ఈ ఏడాది సినీ అభిమానులకు అదిరిపోయే ఫేర్‌వెల్ దొరికింది. ఎందుకంటే రెండు రోజుల వ్యవధిలో రెండు పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. అందులో ఒకటి బాలీవుడ్ బాద్‌షా నటించిన డంకీ కాగా.. మరొకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్. డంకీ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించగా.. సలార్ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. రెండు భారీ చిత్రాలు కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ చిత్రాలపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. రెండు పేర్లు కాస్తా కొత్తగా అనిపించండంతో వీటికి అర్థాలు వెతికేస్తున్నారు.
(ఇది చదవండి: ‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్ దంపతులు..!)
అయితే ఇప్పటికే డంకీ అనే పదానికి అర్థాన్ని ఇప్పటికే హీరో షారుక్ వివరించారు. విదేశాల్లోకి అక్రమంగా ప్రవేశించడాన్ని డంకీ అని పిలుస్తారని అన్నారు. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఈ పదం ఎక్కువగా వాడుకలో ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో వలసదారులు చాలా మంది ఉన్నారట. పంజాబీలోని ఓ సామెత ప్రకారం ఈ పేరు వచ్చినట్లు గతంలో షారుక్ తెలిపారు. అక్రమంగా ప్రవేశించే మార్గాన్ని డంకీ రూట్ అనే పేరు వాడుకలోకి వచ్చిందని వివరించారు.
సలార్‌పై చర్చ
అయితే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం హిట్‌టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దీంతో ప్రస్తుతం సలార్ అనే పదంపై చర్చ మొదలైంది. అసలు ఈ పదానికి అర్థమేంటని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. అసలు ఈ టైటిల్ అర్థం ఏంటో తెలుసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఊవ్విలూరుతున్నారు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం
(ఇది చదవండి: ఆ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరంటే?).
అయితే సలార్ టైటిల్ అర్థాన్ని తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశారు. సలార్ అనేది ఓ ఉర్దూ పదమని ఆయన తెలిపారు. ఈ పదానికి అర్థం సమర్థవంతుడైన నాయకుడని అన్నారు. ఒక రాజుకు కుడిభుజంగా ఉంటూ.. అత్యంత నమ్మదగిన ఓ వ్యక్తి నే అలా పిలుస్తారంటూ ప్రశాంత్ నీల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment