అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్‌ | Janhvi Kapoor Comments On Ambedkar And Gandhi | Sakshi
Sakshi News home page

అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్‌

May 25 2024 10:05 AM | Updated on May 25 2024 11:46 AM

Janhvi Kapoor Comments On Ambedkar And Gandhi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటించిన 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే, ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యలో జాన్వీ చేసిన వ్యాఖ్యలు అభిమానులతో పాటు నెటజన్లలలో కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. సాధారణంగా సినీ నటీనటులలో సామాజిక అంశాల పట్ల ఏమాత్రం అవగాహన ఉండదనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, జాన్వీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.

అంబేద్కర్, గాంధీ మధ్య డిబేట్‌ చూడటం  తనకు చాలా ఆసక్తికరంగా ఉంటుందని జాన్వీ కపూర్‌ తెలిపింది.  ఒక నిర్దిష్ట అంశంపై అంబేద్కర్, గాంధీ అభిప్రాయాలు ఎలా మారాయి అనే దాని మధ్య చర్చ ఉండాలని ఆమె కోరింది. ఆమె మాటలతో ఇంటర్వ్యూయర్లు కూడా 'వావ్' అని ఆశ్చర్యపోయారు. ఈ సమాజం పట్ల వారిద్దరూ ఎంచుకున్న మార్గం పట్ల బలంగా నిలబడ్డారు. వాళ్లిద్దరూ మన సమాజానికి ఎంతో సహాయం చేశారు. వారు ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో అనేది తెలుసుకోవాలని ఉంది. ఇది చాలా ఆసక్తికరమైన చర్చగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక నిర్దిష్ట అంశంపై వారి అభిప్రాయాలు కాలక్రమేణా ఎలా మారాయి..? కుల ఆధారిత వివక్ష, అంటరానితనం పూర్తిగా అంతమవ్వాలి అనే అంశంపై అంబేద్కర్ వైఖరి ఏమిటో స్పష్టంగా ఉంది. 

కానీ గాంధీ అభిప్రాయాలు నిరంతరం మారుతూ వచ్చాయి. ఎందుకంటే మన దేశంలో  కులతత్వం కాకుండా, దానిపై మూడవ వ్యక్తి నుంచి అభిప్రాయాలు పొందడం అనేది వాస్తవ ప్రపంచానికి చాలా భిన్నంగా ఉంటుంది. మీ పాఠశాలలో ఎప్పుడైనా కులతత్వం గురించి చర్చించారా?  అనే ప్రశ్నకు జాన్వీ ఇలా సమాధానమిచ్చింది. 'లేదు, నా స్కూల్‌లో కాదు, నా ఇంట్లో కూడా కులం గురించి ఎప్పుడూ చర్చ జరగదు.' అని జాన్వీ చెప్పింది. దీంతో నెటిజన్లు కూడా ఆమె మాటలకు ఫిదా అవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement