బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. పఠాన్, జవాన్ సినిమాలతో ఈ ఏడాది రెండు భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. తాజాగా డిసెంబర్ 21న 'డంకీ'తో వచ్చేశాడు. రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ పట్ల పాజిటివ్ టాక్ ఉన్నా.. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరిస్తుందని టాక్ వినిపిస్తుంది. భారీ అంచనాలతో విడుదలైన డంకీ చిత్రం మొదటిరోజు ఆశించిన కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్, జవాన్ చిత్రాల మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్‌ను డంకీ దాటలేకపోయింది.
సినిమా ట్రేడ్ వర్గాల ప్రకారం డంకీ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసులు చేసింది. నెట్ కలెక్షన్స్ ప్రకారం అయితే రూ. 30 కోట్లు అని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్ మొదటిరోజు రూ. 106 కోట్లు కలెక్ట్ చేయగా జవాన్ రూ. 129 కోట్లు రాబట్టింది. రెండు వరుస భారీ హిట్లు కొట్టిన తర్వాత వచ్చిన చిత్రం డంకీ... దీంతో ఈ సినిమా రూ. 130 కోట్ల మార్క్‌ను దాటుతుందని అందరూ అంచనా వేశారు. డంకీ చిత్రం మేకర్స్ అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ప్రకటించలేదు.
ప్రభాస్ ప్లాప్ సినిమాను దాటలేకపోయిన 'డంకీ'
ప్రభాస్ ప్లాప్ సినిమా అయిన ఆదిపురుష్ చిత్రం కంటే డంకీ మూవీకి కలెక్షన్స్ తక్కువ వచ్చాయి. ఆదిపురుష్ సినిమా మొదటి రోజు 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెట్ కలెక్షన్స్ ప్రకారం అయితే రూ. 37 కోట్లు. బాలీవుడ్‌లో మొదటిరోజు వచ్చిన టాప్ కలెక్షన్స్ లిస్ట్‌లో డంకీ చిత్రం 7వ స్థానంలో ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రభాస్ సలార్‌తో భారీ రికార్డ్స్ కొట్టడం ఖాయం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు డంకీ మూవీకి చెప్పుకోతగిన టాక్ రాలేదు.
రాజ్ కుమార్ హిరానీ కేరీర్లోనే వీకెస్ట్ సినిమాగా డంకి పేరు తెచ్చుకుంది. అసలే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా వెనుకబడింది. సలార్ మాత్రం 33 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడపోయాయని సమాచారం. సలార్‌తో ప్రభాస్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment