
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హిస్టారికల్ చిత్రం ఛావా. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదట హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా తిరుగులేని వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల తెలుగులోనూ విడుదలైన ఛావా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.
తాజాగా ఈ చిత్రం హిందీలో క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 రికార్డ్‌ను అధిగమించింది. ప్రభాస్ నటించిన బాహుబలి-2 హిందీలో రూ.510 కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా ఛావా చిత్రం ఆ రికార్డ్‌ను దాటేసింది. కేవలం హిందీలోనే రూ.516 కోట్ల వసూళ్లు చేసింది. కేవలం విడుదలైన 25 రోజుల్లోనే బాహుబలి-2 రికార్డ్‌ను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా హిందీ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా నిలిచింది. దీంతో విక్కీ కౌశల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తెలుగులోనూ దూసుకెళ్తోన్న ఛావా..
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఛావా తెలుగు వర్షన్ కలెక్షన్స్‌తో పాటు సినిమాలోని క్లైమాక్స్ సీన్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో అందులో చూపించారు. ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా మేకింగ్ విధానాన్ని కూడా చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 530 కోట్ల మార్క్‌ను ఛావా చేరుకుంది. తెలుగు వర్షన్‌లో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది.

Comments
Please login to add a commentAdd a comment