బిగ్ బాస్ ఈ వారం విశ్లేషణ
నిను వీడను నేను....అనే పాటలోని వాక్యం బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌కు సరిగ్గా సరిపోతుంది. ఏ సిరీస్ అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే...ఒక్కసారి బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళును జీవితకాలం బిగ్ బాస్ నీడలా వారి వెంట ఉంటాడు. అదెలాగంటారా..ప్రతి సీరిస్‌లో పాత వాళ్ళు వచ్చి పార్టిసిపెంట్స్ ను పలకరిస్తారు, వారి టాస్కులతో పులకరిస్తారు. ఇదే జరిగింది ఈ వారం బిగ్ బాస్‌లో. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ కోసం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు పాత సీజన్‌ల నుండి పార్టసిపెంట్సును తీసుకువచ్చి వారిచే టాస్కులు ఆడే ఏర్పాటు చేశాడు బిగ్ బాస్.
అలానే ఆ కంటెస్టెంట్లు టాస్కులతో పాటు కంటెస్టెంట్స్ మధ్య కాసింత గిల్లికజ్జాలు పెట్టి వెళ్ళారు. ఇదే ఈ వారం బిగ్ బాస్ ప్రేక్షకులకు పండుగ. అందరికీ తెలిసినట్టు హౌస్‌లో గ్రూపిజం బాగా కనపడుతుంది. ఒకటి మొదటి నుండి వున్న గ్రూప్ అయితే రెండోది వైల్డ్ కార్డ్ గ్రూప్. ఆ గ్రూపులు మధ్య ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ ఫైట్లు. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ ఫైనల్ టాస్కు ముందు ఈ గ్రూపుల మధ్య ఓ పెద్ద తగాదానే నడిచింది. ఆ తగాదా తినే దోశ కోసం ఎగ పడ్డారు. ఎపిసోడ్‌లో ఈ దోశ పంచాయితీ కనీసం పది నిమిషాల చూపించి ప్రేక్షకుల ఆరాటాన్ని బాగానే క్యాష్ చేసుకున్నాడు బిగ్ బాస్.
టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ కోసం పెట్టిన టాస్కులలో విజేతగా నిలిచాడు అవినాష్. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా టేస్టీ తేజ , పృథ్వి ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లోపల, బయట చూసే ప్రేక్షకులు బిగ్ బాస్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో కాని సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్, గ్రూప్స్ ఆ పై సోషల్ యూజర్స్ మధ్య బిగ్ బాస్ గురించి కొట్లాట... ఇన్ని జరుగుతున్నాయి. అందుకే బిగ్ బాస్ అంటే ఫ్లవర్ కాదు బిగ్ బాస్ చేస్తున్నవాళ్ళకి, చూస్తున్నవాళ్ళకి వాళ్ళ మధ్య మంట పెట్టే ఫైరు. కాబట్టే బిగ్ బాస్ తగ్గేదేలే....
-ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment