ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్‌లో రన్ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. అలాంటిది దేవర చిత్రం ఆరు కేంద్రాలలో వందరోజుల మార్క్‌ను అందుకుంది. పుష్ప2 వంటి భారీ హిట్ సినిమా ముందు కూడా దేవర ఈ రికార్డ్ సాధించడం అనేది సాధరణ విషయం కాదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ప్రదర్శన అనే మాటే వినిపించడమే లేదు. అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.
దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల పోస్టర్ పడింది. ఇప్పుడు ఆరు కేంద్రాలలో దేవర 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. నవంబర్ 15న దేవర 50 రోజుల వేడుకను సెలబ్రేట్ చేసుకున్న అభిమానులు ఇప్పుడు వందరోజుల పండగను సందడిగా జరుపుకుంటున్నారు.
ఆరు థియేటర్లలో 100 రోజులు
ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు థియేటర్స్ మలికిపురం ( పద్మజ ), మండపేట (రాజరత్న) ఉన్నాయి. చిలకలూరిపేటలోని (రామకృష్ణ), చిత్తూరు జిల్లాలోని బి. కొత్తకోట (ద్వారక), కల్లూరు (ఎమ్‌ఎన్‌ఆర్), రొంపిచర్ల (ఎమ్‌ఎమ్ డీలక్స్) వంటి థియేటర్లలో దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment