
హాయ్, హలో.. అందరూ బాగున్నారా? బిగ్ బాస్ చూస్తున్నారా? చూడకపోతే మీ ఆర్టికల్ ఎందుకు చదువుతాం? అంటారా. చూడకపోయినా చదవండి. ఎందుకంటే, ఇక్కడ మనం బిగ్ బాస్ గురించి మాత్రమే మాట్లాడుకోవడం లేదు. బిగ్ బాస్ ను నేపథ్యంగా తీసుకుని సైకాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం.
గతవారం మనం ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం దానికి రిలేటెడ్ గా ‘ఎమోషనల్ మేనిప్యులేషన్’ గురించి మాట్లాడుకుందాం. అందుకోసం ముందుగా కొన్ని పదాలు, వాటి నిర్వచనాల గురించి తెలుసుకుందాం.
Emotional Manipulation: తన ప్రయోజనాలకోసం ఇతరుల భావోద్వాగాలను ప్రభావితం చేయడం లేదా నియంత్రించడం.
Guilt-Tripping: ఒక విషయంలో ఒక వ్యక్తి తప్పు లేకపోయినా, అతని నిర్ణయాలను నియంత్రించేందుకు నేరుగా లేదా పరోక్షంగా అతనినే దోషిగా అనిపించేటట్లు చేయడం.
Gaslighting: ఒక వ్యక్తి మరొకరిని వారి జ్ఞాపకాలు లేదా ప్రవర్తనను సందేహించేటట్లు చేయడం. దీనివల్ల బాధితులు అయోమయంగా, ఆందోళనగా, తాము చూసిన నిజాన్ని నమ్ముకోలేని స్థితిలో పడిపోతారు.
Triangulation: ఒక వ్యక్తి ఇతరుల బంధాల మధ్య విభేదాలు సృష్టించడం, బాధ్యత వదిలించుకునేలా చేయడం. ఇలాంటి వ్యక్తి మూడవ వ్యక్తిని ఒక సాధనంగా వాడి, ఇతరుల మీద నియంత్రణ కలిగిస్తారు.
Public Shaming: ఎవరినైనా ప్రజల ముందు అవమానపరచడం, సిగ్గుపడేటట్లు చేయడం. ఇది సోషల్ మీడియా లేదా వ్యక్తిగతంగా, ప్రజల ముందు ఎక్కడైనా జరుగవచ్చు.
ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో జరిగిన సంఘటనలను emotional manipulation కాంటెక్స్ట్‌లో చూడడం వల్ల, వాటిని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో అర్థం చేసుకోవడం వల్ల చాలా విషయాల్లో స్పష్టత వస్తుంది.
ఎమోషనల్ మేనిప్యులేషన్
ఈ వారం హౌస్ లో తన ప్రవర్తన ద్వారా సోనియా ఎమోషనల్ మేనిప్యులేషన్ ను స్పష్టంగా ప్రదర్శించింది. పదే పదే నబీల్ ను ఫెయిల్డ్ సంచాలక్ అని పిలవడం ద్వారా అతని ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేసింది. ఇది అతన్ని రక్షణాత్మక స్థితిలోకి నెట్టి, ఎమోషనల్ గా వీక్ చేసే ప్రయత్నంగా చెప్పవచ్చు.
నిఖిల్, పృధ్విని వాడుకుని సోనియా ఆడుతోందే తప్ప, తన ఆట తాను ఆడటం లేదని యష్మి ఆరోపించింది. నిఖిల్, పృధ్విలను ఉపయోగించి గేమ్ నెరేటివ్ ను నియంత్రించేందుకు సోనియా ప్రయత్నిస్తోంది. Triangulation అంటే ఇదే. హౌస్ మొత్తం కూడా అదే అభిప్రాయంలో ఉంది. అందుకే శక్తి క్లాన్ నుంచి సభ్యులు కాంతార క్లాన్ లోకి వచ్చారు. కాంతార సభ్యులెవ్వరూ శక్తి క్లాన్ లోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు.
మరోవైపు సోనియా ‘నా హార్ట్ బ్రేక్’ చేశావంటూ నిఖిల్ ను నిందించింది. నీ వల్లనే నేను బాధపడుతున్నానన్నట్లుగా మాట్లాడి అతనపై ఎమోషనల్ ప్రెజర్ పెంచింది. Guilt-trippingకు ఇది ఒక ఉదాహరణ.
అగ్రెషన్ అండ్ మేనిప్యులేషన్
మణికంఠను మానసికంగా, శారీరకంగా బలహీనంగా చూపించడం ద్వారా పృధ్వి తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేసాడు. నబీల్ ను తిట్టడం, భయాందోళనను సృష్టించి అతన్ని మౌనంగా ఉంచడానికి, వెనక్కు తగ్గేలా చేయడానికి ప్రయత్నించాడు.
సోనియా, పృధ్వి ఇద్దరూ కలిసి నబీల్ ను అడ్డుకునేందుకు, ఎమోషనల్ గా వీక్ చేసేందుకు ప్రయత్నించారు. ఇతరులపై పైచేయి సాధించడానికి అగ్రెషన్ ను ఉపయోగించడం కూడా ఒక టెక్నిక్. Public shaming కు ఇదో ఉదాహరణ.
కానీ నబీల్ ఈ మేనిప్యులేషన్ కు, షేమింగ్ కు తలొగ్గకుండా, సోనియాలోని ఎమోషన్ మేనిప్యులేషన్ ను ఎత్తి చూపేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు నిఖిల్, పృధ్విలను వేరే కోణంలో చూస్తోందని సోనియా మాట్లాడింది. తనకు లేని ఆలోచనలకు యష్మిని బాధ్యురాలిగా చేసి బాధపడేలా చేయడం Gaslighting కు ఇదో ఉదాహరణ. ఇలాంటి మాటల వల్ల యష్మి కుంగిపోయి ఏడ్చేసింది. సోనియా లక్ష్యం నెరవేరింది.
ముగ్గురు వర్సెస్ హౌస్...
కాంతార క్లాన్ కు ఎవరు చీఫ్ కావాలనే విషయంలో బిగ్ బాస్ ఒక పోటీ నిర్వహించాడు. అందులో భాగంగా సుత్తి ఎవరికి ఇవ్వాలనే విషయంలో సోనియా, నిఖిల్, పృథ్వి మాట్లాడుకుంటే, సోనియాను ఒంటరి చేయడానికి విష్ణుప్రియ, సీత, నయనిక ప్లాన్ చేశారు. చివరకు శక్తి క్లాన్ కు చెందిన సీత కాంతార గ్రూప్ చీఫ్ గా ఎంపికైంది.
ఆ తర్వాత ఏ క్లాన్ లో ఎవరు ఉండాలో నిర్ణయించుకోమన్నారు. సోనియా మేనిప్యులేషన్, నిఖిల్ ఆమెను సమర్థించడం నచ్చని శక్తి క్లాన్ లోని విష్ణుప్రియ, నయనిక కాంతార క్లాన్ లోని వెళ్లారు. కానీ కాంతార క్లాన్ సభ్యులెవ్వరూ శక్తి క్లాన్ లోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మణికంఠ, యష్మి వెళ్లాల్సి వచ్చింది. కానీ, గోల్డెన్ బ్రాస్లెట్ తీసుకుని మణికంఠ తిరిగి కాంతార క్లాన్ కు వచ్చేశాడు. ఆ ముగ్గురూ, మిగతా సభ్యులుగా హౌస్ విడిపోయింది.
ఎమోషనల్ మేనిప్యులేషన్ వల్ల ఒకరిద్దరిని కంట్రోల్ చేయగలరేమో కాని, అందరినీ కంట్రోల్ చేయలేరని ఈ వారం హౌస్ సభ్యుల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా అర్థం చేసుకోవచ్చు.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
www.psyvisesh.com