Janvi Kapoor
-
'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్
'పెద్ది' సినిమాతో దుమ్మురేపేందుకు రామ్‌చరణ్ రెడీ అయిపోయాడు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన రామ్‌చరణ్ ఫస్ట్ లుక్కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ షాట్ పేరుతో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. శ్రీరామ నవమి (ఏప్రిల్ 6) సందర్భంగా విడుదలైన తొలి షాట్ అదిరిపోయింది. ఫస్ట్ బాల్కే చరణ్ సిక్సర్ కొట్టేశాడని చెప్పవచ్చు. తన జట్టును గెలిపించేందుకు మాస్ లుక్‌లో బరిలోకి దిగాడు చరణ్. సినీ అభిమానులను మెప్పించేలా పెద్ది గ్లింప్స్ ఉంది. గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ ఈ సినిమా బయటపడేస్తుందని ఆయన ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. 2026 మార్చి 27న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్‌లో తెలిపారు.జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించగా కెమేరామెన్‌గా ఆర్. రత్నవేలు ఉన్నారు. గుర్తింపు కోసమే పెద్ది పోరాటం ఉంటుందని రామ్‌చరణ్ సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే. -
కోటు తొలగిస్తూ 'జాన్వీ కపూర్' ర్యాంప్ వాక్.. వీడియో వైరల్
లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన గ్లామర్ వాక్‌తో హీట్ పెంచింది. ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు నటి జాన్వీ షోస్టాపర్‌గా నిలిచింది. ఆయన డిజైన్ చేసిన దుస్తులను ఎందరో మోడల్స్ ధరించి పలు స్టేజీలపైనా ర్యాంప్ వాక్ చేశారు. ఇప్పుడు తొలిసారి జాన్వీ కూడా రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆకట్టుకుంది.జాన్వీ కపూర్ నల్లటి దుస్తుల్లో ర్యాంప్‌పై నడిచింది. పొడవాటి నల్లటి కోటు కింద అద్భుతమైన బంధానీ బాడీకాన్ డ్రెస్‌లో స్టేజీపై ఆమె అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె హీల్స్ కూడా ఎంచుకుంది. స్టేజీపై మధ్యలోనే జాన్వీ తన కోటు తీసేసి పోజులిచ్చింది. కొంతదూరం అలా తన ర్యాంప్ వాక్‌ను కొనసాగించింది. డ్రెస్ డిజైనర్ బ్రాండ్ (AFEW Rahul Mishra) కోసం జాన్వీ భాగమైంది. భవిష్యత్‌లో మరిన్ని కొత్త డిజైన్ డ్రెస్‌లతో ఆమె ఫోజులు ఇవ్వనుంది.ఆమె ఆకర్షణీయమైన దుస్తులు, డైనమిక్ స్టైల్‌తో పాటు అక్కడ వినిపించే సంగీతం అన్నీ ఒకదానికొకటి ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. జాన్వీ ర్యాంప్ వాక్‌పై చాలా వరకు ప్రశంసలే వచ్చాయి. కానీ, కొందరు మాత్రం ఆమెను తప్పుపట్టారు. వేదికపై నిజమైన మోడల్స్ ఎక్కడ ఉన్నారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వేదికలపై సెలబ్రిటీలకు ఇలా ప్రాధాన్యత ఇవ్వడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని చెబుతున్నారు. ఇలా అయితే కొత్త మోడల్స్ ఎలా పరిచయం అవుతారని నిర్వాహకులను తప్పపట్టారు. View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Bollywood Chronicle (@bollywoodchronicle) -
ట్రెండ్ అవుతున్న 'దేవర'.. ఎందుకో తెలుసా..?
బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన రాకతో 'దేవర' (#Devara) హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతుంది. అందుకు కారణం కూడా ఉంది. గత పదేళ్లుగా భారత్‌లో పలు సంగీత కార్యక్రమాలలో ఆయన ప్రదర్శనలు ఇచ్చారు. రీసెంట్గా చెన్నైలో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌తో కలిసి పాటలు పాడి ప్రేక్షకులలో జోష్ నింపారు. తాజాగా బెంగుళూరులో జరిగిన భారీ సంగీత కచేరీలో పాల్గొన్న ఎడ్ షీరన్ 'దేవర' సినిమా నుంచి ఒక సాంగ్ పాడారు. దీంతో ట్విటర్లో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ అభిమానులు ఆ క్లిప్‌ను వైరల్ చేస్తున్నారు.ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు 'గ్రామీ'. ఆ జాబితాలో తమ పేరు ఉండటమే అత్యున్నత గౌరవంగా చాలామంది భావిస్తారు. అలాంటిది ఎడ్ షీరన్ ఏకంగా నాలుగు 'గ్రామీ' అవార్డులు దక్కించుకున్నారు. అందుకే ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు ఉన్నారు. బెంగుళూరులో ఆయన తొలి ప్రదర్శన కావడంతో టికెట్ల కోసం సంగీత ప్రియులు భారీగా పోటీ పడ్డారు. స్టేజీపైన 'దేవర' తెలుగు పాటను వినిపించి కన్నడ వారిలో జోష్ నింపారు. 'దేవర' మూవీ నుంచి యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించిన ‘చుట్టమల్లే..’ తెలుగు వర్షన్ సాంగ్‌ను ఎడ్ షీరన్ పాడారు. ప్రముఖ సింగర్ శిల్పారావుతో ఆయన గాత్రం కలిపారు. దేవరలో ఈ పాటను అన్ని భాషల్లో శిల్పారావు ఆలపించడం విశేషం. దీంతో ఒక్కసారిగా కన్నడ అభిమానులు కేరింతలు వేశారు. వారి చూపిన ఆదరణపై ఎడ్ షీరన్ ఆశ్చర్యపోయారు. మరోసారి బెంగుళూరుకు వస్తానని మాట ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఎడ్ షీరన్ ఆదివారం ఉదయం సడెన్‌గా బెంగళూరులో ఎంట్రీ ఇచ్చారు. ఎలాంటి ప్రకటన లేకుండా ఫుట్‌పాత్‌పై పాటలు పాడటం ఆయన ప్రారంభించారు. అయితే, అక్కడ ఒక్కసారిగా భారీగా జనాలు వచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనొక అంతర్జాతీయ సింగర్ అని వారు గుర్తించలేకపోయారు.. అదే సమయంలో ఆయన కూడా చెప్పుకోలేదు. దీంతో అక్కడి మైక్ వైర్‌ను పోలీసులు తొలగించారు. కొంత సమయం తర్వాత ఈవెంట్ నిర్వాహకులు వచ్చి ఆయన గురించి పోలీసులకు అసలు విషయం చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. భారత పర్యటనలో భాగంగా పూణే, ఢిల్లీలో కూడా ఆయన కార్యక్రమాలు జరగనున్నాయి.#Chuttamalle Song and audience vibing is a whole different energy! ❤️🫶🏻#Devara https://t.co/cLThLtj8aR— Devara (@DevaraMovie) February 9, 2025Ed’s first Telugu song with @shilparao11 🤝 pic.twitter.com/7jJh6stkyW— Ed Sheeran HQ (@edsheeran) February 9, 2025#Chuttamalle Song and audience vibing is a whole different energy! ❤️🫶🏻#Devara https://t.co/cLThLtj8aR— Devara (@DevaraMovie) February 9, 2025 -
ఎవరికీ ప్రపోజ్ చేయలేదన్న ఖుషీ కపూర్.. 'రైనా' సంగతేంటి..?
అలనాటి నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) నటించిన కొత్త సినిమా 'లవ్యాపా' (Loveyapa). బాలీవుడ్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇందులో ఆమీర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో జంటగా ఆమె నటించారు. యూత్‌ను ఆకట్టుకునే ప్రేమకథలా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'లవ్ టుడే'కు రీమేక్‌గా 'లవ్యాపా' సినిమా రానుంది. అయితే, తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఖుషీ కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంటర్యూలో భాగంగా ఇప్పటి వరకు ఎవరినైనా ప్రేమించారా..? ప్రపోజ్ చేశారా..? అని ఖుషీ కపూర్‌ను అడగ్గా.. ఆమె ఇలా చెప్పారు. తాను ఇప్పటి వరకు ఎవరికీ ప్రపోజ్ చేయలేదని షాకింక్ ఆన్సర్ ఇచ్చారు. కానీ, తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే అందుకు సంబంధించిన ఒక ఫోటోను తీసుకోవాలని ఉందని ఆమె పేర్కొన్నారు. బాలీవుడ్ సినిమా 'ది ఆర్చిస్'లో నటించిన తన కో స్టార్ వేదాంగ్ రైనాతో ఖుషి ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ కూడా జంటగా పలు ప్రదేశాల్లో కెమెరాల కంట కూడా పడ్డారు. ఇలాంటి సమయంలో తాను ఎవరికీ ప్రపోజ్ చేయలేదు అని ఖుషీ చెప్పడంతో నెట్టింట ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బహూశా బ్రేకప్ ఏమైనా చెప్పారా..? అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.2023లో విడుదలైన 'ది ఆర్చిస్' సినిమాతో ఖుషీ కపూర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో తనకు జోడీగా నటించిన వేదాంగ్ రైనాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అక్కతో పోటీ లేదు..కెరీర్ పరంగా జాన్వీకపూర్‌తో తాను పోటీ పడలేనని ఖుషీ కపూరు చెప్పారు. నిజం చెప్పాలంటే అలాంటి ఆలోచన తమ ఇద్దరిలోనూ లేదని ఆమె పేర్కొన్నారు. తాము పోటీ పడుతున్నట్లు ఎవరైనా అనుకుంటే అదొక వింతే అని ఖుషీ తెలిపారు. ఒకవేళ తామిద్దరం కలిసే ఏదైనా సినిమా చేస్తే తప్పకుండా ఎక్కువ మార్కులు జాన్వీ అక్కకే పడుతాయని ఆమె అన్నారు. ఆమె చాలా బాగా నటిస్తుంది. స్క్రీన్‌పై అక్క నటన చూస్తే చాలా ఆనందం కలుగుతుందని ఆమె తెలిపారు. 'నేను ఏదైనా చిత్రంలో బాగా నటిస్తే అక్క చాలా సంతోషిస్తుంది. చాలా బాగా చేశావ్ అంటుంది. అప్పుడు కూడా అదంతా తన విజయంగా ఆమె భావిస్తుంది.' అని అన్నారు. -
'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్
పుష్ప సిరీస్ గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 భారీ కలెక్షన్స్ సాధించి ఎన్నో రికార్డ్స్‌ను దాటేసింది. పుష్ప రెండు భాగాలకు దేవిశ్రీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో ఆయన తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 3' (Pushpa 3) ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. పుష్ప చిత్రాలకు ఐటెమ్ సాంగ్స్ మంచి గుర్తింపును ఇచ్చాయి. ఇప్పుడు పుష్ప3లో ఐటెమ్ సాంగ్‌లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో దేవిశ్రీ ప్రసాద్ తాజాగా చెప్పారు. (ఇదీ చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)పుష్పలో సమంత 'ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామా' అంటూ తన గ్లామర్‌తో దుమ్మురేపింది. పుష్ప2లో శ్రీలీల కిస్సిక్ సాంగ్‌లో నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ ప్రత్యేకమైన సాంగ్స్ గురించి దేవిశ్రీ ప్రసాద్ ఇలా పంచుకున్నారు. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని అయన అన్నారు. అయితే, ఈ సాంగ్‌కు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను మేకర్స్‌కు ముందే చెప్పానని ఆయన అన్నారు. దానికి ప్రధాన కారణం ఆమె చాలా బెటర్‌గా డ్యాన్స్ చేయడమేనని దేవిశ్రీ అన్నారు. ఇప్పటికే చాలామంది టాప్ హీరోయిన్లు తన మ్యూజిక్‌లో వచ్చిన ఐటెమ్ సాంగ్స్‌లో మెప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అందులో కాజల్ అగర్వాల్ (జనతా గ్యారేజ్), పూజా హెగ్డే( రంగస్థలం), సమంత (పుష్ప), శ్రీలీల (పుష్ప2)ఉన్నారన్నారు. వారందరూ కూడా కెరీర్లో మంచి పీక్‌లో ఉన్నప్పుడే ఐటెమ్ సాంగ్స్‌లలో కనిపించారన్నారు.'పుష్ప 3' ఐటెమ్ సాంగ్‌లో జాన్వీ ఎంపిక ఎందుకంటే..?పుష్ప 3 సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో కనిపించేది ఎవరని ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. ఈ అంశంపై దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. పాట ఆధారంగా హీరోయిన్ను ఎంపిక చేస్తారని దేవి తెలిపారు. ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్‌కు తాను అభిమానినని చెప్పిన ఆయన.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా మంచి డ్యాన్సర్ అని ఆయన తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్లో నటించిన ఆమె పాటలు చూశానని అన్నారు. ఆమె అమ్మగారు అయిన శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో కూడా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, పుష్ప-3 ఐటెమ్ సాంగ్‌కు జాన్వీ అయితే సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.‘పుష్ప 2’ ఘన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. సుకుమార్ ఇచ్చిన మంచి స్క్రిప్టుకు అల్లు అర్జున్ అద్భుతంగా నటించడం వల్లే సినిమా భారీ హిట్ అయిందని ఆయన అన్నారు. పుష్ప 1, పుష్ప 2కి ఎలా పనిచేశామో ‘పుష్ప 3’కి అదే స్థాయిలో కష్టపడతామని తెలిపారు. -
'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్‌లో రన్ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. అలాంటిది దేవర చిత్రం ఆరు కేంద్రాలలో వందరోజుల మార్క్‌ను అందుకుంది. పుష్ప2 వంటి భారీ హిట్ సినిమా ముందు కూడా దేవర ఈ రికార్డ్ సాధించడం అనేది సాధరణ విషయం కాదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ప్రదర్శన అనే మాటే వినిపించడమే లేదు. అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల పోస్టర్ పడింది. ఇప్పుడు ఆరు కేంద్రాలలో దేవర 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. నవంబర్ 15న దేవర 50 రోజుల వేడుకను సెలబ్రేట్ చేసుకున్న అభిమానులు ఇప్పుడు వందరోజుల పండగను సందడిగా జరుపుకుంటున్నారు.ఆరు థియేటర్లలో 100 రోజులుఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు థియేటర్స్ మలికిపురం ( పద్మజ ), మండపేట (రాజరత్న) ఉన్నాయి. చిలకలూరిపేటలోని (రామకృష్ణ), చిత్తూరు జిల్లాలోని బి. కొత్తకోట (ద్వారక), కల్లూరు (ఎమ్ఎన్ఆర్), రొంపిచర్ల (ఎమ్ఎమ్ డీలక్స్) వంటి థియేటర్లలో దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. -
'పుష్ప2'కు సపోర్ట్‌గా జాన్వీకపూర్.. అభిమానుల నుంచి ప్రశంసలు
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో పుష్ప2తో మరో హిట్ పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానల నుంచి పుష్పరాజ్‌కు ఫిదా అవుతున్నారు. సుమారు 12500కు పైగా థియేటర్స్‌లలో విడుదలైన ఈ చిత్రం పట్ల బాలీవుడ్లో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎక్కువ థియేటర్స్ పుష్ప2 చిత్రానికి కేటాయించడంతో వారు అభ్యంతరం తెలుపుతున్నారు. పుష్ప2 వల్ల హాలీవుడ్ హిట్ మూవీ 'ఇంటర్ స్టెల్లార్' రీ రిలీజ్ వాయిదా పడిందని పుష్పను విమర్శిస్తూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ రియాక్ట్ అయ్యారు.2014లో విడుదలైన'ఇంటర్ స్టెల్లార్' సినిమాకు చాలామంది అభిమానులు ఉన్నారు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికి విడుదలై 10 ఏళ్లు అయింది. ఈ సందర్బంగా ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, బాలీవుడ్‌లోని ఐమాక్స్‌లలో ఎక్కువ చోట్ల పుష్ప2 ఉండటంతో ఈ చిత్రం వాయిదా పడింది. దీంతో కొందరు నెట్టింట అభ్యంతరం పెడుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై జాన్వీ స్పందించింది.పుష్ప2 చిత్రాన్ని సమర్థిస్తూ జాన్వి ఇలా చెప్పుకొచ్చింది. 'పుష్ప2 కూడా సినిమానే కదా.. పాశ్చాత్య దేశాలకు చెందిన సినిమాలతో పోలుస్తూ మన సినిమాను ఎందుకు తక్కువ చేస్తున్నారు. మన సినిమాలను గుర్తించకుండా ఇతర దేశ సినిమాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం మీరు సపోర్ట్ చేస్తున్న హాలీవుడ్ వారే మన సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మన సినిమా పట్ల ఆకర్షితులవుతున్నారు. అయితే, ఇక్కడ విచారకరం ఏమిటంటే.. మనం మాత్రమే మన సినిమాలపై చిన్న చూపు చూపిస్తున్నాం.' అంటూ పుష్ప2 చిత్రానికి సపోర్ట్‌గా ఆమె కామెంట్ చేశారు. ఈ విషయంలో జాన్వీపై ప్రశంసలు అందుతున్నాయి.బాలీవుడ్లో శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. తెలుగులో 'దేవర'తో పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టడంతో ఆమెకు కూడా మంచి గుర్తింపు దక్కింది. రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఒక చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. -
ఓటీటీలో 'దేవర'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఓటీటీ విడుదల విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తారక్ సింగిల్‌గా నటించిన చిత్రాల్లో దేవరనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు.దేవర ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది. నవంబర్ 8న తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా తెలిపింది. అయితే, హిందీ వర్షన్ మాత్రం నవంబర్ 22న ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ. -
తెలుగులోనూ విడుదలైన హిట్ సినిమా రీమేక్‌లో జాన్వీ కపూర్
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ అన్న విషయం తెలిసిందే. తిను ధడక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే బాగా పాపులర్ అయిన జాన్వి కపూర్ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలు ఉండడం విశేషం. అయితే సరైన హిట్స్ మాత్రం రాలేదని చెప్పాలి. అయితే జాన్వీ కపూర్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు అలా దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి పలు ఆఫర్స్ రావడం మొదలెట్టాయి. దక్షిణాదిలో నటించిన తొలి చిత్రం దేవర. జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించిన ఈ తెలుగు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను సాధించింది. తాజాగా తెలుగులో మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా తెలుగులో మరో అవకాశం ఈమె కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే కోలీవుడ్ దృష్టి జాన్వీ కపూర్‌పై పడినట్టు తాజా సమాచారం. ఇక్కడ ఒక భారీ చిత్రంలో ఈమెను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఈరం' (తెలుగులో వైశాలి) చిత్రం హిందీ రీమేక్‌లో నటించే అవకాశం జాన్వీ కపూర్‌ను వరించినట్లు తాజా సమాచారం. తమిళంలో దర్శకుడు శంకర్ నిర్మించిన ఈ చిత్రానికి అరివళగన్ దర్శకత్వం వహించారు. 2009లో విడుదలైన ఈ చిత్రం నటుడు ఆది పినిశెట్టి, నంద, సింధు మేనన్, శరణ్య మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా 15 ఏళ్ల తర్వాత ఈ చిత్రం హిందీలో రీమేక్ కాబోతున్నట్లు అందులో నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది ఈ చితం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస దర్శకుడుగా పరిచయం కానున్నారు. కాగా ఈరం చిత్రాన్ని హిందీ ప్రేక్షకులకు నచ్చే విధంగా కొన్ని చేర్పులు మార్పులు చేయగలరా? అని జాన్వీ కపూర్ కోరగా అందుకు దర్శక టీం ఓకే చెప్పినట్లు సమాచారం. -
ఓటీటీలో 'దేవర' ఎంట్రీ సమయం వచ్చేసిందా..?
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీగా లాభ పడ్డారని నాగవంశీ తెలిపారు.దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఓటీటీలో కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు డీల్ కుదుర్చుకుంది. థియేటర్లలో రిలీజైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే ఓప్పందం దేవర మేకర్స్‌తో ఉన్నట్లు సమాచారం. దీంతో నవంబర్ 8న తెలుగుతో పాటు హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించారట. ఈమేరకు బలంగా వార్తలు వస్తున్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, ప్రకాష్‌రాజ్ వంటి స్టార్స్ నటించారు. -
'జిగ్రా' ట్రైలర్.. రూమర్ బాయ్‌ఫ్రెండ్‌పై అక్కాచెల్లెళ్ల ప్రశంసలు
బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నటించిన జిగ్రా సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు. వాస్తవంగా ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కావాల్సింది. అయితే, అదే రోజు ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల కానున్నడంతో జిగ్రా సినిమా రిలిజ్ను రెండు వారాల పాటు వాయిదా వేశారు. దీంతో అక్టోబర్ 11న జిగ్రా విడుదల కానుంది.తమ్ముడు కోసం అక్క చేసే పోరాట కథనంతో ‘జిగ్రా’ సినిమా ఉండనుంది. మహిళా ప్రాధాన్యతను తెలిపేలా ఈ ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తమ్ముడు ఒక ప్రమాదంలో చిక్కుకుంటే తన అక్క చేసే పోరాటం ఏ రేంజ్లో ఉంటుందో చిత్ర దర్శకుడు సినిమా రూపంలో చూపించాడు.ట్రైలర్‌పై ఖుషి కపూర్ కామెంట్అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ జిగ్రా ట్రైలర్ గురించి కామెంట్ చేసింది. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన నటుడు వేదాంగ్ రైనాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రైలర్‌ను పంచుకుంది. హార్ట్ సింబల్‌తో పాటు ఎమోషనల్ ఫేస్ ఎమోజీలను కూడా ఖుషి కపూర్ షేర్ చేసింది.జాన్వీ కపూర్ కూడా జిగ్రా ట్రైలర్‌పై పోస్ట్ చేశారు. ఇందులో వేదాంగ్ నటన చూసి తాను చాలా ఎమోషనల్ అయినట్లు పంచుకుంది. తన హృదయం కూడా బరువెక్కిందని పేర్కొంది. ట్రైలర్‌కే తాను ఇలా అయితే, సినిమా చూసిన తర్వాత తాను ఏవిధంగా ఫీలవుతానో అర్థంకావడం లేదంటూ రాసుకొచ్చింది. లేడీ బచ్చన్ అలియాభట్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని తెలిపిందని జాన్వీ పేర్కొంది. -
తొలి రోజే 120 కోట్లకు పైగా వసూళ్లు..?
-
దేవర పాట పాడిన అలియా.. టాలీవుడ్ ఫిదా..
-
అప్పుడు ఆంధ్రావాలా ఇప్పుడు దేవర..ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా..?
-
దేవర రన్ టైం అడిగిన సందీప్ వంగకి కౌంటర్ ఇచ్చిన ఎన్టీఆర్
-
Devara: రిలీజ్ కు ముందే రికార్డులు!
-
ట్రోల్ల్స్ తో దేవర ఉక్కిరిబిక్కిరి
-
తిమింగలంపై ఎన్టీఆర్ రైడ్ దేవర కోత.. యూట్యూబ్ మోత..
-
Devara Trailer: 'దేవర' ట్రైలర్ వచ్చేసింది
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ డైరెక్షన్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అశలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓవర్సీస్లో భారీగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటికే అక్కడ సుమారు 11 లక్షలకు పైగా టికెట్ల విక్రయం జరిగింది.దేవర విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ముంబైలో ప్రమోషన్స్ కార్యక్రమాన్ని మేకర్స్ ప్రారంభించారు. బాలీవుడ్ వేదికగా దేవర ట్రైలర్‌ను తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో విడుదల చేశారు. ట్రైలర్లో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. బ్లాక్ షేడ్‌లో కనిపించే విజువల్స్‌తో పాటు సముద్ర తీరంలో జరిగే పోరాట సన్నివేశాలు కేక పుట్టించేలా ఉన్నాయి.దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. -
దేవర టికెట్లు 5 నిమిషాల్లో క్లోజ్.. మూడో సాంగ్‌పై అప్డేట్
స్టార్ హీరో ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'దేవర'. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సేల్స్ టికెట్ల విక్రయాలు అమెరికాలో ప్రారంభమయ్యాయి. అక్కడ భారీగా బుకింగ్స్ జరిగాయి. అయితే, తాజాగా కెనాడాలో సుమారు 30 స్క్రీన్లకు సంబంధించి టికెట్లు ఓపెన్ అయ్యాయి. అయితే, కేవలం 5నిమిషాల్లోనే టికెట్లు అన్నీ పూర్తిగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దీంతో తారక్ సినిమా క్రేజ్ ఏంటో ప్రపంచానికి తెలుస్తోందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.దేవర పాటలతోనే అభిమానుల్లో అంచనాలు పెంచేశాడు తారక్.. ఇప్పటికే రిలీజైన పాటలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. యూట్యూబ్ లో అనేక రికార్డులను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్‌లో ఎన్టీఆర్ - జాన్వీ జోడీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫియర్ సాంగ్ కూడా అదే రేంజ్లో ఆకట్టుకుంటుంది. అయితే, తాజాగా దేవర నుంచి మూడో పాటను సెప్టెంబర్ 4న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మాస్ డ్యుయెట్‌కు విజిల్స్ వేసేందుకు అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ ఎన్టీఆర్ - జాన్వీ పోస్టర్‌ను విడుదల చేశారు. దేవర రెండు భాగాలుగా రానుంది. కొరటాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మలయాళ నటుడు షైన్ టామ్ ఛాకో, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
జూ ఎన్టీఆర్ 'దేవర' టికెట్లు.. ఫస్ట్ షో ఎప్పుడంటే..?
స్టార్ హీరో ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం ‘దేవర’. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, దేవర్ ఫస్ట్ షో గురించి ఒక వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు పాన్ ఇండియా రేంజ్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేశాయి. మిలియన్ల కొద్ది రీల్స్ రూపంలో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా దేవర విడుదల కానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, సెప్టెంబరు 27న అభిమానుల కోసం తెల్లవారుజామున 1:08 గంటలకు బెన్ ఫిట్ షోస్ వేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్.. ఓవర్సీస్లో కూడా ఇదే సమయంలో షో పడనుంది. ఈమేరకు UKలో ఇప్పటికే దేవర బుకింగ్స్ ఓపెన్ చేశారు. టికెట్లు దక్కించుకున్న అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు కూడా.. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటైర్మెంట్స్ నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు. సోలోగా దేవర వస్తుండటంతో బాక్సాఫీస్ షేక్ చేయడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. -
మినీ డ్రెస్‌లో మెరిసిన జాన్వీ..అచ్చం రవ్వదోసలా..!
బాలీవుడ్ జాన్వీ కపూర్ తన అభినయంతో వేలాదిమందు అభిమానులను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడూ లేటెస్ట్ డిజైనర్ వేర్ దుస్తులకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఉలాజ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇటీవలే మూవీ టైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది ఆ ట్రైలర్. అందులో లీడ్రోల్లో కనిపించిన జాన్వీకపూర్ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. ఆమెలో దాగున్న సరికొత్త నటన ఈ రోల్ ద్వారా బయటపడనుంది కూడా. ఇక ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్‌కి ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ, అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, జాన్వీ ప్రియుడు శిఖర్ పహారియా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాన్వీ తెల్లటి రన్‌వే మినీ దుస్తులతో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. ఈ డ్రెస్‌ని డీప్ ఆఫ్-ది-షోల్డర్ నెక్లైన్, స్విర్ల్ ఎంబ్రాయిడరీతో రూపొందించారు. అందుకు తగ్గట్టుగా చెవిపోగులు, ఉంగరాలు ధరించి స్టన్నింగ్ లుక్‌తో మిస్మరైజ్ చేసింది. ఈ దుస్తులు సీ త్రూ సిల్హౌట్ అయినా ఆమె దీన్ని కవర్ చేసేలా లోపల చక్కటి స్కిన్ వేర్ని ధరించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవ్వుతున్నాయి. అయితే నెటిజన్లు ఈ డ్రెస్ చూడటానికి మనం ఇష్టంగా తినే రవ్వదోసలా ఉంటంటూ ఒకరూ, మరికొందరూ టీవీలు, డైనింగ్ టేబుల్స్‌పై వేసే తెల్లటీ ఎంబ్రాయిడరీ క్లాత్‌లా ఉందని కామెంట్లూ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్! ఏకంగా 546 వజ్రాలతో..!) -
ఆసుపత్రి నుంచి జాన్వీ కపూర్ డిశ్చార్జ్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. పూర్తి ఆరోగ్యంతో ఆమె తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఆహారం కల్తీ కావడం వల్ల జాన్వీ అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు.24 గంటల పాటు చికిత్స పొందిన జాన్వీ కపూర్ పూర్తి ఆరోగ్యంతో తన ఇంటికి చేరుకుంది. ఆమె తండ్రి బోనీ కపూర్ ఈ వార్తలను ధృవీకరించారు. ఆమె ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. కాస్త నీరసంగా ఉన్నప్పటికీ మరొక రోజులో ఆమె పూర్తిగా కోలుకుంటారని తెలుస్తోంది.చెన్నై నుంచి ముంబైకి వస్తున్న క్రమంలోనే జాన్వీ అనారోగ్యానికి గురైంది. తన ఆరోగ్యం రిత్యా బయటకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. కానీ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహ వేడుకకు తప్పక వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్యం మెరుగ్గా లేకపోవడం ఆపై పెళ్లికి హాజరకావడంతో ఇబ్బందులకు గురైంది. వరుస సినిమాలతో జాన్వీ కపూర్ బిజీబిజీగా ఉన్నారు. జాన్వీ, గుల్షన్ దేవయ్య, రోషన్ మ్యాథ్యూ నటించిన ప్రధాన ‘ఉలాజ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె బిజీగా ఉంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘దేవర’లో జాన్వీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ జాన్వీనే హీరోయిన్ కావడం విశేషం. -
గ్లామర్‌తో పోటీ పడుతున్న బ్యూటీస్
నేను పెయింటర్‌ను కాదంటున్న శ్రీలీలఏంజిల్లా మెరిసిపోతున్న కాజల్బీచ్లో కసరత్తు చేస్తున్న హనీరోజ్బుట్టబొమ్మలా జాన్వీ కపూర్సరికొత్త లుక్‌లో షాకిస్తున్న డింపుల్ హయాతి View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
ఆస్ట్రేలియా వెళ్లనున్న రామ్ చరణ్.. కారణం ఇదేనా..?
పాన్ ఇండియా హీరో రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా రోజులైంది. రీసెంట్గా పూజా కార్యక్రమం కూడా జరిగింది. కానీ, రెగ్యులర్ షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు..? ఇతర నటీనటులు ఎవరు..? వంటి అప్డేట్స్ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న RC16 ప్రాజెక్ట్ ఇక పట్టాలెక్కడమే ఆలస్యం అని తెలుస్తోంది.ఈ చిత్రం కోసం రామ్ చరణ్ పూర్తిగా తన మేకోవర్‌ను మార్చుకోనున్నారట. ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్లు కనిపించాలంటే మరింత కసరత్తులు తప్పవని ఆయన భావించారట. అందుకోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు చరణ్ సిద్ధం అవుతున్నారట. గేమ్ చేంజర్ చిత్రం పూర్తి అయిన వెంటనే వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ చరణ్ ఫిజికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత RC16 షూటింగ్ అక్టోబర్‌లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. స్పోర్ట్స్ డ్రామాగా, గ్రామీణ నేపథ్యంలో కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్‌చరణ్ సరికొత్తగా కనిపిస్తారని, అందుకోసం ప్రత్యేక మేక్ఓవర్ తప్పదని మేకర్స్ ప్లాన్ చేశారని టాక్. రామ్ చరణ్ కోరుకున్న శారీరక రూపాన్ని పొందాలంటే కనీసం రెండు నెలలపాటు కఠినమైన శిక్షణ తీసుకోవాల్సిందేనని సూచించారట. దానికి కోసం ఆస్ట్రేలియాను ఎంపిక చేశారట.జాన్వీకపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. రెహమాన్ సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. RC16 పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు 'పెద్ది' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. -
అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే, ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యలో జాన్వీ చేసిన వ్యాఖ్యలు అభిమానులతో పాటు నెటజన్లలలో కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. సాధారణంగా సినీ నటీనటులలో సామాజిక అంశాల పట్ల ఏమాత్రం అవగాహన ఉండదనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, జాన్వీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.అంబేద్కర్, గాంధీ మధ్య డిబేట్ చూడటం తనకు చాలా ఆసక్తికరంగా ఉంటుందని జాన్వీ కపూర్ తెలిపింది. ఒక నిర్దిష్ట అంశంపై అంబేద్కర్, గాంధీ అభిప్రాయాలు ఎలా మారాయి అనే దాని మధ్య చర్చ ఉండాలని ఆమె కోరింది. ఆమె మాటలతో ఇంటర్వ్యూయర్లు కూడా 'వావ్' అని ఆశ్చర్యపోయారు. ఈ సమాజం పట్ల వారిద్దరూ ఎంచుకున్న మార్గం పట్ల బలంగా నిలబడ్డారు. వాళ్లిద్దరూ మన సమాజానికి ఎంతో సహాయం చేశారు. వారు ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో అనేది తెలుసుకోవాలని ఉంది. ఇది చాలా ఆసక్తికరమైన చర్చగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక నిర్దిష్ట అంశంపై వారి అభిప్రాయాలు కాలక్రమేణా ఎలా మారాయి..? కుల ఆధారిత వివక్ష, అంటరానితనం పూర్తిగా అంతమవ్వాలి అనే అంశంపై అంబేద్కర్ వైఖరి ఏమిటో స్పష్టంగా ఉంది. కానీ గాంధీ అభిప్రాయాలు నిరంతరం మారుతూ వచ్చాయి. ఎందుకంటే మన దేశంలో కులతత్వం కాకుండా, దానిపై మూడవ వ్యక్తి నుంచి అభిప్రాయాలు పొందడం అనేది వాస్తవ ప్రపంచానికి చాలా భిన్నంగా ఉంటుంది. మీ పాఠశాలలో ఎప్పుడైనా కులతత్వం గురించి చర్చించారా? అనే ప్రశ్నకు జాన్వీ ఇలా సమాధానమిచ్చింది. 'లేదు, నా స్కూల్లో కాదు, నా ఇంట్లో కూడా కులం గురించి ఎప్పుడూ చర్చ జరగదు.' అని జాన్వీ చెప్పింది. దీంతో నెటిజన్లు కూడా ఆమె మాటలకు ఫిదా అవుతున్నారు. Rather surprised to see this from a mainstream Bollywood actor. Janhvi Kapoor on Ambedkar, Gandhi & caste 👏pic.twitter.com/KyH8Ad08f5— Siddharth (@DearthOfSid) May 24, 2024 -
నా పెళ్లి అలా జరగాలి: జాన్వీ కపూర్
-
శ్రీ దేవి దారిలో జాన్వీ కపూర్..!
-
ఆలియా అవుట్..జాన్వీ ఇన్?
హిందీలో ‘దుల్హనియా’ ఫ్రాంచైజీలో వచ్చిన ‘హంప్టీ శర్మా కీ దుల్హనియా’, ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’ చిత్రాల్లో వరుణ్ ధావన్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాలకు శశాంక్ కేతన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ ఫ్రాంచైజీలో మూడో భాగానికి కేతన్ ప్రయత్నాలు మొదలు పెట్టారని బాలీవుడ్ సమాచారం. వరుణ్ ధావన్, ఆలియా భట్లను కూడా సంప్రదించారట. అయితే వరుణ్ ధావన్ సుముఖంగానే ఉన్నా, ఇప్పటికే అంగీకరించిన చిత్రాల కారణంగా ఆలియా మాత్రం ఈ సినిమాలో నటించలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో ఈ చాన్స్ జాన్వీ కపూర్‌కు వెళ్లిందట. ఈ సినిమాకు జాన్వీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ ఊపందుకున్నాయని టాక్. వేసవిలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. -
'ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న శ్రీదేవి'
ఎన్నో సినిమాల్లో తన నటనతో అలరించిన అందాల తార శ్రీదేవి. ఆమె మరణించినా నేటికి శ్రీదేవి పేరు చిరస్మరణీయం. భారతీయ దిగ్గజ నటీమణులలో ఒకరిగా శ్రీదేవి పరిగణించబడ్డారు. బాల నటిగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా మెరిసిన శ్రీదేవి 1990ల చివరలో నటనకు విరామం తీసుకుంది. ఆ తర్వాత 2012 మళ్లీ ఇంగ్లీష్ వింగ్లీష్‌తో ఆమె పవర్-ప్యాక్డ్ పునరాగమనం చేసింది. ఈ చిత్రంలో శ్రీదేవికి సహనటుడిగా నటించిన ఆదిల్ హుస్సేన్ ఇటీవల పలు ఆసక్తకరమైన విషయాలు పంచుకున్నాడు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవిని ఆదిల్ గుర్తుచేసుకున్నాడు. ఆమెతో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. శ్రీదేవిని కలిసినప్పుడు ఆమె నటించిన సద్మా చిత్రం తనకు గుర్తుకు వచ్చిందట. వేశ్యాగృహంలో చిక్కుకున్న నేహలతగా శ్రీదేవి నటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆ చిత్రం తనపై ఎంత ప్రభావం చూపిందని, సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులుగా తాను తినలేకపోయానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 'మొదటగా డైరెక్టర్ గౌరీ షిండేనే నన్ను శ్రీదేవికి పరిచయం చేశారు. అప్పుడు ఆమె తన పెద్ద అందమైన కళ్లతో నన్ను చూసింది. సద్మా సినిమా చూసిన తర్వాత నేను ఏమీ తినలేను అని నేను ఆమెకు మొదట చెప్పాను. శ్రీదేవిని చూడగానే అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు నా మాటలు విన్న తర్వాత, ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి.. ఎందుకో నాకు కూడా తెలియదు. ఆమె కొద్దిగా మృదువైన తడి కళ్లు కలిగి ఉంది. అలా చాలా సమయం తర్వాత మేము రిహార్సల్స్‌కు వెళ్లాము.' అని చెప్పాడు. మెరిల్ స్ట్రీప్‌తో సమానంగా శ్రీదేవి: ఆదిల్ హుస్సేన్ శ్రీదేవిని హాలీవుడ్ లెజెండ్ మెరిల్ స్ట్రీప్‌తో పోలుస్తూ.. ఆమె 'చాలా సెన్సిటివ్' అని పాశ్చాత్య దేశాల మాదిరిగానే ఆమెకు కథలు ఆఫర్ చేసి ఉంటే, శ్రీదేవికి ఆస్కార్ లభించేదని అన్నారు. ఇంగ్లిష్ వింగ్లీష్ గౌరీ షిండే రచించి దర్శకత్వం వహించింది. 2012లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని సాధించింది. శ్రీదేవి, జాన్వీ కపూర్ల మధ్య పోలికలు శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వీ కపూర్ మధ్య ఉన్న సారూప్యత గురించి కూడా ఆదిల్ వివరించాడు. జాన్వీ తన తన తల్లి నుంచి చాలా "గుణాలను" వారసత్వంగా పొందిందని చెప్పాడు. "శ్రీదేవిని మరోకరు మ్యాచ్ చేయడం చాలా కష్టమైన పని.. కానీ జాన్వీ కష్టపడి పనిచేస్తే శ్రీదేవికి దక్కినంత గౌరం, పేరు తప్పకుండా వస్తాయి. జాన్వీలో ఆ టాలెంట్ ఉంది. కచ్చితంగా భవిష్యత్‌లో ఆమె భారత వెండితెరపై తిరుగులేని రాణిలా గుర్తింపు పొందుతుందని ఆదిల్ తెలిపాడు. టాలీవుడ్లో జూ.ఎన్టీఆర్ సరసన దేవరలో జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. -
అక్కినేని అఖిల్ గురించి వైరల్ అవుతున్న న్యూస్!
అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' చిత్రం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమాను ప్రకటించలేదు. భారీ యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా 'ఏజెంట్' తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్‌తో కనిపించడం కోసం ఆయన కొన్నినెలలపాటు శ్రమించారు. కానీ ఏజెంట్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఎజెంట్ సినిమాలో అఖిల్ హాలీవుడ్ హీరోలకు ధీటుగా కనిపిస్తాడు. అతని ప్రధాన బలం హైట్, అందుకు తగ్గట్టు ఆయన మెయిన్టైన్ చేస్తున్న సిక్స్ ప్యాక్.. ఏజెంట్ స్క్రిప్టు పక్కాగా ఉండుంటే భారీ హిట్ అయిండేది. ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత బహిరంగంగానే చెప్పాడు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) తాజాగా అక్కినేని అఖిల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఓ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హాలీవుడ్ హీరోలా ఉన్న అఖిల్ మరింత అందంగా కనిపించడానికి తన ముఖానికి స్వల్ప సర్జరీ చేయించుకుంటున్నారని సమాచారం. తన ముక్కుకు సంబంధించి కొన్ని మెరుగులు దిద్దుతున్నారట. దీనికోసం ఆయన విదేశాలకు వెళ్తున్నారని టాక్. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అఖిల్ ఏజెంట్ తర్వాత పక్కా ప్లాన్‌తో ఒక ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాకు అనిల్ కూమార్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ చేయనున్నారని తెలుస్తోంది. అనిల్ గతంలో సాహో, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. ఈ సినిమాకు ధీర అనే టైటిల్ కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుందని వార్తల వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ దేవర చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
కలర్‌ఫుల్ మీనాక్షి.. నడుము చూపిస్తున్న నిక్కీ!
రంగుల డ్రస్ లో మీనాక్షి.. చూస్తుంటే మాత్రం బ్లూ కలర్ ఔట్ఫిట్లో జాన్వీ సొగసులు మాల్దీవులు వెకేషన్లో మేఘా ఆకాశ్ జీన్స్ స్కర్ట్‌లో సమంత క్యూట్ డ్యాన్స్ విచిత్రమైన చూపులతో మాయ చేస్తున్న నందితా నిక్కీ తంబోలి హాట్ షో.. నడుము చూపిస్తూ కేథరిన్ కొంటె చూపులు.. చూస్తే మీరు ఫ్లాట్ అద్దం ముందు శోభిత వయ్యారాలు చీరలో అందాల విందు చేసిన పూజిత రితికా సింగ్ స్టిల్స్.. వెనక్కి తిరిగి మరీ View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
మరింత ముదురుతోన్న ఆష్విట్జ్ వివాదం.. ఆ సినిమాను తొలగించాలంటూ డిమాండ్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన తాజా చిత్రం బవాల్. ఈ చిత్రంలో జూలై 21న నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదానికి దారితీస్తున్నాయి. ఇటీవలే ఆష్విట్జ్ సీన్స్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూదుల మారణకాండను ఉద్దేశించేలా చిత్రీకరించిన సన్నివేశాలపై నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం చేస్తున్నారు. (ఇది చదవండి: ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!) ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి పూర్తిగా తొలగించాలని యూదుల మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ రంగంలోకి దిగింది. ఈ చిత్రాన్ని వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. నాజీల డెత్ క్యాంపుల్లోని సన్నివేశాలతో దర్శకుడు ప్రచారం పొందాలనుకున్నాడని ఆరోపించింది. హిట్లర్ జరిపిన మారణహోమంలో 6 మిలియన్ల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధాన్ని ఈ సినిమాలో తక్కువ చేసి చూపించారు. అందుకే ఈ చిత్రాన్ని వెంటనే ప్రైమ్ నుంచి తొలగించాలని మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ అసోసియేట్ డీన్, డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ సోషల్ యాక్షన్ రబ్బీ అబ్రహం కూపర్ డిమాండ్ చేశారు. ఆష్విట్జ్ అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారు. ఆష్విట్జ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. నెటిజన్స్ కామెంట్స్ సైతం జాన్వీ కపూర్ స్పందించింది. మీరు సరైన కోణంలో చూడాలని కౌంటర్ ఇచ్చింది. మరోవైపు నెట్టింట జరుగుతోన్న వివాదంపై నితీశ్ తివారీ ఇటీవల స్పందించారు. బవాల్‌లో మంచి సందేశాలు ఉన్నాయని తెలిపారు. ఆష్విట్జ్లో ఎదురైన పరిస్థితులు చూసి అజ్జూ, నిషా చలించిపోయినట్టు చూపించాం కదా.. విమర్శలు చేసేవాళ్లకు అవీ కనిపించలేదా? అని నితీశ్ ప్రశ్నించారు. (ఇది చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) -
'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్ హీరో
నటి శ్రీదేవి ఈ పేరే అందానికి బ్రాండ్ అంబాసిడర్. మొదట కోలీవుడ్‌లో బాలనాటిగా తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత టాప్ హీరోయిన్గా పేరు పొందారు. అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటించి ఇండియన్ సినీ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు. ఆమె జీవితం కథానాయకిగానే ముగిసింది. ఇక శ్రీదేవి వారసురాలిగా రంగప్రవేశం చేస్తున్న పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో ఇప్పటికే క్రేజీ కథానాయకిగా రాణిస్తోంది. నటన కంటే తన అందాలతో సోషల్ మీడియాను ఊపేస్తున్న జాన్వీకపూర్‌పై దక్షిణాది సినిమా చూపు చాలా కాలం క్రితమే పడింది. పలువురు ప్రముఖ దర్శక, నిర్మాతలు తమ చిత్రాల ద్వారా పరిచయం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆమెకు దక్షిణ చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉన్నా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. అలా ఇటీవలే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంలో నటించడానికి అంగీకరించింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. (ఇదీ చదవండి: పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా!) కాగా జాన్వీకపూర్ దక్షిణాదిలో తన రెండవ చిత్రాన్ని కోలీవుడ్‌లో చేయబోతున్నారని తాజా సమాచారం. కోలీవుడ్‌లో కమలహాసన్, శ్రీదేవిలది సూపర్ హిట్ కాంబో. కాగా శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్‌ను కమలహాసన్ కోలీవుడ్‌లో పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. ఇటీవల విక్రమ్ చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం తన 233వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌న్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: ‘భాగ్ సాలే’మూవీ రివ్యూ) కాగా మరోపక్క ఆయన వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు. నటుడు శింబు హీరోగా ఒక చిత్రం, శివకార్తికేయన్‌తో మరో చిత్రం చేస్తున్న కమలహాసన్, ఇటీవల చిన్నచిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన 'లవ్ టుడే' చిత్ర దర్శకుడు, కథానాయకుడు ప్రదీప్ రంగనాథం హీరోగా, నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని కమల్ నిర్మాతగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే నటి జాన్వీకపూర్‌ను కథానాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇందులో కమల్ ఒక కీలక పాత్రలో చేయనున్నట్లు సమచారం. -
లండన్‌లో ఇండియన్ ఆఫీసర్
ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా లండన్‌లో చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ జాన్వీకపూర్. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో అన్నమాట. జాతీయ అవార్డు గ్రహీత సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ‘ఉలజ్’ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు జాన్వీకపూర్. ఈ సినిమా షూటింగ్ తాజాగా లండన్‌లో ప్రారంభమైంది. జాన్వీకపూర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాలు సాగుతుందని టాక్. కాగా జాన్వీకపూర్ నటించిన మరో హిందీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంతో జాన్వీ తెలుగుకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలో బవాల్.. వరుణ్‌ధావన్, జాన్వీకపూర్ జంటగా నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ లవ్‌స్టోరీ ‘బవాల్’. షాజిద్ నదియాద్వాలా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా జూలైలో డైరెక్ట్‌గా అమేజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. -
చరణ్ తో రొమాన్స్ చేయబోతున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్
-
హైదరాబాద్ టు గోవా
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హీరో కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫారిన్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ డిజైన్ చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారట. షిప్లో సాగే ఈ ఫైట్ కోసం ప్రస్తుతం చిత్రయూనిట్ నైట్ షూట్ జరుపుతోంది. కాగా ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ను గోవాలో ప్లాన్ చేశారని తెలిసింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
-
నా బిడ్డను ఆమెతో పోలుస్తారా.. అడ్డుకున్న బోనీ కపూర్
దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిలి'. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్ ఈ మూవీపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మలయాళ సినిమా హెలెన్‌కు హిందీ రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రానికి ముత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె తండ్రి బోనీ కపూర్‌తో కలిసి పాల్గొన్నారు. అక్కడే ఉన్న ఓ మీడియా వ్యక్తి జాన్వీ కపూర్‌ను శ్రీదేవితో పోల్చడాన్ని బోనీ కపూర్ అడ్డుకున్నారు. నా బిడ్డను శ్రీదేవితో పోల్చవద్దంటూ సూచించారు. (చదవండి: ఉత్కంఠ రేపుతున్న జాన్వీకపూర్ ‘మిలి’ ట్రైలర్..) బోనీ కపూర్ మాట్లాడుతూ.. 'ప్రతిఒక్కరూ తమ పాత్రను అర్థం చేసుకోవడానికి విభిన్నమైన శైలిని కలిగి ఉంటారు. అందులో శ్రీదేవి ఒకరు. జాన్వీ కూడా అలాంటి పాత్రలే ఎంచుకుంటుంది. శ్రీదేవిని దాదాపు 150-200 సినిమాల్లో ప్రేక్షకులు చూశారు. కానీ నా కుమార్తె ఇప్పుడే తన ప్రయాణం ప్రారంభించింది. దయచేసి అమ్మతో ఆమెను పోల్చవద్దు.' అని అన్నారు. జాన్వీ కపూర్ మిలి ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, ఆమె సహచరులు ప్రశంసలతో ముంచెత్తారు. అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మిలి ట్రైలర్‌ను ప్రస్తావిస్తూ జాన్వీ కపూర్ టీమ్‌కి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఆమె సోదరుడు అర్జున్ కపూర్ ఆమె నటనను ప్రశంసించారు. నా చెల్లెలు చాలా గొప్ప పనులు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది.' అన్నారు. జాన్వీ కపూర్ మిలితో పాటు స్టార్ కిడ్ రాజ్‌కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె క్రికెట్‌తో ముడిపడి ఉన్న ఓ సినిమా కోసం ప్రిపరేషన్లో బిజీగా ఉంది. వరుణ్ ధావన్‌తో కలిసి బావాల్ మూవీలో కూడా కనిపించునుంది. -
బిగ్ బాస్ వైరల్ వీడియోను రిపీట్ చేసిన జాన్వీ కపూర్
Janvi Kapoor Recreates Bigg Boss Viral Video: సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ సినిమాలు చేస్తూ బిజీగా ఉండరు. సోషల్ మీడియాలో కూడా షూటింగ్‌లకు మించి యాక్టివ్‌గా ఉంటారు. తమదైనా రీతిలో పోస్ట్‌లు పెడుతూ అటెన్షన్ డ్రా చేస్తుంటారు. కొన్ని సార్లు అవి ప్రశంసలకు నోచుకుంటే మరికొన్ని సార్లు బెడిసికొట్టి ట్రోలింగ్‌కు గురవుతాయి. ఆ పోస్టులు, వీడియోలను నెటిజన్లు ఎలా తీసుకున్న సెలబ్రిటీలు పట్టించుకోరు. ప్రశంసలు, ట్రోలింగ్, నెటిజన్లను పక్కన పెడితే బాలీవుడ్ హీరోయిన్, అతిలోక సుందరీ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తాజాగా ఒక ఫన్ వీడియోను సామాజిక మాధ్యమంలో పంచుకుంది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 5లో జరిగిన 'పూజా, ఈ ప్రవర్తన ఏంటీ ?' అనే సంఘటనను రీక్రియేట్ చేసింది జాన్వీ. ఆ హౌజ్‌లో షొనాలీ నాగరాణి, పూజా మిశ్రాల మధ్య జరిగిన గొడవను జాన్వీ, తన మేకప్ ఆర్టిస్ట్ రివేరా లిన్‌తో కలిసి వీడియో చిత్రీకరించింది. పూజా మిశ్రా పాత్రను జాన్వీ చేయగా, షొనాలీ పాత్రలో రివేరా లిన్ నటించింది. వీడియోలో జాన్వీ తెల్లటి షార్ట్స్‌తో నీలిరంగు టాప్ ధరించి వస్తువును తన్నగా, అది లిన్‌కు తాకింది. అప్పుడు 'పూజా, ఈ ప్రవర్తన ఏంటీ?' అని లిన్ అనగా 'పొరపాటున తన్నాను' అని పూజా పాత్రలో ఉన్న జాన్వీ సమాధానం ఇచ్చింది. ఈ వీడియో షేర్ చేస్తూ 'నాకు సహాయం కావాలని మీరు అనుకుంటున్నారా ?' అని క్యాప్షన్ ఇచ్చింది దఢక్ హీరోయిన్. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) జాన్వీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే, హీరో-సోదరుడు అర్జున్ కపూర్ 'అవును' అని బదులిచ్చాడు. తర్వాత జాన్వీ కజిన్ షానాయ కపూర్ 'నేను నీకోసం పార్థిస్తున్నాను' అని కామెంట్ చేసింది. అలాగే సన్నీ కౌశల్, ఫాతిమా సనా షేక్ తదితరులతో సహా బీటౌన్ ప్రముఖులు ఈ వీడియోపై స్పందించారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'దోస్తానా 2', ఆనంద్ ఎల్ రాయ్ 'గుడ్ లక్ జెర్రీ' సినిమాల్లో నటిస్తుంది. ఇదీ చదవండి: న్యూడ్‌గా కనిపించి షాకిచ్చిన జాన్వీ కపూర్.. ఫోటో వైరల్ -
యువరాణులు అంటే ఇలా ఉంటారన్న సారా, పట్టరాని సంతోషంలో కృతీ
జాన్వి కపూర్‌తో ఫొటో షేర్ చేసిన సారా అలీ ఖాన్, యువరాణుల ఒకరి అంటే ఇలా ఉంటారంటున్న సారా హాలీడే రోజు ఇది నా విందు అంటూ రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోను పంచుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం సితాకోక చిలుకలా ఎగురుతున్నంత ఆనందంలో ఉన్నానంటున్న కృతీ సనన్ View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ravi Babu (@ravibabuofficial) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by MONALISA (@aslimonalisa) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
లేడీ బాస్‌గా రీతూ వర్మ, మూతి ముడుచుకున్న నిహారిక
నలుపు అంటే ఇష్టం అంటున్న ఐశ్వర్య రాజేశ్ చీరకట్టులో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా తండ్రి కమల్ హాసన్, చెల్లి అక్షర హాసన్‌తో శుృతి హాసన్ View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Madonna Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
అలా ప్రేమలో పడమంటున్న జాన్వి, అదే నా సంతోషమంటున్న మోనల్
మీ సంతోషాన్ని నాతో పంచుకోండి అంటున్నా బిగ్‌బాస్ బ్యూటీ మెనల్ గజ్జర్ ఆమెతో షూటింగ్ అంటే ఎప్పుడూ సరదానే: లావణ్య త్రిపాఠి కళ్లు మూసి ప్రేమలో పడమంటున్నా జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) -
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు ఐకాన్ అవార్డు
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ బాక్సాఫీసుకు ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. ధర్మప్రొడక్షన్‌లో స్వయంగా ఎన్నో సినిమాలు నిర్మించాడు. ఆయన ఇండియన్ సినీ పరిశ్రమకు చేసిన కృషిగాను లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎల్ఐఎఫ్ఎఫ్) ఐకాన్ అవార్డుతో సత్కరించింది. లండన్ వేదికగా గతవారం ఆన్లైన్లో నిర్వహించిన ఈ కార్యక్రమం చివరిలో కరణ్ జోహార్‌తో పాటు బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఆసిఫ్ కపాడియా ఈ ఐకాన్ ఆవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించారు. అలాగే హీరోయిన్ శృతి హాసన్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్‌లకు ఎల్ఐఎఫ్ఎఫ అవుట్ స్టాడింగ్ ఎచీవ్మెంట్ అవార్డు దక్కడం విశేషం. -
న్యూడ్‌గా కనిపించి షాకిచ్చిన జాన్వీ కపూర్.. ఫోటో వైరల్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్కిన్ షో విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. సినిమాల హిట్, ఫ్లాప్లలతో సంబంధం లేకుండా గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఆ మధ్య జాన్వీ బికినీలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఈ మధ్యకాలంలో పాత్ర డిమాండ్ చేయాలే కానీ నగ్నంగా నటించేందుకు హీరోయిన్లు ముందుకొస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా ఫోటో షూట్లోనూ కూడా నగ్నంగా కనిపించేందుకు రెడీ అంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లకు అయితే న్యూడ్‌గా, సెమీ న్యూడ్‌గా కెమెరా ముందుకు రావడానికి కామన్ అయిపోయింది. ఇటీవలె బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ నగ్నంగా దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. డబూ రత్నానీ ఫొటో షూట్ కోసం టాప్ లెస్ గా పోజులిచ్చింది. ఇప్పుడు ఆ జాబితాలోకి జాన్వీకపూర్ కూడా చేరింది. టాప్ లెస్ ఫోటోతో న్యూడ్ లుక్‌లో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టా స్టోరీలో ఈ నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. క్యాలెండర్ షూట్ కోసం ఈ ఫోటో తీసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమాలో నటిస్తుంది. ‘కోలమావు కోకిల అనే తమిళ రీమేక్ ఆథారంగా తెరకక్కుతున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి : టాప్‌లెస్ ఫోటో షూట్.. కియారా అద్వానీ ఫోటో వైరల్ ఎంతో ప్రయత్నించాను.. కానీ విడిపోక తప్పలేదు: నటి -
హల్చల్ : అనుపమ సొగసులు.. అనసూయ కవ్వింపులు..
♦ లైఫ్ ఈజ్ ట్రిక్కీ అంటోన్న అనసూయ ♦ మల్లెపూలతో న్యూ హెయిల్ స్టైల్లో అనుపమ ♦ చీరకట్టులో సిగ్గుపడుతున్న వైష్ణవి ♦ సోహేల్‌ను ఎత్తుకున్న అరియానా ♦ బిందీస్గా ఫోటోకు ఫోజిచ్చిన దివ్యాంక ♦ నీ చిక్కులు నీవేనంటోన్న దీప్తి సునయన ♦ భర్తతో రీల్స్ చేసిన సీరియల్ నటి మెరీనా View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Shravya Varma (@shravyavarma) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Marina Abraham Sahni (@marina.a1203) View this post on Instagram A post shared by aamna sharif (@aamnasharifofficial) View this post on Instagram A post shared by Moniekaaa (@monie_kaaa1) -
హల్చల్ : వెనక్కి వెళ్లనంటోన్న అనసూయ...తప్పు కాదంటోన్న ప్రియమణి
♦ అది ఎప్పటికీ తప్పు కాదంటున్న ప్రియమణి ♦ వెనక్కి వెళ్లనంటున్న అనసూయ ♦ క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న జాస్మీన్ ♦ బ్లూపర్ షేర్ చేసిన భాను ♦ తన అందానికే సీక్రెట్ ఇదేనంటోన్న కత్రినా ♦ ఆ సమస్య లేకపోతే రోజూ అవే తింటానంటున్న కల్పిక ♦ యోగాతో మోటివేషన్ అంటోన్న ఙ్ఞానేశ్వరి View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kanika Mann 🦋 (@officialkanikamann) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Kalpika Ganesh (@iamkalpika) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
హల్చల్ : సెలబ్రేషన్స్‌లో శిల్పా.. సెట్స్‌లో సన్నీలియోన్
♦ ఆ మూడ్ శాశ్వతం అంటోన్న జాన్వీ ♦ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో శిల్పా శెట్టి ♦ దానిపైనే నమ్మకం ఉంచుతానంటున్న సోనమ్ ♦ ఫోటో షూట్లతో షెహ్నాజ్ ♦ సెట్లో ఎలా ఉంటుందో చూపించేసిన సన్నీ ♦ నో క్యాప్షన్ అంటోన్న రాహుల్ సిప్లిగంజ్ ♦ బాడీతో పాజిటివ్‌గా ఉండాలంటోన్న సమీరా రెడ్డి ♦ బేబీ పింక్‌లో అందంగా ముస్తాబైన మెహ్రీన్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by manasa varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) View this post on Instagram A post shared by Nititaybawa (@nititaylor) View this post on Instagram A post shared by Ananya Nagalla Fans (@ananyanagalla.official) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) -
త్వరలోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ!
అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా రాణిస్తుంది. మరోవైపు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. విదేశాలలో ఇటీవలే చదువు పూర్తి చేసుకుని వచ్చిన ఖుషీ కపూర్ ఇప్పుడు సినిమాల్లో రాణించాలని భావిస్తోందట. తండ్రి బోనీకపూర్ కూడా ఆమెను వెండితెరకి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మొదట బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇవ్వాలని భావించినా తండ్రి బోనీ కపూర్ మాత్రం తెలుగు సినిమాతో అరంగేట్రం చేయించాలని చూస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఖుషీ కపూర్ యాక్టింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఇంతకుముందే జాన్వీ కపూర్ సైతం టాలీవుడ్లో నటించనుందనే వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్- మహేష్‌బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇవి కేవలం పుకార్లే అని తేలిపోయింది. ఇప్పటికే ఆ సినిమాలో పూజా హెగ్డేను ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ ఎవరు అన్న దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. చదవండి : శ్రీదేవి నాకు రోల్‌మోడల్ : ప్రియంక చోప్రా బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్ -
ఆలియా.. జాన్వీ... ఫైనల్‌గా ఎవరో?
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ ప్యాన్ ఇండియా మూవీని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా ఇప్పటికే పూజా హెగ్డే, రష్మికా మందన్నా, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా జాన్వీ కపూర్, ఆలియా భట్ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీని దక్షిణాది తెరకు పరిచయం చేయడానికి చాలామంది దర్శక–నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే రాజమౌళి ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలో రామ్‌చరణ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఆలియా భట్‌ను హీరోయిన్గా ఫిక్స్ చేసి ‘ఆర్ఆర్ఆర్’ జోడీని దర్శకుడు శంకర్ రిపీట్ చేస్తారా? లేక జాన్వీని కన్ఫార్మ్ చేసి, కొత్త జోడీని వెండితెరపై చూపిస్తారా? ఆలియా, జాన్వీ కాకుండా మరో హీరోయిన్ని ఎంపిక చేస్తారా? అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు. -
ఆడటం మొదలుపెట్టిన కాసేటికే
షూటింగ్లో సీన్ సీన్‌కి మధ్య బ్రేక్‌లు వస్తుంటాయి. ఆ బ్రేక్‌లో కొందరు నచ్చిన పుస్తకంలో మునిగిపోతారు. కొందరు ఏదైనా గేమ్స్ ఆడతారు. జాన్వీ కపూర్ అదే చేశారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న ‘గుడ్‌లక్ జెర్రీ’ షూటింగ్ చంఢీఘర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ బ్రేక్‌లో యూనిట్ మెంబర్స్‌తో సరదాగా క్రికెట్ ఆడారామె. ‘‘ఆడటం మొదలుపెట్టిన కాసేటికే మంచి ప్లేయర్లా ఆడగలిగాను’’ అన్నారు జాన్వీ కపూర్. ఈ బ్యూటీ పెద్ద పెద్ద షాట్స్ కొడుతుంటే యూనిట్లో అందరూ ఆశ్చర్యపోయారట. ఇక ‘గుడ్‌లక్ జెర్రీ’ విషయానికొస్తే.. తమిళంలో నయనతార నటించిన ‘కోలమావు కోకిల’కి రీమేక్ ఇది. ఇందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా నటిస్తున్నారామె. ఇది కాకుండా ‘దోస్తానా 2’ సినిమాలో నటిస్తున్నారు జాన్వీ కపూర్. -
గుడ్‌లక్ జెర్రీ
కెరీర్ ఆరంభంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం అంటే సవాల్ లాంటిదే. జాన్వీ కపూర్ అలాంటి సవాల్నే అంగీకరించారు. తమిళంలో నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ సినిమా హిందీ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జాన్వీ. ఇందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా తల్లితండ్రుల బాధ్యత తీసుకుని, కేన్సర్ బారిన పడిన తల్లిని కాపాడుకోవడానికి డబ్బు కోసం డ్రగ్స్ ముఠాలో చేరుతుంది కథానాయిక. చివరికి తన జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది కథ. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ పంజాబ్‌లో ఆరంభమైంది. ఈ చిత్రానికి ‘గుడ్ లక్ జెర్రీ’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, జాన్వీ కపూర్ లుక్‌ని విడుదల చేశారు. -
ఎన్టీఆర్ కొత్త సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న జూనీయర్ ఎన్టీఆర్ ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరోసారి జతకడుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ' సినిమా బ్లక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్‌ను కలిసి కథ వివరించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తికాగానే త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు రేడి అయ్యాడు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారంట. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ హీరోయిన్గా రష్మిక మందన్న దాదాపు ఖరారైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక మరో కథానాయిక కోసం డైరెక్టర్ త్రివిక్రమ్.. దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను సంప్రదించినట్లు సమాచారం. (చదవండి: ఎన్టీఆర్ 30 రోలింగ్ సూన్) ఒకవేళ అంతా ఓకే అయితే ఎన్టీఆర్ రెండవ హీరోయిన్గా జాన్వీ ఖారారైనట్లే. అయితే మూడవ హీరోయిన్ ఎవరన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రావల్సి ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై యస్. రాధాకష్ణ, కల్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించనున్నారు. పోలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు జయరామ్‌లు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే వర్క్ టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్ నుంచి సమాచారం. ఏప్రిల్‌లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకేళ్లేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. (చదవండి: ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ) -
స్ఫూర్తి నింపుతున్న జాన్వీ సినిమా ట్రైలర్
కార్గిల్ యుద్ధంలో విమానం నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎంత బాగుందో, ఎంత మందిలో స్ఫూర్తి నింపుతుందో అనడానికి ఈ ట్రైలర్లో ఉండే ఒక్క డైలాగ్ చాలు. ‘నేను దీన్ని చేయగలను’ అని చెప్పడం ద్వారా మీరు గౌరవం సంపాదించరు, మీరు మీ తలని కిందికి ఉంచి, చేయడం ద్వారా సంపాదించగలరు’. ఈ సినిమాలో జాన్వీ కపూర్ గుంజన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ చాలా ప్రొఫెషనల్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాలో విమానం నడపాలి అనే ఆసక్తి ఉన్న అమ్మాయిని సమాజం ఎలా నిరుత్సాహాపరుస్తుంది. వాటిని అధిగమించి ఆమె ఎలా తన కలని నెరవేర్చుకుంటుంది అనేది చాలా అద్భుతంగా చూపించారు. అదేవిధంగా భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధం కార్గిల్ వార్‌లో విమానం నడిపిన మొదటి మహిళగా గుంజన్ రికార్డు సంపాదించారు. తన పనితో అమ్మాయిలు బలహీనులు కఠినమైన పనులు చేయలేరు అని చెప్పిన వారికి తన సత్తా చూపించారు. పనిచేసే చోట మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈ సినిమాలో చూపించినట్లు అర్థం అవుతుంది. పంకజ్ త్రిపాఠి ఈ చిత్రంలో జాన్వి తండ్రిగా నటించారు. కూతురును వెన్నుతట్టి ప్రోత్సహించే తండ్రిగా ఆయన ఈ సినిమాలోనటించారు. ‘ ఒక స్త్రీ లేదా పురుషుడు విమానం నడుపుతుంటే వారిని పైలెట్ అనే పిలుస్తారు’ అని ఆయన చెప్పే డైలాగ్ భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టులో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంగద్ బేడి, వినీత్ కుమార్, మానవ్ విజ్ , అయేషా రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రం గురించి పంకజ్ మాట్లాడుతూ, “నాకు ఈ పాత్ర చాలా నచ్చింది. ఈ చిత్రం షూటింగ్లో నేను చాలా ఆనందించాను. జాన్వీ చాలా నిజాయితీ గల నటి. ఆమె నన్ను చాలా గౌరవిస్తుంది, నాకు కూడా ఆమె పని పట్ల చిత్తశుద్ధి ,నిబద్ధత కలిగి వుండటం చూసి చాలా గౌరవం పెరిగింది. శరణ్ చాలా ప్రతిభావంతుడైన దర్శకుడు’ అని పేర్కొన్నారు. చదవండి: ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ -
ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ
బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తున్నారు. సక్సేనా తొలి మహిళా భారతీయ వైమానిక దళ పైలట్. ఈ పాత్ర కోసం ఆమె కొంత సమయాన్ని గుంజన్ సక్సేనాతో గడిపారు. ఆ పాత్ర గురించి తెలుసుకుంటూ తాను నేర్చుకున్న కొన్ని విషయాలను జాన్వీ కపూర్ మీడియాతో వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ వైమానిక దళ పైలట్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం నేను సక్సేనాతో చాలా సమయం ఉన్నాను. మనం కష్టపడి పని చేస్తే ఏదైనా సాధించవచ్చు. గుంజన్ చాలా సింపుల్‌గా ఉన్నారు. కష్టపడి పనిచేస్తే ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుంది. నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలుసు. నాకు ఆ విషయంలో గిల్టీగా ఉంది. నేను చేయగలిగింది ఒక్కటే ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసి నా స్థానాన్ని సంపాదించుకోవాలి’ అని జాన్వీ కపూర్ తెలిపారు. చదవండి: అడవిలో హీరోయిన్ జీవిత పాఠాలు అంతే కాకుండా సమాజంలో ఉన్న లింగ వివక్షను ఎదిరించి సక్సేనా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారని, ఆమె ఎంతోమందికి ఆదర్శమని జాన్వీ కపూర్ అన్నారు. ఇక జాన్వీతో పాటు సక్సేనా కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, తాను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులను పంచుకున్నారు. ‘వాష్‌రూమ్స్, డ్రస్సింగ్ రూమ్స్ వంటివి లేకపోవడం ఒక సమస్య అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే మనుషుల ఆలోచనలను అధిగమించడం, నన్ను ఒక ప్రొఫెషనల్‌గా చూసేలా చూడటం. ఒక మహిళా అధికారిణిలా కాకుండా నన్ను ఒక అధికారిలా చూసేలా చేయడం అన్నింటి కంటే ముఖ్యం, అది చాలా కష్టమైన పని కూడా’ అని అన్నారు. ఇక ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఆగస్టు 12న విడుదల అవుతుంది. చదవండి: ఆ కథనంపై చలించిన సోనూసూద్ -
హిందీ హెలెన్!
హిందీ ‘హెలెన్’గా జాన్వీ కపూర్ కనిపించబోతున్నారా? అంటే అందుకు తగ్గ ప్రయత్నాలు మొదలయ్యాయనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. 2019లో మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన చిత్రం ‘హెలెన్’. అన్నాబెన్ టైటిల్ రోల్ చేశారు. ఫారిన్ వెళ్లాలనుకునే బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ ‘హెలెన్’ ఇంగ్లీష్ ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటూ ఓ రెస్టారెంట్లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తుంటుంది. కానీ ఓ రోజు ఆ రెస్టారెంట్‌లోని కోల్డ్ స్టోరేజ్‌లో ఇరుక్కుపోతుంది హెలెన్. అప్పటికే ఆ రెస్టారెంట్ మేనేజర్ తాళం వేసి వెళ్లిపోతాడు. మైనస్ 18 డిగ్రీల చలిలో హెలెన్ తనను తాను ఎలా రక్షించుకుంది? అన్నదే ఈ చిత్రం ప్రధానాంశం. హిందీలో ‘హెలెన్’ చిత్రం రీమేక్ కానుందట. జాన్వీ కపూర్ టైటిల్ రోల్ చేయనున్నారని సమాచారం. మరోవైపు ఈ ‘హెలెన్’ చిత్రం తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా రీమేక్ కానుందని తెలిసింది. -
‘కార్గిల్‌గాళ్’ విడుదల తేదీ ఖరారు
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గాళ్’ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. ఈ సినిమా ఆగస్టు 12న నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ‘ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ఎయిర్‌ఫోర్స్ పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావటం చాలా గర్వంగా ఉంది.ఆమె జీవితం నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. మీకు కూడా స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తూన్నా. ‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గాళ్’ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుంది’ అని కామెంట్ జత చేశారు. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన మూడు మోషన్ పోస్టర్లను జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (నడిరోడ్డుపై డాన్స్ చేస్తా..!) View this post on Instagram Proud to bring to you the story of India’s first woman Air Force Officer to go to war. A journey that I hope will inspire you the way that it has inspired me. 🤞🏻GunjanSaxena - The Kargil Girl is landing on 12th August to your #Netflix screens! @dharmamovies @zeestudiosofficial @karanjohar @apoorva1972 @pankajtripathi @angadbedi @vineet_ksofficial @manavvij @sharansharma @netflix_in @zeemusiccompany A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Jul 15, 2020 at 9:33pm PDT ఈ చిత్రం విడుదల తేదీ ఖరారుకు ముందు రోజు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గాళ్’ మూవీకి సంబంధించి ప్రత్యేకమైన ప్రయాణాన్ని మీ అందరితో పంచుకోవడానికి వేచి ఉండలేకపోతున్నా. నా సస్పెన్స్‌కు నెట్ ఫ్లిక్స్ తొందరంగా ముగింపు ఇవ్వాలి’ అని కామెంట్ జతచేశారు. శరణ్ శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను చిత్ర బృందం మార్చి 13న విడుదల చేయాలనుకుంది. ఆ తర్వాత ఏప్రిల్ 24కు వాయిదా వేశారు. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడటంతో విడుదల సాధ్యపడలేదు. (హిందీకి హిట్) View this post on Instagram Can’t wait to share this very special journey of #GunjanSaxena with all of you 🤞🏻❤️ #ComeOnNetflix pleeease can we end the suspense 🙈 @dharmamovies @zeestudiosofficial @karanjohar @apoorva1972 @pankajtripathi @angadbedi @vineet_ksofficial @manavvij @sharansharma @netflix_in @zeemusiccompany A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Jul 15, 2020 at 5:32am PDT -
‘సెలబ్రిటీ హోదా’ అనేది ఒక అదృష్టం
రొమాంటిక్ డ్రామా ‘ధడ్కన్’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ‘గ్లామర్ డాల్’ పాత్రలకు మాత్రమే పరిమితం కాదల్చుకోలేదు... అందుకే ‘గుంజనా సక్సేనా: ది కార్గిల్ గర్ల్’తో సినీ పండితుల ప్రశంసలు అందుకుంది. ‘ఘోస్ట్స్టోరీస్’లో ‘నర్స్’ పాత్రతో మెప్పించింది. కవిత్వం కూడా రాసే ఈ అమ్మాయి కబుర్లు... అయినా సరే... సినిమా కుటుంబంలో పుట్టి పెరిగినా, సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాగని సినిమాలు అంటే ఆసక్తి లేదని కాదు. కాలేజీకి బంక్ కొట్టి రోజుకు అయిదు సినిమాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. అమ్మతో పాటు షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. కొత్త విషయాలు తెలుసుకోవాలని, కొత్త ప్రదేశాలు చూడాలనే ఆసక్తి మాత్రం ఉండేది. యాక్టింగ్ స్కూల్లో శిక్షణ అయితే తీసుకున్నానుగానీ, అక్కడ నేర్చుకున్నవాటిలో కొన్ని పాఠాలకు నేను సరిపోనేమో అనిపించింది. నా ఇష్టం ‘సెలబ్రిటీ హోదా’ అనేది ఒక అదృష్టం. ప్రేక్షకుల మాటేమిటోగానీ నన్ను నేను ఎప్పుడూ సెలబ్రిటీ అనుకోను. సినిమాల్లోకి వచ్చిన తరువాత నా గురించి నేను మాట్లాడడం ఎక్కువైంది. అడిగిన వారికి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం, సెల్ఫీలు దిగడం కూడా కొత్తగానే ఉంది. వీటి కంటే నాకు బాగా ఇష్టమైనది... ఇంటికెళ్లి హాయిగా ఐస్‌క్రీమ్‌లు లాగించడం. పార్టీలకు వెళ్లడం బొత్తిగా ఇష్టం ఉండదు. పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. కవిత్వం రాయడం అంటే ఇష్టం. రాత్రివేళల్లో పాత హిందీ సినిమాలు చూడడం అంటే ఇష్టం. నా అదృష్టం కెరీర్ కోసం పరుగులు తీయాలని లేదు. చా...లా నెమ్మదిగా, ఆచితూచి నాకు ఇష్టమైన పాత్రలు చేయాలని ఉంది. ‘గుంజన్ సక్సేనా’ సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టం. విభిన్నమైన సినిమాలలో నటించడం ద్వారా నన్ను నేను నిరూపించుకోవాలను కుంటున్నాను. కుటుంబ నేపథ్యంతో సంబంధం లేని, ఏమాత్రం పరిచయంలేని పాత్రలను పోషించడం నిజంగా సవాలు. దీని మూలంగా మనకు ఒక కొత్త ప్రపంచం పరిచయమవుతుంది. ‘ధడ్కన్’ సినిమా నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చింది. ‘గ్లామర్‌గా కనిపించాలి’ అంటూ ప్రయాసపడిపోను. జీవితంలో ఇంతకంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. నాకు నచ్చిందే చేస్తాను. భూమి మీదికి... ఫిల్మ్స్ ప్రమోషన్ల సమయంలో ప్రతి ఒక్కరూ ‘నీ కంటే ముఖ్యమైన వ్యక్తి ఈ భూప్రపంచంలో ఎవరూ లేరు!’ అన్నట్లు చూస్తారు. ‘మీరు ఏం తింటారు?’, ‘ఎన్ని గంటలకు నిద్రిస్తారు?’, ‘మీ ఆలోచనలు ఏమిటి?’... ఇలా ప్రతి ఒక్కటీ తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతారు... ఇదంతా చూసి మనకేదో ప్రత్యేకత ఆపాదించుకోవడం అర్థం లేని వ్యవహారం. అసలు మనమేమిటో మన పనే చెబుతుంది. తెలిసో తెలియకో అప్పుడప్పుడూ భూమికి చాలా దూరంగా కాల్పనిక ప్రపంచంలో విహరిస్తుంటాను. అలాంటి సమయంలో ఎవరైనా నన్ను తిరిగి భూమి మీదికి తీసుకువస్తే బాగుణ్ణు అనిపిస్తుంది! -
ఆ విషయంలో నన్ను ఎక్కిరించేవారు: ఖుషీ కపూర్
ముంబై: శ్రీదేశి, బోనికపూర్‌ల ముద్దుల తనయ ఖుషి కపూర్ తాను బాధపడిన విషయాల గురించి, అభద్రతకు లోనైన సంఘటనలకు సంబంధించి ఒక భావోద్వేగమైన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. క్వారంటైన్ టేప్స్ పేరుతో తన వీడియోలను తన ఎకౌంట్లో ఖుషి పోస్ట్ చేస్తోంది. ఈ వీడియోలో ఖుషి తాను ఒక 19 యేళ్ల అమ్మాయిని అంటూ తనని తాను పరిచయం చేసుకుంది. తాను ఇప్పుడు కనిపిస్తున్నట్లు లేనని తాను పరిపక్వత చెందాను అని తెలిపింది. ఇంకా మాట్లాడుతూ... ‘నేను ఎలా ఉండాలనుకున్నానో అలా లేను, దాని కోసం నేను ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. నేను ఏం చేయకపోయిన చాలా మంది నన్ను పొగుడుతూ ఉంటారు. నేను వారిని సంతోషపరచడానికి ఏదో ఒకటి చేయగలను’ అని పేర్కొంది. (ఆ రియాక్షన్ మాకు ఆక్సిజన్) ఆ తరువాత తనకి చాలా సిగ్గు, బిడియం ఎక్కువ అని ఆ కారణంగా తను చాలా సార్లు అవమానాలు ఎదుర్కొన్నానని పేర్కొంది. తనను అమ్మ(హీరోయిన్ శ్రీదేవి)లాగా , అక్క జాన్వీ కపూర్ లాగా లేవంటూ చాలా మంది ఎక్కిరించేవారని కూడా తెలిపింది. అది మానసికంగా తనని చాలా ఇబ్బందులకు గురిచేసిందని తెలిపింది. దీంతో తినే పద్దతిని, డ్రెస్సింగ్ స్టైల్‌ని కూడా మార్చుకున్నట్లు తెలిపింది. ఇక వీడియో చివరిలో ఇటువంటి అన్నింటి కారణంగా తనని తాను ప్రేమించడం నేర్చుకున్నానని తెలిపింది. తాను ఎలా ఉన్నా, తన రంగు ఎలా ఉన్నప్పటికి తనని తాను ఇష్టపడటం అలవాటు చేసుకున్నట్లు చెప్పింది. ఇతరుల గురించి పక్కన పెట్టి మీరు ఏం చేయాలనుకున్నారో అదే చేయండి. తరువాత మిమ్మల్ని అందరూ వాళ్లంతట వారే మెచ్చుకుంటారు అంటూ ఖుషి తన వీడియోని ముగించింది. (సహాయం కోసం వేలం) -
ఎంతో నేర్చుకున్నా
‘‘లాక్ డౌన్లో ఉండి వారం అవుతోంది. ఈ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. రోజూ తింటున్న ఆహారం విలువ తెలిసింది. తినడానికి కావాల్సినంత ఉండటం అదృష్టం అనే విషయం అర్థం చేసుకున్నాను. కానీ ఇంట్లో తినడానికి సరిగ్గా ఆహారంలేక ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడానికి సాహసం చేసి బయటకు వెళ్తున్న వాళ్లను చూస్తుంటే ఏదో తెలియని బాధ. ఇలాంటివాళ్ల గురించి ఇన్ని రోజులూ ఆలోచించకుండా నేనెంత స్వార్థంతో, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించానో తెలుసుకున్నాను. ప్రతిరోజూ మా నాన్నగారు మమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నారో తెలుసుకున్నాను. మా పనుల్లో మేము ఉండి ఇంటికి తిరిగొచ్చే సమయం వరకు మా కోసం ఆయన ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థమయింది. నా రోజువారీ జీవితం సాఫీగా సాగిపోవడానికి ఎంతమంది మీద ఆధారపడ్డానో అర్థమయింది. మా ఇంటికి నేను చాలా అవసరం అనే సంగతి గ్రహించాను. వాళ్లందరినీ బాధ్యతగా చూసుకోవాలని తెలుసుకున్నాను. వాళ్ల ఆరోగ్యమే నా ఆరోగ్యం అని తెలుసుకున్నాను’’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు జాన్వీ కపూర్. -
బాలీవుడ్ లేడీస్
టైటిల్ కార్డ్స్‌లో ఫస్ట్ హీరో పేరే పడుతుంది. ఆ తర్వాతే హీరోయిన్‌ది. కథ హీరో చుట్టూ తిరుగుతుంది. హీరోయినేమో హీరో చుట్టూ తిరుగుతుంది. హీరో విలన్‌తో ఫైట్ చేస్తే, హీరోతో హీరోయిన్ డ్యూయెట్ పాడుతుంది. ఒకప్పుడు కథని లాగాలంటే హీరోనే కావాలి అన్నట్టుండేది పరిస్థితి. కానీ ప్రతీ జనరేషన్లో కొందరు హీరోయిన్లు ఆ విధానాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించారు. స్టీరింగ్ తమ చేతుల్లోకి తీసుకొని సోలో సినిమాలు చేశారు. ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే ముందు తమకో మార్కెట్‌ను సృష్టించుకున్నారు. ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలు చేశారు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ జనరేషన్లో ఓ నలుగురు హీరోయిన్లు నాలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఆ నలుగురిలో ఒక్క పరిణీతీ చోప్రా మినహా మిగతా ముగ్గురు కెరీర్లో ఇంకా బుడిబుడి అడుగులే వేస్తున్నారు. అయినా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి సిద్ధపడ్డారు. సగం రిస్క్ అనుకుంటే మిగతా సగం మారుతున్న ఆడియన్స్ టేస్ట్ అనుకోవచ్చు. బాలీవుడ్లో లీడ్ క్యారెక్టర్స్‌కి సై చెప్పి, లీడింగ్ లేడీస్ అయిన తారల విశేషాలు... సక్సెస్ సక్సేనా... తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’. ‘ధడక్’తో కథానాయికగా పరిచయమై, రెండో సినిమాకే లేడీ ఓరియంటెడ్ సినిమా ఒప్పుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు జాన్వీ కపూర్. గుంజన్ సక్సేనాకు, జాన్వీకు ఓ పోలిక పెట్టొచ్చు. గుంజన్ సక్సేనా పైలెట్ అవ్వాలి, గాల్లో విహరించాలి అని కలలు కన్నారు. అవన్నీ ఉత్తి గాలి మాటలు అనుకున్నారు. ‘అమ్మాయిలు పైలెట్ కాలేరు’ అని ఆమెను తేలికగా తీసుకున్నారు. కానీ గుంజన్ తన కలను సీరియస్‌గా తీసుకున్నారు. పట్టుదలతో పైలెట్‌గా మారారు. యుద్ధ విమానాన్ని నడిపిన తొలి పైలెట్‌గా చరిత్రలో నిలిచిపోయారు. తను విహరించిన ఫ్లైట్ నుంచి చూస్తే తనని హేళన చేసిన వాళ్లు కనిపించి కూడా ఉండరు. ఇది ఆమె సక్సెస్. జాన్వీకి నటిగా ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది. ఈ సినిమా ఎంచుకున్నప్పుడు ‘సేఫ్ గేమ్ ఆడుకోవచ్చుగా. అప్పుడే సోలో సినిమానా!’ అనే సెటైర్లూ వినిపించాయి. జాన్వీ తన రోల్‌ని సీరియస్‌గా తీసుకున్నారు. పైలెట్‌గా ట్రైనింగ్ తీసుకున్నారు. తన నిర్ణయం కరెక్టో కాదో వచ్చే ఏడాది మార్చి 13న తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన లుక్‌కి మాత్రం మంచి స్పందన వచ్చింది. ఆ విధంగా ప్రస్తుతానికి జాన్వీ సక్సెస్ అయ్యారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. టీనా.. కెటీనా అయింది కొందరికి చేతి నిండా ఉంగరాలుంటాయి. ఏంటీ అంటే మా జ్యోతిష్కుడు చెప్పాడంటారు. పేరులో ఒక అక్షరం పెరుగుతుంది. ఎందుకు? అంటే మళ్లీ అదే కారణం. మూఢ నమ్మకాల మీద సెటైరికల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కెటీనా’. మూఢ నమ్మకాల్ని నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారు. అందుకే ఈ కథ అంటున్నారు దిశా పటానీ. ఏక్తా కపూర్ నిర్మాణంలో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆషిమా చిబ్బర్ దర్శకత్వం వహిస్తున్నారు. మూఢ నమ్మకలను పాటించే టీనా అనే టీనేజ్ అమ్మాయిగా దిశా కనిపిస్తారు. వాస్తవానికి తన పేరు టీనా. పేరుకి ముందు కె కలిపితే కలిసొస్తుందని జోత్యిష్కుడు చెబుతాడు. దాంతో టీనా కాస్తా కెటీనా అవుతుంది. హాట్ క్యారెక్టర్స్‌లో కనిపించే దిశా పటానీ ఇందులో ఓ మధ్య తరగతి అమ్మా యిలా కనిపిస్తారట. డబుల్ ధమాకా పరిణీతీ చోప్రా హీరోయిన్గా మారి ఎనిమిదేళ్లు కావస్తోంది. డజన్ సినిమాల వరకూ చేశారు. కెరీర్లో తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ఒకటి కాదు ఏకంగా రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్నారామె. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా’. ఇందులో సైనా పాత్ర చేస్తున్నారు పరిణీతి. సైనాగా మారడానికి శిక్షణలో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే బ్యాడ్మింటన్ ఆడుతూ గాయపడ్డారు కూడా. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’ అనే సినిమా చేస్తున్నారు. అదే టైటిల్‌తో వచ్చిన ఇంగ్లీష్ సినిమాకి ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలోనూ పరిణీతీ చోప్రానే లీడింగ్ లేడీ. రిబ్బు దాస్ గుప్తా దర్శకుడు. ఇందులో పరిణీతితో పాటు అదితీ రావ్ హైదరీ, కృతీ కుల్హరీ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇలా ఒకేసారి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు పరిణీతీ చోప్రా. నెట్లో పడతాడా? ‘పదహారూ ప్రాయంలో నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలి. నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలి...’ అని పాడుతున్నారు ఇందూ. తనకి తగినవాడు, తన బాయ్‌ఫ్రెండ్ దొరికే వరకూ డేటింగ్ యాప్స్ అన్నీ తెగ వెతికేస్తున్నారు. ఇంటర్నెట్ను వడకడుతున్నారు. మరి డేటింగ్ యాప్స్‌లో ఆమె వేసిన నెట్లో ఎవరు పడతారు? ఎలా పడతారు? అనేది సినిమా కీలకాంశం. డేటింగ్ యాప్స్ వల్ల ఇబ్బందులు పడే ఇందూగా కియారా అద్వానీ ఓ సినిమా చేస్తున్నారు. ‘ఇందూ కీ జవానీ’ టైటిల్. ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అబిర్‌సేన్ గుప్త దర్శకుడు. లేడీ ఓరియంటెడ్ మూవీస్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు వస్తాయి. ఆ హిట్ సినిమాలో ఉన్న హీరోయిన్ తన భూజాల మీద సినిమాని మోయగలదని నిరూపించుకుంటుంది. మరి.. బలనిరూపణలో ఈ నలుగురు తారలు ఎంత స్కోర్ చేస్తారనేది తెలియడానికి కాస్త టైమ్ ఉంది. ఏది ఏమైనా ధైర్యంగా ఒప్పుకున్నారు కాబట్టి.. కమర్షియల్ సినిమాలకు ప్యారలల్‌గా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా వచ్చేంత మార్కెట్ వారికి ఏర్పడాలని ఆశిద్దాం. – గౌతమ్ మల్లాది ∙దిశా పటానీ -
గరిటె తిప్పుతున్న బోనీకపూర్.. వెనుక జాన్వీ..
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్‌కు తన తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అంటే ఎనలేని ప్రేమ. తండ్రే తన బలమని చెప్తుంది జాన్వీ. అయితే నాన్నకూచి అయిన జాన్వీ బోనీని ఎంతగానో మిస్ అవుతుందట. ఈ మేరకు కొన్ని అందమైన జ్ఞాపకాలను మిగిల్చిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో భాగంగా.. నటనలో శిక్షణ తీసుకుంటున్న మూడో కుమార్తె ఖుషీతో కలిసి బోనీకపూర్ న్యూయార్క్‌లో ఉంటున్నారు. వీరిద్దరూ అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోలను జాన్వీ అభిమానులతో పంచుకుంది. నాన్న పక్కన తను లేనన్న బాధతో మిస్ అవుతున్నానంటూ క్యాప్షన్ జోడించింంది. దీంతోపాటు చంఢీఘడ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి పంజాబీ ఆహారాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోను పంచుకుంది. అన్నింటికన్నా మించి తండ్రితో కలిసి దిగిన చిన్ననాటి ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో తండ్రి బోనీకపూర్ వంటగదిలో గరిటె తిప్పుతుంటే వెనక నుంచి జాన్వీ, ఖుషీ, వీరి స్నేహితురాలు అతన్ని హత్తుకున్నారు. ఈ ఫొటో చూసినవారంతా వారి మధ్య ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు. కాగా సోమవారం 64వ పడిలోకి అడుగుపెట్టిన తండ్రికి జాన్వీ కపూర్ భావోద్వేగ శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. ధడక్ సినిమాతో తెరంగ్రేటం చేసిన జాన్వీ ప్రస్తుతం ‘దోస్తానా 2’ షూటింగ్లో బిజీగా ఉంది. (చదవండి: తండ్రికి జాన్వీ కపూర్ భావోద్వేగ పోస్టు) -
సవ్యంగా సాగిపోవాలి
తన కొత్త సినిమా ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సవ్యంగా సాగిపోవాలని ప్రార్థిస్తున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్. కార్తీక్ ఆర్యన్, లక్ష్య, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్న హిందీ చిత్రం ‘దోస్తానా 2’. ఈ సినిమాకు కొల్లిన్ డి కున్హా దర్శకుడు. 2008లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంకా చోప్రా నటించిన ‘దోస్తానా’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా చిత్రీకరణ పంజాబ్‌లో ప్రారంభం కానుంది. చిత్రీకరణకు ముందు కాస్త సమయం దొరకడంతో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకున్నారు జాన్వీ కపూర్. ‘దోస్తానా 2’ చిత్రాన్ని బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్‌జోహార్ నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
విజయ్ దేవరకొండతో చేసే అవకాశం వస్తే..
సినిమా: జాన్వీకపూర్ ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది అతిలోక సుందరి శ్రీదేవినే. ముద్దుముద్దు మాటలు, వడివడి అడుగులతో చిరు వయసులోనే కళామతల్లి ఒడికి చేరిన నటి శ్రీదేవి అన్నది తెలిసిందే. అలా తన నట జీవితానికి శ్రీకారం చుట్టుకున్న ఆమె ఆల్ ఇండియా సూపర్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. జీవితం అంటే ఆనందమే కాదు. ఆపదలు ముంచుకొస్తాయి. అలాంటి అసంభావంతో తనువు చాలించిన నటి శ్రీదేవి. ఆమెకు ఇద్దరు కూతుళ్లన్న విషయం తెలిసిందే. అయితే వారిని నటిగా చూడడానికి శ్రీదేవి మొదట్లో ఇష్టపడలేదు. అందుకేనేమో తన పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్గా నటించిన తొలి చిత్రాన్ని కూడా చూడకుండానే ఈ లోకాన్ని వీడింది. ఏదేమైనా శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ హీరోయిన్ అయిపోయింది. హిందీలో పలు చిత్రాలతో బిజీగా ఉంది. అయితే ఈ చిన్నదానికీ తన తల్లి మాదిరిగా దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి ఉంది. ఈ విషయాన్ని తనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. కాగా జాన్వీ తండ్రి, శ్రీదేవి భర్త బోనీకపూర్ బాలీవుడ్లో ప్రముఖ నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చాలా కాలం తరువాత తమిళంలో అజిత్ కథానాయకుడిగా నేర్కొండ పార్వై చిత్రాన్ని నిర్మించారు. అందులోనే నటి జాన్వీకపూర్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అందులో జాన్వీ నటించలేదు. నేర్కొండపార్వై చిత్రం మంచి ఫలితాన్నివ్వడంతో తాజాగా మళ్లీ అజిత్ హీరోగా చిత్రం చేస్తున్నారు. నేర్కొండ పార్వై చిత్రం ఫేమ్ హెచ్.వినోద్‌నే ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి వలిమై అనే టైటిల్‌కు నిర్ణయించారు. చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందంతా తెలిసిన విషయమే. అయితే తాజాగా మరోసారి ఈ చిత్రానికి సంబంధించి జాన్వీకపూర్ పేరు వినిపిస్తోంది. దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న ఆసక్తిని వ్యక్తం చేసిన జాన్వీకపూర్ తెలుగులో విజయ్‌దేవరకొండతో రొమాన్స్ చేసే అవకాశం వస్తే నటించడానికి సిద్ధం అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. తాజాగా అజిత్ హీరోగా ఆమె తండ్రి నిర్మిస్తున్న వలిమై చిత్రంతో జాన్వీ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతుందనే టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం అధికారకంగా వెల్లడి కాలేదన్నది గమనార్హం. ఇకపోతే బోనీకపూర్ హిందీ చిత్రం పింక్‌ను తమిళంలో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులోనూ నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో జాన్వీకపూర్ నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటి గురించి కచ్చితమైన వివరాలు తెలియడానికి మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
సెలవుల్లోనూ వర్కవుట్
‘‘ఎక్సర్సైజ్లకు సెలవు ఇవ్వకండి.. బద్దకించకుండా వర్కవుట్లు చేయండి.. చక్కగా ఉండండి’’ అంటున్నారు జాన్వీ కపూర్. ‘ధడక్’ చిత్రంతో కథానాయిక అయిన జాన్వీ వరుసగా సినిమాలు సైన్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఎంతసేపూ పని అంటే బోరే కదా.. అందుకే తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్‌తో కలిసి విహార యాత్ర ప్లాన్ చేసుకున్నారు. ఈ ముగ్గురూ న్యూయార్క్ చెక్కేశారు. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగ్‌లకైతే సెలవు చెప్పారు కానీ వ్యాయామాలకు మాత్రం ‘నో హాలిడే’ అన్నారు జాన్వీ. వెకేషన్లో కూడా వర్కవుట్లు చేస్తున్నారు. న్యూయార్క్‌లోని జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న ఓ వీడియోను జాన్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిట్నెస్ మీద ఈ బ్యూటీకి ఎంత శ్రద్ధో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శ్రీదేవి కూడా అంతే. ఫిట్నెస్కి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. 50 ఏళ్ల వయసులోనూ మంచి శరీరాకృతితో ఉండేవారామె. కూతురికి కూడా తల్లిలా ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రస్ట్ అని చెప్పొచ్చు. ఇక సినిమాల విషయానికొస్తే, తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’లో టైటిల్ రోల్ చేశారు జాన్వీ. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక వెకేషన్ నుంచి ముంబై తిరిగి రాగానే ‘దోస్తానా 2’ షూటింగ్లో పాల్గొంటారు. -
అందమైనపు బొమ్మ
శ్రీదేవి గొప్ప అందగత్తె. అంతకు మించిన గొప్ప నటి. సౌతిండియా నుంచి నార్తిండియా వరకూ తన ప్రతిభతో లేడీ సూపర్‌స్టార్ అయ్యారు. ఓ బ్రాండ్లా ఎదిగారు. అనూహ్యంగా గత ఏడాది శ్రీదేవి మరణించారు. అందరి మనసుల్లో చెరిగిపోని బొమ్మగా నిలిచిపోయారు. ఇప్పుడు సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో అందమైన మైనపు బొమ్మగా మారారు శ్రీదేవి. ఈ మైనపు విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘‘శ్రీదేవి మరణించిన తర్వాత కూడా ఆమె మీద కురిపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తను చేసిన సినిమాల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటుంది. నా భార్యగా తనని ఎంతగా ప్రేమించానో, తన ఆర్ట్‌ని, తనకు సినిమా మీద ఉన్న ప్రేమను అంతే గౌరవించాను. ఈ విగ్రహం తన ఆనవాళ్లకు ఓ చిహ్నంలా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు బోనీ కపూర్. ‘మిస్టర్ ఇండియా’ సినిమాలోని ‘హవా హవాయి..’ పాటలో శ్రీదేవి లుక్ ఆధారంగా ఈ మైనపు బొమ్మ తయారు చేశారు. తల్లి బొమ్మను తదేకంగా చూస్తున్న జాన్వీ శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి -
ఆకాశమే నీ హద్దు కాకూడదు
అమ్మాయిలు పైలెట్ కాలేరు. అమ్మాయిలు పైలెట్ అవడం ఏంటి? విహంగయానం చేయాలనుకున్న గుంజన్ సక్సేనాతో ఇరుగుపొరుగు అన్న మాటలివి. ఎవరో ఏదో అన్నారని గుంజన్ వెనక్కి తగ్గలేదు. సరి కదా.. పైలెట్ కావాలనే ఆమె ఆశయం రోజు రోజుకి బలపడింది. సంకల్పం బలమైనదైనప్పుడు ఆశయం నెరవేరుతుంది. గుంజన్ పైలెట్ అయ్యారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తొలి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా చరిత్రలో నిలిచిపోయారు కూడా. ఈ సక్సెస్ఫుల్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘గుంజన్ సక్సేనా: కార్గిల్ గాళ్’. గుంజన్ పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. శరణ్ శర్మ దర్శకత్వంలో కరణ్ జోహార్, అపూర్వా మెహతా, హీరూ జోహార్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడీ, వినీత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు. ‘‘ఆకాశమే నీ హద్దు కాకూడదు. దానికి మించిన ఎత్తుకు నువ్వు ఎదగాలి. చాలా గర్వపడుతున్నాను బేటా. అందరు తండ్రులు తమ పిల్లల్ని చూసి గర్వపడేలా చేస్తావని అనుకుంటున్నాను. త్వరలోనే ఈ ప్రపంచం కూడా నీకు చప్పట్లు కొడుతుంది’’ అని ఒక్కో పోస్టర్‌కు ఒక్కో అభినందనను తన ట్వీటర్లో రాశారు జాన్వీ తండ్రి బోనీ కపూర్. ‘ధడక్’తో హీరోయిన్గా పరిచయమై, నటిగా మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ మలి చిత్రంగా ‘గుంజన్ సక్సేనా’ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 13న విడుదల కానుంది. -
ఆ వార్తల్లో నిజం లేదు : బోనీ కపూర్
ధడక్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్‌కు సౌత్ సినిమాలపై ఆసక్తి లేదనే వార్తలు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోల పక్కన అవకాశం వచ్చినా.. ఆ ఆఫర్స్ అన్నింటిని తిరస్కరిస్తోందని వార్తలు హల్చల్ చేస్తున్న తరుణంలో ఈ రూమర్స్‌పై బోనీ కపూర్ పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తమకు సౌత్ సినిమాలంటే ఇష్టమని.. శ్రీదేవీ అక్కడి నుంచే వచ్చిందని, సూపర్‌స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇలా ప్రముఖ హీరోలందరితో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని బోనీ కపూర్ చెప్పుకొచ్చాడు. మహేష్‌బాబుతో, రామ్‌చరణ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని, జాన్వీ వాటికి తిరస్కరించందనే వార్తల్లో ఏమాత్రం నిజంలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే సౌత్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుందని, సరైన కథ కోసం ఎదురుచూస్తున్నామని బోనీకపూర్ తెలిపాడు. తాజాగా అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన ‘నేర్కొండ పార్వై’ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
జాన్వీ కపూర్ ఎందుకు రాలేదు!?
ముంబై: బోనీ కపూర్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం 'మైదాన్'. ఫుట్‌బాల్ కథాంశం నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ముంబైలో మంగళవారం ప్రారంభమైంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభ వేడుకకు బోనీ కపూర్ కుటుంబం సహా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. కానీ, బోనీ కపూర్-శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ మాత్రం కనిపించలేదు. ఈ సినిమా పూజ కార్యక్రమంలో బోనీ కపూర్ తన పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా, ఖుషీతో కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ఈ వేడుకకు జాన్వీ కపూర్ ఎందుకు హాజరుకాలేదన్న దానిపై వివరాలు తెలియదు. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల షూటింగ్ కారణంగా ఈ సినిమా పూజ కార్యక్రమానికి ఆమె రాలేకపోయారా? అన్నది తెలియదు. ఇక 1952 - 62 మధ్యకాలంలో భారత ఫుట్‌బాల్ క్రీడా వైభవాన్ని చాటేలా తెరకెక్కుతున్న ‘మైదాన్’లో అజయ్ దేవ్‌గణ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రను పోషిస్తుండగా, కీర్తి సురేష్ మరో కీలక పాత్రలో నటించబోతున్నారు. -
దెయ్యాల కథలు చెబుతా
భూత, ప్రేత కథలను చూపిస్తానంటున్నారు జాన్వీ కపూర్. భయాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ కావాలనే షరతు కూడా పెట్టారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో సత్తా చాటేందుకు తొలిసారి ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌కు సైన్ చేశారు జాన్వీ కపూర్. జాన్వీకి జోడీగా ‘గల్లీభాయ్’ ఫేమ్ విజయ్ వర్మ నటిస్తున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో బాగా పాపులరైన ‘లస్ట్‌స్టోరీస్’కు దర్శకత్వం వహించిన జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీల ఆధ్వర్యంలో ఈ ‘ఘోస్ట్ స్టోరీస్’ రూపొందనుంది. ‘లస్ట్ స్టోరీస్’ మాదిరిగానే ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందనున్న భాగంలో జాన్వీ, విజయ్ నటిస్తారు. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలైంది. మరి.. లస్ట్‌స్టోరీస్‌లా ఈ ‘ఘోస్ట్ స్టోరీస్’ సిరీస్ కూడా డిజిటల్ ఆడియన్స్‌ను మెప్పిస్తుందా? వెయిట్ అండ్ సీ. -
చట్రంలో చిక్కిపోతున్నారు!
సినిమా సమాజానికి అద్దమైతే... ఒక్కోసారి ఆ అద్దం మీద పడ్డ కాంతి కళ్లను జిగేలుమనిపిస్తుంది.ఆ జిగేలే జీవితం అనుకుని చాలామంది మనసు పాడు చేసుకుంటారు.హీరోయిన్ సన్నగా ఉంటే.. అలా చిక్కిపోవాలని... బొద్దుగా ఉంటే అలానే తయారవ్వాలనే ఫీలింగ్‌తో ఓ చట్రంలో చిక్కుకుపోతున్నారు. బొద్దుగా ఉంటే ముద్దు అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. సినిమాలో హీరోయిన్లు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉండరని చిక్కిపోతేనే చాన్సులు చిక్కుతాయని సన్నబడే చట్రంలో చిక్కుకుంటున్నారు.వాళ్ళను చూసి మనమూ చిక్కుకుపోకుండా ఉంటేనే బెటర్. బొద్దుగా, సన్నగా, నాజూకుగా, జీరో సైజ్... ఎలా ఉండాలన్నది పర్సనల్ చాయిస్. ప్రస్తుతం హీరోయిన్ల చాయిస్ స్లిమ్ వైపుకు మళ్లింది. దాంతో వాళ్ల దారి జిమ్‌కు మళ్లింది. బరువును తేలికగా తీసుకోవడం మానేశారు. వెయిట్ లాసే క్యారెక్టర్ గెయిన్ అంటున్నారు. పాత్ర బరువైనది అయితే ఆ బరువును మోయడానికి సన్నగా మారిపోవడానికి సిద్ధమయ్యారు. స్క్రిప్ట్ బావుంటే స్ట్రిక్ట్ డైట్‌కి కట్టుబడి ఉంటున్నారు. సినిమాలో కొత్త లుక్ కోసం మారిన వాళ్లు కొందరైతే, లుక్‌నే మార్చేయాలనే ఉద్దేశంతో తగ్గిన వాళ్లు ఇంకొందరు. అలా ఈ మధ్య కాలంలో సన్నగా మారిన కథానాయికలపై స్పెషల్ స్టోరీ. సైలెన్స్ కోసం సైలెంట్‌గా ‘భాగమతి’ తర్వాత కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు అనుష్క. ఈ గ్యాప్‌లో సైలెంట్‌గా లుక్ మార్చేసే పనిలో పడ్డారు. ‘సైజ్ జీరో’ సినిమా కోసం పెరిగిన వెయిట్నంతా తగ్గించేయాలనుకున్నారు. అలాగే ‘బాహుబలి’లో కనిపించనదానికన్నా స్లిమ్‌గా అయిపోవాలనుకున్నారు. అందుకే చాలా రోజులు బయటకు కూడా కనిపించకుండా సైలెంట్‌గా చిక్కిపోయారు. ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సైలెంట్ థ్రిల్లర్‌లో నటించారామె. ఇందులో మాధవన్, అంజలి, షాలినీ పాండే, హాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ‘నిశ్శబ్దం’లో సరికొత్త అనుష్కను చూస్తారని చిత్రబృందం ప్రామిస్ కూడా చేసింది. ఈ ఏడాది చివర్లో అనుష్కను కొత్త లుక్‌లో చూడొచ్చు. ఈ చిత్రం షూటింగ్ సోమవారంతో పూర్తయింది. హిట్ చేయడానికి ఫిట్‌గా... పోలీస్ ఆఫీసర్ అంటే ఫిట్‌గా.. ఎవరైనా తప్పు చేస్తే హిట్ చేసేంత టఫ్‌గా ఉండాలి. అందుకోసమే మరింత స్లిమ్‌గా మారిపోయారు అంజలి. ఇంతకుముందు బొద్దుగా ఉండే అంజలి ఈ మధ్య ఎక్స్ట్రా వెయిట్‌ని కట్‌చేసి స్లిమ్‌గా మారిపోయారు. తెలుగులో సినిమాలు చేయడం కొంచెం తగ్గించినా తమిళంలో స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారామె. ‘నిశ్శబ్దం’ మూవీలో ఓ కీలక పాత్ర చేశారు. అది కూడా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. యూనిఫామ్ వేసుకోవడం కోసం ఎనిమిది కిలోలను నిర్దాక్షిణ్యంగా తగ్గించేశారు. వెయిట్ తగ్గిన తర్వాత ఫిట్‌గా అనిపిస్తుందని తెలిపారు. బికినీ బేబ్ ఇంతకుముందు లక్ష్మీ రాయ్. ఇప్పుడు రాయ్ లక్ష్మీ. పేరు మారింది. ఫిజిక్ కూడా మారిపోయింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న లక్ష్మీరాయ్ ఆ తర్వాత తగ్గారు. ఇప్పుడు ఏకంగా బికినీకి సెట్ అయ్యేట్లు తన ఫిజిక్‌ని సెట్ చేసుకున్నారు ‘ఫిట్నెస్ అంటే కేవలం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండటమే కాదు. మెంటల్‌గానూ ఫిట్‌గా ఉంటాం. నాలో ఈ కొత్తమార్పుని ప్రేమిస్తున్నాను. ఇంతగా బరువు తగ్గడంకోసం చాలా కష్టపడ్డాను. ఫిట్‌గా మారాక కొత్తవ్యక్తిలా మారిపోయిన ఫీలింగ్ వస్తోంది. మనం అనుకుంటే ఏదైనా సాధ్యమే’ అని మోటివేషన్ కూడా ఇస్తున్నారు రాయ్‌లక్ష్మి. మామూలుగా బికినీలో హాట్ కనిపించే భామలను ‘బికినీ బేబ్’ అని యూత్ పిలుచుకుంటారు. రాయ్‌లక్ష్మి విడుదల చేసిన బికినీ ఫొటోలను చూసి, అలానే అంటున్నారు. బెస్ట్ వెర్షన్ ఖన్నా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు బబ్లీగా ఉన్నారు రాశీ ఖన్నా. కొంత కాలంగా స్లిమ్ అయ్యే పనిలో పడ్డారు. ‘స్లిమ్ లుక్ ఓవర్ నైట్‌లో రాదు. వర్కౌట్స్ చేస్తూనే ఉండాలి’ అంటారు తన స్లిమ్ సీక్రెట్ అడిగితే. ఈ సరికొత్త లుక్‌లోకి రావడానికి రాశీ ఖన్నా సుమారు రెండేళ్లుగా శ్రమిస్తున్నారట. కొత్త లుక్‌లోకి మారిపోయిన తర్వాత ‘నాకు నేను నా బెస్ట్ వెర్షన్‌లా అనిపిస్తున్నాను’ అని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారామె. ‘క్రాష్ కోర్స్ డైట్స్‌ని పెద్దగా నమ్మను. రెండేళ్లు శ్రమించా. హెల్తీగా, హ్యాపీగా తగ్గా’ అన్నారు రాశీ. ఈ మధ్యనే తన స్లిమ్ ఫిజిక్‌ను బికినీలో దింపేశారు కూడా. కీర్తి పెరిగింది.. తగ్గింది ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర కోసం కొంచెం బొద్దుగా అయ్యారు కీర్తీ సురేశ్. సావిత్రి పాత్ర తాలూకు బరువు బాధ్యతలను అద్భుతంగా మోశారు కీర్తీ. నటిగా గొప్ప పేరును సంపాదించారు. ‘మహానటి’ కోసం పెరిగిన బరువును తగ్గించేసి మరింత స్లిమ్‌గా మారిపోయారామె. ప్రస్తుతం చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా కోసమే ఈ లుక్ అని తెలిసింది. పంచ్లైన్కి తగ్గట్టుగా... ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో తెలుగుకు పరిచయమైన పంజాబీ కుడి మెహరీన్. కొత్తలో మెహరీన్ కూడా కొంచెం బొద్దుగానే ఉండేవారు. ఇప్పుడు ‘హనీ ఈజ్ ది బెస్ట్’ (‘ఎఫ్ 2’లో మెహరీన్ పంచ్‌లైన్) మంత్రం జపించి స్లిమ్‌గా తయారయ్యారు. సినిమాలో పంచ్ లైనే ఇప్పుడు మెహరీన్ రియల్ లైఫ్‌కి వచ్చేసింది. కొత్త లుక్‌లోకి మారిపోయిన ఈ బ్యూటీని చూసి, ‘మెహరీన్ ఈజ్ ది బెస్ట్’ అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు సైన్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. 25 రోజులు 10 కిలోలు యంగ్ హీరోయిన్స్‌లో ఫిట్నెస్ మీద అమితంగా ఆసక్తి చూపించేవాళ్లలో రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరుసలో ఉంటారని బాక్సింగ్ బ్యాగ్ గుద్ది మరీ చెప్పొచ్చు. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’ కోసం ఏకంగా పదికిలోలు తగ్గిపోయారామె. అది కూడా 25 రోజుల్లో. ఆ స్లిమ్ లుక్ సినిమాకు సరిగ్గా సరిపోయింది. అయితే సన్నబడటంకోసం రకుల్ మరీ అంతలా పస్తులుండటాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ‘పేషెంట్లా ఉన్నావు’ అని ప్రేమగా కామెంట్ కూడా చేశారు. ‘ఫిట్నెస్ అందరికీ ముఖ్యమే. ఎలా ఉండాలన్నది పర్సనల్ చాయిస్’ అని రకుల్ బదులిచ్చారు కూడా. వెయిట్ ఈజ్ ఓవర్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ వాణీ కపూర్. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న సినిమా ‘వార్’లో హీరోయిన్గా నటిస్తున్నారామె. ఈ యాక్షన్ సినిమాలో బికినీలో అలరించనున్నారు వాణీ. బికినీ ఫిజిక్‌లోకి రావడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు. ‘‘యోగా, గంటల తరబడి జిమ్, వెయిట్‌లిఫ్టింగ్ చేశాను. డైటింగ్ చాలా కఠినంగా అనిపించింది. చీట్ డేస్ కూడా లేకుండా శ్రమించాను’’ అని రహస్యం తెలిపారు. అన్నట్లు వాణీ కపూర్ తెరపై కనిపించి కొన్నాళ్లయింది. ఇప్పుడు వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ.. వెయిట్ తగ్గి మరీ కనువిందు చేయబోతున్నారు. వెయిట్ గేమ్స్ వెయిట్ గేమ్స్ ఆడుతున్నారు జాన్వీ కపూర్. సినిమాలో పాత్రను బట్టి బరువు తగ్గుతూ పెరుగుతూ ఉండాలి. కానీ ఒకేసారి ఓ సినిమాలో బొద్దుగా, మరో సినిమాలో స్లిమ్‌గా కనిపించాల్సి వచ్చింది. దీంతో వెయిట్ గేమ్స్ ఆడుతున్నారామె. ప్రస్తుతం ‘కార్గిల్ గాళ్, రూహీ అఫ్జా’ సినిమాలు చేస్తున్నారామె. ‘కార్గిల్ గాళ్’ కోసం మొదట 6 కిలోలు పెరిగారు. ‘రూహీ అఫ్జా’ కోసం పది కిలోలు తగ్గారు. మళ్లీ కార్గిల్ గాళ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. మళ్లీ బరువు పెరిగే పనిలో ఉన్నారు జాన్వీ.- గౌతమ్ మల్లాది -
సౌత్ ఎంట్రీ?
తొలి చిత్రం ‘ధడక్’లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. ప్రస్తుతం ‘కార్గిల్ గాళ్ (వర్కింగ్ టైటిల్), రుహీ అఫ్జా, తక్త్’ సినిమాలతో బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్నారామె. అయితే సౌత్‌లో జాన్వీ నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జాన్వీ తండ్రి బోనీకపూర్ నిర్మాతగా హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ఓ కీలక పాత్రలో జాన్వీ నటించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియా అంటోంది. మరి.. తండ్రి నిర్మించబోయే సినిమాలో నటిస్తారా? వేచి చూద్దాం. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మానాడు, ఆర్ఆర్ఆర్’ సినిమాలతో జాన్వీ సౌత్ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ అవి ఏవీ నిజం కాలేదన్న విషయం తెలిసిందే. -
తగ్గుతూ.. పెరుగుతూ...
యాక్టర్లు పాత్రకు తగ్గట్టు బరువు తగ్గుతూ, పెరుగుతూ ఉండాల్సి ఉంటుంది. కానీ ఒకేసారి బరువు తగ్గుతూ, పెరుగుతూ జిమ్‌లో శ్రమిస్తున్నారు జాన్వీ. ప్రస్తుతం జాన్వీ ‘కార్గిల్ గాళ్, రూహీఅఫ్జా’ సినిమాలను ఏకకాలంలో చేస్తున్నారు. ‘కార్గిల్ గాళ్’ ఏమో గుంజన్ సక్సేనా బయోపిక్. ఈ పాత్రలో కొంచెం బొద్దుగా కనిపించనున్నారు జాన్వీ. ‘రూహీ అఫ్జా’ అనేది హారర్ కామెడీ చిత్రం. ఈ సినిమాలో నాజూకుగా కనిపించాలి. ‘కార్గిల్ గాళ్’ సినిమా షూటింగ్ మొదట ప్రారంభించారు. ఆ పాత్ర కోసం జాన్వీ సుమారు 6 కిలోల బరువు పెరిగారు. ఆ తర్వాత ‘రుహీ అఫ్జా’ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. ఇందులోని పాత్ర కోసం 10 కిలోల బరువు తగ్గారామె. ఇప్పుడు ‘కార్గిల్ గాళ్’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. దాంతో మళ్లీ బరువు పెరగనున్నారని తెలిసింది. ‘‘కొత్త షెడ్యూల్‌కి ఆరు వారాల సమయం ఉంది. ఈ గ్యాప్‌లో వారానికి ఆరుసార్లు జిమ్ చేస్తూ, రోజుకి 3 గంటలు జిమ్‌లోనే గడుపుతున్నారు. రోజుకి ఇంట్లో తయారు చేసిన లడ్డూలు మూడు నాలుగు లాగించేస్తున్నారు’’ అన్నారు జాన్వీ ట్రైనర్ నమ్రత. -
ఇషాన్‌తో జాన్వీకపూర్ డేటింగ్..!
బోనీకపూర్ గారాలపట్టి జాన్వీ కపూర్, హీరో ఇషాన్ ఖట్టర్ డేటింగ్లో ఉన్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. వీరు ‘ధడక్’ చిత్రంలో వెండితెరపై రొమాన్స్ చేయడంతో.. నిజ జీవితంలోనూ వీరి మధ్య బంధం ఏర్పడిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై జాన్వీ తండ్రి బోనికపూర్ స్పందించి.. ‘జాన్వీ, ఇషాన్‌లపై వస్తున్నవార్తలు అవాస్తవం. వారు మంచి స్నేహితులు.. అదేవిధంగా నా కూతురు ఇషాన్‌తో చేసే స్నేహాన్ని ఎప్పుడూ గౌరవిస్తాను. ఇషాన్ తరుచు జాన్వీ ఇంటికి వెళ్లుతున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కాగా ధడక్ మూవీ రిలీజ్ అయ్యాక ఇషాన్.. ఒక్కసారి కూడా తమ ఇంటికి రాలేదు. దీంతోపాటు వారి ఇరువురి మధ్య స్నేహానికి మించి ఎలాంటి రిలేషన్ లేద’న్నారు. తెలుగులో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ మూవీ రీమేక్‌లో జాన్వీ , ఇషాన్ జంటగా నటిస్తారని బీ టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై నిర్మాత కరణ్ జోహార్ స్పందించాడు. ఇంకా నటీనటులు ఎవరనేది డిసైడ్ చేయాలేదని, డియర్ కామ్రేడ్ మూవీ పెద్ద విజయం సాధించాలని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. -
దోస్త్ మేరా దోస్త్
బాలీవుడ్ లో కొత్త దోస్తీ కహానీ త్వరలో షురూ కానుంది. కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా ‘దోస్తానా 2’ అనే చిత్రం తెరకెక్కనుంది. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంకా చోప్రా ముఖ్య తార లుగా 2008లో వచ్చిన ‘దోస్తానా’ చిత్రానికి ఇది సీక్వెల్. కోలిన్ డుకున్హా దర్శకత్వం వహించనున్నారు. కరణ్ జోహార్ నిర్మించనున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సినిమాలో జాన్వీ, కార్తీక్‌లతో పాటు మరో కొత్త హీరో నటించనున్నారు. అతను ఎవరు? అనే విషయాన్ని త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం ‘రుహ్ అప్జా, ‘కార్గిళ్ గాళ్’ (వీరవనిత గుంజన్ సక్సెనా బయోపిక్) సినిమాలతో బిజీగా ఉన్నారు జాన్వీ కపూర్. -
నా వయసు పది!
రెండుపదుల వయసు దాటి రెండేళ్లు దాటినా ఇప్పటికింకా తన వయసు నిండా పదేళ్లే అంటున్నారని నిట్టూరుస్తున్నారు యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ‘చాలా యంగ్ ఏజ్‌లో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ భావన మీకు ఎలా అనిపిస్తుంది?’ అన్న ప్రశ్నను జాన్వీ ముందు ఉంచితే... ‘‘ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్స్‌తో ఫిజికల్‌గా నేను బాగానే ఉన్నాను. కానీ మెంటల్‌గా కొంచెం స్ట్రాంగ్ కావాల్సి ఉంది. నేను మానసికంగా చాలా యంగ్‌గా ఉంటానని, పదేళ్ల వయసు ఉన్న అమ్మాయిలా ప్రవర్తిస్తానని కొందరు నాతో అంటుంటారు. అందుకే నేను మానసికంగా త్వరగా ఎదగాలి అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘రూహి అఫా’్జ అనే హారర్ మూవీలో రాజ్‌కుమార్ రావుతో కలిసి నటిస్తున్నారు జాన్వీ. అలాగే ‘కార్గిల్ గాళ్’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో కూడా నటిస్తున్నారామె. గత ఏడాది ‘ధడక్’ సినిమాతో ఆమె సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఇక షురూ...
ఈ రోజు (శుక్రవారం) నుంచి షురూ అంటున్నారు జాన్వీ కపూర్. తన కొత్త చిత్రం గురించే జాన్వీ కపూర్ ఇలా చెబుతున్నారు. ఆమె కథానాయికగా నటిస్తున్న హారర్ మూవీ ‘రూహీ అఫ్జా’ శుక్రవారం మొదలైంది. ఇందులో రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నారు. హార్థిక్ మెహతా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ శర్మ కీలక పాత్రధారి. దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం మొదలైంది. ‘‘సినిమా అభిమానులందరూ శ్రద్ధగా ఆలకించండి. నా తర్వాతి హిందీ చిత్రం ఈ రోజు మొదలైంది’’ అని జాన్వీ కపూర్ అన్నారు. ఈ సినిమా కాకుండా వీరవనిత గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘కార్గిల్ గాళ్’ సినిమాలోనూ నటిస్తున్నారు జాన్వీ కపూర్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. -
మా నాన్న తగ్గారోచ్
కథానాయికలు ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శరీరాన్ని చక్కగా ఉంచుకోవడానికి జిమ్‌లలో చెమటోడుస్తుంటారు. కఠినమైన వర్కవుట్స్ చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు కూడా. ఇక యువతారల్లో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. ఫిట్నెస్కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఫిట్నెస్ విషయంలో ఎప్పుడూ తన ఫొటోలు షేర్ చేసే జాన్వీ తాజాగా తన తండ్రి ఫొటో షేర్ చేసి, చాలామందిని ఆశ్చర్యపరిచారు. ‘‘మా డాడీ (బోనీ కపూర్) 12 కిలోల బరువు తగ్గారు. ఆరోగ్యకరమైన జీవనం గడిపేందుకు ఆయన అన్ని కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా, ట్రిమ్గా తయారయ్యి నాకు స్ఫూర్తిగా నిలిచారు. నాన్నను చూసి చాలా గర్వపడుతున్నా’’ అంటూ తండ్రి ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు జాన్వీ కపూర్. గతంలో కంటే ఆ ఫొటోలో చాలా స్లిమ్‌గా కనిపిస్తున్నారు బోనీకపూర్. గత ఏడాది ఫిబ్రవరిలో శ్రీదేవి చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నాన్నతో మరింత ఎక్కువగా క్లోజ్‌గా ఉంటున్నారు జాన్వీ. బహుశా బోనీ తగ్గాలనుకోవడానికి కూతురు కూడా ఓ కారణం అయ్యుంటుందేమో. జాన్వీ నటించిన తొలి చిత్రం ‘ధడక్’ గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె శరణ్ శర్మ దర్శకత్వంలో పైలట్ గున్‌జాన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘కార్గిల్ గర్ల్ ఇన్ లక్నో’, కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ‘తక్త్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
అక్క చెప్పింది... చెల్లి వస్తోంది!
అతిలోకసుందరి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ల పెద్దకుమార్తె జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ ఓ చాట్ షోలో భాగంగా కన్ఫార్మ్ చేశారు. ‘‘ఖుషీ యాక్టింగ్‌ని సీరియస్‌గా తీసుకుంది. ఏదో అలా వచ్చాంలే అనుకోకుండా ముందు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటోంది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకోనుంది. ఈ విషయంపై నాన్న బోనీ కపూర్ కూడా కాస్త ఎగై్జటింగ్‌గానే ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు జాన్వీకపూర్. ఇక.. జాన్వీని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన కరణ్ జోహారే తనను కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందనే ఆలోచనను వ్యక్తపరిచారట ఖుషీకపూర్. ఆలియా భట్, సిద్దార్ధ్‌మల్హోత్రా, వరుణ్‌ధావన్ ఇలా చాలామంది స్టార్స్ కొడుకులు, కూతుర్లను కరణ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందరూ కూడా కెరీర్లో దూసుకెళుతున్నారు. -
సెల్యూట్ సైనికా
మనందరికీ ప్రత్యేకంగా ఇల్లు ఉంటుంది. కానీ సైనికులు ఇండియా మొత్తం ఇంటిలానే భావిస్తారు. దేశం కోసం ప్రాణాలు విడవడానికి కూడా సిద్ధపడిపోతారు. అలా రియల్ లైఫ్‌లో ప్రాణాలు ఒడ్డిన సైనికులను మనం సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నాం. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మాణంలో ఉన్న ‘సోల్జర్’ బ్యాక్‌డ్రాప్ సినిమాల గురించి తెలుసుకుందాం. కమాండో సందీప్ ముంబైలో 2008లో జరిగిన 26/11 ఎటాక్స్ దేశంలో సంచలనం సృష్టించాయి. ఆ దురదృష్టకర సంఘటనలో మరణించిన 174 (దాదాపుగా) మందిలో ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డు) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఒకరు. ఈ సంఘటన ఆధారంగా కొన్ని పుస్తకాలు వచ్చాయి. సినిమాలొచ్చాయి. వాటిలో రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘ది ఎటాక్స్ ఆఫ్ 26/11’ ఒకటి. తాజాగా తెలుగు, హిందీ భాషల్లో ‘మేజర్’ అనే టైటిల్‌తో మరో చిత్రం తెరకెక్కనుంది. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో హీరో అడవి శేష్ నటించనున్నారు. ఈ చిత్రానికి హీరో మహేశ్‌బాబు ఒక నిర్మాత. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అడవి శేష్, మహేశ్‌బాబు కాపాడతాడు శత్రువులు దేశంలోనే కాదు.. దేశం లోపల కూడా ఉంటారు. ఎవర్నైనా ఎదుర్కోవాల్సింది మన సైనికులే. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్›్డ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఇలా విభాగాలే వేరు. దేశ రక్షణే అందరి లక్ష్యం. దేశ ప్రధాని రక్షణకోసం ఓ ఎన్ఎస్జీ కమాండో ఎలాంటి సాహసం చేశారనే అంశం ఆధారంగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘కాప్పాన్’. (కాపాడతాడు) సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బొమన్ ఇరానీ, మోహన్‌లాల్, ఆర్య, సముద్ర ఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సూర్య, సముద్రఖని ఎన్ఎస్జీ కమాండోలుగా నటిస్తున్నారు. ప్రధానమంత్రి పాత్రలో మోహన్‌లాల్ నటిస్తారని తెలిసింది. సాయేషా కథానాయికగా నటిస్తున్న సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. సూర్య కమాండో అర్జున్ పండిట్ ఆర్మీ ఆఫీసర్లు చేసే సీక్రెట్ ఆపరేషన్స్‌కు విభిన్నమైన పేర్లు పెడుతుంటారు. ఆలాగే గోల్డ్‌ఫిష్ అనే పేరుతో ఓ ఆపరేషన్‌ను షురూ చేశారు కమాండో అర్జున్ పండిట్. ఆ ఆపరేషన్ టార్గెట్ ఎవరు అనేది వెండితెరపై చూడాల్సిందే. వాస్తవ సంఘటనలకు కల్పిత అంశాలను జోడించి అడివి సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ఇందులో కమాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది సాయికుమార్ నటించారు. శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్ కీలక పాత్రలు చేశారు. ఆది సాయికుమార్ సరిహద్దు సమరం ఓ మంచి సక్సెస్ కోసం సరిహద్దుకు వెళ్లారు హీరో తనీష్. ఇటీవలే ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు తనీష్. 2008లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నచ్చావులే’ హీరోగా ఇతనికి తొలి చిత్రం. ఆ తర్వాత హీరోగా చేయడంతో పాటు కృష్ణవంశీ ‘నక్షత్రం’ సినిమాలో విలన్‌గాను నటించారు. తనీష్ నెక్ట్స్ చిత్రం ‘సరిహద్దు’. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వి. కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సైనికుడి పాత్రలో నటిస్తున్నారు తనీష్. కార్తికేయ–తనీష్ కాంబినేషన్లో వచ్చిన రంగు సినిమాకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తనీష్ దేశాన్ని రక్షించే సైనికుడంటే ప్రజలందరికీ గౌరవం ఉంటుంది. అందుకే సినిమా సైనికులను కూడా ఆదరిస్తుంటారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ‘సోల్జర్’ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవి కాకుండా రానున్న రోజుల్లో మరెంతో మంది సైనికులను తెరపై చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా పాక్ చేతికి చిక్కి, ధైర్యంగా ఇండియా తిరిగొచ్చిన భారత ఆర్మీ కమాండర్ అభినందన్ మీద చాలా సినిమాలు వచ్చే చాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే బాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థలు అభినందన్ బయోపిక్ కోసం టైటిల్స్ రిజిస్టర్ చేశారు. మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే బోర్డర్లో సైనికుల కాపలానే కారణం. అందుకే సెల్యూట్ సైనికా.. రైఫిల్ మేన్ వస్తాడా? ఈ ఏడాది నేషనల్ ఆర్మీడే (జనవరి 15) సందర్భంగా ‘రైఫిల్‌మేన్’ అనే సినిమాలో సోల్జర్‌గా నటించనున్నట్లు వెల్లడించారు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. స్మాల్ టీజర్‌ని కూడా రిలీజ్ చేశారు. సోల్జర్ జస్వంత్‌సింగ్ రావత్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుందని వార్తలు వచ్చాయి. ఆయన జీవితంపై సినిమా తీసే హక్కులు మాకే ఉన్నాయంటూ ఓ ప్రొడక్షన్ హౌస్ ముందుకు వచ్చిందట. దాంతో ప్రస్తుతానికి ‘రైఫిల్‌మేన్’ చిత్రం లీగల్ సమస్యలను ఎదుర్కొంటోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కార్గిల్ అమ్మాయి సరిహద్దులో పాకిస్తాన్‌తో యుద్ధం చేయడానికి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ పైలెట్‌గా మారారు. 1999లో జరిగిన కార్గిల్ వార్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫస్ట్ ఉమెన్ గుంజన్ సక్సెనా కీలకంగా వ్యవహరించారు. ఆమె జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో గుంజన్ పాత్రను జాన్వీ చేస్తున్నారు. ఇందుకోసం జాన్వీ విమానం నడపడంలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. శరన్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కార్గిళ్ గాళ్’ అనే టైటిల్ కూడా పెట్టారని బాలీవుడ్ సమాచారం. ఇటీవల మేజర్ షూటింగ్ లక్నోలో ప్లాన్ చేశారు. వేసవిలోపు ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారట. ఒక్కటంటే ఒక్క సినిమాలో మాత్రమే నటించిన జాన్వీ కపూర్‌కు ఇంత తొందరగా బయోపిక్ చాన్స్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మరి.. జాన్వీ ఏ మేరకు ఆడియన్స్‌ను మెప్పిస్తుందో తెలియాలి. జాన్వీ కపూర్ అప్పుడు నీరు.. ఇప్పుడు నింగి రెండేళ్ల క్రితం లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మగా నీటి లోపల పాకిస్తాన్ శత్రువులతో పోరాడారు రానా. ఇది ‘ఘాజీ’ చిత్రం కోసం. ఇప్పుడు ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ కోసం రానా మళ్లీ లెఫ్టినెంట్ కల్నల్‌గా బాధ్యతలు చేపట్టారు. 1971 ఇండో–పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపించినప్పుడు ఏం జరిగింది? అనే అంశంపై ఈ సినిమా తెరకెక్కనుంది. అభిషేక్ దుథాయియా దర్శకత్వం వహిస్తారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ కల్నల్ విజయ్ పాత్రలో హీరోగా నటిస్తారు అజయ్ దేవగన్. మద్రాస్‌కి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ పాత్రను రానా చేస్తున్నారు. సంజయ్‌దత్, సోనాక్షీ సిన్హా, పరిణీతీ చోప్రా ఇతర కీలక పాత్రధారులు. అలాగే ‘1945’ (తమిళంలో ‘మడైతిరందు’) అనే సినిమాలో కూడా రానా స్వాతంత్య్రానికి పూర్వం నాటి సైనికుడి పాత్రలో రానా కనిపిస్తారని తెలిసింది. దీనికోసం ప్రత్యేక కసరత్తులు చేశారట. రానా సైన్యంలో చేరతారా? ‘సైనికుడు’ పేరుతో వచ్చిన సినిమాలో మహేశ్‌బాబు నటించారు కానీ సరిహద్దు సైనికుడిలా మాత్రం కనిపించలేదు. అయితే..‘పోకిరి, దూకుడు, ఆగడు’ వంటి చిత్రాల్లో బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు మహేశ్ సైన్యంలో చేరే సమయం ఆసన్నమైందని ఫిల్మ్ నగర్ సమాచారం. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా మహేశ్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. మహేశ్‌బాబు ఆర్మీ ఆఫీసర్ సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు సాగే ఫన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని టాక్. ఇక వెంకటేశ్‌తో కలిసి నాగచైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. కేఎస్. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో జరిగింది. ఆ లొకేషన్లో ఆర్మీ ఆఫీసర్ కాస్ట్యూమ్స్ కనిపించడంతో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నారనే టాక్‌కు మరింత బలం చేకూరినట్లయింది. మహేశ్‌బాబు, నాగచైతన్య ఆర్మీ జాయినింగ్ గురించి అధికారిక ప్రకటన వస్తే మరింత స్పష్టత లభిస్తుంది. -
సంగ్రామంలో సగం
ఆడపిల్ల నిచ్చెన ఎక్కబోతేనే నివారించే సమాజం ఆమె ఆకాశంలో ఎగురుతానంటే సరే అంటుందా?ఆడపిల్ల తుపాకీ బొమ్మ పట్టుకుంటేనే వద్దనే సమాజం ఆమె యుద్ధ క్షేత్రంలో అడుగు పెడతానంటే సరే అంటుందా?ఆడపిల్ల గట్టిగా మాట్లాడితేనే నిరోధించే సమాజం ఆమె శత్రువు మీద తుపాకీ గురిపెడతానంటే సరేనంటుందా?చదువులో సగం అంటే అతి కష్టం మీద సరే అంది సమాజం.ఉద్యోగాల్లో సగం అంటే అతి కష్టం మీద సరే అంటోంది సమాజం. కాని సంగ్రామంలో సగం అంటే మాత్రం కొంచెం కంగారు పడుతోంది.కాని గుంజన్ సక్సేనా వంటి పైలట్లు మాత్రం యుద్ధ క్షేత్రాల్లో లోహ విహంగాలు ఎగరేసి మేమూ చేయగలం అని నిరూపించారు.ఆమె స్ఫూర్తితో జాన్వీ కపూర్ నటిస్తున్న సినిమా ‘కార్గిల్ గర్ల్’ ఇప్పుడు సెట్స్ మీద ఉంది. నేడు జాన్వి పుట్టినరోజు.గుంజన్ సక్సేనా, జాన్వి.. లాంటి ఈ తరం ప్రతినిధుల స్ఫూర్తి కొనసాగుతూ ఉంటుంది. యుద్ధంలో విమానాలు, హెలికాప్టర్లు ఎంత ముఖ్యమో వాటిని నడిపే పైలట్లు కూడా అంతే ముఖ్యం.పైలట్లు లేని విమానాలు ఒట్టి ఆటబొమ్మలు.ఈ ప్రపంచంలో మగవారిది పైచేయిగా ఉన్నట్టే త్రివిధ దళాలలో కూడా మగవారిదే పైచేయి. ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్‌లో స్త్రీలు ‘ఫైటర్ పైలట్’లుగా ఉండటానికి నిన్న మొన్నటి వరకూ అనుమతి లేదు.అటువంటి దశలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదటిసారి ‘ఫిమేల్ ట్రైనీ పైలట్స్’ను భర్తీ చేయ తలపెట్టింది. ఢిల్లీలో చదువుకుంటున్న గుంజన్ సక్సేనా ఏ మాత్రం ఆలోచించకుండా ఆ అవకాశాన్ని దక్కించుకోవాలనుకుంది. ఎందుకంటే అప్పటికే ఆమె తల్లి, తండ్రి సైన్యంలో పని చేస్తున్నారు. ఇంట్లో ఉన్న సైనిక వాతావరణం ఆమెను ఫైటర్ పైలట్ కమ్మని ప్రోత్సహించింది. అయితే ట్రైనింగ్ సమయంలో, ఆమె ‘ఫ్లయిట్ ఆఫీసర్‘ అయినప్పుడు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏదోలే ఉన్నారులే అనే ధోరణినే మహిళా ఫైటర్ పైలట్ల పట్ల వ్యక్తపరిచేవారు. ఎందుకంటే వొత్తిడి సమయంలో ఆకాశంలో లోహ మరను కంట్రోల్ చేయడం స్త్రీలకు సాధ్యమవుతుందా అని సందేహం. గుంజన్ సక్సేనాకు ఇది కొంచెం నిరుత్సాహం కలిగించేది. తనను తాను నిరూపించే అవకాశం రావాలని పట్టుదలగా ఉండేది. ఆమె ఎదురుచూపుకు తగినట్టే వచ్చిన అవకాశం 1999 కార్గిల్ యుద్ధం. చీటా హెలికాప్టర్లో.. కార్గిల్ యుద్ధం మొదలైంది. ఎయిర్ ఫోర్స్ అందులో కీలకబాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆకాశ పహారాలో మగ ఫైటర్ పైలట్లు ఉన్నారు. కాని యుద్ధంలో క్షతగాత్రులను తరలించడానికి, ముఖ్యమైన సామాగ్రి తరలించడానికి పైలట్లు కావాల్సి వచ్చింది. అప్పుడు అవకాశం గుంజన్ సక్సేనాకు దక్కింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దగ్గర ఉన్న చీటా హెలికాప్టర్‌ను గుంజన్‌కు ఇచ్చి కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌కు వెళ్లి తిరిగి బేస్ క్యాంప్‌కు వచ్చే పని అప్పజెప్పారు. ఈ పని చేయడం అంటే శత్రువు లక్ష్యానికి దగ్గరగా వెళ్లి రావడమే. అయినప్పటికీ గుంజన్ భయపడలేదు. ధైర్యంగా అనేకసార్లు కార్గిల్ వార్‌లో అటూ ఇటూ చక్కర్లు కొట్టింది. ఆమెకు తెలుసు.. ఏ క్షణాన్నైనా ఈ హెలికాప్టర్‌ను శత్రువు కూల్చవచ్చని. అందుకని తన దగ్గర ఒక అసాల్ట్ రైఫిల్, ఒక రివాల్వర్ పెట్టుకుని ఆకాశంలో ఎగిరేది. ఎందరో క్షతగాత్రులను ఆమె బేస్ క్యాంప్‌కు తెచ్చి ప్రాణాలు కాపాడింది. ఒకసారి కార్గిల్ స్ట్రిప్ మీద ఆమె హెలికాప్టర్ టేకాఫ్ అవుతూ ఉండగా ఆమెను లక్ష్యం చేసి పేల్చిన రాకెట్ లాంచర్ కొంచెంలో తప్పి పక్కన ఉన్న కొండ చరియకు తాకింది. అయినప్పటికీ చెక్కు చెదరక గుంజన్ విధులు నిర్వర్తించింది. ఈ ధైర్యం, తెగువ వృధా పోలేదు. యుద్ధం ముగిసి మనం గెలిచాక ఆమెకు ‘కార్గిల్ గర్ల్’ అని పాపులర్ బిరుదు వచ్చింది. ప్రభుత్వం ‘శౌర్య చక్ర’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఇప్పుడు ఆ కథ సినిమాగా రాబోతుంది. జాన్వియే సరైన ఎంపిక... గుంజన్ యుద్ధ క్షేత్రంలో తెగువ ప్రదర్శించి ఉండొచ్చు. కాని జాన్వి నిజజీవితంలో తెగువ ప్రదర్శించింది. ఆమె తల్లి నటి శ్రీదేవి మరణించి మొన్నటి ఫిబ్రవరికి ఒక సంవత్సరం. తల్లి ఎన్నో కలలు కనగా తాను నటించిన తొలి సినిమా ‘ధడక్’ రిలీజ్‌ను చూడకనే ఆమె మరణించడం జాన్వికి తీరని లోటు. ఇంకా పూర్తిగా జీవితంలో స్థిరపడక మునుపే తల్లి లేని పిల్ల కావడం చాలా పెద్ద దెబ్బ. అయినప్పటికీ నిబ్బరంగా ఆమె ‘ధడక్’ పూర్తి చేసింది. రిలీజయ్యాక జాన్వి ఒట్టి అందాల బొమ్మ కాదని, తల్లికి మల్లే మంచి నటి అని జనం గ్రహించారు. మెచ్చుకున్నారు. అందుకే జాన్వికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ‘కార్గిల్ గర్ల్’లో గుంజన్ సక్సేనా పాత్రను పోషించే అవకాశం రావడం చాలా మంచి విషయం. ఈ సినిమా కాకుండా కరణ్ జోహర్ తీస్తున్న మల్టీస్టారర్ ‘తఖ్త్’లో జాన్వి ఒక పాత్ర పోషి స్తోంది. కరీనా కపూర్, అనిల్ కపూర్, ఆలియా భట్ ఇందులో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇది కాకుండా రాజ్‌కుమార్ రావ్‌కు ఒక సినిమాలో జోడీ కట్టనుంది. పిత్రోత్సాహం తండ్రి కూతురిని చూసి పొంగిపోతే ‘పుత్రికోత్సాహం’. కూతురు తండ్రిని చూసి పొంగిపోతే ‘పిత్రోత్సాహం’. జాన్వి ప్రస్తుతం పిత్రోత్సాహంలో ఉంది. ఎందుకంటే హిందీలో హిట్ అయిన ‘పింక్’ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనేది శ్రీదేవి కోరిక. అందుకే తాను దక్షిణాదిలో మొదటిసారి నిర్మాతగా ‘పింక్’ను ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేసి విడుదల చేయనున్నారు బోనీ కపూర్. హిందీలో అమితాబ్ చేసిన పాత్రను తమిళంలో అజిత్ చేయడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఫస్ట్ లుక్ కూడా విడుదల అయ్యింది. దానిని చూసిన జాన్వి ‘నాన్న తొలి తమిళ సినిమా. కాన్ట్ వెయిట్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించింది. కూడుతున్న కుటుంబం జాన్వి తల్లి లేని లోటు నుంచి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటోందనే చెప్పవచ్చు. చెల్లెలు ఖుషీ కపూర్‌తో, సవతి సోదరుడు అర్జున్ కపూర్‌తో, సవతి సోదరి అన్షులా కపూర్‌తో ప్రేమానుబంధాలు బలపడ్డాయి. ఇంకా అనిల్ కపూర్ సంతానం సోనమ్ కపూర్, రియా కపూర్ కూడా ఆమెకు బాసటగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా మగవారిదే పైచేయి. వారితో సమానంగా నిలిచే సంగ్రామంలో జాన్వి విజయవంతం అవుతుందని ఆశిద్దాం. -
ఇంకా షాక్‌లోనే ఉన్నా!
కూతురిని సిల్వర్ స్క్రీన్‌పై చూసి మురిసిపోవాలనుకున్నారు శ్రీదేవి. తనలానే కూతురు కూడా అంచలంచెలుగా పైకెళ్తుంటే పడిపోకుండా పక్కనుండి పట్టుకోవాలని ఆశపడ్డారు. కానీ కూతురి మొదటి చిత్రాన్ని (ధడక్) చూడకుండానే శ్రీదేవి చనిపోయారు. ‘తల్లి మరణం తనకింకా షాక్‌గానే ఉంది’ అంటున్నారు జాన్వీ కపూర్. ఈ విషయం గురించి ఇటీవల ఓ షోలో మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి చాలామంది చాలాసార్లు అడిగారు. చాలాసార్లే చెప్పాను కూడా. కానీ అమ్మ మరణం నాకిప్పటికీ షాకింగ్‌గానే ఉంది. ఆ వార్తను ఎందుకో జీర్ణించుకోవడానికి నా మనసు ఇష్టపడటం లేదు. ‘అమ్మ చనిపోయింది’ అనే వార్త విన్నప్పటినుంచి ఆ తర్వాత నాలుగు నెలల వరకూ జరిగిన సంఘటనలు ఏవీ నా మైండ్‌లో రిజిస్టర్ కాలేదు. జ్ఞాపకాలన్నీ అమ్మ చుట్టూనే ఉండిపోయాయి’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే షోను తేలికపరచడం కోసం తన తల్లిదండ్రులు ‘చాలా డ్రమాటిక్’ అని మరో విషయాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘డేటింగ్ విషయాన్ని అమ్మా, నాన్న చాలా డ్రామా చేసేవారు. ‘నీకెవరైనా నచ్చితే మాతో వచ్చి చెప్పు. మేం నీకు పెళ్లి చేస్తాం’ అనేవారు. అప్పుడు నేనేమో ‘నచ్చిన ప్రతీ అబ్బా యిని పెళ్లి చేసుకోలేం కదా. జస్ట్ ఫ్రెండ్లీగా చిల్ కూడా అవ్వొచ్చు అనుకుంటా?’ అని సమాధానం చెప్పేదాన్ని. ‘చిల్ అవ్వడమంటే? ఏంటి?’ అని తిరిగి ప్రశ్నించేది అమ్మ. ఇలా సరదాగా జోక్ చేసుకునేవాళ్లం’’ అని పేర్కొన్నారు జాన్వీ. సినిమాల విషయానికి వస్తే జాన్వీ ప్రస్తుతం పైలెట్ గుంజన్ సక్సెనా బయోపిక్‌లో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
టేకాఫ్‌కు రెడీ
కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులను కాపాడే కార్యక్రమంలో పాల్గొన్నవాళ్లల్లో లేడీ పైలెట్ గుంజన్ సక్సెనా ఉన్నారు. ఈ సూపర్ హీరోయిన్ పాత్రను సిల్వర్ స్క్రీన్ మీద పోషించడానికి రెడీ అయ్యారు జాన్వీ కపూర్. దానికోసం శిక్షణ తీసుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. పైలెట్‌కు సంబంధించిన క్లాస్‌లకు కూడా హాజరవుతున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ లుక్ ఇదే అంటూ ఓ ఫొటో బయటకు వచ్చింది. పైలెట్ సూట్ప్యాంట్లో ఉన్న ఈ లుక్‌తోనే ఈ చిత్రంలో జాన్వీ కనిపించనున్నారట. -
ముందు గెస్ట్‌గా?
కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండకు సంబంధించి ఒకే టాపిక్ గురించి డిస్కషన్ నడుస్తోంది. తన బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? అన్నదే ఆ టాపిక్. జాన్వీ కపూర్‌తో చేసే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తారని, విజయ్‌ని కరణ్ జోహార్ పరిచయం చేస్తారని ప్రచారంలో ఉన్న వార్తలు. అయితే తాజాగా ‘83’ చిత్రం ద్వారా విజయ్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తారని టాక్. 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా కబీర్ ఖాన్ రూపొందించనున్న చిత్రం ‘83’. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సౌత్ ఇండియన్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రను పోషిస్తారని టాక్. ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపిస్తారని సమాచారం. ఇదే నిజమైతే బాలీవుడ్‌కి ముందు గెస్ట్‌గా వెళ్లి, ఆ తర్వాత హీరోగానూ చేస్తారని ఊహించవచ్చు. ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. రీసెంట్గా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారాయన రన్నింగ్ ట్రైన్ ఎక్కే సన్నివేశాల్లో స్లిప్ అవ్వడంతో విజయ్ చేతికి చిన్నపాటి గాయమైంది. -
ఏ ‘డీ’తో జోడీ
‘ధడక్’తో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులతో మంచి మార్కులే వేయించుకున్నారు జాన్వీ కపూర్. ఆ సినిమాతో జాన్వీని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శక–నిర్మాత కరణ్ జోహార్, జాన్వీ రెండో చిత్రాన్నీ కూడా నిర్మిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గుంజన్ సక్సెన్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో గుంజన్ సక్సెన్ పాత్రను పోషించనున్నారు జాన్వీ కపూర్. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు యాక్ట్ చేస్తారన్నది ఈ మధ్య బాలీవుడ్లో హాట్‌టాపిక్. ఇందులో హీరోగా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేదా మలయాళీ యువ హీరో దుల్కర్ సల్మాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ బాలీవుడ్లో ఎంట్రీæ(కార్వాన్) ఇచ్చి, సెకండ్ మూవీ (జోయా ఫ్యాక్టర్)లో నటిస్తున్నారు దుల్కర్. ఈ హీరోతో కరణ్ ప్రొడక్షన్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఓ సినిమా చేయనున్నట్లు టాక్. మరోవైపు టాలీవుడ్ హీరోలలో విజయ్ నటనకు ఫ్యాన్ అయ్యానని కరణ్ జోహార్ షోలో పేర్కొన్నారు జాన్వీ. కరణ్ కూడా విజయ్ను బాలీవుడ్‌కు పరిచయం చేయాలనుకుంటున్నట్లు బాలీవుడ్ టాక్. మరి దేవరకొండ, దుల్కర్ ఈ ఇద్దరిలో ఏ డీ (డి ఫర్ దేవరకొండ, దుల్కర్)తో జాన్వీ కపూర్ తన తదుపరి చిత్రంలో జోడీ కడతారో వేచి చూడాలి. వీళ్లిద్దరూ కాకుండా వేరే హీరో సీన్లోకి వస్తారేమో వెయిట్ అండ్ సీ. -
వార్కి రెడీ
యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారట జాన్వీ కపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గున్‌జన్ సక్సేనా కార్గిల్ యుద్ధంలో ప్రతిభ చాటారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుందని బాలీవుడ్ సమాచారం. టైటిల్ రోల్లో జాన్వీ కపూర్ నటించనున్నారట. సక్సేనా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలను తెలుసుకునే పనిలో పడ్డారట జాన్వీ. తొలిచిత్రం ‘ధడక్’లో గ్లామర్‌గా నటించిన ఆమె ఈ చాలెంజింగ్ పాత్రలో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పిస్తారనే విషయం బాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్ర చేయనున్నారని వినికిడి. జాన్వీని వెండితెరకు పరిచయం చేసిన కరణ్ జోహార్ ఈ సినిమాని కూడా నిర్మించనున్నారట. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ సినిమా కంటే ముందు కరణ్ జోహార్ దర్శకత్వం వహించనున్న ‘తక్త్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జాన్వీ. -
విజయ్ దేవరకొండలా నిద్ర లేస్తానంటోన్న జాన్వీ!
అమ్మాయిల్లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భీమవరంలో జరిగిన ‘టాక్సీవాలా’ విజయ యాత్రలో ఆయన లేడీ ఫ్యాన్స్ స్కూటీలతో ర్యాలీ చేసిన ఫొటోలు వైరల్ అవడం ఇందుకు ఒక ఉదాహరణ. విజయ్ క్రేజ్ బాలీవుడ్‌కి కూడా చేరింది. విజయ్‌తో ఓ సినిమా చేయాలని ఉందని శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ చెప్పారు. కాఫీ విత్ కరణ్ షోలో అన్నయ్య అర్జున్ కపూర్‌తో కలిసి పాల్గొన్నారు జాన్వీ కపూర్. ఈ షోలో ‘సడన్‌గా ఓ మేల్ యాక్టర్లా ఓ రోజు నువ్వు నిద్ర లేవాలి అనుకుంటే ఎవరిని ఊహించుకుంటావు? అని జాన్వీని కరణ్ జోహార్ అడిగితే.. ‘‘విజయ్‌దేవర కొండలా నిద్రలేచి, నాతో సినిమా చేయమని అడుగుతాను’’ అన్నారు. జాన్వీ ఇలా అనగానే ‘అర్జున్‌రెడ్డి’ అని అర్జున్ కపూర్ అన్నారు. ‘‘ఇప్పుడు ఆ సినిమా రీమేక్ ‘కబీర్‌సింగ్’ లోనే షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. విజయ్ సెక్సీ’’ అని కరణ్ అన్నారు. ఏది ఏమైనా జాన్వీ నోటి నుంచి విజయ్ దేవరకొండ పేరు రావడంతో తెలుగు సినిమాల్లో నటించాలని ఈ యంగ్ హీరోయిన్‌కి ఉందని స్పష్టం అవుతోంది. ముఖ్యంగా విజయ్‌తో జోడీ కట్టాలనుకుంటున్నారని కూడా అర్థమైంది. మరి.. జాన్వీ ఊహ నెరవేరుతుందా? వేచి చూద్దాం. -
‘అయినా... నువ్వంటే నాకెంతో ఇష్టం’
‘ చిన్ననాటి నుంచి నీ నుంచి నేను ఎదుర్కొన్న బెదిరింపులకు ఉదాహరణ ఇది... అయినా నువ్వంటే నాకెంతో ఇష్టం, ఎంత అంటే నువ్వు ఊహించలేనంతగా.. హ్యాపీ బర్త్‌డే’ అంటూ తన చిట్టి చెల్లెలు ఖుషీ కపూర్‌కు.. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. బుల్లి జాన్వీ, ఖుషీలు టీవీ ముందు డాన్స్ చేస్తున్న ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘సో క్యూట్.. ఈ చిన్నారులు ఇద్దరు.. ప్రస్తుతం ఇద్దరు కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించిన యువతులు. మీ బంధం ఇలాగే కలకాలం వర్ధిల్లాలి’ అంటూ ఖుషీకి విషెస్ తెలుపుతున్నారు. తల్లి శ్రీదేవి మరణించిన తర్వాత ఖుషీ తొలి పుట్టినరోజు ఇదే కావడంతో.. ‘ మీ అమ్మ ఎక్కడ ఉన్నా మీ బంధం చూసి ఆనందపడతారు. ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీరు’ అంటూ జాన్వీ, ఖుషీలను అభినందిస్తున్నారు. కాగా ఖుషీతో ఉన్న రిలేషన్షిప్ గురించి జాన్వీ కపూర్ పలు సందర్భాల్లో మీడియాతో పంచుకున్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ– ‘ఇంటి బయట మాత్రమే హీరోయిన్ అనే స్టేటస్ ఉంటుంది. ఇంట్లో మాత్రం నేను సాదాసీదా అమ్మాయినే. స్టార్‌ని అనే ఫీలింగ్‌ని నాకు రాకుండా, నన్ను భూమ్మీదే ఉంచుతుంది నా చెల్లెలు ఖుషీ(నవ్వుతూ). ‘నువ్వు చాలా కూల్ అనుకుంటావు కానీ అలా ఏం కాదు అంటూ సరదాగా ఆటపట్టిస్తూ నన్ను ఏడిపిస్తూ ఉంటుంది. నాతో అన్ని పనులు చేయించుకుంటుంది. అయినా ఖుషి అంటే నాకు చాలా ఇష్టం. తనను నా చెల్లెలు అనడం కంటే అక్క అనడం బెటరేమో! ’ అంటూ చెల్లెలి గురించి జాన్వీ బోలెడు కబుర్లు చెప్పింది. ఇక బోనీ కపూర్- శ్రీదేవి దంపతుల పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘ధడఖ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అక్క బాటలోనే ఖుషీ కూడా త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారని బీ- టౌన్ టాక్. View this post on Instagram Just an example of how most of my childhood consisted of being bullied by you.... I still love u though, more than you’ll ever be able to imagine. #hbd A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Nov 4, 2018 at 11:21am PST -
ఖుషి నాకు చెల్లెలు కాదు!
‘బయట అందరికీ నేను ‘ధడక్’లో హీరోయిన్ని కావచ్చు. సెలబ్రిటీ కావచ్చు. కానీ ఎప్పుడూ నన్ను నాలానే ఉంచే వ్యక్తి నా చెల్లెలు ఖుషి’’ అంటున్నారు జాన్వీ కపూర్. ఖుషీతో ఉన్న రిలేషన్షిప్ గురించి జాన్వీ మాట్లాడుతూ– ‘‘సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ మధ్య మేం కలసి ఉండటం చాలా తక్కువ అవుతోంది. తను నన్ను కలవడానికి వచ్చినా నేనేదో నా పనుల్లో బిజీగా ఉంటున్నాను. అది కొంచెం బాధగా అనిపిస్తోంది. సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్ అన్నింట్లో ‘స్పెషల్ ట్రీట్మెంట్’ ఉంటుంది. ఇంటి బయట నా స్టేటస్ ఇది అయితే ఇంట్లో మాత్రం సాదాసీదా అమ్మాయినే. ఎందుకంటే స్టార్ ఫీలింగ్‌ని నాలోకి రాకుండా చేస్తుంది ఖుషి. నన్ను భూమ్మీదే ఉంచుతుంది (నవ్వుతూ). ఇప్పటికీ నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. ‘నువ్వు చాలా కూల్ అనుకుంటావు కానీ అంతేం కాదు’ అంటూ సరదాగా ఆటపట్టిస్తుంది. నాతో అన్ని పనులు చేయించుకుంటుంది. టీవీలో మేం ఏం చూడాలో తనే డిసైడ్ చేస్తుంది. అందుకే ఖుషి అంటే నాకు బోలెడంత ఇష్టం. నా చెల్లి అనడంకంటే ఖుషీని అక్క అనాలేమో?’’ అని చెల్లెలి గురించి చాలా కబుర్లు చెప్పారు జాన్వీ. -
ఆ ముగ్గురే నా ఫస్ట్ చాయిస్!!
బాలీవుడ్ ప్రేమజంట రణ్‌బీర్ కపూర్- అలియా భట్, జాన్వీ కపూర్.. ఈ ముగ్గురే తన ఫస్ట్ చాయిస్ అంటున్నారు ధర్మ ప్రొడక్షన్స్ అధినేత, దర్శక నిర్మాత కరణ్ జోహార్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలను నిర్మించే కరణ్.. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. కబీ ఖుషి కబీ గమ్, కుచ్ కుచ్ హోతా హై వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో దర్శకుడిగా కూడా ప్రతిభను చాటుకున్న కరణ్.. ప్రస్తుతం రేడియో జాకీగా కొత్త అవతారమెత్తారు. ఈ సందర్భంగా.. 20 ఏళ్ల క్రితం బాలీవుడ్ యువ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాకు సీక్వెల్ తీస్తే.. క్యాస్టింగ్ విషయంలో మీ అభిప్రాయమేమిటని ఓ అభిమాని కరణ్‌ని ప్రశ్నించాడు. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే రణ్‌బీర్ కపూర్, అలియా భట్, జాన్వీ కపూర్లతోనే కెకెహెచ్2 ఉంటుందని సమాధానమిచ్చారు. అయితే ఏ పాత్రలో ఎవరు నటిస్తారనేది మాత్రం రివీల్ చేయలేదు. కాగా షారూక్ ఖాన్, కాజోల్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కుచ్ కుచ్ హోతా హై ఎంతగా హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. -
అది నిజం కాదు
బాలీవుడ్లో స్టార్ కిడ్స్‌ని పరిచయం చేయడంలో లక్కీ హ్యాండ్ అంటే కరణ్ జోహార్ అనే చెప్పాలి. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్స్ అందరూ సూపర్ సక్సెస్‌లో కొనసాగుతున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని కూడా ఆయనే పరిచయం చేశారు. ఫస్ట్ సినిమా ‘ధడక్’లో అవకాశం ఇవ్వడమే కాదు... వెంటనే పీరియాడికల్ డ్రామా ‘తక్త్’లోనూ అవకాశం ఇచ్చారు. సెకండ్ సినిమాతోనే అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్ , కరీనా కపూర్ వంటి స్టార్స్‌తో కలిసి యాక్ట్ చేసే అవకాశం రావడం అంటే జాన్వీ లక్కీయనే చెప్పాలి. ఫస్ట్ సినిమా ద్వారా ఇండస్ట్రీకు పరిచయం చేసిన కరణ్ తర్వాత సినిమాలు కూడా ఆఫర్ చేస్తూ జాన్వీ ఇండస్ట్రీలో నిలబడటానికి ఒక గైడ్‌లా హైల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ జాన్వీకి కరణ్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. 2008లో తరుణ్ మన్సుఖానీ రూపొందించిన ‘దోస్తానా’ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారాయన. ఇందులో హీరోయిన్గా జాన్వీని ఫిక్స్ చేసినట్టు వార్త షికారు చేస్తోంది. ఈ వార్తల్లో నిజం లేదని కరణ్ స్పష్టం చేశారు. సో.. జాన్వీ మూడో సినిమా బయట ప్రొడక్షన్లో ఉంటుందా? లేదా తండ్రి బోనీ కపూర్‌తో ఉంటుందా తెలియాలి. -
జాన్వీ పార్టీ డ్రెస్ ఖరీదు ఎంతంటే..
సాక్షి, ముంబై : అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ధడక్ మూవీతో బాలీవుడ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. జాన్వీకి సంబంధించి ప్రతి వార్తనూ పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇటీవల ముంబైలో ఇచ్చిన పార్టీకి హాజరైన జాన్వీ తన లుక్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పార్టీకి జాన్వీ ఎరుపు రంగు సిల్క్ క్రీప్ బటన్ అప్ షర్ట్, అదే కలర్ ట్రౌజర్స్‌తో హాజరై మెస్మరైజ్ చేశారు. రెడ్ డ్రెస్‌తో పాటు నలుపు రంగు బ్యాగ్, యాక్సెసరీస్‌తో స్టన్నింగ్ లుక్‌లో మెరిశారు. జాన్వీ డ్రెస్ ఖరీదు భారతీయ కరెన్సీలో రూ లక్షా1725 కావడం గమనార్హం. -
ఆ లక్కీగర్ల్ ఎవరు?
తమిళసినిమా: సినిమాకు కథ, కథనాలను పక్కన పెడితే హీరోహీరోయిన్ల కాంబినేషన్ బట్టి కూడా వ్యాపారం ఉంటుంది. అలా కోలీవుడ్‌లో స్పెషల్ కాంబినేషన్లను కలిపే దర్శకుల్లో వెంకట్‌ప్రభు ఒకరు. ప్రస్తుతం పార్టీ చిత్ర విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈయన త్వరలో కొత్త చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించడానికి సమ్మతించారు. అంతే కాదు ఈ చిత్రానికి మానాడు అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. దీన్ని సురేశ్‌కామాక్షి తన వీ.హౌస్ పతాకంపై నిర్మించనున్నారు. టైటిల్‌ను బట్టే అర్థం అవుతుంది ఇదో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న కథా చిత్రం అని. ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్‌ప్రభు ధృవీకరించారు. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగునున్నాయి. ఇంత వరకూ బాగానే ఉంది. ఇందులో శింబుతో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరన్నది ఆసక్తిగా మారింది. మానాడులో నటించే హీరోయిన్ కోసం ఇద్దరు యువ నటీమణులతో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అంతే కాదు వారి పేర్లు కూడా వెల్లడించారు. నటి కీర్తీసురేశ్, అతిలోక సుందరి వారసురాలు జాన్వీలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే వీరిలో ఎవరు శింబుతో నటించేది త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. అయితే శింబుకు జంటగా నటి జాన్వీ నటిస్తుందన్నది సందేహమే. అయితే ఈ అమ్మడిని దక్షిణాదిలో పరిచయం చేయాలన్న ప్రయత్నాలు మాత్రం చాలా కాలంగానే జరుగుతున్నాయి. ఏదేమైనా మానాడు చిత్రంలో నాయకిగా కీర్తీసురేశ్‌నే నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇ ఇద్దరు బ్యూటీలో ఎవరు శింబుతో జత కట్టినా అది క్రేజీ కాంబినేషనే అవుతుంది. త్వరలోనే ఎవరన్న సస్పెన్ప్ వీడనుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. -
సినిమాల్లోకి జాన్వీ.. మరి ఖుషీ ప్లాన్సేంటి?
ముంబై : దివంగత నటి శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాలో జాన్వీ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. తల్లి లాగే జాన్వీ కూడా కళ్లతోనే భావాలను పలికించగలదంటూ శ్రీదేవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త శ్రీదేవి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి రానుందనేదే ఈ వార్తల సారాంశం. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనుందని బోనీ కపూర్ తెలిపారు. ‘ఖుషీ మొదట మోడల్ కావాలనుకుంది. కానీ ప్రస్తుతం తన లక్ష్యం మారింది. అక్క జాన్వీ లాగే తను కూడా హీరోయిన్ కావాలనుకుంటోంది. కెరీర్ గురించి నిర్ణయం తీసుకోగల పరిపక్వత నా పిల్లలకు ఉంది. అన్షులా, అర్జున్, జాన్వీలు తమ సొంత నిర్ణయం మేరకే కెరీర్‌ను రూపొందించుకున్నారు. ఇపుడు ఖుషీ కూడా వారి బాటలోనే నడవాలనుకుంటోందని’ బోనీ కపూర్ వ్యాఖ్యానించారు. -
తొలి రోజే ‘ధడక్’ సరికొత్త రికార్డు
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను హీరోయిన్గా పరిచయం చేస్తూ కరణ్ జోహార్ నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘ధడక్’. మరాఠీ మూవీ ‘సైరట్’కు అధికారిక రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ నటనను చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. శుక్రవారం(జూలై 20) విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా రికార్డు సృష్టించి జాన్వీ సంతోషాన్ని రెట్టింపు చేసింది. విడుదలైన రోజే 8. 71 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా.. నూతన తారలతో రూపొంది, తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘ధడక్‌కు గొప్ప ఆరంభం.. నూతన తారలతో రూపొందినప్పటికీ తొలిరోజే 8.71 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ పేరిట ఉన్న రూ. 8 కోట్ల రికార్డును అధిగమించిందంటూ’ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కాగా ఈ రెండు సినిమాలు కరణ్ జోహారే నిర్మించారు. ‘ధడక్’ సినిమాలో జాన్వీకి జోడీగా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ నటించాడు. ‘బియాండ్ ద క్లౌడ్స్’ సినిమాలో సహాయక పాత్రలో నటించిన ఇషాన్‌కు హీరోగా మాత్రం ఇదే తొలి చిత్రం. #Dhadak takes a HEROIC START... Rarely does a film starring absolute newcomers open so well... Day 1 is higher than #StudentOfTheYear [₹ 8 cr]… Fri ₹ 8.71 cr. India biz. — taran adarsh (@taran_adarsh) July 21, 2018 -
ధడక్ : జాన్వీ రెమ్యునరేషన్ ఎంత?
అతిలోక సుందరి, అలనాటి అందాల తార శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్, సినీ కెరీర్లోకి ఎంట్రీ ఇస్తూ తీసిన మూవీ ధడక్ విడుదలైంది. జాతీయ అవార్డు అందుకున్న సైరత్ మూవీకి రిమేక్‌గా ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోని స్క్రీన్లపైకి వచ్చేసింది. బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సౌందర్యరాశి కలలు నిజమయ్యాయి. తొలి మూవీలోనే జాహ్నవి అద్భుతంగా నటించి, తల్లికి నటనలోనూ వారసురాలినని నిరూపించుకుంది. ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచి, ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న జాన్వీ కపూర్ పొందిన పారితోషికం ఎంత? అనేది ప్రస్తుతం ఆసక్తిదాయకమైన అంశంగా నిలిచింది. ఈ వివరాలను సైతం డైలీహంట్ రిపోర్టు చేసింది. ధడక్ సినిమాకు గాను, జాన్వీ కపూర్ అరవై లక్షల రూపాయల పారితోషికం అందుకున్నట్టు తెలిపింది. తన తొలి సినిమాకు ఈ మేరకు పారితోషికం పొందిందని తెలిసింది. అలాగే ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయిన ఇషాన్ ఖట్టర్‌కు కూడా అరవై లక్షల రూపాయల పారితోషికమే ఇచ్చారట. అయితే వీరిద్దరి కంటే అధికంగా జాన్వీ తండ్రిగా ఈ సినిమాలో నటించిన అశుతోష్ రాణాకు రూ.80 లక్షలకు చెల్లించారని.. సైరత్, ధడక్ రెండింటికీ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉన్న అజయ్-అతుల్‌లకు రూ.1.5 కోట్ల పారితోషికం ఇచ్చారని తెలిసింది. ధడక్ చిత్రానికి మ్యూజిక్ ఓ మ్యాజిక్ అని క్రిటిక్స్ సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా రీరికార్డింగ్ సినిమాను నిలబెట్టిందని, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసిందని అంటున్నారు. ఫీల్‌గుడ్, ఎమోషనల్ ఫ్యాక్టర్‌ను అందించడంలో అజయ్, అతుల్ సంగీతద్వయం ఆకట్టుకున్నదని చెబుతున్నారు. -
వారి ప్రశంసకు మురిసిపోయిన జాన్వీ
ముంబై : అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్.. బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. త్వరలోనే తను నటించిన ‘ధడక్’ సినిమా తెరపైకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ను చూసిన వారంతా.. జాన్వీ నటనను, అందాన్ని చూసి ఫిదా అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. తొలి సినిమానే అయినా జాన్వీ చాలా అద్భుతంగా నటించిందని, హావభావాలను పలికించిన తీరు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇన్ని ప్రశంసల్లో ఓ కాంప్లిమెంట్ తన హృదయాన్ని తాకిందట. అది అన్న అర్జున్ కపూర్ మెచ్చుకోలు. ‘ఈ సినిమాలో నీవు చాలా నిజాయితీతో నటించినట్టు ఉంది. హీరోయిన్ మాదిరి నీవు నటించలేదు. పాత్రలో లీనైపోయావు. నిజాయితీగా నీ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించావు’ అని అర్జున్ ప్రశంస ఇచ్చాడట. ఈ మెచ్చుకోలును తన బెస్ట్ కాంప్లిమెంట్‌గా జాన్వీ చెప్పింది. అర్జున్ నుంచి వచ్చిన ఈ ప్రశంసతో తాను చాలా సంతోషంగా ఫీల్ అయినట్టు పేర్కొంది. అంతేకాక తన తండ్రి బోని కపూర్ కూడా ‘వావ్, ఎంత సహజంగా నీవు నటించావు’ అని ప్రశంసించారట. ఈ ఇద్దరి కాంప్లిమెంట్‌తో తాను చాలా ఖుషీగా ఉన్నట్టు జాన్వీ ఇటీవల ఇచ్చిన ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. కాగ, ధడక్‌లో జాన్వీకి జోడిగా షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ నటించాడు. జాన్వీ, ఇషాన్ ఇద్దరూ పోటీపడి నటించినట్టు ఉందని, ఇషాన్ ఖట్టర్ నటన కూడా అద్భుతంగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. మరాఠి హిట్ మూవీ ‘సైరాట్' రీమేక్‌గా ‘ధడక్' చిత్రాన్ని తెరకెక్కించారు. -
కపూర్ ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్!
సాక్షి, ముంబై : బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్- శ్రీదేవి దంపతుల కూతురు జాన్వీ కపూర్ ‘దడక్’ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. తాజాగా కపూర్ల ఫ్యామిలీ నుంచి మరో అమ్మాయి కూడా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారని వినికిడి. బోనీ కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ కూతురు షనాయాను ఈ ఏడాది హీరోయిన్గా పరిచయం చేసేందుకు కపూర్ల ఫ్యామిలీ సన్నాహాకాలు చేస్తోందట. ఈ విషయం గురించి సంజయ్ కపూర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ....‘ షనాయా ప్రస్తుతం ప్లస్ టూ పూర్తి చేసింది. అయితే ఏం జరుగుతుందో ముందే ఊహించలేం కదా. తన కెరీర్ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ కచ్చితంగా తను అనుకున్నది సాధిస్తుంది. ఇప్పటివరకైతే ఏ మూవీకి సైన్ చేయలేదు. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయం’టూ పేర్కొన్నారు. అక్క సోనమ్ పెళ్లిలో, జాన్వీ కపూర్ ‘దడఖ్’ ట్రైలర్ విడుదల సమయంలో ఫొటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించిన షనాయాకు ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫ్యాలోయింగ్ పెరిగిపోయింది. -
సారీ జాన్వీ
ఇంటి నుంచి బయటకు వెళ్తేనే బోలెడు జాగ్రత్తలు చెబుతారు అన్నయ్యలు. కొత్త ఉద్యోగంలోకి అడుగుపెడుతున్నప్పుడు కూడా చాలా టిప్స్ చెబుతారు. హీరోయిన్గా తన టాలెంట్‌ని ఫ్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జాన్వీకి కూడా అలాంటి సూచనలే ఇస్తున్నారు అర్జున్ కపూర్. జాన్వీ పరిచయం కానున్న ‘ధడక్’ ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. షూటింగ్లో భాగంగా వేరే దేశంలో ఉన్న అర్జున్ కపూర్ తన సలహాలను, శుభాకాంక్షాలను ట్వీటర్ ద్వారా పంచుకున్నారు. ‘‘సారీ.. ముంబైలో లేనందున ఈవెంట్‌కి రాలేకపోతున్నాను. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎప్పటికీ ఆడియన్స్‌లో నువ్వో భాగం అయిపోతావు. నీకో విషయం చెప్పదలుచుకున్నాను.. బాగా కష్టపడుతూ,నిజాయితీగా ఉంటూ, ప్రసంశలను తలకెక్కించుకోకుండా, అందరి ఒపీనియన్ తీసుకుంటూనే నీకంటూ ఓ దారిని సృష్టించుకోగలిగితే ఈ ఇండస్ట్రీకి మించిన గొప్ప చోటు లేదు. వాట్టన్నింటిని నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు అర్జున్. -
కన్నీటిపర్యంతమైన శ్రీదేవి చిన్న కూతురు
-
కన్నీటిపర్యంతమైన ఖుషీ కపూర్
జాన్వీ కపూర్‌కు, ఎంటైర్ కపూర్ ఫ్యామిలీకి నేడు బిగ్ డే. అలనాటి అందాల తార శ్రీదేవి, బోని కపూర్ల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న ధడక్ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. అనిల్ కపూర్, బోని కపూర్ల నుంచి ఖుషీ కపూర్ వరకు ఈ ట్రైలర్ లాంచ్‌కు హాజరయ్యారు. ఈ ఉద్వేగభరిత సందర్భంలో శ్రీదేవీ లేకపోవడం ప్రతి ఒక్కర్ని కలచివేసింది. చిన్న కూతురు ఖుషీ తనను తాను నియంత్రించుకోలేక, తల్లిని తల్లుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అలా తీవ్ర ఉద్వేగానికి గురైన చెల్లిని, జాన్వీ కపూర్ అక్కుని చేర్చుకుని ఓదార్చడంతో అక్కడున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. జాన్వీ సైతం మీడియా ఎంతో ముందు ఎంతో నెర్వస్‌గా ఫీలయ్యారు. జాన్వీని బాలీవుడ్‌కు పరిచయం చేయడంపై శ్రీదేవీ ఎప్పుడూ కలలు కంటూ ఉండేవారు. తల్లి కలను జాన్వీ నిజం చేయబోతున్నారు. శ్రీదేవి మరణించిన దగ్గర్నుంచి అక్కా చెల్లెళ్లు ఒకరికొకరు ఎంతో చేదుడువాదోడుగా ఉంటున్నారు. వీరికి అన్న అర్జున్ కపూర్, సోదరి అన్హులా కపూర్లు కూడా అండగా నిలబడుతూ వస్తున్నారు. నేడు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మనసుకు హత్తుకునేలా ఓ పోస్టు కూడా చేశారు. ఇషాన్ ఖట్టర్, జాన్వీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ ఖైటన్ దర్శకత్వం వహిస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. -
ఆ వార్తలకు అంత అర్హత లేదు
చెల్లిని ఏమైనా అంటే అన్నయ్య రెస్పాండ్ అవ్వకుండా గమ్మునుంటాడా? తప్పకుండా గుస్సా అవుతాడు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా తన చెల్లెలి మీద కామెంట్లు విసిరినందుకు గుస్సా అయ్యారు. రీసెంట్గా జాన్వీ కపూర్ వేసుకున్న షార్ట్ డ్రెస్‌పై కొందరు నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. వీటిని ఓ వార్తాపత్రికకు చెందిన (‘సాక్షి’ కాదు) వెబ్సైట్ పోస్ట్ చేసింది. ఈ న్యూస్‌ను అర్జున్‌కపూర్ ట్వీటర్లో ట్యాగ్ చేసి, –‘‘ఎవరో ఇద్దరు చేసిన కామెంట్స్‌ని హైలైట్ చేశారు. ఇది చాలు.. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే నెటిజన్లకు మీడియా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో తెలుసుకోవడానికి’’ అని పేర్కొన్నారు. అర్జున్ అభిప్రాయాన్ని మరో మీడియా ట్యాగ్ చేసి, అతను ఫలానావాళ్లపై మండిపడ్డారని పేర్కొంది. అప్పుడు మళ్లీ అర్జున్ రెస్పాండ్ అయ్యారు. ‘‘ఇది నేను కేవలం ఒక మీడియా గురించి చెప్పడం లేదు. సోషల్ మీడియా కామెంట్స్ న్యూస్‌గా మారుతున్నాయి. వాస్తవానికి వీటికి అంత అర్హత లేదు. క్లిక్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ హెడ్డింగ్స్ పెట్టి ఇలాంటి స్టోరీలను రాయకండి’’ అని పేర్కొన్నారు అర్జున్ కపూర్. కొన్ని రోజుల క్రితం జాన్వీ కపూర్ డ్రెస్ గురించి వినిపించిన అసభ్యమైన కామెంట్స్ గురించి అర్జున్ ఇలానే రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి చెల్లిని ప్రొటెక్ట్ చేస్తూ, మాట్లాడారు. చూస్తుంటే అన్నాచెల్లెళ్ల మధ్య మంచి బంధం ఏర్పడిందనిపిస్తోంది కదూ. -
అమ్మ కోరిక అదే : హీరో
లెజెండరీ నటి శ్రీదేవి మరణానంతరం తొలిసారి అర్జున్ కపూర్ తన తల్లి మోనా శౌరీ కపూర్ గురించి స్పందించారు. సవతి తల్లి మరణానంతరం.. ఆ బాధ నుంచి కోలుకునేందుకు అర్జున్ కపూర్, అన్షులా కపూర్లు తమ తండ్రి బోనీకపూర్, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు ప్రతీ విషయంలో అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీదేవి చనిపోయినపుడు షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని మరీ కొడుకుగా, అన్నగా బాధ్యతలు నిర్వర్తించారు అర్జున్ కపూర్. ప్రస్తుతం బోనీ కపూర్ పిల్లలు నలుగురు ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు కురిపించుకుంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ కూడా ‘అమ్మ మరణించిన తర్వాత మా కుటుంబమంతా తిరిగి ఒక్కటయ్యింది. అన్నయ్య అర్జున్ కపూర్, సోదరి అన్షులా కపూర్ తమని చాలా బాగా చూసుకుంటున్నారని’ చెప్పారు. అయితే అర్జున్, అన్షులా గురించి ప్రస్తావిస్తూ ఓ నెటిజన్.. ‘ అర్జున్, అన్షులా తల్లి మోనా శౌరీ పెంపకం చాలా గొప్పది. అందుకే వారు కష్టకాలంలో తమ తండ్రికి, సోదరిలకు అండగా నిలిచారు’ అంటూ ట్వీట్ చేశారు. అభిమాని ట్వీట్‌కు స్పందించిన అర్జున్ కపూర్.. ‘నేను, నా సోదరి అన్షులా మా జీవితంలోని ప్రతీ క్షణంలో మా అమ్మ మాతో ఉన్నట్టుగానే భావిస్తాం. మేము ఎల్లప్పుడూ మా తండ్రి పక్కనే ఉండాలని ఆమె కోరుకునేది. అలాగే జాన్వీ, ఖుషీలకు తోడుగా ఉండడం మరీ అంత గొప్ప విషయమేమీ కాదు. మా అమ్మ గురించి ఇంత మంచిగా మాట్లాడిన మీకు కృతఙ్ఞతలు. ఆమె మిమ్మల్ని దీవిస్తుంది’ అంటూ ఉద్వేగపూరిత ట్వీట్ చేశారు. Hey @aakanksha3131 , me & @anshulakapoor represent our mother every single second we live...she would expect us to have been standing next to our father no matter what n be there for Janhvi & Khushi... thank you for ur kind words bout our mother...as she would say god bless u... https://t.co/xOBQgDE0pP — Arjun Kapoor (@arjunk26) June 4, 2018 -
శ్రీదేవికి కేన్స్ ఘన నివాళి
లెజండరీ నటి, స్వర్గీయ శ్రీదేవికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘన నివాళి అర్పించనుంది. ఈనెల 16న లే మెజెస్టిక్ బీచ్ ఇందుకు వేదిక కానుంది. శ్రీదేవికి సంస్మరణార్థం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో.. ఆమె అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాల్లోని విజువల్స్‌ను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో పాటు, ఆమె ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్లు హాజరవనున్నారు. ఈ విషయాన్ని బోనీ కపూర్ ధ్రువీకరించారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల పాటు తన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన శ్రీదేవి ప్రతిభను ప్రపంచం గుర్తించినందుకు తాను సంతోషపడతానన్నారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీదేవికి ఈ పేరు ప్రఖ్యాతులు లభించాయని పేర్కొన్నారు. ఆమె భౌతికంగా తమ మధ్య లేకపోయడం బాధకు గురిచేస్తున్నా.. ఆమె అద్భుత నటన ద్వారా అందరి మనసులలో చోటు సంపాదించుకోవడం ఆనందాన్నిస్తుందన్నారు. మరణానంతరం జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న శ్రీదేవికి.. ప్రస్తుతం కేన్స్ నివాళి అర్పించడం ద్వారా మరోసారి ఆమె ప్రతిభకు గుర్తింపు దక్కినట్లు భావిస్తున్నాని ఆనందం వ్యక్తం చేశారు. -
తల్లి చీరలో జాన్వీ కపూర్
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నవారిలో దివంగత నటి శ్రీదేవి కుటుంబం ఉంది. ‘మామ్’ చిత్రానికి ఉత్తమ నటిగా శ్రీదేవిని జాతీయ అవార్డుకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డును అందుకోవడానికి శ్రీదేవి భర్త బోనీకపూర్, ఆమె కూమార్తెలు జాన్వీ అండ్ ఖుషీ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ‘‘ఇది మేం గర్వపడాల్సిన సమయం. ఈ మంచి క్షణాల్లో శ్రీదేవి బతికి ఉంటే చాలా సంతోషపడేవారు. సినిమాలో ఆమె పడిన కష్టానికి ఫలితం దక్కింది’’ అన్నారు బోనీ కపూర్. జాన్వీ పట్టు చీర కట్టుకుని వెళ్లారు. తాను కట్టుకున్న చీర తల్లిదేనని ఆమె పేర్కొన్నారు. -
సైట్లో చెల్లెలి ఫొటోలపై అసభ్య వ్యాఖ్యలు.. మండిపడ్డ హీరో!
సాక్షి, ముంబై: తన సోదరి జాన్వీ కపూర్ ఫొటోలను అభ్యంతరకరరీతిలో ప్రచురించిన వెబ్‌సైట్‌పై బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మండిపడ్డాడు. ఎక్స్పోజింగ్ చేసేలా జాన్వీ కపూర్ ‘సెక్సీ దుస్తులను’ ధరించిందంటూ ఓ బాలీవుడ్ సినిమా వెబ్సైట్ అసభ్య కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై అర్జున్ కపూర్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఇటీవల అర్జున్ కపూర్ నివాసం వద్ద జాన్వీ, ఆమె సోదరి ఖుషీ ఉన్న సమయంలో తీసిన ఫొటోలు.. పోస్టు చేస్తూ అభ్యంతరకరమైన రీతిలో కథనాన్ని ప్రచురించడంతో ఆ వెబ్‌సైట్‌ను అర్జున్ చీల్చిచెండాడాడు. ‘నీచమైన వెబ్సైట్.. అలాంటి సమయంలోనూ నీ కళ్లు అలా దుర్బుధ్దితో అన్వేషించడం సిగ్గుచేటు. మన దేశంలో అమ్మాయిలను ఇలాగే చూస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం. ఇందుకు సిగ్గుపడుతున్నా’ అని అర్జున్ ఆవేదనగా ట్వీట్ చేశాడు. సదరు వెబ్సైట్ వెంటనే కథనాన్ని తొలగించింది. గతంలోనూ జాన్వీ, ఖుషీలను ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు కించపరిస్తే.. వారికి మద్దతుగా అర్జున్ నిలిచాడు. శ్రీదేవి కూతుళ్లు అయిన జాన్వీ, ఖుషీ అర్జున్‌కు సవతి చెల్లెళ్లు అవుతారు. బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ సంతానం అర్జున్, అన్షులా. ఇటీవల శ్రీదేవి ఆకస్మికంగా మృతిచెందడంతో తీవ్ర బాధలో ఉన్న జాన్వీ, ఖుషీకి అర్జున్, అన్షులా అండగా నిలిచారు. ఈ క్రమంలో ఇటీవల బోనీ తన కూతుళ్లు జాన్వీ, ఖుషీలను తీసుకొని అర్జున్, అన్షులా ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. -
‘ఆమెను శ్రీదేవితో పోల్చకండి’
ముంబై : బాలీవుడ్ దర్శకురాలు, కొరియెగ్రాఫర్ ఫరాఖాన్ రీల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఈ అవార్డ్స్ కమిటీకి జ్యూరి మెంబర్‌గా వ్యవహరిస్తున్న ఆమె ఈ ఏడాది కొత్త కథాంశాలతో సినిమాలు వచ్చాయని, ‘లిప్‌స్టిక్ అండర్ బుర్ఖా’ సందేశంతో పాటు వినోదం కూడా పంచిందన్నారు. న్యూటన్, హిందీ మీడియమ్ సినిమాలు కూడా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన బాలీవుడ్ అందాల నటి శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. లెజండరీ హీరోయిన్ శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని, కెరీర్ తొలినాళ్లలో ఆమె తననెంతో ప్రోత్సహించారన్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ‘దడక్’ సినిమాకు కొరియోగ్రఫీ చేస్తున్న ఫరా, జాన్వీ కూడా మంచి డాన్సర్ అని ప్రశంసలు కురిపించారు. అయితే ఇంకా జాన్వీ నేర్చుకునే దశలోనే ఉందదని.. ఇప్పుడే ఆమెను శ్రీదేవితో పోల్చడం సరైంది కాదన్నారు. మై హూనా సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఫరాఖాన్.. కొంత కాలంగా దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. ఈ మీడియా సమావేశంలో తన భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడుతూ రొటీన్ సినిమాలతో విసిగెత్తిపోయాను. స్టైల్ మార్చి ఈసారి బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీ చేయాలనుకుంటున్నాను తన మనసులో మాట బయటపెట్టారు. -
అమ్మ అడుగుజాడల్లో...
‘అచ్చంగా అమ్మలానే’... జాన్వీ కపూర్ గురించి ‘ధడక్’ టీమ్ అంటున్న మాటలివి. చూడ్డానికి తల్లి శ్రీదేవిలానే జాన్వీ ఉంటుంది కాబట్టి అలా అన్నారా? అంటే.. ఊహూ. ఇది ‘క్రమశిక్షణ’ గురించి. తల్లి మరణించి పట్టుమని పదిరోజులు కూడా గడవకముందే ‘ధడక్’ లొకేషన్లో కాలుపెట్టారు జాన్వీ కపూర్. యాక్చువల్లీ జాన్వీ లాంగ్ బ్రేక్ తీసుకుంటుందని, సినిమా వాయిదా తప్పదని కొందరు భావించారు. అయితే తండ్రి బోనీకపూర్ నిర్మాత, తల్లి శ్రీదేవి ఆర్టిస్ట్ కాబట్టి జాన్వీకి సినిమా కష్టాలు తెలుసు. అందుకే షూటింగ్లో పాల్గొనాలని ఫిక్సయ్యారు. ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా శశాంక్ కేతన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ధడక్’ మరాఠీ సినిమా ‘సైరట్’కు రీమేక్. గురువారం ఈ సినిమా తాజా షెడ్యూల్ స్టారై్టంది. రెండు రోజుల పాటు ఇషాన్, జాన్వీలపై రొమాంటిక్ సీన్స్ తీసి, ఆ తర్వాత కోల్‌కత్తాలో నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. ‘‘మా షూటింగ్‌కు బ్రేక్ పడుతుందని వచ్చిన వార్తల్లో నిజం లేదు. కోల్‌కతా షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాం’’ అన్నారు శశాంక్ కేతన్. శ్రీదేవి ఆరోగ్యంగా లేకున్నా తన వల్ల మూవీ యూనిట్‌కు ఇబ్బంది కలగకూడదు అనుకునేవారు. జాన్వీ కూడా అంతే. అచ్చు అమ్మ అడుగుజాడల్లోనే ముందుకెళ్తుంది అని అనుకుంటున్నారు బాలీవుడ్ సినీవాసులు. ఈ సంగతి ఇలా ఉంచితే.. శ్రీదేవి గురించి బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ ఓ ఇన్సిడెంట్ను గుర్తు చేసుకున్నారు. ‘‘గుమ్రా’ సినిమా చేస్తున్నప్పుడు శ్రీదేవి జ్వరంతో బాధపడుతున్నారు. షూట్ క్యాన్సిల్ చేద్దామని చెప్పా. ‘లేదు. లేదు..నా వల్ల షూటింగ్ అగిపోకూడదు’ అని శ్రీదేవి చెప్పారు. అంతేకాదు అంత జ్వరంలోనూ వాటర్ సీన్స్‌లో అద్భుతంగా నటించారామె. ఆమె అంకితభావం సూపర్’’ అని పేర్కొన్నారు మహేశ్ భట్. సో.. జాన్వీ కూడా అచ్చంగా అమ్మలానే. తన మానసిక స్థితి ఎలా ఉన్నా సినిమాపై ఆ ప్రభావం పడకూడదనుకుంది. ‘ధడక్’ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 20న విడుదల చేయాలనుకుంటున్నారు. -
జాన్వీ కపూర్ పుట్టినరోజు వేడుకలు
తల్లి శ్రీదేవి హఠాన్మరణం ఇచ్చిన షాక్ నుంచి జాన్వీ కపూర్ తేరుకుంటున్నట్లున్నారు. బుధవారం తన 21వ పుట్టినరోజుని జరుపుకున్నారు. ముంబైలోని ఒక ఓల్డేజ్ హోమ్‌కి వెళ్లి అక్కడ కేక్ కట్ చేశారామె. అక్కడి వాళ్లంతా ప్రేమతో జాన్వీకి బర్త్‌డే సాంగ్ పాడారట. కుటుంబసభ్యుల మధ్య కూడా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు జాన్వీ. ఈ వేడుకల్లో బోనీకపూర్, ఖుషీ కపూర్, సోనమ్ కపూర్, రేఖా కపూర్, అన్షులా కపూర్, శాన్య కపూర్, జాహన్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీదేవి ఆశ నెరవేరలేదని బాధగా ఉంది
అప్పట్లో మీతో పాటు ఇండస్ట్రీని రూల్ చేసిన శ్రీదేవిగారి గురించి.. జయప్రద: ప్రతి పాత్రలోనూ జీవించాలని ఎంతో కష్టపడేది. ఆన్‌స్క్రీన్ స్టైల్‌గా కనిపించడంతో పాటు ఎమోషన్స్‌ను ఎంతో బ్యాలెన్డ్స్‌గా పలికించేది. గొప్ప నటి ఆమె. అంతేకాదు గొప్ప అమ్మ కూడా. తన జీవితంలోకి అన్ని రంగులు త్వరగానే వచ్చేసాయేమో అనిపిస్తుంది. తక్కువ వయసులోనే సక్సెస్ చూసింది. తక్కువ వయçసులోనే వెళ్లిపోయింది. అందుకే దేవుడు జీవితంలోని అన్ని కలర్స్‌ను తనకు త్వరగా చూపించాడేమో అనిపిస్తుంది. శ్రీదేవి మనతో లేరు అనేది ఒక నమ్మలేని నిజం. మళ్లీ తిరిగి రానటువంటి నిజం. చివరి క్షణాల్లోనూ ఆనందంగా ఉన్న సమయాల్లోనే కన్ను మూసింది. ఒక కల్యాణానికి వెళ్లి అక్కడ అందరితో సరదాగా ఉంటున్న సమయంలో తుది శ్వాస విడిచింది. అంటే.. ఒక మనిషి జీవితం ఎంత చిన్నదో తెలుసుకోవచ్చనిపిస్తోంది. మీరిద్దరూ ఎక్కువగా కలుస్తుండేవారా? జయప్రద:తరచూ కాకపోయినా అప్పుడప్పుడూ మేము కలుస్తూనే ఉండేవాళ్లం. మా ఇంట్లో జరిగిన పెళ్లి (జయప్రద అక్క కుమారుడు సిద్ధార్థ్ వెడ్డింగ్) వేడుకకు భర్త బోనీ కపూర్‌తో సహా శ్రీదేవి వచ్చింది. అందర్నీ ఆప్యాయంగా పలకరించింది. సరదాగా టైమ్ స్పెండ్ చేసింది. నా లైఫ్‌లో అవి మెమొరబుల్ మూమెంట్స్లా మిగిలిపోయాయి. మీరిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు కదా.. విభేదాలేమైనా? జయప్రద:జయసుధ, శ్రీదేవి, నాకు మధ్యలో ఎప్పుడూ ఎలాంటి విభేదాలు లేవు. ఒక మాట అనుకోవడం కూడా లేదు. అయితే.. మీడియా ఒక ప్రొఫెషనల్ హైప్‌ను క్రియేట్ చేసింది. మా మధ్య ఎటువంటి తగువులు లేవు. ‘దేవత’లో తను నాకు చిట్టిచెల్లెలిగా చేసింది. మరో సినిమాలో సవతిగా చేసింది. డిఫరెంట్ రోల్స్ చేశాం. ఒకర్ని మించి ఒకరం బాగా చేయాలని తప్పిస్తే వేరే ఏమీ ఉండేది కాదు. శ్రీదేవి నటించినవాటిలో మీకు నచ్చిన సినిమాలు? జయప్రద:జగదేకవీరుడు అతిలోకసుందరి, దేవత సినిమాలు. తను చేసిన హిందీ సినిమాలూ ఇష్టమే. తన సినిమా కెరీర్ అద్భుతమైనది. సినిమా లైబ్రరీలో తనదో ప్రత్యేకమైన స్థానం ఉండాలి. ఆమె లాంటి ఆర్టిస్టు మళ్లీ రావడం కష్టం. జాన్వీ హీరోయిన్గా సినిమా చేస్తున్న విషయం తెలిసే ఉంటుంది.. జయప్రద:ఇన్నాళ్లూ కూతుళ్లకు తోడుగా ఉంది. ఇప్పుడు కూతురు సినిమా చేస్తున్న సమయానికి తోడుండి చూసుకోలేకపోయింది. జాన్వీ ఎంతో దుఃఖంలో ఉంటుంది. రెండో పాప ఖుషీ కూడా. జాన్వీని ఆన్‌స్క్రీన్‌పై చూసుకోవాలన్న శ్రీదేవి ఆశ నేరవేరలేదని బాధగా ఉంది. ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ఇది తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. -
ఇరగదీసింది!
అవును..డ్యాన్స్‌ను ఇరగదీసింది శ్రీదేవి తనయ జాన్వీ. మరాఠీ సూపర్ హిట్ ‘సైరట్’ చిత్రం హిందీలో ‘థడక్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. శశాంక్ కేతన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రీసెంట్గా ఓ సోలో సాంగ్‌ను ముంబైలో జాన్వీ కపూర్‌పై చిత్రీకరించారు. కొరియోగ్రాఫర్ తుషార్ కలియా డిజైన్ చేసిన ఈ రేసీ సాంగ్‌లో డ్యాన్స్ కుమ్మేసిందట జాన్వీ. ఈ సాంగ్ షూట్‌కు రెండు రోజుల ముందు నుంచే ఫుల్‌గా ప్రాక్టీస్ చేసి లొకేషన్లోకి వచ్చిందట జాన్వీ. ‘‘చాలా కాన్ఫిడెంట్‌గా డ్యాన్స్ చేసింది జాన్వీ. ఏ డ్యాన్స్ మూమెంట్లో చేంజ్ అడగలేదు. సాంగ్ బ్రేక్ టైమ్‌లోనూ నెక్ట్స్ స్టెప్ కోసం ప్రాక్టీస్ చేస్తూనే ఉంది’’ అని జాన్వీని పొగిడేశారు తుషార్. ఈ సినిమాను జూలై 20న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. హీరోయిన్గా నటిస్తున్న తొలి సినిమాలోనే కొరియోగ్రాఫర్‌ను మెప్పించే రేంజ్లో జాన్వీ డ్యాన్స్ చేయడం విశేషమే. -
జాన్వీ@టెంపర్
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. శషాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్‌తో జోడీ కట్టారు జాన్వీ. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో క్రేజీ ఆఫర్ జాన్వీని వరించిందని బీ టౌన్ టాక్. ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని ‘శింబా’ పేరుతో హిందీలో రీమేక్ చేయనున్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ ఈ చిత్రం నిర్మించనున్నారట. ఇందులో జాన్వీ కపూర్‌ని కథానాయికగా తీసుకున్నారని బాలీవుడ్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తెలుగులో కాజల్ చేసిన పాత్రకంటే ‘శింబా’లో జాన్వీ పాత్రను మరింత క్యూట్‌గా మలచనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. జాన్వీ ఫస్ట్ మూవీ ‘ధడక్’ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ‘టెంపర్’ రీమేక్‌కి కూడా ఆయనే నిర్మాత. ఒకవేళ జాన్వీ నటన నచ్చి, ‘టెంపర్’కి కూడా తీసుకోవాలనుకున్నారేమో? అని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. -
ఎవరేమనుకున్నా నా నిర్ణయం అదే
బాలీవుడ్లో ఎవరైనా టాప్ సెలబ్రిటీస్ వారసులను పరిచయం చేయాలంటే ముందుగా వినిపించేది దర్శక–నిర్మాత కరణ్ జోహార్ పేరు. ప్రస్తుతం అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్‌ను హిందీ తెరకు పరిచయం చేస్తున్నారు కరణ్ జోహార్. ‘ధడక్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు కరణŠ జోహార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరాఠి సూపర్ íß ట్ సినిమా ‘సైర ట్’కు ఇది అఫీషియల్ రీమేక్. న్యూ ఇయర్ సందర్భంగా జాన్వీ, ఇషాన్‌కు కరణ్ జోహార్ ఓ లేఖ రాశారు. ‘కాలింగ్ కరణ్’ షోలో దాన్ని చదివి వినిపించారు కూడా. ‘‘మై డియర్ జాన్వీ, ఇషాన్ ఈ సంవత్సరంతో మీ లైఫ్‌లో సరికొత్త జర్నీ మొదలు కాబోతోంది. ఈ ఇయర్ మీకు చాలా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లు ఇవ్వనుంది. తొలి సినిమా రిలీజ్, ప్రమోషన్స్, లింక్ అప్స్, క్రిటిసిజం, పొగడ్తలు, ఫేమ్, ఫెయిల్యూర్ ఇలా ఎన్నో చూడబోతున్నారు. మీకో చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. వీటన్నింటిని అంత సీరియస్‌గా తీసుకోకండి. ఈ ఇనిషియల్ డేస్‌ను బాగా ఆస్వాదించండి. ఇవి మళ్లీ తిరిగి రావు. మీలోని బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే మీరింకా విద్యార్థులే. మీ నమ్మకాలు, మీ ఇన్నోసెన్స్ కోల్పోకుండా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు కరణ్. నో మోర్ డిప్లోమసీ: బాలీవుడ్ అగ్ర దర్శక–నిర్మాత కరణ్ జోహార్ న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని న్యూ రిజల్యూషన్స్ తీసుకున్నారు. ఈ సంవత్సరం నుంచి నా మిత్రుల బర్త్డేస్కు స్వయంగా కలిసి విష్ చేయాలనుకుంటున్నాను. ఇక నుంచి ట్రైలర్స్ అయినా, సినిమాలైనా నాకు మనస్ఫూర్తిగా నచ్చితేనే పొగుడుతాను. ఇది వరకు డిప్లొమసి ప్రదర్శించినందుకు సారీ. నా సినిమాల ప్రమోషన్ విరివిగా చేసుకోవాలనుకుంటున్నాను... ఎవ‡రేమనుకున్నా సరే... అంటూ తన నిర్ణయాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు కరణ్. -
అది బిడియమా? పొగరా?
జాన్వీ కపూర్ డాటరాఫ్ శ్రీదేవి గురించి బాలీవుడ్లో చాలామంది చేస్తున్న కామెంట్ ‘తనకు బిడియమా? పొగరా’ అని. సెలబ్రిటీల వారసులకు కొన్ని తిప్పలు తప్పవు. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా టాపిక్కే. జాన్వీ కపూర్ అయితే సినిమాల్లోకి రాకముందు నుంచీ వార్తల్లో నిలిచింది. ఎక్కడ కనిపించినా కెమెరాలు వెంటాడుతుంటాయి. రూమర్స్ క్రియేట్ చేయడానికి ఔత్సాహికరాయుళ్లు ఎలానూ ఉంటారు. ఇక, సినిమాల్లోకొచ్చేస్తే డోస్ ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం జాన్వీ ‘ధడక్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఇషాన్ కట్టర్ హీరో. ఈ ఇద్దరూ కలసి సరదాగా డిన్నర్‌కి వెళ్లారు. డిన్నర్ అంతా బాగానే సాగింది. ఫైనల్లీ ‘మళ్లీ కలుద్దాం’ అంటూ ఇషాన్ బై చెప్పి వెళుతుండగా, ఓ కుర్రాడు జాన్వీ దగ్గరకొచ్చి ‘సెల్ఫీ ప్లీజ్’ అన్నాడు. జాన్వీ అతన్ని లెక్క చేయకుండా అక్కణ్ణుంచి నిష్క్రమించింది. పాపం.. టీనేజ్ అమ్మాయి. ఎంత సినిమా వాతావరణంలో పెరిగినా ఫ్యాన్స్ దూసుకొస్తే కంగారుగానే ఉంటుంది కదా. బహుశా సెల్ఫీ ఇవ్వాలో లేదో తెలియక జాన్వీ తికమకపడిం దేమో అన్నది కొందరి అభిప్రాయం. ఇంకొందరు మాత్రం ‘అది బిడియమా? పొగరా?’ అనే ప్రచారం మొదలుపెట్టారు. కానీ, మొదటిదే కరెక్ట్ అయ్యుండొచ్చేమో. -
ధడక్... దిగులు పడక్
‘‘ప్రేమ ఎప్పుడూ పూల పాన్పు కాదు. అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రేమించినంత సులువు కాదు, ఆ ప్రేమను గెలిపించుకోవటం. సమస్యలకు భయపడకుండా పోరాడి నిలబడగలిగితేనే నిజమైన ప్రేమ అంటున్నారు’’ జాన్వీ, ఇషాన్. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ పరిచయం అవుతున్న చిత్రం ‘ధడక్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ లుక్‌ని ఆ మధ్య విడుదల చేశారు. తాజాగా ఓ స్టిల్ బయటకు వచ్చింది. ఈ ఫొటో చూస్తుంటే జాన్వీ, ఇషాన్ దేనికోసమో దిగులు పడుతున్నట్టుగా ఉంది కదూ. ఆ దిగులు ఎందుకోసం అంటే.. ప్రేమికు (సినిమాలో లవర్స్)లకు పెద్దవాళ్ల నుంచి వచ్చే సమస్యల వల్లనే అని ఊహించవచ్చు. జాన్వీ, ఇషాన్ పరిచయమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. ఈ ఇద్దరూ ఎలా నటించారో తెలియాలంటే వచ్చే ఏడాది జులై వరకూ ఆగాల్సిందే. శశాంక్ కైతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ధర్మ ప్రొడన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. -
అమ్మ తోడు యాక్షన్ మొదలైంది
జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ కెమెరా ముందుకొచ్చింది. ఇప్పటివరకూ చాలాసార్లు వచ్చింది కదా అనుకుంటున్నారా? నటిగా రావడం ఇదే ఫస్ట్ టైమ్. జాన్వీ కథానాయికగా నటిస్తోన్న మొదటి హిందీ చిత్రం ‘ధడక్’ షూటింగ్ శుక్రవారం మొదలైంది. శశాంక్ కేతన్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. మరాఠీ చిత్రం ‘సైరాట్’కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. ‘‘మార్చికల్లా షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. జాన్వీ, ఇషాన్ చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారిని ఎవరైనా డైరెక్ట్ చేయాలనుకుంటారు. ఒరిజినల్ సినిమాలోని సోల్ మిస్ కాకుండా నా స్టైల్లో సినిమా తీయాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు కేతన్. వచ్చే ఏడాది జూలై 6న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కరణ్ జోహార్ వెల్లడించారు. ఆ సంగతలా ఉంచితే.. ముద్దుల కూతురి మొదటి సినిమా, మొదటి రోజు షూటింగ్‌ని కళ్లారా చూడాలనుకున్నారేమో.. శ్రీదేవి కూడా లొకేషన్‌కి వెళ్లారు. కూతురితో కలసి సెల్ఫీ దిగి, సందడి చేశారు. -
అధరం తాంబూలం!
సెలబ్రిటీలకు స్వేచ్ఛ ఉండదు. ఇంటి నుంచి కాలు బయట పెట్టిన క్షణం నుంచీ రహస్య కెమేరాలు వెంటాడతాయ్. అది గ్రహించే ప్రముఖులు కూడా అప్రమత్తంగా ఉంటారు. అయినా ఏదో చోట దొరికిపోతారు. ఈ మధ్య ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అలానే దొరికిపోయింది. ఈ టీనేజ్ బ్యూటీ ఇటీవల శిఖర్ పహారియా అనే కుర్రాడితో ముద్దుల మూడ్‌లో ఉన్నప్పుడు రహస్యంగా ఎవరో కెమెరాలో బంధించారు. తీసినవాళ్లు సోషల్ మీడియా ద్వారా జాన్వీ, శిఖర్‌ల ముద్దూ ముచ్చట తాలూకు ఫొటోను బయటపెట్టారు. ఇంతకీ ఈ శిఖర్ పహారియా ఎవరంటే.. కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు. ఓ ప్రైవేట్ పార్టీలో జాన్వీ, శిఖర్‌లు ఈ విధంగా పట్టుబడ్డారని టాక్. ప్రస్తుతం జాన్వీ న్యూయార్క్‌లో ఉంది. అక్కడ నటనలో శిక్షణ తీసుకుంటోంది. మరో రెండేళ్ల లోపు తను కథానాయికగా పరిచయమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం.