dunki movie
-
ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ నాలుగు హైలెట్
మరో వారం వచ్చేసింది. రేపు (ఫిబ్రవరి 16) సందీప్ కిషన్ నటించిన భైరవకోన విడుదల కానుంది. గత వారంలో విడుదలైన రవితేజ ఈగల్, యాత్ర- 2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఓటీటీలోకి రాబోయే రెండు రోజుల్లో నా సామిరంగా, ది కేరళ స్టోరీ చిత్రాలు రానున్నాయి. దాదాపు 9 నెలల తర్వాత వివాదస్పద కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోవడంతో ఆ సినిమాపైనే అందరి గురి ఎక్కువగా ఉంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారంలో అందుబాటులో ఉండనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. డంకీ, నా సామిరంగ, సబా నాయగన్, ది కేరళ స్టోరీ నాలుగు చిత్రాలు ప్రత్యేకం. నెట్‌ఫ్లిక్స్ • డంకీ (నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది) • హౌస్ ఆఫ్ నింజాస్ (వెబ్‌సిరీస్) - ఫిబ్రవరి 15 • ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్- సీజన్-2(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 • లిటిల్ నికోలస్- హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15 • రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15 • ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 • ది క్యాచర్ వాజ్ ఏ స్పై - ఫిబ్రవరి 15 • క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 15 • ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16 • కామెడీ చావోస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 • ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) - ఫిబ్రవరి 16 • ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ • నా సామిరంగ (తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17 • సబా నాయగన్ ( తమిళ్,తెలుగు,మలయాళం,హిందీ మూవీ)- స్ట్రీమింగ్ అవుతుంది • సలార్ (హిందీ వర్షన్) - ఫిబ్రవరి 16 • ది స్టోరీ ఆఫ్ అజ్ (వెబ్ సిరీస్- 1)- - ఫిబ్రవరి 16 అమెజాన్ ప్రైమ్ వీడియో • రూట్ నం.17 ( తమిళ్ మూవీ) - ఫిబ్రవరి 15 • అమవాస్ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 16 • లవ్‌స్టోరీ యాన్ (హిందీ వెబ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది జీ5 • ది కేరళ స్టోరీ (బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16 • క్వీన్ ఎలిజిబెత్ (తమిళ్,మలయాళం మూవీ) - స్ట్రీమింగ్ అవుతుంది -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డంకీ' సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాదిలో సలార్‌కు పోటీగా డిసెంబర్ 21న డంకీ విడుదలైంది. 2023లో పఠాన్,జవాన్ చిత్రాలతో షారుక్ ఖాన్ రెండు బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించినా ఆ రెండు చిత్రాల రేంజ్లో మెప్పించలేక పోయింది. దీంతో రూ. 470 కోట్ల కలెక్షన్స్ వద్ద డంకీ ఆగిపోయింది. తాజాగా డంకీ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. వాస్తవంగా ఈ సినిమా జనవరిలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీలు కాలేదు. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండు షారుక్ డంకీ సినిమాను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో టాలీవుడ్ సినిమాలు అయిన సలార్,యానిమల్,గుంటూరు కారం, హాయ్‌నాన్న వంటి చిత్రాలు టాప్ టెన్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు డంకీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. థియేటర్స్‌లో డంకీ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులు ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
సలార్ VS డంకీ.. మొదటిసారి రియాక్ట్ అయిన ప్రశాంత్ నీల్
'ఉగ్రం' సినిమాతో దర్శకుడిగా 2014లో కెరీర్ ప్రారంభించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘ఉగ్రం’ తర్వాత మూడు సినిమాలే చేశాడు. కానీ ఆయన సినిమాలకు ఆదరణ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కేజీఎఫ్ 1, 2 సినిమాల ద్వారా ఇండియన్ సినిమా మార్కెట్లో ఫేమస్ డైరెక్టర్‌గా పాపులారిటీ పెంచుకున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యాక్షన్ ప్యాక్డ్ మూవీ సలార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అదరగొట్టేస్తున్నాడు. 'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ తెరకెక్కించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ తదితరులు నటించిన సలార్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ విజయం పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు.. తన సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సలార్ వర్సెస్ డంకీ ఫైట్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ఇద్దరు టాప్ హీరోల సినిమాల మధ్య గొడవలు పడుతుంటారు. 'నేను అలాంటి వాటిని ప్రోత్సహించను. అలాంటివి వినడానికి కూడా ఇష్టపడను. ఇలాంటి ట్రెండ్ సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం మంచిది కాదు. కళాకారులు ఒకరితో ఒకరు పోటీపడరు. అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ‘సలార్’, ‘డంకీ’ల మధ్య చాలా మంది అనుకుంటున్నట్లు ప్రతికూల వాతావరణం ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. డంకీ నిర్మాతలు కూడా మనలాగే పాజిటివ్‌గా ఆలోచించాలి. మనమందరం ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఉండే క్రికెట్ మ్యాచ్ కాదు.' అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. బాలీవుడ్లో సలార్ చిత్రానికి థియేటర్లు లేకుండా చేసిన కొందరు రివ్యూలు కూడా నెగటివ్‌గానే చెప్పడం జరిగింది. సలార్ సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేస్తే బాగుంటుందని అలా చేసి ఉంటే మరింత వసూళ్లు వచ్చేవని కూడా వచ్చే ప్రశ్నలకు కూడా ఆయన ఇలా చెప్పారు. 'డంకీతో విడుదల కాకుండా మా సినిమా మాత్రమే విడుదలై ఉంటే ఇలాంటి వార్తలు వచ్చేవి కావు.' అని ప్రశాంత్ నీల్ అన్నారు. సలార్ చిత్రం డిసెంబర్ 22న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలయింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్ల మార్క్‌ను దాటింది. -
ఇది ఎవరి తప్పు?
ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ చిత్రం ‘డంకీ’ గత గురువారం విడుదలైనప్పుడు, సరిగ్గా అలాంటి కథే కళ్ళ ముందుకొస్తుందని ఆయనా ఊహించి ఉండరు. సరైన విద్యార్హతలు లేకున్నా, సంపాదనకై లండన్‌కు అక్రమంగా వలసపోవాలనుకొనే నలుగురు పంజాబీల చుట్టూ తిరిగే షారుఖ్ ఖాన్ సినిమా అది. ఈ రోజుల్లో అలాంటి కథ ఏ మేరకు ప్రాసంగికమంటూ కొందరు స్తనశల్య పరీక్ష చేస్తున్నవేళ, యాదృచ్ఛికంగా అచ్చంగా ఆ సినిమాలో లానే, ఇంకా చెప్పాలంటే అంతకు మించిన రీతిలో భారతీయ అక్రమ వలసల ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నికరాగ్వా వెళ్ళాల్సిన ప్రత్యేక విమానం ఇంధనం నింపుకోవడానికి ఫ్రాన్స్‌లో ప్యారిస్‌కు 150 కి.మీ.ల దూరంలోని వాత్రీ విమానాశ్రయంలో ఆగినప్పుడు ఊహించని విషయం బయటపడింది. విమానంలో మనుషుల అక్రమ రవాణా సాగుతున్నట్టు ఉప్పందడంతో ఫ్రాన్స్ పోలీసులు బరిలోకి దిగేసరికి, అమెరికాకు అక్రమంగా పోవాలనుకున్నవారి ఆశ అడియాస అయింది. పక్కన తోడెవరూ లేని 11 మంది మైనర్లతో సహా మొత్తం 303 మంది విమాన ప్రయాణికుల్లో అత్యధికులు భారతీయులే. భారత్ నుంచి నేటికీ భారీగా సాగుతున్న అక్రమ వలసలకు ఇది మచ్చుతునక. వివిధ దేశాలకు అక్రమ వలసలు కొత్త కాదు. కానీ ఈ పద్ధతిలో, ఇంత భారీ సంఖ్యలో జరగడం మాత్రం కొత్తే. నికరాగ్వా వీసా మాత్రమే ఉన్నప్పటికీ వారిని అక్రమంగా అమెరికా పంపాలనేది పథకమనీ, ఈ వ్యవహారం నడిపిన ఇద్దరు అనుమానితుల్ని ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకు న్నారనీ, ప్రయాణికుల్లో పాతిక మంది శరణార్థులుగా ఆశ్రయం కోరారనీ వార్త. ఇక, మిగిలిన 276 మంది మంగళవారం ముంబయ్‌కి విమానంలో సురక్షితంగా తిరిగొచ్చారు. వ్యవహారం ఇంతటితో ముగిసినట్టనిపిస్తున్నా, అసలు కథ ఇప్పుడే ఉంది. రొమేనియా దేశపు ప్రైవేట్ కంపెనీ నడుపుతున్న విమానంలో ఈ అక్రమ వలస యానం వెనుక అసలు ఉన్నదెవరు? అమెరికా ఆశ చూపి అమాయకు లకు టికెట్లు, వీసాలు ఏర్పాటు చేసిన ప్రయాణ ఏజెన్సీలేమిటి? ఈ ‘డాంకీ/ డంకీ రూట్’ (అక్రమ ప్రయాణమార్గం), ప్రత్యేక విమానాలను ఖరారు చేసిందెవరు? ఇలాంటి అనేక విషయాల దర్యాప్తు మిగిలే ఉంది. నికరాగ్వా చేరకముందే, ఫ్రాన్స్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొనేసరికి కొందరు శరణార్థులుగా ఆశ్రయం కోరడం అచ్చంగా ‘డంకీ’ సినిమాలోని సన్నివేశాలను గుర్తు చేస్తుంది. నిజానికి, అమెరికాలోని అక్రమ వలస జనాభా విషయంలో మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత మూడో స్థానం భారత్‌దే. 2021 నాటి ప్యూ రిసెర్చ్ సెంటర్ నివేదిక ఈ వాస్తవం వెల్లడించింది. భారతీయ అమెరికన్లలో దాదాపు 7.25 లక్షల మంది అక్రమ వలసదారులే! మరో మాటలో – అమెరికాలోని ప్రతి ఆరుగురు భారతీయ అమెరికన్లలో ఒకరు సరైన పత్రాలు లేకుండా ఆ దేశంలో ఉంటున్నవారే! గమనిస్తే, ఒక్క 2022– 23లోనే 96,917 మంది భారతీయులు అక్రమ వలసదారులుగా అమెరికాలో ప్రవేశించే ప్రయత్నం చేశారు. అంతకు మునుపటి ఏడాదితో పోలిస్తే, అది 51.61 శాతం ఎక్కువ. వీరిలో దాదాపు 41 వేల మందికి పైగా మెక్సికన్ సరిహద్దు మార్గం గుండా అమెరికాలోకి వెళ్ళాలని చూశారు. ఎలాగైనా సరే అగ్రరాజ్యపు సందిట్లోకి చేరాలనుకొనే వారికి ప్రయాణ పత్రాలు సులభంగా పుట్టే నికరాగ్వా వాటమైన మజిలీ. మధ్య అమెరికాలోని ఆ అతి పెద్ద దేశం మీదుగా వలస పోతున్నారు. మెక్సికో, కెనడాల నుంచి అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన వార్తలు ఇటీవల అనేకం వచ్చాయి. అసలింతమంది భారతీయులు విదేశాలకు వలస పోవాలని ఎందుకనుకుంటున్నట్టు? భార తీయ అమెరికన్ కుటుంబ సగటు ఆదాయం లక్షా 30 వేల డాలర్లు. స్వదేశంలో సరైన ఉపాధి, ఉద్యోగాలు లేక అధిక శాతం మంది విదేశాల వైపు చూస్తున్నారు. అమెరికా, కెనడా లాంటి చోట్ల మెరుగైన ఆదాయం, ఆనందమయ జీవితాలను వెతుక్కుంటూ, ‘డాంకీ/ డంకీ రూట్’లోనైనా సరే అక్కడకు చేరిపోవాలని ఆరాటపడుతున్నారు. చిత్రమేమిటంటే, తాజాగా దొరికిన లెజెండ్ ఎయిర్ లైన్స్ విమానంలో అధిక శాతం మంది పాశ్చాత్య సమాజంతో దీర్ఘకాలిక సంబంధమున్న సంపన్న రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్ల వారే! ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డవారు సొంత భాష, ప్రాంతానికి చెందిన ఈ అక్రమ వలసదారులకు అండగా, సురక్షిత ఆశ్రయంగా మారడం సహజమే. సంపన్న దేశాల్లో శ్రామికశక్తి లోటును భర్తీ చేయడానికి మనుషులు కావాలి కానీ, సాంస్కృతిక అంతరాల రీత్యా అక్కడ వలసదారులకు లభించే గౌరవం ఎంత అన్నది చర్చనీయాంశమే. దేశాల సరిహద్దులు చెరిపేసిన ప్రపంచీకరణ వ్యాపారంలో జరిగిందే తప్ప, ఇప్పటికీ వ్యక్తులను అనుమతించడంలో, ఆదరించడంలో కాలేదన్నది నిష్ఠురసత్యం. ఏ దేశానికి ఆ దేశం తనవైన నియమ నిబంధనలు పెట్టుకోవడం సహజమే. అయితే, ఉన్న ఊరినీ, కన్నతల్లినీ వదిలేసి, మెరుగైన జీతం, జీవితం కోసం మనవాళ్ళు గల్ఫ్ నుంచి అమెరికా దాకా వివిధదేశాలకు వలసపోతున్న తీరుకు కారణాలపై సమాజం, సర్కారు పెద్దలు ఇప్పటికైనా దృష్టి సారించాలి. భవిష్యత్తు అనిశ్చితమని తెలిసినా సరే, ఎండమావుల వెంటపడి ప్రాణాల్ని పణంగా పెడుతున్న భారతీయ శ్రామికశక్తికి ఇక్కడే ఎందుకు సలక్షణ జీవనమార్గం చూపించలేకపోతున్నామో ఆలోచించాలి. దూరపుకొండల వైపు ఆశగా చూస్తున్న అమాయకులను బుట్టలో వేసుకొని, కళ్ళ ముందు గాలి మేడలు చూపెడుతున్న ఏజెంట్ల వ్యవస్థను పసిగట్టాలి. ప్రాణాంతక అక్రమ వలసలకు ప్రోత్సహిస్తున్న వారి పనిపట్టాలి. ప్రాచీన కాలపు బానిస వ్యాపార వ్యవస్థకు ఆధునిక రూపాంతరమైన మానవ అక్రమ రవాణా వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలి. తాజా విమానయాన ఉదంతం అందుకు ఓ మేలుకొలుపు. -
'రెండు చెత్త సినిమాలే'.. ట్వీట్లతో రెచ్చిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్!
మిస్టర్ రాస్కెల్, ప్రయాణం, ఊసరవెల్లి చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న భామ పాయల్ ఘోష్. టాలీవుడ్ మూవీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఊసరవెల్లి చిత్రంలో మెప్పించిన భామ.. ఆ తర్వాత టాలీవుడ్ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం సినిమాల్లో ఆమె ఏ సినిమాలో నటించడం లేనది తెలుస్తోంది. అయితే తాజాగా పాయల్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే థియేటర్లలో రిలీజైన డంకీ, సలార్ చిత్రాలను ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్స్ పాయల్ తన ట్వీట్లో రాస్తూ..' 2023లో రిలీజైన సినిమాలు ఒక్కటీ కూడా చూడలేని విధంగా ఉన్నాయి. అన్నీ చెత్త సినిమాలే వస్తున్నాయి. డంకీ, సలార్ కూడా చెత్తగా ఉన్నాయి. తన కెరీర్లో మొదటిసారి రాజ్ కుమార్ హిరానీ ఫ్లాప్ సినిమా తీశాడు. డంకీ, సలార్ రెండు చెత్త సినిమాలే. కానీ సలార్ చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ప్రభాస్ యంగ్ అండ్ పవర్ఫుల్ పర్సన్. ఆయనకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని' రాసుకొచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది రిలీజైన పఠాన్, జవాన్, యానిమల్ చిత్రాలు కూడా చెత్త సినిమాలేనంటూ వరుస ట్వీట్లు చేసింది. అయితే పాయల్ చేసిన ట్వీట్లకు ఎవరూ కూడా పెద్దగా రియాక్ట్ అవడం లేదు. అవకాశాల్లేకపోవడంతో ఫేమస్ అయ్యేందుకే ఇలా చేస్తోందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది 'ఫైర్ ఆఫ్ లవ్: రెడ్' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. #dunki bhi Faltu film au Aur #Salaar bhi lekin #Salaar will own more money because #Prabhas is not vfxd 😂he’s young and powerful.. dono film ho ghatiya hai 😅✔️ — Payal Ghoshॐ (@iampayalghosh) December 24, 2023 Ek bhi film dekhne layak nahi thi2023 mein sab Ghatiya film the…chahe woh pathan, jawan , animal, etc sab ke sab ghatiya film the Aur. Dunki and salaar.. sab ka review ghatiya hai 🤣🤣🤣 first time Raj kumar Hirani made a flop 🤣🤣 — Payal Ghoshॐ (@iampayalghosh) December 23, 2023 Koi nahi #Salaar bhi flop hai Aur #Dunki bhi dono ghatiya films audience ko chutiya bana rahe hai 😂😂😂😅 — Payal Ghoshॐ (@iampayalghosh) December 24, 2023 -
సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ప్రభాస్ బంపర్ రికార్డ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా సలార్ సందడే కనిపిస్తుంది. చాలా ఎళ్ల తర్వాత ప్రభాస్ భారీ హిట్ కొట్టాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సలార్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా సలార్ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు కలెక్షన్స్ రూ. 178 కోట్లు రాబట్టినట్లు చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 90 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రంగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాతి స్థానంలో దళపతి విజయ్ నటించిన 'లియో', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాలు ఈ ఏడాదిలో రూ.140 కోట్ల గ్రాస్‌తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్‌లో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా RRR మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ రూ. 223 కోట్ల రికార్డ్ పదిలంగా ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్-2 రూ. 165 కోట్ల రికార్డ్‌ను సలార్ దాటేశాడు. దీంతో మొదటిరోజు బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో సలార్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ రెండు చిత్రాలు సౌత్ ఇండియా నుంచే ఉండటం విశేషం. కానీ ఈ ఏడాది రెండు వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన షారుక్ ఖాన్ మాత్రం డంకీ చిత్రంతో కలెక్షన్స్ పరంగా వెనుకపడ్డాడు. డంకీ చిత్రానికి మొదటిరోజు కేవలం ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. సలార్ దెబ్బతో డంకీ కలెక్షన్స్ రెండోరోజు మరింత క్షీణించాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. The most violent man announced his arrival ⚠️#SalaarCeaseFire hits 𝟏𝟕𝟖.𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) on the opening day!𝐓𝐡𝐞 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐨𝐩𝐞𝐧𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐚𝐧𝐲 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐅𝐢𝐥𝐦 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑 💥#BlockbusterSalaar #RecordBreakingSalaar… pic.twitter.com/8FPzU8RB0I— Mythri Movie Makers (@MythriOfficial) December 23, 2023 -
'డంకీ' అంటే అర్థం తెలుసు.. 'సలార్' అంటే?
ఈ ఏడాది సినీ అభిమానులకు అదిరిపోయే ఫేర్వెల్ దొరికింది. ఎందుకంటే రెండు రోజుల వ్యవధిలో రెండు పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. అందులో ఒకటి బాలీవుడ్ బాద్షా నటించిన డంకీ కాగా.. మరొకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్. డంకీ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించగా.. సలార్ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. రెండు భారీ చిత్రాలు కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ చిత్రాలపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. రెండు పేర్లు కాస్తా కొత్తగా అనిపించండంతో వీటికి అర్థాలు వెతికేస్తున్నారు. (ఇది చదవండి: ‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్ దంపతులు..!) అయితే ఇప్పటికే డంకీ అనే పదానికి అర్థాన్ని ఇప్పటికే హీరో షారుక్ వివరించారు. విదేశాల్లోకి అక్రమంగా ప్రవేశించడాన్ని డంకీ అని పిలుస్తారని అన్నారు. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఈ పదం ఎక్కువగా వాడుకలో ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో వలసదారులు చాలా మంది ఉన్నారట. పంజాబీలోని ఓ సామెత ప్రకారం ఈ పేరు వచ్చినట్లు గతంలో షారుక్ తెలిపారు. అక్రమంగా ప్రవేశించే మార్గాన్ని డంకీ రూట్ అనే పేరు వాడుకలోకి వచ్చిందని వివరించారు. సలార్‌పై చర్చ అయితే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం హిట్‌టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దీంతో ప్రస్తుతం సలార్ అనే పదంపై చర్చ మొదలైంది. అసలు ఈ పదానికి అర్థమేంటని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. అసలు ఈ టైటిల్ అర్థం ఏంటో తెలుసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఊవ్విలూరుతున్నారు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం (ఇది చదవండి: ఆ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరంటే?). అయితే సలార్ టైటిల్ అర్థాన్ని తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశారు. సలార్ అనేది ఓ ఉర్దూ పదమని ఆయన తెలిపారు. ఈ పదానికి అర్థం సమర్థవంతుడైన నాయకుడని అన్నారు. ఒక రాజుకు కుడిభుజంగా ఉంటూ.. అత్యంత నమ్మదగిన ఓ వ్యక్తి నే అలా పిలుస్తారంటూ ప్రశాంత్ నీల్ వెల్లడించారు. -
'డంకీ' ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత తక్కువా..? సలార్‌కు లైన్ క్లియర్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. పఠాన్, జవాన్ సినిమాలతో ఈ ఏడాది రెండు భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. తాజాగా డిసెంబర్ 21న 'డంకీ'తో వచ్చేశాడు. రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ పట్ల పాజిటివ్ టాక్ ఉన్నా.. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరిస్తుందని టాక్ వినిపిస్తుంది. భారీ అంచనాలతో విడుదలైన డంకీ చిత్రం మొదటిరోజు ఆశించిన కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్, జవాన్ చిత్రాల మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్‌ను డంకీ దాటలేకపోయింది. సినిమా ట్రేడ్ వర్గాల ప్రకారం డంకీ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసులు చేసింది. నెట్ కలెక్షన్స్ ప్రకారం అయితే రూ. 30 కోట్లు అని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్ మొదటిరోజు రూ. 106 కోట్లు కలెక్ట్ చేయగా జవాన్ రూ. 129 కోట్లు రాబట్టింది. రెండు వరుస భారీ హిట్లు కొట్టిన తర్వాత వచ్చిన చిత్రం డంకీ... దీంతో ఈ సినిమా రూ. 130 కోట్ల మార్క్‌ను దాటుతుందని అందరూ అంచనా వేశారు. డంకీ చిత్రం మేకర్స్ అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ప్రకటించలేదు. ప్రభాస్ ప్లాప్ సినిమాను దాటలేకపోయిన 'డంకీ' ప్రభాస్ ప్లాప్ సినిమా అయిన ఆదిపురుష్ చిత్రం కంటే డంకీ మూవీకి కలెక్షన్స్ తక్కువ వచ్చాయి. ఆదిపురుష్ సినిమా మొదటి రోజు 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెట్ కలెక్షన్స్ ప్రకారం అయితే రూ. 37 కోట్లు. బాలీవుడ్లో మొదటిరోజు వచ్చిన టాప్ కలెక్షన్స్ లిస్ట్‌లో డంకీ చిత్రం 7వ స్థానంలో ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రభాస్ సలార్‌తో భారీ రికార్డ్స్ కొట్టడం ఖాయం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు డంకీ మూవీకి చెప్పుకోతగిన టాక్ రాలేదు. రాజ్ కుమార్ హిరానీ కేరీర్‌లోనే వీకెస్ట్ సినిమాగా డంకి పేరు తెచ్చుకుంది. అసలే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా వెనుకబడింది. సలార్ మాత్రం 33 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడపోయాయని సమాచారం. సలార్‌తో ప్రభాస్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం. -
'ఈ ఏడాదికి సరైన ముగింపు'.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పోస్ట్ వైరల్!
ఈ ఏడాది విరూపాక్షతో హిట్ కొట్టిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా మెగా హీరో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారంది. పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండే వ్యక్తుల్లో హీరో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఎల్లప్పుడూ సినిమా గెలవాలని ఆయన కోరుకుంటారు. అందులోనూ తెలుగు సినిమా ఎప్పుడూ ముందుడాలని కోరుకునే వ్యక్తి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ. తాజాగా ఆయన చేసిన పోస్ట్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నేడు మన తెలుగు సినిమా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నత స్థితికి చేరుకుందని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ నోట్లో రాస్తూ.. 'రెండు రోజుల్లో మూడు సినిమా ఇండస్ట్రీల నుంచి చిత్రాలు రిలీజవ్వడం సంతోషంగా ఉంది. తెలుగు సినిమా ప్రభాస్ సలార్. షారుక్ ఖాన్ డంకీ, హాలీవుడ్ ఫిలిం అక్వామెన్‌తో సరిసమానమైన క్రేజ్‌తో విడుదల కావడం గర్వంగా వుంది. మూడు అగ్ర సినీ పరిశ్రమలు ఓకేసారి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతికి ఇవ్వడానికి సిద్దం కావడం గొప్ప విషయం. అన్నింటి కంటే ఈ రోజు సినిమా చాలా అగ్రస్థాయిలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. 2023కు ఇదే సరైన ముగింపు. ఈ అనుభూతికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యువర్ కమ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్ షారుఖ్ సార్. డంకీ చిత్రంతో వరుసగా హ్యట్రీక్ సక్సెస్ సాధించాలి. సలార్‌తో వెండితెరపై ఫైర్ క్రియేట్ చేయడానికి సిద్దమైన ప్రభాస్ అన్నకు, అలాగే అక్వామెన్ సినిమాకు బెస్ట్ ఆఫ్ లక్' అంటూ రాసుకొచ్చారు. ఎందుకంటే ఈ వారంలో మోస్ట్ అవేటెడ్ ఫిల్స్మ్ డంకీ, సలార్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇవాళ డంకీ రిలీజ్ కాగా.. మరికొద్ది గంటల్లో సలార్ థియేటర్లలో సందడి చేయనుంది. అంతే కాకుండా మరో చిత్రం సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. అదే హాలీవుడ్ మూవీ అక్వామెన్ కూడా ఈరోజు రిలీజైంది. రెండు రోజుల వ్యవధిలో మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ సందర్భంగా మూడు సినిమాలను ఉద్దేశించి సాయి ధరమ్ తేజ్ నోట్ విడుదల చేశారు. CINEMA IS WINNING 💪🏼❤️#TeluguFilmIndustry#HindiFilmIndustry#Hollywood pic.twitter.com/hmlLm6PaJC — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 21, 2023 -
భారీ ధరకు డంకీ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాలీవుడ్ బాద్షా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైపోయాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ సినిమాతో ప్రేక్షకులను ముందుకొచ్చారు షారుక్ ఖాన్. గతంలో వీరిద్దరి కాంబోలో చాలా చిత్రాలు వచ్చాయి. దీంతో వీరి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న ఈ చిత్రం రిలీజైంది. అయితే డంకీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే అప్పుడే ఈ స్టార్ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అభిమాన హీరో సినిమా ఎక్కడ స్ట్రీమింగా కానుందని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అయితే డంకీ ఓటీటీ పార్ట్నర్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఈవెంట్లో జియో స్టూడియోస్ ప్లాట్ఫామ్లో రానున్న సినిమాలు, సిరీస్‌ల జాబితాను ఆవిష్కరించారు. ఆ లిస్ట్‌లో షారుక్ డంకీ సినిమా కూడా ఉంది. దీంతో డంకీ జియో సినిమాలో స్ట్రీమింగ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే డంకీ చిత్రాన్ని జియో సినిమా రూ. 155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇక సినిమా టాక్‌ను బట్టి, కలెక్షన్స్ ఆధారంగా మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. సాధరణంగా థియేట్రికల్ రిలీజ్ నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తారని తెలిసిందే. అలాగే జరిగితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే కానుకగా డంకీని ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. -
Dunki Movie Review: ‘డంకీ’ మూవీ రివ్యూ
టైటిల్: డంకీ నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, బొమాన్ ఇరానీ, అనీల్ గ్రోవర్ తదితరులు నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ నిర్మాతలు:గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే దర్శకత్వం: రాజ్ కుమార్ హిరాణీ సంగీతం: అమన్ పంత్, ప్రీతమ్(పాటలు) సినిమాటోగ్రఫీ: సీకే మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్ విడుదల తేది: డిసెంబర్ 21, 2023 ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సినిమాలను తెరకెక్కించే అతికొద్ది మంది దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాణీ ఒకరు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది షారుక్ ఖాన్‌తో సినిమా అంటే.. ఆ అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. డంకీ విషయంలో అదే జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. అందుకే డంకీపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 21)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పఠాన్, జవాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ల తర్వాత షారుక్ నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? షారుక్ ఖాతాలో హ్యాట్రిక్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. డంకీ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1995లో సాగుతుంది. శత్రువుల దాడిలో గాయపడిన సైనికుడు హార్డీ(షారుఖ్)ని ఓ వ్యక్తి కాపాడుతాడు. కొన్నాళ్ల తర్వాత అతన్ని కలిసేందుకు హార్డీ పంజాబ్‌కి వస్తాడు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణిస్తాడు. అతని సోదరి మను రంధ్వా అలియాస్ మన్ను(తాప్సీ పన్ను) కుటుంబ బాధ్యతను తీసుకుంటుంది. అప్పులు కట్టలేక ఇంటిని కూడా ఆమ్మేస్తారు. లండన్ వెళ్లి బాగా డబ్బు సంపాదించి.. అమ్ముకున్న ఇంటిని మళ్లీ కొనాలనేది మను కల. అలాగే ఆమె స్నేహితులు బుగ్గు లక్నపాల్(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) కూడా డబ్బు సంపాదించడానికై లండన్ వెళ్లాలనుకుంటారు. వీసా కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తన ప్రాణాలను కాపాడిన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న హార్డీ.. మనుని లండన్ పంపించేందుకు సహాయం చేస్తాడు. ఈ నలుగురు వీసా కోసం ట్రై చేస్తారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని అష్టకష్టాలు పడతారు. ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో ఈ నలుగురికి సుఖీ(విక్కీ కౌశల్) పరిచయం అవుతాడు. తన ప్రియురాలి జెస్సీని కలిసేందుకు అతను లండన్ వెళ్లాలనుకుంటాడు. వీళ్లంతా లీగల్‌గా ఇంగ్లండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. దీంతో దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించి లండన్ వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంగ్లండ్‌కు అక్రమంగా వెళ్లే క్రమంలో వీళ్లు పడిన కష్టాలేంటి? లండన్‌లో వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ప్రియురాలి కోసం ఇంగ్లండ్ వెళ్లాలనుకున్న సుఖీ కల నెరవేరిందా లేదా? మన్నుతో ప్రేమలో పడిన హర్డీ.. తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చాడు? పాతికేళ్ల తర్వాత.. మన్ను తిరిగి ఇండియాకు ఎందుకు రావాలనుకుంది? ఈ క్రమంలో హార్డీ మళ్లీ ఎలాంటి సహాయం అందించాడు? మను, హర్డీల ప్రేమ కథ సంగతేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మంచి కథ, భావోద్వేగాలతో పాటు చక్కటి సామాజిక సందేశం ఉన్న సినిమాలను తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరాణి స్పెషాలిటీ. సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దుతాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. డంకీ చిత్రంలో కూడా మంచి సోషల్ మెసేజ్ఉంది. కానీ దాన్ని ప్రేక్షకులకు ఆకట్టుకునేదే తీర్చిదిద్దడంలో రాజ్ కుమార్ హిరాణీ పూర్తిగా సఫలం కాలేదు. భారత్ నుంచి అక్రమంగా యూకేలోకి ప్రవేశించాలనుకునే నలుగురు స్నేహితుల కథే డంకీ. దర్శకుడు రాజ్ కుమార్.. అక్రమ వలసదారుల కాన్సెప్ట్‌ని తీసుకొని దానికి దేశభక్తి, లవ్‌స్టోరీని టచ్ చేసి ఎమోషనల్ యాంగిల్లో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ పాత్రలదారుల భావోద్వేగాలను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయలేకపోయాడు. ఎమోషనల్ సీన్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. వినోదం పండించడంలో మాత్రం తన పట్టు నిలుపుకున్నాడు. ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. పాతికేళ్లుగా లండన్‌లో ఉన్న మన్ను తిరిగి ఇండియా రావాలనుకొని ఆస్పత్రి నుంచి బయటకు పారిపోయే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే కథ 1995లోకి వెళ్తుంది. మన్ను.. ఆమె స్నేహితులు బల్లి,బుగ్గుల నేపథ్యం నవ్విస్తూనే.. ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. ఇక హీరో ఎంట్రీ అయిన కాసేపటికే కథంతా కామెడీ మూడ్‌లోకి వెళ్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ మను గ్యాంగ్ పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా నవ్విస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం ఎమోషనల్‌కు గురి చేస్తుంది. ఇక సెకండాఫ్ అంతా కాస్త సీరియస్‌గా సాగుతుంది. డంకీ రూటులో( దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబ్‌లో దాన్ని డంకీ అని పిలుస్తారు) ఇంగ్లండ్‌కి వెళ్లే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక లండన్ వెళ్లాక ఈ నలుగు పడే కష్టాలు నవ్విస్తూనే..కంటతడి పెట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. తిరిగి ఇండియాకు రావాలనుకున్నా..మళ్లీ డాంకీ ట్రావెలే చేయాల్సి వస్తుంది. ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కన్నీళ్లను పెట్టిస్తుంది. కథ సాగదీసినట్లుగా అనిపించడం.. ప్రేక్షకుడి ఊహకు అందేలా కథనం సాగడం కూడా మైనస్. ఎవరెలా చేశారంటే.. పఠాన్, జవాన్ చిత్రాల్లో యాక్షన్‌తో ఇరగదీసిన షారుక్.. ఇందులో సాదాసీదా పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హార్డీసింగ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కామెడీ పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించాడు. అయితే ఓల్డ్ లుక్‌లో షారుఖ్‌ని చూడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో తాప్సీకి మరో బలమైన పాత్ర లభించింది. మన్ను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా మొత్తం ఆమె పాత్ర ఉంటుంది. కొన్ని చోట్ల అయితే తనదైన నటనతో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఇక విక్కీ కౌశల్ ఈ చిత్రంలో కనిపించేది కొద్ది సేపే అయినా..గుర్తిండిపోయే పాత్రలో నటించాడు. విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్, బోమన్ ఇరాన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రీతమ్ పాటలు పర్వలేదు.లుట్ ఫుట్ గయా సాంగ్ ఆకట్టకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
PVR మల్టీప్లెక్స్‌లలో కనిపించని సలార్.. కారణం 'డంకీ' సినిమానే
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ప్రభాస్ 'సలార్' సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆఫ్‌లైన్, ఆన్లైన్లో టికెట్లను విడుదల చేశారు. భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కడంతో ఏపీలో 10 రోజులు పాటు రూ.40 పెంచుకునేందుకు, తెలంగాణలో మల్టీప్లెక్స్‌ల్లో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.65 పెంచుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో మల్టీఫ్లెక్స్‌లో సినిమా చూడాలంటే ఒక్కో టికెట్ రూ. 400 పైమాటే.. అయినా ఎక్కడా టికెట్లు దొరకడం లేదు. తాజాగా నార్త్ ఇండియా ప్రాంతాల్లో ఉన్న పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లల్లో 'సలార్' సినిమాను విడుదల చేయకూడదని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం షారుక్ ఖాన్ 'డంకీ' సినిమాకు ఈ థియేటర్లు ఇచ్చిన ప్రాముఖ్యతే అని చెప్పవచ్చు. సలార్ సినిమా విడుదలకు ముందే ఈ రెండు మల్టీఫ్లెక్స్‌లతో హోంబలె ఫిల్మ్స్ అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారం నార్త్ ఇండియాలో 'డంకీ'తో పాటు 'సలార్'కు పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ చైన్ థియేటర్లలో సమానంగా స్క్రీన్లు కేటాయించాలి. కానీ డంకీ సినిమాకే ఎక్కువ స్క్రీన్స్‌ను ఈ రెండు మల్టీఫ్లెక్స్‌లు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లల్లో సలార్‌ను ఇవ్వకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారట. సలార్ నుంచి రెండో ట్రైలర్ విడుదల అయిన తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్‌ను మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. అప్పటికే డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్‌ను ఓపెన్ చేసి టికెట్ల కోసం రెడీగా ఉన్నారు. లక్షలాది మంది ఒక్కసారిగా యాప్‌ను ఓపెన్ చేయడంతో యాప్ సర్వర్ డౌన్ అయింది. తర్వాత అది ఓపెన్ కాగానే చూస్తే.. సలార్ టికెట్లు దొరికే పరిస్థితి లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బ్లాక్‌లో టికెట్లు కొనేందుకు ప్రయత్నాలు చేస్తే.. ఒక్కో టికెట్ రూ. 2000 పై మాటే చెబుతున్నారని వారు వాపోతున్నారు. -
Dunki X Review: డంకీ ట్విటర్ రివ్యూ
బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘డంకీ’. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత షారుఖ్ నటించిన చిత్రం కావడంతో మొదటి నుంచే డంకీ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 21) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. డంకీ కథేంటి? ఎలా ఉంది? షారుఖ్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవోంటో చదివేయండి. ఇది కేలవం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. డంకీ చిత్రానికి ఎక్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. షారుక్ ఖాన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని కొంతమంది కామెంట్ చేస్తే.. యావరేజ్మూవీ అని.. భరించడం కష్టమని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఎక్స్‌లో నెగెటివ్ కంటే ఎక్కువగా పాజిటివ్ పోస్టులే కనిపిస్తున్నాయి. కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరాణి మరోసారి తనదైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #Dunkireview Masterpiece Rating ⭐️⭐️⭐️⭐️⭐️ 5/5 Its an absolute masterpiece! The storytelling is captivating, the cinematography is stunning, and the performances are top-notch. This movie had me on the edge of my seat from start to finish.#Dunkireviews #SRK #ShahRuhkKhan pic.twitter.com/NoBdMF7FRc — komal nehta (@komalnehta) December 20, 2023 డంకీ..ఓ మాస్టర్ పీస్. కథ చెప్పిన విధానం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ స్టన్నింగ్‌గా ఉంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు సీట్లకు త్తుకునపోయి చూస్తారు’అని కామెంట్ చేస్తూ ఓ నెటిజన్ 5/5 రేటింగ్ ఇచ్చాడు. #DunkiReview Raju sir + SRKs = Another 1000 cr Mark my work... What a movie man...Theater me bina rumaal aur tissue paper ke mat jana ⭐⭐⭐⭐⭐#Dunki #DunkiFirstDayFirstShow #RajkumarHirani #ShahRukhKhan pic.twitter.com/7TpZdfcsXB — AbRam Khan (@iAmDilshad07) December 21, 2023 షారుఖ్ ఖాన్ మరోసారి రూ.1000 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. It’s a boring fare all together. SRK acting is big let down dialogue delivery is hard to bear. Hirani has delivered it’s worst ever Wait for movie to release on OTT #Dunki #DunkiReview — Thagudam (@Neninthe___) December 21, 2023 బోరింగ్ మూవీ. షారుక్ యాక్టింగ్ బాగున్నా.. డైలాగ్ డెలివరీ భరించడం కష్టం. హిరాణీ రాజ్‌కుమార్ నుంచి వచ్చిన పేలవమైన చిత్రమిది. ఓటీటీలో రిలీజ్ అయ్యేంతవరకు ఎదురుచూడడం బెటర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #DunkiReview-⭐⭐⭐⭐⭐ It's not a Blockbuster, it's a Mega Blockbuster Movie, #ShahRukhKhan𓀠 Character is literally Blow your Mind, And Story is Top level, A Must watch 1000cr loading🔥#Dunki #DunkiStorm #stockmarketcrash#DunkiReviews #DunkiTomorrow pic.twitter.com/6SR6DhAlGb — Amit Rahangdale (@amitrahangdale4) December 21, 2023 డంకీ బ్లాక్ బస్టర్ కాదు.. మెగా బ్లాక్ బస్టర్ మూవీ. షారుక్ పాత్ర మీ మైండ్‌ని బ్లాంక్ చేస్తుంది. స్టోరీ అదిరిపోయింది. తప్పకుండా చూడండి. రూ. 1000 కోట్ల మూవీ అంటూ మరో నెటిజన్ 5/5 రేటింగ్ ఇచ్చాడు. This movie is for Indian Aunties and Uncles who are settled abroad and would wish to come back home - India. Youth won’t relate to it. Watching SRK romance at this age looks creepy. He should retire now. Comedy is outdated #Dunki #DunkiReview pic.twitter.com/h2GnzpscAD — hello (@walterwhitezzz) December 20, 2023 #Dunki 5/5 ⭐️⭐️⭐️⭐️⭐️ Dunki is a fantastic blend of comedy and emotions. Shah Rukh Khan's performance is top-notch, delivering both laughs and heartfelt moments. The movie keeps you entertained throughout with its witty dialogues and touching storyline.#DunkiReview #Dunki #SRK — Nesgane (@nesgane) December 21, 2023 #Dunki #DunkiReviews https://t.co/b176wzIX2t — Raju Soni (@RajuSoni1541477) December 21, 2023 #OneWordReview...#Dunki : UNBEARABLE. Rating: ⭐️ A colossal waste of talent, big money and opportunity by director #RajuHirani. Weak story and amateur direction. #DunkiReview #ShahRukhKhan #SRK #TapseePannu pic.twitter.com/FbdWJY7PUm — Taran Adarsh (@Taran_Adaresh) December 21, 2023 OneWordReview...#Dunki: DISAPPOINTING Rating: ⭐️½#Dunki is an EPIC DISAPPOINTMENT… Just doesn’t meet the mammoth expectations… Director #RajkumarHirani had a dream cast and a massive budget on hand, but creates a HUGE MESS.#DunkiReview #ShahRukhKhan pic.twitter.com/KSFcnV5Jd3 — SANATAN THE BULL 🚩 (@being_nkm) December 21, 2023 Just finished the show. #Dunki is a cinematic gem, seamlessly blending laughter and tears. Overflowing with innocence, joy, emotions, and love, it serves as a powerful eye-opener. Shah Rukh Khan's stellar performance. RKH showcases his genius. #DunkiReview ⭐⭐⭐⭐½ — yourweirdcrush X (@Yourweirdcrush1) December 21, 2023 #Dunki wish to be a Masterpiece 🔥 #RajkumarHirani is best in Story Telling so far and wish continue with #Dunki @iamsrk performance would be another memorable ☺️ for the #ShahRuhKhan lovers pic.twitter.com/6t6m93qHzg — Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) December 21, 2023 #Dunki first half is written Blockbuster all over 💥💥🔥🔥#DunkiReview pic.twitter.com/nu1se3yaH8 — Ahmed (FAN) (@AhmedKhanSrkMan) December 21, 2023 BLOCKBUSTER PUBLIC REVIEWS! Good WoM till now💥💥#DunkiReviewpic.twitter.com/QpOylBH1do — काली🚩 (@SRKsVampire_) December 21, 2023 #DunkiReview Plz Avoid Old hindi serial drama , Head ache comdey scenes 2 scenes well written remaining totally dispointed, weakest work from Hirani sir #Dunki ⭐⭐ / 5 👎👎 pic.twitter.com/1ZQHMqGEP6 — Vamsivardhan PKVK (@Vamsivardhan_2) December 20, 2023 -
డంకీ సినిమా రిలీజ్.. సలార్ మేకర్స్ సంచలన నిర్ణయం!
మరికొద్ది గంటల్లో షారుక్ ఖాన్ నటించిన డంకీ థియేటర్లలో సందడి చేయనుంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. నలుగురు వ్యక్తులు అక్రమంగా విదేశాలకు వెళ్తే ఏమవుతుంది అనే కథాంశంతో డంకీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఏడాది పఠాన్, జవాన్ చిత్రాలతో వేల కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్ బాద్షా హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయిపోయారు. అభిమానుల భారీ అంచనాల మధ్య మూడో చిత్రం విడుదలకు సిద్ధమైంది. అయిత ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న ఈ సినిమా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్‌తో పోటీ పడనుంది. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు కావడంతో థియేటర్ల విషయంలో వివాదం తలెత్తింది. ఇప్పటికే పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో డంకీ ప్రదర్శనకు సమానంగా స్క్రీన్స్ కేటాయిచాలని హోంబలే ఫిల్మ్స్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డంకీతో సమానంగా ప్రభాస్ సలార్‌కు స్క్రీన్స్ ఇవ్వకపోవడంతో నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో 'సలార్' చిత్రాన్ని విడుదల చేయటం లేదని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ థియేటర్లలో బుకింగ్ చేసుకున్న ఆడియన్స్ టికెట్స్ క్యాన్సిల్ కావడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అంతే కాకుండా ట్విటర్లోనూ బాయ్‌కాట్ పీవీఆర్ ఐనాక్స్ అని ట్రెండింగ్ అయింది. గూస్బంప్స్ తెప్పిస్తోన్న సెకండ్ ట్రైలర్.. సలార్ రెండో ట్రైలర్ రిలీజ్ తర్వాత సలార్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటించింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. Pan India Star #Prabhas' #Salaar unlikely to release in PVR INOX due to unfair screen sharing with #ShahRukhKhan's #Dunki.#BoycottPVRInox "The makers have withdrawn the release of Salaar from the multiplex chains in the South Indian Markets. They won't be releasing Salaar in… pic.twitter.com/RHTV3BuRdu — Manobala Vijayabalan (@ManobalaV) December 20, 2023 REBELS GO To PLAYSTORE And DESTROY PVR APP RATING💥💥💥💥💥 Show Them The Power Of #Prabhas and #SALAAR. SHAME ON YOU AJAY BIJLI #BoycottPVRInox #BoycottpvrAjayBijli pic.twitter.com/a5AA8mZuF0 — Ashok Kumar (@bashokkumar_) December 20, 2023 -
రిలీజ్‌కు ముందే సలార్ రికార్డ్.. అట్లుంటది మనతోని..!
ఈ వారంలో రిలీజవుతున్న ప్రభాస్ సలార్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఎంతోమంది అభిమానులు టికెట్స్ దొరకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే సలార్ బుకింగ్స్ రూ.18 కోట్లకు పైగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే సలార్‌కు ఒక రోజు ముందే బాలీవుడ్ బాద్షా నటించిన డంకీ చిత్రం కూడా బాక్సాఫీస్ బరిలో నిలిచింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 21న రిలీజ్ కానుంది. ఈ మూవీ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఇప్పటివరకు రూ.12 కోట్ల వరకు బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్క రోజు వ్యవధిలో బాక్సాఫీస్ బరిలో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడనుండండతో కలెక్షన్స్ పైనే అందరి దృష్టి పడింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఓ రేంజ్లో దూసుకెళ్తోన్న సలార్ ముందు.. షారుక్ ఖాన్ డంకీ పోటీలో నిలుస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. కాగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టిను ఆనంద్, జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు షారుక్ ఖాన్ డంకీ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
‘డంకీ’ అంటే ఏంటి? ఎందుకంత స్పెషల్?
ఈ ఏడాది కింగ్‌ఖాన్ షారుక్ ఖాన్‌దే అని చెప్పాలి. ఆయన నటించిన రెండు చిత్రాలు(పఠాన్, జవాన్) సూపర్ హిట్‌గా నిలిచాయి. ఒక్కో సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే డంకీ. రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామా మరికొద్ది గంటల్లో(డిసెంబర్ 21) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం... ► రాజ్ కుమార్ హిరాణీ-షారుక్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత షారుఖ్ నటించిన చిత్రమిది. ఆ రెండు చిత్రాలు యాక్షన్ జానర్లో తెరకెక్కాయి. డంకీ మాత్రం కామెడీ డ్రామా ఎంటర్టైనర్. అభిమానుల కోసం కాకుండా తనకోసం నటించిన చిత్రమిదని షారుఖ్ అన్నారు. దీన్ని బట్టి షారుక్‌కి ఈ కథ ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ► సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని, కామెడీ యాంగిల్లో దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరాణీ ప్రత్యేకత. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. ఆయన కెరీర్లో ఇంతవరకు ప్లాప్ చిత్రమే లేదు. అందుకే డంకీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ► భారత్ నుంచి అక్రమంగా ప్రయాణించి యూకేలోకి ప్రవేశించిన స్నేహితుల కథే ఇది. ఈ చిత్రానికి తొలుత ‘రిటర్న్ టికెట్’ లేదా ‘టాస్ ’అనే టైటిల్ పెట్టాలనుకున్నారట. కానీ చివరకు డంకీ అని ఖరారు చేశారు. ► దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబీ వాళ్లు దాన్ని డంకీ అంటారు. ఈ కథ నేపథ్యం కూడా అక్రమ చొరబాటుకు సంబంధించినదే కావడంతో డంకీ సరైన టైటిల్ అని మేకర్స్ భావించారట ► ఈ మూవీ షూటింగ్ 75 రోజుల్లో పూర్తయింది. దాదాపు 60 రోజుల పాటు షారుక్ షూటింగ్లో పాల్గొన్నారు. అయితే దాదాపు రెండున్నరేళ్ల క్రితమే ఈ చిత్రం పనులు ప్రారభం అయ్యాయి. ప్రీప్రొడక్షన్ వర్క్ పకడ్బందీగా పూర్తి చేయడంతో షూటింగ్ త్వరగా పూర్తయిందట. ముంబై, జైపూర్, కశ్మీర్, లండన్, బుడాపెస్ట్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ► ఈ చిత్రం నిడివి 2.41 గంటలు. బడ్జెట్ రూ.120 కోట్లు. షారుఖ్ గత ఆరేళ్లలో నటించిన చిత్రాల్లో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇదే. ► సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి లక్షకు పైగా అభిమానులు, వీక్షకులు రావటం విశేషం. షారూక్ సైతం లుట్ పుట్ గయా.., ఓ మాహి.. పాటలకు డాన్స్ చేసి అలరించాడు. ఈవెంట్లో భాగంగా అద్భుతమైన డ్రోడ్ షోను ఏర్పాటు చేశారు. ►హీరోయిన్ తాప్సికి షారుఖ్‌తో తొలి సినిమా ఇది. విక్కీ కౌశల్ అతిథి పాత్ర పోషించాడు. దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత సీనియర్ నటుడు సతీశ్ షా ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ►ఈ సినిమాను తొలుత డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు ప్రభాస్ సలార్ మూవీ విడుదల కానుండడంతో డంకీ ప్రీపోన్ అయింది. -
కూతురుతో కలిసి షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్ పూజలు (ఫోటోలు)
-
కూతురుతో షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్ పూజలు
బాలీవుడ్ కింగ్ షారుక్‌ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'డంకీ'. ఈ సినిమా డిసెంబర్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు నానుంది. ఈ ఏడాది రెండు సూపర్ హిట్లతో బాక్సాఫీస్ వద్ద షారుక్ ఖాన్ సంచలనం సృష్టించారు. తాజాగా 'డంకీ'తో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు షారుక్ కూడా ప్రమోషన్స్లలో బిజీగా ఉన్నారు. తాజాగా షారుక్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి షిర్డీ సాయి బాబాను దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షారుక్ ఖాన్‌కు ఆలయ ట్రస్ట్ అధికారి శివ శంకర్ సన్మానం చేశారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో షిర్డీ ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్న షారుక్.. అక్కడి నుంచి కారులో బయల్దేరి సాయి బాబా ఆలయానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితమే జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణోదేవి మాత ఆలయానికి వెళ్లిన షారుక్ అక్కడ అమ్మవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. గత రెండు సినిమాలు పఠాన్,జవాన్ విడుదలకు ముందు కూడా ఇలా పలు ఆలయాలను షారుక్ ఖాన్ దర్శించుకుని తన సనిమా మంచి విజయం సాధించాలని పూజలు జరిపారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న విడుదల కానున్న తన చిత్రం డంకీ కూడా సూపర్ హిట్ కొట్టాలని ఆయన కోరుకుంటున్నారు. డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ కూడా విడుదల కానుంది. -
కర్ణిసేన చీఫ్ హత్య: ‘డుంకీ’ టెక్నిక్‌తో సూత్రధారి పరార్
న్యూఢిల్లీ: కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్‌సింగ్ గొగామెడిని హత్య వెనుక కీలక సూత్రధారి గ్యాంగ్‌స్టర్ రోహిత్ గొడారా భారత్ నుంచి పారిపోయాడు. అయితే గొడారా డాంకీ ఫ్లైట్ టెక్నిక్ వాడి కెనడాకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ టెక్నిక్‌నే పంజాబ్‌లో డుంకీ అని పిలుస్తారు. ఈ పేరుతోనే త్వరలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ సినిమా రాబోతోంది. డుంకీ సినిమా థీమ్ కూడా పోలీసుల కళ్లుగప్పి పారిపోవడమేనని తెలుస్తోంది. డుంకీ టెక్నిక్‌లో పోలీసులను తప్పుదారి పట్టించేందుకు వెళ్లాల్సిన చోటికి నేరుగా కాకుండా మధ్యలో వేరు వేరు దేశాల్లో ఆగుతూ చివరకు గమ్యస్థానం చేరుకుంటారు. ఇందుకు ఆయా దేశాల వీసా,ఇమిగ్రేషన్ నిబంధనల్లోని లోపాలను అడ్డుపెట్టుకుంటారు. ఈ తరహాలోనే గొడారా పలు దేశాల్లో ఆగుతూ తొలుత అమెరికా వెళ్లాడు. అక్కడి నుంచి చివరకు కెనడా పారిపోయాడు. ఈ నెల ఐదవ తేదీన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్‌సింగ్ గొగామెడిని ఆయన ఇంట్లోనే టీ తాగుతుండగా ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. వీరిలో ఒకరు అక్కడే క్రాస్ ఫైరింగ్‌లో చనిపోగా మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ హత్య తామే చేశామని గ్యాంగ్‌స్టర్ రోహిత్ గొడారా ప్రకటించుకున్నారు. ఇతనిపై దేశంలోని పలు పోలస్‌స్టేషన్‌లలో 32 కేసులు నమోదయ్యాయి. ఇదీచదవండి..కాంగ్రెస్ ఉండగా మనీ హేస్ట్ ఎందుకు? -
వైష్ణో దేవి అమ్మవారి సన్నిధిలో షారుక్ ఖాన్.. మరో హిట్ ఖాయం
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డంకీ' డిసెంబర్ 21న విడుదల కానుంది. ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సినిమా విడుదలకు ముందు హీరో షారుక్ ఖాన్ జమ్మూలోని వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం జమ్మూలోని కత్రా వద్దకు ఆయన చేరుకున్నారు. ఏడాది సమయంలో మూడవసారి ఈ పవిత్ర స్థలాన్ని షారుక్ సందర్శించారు. 2023లో షారుక్ ఖాన్ రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిన షారుక్ ఆ తర్వాత జవాన్ సినిమాతో కూడా మరో సూపర్ హిట్‌ను అందుకున్నారు. ఈ రెండు సినిమా విడుదలకు ముందు కూడా ఆయన వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. 'పఠాన్' విడుదలకు ముందు 2022 డిసెంబర్ 12న వైష్ణోదేవి ఆలయంలో పూజలు నిర్వహించిన షారుక్.. మళ్లీ 'జవాన్' విడుదలకు ముందు ఆగస్టులో మరోసారి అక్కడికి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు 'డంకీ' విడుదల సమయంలో అక్కడ పూజలు నిర్వహించారు. అలా వైష్ణోదేవి అమ్మవారి సెంటిమెంట్‌ను షారుక్ పాటిస్తున్నారు. అమ్మవారి ఆలయం చుట్టూ షారుక్ తిరుగుతుండగా పలువురు వీడియోలు తీశారు. ఆయనతో పాటు తన అంగరక్షకులు, మేనేజర్ పూజా దద్లానీ ఉన్నారు. తన సినిమాలు విజయం సాధించాలని విడుదలకు ముందే పలు దేవాలయాలను ఆయన సందర్శిస్తారు. జవాన్ సినిమా సమయంలో తిరుమల శ్రీవారిని కూడా ఆయన దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రానున్న 'డంకీ'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో షారుఖ్‌తో పాటు బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్ తదితరులు నటించారు. 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ఈ మధ్యే విడుదలైంది. దానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. డిసెంబర్ 22న డంకీ చిత్రానికి పోటీగా ప్రభాస్ సలార్ వస్తున్న విషయం తెలిసిందే. #WATCH | J&K: Actor Shah Rukh Khan visited Mata Vaishno Devi shrine, earlier today. (Source: J&K Police) pic.twitter.com/hK3JHvaCG2 — ANI (@ANI) December 12, 2023 -
ఎక్కడా కనిపించని 'సలార్' బజ్.. మరి సినిమా పరిస్థితి ఏంటి..?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ విడుదలకు రెడీగా ఉంది.. కేజీఎఫ్ హిట్‌తో పాన్ ఇండియా సెన్సేషన్‌గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అంచనాలు భారీగా ఉంటాయి. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు మాత్రం ఏమీ జరగడం లేదు. ఎప్పుడో సంక్రాంతికి వచ్చే సినిమాలు గుంటూరుకారం,సైంధవ్, నా సామిరంగ వంటి సినిమాలు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఆ చిత్రాల నుంచి పోస్టర్స్, టీజర్స్,పాటలు ఇలా అప్పడప్పుడు ఎదో ఒకటి వదులుతూ తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. కానీ మరో 10 రోజుల్లోపు వచ్చే సలార్ మేకర్స్ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఉన్నారు. వీటంన్నిటికి తోడు తాజాగా సలార్‌పై మరో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా ఉండదనే టాక్ వినిపిస్తోంది. మరోక ట్రైలర్ విడుదల చేసి చేతులు దులుపుకోవాలని సలార్ యూనిట్ చూస్తున్నట్లు సమాచారం. ప్రీ-రిలీజ్ లేకుండా నేరుగా సినిమా విడుదలకు వెళ్తే ఆ ప్రభావం కలెక్షన్స్ మీద పడవచ్చు. ఇలా సలార్ చుట్టూ ఎన్నో ప్రచారాలు జరుగుతున్నా ఆ టీమ్ మాత్రం సైలెంట్‌గా ఉంది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ చిత్రం డంకీ కూడా సలార్‌కు పోటీగా ఉన్న విషయం తెలిసిందే. డంకీ కోసం చాలా రోజుల నుంచి షారుక్ టీమ్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కానీ బాలీవుడ్లో సలార్ టీమ్ ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్ కార్యక్రమం కూడా చేయలేదు. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదల అవుతుంది అంటే.. ఢిల్లీ, ముంబయి, పుణె, బెంగళూరు, చెన్నై,హైదరాబాద్ వంటి నగరాల్లో ఆ చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలు ఉంటాయి.. కానీ సలార్ విషయంలో ఆ పరిస్థితి కనిపించడంలేదు. సలార్ విషయంలో హోంబలే ఫిల్మ్ మేకర్స్ వ్యూహం ఎలా ఉందో తెలియాల్సి ఉంది. సలార్ మేకర్స్ నిర్లక్ష్యం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. -
'మీకు మలబద్ధకం అనుకుంటా.. మందులు పంపిస్తా'.. షారుక్ ఖాన్ అదిరిపోయే రిప్లై!
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్షా మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. డీంకీ పేరుతో ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు అభిమానులను పలకరించబోతున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే మూవీ విడుదలకు ముందు నెటిజన్స్‌తో చిట్ చాట్ నిర్వహించడం మన స్టార్ హీరోకు అలవాటు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్విటర్లో ముచ్చటించారు షారుక్. అయితే ఈ సందర్భంగా షారుక్ ఖాన్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఓ నెటిజన్ రాస్తూ.. ' మీ పీఆర్ టీమ్ బాగా పని చేయడం వల్లే పఠాన్, జవాన్ సినిమాలు సక్సెస్ అయ్యాయి కదా సార్. అలాగే డంకీ సినిమాకు కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవుతుందంటారా? అని ప్రశ్నించాడు. అయితే దీనికి షారుక్ ఖాన్ కాస్తా వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. షారుక్ రిప్లై ఇస్తూ..'సాధారణంగా మీలాంటి తెలివైన వారికి నేను సమాధానం చెప్పను. కానీ మీ విషయంలో మాత్రం మినహాయింపు ఇస్తున్నా. ఎందుకంటే మీరు మలబద్ధకం కోసం చికిత్స తీసుకోవాల్సి ఉందని నేను భావిస్తున్నా. నా పీఆర్ బృందానికి కొన్ని మంచి మందులు నీకు పంపమని చెబుతా...మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అంటూ తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు. కాగా.. హ్యాట్రిక్ లక్ష్యంగా షారుక్ 'డంకీ' సినిమాతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్‌తో పాటు విక్కీ కౌశల్, తాప్సీ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అదే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సలార్‌తో పోటీ పడి నిలుస్తోందో లేదో వేచి చూడాల్సిందే. డంకీ రిలీజైన తర్వాత రోజే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న సలార్ విడుదల కానుంది. Normally I don’t answer amazingly intelligent people like you. But in your case I am making an exception because I feel you need to be treated for constipation. Will tell my PR team to send you some golden medicines…hope u recover soon. https://t.co/FmKfCZxmyp — Shah Rukh Khan (@iamsrk) December 6, 2023 -
ప్రభాస్ వర్సెస్ షారుఖ్ విన్నర్ ఎవరు...?
-
షారుక్ ఖాన్ డంకీ ట్రైలర్ వచ్చేసింది.. తక్కువ అంచనా వేయకండి
బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను నటించిన డంకీ మూవీ ట్రైలర్ వచ్చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల నటించడం విశేషం. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా మంగళవారం (డిసెంబర్ 5) రిలీజైన ఈ ట్రైలర్ ఫన్, ఎమోషన్ కలగలిపి ఎంతో ఆసక్తి రేపేలా ఉంది. ఈ ట్రైలర్ SRK వాయిస్‌తో ప్రారంభం అవుతుంది. ఇందులో స్నేహం, కామెడీ, విషాదం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఇంగ్లిష్ నేర్చుకొని యూకే వెళ్లి సెటిలవ్వాలనుకునే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుక్ ఖాన్ అదరగొట్టేశాడు అనిపిస్తుంది. కానీ అతనికి ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్ రాకపోవడంతో అక్రమంగా చూకేలోకి చొరబడాలని ప్రయత్నించడం ఆపై అక్కడి వారికి దొరికిపోవడం వంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉండనున్నాయి. షారుక్ జర్నీలో స్నేహితులతో అతను పడే ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నాడో డంకీ ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. తాజాగా డంకీ ట్రైలర్‌ను షారుక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఇలా చెప్పాడు. 'ఈ కథను నేను లాల్టూ నుంచి మొదలు పెట్టాను. నా ఫ్రెండ్స్ తో కలిసి రాజు సర్ విజన్ నుంచి మొదలైన ప్రయాణాన్ని డంకీ ట్రైలర్ చూపిస్తుంది. ఈ ట్రైలర్ స్నేహం, కామెడీ, విషాదంతో పాటు ఇల్లు, కుటుంబ జ్ఞాపకాలను అందరినీ తట్టిలేపేలా ఉంటుంది. నేను ఎంతో కాలంగా ఎదరు చూస్తున్న సమయం వచ్చేసింది. డంకీ డ్రాప్ వచ్చేసింది.' అనే క్యాప్షన్‌తో షారుక్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే లాంటి సినిమాలను తీసిన రాజు హిరానీ డైరెక్షన్లో డంకీ చిత్రం రావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
చాలా భావోద్వేగానికి గురయ్యాను
‘‘డంకీ’ సినిమాలోని ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే..’ పాట తొలిసారి విన్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను’’ అని బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డంకీ’. రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, బొమన్ ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్‌పై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే..’ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. కాగా ‘హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ ఎస్ఆర్కే’ సెషన్స్‌లో భాగంగా అభిమానులు, నెటిజన్స్‌తో మాట్లాడిన షారుక్ ఖాన్ పలు విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే..’ పాటని తొలిసారి విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది?’ అనే ప్రశ్నకు షారుక్ ఖాన్ మాట్లాడుతూ–‘‘ఆ పాట నా తల్లిదండ్రులను, నా స్నేహితులను గుర్తు చేసింది. అలాగే ఢిల్లీలో నేను గడిపిన నాటి రోజులు జ్ఞాపకం వచ్చాయి. చాలా భావోద్వేగానికి గురయ్యాను’’ అని బదులిచ్చారు. -
'డంకీ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకండి'.. షారుక్‌కు నెటిజన్ రిక్వెస్ట్!
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బాలీవుడ్ బాద్షా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇటీవలే అట్లీ డైరెక్షన్లో వచ్చిన జవాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీతోనే లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓకే ఏడాదిలోనే మూడో చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి లుట్ పుట్ గయా అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా షారుక్ ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఆస్క్ ఎస్ఆర్కే సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనదైన శైలిలో వారికి ప్రశ్నలకు బదులిచ్చారు. మొదటి డంకీ అనే పదానికి అర్థమేంటో వివరించారు. డంకీ అంటే దేశ సరిహద్దుల వెంట అక్రమ ప్రయాణం గురించి వివరించే మార్గమని షారుక్ వివరించారు. ఓ నెటిజన్ సినిమాను థియేటర్లలో చూడటానికి చట్టవిరుద్ధమైన మార్గం ఏదైనా ఉందా? అన షారుక్‌ను ప్రశ్నించాడు. దీనిపై స్పందిస్తూ.. నా చిన్నతనంలో సినిమాలు చూసేందుకు థియేటర్ ప్రొజెక్షనిస్ట్ను లైన్లో పెట్టేవాడిని.. మీరు ఒకసారి ఇలా ప్రయత్నించండి.. వర్కవుట్ అవుతుందేమో.. కానీ ఈ విషయం మీకు చెప్పినట్లు ఎవరికీ చెప్పకండి. ఇది చాలా రహస్యం" అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్ కూడా డంకీని థియేటర్లో కాకుండా స్టేడియంలో ప్రదర్శించమని ఎస్ఆర్కేను కోరారు. దీనికి బాద్షా బదులిస్తూ "అవును.. నేను కూడా మా టీమ్‌కి ఈ విషయం చెప్పాను.. కానీ ఎయిర్ కండిషనింగ్ సమస్య. మీరు సినిమా చూసేందుకు పిల్లలు, పెద్దలతో కలిసి వెళ్లాలి. చాలా అసౌకర్యంగా ఉంటుంది..." అంటూ ఫన్నీగా ఇచ్చిపడేశాడు. కాగా.. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. Dunki is a way of describing an illegal journey across borders. It is pronounced डंकी. It’s pronounced like Funky…Hunky….or yeah Monkey!!! https://t.co/t0Et738SEk — Shah Rukh Khan (@iamsrk) November 22, 2023 Yes I also told the team but the air conditioning is an issue. You have to go with kids and elders for the film…will be uncomfortable…so let’s keep this one in the theatres in the 21st December only. #Dunki https://t.co/vOkGZ2fJzD — Shah Rukh Khan (@iamsrk) November 22, 2023 -
క్రికెట్ జోష్ ముగిసింది.. బరిలో 8 సినిమాలు.. పోటీ పడుతున్న సలార్
కొద్దిరోజుల్లో 2023కు గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. దసర పండుగ వరకు వరుస సినిమాలతో సందడి చేసిన చిత్ర పరిశ్రమ క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా పలు సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎందుకంటే..? క్రికెట్, సినిమా రెండూ ప్రేక్షకులను అలరిస్తాయి. క్రికెట్ కారణంగా కొన్ని సినిమాలు విడుదల వాయిదా వేసుకుంటే మరికొన్ని అనుకోని కారణాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. నిన్నటితో క్రికెట్ ప్రపంచం నుంచి ప్రేక్షకులు మెళ్లిగా సినిమా ప్రపంచం వైపు మళ్లుతున్నారు. త్వరలో క్రిస్టమస్ పండగ రానుంది... అంతేకాకుండా 2023 సంవత్సరానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో రానున్న 40 రోజుల్లో విడుదలయ్యే సినిమాలు ఏవి..? ఏడాది చివర్లో భారీ సిక్సర్ కొట్టే సినిమా ఏది..? ఇదే క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యే మూవీ ఏది..? అనే అప్పుడే లెక్కలు వేస్తున్నారు సినీ అభిమానులు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 22 వరకు వరసగా విడుదలయ్యే చిత్రాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆదికేశవతో వస్తున్న వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్.రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆదికేశవ'. ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అపర్ణా దాస్, జోజు జార్జ్, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వైష్ణవ్, శ్రీలీల రొమాంటిక్ లుక్‌తో చూడముచ్చటగా కనిపించారు. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై వైష్ణవ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో రుద్ర అనే పాత్రలో వైష్ణవ్ కనిపిస్తే... వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ కనిపించనుంది. ఈ సినిమాకి సంగీతం జి.వి.ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. 'కోట బొమ్మాళి పీఎస్'లో శివాని రాజశేఖర్ లింగి లింగి లింగిడి... పాట వల్ల 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా గురించి విడుదలకి ముందే హైప్ క్రియేట్ అయింది. తల్లిదండ్రులు జీవిత, రాజశేఖర్ల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న శివాని ఇందులో ప్రధాన పాత్రలో కనిపించనుంది. శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాస్, విద్య కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'నాయట్టు' చిత్రానికి రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. క్రూరమైన యానిమల్గా రణ్‌బీర్ రణ్‌బీర్ కపూర్ - రష్మిక జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథతో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రన్‌టైమ్ దాదాపు 3.20 గంటలు ఉండనుందని టాక్ వస్తుంది. కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. హ్యట్రిక్‌పై కన్నేసిన షారుక్ ఖాన్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేర్లలో 'డంకీ' చిత్రం టాప్‌లో ఉంది. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ ఇందులో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలతో ఫుల్‌జోష్‌లో ఉన్న షారుక్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పఠాన్, జవాన్ రెండు చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్లో చేరిపోయాయి. డంకీ చిత్రం ద్వారా సూపర్ హిట్ కొట్టి ఈ ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టాలని షారుక్ ఉన్నారు. డిసెంబర్ 22న ఈ చిత్రం సలార్‌తో పోటీకి దిగనుంది. చివర్లో దిగుతున్న డైనోసార్ (సలార్) భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలకు రెడీగా ఉన్న చిత్రం సలార్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తెరకెక్కింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే ఒకసారి వాయిదా పడి క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ ఏడాది చివర్లో భారీ బడ్జెట్ చిత్రంగా సలార్ ఉంది. లైన్లో ఉన్న నాని, నితిన్, విష్వక్సేన్ ఈ చిత్రాలతో పాటు మరికొన్ని ఆసక్తకరమైన చిత్రాలు డిసెంబర్ నెలలో విడుదల కానున్నాయి. డిసెంబర్ 7న నాని చిత్రం 'హాయ్ నాన్న' ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 8న ఏకంగా మూడు చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వరుణ్‌తేజ్- 'ఆపరేషన్ వాలంటైన్', విష్వక్సేన్- 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', నితిన్- 'ఎక్స్ట్రా ఆర్డినరీమేన్' ఉన్నాయి. ఈ మూడు సినిమాలూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. -
సలార్ Vs డంకీ.. వెనక్కి తగ్గుతున్న ప్రభాస్.. కారణం ఇదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ మరోసారి వాయిదా పడనుందా..? బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ డంకీ చిత్రంతో పోటీ ఎందుకని డైనోసార్ వెనకడుగు వేస్తున్నాడా..? ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన 'సలార్' డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ తేదీన కూడా సలార్ రావడం కష్టమేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: అలాంటి వాళ్లు ‘ఆంటీ’ అంటే నాకు ఇష్టమే : అనసూయ) క్రిస్మస్ కానుకగా బాక్సాఫీస్ వద్దకు సలార్,డంకీ చిత్రాలు రానున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పఠాన్,జవాన్ చిత్రాలతో భారీ హిట్స్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నాడ్ షారుక్.. దీంతో ఆయన నుంచి వస్తున్న డంకీ చిత్రంపై భారీ కలెక్షన్స్ రావడం పక్కా అని బాలీవుడ్ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఇదే సమయంలో రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్ల తర్వాత సలార్‌తో ప్రభాస్ వస్తున్నాడు. అయినా కూడా ప్రశాంత్ నీల్,ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సలార్‌పై అంచనాలు ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. కానీ ఈ రెండు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలే కావడంతో ఒకేసారి రిలీజ్ కావడం సరైంది కాదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తేడా వస్తే వసూళ్లపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉండవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ క్లాష్ నుంచి రెండు చిత్రాలు తప్పుకుంటే మంచిదని సినీ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. డిసెంబర్లో వస్తున్నట్లు షారుక్ డంకీ టీమ్ ముందుగానే ప్రకటించారు.. కానీ సలార్ మాత్రం సెప్టెంబర్‌లో రిలీజ్ అని ప్రకటించి ఆ తర్వాత డిసెంబర్‌కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.. దీంతో ఇప్పుడు 'సలార్' మరోసారి వాయిదాకు రెడీ అయిందని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజం అయితే సలార్ 2024 జనవరి లేదా మార్చి నెలలో విడదల కావడం గ్యారెంటీ.. ఈ విషయంపై అధికారకంగా సలార్ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. -
డైలమాలో ప్రభాస్ (సలార్) ఫ్యాన్స్..(డంకీ) షారుఖ్ ఫ్యాన్స్ కి పూనకాలు..!
-
కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం డంకీ. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్గా నటిస్తోంది. గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, జ్యోతిదేశ్ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్ట్మస్ కానుకగా అభిమానులను అలరించనుంది. తాజాగా నవంబర్ 2న కింగ్ ఖాన్ బర్త్ డే కావడంతో మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా డంకీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే ఐదుగురు కలిసి ఇంగ్లాండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రాంతంలోని యువకుల కథనే ఇందులో చూపించనున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ వెళ్లేందుకు వారు ఎలా ప్రయత్నించారు? వారికెదురైన సమస్యలేంటి అనేది తెలియాలంటే డంకీ సినిమా చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home! A heartwarming story by a heartwarming storyteller. It's an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT — Shah Rukh Khan (@iamsrk) November 2, 2023 -
అర్థరాత్రి షారుక్ ఖాన్ ఇంటవద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ అని పలు పేర్లతో తన అభిమానులతో పిలుపంచుకునే నటుడు షారుక్ ఖాన్ ఈరోజు తన 58వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న షారుక్ ఖాన్‌కు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఖాన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది అభిమానులు ఆయన ఇంటికి వస్తుంటారు. అర్ధరాత్రి 12 దాటగానే బాణసంచా పేలుస్తూ పండుగలా జరుపుకుంటారు. భారీగా తన అభిమానులు గుమిగూడినప్పటికీ వారిని ఆయన ఏ మాత్రం నిరాశపరచడు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ పెళ్లి.. మెగా ఫోటో షేర్ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే) ఇంటి బాల్కనీ వద్దకు చేరుకుని తన మార్క్ అభివాదంతో చేతులు ఊపుతూ కృతజ్ఞతలు తెలుపుతాడు. ఈసారి కూడా తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని వెస్ట్ బాంద్రాలోని తన నివాసం 'మన్నత్' సమీపంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాది మంది అభిమానులు అర్ధరాత్రి చేరుకున్నారు. షారుఖ్ ఖాన్ తన ఇంటి బాల్కనీలో కనిపించి అర్థరాత్రి తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా అభిమానులకు చేయి ఊపుతూ ధన్యవాదాలు తెలిపారు. తమ అభిమాన నటుడిని చూసిన అభిమానుల ఆనందం వెలకట్టలేనిదని చెప్పవచ్చు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో షారుఖ్ ఖాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించాడు. రొమాంటిక్ పాత్రలను సులువుగా పోషిస్తూ 'కింగ్ ఆఫ్ రొమాన్స్'గా పేరు తెచ్చుకున్నాడు షారుక్. యాక్షన్ సినిమాల్లో దుమ్మురేపుతున్న షారుఖ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. పఠాన్,జవాన్లతో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న కింగ్ డిసెంబర్లో తన డంకీ మూవీతో ప్రభాస్ సలార్‌ను ఢీ కొట్టనున్నాడు. View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Voompla (@voompla) -
ఈసారి క్రిస్మస్ నిరుడు లెక్కుండదు.. బాక్సాఫీస్ షేకే!
సలార్ మూవీ సెప్టెంబర్ లోనే వచ్చి ఉంటే బాగుండేదేమో డిసెంబర్లో అంటే లేని పోని సమస్యలు వస్తున్నాయి.ఆల్రెడీ షారుఖ్ పోటీలో ఉన్నాడు.ఇప్పుడు కింగ్ ఖాన్ తో పాటు హాలీవుడ్ నుంచి ఒక మరో సూపర్ హీరో కూడా సలార్ తో ఫైట్‌కి రెడీ అంటున్నాడు.అయితే ఎంత మంది వచ్చినా, డైనోసార్ ముందు జుజూబీనే అంటున్నాడు రెబల్. వెయ్యి కోట్ల హీరోతో పోటీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సలార్. కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కావడంతో సలార్‌పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కావాల్సింది. కానీ అనూహ్యం వాయిదా పడింది. ఏవోవే కారణాలు చెప్పి డిసెంబర్ 22కు పోస్ట్‌పోన్ చేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడు సలార్‌పై అంతకంతకూ పోటీ పెరుగుతోంది. ఇప్పటికే జవాన్ తర్వాత షారుఖ్ నటిస్తున్న డంకీ ఇదే డేట్ కు రిలీజ్ అవుతోంది. అసలే షారుఖ్ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వెయ్యి కోట్ల కలెక్షన్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఆయన నటించిన గత రెండు చిత్రాలు పఠాన్, జవాన్..రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.అలాంటి హీరోతో సలార్ పోటీకి సిద్ధమవుతున్నాడు.డిసెంబర్ 22న సలార్ వర్సెస్ డంకీ ఫైట్ గురించి ఇప్పటికే ఇండియా మొత్తం మాట్లాడుకుంటోంది. ఇప్పుడు ఇదే డేట్ గురించి వరల్డ్ మొత్తం మాట్లాడుకునేలా చేస్తున్నాడు ఆక్వామేన్. డంకీ, సలార్‌కి పోటీగా ఆక్వామేన్ ఆక్వామేన్ అండ్ ది లాస్ట్ కింగ్ డమ్ మూవీ డిసెంబర్ 25న విడుదల కావాల్సింది. అయితే ఇప్పుడు మూడు రోజుల ముందుగానే.. అంటే డిసెంబర్ 22నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే రోజు సలార్, డంకీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆక్వామేన్ హంగామా అంతా హాలీవుడ్ కే పరిమితం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆక్వామ్యాన్ వల్ల ఓవర్సీస్ మార్కెట్ లో ఇటు సలార్, అటు డంకీకి స్క్రీన్స్ సమస్య వస్తుంది. స్క్రీన్స్ అడ్జెస్ట్ మెంట్ అంటే కలెక్షన్స్ కూడా పంచుకోవాల్సి వస్తుంది. కలెక్షన్స్ పంచుకోవడం అంటే డే వన్ రికార్డులు మిస్ అయినట్లే అవుతుంది.అందుకే సలార్ కూడా ముందుగా అనుకున్నట్లు సెప్టెంబర్ లోనే వచ్చి ఉంటే ఇటు డంకీతోనూ, అటూ అక్వామేన్ తోనూ పోటీ పడే ఇబ్బంది తప్పేది. అయితే ఎక్కువ స్క్రీన్స్ కోసం ఆల్రెడీ సలాన్ నిర్మాతలు రంగంలోకి దిగారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమాత్రం డిజప్పాయింట్ కాకుండా డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా సలార్ ను ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేసేందుకు చేయాల్సిదంతా చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి క్రిస్మస్ మాత్రం నిరుడు లెక్క ఉండదు. సలార్ ఇటు సౌత్ మార్కెట్‌ను, డంకీ అటు నార్త్ మార్కెట్‌ను, ఆక్వామేన్ ఓవర్సీస్ మార్కెట్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఎంతమంది వచ్చినా డైనోసార్ ముందు జుజుబీ..
-
డైనోసార్ దెబ్బకు డంకీ వెనక్కి తగ్గుతాడా..
-
సలార్ VS డుంకి... వెనక్కు తగ్గేది ఎవరంటే?
డిసెంబర్ 22 కోసం ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అదే రోజు బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ 'డుంకి' సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ విడుదల అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటనలు వచ్చేశాయి. ఇద్దరు బిగ్ స్టార్స్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో షారుక్ ఖాన్ కొంచెం వెనకడుగు వెసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పఠాన్,జవాన్ సినిమాలతో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ప్రస్తుతం ఆయన కెరియర్లో మంచి స్వింగ్ మీద ఉన్నాడు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) అయినా డైనోసార్‌తో రిస్క్ చేయడం ఎందుకని షారుక్ ఒక అడుగు వెనక్కు వేశాడు. తన డుంకి సినిమాను డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు సలార్ కంటే ముందే వారు ప్రకటించారు. కానీ పలు వాయిదాలతో దూసుకుపోతున్న సలార్ చివరకు డుంకి సినిమాకు పోటీగా దిగేందుకు రెడీ అయ్యాడు. దీంతో చేసేది ఏం లేక షారుక్‌నే తన డుంకి సినిమాను 2024 జనవరి 26న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పఠాన్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ప్రశాంత్ నీల్, షారుఖ్ ఖాన్ పై పగబట్టినట్లు ఉన్నాడని కోందరు కామెంట్లు చేస్తున్నారు. 2018లో KGF ఛాప్టర్ 1 సినిమాని షారుఖ్ ఖాన్ జీరో మూవీకి పోటీగా రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్… ఆ బిగ్గెస్ట్ క్లాష్‌లో గెలిచి జెండా ఎగరేశాడు. ఈ దెబ్బకి షారుఖ్ ఖాన్ అయిదేళ్ల పాటు సినిమాలు చేయలేదు. అయిదేళ్ల బ్రేక్ తర్వాత పఠాన్, జవాన్ సినిమాలతో షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇచ్చాడు. తన కెరీర్ మొత్తంలో ప్రస్తుతం పీక్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ కి ఇప్పుడు మరోసారి రిష్క్ చేయకపోవడమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నట్లు టాక్. KGF టైంలో యష్ ఎవరికీ తెలియదు, ప్రశాంత్ నీల్ కూడా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడలా కాదు... సలార్‌లో డైనోసార్ ఉన్నాడు... ప్రశాంత్ నీల్‌కు ప్రభాస్ కలిశాడు. ఇంకేముంది పోటీ భారీగానే ఉంటుంది. దీంతో ఓవర్సీస్ నుంచి ఇండియన్ బాక్సాఫీస్ వరకు డుంకి సినిమాకు కలెక్షన్స్ తగ్గే ప్రమాదం ఉందని ఆయన ముందే పసిగట్టాడు. కానీ ఇదోరకంగా సలార్‌కు మంచి అవకాశం. ఇదేరోజు డుంకి రిలీజ్ అయితే సలార్‌కు కూడా కొంత కలెక్షన్స్ తగ్గే ప్రమాదం ఉంది. ఎందుకంటే అక్కడ బరిలో ఉండేది బాలీవుడ్ కింగ్. ఏదేమైనా డిసెంబర్ 22న సలార్ మాత్రమే వస్తున్నాడు. డుంకి వాయిదా విషయంపై అధికారికంగా త్వరలో ప్రకటన రావడం ఖాయం. -
సలార్ VS డంకీ: రెఢీ
రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేరోజు థియేటర్లకు వస్తే.. ఏ సినిమా చూడాలి? అనేది ప్రేక్షకుల ముందుండే ప్రశ్న. ఏ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి? అనేది ఎగ్జిబిటర్ల ముందుండే ప్రశ్న? ఏ సినిమాని ఏ ఏరియాకి ఎంత ఇచ్చి కొనాలి? అనేది డిస్ట్రిబ్యూటర్ల ముందుండే ప్రశ్న.. అసలు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం కరెక్టేనా? బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందేమో.. ఇది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు,ప్రొడ్యూసర్లు.. ఇలా అందరి ముందుండే ప్రశ్న. శుక్రవారం వచ్చిన ‘సలార్’ విడుదల తేదీ (డిసెంబర్ 22) ప్రకటన ఈ ప్రశ్నలకు కారణమైంది. అదే రోజు షారుక్ ఖాన్ ‘డంకీ’ కూడా రిలీజ్ కానుంది. బాక్సాఫీస్‌ను ఢీ కొట్టడానికి రెడీ అవుతున్న ‘సలార్’, ‘డంకీ’... చిత్రాల్లో ఏది వసూళ్లను కొల్లగొడుతుంది? ఈ రెండింటి కారణంగా వేరే చిత్రాలు వాయిదా పడతాయా? ఓ లుక్కేద్దాం. ఇండియన్ సినిమా బడా సూపర్ స్టార్స్ ప్రభాస్, షారుక్ ఖాన్ బాక్సాఫీస్ ఫైట్‌కి రెఢీ అయ్యారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’లోని తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ను డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది. నిజానికి 2022 ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకుని, ఆ తర్వాత 2023 సెప్టెంబరు 28కి వాయిదా వేశారు. తాజాగా డిసెంబర్ 22 అంటున్నారు. ఇంకోవైపు మరో పాన్ ఇండియన్ స్టార్ షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘డంకీ’. హిందీలో ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్’, ‘3 ఇడియట్స్, ‘పీకే’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్స్ తీసిన అగ్రశ్రేణి దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి ఈ సినిమాకు దర్శకుడు. షారుక్, రాజ్‌కుమార్.. ఈ ఇద్దరికీ విడివిడిగా రికార్డులు ఉండటంతో తొలిసారి ఇద్దరూ కలిసి చేస్తున్న ‘డంకీ’ చిత్రం పై మంచి అంచనాలున్నాయి. గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, జ్యోతిదేశ్ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా 2022 ఏప్రిల్ 19న ‘డంకీ’ సినిమాను ప్రకటించిన రోజే విడుదల తేదీని (22 డిసెంబరు 2023) కూడా ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్ అండ్ టీమ్ ఇదే రోజున ‘సలార్’ విడుదలను నిర్ణయించడం ఇటు తెలుగు అటు హిందీతో పాటు పాన్ ఇండియా సినిమాలు కాబట్టి.. ఇతర భాషల ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. ఎవరి రికార్డులు వారివి... ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో (2019)’, ‘రాధేశ్యామ్ (2022)’, ‘ఆదిపురుష్ (2023)’ చిత్రాలకు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ప్రభాస్‌కు ‘సలార్’ హిట్ కీలకంగా మారింది. ఇటు ‘జీరో (2018)’ రిజల్ట్‌తో షారుక్ ఖాన్ డీలా పడ్డప్పటికీ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ‘పఠాన్’, ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ‘జవాన్’ చిత్రం కలెక్షన్స్‌లో హిందీ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని యూనిట్ పేర్కొంది. ఇవి షారుక్ ఖాన్ సూపర్‌ఫామ్‌ను స్పష్టం చేస్తున్నాయి. అలా అని ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమాలనూ తక్కువ చేయలేం. ఎందుకంటే ప్రభాస్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ మొత్తం వసూళ్లను షారుక్ ఏ సినిమా కూడా ఇంకా అధిగమించలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే షారుక్ కెరీర్లో ఓ డిజాస్టర్‌గా నిలిచిన ‘జీరో’ రిలీజైన రోజున.. అంటే డిసెంబరు 21నే ‘కేజీఎఫ్: ఛాప్టర్ 1’ (యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూ΄÷ందింది) విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, కొత్త రికార్డులను సృష్టించింది. ఇలా ప్రశాంత్ నీల్, షారుక్ ఖాన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద ఢీ కొనడానికి రెడీ కావడం ఆసక్తికరమైన విశేషం. ఎవరి రికార్డులు వారికి ఉన్న నేపథ్యంలో తాజా ΄ోటీలో రికార్డ్ ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది. ఫుల్ కన్ఫ్యూజన్ నో కన్ఫ్యూజన్..‘సలార్: సీజ్ ఫైర్’ను డిసెంబరు 22న విడుదల చేస్తున్నాం అంటూ ‘సలార్’ టీమ్ ప్రకటించింది. అయితే ‘సలార్’కు కన్ఫ్యూజన్ అక్కర్లేక΄ోవచ్చు కానీ 2023 క్రిస్మస్కు ఆల్రెడీ రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకున్న తెలుగు చిత్రాల విడుదల విషయం ఇప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్. డిసెంబరు 21న నాని ‘హాయ్ నాన్న’, 22న వెంకటేశ్ ‘సైంధవ్’, సుధీర్‌బాబు ‘హరోం హర’, 23న నితిన్ ‘ఎక్స్ట్రా’ చిత్రాలు విడుదలకు షెడ్యూల్ అయ్యాయి. ఇప్పుడు ‘సలార్’ ఎఫెక్ట్‌తో ఈ సినిమాల విడుదల వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పుడు వాయిదా వేసి, సంక్రాంతికి వద్దామనుకుంటే ఆల్రెడీ పండగ బరిలో నాగార్జున ‘నా సామిరంగ’, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్ (ప్రచారంలో ఉన్న టైటిల్), తేజా సజ్జా ‘హనుమాన్’ చిత్రాలతో పాటు అనువాద చిత్రాలు శివ కార్తికేయన్ ‘అయలాన్’, సుందర్. సి ‘అరణ్మణై 4’ ఉన్నాయి. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలంటే థియేటర్ల సంఖ్య ప్రశ్నార్థకమవుతుంది... దాంతో పాటు వసూళ్లు కూడా షేర్ అయి΄ోతాయి కాబట్టి వీటిలో ఏదైనా వాయిదా పడే అవకాశమూ లేక΄ోలేదు. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘కల్కి 2098 ఏడి’ కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఈ సినిమా వాయిదా పడే చాన్స్ ఉందని తెలుస్తోంది. ‘సలార్’, ‘డంకీ’... ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 22నే వస్తాయా? ఇవి వస్తే ఏ చిత్రాలు వెనక్కి వెళతాయి? సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలేంటి? అనేది తెలియాలంటే కొంత సమయం వేచి ఉండక తప్పదు. ఆ తేదీకే ఎందుకు? ఓ సినిమా బాక్సాఫీస్ సరికొత్త రికార్డులను సృష్టించాలంటే సరైన రిలీజ్ డేట్ కూడా ముఖ్యం. ఇప్పుడు ‘సలార్’, ‘డంకీ’ చిత్రాలు డిసెంబరు 22ను ఎంచుకోవడం సరైనదే. ఎందుకంటే ఆ రోజు నుంచి వారాంతం ఆరంభమవుతుంది. సరిగ్గా క్రిస్మస్ సెలవులు కూడా మొదలవుతాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం ఖాయం. ఒకవేళ ఈ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటే.. న్యూ ఇయర్, ఆ తర్వాత సంక్రాంతి వరకూ ప్రదర్శనకు స్కోప్ ఉంటుంది. సంక్రాంతి సెలవుల టార్గెట్‌గా కొత్త చిత్రాలు వస్తాయి. అప్పుడు ‘సలార్’, ‘డంకీ’కి థియేటర్లు తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ పండగ టైమ్‌లో వచ్చే చిత్రాలకన్నా ఈ రెండూ బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే అప్పుడు సంక్రాంతి సెలవులను కూడా క్యాష్ చేసుకుంటాయి. ఈ చిత్రాల టాక్ ముందే తెలిసి΄ోతుంది కాబట్టి.. సంక్రాంతికి వచ్చే చిత్రాల్లో ఏదైనా వాయిదా పడే అవకాశం కూడా లేక΄ోలేదు. -
Dunki vs Salaar: షారుఖ్‌తో ప్రభాస్ ఢీ.. క్రిస్మస్ బరిలో సలార్, డుంకీ!
ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం సలార్ డిసెంబర్లో రిలీజ్ కాబోతుందనే చర్చ నెట్టింట వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా హఠాత్తుగా వాయిదా పడింది. కొత్త డేట్‌ని ప్రకటించలేదు. వచ్చే ఏడాది వేసవి బరిలోకి దిగబోతున్నాడని తొలుత వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఈ ఏడాది డిసెంబర్లోనే సలార్ రాబోతుందనే చర్చ నెట్టింట బాగా జరుగుతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న సలార్ విడుదల కాబోతుందని ఓ సినీ విశ్లేషకుడు పోస్ట్ పెట్టడమే ఈ చర్చకు కారణం. ఇక ఇదే తేదిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘డుంకీ’కూడా విడుదల కాబోతుంది. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మొదటిసారి షారుఖ్ తో తీస్తున్న సినిమా ఇది. షూటింగ్ మొదలైన రోజు విడుదల తేదిని ప్రకటించారు. ప్రభాస్ ఫ్యాన్స్ Vs షారుఖ్ ఫ్యాన్స్ ఇద్దరు బడా హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయితే ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం సహజం. ఆ ఎఫెక్ట్ వసూళ్లపై కూడా పడుతుంది. అందుకే బరిలో ఒక్క పెద్ద సినిమా ఉంటే మిగతా సినిమాలన్ని విడుదలను పోస్ట్‌పోన్ చేసుకుంటాయి. లేదంటే ముందు, వెనక విడుదల చేస్తాయి. సలార్ సెప్టెంబర్ 28న విడుదలవుతుందని ప్రకటించడంతో స్కంద, చంద్రముఖి 2 లాంటి బడా సినిమాలు సెప్టెంబర్ 15నే రావడానికి సిద్ధమయ్యాయి. కానీ సలార్ విడుదల వాయిదా పడగానే.. ఆ డేట్లోకి మార్చుకున్నాయి. ఇక ఇప్పుడు డిసెంబర్ 22న విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజు షారుఖ్ డుంకీ కూడా రీలీజ్ కానుంది. ఒకవేళ డుంకీ వాయిదా పడితే సలార్‌కి భయపడి వాయిదా వేశారనే కామెంట్స్ వస్తాయి. లేదని సలార్‌తో తలపడితే బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై దెబ్బ పడుతుంది. నార్త్‌లో షారుఖ్ హవా కొనసాగితే.. సౌత్‌లో ప్రభాస్ హవా ఉంటుంది. పరస్పరం మాట్లాడుకొని ఒకరు తమ సినిమాను వాయిదా వేసుకుంటే బాగుంటుందని బయ్యర్లు కోరుకుంటున్నారు. మరోవైపు మాకు పోటీగా వస్తే నష్టపోతారని ప్రభాస్- షారుఖ్ ఫ్యాన్స్ పరస్పరం కవ్వించుకుంటున్నారు. ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే మాత్రం ఆ ఎఫెక్ట్ కచ్చితంగా బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై పడుతుంది.