పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా సలార్ సందడే కనిపిస్తుంది. చాలా ఎళ్ల తర్వాత ప్రభాస్ భారీ హిట్ కొట్టాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సలార్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు.
తాజాగా సలార్ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు కలెక్షన్స్ రూ. 178 కోట్లు రాబట్టినట్లు చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 90 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రంగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాతి స్థానంలో దళపతి విజయ్ నటించిన 'లియో', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాలు ఈ ఏడాదిలో రూ.140 కోట్ల గ్రాస్‌తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలుగా ఉన్నాయి.
ఇప్పటి వరకు భారత్‌లో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా RRR మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ రూ. 223 కోట్ల రికార్డ్ పదిలంగా ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్-2 రూ. 165 కోట్ల రికార్డ్‌ను సలార్ దాటేశాడు. దీంతో మొదటిరోజు బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో సలార్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ రెండు చిత్రాలు సౌత్ ఇండియా నుంచే ఉండటం విశేషం.
కానీ ఈ ఏడాది రెండు వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన షారుక్ ఖాన్ మాత్రం డంకీ చిత్రంతో కలెక్షన్స్ పరంగా వెనుకపడ్డాడు. డంకీ చిత్రానికి మొదటిరోజు కేవలం ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. సలార్ దెబ్బతో డంకీ కలెక్షన్స్ రెండోరోజు మరింత క్షీణించాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
The most violent man announced his arrival ⚠️#SalaarCeaseFire hits 𝟏𝟕𝟖.𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) on the opening day!
— Mythri Movie Makers (@MythriOfficial) December 23, 2023
𝐓𝐡𝐞 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐨𝐩𝐞𝐧𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐚𝐧𝐲 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐅𝐢𝐥𝐦 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑 💥#BlockbusterSalaar #RecordBreakingSalaar… pic.twitter.com/8FPzU8RB0I
Comments
Please login to add a commentAdd a comment