Second part
-
సీక్వెల్‌కు రెడీ అయిన హిట్ సినిమాలివే!
ఒక కథ హిట్టయితే... ఆ కథని కంటిన్యూ చేస్తే బాగుంటుందని ఆ కథలోని హీరో, ఆ కథని తెరకెక్కించిన దర్శకుడు, తీసిన నిర్మాత, చూసే ప్రేక్షకులు అనుకోవడం సహజం. కానీ ఆ కథను కొనసాగించడానికి స్కోప్ ఉంటేనే ఇంకో కథ రెడీ అవుతుంది. అలా కొనసాగింపుకి ఆస్కారం ఉన్న కొన్ని కథలు రెడీ అయ్యాయి. ఇలా తమిళంలో పదికి పైగా రానున్న చిత్రాల రెండో భాగం విశేషాలు తెలుసుకుందాం. సేనాపతి తిరిగొస్తున్నాడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’ – 1996) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఎప్పట్నుంచో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్న శంకర్ 2017లో ‘ఇండియన్ 2’ని ప్రకటించారు. షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదం, నిర్మాణపరంగా నెలకొన్న సమస్యలను అధిగమించుకుని, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లైకా ప్రోడక్షన్తో కలిసి ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1920 నేపథ్యంలో సాగే ‘ఇండియన్ 2’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ పోస్టర్ మూడు సీక్వెల్స్‌లో ధనుష్ పుష్కరకాలం క్రితం విడుదలైన ‘ఆయిరత్తిల్ ఒరువన్ (‘యుగానికి ఒక్కడు’ – 2010) సంచలన విజయం సాధించింది. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా, పార్తిబన్ లీడ్ రోల్స్ చేయగా, సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ను ప్రకటించి, హీరోగా తన తమ్ముడు ధనుష్ నటిస్తారని, 2024లో ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నామని తెలిపారు సెల్వ రాఘవన్. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కాలేదు. అలాగే హీరో ధనుష్–దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన ‘అసురన్’, ‘వడ చెన్నై’ చిత్రాలకు వీరి కాంబినేషన్లోనే సీక్వెల్స్‌కి ప్లాన్ జరుగుతోందని సమాచారం. రెండు సీక్వెల్స్‌లో కార్తీ ‘ఖైదీ’ (2019)గా కార్తీ సూపర్ హిట్టయ్యారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనుకుంటున్నారు. మరోవైపు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ కూడా హిట్ ఫిల్మ్. ‘సర్దార్ 2’ కూడా దాదాపు ఖరారైంది. కార్తీ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి కాగానే ‘సర్దార్ 2’ మొదలవుతుంది. ఈలోపు రజనీకాంత్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రాన్ని పూర్తి చేసి, ‘ఖైదీ 2’ సీక్వెల్ కథ రెడీ చేస్తారట లోకేశ్. అలాగే భవిష్యత్‌లో ‘జైలర్ 2’, కమల్‌హాసన్‌తో ‘విక్రమ్ 2’, ‘బీస్ట్ 2’ చిత్రాలను తెరకెక్కించే ఆలోచన కూడా లోకేశ్ కనగరాజ్‌కి ఉందట. ‘తుప్పరివాలన్’లో విశాల్ మళ్లీ డిటెక్టివ్.. విశాల్ కెరీర్లో ఉన్న ఓ డిఫరెంట్ హిట్ ఫిల్మ్ ‘తుప్పరివాలన్’ (‘డిటెక్టివ్’ – 2017). మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్ సాధించింది. ఆ తర్వాత విశాల్, మిస్కిన్‌ల కాంబినేషన్లోనే ‘డిటెక్టివ్’కు సీక్వెల్‌గా ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు. నిజానికి ‘డిటెక్టివ్ 2’ ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ ఈ సీక్వెల్ స్క్రిప్ట్, బడ్జెట్ విషయాల్లో విశాల్‌కు, మిస్కిన్కు భేదాభిప్రాయాలు తలెత్తడంతో ‘డిటెక్టివ్ 2’ షూటింగ్ నిలిచిపోయింది. ‘డిటెక్టివ్ 2’కు తానే దర్శకత్వం వహించి, నటిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు విశాల్. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా విదేశాల్లో జరగనుంది. ‘తని ఒరువన్’లో నయనతార, ‘జయం’ రవి ఎనిమిదేళ్ల తర్వాత... ‘జయం’ రవి కెరీర్లో ‘తని ఒరువన్’ (ఈ సినిమా తెలుగు రీమేక్ ‘«ధృవ’లో రామ్‌చరణ్ హీరోగా నటించారు) బ్లాక్‌బస్టర్. ‘జయం’ రవి అన్నయ్య, దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు మోహన్ రాజా. ఫైనల్‌గా ‘తని ఒరువన్’ విడుదలై, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 28న సీక్వెల్‌ను ప్రకటించారు. తొలి భాగంలో నటించిన ‘జయం’రవి, నయనతారలే మలి భాగంలోనూ నటిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ‘మాయవన్’లో సందీప్ కిషన్ మరో మాయవన్ ఐదేళ్ల క్రితం సందీప్ కిషన్ హీరోగా సీవీ కుమార్ దర్శకత్వంలో ‘మాయవన్’ అనే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ‘మాయవన్’కు సీక్వెల్‌గా ‘మాయవన్ 2’ తీస్తున్నారు మేకర్స్. సందీప్ కిషన్, సీవీ కుమార్ కాంబినేషన్లోనే ఈ చిత్రం రూపొందుతోంది. ‘సార్పట్ట’లో ఆర్య పరంపర కొనసాగుతోంది టెడ్డీ, సార్పట్ట పరంపర.. ఆర్య కెరీర్లో ఈ రెండూ సూపర్‌హిట్ సినిమాలే. అయితే ఈ రెండు చిత్రాలూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల సీక్వెల్స్‌ను మాత్రం వెండితెరపైనే చూపించనున్నారు. ‘సార్పట్ట పరంపర’కు దర్శకత్వం వహించిన పా. రంజిత్‌తోనే ఇటీవల ‘సార్పట్ట పరంపర 2’ను ప్రకటించారు ఆర్య. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇక దర్శకుడు శక్తి సౌందర్ రాజన్తోనే ‘టెడ్డీ’ సినిమా సీక్వెల్‌ను ఆర్య ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ‘7/జి...’లో రవికృష్ణ బృందావన కాలనీ ప్రేమ దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘7/జి బృందావన కాలనీ’ (2004) యూత్‌ని బాగా ఆకట్టుకున్న విషాద ప్రేమకథ. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్. కాగా, ‘7/జి బృందావన కాలనీ’కి సీక్వెల్ ప్లాన్ చేశారు సెల్వ రాఘవన్. తొలి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణ మలి భాగంలోనూ నటిస్తారు. కథానాయిక పాత్ర కోసం ఇవానా, దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ పేర్లను పరిశీలిస్తున్నారట. తొలి భాగాన్ని నిర్మించిన ఏఎమ్ రత్నం సీక్వెల్‌ని కూడా నిర్మించనున్నారు. జిగర్తాండ 2 కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2014లో విడుదలైన సినిమాల్లో హిట్‌గా నిలిచినవాటిలో ‘జిగర్తాండ’ ఒకటి. సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తెరకెక్కింది. రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది. జెంటిల్‌మేన్ మారారు దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘జెంటిల్‌మేన్’ (1993). యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ చిత్ర నిర్మాత కేటీ కుంజుమోన్ ఇటీవల ‘జెంటిల్ మేన్ 2’ని ్రపారంభించారు. అయితే ఈ సీక్వెల్‌కి దర్శకుడు, హీరో మారారు. ఏ. గోకుల్ కృష్ణ దర్శకత్వంలో చేతన్ శ్రీను హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీత దర్శకుడు.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్ నిధి హీరోగా రూపొందిన ‘డిమాంటీ కాలనీ’కి సీక్వెల్ వీరి కాంబినేషన్లోనే రానుంది. ఇంకా సీక్వెల్ లిస్ట్‌లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
Devara: ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నారా?
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్థుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి నాలుగు భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. రీసెంట్గా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేక సెట్లో రెండు వారాల పాటు దేవర షూటింగ్ జరిగింది. (ఇదీ చదవండి: Salar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రికార్డ్స్ అన్నీ బద్దలే) ఇందులో భాగంగా ఓ కీలక వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను మేకర్స్ చిత్రీకరించినట్లు సమాచారం. దీనికి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ డైరెక్షన్లో ఎన్టీఆర్ అదరగొట్టాడని తెలుస్తోంది. రేపటి నుంచి (జులై 3) మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందు కోసం దేబాయ్ వెకేషన్లో ఉన్న ఎన్టీఆర్ రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మృగాల వేట మామూలుగా ఉండదని కొరటాల ముందే చెప్పాడు. బిగ్ ఎమోషనల్ పాన్ ఇండియా చిత్రంగా దేవరను కొరటాల తెరకెక్కిస్తున్నాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్లపై పాయల్ రాజ్‌పూత్ సెన్సేషనల్ కామెంట్స్) ఈ నేపథ్యంలో దేవరకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాను రెండు పార్టులుగా తీయనున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్ డ్యూయెల్ పాత్రలో మెప్పించనున్నారని, అందు కోసం తండ్రి క్యారెక్టర్ సరసన సాయిపల్లవిని తీసుకున్నారని కూడా వైరల్ అవుతుంది. రెండు పార్టులుగా తీసేందుకే కథను రెడీ చేశారట కొరటాల.. అందుకే ఎక్కువ సమయం తీసుకున్నట్లు తన సన్నిహితులతో చెప్పారట. దేవర రెండు భాగాలుగా వస్తే యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు జాతరేనని చెప్పవచ్చు. ఇది పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సమయం వరకు ఉంటే కానీ రెండో పార్ట్ గురించి రివీల్ అవుతుంది. -
రాజమౌళి ఆ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు: మణిరత్నం
‘‘నేను ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. రాజమౌళికి థ్యాంక్స్. ఎందుకంటే ‘బాహుబలి’ రెండు భాగాలుగా రాకపోయిఉంటే ‘పొన్నియిన్ సెల్వన్’(పీఎస్)తెరకెక్కేది కాదు. ఈ విషయాన్ని రాజమౌళితో కూడా చెప్పాను.‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాలుగా తీసే దారిని తను చూపించాడు. చారిత్రాత్మక సినిమాలను తీసే ఆత్మవిశ్వాసాన్ని సినిమా ఇండస్ట్రీకి రాజమౌళి ఇచ్చా రు. భారదేశ చరిత్ర ఆధారంగా చాలామంది ఇప్పుడు సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ మణిరత్నం. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మీ ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. సుభాస్కరన్, మణిరత్నం నిర్మించిన ఈ చిత్రంలోని రెండో భాగం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఈ నెల 28న రిలీజ్ కానుంది. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ– ‘‘పొన్నియిన్ సెల్వన్’ తీయడానికి కారణమైన సుభాస్కరన్, వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరంజీవి, తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తున్న ‘దిల్’రాజుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా గురువు మణిరత్నంతో మరో అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వచ్చినందుకు టీమ్‌కు శుభాకాంక్షలు’’ అన్నారు విక్రమ్. ‘‘ఒకేసారి రెండు విభాగాలు చిత్రీకరించి, తొలి భాగం రిలీజ్ చేసిన ఆరు నెలల తర్వాత రెండో భాగాన్ని రిలీజ్ చేస్తానన్న గుండె ధైర్యం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎవరూ రెండు విభాగాలను ఒకేసారి చిత్రీకరించలేదు. మణిరత్నంగారి ధైర్యానికి హ్యాట్సాఫ్’’ అన్నారు ‘జయం’ రవి. ‘‘భారతదేశ చరిత్ర తెలియాలని మణిరత్నంగారు ఈ సినిమా తీశారు’’అన్నారు కార్తీ. ‘‘పొన్నియిన్ సెల్వన్’ మ్యాజికల్ వరల్డ్’’ అన్నారు ఐశ్వర్యారాయ్. ‘‘హైదరాబాద్ నాకు రెండో ఇల్లు’’ అన్నారు త్రిష. ‘‘పొన్నియిన్ సెల్వన్ పార్టు 2’లో అద్భుతం చూడబోతున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ఈ కార్యక్రమంలో శోభిత, ఐశ్వర్యాలక్ష్మీ, ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, సుహాసినీ మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ హెడ్ తమిళ కుమరన్, లైకా డిప్యూటీ ౖచైర్మన్ ప్రేమ్ పాల్గొన్నారు. -
మరో రెండు భాగాలు
నవీన్ పోలిశెట్టి హీరోగా, శ్రుతి శర్మ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జె తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది జూన్‌లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఈ చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా పుట్టినరోజుని పురస్కరించుకొని ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ట్రయాలజీగా వస్తుందని ప్రకటించారు. అంటే ఈ చిత్రానికి మరో రెండు భాగాలు రానున్నాయన్న మాట. ఈ సందర్భంగా రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ–‘‘స్వరూప్ ఆర్ఎస్జె ప్రస్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. తను దర్శకత్వం వహిస్తోన్న రెండో సినిమా పూర్తవగానే ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ రెండో భాగం షూటింగ్ మొదలవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడిస్తాం. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమా హిందీ, తమిళ, మలయాళం రీమేక్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోయాయి. త్వరలో కన్నడ హక్కులు కూడా అమ్ముడు కానున్నాయి. మా చిత్రం జపాన్ భాషలో అనువాదం అవుతుండటం మరో విశేషం. సెప్టెంబర్ 11న అక్కడ విడుదలవుతోంది’’ అన్నారు. -
రాకీ భాయ్ ఈజ్ బ్యాక్
‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ సినిమా మాస్ ప్రేక్షకులకు విందు భోజనం అందించింది. రెండో పార్ట్‌కోసం ఈ సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ విడుదలైన మొదటి వార్షికోత్సవానికి సెకండ్ పార్ట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కైకాల సత్యనారాయణ సమర్పణలో విజయ్ కిర గందూర్ నిర్మిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి కథానాయిక. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. యష్ చేసిన రాకీ భాయ్ పాత్రకు మంచి ఆదరణ లభించింది. ‘సామ్రాజ్యాన్ని సరికొత్తగా నిర్మిస్తూ’ అనే క్యాషన్‌తో విడుదలైన ఈ ఫస్ట్‌లుక్ ఆకట్టుకునేలా ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా విడుదల కానుంది. -
అధీర అడుగుపెట్టాడు
ఫస్ట్ పార్ట్‌లో రాకీ భాయ్ (యశ్) చాలా మంది విలన్లనే ఎదుర్కొన్నాడు. కానీ యుద్ధం ఇంకా అయిపోలేదు. పెద్ద పెద్ద విలన్లు ముందున్నారు. అందులో అధీర ముఖ్యుడు. ఇప్పుడు తనని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాడు రాకీ. గత ఏడాది వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ కథాంశం ఇది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 1970లలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చుట్టూ సాగే యాక్షన్ చిత్రం ‘కేజీఎఫ్’. ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో అధీర అనే విలన్ పాత్ర చేస్తున్నారు సంజయ్. బుధవారం ఈ సినిమా షూటింగ్లో సంజయ్ దత్ జాయిన్ అయ్యారు. హొంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. -
సీక్వెల్ ప్లస్ ప్రీక్వెల్
సమ్మర్ మలయాళ బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’ ఒకటి. హీరో పృథ్వీరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వంద కోట్లు వసూలు సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సెకండ్ పార్ట్ రాబోతోందని చిత్రబృందం ప్రకటించింది. ‘ఎంపురాన్’ టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రంలోనూ మోహన్‌లాలే హీరోగా కనిపిస్తారు. సెకండ్ పార్ట్ గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ పార్ట్‌కు కొనసాగింపుగా ఈ కథ జరగదు. ‘లూసిఫర్’ ముందు ఏం జరిగింది? తర్వాత ఏం జరగబోతోంది? అనే అంశాలతో ఈ చిత్రం ప్లాన్ చేశాం. ‘లూసిఫర్’ చేస్తున్నప్పుడే ఈ సినిమాను ఓ ఫ్రాంచైజీలా రూపొందించాలని ప్లాన్ చేశాం’’ అన్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మౌనం మారణాయుధంతో సమానం
ప్రముఖ దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘యన్.టి.ఆర్’. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ పేరుతో జనవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయ నేపథ్యంలో రూపొందిన ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ ఈ నెల 22న విడుదల కానుంది. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహ నిర్మాతలు. క్రిష్ దర్శకత్వం వహించారు. ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రం నిడివి 2 గంటల 8 నిమిషాలు. ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ‘‘నిశ్శబ్దాన్ని చేతకానితనం అనుకోవద్దు. మౌనం మరాణాయుధంతో సమానమని మర్చిపోకు’, ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికొచ్చాను’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్ సాగింది. కల్యాణ్ రామ్, రానా, విద్యాబలన్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త. -
కృష్ణతో మరోసారి..
తమిళసినిమా: దేశ వ్యాప్తంగా బుల్లితెర అభిమాన లోకాన్ని కట్టిపడేస్తున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షో తమిళ వెర్షన్లో పాల్గొని ఒక్కసారిగా భారీ స్టార్డమ్ సొంతం అందాల రాశి ఓవియా. ‘కలవాని’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అయినా అమ్మడు అనుకున్నంత స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ‘బిగ్ బాస్’ షోతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు తమ సినిమాలకు ఓవియాను బుక్ చేసుకోవాలని తహతహలాడుతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించే రీతిలో ఇది వరకే ఓవియా నటించిన ‘శీని’ చిత్రం టైటిల్ పేరు మార్చి తాజాగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇలయదళపతి విజయ్ కొత్త చిత్రంలో ఓవియాను నటింపచేయాలని దర్శకుడు మురుగదాస్ నిర్ణయించినట్టు ఇటీవల వార్తలు వెల్లడయ్యాయి. అదేవిధంగా ‘సిలుక్కువార్‌పట్టి సింగం’, ‘ఇరవుక్కు ఆయిరం కన్గల్’ చిత్రాల్లో నటించిన ఓవియాను ‘అరిమా నంబి’ చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ తన కొత్త చిత్రంలో నటింపచేయాలని నిర్ణయించారట. ఓవిమా అభిమానుల మనస్సులో చెరగని ముద్రలా నిలిచిపోయిందని, ఆమెను తన తర్వాత చిత్రంలో నటింపచేసే అవకాశం ఉందని ఆయన ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ స్థితిలో ఇది వరకే నటించిన ‘యామిరుక్క భయమేన్’ రెండో భాగంలో కూడా తిరిగి ఓవియా నటిస్తున్నారు. కృష్ణ హీరో నటిస్తున్న ఈ చిత్రంలో ఓవియాతో పాటు మరి కొందరు నటీమణులు నటించారు. అయితే ఈ రెండో భాగంలో ఓవియా మాత్రమే ముఖ్య భూమికను పోషిస్తున్నారట. -
సివలపేరిపాండి సీక్వెల్లో కమల్?
సివలపేరిపాండి చిత్రం రెండో భాగంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. తూంగావనం చిత్రం దీపావళికి విడుదలై మంచి విజయం అందుకుంది. ఆ విశ్వనటుడి తదుపరి చిత్రం ఏమిటన్న విషయం గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. తాజాగా సివలపేరిపాండి చిత్రానికి సీక్వెల్లో నటించడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. సివలపేరిపాండి చిత్రం గురించి చెప్పాలంటే 20 ఏళ్లు వెనక్క వెళ్లాలి. ఇది తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని సివలపేరి అనే ఊరిపై ఎనలేని ప్రేమ కలిగిన పాండి అనే వ్యక్తి ఇతివృత్తం అది. యథార్థ కథ ఆధారంగా రూపొందిన చిత్రం సివలపేరిపాండి. 1994లో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. నటుడు నెపోలియన్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ఇది. ప్రతాప్‌పోతన్ దర్శకుడు. ఆ చిత్రాన్ని నిర్మించిన పీజీ.శీకాంత్ ఇప్పుడు దానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కమలహాసన్ కథానాయకుడిగా నటించనున్నట్లు కోడంబాక్కమ్ టాక్. దీనికి గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు కమలహాసన్, గౌతమ్‌మీనన్ కాంబినేషన్లో వేట్టైయాడు విళైయాడు అనే సక్సెస్ఫుల్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇదే నిజం అయితే సుమారు దశాబ్దం తర్వాత మళ్లీ వీరి కలయికలో ఒక యాక్షన్ చిత్రం తెరకెక్కే అవకాశముందన్న మాట. హాస్యభరిత కథా చిత్రం కమలహాసన్ తదుపరి చిత్రం గురించి మరో ప్రచారం కూడా జరుగుతోం ది. తూంగావనం తర్వాత కమలహాసన్ పూర్తి వినోదభరిత కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారని, ఆ చిత్రానికి ఆయనే స్క్రీన్‌ప్లే రాస్తున్నారని, ఈ చిత్రాన్ని తన రాజకమల్ ఇంటర్నేషనల్ సంస్థలో నిర్మించనున్నార ని ప్రచారం జరుగుతోంది. తమిళం, తెలుగు, మలయాళం, హింది తదితర నాలుగు భాషలలో రూపొందించనున్న ఈ చిత్రానికి రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. జనవరిలో అమెరికాలోని న్యూ యార్క్ నగరం లో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోం ది. ఇది అవ్వైషణ్ముఖి, పంచతంత్రం చిత్రాల తరహాలో వినోదంతో కూడి న సమాజానికి కావాల్సిన మంచి సందేశంతో ఊడి ఉంటుం దని కోలీవుడ్ వ ర్గాల సమాచారం. కమల్ తదుపరి చిత్రం ఏమిటన్నది త్వరలోనే ఒక ప్రకటన అధికారపూర్వకంగా వెలువడే అవకాశం ఉందని తెలిసింది. -
రిలీజ్‌కాని ఆసినిమాకి అప్పుడే సీక్వెల్ ?