Bahubali - 2
-
బాహుబలి తర్వాత అందుకే చేయలేదు: అనుష్క శెట్టి ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను పలకరించింది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టితో చాలా రోజుల గ్యాప్ తర్వాత అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టితో కలిసి తెరపై మెరిశారు. పి. మహేశ్ బాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అ పాన్ ఇండియా మూవీ బాహుబలి-2 తర్వాత పెద్దగా చిత్రాల్లో కనిపించలేదు. ఆ విషయంపై అనుష్క ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల్లో నటించకపోవడంపై తొలిసారి స్పందించింది. (ఇది చదవండి: 'నేను మీకు వీరాభిమానిని'.. జ్యోతిక పోస్ట్ వైరల్!) రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-1, బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. దేవసేన మెప్పించిన అనుష్క ఈ చిత్రం తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్‌లో ఎక్కడా కనిపించలేదు. ఆ సినిమా తర్వాత 2018లో భాగమతితో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజైన నిశ్శబ్దంలో కనిపించింది. దీంతో పాన్ ఇండియా మూవీస్‌లో ఎందుకు నటించలేదనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన అనుష్క ఈ విషయంపై తొలిసారి క్లారిటీ ఇచ్చారు. అనుష్క మాట్లాడుతూ..'నేను బాహుబలిని చేసిన తర్వాత భాగమతి సినిమాకు ఓకే చెప్పా. ఆ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నా. ఎందుకంటే ఆ సమయంలో అది నాకు చాలా అవసరం. అందువల్లే ఆ సమయంలో పెద్ద ప్రాజెక్టులకు ఓకే చెప్పలేదు. భవిష్యత్తులో మరిన్నీ ప్రాజెక్టులు చేయాలంటే బ్రేక్ తప్పనిసరి అనిపించింది. కొంత సమయం సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే ఎలాంటి స్క్రిప్ట్ వినలేదు. కానీ మంచి కథ వస్తే తప్పకుండా చేస్తా. అది ఏ భాషలోనైనా కావొచ్చు.' అని తెలిపింది. చాలా రోజుల తర్వాత మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో ప్రేక్షకులను అలరించింది భామ. చెఫ్ పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. (ఇది చదవండి: ప్రభాస్ కల్కిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్.. ఇప్పటికే!) -
మహేష్, రాజమౌళి సినిమా పై రానా సంచలన కామెంట్స్
-
జపాన్ లో బాహుబలి -2 రికార్డును తుడిచేసిన RRR
-
నాలుగు సినిమాలు.. అక్షరాలా రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ప్రభాస్ బర్త్‌డేను పురస్కరించుకుని బిల్లా సినిమాను రి-రిలీజ్ చేయగా థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం 43వ పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ చేతిలో పలు కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభాస్ నటిస్తున్నచిత్రాలన్నీ భారీ బడ్జెట్లోనే నిర్మిస్తున్నారు. అయితే ఆ సినిమాల బడ్జెట్ విలువ దాదాపు రూ.1000 కోట్లకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిపురుష్: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న త్రీడీ యాక్షన్ చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాలో రాఘవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బడ్జెట్ రూ.400 కోట్లు. ఈ మెగా బడ్జెట్ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో రావణుడి పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆదిపురుష్‌లో ప్రభాస్ సరసన కృతి సనన్ జానకి పాత్రలో సీతగా కనిపించనుంది. ఈ చిత్రంలో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నారు. 2023 జనవరిలో థియేటర్లలోకి రాబోతున్న ఆదిపురుష్ అద్వితీయమైన అనుభూతిని కలిగిస్తుందని ఇటీవల విడుదలైన టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. (చదవండి: అరాచకం.. థియేటర్‌ను తగలబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్) ప్రాజెక్ట్ కె: నాగ్ అశ్విన్ దర్శకత్వంతో తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం 'ప్రాజెక్ట్ కె'. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె నటిస్తోంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 500 కోట్లుగా అంచనా వేస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో లెజెండరీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్: కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్ ప్రతిష్ఠాత్మక చిత్రం 'సలార్'. ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ మలయాళీ నటుడు-చిత్రనిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీలోని కొన్ని ప్రధాన ముఖాలు సాలార్‌లో కనిపించాలని భావిస్తున్నారు. ప్రభాస్ నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2023లో థియేటర్లలో కనువిందు చేయనుంది. రాజా డీలక్స్: దర్శకుడు మారుతీతో ప్రభాస్ ఒక ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు తాత్కాలికంగా రాజా డీలక్స్ అని పేరు పెట్టారు. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కూడా రూ.100 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్-ఇండియన్ స్టార్ ఈ చిత్రంలో తాత, మనవడి పాత్రలను పోషిస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి. హారర్, కామెడీ చిత్రంగా నిర్మిస్తున్న రాజా డీలక్స్ అతి త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. (చదవండి: Prabhas: ఆదిపురుష్ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. యుద్ధ వీరుడిలా ప్రభాస్ లుక్) బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ ప్రభాస్ నటించిన బాహుబలి భారీ విజయం తర్వాత పాన్-ఇండియన్ సూపర్ స్టార్ కాస్త కఠినమైన పరీక్ష ఎదుర్కొన్నారు. రెబల్ స్టార్ నటించిన రెండు చిత్రాలు సాహో, రాధే శ్యామ్ కమర్షియల్ ఫెయిల్యూర్స్‌గా నిలిచి సినీ ప్రేక్షకులను చాలా నిరాశపరిచాయి. ఆగస్టు 2019లో థియేటర్లలోకి వచ్చిన సాహో రూ. 350కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. మరోవైపు రాధే శ్యామ్ మార్చి 2022లో విడుదల కాగా.. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెగా-బడ్జెట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తెలుగు సినీ ప్రేమికులను ప్రభాస్ అలరించనున్నారు. -
నా జీవితాన్నే మార్చేసింది : రానా
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి... కలెక్షన్ల వర్షం కురిపించింది బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో .. ఆ సినిమాలోని నటీనటులు అంతే స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ సినిమాతో హీరో ప్రభాస్‌తో పాటు స్టార్ వారసుడు రానా దగ్గుబాటి కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్ల నుంచి ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా విలక్షణ పాత్రలు ఎంచుకుంటున్న రానా.. భల్లాలదేవ పాత్రతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. కాగా బాహుబలి: ద కన్‌క్లూజన్ విడుదలై ఆదివారం నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రానా ఆనందం వ్యక్తం చేశాడు. ‘ రెండేళ్ల క్రితం ఇదే రోజు నా జీవితాన్ని మార్చివేసింది. చిరస్థాయిగా నిలిచిపోయే భారతీయ సినిమా బాహుబలి’ అంటూ బాహుబలి 2 పోస్టర్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. దీంతో రీట్వీట్లు, లైకులతో బాహుబలి అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అదే విధంగా బాహుబలి తర్వాత రానా ఇతర సినిమాల విడుదల జాప్యంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ఏం చేస్తున్నారు బ్రో అంటూ రానాను ప్రశ్నిస్తున్నారు. ఇక కొద్ది రోజులు క్రితం రానా ఆరోగ్య పరిస్థితి పై రకరకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. రానా తండ్రి సురేష్ బాబు కూడా రానా చిన్న ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టుగా వెల్లడించాడు. తాజాగా రానా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డాడు. ఈ ఫోటోల్లో రానా లుక్ మరోసారి చర్చకు దారి తీస్తోంది. బాగా సన్నబడ్డ రానాను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం హాథీ మేరే సాథీ, విరాటపర్వం సినిమాల్లో నటిస్తున్న రానా ఆ సినిమాల కోసం ఇలా బరువు తగ్గాడా? లేక హెల్త్ ప్రాబ్లం కారణంగా తగ్గాడా? అని చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తలపై రానా ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి. Two years this day changed my life and Indian cinema forever!! #Baahubali pic.twitter.com/XezO0D42I4 — Rana Daggubati (@RanaDaggubati) April 28, 2019 -
కట్టప్ప ఎందుకు చంపాడో నేనే తెలుసుకుంటా...
ఆమిర్ ఖాన్ ఓ సూపర్‌స్టార్. అందులో నో సీక్రెట్స్! ఆమిర్ నటించిన ఏ చిత్రమైనా సూపర్‌హిట్టే. అందులో నో డౌట్స్. కానీ, ఆయన్ను మించిన ఓ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఉన్నారని ఆమిర్ చెబుతున్నారు. ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తూ, నిర్మించిన చిత్రమిది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆమిర్ మీడియాతో ముచ్చటించిన విశేషాలు.... ► ఇంతకు ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ తెలుగు సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు! నిజమే. ‘మంచి కథ దొరికితే’ అని కూడా చెప్పాను కదా! తెలుగులో నటించడానికి నాకు ఎలాంటి సమస్యా లేదు. తెలుగు దర్శకులతో నా కోసం మంచి కథలు, క్యారెక్టర్లు రాయమని చెప్పండి. ఐ యామ్ రెడీ! ► ఇప్పుడు తెలుగు సినిమాలు హిందీలోనూ (డబ్బింగ్) మంచి హిట్టవుతున్నాయి. వాటిని మీరు చూస్తారా? టైమ్ దొరికినప్పుడు చూస్తుంటా! ‘బాహుబలి’ చూశా. ప్రభాస్ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. అద్భుతంగా చేశాడు. తెలుగులో మంచి మంచి నటులు, దర్శకులు ఉన్నారు. మంచి సిన్మాలు వస్తున్నాయి. ‘బాహుబలి 2’ హిందీలో ‘దంగల్’ కంటే ఎక్కువ వసూలు చేసింది. కానీ, నేనింకా ఆ సినిమా చూడలేదు. ► అవునా!? పోనీ, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకున్నారా? తెలియదు. పొరపాటున కూడా ఆ సీక్రెట్ చెప్పవద్దు. నేనే తెలుసుకుంటా. త్వరలో ‘బాహుబలి–2’ చూస్తా. ► ఓకే! మీరేంటి? చెవులకు పోగులు, ముక్కుపుడక... ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో సర్ప్రైజ్ లుక్‌లో కనిపిస్తారా? లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న లుక్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ కోసం! ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో సంగీత దర్శకుడు శక్తి కుమార్‌గా కనిపిస్తా. మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. సింగర్ కావాలనే ఓ 14 ఏళ్ల అమ్మాయి తన లక్ష్యాన్ని ఎలా చేరుకుందనేది చిత్రకథ. ► ఈ సినిమాలో సీక్రెట్ సూపర్‌స్టార్ ఎవరు? చాలామంది ఉన్నారు. సింగర్ కావాలనే అమ్మాయిగా ‘దంగల్’ ఫేమ్ జైరా వసీమ్, ఆమె తల్లిగా మెహర్ అద్భుతంగా నటించారు. వాళ్లిద్దరి కథే ఈ సినిమా. నేను స్టార్స్‌తోనే సినిమాలు చేయాలనుకోను. కథకు ఎవరు సూటైతే వాళ్లతో చేయాలనుకుంటా. ‘దంగల్’లో నలుగురు కొత్తమ్మాయిలు ఎంత బాగా చేశారో చూశారు కదా! కొత్త టాలెంట్‌ను ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ నాకు వస్తుండడం హ్యాపీగా ఉంది. ఈ సిన్మాతో దర్శకుడు అద్వైత్ చందన్, కొత్త సింగర్స్, పలువురు టెక్నిషియన్స్‌ని పరిచయం చేస్తున్నా. ► 2 వేల కోట్లు కలెక్ట్ చేసిన ‘దంగల్’ తర్వాత మీరు నటించిన చిత్రమిది. ప్రేక్షకుల్లో బోల్డన్ని అంచనాలు ఉన్నాయి. మీరేమో ఓ చిన్న సినిమా చేశారేంటి? ఇండియాలోనే కాదు... చైనా, హాంకాంగ్‌లతో పాటు పలు దేశాల్లో ‘దంగల్’ సూపర్‌హిట్. ఆ సినిమాపై ప్రేక్షకులు ఎంతో ప్రేమను చూపించారు. ‘దంగల్’ నచ్చినోళ్లకు కచ్చితంగా ఈ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ కూడా నచ్చుతుంది. ఇందులోనూ మనసుల్ని కదిలించే కథ, కథనాలు ఉన్నాయి. సమాజంలో కొందరు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించాం. ► ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ట్రైలర్లో ‘అవార్డులు తీసుకుని తీసుకుని విసుగొచ్చింది’ అనే డైలాగ్ చెప్పారు. మీరు అవార్డు వేడుకలకు అటెండ్ అవ్వరు కదా? అందుకే దర్శకుడు కథ చెప్పగానే.. ‘శక్తి కుమార్ పాత్రలో నాకు నేను కనిపించడం లేదు’ అన్నాను. అద్వైత్ మాత్రం నేనే నటిస్తే బాగుంటుందన్నాడు. ‘ఓ పని చేద్దాం. నేను ఆడిషన్ ఇస్తా. బాగుంటే చేద్దాం’ అన్నాను. చివరికి, నన్నే సెలక్ట్ చేశాడు. ► అవార్డుల గురించి వచ్చింది కాబట్టి... ఆస్కార్స్ వచ్చే ప్రతిసారి మన దర్శకులెవరికీ ఆ అవార్డు అందుకునే అర్హత లేదా? అనే ప్రస్తావన వస్తుంది. మీ దృష్టిలో ఆస్కార్స్ సాధించగల దర్శకుడు ఎవరు? ప్రపంచంలోనే అత్యుత్తమ దర్శకులు మన దగ్గరున్నారు. వెరీ టాలెంటెడ్. మంచి సినిమాలు తీస్తున్నారు. ఇండియాతో పాటు చైనా, హాంకాంగ్‌లలో భారీ హిటై్టన ‘దంగల్’ను తీసింది మన నితీశ్ తివారీనే కదా! వరల్డ్ క్లాస్ సినిమాలు మనమూ తీస్తున్నాం. సో, ఎవరో (అమెరికన్స్) ఇచ్చే అవార్డు కన్నా... ప్రేక్షకులు ఇచ్చే ప్రశంసలు, ఆదరణే ముఖ్యమని భావిస్తా. ► మీరు రొమాంటిక్ సిన్మా చేసి చాలా రోజులైంది. ఏ హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలనుంది? ఓ అమ్మాయితో రొమాన్స్ చేయాలనుంది. తను మంచి యాక్టర్. అందంగానూ ఉంటుంది. కానీ, నాతో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. తన పేరు కిరణ్‌రావ్ (ఆమిర్ భార్య) అని నవ్వేశారు. -
ఇంటి దొంగను పట్టేసింది!
దక్షిణాదిలో డేరింగ్ బ్యూటీగా పెరొందిన నటి అనుష్క. కథానాయకిగా పలు దశలను దాటి టాప్ నటిగా రాణిస్తున్న ఈ యోగా సుందరి కెరీర్ అరుంధతికి ముందు ఆ తరువాత అన్నట్టుగా ఒక దశ, రుద్రమదేవి, బాహుబలి అంటూ మరో దశ, తాజాగా బాహుబలి– 2తో అత్యున్నత దశ అంటూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం భాగమతి అంటూ తెరపైకి రావడానికి రెడీ అవుతున్న అనుష్క గురించి వదంతులు అదే స్థాయిలో హల్చల్ చేస్తున్నాయి. నటుడు ఆర్యతో చెట్టాపట్టాల్ అని, రానాతో సరాగాలని పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా బాహుబలి ఫేమ్ ప్రభాస్‌తో ప్రేమ వ్యవహారం, త్వరలో పెళ్లికి సిద్ధం అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటికి స్పందించిన ఈ స్వీటీ అసలు ఈ వదంతులు ఎలా పుడుతున్నాయి. ఎవరు తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాకు ఉప్పందిస్తున్నారు? అన్న విషయాలపై కన్నేశారట. దీంతో లీకుల దొంగ దొరికేశాడట. అతనెవరో కాదు తన వద్ద పని చేసే సహాయకుడేనని అనుష్క నిఘాలో బయట పడిందట. అంతే వెంటనే అతకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పని నుంచి వెంటనే తొలగించారట. సాధారణంగా ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు. అనుష్క కాస్త షార్ప్ అట. అందుకే తన వెనుక గోతులు తవ్వుతున్న వక్తిని పసి గట్టి పని బట్టి ఇంటికి పంపించేసిందట. అనుష్క నా మజాకా అంటున్నారు సినీవర్గాలు. ఇంతకీ ప్రభాస్‌తో ప్రేమాయణం వ్యవహారంలో నిజమెంత?ఈ విషయాన్ని కాలానికే వదిలేద్దాం. -
శివగామి!
శివగామి అంత పవర్ఫుల్ మదర్ క్యారెక్టర్‌గా మనకు ఎందుకు కనపడుతోంది? ధైర్యం వల్ల... త్యాగం వల్ల... కుటుంబ గౌరవం కోసం పోరాడిన వీర వనిత అవ్వడం వల్ల! రమా రాజమౌళి తన పిల్లలకే కాదు... ‘బాహుబలి’ యూనిట్‌కి ఒక తల్లి. కుటుంబం ఒక రాజ్యం అయితే... ఆవిడ శివగామి. రాజమౌళి జీవితంలో అసలు సిసలైన శివగామి! ♦ ఏంటండీ... గిన్నెలు, స్టవ్వు, పరుపులు, దుప్పట్లు... ‘బాహుబలి’ పనులు ఎక్కడ జరిగితే ఆ ప్లేస్‌ని ఇంటిలా మార్చేస్తారా? రమా రాజమౌళి: (నవ్వుతూ). ఈ సినిమా కోసం నాలుగైదేళ్లు డెడికేట్ చేసేశాం. దాదాపు ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అందుకే ఎక్కడ ఉంటే అక్కడ ఇంటి వాతావరణం గుర్తుకొచ్చేలా మార్చేశాం. అలా లేకపోతే ఇది హోటల్, ఇది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ల్యాబ్, ఇది షూటింగ్ స్పాట్ అనే ఫీలింగ్ మనసులో ఉంటుంది. పైగా నందీ (రాజమౌళి)కి ఇల్లంటే ఇష్టం. బయట ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే, అది ఎంత పెద్ద స్టార్ హోటల్ అయినా అక్కడి మంచాల మీద మా దుప్పట్లు వేస్తాను. వేరే బెడ్‌షీట్స్ అయితే నందీకి నిద్రపట్టదు. నేను ఒకటి రెండు రోజుల గురించి మాట్లాడటం లేదు. పెద్ద పెద్ద షెడ్యూల్స్ గురించి చెబుతున్నా. ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఆర్ఎఫ్సీలో ఓ గెస్ట్ హౌస్‌ని ఇంటిలా మార్చేశాం. ఇంటి స్టాఫ్‌ని తీసుకెళ్లిపోయాం. దాదాపు వంట నేనే చేస్తాను. ♦ అంత టైమ్ మీకుంటుందా? మీరీ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ కదా... ఆ పనులు చూసుకోవాలిగా? రమ: నాకు వంట చేయడం ఎప్పుడూ ఇబ్బంది అనిపించలేదు. ఈజీగా, ఫాస్ట్‌గా చేసేస్తా. ఎప్పుడూ పూటకి 20 మందికి వంట చేస్తాను. ఇంట్లో ఉన్నా ఎవరో ఒకరు వస్తుంటారు. లొకేషన్‌కి క్యారియర్ పంపాలంటే ఒకరికో ఇద్దరికో పంపలేం కదా. అందుకే ఎప్పుడూ 20, 25 మందికి వండుతుంటాను. తక్కువ వండాలంటే నాకు కష్టమే. హైదరాబాద్‌లో షూటింగ్ అంటే నందీకి ఇంటి నుంచే క్యారియర్ పంపిస్తాను. ♦ మీ నందిగారికి నచ్చిన వంటకాలు... అసలు బయట ఫుడ్‌ని ఎంజాయ్ చేయరా? రమ: ‘ఇది కావాలి’ అని అడగడు. ఏది వండినా తింటాడు. పప్పుచారు, చికెన్ కాంబినేషన్‌ని ఇష్టంగా తింటాడు. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఏదైనా కర్రీ, చారు పెట్టేస్తాను. అలా తినడం తనకూ ఇష్టమే. నందీకి పని తప్ప ఆరోగ్యం మీద ధ్యాస ఉండదు. తన ఆరోగ్యం గురించి నేనే పట్టించుకుంటుంటాను. మేం బయట కూడా తింటాం. సరదాగా లంచ్, డిన్నర్ అవీ చేస్తుంటాం. హాలిడే ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు మాత్రం బయట ఫుడ్ తింటాం. ♦ ఒకసారి రాజమౌళిగారు పులిహోర కలుపుతున్న ఫొటో ఒకటి బయటికొచ్చింది. ఆయన గరిటె తిప్పుతుంటారా? రమ: రాజమౌళికి వంట రాదు. షూటింగ్ లేకపోతే వంటింట్లో గట్టు మీద కూర్చుని కబుర్లు చెబుతుంటాడు. ఒకసారి నేను పులిహోర చేస్తుంటే, మొత్తం కలిపాడు. అలాంటి సహాయాలు చేస్తుంటాడు. ♦ మీ ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్స్? రమ: ఇద్దరికీ ఫుడ్ ఇష్టం. ట్రావెల్ చేయడం అంటే బోల్డంత సరదా. కొత్త ప్లేసులు చూడాలనుకుంటాం. ఎడ్వంచరస్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. ఇద్దరి ఆలోచనలూ దాదాపు ఒకేలా ఉంటాయి. ♦ గుడ్ హజ్బెండ్‌కి కేరాఫ్ అడ్రస్ రాజమౌళిగారనొచ్చా? రమ: ‘దేర్ ఈజ్ నో గుడ్, దేర్ ఈజ్ నో బ్యాడ్’. ఎందుకంటే నాకు ఇష్టమైనది ఇంకొకరికి మంచి క్వాలిటీ కాకపోవచ్చు. ఇంకొకరి దృష్టిలో బ్యాడ్ క్వాలిటీ నా కోణంలో గుడ్ అవ్వొచ్చు. అందుకే మంచి భర్తకి కావాల్సిన క్యాలిటీ ఇదే అని చెప్పలేను. రాజమౌళికి 24 గంటలూ ప్రొఫెషనే. అది చాలామందికి నచ్చకపోవచ్చు. నచ్చకపోయినంత మాత్రాన అది తప్పుకాదు. చెబితే నమ్మరు. ఆయనకు ఒక్క ఫ్రెండ్ కూడా లేరు. దానిని మనం నెగిటివ్‌గానూ తీసుకోవచ్చు. పాజిటివ్ క్వాలిటీగానూ తీసుకోవచ్చు. మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. నా వరకు ‘హీ ఈజ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్’. ఇతరులను బాగా అర్థం చేసుకుంటాడు. కోపం వచ్చినా క్షణికమే. ఎవరి మీద కోపం వస్తే వాళ్లతో కోపంగా మాట్లాడి, వెంటనే వేరేవాళ్లతో మాట్లాడాల్సి వస్తే, మూడ్ మార్చుకుంటాడు. అది మంచి లక్షణం. ♦ ‘బాహుబలి’ లాంటి పెద్ద ప్రాజెక్ట్‌కు మీ ఫ్యామిలీ నాలుగేళ్లు అంకితమైపోతుందని ఊహించారా? రమ: ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తామని ఊహించలేదు. రాజమౌళికి మహాభారతం అంటే ఇష్టం. ఆ ప్రాజెక్ట్ చేయాలనేవాడు. అది కనీసంæఐదేళ్ల ప్రాజెక్ట్ అనుకునేదాన్ని. ‘ఇప్పుడు మనకు బాధ్యతలు ఉన్నాయి. ఒక్క ప్రాజెక్ట్ మీద అంత టైమ్ స్పెండ్ చేయలేం. అది రిటైర్మెంట్ ప్రాజెక్ట్ అయితే బెటర్’ అనేదాన్ని. తనూ అదే కరెక్ట్ అనుకున్నాడు. కానీ ఇప్పుడనిపిస్తోంది. ‘బాహుబలి’నే ఐదేళ్ల ప్రాజెక్ట్ అయితే ‘మహాభారతం’కి పదేళ్లు పడుతుందని. ♦ పది మందికి పైగా మీ కుటుంబ సభ్యులు ‘బాహుబలి’కి పని చేశారు. ‘ఫ్యామిలీ ప్యాకేజ్’ అని బయట చాలామంది అంటుంటారు. మీ రెమ్యూనరేషన్ ఎంత? మిగతా అందరికీ పారితోషికాలు ఉంటాయి. నాకు రాజమౌళి కోసం పని చేయడం ఇష్టం కాబట్టి చేస్తున్నాను. అందుకని పారితోషికం తీసుకోను. ♦ అసలు కాస్ట్యూమ్ డిజైనర్‌గా మీ కెరీర్ ఎలా ప్రారంభమైంది? రమ: మొదట్నుంచీ కెరీర్లో పెద్ద స్థాయికి ఎదగాలని నేను అనుకోలేదు. అమ్మ చదువుకోమని చెబుతున్నా పట్టించుకునేదాన్ని కాదు. పెళ్లైన తర్వాత కూడా సినిమాల్లో వర్క్ చేయాలని కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వాలనీ ఆలోచన లేదు. రాజమౌళికి క్యారియర్ తీసుకుని షూటింగ్ స్పాట్‌కి వెళ్లేదాన్ని. ఆ టైమ్‌లో ‘సింహాద్రి’ షూట్ జరుగుతోంది. కాస్ట్యూమ్స్‌లో కొన్ని రాజమౌళికి నచ్చేవి కావు. మార్చి చేయించుకుందామంటే అసలు ప్రాబ్లమ్ ఏంటో చెప్పడం తనకు తెలిసేది కాదు. అప్పుడు నేను కలర్ కాంబినేషన్ విషయంలో సలహాలిచ్చేదాన్ని. అలా నాకు తెలియకుండానే ఇన్వాల్వ్ అయ్యాను. సాంగ్స్ తీసేటప్పుడు ‘కొంచెం కాస్ట్యూమర్తో మాట్లాడవా?’ అని నంది అనేవాడు. దాంతో నేనే వెళ్లి, మెటీరియల్ కొని, తీసుకొచ్చేదాన్ని. ‘సింహాద్రి’లోని అన్ని సాంగ్స్‌కు నేనే చేశా. ‘సై’ సిని మా నుంచి అఫిషియల్ అయిపోయా. ♦ రాజమౌళిగారికి కలర్ కాంబినేషన్ గురించి ఎంతవరకూ అవగాహన ఉంది? రమ: క్యారెక్టర్ లుక్ గురించి చెబుతారు కానీ, కాస్ట్యూమ్స్ ను ఆయన ఊహించలేరు. కలర్ మ్యాచింగ్ గురించి తనకు పెద్దగా ఐడియా లేదు. కాస్ట్యూమ్‌గా చూసినప్పుడు ఆయనకు అర్థం కాదు. అయితే ఆర్టిస్టులు వేసుకున్న తర్వాత లుక్స్‌కి ఇంప్రెస్ అయ్యేవారు. ♦ సో... రాజమౌళిగారి డ్రెస్సుల సెలక్షనంతా మీదే అన్నమాట... రమ: అన్నీ నేనే ఎంపిక చేస్తాను. ఒకరోజైతే నేనేదో పని మీద ఉంటే, తనంతట తాను ఒక డ్రెస్ సెలక్ట్ చేసుకుని, వేసుకుని వెళ్లాడు. అది రెడ్ టీ షర్ట్, రెడ్ ప్యాంట్. అలా వింత కాంబినేషన్లో డ్రెస్సులు వేసుకున్న సందర్భాలున్నాయి. అప్పుడు షూటింగ్ బిజీలో అలా చేశాడు. సినిమా జరగనప్పుడు కాస్త మైండ్ పెడితే మంచి కాంబినేషన్ సెలక్ట్ చేసుకోగలడు. ♦ పెద్ద డైరెక్టర్ని అనే గర్వం రాజమౌళిగారికి ఉంటుందా? రమ: గర్వం ఉంటుంది. ఆయన ఏం గౌతమ బుద్దుడు కాడు. సెయింట్ అసలే కాదు. ఇంత పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత చిన్నపాటి గర్వం లేకుండా ఎలా ఉంటుంది? రాజమౌళి సక్సెస్ చూసి, నాకూ గర్వంగా ఉంటుంది. ♦ ‘బాహుబలి’ కోట్ల బడ్జెట్‌తో తీసిన మూవీ. పార్ట్ 1 పెద్ద సక్సెస్ అయింది కాబట్టి ఓకే. లేకపోతే ఏంటి? అనే టెన్షన్ ఉండేదా? రమ: ఈ సినిమాకి మాత్రమే కాదు. ప్రతి సినిమాకీ నేను ఆందోళన పడతాను. ఇప్పుడు కూడా టెన్షన్లో ఉన్నాను. నా భయాన్ని మాటల్లో చెప్పలేను. కడుపు మెలి తిప్పిన ఫీలింగ్. కానీ ఎక్కువసేపు ఇదే మూడ్‌లో ఉండను. తర్వాత పక్కకు నెట్టేసి హ్యాపీ మూడ్‌లోకి వచ్చేస్తాను. రాజమౌళి మెదడుకు ఖాళీయే ఉండదు. షూటింగ్ చేస్తాడు. ఫుల్‌గా అలసిపోతాడు. హాయిగా నిద్రపోతాడు. అస్సలు భయపడడని కాదు, ఉంటుంది. కానీ నాకున్నంత భయం ఆయనకు ఉండదు. నేనెక్కువగా ఖాళీగా ఉంటాను కదా. అందుకే ఎక్కవగా ఆలోచించి అలా భయపడుతుంటాను. ♦ ఫైనల్లీ... మీది పెద్ద ఫ్యామిలీ. అందరూ ఎంతో క్లోజ్‌గా ఉంటారు. మీలోని మంచి ‘హోమ్ మేకర్’ అందరూ కలసి మెలసి ఉండేలా చేస్తుందనుకోవచ్చా? రమ: కీరవాణిగారిల్లు, మా ఇంటికి కొంచెం దూరంలో ఉంది. మేం ఐదు కుటుంబాలు ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం. కుటుంబ సభ్యులంతా కలసి మెలసి ఉండటానికి ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోవాలి. అది నేనవుతాను. పండగలంటే అందరం కలసి చేసుకోవాల్సిందే. ఆ టైమ్‌లో మేం ఓ 50 మంది వరకూ ఉంటాం. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించినప్పుడు మనస్పర్థలకు తావు ఉండదు. – డి.జి. భవాని ♦ బాహుబలి’ కోసం పని చేసిన మీ కుటుంబ సభ్యుల గురించి? రమ: మా పెద మామగారు శివశక్తి దత్తా, మా పిన మామగారు రామకృష్ణ పాటలు రాశారు. మా మామగారు విజయేంద్రప్రసాద్ కథ ఇచ్చారు. కీరవాణిగారు పాటలు ఇచ్చారు. కల్యాణి కోడూరి సౌండ్ మిక్సింగ్ చేశారు. నేను సై్టలిస్ట్‌గా చేశా. నా సిస్టర్ వల్లి లైన్ ప్రొడ్యూసర్. మా అబ్బాయి కార్తికేయ సెకండ్ యూనిట్ డైరెక్టర్. కీరవాణిగారి పెద్దబ్బాయి భైరవ పాటలు పాడాడు. కీరవాణిగారి రెండో అబ్బాయి శ్రీసింహా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. రామకృష్ణగారి అబ్బాయి రాజబలి వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లో చేశాడు. కల్యాణి కోడూరి అబ్బాయి మయూర్ ఒక బిట్‌కి డబ్బింగ్ చెప్పాడు. మూడు తరాలు పని చేశాం. కార్తికేయ బలం అదే! ♦ మీ అబ్బాయి కార్తికేయ కూడా డైరెక్టర్ అవుతారా? రమ: ‘బాహుబలి’కి కార్తికేయ సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా చేశాడు. తనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూట్ కాదు. ప్రొడక్షన్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు. సిచ్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడంలో కార్తికేయ బెస్ట్. అదే అతని బలం. డైరెక్టర్‌కు ఉండాల్సినంత ఫోకస్ వాడికి లేదు. చాలా కష్టపడతాడు. అయితే స్థిరంగా ఒక చోట కూర్చొని పని చేయలేడు. అయినా సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా ఎలా చేయగలిగాడంటే రాజమౌళికి ఏం కావాలో కార్తికేయ బాగా అర్థం చేసుకోగలడు. తన మనసును కార్తికేయ చదవగలడు. ఈ సినిమా మొత్తం జనాలే. వాళ్లందర్నీ బాగా కంట్రోల్ చేశాడు. సెకండ్ యూనిట్ డైరెక్ట్ చేశావు కదా. డైరెక్టర్ అవుతావా అనడిగితే... ‘ఇప్పుడింకా క్లారిటీ వచ్చింది. డైరెక్షన్లోకి అస్సలు వెళ్లను’ అన్నాడు. నాకేం కావాలో పిల్లలు అది అవ్వాలని ఎప్పుడూ బలవంతపెట్టలేదు, పెట్టను కూడా. కానీ, వాళ్ల బలాబలాలు ఏంటో వాళ్లకు చెబుతుంటాను. ♦ మీ నాన్న (రాజమౌళి)గారు టోటల్‌గా ‘బాహుబలి’కే డెడికేట్ కావడం కోపంగా అనిపించిందా? మయూఖ: నాన్నగారు చాలా కష్టపడతారు. రెండు నిమిషాలు టైమ్ ఉన్నా నాతో ఆప్యాయంగా మాట్లాడతారు. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారని నాకు తెలుసు. అందుకే కోపం లేదు. ♦ ఇంతకీ అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో మీకు తెలుసా? మయూఖ: అది మాక్కూడా తెలియదు. నాన్న చెప్పలేదు. స్కూల్లో ఫ్రెండ్స్ కూడా ఈ విషయం గురించి అడుగుతుంటారు. కుముద్వతి: ఆ విషయం తెలుసుకోవాలని మాకూ ఉంది. ♦ ప్రభాస్‌ని పరిచయం చేయమని ఫ్రెండ్స్ అడుగుతారా? కుముద్వతి: ఆటోగ్రాఫ్ కావాలని అడిగితే, ప్రభాస్ అన్నయ్య దగ్గర సైన్ పెట్టించుకు వెళ్లాను. నా ఫ్రెండ్స్ చాలా హ్యాపీ ఫీలయ్యారు. మయూఖ: నా ఫ్రెండ్ యుక్తీకి ప్రభాస్ అన్నయ్య అంటే ఇష్టం. ఒకసారి లొకేషన్‌కి తీసుకెళితే ఫొటో దిగింది. ♦ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? మయూఖ: నాకు సింగర్ అవ్వాలని ఉంది. కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. మ్యూజిక్‌లో నాకు మా పెదనాన్న కీరవాణిగారు, హాలివుడ్లో ‘రాక్మై బ్యాండ్’ ఇష్టం. కుముద్వతి: ఏమో ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. ♦ కీరవాణిగారు ఇటీవల తాను చాలామంది ‘బ్రెయిన్లెస్ డైరెక్టర్స్’తో సినిమాలు చేశానంటూ ఘాటుగా స్పందించడం వెనక ఏదో పెద్ద బాధే ఉండి ఉంటుందనిపిస్తోంది. ఆ బాధ గురించి కుటుంబ సభ్యులతో పంచుకున్నారా? రమ: లేదు. ఏదో ఒక విషయంలో ఆయన ఎక్కువ బాధపడి ఉంటారు. ఆయన జీవితంలో ఎన్నో బరువు, బాధ్యతలను మోసారు అన్న విషయం మర్చిపోకూడదు. ఆయన ఫీలయ్యారు కాబట్టి అలా స్పందించారు. ప్రతి మనిషికీ లోలోపల ఏదో íఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. ఇప్పుడు వచ్చింది. ♦ అంత ఘాటైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నది కొందరి అభిప్రాయం... మరి మీ ఇంట్లో? రమ: మనం చేసే ప్రతి పని అందరికీ నచ్చాలని లేదు. నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరేం చేయాలనుకుంటే అది చేస్తే మంచిది. అందుకే ‘ఇది సరి కాదు’ అనే చర్చ మా మధ్య రాదు. మా కుటుంబ సభ్యులకు మేం ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటాం. అప్పుడు నాకు మూడేళ్ల వయసుంటుందేమో! ఓ రూపాయి కావాలని అమ్మను అడిగా. సరే, ఇస్తానంది. అప్పుడు మా ఇంట్లో ఓ బ్లూ స్కూటర్ ఉండేది. ఎక్కడా మట్టి లేకుండా శుభ్రంగా ఆ స్కూటర్‌ను కడిగి రూపాయి తీసుకోమని చెప్పింది. పెద్దయిన తర్వాత ఆలోచిస్తే... కష్టపడితేనే డబ్బులు వస్తాయని నాకు అర్థమవడానికి అప్పుడలా అమ్మ ప్రాక్టికల్‌గా చూపించిందనిపించింది. కుటుంబ విలువలు కాపాడుకోవడానికి కూడా అంతే కష్టపడాలని చెప్పింది. అమ్మ ఎవర్నీ ఎక్కువ.. తక్కువగా చూడదు. ‘మనిషి చేసే ప్రతి పనికి విలువుంటుంది. ఎవర్నీ ఎక్కువ తక్కువగా చూడకూడదు’ అని తను ఆచరించేదే నాకు చెప్పింది. ప్రతి అంశాన్ని డబ్బుతో కాకుండా మానవీయ కోణంలో చూస్తుంది. ఈ రోజు నేనిలా ఉన్నానంటే అమ్మ నేర్పిన విలువలే కారణం. అమ్మను చూసి నేనెంతో నేర్చుకున్నాను. – ఎస్.ఎస్. కార్తికేయ మనిషిని మనిషిగా చూడాలనీ, అందరితో సమానంగా మెలగాలనే గొప్ప గుణాన్ని పెద్దమ్మ దగ్గర్నుంచి నేర్చుకున్నాను. అలాగే, ఫ్యామిలీ లైఫ్‌ను ఎలా మేనేజ్ చేయాలనేది పెద్దమ్మ నుంచి నేర్చుకున్నాను. – శ్రీ సింహ నైతికంగా పెద్దమ్మ నాకు కొండంత అండ. నేను ఉన్నత స్థితికి చేరతానని నాపై కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తుల్లో పెద్దమ్మ ఒకరు. ‘షి వాజ్ అండ్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ మి’. నేననే కాదు... ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే ఎంతో మోరల్ సపోర్ట్ ఇస్తుంది. పెద్దమ్మ నాకే కాదు... ఎంతోమందికి ఇన్స్పిరేషన్. – కాలభైరవ