76 సినిమాల్లో నటించా | i acted in 76 movies, says Prudvi Raj | Sakshi
Sakshi News home page

76 సినిమాల్లో నటించా

Dec 23 2013 2:33 PM | Updated on Sep 2 2017 1:53 AM

76 సినిమాల్లో నటించా

76 సినిమాల్లో నటించా

తాను ఇప్పటివరకు 76 సినిమాల్లో నటించానని నటుడు పృధ్వీరాజ్ అన్నారు. భీమవరంలో ప్రభు డాన్స్ స్కూల్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం గబ్బర్‌సింగ్-2, ఆగడు, రభస చిత్రాల్లో నటిస్తున్నా.

 భీమవరం : తాను ఇప్పటివరకు 76 సినిమాల్లో నటించానని నటుడు పృధ్వీరాజ్ అన్నారు. భీమవరంలో ప్రభు డాన్స్ స్కూల్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం గబ్బర్‌సింగ్-2, ఆగడు, రభస చిత్రాల్లో నటిస్తున్నా. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో  అందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. కొత్త దర్శకులు బాగానే వస్తున్నారు.
 
 క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాకు మంచి పేరు వచ్చింది. కళాకారులకు నిరాశ ఉండదు.. ఎంత కష్టపడితే అంత గుర్తించి వస్తుంది. భీమవరం బుల్లోడు సినిమాలో నా క్యారెక్టర్ హీరో సునీల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆప్తులు శ్రీహరి, ఏవీఎస్, ధర్మవరపును కోల్పోవడం బాధగా ఉంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయం.
 
 మహానేత వైఎస్‌పై అభిమానంతో వైసీపీలో చేరా. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ల్లో పార్టీ ప్రచార బాధ్యతలు తీసుకున్నా. నాకెలాంటి పదవులు వద్దు. పార్టీ విజయానికి శాయశక్తులా కృషిచేస్తా.’ అన్నారు. వైసీపీ నాయకులు రేవూరి గోగురాజు, పేరిచర్ల సత్యనారాయణరాజు, గుంటి ప్రభు ఆయన వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement