ఓ ఇంట్లో పెట్టి, వారి మధ్య టాస్కుల పేరుతో గిల్లికజ్జాలు పెట్టి, వారు కొట్టుకుంటే చూసే ప్రేక్షకుడితో తన గల్లా పెట్టి నింపుకునేదే ఈ బిగ్ బాస్ వ్యాపార సూత్రం. సాధారణంగా రోడ్డు మీద ఎవరైనా అనామకుడితో మనకు చిన్న పాటి ప్రమాదం జరిగినా చెలరేగిపోతాం. అటువంటి సమయంలో చుట్టూ వచ్చి పోయే వాళ్ళు ఆగి మరీ మన కొట్లాట వేడుకలా చూసి ఆనందిస్తారు. ఇప్పుడు బిగ్‌బాస్‌లో జరిగేది కూడా అదే! గొడవపడితే ఏమవుతుంది?తెలియని అనామకుడితో జరిగే గొడవ మనకు కాస్తంత అసహనం ఇచ్చినా గొడవపడతాం, అలాంటిది కోట్లాది మంది చూస్తున్నారన్న విషయం తెలిసి కూడా అదుపు తప్పి తోటి పార్టిసిపెంట్స్‌తో గొడవ పడినపుడు ఏమవుతుంది? మహా అయితే బిగ్‌బాస్ చిల్లర రెమ్యునరేషన్ రూపంలో విదిలిస్తాడు, కానీ తన ఇమేజ్ను ఈ కాస్త చిల్లర కోసం పాడు చేసుకుంటున్నామన్న విషయం గ్రహించలేకపోతున్నారు ఇప్పటి పార్టిసిపెంట్స్.గంగవ్వ ఎలిమినేషన్ఈ వారం విశ్లేషణ అంతా పైన విషయంలోనే వుంది. ఇక చెప్పుకోవాల్సిన అంశాలేమైనా ఉన్నాయి అంటే వైల్డ్ ఎంట్రీగా వచ్చిన గంగవ్వ సైలెంట్‌గా అనారోగ్య కారణాలతో ఎగ్జిట్ అయింది. బిగ్‌బాస్ కార్యక్రమాన్ని మొత్తంగా హరికథ రూపేణా పొగిడించుకుని వారాంతంలో హరితేజకు హ్యాండిచ్చి ఎలిమినేట్ చేశాడు బిగ్‌బాస్. బిగ్ డ్యామేజ్వారాంతంలో జంబలకిడిపంబ పేరుతో పార్టిసిపెంట్స్‌ను లింగ వేషధారణతో జుగుప్సాకరమైన డ్యాన్సులు హావభావాలతో రసాభాస చేసి ఈ వారానికి మమ అనిపించారు. ఏదేమైనప్పటికీ బిగ్‌బాస్ అన్నది బిగ్ డ్యామేజ్ అన్న విషయం చూసే ప్రేక్షకులు ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ పార్టిసిపెంట్స్ అయినా ఎప్పటికి గ్రహిస్తారో ఏమో!-ఇంటూరు హరికృష్ణమరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హరితేజ ఎలిమినేట్.. నిఖిల్ సహా ఆ నలుగురు మాస్క్ తీయాల్సిందే!
ఈరోజు హౌస్ జంబలకిడిపంబగా మారిపోయింది. వాళ్లు వీళ్లయ్యారు, వీళ్లు వాళ్లయ్యారు. అదేనండి.. ఆడాళ్లు మగాళ్ల గెటప్‌లోకి. మగాళ్లు ఆడాళ్ల గెటప్‌లోకి మారిపోయారు. వీరినలా చూస్తుంటేనే ప్రేక్షకులు పడీపడీ నవ్వడం ఖాయం. అలా ఉన్నాయి ఒక్కొక్కరి అవతారాలు.. పైగా ఒకరి పాత్రల్లో మరొకరు లీనమై నటించారు. ముఖ్యంగా ప్రేరణ.. నిఖిల్‌గా నటించి అదరగొట్టేసింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఐటం సాంగ్నాగ్.. ప్రేరణ, గౌతమ్‌ను సేవ్ చేశాడు. తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజీపైకి వచ్చాడు. వచ్చీరావడంతోనే ఆడవేషంలో ఉన్న మగవారికి ఐటం సాంగ్ చేసే టాస్క్ ఇచ్చాడు. అలాగే మగవేషంలో ఉన్న ఆడపిల్లలు మాస్ పాటలకు చిందేయాలన్నాడు. పర్ఫామెన్స్ బట్టి మార్కులిస్తానన్నాడు. ఈ గేమ్‌లో నబీల్‌కు 6, రోహిణి, తేజ, విష్ణుప్రియకు 10, అవినాష్, ప్రేరణ, నిఖిల్, హరితేజలకు 9, యష్మికి 8, గౌతమ్‌కు 7 మార్కులిచ్చాడు. తేజ డ్యాన్స్‌కు ముచ్చెమటలుముఖ్యంగా తేజ పర్ఫామెన్స్కైతే వరుణ్‌తేజ్‌కు చెమటలు పట్టాయి. ఒక్కరు నవ్వకుండా ఉంటే ఒట్టు! ఆ రేంజ్లో ఉంది మనోడి పర్ఫామెన్స్. ఫైనల్‌గా ఈ గేమ్‌లో బాయ్స్ వేషంలో ఉన్న ఆడవారు గెలిచారు. అనంతరం వరుణ్ తన మనసుకు దగ్గరైనవారి గురించి మాట్లాడాడు. రామ్ చరణ్ తనకు సోదరుడని, ఏ సమస్య వచ్చినా అతడి దగ్గరకు వెళ్తానన్నాడు. నిహారిక కొడుతుందా?చిరంజీవి తన ఇన్స్పిరేషన్ అని, అల్లు అర్జున్ హార్డ్‌వర్కర్ అని, పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవన్నాడు. నిహారిక బెస్ట్‌ఫ్రెండ్ అని.. ఎప్పుడూ తనను కొడుతుందన్నాడు. తర్వాత సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు. ఇకపోతే కొన్ని హ్యాష్‌ట్యాగులు ఇచ్చిన బిగ్‌బాస్ అవి ఎవరికి సెట్టవుతాయో చెప్పాలన్నాడు. ముందుగా తేజ.. ఎవరికోసం ఆలోచించకుండా పండ్లు తినేసిన గౌతమ్‌కు సెల్ఫిష్ ట్యాగ్ ఇచ్చాడు. బిల్లు మాఫీ చేయించిన నాగ్ఈ క్రమంలో హౌస్‌లో జరుగుతున్న దొంగతనం గురించి నాగ్ ఆరా తీశాడు. సూపర్ మార్కెట్లో హౌస్మేట్స్ కొన్ని వస్తువులు దొంగతనం చేశారు. అందుకుగానూ బిగ్‌బాస్ రూ.1,85,000 బిల్లు వేశాడు. అసలు ఏమేం దొంగిలించారనేది నాగ్ వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. అయితే చిన్నచిన్న దొంగతనాలను చూసీ చూడనట్లు వదిలేయమని, ఆ బిల్లును ప్రైజ్‌మనీలో నుంచి కట్ చేయొద్దని నాగ్ బిగ్‌బాస్‌ను అభ్యర్థించడం విశేషం.అవినాష్ కట్టప్పహ్యాష్ట్యాగుల గేమ్ విషయానికి వస్తే.. విష్ణుప్రియ.. ప్రేరణ టేప్‌రికార్డర్ అని, హరితేజ.. తేజ లేజీబాయ్ అని, నబీల్.. ప్రేరణకు ఇగో ఎక్కువ, యష్మి.. అవినాష్ కట్టప్ప (వెన్నుపోటు), అవినాష్.. విష్ణుప్రియ ఓవర్ డ్రమటిక్, గౌతమ్.. ప్రేరణ కంట్రోల్ ఫ్రీక్, రోహిణి.. అవినాష్ అటెన్షన్ సీకర్, ప్రేరణ.. గౌతమ్ ఇరిటేటింగ్, పృథ్వీ.. నిఖిల్ ఇమ్మెచ్యూర్, నిఖిల్.. పృథ్వీ అటెన్షన్ సీకర్ అని పేర్కొన్నారు. తర్వాత విష్ణు, పృథ్వీ సేవ్ అయ్యారు.హరితేజ ఎలిమినేట్చివరగా హరితేజ, యష్మి మాత్రమే మిగిలారు. నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడగ్గా అతడు ఇప్పుడు వాడనని తేల్చిచెప్పాడు. దీంతో నాగ్ యష్మిని సేవ్ చేసి హరితేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. హరితేజ వెళ్లిపోతుంటే విష్ణుప్రియ వెక్కివెక్కి ఏడ్చింది. చివర్లో హరితేజ.. హౌస్‌లో ఎవరు మాస్కులు తీసేస్తే బెటరో చెప్పాలన్నాడు. ఐదుగురు మాస్క్ తీయాల్సిందే!అవినాష్, రోహిణి మాస్కు తీసేయాలని అభిప్రాయపడింది. తేజ.. రూల్స్ చెప్పడమే కాకుండా పాటించాలని సూచించింది. ప్రేరణ మంచి అమ్మాయే కానీ కొన్ని చెడు లక్షణాల వల్ల తన మంచి కనడకుండా పోతుందని తెలిపింది. నిఖిల్.. తన ఎమోషన్స్ బయటకు చూపించాలన్నాడు. అలా ఈ ఐదుగురు మాస్క్ తీసేస్తే బెటర్ అని చెప్పింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తేజకు దారుణమైన పనిష్మెంట్.. త్యాగానికి రోహిణి రెడీ!
టేస్టీ తేజకు దెబ్బమీద దెబ్బ పడింది. ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో అతడు చేసిన తప్పిదం వల్ల వచ్చేవారం కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయాడు. అటు హౌస్మేట్స్ వల్ల తన ఫ్యామిలీ హౌస్‌లోకి వచ్చే ఆస్కారమే లేదట.. అదెలాగో నేటి ఎపిసోడ్ (నవంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..సిగ్గు లేకుండా..మెగా చీఫ్ ప్రేరణ మాట ఎవరూ వినడం లేదు. పెండింగ్‌లో ఉన్న పని చేయమంటే విష్ణు కస్సుబుస్సులాడుతుంది. సీతాఫలం తినొద్దు అని చెప్పినా ఉన్న ఒక్కదాన్ని లటుక్కుమని గౌతమ్ ఆరగించేశాడు. వద్దని చెప్పినా ఎలా తిన్నావు? సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావని గౌతమ్‌పై ఫైర్ అయింది. అటు స్వీట్లు తినను అని బిగ్‌బాస్‌కు మాటిచ్చిన నబీల్.. హల్వా తిని ఆ నియమాన్ని ఉల్లంఘించాడు.తేజకు శిక్షఇక నాగార్జున వచ్చీరావడంతోనే ఎవిక్షన్ షీల్డ్ గేమ్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమైన తేజను వాయించాడు. నీకంటే ముందు వచ్చిన జంటలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. నువ్వు మాత్రం యష్మితో కలిసి ఒక అభిప్రాయానికి రాకుండా నీకు నచ్చింది చేశావని సీరియస్ అయ్యాడు. అతడు చేసిన తప్పుకుగానూ వచ్చేవారం చీఫ్ కంటెండర్‌వి కాలేవని శిక్ష విధించాడు.ఎవిక్షన్ షీల్డ్ ఎవరికివ్వాలో డిసైడ్ చేసిన ప్రేరణఇక ఎవిక్షన్ షీల్డ్ రేసులో మిగిలిన రోహిణి, నబీల్, నిఖిల్‌లలో ఎవరికి ఆ షీల్డ్ ఇవ్వాలో హౌస్మేట్స్ డిసైడ్ చేయాలన్నాడు. ఈ క్రమంలో రోహిణికి ప్రేరణ, గంగవ్వ, తేజ సపోర్ట్ చేయగా నిఖిల్‌కు హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ సపోర్ట్ చేశారు. నబీల్‌కు గౌతమ్, యష్మి, అవినాష్ మద్దతిచ్చారు. ముగ్గురికీ సమాన ఓట్లు పడటంతో చీఫ్ ప్రేరణపై భారం వేశారు. ఆమె నబీల్‌కు సపోర్ట్ ఇవ్వడంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ అందుకున్నాడు.అంతరాత్మపై ఒట్టేసి..అనంతరం నాగార్జున.. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలుస్తూ.. నీపై నువ్వు ప్రమాణం చేసుకుని ఈ సీజన్లో వరస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పాలన్నాడు. మొదటగా నబీల్.. తన ఫోటోపై ఒట్టేసి విష్ణుప్రియను వరస్ట్ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. నిఖిల్.. తప్పు చేసినా రుబాబు చూపిస్తాడు, వెటకారం ఎక్కువ అంటూ తేజ వరస్ట్ ప్లేయర్ అన్నాడు. హరితేజ, యష్మి.. రోహిణిని, గౌతమ్, తేజ.. పృథ్వీని, అవినాష్.. హరితేజను, రోహిణి, గంగవ్వ.. యష్మిని, విష్ణుప్రియ, పృథ్వీ.. తేజను చెత్త ప్లేయర్ అని పేర్కొన్నారు. తేజకు కోలుకోలేని దెబ్బప్రేరణ.. గెలవాలన్న ఆసక్తి లేదంటూ విష్ణుప్రియ వరస్ట్ ప్లేయర్ అని తెలిపింది. వరస్ట్ హౌస్మేట్స్ అని ఎక్కువ ఓట్లు పడ్డ వ్యక్తికి ఫ్యామిలీ వీక్‌లో వారి కుటుంబసభ్యులు రాబోరని నాగ్ బాంబు పేల్చాడు. ఈ సీజన్లో తేజను వరస్ట్ ప్లేయర్‌గా డిసైడ్ చేశారు. కేవలం తల్లిని తీసుకురావడానికే ఈ సీజన్‌కు వచ్చాను సర్ అంటూ తేజ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేశాడు.గంగవ్వ ఎలిమినేట్దీంతో రోహిణి.. నా ఫ్యామిలీకి బదులుగా నీ కుటుంబసభ్యులు రావాలని బిగ్‌బాస్‌ను అభ్యర్థిస్తానంది. అటు గంగవ్వ ఆరోగ్యం గురించి నాగ్ ఆరా తీశాడు. ఆమె తన ఒళ్లంతా మంట లేస్తోందంటూ.. సంతోషంగానే ఉన్నాను కానీ చేతనవడం లేదని తెలిపింది. దీంతో ఆమెను హౌస్ నుంచి పంపించేశారు. గంగవ్వ వెళ్లిపోతుంటే రోహిణి, తేజ గుక్కపెట్టి ఏడ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియకు చుక్కలు చూపిస్తున్న ప్రేరణ.. బలైపోయిన తేజ!
ఎన్నాళ్లనుంచో చీఫ్ పోస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రేరణ కల ఎట్టకేలకు సాకారమైంది. మెగా చీఫ్ పదవిని అధిరోహించింది. అలా డ్యూటీ ఎక్కిందో లేదో తన పనితనం మొదలుపెట్టేసింది. అప్పుడే విష్ణుప్రియకు చుక్కలు చూపించేస్తోంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..మాట తప్పాడన్న కోపంతో..మెగా చీఫ్ గేమ్‌లో పృథ్వీ, నబీల్ ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ముందుగానే డీల్ చేసుకున్నారు. కట్ చేస్తే నబీల్ను ఓడించమని నిఖిల్‌కు సూచించాడు పృథ్వీ. చేసిందంతా చేశాక తాను అలా అనలేదని మాట మార్చాడు. తను ఓడిపోవడంతో నబీల్ కూడా పృథ్వీని ఓడించాలని డిసైడయ్యాడు. ఈ క్రమంలో అతడు కూర్చున్న బాక్స్‌లో మూటలు వేశాడు. అయితే అవి తన మీద పడటం, అలాగే ఇచ్చిన మాట తప్పాడన్న కోపంతో పృథ్వీ.. నబీల్‌పై సీరియస్ అయ్యాడు. ఈ రౌండ్లో పృథ్వీ ఓడిపోయాడు.ప్రేరణ మెగా చీఫ్చివర్లో ప్రేరణ, రోహిణి ఇద్దరే మిగిలారు. విష్ణు, గంగవ్వ, అవినాష్, తేజ.. రోహిణికి సపోర్ట్ చేయగా మిగతా అందరూ ప్రేరణకు మద్దతిచ్చి ఆమెను చీఫ్ చేశారు. ఇకపోతే హరితేజ హౌస్‌లో ఉన్నవారందరిపైనా హరికథ చెప్పి అలరించింది. అనంతరం మెగా చీఫ్ అయిన ప్రేరణ మొదట విష్ణునే టార్గెట్ చేసినట్లు ఉంది. విష్ణును కప్బోర్డ్ ఖాళీ చేయమందట.. అలాగే విష్ణు బెడ్ దగ్గరున్న సామాను నీట్‌గా పెట్టుకోమని చెప్పింది. ఆమె వినకపోవడంతో ప్రేరణ వెళ్లి సర్దింది. ఇంట్లో చేయాల్సిన పనులు కూడా సరిగా చేయడం లేదని విష్ణును తప్పు పట్టింది.పాము- ఎగ్స్బిగ్బాస్ ఎవిక్షన్ షీల్డ్‌ను ప్రవేశపెట్టాడు. సమయానుసారం ఆకలిగా ఉన్న పాముకు గోల్డెన్ ఎగ్స్ ఇవ్వాలన్నాడు. ఎవరికి చెందిన గోల్డెన్ ఎగ్ పాముకు ఆహారమవుతుందో వారు ఎవిక్షన్ షీల్డ్‌కు దూరమవుతారు. మెగా చీఫ్ ప్రేరణ.. ఎవిక్షన్ షీల్డ్ రాకూడదనుకున్న ఐదుగురి ఎగ్స్ పాముకు ఆహారంగా పెట్టాలన్నాడు. అలా విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజ ఫోటోలున్న ఎగ్స్‌ను పాము నోట్లో వేసింది.అవినాష్‌పై ఎగిరెగిరి పడ్డ యష్మిఅనంతరం.. అవినాష్, నబీల్ను పిలిచి ఒక ఎగ్‌ను పాము నోట్లో పెట్టమన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయంతో యష్మి ఎగ్ తొలగించారు. అందుకు కారణం చెప్పమని యష్మి అడగ్గా.. నువ్వు వీక్ కాబట్టే నబీల్ నీకు సూట్‌కేస్ ఇచ్చాడు. అయినా ఈ వారం నీకు వచ్చిన అవకాశం సరిగా వాడుకోలేదని అవినాష్ అన్నాడు. ఆ మాటతో యష్మికి కోపం కట్టలు తెంచుకుంది. అందరూ అన్ని గేమ్స్ గెలవరు, స్ట్రాంగ్ ఉన్నవాళ్లు కూడా చాలా గేమ్స్‌లో ఓడిపోయారు.. నన్ను వీక్ అంటూ డీమోటివేట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.నిఖిల్ గేమ్‌ను అడ్డుకున్న గౌతమ్నిఖిల్, గౌతమ్ వంతు రాగా నిఖిల్ త్యాగం చేసేందుకు రెడీ అయ్యాడు. అందుకు గౌతమ్ ఒప్పుకోలేదు. ప్రేరణ ఎగ్ తీసేద్దామంటే నిఖిల్ ఒప్పుకోడు. చివరకు ఇద్దరూ కలిసి తేజను బలి చేశారు. విష్ణుప్రియ, పృథ్వీ వంతురాగా.. ప్రేరణ ఎగ్ తీసేశారు. తర్వాత రోహిణి, హరితేజ వంతు వచ్చింది. నిఖిల్ ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అవడానికి రెడీగా ఉన్నాడని రోహిణి అంటుంటే హరితేజ మాత్రం నామినేషన్స్‌లోకి రావట్లేదంటూ అవినాష్‌ను తీసేద్దామంది. అందుకు రోహిణి ఒప్పుకోలేదు. అటు హరితేజ కూడా వినకపోవడంతో తప్పని పరిస్థితిలో రోహిణి.. అవినాష్ ఎగ్‌ను పాము నోట్లో వేసింది.తేజ చేసిన పనికితేజ, యష్మి వంతు వచ్చింది. యష్మి.. ఎఫర్ట్స్ కనిపించడం లేదంటూ రోహిణి పేరు చెప్పగా తేజ.. నబీల్, నిఖిల్లో ఎవరైనా ఓకే అన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తేజ.. నబీల్, రోహిణి, నిఖిల్ అభిప్రాయాలు అడిగాడు. తనకు అక్కర్లేదని నిఖిల్ క్లియర్‌గా చెప్పడంతో మరో సెకన్ ఆలోచించకుండా అతడి ఎగ్‌ను పాము నోట్లో వేశాడు.నబీల్‌కు ఎవిక్షన్ షీల్డ్అది చూసిన యష్మి.. కావాలని రోహిణి ఎగ్ కూడా వేసేసింది. దీంతో నిఖిల్, పృథ్వీ, హరితేజ, విష్ణు.. అందరూ తేజపై పడి అరిచారు. ఏకాభిప్రాయానికి రాకుండా ఎగ్ ఎలా వేస్తావంటూ మండిపడ్డారు. కానీ ఏ ఒక్కరూ యష్మి ఎగ్ వేయడాన్ని తప్పుపట్టలేదు. చివర్లో నబీల్ ఎగ్ మాత్రమే మిగిలి ఉండటంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ గెలుపొందినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీనే కొట్టాలనుకున్న విష్ణు.. యష్మి ఎంత పని చేసింది?
డంబ్.. ఈ ఒక్కమాటతో విష్ణుప్రియ పృథ్వీపై కోపం పెంచుకుంది. లాగి పెట్టి కొట్టాలన్నంత కోపమొచ్చింది. అతడికి ఆ మాట అన్నాడని కూడా గుర్తు లేదట.. అయినా సారీ చెప్పడంతో విష్ణు ఇట్టే కరిగిపోయింది. తాను కూడా ఏమైనా హర్ట్ చేసుంటే సారీ అంటూ మళ్లీ అతడి మాయలోనే పడింది. మరి హౌస్‌లో ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (నవంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..తప్పులో కాలేసిన యష్మిబిగ్బాస్ చిట్టచివరగా స్క్రూను తిప్పు-కంటెండర్ పట్టు అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో విష్ణుప్రియను ఓడించి యష్మి విజేతగా నిలిచి కంటెండర్ బ్యాడ్జ్ ధరించింది. అయితే పొరపాటున యష్మి.. తన సూట్‌కేస్‌కు బదులు విష్ణు సూట్‌కేస్ తెచ్చి ఓపెన్ చేసింది. అందులో ఉన్న రూ.75 వేలున్నాయి. అంతలోనే తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకున్న యష్మి.. తప్పయిపోయింది బిగ్‌బాస్ అంటూ తన ఒరిజినల్ సూట్‌కేస్ ఓపెన్ చేసింది. అందులో రూ.1,84,000 ఉన్నాయి. కానీ బిగ్‌బాస్ దానికి ఒప్పుకోకుండా ముందుదాని ప్రకారం రూ.75 వేలను ప్రైజ్‌మనీలో యాడ్ చేశాడు.పృథ్వీ, విష్ణు మధ్య దూరంమరోవైపు పృథ్వీ ప్రవర్తనకు విష్ణుకు చిర్రెత్తిపోయింది. నన్ను డంబ్ అన్నాడు. నన్ను హర్ట్ చేసి తను మాత్రం సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి నాకొద్దు. ఫస్ట్ టైమ్ అతడికి పంచ్ ఇవ్వాలనిపించింది అని తన కోపాన్ని, బాధనంతా యష్మి ముందు కక్కేసింది. ఇంతలో పృథ్వీ అటుగా రావడంతో యష్మి.. వీరిద్దరికీ సయోధ్య కుదర్చాలని ప్రయత్నించింది. ఆమెకు సారీ చెప్పమని అడిగింది. మనసులో స్థానం కోల్పోయాడంటూ భారీ డైలాగ్స్అతడు నో అనేసరికి నేనేమీ సారీ అడగలేదని విష్ణు అంది. అది విన్న పృథ్వీ.. నేను నీతో మాట్లాడట్లేదు అని సీరియస్‌గా అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కోపం వల్లే అతడు తన మనసులో స్థానం కోల్పోయాడని విష్ణు నిఖిల్‌తో చెప్పింది. చివరకు పృథ్వీ సారీ చెప్పడంతో విష్ణు ఆవేశమంతా చప్పున చల్లారింది. బిగ్‌బాస్ ఓ ఫన్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా అవినాష్ ఫేమస్ డైరెక్టర్, రోహిణి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.ఏబీసీ.. సినిమావీరిద్దరూ ఆడిషన్ కోసం బిగ్‌బాస్ హౌస్‌కు వస్తారు. ఇంకేముంది.. హౌస్మేట్స్ తమ కళలు చూపిస్తూ ఛాన్స్ పొందాలని ప్రయత్నించారు. ఏబీసీ అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా తీద్దామనుకుంటున్నా.. అక్కా బావ ఎక్కడ? అనేది క్యాప్షన్ అన్నాడు అవినాష్. సినిమా పేరుకు తగ్గట్లే ఓ రియల్ సీన్ చేసి చూపించారు నిఖిల్, యష్మి, గౌతమ్. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని అక్కా అని పిలిస్తే నిఖిల్ వద్దని వారించాడు. యష్మిని అక్కా అని పిలుస్తావా?దీంతో గౌతమ్.. సరే నేను పిలవను, మరి నువ్వు యష్మిని అక్కా అని పిలుస్తావా? అని ప్రశ్నించాడు. ఈ మాటతో అక్కడున్న అందరూ పడీపడీ నవ్వారు. ఇలా ఫన్ టాస్క్ ద్వారా కిచెన్ టైమర్‌కు మరో రెండు గంటలు జమైంది. పృథ్వీ తనకు అక్కర్లేదన్న విష్ణుప్రియ చివరకు అతడి దగ్గరకు వెళ్లి సారీ చెప్పి మళ్లీ అతడి మైకంలోనే పడిపోయింది.మూట ముఖ్యం బిగిలు మెగా చీఫ్ కంటెండర్లు రోహిణి, ప్రేరణ, నబీల్, పృథ్వీ, యష్మిలకు మూట ముఖ్యం బిగిలు అన్న గేమ్ ఇచ్చాడు. ఎవరు చీఫ్ కాకూడదని కోరుకుంటున్నారో వారి డబ్బాలో హౌస్మేట్స్ మూటలు వేయాలన్నాడు. అలా మొదటి రౌండ్లో యష్మి, రెండో రౌండ్లో నబీల్ ఓడిపోయారు. అంతటితో ఎపిసోడ్ ముగిసింది. ఇకపోతే ప్రేరణ మెగా చీఫ్ అయినట్లు సమాచారం.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియ గుండె ముక్కలు.. కొత్త మెగా చీఫ్ ఎవరంటే?
మెగా చీఫ్ కంటెండర్‌షిప్ కోసం హౌస్‌లో పోటీలు జరిగాయి. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ.. ముగ్గురూ టఫ్ టాస్కులోనూ కష్టపడి ఆడారు. అటు బిగ్‌బాస్ గాసిప్స్ వినాలని తహతహలాడిపోయాడు. ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (నవంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..కీని పట్టు.. కంటెండర్‌షిప్‌ను గెలిచేట్టుఇప్పటికే రోహిణి, నబీల్ కంటెండర్‌షిప్ బ్యాడ్జులు గెలిచారు. మిగిలిన పృథ్వీ కోసం 'కీని పట్టు.. కంటెండర్‌షిప్‌ను గెలిచేట్టు' అనే గేమ్ ఇచ్చాడు. ముందుగా తాళాలు సంపాదించి అన్ని బాక్సులు ఓపెన్ చేసినవారు గెలుస్తారు. పృథ్వీతో ఎవరు తలబడాలనుకుంటున్నారో చెప్పాలనగా దాదాపు హౌస్మేట్స్ అందరూ ముందుకొచ్చారు. దీంతో పృథ్వీ.. అందరిలో నుంచి విష్ణుప్రియను సెలక్ట్ చేసుకున్నాడు. అలా పృథ్వీ, విష్ణు ఆడారు.విష్ణును బోల్తా కొట్టించిన పృథ్వీఈ గేమ్‌లో పృథ్వీ అతి తెలివితో విష్ణుప్రియను బురిడీ కొట్టించి గెలిచేశాడు. అలాగే కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ ధరించాడు. అతడి సూట్‌కేస్‌లో రూ.99,000 ఉండగా.. అవి ప్రైజ్‌మనీలో యాడ్ అయ్యాయి. పృథ్వీకి ఒకర్ని చీఫ్ కంటెండర్ చేసే ఛాన్స్ ఉండగా ఆ అవకాశాన్ని అతడు విష్ణుప్రియకు ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటావు.. నిన్ను ఆదర్శంగా తీసుకుని చాలా మారిపోయాను అంటూ విష్ణుతో కబుర్లాడాడు పృథ్వీ.మెలిక పెట్టిన బిగ్బాస్ఇకపోతే బ్యాడ్జులు గెలిచిన నబీల్, పృథ్వీ, రోహిణి.. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణలను కంటెండర్లుగా సెలక్ట్ చేశారు. ఈ ముగ్గురికీ బిగ్‌బాస్ ఇసుక బస్తాలతో గేమ్ పెట్టాడు. ఇందులో ప్రేరణ విజయం సాధించి కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ ధరించింది. అలాగే తన దగ్గరున్న సూట్‌కేసులో రూ.1 లక్ష ఉంది. ఇక్కడే బిగ్‌బాస్ ఓ మెలిక పెట్టాడు. ఈ సూట్కేసుకు బదులుగా మిస్టరీ సూట్‌కేస్ సెలక్ట్ చేసుకోవచ్చన్నాడు. దీంతో పాతది వదిలేసి మిస్టరీ సూట్‌కేస్ తెరిచింది. తీరా చూస్తే ఆశ్చర్యంగా అందులో రూ.2,10,00 ఉన్నాయి. ఇది విన్నర్ ప్రైజ్‌మనీలో జమైంది.అంతమాట అనేసిందేంటి?గంగవ్వ.. ప్రేమపక్షులు పృథ్వీ, విష్ణులను అన్నాచెల్లి అనేసింది. పృథ్వీకి విష్ణు చెల్లిలా అన్నీ దగ్గరుండి చేసి పెడుతుందని మెచ్చుకుంది. అక్కడ చెల్లి అనే పదం విని విష్ణు గుండె ముక్కలైంది. చెల్లి కాదు, అతడంటే ప్రేమ అని విష్ణు చెప్తున్నా కూడా అవన్నీ కుదరవని తీర్పు చెప్పింది. అనంతరం బిగ్‌బాస్.. తేజను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి అతడి ముందు కేక్ పెట్టాడు. కేక్ కావాలంటే ఇంటిసభ్యుల గురించి ఒక మంచి గాసిప్ చెప్పాలన్నాడు.అప్పట్లో ట్రయాంగిల్.. ఇప్పుడైతే..దీంతో తేజ.. గౌతమ్- యష్మి- నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నడిచిందని కానీ ఇప్పుడు అది లేదన్నాడు. గౌతమ్- యష్మి మధ్య అక్కాతమ్ముళ్ల అనుబంధం, నిఖిల్- యష్మి మధ్య ఫ్రెండ్షిప్ ఉందన్నాడు. నీకు ఎవరు క్రష్ అని బిగ్‌బాస్ అడగడంతో పడీపడీ నవ్విన తేజ.. క్రష్ కాదుగానీ ప్రేరణతో మంచి అనుబంధం ఏర్పడిందన్నాడు. కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తేజ అసలు విషయం చెప్పకుండా.. యష్మి సూట్‌కేస్ ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని బిగ్‌బాస్ చెప్పాడంటూ అబద్ధమాడాడు. తేజ పెట్టిన పెంటఅది నిజమని నమ్మిన యష్మి.. వెంటనే తన సూట్‌కేసును గౌతమ్‌కు ఇచ్చింది. పోయినవారం అతడిని రేస్ నుంచి తీసేసినందుకు ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంది. కానీ పృథ్వీ అందుకు ఒప్పుకోలేదు. అతడికెందుకు ఇస్తావంటూ కోపంగా మాట్లాడాడు. దీంతో యష్మి ఫీలైంది. అది చూసిన విష్ణు.. ఈ అబ్బాయిలు డిక్టేటర్‌గా మనల్ని రూల్ చేయడమేంటని అసహనం వ్యక్తం చేసింది.గాసిప్ చెప్తే కేక్ ఫ్రీఅటు ప్రేరణను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ ఏదైనా గాసిప్ చెప్తే కేక్ తినొచ్చన్నాడు. నిఖిల్‌కు యష్మి అంటే ఇష్టం.. కానీ, అందరి ముందు బయటపడటం లేదు అని తెలిపింది. ఈ ఇంట్లో అందరికంటే జెన్యూన్ ఎవరని అడగ్గా గంగవ్వ పేరు చెప్పింది. ఇకపోతే ఎంతోకాలంగా మెగా చీఫ్ పోస్ట్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ప్రేరణ ఎట్టకేలకు చీఫ్ పదవిని కైవసం చేసుకున్నట్లు భోగట్టా!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అక్క అనడం తప్పన్న నిఖిల్, ఫ్రెండ్‌ను కాపాడిన అవినాష్
నామినేషన్స్ అంటే మాటల యుద్ధమే.. ఎప్పుడూ ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పే బిగ్‌బాస్ ఈసారి మాత్రం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలన్నాడు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..హరితే, ప్రేరణ.. ఇద్దరూ ఇద్దరే!మొదటగా పృథ్వీ.. నాకు నెక్ ఫాంటసీ ఉందనడం నచ్చలేదంటూ రోహిణిని నామినేట్ చేశాడు. నెక్ ఫాంటసీ అన్నది బూతు పదమా? అని రోహిణి ఆశ్చర్యపోయింది. హరితేజ.. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది.. నోటికొచ్చిన మాటలు అనేయొద్దని ప్రేరణను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ వాదులాడుకున్నారు. హరితేజ చెప్పే పాయింట్లు కరెక్టే ఉన్నా కాస్త యాక్టింగ్ చేస్తూ చెప్పడం అతిగా అనిపించింది. తెలుగులో కొత్త బూతు 'అక్క'అటు ప్రేరణ కూడా ఈమెపై రివేంజ్ నామినేషన్ చేసింది. అంత అరుచుకున్నాక చివర్లో ఇద్దరూ కలిసిపోయి హగ్గులిచ్చుకోవడం గమనార్హం. నిఖిల్ వంతురాగా.. ఒకమ్మాయి తనను అక్కా అని అనొద్దని చెప్తున్నా పదేపదే అనడం బుల్లీయింగ్ అంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. అక్కా అనడంలో తప్పేముంది? అని గౌతమ్ అంటే అశ్వత్థామ అని పిలిస్తే నువ్వు హర్టయినప్పుడు.. ఆమె వద్దంటున్నా అక్కా అని పిలవడం కూడా తప్పేనని లాజిక్ లేని సమాధానమిచ్చాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.దీంతో చిర్రెత్తిన గౌతమ్.. ఇప్పుడు చెప్తున్నా.. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. నన్ను ట్రోల్ చేసుకోండి.. ఏమైనా చేసుకోర్రి అన్నాడు. ఇద్దరూ అరుచుకుని కాసేపటికి నిఖిల్.. అమ్మతోడు, గేటు తీయమను.. బయటకెళ్లి చూసుకుందాం అని రెచ్చగొట్టాడు. నా ప్రవర్తన తప్పు అంటున్నావ్.. మరి నా మీద కోపాన్ని టాస్కులో అమ్మాయిలపై చూపించడం తప్పు కాదా? ఎవరేంటో నాకర్థమైంది.. ఇప్పుడు నాకు భయం లేదు, ఎవరికీ వినేది లేదు, తగ్గేది లేదు అని గౌతమ్ ఆవేశంతో మాట్లాడుతుంటే రోహిణి, హరితేజ చప్పట్లు కొట్టారు.నువ్వే ఆ ఛాన్సిచ్చావువిష్ణుప్రియ వంతు రాగా.. నేను నిన్ను నామినేట్ చేయకూడదనుకున్నాను.. కానీ నువ్వే ఆ ఛాన్సిచ్చావు! ఈ వారం చాలా తప్పులు చేశావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. నబీల్.. పోయినవారం నామినేషన్స్‌లో ఫేవరెటిజం చూపించావు, మెగా చీఫ్‌గా ఫెయిలయ్యావంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.చప్పట్లు కొట్టిన గంగవ్వగంగవ్వ.. యష్మిని అశ్విని అనడంతో అందరూ పడీపడీ నవ్వాడు. గౌతమ్ బాగా ఆడతాడు. చిన్నదానికీ పెద్దదానికీ నువ్వు, ప్రేరణ ఇద్దరూ అతడిపై అరుస్తారు. ఆటలో గెలవకపోతే మాత్రం చీదరించుకుంటావు అని చెప్పింది. నామినేట్ అయినందుకుగానూ యష్మిపై ఆయిల్ పెయింట్ పడటంతో గంగవ్వ చప్పట్లు కొట్టింది. రోహిణి.. మెగా చీఫ్ కంటెండర్‌షిప్ గేమ్‌లో నీకంటే ఒక అడుగు ముందున్న గౌతమ్‌ను సైడ్ చేయడం బాగోలేదని యష్మిని నామినేట్ చేసింది. బిగ్‌బాస్‌కు గౌరవం ఇవ్వలేదుగౌతమ్ వంతు రాగా.. టీమ్‌లీడర్‌గా ఉన్నప్పుడు పదేపదే ఇరిటేట్ అయ్యావ్.. రెండోది నన్ను గేమ్‌లో సైడ్ చేసినప్పుడు నాకో కారణం చెప్పావ్.. కానీ వెనకాల మరో కారణం చెప్పావ్.. అంటూ యష్మిని నామినేట్ చేశాడు. తేజ.. నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో నువ్వు స్మోకింగ్ జోన్లో సిగరెట్ తాగుతూ కూర్చున్నావు.. ఇది బిగ్‌బాస్‌ను అగౌరవపర్చాడంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.ఆమెను సేవ్ చేసిన అవినాష్యష్మి.. నువ్వు నన్ను అక్కా అని పిలవడం నచ్చలేదు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. ఫ్లిప్ అవుతున్నావు అంటూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. చివర్లో ఒకరిని స్వాప్ చేసే అధికారం మెగా చీఫ్ అవినాష్‌కు ఇవ్వడంతో అతడు రోహిణిని సేవ్ చేసి ఆమె స్థానంలో నిఖిల్‌ను నామినేట్ చేశాడు. అలా ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ అయ్యారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నవ్వుతూ వెళ్లిన నయని.. ఆ ఐదుగురు డమ్మీ ప్లేయర్స్ అంటూ..
సండే అంటే ఫన్డే.. ఆటలు, పాటలు, డ్యాన్సులు.. మొత్తం ఇవే ఉంటాయి. ఇలాంటి ఫన్ గేమ్‌తోనే ఎపిసోడ్ మొదలైంది. అంతకంటే ముందు గౌతమ్‌ను సేవ్ చేశాడు. తర్వాత ఏం జరిగిందో నేటి (నవంబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..విష్ణుప్రియ టీమ్ గెలుపునిఖిల్, రోహిణి, ప్రేరణ, నయని పావని, విష్ణుప్రియ, తేజను టీమ్ 'A'గా మిగతావాళ్లందరినీ టీమ్ 'B'గా విభజించారు. ఈ గేమ్‌లో భాగంగా ఒక చీటీ తీసి అందులో ఇంగ్లీష్‌లో రాసి ఉన్న వాక్యాలు చదివి తెలుగులో పాటను గెస్ చేయాలి. చిన్నపిల్లలు కూడా ఆడగలిగేలా సింపుల్‌గా ఉన్న ఈ గేమ్‌లో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. తర్వాత యష్మి సేవ్ అయినట్లు ప్రకటించాడు.నిఖిల్ వెంటే గెలుపుఅనంతరం అందరూ పక్షుల్లా మారిపోయారు. ఆకాశం, సముద్రం, పర్వతాలు.. వీటిలో నాగ్ ఏ పేరు చెప్తే ఆ పేరు రాసున్న బోర్డ్‌పై కంటెస్టెంట్లు నిలబడాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో కూడా నిఖిలే ఆఖరివరకు చేరుకుని గెలిచాడు. అలాగే లక్ష రూపాయలు ప్రైజ్‌మనీలో యాడ్ చేయడంతో విన్నింగ్ ప్రైజ్‌మనీ రూ.42,16,000కు చేరింది.జ్యూస్‌లకు మారు పేర్లుతర్వాత కొన్ని జ్యూస్‌లకు స్వార్థం, కోపిష్టి, ఫేక్.. ఇలా పలురకాల పేర్లు ఇచ్చారు. అవి ఎవరికి సూట్ అవుతాయో వారితో ఆ జ్యూస్ తాగించాలన్నాడు. మొదటగా గౌతమ్.. ఆనియన్ (నకిలీ), టమాటో (స్వార్థం) జ్యూస్‌ను యష్మీకి ఇచ్చాడు. రోహిణి.. కీరా దోస(బాధ్యతారాహిత్యం), చిల్లీ (కోపిష్టి) జ్యూస్‌ను గౌతమ్‌కు ఇచ్చింది. విష్ణుప్రియ.. చిల్లీ, లెమన్ (నోటిదురుసు) జ్యూస్‌ను ప్రేరణకు ఇచ్చింది. ఆమెకు నోటిదురుసు ఎక్కువహరితేజ.. చిల్లీ, ఆమ్ల జ్యూస్‌ను నిఖిల్‌తో తాగిపించింది. పృథ్వీ.. ప్రేరణకు జ్యూస్ ఇస్తూ తనకు నోటిదురుసు ఉందని, కోపిష్టి అన్నాడు. అవినాష్.. గౌతమ్‌కు నోటిదురుసు, బాధ్యతారాహిత్యం ఉందంటూ అతడితో లెమన్, కీరా జ్యూస్ తాగిపించాడు. తేజ.. ప్రేరణకు నోటిదురుసు, మందబుద్ధి ఉందన్నాడు. నబీల్.. అవినాష్ డంబ్ అండ్ టాక్సిక్ అన్నాడు. ప్రేరణ వంతు రాగా.. హరితేజ ఫేక్ అంటూ ఆనియన్, ఆమ్లా జ్యూస్ తాగిపించింది. ఎక్కువ జ్యూస్‌లు ఎవరికంటే?యష్మి.. గౌతమ్ ఫేక్ అంటూ ఆనియన్ జ్యూస్ ఇచ్చింది. గంగవ్వ.. రోహిణికి మందబుధ్ది, నోటిదురుసు ఉందని తెలిపింది. నయని కూడా ప్రేరణకు కోపమెక్కువ అంటూ నిమ్మ, మిర్చి జ్యూస్ కలిపిచ్చింది. నిఖిల్.. గౌతమ్ బాధ్యతారాహిత్యంగా ఉంటాడంటూ అతడికి లెమన్, కీర జ్యూస్ కలిపిచ్చాడు. అలా ప్రేరణ, గౌతమ్ అందరికంటే ఎక్కువ జ్యూస్‌లు తాగారు.నయని ఎలిమినేట్తర్వాత నాగ్ హరితేజను సేవ్ చేసి నయని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ప్రతిదానికి కన్నీళ్లు పెట్టుకునే నయని ఈసారి తన దుఃఖాన్ని దిగమింగుకుని నవ్వుతూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకోవడం విశేషం. స్టేజీపైకి వచ్చాక .. గంగవ్వ, రోహిణి, ప్రేరణ, గౌతమ్, విష్ణును డమ్మీ ప్లేయర్స్ అంది. హరితేజ, నిఖిల్, పృథ్వీ బెస్ట్ ప్లేయర్స్ అని కితాబిచ్చింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: అట్లుంటది ‘బిగ్ బాస్’తో
మామూలుగా ఒక్క టికెట్ మీద ఒక సినిమానే చూడగలం. అలాగే వేరే టికెట్ మీద వేరే సినిమా చూడగలం. కాని అదే ఒక్క టికెట్ మీద డజనుకు పైగా సినిమాలు దాదాపు వంద రోజులు చూడగలిగితే అదే బిగ్ బాస్ కార్యక్రమం. మనం చూసే సినిమా సినిమాకీ ప్రత్యేకత కోరుకుంటాం. ఓ చిన్న సన్నివేశం కానీ, అంతెందుకు కనీసం చిన్న ప్రదేశం కానీ... ఒక సినిమాలోది మరో సినిమాలో కనబడితే నానా యాగీ చేస్తాం. కానీ బిగ్ బాస్ కార్యక్రమం మాత్రం ఇందుకు మినహాయింపు. గడచిన 8 సిరీస్‌లలో బిగ్ బాస్ కార్యక్రమ అంశం కానీ, కంటెస్టెంట్లు ఆడిన టాస్కులు కానీ అంతెందుకు వాళ్లున్న సెట్ అంతా ఒకటే. కాకపోతే సెట్‌కు కాస్త రంగులు మారుస్తారు. సిరీస్‌కు కంటెస్టెంట్లు మారతారు. అయినా ప్రతి సిరీస్‌కు బిగ్ బాస్కున్న ఆదరణ పెరుగుతుందే కానీ తరగట్లేదు. బిగ్ బాస్ కార్యక్రమానికి ప్రేక్షక అభిమానం ఆకాశమంత ఎత్తయితే, విమర్శకుల దురభిమానం అంతరిక్షమంత ఎత్తు అని చెప్పవచ్చు. ఈ వారం మెగా ఛీఫ్ ఎంపిక (విష్ణుప్రియ) ఓ విడ్డూరమయితే వారం మధ్యలో తన నటనతో గంగవ్వ చేసిన హారర్ ఎపిసోడ్ ఓ అద్భుతమనే అనాలి. యధావిధిగా కంటెస్టెంట్లు మూడు లవ్ ఎపిసోడ్లు నాలుగు ఫ్లర్టింగ్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వారాంతంలో దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌గా ప్రసారమయిన ఫార్మెట్ కూడా పేలవంగా అనిపించింది. కాకపోతే కొత్త సినిమాల సెలబ్రిటీస్‌తో కాస్త కళకళలాడించడానికి ప్రయత్నించాడు బిగ్ బాస్. వారమంతా కాస్త టాస్కులలో తన సత్తా చాటుతూ స్క్రీన్ స్పేస్ మిగతావారి కన్నా ఎక్కువ షేర్ చేసుకున్నా మెహబూబ్‌కు మొండి చేయి చూపించి ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. ఈ వారం ఎపిసోడ్ ట్విస్ట్ ఏంటంటే అవినాష్ కూడా తాను అనారోగ్య కారణాలతో హౌస్ బయటకు వెళుతున్నట్టు ఎపిసోడ్ చివర ప్రోమోలో చూపించారు. పోయిన సారి మన విశ్లేషణలో చెప్పుకున్నట్టు హౌస్‌లోని కంటెస్టెంట్లు తమ ఉనికి, ఉపాధి కోసం తమ ఆరోగ్యాలను కూడా లెక్క చేయడంలేదు. ఇన్ని జరుగుతున్నా బిగ్ బాస్ మాత్రం తన షో లాభాలను లెక్క పెట్టుకుంటూనే ఉన్నాడు. ఏదేమైనా అట్లుంటది బిగ్ బాస్‌తో. -
నాగ్ చేసిన పనికి షాక్‌లో తేజ.. త్వరలో వెళ్లిపోతానంటున్న గంగవ్వ
హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టిగా క్లాస్ పీకి చాలాకాలమైంది. అందుకే ఈ రోజు అందరికీ కోటింగ్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. గౌతమ్, నిఖిల్, యష్మి, ప్రేరణలపై సీరియస్ అయ్యాడు. ప్రత్యేకంగా ఈ నలుగురిపైనే ఫైర్ అవడానికి కారణమేంటో తెలియాలంటే నేటి (నవంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నువ్వేమైనా పుడింగా?నాగార్జున వచ్చీరాగానే ప్రేరణపై విరుచుకుపడ్డాడు. నువ్వేమైనా పుడింగా? అందరిపై నోరు ఎందుకు జారుతున్నావ్? అని నిలదీశాడు. అందుకామె పుడుంగి అనేది తప్పు పదమని తెలీదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నయని లేచి.. తను ఎప్పుడూ అమర్యాదగానే మాట్లాడుతుందని అగ్నికి ఆగ్జం పోసింది. అటు నాగ్ వీడియో ప్లే చేయడంతో అడ్డంగా దొరికిపోయిన ప్రేరణ నయనికి సారీ చెప్పింది. నిఖిల్‌ను తిట్టడాన్ని సైతం తప్పుపడుతూ నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు.ఎందుకంత కోపం?పానీపట్టు యుద్ధం టాస్క్‌లో అగ్రెసివ్‌గా ఆడావు. అప్పుడు ప్రేరణ, యష్మిపై ఎందుకంత కోపం చూపించావని నాగ్ నిఖిల్‌ను అడిగాడు. అందుకతడు ప్రేరణ, గౌతమ్ బూతు వాడటంతో మరింత ట్రిగ్గర్ అయ్యానన్నాడు. దీనిపై గౌతమ్ స్పందిస్తూ.. తాను బూతు మాట అనలేదన్నాడు. దీంతో నాగ్ వీడియో వేసి చూపించాడు. అందులో అతడు పెదాలాడించినట్లు ఉందే తప్ప బూతు మాట్లాడినట్లు లేదు.నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతా..వీడియో చూసిన తర్వాత కూడా గౌతమ్.. తల్లిపై ప్రమాణం చేస్తున్నాను. నేను బూతు మాట్లాడలేదు. చేయని తప్పును ఒప్పుకోను. నేను బూతు మాట్లాడినట్లు నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతానని శపథం చేశాడు. దీంతో నాగ్.. గౌతమ్ మాటల్ని ఎవరు నమ్ముతున్నారని అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు స్టూడియోలో ఉన్నవారిని అడిగాడు. కానీ ఏ ఒక్కరూ గౌతమ్‌కు సపోర్ట్ చేయకపోవడంతో అతడి ముఖంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది.మధ్యలో దూరకుతర్వాత యష్మి వంతురాగా.. నీ ప్రాబ్లమేంటక్కా? అని నాగ్ ప్రశ్నించాడు. గౌతమ్ తనను సడన్‌గా క్రష్, సడన్‌గా అక్క అని పిలిస్తే తీసుకోలేకపోయానని బదులిచ్చింది యష్మి. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. అందులో గౌతమ్.. విష్ణుతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో దూరింది. ఈ గొడవ పెద్దదై ఒకరినొకరు అక్కాతమ్ముడు అనుకున్నారు. నువ్వు కూడా తమ్ముడు అన్నావుగా.. ఏదైనా జరుగుతున్నప్పుడు మధ్యలోకి దూరకూడదు అని సూచించాడు. ఫ్లిప్ అవుతున్నావ్అలాగే బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్‌లో తన రెడ్ టీమ్‌లో గౌతమ్‌ను ఎలిమినేట్ చేయడం గురించి అడగ్గా.. అతడు పెద్దగా ఆడలేదని తెలిపింది. దీంతో గౌతమ్ లేచి.. నేను ఆల్రెడీ ఒకసారి మెగా చీఫ్ అయ్యానని, అందుకే సైడ్ చేస్తున్నామని చెప్పిందే తప్ప ఆడలేదని చెప్పలేదన్నాడు. ఇది విన్న నాగ్.. ఇలా మాటలు మారుస్తూ ఉంటే నువ్వు ఫ్లిప్ అవుతున్నావని జనాలు భావిస్తారని హెచ్చరించాడు.సిగ్నల్స్ ఇచ్చిన గంగవ్వఅనంతరం బాగా ఆడావంటూ నాగ్ తేజను మెచ్చుకోగా ఇది కలా? నిజమా? అర్థం కాక అతడు నోరెళ్లబెట్టాడు. సెకనులో ఇదంతా నిజమేనని తెలుసుకుని తెగ సంతోషించాడు. ఇక మెగా చీఫ్ పోస్ట్‌ను త్యాగం చేయడం బాగోలేదని నబీల్‌కు చురకలంటించాడు. గండం గట్టెక్కింది!గంగవ్వను ఆటలో ఇంకాస్త యాక్టివ్‌గా ఆడాలని నాగ్ సలహా ఇవ్వగా.. తనకు ఒళ్లునొప్పులు వస్తున్నాయంది. తనవల్ల కానిరోజు హౌస్ నుంచి తనే స్వయంగా వెళ్లిపోతానంది. చివర్లో తేజ సేవ్ అయినట్లు ప్రకటించాడు. గతంలో తొమ్మిదో వారమే షో నుంచి ఎలిమినేట్ అయ్యానని ఈసారి ఆ వారం నుంచి తప్పించుకున్నానంటూ ఫుల్ ఖుషీ అయ్యాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎంటర్టైనర్లు ఉట్టి జోకర్లేనా? విన్నర్‌గా పనికి రారా?
రియాలిటీ షో అంటేనే రియల్/నిజ స్వరూపం చూపించడం. ఎలా ఉంటున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం? భావోద్వేగాలను ఎలా నియంత్రించుకుంటున్నాం? ఇలా అన్నీ తెల్లకాగితంలా జనాలకు చూపించాలి. నచ్చినవాళ్లు ఓటేస్తారు, నచ్చనివాళ్లు లెక్క చేయరు .రియల్ ఎంటర్టైనర్స్ఎలాంటి ముసుగు లేకుండా స్వచ్ఛంగా ఉంటూ నలుగుర్ని నవ్వించేవారే రియల్ ఎంటర్టైనర్స్! కానీ ఇప్పటివరకు తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ప్రేక్షకుల్ని నవ్వించి కప్పు ఎగరేసుకుపోయినవాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. టాస్కులు ఆడినవారు లేదా సింపతీ సాధించినవారు, ఆల్రెడీ ఫ్యాన్‌బేస్ ఉన్నవాళ్లే విజేతలుగా నిలుస్తూ వస్తున్నారు తప్ప కమెడియన్లు కప్పు అందుకున్న దాఖలాలే లేవు. ఆ ఒక్కటి లేకపోతే అసంపూర్ణమే!అసలు వీళ్లు లేకపోతే బిగ్‌బాస్ షోనూ ఎవరూ పట్టించుకోరు. అన్నీ ఉన్నా వినోదం లేకపోతే అది సంపూర్ణంగా ఉండదు. అందుకే ఈ సీజన్లో రీలోడ్ పేరిట వైల్డ్‌కార్డ్స్‌ను దింపారు. ఇందులో ఎంటర్టైనర్స్ రోహిణి, అవినాష్, తేజ ఉన్నారు. ఫిజికల్ టాస్కులే కాకుండా బుర్రకు పదునుపెట్టే టాస్కుల్లోనూ ఒక అడుగు ముందే ఉన్నారు. వెనకాల గోతులు తవ్వడం, చాడీలు చెప్పడం, కావాలని గొడవపెట్టుకోవడం వంటి ఎన్నో అవలక్షణాలకు వీరు దూరంగా ఉన్నారు. ఈ లెక్కన విజేతగా నిలవడానికి ఆస్కారం ఉన్నవారు!టాప్ 5 మాత్రమేనా?కానీ రియాలిటీలో అది జరగడం లేదు. నిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వీడియో మెసేజ్‌లో నువ్వు టాప్ 5లో ఉండాలి అని తేజకు అతడి పేరెంట్స్ చెప్పారు. విన్నర్ అనకుండా టాప్ 5 అని ఎందుకన్నారు? అని తేజ అమాయకంగా రోహిణిని అడిగాడు. అప్పుడు రోహిణి కప్పు ఎలాగో రాదని తెలుసుగా.. అందుకే టాప్ 5 అన్నారు. మన పర్సనాలిటీలకు కప్పు రావురా.. ఏదో ఆడుకుంటూ వెళ్లిపోవడమే! నామినేషన్స్‌లో మేనరిజం చూపిస్తూ అరవడంలాంటివేమీ మనం చేయలేము అని చేదు సత్యాలను వివరించింది. కమెడియన్ విన్నర్ కాకూడదా?అందుకు తేజ.. ఎంటర్టైనర్లను ప్రేక్షకులు విన్నర్లుగా చూడరు అని అభిప్రాయపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కమెడియన్ విన్నర్ కాకూడదా? అన్న చర్చ మొదలైంది. జనాల్లోనూ ఈ ఆలోచన వస్తే ఎంటర్టైనర్లకు మంచి రోజులు వచ్చినట్లే! View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ మ్యాచ్‌ఫిక్సింగ్.. బిగ్‌బాస్ సర్ప్రైజ్లు.. కంటెస్టెంట్ల ఏడుపులు
బిగ్‌బాస్ హౌస్‌లో అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. దీపావళికి హౌస్‌మేట్స్‌కు వీడియో మెసేజ్‌ల రూపంలో కానుకలు అందాయి. తర్వాత అందరూ కలిసి సంతోషంగా డ్యాన్సులు వేశారు. దీంతో బిగ్‌బాస్ హౌస్ ఆనందాల హరివిల్లుగా మారింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అవినాష్‌తో డీల్నిన్న బిగ్‌బాస్ ఇచ్చిన బీన్ బ్యాగ్ గేమ్‌లో మొదట హరితేజ, తేజ ఎలిమినేట్ అయ్యారు. ఆ గేమ్ కొనసాగింపుతో నేటి ఎపిసోడ్ మొదలైంది. ఈ ఆటలో నిఖిల్.. నబీల్ను టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో నబీల్.. నిఖిల్‌ను మోచేయితో కొట్టాడు. నిఖిల్-ప్రేరణ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారని అర్థమైపోవడంతో నబీల్.. అవినాష్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. నిఖిల్‌ను అవుట్ చేద్దామని.. తర్వాత తాను ఓడిపోయి అవినాష్‌ను చీఫ్ చేస్తానని మాటిచ్చాడు. అలా చివరకు అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు.నబీల్‌కు స్వీట్లు తినే ఛాన్స్తర్వాత హౌస్‌లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో భాగంగా అబ్బాయిలు, అమ్మాయిలు అందంగా ముగ్గులు వేశారు. తర్వాత బిగ్‌బాస్ స్వీట్లు పంపించాడు. ఇక ఈ సీజన్ మొత్తం స్వీట్లు తిననని శపథం చేసిన నబీల్‌కు ఈ ఒక్కరోజు మాత్రం స్వీట్లు తినవచ్చని బిగ్‌బాస్ మినహాయింపు ఇచ్చాడు. అనంతరం బిగ్‌బాస్.. కంటెస్టెంట్ల ఇంటిసభ్యుల వీడియో సందేశాలను చూడవచ్చన్నాడు. ఎమోషనలైన తేజఅయితే ఇక్కడ కూడా అందరికీ అవకాశం ఇవ్వకుండా ప్రతి ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంటుందన్నాడు. అలా మొదటగా నబీల్, పృథ్వీలలో.. నబీల్‌కు అమ్మ, అన్నయ్య నుంచి వీడియో మెసేజ్ వచ్చింది. తల్లిని టీవీలో చూడగానే నబీల్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. రోహిణి, తేజలలో ఒకరికే వీడియో ఛాన్స్ అని బిగ్‌బాస్ చెప్పగా రోహిణి త్యాగంతో తేజకు ఫ్యామిలీ వీడియో ప్లే చేశాడు. తల్లిని స్క్రీన్‌పై చూడగానే తేజ ఎమోషనలయ్యాడు. యష్మి త్యాగంఅనంతరం నయని, యష్మిలలో ఒకరికే వీడియో ఛాన్స్ ఇవ్వగా నయనికి తల్లి మెసేజ్ ప్లే చేశారు. లైఫ్‌లో ఎన్నో ఎదుర్కొంటూ ఈ స్టేజ్‌కు వచ్చావు.. స్ట్రాంగ్‌గా ఆడు అని తల్లి ధైర్యం చెప్పడంతో నయని కళ్లలో నీళ్లు తిరిగాయి. అవినాష్ త్యాగంతో రోహిణి ఫ్యామిలీ వీడియో చూడగలిగింది. తర్వాత యష్మి త్యాగంతో విష్ణుప్రియ ఆంటీ వీడియో చూసి సంతోషపడిపోయింది. చివరగా యష్మి, అవినాష్, పృథ్వీలో ఒక్కరికే ఛాన్స్ అని చెప్పగా వీరు పృథ్వీ పేరు సూచించారు. అంతా ఏకమై సంతోషంగా..అలా పృథ్వీ తన తమ్ముడి వీడియో చూసి ఖుషీ అయ్యాడు. తర్వాత అందరూ పటాసులు కాల్చి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. పండగ పూట హౌస్‌మేట్స్‌ను బాధపట్టడం ఇష్టం లేని బిగ్‌బాస్ సడన్‌గా అవినాష్, యష్మి, హరితేజ ఫ్యామిలీ వీడియోస్ ప్లే చేశాడు. కూతురిపై బెంగ పెట్టుకున్న హరితేజ.. చిన్నారి భూమిని చూడగానే గుక్కపెట్టి ఏడ్చింది. భావోద్వేగాలతో గుండె భారమైన కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేక భోజనం పంపించడం విశేషం.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: ఇచ్చిపడేసిన నబీల్.. విలన్‌గా విష్ఱుప్రియ.. దెబ్బకు!
అవినాష్‌ను స్కానింగ్ కోసం బయటకు తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగోలేక ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నాడేమోనని హౌస్ మొత్తం ఏడ్చేసింది. కట్ చేస్తే కొన్ని గంటలకే లోనికి వచ్చాడు. నామినేషన్స్ ఈసారి డిఫరెంట్‌గా జరిగాయి. ముఖ్యంగా మెగా చీఫ్‌కు ఇది కత్తి మీద సామే అయింది. అదెలాగో తెలియాలంటే నేటి (అక్టోబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హౌస్ మొత్తం ఏడుపుకడుపు నొప్పితో అవినాష్ మెడికల్ రూమ్‌కు వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యుడు స్కానింగ్ కోసం హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నారు. కడుపు నొప్పి భరించలేకపోతున్నాను, అందుకే హౌస్ నుంచి వెళ్లిపోతున్నా అంటూ అవినాష్ హౌస్‌లో ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే అవి ఎలిమినేట్ అవుతున్నాడనుకుని దాదాపు హౌస్మేట్స్ అందరూ భారంగా ఏడుస్తూ వీడ్కోలు చెప్పారు. అవినాష్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కాన్ చేయించిన బిగ్‌బాస్ టీమ్.. అతడిని తిరిగి హౌస్‌లోకి పంపారు.నామినేషన్స్.. మెగా చీఫ్‌పై భారంమెగా చీఫ్ విష్ణుప్రియ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఐదుగురు సభ్యులను నామినేట్ చేసి జైల్లో పెట్టి తాళం వేయాలన్నాడు. చీఫ్‌ను చేయడంతో పాటు విలన్‌ను కూడా చేసేస్తున్నారని మనసులో అనుకుంటూనే ముందుగా గౌతమ్‌ను నామినేట్ చేసింది. లేడీస్ వీక్ అంటూ ఆడాళ్లకు గౌరవమిస్తానంటావ్.. కానీ ఒకరిపై నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అరవడం బాగోలేదని తెలిపింది. అందుకు గౌతమ్.. ప్రేరణతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పాయింట్లు వెతకడానికే నీతో ఉన్నాతన పేరు రావడంతో యష్మి గొడవకు దిగింది. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని అక్కా అనేశాడు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. నన్ను అక్కా అని పిలవకు అని యష్మి హెచ్చరించగా అది చూసి విష్ణు పకాపకా నవ్వింది. నాకంటే ఎక్కువపాయింట్లు ఉన్నోళ్లు నీ చుట్టూ ఉన్నా నామినేట్ చేయవని గౌతమ్.. విష్ణుపై అసహనం వ్యక్తం చేశాడు. నిన్ను నామినేట్ చేయడానికి దగ్గరుండి పాయింట్లు వెతికానంది విష్ణు. ఈమె మాటలు విన్న పృథ్వీ వెటకారంగా నవ్వాడు. మనసు చివుక్కుమంది, అందుకే..నన్ను ఫేక్ ఫ్రెండ్ అన్నావ్, అందర్నీ గాలికొదిలేసి నీ కోసమే బజ్జీలు వేసుకున్నావంటూ ప్రేరణను జైల్లో పడేసింది. సంచాలకుడిపై అరవడం వల్ల నా మనసు చివుక్కుమందంటూ తేజను నామినేట్ చేసింది. పృథ్వీ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో నయనిని సైతం జైల్లో వేసింది. వైల్డ్‌కార్డ్స్ వచ్చాక నీలో పన్ యాంగిల్ కనిపించడం లేదంటూ నబీల్ను నామినేట్ చేసింది. వెంటనే నబీల్.. నువ్వు పృథ్వీతో ఉంటే నేనెక్కడ కనిపిస్తానంటూ భలే కౌంటరిచ్చాడు. నీలో ఫైర్ ఏముందని నాకు చెప్తున్నావ్ అని తిరిగి ప్రశ్నించాడు. నామినేషన్స్‌లో రెండో లెవల్అలా విష్ణుప్రియ వల్ల గౌతమ్, ప్రేరణ, నయని పావని, తేజ, నబీల్ నామినేట్ అయ్యారు. మన టీమ్వాళ్లు మెగా చీఫ్ అవ్వాలని ఆడితే ఇప్పుడు నన్నే నామినేట్ చేసిందని నబీల్ ఏడ్చాడు. చేసిందంతా చేసిన విష్ణు.. నబీల్‌కు సారీ చెప్పింది. తర్వాత నామినేషన్స్‌లో రెండో లెవల్ మొదలైంది. జైల్లో ఉన్నవారిని విడిపించే అవకాశాన్ని హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. బజర్ మోగిన ప్రతిసారి జైలు తాళం చెవిని పట్టుకున్నవారికి ఒకరిని నామినేషన్ నుంచి సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి బదులుగా మరొకరిని నామినేట్ చేసి జైల్లో వేయాల్సి ఉంటుంది.ఫైనల్ లిస్ట్ ఇదేమొదటగా పృథ్వీ తాళం అందుకుని.. నబీల్ను జైలు నుంచి విడిపించాడు. అతడి స్థానంలోకి అవినాష్‌ను పంపించాడు. తర్వాత బజర్‌కు యష్మి.. ప్రేరణను విడిపించి హరితేజను జైల్లోకి పంపింది. రోహిణి.. అవినాష్‌ను బయటకు తీసి పృథ్వీని లోనికి పంపించింది. అవినాష్.. తేజను విడిపించి యష్మిని జైల్లో వేశాడు. ప్రేరణ.. పృథ్వీని విడిపించి తేజను లోనికి పంపించింది. ఫైనల్‌గా ఈ వారం గౌతమ్, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేట్ అయినట్లు ప్రకటించారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెహబూబ్ అవుట్.. నొప్పి భరించలేక అవినాష్ సెల్ఫ్ ఎలిమినేట్
పండగ సెలబ్రేషన్స్‌లో బిగ్‌బాస్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవలే హౌస్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు జరిగాయి. ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలల్లో సినీ తారలు భాగమయ్యారు. మరి హౌస్‌లో జరిగిన రచ్చ, హంగామా ఏ రేంజ్లో ఉందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..పండగ సర్ప్రైజ్నాగార్జున దీపావళి పాటకు స్టెప్పులేస్తూ పండగ కళను తీసుకొచ్చాడు. తర్వాత హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడగొట్టిస్టెప్పులు మీవి- మార్కులు మావి అనే గేమ్ ఆడించాడు. ప్రతి రౌండ్లో గెలిచిన టీమ్‌కు ఒక సర్ప్రైజ్ ఉంటుందన్నాడు. అలా మొదటి రౌండ్లో గంగవ్వ-తేజ గెలిచారు. ఈ జంటలో ఒకరికే ఇంటిసభ్యుల నుంచి మెసేజ్ వస్తుందన్నాడు. అలా తేజ త్యాగంతో గంగవ్వకు తన కూతురి వీడియో మెసేజ్ ప్లే చేశారు. అది చూసిన అవ్వ సంతోషంతో కన్నీళ్లుపెట్టుకుంది. తర్వాత విష్ణుప్రియను సేవ్ చేశారు.ప్రైజ్‌మనీలో మరో రూ.1లక్షఅనసూయ డ్యాన్స్‌తో జోష్ నింపింది. ప్రైజ్‌మనీ కవర్స్ కనుక్కోవాలన్న రెండో గేమ్‌లో నిఖిల్, యష్మీ గెలిచారు. వీరు కనిపెట్టిన కవర్లలోని రూ.1 లక్ష ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. తర్వాత ఈ జంటకు సంబంధించిన ఇంటిసభ్యుల ఫోటో చూపించారు. యష్మి త్యాగం చేయడంతో నిఖిల్ పేరెంట్స్ వీడియో ప్లే చేశారు. అలాగే నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.ప్రేరణకు సర్ప్రైజ్తర్వాత 'క' మూవీ టీమ్ స్టేజీపైకి వచ్చింది. వీరు హౌస్మేట్స్ కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు. ఇందులో ప్రేరణ-మెహబూబ్ గెలిచారు. మెహబూబ్ త్యాగంతో ప్రేరణకు వీడియో ప్లే చేశారు. ఆమె తన పేరెంట్స్ మాటలు విని మురిసిపోయింది. తర్వాత మెహరీన్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్ సమీరా భరద్వాజ్.. హౌస్మేట్స్ అందరిపైనా అలవోకగా పాటలు పడేసి అబ్బురపరిచింది. ప్రతి ఒక్కరిపైనా అద్భుతంగా పాట పాడి అదరొట్టేసింది. స్టేజీపై దుల్కర్ సల్మాన్లక్కీ భాస్కర్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ స్టేజీపైకి వచ్చారు. డైరెక్టర్స్ త్రివిక్రమ్, వెంకీలలో ఎవరిని సెలక్ట్ చేస్తావన్న ప్రశ్నకు మీనాక్షి.. వెంకీ అని బదులిచ్చింది. లక్కీ భాస్కర్ టీమ్ ఆడించిన గేమ్‌లో గౌతమ్-నయని పావని జంట గెలిచింది. వీరిలో నయని పావని తన తల్లి మెసేజ్‌ను త్యాగం చేయడంతో గౌతమ్.. అతడి తండ్రి వీడియో సందేశాన్ని వినగలిగాడు. ఇంట్లో గొడవపడి వచ్చిన గౌతమ్.. తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి మరీ సారీ చెప్పాడు.హరితేజ ఎమోషనల్హీరోయిన్ శాన్వీ స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్తో మైమరపించింది. తర్వాత ప్రేరణ, పృథ్వీని సేవ్ చేశారు. అనంతరం అమరన్ హీరో శివకార్తికేయన్, హీరోయిన్ సాయిపల్లవి స్టేజీపైకి వచ్చారు. వీరు ఆడించిన గేమ్‌లో రోహిణి, అవినాష్ గెలిచారు. వీళ్లిద్దరూ తమకు బదులుగా హరితేజకు తన కూతురి వీడియో చూపించమన్నాడు. హాయ్ అమ్మ, హ్యాపీ దివాళి అంటూ కూతురు మాట్లాడిన ముద్దుముద్దు మాటలు విని హరితేజ ఏడ్చేసింది. తర్వాత హైపర్ ఆది హౌస్‌లోకి వచ్చి తన పంచ్ కామెడీతో నవ్వించాడు.ఏడ్చిన యష్మిఈ ఎపిసోడ్ కంటే ముందు ఏం జరిగిందన్నది చూపించారు. ఎవరినో ఉడికించడానికి యష్మి తనను వాడుకోవడం నచ్చలేదన్నాడు గౌతమ్. ఆ మాటలు విన్న యష్మి.. తన ఉద్దేశం అది కాదంటూ ఏడ్చేసింది. నిఖిల్, నేను ఫ్రెండ్స్‌లా టీజ్ చేసుకున్నాం తప్ప నువ్వంటే నాకు బాగా ఇష్టం అని ఎక్కడా ఒకరికొకరం ఎక్స్‌ప్రెస్ చేసుకోలేదు. నా వల్ల తప్పు జరిగుంటే సారీ అని చెప్పింది. దీంతో గౌతమ్.. ఇకపై నువ్వు నాకు కంటెస్టెంటు మాత్రమే.. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని క్లారిటీ ఇచ్చేశాడు. నాగ్ నయనిని సేవ్ చేసి మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.అప్పుడలా ఇప్పుడిలా..వెళ్లిపోయేముందు మెహబూబ్ హౌస్‌మేట్స్‌ను పటాకాలతో పోల్చాడు. అవినాష్ ధౌజండ్‌వాలా, గంగవ్వ లక్ష్మీబాంబ్, నబీల్ రాకెట్, రోహిణి కాకరబత్తి, గౌతమ్ మ్యాచ్ స్టిక్ అన్నాడు. గతంలోనూ దీపావళికి నేను ఎలిమినేట్ అయ్యా.. ఈసారి కూడా దీపావళికే బయటకు వచ్చేశాను. ఎందుకో అర్థం కావట్లేదంటూ ఎమోషనల్ అయ్యాడు. అవినాష్ ఎలిమినేట్ఇక రేపటి ప్రోమోలో అవినాష్ అనారోగ్యంతో సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు చూపించారు. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మెడికల్ రూమ్‌కు వెళ్తే బయటకు వచ్చేయమన్నారు. వెళ్లిపోతున్నాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు. హాస్పిటల్‌కు వెళ్లి మళ్లీ హౌస్‌లో అడుగుపెడతాడా? లేదా నిజంగానే వెళ్లిపోతాడా? అన్నది రేపు తేలనుంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ట్రయాంగిల్ లవ్‌స్టోరీని బయటపెట్టిన పృథ్వీ.. సూర్యకు సర్ప్రైజ్
గంగవ్వ అర్ధరాత్రి దెయ్యం పట్టినట్లు ప్రవర్తించిన వీడియో ప్లే చేసిన నాగ్ అది కేవలం ప్రాంక్ అని బయటపెట్టాడు. ప్రైజ్‌మనీలో అరలక్ష పోయినా నామినేషనే ముఖ్యమనుకున్న నబీల్‌పై పోయిన డబ్బును తీసుకొచ్చే బాధ్యతను వేశాడు. హీరో సూర్య నేటి (అక్టోబర్ 26) ఎపిసోడ్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి..ఇవే తగ్గించుకుంటే మంచిదిఘోస్ట్ ప్రాంక్‌లో గంగవ్వ యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన నాగ్ ఆమెను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి మరీ సీక్రెట్‌గా మెచ్చుకున్నాడు. పృథ్వీ ప్రాణం పెట్టి సింహంలా ఆడాడని పొగిడాడు. అయితే నామినేషన్స్‌లో రోహిణిని కింది నుంచి పైకి చూస్తే అది బాడీ షేమింగ్లానే కనిపిస్తుందని.. దాన్ని మార్చుకోమని సూచించాడు. పృథ్వీ- నిఖిల్.. ఆర్ఆర్ఆర్ మూవీ హీరోల్లా కలిసి ఆడారని క్లాప్స్ కొట్టాడు. నీ వల్ల అరలక్ష గోవిందా..ప్రైజ్‌మనీలో రూ.50 వేలు కట్ అవుతాయని తెలిసినా హరితేజను నామినేట్ చేశావు. ఆ అర లక్ష మళ్లీ ప్రైజ్‌మనీలో జమ చేయాల్సిన బాధ్యత నీదేనని నబీల్‌కు నొక్కి చెప్పాడు. గౌతమ్ గురించి మాట్లాడుతూ.. మహిళలపై గౌరవం ఉందని చెప్పే నువ్వు యష్మిపై ఎందుకు అరిచావ్? నీ షార్ట్ టెంపర్ తగ్గించుకో అని సలహా ఇచ్చాడు.ట్రయాంగిల్ లవ్ స్టోరీతర్వాత నిఖిల్- యష్మి - గౌతమ్‌ల ట్రయాంగిల్ లవ్‌స్టోరీని నాగ్ బయటపెట్టాడు. హౌస్‌లో జరిగిన టీ షర్ట్ వ్యవహారం గురించి పృథ్వీ చెప్తే ప్రైజ్‌మనీలో రూ.50 వేలు యాడ్ చేస్తానని నాగ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇంకేముంది, ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టి పృథ్వీ లేచి నిల్చున్నాడు. గౌతమ్ టీషర్ట్ కావాలని యష్మి అడిగింది. నిఖిల్ టీషర్ట్ లేదు కాబట్టి గౌతమ్‌ది వేసుకుంది. అప్పుడు నిఖిల్ జెలసీ ఫీల్ అవుతున్నాడని యష్మి నాతో చెప్పింది. అక్కడినుంచి ఏమైనా ఉందా? అని అడిగింది అంటూ పూసగుచ్చినట్లు చెప్పాడు.యష్మికి గడ్డి పెట్టిన నాగ్రాయల్ టీమ్‌లో విభేదాలున్నాయని.. అవన్నీ పక్కనపెట్టి ఓజీ టీమ్‌లా ఐకమత్యంగా ఉండాలని సలహా ఇచ్చాడు. ఇక నిఖిల్ చుట్టూ తిరిగిన యష్మిని.. ఎవరి చుట్టూనో తిరగడం మానేయ్, మళ్లీ గేమ్‌కు వచ్చేయమని సూచించాడు. అలాగే సంచాలకురాలిగా నా స్ట్రాటజీ నాకుంటుంది, నా గ్రూపును నేను గెలిపించుకోవాలనడం తప్పు అని కుండబద్ధలు కొట్టాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన యష్మి నాకు ఏ స్ట్రాటజీ లేదంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది.అప్పుడు కెమెరామన్, ఇప్పుడు డైరెక్టర్ఇక గంగవ్వ దెయ్యంగా మారి భయపెట్టింది ప్రాంక్ అని.. ఈ ఐడియా అవినాష్, తేజదని వీడియోతో సహా క్లారిటీ ఇచ్చాడు నాగ్. తర్వాత కంగువా ప్రమోషన్స్ జరిగాయి. అందులో భాగంగా హీరో సూర్య, దర్శకనిర్మాత స్టేజీపైకి వచ్చాడు. డైరెక్టర్ అవ్వకముందు నాగార్జున నటించిన నేనున్నాను, బాస్: ఐ లవ్యూ సినిమాలకు శివ కెమెరామెన్‌గా నటించాడు. ఆ సమయంలో ఒకరోజు నాగ్ పిలిచి.. నువ్వు కచ్చితంగా డైరెక్టర్ అవుతావన్నాడు అని చెప్పుకొచ్చాడు.సూర్య కోసం వచ్చేందుకు రెడీసూర్య వస్తున్నాడని తెలిసి నయని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందట! ఇక హౌస్మేట్స్ అందరూ సూర్య పాటలకు డ్యాన్స్ వేసి అతడిని సర్ప్రైజ్ చేశాడు. సూర్యను కలవడానికి హౌస్ నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తావా? అని నాగ్ అడగ్గా తప్పకుండా వస్తాను సర్ అంటూ నయని మెలికలు తిరిగిపోయింది. పృథ్వీ కోరిక మేరకు సూర్య.. రోలెక్స్ డైలాగ్ చెప్పాడు. తర్వాత బై చెప్పివెళ్లిపోయాడు.డ్యాన్స్ రిహార్సల్స్‌లో గొడవఅయితే డ్యాన్స్ రిహార్సల్స్‌లో యష్మి హర్టయిందట! ప్రాక్టీస్ మీద ఆసక్తి చూపించడం లేదు, నీకసలు డ్యాన్స్ పార్ట్నర్ ఎవరు కావాలి? అని విష్ణు పృథ్వీని అడిగగింది. అందుకతడు ఎవరైనా ఓకే అన్నాడు. దీంతో హర్టయిన విష్ణు.. నేను, పృథ్వీ కంఫర్ట్‌గా లేము బిగ్‌బాస్. పార్ట్నర్స్ మార్చుకునే వీలుందా? అని అడిగింది. దీంతో బిగ్‌బాస్ నిఖిల్ -యష్మిని విడదీశాడు. నిఖిల్‌తో విష్ణు, యష్మితో పృథ్వీ కలిసి డ్యాన్స్ చేయాలన్నాడు.బిత్తరపోయిన విష్ణుఇది యష్మికి అస్సలు నచ్చలేదు. తన కోసం నా ఆనందాన్ని చెడగొడుతోందని ఏడ్చేసింది. నువ్విలా చేస్తావని ఊహించలేదంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడింది. దీంతో బిత్తరపోయిన విష్ణు.. పృథ్వీతో డ్యాన్స్ చేసేందుకు ఒప్పుకోవడంతో సమస్య సద్దుమణిగింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిపై ప్రేమను దాచేస్తున్న నిఖిల్.. కోపంతో తేజను కొట్టిన గంగవ్వ
రెండు రోజులుగా కొనసాగుతున్న బీబీ రాజ్యం ఛాలెంజ్ ఈరోజుతో పూర్తయింది. రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ను వెనక్కు నెట్టి ఓజీ టీమ్(పాత కంటెస్టెంట్లు) రాజ్యాన్ని కైవసం చేసుకుంది. అదొక హఠాత్పరిణామం.. అన్నట్లుగా విష్ణుప్రియ మెగా చీఫ్‌గా నిలిచింది. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పొడుపు కథబీబీ రాజ్యం చాలెంజ్‌లో భాగంగా మీలో ఎవరు తెలివైనవారు? అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌కు నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించాడు. '13 హార్ట్స్ ఉంటాయి.. కానీ మిగతా ఆర్గాన్స్ ఉండవు.. ఏంటి?' అన్న ప్రశ్నకు తేజ ప్లేయింగ్ కార్డ్స్ అని బదులిచ్చాడు. కొన్ని నెలలకు 31 రోజులుంటాయి కొన్ని నెలలకు 30రోజులుంటాయి. ఎన్ని నెలలకు 28 రోజులుంటాయన్న ప్రశ్నకు గౌతమ్ 12 నెలలు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు.బతికుండగానే పాతిపెడతారా?ఏపీ, తెలంగాణ సరిహద్దులో విమానం పడిపోతే అందులో ఉన్న సర్వైవర్లను ఎక్కడ పాతిపెడతారు? అని అడిగాడు. అందుకు నిఖిల్, నయని.. ఆంధ్ర, తెలంగాణ అంటూ శుద్ధ తప్పు సమాధానం చెప్పారు. బతికున్నవాళ్లను పాతిపెడతారా? అని బిగ్‌బాస్ కౌంటర్ వేయడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఇలాంటి ప్రశ్నలే మరికొన్ని వేయగా రెండు టీమ్స్‌కు టై అయింది. దీంతో చివరి ప్రశ్నగా.. కోతి, ఉడుత, పక్షిలో ఏది ముందుగా కొబ్బరిచెట్టు ఎక్కి అరటిపండు తెంపుతుందన్నాడు. తేజను వాయించిన గంగవ్వముందుగా బజర్ నొక్కిన ప్రేరణకు ప్రశ్న సరిగా అర్థం కాలేదు. ఆ క్వశ్చన్ రిపీట్ చేయడానికి వీల్లేదని తేజ వాదించాడు. కావాలంటే జంతువుల పేర్లను ఇంగ్లీష్‌లో చెప్పుకోవచ్చన్నాడు. దీంతో గంగవ్వ వచ్చి.. ప్రేరణకు ఎందుకు చెప్తున్నావు, నీకు ఆన్సర్ చెప్పొస్తలేదా? అని తేజను కొట్టింది. ఇంతలో ప్రేరణ కొబ్బరిచెట్టుపై నుంచి పండును ఏ జంతువూ తెంపలేదని పేర్కొంది.ప్రేరతో గౌతమ్ ఫైట్అలా ఈ గేమ్‌లో ఓజీ గెలిచి బీబీ రాజ్యంలో స్కూల్, న్యాయస్థానం గెలుచుకుంది. అలాగే తన టీమ్‌లో ప్రేరణను కంటెండర్‌గా ప్రకటించారు. రాయల్స్ టీమ్‌లో మెహబూబ్‌ను చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు. ఇంతలో గౌతమ్.. ప్రేరణతో ఏదో వాదులాటకు దిగగా మధ్యలో యష్మి వచ్చి సముదాయించబోయింది. మా ఇద్దరి మధ్యలోకి రాకు, వెళ్లిపో అని యష్మిపై అరిచాడు. కాసేపటికి వాళ్లిద్దరికీ సారీ కూడా చెప్పాడు. ప్రేమ ఉంది కాబట్టే అలా..మరోవైపు నిఖిల్, యష్మి మధ్య దోబూచులాట అవుతూనే ఉంది. నీకు, నాకు సెట్టవదు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు అంటూ ఏవేవో మాట్లాడుకున్నారు. నిఖిల్ ప్రవర్తన అంతుపట్టని యష్మి.. సడన్‌గా వచ్చి నాపై ఇంట్రస్ట్ ఉందన్నట్లు మాట్లాడతాడు. అలాగే నేను, గౌతమ్ డ్యాన్స్ చేస్తే జెలసీ ఫీల్ అయ్యాడు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. కెమెరా ముందు మంచోడిలా ఉండాలనుకుంటే ఉండు.. నేను మాత్రం ఫేక్‌గా ఉండలేను అంది. అలా ఈర్ష్యపడటం లవ్ లాంగ్వేజ్ అని ప్రేరణ నిర్ధారించింది.ఆరుగురు మెగా చీఫ్ కంటెండర్స్ఇక బీబీ రాజ్యం టాస్కు పూర్తయిందన్న బిగ్‌బాస్.. ఓజీ, రాయల్స్ నుంచి చెరొక కంటెండర్‌ను సెలక్ట్ చేయవచ్చన్నాడు. దీంతో విష్ణుప్రియ, తేజను ఎంపిక చేశారు. ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి, తేజలలో ఒకర్ని మెగా చీఫ్‌గా ఎన్నుకునే బాధ్యతను హౌస్‌మేట్స్‌పై వేశాడు. మెగా చీఫ్‌కు అనర్హులనుకునేవారికి మిరప దండ వేసి రేసు నుంచి తప్పించాలన్నాడు.కొత్త చీఫ్‌గా విష్ణుప్రియఅలా మొదటగా మెహబూబ్.. ప్రేరణను తప్పించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నబీల్.. రోహిణిని, అవినాష్.. పృథ్వీని అవుట్ చేశారు. చివరగా గౌతమ్.. నిఖిల్‌ను అవుట్ చేస్తూ విష్ణుప్రియను చీఫ్‌గా గెలిపించాడు. అయితే ఒక్కరికే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానంగా చూడాలని మాట తీసుకున్నాడు. ఇక విష్ణుప్రియకు ఇచ్చిన ఎన్విలాప్‌లో రూ.2 లక్షలు ఉండగా అది ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.40,16,000కు చేరింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హడలెత్తించిన నిఖిల్, పృథ్వీ.. కూతురి కోసం హరి కన్నీళ్లు!
ఫిజికల్ టాస్క్ వస్తే పృథ్వీకి తెలియకుండానే పూనకం వస్తుంది. మనుషుల్ని పిట్టల్లా విసిరేస్తూ, పురుగుల్లా నలిపేస్తుంటాడు. ఈ రోజూ ఇదే జరిగింది. ఈసారి నిఖిల్ తోడయ్యాడు. టాస్కులో ఈ దోస్తులిద్దరూ అరాచకం సృష్టించారు. మరి వీరితో పోటీపడిందెవరు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నిఖిల్, పృథ్వీ అరాచకంబీబీ రాజ్యం ఛాలెంజ్ కొనసాగింపుగా నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఎనిమిది ధాన్యపు బస్తాలను తోపుడు బండిపై ఎవరు ముందుగా పెడతారో ఆ టీమ్‌కు రాజ్యంలో వ్యవసాయం దక్కుతుందన్నాడు. ఓజీ టీమ్ నుంచి నిఖిల్, పృథ్వీ విజృంభించి ఆడారు. వారిని అడ్డుకునేందుకు గౌతమ్, మెహబూబ్ చాలావరకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొట్టుకున్నారు, తోసేసుకున్నారు. నానా అరాచకం సృష్టించడంతో బిగ్‌బాస్ కొన్ని సెకన్లపాటు గేమ్‌ను పాజ్ చేశాడు. అదుర్స్ అనిపించిన తేజ, అవినాష్అలాగే ఈ ఆటలో పోటీదారులను మార్చుకోవచ్చని వెసులుబాటు కల్పించాడు. అలా గౌతమ్, మెహబూబ్ స్థానంలోకి అవినాష్, తేజ వచ్చారు. వీళ్లు కూడా తమ శక్తికి మించి ప్రయత్నించి ఆడారు. వాళ్లు ఎంతో కష్టపడి ఓ సంచిని బండిపై పెట్టారు. కానీ అది ముందు ఓజీ తోపుడు బండికి టచ్ అయిందంటూ వారికే పాయింట్ ఇస్తానని సంచాలకురాలు యష్మి వితండ వాదం చేసింది. ఒక్క బస్తా కూడా రాయల్ టీమ్‌ను పెట్టనివ్వకపోవడం నిఖిల్, పృథ్వీల శక్తికి నిదర్శనం.మనలో ఒకరే విన్నర్ఫైనల్గా ఈ గేమ్‌లో ఓజీ టీమ్ గెలవడంతో వ్యవసాయ భూమి గెలిచారు. అలాగే తన టీమ్‌లో నుంచి పృథ్వీని మెగా చీఫ్ కంటెండర్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో కంటెండర్ అవ్వాలనుకున్న ప్రేరణకు, యష్మికి మధ్య గొడవ జరిగింది. ఈ ఇద్దరికీ సర్ది చెప్పిన నిఖిల్.. ఇది మన సీజన్.. మన టీమ్‌లోని ఒకరే ట్రోఫీ ఎత్తాలి. మనలో మనకు గొడవలొద్దు అని టీమ్ సభ్యులకు హితోపదేశం చేశాడు. ఓడిన రాయల్స్ టీమ్ నుంచి గంగవ్వను మెగా చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు.కూతుర్ని తల్చుకుని హరితేజ ఎమోషనల్వచ్చినప్పటినుంచి మేమే గెలిచాం అని రాయల్స్ ఫీల్ అవుతున్నారు. మనం మిగతా టాస్కులు గెలిచి ఆ పొగరును తగ్గించేయాలని ప్రేరణ.. నబీల్‌తో అంది. అన్నట్లుగానే తర్వాత టాస్కుల్లోనూ దూకుడు ప్రదర్శించారు. మరోవైపు హరితేజ.. తన కూతురు భూమిని తల్చుకుని ఎమోషనలైంది. అమ్మ గురించి బెంగపెట్టుకోకు, స్కూలుకు వెళ్లు, పిన్నితో ఆడుకో.. వీకెండ్లో నాన్న వస్తాడు. అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు, నీకోసం ఏడవట్లేదు. నువ్వు కూడా ఏడవొద్దంటూనే కన్నీళ్లు పెట్టుకుంది.మళ్లీ ఓజీ టీమ్‌దే గెలుపుబీబీ రాజ్యంలో సైన్యం, హాస్పిటల్‌ను పొందడానికి బిగ్‌బాస్ వైరల్ అటాక్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఓజీ టీమ్ నుంచి నిఖిల్, నబీల్ ఆడగా రాయల్ టీమ్ నుంచి గౌతమ్, తేజ ఆడారు. మరోసారి ఓజీ టీమ్ గెలిచి హాస్పిటల్, సైన్యం పొందింది. అలాగే తన టీమ్‌లో నుంచి నిఖిల్‌ను మెగా చీఫ్ కంటెండర్‌గా ప్రకటించారు. రాయల్స్ నుంచి గౌతమ్‌ను మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పించారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్‌పై మనసు పారేసుకున్న యష్మి, అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!
సమయం దొరికినప్పుడల్లా అవినాష్ అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. అటు తేజ, అవినాష్.. గంగవ్వను దెయ్యం పట్టినట్లు యాక్ట్ చేయమన్నారు. కానీ గంగవ్వ ఏకంగా జీవించేసింది. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..తిక్క కుదిర్చిన బిగ్బాస్ఇంటిని శుభ్రంగా ఉంచట్లేదని, తన ఆదేశాలను లెక్కచేయట్లేదని బిగ్‌బాస్ హర్టయ్యాడు. అందుకని ఈ వారం సూపర్మార్కెట్లో షాపింగ్ చేసే సమయాన్ని కాస్త కట్ చేసిపారేశాడు. దీంతో మెగా చీఫ్ గౌతమ్.. నిఖిల్‌ను మార్కెట్‌కు పంపించి అతడితో షాపింగ్ చేయించాడు.యష్మి- నిఖిల్ లవ్ ట్రాక్?ఇక యష్మి.. నిఖిల్‌ను తనతో మాట్లాడమని బతిమాలింది. ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడే బాగుండేది.. నా వల్ల నీ గేమ్‌కు ప్రాబ్లం కానివ్వను. నాది పడిపడి చచ్చే క్యారెక్టర్ అయితే కాదు, ఇకపై జస్ట్ ఫ్రెండ్‌గా ఉంటా అని చెప్పుకుంటూ పోయింది. నిఖిల్ శిలావిగ్రహంలా స్తబ్దుగా కూర్చోవడంతో కోపంతో వెళ్లిపోయింది. ఆమె అలకను తీర్చేందుకు నిఖిల్.. యష్మిని హత్తుకుని ముద్దిచ్చాడు.ఇంకా పృథ్వీ వెనకే పడుతోన్న విష్ణుపృథ్వీ మెడలో గోల్డ్ చెయిన్ చూసి నిలువెత్తు బంగారం.. మళ్లీ బంగారం వేసుకుని తిరగడమేంటో అని మురిసిపోయింది. ఈ మాట విన్న హౌస్మేట్స్ ఇక మా వల్లకాదు, వెళ్లిపోతాం అని జోక్ చేశారు. బిగ్‌బాస్ కూడా సరే, మీ సరదా నేనెందుకు కాదంటాను అన్నట్లు గేట్లు తెరిచాడు. దీంతో అబ్బాయిలంతా కలిసి అవినాష్‌ను లాక్కెళ్లి మరీ బయట పడేసేందుకు ప్రయత్నించారు.మనసు మార్చుకున్న బిగ్బాస్అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ మేరకు అవినాష్ జిమ్ ట్రైనర్‌గా మారి హౌస్‌మేట్స్‌తో చిత్రవిచిత్రమైన కసరత్తులు చేయించి నవ్వించాడు. దీంతో కిచెన్ టైమర్‌కు మరో రెండు గంటల సమయం యాడ్ చేశాడు. అలాగే మార్కెట్లో మర్చిపోయిన కూరగాయలు, పండ్లను సైతం పంపించి తన మనసు వెన్న అని నిరూపించుకున్నాడు.అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!అవినాష్, తేజ.. గంగవ్వను దెయ్యంలా రెడీ అయి భయపెట్టాలన్నాడు. ఇంకేముంది.. అర్ధరాత్రి గంగవ్వ జుట్టు విరబోసుకుని కేకలు వేయడంతో హౌస్మేట్స్ నిద్రలో నుంచి లేచి జడుసుకున్నారు. ఇది చూసిన తేజ.. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పక్కా అని భయపడిపోయాడు. నిఖిల్, పృథ్వీ, నబీల్ మాత్రం నిద్రలో నుంచి లేవలేదు. అయితే ఇది ప్రాంక్ అని, అవినాష్ చేయించి ఉంటాడని గౌతమ్ అనుమానపడ్డాడు.మెగా చీఫ్ కంటెండర్‌గా రోహిణిబీబీ రాజ్యం ఏర్పాటు చేసుకునేందుకు రెండు క్లాన్స్ పోటీపడతాయన్నాడు. మొదటగా అక్వేరియంలో నీళ్లను నింపే టాస్కులో రాయల్ టీమ్ గెలిచింది. అందుకు గానూ రాజ్యంలో మంచినీటి సరస్సును పొందారు. అలాగే రాయల్ టీమ్‌లో నుంచి రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అయింది. అలాగే ఓజీ టీమ్‌లో యష్మి మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పుకుంది. రోహిణిని కంటెండర్‌గా సెలక్ట్ చేయడంపై హరితేజ రాద్దాంతం చేసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణపై పగ తీర్చుకున్నారు.. ప్రైజ్‌మనీని ఖాతరు చేయని నబీల్
నామినేషన్స్.. ఈసారి అన్నీ రివేంజ్ నామినేషన్సే పడ్డాయి. ప్రైజ్‌మనీ తగ్గినా తనకేం పర్వాలేదన్నట్లు ప్రవర్తించాడు నబీల్. ఇంతకీ నామినేషన్స్‌కు, ప్రైజ్‌మనీకి ఏం సంబంధం? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నామినేషన్స్ షురూఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఇద్దరు ఇంటిసభ్యుల దిష్టిబొమ్మలపై కుండ పెట్టి పగలగొట్టాలని బిగ్‌బాస్ చెప్పాడు. నామినేషన్ షీల్డ్ ఎవరిదగ్గరైతే ఉంటుందో వారిని నామినేట్ చేసినప్పుడల్లా ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు పోతాయని హెచ్చరించాడు. మెగా చీఫ్ గౌతమ్.. ఈ నామినేషన్ షీల్డ్‌ను హరితేజకు ఇచ్చాడు.పృథ్వీ మీద ప్రేమతో.. పోయినవారం తేజకు బదులుగా పృథ్వీని నామినేట్ చేయడం నచ్చలేదని పరోక్షంగా చెప్తూ ప్రేరణను నామినేట్ చేసింది విష్ణు. గేమ్ స్లో అయిపోతుందంటూ, లైటర్ కోసం పాయింట్ ఇవ్వడం నచ్చలేదని నిఖిల్ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టింది. అలాగైతే నువ్వు అందరికంటే ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసి పాయింట్ ఇచ్చేశావ్గా అని నిఖిల్ అనడంతో విష్ణు నీళ్లు నమిలింది. తర్వాత రోహిణి.. ఆటలో ఫిజికల్ అవడం నచ్చలేదని నిఖిల్‌ను నామినేట్ చేసింది. సెల్ఫిష్‌గా ఆలోచిస్తావ్, గేమ్‌లో అగ్రెసివ్ అవుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేసింది. బాడీ షేమింగ్పృథ్వీ.. పోయినవారం కిల్లర్ గర్ల్‌గా తనను నామినేట్ చేసినందుకు ప్రేరణ కుండ పగలగొట్టి తనపై ప్రతీకారం తీర్చుకున్నాడు. టాస్క్‌లో వీక్, ఆటలో జీరో.. నీకు రన్నింగ్ కూడా రావాలి, అది అంత ఈజీ కాదు అని రోహిణిని పై నుంచి కింది వరకు చూశాడు. తనను బాడీ షేమింగ్ చేయడంతో రోహిణికి చిర్రెత్తుకొచ్చింది. ఆ చూపేంటి? బాడీ షేమింగా? ఓవరాక్షన్ చేయకు.. తొక్కలో నామినేషన్స్ చేయకు అని ఇచ్చిపడేసింది.సెల్ఫిష్ గేమ్నయని పావని.. బ్యాటరీ టాస్కులో సెల్ఫిష్‌గా ఆడారంటూ మెహబూబ్, నిఖిల్‌ను నామినేట్ చేసింది. హరితేజ వంతురాగా.. ప్రేరణను నామినేట్ చేస్తూ కొంపలు మునిగాక రావడం మానేయమని సలహా ఇచ్చింది. సెల్ఫిష్‌గా ఆడావంటూ మెహబూబ్‌ను నామినేట్ చేసింది. ప్రైజ్‌మనీ తగ్గినా పర్లేదంటూ..నబీల్.. నన్ను ఇమ్మెచ్యూర్ అనడం నచ్చలేదు, అలాగే వేరేవాళ్ల పనుల్లో దూరకు అంటూ ప్రేరణ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టాడు. ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు పోయినా పర్లేదంటూ హరితేజను నామినేట్ చేశాడు. మీకు డెసిషన్ తీసుకోవడం రావట్లేదు. అలాగే నాకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని నా సూట్‌కేస్ బయటపెట్టడం నచ్చలేదని కుండ పగలగొట్టాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పాపం గౌతమ్.. వెళ్లిపోయేముందు వాళ్లను ముంచేసిన మణికంఠ
బిగ్‌బాస్ అనేది గోల్డెన్ ఛాన్స్. ప్రేక్షకులకు దగ్గరచేసే సాధనం, ఫ్రీ పబ్లిసిటీ! అలాంటిది.. ప్రేక్షకులు తనను సేవ్ చేసినా కాదనుకుని వెళ్లిపోయాడు. షో గెలుస్తానన్న అతడు ఏడువారాలకే తన వల్ల కావట్లేదని చేతులెత్తేశాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..రెండు జంటల డ్యాన్స్ హైలైట్బిగ్బాస్ హౌస్‌లో అందరూ సమానమే.. లింగబేధం, కమ్యూనిటీ బేధాలుండవని నాగార్జున హౌస్‌మేట్స్‌కు నొక్కి చెప్పాడు. దీంతో కమ్యూనిటీ గురించి మాట్లాడిన నబీల్, మెహబూబ్ ముఖం వాడిపోయింది. తర్వాత నాగ్.. యష్మిని సేవ్ చేసి హౌస్‌మేట్స్‌తో చిత్రం భళారే విచిత్రం గేమ్ ఆడించాడు. ఇందులో అబ్బాయిల టీమ్ విజయం సాధించింది. ఈ గేమ్‌లో విష్ణు-పృథ్వీ, యష్మి- గౌతమ్ జంటల డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. తర్వాత నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.డైలాగ్ డెడికేషన్హౌస్మేట్స్పై సోషల్ మీడియాలో వైరలవుతున్న కొన్ని మీమ్స్ చూపించడంతో అందరూ పగలబడి నవ్వారు. నబీల్ను సేవ్ చేసిన అనంతరం డైలాగ్ డెడికేషన్ అని మరో గేమ్ ఆడించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా కొన్ని డైలాగులను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. అలా మొదటగా నిఖిల్.. నువ్వు ఊరుకోమ్మా.. ఊరికే తుత్తుత్తు అంటావ్.. అన్న డైలాగ్ బోర్డును ప్రేరణ మెడలో వేశాడు. హరితేజ.. వీడిని ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా డైలాగ్ నాగమణికంఠకు అంకితమచ్చింది. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారుతేజ.. అదంతా అప్పుడండి.. ఇప్పుడు నేను మారిపోయాను డైలాగ్ అవినాష్‌కు సూట్ అవుతుందన్నాడు. విష్ణుప్రియ.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు డైలాగ్ గంవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందంది. తు సమ్జా.. నై సమ్జా డైలాగ్ పృథ్వీకి సరిపోతుందన్నాడు మెహబూబ్. ఇక నయని.. నవ్వాపుకుంటున్నావ్ కదరా డైలాగ్ బోర్డును విష్ణు మెడలో వేసింది. అన్న రూల్స్ పెడ్తాడు కానీ ఫాలో అవడు డైలాగ్ నిఖిల్‌కు సెట్ అవుతుందన్నాడు గౌతమ్. సరె సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి? అన్న డైలాగ్‌ను విష్ణు మెడలో వేసింది రోహిణి. బేసిక్ సెన్స్ ఉండదునాకు అర్థం కాలేదు సార్ డైలాగ్ పృథ్వీకి సెట్ అవుతుందన్నాడు మణి. నువ్వు అంత హార్ష్‌గా మాట్లాడకు, ఫీల్ అవుతాను డైలాగ్ తేజకు డెడికేట్ చేసింది యష్మి. నబీల్ వంతు రాగా.. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం డైలాగ్‌ను గౌతమ్‌కు అంకితమిచ్చాడు. గంగవ్వ.. బేసిక్ సెన్స్ ఉండదు, అంటే ఏమో హర్ట్ అయిపోతారు అన్న డైలాగ్ నయనికి డెడికేట్ చేసింది. ఓవరాక్షన్ చేస్తున్నావేంట్రా, ఓవరాక్షన్ అన్న బోర్డును అవినాష్.. పృథ్వీకి ఇచ్చాడు. నాకు ఇంట్రస్ట్ పోయింది సర్ అన్న డైలాగ్‌ను మణికి డెడికేట్ చేసింది ప్రేరణ. మండుతున్నట్లుంది డైలాగ్‌ను మెహబూబ్‌కు అంకితమిచ్చాడు పృథ్వీ. మణికంఠ ఎలిమినేట్తర్వాత నాగ్.. పృథ్వీని సేవ్ చేశాడు. చివర్లో గౌతమ్, మణికంఠ మిగిలారు. ఈ క్రమంలో మణి తనవల్ల కావట్లేదు, వెళ్లిపోతానన్న వీడియను హౌస్‌మేట్స్‌కు ప్లే చేసి చూపించాడు నాగ్. అతడు ఉండాలా? వద్దా? అని హౌస్‌మేట్స్‌ను అడగ్గా మెజారిటీసభ్యులు మణి వెళ్లడమే బెటర్ అన్నారు. చివరిసారి మణికంఠను అడిగి చూశాడు నాగ్. అప్పటికీ అతడు వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. దీంతో మణికంఠ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అయితే మణికంఠ కంటే గౌతమ్‌కు తక్కువ ఓట్లు పడ్డాయన్నాడు. నిజానికి ఎలిమినేట్ కావాల్సింది గౌతమ్ అని చెప్పాడు. ఎక్కడ తప్పు జరుగుతోందని గౌతమ్ ఆలోచనలో పడిపోయాడు. ఆ ఐదుగురినీ బోటు ఎక్కించాడుఅటు మణికంఠ.. జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలా నవ్వుతూ వెళ్లిపోయాడు. పోరాడలేకపోయాను, నా ఓపిక అయిపోయిందంటూ హౌస్మేట్స్ దగ్గర సెలవు తీసుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన మణికంఠతో నాగ్ ఓ గేమ్ ఆడించారు. అందులో భాగంగా మణి.. నయని, విష్ణుప్రియ, నబీల్, హరితేజ, మెహబూబ్ ఫోటోలను బోటు ఎక్కించాడు. మెహబూబ్‌కు విన్నర్‌కు కావాల్సిన లక్షణాలున్నాయన్నాడు. అనంతరం ఆటలో ఒకప్పుడు ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు, ఫినాలే వరకు వస్తావని ఆశిస్తున్నానంటూ నిఖిల్ ఫోటోను నీటిలో ముంచేశాడు. మునిగిపోతావ్, జాగ్రత్త..తేజ ఎనర్జీ చూపించకపోతే ముగిపోతాడన్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆడితే బెటర్ అంటూ పృథ్వీని ముంచాడు. అవసరమైనప్పుడే నోరు విప్పు.. వచ్చిన మొదటివారమే చీఫ్ అయ్యావ్.. ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయకపోతే ఆటలో మునిగిపోతావని గౌతమ్‌ను హెచ్చరించాడు. అనవసరమైన చోట నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం వల్ల నీ ఆటకే ఎసరు పడుతుందని ప్రేరణ ఫోటోను ముంచాడు. చివర్లో ప్రేక్షకుల ఓట్లను కాదని వెళ్లిపోయినందుకు తనను క్షమించమని వేడుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: పులిహోర పార్టిసిపెంట్స్ ఉప్పు సత్యాగ్రహం
బిగ్ బాస్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నాడు. తన ప్రేక్షకులను తిమ్మెని బమ్మిని అయినా చేసి ఆకట్టుకునే తీవ్ర ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగా హౌస్‌లోకి కొంతమందిని కొత్తవారిని తీసేసి పాతవారిని తీసుకువచ్చి కలగాపులగం చేశాడు. ఇంకా చెప్పాలంటే... ఓ పులిహోర లాంటి పార్టిసిపెంట్స్ ఇప్పుడు హౌస్‌లో ఉన్నారు. కొత్తవాళ్లు ఎంతలా ఆడినా, నామినేషన్స్ ప్రక్రియ నుండి టాస్క్‌లు కాని, ఎలిమినేషన్ కాని అంతా రాయల్ క్లాన్స్దే పైచేయిగా ఉంది. గమనిక... ఇక్కడ పాతవాళ్లుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గ్రూప్‌కు రాయల్ క్లాన్స్ అనే పేరు పెట్టాడు బిగ్ బాస్. హౌస్‌లో కన్నడ పార్టిసిపెంట్స్, తెలుగు పార్టిసిపెంట్స్ మధ్య పోటీ అనిపిస్తుంది కాని హౌస్ మొత్తం ఒకే పార్టిసిపెంట్స్ అని అనిపించట్లేదు. బిగ్ బాస్ ఫాలో అవుతున్న సదరు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమవుతుంది గేమ్ అంతా ఏకపక్షమైందని. ఇక ఈ వారం టాస్క్‌ల పరంగా ఉప్పు గురించి ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కాకపోతే అది చాలా సిల్లీగా అనిపించింది. దసరా పండగ స్పెషల్‌గా వారాంతం ఎపిసోడ్ కొన్ని మెరుపులతో కొన్ని పాత ఆటలతో మమ అనిపించాడు బిగ్ బాస్. బిగ్ బాస్ అన్ని సిరీస్‌లు ఫాలో అవుతున్నవారికి తెలుస్తుంది... బిగ్ బాస్ టాస్కులన్నీ పాత టాస్కులే అని. ఇక్కడ టాస్కులు పాతవైతే ఫర్వాలేదు ఆ పాత టాస్కులు ఆడేవారు కూడా పాతవారే. ఓ సారి ఆట ఆడినవారు మరోసారి జాగ్రత్తగా ఆడతారు కదా. అప్పుడు కొత్తవాళ్ళెప్పుడూ పాతవాళ్ల మీద గెలుస్తారు కదా. ఇంత చిన్న లాజిక్ బిగ్ బాస్ ఎందుకు గమనించలేదో ఏమో. కాని ఒక్క విషయంలో మాత్రం బిగ్ బాస్‌ను మెచ్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ పరదేశానిదైనా మన దేశంలో చేస్తున్నప్పుడు మన సంస్కృతికి పెద్ద పీట వేసి మన పండగ శోభలను కార్యక్రమంలో పొందుపరచడం నిజంగా అభినందనీయం. ముఖ్యంగా వారాంతంలో ప్రసారమయిన ఎపిసోడ్లో ప్రముఖ గాయని మంగ్లీ హౌస్‌లోని పార్టిసిపెంట్స్ చేత బతుకమ్మ ఆడించడం ఆకర్షణగా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ ఈ సీజన్లో ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పడి ప్రేక్షకుల కోసం ఇంకెంత పులిహోర కలుపుతాడో చూడాలి మరి. -
చేతనైతలే.. వెళ్లిపోతా, ఓట్లు వేయకండి: ఏడ్చేసిన మణికంఠ
హౌస్మేట్స్ ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో తెలియజేసేందుకు నాగార్జున ఓ టాస్క్ పెట్టాడు. మరోవైపు హౌస్‌లో గౌతమ్ కృష్ణ.. యష్మి అంటే తనకు క్రష్ అంటున్నాడు. అటు బిగ్‌బాస్ కప్పు గెలుస్తానన్న మణి.. ఇంటికి వెళ్లిపోతానని ఏడ్చాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (అక్టోబర్ 19) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..వెళ్లిపోతా..ఈ గొడవలు, కొట్లాటలు నావల్ల కావడం లేదు, వెళ్లిపోతానంటూ కెమెరాల ముందు మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. దయచేసి ఓట్లు వేయొద్దని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉందామనుకున్నా.. కానీ నా వల్ల కావట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై గౌతమ్ క్రష్అటు గౌతమ్.. 'నేను సింగిల్, నీపై నాకు క్రష్ ఉంది.. ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్‌లా ఉందాం. మన మధ్య బాండింగ్ ఎటువైపు వెళ్తుందో చూద్దాం.. అందరిలో నువ్వు నాకు స్పెషల్' అని యష్మితో మాటలు కదిపాడు. తర్వాత నాగార్జున బీబీటైమ్స్ హెడ్‌లైన్స్ అని ఓ గేమ్ ఆడించాడు. అందులో భాగంగా కంటెస్టెంట్లకు సరిపోయే హెడ్‌లైన్స్‌ను బోర్డ్‌పై పెడతాడు. అది నిజంగా ఎంతమేరకు సూట్ అవుతుందన్నది హౌస్మేట్స్ చెప్పాలి. నిన్న హీరో- ఈరోజు జీరోఅలా మొదటగా కండబలం ఎక్కువ- బుద్ధిబలం తక్కువ అన్న హెడ్డింగ్ గౌతమ్‌కు సరిగ్గా సరిపోతుందన్నారు. ఈ క్రమంలో నిఖిల్, గౌతమ్ కొట్లాడుకున్న వీడియో చూపించిన నాగ్.. కసిగా ఆడండి కానీ ఉన్మాదంగా ఆడొద్దని హెచ్చరించాడు. నిఖిల్‌కు నిన్న హీరో- ఈరోజు జీరో అన్న ట్యాగ్ కరెక్ట్‌గా సరిపోతుందన్నాడు. హరితేజ.. ఒకప్పుడు ఫైర్- ఇప్పుడు ఫ్లవర్‌లా మారిపోయిందన్నారు.ఆట కంటే నాకు నేనే ముఖ్యంపృథ్వీకి.. 'కింగ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్- వాంట్స్ రెస్పెక్ట్ (అగౌరవపరుస్తాడు కానీ తనను గౌరవించాలనుకుంటాడు)', 'ఆట కంటే నాకు నేనే ముఖ్యం' అన్న రెండు ట్యాగులు సరిగ్గా సూటవుతాయన్నారు. గడ్డం, మీసం తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేశావని నాగ్ ఆరా తీశాడు. పోనీ రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేస్తా, గడ్డం తీసుకుంటావా? అన్నాడు. పృథ్వీ ఒప్పుకోకపోవడంతో దాన్ని రూ.8 లక్షలకు పెంచాడు. అయినా అడ్డంగా తలూపడంతో నామినేషన్స్‌తో పని లేకుండా నేరుగా పదో వారంలోకి అడుగుపెట్టేందుకు ఛాన్స్ ఇస్తానన్నాడు. అయినా పృథ్వీ అంగీకరించలేదు.అశ్వత్థామ 3.0ఇక నామినేషన్స్‌లో పృథ్వీ- ప్రేరణపై రివేంజ్ నామినేషన్ చేయడాన్ని నాగ్ సమర్థించడం విశేషం. అనంతరం అవినాష్‌కు పైకి నవ్విస్తా- వెనక ప్లాన్ వేస్తా అన్న హెడ్డింగ్ సరిగ్గా సరిపోతుందన్నారు. ఆ వెంటనే భార్య అనూజ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పిన ఆడియో ప్లే చేయగా అవినాష్ ఎమోషనలయ్యాడు. ఇక గౌతమ్ అశ్వత్థామ 3.0 అని చెప్తూ నాగ్ అతడిని మెచ్చుకున్నాడు. ముందు ఒక ఆట-వెనక ఒక ఆట హెడ్డింగ్ యష్మికి కాస్త సూట్ అవుతుందన్నారు. ఆటలో వీక్- డ్రామాలో పీక్తర్వాత నాగ్.. ప్రేరణ, తేజను నాగ్ సేవ్ చేశాడు. 'ఆటలో వీక్- డ్రామాలో పీక్' హెడ్డింగ్ మణికంఠకు సెట్ అవుతుందని హౌస్మేట్స్ అన్నారు. ఈ సందర్భంగా మణి.. కూర్చుంటే లేవలేకపోతున్నా.. నా శరీరం నా కంట్రోల్లో లేదు, ఇంకా ఆడాలని ఉంది.. కానీ ఇలాగే ఉంటే నా శరీరం, మెదడు సహకరించదు. నేను వెళ్లిపోతాను సర్. నాకు నేనే వీక్ అయిపోయాను అని తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే ప్రేక్షకుల ఓటింగ్ ఎలా ఉందో చూద్దామని నాగ్ అతడిని కూర్చోబెట్టాడు.మత్తు వదలరా..తేజకు హౌస్ అంతా కలిసి మత్తు వదలరా ట్యాగ్ ఇచ్చేసింది. ప్రేరణకు.. గుంపులో గుర్తింపు కోరుకోవద్దని చెప్పారు. నయని పావనికి క్రై బేబీ అన్న ట్యాగ్ ఇచ్చారు. మెహబూబ్.. ఈ సీజన్‌కు ఫ్లాప్ చీఫ్ అని నిర్ణయించారు. కత్తిలాంటి నా నాలుక.. కాదు మీకు తేలిక శీర్షిక గంగవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అయిందన్నారు. ఈ సందర్భంగా గంగవ్వ.. తనను ఎవరూ నామినేట్ చేయొద్దని మీరైనా చెప్పండని నాగార్జునను వేడుకుంది.మాటలో పులి- ఆటలో పిల్లిఇక రోహిణికి.. మనసులే కాదు ఆట కూడా గెలవాలన్నారు. విష్ణుప్రియకు 'రివేంజ్ నా సరికొత్త ఆట', 'వీకెండ్లో ఆట, మిగతా రోజులు టాటా' అన్న రెండు హెడ్‌లైన్స్ కరెక్ట్‌గా సరిపోయాయన్నారు. నబీల్.. 'మాటలో పులి- ఆటలో పిల్లి' అన్నారు. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రతివారం అరతులం బంగారమిస్తా.. గంగవ్వకు మణి బంపరాఫర్
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అంతా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు నబీల్. అయితే ఇది గొంతెమ్మ కోరికగా భావించిన బిగ్‌బాస్ ఈ వారం మాత్రమే కావాల్సినంత ఫుడ్ ఇస్తానన్నాడు. కానీ ఓ తిరకాసు పెట్టాడు. అదేంటో తెలియాలంటే నేటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నా జీవితంలో జరిగిన ఘోరంవిష్ణుప్రియ తన మనసులోని బాధను చెప్పడంతో గంగవ్వ ఎమోషనలైంది. అమ్మకు ఇష్టం లేదని చిన్నప్పటినుంచి నాన్నతో మాట్లాడేవాళ్లం కాదు. నాన్నపై ఎంత ప్రేమ ఉన్నా, అమ్మ కోసం ఆయనతో మాట్లాడలేదు. చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు.. అది నా జీవితంలో జరిగిన ఘోరం.. ఇది ఎవరికీ జరగకూడదు. అమ్మ చనిపోయాక ఇప్పుడిప్పుడే తనతో మాట్లాడుతున్నాం అని చెప్పింది. ఇది విని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.హౌస్మేట్స్ కోసం నబీల్ త్యాగంఇకపోతే ఇన్ఫినిటీ రూమ్‌లో నబీల్ అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్న సంగతి తెలిసిందేగా! దాని గురించి బిగ్‌బాస్ ప్రస్తావిస్తూ.. ఇంట్లో ఉన్నంతకాలం నబీల్ స్వీట్లు, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు త్యాగం చేస్తే ఈ ఒక్క వారం అన్లిమిటెడ్ రేషన్ లభిస్తుందన్నాడు. ఇంటిసభ్యులందరికోసం ఆ కండీషన్‌కు నబీల్ ఓకే చెప్పాడు. దీంతో మెహబూబ్.. సూపర్ మార్కెట్లో ఉన్న రేషన్ అంతా ఊడ్చేశాడు.బంగారం ఇస్తానన్న మణికంఠతర్వాత నాగమణికంఠ.. తాను నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయితే గంగవ్వకు బంగారు ముక్కుపుడక ఇస్తానన్నాడు. సేవ్ అయిన ప్రతివారం అరతులం ఇస్తానంటూ గంగవ్వ మీద ఒట్టేశాడు. మరి నాకేం ఇస్తావని రోహిణి అనగా ఒక ముద్దిస్తానన్నాడు. ఇక అవినాష్-రోహిణి నామినేషన్స్‌ను రీక్రియేట్ చేసి నవ్వించారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్ కిచెన్‌లో మరో రెండు గంటలు ఎక్కువ సేపు వంటచేసుకునే ఛాన్సిచ్చాడు. మెగా చీఫ్ కంటెండర్‌గా గంగవ్వఅనంతరం రాయల్ టీమ్ గెలుపొందిన మెగా చీఫ్ కంటెండర్ షీల్డ్‌ను గంగవ్వకిచ్చారు. బిగ్‌బాస్.. రాయల్ టీమ్‌ను ఓవర్ స్టార్ట్ఫోన్లుగా, ఓజీ టీమ్‌ను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభజించారు. హౌస్ అంతా రాయల్ టీమ్ ఆధీనంలో, గార్డెన్ ఏరియా ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందన్నాడు. కిచెన్, బెడ్రూమ్, వాష్‌రూమ్ వంటి వసతులు అందిస్తూ చార్జింగ్ పొందవచ్చని తెలిపాడు.బెంబేలెత్తిపోయిన మణికంఠటాస్క్ పూర్తయ్యేలోపు బతికున్న సభ్యులే మెగాచీఫ్ కంటెండర్లవుతారన్నాడు. టాస్క్ ప్రారంభానికి ముందే మణి బెంబేలెత్తిపోయాడు. నాకంటూ ఫ్యామిలీ ఉంది. బొక్కలిరగ్గొట్టుకుని బయటకు వెళ్లలేను. ఆరోగ్యం ముఖ్యం.. టీమ్‌కు ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అంతే ఇస్తానని చెప్పాడు. ఆట మొదలవగానే అవినాష్.. నబీల్‌కు తెలియకుండా అతడి చార్జర్‌ను తన ప్లగ్‌కు కనెక్ట్ చేశాడు. హరికథ చెప్పి చార్జింగ్హరితేజ.. హరికథతో మణికంఠను మెప్పించి అతడి దగ్గర నిమిషం పాటు చార్జింగ్ పొందింది. నయని కూడా యష్మి దగ్గర బలవంతంగా చార్జ్ పొందడానికి ట్రై చేసింది. కానీ నిఖిల్ ఆమెను అడ్డుకుని అవతలకు విసిరేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సిగరెట్ తాగడం తప్ప ఏం చేశావన్న గంగవ్వ.. ఆ కోపం ప్రేరణపై..!
బిగ్‌బాస్ హౌస్‌లో ఏడోవారం నామినేషన్స్ జరిగాయి. అయితే కిల్లర్ గర్ల్స్ చేతికి నామినేషన్స్‌ను ఫైనల్ చేసే అధికారం ఇచ్చారు. మరి ఆ కిల్లర్ గర్ల్స్ ఎవరు? వీళ్లు ఎవర్ని నామినేట్ చేశారు? ఎవర్ని సేవ్ చేశారనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే!ఆ ఇద్దరికీ స్పెషల్ డ్రెస్గౌతమ్, తేజ, పృథ్వీ.. ఈ ముగ్గురిలో గౌతమ్ సూట్ కేసు మాత్రమే వెనక్కు వచ్చింది. దీంతో మిగతా ఇద్దరు బిగ్‌బాస్ ఇచ్చిన చిరిగిన బస్తా డ్రెస్ వేసుకున్నారు. ఆ వెంటనే నామినేషన్స్ మొదలయ్యాయి. బిగ్‌బాస్ ప్రేరణ, హరితేజను కిల్లర్ గర్ల్స్‌గా నియమించాడు. గుర్రం సౌండ్ వినిపించినప్పుడు ప్లాట్‌ఫామ్స్‌పై నిలబడే ఇద్దరు హౌస్మేట్స్ ఇంటిసభ్యులను నామినేట్ చేస్తారు. అందులో ఒకరి నామినేషన్‌ను అంగీకరించి, మరొకరి నామినేషన్ తిరస్కరించే హక్కు హ్యాట్ మొదట పట్టుకున్న కిల్లర్ గర్ల్‌కు ఉంటుంది.అతిగా రియాక్టయిన అవినాష్మొదటగా రోహిణి.. నీకు బాధేసినప్పుడు మైక్ విసిరేయడం నచ్చలేదని గౌతమ్‌ను నామినేట్ చేసింది. అందుకు గౌతమ్ స్పందిస్తూ.. అవినాష్ చేసిన కామెడీ తనకు బుల్లీయింగ్లా ఉందన్నాడు. దీంతో అవినాష్ మధ్యలో కలగజేసుకుంటూ కామెడీ తీసుకోకపోతే షోకి రావొద్దంటూ చొక్కా విప్పి మరీ ఫైర్ అయ్యాడు. ఇది కామెడీ షో కాదని గౌతమ్ అనడంతో.. అంతలోనే సారీ భయ్యా, తెలియక అనేశాను.. అంటూ అవినాష్ చేతులు జోడిస్తూ కాస్త అతిగా రియాక్టయ్యాడు. నిఖిల్.. తేజ యాక్టివ్‌గా లేడని నామినేట్ చేశాడు.ఏడ్చేసిన గౌతమ్హ్యాట్ అందుకున్న కిల్లర్ గర్ల్ ప్రేరణ.. రోహిణి చెప్పిన పాయింట్లకు ఏకీభవిస్తూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. అయిపోయినదాన్ని (ట్రోలింగ్ గుర్తు చేస్తున్నారంటూ..) మళ్లీ మళ్లీ తీసుకొస్తున్నారంటూ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు బుల్లీయింగ్ అనడం ఎంత పెద్ద తప్పు? అసలు ఆ పదానికి అర్థం తెలుసా? అని రోహిణి, అవినాష్ సీరియసయ్యారు. రెండో రౌండ్లో నిఖిల్, గంగవ్వ ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్నారు. నిఖిల్ మరోసారి తేజను నామినేట్ చేశాడు. ప్రేరణపై పీకలదాకా కోపం..గంగవ్వ.. నాతో మాట్లాడట్లేదు, హోటల్ టాస్క్‌లో పెద్దగా ఆడలేదు.. సిగరెట్ తాగుతూ కూర్చుంటావంటూ పృథ్వీని నామినేట్ చేసింది. ఇద్దరి పాయింట్లు విన్న ప్రేరణ.. పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో ప్రేరణపై పగ పెంచుకున్న పృథ్వీ.. ఆమె హ్యాట్ పట్టుకోనివ్వకుండా అడ్డుకున్నాడు. తను నామినేట్ అవ్వాల్సిందేనని బలంగా కోరుకున్నాడు. అతడికి సపోర్ట్‌గా నయని కూడా దిగింది. ప్రేరణ నామినేట్ అవడమే తనకూ కావాలంది.నీ గ్రాఫ్ పడిపోయిందిపృథ్వీకి నిఖిల్ సర్ది చెప్పాలని చూశాడు కానీ వర్కవుట్ కాలేదు. నాకు అన్యాయం జరిగింది.. ఇల్లు మొత్తం అడ్డొచ్చినా నేను తను నామినేట్ అయ్యేలా చూస్తానన్నాడు. అది విని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. మూడో రౌండ్లో యష్మి.. హోటల్ టాస్క్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేదంటూ తేజ పేరు చెప్పింది. నాగమణికంఠ.. గ్రాఫ్ పడిపోయిందని, హోటల్ టాస్క్‌లో ఫన్ చేయలేదని నిఖిల్ పేరు చెప్పాడు. హ్యాట్ పట్టుకున్న హరితేజ.. నిఖిల్‌ను నామినేషన్స్‌లో వేసింది.యష్మి ఎమోషనల్నాలుగో రౌండ్లో అవినాష్.. టాస్కుల్లో వీక్ అనిపించాడంటూ మణికంఠ పేరు చెప్పాడు. గౌతమ్.. హోటల్ టాస్క్‌లో పెద్దగా ఆసక్తి చూపించలేదంటూ విష్ణుప్రియ పేరు చెప్పాడు. పృథ్వీ.. ప్రేరణను అడ్డుకోవడంతో మరోసారి హరితేజ హ్యాట్ పట్టుకుంది. ఈమె మణికంఠను నామినేట్ చేసింది. ఇక పృథ్వీ ప్రవర్తన చూసి బెంబేలెత్తిపోయిన యష్మి అది కరెక్ట్ కాదంటూ ఏడ్చేసింది. ఈ నామినేషన్స్ రేపటి ఎపిసోడ్‌లోనూ కొనసాగనున్నాయి. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కిర్రాక్ సీత ఎలిమినేటికి కారణాలు ఇవే..
-
సీత ఎలిమినేట్.. 'అతడు గెలిస్తే చూడాలనుంది'
దసరా సందర్భంగా బిగ్‌బాస్ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. హీరోయిన్ల డ్యాన్స్, గెస్టుల రాక, టీమ్స్ మధ్య పోటీతో నేటి ఎపిసోడ్ వినోదాత్మకంగా సాగింది. పండగ సందర్భంగా నాగ్ పంచెకట్టుకుని సాంప్రదాయంగా ముస్తాబయ్యాడు. అటు హౌస్మేట్స్ కూడా అంతే కలర్ ఫుల్‌గా రెడీ అయ్యారు. మరి ఈ దసరా ఎపిసోడ్ ఎలా సాగిందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..అన్లిమిటెడ్ ఫుడ్ కావాలి!నాగార్జున మొదటగా యష్మిని సేవ్ చేశాడు. ఆ వెంటనే ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. ఇన్ఫినిటీ రూమ్‌కు వెళ్లి బిగ్‌బాస్‌ను ఏదైనా కోరిక కోరవచ్చని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఓజీ టీమ్‌లో ఒకరికే ఈ ఛాన్స్ ఉంటుందన్నాడు. ఈ బంపర్ ఆఫర్ ఎవరికివ్వాలని అడిగినప్పుడు రాయల్ టీమ్‌లోని మెజారిటీ సభ్యులు నబీల్ పేరు సూచించారు. దీంతో అతడు ఇన్ఫినిటీ రూమ్‌కు వెళ్లి.. ప్రతివారం మార్కెట్‌కు వెళ్లే బాధ లేకుండా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు. దీనికి బిగ్‌బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఎలాంటి కండీషన్స్ పెడతాడనేది సస్పెన్స్‌లోనే ఉంచారుఫస్ట్ టాస్క్‌లో ఓజీ టీమ్ గెలుపుతర్వాత లడ్డు తయారుచేసి మరీ స్పూన్‌తో తినిపించాలంటూ మొదటగా ఫన్ టాస్క్ ఇవ్వగా ఇందులో ఓజీ టీమ్ గెలిచింది. అనంతరం అమృత అయ్యర్ దాండియా పాటతో స్టేజీ దద్దరిల్లేలా చేసింది. ఇక నాగ్.. విష్ణుప్రియను సేవ్ చేశాడు. పకడో.. పకడో అనే రెండో గేమ్‌లో రాయల్ టీమ గెలుపొందింది. బతుకమ్మసింగర్ మంగ్లీ మాస్, లవ్, భక్తి పాటలు పాడుతూ అదరగొట్టేసింది. హౌస్‌లోకి వెళ్లి రెండు టీమ్స్‌తో బతుకమ్మ తయారు చేయించింది. గంగవ్వ అందంగా బతుకమ్మ పేర్చడంతో ఈ మూడో టాస్క్‌లో రాయల్ టీమ్ గెలిచింది. అనంతరం విశ్వం డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ స్టేజీపైకి వచ్చి కాసేపు కబుర్లాడారు. విశ్వం సినిమా ట్రైలర్ కూడా ప్లే చేశారు.ఫరియా డ్యాన్స్దసరా దోస్తీ పేరిట హౌస్‌మేట్స్‌తో నాలుగో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ గెలిచింది. తర్వాత డింపుల్ హయాతి డ్యాన్స్‌తో అలరించగా అటు గంగవ్వ సేవ్ అయినట్లు ప్రకటించారు. మాట-పాట-టాటా అని హౌస్‌మేట్స్‌తో ఐదో గేమ్ ఆడించారు. ఇందులోనూ రాయల్ టీమే గెలిచింది. అనంతరం ఫరియా అబ్దుల్లా ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఓ ఊపు ఊపేసింది.రాయల్ టీమ్‌కు బంపర్ ఆఫర్నాగ్ హౌస్‌మేట్స్‌తో ఆర్మ్ రెజ్లింగ్ అని ఆరో గేమ్ ఆడించారు. ప్రేరణ.. హరితేజను, విష్ణుప్రియ.. రోహిణిని ఓడించింది. మెహబూబ్.. నిఖిల్‌ను, గౌతమ్.. పృథ్వీని ఓడించారు. ఈ గేమ్‌లో ఓజీ టీమ్ గెలిచింది. అయితే మెజారిటీ టాస్కులు గెలుపొందిన రాయల్ టీమ్ ఓవరాల్ విజేతగా నిలిచింది. దీంతో ఈవారం మెగా చీఫ్ అయ్యేందుకు రాయల్ టీమ్‌కు మాత్రమే అవకాశం ఉంటుందన్నాడు. రాయల్ టీమ్‌లోని వారే మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారని నాగ్ తెలిపాడు.ముగ్గురికీ హార్ట్ ఇచ్చిన సీతచివర్లో నామినేషన్స్‌లో మిగిలినవారిలో మెహబూబ్‌ను సేవ్ చేసి సీతను ఎలిమినేట్ చేశారు. దీంతో విష్ణు ఎమోషనలైంది. నీకు నీ తల్లిని మర్చిపోయేంత మంచి పార్ట్నర్ దొరకాలని ఆశీస్సులు ఇచ్చింది. ఎలాంటి ముసుగు లేకుండా ఉండే నబీల్ గెలవాలంది. అవినాష్ పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చాడంది. అలా ఈ ముగ్గురికీ వైట్ హార్ట్ ఇచ్చింది.సీత కోసం మాటిచ్చిన మెహబూబ్తర్వాత నిఖిల్, గౌతమ్, నయనికి బ్లాక్ హార్ట్ ఇచ్చింది. నిఖిల్.. హజ్బెండ్ మెటీరియల్ అని చెప్పింది. గౌతమ్.. చిన్నచిన్నవాటికే హర్ట్ అవొద్దని సూచించింది. నయనికి.. వచ్చినప్పుడు నన్ను క్రై బేబీ అన్నావ్.. కానీ నాకన్నా ఎక్కువ ఏడుస్తున్నావ్.. ఈసారి చాలారోజులు ఉండమంటూ బాగా ఆడమని సూచించింది. చివర్లో మెహబూబ్ లేచి.. సీత తన తండ్రికివ్వాలనుకున్న బైక్‌ను తాను గిఫ్ట్‌గా ఇస్తానని మాటిచ్చాడు. మరిన్ని బిగ్‌బాస వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ముగ్గుర్ని బ్యాగులు సర్దమన్న నాగ్.. వాళ్లు పతనం, వీళ్ల ఎదుగుదల
నాలుగువారాలు చీఫ్‌గా కొనసాగిన నిఖిల్ ఈ వారం గేమ్‌లో కనిపించకుండా పోయాడు. అటు యష్మి హోటల్ టాస్క్‌ను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరిదే కాదు.. అందరి ఆట గురించి నాగ్ విశ్లేషించాడు. మరి ఆయన ఏమేం చెప్పాడో నేటి (అక్టోబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రైజింగ్ స్టార్స్బిగ్బాస్ హోటల్ టాస్క్‌లో అవినాష్, తేజ దొంగతనంగా గులాబ్ జామ్ తిన్నారు. అందుకని నాగార్జున ఓ గిన్నె నిండా గులాబ్ జామ్స్ పంపించి అవి ఆ ఇద్దరితో మాత్రమే తినిపించాడు. ఇక హౌస్మేట్స్ ఆటను బట్టి వారిని రైజింగ్ స్టార్స్, ఫాలింగ్ స్టార్స్‌గా నాగ్ విభజించాడు. గంగవ్వ, మెహబూబ్, అవినాష్, రోహిణి, నాగమణికంఠ, నయని, యష్మి.. రైజింగ్ స్టార్స్ అని పేర్కొన్నాడు.నాతో గేమ్స్ద్దునువ్వు బచ్చా అన్నందుకు మణికంఠ ఫీలయ్యాడని నాగ్ రోహిణితో అన్నాడు. అయితే మణి మాత్రం.. నేను మరీ అంత ఫీల్ అవలేదన్నాడు. దీంతో నాగ్.. ఇప్పుడు కవరింగ్ చేయకు, నా దగ్గర ఆటలాడొద్దంటూ అతడి నోరు మూయించాడు. నువ్వు గేమ్ సీరియస్‌గా తీసుకోకపోతే నిన్ను ఆడియన్స్ కూడా సీరియస్‌గా తీసుకోరని విష్ణుప్రియకు మరోసారి గుర్తు చేశాడు. మణికంఠలో ఎనర్జీ, ఫన్ మరో లెవల్లో ఉందంటూ ఓ వీడియో చూపించాడు.తేజకు పనిష్మెంట్నబీల్, గౌతమ్, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, నిఖిల్, సీతలను ఫాలింగ్ స్టార్స్‌గా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ.. నబీల్‌కు ఏదైనా సమస్య ఉంటే నేరుగా అందుకు కారణమైన వ్యక్తితోనే మాట్లాడాలన్నాడు. గతం గురించి ఆలోచించుకుంటే వర్తమానం మిస్ అయిపోతావ్ అని గౌతమ్‌కు సలహా ఇచ్చాడు. తేజ.. నయనిపావనిపై నోరు పారేసుకున్న వీడియోను ప్లే చేసి మరీ క్లాస్ పీకాడు. 10 పుషప్స్ తీయమని పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రేరణ వంతు రాగా ఆమె సగం రైజింగ్, సగం ఫాలింగ్ అని తెలిపాడు.అవినాష్ దృష్టిలో అతడు స్ట్రాంగ్ కాదట!ఇంట్లో ఉండేందుకు అర్హత లేని కంటెస్టెంట్ల బ్యాగుని ఎగ్జిట్ గేట్ దగ్గర పెట్టాలన్నాడు నాగ్. అయితే ఎవరి టీమ్‌లో నుంచి వాళ్లు కాకుండా.. అవతలి టీమ్‌లోని వారి పేర్లను మాత్రమే చెప్పాలన్నాడు. మొదటగా తేజ.. ఇంటి పనులు చేయట్లేదంటూ పృథ్వీ బ్యాగును పెట్టాడు. హరితేజ.. నబీల్‌కు క్లారిటీ తక్కువగా ఉందంది. అవినాష్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదంటూ నిఖిల్ బ్యాగు గేటు దగ్గర పెట్టాడు. గంగవ్వ.. మణి పేరును, రోహిణి.. ప్రేరణ, గౌతమ్.. సీత, మెహబూబ్.. పృథ్వీ పేర్లను సూచించారు. నయని.. విష్ణుప్రియలో ఇంప్రూవ్మెంట్ కనిపించలేదని పేర్కొంది.చివర్లో ముగ్గురి బ్యాగులుతర్వాత ఓజీ టీమ్సభ్యుల వంతు వచ్చింది. నాగమణికంఠ.. నా అంచనాలు అందుకోలేకపోయాడంటూ తేజ బ్యాగు ఎగ్జిట్ దగ్గర పెట్టాడు. సీత.. హోటల్ టాస్క్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేదంటూ గౌతమ్ పేరు చెప్పింది. పృథ్వీ, యష్మి.. బాగా ఆడలేదని తేజను, నిఖిల్, నబీల్.. గౌతమ్‌ను, విష్ణుప్రియ, ప్రేరణ.. నయని పేర్లను సూచించారు. చివర్లో ఎక్కువ ఓట్లు పడ్డ పృథ్వీ, తేజ, గౌతమ్ బ్యాగుల్ని సర్దేసి స్టోర్ రూమ్‌లో పెట్టాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తయింది. ఇక రేపటి ఎపిసోడ్లో సీత ఎలిమినేట్ కానుంది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెగా చీఫ్‌గా మెహబూబ్.. బైక్ గెల్చుకున్న నయని
మెగా చీఫ్‌గా నబీల్ పదవీకాలం ముగిసింది. దీంతో మెగా చీఫ్ పోస్ట్ కోసం మళ్లీ పోటీపెట్టారు. ఈసారి పాత కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి సుడిగాలిలా హౌస్‌లో అడుగుపెట్టిన వైల్డ్కార్డుల్లో ఒకరే ఆ పోస్టును ఎగరేసుకుపోయారు. మరి ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి(అక్టోబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఎలిమినేషన్ గురించి ఛాలెంజ్వచ్చేవారం నువ్వే ఎలిమినేట్ అవుతానవి గంగవ్వ అనడంతో విష్ణుప్రియ తాను వెళ్లనంది. అవ్వ పోయేదాకా తాను పోనంది. దీంతో ఎవరు ఎక్కువ రోజులు ఉంటారో చూద్దామని గంగవ్వ, విష్ణుప్రియ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకున్నారు. అటు ప్రేరణ.. నా మాట వినట్లేదు, నన్ను నమ్మట్లేదు, ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నావంటూ నబీల్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో హర్టయిన నబీల్.. నేను ఇమ్మెచ్యూర్ కాదని అరిచాడు. ప్రాంక్ చేసిన గంగవ్వతర్వాత అతడు ప్రేరణను ఇమిటేట్ చేస్తూ మాట్లాడటం కాస్త వెగటుగా అనిపిస్తుంది. ఇక బిగ్‌బాస్ రాయల్ క్లాన్ (వైల్డ్ కార్డ్స్)లో నుంచి ఆరుగురు బెస్ట్ పర్ఫామర్లను మెగా చీఫ్ కంటెండర్స్ కోసం ఎంపిక చేయమన్నాడు. దీంతో అవినాష్.. తన పేరుతో పాటు నయని, మెహబూబ్, హరితేజ, రోహిణి, గౌతమ్ పేర్లను సూచించాడు. నా పేరు ఎవరూ చెప్పలేదని గంగవ్వ ఏడుస్తున్నట్లు నటించి అందర్నీ ఆటపట్టించింది.కంటెండర్‌గా మణిఅటు ఓజీ టీమ్‌లో రెండు స్టార్లున్న మణికంఠ, నబీల్ లలో ఒకరిని బెస్ట్ పర్ఫామర్‌గా సెలక్ట్ చేయాలన్నాడు. దీంతో టీమ్ అంతా కలిసి మణిని బెస్ట్ పర్ఫామర్ అని ప్రకటించడంతో అతడు చీఫ్ కంటెండర్ అయ్యారు. చీఫ్ కంటెండర్లకు మొదటగా ఓ గేమ్ పెట్టారు. అందులో కంటెండర్లు అందరూ జాకెట్ వేసుకుని నిలబడితే వారిపైకి హౌస్మేట్స్ బంతులు విసరాలి. ఎవరి జాకెట్‌కు ఎక్కువ బంతులు అతుక్కుంటే వారు అవుట్ అవుతారు. అందరికంటే గంగవ్వ ఎక్కువ హుషారుగా బాల్స్ విసరడం విశేషం. మొదటి రౌండ్లో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఏడ్చేసిన రోహిణిఈ గేమ్‌లో విష్ణుప్రియ, పృథ్వీ.. తనను కావాలని గట్టిగా కొట్టారని రోహిణి ఫీలైంది. ఈమె దగ్గరకు విష్ణు వెళ్లి.. నాకు అతడి (పృథ్వీ) దగ్గరి నుంచి ఎనర్జీ వస్తుంది. డౌన్‌గా ఉన్నప్పుడే తన దగ్గరకు వెళ్తాను.. అందరితోనూ నేను బాగుంటాను అంటూ తన రిలేషన్ గురించి చెప్పింది. దీంతో రోహిణి.. నేనేమీ మీ గురించి లేనిది చెప్పలేదు.. మీరు అందరిముందు ఎలా ఉంటున్నారన్నదాని గురించే మాట్లాడాను.. అయినా తప్పుగా అనిపిస్తే సారీ అని చెప్పేసి వెళ్లిపోయింది. బైక్ గెల్చుకున్న నయనిఇక బాల్స్ గేమ్ రెండో రౌండ్లో నయని అవుట్ అవడంతో ఏడ్చేసింది. మూడో రౌండ్లో రోహిణి అవుట్ అయింది. సారీ చెప్పిన తర్వాత కూడా విష్ణుప్రియ గేమ్‌లో తనను టార్గెట్ చేయడంతో రోహిణి ఏడ్చేసింది. ఇక హరితేజ, మెహబూబ్, అవినాష్, మణి రెండో గేమ్‌లో పోటీపడగా చివరకు మెహబూబ్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. అనంతరం దమ్ముంటే స్కాన్ చెయ్ గేమ్‌లో విష్ణుప్రియ, నయని పావని ఆడారు. అయితే నయని పావని గెలిచి థండర్ వీల్స్ బైక్ పొందింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గతాన్ని తల్చుకుని కుంగిపోయిన గౌతమ్.. ఈసారి కప్పు కొడతా!
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడుతోంది. బిగ్‌బాస్ 8లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. వీరితో కలిసి ఫన్ గేమ్ ఆడించాడు. అదే బిగ్‌బాస్ హోటల్. ఈ టాస్క్‌లో పాతవాళ్లంతా హోటల్ సిబ్బందిగా, కొత్తవాళ్లంతా గెస్టులుగా ఉన్నారు. మరి ఈ టాస్క్ ఏమేరకు వర్కవుట్ అయిందో నేటి (అక్టోబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఫన్ టాస్క్బిగ్బాస్ అమ్మాయిలను ఒక టీమ్‌గా, అబ్బాయిలను ఒక టీమ్‌గా విభజించి ఫన్నీ టాస్కు ఇచ్చాడు. ఆడాళ్ల టీమ్‌కు ముక్కు అవినాష్, అబ్బాయిల టీమ్‌కు రోహిణిని లీడర్‌గా పెట్టారు. గేమ్ ఏంటంటే.. టీమ్సభ్యులంతా వారి నోటిని నీటితో నింపుకోవాలి. వీళ్లను ఇతర టీమ్‌లోని వారు నవ్వించి ఆ నీళ్లు బయటకు వచ్చేలా చేయాలి. ఈ గేమ్‌లో అబ్బాయిలను నవ్వించే క్రమంలో అవినాష్.. మణికంఠ దగ్గరకు వెళ్లి పాట పాడాడు. కప్పు కొడతా: గౌతమ్తర్వాత గౌతమ్ దగ్గరకు వెళ్లి అశ్వత్థామ 2.0 అని ఇమిటేట్ చేశాడు. అది విని హర్టయిపోయిన గౌతమ్.. అయిపోయినదాన్ని మళ్లీ మళ్లీ తీసి ఇరిటేషన్ తెప్పించొద్దు. వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. అని మైక్ విసిరేసి ఇంట్లోకి వెళ్లి ఏడ్చాడు. నాన్న ఐయామ్ సారీ, నీతో గొడవపడి మాట్లాడకుండా వచ్చేశా.. కానీ ఈసారి నన్ను నేను నిరూపించుకుంటాను. కప్పు కొడతాను అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు.ఉప్పు గెల్చుకున్న అవినాష్, రోహిణిమరోవైపు తనను నవ్వించమని అవినాష్, రోహిణికి బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్ వీరికి కొట్టిన పిండి కావడంతో ఇరగదీశారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్.. ఇంటిసభ్యులు రేషన్‌లో మర్చిపోయిన ఉప్పును కానుకగా ఇచ్చాడు. ఇక తర్వాతి రోజు ఉదయం విష్ణు ధ్యానం చేస్తుంటే గంగవ్వ చెడగొట్టేందుకు ప్రయత్నించడం భలే సరదాగా అనిపించింది. అనంతరం బిగ్‌బాస్ హోటల్ టాస్క్ పెట్టాడు. ఇందులో ఓల్డ్ కంటెస్టెంట్లు హోటల్ సిబ్బంది కాగా రాయల్ టీమ్ అతిథులుగా ఉంటారు. ఎవరెవరు ఏ పాత్రలో..పాత్రల విషయానికి వస్తే.. నబీల్.. అప్పుల్లో కూరుకుపోయిన హోటల్ యజమాని, ప్రేరణ.. మతిమరుపు మేనేజర్, నిఖిల్.. హెడ్ చెఫ్, సీత.. అసిస్టెంట్ చీఫ్, పృథ్వీ.. అందరినీ ఫ్లర్ట్ చేసే గార్డ్, విష్ణు.. పృథ్వీతో లవ్‌లో ఉండే పర్సనల్ బట్లర్, యష్మి.. హౌస్ కీపింగ్, మణికంఠ.. హౌస్ కీపింగ్(దొంగిలించడం, దాన్ని తిరిగిచ్చేయడం)గా వ్యవహరిస్తారు.తికమక మనిషిగా హరితేజగంగవ్వ.. రాజవంశానికి చెందిన మహారాణి, నయని పావని.. మహారాణి అసిస్టెంట్, అవినాష్.. సూపర్‌స్టార్, రోహిణి- పొగరుబోతు రిచ్ కిడ్ (అవినాష్ గర్ల్‌ఫ్రెండ్), మెహబూబ్.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ (రోహిణి తండ్రి అపాయింట్ చేస్తాడు) హరితేజ.. మెహబూబ్ అసిస్టెంట్(తికమక మనిషి), తేజ.. పాపులర్ ఫుడ్ బ్లాగర్, గౌతమ్.. పోలీసుల నుంచి దాక్కుని తిరుగుతున్న క్రిమినల్‌గా పాత్రలు పోషించారు.మణిని ఆడుకున్న రోహిణిటాస్కు ప్రారంభానికి ముందే సీత.. ఒక పర్సు కొట్టేయడం గమనార్హం. ఈ టాస్కులో హౌస్మేట్స్ తమ పర్ఫామెన్స్ చూపించారు. నన్నెవరూ పట్టించుకోవట్లేదని రోహిణి అనగా.. మణి.. నువ్వో మాడియపోయిన కందిపప్పు, మీ ఆయనో పెసరపప్పు అని సెటైర్ వేశాడు. దీంతో రోహిణి సీరియస్ అయింది.. ఒకసారి, రెండుసార్లు ఓకే.. కానీ మూడోసారి ఒప్పుకోను. నీ క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి నీకు నచ్చినట్లు మాట్లాడటం ఫన్ కాదు.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతలోనే జోక్ చేశానంటూ నవ్వేసింది. నీ కళ్లలో భయమే నాకు కావాలంటూ నవ్వుతూ చెప్పడంతో మణి ఊపిరి పీల్చుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8 రీలోడ్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ.. వాటే ట్విస్ట్
గత ఏడు సీజన్లకంటే కూడా ఈసారి బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు అత్యధిక టీఆర్పీ వచ్చింది. కానీ కంటెస్టెంట్లు ఆ రేటింగ్‌ను అలాగే కాపాడుకోలేకపోయారు. నెమ్మదిగా షో బోరింగ్‌గా మారుతుండటంతో బిగ్‌బాస్ ఇక లాభం లేదనుకుని పాత సీజన్లలో పాల్గొన్న పలువురినే వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట హౌసులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం.. 'బిగ్‌బాస్ గ్రాండ్ రీలోడ్' పేరిట ఎపిసోడ్ ప్రసారమైంది. ఇంతకీ హౌస్‌లోకి వచ్చిందెవరో చూసేయండి..నైనిక ఎలిమినేట్'జవాన్' టైటిల్ సాంగ్, 'గేమ్ ఛేంజర్' నుంచి రీసెంట్గా రిలీజైన 'రా మచ్చా' పాటలకు స్టెప్పులేసి ఆదివారం ఎపిసోడ్‌కి హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ, విష్ణుప్రియ, నైనికని నిలబెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఎలా ఎదుర్కోబోతున్నారో ఎదుర్కోబోతున్నారని హౌస్‌మేట్స్‌ను అడగ్గా వారంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నైనిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో సీత ఎప్పటిలాగే కన్నీటి కుళాయిని ఓపెన్ చేస్తూ బోరున ఏడ్చేసింది.ఎవరికి ఏ ట్యాగ్?స్టేజీపైకి వచ్చిన నైనికని హౌసులో ఎవరు ఎలాంటి వారనేది నాగ్ అడగ్గా.. ప్రేరణ మ్యానిప్యులేటర్, మణికంఠ వెన్నుపోటు పొడిచే వ్యక్తి, విష్ణుప్రియ నకిలీ స్నేహితురాలు, పృథ్వీ అటెన్షన్ సీకర్, నబీల్ అవకాశవాది, సీత నిజమైన ఫ్రెండ్, నిఖిల్ గేమ్ ఛేంజర్, యష్మిది మంద బుద్ధి అని చెప్పుకొచ్చింది.ఉత్తరాలు వచ్చాయ్..ఈ వారం హౌస్మేట్స్ కోసం ఉత్తరాలు వచ్చాయి. కానీ అవి కొందరికి అందకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. వాటిని నాగ్ తిరిగి తీసుకొచ్చాడు. సీత, నబీల్, యష్మి, మణికంఠ తమ లెటర్స్ అందుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్‌లో ఉన్న ఎనిమిది మంది ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్) టీమ్‌గా, కొత్తగా వచ్చే ఎనిమిది వైల్డ్ కార్డ్స్ రాయల్ టీమ్‌గా ఉంటాయని నాగ్ వెల్లడించాడు.. తొలి వైల్డ్ కార్డ్‌గా హరితేజసీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది. యాక్టింగ్, యాంకరింగ్ రెండింట్లోనూ ఆరితేరిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తనకు నవదీప్.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో పంపించారు. అలానే హౌసులోకి వెళ్లేముందు స్టేజీపైకి హరితేజ కూతురుని తీసుకురావడంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.రెండో వైల్డ్ కార్డ్‌గా టేస్టీ తేజతేజ అసలు పేరు తేజ్‌దీప్. తెనాలో పుట్టిపెరిగిన ఇతడు 2017లో సాఫ్ట్వేర్ ఉద్యోగం హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. చిన్నప్పటినుంచి నటన, సినిమాలంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసొచ్చాయి. 2020లో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. ఆ వీడియో యూట్యూబ్‌లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్‌గా తిండి వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. అలా బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్‌లో ఉన్నాక షోకి టాటా బైబై చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అమ్మ చేసిన పాల తాళికలను నాగార్జున కోసం తీసుకొచ్చాడు. అలానే తేజకి శోభాశెట్టి బెస్ట్ విషెస్ చెప్పింది.మరో రూ.20 లక్షలుసెట్పైకి వచ్చిన స్వాగ్ టీమ్ (శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగార్కర్) తన సినిమా కబుర్లు చెప్పింది .తర్వాత హౌస్‌లోకి వెళ్లి హౌస్మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్‌తో గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు హరి-తేజ గెలిచి రూ.20 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అనంతరం మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నయని పావని హౌస్‌లో అడుగుపెట్టింది.మూడో వైల్డ్ కార్డ్‌గా నయని పావనిఈమె అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్ స్టార్‌గా ఫేమస్. షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. అయితే నయని నెక్స్ట్ సీజన్లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఇక శివాజీ.. నయనికి బెస్ట్ విషెస్ చెప్పాడు.నాలుగో వైల్డ్ కార్డ్‌గా మెహబూబ్డ్యాన్స్, యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.అలా తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగుపెట్టిన టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఇక మెహబూబ్ కోసం సొహైల్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలానే నాలుగో సీజన్లో ఎలా అయితే ఆడావో ఈసారి అంతకు మించి ఆడి గెలవాలన్నాడు.'జనక అయితే గనక' మూవీ ప్రమోషన్లో భాగంగా సుహాస్, దిల్ రాజ్ టీమ్ వచ్చారు. సుహాస్, హీరోయిన్ సంగీర్తన హౌసులోకి వెళ్లి ఓజీ, రాయల్ టీమ్స్‌తో గేమ్ ఆడించారు. ఇందులో గెలిచిన సీత-మణికంఠ.. బెడ్ రూమ్, రేషన్ కంట్రోల్ చేసే అధికారాన్ని సొంతం చేసుకున్నారు.ఐదో వైల్డ్ కార్డ్‌గా రోహిణిఒకప్పుడు సీరియల్స్‌లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. తన కామెడీ టైమింగ్స్‌తో అందరికీ వినోదాన్ని పంచుతోంది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్‌పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపిస్తోంది. బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న రోహిణి.. మరోసారి ఈ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక శివజ్యోతి.. రోహిణి కోసం స్పెషల్ వీడియో పంపింది. హౌసులో కామెడీ లోటు బాగా ఉందని, దాన్ని ఫుల్ ఫిల్ చేయాలంది.ఆరో వైల్డ్ కార్డ్‌గా గౌతమ్ కృష్ణగౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్‌బాస్ ఏడో సీజన్‌తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.బాలీవుడ్‌లోనూ సిద్దూ: ది రాక్‌స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్లో సీక్రెట్ రూమ్‌కు వెళ్లాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేకపోయాడు. తాజాగా మరోసారి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.ఏడో వైల్డ్ కార్డ్‌గా అవినాష్ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్‌గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్‌బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.ఆర్థిక అవసరాల వల్ల స్నేహితుల సాయం తీసుకుని మరీ ఆ డబ్బు కట్టేసి బిగ్‌బాస్‌కు వెళ్లాడు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్‌లో ఉండి ఎంటర్టైనర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడికి శ్రీముఖి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అలానే స్టేజీపై మణికంఠ, నబీల్, విష్ణుప్రియలా యాక్ట్ చేసి నవ్వించాడు.ఎనిమిదో వైల్డ్ కార్డ్‌గా గంగవ్వవయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్లో అడుగుపెట్టింది. స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్‌బాస్ 8లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.రాయల్ టీమ్‌కు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ టీమ్‌కు చివరగా మరో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ నుంచి అవినాష్, గంగవ్వ ఆడారు. ఓజీ టీమ్‌పై వీరు విజయం సాధించడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఈ వారం ఇమ్యూనిటీ లభించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8 : మాజీలతో మసాలా వర్కౌట్ అయ్యేనా?
ఈ వారం హౌస్‌లోని కంటెస్టెంట్ల మనసులో ఉన్న ముసుగులను తొలగించడానికి ఫోమ్‌ని నామినేషన్ పర్వంలో వాడాడు బిగ్ బాస్. ఏ నురగైనా కరిగితే అసలు పదార్థం బయట పడుతుందన్నట్టు ఈ ఫోమ్ ఉపయోగించిన తరువాత కంటెస్టెంట్ల అసలు రంగులు చాలానే బయటపడ్డాయని చెప్పవచ్చు. ఆ రంగులు బయటకు రాగానే ఆట మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. యథావిధిగా నామినేషన్లో వాడి వేడి రచ్చతో పాటు ఈ వారం క్లాన్ల మధ్య పోటీగా నిర్వహించిన వినూత్న బెలూన్ కాంటెస్ట్ ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. (చదవండి: కాలేజీలో మోసపోయానన్న యష్మి.. కన్నింగ్, సెల్ఫిష్ 'మణికంఠ' ఏడుపు)ఒక్క నామినేషన్లో తప్ప మిగతా రోజులంతా కంటెస్టెంట్లు ఆనందంగా కనిపించారు. కానీ వారి ఆనందాన్ని ఎక్కువ సేపు బిగ్ బాస్ తట్టుకోలేకపోయాడు. అంతే బెలూన్ కాంటెస్ట్ ముందే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని బాంబు పేల్చాడు. దాంతో ఇంకేముంది... ఓ పక్క తమను తాము కాపాడుకుంటూ వైల్డ్ కార్డ్స్‌ని హౌస్‌లోకి రానివ్వకుండా బిగ్ బాస్ పెట్టే ఆటలన్నీ ప్రాణం పెట్టి ఆడుతున్నారు ప్రస్తుత కంటెస్టెంట్స్. ఇక ఇదంతా ఒక ఎత్తయితే గత వారం ఊహించని ఎలిమినేషన్ సోనియా. కాకపోతే ఈ సోనియాని ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదు... హౌస్‌లోని కంటెస్టెంట్స్ చేయడం విశేషం. ముఖ్యంగా కంటెస్టెంట్స్లోని మిగతా లేడీ పార్టిసిపెంట్స్ సోనియాని వద్దనుకోవడం విడ్డూరం. ఎలిమినేట్ అయిన తరువాత ఈ విషయాన్ని నాగార్జునతో సోనియా బాహాటంగానే అందరి ముందు చెప్పింది. (చదవండి: విశ్వంలో చాలా రహస్యాలున్నాయి: దర్శకుడు శ్రీను వైట్ల)కండబలం ఉన్నవారికి గుండెబలం తక్కువ ఉంటుందన్న విషయాన్ని నిరూపించాడు నిఖిల్. సోనియా ఎలిమినేట్ అవ్వగానే ఒక్కసారిగా భోరుమన్నాడు హౌస్‌లోనే బలవంతుడైన నిఖిల్. పృథ్వీ కూడా నిఖిల్‌తో జత కలిశాడు. ఆఖరికి ఇద్దరికిద్దరూ ఓ అమ్మాయి కోసం ఏడవడం ప్రేక్షకులకు కాస్త నవ్వు తెప్పించి ఉండవచ్చు. ఈ వారం చివర్లో కూడా నాగార్జున ప్రేక్షకులకు ఓ ఝలక్ ఇచ్చి ముగించారు. వారం మధ్యలో ఒక ఎలిమినేషన్ ఉంటుంది అని ప్రకటించారు. చెప్పినట్లుగానే మిడ్ వీక్‌లో ఆదిత్యను ఎలిమినేట్ చేశాడు. ఇక ఇప్పుడు హౌస్‌లో ఉన్నవాళ్ల దగ్గర నుండి ఎక్కువ మసాలా రావట్లేదని అనుకున్నాడో ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేరిట ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపడానికి రెడీ అయ్యాడు బిగ్ బాస్. మరి ఈ మాజీలతో మసాల వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. -
టాటూ సీక్రెట్ బయటపెట్టిన యష్మి.. మణికంఠ సింపతీ డ్రామాలొద్దు!
వైల్డ్‌కార్డులు లేకుండా ఈరోజే లాస్ట్డే.. రేపు ఈ సమయానికల్లా ఎనిమిది మంది మాజీలు హౌస్‌లో తిష్ట వేస్తారు. సింపతీ ఏడుపులు వద్దంటూ నాగార్జున నాగమణికంఠకు క్లాసు పీకాడు. ఇదే మంచి తరుణమని హౌస్మేట్స్ అంతా కూడా మణిపైనే పడ్డారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే నేటి(అక్టోబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..మణికంఠకు క్లాస్ పీకిన నాగ్నాగార్జున వచ్చీరావడంతోనే సింపతీకి ఫుల్స్టాప్ పెట్టమని మణికంఠకు గట్టిగా క్లాస్ పీకాడు. ఎంత బాధున్నా ఇప్పుడే ఏడ్చేసేయ్, కానీ తర్వాత మాత్రం ఏడవడానికి వీల్లేదన్నాడు. అయినా మణి కంట నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. దీంతో నాగ్.. నీ భార్య నీదగ్గరకు రానంటే ఏం చేస్తావ్? నీకు ఫుడ్ పంపించింది కూడా నీ భార్య కాదు ఫ్రెండ్ రాహుల్ అని చెప్పడంతో మణి ఏడ్చేశాడు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఏడుస్తూ సింపతీ కోరుకుంటావని తిట్టాడు.ఫైర్? అదెలా ఉంటుంది సర్?మణికి ఈ రేంజ్లో క్లాస్ పీకడంతో హౌస్మేట్స్ అంతా కూడా అతడి మీదే పడ్డారు. మొదటగా ప్రేరణ.. మణి అందరూ తన గురించే ఆలోచించాలనుకుంటాడంది. విష్ణుప్రియ, పృథ్వీ కూడా అతడిని సెల్ఫిష్ అనేశారు. ఈ సందర్భంగా నాగ్.. విష్ణుప్రియలో ఫైర్ చూడాలనుందనగా.. అదెలా ఉంటుంది సర్? అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది విష్ణు. దీంతో నాగార్జున మారు మాట్లాడలేక తన నోటికి తాళం వేసుకున్నాడు. ప్రేరణను సెల్ఫిష్ అనేసిన యష్మినబీల్ వంతురాగా.. తాను గెలిచినప్పుడు యష్మి జెలసీతో ఏడ్చేసిందన్నాడు. యష్మి మళ్లీ మణి దగ్గరకే వచ్చి అతడు ప్రవర్తన అన్నోయింగ్గా అనిపిస్తుందంది. అలాగే ప్రేరణ సెల్ఫిష్‌గా అనిపిస్తోందని అభిప్రాయపడింది. నాగ్ మాత్రం.. ప్రేరణ గేమ్ అద్భుతంగా ఆడుతుందని మెచ్చుకున్నాడు. ఇక యష్మికి తండ్రి పంపిన మెసేజ్ చెప్తానన్నాడు నాగ్. కాకపోతే ఏదైనా సీక్రెట్ చెప్పాలని షరతు విధించాడు. మోసపోయిన యష్మిదీంతో యష్మి ఓపెన్ అవుతూ.. కాలేజీలో ఒకర్ని ప్రేమించాను.. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మా ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలను చైనీస్ భాషలో పచ్చబొట్టు వేయించుకున్నాను. తర్వాత తెలిసిందేంటంటే.. ఇది జపనీస్ భాష అంట.. పైగా ఈ అక్షరాలకు అసలు అర్థమే లేదంటూ తను మోసపోయిన విషయం బయటపెట్టింది. సీక్రెట్ బయటపెట్టిన యష్మికి తండ్రి పంపిన మెసేజ్‌ను తెలియజేశాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది, వారియర్‌లా పోరాడు, మిస్ అవుతున్నానని సందేశం పంపాడన్నాడు. మణికంఠ కన్నీళ్లుసీతకు ఈర్ష్య ఉందని పృథ్వీ, ప్రేరణ అభిప్రాయపడ్డారు. మణి కన్నింగ్ అని నిఖిల్, మణి టాక్సిక్ అని నైనిక పేర్కొన్నారు. మణికంఠ వంతు వచ్చేసరికి.. ఎవరినీ జడ్జ్ చేసే పరిస్థితిలో లేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ఆడాల్సిందే అని నాగ్ గద్దించడంతో సీతకు జెలసీ ఉందన్నాడు. నేను ఎలా సేవ్ అవుతున్నానో అర్థం కావడం లేదనేసిందని చెప్పాడు. కిచెన్‌లో ప్రేరణ ప్రవర్తించిన తీరు నచ్చలేదన్నాడు. ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్, నబీల్ను సేవ్ చేశారు.ఆ నలుగురికీ ఆదిత్య పంచ్తర్వాత వారం మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఆదిత్యను స్టేజీపైకి పిలిచి జర్నీ చూపించాడు. అతడితో హగ్ అండ్ పంచ్ గేమ్ ఆడించాడు. నబీల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్‌కు హగ్స్ ఇచ్చిన ఆదిత్య.. యష్మి, నైనిక, సీత, నాగమణికంఠకు పంచ్ ఇచ్చాడు. ఒక్కవారమైనా ఏ గొడవా లేకుండా ఆడమని మణికి సలహా ఇచ్చాడు. ఇక పుట్టినరోజునాడే ఆదిత్య బిగ్‌బాస్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిని ఆడుకున్న బిగ్‌బాస్.. ఏడ్చినా కరుణించలేదు!
ఆదిత్య ఎలిమినేషన్‌తో హౌస్‌లో తొమ్మిది మందే మిగిలారు. వీరికోసం బిగ్‌బాస్ అదిరిపోయే డీల్ తీసుకొచ్చాడు. ఇంటి వంటను కళ్లముందుంచాడు. కానీ దాన్ని తినే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. మరి ఎవరెవరు ఇంటి భోజనం అందుకున్నారో తెలియాలంటే నేటి (అక్టోబర్ 04) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..జాతకం చెప్పిన మణిమణికంఠకు సపోర్ట్ చేస్తే ఆడియన్స్ దృష్టిలో మనల్నే విలన్ చేస్తున్నాడని సీత అభిప్రాయపడింది. అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడంది. ఇదిలా ఉంటే తర్వాతి రోజు మార్నింగ్ మస్తీ పేరిట బిగ్‌బాస్ మణికంఠతో హౌస్‌మేట్స్‌కు జ్యోతిష్యం చెప్పించాడు. ఈ సందర్భంగా మణి తనలోని ఫన్ యాంగిల్‌ను బయటపెట్టాడు. తర్వాత హౌస్మేట్స్ మణి జాతకం చెప్పారు. ఈ వారం వెళ్లిపోయేలా ఉన్నావని నబీల్, ప్రతిదానికి ఏడవొద్దని యష్మి సెటైర్లు వేశారు.భార్య మెసేజ్ కోసం మణి ఆరాటంఅనంతరం అసలైన ఆట మొదలుపెట్టాడు. మొదటగా యష్మిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. నిఖిల్ కోసం అతడి అమ్మ చేసిన వంటను, నాగమణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను ముందు పెట్టాడు. వీరికి మెసేజెస్ కూడా వచ్చాయన్నాడు. అయితే ఇద్దరిలో ఒకరినే సెలక్ట్ చేసుకుని వారికి ఫుడ్, లెటర్ ఇవ్వాలన్నాడు. యష్మి.. క్షణం ఆలోచించకుండా నిఖిల్ పేరు చెప్పింది. అది విని మణికంఠ గుండె బద్ధలయ్యింది. తన భార్య ఏమని మెసేజ్ పంపిందోనని దిగులు చెందాడు. అంతలోనే తనకోసం బిర్యానీ చేసి పంపినందుకు తినకపోయినా మనసు నింపుకున్నాడు.నువ్వు వారియర్‌వి..అమ్మ చేతి వంట తిన్న తర్వాత నిఖిల్.. 'ఎవరి కోసమూ మారాల్సిన అవసరం లేదు, లక్ష్యాన్ని మర్చిపోకు' అంటూ తల్లి పంపిన మెసేజ్ చూసుకుని మురిసిపోయాడు. తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన పృథ్వీ విష్ణుప్రియకు బదులుగా నైనిక కోసం ఆమె తల్లి చేసిన ఇడ్లీసాంబార్ తీసుకెళ్తానన్నాడు. విష్ణు ముందుగానే త్యాగం చేసేందుకు రెడీ అని హింటివ్వడంతోనే పృథ్వీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు వారియర్‌వి, నీ బలం చూపించు అంటూ అమ్మ పంపిన మెసేజ్ చూసి నైనిక మురిసిపోయింది.యష్మి ఎమోషన్స్‌తో ఆడుకున్న బిగ్బాస్మణికంఠ వంతురాగా యష్మీని పక్కన పెట్టేసి పృథ్వీ ఫుడ్ తీసుకెళ్లిచ్చాడు. దీంతో యష్మి బోరుమని ఏడ్చేసింది. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అంటూ తల్లి నుంచి వచ్చిన మెసేజ్ చూసి పృథ్వీ ఖుషీ అయ్యాడు. ఇంతలో బిగ్‌బాస్ యష్మి కోసం తండ్రి పంపిన మెసేజ్‌ను సైతం టీవీలో వేశాడు. కానీ ఒక లైన్ చదివేలోపే దాన్ని తీసేయడంతో యష్మి ఒక్కసారి మెసేజ్ చూపించు బిగ్‌బాస్ అని ఏడుస్తూ వేడుకుంది. కానీ బిగ్‌బాస్ కనికరించలేదు. ఒంటరి పోరాటం..ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముందంటే.. హాయ్ అమ్మూ, నువ్వు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే నీ పోరాటాలను ఎదుర్కొన్నావు.. ఆ సమయంలో నీకు తోడుగా లేను. నీ కలలను సాకారం చేసుకునేటప్పుడు కుటుంబంలో ఎవరమూ నీకు సపోర్ట్ చేయలేదు. అయినా నువ్వు వారియర్‌లా పోరాడావు, మేము తప్పని నిరూపించావు. మేము గర్వపడేలా చేశావు. ధైర్యంగా ఉండు, మిస్ యూ మగలే.. ఇట్లు నీ పప్పా అని రాసి ఉంది.పెళ్లయి 10 నెలలే..తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన నిఖిల్.. ప్రేరణ, నబీల్, సీత.. ముగ్గురిలో ప్రేరణను సెలక్ట్ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన పావ్ బాజీని ప్రేరణ ఆవురావురుమని ఆరగించింది. 'మన పెళ్లయి పది నెలలే అవుతోంది.. నీకు ఈ షో ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నిన్ను కలవలేనప్పటికీ టీవీలో సంతోషంగా చూస్తున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను. మిస్ యూ.. ఇట్లు నీ పుట్టు' అని భర్త మెసేజ్ చదివి సంతోషించింది.విష్ణుకు మెసేజ్చివరగా ఇంటి నుంచి భోజనం అందుకోలేకపోయినవారికోసం బిగ్‌బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. నిఖిల్, నైనిక, ప్రేరణ, పృథ్వీ కలిసి.. మిగతా హౌస్‌మేట్స్‌లో ఒకరికి ఫుడ్ తీసుకెళ్లొచ్చనగా అందరూ విష్ణుప్రియ పేరు చెప్పారు. చెల్లి పంపిన చికెన్ బిర్యానీ చూసి విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఏమని మెసేజ్ వచ్చిందంటే. ఆట మీద దృష్టి పెట్టి రేసుగుర్రంలా ఆడు, సైలెంట్‌గా ఉండటం వల్ల నీ గేమ్ డల్ అవుతుంది. టాస్కుల్లో ఫైర్ చూపించు.. ప్రేక్షకుల మనసు గెలుచుకో అని రాసుంది. మరి ఇప్పుడైనా విష్ణు.. పృథ్వీపైనే కాకుండా గేమ్‌పై ఫోకస్ పెడుతుందేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణపై విషం కక్కిన యష్మి, ఆదిత్యను దగ్గరుండి సాగనంపారు!
బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త చీఫ్ సెలక్ట్ అయ్యాడు. ఓరుగల్లు పిలగాడు నబీల్ అఫ్రిది చీఫ్ పోస్ట్ దక్కించుకున్నాడు. అలాగే నాగార్జున చెప్పినట్లు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఆదిత్య ఓంను బయటకు పంపించారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పోరాడి ఓడిన ప్రేరణహ్యాపీ పప్పీ టాస్క్‌లో నబీల్, ఆదిత్య, ప్రేరణ, నిఖిల్ మాత్రమే మిగిలారు. ఎలాగైనా చీఫ్ అవ్వాలని ప్రేరణ చివరిదాకా ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. అందరినీ వెనక్కు నెట్టి చివరకు నబీల్ చీఫ్ కంటెండర్‌గా నిలిచాడు. చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోయిందని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. పృథ్వీ, నబీల్‌లకు బిగ్‌బాస్ 'రాజయ్యేది ఎవరు?' అన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో పృథ్వీ మొదటగా టాస్క్ పూర్తి చేశాడు. కానీ చిన్న పొరపాటు చేయడంతో ఓడిపోయాడు.ఫ్రెండ్ అని ఊరుకున్నా..ఆలస్యంగానైనా నబీల్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. పృథ్వీ గెలవనందుకు యష్మి ఏడ్చేసింది. సంచాలకురాలిగా ప్రేరణ.. నబీల్‌కే ఫేవర్ చేసిందని ఆరోపించింది, అతడే గెలవాలని తన మనసులో ఉందంటూ ఏవేవో నిందలు వేసింది. ఫ్రెండ్ అని సైలెంట్‌గా ఊరుకుంటున్నాను, లేకపోయుంటే మాత్రం వదిలేసేదాన్నే కాదని నిఖిల్, పృథ్వీ దగ్గర ఫైర్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేరణ కనిపిస్తే కూడా.. పృథ్వీ మిస్టేక్ చేసినప్పుడు సరిచేయొచ్చు కదా అని నిలదీసింది. సంచాలకురాలిగా ఉన్నప్పుడు ఎవరికీ సాయం చేయనని ప్రేరణ మొహం మీదే చెప్పేసింది.లేడీస్ గ్యాంగ్ ఏడుపురాత్రిపూట బిగ్‌బాస్ మిడ్‌వీక్ ఎలిమినేషన్ అంటూ బాంబు పేల్చాడు. నామినేషన్లో ఉన్నవారిలో నిఖిల్, నబీల్, మణికంఠ.. ఈరోజుకైతే సేఫ్ అని తెలిపాడు. విష్ణుప్రియ, ఆదిత్య, నైనికలలో ఒకరు ఈరోజు బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతారని పేర్కొన్నాడు. దీంతో నైనిక ఏడుపందుకుంది. వాళ్లను చూసి సీత సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత బిగ్‌బాస్.. ఆదిత్య, నైనిక, విష్ణుప్రియను వరుసగా నిల్చోబెట్టి.. వీరిలో ఎవరు ఈరోజు వెళ్లిపోతారని భావిస్తున్నారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు.ఆదిత్య ఎలిమినేట్కొన్ని విషయాల్లో ఆదిత్య వెనకబడుతున్నాడని, అతడు ఎలిమినేట్ అవుతాడని నిఖిల్ అభిప్రాయపడ్డాడు. మణికంఠ, సీత, యష్మి సైతం.. ఆదిత్య వెళ్లిపోతాడని భావించారు. నబీల్ వంతురాగా.. మాటలు జారిన విష్ణుప్రియ హౌస్ నుంచి వెళ్లిపోవచ్చేమోనని గెస్ చేశాడు. ప్రేరణ, పృథ్వీ.. నైనిక వెళ్లిపోతుందేమోనని అభిప్రాయపడ్డారు. చివర్లో బిగ్‌బాస్.. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఆదిత్య ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించాడు. దీంతో ఎప్పటిలాగే ఆదిత్య అందరికీ ఓ ఫ్లయింగ్ కిస్ వదిలి హౌస్ నుంచి నిష్క్రమించాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తిట్టుకుని మరీ ఏడ్చిన యష్మి, పృథ్వీ.. మణి పరిస్థితి ఇలా అయిందేంటి?
హౌస్‌మేట్స్‌ను కూల్ చేసేందుకు ఫన్ గేమ్ ఇచ్చిన బిగ్‌బాస్ తర్వాత చీఫ్ కంటెండర్ కోసం మరో గేమ్ పెట్టాడు. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఎవరు చీఫ్ అయ్యారు? మళ్లీ ఎలాంటి రభస జరిగిందనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..మార్నింగ్ మస్తీ..బిగ్‌బాస్ ఇంటిసభ్యులతో ఉదయాన్నే కాస్త ఫన్ గేమ్ ఆడించాడు. కలర్.. కలర్.. విచ్ కలర్? అంటూ చిన్నపిల్లల ఆట ఆడించాడు. మధ్యమధ్యలో హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు కూడా చేయించాడు. అనంతరం సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్ ముగిసిందని బిగ్‌బాస్ వెల్లడించాడు. ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయని ప్రకటించాడు. ఎక్కువ టాస్కులు గెలిచిన శక్తి టీమ్ నుంచి ఒకర్ని నేరుగా చీఫ్ కంటెండర్‌గా సెలక్ట్ చేయమని బిగ్‌బాస్ ఆదేశించాడు.ఏడ్చిన యష్మి, పృథ్వీదీంతో యష్మి, పృథ్వీ.. తాను కంటెండర్ అవుతానంటే తాను అవుతానని వాదించుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీ.. నువ్వు మణికంఠను అబ్బాయి కాదని కామెంట్ చేయలేదా? అని నెగెటివ్ ఎత్తి చూపడంతో యష్మి ఏడ్చేసింది. అమ్మతోడు అలా అనలేదని దాని గురించి మాట్లాడొద్దని అడిగింది. ఇక యష్మిని ఓదార్చబోయి పృథ్వీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు. పైకి కఠినగా కనిపించే ఇద్దరూ కంటతడి పెట్టుకోవడంతో నిఖిల్ ఆశ్చర్యపోయాడు.పప్పీ గేమ్పృథ్వీ ఏడుస్తున్నాడని తెలిసి విష్ణుప్రియ మనసు కళుక్కుమంది. నువ్వు రోజూ దిష్టి తీయించుకో అంటూ అతడిపై ప్రేమ ఒలకబోసింది. నానా రభస తర్వాత నిఖిల్.. పృథ్వీని చీఫ్ కంటెండర్‌గా సెలక్ట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. మరో చీఫ్ కంటెండర్ ఎంపిక కోసం బిగ్‌బాస్ హ్యాపీ పప్పీ గేమ్ పెట్టాడు. ఇందులో కుక్కపిల్ల బొమ్మల మీద ఇంటిసభ్యుల పేర్లుంటాయి. ప్రతిఒక్కరూ తమపేరుకు బదులుగా వేరే పేరున్న పప్పీనే సెలక్ట్ చేసుకుని ఆడాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్‌కు కొత్త సంచాలక్పప్పీని చివరగా ఇంటికి తీసుకొచ్చిన కంటెస్టెంట్‌తో పాటు పప్పీ మెడలోని ట్యాగ్‌పై ఎవరి పేరుంటుందో ఆ కంటెస్టెంట్ ఇద్దరూ డేంజర్ జోన్లో నిలబడతారు. వారిలో ఒకరిని సంచాలకుడు అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్లో నుంచి అవుట్ అయిన కంటెస్టెంట్ సంచాలకుడిగా మారుతూ ఉంటారు. మొదటి రౌండ్లో మణి, యష్మి.. డేంజర్ జోన్లో నిలబడ్డారు. సంచాలకుడు పృథ్వీ.. యష్మిని గేమ్‌లో ఉంచుతూ మణిని అవుట్ చేశాడు. కావాలనే తనను రేసు నుంచి పక్కన పెట్టేశారని మణి ఫీలయ్యాడు. మణిని టార్గెట్ చేశారా?రెండో రౌండ్లో యష్మి, ప్రేరణ డేంజర్ జోన్లో నిలబడ్డారు. ప్రేరణకు చీఫ్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని మణి.. యష్మిని అవుట్ చేశాడు. నన్ను టార్గెట్ చేశావని యష్మి అనగా.. తాను టార్గెట్ చేయలేదని మణి వాదించాడు. నీతో ఎవడ్రా మాట్లాడతాడు, పోరా.. నీకయితే చీఫ్ అయ్యే అర్హతే లేదు. నువ్వు ఎలా ఆడతావో చూస్తా.. అని ఛాలెంజ్ చేయగా ఏదో ఒకరోజు చీఫ్ అవుతానని మణి శపథం చేశాడు. తర్వాత మణి వెళ్లి బొమ్మలు సర్దుతుంటే దాన్ని సీత తప్పుపట్టింది. అతడిపైకి గట్టి గట్టిగా అరుస్తూ క్లాస్ పీకింది.విష్ణు అవుట్ దీంతో మణి అందరూ కలిసి కార్నర్ చేస్తున్నట్లుగా ఉందని కన్నీళ్లు పెట్టుకోగా యష్మి వెళ్లి ఓదార్చడం విశేషం. సీతూ అంటే ఇష్టం.. తనను తప్పుగా అర్థం చేసుందని ఎమోషనల్ అవడంతో వెంటనే ఆమె కూడా వెళ్లి ఓదార్చింది. మూడో రౌండ్లో ప్రేరణ, విష్ణుప్రియ డేంజర్ జోన్లో నిలబడ్డారు. వీరిలో నుంచి యష్మి.. విష్ణును గేమ్ నుంచి అవుట్ చేసింది. నాలుగో రౌండ్లో నైనిక, సీత నిలబడగా విష్ణు సీతను అవుట్ చేసింది. అతడే చీఫ్ఐదో రౌండ్లో నైనిక తన పప్పీ తనే తెచ్చేసుకోవడంతో గేమ్‌లో నుంచి అవుట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్లో గేమ్ పూర్తవలేదు కానీ ఆల్రెడీ నబీల్ చీఫ్ కంటెండర్‌గా, ఆ తర్వాత చీఫ్‌గానూ సెలక్ట్ అయ్యాడట! ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆదిత్య ఓంను సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆదిత్య పిచ్చిపని.. బిగ్‌బాస్ వార్నింగ్.. నిజం ఒప్పుకున్న విష్ణు
ఈ రోజు నామినేషన్స్‌లో అంత ఫైర్ ఏం కనిపించలేదు. కారణాలు వెతుక్కుని మరీ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లు కనిపించింది. మెజారిటీ సభ్యులు నాగమణికంఠపైనే పడ్డారు. యష్మి.. నిఖిల్ టీమ్‌కు షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అలా వెళ్లి ఇలా వచ్చేశాడుఈ సీజన్లో జైల్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా నాగమణికంఠ నిలిచాడు. అయితే కాసేపటికే అతడిని బయటకు పంపించి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను మంటలో వేయాలన్నాడు. మొదటగా నాగమణికంఠ మాట్లాడుతూ.. మొదటి వీక్‌లో ఉన్నంత స్ట్రాంగ్‌గా ఇప్పుడు లేవంటూ నైనికను నామినేట్ చేశాడు. తనపై జోకులు వేయడం నచ్చలేదంటూ యష్మి ఫోటోను మంటల్లో వేశాడు.నామినేషన్స్తర్వాత నైనిక..నబీల్, విష్ణుప్రియను; సీత.. మణికంఠ, విష్ణుప్రియను; నబీల్.. నైనిక, విష్ణుప్రియను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా విష్ణు.. నేను అనుకున్నంత ఈజీగా ఈ జర్నీ లేదు. నేను ప్రతిరోజు బెస్ట్ ఇవ్వలేను.. కానీ ట్రై చేస్తాను అంటూ తను పెద్దగా ఆడలేదన్న విషయాన్ని ఒప్పేసుకుంది. ఆదిత్య ఓం.. నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటే బాగుంటుందని నైనిక ఫోటోను అగ్నిలో వేశాడు. ఆచితూచి మాట్లాడంటూ విష్ణును నామినేట్ చేశాడు.నీకే నోటిదురుసునిఖిల్ వంతురాగా.. నువ్వు చేసే కామెడీ ఎదుటివారిని బాధపెట్టేలా ఉండకూడదు అని విష్ణును నామినేట్ చేశాడు. అప్పుడు విష్ణు.. నాకన్నా నీకే పెద్ద నోటిదూల, అలాంటిది నువ్వు వచ్చి చెప్తున్నావా? అని సెటైర్లు వేయడంతో లేడీ గ్యాంగ్ ఫక్కుమని నవ్వింది. సింపతీ గేమ్ ఆడుతున్నావంటూ నాగమణిని నామినేట్ చేశాడు. తర్వాత ప్రేరణ.. త్యాగం చేయడం తప్పు అంటూ మణి ఫోటోను మంటల్లో వేసింది. మీలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతోందంటూ ఆదిత్యను నామినేట్ చేసింది. ఆవేశపడ్డ ఆదిత్యఆమె మాటలతో ఆవేశపడ్డ ఆదిత్య.. మంటల్లో చేయి పెట్టి తన ఫోటోను బయటకుతీస్తూ ఇదీ నా కాన్ఫిడెన్స్ అన్నాడు. దీంతో బిగ్‌బాస్.. మంటల్లో చేయి పెట్టడం ఆటలా? అని క్లాస్ పీకడంతో ఆదిత్య క్షమించమని కోరాడు. తర్వాత విష్ణుప్రియ.. నీ పర్ఫామెన్స్ ఇంకా మెరుగవ్వాలంటూ నైనికను నామినేట్ చేసింది. సంచాలకుడిగా సరిగా వ్యవహరించలేదంటూ నబీల్ ఫోటోను మంటల్లో వేసింది. మాట మార్చావ్..యష్మి.. మణికంఠను నామినేట్ చేస్తూ నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అర్థం కావట్లేదు... నువ్వు నా ఫ్రెండ్ కానందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సమయంలో మణి, యష్మి.. చాలాసేపు వాదులాడుకున్నారు. అనంతరం యష్మి.. మీలో క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తోందని ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది. పృథ్వీ.. నైనికను నామినేట్ చేశాడు. నాలుగు గోడల దగ్గర త్యాగం చేశానని చెప్పి అందరిముందు త్యాగం చేయలేదని మాట మార్చావంటూ మణికంఠను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కాసేపు గొడవపడ్డారు. నామినేషన్స్‌లో ఎవరంటే?చివర్లో హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ సూపర్ పవర్ ఇచ్చాడు. ఇద్దరు చీఫ్స్‌లో ఒకరిని నామినేట్ చేయొచ్చన్నాడు. యష్మి, పృథ్వీ మినహా మిగతా అందరూ సీతను సేవ్ చేయడానికే మొగ్గు చూపడంతో నిఖిల్ నామినేషన్లోకి వచ్చాడు. అలా ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబీల్ నామినేషన్లో ఉన్నారు.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సోనియా ఎలిమినేట్, ఏడ్చిన నిఖిల్.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగ్!
ఎంతోమంది బిగ్‌బాస్ ప్రియులు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సోనియా ఎలిమినేట్ అయింది. తను వెళ్లిపోతుంటే నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. వెళ్లిపోయేముందు కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెలిబుచ్చింది సోనియా.. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ముందే ఊహించిన సోనియాఈ వారం తానే ఎలిమినేట్ అవుతానని సోనియా ముందే పసిగట్టింది. హౌస్ మొత్తం తనను తప్పుగా అర్థం చేసుకుంటోందంటూ తొలిసారి ఏడ్చేసింది. నాగ్ ఓదార్చే ప్రయత్నం చేయగా సోనియా తన కన్నీళ్లను దిగమించుకునేందుకు యత్నించింది. దీంతో యష్మి లేచి.. సోనియా ఒక సోదరిలా పృథ్వీ, నిఖిల్‌కు సలహాలు ఇస్తోందని, అక్కడ ఈమె తప్పే లేదని వెనకేసుకొచ్చింది. తర్వాత నాగ్ చిన్న ఫన్ గేమ్ ఆడించగా ఇందులో కాంతార టీమ్ గెలిచింది. సోనియా టాక్సిక్అనంతరం మీకే అంకితం అనే చిట్టీల గేమ్ ఆడించాడు. కంటెస్టెంట్లు ఓ చీటీ తీసి అందులో ఉన్న వాక్యాన్ని ఒకరికి అంకితం చేసి వారిని చెంపదెబ్బ కొట్టాలన్నాడు. అలా మొదటగా ప్రేరణ.. హౌస్‌లో సోనియా టాక్సిక్ అని ఆమెను కొట్టింది. నైనిక.. విష్ణుప్రియను లౌడ్ స్పీకర్ అంది. సీత.. మణికంఠ విక్టిమ్ కార్డ్ వాడతాడంది. ఆదిత్య.. మణికంఠ నెగెటివ్‌గా ఆలోచిస్తాడని పేర్కొన్నాడు. నబీల్.. నిఖిల్ సేఫ్ ప్లేయర్ అని తెలిపాడు. పృథ్వీ.. మణికంఠ మానిప్యులేట్ చేస్తాడన్నాడు.కంటెస్టెంట్ల చేతికి ఎలిమినేషన్ పవర్ యష్మి.. పృథ్వీ అటెన్షన్ సీకర్ అని తెలిపింది. నిఖిల్.. మణికంఠకు ఏ లక్ష్యం లేదన్నాడు. మణికంఠ వంతురాగా నిఖిల్ బయాస్డ్ అని పేర్కొన్నాడు. విష్ణు.. నైనిక ఇమ్మెచ్యూర్ అని అభిప్రాయపడింది. సోనియా.. విష్ణుకు సెల్ఫిష్ అన్న ట్యాగ్ ఇచ్చింది. తర్వాత నాగ్ ప్రేరణను, ఆదిత్యను సేవ్ చేశాడు. చివర్లో సోనియా, మణికంఠ మాత్రమే మిగిలారు. మణికంఠ హౌస్‌లో ఉండేందుకు పనికిరాడని మీరన్నారు. కానీ, సోనియాకు తక్కువ ఓట్లు పడ్డాయి.. మరి వీరిద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండాలనేది మీరే నిర్ణయించాలంటూ కంటెస్టెంట్లకే పవర్ ఇచ్చాడు నాగ్.జైలుకు మణికంఠఈ క్రమంలో నిఖిల్, పృథ్వీ, నైనిక మాత్రమే సోనియాకు సపోర్ట్ చేయగా మిగతా అందరూ మణికంఠకు మద్దతిచ్చారు. దీంతో నాగ్.. అటు ప్రేక్షకుల ఓట్ల ప్రకారం, మెజారిటీ హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం సోనియా ఎలిమినేట్ అని ప్రకటించాడు. డేంజర్ జోన్లో ఉన్న మణి ఈ ఎపిసోడ్ అయిపోగానే జైల్లో ఉండాలన్నాడు. ఇక సోనియా ఎలిమినేట్ అవడంతో నిఖిల్, పృథ్వీ భావోద్వేగానికి లోనయ్యారు. (చదవండి: సోనియా ఎలిమినేషన్‌కు కారణాలివే!)నేనెవరికీ నచ్చనుస్టేజీపైకి వచ్చిన సోనియా.. నేను ఉన్నదున్నట్లు మాట్లాడటం వల్ల ఎవరికీ నచ్చను. కాలేజీలోనూ అంతే, ఇక్కడా అంతే.. కానీ, ఎవరికోసమూ నా స్వభావాన్ని మార్చుకోలేను. నిఖిల్, పృథ్వీకి సలహాలు ఇస్తాను. కానీ, వారు నా మాటలు వినరు, నేను వాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేయలేదు అని నొక్కి చెప్పింది. హౌస్మేట్స్ గురించి మాట్లాడుతూ.. విష్ణుప్రియ పులిహోర కలుపుతుందని, సీత.. కాకరకాయలా చేదుగా మాట్లాడుతుందని చెప్పింది. ప్రేరణ.. ఆవకాయ అని, నబీల్.. సాఫ్ట్ కుర్రాడు అని తెలిపింది. పృథ్వీ.. స్వీట్ పాయసం అని, యష్మి.. పెరుగన్నం అని పేర్కొంది. మిడ్ వీక్ ఎలిమినేషన్అన్నం లేకపోతే ఏదీ లేదు, అలాగే నిఖిల్ లేకపోతే బిగ్‌బాస్ హౌసే లేదంది. నైనిక.. అప్పడంలా ఈజీగా బ్రేక్ అవుతుందని చెప్పింది. సోనియా వెళ్లిపోతుండటంతో నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మిస్ యూ అంటూ ఒకరినొకరు కళ్లతోనే సంభాషించుకున్నారు. సోనియాను పంపించేశాక.. నాగ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పాడు. అంటే.. వచ్చే ఆదివారం (అక్టోబర్ 5న) వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీరితోపాటే సోనియా కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాగ్‌తో అడ్డంగా వాదించిన సోనియా.. హౌస్‌లో జీరో అతడే!
మాటలు హద్దులు దాటడంతో యష్మి, విష్ణు, సోనియాకు నాగ్ గట్టిగానే క్లాస్ పీకాడు. మణికంఠను అబ్బాయే కాదంటావా? నిఖిల్ చేతికి గాజులు ఒక్కటే తక్కువయ్యాయా? యష్మి దృష్టి ఎంతసేపూ ఇద్దరబ్బాయిల మీదే ఉందా? అని ముగ్గురిపైనా విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఎవరిపై ఏ రేంజులో ఫైర్ అయ్యాడో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హీరోగా నబీల్నాగార్జున వచ్చీరావడంతోనే హీరో-జీరో గేమ్ ఆడించాడు. మొదటగా మణికంఠ.. సీత హీరోలా గేమ్ ఆడుతుందని, నైనిక గేమ్‌లో జీరోలా అయిపోతోందని చెప్పాడు. మణికంఠ కరెక్ట్‌గా చెప్పాడని నాగ్ మెచ్చుకున్నాడు. తర్వాత యష్మి.. నబీల్ను హీరో, నైనికను జీరో అనేసింది. ఇక్కడ నాగ్.. నబీల్ ఆటకు చప్పట్లు కొట్టడమే కాకుండా ఆడియన్స్‌తోనూ సూపర్ అనిపించాడు. ఇతడు పృథ్వీ హీరో, మణిని జీరో అని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా మణికంఠ డబుల్ యాక్షన్ చేసిన వీడియోలు ప్లే చేశారు. గేమ్‌లో త్యాగం చేయలేదని ఓసారి, తనే త్యాగం చేశానని మరోసారి చెప్పాడు. ఏదైనా ఒక్కదానిపైనే నిలబడు, అతిగా ఆలోచించకు అని నాగ్ మణికి సలహా ఇచ్చాడు.సీత హీరో, మణి జీరోఆదిత్య వంతురాగా.. నిఖిల్ హీరో, మణి జీరో అని పేర్కొన్నాడు. నైనిక.. సీత హీరో, మణి జీరో అని తెలిపింది. ప్రేరణ వంతురాగా.. నబీల్‌కు హీరోగా కిరీటం పెట్టింది. పప్పులా ఆడుతున్నాడా? ఎవరి వల్లయినా ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడా? అనేది అర్థం కావట్లేదంటూ నిఖిల్‌ను జీరోగా అనేసింది. ఎందుకలా? అని నాగ్ అడగ్గా మిస్ బ్యాలెన్స్ అయ్యానని నిఖిల్ చెప్పాడు. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? అని నిలదీశాడు. అంతేకాకుండా నీ క్లాన్లోకి రావడానికి హౌస్ అంతా ఇష్టపడలేదు, ఎందుకో తెలుసా? నీ ఆట నువ్వు ఆడట్లేదు, ఈజీగా ఇన్ఫ్లూయెన్స్ అయిపోతున్నావు.. అనే ఎవరూ ఇష్టపడలేదు అని అర్థమయ్యేలా వివరించాడు. చదవండి: సోనియా ఎలిమినేట్.. సీక్రెట్ రూంలాంటి ట్విస్టులేమైనా..?నా ఆట నేనే ఆడతాసోనియా, నిఖిల్.. పృథ్వీని హీరోగా, మణికంఠను జీరోగా అభిప్రాయపడ్డారు. సీత.. నబీల్ను హీరోగా పేర్కొనగా.. ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ నిఖిల్‌ను జీరోగా అభిప్రాయపడింది. నెమ్మదిగా విషయం బోధపడుతున్న నిఖిల్.. ఇకమీదట నా ఆట నేనే ఆడతా, నా నిర్ణయాలు నేనే తీసుకుంటా అని మాటిచ్చాడు. పృథ్వీ.. నబీల్ను హీరోగా.. మణికంఠను జీరోగా పేర్కొన్నాడు. తర్వాత నాగ్ సోనియాకు క్లాస్ పీకాడు.. విష్ణును అడల్ట్రేటెడ్ కామెడీ అన్నావ్.. మరి నామినేషన్లో నువ్వు చేసిందేంటి? అని వీడియో ప్లే చేశాడు.నాగ్‌తో వాదించిన సోనియాఅందులో సోనియా.. ఎంతసేపు పృథ్వీ, నిఖిల్‌నే చూస్తే ఎలా? మమ్మల్ని కూడా చూడు అంటూ యష్మిపై సెటైర్లు వేసింది. ఇది తప్పు కాదా? అని నిఖిల్, పృథ్వీని ప్రశ్నించగా అబ్బే, తన ఉద్దేశం అది కాదంటూ వీళ్లు ఆమెను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో ప్రేరణ అందుకుని.. ఇందుకే, ఇలా తప్పు చేసినా సరే వారిని వారే సమర్థించుకోవడం వల్లే ఎవరూ ఆ క్లాన్లోకి వెళ్లలేదని ఉన్నమాట అనేసింది. తర్వాత సోనియా లేచి.. గేమ్‌లో వాళ్లతో పాటు నన్ను కూడా చూడు అని చెప్పానే తప్ప అందులో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదని వాదించింది. ఇది జోక్ కాదువిష్ణుప్రియ.. ప్రేరణకు హీరోగా కిరీటం ఇవ్వగా, సోనియా జీరో అని తేల్చింది. ఈ సందర్భంగా విష్ణు.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువ అని హేళన చేసిన వీడియోను నాగ్ ప్లే చేశాడు. అది సరదాగా అన్నానని విష్ణు నవ్వడంతో.. ఇది జోక్ కాదు, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావ్? ఇలాంటివి మళ్లీ రిపీట్ కావొద్దని నాగ్ హెచ్చరించాడు. అనంతరం మణికంఠను అబ్బాయిల లిస్టులో నుంచి పక్కనపడేసిన వీడియో ప్లే చేశారు.యష్మిపై ఫైర్అందులో.. ఇంట్లో నలుగురు అబ్బాయిలే ఉన్నామా? అయినా మణికంఠ ఉన్నాడుగా అని పృథ్వీ అనగా వాడు లెక్కలో లేడు అని యష్మి అనేసింది. ఇది చూసి నోరెళ్లబెట్టిన యష్మి.. అమ్మతోడు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, గేమ్పరంగా అతడు లెక్కలో లేడు అన్నానే తప్ప మరే ఉద్దేశం లేదంటూ క్షమాపణలు చెప్పింది. ఫైనల్‌గా నాగ్ ఈ రోజు నబీల్ ఒక్కడినే సేవ్ చేశాడు. రేపు సోనియా ఎలిమినేట్ అన్న విషయం అందరికీ తెలిసిందే!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: మేనిప్యులేషన్తోనే సక్సెస్ కాలేరు
హాయ్, హలో.. అందరూ బాగున్నారా? బిగ్ బాస్ చూస్తున్నారా? చూడకపోతే మీ ఆర్టికల్ ఎందుకు చదువుతాం? అంటారా. చూడకపోయినా చదవండి. ఎందుకంటే, ఇక్కడ మనం బిగ్ బాస్ గురించి మాత్రమే మాట్లాడుకోవడం లేదు. బిగ్ బాస్ ను నేపథ్యంగా తీసుకుని సైకాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం.గతవారం మనం ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం దానికి రిలేటెడ్ గా ‘ఎమోషనల్ మేనిప్యులేషన్’ గురించి మాట్లాడుకుందాం. అందుకోసం ముందుగా కొన్ని పదాలు, వాటి నిర్వచనాల గురించి తెలుసుకుందాం.Emotional Manipulation: తన ప్రయోజనాలకోసం ఇతరుల భావోద్వాగాలను ప్రభావితం చేయడం లేదా నియంత్రించడం.Guilt-Tripping: ఒక విషయంలో ఒక వ్యక్తి తప్పు లేకపోయినా, అతని నిర్ణయాలను నియంత్రించేందుకు నేరుగా లేదా పరోక్షంగా అతనినే దోషిగా అనిపించేటట్లు చేయడం.Gaslighting: ఒక వ్యక్తి మరొకరిని వారి జ్ఞాపకాలు లేదా ప్రవర్తనను సందేహించేటట్లు చేయడం. దీనివల్ల బాధితులు అయోమయంగా, ఆందోళనగా, తాము చూసిన నిజాన్ని నమ్ముకోలేని స్థితిలో పడిపోతారు.Triangulation: ఒక వ్యక్తి ఇతరుల బంధాల మధ్య విభేదాలు సృష్టించడం, బాధ్యత వదిలించుకునేలా చేయడం. ఇలాంటి వ్యక్తి మూడవ వ్యక్తిని ఒక సాధనంగా వాడి, ఇతరుల మీద నియంత్రణ కలిగిస్తారు.Public Shaming: ఎవరినైనా ప్రజల ముందు అవమానపరచడం, సిగ్గుపడేటట్లు చేయడం. ఇది సోషల్ మీడియా లేదా వ్యక్తిగతంగా, ప్రజల ముందు ఎక్కడైనా జరుగవచ్చు.ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో జరిగిన సంఘటనలను emotional manipulation కాంటెక్స్ట్లో చూడడం వల్ల, వాటిని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో అర్థం చేసుకోవడం వల్ల చాలా విషయాల్లో స్పష్టత వస్తుంది.ఎమోషనల్ మేనిప్యులేషన్ ఈ వారం హౌస్ లో తన ప్రవర్తన ద్వారా సోనియా ఎమోషనల్ మేనిప్యులేషన్ ను స్పష్టంగా ప్రదర్శించింది. పదే పదే నబీల్ ను ఫెయిల్డ్ సంచాలక్ అని పిలవడం ద్వారా అతని ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేసింది. ఇది అతన్ని రక్షణాత్మక స్థితిలోకి నెట్టి, ఎమోషనల్ గా వీక్ చేసే ప్రయత్నంగా చెప్పవచ్చు.నిఖిల్, పృధ్విని వాడుకుని సోనియా ఆడుతోందే తప్ప, తన ఆట తాను ఆడటం లేదని యష్మి ఆరోపించింది. నిఖిల్, పృధ్విలను ఉపయోగించి గేమ్ నెరేటివ్ ను నియంత్రించేందుకు సోనియా ప్రయత్నిస్తోంది. Triangulation అంటే ఇదే. హౌస్ మొత్తం కూడా అదే అభిప్రాయంలో ఉంది. అందుకే శక్తి క్లాన్ నుంచి సభ్యులు కాంతార క్లాన్ లోకి వచ్చారు. కాంతార సభ్యులెవ్వరూ శక్తి క్లాన్ లోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు.మరోవైపు సోనియా ‘నా హార్ట్ బ్రేక్’ చేశావంటూ నిఖిల్ ను నిందించింది. నీ వల్లనే నేను బాధపడుతున్నానన్నట్లుగా మాట్లాడి అతనపై ఎమోషనల్ ప్రెజర్ పెంచింది. Guilt-trippingకు ఇది ఒక ఉదాహరణ.అగ్రెషన్ అండ్ మేనిప్యులేషన్మణికంఠను మానసికంగా, శారీరకంగా బలహీనంగా చూపించడం ద్వారా పృధ్వి తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేసాడు. నబీల్ ను తిట్టడం, భయాందోళనను సృష్టించి అతన్ని మౌనంగా ఉంచడానికి, వెనక్కు తగ్గేలా చేయడానికి ప్రయత్నించాడు.సోనియా, పృధ్వి ఇద్దరూ కలిసి నబీల్ ను అడ్డుకునేందుకు, ఎమోషనల్ గా వీక్ చేసేందుకు ప్రయత్నించారు. ఇతరులపై పైచేయి సాధించడానికి అగ్రెషన్ ను ఉపయోగించడం కూడా ఒక టెక్నిక్. Public shaming కు ఇదో ఉదాహరణ.కానీ నబీల్ ఈ మేనిప్యులేషన్ కు, షేమింగ్ కు తలొగ్గకుండా, సోనియాలోని ఎమోషన్ మేనిప్యులేషన్ ను ఎత్తి చూపేందుకు ప్రయత్నించాడు.మరోవైపు నిఖిల్, పృధ్విలను వేరే కోణంలో చూస్తోందని సోనియా మాట్లాడింది. తనకు లేని ఆలోచనలకు యష్మిని బాధ్యురాలిగా చేసి బాధపడేలా చేయడం Gaslighting కు ఇదో ఉదాహరణ. ఇలాంటి మాటల వల్ల యష్మి కుంగిపోయి ఏడ్చేసింది. సోనియా లక్ష్యం నెరవేరింది.ముగ్గురు వర్సెస్ హౌస్... కాంతార క్లాన్ కు ఎవరు చీఫ్ కావాలనే విషయంలో బిగ్ బాస్ ఒక పోటీ నిర్వహించాడు. అందులో భాగంగా సుత్తి ఎవరికి ఇవ్వాలనే విషయంలో సోనియా, నిఖిల్, పృథ్వి మాట్లాడుకుంటే, సోనియాను ఒంటరి చేయడానికి విష్ణుప్రియ, సీత, నయనిక ప్లాన్ చేశారు. చివరకు శక్తి క్లాన్ కు చెందిన సీత కాంతార గ్రూప్ చీఫ్ గా ఎంపికైంది.ఆ తర్వాత ఏ క్లాన్ లో ఎవరు ఉండాలో నిర్ణయించుకోమన్నారు. సోనియా మేనిప్యులేషన్, నిఖిల్ ఆమెను సమర్థించడం నచ్చని శక్తి క్లాన్ లోని విష్ణుప్రియ, నయనిక కాంతార క్లాన్ లోని వెళ్లారు. కానీ కాంతార క్లాన్ సభ్యులెవ్వరూ శక్తి క్లాన్ లోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మణికంఠ, యష్మి వెళ్లాల్సి వచ్చింది. కానీ, గోల్డెన్ బ్రాస్లెట్ తీసుకుని మణికంఠ తిరిగి కాంతార క్లాన్ కు వచ్చేశాడు. ఆ ముగ్గురూ, మిగతా సభ్యులుగా హౌస్ విడిపోయింది.ఎమోషనల్ మేనిప్యులేషన్ వల్ల ఒకరిద్దరిని కంట్రోల్ చేయగలరేమో కాని, అందరినీ కంట్రోల్ చేయలేరని ఈ వారం హౌస్ సభ్యుల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా అర్థం చేసుకోవచ్చు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
పృథ్వీ ఆమెకు పడిపోయాడు, తనను చూస్తే భయమేస్తోంది: సోనియా
సీరియస్ టాస్క్‌లకు చెక్ పెడుతూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరి పాత్రల్లో మరొకరు దూరి మిమిక్రీ చేయాలన్నాడు. ఇంకేముంది.. హౌస్మేట్స్ దొరికిన ఛాన్స్‌ను బీభత్సంగా వాడుకున్నారు. నబీల్ అయితే నెక్ట్స్ లెవల్.. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 27) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పృథ్వి మాయలో విష్ణుపృథ్వి, విష్ణుప్రియకు ఒకరంటే ఒకరికి ఇష్టం. నిన్న టాస్కులో కూడా పృథ్వి.. విష్ణుకోసం ప్రేమపాట పాడటం.. అది విని ఆమె పరవశించిపోవడం చూశాం. వారి ఇష్టాన్ని గ్రహించిన సోనియా.. పృథ్విగాడిని చూస్తే భయం వేస్తుంది. ఆమె (విష్ణు)కు పడిపోతున్నాడు. నాకు ఏది నిజం? ఏది అబద్ధమో తెలియదుగానీ అలా అనిపిస్తుంది అని నిఖిల్‌తో చెప్పుకొచ్చింది. అటు విష్ణుప్రియ కూడా.. తన లేడీ గ్యాంగ్‌కు పృథ్వీ అంటే ఇష్టమని చెప్పి అతడితోనే ఎంచక్కా ఉంటోంది.రేషన్ టాస్క్తర్వాత బిగ్‌బాస్ రేషన్ టాస్క్ పెట్టాడు. అందులో భాగంగా తాను వినిపించే శబ్దాలను వరుస క్రమంలో రాయాలన్నాడు. ఈ గేమ్‌లో శక్తి టీమ్ గెలవగా తమకు కూరగాయలు, పండ్లు, కూల్‌డ్రింక్ తీసుకునేందుకు ఎక్కువ గడువు దొరికింది. కాంతార టీమ్‌కు వాటిని సంపాదించుకునేందుకు తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు.టీమ్ మార్చేసిన మణిఅనంతరం బిగ్‌బాస్.. గార్డెన్ ఏరియాలో ఓ బంగారు గాజును పెట్టాడు. దాన్ని ఉపయోగించుకుని వేరే టీమ్‌లోకి మారొచ్చని చెప్పాడు. నబీల్ను లాక్కోవాలని శక్తి టీమ్.. పృథ్విని లాక్కోవాలని కాంతార టీమ్ ప్రయత్నించింది. కానీ ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ నాగమణికంఠ గోల్డెన్ బ్యాంగిల్ ధరించాడు. అలా శక్తి టీమ్‌ను వదిలేసి కాంతార టీమ్‌లో చేరాడు. అయితే కాంతార టీమ్‌లో నుంచి ఒకరిని స్వాప్ చేయాలనడంతో ఆదిత్యను శక్తి టీమ్‌కు పంపించాడు.పరకాయ ప్రవేశంతర్వాత బిగ్‌బాస్.. ఇంట్లో ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరిని ఒకరు ఇమిటేట్ చేయాలన్నాడు. ప్రేరణ.. మణి పాత్రలో జీవించేసింది. ఆదిత్య.. సోనియాను అచ్చుదింపేశాడు. నబీల్.. ఆదిత్య పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఎవరూ తగ్గలేదు. అందరిలో నబీల్ను బెస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించారు. ఇక ఈ ఇమిటేషన్ టాస్కులో నిఖిల్, సోనియా, పృథ్వీలను ఒక గ్రూపుగా పేర్కొంటూ వారిపైనే ఫోకస్ పెట్టడంతో సోనియా తెగ సంతోషపడిపోయింది. తమ ముగ్గురి గురించే హౌస్ అంతా మాట్లాడుకుంటోందని మురిసిపోయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి