ఛావా మరో క్రేజీ రికార్డ్‌.. పుష్ప-2 సరసన చేరిన బాలీవుడ్‌ మూవీ! | Chhaava Become third film to achieve this milestone after Pushpa 2 and Stree 2 | Sakshi
Sakshi News home page

Chhaava Movie: ఛావా మరో క్రేజీ రికార్డ్‌.. ఆ జాబితాలో మూడో చిత్రంగా!

Published Mon, Apr 21 2025 8:01 PM | Last Updated on Mon, Apr 21 2025 8:27 PM

Chhaava Become third film to achieve this milestone after Pushpa 2 and Stree 2

విక్కీ కౌశల్‌,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ఛావా(Chhaava Movie). ఈ ఏడాది ఫిబ్రవరి 14న హిందీలో రిలీజై బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 800 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. ఛావా సినిమాకు బాలీవుడ్‌లో హిట్‌ టాక్‌ రావడంతో.. మార్చి 7న ఈ చిత్రాన్ని తెలుగులో  గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. టాలీవుడ్‌లోనూ అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఛావా' దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.

తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది. కేవలం హిందీలో దేశవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది. పుష్ప-2, స్త్రీ-2 తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన మూడో చిత్రంగా ఛావా చోటు దక్కించుకుంది. స్త్రీ-2 తర్వాత ఈ రికార్డ్ కొల్లగొట్టిన రెండో బాలీవుడ్ మూవీగా అవతరించింది. ఈ విషయాన్ని విక్కీ కౌశల్ తండ్రి, బాలీవుడ్‌లో దర్శకుడైన శామ్ కౌశల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 600 నాట్‌అవుట్ అంటూ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ గణాంకాలను వెల్లడించారు. ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా మార్చడంలో మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ  సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.  ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా కూడా కీలక పాత్రల్లో నటించారు. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

హిందీలో టాప్- 10 నెట్‌ వసూళ్లు సాధించిన చిత్రాలు..

1 పుష్ప: ది రూల్ - పార్ట్ 2- రూ.812.14 కోట్లు
2 స్ట్రీ- 2 - రూ.597.99 కోట్లు
3 ఛావా- రూ.585.43 కోట్లు
4 జవాన్ -రూ.582.31 కోట్లు
5 గదర్ 2- రూ.525.7 కోట్లు
6 పఠాన్ -రూ.524.53 కోట్లు
7 బాహుబలి 2 ది కన్‌క్లూజన్- రూ.510.99 కోట్లు
8 యానిమల్- రూ.502.98 కోట్లు
9 కేజీఎఫ్ చాప్టర్ 2- రూ.435.33 కోట్లు
10 దంగల్ - రూ.374.43 కోట్లు
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement