సీక్వెల్‌ ప్లస్‌ ప్రీక్వెల్‌ | Mohanlal-Prithviraj Lucifer 2 is titled Empuraan | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌ ప్లస్‌ ప్రీక్వెల్‌

Published Thu, Jun 20 2019 12:07 AM | Last Updated on Thu, Jun 20 2019 12:07 AM

Mohanlal-Prithviraj Lucifer 2 is titled Empuraan - Sakshi

మోహన్‌లాల్‌

సమ్మర్‌ మలయాళ బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌లో మోహన్‌లాల్‌ నటించిన ‘లూసిఫర్‌’ ఒకటి. హీరో పృథ్వీరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వంద కోట్లు వసూలు సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సెకండ్‌ పార్ట్‌ రాబోతోందని చిత్రబృందం ప్రకటించింది. ‘ఎంపురాన్‌’ టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రంలోనూ మోహన్‌లాలే హీరోగా కనిపిస్తారు. సెకండ్‌ పార్ట్‌ గురించి పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్‌ పార్ట్‌కు కొనసాగింపుగా ఈ కథ జరగదు. ‘లూసిఫర్‌’ ముందు ఏం జరిగింది? తర్వాత ఏం జరగబోతోంది? అనే అంశాలతో ఈ చిత్రం ప్లాన్‌ చేశాం.  ‘లూసిఫర్‌’ చేస్తున్నప్పుడే ఈ సినిమాను ఓ ఫ్రాంచైజీలా రూపొందించాలని ప్లాన్‌ చేశాం’’ అన్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement