తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ప్రభాస్ 'సలార్' సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేశారు. భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కడంతో ఏపీలో 10 రోజులు పాటు రూ.40 పెంచుకునేందుకు, తెలంగాణలో మల్టీప్లెక్స్‌ల్లో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.65 పెంచుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో మల్టీఫ్లెక్స్‌లో సినిమా చూడాలంటే ఒక్కో టికెట్ రూ. 400 పైమాటే.. అయినా ఎక్కడా టికెట్లు దొరకడం లేదు.
తాజాగా నార్త్ ఇండియా ప్రాంతాల్లో ఉన్న పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లల్లో 'సలార్' సినిమాను విడుదల చేయకూడదని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం షారుక్ ఖాన్ 'డంకీ' సినిమాకు ఈ థియేటర్లు ఇచ్చిన ప్రాముఖ్యతే అని చెప్పవచ్చు. సలార్ సినిమా విడుదలకు ముందే ఈ రెండు మల్టీఫ్లెక్స్‌లతో హోంబలె ఫిల్మ్స్ అగ్రిమెంట్ ఉంది.
దాని ప్రకారం నార్త్ ఇండియాలో 'డంకీ'తో పాటు 'సలార్'కు పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ చైన్ థియేటర్‌లలో సమానంగా స్క్రీన్లు కేటాయించాలి. కానీ డంకీ సినిమాకే ఎక్కువ స్క్రీన్స్‌ను ఈ రెండు మల్టీఫ్లెక్స్‌లు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లల్లో సలార్‌ను ఇవ్వకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారట.
సలార్ నుంచి రెండో ట్రైలర్ విడుదల అయిన తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్‌ను మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. అప్పటికే డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్‌ను ఓపెన్ చేసి టికెట్ల కోసం రెడీగా ఉన్నారు. లక్షలాది మంది ఒక్కసారిగా యాప్‌ను ఓపెన్ చేయడంతో యాప్ సర్వర్ డౌన్ అయింది. తర్వాత అది ఓపెన్ కాగానే చూస్తే.. సలార్ టికెట్లు దొరికే పరిస్థితి లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బ్లాక్‌లో టికెట్లు కొనేందుకు ప్రయత్నాలు చేస్తే.. ఒక్కో టికెట్ రూ. 2000 పై మాటే చెబుతున్నారని వారు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment