రూ.500 కోట్లకు చేరువలో ఛావా.. తెలుగు వర్షన్‌ రిలీజ్‌ ఎప్పుడంటే? | Buzz: Vicky Kaushal Chhaava Movie Releasing in Telugu | Sakshi
Sakshi News home page

Chhaava Movie: తెలుగులో రిలీజవుతున్న ఛావా.. ఎప్పుడంటే?

Published Wed, Feb 26 2025 2:58 PM | Last Updated on Wed, Feb 26 2025 4:32 PM

Buzz: Vicky Kaushal Chhaava Movie Releasing in Telugu

ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్‌ సినిమా ఏది? అంటే క్షణం ఆలోచించకుండా ఛావా (Chhaava Movie) అని చెప్తున్నారు సినీప్రియులు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ జనాల్ని థియేటర్‌కు రప్పిస్తూనే ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీయే కాదు ఆయన తనయుడు శంభాజీ (Chhatrapati Sambhaji Maharaj) కూడా పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, త్యాగశీలి అని చరిత్రను చాటిచెప్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.483 కోట్లు రాబట్టింది. రేపో మాపో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరనుంది.

తెలుగు ప్రేక్షకుల డిమాండ్‌
సినిమాను విపరీతంగా ప్రేమించే తెలుగు ప్రేక్షకులు ఛావా తెలుగు డబ్బింగ్‌ (Chhaava Telugu Version) కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. తెలుగు వర్షన్‌లో ఛావా రిలీజైతే ఇక్కడ మరింత కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఇంత గొప్ప సినిమాను టాలీవుడ్‌ ఆడియన్స్‌కు అందించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ భావించారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ ఛావా తెలుగు డబ్బింగ్‌ పనులను ఇదివరకే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా గీతా ఆర్ట్స్‌.. మార్చి 7న ఛావా తెలుగు వర్షన్‌ రిలీజ్‌ చేయనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

ఛావా
విక్కీ కౌశల్‌ పోషించిన శంభాజీ పాత్రకు ఏ హీరో డబ్బింగ్‌ చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ అయితే ఆ పాత్రకు ప్రాణం పోస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. మరి ఏ హీరో డబ్బింగ్‌ చెప్పాడన్నది వారం రోజుల్లో తెలియనుంది. ఛావా సినిమా విషయానికి వస్తే.. విక్కీ కౌశల్‌, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించగా ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.

 

 

చదవండి: ఆ సమయంలో నా తండ్రి పేరు చెప్పుకోలేదు: శృతిహాసన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement