నాలుగు సినిమాలు.. అక్షరాలా రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ | Rebal Star Prabhas Upcoming Projects Rs 1000 Crore Rupees | Sakshi
Sakshi News home page

Prabhas Movies Budget: రెబల్ స్టార్ భారీ ప్రాజెక్ట్స్.. రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్

Published Sun, Oct 23 2022 3:53 PM | Last Updated on Sun, Oct 23 2022 3:54 PM

Rebal Star Prabhas Upcoming Projects Rs 1000 Crore Rupees - Sakshi

పాన్‌ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ప్రభాస్ బర్త్‌డేను పురస్కరించుకుని బిల్లా సినిమాను రి-రిలీజ్ చేయగా థియేటర్లలో రచ్చ చేస్తున్నారు.  ప్రస్తుతం 43వ పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ చేతిలో పలు కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభాస్ నటిస్తున్నచిత్రాలన్నీ భారీ బడ్జెట్‌లోనే నిర్మిస్తున్నారు. అయితే ఆ సినిమాల బడ్జెట్ విలువ దాదాపు రూ.1000 కోట్లకు పైనే ఉన్నట‍్లు తెలుస్తోంది. 

ఆదిపురుష్: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న త్రీడీ యాక్షన్ చిత్రం ఆదిపురుష్‌. ఈ సినిమాలో రాఘవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బడ్జెట్‍ రూ.400 కోట్లు. ఈ మెగా బడ్జెట్ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు.  బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో రావణుడి పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆదిపురుష్‌లో ప్రభాస్ సరసన కృతి సనన్ జానకి పాత్రలో సీతగా కనిపించనుంది. ఈ చిత్రంలో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నారు. 2023 జనవరిలో థియేటర్లలోకి రాబోతున్న ఆదిపురుష్ అద్వితీయమైన అనుభూతిని కలిగిస్తుందని ఇటీవల విడుదలైన టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.

(చదవండి: అరాచకం.. థియేటర్‌ను తగలబెట్టిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌)

ప్రాజెక్ట్ కె: నాగ్ అశ్విన్ దర్శకత్వంతో తెరకెక్కిస్తున్న మరో భారీ  చిత్రం 'ప్రాజెక్ట్ కె'.  ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె  నటిస్తోంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 500 కోట్లుగా అంచనా వేస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో లెజెండరీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సలార్:  కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస‍్తున్ ప్రతిష్ఠాత్మక చిత్రం 'సలార్'. ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న  ఈ చిత్రం రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ మలయాళీ నటుడు-చిత్రనిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీలోని కొన్ని ప్రధాన ముఖాలు సాలార్‌లో కనిపించాలని భావిస్తున్నారు. ప్రభాస్ నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2023లో థియేటర్లలో కనువిందు చేయనుంది. 

రాజా డీలక్స్: దర్శకుడు మారుతీతో ప్రభాస్ ఒక ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు తాత్కాలికంగా రాజా డీలక్స్ అని పేరు పెట్టారు. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కూడా రూ.100 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస‍్తోంది. పాన్-ఇండియన్ స్టార్ ఈ చిత్రంలో తాత, మనవడి పాత్రలను పోషిస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి.  హారర్, కామెడీ చిత్రంగా నిర్మిస్తున్న రాజా డీలక్స్ అతి త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

(చదవండి: Prabhas: ఆదిపురుష్‌ స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌.. యుద్ధ వీరుడిలా ప్రభాస్‌ లుక్‌)

బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్

ప్రభాస్ నటించిన బాహుబలి  భారీ విజయం తర్వాత పాన్-ఇండియన్ సూపర్ స్టార్ కాస్త కఠినమైన పరీక్ష ఎదుర్కొన్నారు. రెబల్ స్టార్ నటించిన రెండు చిత్రాలు  సాహో, రాధే శ్యామ్ కమర్షియల్ ఫెయిల్యూర్స్‌గా నిలిచి సినీ ప్రేక్షకులను చాలా నిరాశపరిచాయి. ఆగస్టు 2019లో థియేటర్లలోకి వచ్చిన సాహో రూ. 350కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.  మరోవైపు రాధే శ్యామ్ మార్చి 2022లో విడుదల కాగా.. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.  ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెగా-బడ్జెట్ చిత్రాలతో  బాక్సాఫీస్ వద్ద తెలుగు సినీ ప్రేమికులను ప్రభాస్ అలరించనున్నారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement