రిలీజ్‌కు ముందే సలార్‌ రికార్డ్.. అట్లుంటది మనతోని..! | Prabhas Salaar advance booking exceeds Shah Rukh Khan Dunki | Sakshi
Sakshi News home page

Prabhas Salaar Movie: రిలీజ్‌కు ముందే డైనోసార్ రికార్డ్.. ఆ మూవీని వెనక్కినెట్టి!

Published Wed, Dec 20 2023 6:44 PM | Last Updated on Wed, Dec 20 2023 7:22 PM

Prabhas Salaar advance booking exceeds Shah Rukh Khan Dunki - Sakshi

ఈ వారంలో రిలీజవుతున్న ప్రభాస్ సలార్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభం హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఎంతోమంది అభిమానులు టికెట్స్ దొరకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే సలార్‌ బుకింగ్స్ రూ.18 కోట్లకు పైగా జరిగినట్లు తెలుస్తోంది.

అయితే సలార్‌కు ఒక రోజు ముందే బాలీవుడ్ బాద్‌షా నటించిన డంకీ చిత్రం కూడా బాక్సాఫీస్ బరిలో నిలిచింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 21న రిలీజ్ కానుంది. ఈ మూవీ టికెట్స్ బుకింగ్స్ ‍ప్రారంభం కాగా.. ఇప్పటివరకు రూ.12 కోట్ల వరకు బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్క రోజు వ్యవధిలో బాక్సాఫీస్ బరిలో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడనుండండతో కలెక్షన్స్ పైనే అందరి దృష్టి పడింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఓ రేంజ్‌లో దూసుకెళ్తోన్న సలార్ ముందు.. షారుక్ ఖాన్ డంకీ పోటీలో నిలుస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. 

కాగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్,  టిను ఆనంద్, జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు షారుక్ ఖాన్ డంకీ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement