అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో పుష్ప2తో మరో హిట్ పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానల నుంచి పుష్పరాజ్‌కు ఫిదా అవుతున్నారు. సుమారు 12500కు పైగా థియేటర్స్‌లలో విడుదలైన ఈ చిత్రం పట్ల బాలీవుడ్‌లో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎక్కువ థియేటర్స్ పుష్ప2 చిత్రానికి కేటాయించడంతో వారు అభ్యంతరం తెలుపుతున్నారు. పుష్ప2 వల్ల హాలీవుడ్ హిట్ మూవీ 'ఇంటర్ స్టెల్లార్' రీ రిలీజ్ వాయిదా పడిందని పుష్పను విమర్శిస్తూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ రియాక్ట్ అయ్యారు.
2014లో విడుదలైన'ఇంటర్ స్టెల్లార్' సినిమాకు చాలామంది అభిమానులు ఉన్నారు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికి విడుదలై 10 ఏళ్లు అయింది. ఈ సందర్బంగా ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, బాలీవుడ్‌లోని ఐమాక్స్‌లలో ఎక్కువ చోట్ల పుష్ప2 ఉండటంతో ఈ చిత్రం వాయిదా పడింది. దీంతో కొందరు నెట్టింట అభ్యంతరం పెడుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై జాన్వీ స్పందించింది.
పుష్ప2 చిత్రాన్ని సమర్థిస్తూ జాన్వి ఇలా చెప్పుకొచ్చింది. 'పుష్ప2 కూడా సినిమానే కదా.. పాశ్చాత్య దేశాలకు చెందిన సినిమాలతో పోలుస్తూ మన సినిమాను ఎందుకు తక్కువ చేస్తున్నారు. మన సినిమాలను గుర్తించకుండా ఇతర దేశ సినిమాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం మీరు సపోర్ట్ చేస్తున్న హాలీవుడ్ వారే మన సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మన సినిమా పట్ల ఆకర్షితులవుతున్నారు. అయితే, ఇక్కడ విచారకరం ఏమిటంటే.. మనం మాత్రమే మన సినిమాలపై చిన్న చూపు చూపిస్తున్నాం.' అంటూ పుష్ప2 చిత్రానికి సపోర్ట్‌గా ఆమె కామెంట్ చేశారు. ఈ విషయంలో జాన్వీపై ప్రశంసలు అందుతున్నాయి.
బాలీవుడ్‌లో శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. తెలుగులో 'దేవర'తో పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టడంతో ఆమెకు కూడా మంచి గుర్తింపు దక్కింది. రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఒక చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment