Prudvi Raj
-
'బిగ్ బాస్ అంటే ప్రేక్షకులకు ఫ్లవరు.. పార్టిసిపెంట్స్‌కు ఫైరు'
నిను వీడను నేను....అనే పాటలోని వాక్యం బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌కు సరిగ్గా సరిపోతుంది. ఏ సిరీస్ అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే...ఒక్కసారి బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళును జీవితకాలం బిగ్ బాస్ నీడలా వారి వెంట ఉంటాడు. అదెలాగంటారా..ప్రతి సీరిస్‌లో పాత వాళ్ళు వచ్చి పార్టిసిపెంట్స్ ను పలకరిస్తారు, వారి టాస్కులతో పులకరిస్తారు. ఇదే జరిగింది ఈ వారం బిగ్ బాస్‌లో. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ కోసం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు పాత సీజన్ల నుండి పార్టసిపెంట్సును తీసుకువచ్చి వారిచే టాస్కులు ఆడే ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. అలానే ఆ కంటెస్టెంట్లు టాస్కులతో పాటు కంటెస్టెంట్స్ మధ్య కాసింత గిల్లికజ్జాలు పెట్టి వెళ్ళారు. ఇదే ఈ వారం బిగ్ బాస్ ప్రేక్షకులకు పండుగ. అందరికీ తెలిసినట్టు హౌస్‌లో గ్రూపిజం బాగా కనపడుతుంది. ఒకటి మొదటి నుండి వున్న గ్రూప్ అయితే రెండోది వైల్డ్ కార్డ్ గ్రూప్. ఆ గ్రూపులు మధ్య ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ ఫైట్లు. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ ఫైనల్ టాస్కు ముందు ఈ గ్రూపుల మధ్య ఓ పెద్ద తగాదానే నడిచింది. ఆ తగాదా తినే దోశ కోసం ఎగ పడ్డారు. ఎపిసోడ్లో ఈ దోశ పంచాయితీ కనీసం పది నిమిషాల చూపించి ప్రేక్షకుల ఆరాటాన్ని బాగానే క్యాష్ చేసుకున్నాడు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ కోసం పెట్టిన టాస్కులలో విజేతగా నిలిచాడు అవినాష్. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా టేస్టీ తేజ , పృథ్వి ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లోపల, బయట చూసే ప్రేక్షకులు బిగ్ బాస్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో కాని సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్, గ్రూప్స్ ఆ పై సోషల్ యూజర్స్ మధ్య బిగ్ బాస్ గురించి కొట్లాట... ఇన్ని జరుగుతున్నాయి. అందుకే బిగ్ బాస్ అంటే ఫ్లవర్ కాదు బిగ్ బాస్ చేస్తున్నవాళ్ళకి, చూస్తున్నవాళ్ళకి వాళ్ళ మధ్య మంట పెట్టే ఫైరు. కాబట్టే బిగ్ బాస్ తగ్గేదేలే....-ఇంటూరు హరికృష్ణ -
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
జహీరాబాద్: అమెరికాలోని చోర్లెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్ కారులో ఉండిపోయిన సెల్‌ఫోన్ కోసం వెళుతూ.. మళ్లీ రోడ్డు దాటుతున్న క్రమంలో అదే సమయంలో వేగంగా వచి్చన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పృథ్వీ మృతదేహం శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు. -
సెల్ఫీ వీడియో: ఆసుపత్రిలో పృథ్వీరాజ్
-
అన్నయ్య పక్కన ఆ డైలాగ్ చాలు: పృధ్వీరాజ్
‘సైరా’ చిత్రంలో మాధవయ్యర్ క్యారెక్టర్ చేయడం తన పూర్వజన్మ సుకృతం భావిస్తున్నానని, సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీరాజ్ తెలిపారు. తన సినీ జీవితంలో ఈ క్యారెక్టర్ ఒక్కటి చాలని, ఇంకా సినిమాలు చేయకపోయినా పరవాలేదని ఆయన ఉద్వేగంగా అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పృధ్వీరాజ్ మాట్లాడుతూ.... సినిమా ఇంటర్వెల్ బ్లాక్‌లో ‘అన్నయ్య’ గొప్పదనం గురించి చెప్పేటప్పుడు మాధవయ్యార్ సునామీలా విరుచుకుపడతాడు. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు అన్నయ్యకు జీవితాంతం రుణపడి ఉంటా. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేను. ఈ సినిమాలో నాది మాధవయ్యర్ పాత్ర. నేను ఢిల్లీ నుంచి వచ్చి అన్నయ్యను కలిసినప్పుడు నాతో అన్నారు... ఈ క్యారెక్టర్ ఎవరికి రాసుంటే వాడే చేస్తాడురా.. డూ ఇట్..డూ యువర్ బెస్ట్ అని అన్నారు. ఆ అవకాశం నన్ను వరించింది. ఆ ఒక్క మాట చాలు నాకు ‘ఐ ఫీల్ దిస్ ఇజ్ ఆస్కార్ అవార్డు ఫర్ మీ. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ మెగాస్టార్’ . అన్నయ్య పక్కన పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఇంతకన్నా నాకు ఏం కావాలి. ఈ చిత్రం మెగా అభిమానులకు ఫుల్ జోష్. సినిమా అన్ని భాషల్లో సూపర్, డూపర్ హిట్ అవుతుంది. రికార్డులు బద్దలు కొట్టడానికి కొణెదల సింహం వస్తున్నాడు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి, పరుచూరి బ్రదర్స్‌కు నా కృతజ్ఞతలు’ అని తెలిపారు. ఈ వేడుకకు హాజరైన దర్శకుడు కొరటాల శివ...తనకు ఓ క్యారెక్టర్ ఇవ్వాల్సిందేనంటూ పృధ్వీరాజ్ కోరారు. -
సీఎం జగన్‌ను కలిసిన పృధ్వీరాజ్
సాక్షి, అమరావతి: ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృధ్వీరాజ్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాయలంలో ముఖ్యమంత్రిని కలిసి తనను చైర్మన్‌గా నియమించడం పట్ల కృతఙ్ఞతలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎస్వీబీసీ చానల్ ను ప్రారంభించి భక్తులకు అనేక సేవలు అందించే అవకాశం కల్పించారన్నారు. ఇప్పుడు ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఎస్వీబీసీని మరింతగా భక్తులకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని పృధ్వీరాజ్ తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ధనలక్ష్మి, మేరుగ నాగార్జున, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రితో సమావేశమైన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీ తమ నియోజకవర్గ పరిధిలోని అనేక సమస్యలను జగన్ దృష్టికి తెచ్చారని సమాచారం. -
సీక్వెల్ ప్లస్ ప్రీక్వెల్
సమ్మర్ మలయాళ బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’ ఒకటి. హీరో పృథ్వీరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వంద కోట్లు వసూలు సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సెకండ్ పార్ట్ రాబోతోందని చిత్రబృందం ప్రకటించింది. ‘ఎంపురాన్’ టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రంలోనూ మోహన్‌లాలే హీరోగా కనిపిస్తారు. సెకండ్ పార్ట్ గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ పార్ట్‌కు కొనసాగింపుగా ఈ కథ జరగదు. ‘లూసిఫర్’ ముందు ఏం జరిగింది? తర్వాత ఏం జరగబోతోంది? అనే అంశాలతో ఈ చిత్రం ప్లాన్ చేశాం. ‘లూసిఫర్’ చేస్తున్నప్పుడే ఈ సినిమాను ఓ ఫ్రాంచైజీలా రూపొందించాలని ప్లాన్ చేశాం’’ అన్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
జగన్ విజయం ప్రజా విజయం
హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయం ప్రజా విజయమని నటుడు, వైఎస్సార్సీపీ నేత పృథ్వీరాజ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మరో సినీ నటుడు కృష్ణుడు తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏడాదిన్నర క్రితమే జగన్‌కు ఓటేయాలని నిర్ణయించుకున్నారని, ఆయన అయితేనే సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని భావించారని తెలిపారు. పాదయాత్ర మొదలైన రోజే వైఎస్ జగన్ విజయం ఖాయమయ్యిందన్నారు. ఆయన ఘన విజయంలో సముద్రంలో ఇసుక రేణువులా తన పాత్ర కూడా ఉండడం సంతోషమన్నారు. జగన్ మంచి ముఖ్యమంత్రిగా తప్పక పేరు తెచ్చుకుంటారన్నారు. -
‘120 స్థానాల్లో గెలుపు ఖాయం’
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వామి వారిని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 120 స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రజల మద్దతు ఆయనకే ఉందని, జాతీయ స్థాయిలో సర్వేలన్ని వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. అమరావతి కోటపై వైఎస్సార్సీపీ జెండా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృద్వీరాజ్ మొదటిసారిగా అలిపిరి నుంచి కాలినడక మార్గంలో వెళ్లారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తానని ఆయన తెలిపారు. ఏపీ ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. మే 23న అమరావతి కోటపై వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. మహర్షి సినిమా దర్శక, నిర్మాతలు పైడిపల్లి వంశీ, దిల్‌రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి విజయంతో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. -
పవన్ కల్యాణ్‌పై సినీనటుడు పృధ్వీరాజ్ ఫైర్
సాక్షి, భీమవరం: రాజకీయాలు, సినిమాలు వేరనే విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ గుర్తించకపోవడం అవివేకమని సినీనటుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫృధ్వీరాజ్ ఎద్దేవా చేశారు. ప్రచార సభల్లో పవన్‌కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. తొక్కతీస్తా, తాట తీస్తానంటే జనం సహించరని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజుతో కలసి ఆదివారం ఆయన భీమవరంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కల్యాణ్.. అన్నివిధాలుగా దోచుకుని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన టీడీపీని ప్రశ్నించకుండా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడం వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గ్రహించారన్నారు. కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ సినీ రంగంలో పవర్‌స్టార్‌గా పేరొందిన పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్‌గా మారి టీడీపీతో చేసుకున్న ప్యాకేజీ ఒప్పందాలను ప్రజలు, పవన్ అభిమానులు కూడా గ్రహించారన్నారు. పవన్ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీకి ఓట్లు వేయాలని ఎక్కడా అడగడంలేదని, జగన్‌కు ఓట్లు వేయవద్దని మాత్రమే ప్రచారం చేయడం వెనుక టీడీపీతో లాలూచీ వ్యవహారం బయటపడుతోందన్నారు. విలేకర్ల సమావేశంలో సినీనటుడు జోగినాయుడు, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, వైసీపీ నేత గుబ్బల తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
మీ ఓటు ఉందా.. ఒకసారి సరి చూసుకోండి
-
మేము వైఎస్ఆర్సీపీ సోల్జర్స్.. పార్టీ విజయం కోసం కృషిచేస్తాం
-
‘సుహాసినిని బలిపశువుని చేశారు’
-
నేడు స్వస్థలానికి పృథ్వీరాజ్ భౌతికకాయం
అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో గల సిన్సినాటి నగరంలో ఈ నెల ఆరో తేదీన ఉన్మాది జరిపిన కాల్పుల్లో తెనాలికి చెందిన కందేపి పృథ్వీరాజ్(26) ప్రాణాలు కోల్పోయాడు. అతని భౌతిక కాయం మంగళవారం రాత్రికి స్వస్థలానికి చేరుకోనుంది. అమెరికా నుంచి కార్గో విమానంలో తీసుకొస్తున్న పృథ్వీరాజ్ భౌతికకాయం తొలుత ముంబయ్ విమానాశ్రయానికి చేరుతుంది. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తరలిస్తారు. శంషాబాద్ నుంచి అంబులెన్స్‌లో స్వస్థలౖమెన తెనాలికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుజరుగుతున్నాయి. గుంటూరు, తెనాలిరూరల్: అయెరికాలోని ఓహియో రాష్ట్రంలోని సిన్సీనాటి నగరంలో ఈ నెల 6న దుండగుడు కాల్పుల్లో మృతి చెందిన తెనాలి కందేపి పృథ్వీరాజ్(26) మృతదేహం మంగళవారం రాత్రికి స్వస్థలానికి చేరుకోనుంది. అమెరికా నుంచి కార్గో విమానంలో భౌతిక కాయం సోమవారం బయలుదేరింది. మంగళవారం ముంబయ్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి రాత్రి తొమ్మది గంటల ప్రాంతంలో శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి తెనాలికి అంబులెన్సులో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున తెనాలి చెంచుపేటలోని ఇంటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. చదువులో రాణించే పృథ్వీరాజ్ తాను చదివిన తమిళనాడులోని బిట్ విద్యా సంస్థకు చెందిన మరో ఐదుగురు స్నేహితులతో కలసి ఉన్నత చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని వారు వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలలో స్థిరపడ్డారు. పృధ్వీరాజ్ ఫిఫ్త్ థర్డ్ బ్యాంక్‌లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు. అజయ్ మల్లిన, యశ్వంత్ ఎద్దులపల్లి, వెంకట్ పూళ్ల తదితర ఆరుగురు మిత్రుల బృందంలో పృధ్వీరాజ్ చురుకుగా ఉండేవాడని తెలుస్తోంది. దారుణ ఘటన అనంతరం సిన్సినాటిలో పంచనామా, ఇతర వ్యవహారాలు పూర్తి చేసి, మృతదేహాన్ని న్యూజెర్సీ తరలించారు. అక్కడి నుంచి స్వదేశానికి బయలుదేరింది. -
సరదా సంక్రాంతి
-
76 సినిమాల్లో నటించా
భీమవరం : తాను ఇప్పటివరకు 76 సినిమాల్లో నటించానని నటుడు పృధ్వీరాజ్ అన్నారు. భీమవరంలో ప్రభు డాన్స్ స్కూల్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం గబ్బర్‌సింగ్-2, ఆగడు, రభస చిత్రాల్లో నటిస్తున్నా. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. కొత్త దర్శకులు బాగానే వస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాకు మంచి పేరు వచ్చింది. కళాకారులకు నిరాశ ఉండదు.. ఎంత కష్టపడితే అంత గుర్తించి వస్తుంది. భీమవరం బుల్లోడు సినిమాలో నా క్యారెక్టర్ హీరో సునీల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆప్తులు శ్రీహరి, ఏవీఎస్, ధర్మవరపును కోల్పోవడం బాధగా ఉంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయం. మహానేత వైఎస్‌పై అభిమానంతో వైసీపీలో చేరా. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ల్లో పార్టీ ప్రచార బాధ్యతలు తీసుకున్నా. నాకెలాంటి పదవులు వద్దు. పార్టీ విజయానికి శాయశక్తులా కృషిచేస్తా.’ అన్నారు. వైసీపీ నాయకులు రేవూరి గోగురాజు, పేరిచర్ల సత్యనారాయణరాజు, గుంటి ప్రభు ఆయన వెంట ఉన్నారు.