
ఎక్కడ చూసినా ఛావా (Chhaava Movie) ప్రభంజనమే! ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఛత్రపతి శివాజీ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన కుమారుడు శంబాజీ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఆయన చరిత్రను అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో తెరకెక్కిన సినిమా ఛావా. ఓపక్క ప్రేక్షకుల రక్తం మరిగేలా చేస్తూ మరోపక్క వారిని సీట్లకు కట్టిపడేసి కన్నీళ్లు పెట్టిస్తోందీ మూవీ.
పుష్ప 2 Vs ఛావా అయ్యేది!
ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజైంది. నిజానికి గతేడాది డిసెంబర్ 6న ఛావాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా (Pushpa 2: The Rule) కూడా సరిగ్గా అప్పుడే వస్తున్నట్లు తెలిసి ఆలోచనలో పడ్డారు. అప్పటికే పుష్ప 1 బ్లాక్‌బస్టర్. దానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2ను పాన్ ఇండియావైడ్‌గా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఇలాంటి సమయంలో పుష్పరాజ్‌కు పోటీగా వెళ్తే రెండు సినిమాల కలెక్షన్స్ దెబ్బతినే అవకాశం ఉందని ఛావా మేకర్స్ వెనక్కు తగ్గారు.

పుష్పరాజ్‌కు దారిచ్చిన ఛావా
పుష్పరాజ్‌కు దారిస్తూ కొత్త డేట్ వెతుక్కున్నారు. అందుకుగానూ అల్లు అర్జున్ (Allu Arjun) ఛావా యూనిట్‌కు స్పెషల్‌గా థాంక్స్ కూడా చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రెండు సినిమాలు లాభపడ్డాయి. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1850 కోట్లు సాధించింది. ఇప్పుడు ఛావాకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ ఊపందుకుంటున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లోనూ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించడం విశేషం.
(చదవండి: Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో)
ఇద్దరి కెరీర్‌లో మైలురాయి..
అల్లు అర్జున్ కెరీర్‌లో పుష్ప ఎలాగో విక్కీ కౌశల్ కెరీర్‌లో ఛావా అంతే ప్రత్యకంగా నిలిచిపోనుంది. ఛావా సినిమాపై ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రశంసలు కురిపించారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఛావా అన్నిచోట్లా ఆదరణ పొందుతోంది. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల వల్ల శంభాజీ వీరత్వాన్ని సినిమాగా పరిచయం చేయడానికి వీలైంది అన్నారు.

మోదీ ప్రశంసలు
ఇందుకు సంబంధించిన వీడియోను విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీ ఛావాను ప్రశంసించడం, ఛత్రపతి శంభాజీ మహారాజ్ త్యాగాన్ని కీర్తించినందుకు గర్వంగా ఉంది. ఆనందంతో మనసు ఉప్పొంగుతోంది అని రాసుకొచ్చాడు. ఛావాలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక మందన్నా, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా రాబట్టింది.
చదవండి: అయ్య బాబోయ్.. కిచ్చ సుదీప్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా?
Comments
Please login to add a commentAdd a comment