సలార్‌ Vs డంకీ.. వెనక్కి తగ్గుతున్న ప్రభాస్‌.. కారణం ఇదేనా? | Salaar Postponed Again Because Dunki | Sakshi
Sakshi News home page

Salaar Postponed: సలార్‌ మరోసారి వాయిదా పడనుందా.. కారణం ఇదేనా?

Published Sun, Nov 5 2023 5:21 PM | Last Updated on Sun, Nov 5 2023 6:02 PM

Salaar Postponed Again Because Dunki - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మోస్ట్​ అవైటెడ్​ మూవీ సలార్‌ మరోసారి వాయిదా పడనుందా..? బాలీవుడ్‌ కింగ్‌ షారుక్‌ ఖాన్‌ డంకీ చిత్రంతో పోటీ ఎందుకని డైనోసార్‌ వెనకడుగు వేస్తున్నాడా..? ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన 'సలార్‌' డిసెంబర్‌ 22న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ తేదీన కూడా సలార్‌ రావడం కష్టమేనని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

(ఇదీ చదవండి: అలాంటి వాళ్లు ‘ఆంటీ’ అంటే నాకు ఇష్టమే : అనసూయ)

క్రిస్మస్​ కానుకగా బాక్సాఫీస్​ వద్దకు సలార్‌,డంకీ  చిత్రాలు రానున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పఠాన్‌,జవాన్‌ చిత్రాలతో భారీ హిట్స్‌ కొట్టి ఫుల్‌ జోష్‌లో ఉన్నాడ్‌ షారుక్‌.. దీంతో ఆయన నుంచి వస్తున్న డంకీ చిత్రంపై భారీ కలెక్షన్స్‌ రావడం పక్కా అని బాలీవుడ్‌ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఇదే సమయంలో  రాధేశ్యామ్​, ఆదిపురుష్ డిజాస్టర్ల తర్వాత సలార్‌తో ప్రభాస్‌ వస్తున్నాడు.  అయినా కూడా ప్రశాంత్‌ నీల్‌,ప్రభాస్‌ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సలార్‌పై అంచనాలు ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. 

కానీ ఈ రెండు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలే కావడంతో ఒకేసారి రిలీజ్ కావడం సరైంది కాదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తేడా వస్తే వసూళ్లపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉండవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ  క్లాష్ నుంచి రెండు చిత్రాలు తప్పుకుంటే మంచిదని సినీ ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి. డిసెంబర్‌లో వస్తున్నట్లు షారుక్‌ డంకీ టీమ్‌ ముందుగానే ప్రకటించారు.. కానీ సలార్‌ మాత్రం సెప్టెంబర్‌లో రిలీజ్‌ అని ప్రకటించి ఆ తర్వాత డిసెంబర్‌కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.. దీంతో  ఇప్పుడు 'సలార్'​ మరోసారి వాయిదాకు రెడీ అయిందని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజం అయితే సలార్‌ 2024 జనవరి లేదా మార్చి నెలలో విడదల కావడం గ్యారెంటీ.. ఈ విషయంపై అధికారకంగా సలార్‌ టీమ్‌ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement