Jr NTR Devara Movie Latest Big Update Viral on Social Media - Sakshi
Sakshi News home page

Devara: ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఇవ్వనున్నారా?

Published Sun, Jul 2 2023 3:01 PM | Last Updated on Sun, Jul 2 2023 3:38 PM

NTR Devara Latest Big Update Viral - Sakshi

పాన్‌ ఇండియా హీరో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్థుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి నాలుగు భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. రీసెంట్‌గా శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేక సెట్లో రెండు వారాల పాటు దేవర షూటింగ్‌ జరిగింది.

(ఇదీ చదవండి: Salar: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రికార్డ్స్‌ అన్నీ బద్దలే)

ఇందులో భాగంగా ఓ కీలక వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను మేకర్స్‌ చిత్రీకరించినట్లు సమాచారం. దీనికి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ కెన్నీ బేట్స్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ అదరగొట్టాడని తెలుస్తోంది. రేపటి నుంచి (జులై 3) మరో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. అందు కోసం దేబాయ్‌ వెకేషన్‌లో ఉన్న ఎన్టీఆర్‌ రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మృగాల వేట మామూలుగా ఉండదని కొరటాల ముందే చెప్పాడు. బిగ్‌ ఎమోషనల్‌ పాన్‌ ఇండియా చిత్రంగా దేవరను కొరటాల తెరకెక్కిస్తున్నాడు.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌ డైరెక్టర్లపై పాయల్ రాజ్‌పూత్‌ సెన్సేషనల్ కామెంట్స్)

ఈ నేపథ్యంలో దేవరకు సంబంధించిన న్యూస్‌ ఒకటి వైరల్‌గా మారింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాను రెండు పార్టులుగా తీయనున్నారని రూమర్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్‌ డ్యూయెల్‌ పాత్రలో మెప్పించనున్నారని, అందు కోసం తండ్రి క్యారెక్టర్‌ సరసన సాయిపల్లవిని తీసుకున్నారని కూడా వైరల్‌ అవుతుంది. రెండు పార్టులుగా తీసేందుకే కథను రెడీ చేశారట కొరటాల.. అందుకే ఎక్కువ సమయం తీసుకున్నట్లు తన సన్నిహితులతో చెప్పారట. దేవర రెండు భాగాలుగా వస్తే యంగ్‌ టైగర్‌ ఫ్యాన్స్‌కు జాతరేనని చెప్పవచ్చు. ఇది పాన్‌ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సమయం వరకు ఉంటే కానీ రెండో పార్ట్‌ గురించి రివీల్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement