PVR
-
ఎంతసేపు సినిమా చూస్తే అంతే ధర చెల్లించేలా..
ఎంతో ఆసక్తిగా సినిమా చూసేందుకు వెళ్తారు. తీరా అరగంట చూశాక సినిమా నచ్చకో లేదా ఏదైనా అత్యవసర పనిమీదో బయటకు వెళ్లాల్సి రావొచ్చు. అలాంటి సందర్భంలో టికెట్ డబ్బులు వృథా అయినట్టే కదా. ఇలాంటి ప్రత్యేక సమయాల్లో టికెట్ డబ్బు నష్టపోకుండా మీరు ఎంతసేపు సినిమా చూస్తారో అంతే మొత్తం చెల్లించేలా పీవీఆర్ ఐనాక్స్ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది. అందులో భాగంగా ‘ఫ్లెక్సీ షో’ అనే కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.ఈ ఫ్లెక్సీ షో ద్వారా సినిమా చూసే సమయానికి మాత్రమే డబ్బు చెల్లించవచ్చు. ఈ వినూత్న టికెటింగ్ మోడల్లో సీటు ఆక్యుపెన్సీని పర్యవేక్షించడానికి, మూవీ మిగిలి ఉన్న సమయం ఆధారంగా రీఫండ్లను లెక్కించడానికి ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.ఎలా పని చేస్తుందంటే..టికెట్ స్కానింగ్: మీరు సినిమా థియేటర్లోకి వెళ్లేప్పుడు టికెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. మీ ఎంట్రీ, ఎక్జిట్ సమయాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. దానిపరంగా మీకు డబ్బు రీఫండ్ అవుతుంది.రీఫండ్ సిస్టమ్: సినిమా 75% కంటే ఎక్కువ మిగిలి ఉంటే, టికెట్ ధరలో 60% తిరిగి పొందవచ్చు. సినిమా వ్యవధి 50-75%కు మధ్య ఉంటే 50% రీఫండ్ అవుతుంది. ఇంకా 25-50% సినిమా మిగిలి ఉన్నప్పుడు మీరు థియేటర్ నుంచి బయటకు వెళితే 30% రీఫండ్ ఇస్తామని పీవీఆర్ ఐనాక్స్ పేర్కొంది.అదనపు ఛార్జీలుఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునేవారు టికెట్ బుకింగ్ సమయంలోనే ‘ఫ్లెక్సీ షో’ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు సాధారణ ధర కంటే టికెట్ ఫేర్‌లో 10 శాతం అధికంగా చెల్లించాలి.ఎక్కడ అమలు చేస్తున్నారు..ఈ సదుపాయాన్ని ప్రస్తుతం న్యూఢిల్లీ, గుర్గావ్ల్లో అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదికూడా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రేక్షకుల స్పందన ఆధారంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో జాబ్స్ పెరుగుతాయా? తగ్గుతాయా?కంపెనీపై ప్రభావంప్రేక్షకుల సంతృప్తి: సినిమా చూసే సమయానికి మాత్రమే ధర నిర్ధారించడం వల్ల పీవీఆర్ ఐనాక్స్‌పై ప్రేక్షకులకు విశ్వసనీయత పెరుగుతుందని కంపెనీ అధికారులు తెలిపారు. ప్రేక్షకుల సంతృప్తికి సంస్థ పెద్దపీట వేస్తుందని చెప్పారు.ఆదాయ వృద్ధి: ఫ్లెక్సీ షో టికెట్ల ధర 10% ఎక్కువగా ఉన్నప్పటికీ, సినిమా వీక్షించిన సమయం ఆధారంగా రీఫండ్లను అందిస్తుండడంతో కంపెనీ ఆదాయం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ అందించే సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు అదనపు ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని కంపెనీ భావిస్తుంది.పోటీని తట్టుకునేలా..: ఈ వినూత్న టికెటింగ్ మోడల్ పీవీఆర్ ఐనాక్స్ ఇతర ఎంటర్టైన్మెంట్ రంగంలోని సంస్థలతో పోటీ పడేందుకు ఉపయోగపడుతుంది.డేటా సేకరణ: సీట్ల ఆక్యుపెన్సీని పర్యవేక్షించడానికి, రీఫండ్లను లెక్కించడానికి ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలు ఉపయోగించనున్నారు. దాంతో ప్రేక్షకుల ప్రవర్తన, వారి ప్రాధాన్యతలకు సంబంధించిన డేటాను సేకరించే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో ప్రేక్షకులకు మరింత మెరుగైన సినిమా అనుభవాన్ని అందించేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది. -
థియేటర్ల నుంచి పుష్ప 2 అవుట్? ఏం జరిగిందంటే?
పుష్పరాజ్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్నాడు. బాలీవుడ్లో బడా స్టార్ల రికార్డులను బద్దలు కొడుతూ వందల కోట్ల కలెక్షన్స్ వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లు (గ్రాస్) వసూలు చేయగా ఒక్క హిందీలోనే రూ.618 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా మూడోవారంలోకి అడుగుపెట్టింది. ఆ కారణం వల్లే?ఈ క్రమంలో నార్త్‌లో పుష్ప 2ను థియేటర్లలో నుంచి తీసేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. సినీ విశ్లేషకులు మనోబాలా విజయబాలన్.. పుష్ప 2 చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ నుంచి తీసేస్తున్నారని ట్వీట్ చేశాడు. థియేటర్లో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్న నిబంధనకు నిర్మాతలు ఒప్పుకోలేదని, అందుకే ఉన్నపళంగా పుష్ప 2 ప్రదర్శనలను నిలిపిపేయాలని మల్టీప్లెక్స్‌లు భావించినట్లు తెలుస్తోంది. సమస్య సద్దుమణిగినట్లే!తర్వాత ఇరు వర్గాలు కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని మనోబాల మరో ట్వీట్లో వెల్లడించాడు. సమస్య సద్దుమణిగిందని తెలిపాడు. పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో పుష్ప 2 ఆడుతుందని పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా పుష్ప 2 సినిమాను జనవరి రెండో వారంలో ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. మరి ఇప్పుడు కొత్త అగ్రిమెంట్స్ ప్రకారం ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి! BREAKING: Pushpa 2⃣ REMOVED✖️ from all PVR INOX chains in North India from Tomorrow.— Manobala Vijayabalan (@ManobalaV) December 19, 2024 BREAKING: Pushpa 2️⃣ PVR INOX agreement issue now resolved✅Shows opening slowly one by one⏳— Manobala Vijayabalan (@ManobalaV) December 19, 2024చదవండి: లక్కీ భాస్కర్.. హీరోయిన్ను మెచ్చుకోవాల్సిందే! : పరుచూరి గోపాలకృష్ణ -
మరో 100 స్క్రీన్లు వస్తున్నాయ్..
న్యూఢిల్లీ: సినిమా ప్రదర్శన వ్యాపారంలో ఉన్న పీవీఆర్ ఐనాక్స్ వచ్చే ఏడాది కొత్తగా సుమారు 100 స్క్రీన్లను జోడిస్తోంది. ఇందుకోసం రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు కంపెనీ ఈడీ సంజీవ్ కుమార్ బిజ్లి వెల్లడించారు. రాబోయే కాలంలో ఏటా 100 స్క్రీన్లను ప్రారంభిస్తామని తెలిపారు.‘ఈ సంవత్సరం ఇప్పటివరకు 70 దాకా స్క్రీన్లను తెరిచాము. 45–50 తెరలను మూసివేశాం. 2024లో మరో 40 జతచేస్తాం. అలాగే మరో 10–15 మూసివేస్తాం. మొత్తంగా ఈ ఏడాది దాదాపు 75 మూసివేసి, 120 స్క్రీన్లను జోడించాలనే ఆలోచన ఉంది. అసెట్ లైట్ మోడల్‌ను అనుసరిస్తాం. పెట్టుబడికి పెద్ద సహకారం డెవలపర్ల నుండి వస్తోంది. డిసెంబర్ త్రైమాసికం ఇప్పుడు మెరుగైన స్థానంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అక్టోబర్ కాస్త నిస్తేజంగా ఉంది. కానీ నవంబర్ ఇప్పటికే జోరు మీద ఉంది. కొత్త సినిమాలు విడుదల కానుండడంతో క్యూ3 చాలా మెరుగ్గా కనిపిస్తోంది.ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధ భాగం చాలా మెరుగ్గా ఉంది. ఏప్రిల్–సెప్టెంబర్ కాస్త స్తబ్దుగా ఉంది. ఎందుకంటే చాలా సినిమాల రిలీజ్లు అక్టోబర్–మార్చికి వాయిదా పడ్డాయి. కంపెనీ క్యూ3, క్యూ4లో విడుదలయ్యే కొత్త సినిమాలతో జోరుమీద ఉంది’ అని సంజీవ్ కుమార్ వివరించారు. మూవీ జాకీ పేరుతో ఆర్టిఫీషియల్ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం పీవీఆర్ ఐనాక్స్ దేశవ్యాప్తంగా 111 నగరాల్లోని 355 ప్రాపర్టీలలో 1,744 తెరలను కలిగి ఉంది. -
సీన్ రివర్స్.. నష్టాల్లోకి పీవీఆర్ ఐనాక్స్
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో లాభాలకు బదులు నష్టాలు చవిచూసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 12 కోట్లకుపైగా నష్టాలను ప్రకటించింది. సినిమా థియేటర్ల బిజినెస్ నీరసించడం ప్రభావాన్ని చూపించింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో కంపెనీ రూ. 166 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం సైతం 19 శాతం క్షీణించి రూ.1,622 కోట్లకు పరిమితమైంది. మొత్తం వ్యయాలు 7 శాతం తగ్గి రూ. 1,679 కోట్లుగా నమోదయ్యాయి. మూవీ ఎగ్జిబిషన్ ఆదాయం 20 శాతం క్షీణించి రూ. 1,579 కోట్లకు పరిమితమైంది. అయితే మూవీ ప్రొడక్షన్, పంపిణీ బిజినెస్ 78 శాతం పెరిగి రూ. 108 కోట్లను చేరుకుంది. -
టికెట్ కొంటే ఛాయ్, సమోసా ఫ్రీ.. కానీ సినిమాకి జనాలు రావట్లేదు!
ఇప్పుడు కొత్త సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా తయారైంది. కంటెంట్ ఉంటేనే చూస్తున్నారు లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో మూవీ అయినా సరే నిర్దాక్షిణ్యంగా పక్కనబెట్టేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీకి తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎంతలా అంటే ఏకంగా మల్టీఫ్లెక్స్‌లు టికెట్ కొంటే ఫుడ్ ఫ్రీ ఇచ్చేంతలా!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'సర్ఫిరా'.. మూడు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చింది. అప్పుడెప్పుడో కరోనాలో నేరుగా ఓటీటీలో రిలీనైన సూర్య 'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికి రీమేక్ ఇది. ఆల్రెడీ రీమేక్‌ని చాలామంది చూసేయడం, రిలీజ్‌కి ముందు సరైన బజ్ లేకపోవడం 'సర్ఫిరా'కి ఘెరమైన మైనస్ అయ్యాయి. ఇదంతా వసూళ్లపై ప్రభావం పడింది.ఒకప్పుడు వందల కోట్ల వసూళ్లు చూసిన అక్షయ్ కుమార్.. ఇప్పుడు 'సర్ఫిరా'తో మూడు రోజుల్లో కేవలం రూ.12 కోట్లు కలెక్షన్స్ రావడం షాకయ్యేలా చేసింది. దీంతో సినిమాని ప్రదర్శిస్తున్న థియేటర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో పీవీఆర్ మల్టీఫ్లెక్స్.. టికెట్ కొని 'సర్పిరా' చూస్తే సమోసా, ఛాయ్ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ పెట్టడం చూస్తుంటే జనాలు ఎలా మొహం చాటేస్తున్నారో అర్థమవుతోంది.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)Chase your hunger away with this totally Sarfira combo! ☕️🎬 This yummy combo includes 2 samosas and tea. Plus, get a free merchandise with your order. Now screening at PVR INOX!Book now: https://t.co/WyiWtS0CBM*T&Cs Apply #AkshayKumar #RadhikaMadan #Sarfira #PareshRawal pic.twitter.com/f7OUtXVia2— P V R C i n e m a s (@_PVRCinemas) July 14, 2024 -
'మంజుమ్మల్ బాయ్స్' ప్రదర్శనలు నిలిపేసిన పీవీఆర్ మల్టీప్లెక్స్.. కారణమేంటి?
మలయాళంలో బ్లాక్ బస్టర్ టాక్ తో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. తాజాగా ఏప్రిల్ 6న తెలుగులో రిలీజై అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యాంగా పీవీఆర్ మల్టిఫ్లెక్స్ మంజుమల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను ఆపేసింది. (ఇదీ చదవండి: ప్రముఖ నటి భర్తకు గుండెపోటు.. అందువల్లే..) మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ యాజమాన్యం వెల్లడించింది. పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు. మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమన్న శశిధర్ రెడ్డి... ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై గురువారం సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది. (ఇదీ చదవండి: నాలుగేళ్ల గొడవ క్లియర్.. హీరో-కమెడియన్ కలిసిపోయారు!) -
PVR మల్టీప్లెక్స్‌లలో కనిపించని సలార్.. కారణం 'డంకీ' సినిమానే
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ప్రభాస్ 'సలార్' సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆఫ్‌లైన్, ఆన్లైన్లో టికెట్లను విడుదల చేశారు. భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కడంతో ఏపీలో 10 రోజులు పాటు రూ.40 పెంచుకునేందుకు, తెలంగాణలో మల్టీప్లెక్స్‌ల్లో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.65 పెంచుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో మల్టీఫ్లెక్స్‌లో సినిమా చూడాలంటే ఒక్కో టికెట్ రూ. 400 పైమాటే.. అయినా ఎక్కడా టికెట్లు దొరకడం లేదు. తాజాగా నార్త్ ఇండియా ప్రాంతాల్లో ఉన్న పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లల్లో 'సలార్' సినిమాను విడుదల చేయకూడదని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం షారుక్ ఖాన్ 'డంకీ' సినిమాకు ఈ థియేటర్లు ఇచ్చిన ప్రాముఖ్యతే అని చెప్పవచ్చు. సలార్ సినిమా విడుదలకు ముందే ఈ రెండు మల్టీఫ్లెక్స్‌లతో హోంబలె ఫిల్మ్స్ అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారం నార్త్ ఇండియాలో 'డంకీ'తో పాటు 'సలార్'కు పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ చైన్ థియేటర్లలో సమానంగా స్క్రీన్లు కేటాయించాలి. కానీ డంకీ సినిమాకే ఎక్కువ స్క్రీన్స్‌ను ఈ రెండు మల్టీఫ్లెక్స్‌లు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లల్లో సలార్‌ను ఇవ్వకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారట. సలార్ నుంచి రెండో ట్రైలర్ విడుదల అయిన తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్‌ను మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. అప్పటికే డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్‌ను ఓపెన్ చేసి టికెట్ల కోసం రెడీగా ఉన్నారు. లక్షలాది మంది ఒక్కసారిగా యాప్‌ను ఓపెన్ చేయడంతో యాప్ సర్వర్ డౌన్ అయింది. తర్వాత అది ఓపెన్ కాగానే చూస్తే.. సలార్ టికెట్లు దొరికే పరిస్థితి లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బ్లాక్‌లో టికెట్లు కొనేందుకు ప్రయత్నాలు చేస్తే.. ఒక్కో టికెట్ రూ. 2000 పై మాటే చెబుతున్నారని వారు వాపోతున్నారు. -
డంకీ సినిమా రిలీజ్.. సలార్ మేకర్స్ సంచలన నిర్ణయం!
మరికొద్ది గంటల్లో షారుక్ ఖాన్ నటించిన డంకీ థియేటర్లలో సందడి చేయనుంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. నలుగురు వ్యక్తులు అక్రమంగా విదేశాలకు వెళ్తే ఏమవుతుంది అనే కథాంశంతో డంకీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఏడాది పఠాన్, జవాన్ చిత్రాలతో వేల కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్ బాద్షా హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయిపోయారు. అభిమానుల భారీ అంచనాల మధ్య మూడో చిత్రం విడుదలకు సిద్ధమైంది. అయిత ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న ఈ సినిమా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్‌తో పోటీ పడనుంది. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు కావడంతో థియేటర్ల విషయంలో వివాదం తలెత్తింది. ఇప్పటికే పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో డంకీ ప్రదర్శనకు సమానంగా స్క్రీన్స్ కేటాయిచాలని హోంబలే ఫిల్మ్స్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డంకీతో సమానంగా ప్రభాస్ సలార్‌కు స్క్రీన్స్ ఇవ్వకపోవడంతో నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో 'సలార్' చిత్రాన్ని విడుదల చేయటం లేదని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ థియేటర్లలో బుకింగ్ చేసుకున్న ఆడియన్స్ టికెట్స్ క్యాన్సిల్ కావడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అంతే కాకుండా ట్విటర్లోనూ బాయ్‌కాట్ పీవీఆర్ ఐనాక్స్ అని ట్రెండింగ్ అయింది. గూస్బంప్స్ తెప్పిస్తోన్న సెకండ్ ట్రైలర్.. సలార్ రెండో ట్రైలర్ రిలీజ్ తర్వాత సలార్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటించింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. Pan India Star #Prabhas' #Salaar unlikely to release in PVR INOX due to unfair screen sharing with #ShahRukhKhan's #Dunki.#BoycottPVRInox "The makers have withdrawn the release of Salaar from the multiplex chains in the South Indian Markets. They won't be releasing Salaar in… pic.twitter.com/RHTV3BuRdu — Manobala Vijayabalan (@ManobalaV) December 20, 2023 REBELS GO To PLAYSTORE And DESTROY PVR APP RATING💥💥💥💥💥 Show Them The Power Of #Prabhas and #SALAAR. SHAME ON YOU AJAY BIJLI #BoycottPVRInox #BoycottpvrAjayBijli pic.twitter.com/a5AA8mZuF0 — Ashok Kumar (@bashokkumar_) December 20, 2023 -
క్యూ2లో పీవీఆర్ ఐనాక్స్ జోరు
న్యూఢిల్లీ: మలీ్టప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్(క్యూ2)లో నష్టాలను వీడి రూ. 166 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 71 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 686 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లకు దూసుకెళ్లింది. 2023 ఫిబ్రవరి 6నుంచి పీవీఆర్, ఐనాక్స్ విలీనం అమలులోకి రావడంతో ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. కాగా.. మొత్తం వ్యయాలు రూ. 1,802 కోట్లుగా నమోదయ్యాయి. విలీనం తదుపరి పీవీఆర్ ఐనాక్స్ చరిత్రలోనే అత్యధికంగా ఒక త్రైమాసికంలో 4.84 కోట్ల మంది సినిమా హాళ్లను సందర్శించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక సగటు టికెట్ ధర అత్యధికంగా రూ. 276కు చేరగా.. ఆహారం, పానీయాల సగటు వ్యయం సైతం రికార్డ్ నెలకొల్పుతూ రూ. 136ను తాకింది. ఈ కాలంలో 37 తెరలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో శ్రీలంకసహా 115 పట్టణాలలో మొత్తం స్క్రీన్ల సంఖ్య 1,702కు చేరింది. అయితే ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో సరైన ఆదరణలేని మొత్తం 33 స్క్రీన్లను తొలగించింది. మరోవైపు పూర్తి ఏడాదిలో 150–160 కొత్త స్క్రీన్ల ఏర్పాటు బాటలో సాగుతున్నట్లు వెల్లడించింది. ఈ కాలంలో ప్రధానంగా హిందీ సినిమాలు అత్యధిక వసూళ్లను సాధించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 1,742 వద్ద ముగిసింది. -
సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్: రూ.699కే నెలంతా థియేటర్లో సినిమాలు!
సినీ ప్రేక్షకుల కోసం ప్రముఖ సినిమా చైన్ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ 'PVR INOX పాస్‌పోర్ట్' అనే కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్రేక్షకులను తరచూ థియేటర్లకు లక్ష్యంతో తీసుకొచ్చిన మొదటి సినిమా సబ్స్క్రిప్షన్ పాస్ ఇది. ఈ నెలవారీ సబ్స్క్రిప్షన్ పాస్‌లు అక్టోబర్ 16 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ పాస్ ద్వారా కేవలం రూ.699తో నెలకు 10 సినిమాల వరకు చూడవచ్చు. అయితే వీటికి కొన్ని షరతులు ఉన్నాయి. పీవీఆర్ ఐనాక్స్ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం అవి ఏంటంటే.. ఈ ఆఫర్ సోమవారం నుంచి గురువారం వరకు వర్తిస్తుంది. ఐమ్యాక్స్, గోల్డ్, లక్, డైరెక్టర్స్ కట్ వంటి ప్రీమియం థియేటర్లకు ఇది వర్తించదు. సినిమా చైన్ యాప్ లేదా వెబ్సైట్ నుంచి కనీసం మూడు నెలల సబ్స్క్రిప్షన్ వ్యవధికి 'PVR INOX పాస్‌పోర్ట్' కొనుగోలు చేయవచ్చు. రిడీమ్ చేసుకోవడానికి వినియోగదారులు లావాదేవీ చెక్ అవుట్ సమయంలో చెల్లింపు ఎంపికగా పాస్‌పోర్ట్ కూపన్‌ను ఎంచుకోవలసి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ టికెట్లు కొంటున్నట్లయితే, ఒక టికెట్‌కు పాస్‌పోర్ట్ కూపన్‌ని ఉపయోగించవచ్చు. ఈ పాస్‌పోర్ట్ అనేది బదిలీ చేయలేని సబ్స్క్రిప్షన్. ఒకరే వినియోగించాల్సి ఉంటుంది. థియేటర్లోకి వెళ్లే ముందు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. ఇక ఆహారం, పానీయాల విషయంలోనూ పీవీఆర్ ఐనాక్స్ ఇదివరకే వాటి ధరలను 40 శాతం తగ్గించింది. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రూ. 99 నుంచి ప్రారంభమయ్యే ఫుడ్ కాంబోలను పరిచయం చేసింది. -
పీవీఆర్ ఐనాక్స్కు నష్టాలు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 82 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ. 981 కోట్ల నుంచి రూ. 1,305 కోట్లకు ఎగసింది. మొత్తం టర్నోవర్ రూ. 1,330 కోట్లను తాకగా.. మొత్తం వ్యయాలు రూ. 1,438 కోట్లకు చేరాయి. అయితే పీవీఆర్, ఐనాక్స్ విలీనం నేపథ్యంలో గతేడాది క్యూ1తో ఫలితాలను పోల్చతగదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత సమీక్షా కాలంలో 3.39 కోట్లమంది సినిమా హాళ్లను సందర్శించగా.. సగటు టికెట్ ధర రూ. 246గా నమోదైంది. సగటున ఆహారం, పానీయాలపై రూ. 130 చొప్పున వెచి్చంచినట్లు కంపెనీ వెల్లడించింది. కొత్తగా 31 స్క్రీన్లను ప్రారంభించడంతో వీటి సంఖ్య 1,707కు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం లాభపడి రూ. 1,566 వద్ద ముగిసింది. -
సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన థియేటర్స్..!
-
సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్! సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన మల్టీప్లెక్స్!
మల్టీప్లెక్స్‌లో సినిమాలు వీక్షించేవారికి ఊరట కలిగించే విషయం ఇది. సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరల కంటే అక్కడ అమ్మే తినుబండారాలు, పానీయాల రేట్లే అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్‌లలో విపరీతమైన వాటి ధరలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వక్తమవుతుండటం తెలిసిందే. సోషల్ మీడియాలో విమర్శల దెబ్బకు ప్రముఖ మల్టీప్లెక్స్ చెయిన్ పీవీఆర్ ఐనాక్స్ దిగొచ్చింది. తమ వద్ద విక్రయించే తినుబండారాలు, పానీయాల ధరలను 40 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఫుడ్ కాంబోల ధరలు రూ.99 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే ‘బెస్ట్ సెల్లర్@99’ అనేది స్పషల్ షోలకు, గ్రూప్ బుకింగ్స్‌కి వర్తించదని, ఆఫ్‌లైన్‌లోనే కొనుక్కోవాలని ప్రకటించింది. ఈ మల్టీప్లెక్స్‌లో ఒక టబ్ చీస్ పాప్‌కార్న్ రూ.450, సాఫ్ట్ డ్రింక్ 600 ఎంఎల్ రూ.360 ఉండేది. దీనిపై ట్విటర్లో పది రోజుల క్రితం ఓ యూజర్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దానికి స్పందిస్తూ సదరు మల్టీప్లెక్స్ యాజమాన్యం తినుబండారాలు, పానీయాల రేట్లు తగ్గించింది. దీనికితోడు థియేటర్లలో తినుబండారాలు, పానీయాల ధరలపై జీఎస్టీని ప్రభుత్వం ఇటీవల 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం కూడా కలిసివచ్చింది. ఇదీ చదవండి: FAME 3: ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం! -
ఇలా అయితే థియేటర్లో సినిమాలు చూసినట్లే?, వైరల్‌గా మారిన పాప్‌కార్న్ బిల్
మనలో చాలా మందికి సినిమా థియేటర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సినిమాల్ని చూసేందుకు ఇష్టపడుతుంటాం. కానీ మహమ్మారి రాకతో సినిమా థియేటర్లలో సందడి తగ్గింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ల హవా పెరిగింది. కోవిడ్‌కు ముందు తమకు నచ్చిన అభిమాన హీరో సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసిన సినీ లవర్స్ ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఓటీటీల్లో కొత్త సినిమాలు విడుదలయ్యే వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. అందుకు ప్రధాన కారణం థియేటర్లో సినిమా చూడడం ఖర్చుతో కూడుకుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు సినిమా టిక్కెట్ల కోసం ఖర్చుతో పాటు స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలతో సినీ ప్రేక్షకుల జేబుకు చిల్లు పడుతుందని వాపోయాడు ఓ నెటిజన్. ఓ థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లిన తనకు పాప్ కార్న్ బిల్లు చూసి కళ్లు బైర్లు కమ్మాయంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. Rs 460 for 55gm of cheese popcorn, Rs 360 for 600ml of Pepsi. Total Rs 820 at @_PVRCinemas Noida. That’s almost equal to annual subscription of @PrimeVideoIN. No wonder people don’t go to cinemas anymore. Movie watching with family has just become unaffordable. pic.twitter.com/vSwyYlKEsK — Tridip K Mandal (@tridipkmandal) July 1, 2023 ఇటీవల ట్విటర్ యూజర్ త్రిదీప్ కె మండల్ నోయిడాలోని పీవీఆర్ సినిమాస్‌లో సినిమా చూశాడు. అందుకు అతనికైన ఖర్చు అక్షరాల రూ.820. సినిమా టికెట్ ధర వేరే ఉంది. పాప్‌కార్న్ ధర రూ.460, కూల్‌డ్రింక్‌కి రూ. 360కి చెల్లించాల్సి వస్తుందంటూ ఆ బిల్లును ట్విటర్లో షేర్ చేశారు. అంతేకాదు, ఒక్క సినిమా కోసం నేను ఖర్చు చేసిన మొత్తం ధరతో ఏడాది పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లో కావాల్సినన్ని సినిమాల్ని చూడొచ్చు. అందుకే ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు ఇష్ట పడడం లేదు అని ట్వీట్లో పేర్కొన్నాడు. ఆ ట్వీట్‌ను 1.2 మిలియన్లకు పైగా వీక్షించగా, 17.8k లైక్ కొట్టారు. తినడానికి కాదుగా దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సినిమా థియేటర్లలో అధిక ధరల్ని ఎలా భరించగలం? సినీ లవర్స్ థియేటర్లకు వెళ్లకుండా మానుకోవడంలో ఆశ్చర్యం లేదని ఓ నెటిజన్ చేయగా.. పాప్‌కార్న్ డబ్బుల్ని ఆదా చేసుకోండి. ఇంటికెళ్లి భోజనం చేయండి అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. థియేటర్‌కు వెళ్లి సినిమా మాత్రమే చూడండి. తినడం కోసం మాత్రం వెళ్లొద్దంటూ సలహా ఇస్తున్నారు. మొత్తానికి ఇప్పుడీ ఈ అంశం నెట్టింట్లో వైరల్‌గా మారింది. Ghar se khaana kha ke niklo sabhi — dr_vee (@dr_vee95) July 2, 2023 50 స్క్రీన్లను మూసేస్తున్న మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్కు నష్టాలు వెంటాడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 333 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 105 కోట్లకుపైగా నష్టం నమోదైంది. దీంతో వరుస నష్టాల నుంచి బయటపడేందుకు మల్టీప్లెక్స్ చైన్ కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన పీవీఆర్ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఎవరీ లలితాజీ.. సర్ఫ్ ఎక్సెల్ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు? -
పీవీఆర్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ అన్‌స్టాపబుల్ పేరుతో ఆటోబయోగ్రఫీ
పీవీఆర్ సంస్థ దక్షిణాది నిర్వాహకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీనా చాబ్రియా తన జీవిత చరిత్రను అన్ స్టాపబుల్ పేరుతో రాసుకున్నారు. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చైన్నె, రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి ఐశ్వర్య రాజేష్, మైక్ సెట్ శ్రీరామ్, ఆటో అన్నాదురై, నిర్మాత యువరాజ్ గణేశన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ఈ వేడుకలో పాల్గొనే ముందు తాను మీనా చాబ్రియా గురించి తెలుసుకోదలచానన్నారు. దీంతో ఆమెకు ఫోన్ చేసి అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నారు. 17 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని 20 ఏళ్ల వయసులోనే విడాకులు పొందిన ఇద్దరు పిల్లల తల్లి ఇంత ఉన్నత స్థానానికి ఎదగడం చూస్తే.. తనకు తన తల్లి జ్ఞాపకం వచ్చిందన్నారు. సినిమా రంగంలోకి తాను ప్రవేశించిన కొత్తలో నటిగా నువ్వు ఏం చేస్తావు? అని పలువురు ఎగతాళి చేశారన్నారు. అయితే అలాంటి అవమానాలను దాటి ఎదిగి తాను అన్ స్టాపబుల్ గా నిలిచానన్నారు. దీన్ని పేరుగా పెట్టిన మీనా చాబ్రియా రాసిన పుస్తకం మంచి సక్సెస్ కావాలని పేర్కొన్నారు. తాను పుస్తకాలు ఎక్కువగా చదవనని, అయితే ఈ పుస్తకాన్ని చదవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే తాను మహిళ ఇతివృత్తంతో కూడిన చిత్రాల్లో నటించడం వల్ల తనకు పురుషులంటే ద్వేషం అని భావించరాదన్నారు. తనను స్త్రీ పక్షపాతివా అని కూడా అడుగుతున్నారన్నారు. నిజానికి అలాంటిదేమీ లేదని చెడు అనేది స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఉంటుందని నటి ఐశ్వర్యా రాజేష్ అభిప్రాయపడ్డారు. -
ఊహించని విధంగా వందల కోట్ల నష్టం.. 50 స్క్రీన్లను మూసేస్తున్న పీవీఆర్?
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 333 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 105 కోట్లకుపైగా నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 536 కోట్ల నుంచి రూ. 1,143 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో పీవీఆర్, ఐనాక్స్ విలీనమై పీవీఆర్ ఐనాక్స్‌గా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6 నుంచి విలీనం అమల్లోకి వచ్చింది. వెరసి అంతక్రితం ఏడాది క్యూ4తో తాజా ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ. 1,364 కోట్లను దాటాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం రూ. 336 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 3,751 కోట్లుగా నమోదైంది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. రెండు సంస్థలూ కలిపి గతేడాది 168 కొత్త తెరలను ఆవిష్కరించాయి. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్ఈలో 1.2 శాతం బలపడిరూ. 1,464 వద్ద ముగిసింది. 50 స్క్రీన్లను మూసేస్తున్న కాగా, మల్టీప్లెక్స్ చైన్ కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన పీవీఆర్ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
పీవీఆర్ ఐనాక్స్ భారీ విస్తరణ
లక్నో: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్ లీజర్‌ను విలీనం చేసుకున్న నేపథ్యంలో భారీ విస్తరణపై కన్నేసింది. టికెట్ ధరలు, ఆహారం, పానీయాలు, ప్రకటనలు, నిర్వహణ వ్యయాలు తదితర అంశాలలో రెండు కంపెనీల మధ్య ఏకీకరణను చేపట్టినట్లు కంపెనీ ఎండీ అజయ్ బిజిలీ తెలియజేశారు. 2023 ఫిబ్రవరి 6 నుంచి పీవీఆర్, ఐనాక్స్ విలీనం అమల్లోకి వచ్చింది. విలీనం తదుపరి వ్యయాలను తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించినట్లు అజయ్ తెలియజేశారు. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో రెండంకెల వృద్ధిని అందుకోగలమని భావిస్తున్నట్లు తాజాగా అంచనా వేశారు. విలీన కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ ఇకపై ప్రతీ ఏడాది 200 స్క్రీన్ల చొప్పున జత చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. చిన్న మార్కెట్లలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్లు అజయ్ వెల్లడించారు. పీవీఆర్ ఐనాక్స్కు ఎండీగా అజయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
సినీ ప్రియులకు బంపర్ ఆఫర్.. మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.99 కే టికెట్
మీకు అతి తక్కువ ధరకే సినిమా టికెట్ కావాలా? కేవలం వంద రూపాయల్లో సినిమా చూసేయలనుకుంటున్నారా? అది కూడా సాధారణ థియేటర్లలో కాదండోయ్. అన్ని హంగులుండే మల్టీప్లెక్స్‌ల్లో ఈ ధరకు టికెట్ అందిస్తోంది పీవీఆర్ సినిమాస్. సినీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. సినిమా ప్రేమికుల కోసం పీవీఆర్ సినిమాస్ ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈనెల 20న సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్‌లో అన్ని షోలను రూ.99 కే చూడవచ్చని ప్రకటించింది. అయితే ఈ టికెట్లకు జీఎస్టీ అదనంగా ఉండనుంది. కేవలం ఎంపిక చేసిన నగరాల్లో ఈ బంపర్ ఆఫర్ వర్తించనుంది. అయితే పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్, పఠాన్‌కోట్‌తో పాటు పుదుచ్చేరి నగరాల్లో ఉన్న పీవీఆర్ సినిమాలో ఈ ఆఫర్ వర్తించదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో టికెట్ ధర రూ.100+ జీఎస్టీతో కలిపి ఉండనుంది. మొత్తంగా తెలంగాణలో రూ.112+జీఎస్టీతో కలిపి టికెట్లు ఉండనున్నాయి. అయితే ప్రీమియం కేటగిరి సీట్స్ ఈ ఆఫర్ పరిధిలోకి రావని తెలిపింది యాజమాన్యం. మరింత సమాచారం కోసం పీవీఆర్ సినిమాస్ వెబ్సైట్ చూడాలని సూచించింది. -
ఈ ఏడాది పీవీఆర్, ఐనాక్స్ విలీనం
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ విలీనం ఈ ఏడాదిలో పూర్తికావచ్చని అజయ్ బిజిలీ తాజాగా అంచనా వేశారు. విలీనం అనంతరం సంయుక్త సంస్థ ఐదేళ్ల కాలంలో 3,000–4,000 తెరలకు చేరనున్నట్లు పీవీఆర్ చైర్మన్ అజయ్ తెలియజేశారు. గత తొమ్మిది నెలల్లో మూవీలకు తరలివచ్చే ప్రేక్షకులు పెరగడం, ఫిల్మ్ పరిశ్రమ నుంచి సినిమాల నిర్మాణం ఊపందుకోవడం వంటి అంశాలు కంపెనీకి జోష్‌నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 27న విలీనానికి పీవీఆర్, ఐనాక్స్ లీజర్ తెరతీశాయి. ఇందుకు వాటాదారులు, రుణదాతలు, స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అనుమతించాయి. జనవరి 12న సమావేశంకానున్న ఎన్సీఎల్టీసహా నియంత్రణ సంస్థల నుంచి విలీనానికి త్వరలోనే ఆమోదముద్ర లభిస్తుందని అభిప్రాయపడ్డారు. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
పీవీఆర్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నష్టాలు సగానికిపైగా తగ్గాయి. రూ. 71.5 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 153 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో ఫిల్మ్ ఎగ్జిబిషన్ బిజినెస్ ఊపందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. క్యూ2లో మొత్తం ఆదాయం సైతం రూ. 120 కోట్ల నుంచి దాదాపు రూ. 687 కోట్లకు దూసుకెళ్లింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 461 కోట్ల నుంచి భారీగా ఎగసి రూ. 813 కోట్లను తాకాయి. ఈ కాలంలో 1.8 కోట్ల మంది సినిమాలను సందర్శించగా.. టికెట్ సగటు ధరలు 11 శాతం మెరుగై రూ. 224కు చేరాయి. ఆహారం, పానీయాలపై ఒక్కో వ్యక్తి వినియోగ వ్యయం 31 శాతం పుంజుకుని రూ. 129కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
విలీనానికి పీవీఆర్ వాటాదారుల ఆమోదం
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ సేవల్లోని ఐనాక్స్ లీజర్తో విలీనానికి తమ వాటాదారులు ఆమోదం తెలిపినట్టు పీవీఆర్ ప్రకటించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పీవీఆర్ మంగళవారం తన వాటాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి ఆమోదాన్ని కోరింది. 99 శాతం విలీనానికి అనుకూలంగా ఓటు వేసినట్టు పీవీఆర్ బుధవారం ప్రకటించింది. విలీనానికి ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అనుమతులను పీవీఆర్–ఐనాక్స్ లీజర్ జూన్‌లోనే పొందాయి. ఈ ఏడాది మార్చి 27న ఈ సంస్థలు తమ విలీన ఒప్పందాన్ని ప్రకటించాయి. తద్వారా 1,500 స్క్రీన్లతో దేశంలోనే అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించనున్నట్టు తెలిపాయి. -
పీవీఆర్–ఐనాక్స్ విలీనం వాటిని దెబ్బతీస్తాయ్.. సీసీఐకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ చైన్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ విలీనం పోటీ నిబంధనలను దెబ్బతీస్తాయంటూ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) వద్ద ఫిర్యాదు దాఖలైంది. విలీనం కారణంగా సినిమా పంపిణీ పరిశ్రమలో పోటీతత్వానికి తెరపడుతుందంటూ లాభరహిత సంస్థ కన్జూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ(సీయూటీఎస్) ఆరోపించింది. ఈ అంశంపై దర్యాప్తు చేయవలసిందిగా సీసీఐను అభ్యర్థించింది. ఈ ఏడాది మార్చి 27న పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీన అంశాన్ని ప్రకటించిన విషయం విదితమే. తద్వారా దేశవ్యాప్తంగా 1,500 తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్ నెట్‌వర్క్‌కు తెరతీసేందుకు నిర్ణయించాయి. దీంతో చిన్న నగరాలు, పట్టణాలలో మరింత విస్తరించే వీలున్నట్లు తెలియజేశాయి. విలీనం తదుపరి పీవీఆర్ ఐనాక్స్‌గా ఆవిర్భవించనున్న కంపెనీ భవిష్యత్‌లో కొత్త మల్టీప్లెక్స్‌లను ఇదే బ్రాండుతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో వినియోగదారులకు అధిక టికెట్ ధరలు తదితరాల విషయంలో అవకాశాలు తగ్గిపోతాయని సీసీఐకు దాఖలు చేసిన ఫిర్యాదులో సీయూటీఎస్(కట్స్) అభిప్రాయపడింది. కాగా.. జూన్ 21న స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి డీల్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించడం గమనార్హం! చదవండి: స్టాక్ మార్కెట్: ఒక్కరోజులోనే రూ.2.94 లక్షల కోట్లు ఆవిరి.. కారణమిదే! -
మల్టీప్లెక్స్‌లలో ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తున్న పాప్ కార్న్ ధరలు!
చారాణా కోడి పిల్లకు బారాన మసాలా అంటే ఇదేనేమో. వీకెండ్ ఎంజాయ్ చేద్దామని సినిమాకెళ్తే అక్కడ రెండు సినిమాలు చూపిస్తున్నారు. ఒకటి థియేటర్లో..ఇంకోటి ఇంటర్వెల్లో. థియేటర్లలో అన్ని తరగతుల వారికి వారి స్థాయిని బట్టి టికెట్ల ధరలుంటాయి. సినిమా హాళ్ల క్యాంటీన్లలో విక్రయించే తినుబండారాలకు మాత్రం అలాంటి భేదం లేదు. సినిమాకి వెళ్తే చాలు తమకు నచ్చిన రేట్లేసి చుక్కలు చూపిస్తున్నారు. వారమంతా కష్టపడ్డ సామాన్యుడు.. కాస్తంత రిలాక్స్ అయ్యే మంత్రం సినిమా. ఇప్పుడు అదే సినిమా థియేటర్లో స్నాక్స్ రేట్లు చూసి భయపడుతున్నారు. రేట్లు తగ్గించాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో సినిమా థియేటర్లో ముఖ్యంగా పాప్కాన్ కాస్ట్లీపై పీవీఆర్ ఛైర్మన్ అండ్ మేనేజిండ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ స్పందించారు. థియేటర్లలో పెరిగిపోతున్న శ్నాక్స్ ధరల్ని వ్యతిరేకిస్తున్న వినియోగదారుల్ని నిందించలేం. అయితే, మనదేశంలో సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీఫ్లెక్స్‌ల వరకు ఫుడ్ అండ్ బేవరేజెస్(ఆహారం,కూల్ డ్రింక్స్)ధరలలో ఎటువంటి మార్పు ఉండదని బిజిలీ చెప్పారు. నిర్వహణ ఖర్చుల కోసం మల్టీప్లెక్స్‌లోని స్నాక్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. మనదేశంలో ఫుడ్ & అండ్ బేవరేజెస్ మార్కెట్ రూ.1500కోట్లుగా ఉంది. మల్టీప్లెక్స్‌లలో ఎక్కువ స్క్రీన్ల కారణంగా ప్రొజెక్షన్ రూమ్‌లు,సౌండ్ సిస్టమ్‌ల అవసరం ఎక్కువే. కాబట్టే ఖర్చులు "4 నుండి 6 రెట్లు" పెరుగుతాయని అన్నారు. ఫోయర్లు కూడా ఫుల్ ఏసీతో ఉండడంతో ఎయిర్ కండిషనింగ్ అవసరం కూడా పెరిగిందన్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో పీవీఆర్- ఐనాక్స్ మెర్జ్ అయిన విషయం తెలిసిందే. చదవండి👉ఓటీటీ దెబ్బకు ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్ల విలీనం..! -
పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ మధ్య విలీనానికి స్టాక్ ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అనుమతించాయి. రెండు ఎక్సే్ఛంజీలూ ఇందుకు నో అబ్జక్షన్ ప్రకటించినట్లు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ఇతర నియంత్రణ సంస్థల నుంచి పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీనానికి తొలుత స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు అనుమతించవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ ఏడాది మార్చి 27న రెండు సంస్థలూ విలీన అంశాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. విలీన కంపెనీ 1,500కుపైగా తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌గా ఆవిర్భవించనుంది. సంయుక్త సంస్థను పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం దూసుకెళ్లి రూ. 1,788 వద్ద నిలవగా.. ఐనాక్స్ లీజర్ 5.3 శాతం జంప్‌చేసి రూ. 482 వద్ద ముగిసింది. -
రామ్ గోపాల్ వర్మకు చేదు అనుభవం, స్పందించిన ఆర్జీవీ
Ram Gopal Varma Slams PVR, INOX: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన తాజా చిత్రం డేంజరస్ ఏప్రిల్ 8న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తన మూవీని ప్రదర్శించేందుకు పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లు అభ్యంతరం వ్యకం చేశాయి. డేంజరస్ చిత్రాన్ని తమ థియేటర్లో ప్రదర్శించబోమంటూ వర్మకు షాకిచ్చాయి. ఈ విషయాన్ని స్యయంగా ఆర్జీవీ సోషల్ మీడియా వేదిక వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. పీవీఆర్, ఐనాక్స్ డెంజరస్ సినిమాను ప్రదర్శించడానికి నిరాకరించినట్లు తెలిపాడు. అంతేకాదు ఈ మూవీ పట్ల వారు వ్యవహరించిన తీరు సుప్రీం కోర్టు తీర్పునే వ్యతిరేకించేలా ఉందన్నాడు. చదవండి: రామ్ చరణ్‌కి జోడిగా అంజలి!, ఏ సినిమాలో అంటే.. కాగా ‘నా సినిమా డేంజరస్ లెస్బియన్ కథాంశం అని దాన్ని ప్రదర్శించడానికి నిరాకరించడం సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడమే. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం ఎల్జీబీటీ(LGBT) కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. అంటే పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలు ఎల్జీబీటీని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ కమ్యూనిటీ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నా’ అంటూ వర్మ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వివాదం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. మరి వర్మ ట్వీట్‌పై పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి. కాగా ఇద్దరు యువుతుల మధ్య స్వలింగ సంపర్కం నేపథ్యంలో వర్మ డేంజరస్ చిత్రాన్ని రూపొందించాడు. చదవండి: చైతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్ -
ఆర్ఆర్ఆర్ ఎంట్రీ..పీవీఆర్‌తో కొత్త దోస్తీ..ఊహించని లాభాలు సొంతం...!
కోవిడ్-19 రాకతో గత రెండేళ్లుగా మల్టీప్లెక్స్ థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. దిగ్గజ మల్టీప్లెక్స్ సంస్థలు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. దీంతో నష్టాలనుంచి బయటపడేందుకుగాను పీవీఆర్, ఐనాక్స్ లీజర్ మల్టీప్లెక్స్ సంస్థలు విలీనానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ పీవీఆర్, ఐనాక్స్ లీజర్ కంపెనీలకు భారీగా కలిసొచ్చింది. కలిసొచ్చిన విలీనం..! పీవీఆర్, ఐనాక్స్ లీజర్ కంపెనీలు వీలినమవుతున్నట్లు ఆదివారం రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొన్నాయి. దీంతో సోమవారం రోజున ఇరు కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ షేర్లు దూసుకుపోయాయి. ఐనాక్స్ షేర్లు 20 శాతం పెరిగి రూ.563 కి చేరుకోగా..ప్రీ కోవిడ్ గరిష్టాలను అధిగమించడం గమనార్హం. ఇక పీవీఆర్ షేర్లు 10 శాతం లాభపడి రూ. 2010. 34 మేర పెరిగాయి. వీలిన ప్రక్రియలో భాగంగా ఐనాక్స్ షేర్ హోల్డర్స్ పది ఐనాక్స్ షేర్లకు పీవీఆర్ మూడు షేర్లు దక్కనున్నాయి. ఆర్ఆర్ఆర్ ఎంట్రీతో.. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మల్టీప్లెక్స్ థియేటర్లకు బాగా కలిసొచ్చింది. పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ షేర్లు రెండేళ్ల గరిష్టాలకు చేరాయి. ఆర్ఆర్ఆర్ మూవీ మల్టీప్లెక్స్ సంస్థలకు ఫుల్ జోష్‌ను నింపింది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో విదేశీ కంపెనీ..! -
ఓటీటీ దెబ్బకు ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్ల విలీనం..!
భారత్‌లోని అతిపెద్ద మల్టీప్లెక్స్ బ్రాండ్స్ పీవీఆర్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ సంస్థలు పూర్తిగా వీలినమయ్యాయి. కంపెనీల వీలినాన్ని డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని పీవీఆర్ లిమిటెడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఐనాక్స్ బోర్డు కూడా విలీనాన్ని ఆమోదించింది. మల్టీప్లెక్స్ సంస్థల్లో ఇరు కంపెనీల వీలినం అతి పెద్ద డీల్‌గా నిలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఎగ్జిబిషన్ కంపెనీగా పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ అవతరించనుంది. విలీనానంతర సంస్థకు పీవీఆర్ సీఎండీ అజయ్ బిజ్లీ ఎండీగా కొనసాగనున్నారు. ఇదే సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఐనాక్స్ గ్రూప్ ఛైర్మన్ పవన్ కుమార్ జైన్ బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, సిద్థార్థ్ జైన్ నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఎక్సేంజీలకు ఇరు సంస్థలు వెల్లడించాయి. వీలినంలో భాగంగా ఐనాక్స్ షేర్ హోల్డర్లందరికీ పీవీఆర్ షేర్లు లభించనున్నాయి. కాగా ఈ వీలినానికి ఎక్సేచేంజ్లు, సెబీ, సీసీఐ నుంచి అనుమతి రావాల్సి ఉంది. కొత్తగా ఏర్పడే సంస్థలో పీవీఆర్ ప్రమోటర్లకు 10.62 శాతం వాటా, ఐనాక్స్ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా లభించనుంది. దేశవ్యాప్తంగా పీవీఆర్‌కు 73 పట్టణాల్లోని 181 ప్రాంతాల్లో 871 స్క్రీన్స్ ఉన్నాయి. ఐనాక్స్కు 72 పట్టణాల్లోని 160 ప్రాంతాల్లో 675 తెరలున్నాయి. ఓటీటీ కారణం.. కోవిడ్-19 రాకతో థియేటర్లు భారీ నష్టాలను చవిచూశాయి. థియేటర్లు పూర్తిగా మూసివేయడంతో సినీ నిర్మాతలు అమెజాన్ ప్రైం, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హట్‌స్టార్ వంటి ఓటీటీ సంస్థల తలుపులను తట్టారు. అదే స్థాయిలో ఓటీటీ సంస్థలు కూడా సినిమాలకు భారీ మొత్తంలోనే డబ్బులను చెల్లించాయి. దీంతో థియేటర్ల మనుగడకు భారంగా మారింది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. నష్టాలను పూడ్చుకోవడానికి థియేటర్ల యాజమాన్యం ఫంక్షన్ హాల్స్గా మార్చేశారు. ఓటీటీ సంస్థల నుంచి వీపరితమైన పోటీ రావడంతో ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్లు పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి దారి తీసినట్లు తెలుస్తోంది. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్...తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్..! -
ఆర్ఆర్ఆర్ మేనియా...అప్పుడెమో థియేటర్ల పేరు..ఇప్పుడు సరికొత్తగా..
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇక ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో మార్చి 25న రిలీజ్‌కానున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా భారత్‌లోని అతిపెద్ద థియేట్రికల్ ఎగ్జిబిటర్ పీవీఆర్ తొలిసారిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్‌చైయిన్ టెక్నాలజీను అందిపుచ్చుకుంది. ఆర్ఆర్ఆర్ ఎన్ఎఫ్టీ..! తొలిసారిగా భారతీయ సినీ ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ మూవీ ఎన్ఎఫ్టీ(నాన్ ఫంజిబుల్ టోకెన్స్) కలెక్షన్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పీవీఆర్ ప్రకటించింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్, పీవీఆర్ సంయుక్తంగా ఈ డిజిటల్ ఎన్ఎఫ్టీలను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనుంది. ఎస్ఎస్ రాజమాళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అలియా భట్ సంతకం చేసిన పోస్టర్లు, సినిమాలో వాడిన పలు వస్తువులతో సహా దాదాపు 300పైగా ఎన్ఎఫ్టీలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ డిజిటల్ కలెక్షన్లను పీవీఆర్ నిర్వహించే పోటిలో వీటిని ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చునని పీవీఆర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా పాత చిత్రాలను కూడా ఎన్ఎఫ్టీ కలెక్షన్ల రూపంలో అందించేందుకు సిద్దమని పీవీఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజిలీ చెప్పారు. పీవీ‘ఆర్ఆర్ఆర్’..! గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో అతి పెద్ద మల్టీప్లెక్స్ చైన్ సిస్టమ్ పీవీఆర్ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. పీవీఆర్ సినిమాస్‌కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‌ల పేరు PVRRR గా మార్చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలయ్యే వరకు PVR సినిమాస్ PVRRR గా కనిపిస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ సినిమా హిస్టరీ ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇలాంటి డీల్ ను సెట్ చేయలేదు. చదవండి: టిక్కెట్ రేట్ల పెంపే కాదు ఆర్ఆర్ఆర్ టీమ్‌కి మరో శుభవార్త! -
నవంబర్ 5న జియో వరల్డ్ డ్రైవ్ ప్రారంభం!
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ప్రీమియం రిటైల్ షాపింగ్ మాల్ జియో వరల్డ్ డ్రైవ్(JWD)ను ఆవిష్కరించింది. ముంబైలోని వాణిజ్య కేంద్రమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. మేకర్ మాక్సిటీ వద్ద 17.5 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. జియో వరల్డ్ డ్రైవ్ ముంబైలో సరికొత్త ఆవిష్కరణ అని చెప్పొచ్చు. ఈ ప్రాంగణంలో 72 ప్రముఖ అంతర్జాతీయ, భారతీయ బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాపులరైన 27 ఫుడ్ ఔట్లెట్స్ ఉన్నాయి. ఇది ముంబైలోని తొలి మొదటి అంతస్థులో ఉండే డ్రైవ్ ఇన్ థియేటర్. ఇది ఓపెన్ ఎయిర్ వీకెంట్ కమ్యూనిటీ మార్కెట్. భారతదేశంలో అత్యుత్తమ గ్లోబల్ సౌకర్యాలను కల్పించాలని, భారతదేశంలోని అత్యుత్తమమైన వాటిని ప్రపంచానికి ప్రదర్శించాలనే దృక్పథంతో దీనిని రూపొందించారు. ఈ ప్రాంగణం భారతీయ, అంతర్జాతీయ ప్రజల అత్యంత విభిన్న కళలను గుర్తు చేస్తుంది. ప్రఖ్యాత కళాకారులు, వినియోగదారులను సృజనాత్మకత, కళాత్మక దృశ్యమాన చట్రంలో కనువిందు చేస్తున్నాయి. ముంబై స్ఫూర్తిని, ఇక్కడి అనేక విచిత్రాలను హైలైట్ చేసే వ్యక్తీకరణలు కూడా ఇక్కడ ఉంటాయి. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్-ఎయిర్ రూఫ్‌టాప్ థియేటర్ జియో వరల్డ్ డ్రైవ్(JWD)ను నవంబర్ 5న తెరవనున్నారు. (చదవండి: దేశీయ ఈవీ మార్కెట్లో చైనా కారు విడుదల.. రేంజ్ ఎంతో తెలుసా?) పీవీఆర్ నిర్వహిస్తున్న జియో డ్రైవ్-ఇన్ 290 కార్లతో పట్టణంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను కలిగి ఉంది. తమ స్వంత కారులో కూర్చొని సినిమాలు చూడవచ్చు. కొత్త కాన్సెప్ట్ 6 అత్యాధునిక మల్టీప్లెక్స్ థియేటర్లు, ప్రివ్యూతో ప్రారంభించబడింది. వీఐపీలకు, అతిథులకు థియేటర్లో ప్రత్యేక ప్రవేశం ఉంటుంది. హోమ్ డెకర్ బెహెమోత్- వెస్ట్ ఎల్మ్, హామ్లీస్ గ్లోబల్-ఫస్ట్ కాన్సెప్ట్ స్టోర్ హామ్లీస్ ప్లే కూడా ఇక్కడ ఉంటుందని తెలిపారు. దీన్ని ప్రఖ్యాత ఆర్కిటెక్ డిజైనర్లు రాస్ బోన్థోర్న్, ఆండీ లాంపార్డ్ డిజైన్ చేశారు. జియో వరల్డ్ డ్రైవ్ ముఖభాగం ఫ్రెంచ్ కాన్సెప్ట్ న్యూజ్, ఇది క్లౌడ్ లాంటి నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ విస్తరించిన స్కైలైట్‌తో హై స్ట్రీట్ అనుభవం లభిస్తుంది. -
‘వ్యాక్సిన్ ఆఫర్’.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ !
దేశవ్యాప్తంగా తమ సినియా థియేటర్లు, మల్టీప్లెక్సులు జులై 30 నుంచి తెరుచుకుంటాయని మల్టీప్టెక్స్ చైన్ పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్స్‌కి వచ్చే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘జాబ్ ఆఫర్’ను ప్రకటించింది. బొమ్మపడింది దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో క్రమంగా సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీగా తెరుచుకునేందుకు ఉత్సాహంగా ఉండగా కోవిడ నిబంధనల కారణంగా మల్టీప్లెక్స్‌లు కొంచెం తటపటాయిస్తున్నాయి. అయితే వందశాతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఆధీనంలో ఉన్న మల్టీప్లెక్సులు జులై 30 నుంచి ఓపెన్ చేశామని పీవీఆర్ ప్రకటించింది. అందరికీ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను వంద శాతం తప్పక పాటిస్తామని పీవీఆర్ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్సులలో పని చేసే సిబ్బంది అందరికీ కో\విడ్ వ్యాక్సిన్ అందించామని తెలిపింది. ప్రేక్షకులు ఎటువంటి సందేహాలు లేకుండా సినిమాలను ఎంజాయ్ చేయవచ్చని చెప్పండి వ్యాక్సిన్ ఆఫర్ మల్టీప్లెక్సుల ఓపెనింగ్ సందర్భంగా వ్యాక్సిన్ ఆఫర్‌ని ప్రకటిచింది పీవీఆర్ సినిమాస్. వ్యాక్సిన్ తీసుకుని పీవీఆర్ సినిమాస్‌కి వచ్చిన వారికి ఎంపిక చేసిన కంటెంట్ (సినిమా)పై ఒక టికెట్‌ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు ఫుడ్ అండ్ బేవరేజెస్ సెక్షన్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్ మల్టీప్లెక్సులు ఓపెన్ చేసిన ఒక వారం పాటు అమల్లో ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఎంపిక చేసిన కంటెంట్ ఏమిటనే దానిపై కచ్చితమైన వివరణ ఇవ్వలేదు. ఆయా మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించే సినిమాలు, ఇతర కంటెంట్‌ను బట్టి ఇది మారే అవకాశం ఉంది. -
పీవీఆర్‌కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం రూ. 289 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 74.5 కోట్ల నష్టమే నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 662 కోట్ల నుంచి రూ. 263 కోట్లకు క్షీణించింది. కాగా.. కోవిడ్–19 కట్టడికి లాక్డౌన్ల అమలు, సామాజిక దూరం, కంటెంట్ తగ్గడం వంటి పలు ప్రతికూల అంశాలు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపినట్లు పీవీఆర్ పేర్కొంది. వెరసి ఫలితాలను అంతక్రితం ఏడాది పనితీరుతో పోల్చి చూడతగదని తెలియజేసింది. మల్టీప్లెక్స్ పరిశ్రమకు గత ఆర్థిక సంవత్సరం అత్యంత గడ్డుకాలమని వ్యాఖ్యానించింది. అయితే ఫిక్స్డ్ వ్యయాల తగ్గింపు, తగినంత లిక్విడిటీ వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలియజేసింది. క్యూ4లో హాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రాధాన్యతగల సినిమాలు విడుదలకాలేదని ప్రస్తావించింది. దక్షిణాదిలో కీలక సినిమాల కారణంగా రికవరీ కనిపించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 1,319 వద్ద ముగిసింది. -
బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు జరిమానా
సాక్షి, హైదరాబాద్: టికెట్ ధర కన్నా అధిక రుసుము వసూలు చేసిన బుక్‌మైషో, పీవీఆర్ సినిమాలపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కొరడా ఝుళిపించింది. ఇంటర్నెట్ చార్జీల పేరుతో అధికంగా డబ్బులు గుంజడాన్ని సవాలు చేస్తూ విజయ్ గోపాల్ అనే వ్యక్తి వినియోగదారుల ఫోరంలో గతేడాది ఫిర్యాదు చేశాడు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు సుమారు 25 నెలల తర్వాత తుది తీర్పు వెలువరించింది. ఇంటర్నెట్ చార్జీల పేరిట పై రెండూ ప్రేక్షకుడి నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించింది. దీంతో బుక్‌మైషో, పీవీఆర్ సినిమాస్ బాధితుడికి 25 వేల రూపాయల నష్టపరిహారంతో పాటు కేసు ఖర్చుల కింద మరో 1000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. లీగల్ ఎయిడ్ కింద కోర్టుకు రూ.5 వేలు కట్టాలని తీర్పు చెప్పింది. చదవండి: స్క్రీన్ షాట్లు షేర్ చేసినందుకు చాలా సంతోషం: నాగ్ మహేశ్‌బాబు సరసన జాన్వీ కపూర్! -
నేడే చూడండి టికెట్ కేవలం 50 రూపాయిలే
కోవిడ్ వల్ల థియేటర్స్ వైపుకు రావట్లేదు ప్రేక్షకులు. వాళ్లందరూ మళ్లీ థియేటర్స్ బాట పట్టాలంటే ఏదో బలమైన ఆకర్షణ ఉండాలి. మంచి సినిమా ఉండాలి. బంఫర్ ఆఫర్ ఉండాలి. వీటన్నింటినీ కలిపి ఇవ్వడానికి ప్లాన్ సిద్ధం చేశాయి ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్, పలు మల్టీప్లెక్స్ చైన్లు. ఆ విశేషాలు. యశ్‌రాజ్ సంస్థ నిర్మాణంలోకి వచ్చి 50 ఏళ్లయింది. యాభై ఏళ్లుగా ఎన్నో విజయవంతమైన, సంచలనమైన సినిమాలను అందిస్తూ వస్తోంది. 50ఏళ్ల ప్రయాణం సందర్భంగా పలు భారీ సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా ఓ కొత్త ఆలోచనతో యశ్‌రాజ్ ముందుకు వచ్చింది. ఇన్నేళ్లుగా తమ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ఏదైనా ఇవ్వాలనుకుంది. తమ సూపర్ హిట్ సినిమాలను మళ్లీ ఆనందించేలా చేయాలనుకుంది. కోవిడ్ వల్ల మర్చిపోయిన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను తిరిగి రుచి చూపించాలనుకుంది. అది కూడా తక్కువ ధరకే. యశ్‌రాజ్ సంస్థ నిర్మించిన సూపర్ హిట్ సినిమాల్లో కొన్నింటిని దీపావళి సందర్భంగా మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్ 12 నుంచి 19 వరకూ ఈ సినిమాలను పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్ మల్టీప్లెక్స్‌లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. టికెట్ ధర జస్ట్ 50 రూపాయిలే. మరి.. ప్రేక్షకులను తిరిగి థియేటర్స్‌కు తీసుకురావడానికి ఈ ప్రయత్నం ఎంత వరకూ సఫలం అవుతుందో చూడాలి. రండీ.. ఆనందించండీ ‘సినిమా విడుదలకు మంచి సీజన్ దీపావళి. పండగకి సినిమాను ఆనందించడం సినీ ప్రేమికులకు ఇష్టమైన ఆనవాయితీ. యశ్‌రాజ్ సంస్థ ప్రేక్షకుల ఫేవరెట్ సినిమాలను మళ్లీ పెద్ద స్క్రీన్ మీద ఎంజాయ్ చేసే వీలు కల్పించడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్ మల్టీప్లెక్స్ ప్రతినిధులు. ప్రదర్శితం కానున్న చిత్రాలు యశ్‌రాజ్ నుంచి వచ్చిన చిత్రాల్లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ ఓ క్లాసిక్. ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో పాటు కభీ కభీ, సిల్సిలా, దిల్ తో పాగల్ హై, వీర్ జరా, బంటీ ఔర్ బబ్లీ, రబ్నే బనాదీ జోడీ, ఏక్‌థా టైగర్, బ్యాండ్ బాజా భారాత్, సుల్తాన్, వార్, మర్దానీ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. -
పీవీఆర్, ఐనాక్స్ లీజర్.. లాభాల షో
కంటెయిన్మెంట్ జోన్లలో మినహాయించి ఈ నెల 15 నుంచీ సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం వరకూ సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను నిర్వహించుకునేందుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా అనుమతించింది. దీంతో దేశవ్యాప్తంగా సినిమాల ప్రదర్శనకు వీలు కలగనుండటంతో మల్టీప్లెక్స్ నిర్వాహక కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లిస్టెడ్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హుషారుగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీవీఆర్ 9 శాతం జంప్‌చేసి రూ. 1,319 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 15 శాతం దూసుకెళ్లింది. గరిష్టంగా రూ. 1,395ను తాకింది. ఇక ఐనాక్స్ లీజర్ సైతం ఇంట్రాడేలో 17 శాతం దూసుకెళ్లింది. రూ. 318కు చేరింది. ప్రస్తుతం 7.2 శాతం లాభపడి రూ. 290 వద్ద ట్రేడవుతోంది. సినిమా థియేటర్ల ప్రారంభానికి కేంద్రం అనుమతించినప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. మహారాష్ట్ర, తమిళనాడులలో సినిమా హాళ్లు అక్టోబర్ నెలలోనూ తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించకపోవడం గమనార్హం! -
రైట్స్‌తో పీవీఆర్- బైబ్యాక్‌తో ఎంపీఎస్.. స్పీడ్
నిధుల సమీకరణకు చేపట్టిన రైట్స్ ఇష్యూ ఓవర్ సబ్స్క్రయిబ్ అయిన వార్తలతో మల్టీప్లెక్స్ చైన్ కంపెనీ పీవీఆర్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో పబ్లిషింగ్ సొల్యూషన్స్ అందించే ఎంపీఎస్ లిమిటెడ్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. పీవీఆర్ లిమిటెడ్ గత నెల 17-31 మధ్య చేపట్టిన రైట్స్ ఇష్యూకి 2.24 రెట్లు అధికంగా స్పందన లభించినట్లు పీవీఆర్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. షేరుకి రూ. 784 ధరలో నిర్వహించిన రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్లు సమీకరించినట్లు తెలియజేసింది. రైట్స్‌లో ఆఫర్ చేసిన 38.23 కోట్ల షేర్లకుగాను 85.29 లక్షల షేర్ల కోసం దరఖాస్తులు లభించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో 6.4 శాతం జంప్‌చేసి రూ. 1,194 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1,229 వరకూ ఎగసింది. ఎంపీఎస్ లిమిటెడ్ ఒక్కో షేరు రూ. 600 ధర మించకుండా బైబ్యాక్ చేపట్టేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఎంపీఎస్ లిమిటెడ్ తెలియజేసింది. కంపెనీ ఈక్విటీలో 3.04 శాతం వాటాకు సమానమైన దాదాపు 5.67 లక్షల షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు రూ. 34 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. పబ్లిషింగ్ సంబంధ సొల్యూషన్లు అందించే కంపెనీలో ప్రమోటర్ల వాటా జూన్‌కల్లా 67.77 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 415 సమీపంలో ఫ్రీజయ్యింది. -
మళ్లీ మల్టీప్లెక్స్‌ల జోరు- పీవీఆర్, ఐనాక్స్ హవా
కరోనా వైరస్ కట్టడికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి లాక్డవున్లు ప్రకటించాక డీలాపడిన మల్టీప్లెక్స్ కౌంటర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లిస్టెడ్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ జోరందుకున్నాయి. నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. అన్‌లాక్-3లో భాగంగా కొన్ని సినిమా థియేటర్లను ఆగస్ట్ 1 నుంచి తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించనుందన్న వార్తలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. జోరుగా.. దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్‌ల చైన్ కలిగిన పీవీఆర్ లిమిటెడ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 1,147 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 6.3 శాతం ఎగసి రూ. 1,172ను తాకింది. ఇక ఐనాక్స్ లీజర్ మరింత అధికంగా 8 శాతం దూసుకెళ్లి రూ. 259 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో దాదాపు 12 శాతం పురోగమించి రూ. 268కు చేరింది. అన్‌లాక్-3లో దేశవ్యాప్తంగా పలు సినిమా థియేటర్లను తిరిగి ఆగస్ట్ 1 నుంచి ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించనుందన్న వార్తలతో ఐనాక్స్ కౌంటర్లో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా ఎగసింది. మధ్యాహ్నానికల్లా బీఎస్ఈలో 2.6 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 35,000 షేర్లు మాత్రమేకావడం గమనార్హం! -
మల్టీప్లెక్స్ షేర్ల పతనం- పీవీఆర్ నుంచి రైట్స్!
దేశీయ మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్.. నిధుల సమీకరణ బాటపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రైట్స్ ఇష్యూని చేపట్టే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. పీవీఆర్ సినిమాస్ పేరుతో దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ నిర్వహిస్తున్న కంపెనీ లాక్‌డవున్ కారణంగా ఇటీవల సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్లు సమీకరించేందుకు పీవీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే యాక్సిస్ కేపిటల్‌ను మర్చంట్ బ్యాంకర్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. 845 తెరలతో పీవీఆర్ లిమిటెడ్ చేపట్టదలచిన రైట్స్ ఇష్యూలో ప్రమోటర్లతోపాటు ఇప్పటికే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన పీఈ దిగ్గజాలు వార్బర్గ్ పింకస్, మల్టీపుల్స్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్మెంట్ సైతం పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి డేటాబేస్ ప్రకారం పీవీఆర్ లిమిటెడ్‌లో ప్రమోటర్ల వాటా 18.54 శాతంకాగా.. వార్బర్గ్ పింకస్ 12.74 శాతం, మల్టిపుల్స్ ఏఏఎం 11.17 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా పీవీఆర్ 176 ఆస్తులను కలిగి ఉంది. తద్వారా 845 తెరల(స్ర్కీన్స్)ను నిర్వహిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో కంపెనీ క్విప్ ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకుంది. లాక్‌డవున్ కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు, మాల్స్ మార్చి నుంచి తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో మల్టీప్లెక్స్ రంగంలో ఆదాయాలకు గండి పడింది. మరోపక్క మూవీ నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సినిమాలను విడుదల చేసే ప్రణాళికలు వేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఓటీటీ ద్వారా కాకుండా నేరుగా థియేటర్లలో తొలిసారి విడుదల చేసే సినిమాలను మాత్రమే ప్రదర్శించాలని పీవీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. షేర్లు డీలా కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఇటీవల స్టాక్ మార్కెట్లలో లిస్టయిన మల్టీప్లెక్స్ కంపెనీలు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వెరసి గత మూడు నెలల్లో పీవీఆర్ షేరు 57 శాతం పతనంకాగా.. ప్రత్యర్ధి కంపెనీ ఐనాక్స్ లీజర్ షేరు సైతం 55 శాతం దిగజారింది. కాగా.. జులైకల్లా తిరిగి మల్టీప్లెక్స్‌ల కార్యకలాపాలు ప్రారంభంకాగలవని పీవీఆర్ భావిస్తోంది. ఆగస్ట్ రెండో వారం నుంచీ బిజినెస్ పుంజుకోగలదని ఆశిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీవీఆర్ షేరు 2 శాతం క్షీణించి రూ. 864 వద్ద ట్రేడవుతోంది. ఈ ఫిబ్రవరి 25న రూ. 2125 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇక రూ. 512 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన ఐనాక్స్ లీజర్ ప్రస్తుతం 2 శాతం నీరసించి రూ. 212 వద్ద ట్రేడవుతోంది. -
నలుగురు సినీ ప్రేక్షకులపై కేసు
బెంగళూరు: సినిమాహాల్లో జాతీయగీతం ప్రదర్శించినప్పుడు కుర్చీల్లోంచి లేచి నిలబడలేదన్న కారణంతో నలుగురిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పదిహేను రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబరు 23న బెంగళూరులోని పీవీఆర్ ఓరియన్ సినిమాహాల్లో ప్రదర్శితమవుతోన్న తమిళ సినిమా ‘అసురన్’కు వచ్చిన ప్రేక్షకుల్లో నలుగురు సినిమాకు ముందుగా జాతీయగీతం ‘జనగణమన’ను ప్రదర్శించినప్పుడు లేచి నిలబడలేదు. దీంతో ఓ వ్యక్తి వారిని వీడియో తీశాడు. ఈ వీడియోను సినీ నటి బీవీ ఐశ్వర్య సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఆ నలుగురు వ్యక్తులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే, వారి పేర్లను అందులో పేర్కొనలేదు. -
పీవీఆర్ రూ.750 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ థియేటర్ చెయిన్‌ను నిర్వహిస్తున్న పీవీఆర్ సంస్థ రూ.750 కోట్లు సమీకరించనుంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు (క్యూఐబీ) షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరించనున్నామని పీవీఆర్ తెలిపింది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని, ఈ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరుతున్నామని వివరించింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 29 మధ్యలో వాటాదారులు ఈ ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని, ఓటింగ్ ఫలితాలను వచ్చే నెల 30న వెల్లడిస్తామని తెలియజేసింది. ఈ నిధులను పెట్టుబడుల అవసరాలకు, ఇతర కంపెనీల కొనుగోళ్లకు, రుణ భారం తగ్గించుకోవడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్పీఐ సినిమాస్‌లో 71.69 శాతం వాటాను పీవీఆర్ రూ.633 కోట్లకు కొనుగోలు చేసింది. 2016లో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నుంచి డీటీ సినిమాస్‌ను రూ.433 కోట్లకు చేజిక్కించుకుంది. రూ.750 కోట్ల నిధుల సమీకరణ నేపథ్యంలో బీఎస్ఈలో పీవీఆర్ షేర్ 0.5 శాతం లాభంతో రూ.1,585 వద్ద ముగిసింది. -
‘అవి ఎప్పటికీ సత్యం థియేటర్లే’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ భారత దేశంలో ‘ఎస్పీఐ సినిమాస్’ హాళ్లను ‘పీవీఆర్ సినిమాస్’ కొనుగోలు చేసిందనే వార్త సోషల్ మీడియాలో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సత్యం సినిమా హాళ్లతో మాకున్న అనుబంధాన్ని, తీపి గుర్తులను ఎలా మరచిపోయేది?’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీఐ సినిమాస్‌ను సాధారణంగా సత్యం సినిమాస్‌గా వ్యవహరిస్తారు. వెన్న చిలకరించిన వివిధ ఫ్లేవర్ల పాప్‌కార్న్ ఇక తినే భాగ్యం లేదా ? అంటూ ఎక్కువ మంది బాధ పడుతున్నారు. ఈ సత్యం థియేటర్లలో పాప్‌కార్న్ చాలా పాపులర్. అది అత్యంత రుచికరంగా ఉంటుంది. అది అమెరికాలోని ఓ రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో పండిస్తున్న అధికోత్పత్తి రకం పాప్‌కార్న్ కావడం వల్ల అది ఎంతో రుచిగా ఉంటుందని ఎస్పీఐ సినిమాస్‌లోని ‘ఎక్స్పీరియన్నెస్ విభాగం’ అధ్యక్షుడు భవేశ్ షా తెలిపారు. భారత్‌లో దొరికే పాప్‌కార్న్ తక్కువ దిగుబడినిచ్చే వంగడం నుంచి వచ్చేదని, ఇది లావుగా ఉండి, కాస్త గట్టిగా ఉంటుందని ఆయన చెప్పారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పాప్‌కార్న్ కాస్త సన్నగా, మృదువుగా ఉండి ఎంతో రుచిగా ఉంటుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబైలోని ఎస్పీఐ సినిమాస్‌లో 71.7 శాతం వాటాను అంటే, 222,711 ఈక్విటీ వాటాను 633 కోట్ల రూపాయలను చెల్లించి కొనుగోలు చేసినట్లు దేశంలోనే అతిపెద్ద సినిమా థియేటర్ల చైన్‌ను కలిగిన పీవీఆర్ సినిమాస్ ఆదివారం నాడు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో దేశంలోని 60 నగరాల్లో పీవీఆర్‌కు సినిమా హాళ్ల సంఖ్య 703కు చేరుకుంది. ఎస్పీఐ సినిమాస్ వ్యవస్థాపకులైన కిరణ్ ఎం రెడ్డి, స్వరూప్ రెడ్డిలు తమ వ్యాపారంతో కొనసాగుతారని పీవీర్ యాజమాన్యం వెల్లడించింది. ఈ విక్రయంపై ట్విట్టర్ వినియోగదారులు తమదైన శైలిలో స్పందించారు. ‘ఇది విచారకరమైన వార్త. చెన్నై వాసులకు సత్యం ఒక ఆత్మ, ఒక అనుభూతి... మీరు మీ థియేటర్లను ఎవరికైనా అమ్ముకోండి. వారు వాటికి ఏ పేరైనా పెట్టుకోనియ్యండి, మా దృష్టిలో మాత్రం అవి ఎప్పటికీ సత్యం థియేటర్లే... పీవీఆర్ అనేది ఓ పేరు మాత్రమే. సత్యం అన్నది మా భావోద్వేగం’ అంటూ కొందరు స్పందించగా ఎక్కువ మంది ‘మా పాప్ కార్న్ జోలికి రాకండి’ అంటూ అది అలాగే కొనసాగాలని ఎక్కువ మంది కోరుకున్నారు. వారి కోరిక మేరకు సత్యం సినిమా హాళ్లలో పాత ఫుడ్ చైన్‌ను అలాగే కొనసాగిస్తామని పీవీఆర్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నితిన్ సూద్ స్పష్టం చేశారు. -
గోల్ ‘మాల్స్’పై కొరడా.!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్టీప్లెక్స్, థియేటర్ల చేతివాటంపై తూనికల కొలుతల శాఖ కన్నెర చేసింది. మల్టీప్లెక్స్, థియేటర్లలో ప్యాకేజ్డ్ కమోడిటీస్ చట్టం (ఎమ్మార్పీ) అమలు ఉల్లంఘనపై గురువారం ‘సాక్షి’ దిన పత్రికలో ‘ఆగని గోల్ మాల్స్’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై తూనికలు, కొలుతల శాఖ స్పం దించింది. ఎంఆర్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్న పలు మల్టీప్లెక్స్‌లపై గురువారం మూకు మ్మడి దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి ంది. నగరంలోని 20 మల్టీప్లెక్స్‌లపై తూనికలు, కొలుతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్లు భాస్కర్‌రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయసారథి, నిర్మల్ కుమార్, రాజేశ్వర్, శివానంద్ ఆధ్వర్యంలో సుమా రు 30 మందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలు పాటించకుండా వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న 18 మల్టీప్లెక్స్‌లలో 54 కేసులు నమోదు చేశాయి. కేసులు నమోదైన మాల్స్ ఇవే... ఈ సందర్భంగా అధికారులు ఐమాక్స్, పీవీఆర్ గెలీలియో, పీవీఆర్ ఐకాన్ మాదాపూర్, జీవీకే వన్ బంజారాహిల్స్, బిగ్ సినిమా కాచిగూడ, మహాలక్ష్మి కొత్తపేట, బీబీకే మల్టీప్లెక్స్ ఎల్బీనగర్, ఏషియన్ సినిమా స్క్వైర్ ఉప్పల్, ఏషియన్ రాధిక ఈసీఐఎల్, సినీపోలీస్ మల్కాజిగిరి, తాళ్లూరి ఈసీఐఎల్, స్పెషల్ సినిమా ప్రై.లి. మల్లాపూర్, ఏషియన్ ముకుంద మేడ్చల్, ఏషియన్ సినీ ప్లాంట్ కొంపల్లి, సుజనా ఫోరం మాల్ కూకట్పల్లి, మంజీరా మాల్ జేఎన్‌టియూ, సినీపోలీస్, శంషాబాద్, ఏషియన్ సినిమా టౌన్, మియాపూర్ మల్టీప్లెక్స్‌లపై కేసులు నమోదు చేశారు. కూకట్‌పల్లిలో ఇలా... సుజనా ఫోరం మాల్లోని పీవీఆర్ సినిమాలో తనిఖీలు నిర్వహించిన అధికారులు కూల్ డ్రింక్స్ కప్‌లపై లార్జ్, స్మాల్ అనే సంకేతాలు తప్ప ఎంత పరిమాణం(లీటర్లలో) పేర్కొన లేదని గుర్తించారు. పీవీఆర్ మఖానా ప్యాక్‌పై కస్టమర్ కేర్‌కు సంబంధించిన సమాచారం లేదు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఎమ్మార్పీ ధరల అమలుకు సంబంధించి జారీచేస్తున్న బిల్లులను సైతం సరిపోల్చుకున్నారు. మంజీ రా ట్రినిటీ మాల్లో గల సినీపోలీస్లోనూ తినుబండారాల విక్రయ కేంద్రా ల వద్ద సరైన సమాచారం లేకపోవడం, పాప్‌కార్న్ ప్యాక్‌లు, కూల్ డ్రింక్ కప్‌లపై పరిమాణం తెలిపే వివరాలు లేకపోవడాన్ని గుర్తించా రు. వేయింగ్ మెషిన్లపై అధికారిక ముద్ర, సీల్ లేకపోవడాన్ని గుర్తించి మూడు కేసులు నమోదు చేశారు. కొత్తపేటలోని మహాలక్ష్మీ, మిరాజ్ సినిమా మల్టీప్లెక్స్ హాళ్లను తనిఖీ చేసిన అధికారులు మహాలక్ష్మీ థియేటర్ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేశారు. కాచిగూడలో.. సుల్తాన్‌బజార్: కాచిగూడ క్రాస్‌రోడ్స్‌లోని ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లో సమోసాలు, పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ ధరలను చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అధిక ధరలకు విక్రయిస్తున్న పాప్‌కార్న్ ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసు కుని నోటీసులు జారీ చేశారు. అదే విధంగా ఏఎస్‌రావునగర్‌లోని ఆసియా సినిమా(రాధిక మల్టీప్లెక్స్), తాళూరి ధియేటర్ల క్యాంటిన్లలో నిబ ంధనలకు విరుద్దంగా తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తుండటమేగాక నిర్ణీత పరిమాణానికి తక్కువగా తినుబండరాలను, కూల్‌డ్రింకులను వి క్రయిస్తున్నట్లు గుర్తించి మూడు కేసులు నమోదు చేశారు. మాల్స్‌లో బిల్లింగ్ మెషిన్లు సీజ్ తూనికలు, కొలతల శాఖ అధికారులు మాల్కాజిగిరి సినీపోలీస్, ఐమాక్స్ ప్రసాద్, తాళ్లూరి, స్పెషల్ సినిమాక్స్, ఐనాక్స్ కాచిగూడ, శంషాబాద్ సినీపోలీస్ మల్టీప్లెక్స్‌లలో బిల్లింగ్ మెషిన్లు సీజ్ చేశారు. ధరల పట్టికల ఏర్పాటు... చిక్కడపల్లి: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి, సుదర్శ న్ థియేటర్లో ధరల సూచిక బోర్డు చేశారు. సూచిక బోర్డు కింద తూనికలు కొలతల శాఖకు ఫిర్యాదు చేయాల్సిన నంబర్లను సైతం అందుబాటులో ఉంటారు. టోల్ ఫ్రీ నంబర్ 1800450033, వాట్సప్ నంబర్ 7330774444 నంబర్లు అందుబాటులో ఉంచారు. ప్రధానంగా సినిమా హాల్స్, మల్టీఫ్లెక్స్‌లలో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తూనికల కొలతల శాఖకు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో శాఖ అదేశాల మేరకు థియేటర్ యాజ మానులు స్పందించి సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. -
సినిమారంగ షేర్లకు జీఎస్టీ షాక్
ముంబై: ఎన్డీఏ సర్కారు ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్టీలో వివిధ పన్నులు దాదాపు ఖరారయ్యాయి. దీంతో ఈ ప్రభావం స్టాక్‌మార్కెట్లలో వివిధ రంగాలపై బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ లాంటి సెక్టార్లు దూకుడును ప్రదర్శిస్తుండగా, సినిమాలపై అంచనాల కంటే అధికంగా పన్ను రేట్లు ఖరారు కావడంతో సోమవారం స్టాక్‌మార్కెట్లలో సినిమాకు సంబంధించిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. పీవీఆర్, ఐనాక్స్ లీజర్ వంటి వినోద రంగ షేర్లు కుదేలయ్యాయి. జీఎస్టీ పరిధిల్లో పన్నుల శ్లాబులో 18 శాతం పన్ను ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేశారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ 28 శాతం పన్ను రేటును ఖరారు చేసినట్టు శుక్రవారం ఆర్థికమంత్రి అరుణ జైట్లీ ప్రకటించారు. దీంతో పీవీఆర్ షేర్ నెల రోజుల వ్యవధిలో 6 శాతం నష్టాన్ని నమోదు చేసింది. సోమవారం ఈ షేర్ ఇంట్రాడేలో రూ.1,400-రూ.1,513 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. ఎన్ఎస్ఈలో ఒక్కో షేర్ రూ.1,471 ధరకు రూ.6.83 కోట్ల బ్లాక్ డీల్ జరిగింది. ఈ షేర్ ఏడాది కనిష్ట, గరిష్ట స్థాయిలు రూ.820, 1,660గా ఉన్నాయి. మరో మల్టీప్లెక్స్ కంపెనీ ఐనాక్స్ లీజర్ కూడా ఇదే బాటలో పయనిస్తూ నష్టాలను మూటగట్టుకోవడం గమనార్హం. ప్రస్తుతం 15శాతంపన్ను అమలవుతున్న సినిమారంగాన్ని హెయ్యస్ట్ కేటగిరీలైన జూదం, బెట్టింగ్ లాంటి లో సినిమా రంగాన్ని చేర్చడంపై పరిశ్రమంగా కొద్దిగా అసంతృప్తిగా వున్నారని ఏంజెల్ బ్రోకింగ్ అభిప్రాయపడింది. -
పీవీఆర్, ఐనాక్స్ లకు బాహుబలి జోష్
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా మారుమ్రోగించిన బాహుబలి-ది బిగినింగ్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేసింది. బాహుబలి: ది బిగినింగ్ రీఎంట్రీ మల్టిప్లెక్స్ ఆపరేటర్లు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లకు భలే జోష్ నిచ్చింది. హిందీ వెర్షన్లలో 1000కి పైగా స్క్రీన్లపై ఈ సినిమాను మల్టిప్లెక్స్ లో ప్రదర్శిస్తున్నారు. బాహుబలి రీ-రిలీజ్ సందర్భంగా నేటి మార్కెట్లో పీవీఆర్ షేర్లు 3 శాతం పైగా పైకి దూసుకెళ్లగా.. ఐనాన్స్ 0.30 శాతం లాభపడ్డాయి. ఓ వైపు దేశీయ బెంచ్ మార్కు సూచీలు తీవ్ర నష్టాల దిశగా పయనిస్తున్న సమయంలోనే పీవీఆర్, ఐనాక్స్ షేర్లను బాహుబలి: ది బిగినింగ్ ఆదుకుంది. గత మూడు నెలల్లో ఈ మల్టిఫ్లెక్స్ ల షేర్లు 30 శాతానికంటే పైకి దూసుకెళ్లాయి. మల్టిప్లెక్స్ ఆపరేటర్లకు మార్చి క్వార్టర్ ఎంతో లాభదాయకమైన త్రైమాసికమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దంగాల్, రాయిస్, కబాలి, జోలీ ఎల్ఎల్బీ2, బద్రినాథ్ కి దుల్హానియా వసూళ్లు ఈ కంపెనీ షేర్లకు భారీగా కలిసివచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బాహుబలి రీ-రిలీజ్ మరింత సెంటిమెంట్ ను బలపరుస్తుందన్నారు. ఏప్రిల్ 28 'బాహుబలి 2' విడుదల అవుతున్న సందర్భంగా మరోమారు 'బాహుబలి 1'ను విడుదల చేసేందుకు థియేటర్ యాజమాన్యాలు నిర్ణయించాయి. తెలుగులో పరిమిత సంఖ్యలో విడుదలవుతున్నా.. హిందీలో మాత్రం మరోసారి ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఒక కొత్త సినిమా మాదిరిగానే హౌస్ ఫుల్ కావడం బాహుబలికున్న క్రేజ్ చాటిచెప్తోంది. ఈ రీ-రిలీజ్ సినిమాను 17వ తేదీ లోపున చూసిన వారికి, బాహుబలి 2 టిక్కెట్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
పీవీఆర్ స్క్రీన్ల వేట
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ చెయిన్ ఆపరేటర్, పీవీఆర్ మరిన్ని ‘స్క్రీన్ల’ను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 30 స్క్రీన్లను కొనుగోలు చేయనున్నామని పీవీఆర్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 70–80 స్క్రీన్లను కొనుగోలు చేస్తామని కంపెనీ జాయింట్ ఎండీ సంజీవ్ కుమార్ బిజ్లి చెప్పారు. కొనుగోలు చేయడానికి పలు స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని, కానీ తమకు తగినవి మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటున్నామని, ఈ విషయమై కసరత్తు జరుగుతోందని వివరించారు. గత ఏడాది పీవీఆర్ కంపెనీ డీఎల్ఎఫ్ నుంచి 32 స్క్రీన్ల డీటీ సినిమాస్‌ను రూ.433 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం పీవీఆర్ సంస్థ 48 నగరాల్లో 122 ప్రోపర్టీల్లో 562 స్క్రీన్లను నిర్వహిస్తోంది. కాగా ఇటీవలనే పీవీఆర్‌లో 14 శాతం వాటాను వార్బర్గ్ పిన్కస్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ రూ.820 కోట్లకు కొనుగోలు చేసింది. -
పీవీఆర్ పై కన్నేసిన వాండా?
ప్రముఖ థియేటర్ల నిర్వహణ సంస్థ పీవీఆర్ లిమిటెడ్ లో అతిపెద్దవాటాను చైనాకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ కొనుగోలు చేయనుందన్న వార్తలు వెలు వడ్డాయి.. మల్టీఫ్లెక్స్ రంగంలో దూసుకుపోతున్న పీవీఆర్ లో మేజర్ షేర్ కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు హల్ చల్ చేశాయి. చైనా రియల్టీ దిగ్గజం దలియాన్ వాండా గ్రూప్ పీవీఆర్ ను కొనుగోలు చేయనుందన్న అంచనాలతో మార్కెట్ల్ ఈ షేర్ భారీ లాభాలను ఆర్జించింది. సుమారు 8 శాతం ఎగిసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. చైనాలోని సుప్రసిద్ధ బహుళజాతి సంస్థ, ఆసియాలో అతిపెద్ద సినిమా గ్రూప్, థియేటర్ ఆపరేటర్ వాండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భారతదేశం యొక్క మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్‌లో వాటాల కొనుగోలు చర్చలు జరుపుతోందట. మరోవైపు ఈ వార్తల నేపథ్యలో బీఎస్ఈ పీవీఆర్ ను వివరణ యివ్వాల్సిందిగా కోరింది. కాగా పీవీఆర్ ప్రస్తుతం దేశంలోని 48 నగరాల్లో 557 స్ర్కీన్లతో విజయవంతంగా తన వ్యాపారాన్ని సాగిస్తోంది. ఇటీవల ముంబైలోని ఆరు స్ర్కీన్ల మల్టీప్లెక్స్ ఎక్స్ పీరియాను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
పీవీఆర్ చేతికి డీఎల్ఎఫ్ డీటీ సినిమాస్
డీల్ విలువ రూ.500 కోట్లు... న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్కు చెందిన డీటీ సినిమాస్‌ను పీవీఆర్ రూ.500 కోట్లకు కొనుగోలు చేసింది. డీఎల్ఎఫ్కు చెందిన డీఎల్ఎఫ్ యుటిలిటిస్ సంస్థ సినిమా ఎగ్జిబిషన్ బిజినెస్‌ను డీటీ సినిమాస్ పేరుతో నిర్వహిస్తోంది. ఈ సంస్థ 6,000 సీటింగ్ కెపాసిటి ఉన్న 29 స్క్రీన్లతో ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. పీవీఆర్ సినిమాస్ సంస్థ 43 నగరాల్లో 467 స్క్రీన్లను నిర్వహిస్తోంది. డీటీ సినిమాస్ కొనుగోలుతో పీవీఆర్ సంస్థ 44 నగరాల్లో 506 స్క్రీన్లను నిర్వహించే స్థాయికి చేరుతుంది. భారత వినియోగదారులకు ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని అందించే లక్ష్యంలో భాగంగా డిటీ సినిమాస్‌ను కొనుగోలు చేశామని పీవీఆర్ సీఎండీ అజయ్ బిజిలీ చెప్పారు. -
మరిన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లు!
- వ్యాపార విస్తరణకు సంస్థల అడుగులు - ప్రాతీయ మార్కెట్‌పై దృష్టి - సంప్రదాయ రూట్లో పీవీఆర్, ఐనాక్స్ - భారీ డీల్స్‌తో పెరుగుతున్న కార్నివాల్ సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీతో సినిమా ప్రొడక్షన్ వ్యయం తగ్గింది. దీనికి తగ్గట్టే సినిమాల నిర్మాణం పెరిగింది. దీంతో ప్రాంతీయ భాషా చిత్రాల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. వీటన్నిటికీ తోడు ఇపుడు ఏ సినిమా అయినా సాధారణంగా రెండు మూడు భాషల్లో విడుదలవుతోంది. ఇవన్నీ కలిసి సినిమా థియేటర్లకు గిరాకీ పెంచుతున్నాయి. సరిగ్గా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే మల్టీప్లెక్స్‌లు భారీ విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నాయి. సినిమాల సంఖ్యకు తగ్గట్టుగా థియేటర్లు పెరగటం లేదని, ఈ లోటును భర్తీ చేయటానికి తాము ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాలపై దృష్టి సారిస్తున్నామని మల్టీప్లెక్స్ సంస్థలు చెబుతున్నాయి. ఇపుడు ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో మాల్స్ కూడా భారీగా వస్తుండటంతో థియేటర్లు ఏర్పాటు చేయటమూ వాటికి పెద్ద కష్టం కావటం లేదు. ప్రాంతీయ మార్కెట్‌పై మల్టీప్లెక్స్‌ల కన్ను భవిష్యత్తు అవకాశాలన్నీ ప్రాంతీయ మార్కెట్లోనే ఉన్నాయని భావిస్తున్న మల్టీప్లెక్స్ సంస్థలు.. తమ దృష్టిని జాతీయ మార్కెట్ నుంచి ప్రాంతీయ మార్కెట్‌పైకి మళ్లిస్తున్నాయి. ‘‘దేశంలో అధిక సంఖ్యలో చిన్న చిన్న పట్టణాలున్నాయి. వీటిల్లో సినిమాలను వీక్షించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకని మల్టీప్లెక్స్ థియేటర్ సంస్థలు ఈ పట్టణాలపై దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది’’ అనేది మల్టీప్లెక్స్ వ్యాపారంలో అత్యధిక వాటా కలిగి ఉన్న పీవీఆర్ గ్రూప్ అభిప్రాయం. ఎక్కువ థియేటర్లున్న ఐనాక్స్, సినీ పోలిస్, కార్నివాల్ సినిమాస్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బావుంటుందన్నది సంస్థ అభిప్రాయం. పెరగనున్న మల్టీప్లెక్స్ స్క్రీన్లు: నిజానికి ఇప్పటిదాకా పీవీఆర్, సినీ పోలిస్లు సంప్రదాయ విస్తరణపైనే (మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్మాణం) ఎక్కువ దృష్టి కేంద్రీకరించాయి. అంతే తప్ప వేరే సంస్థను కొనుగోలు చేయటం వంటివేమీ చేయలేదు. పీవీఆర్ గత రెండేళ్ల నుంచీ ఏడాదికి 70-75 స్క్రీన్లను పెంచుకుంటూ వెళుతోంది. ఇపుడు ఈ సంఖ్యను 100కు చేర్చే యోచనతో ఉంది. ‘‘దేశంలో సినిమా ప్రదర్శనలో మార్పులు జరుగుతున్నాయి. ఈ సమయంలో సంప్రదాయక విస్తరణ అత్యవసరం. దీనివల్ల కొత్త స్క్రీన్లు వస్తాయి. కార్నివాల్ సంస్థ విస్తరణను స్వాగతిస్తున్నాము. కానీ దీనివల్ల మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండదు. మారింది కేవలం మల్టీప్లెక్స్‌ల ముందు బ్యానర్ మాత్రమే’’ అని పీవీఆర్ గ్రూప్ పేర్కొంది. కార్నివాల్ సంస్థ ఇటీవల రిలయన్స్ మీడియా వర్క్స్‌కు చెందిన ‘బిగ్ సినిమాస్’లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి ఆ సంస్థను చేజిక్కించుకుంది. దీనివల్ల బిగ్ సినిమాస్ థియేటర్లన్నీ ఇకపై కార్నివాల్ సినిమాస్‌గా మారతాయని, అంతేతప్ప కొత్తగా స్క్రీన్లు పెరగటం వంటిది జరగదనేది పీవీఆర్ అభిప్రాయం. మరో అగ్రశ్రేణి సంస్థ సినీపోలిస్ కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్యను మరో 60కి పెంచటానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ‘‘దేశంలో మల్టీప్లెక్స్ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశాలున్నాయి. ఫన్ సినిమాతో ఒప్పందం చేసుకునేదాకా మేం ఒంటరిగానే వ్యాపార విస్తరణను చేపట్టాం. ప్రస్తుతం దేశంలో చాలా చైన్ మల్టీప్లెక్స్‌లు మావే. సంప్రదాయక విస్తరణపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం. ఉనికి, లాభదాయకతపైనే వ్యాపార వృద్ధి అధారపడి ఉంటుంది’’ అని గ్రూప్ అభిప్రాయపడింది. ఈ ఏడాది కార్నివాల్ కూడా తన స్క్రీన్ల సంఖ్యను 500కు పెంచటానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంస్థలు కొత్త స్క్రీన్లను మొదట కోల్‌కతా, తర్వాత బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీలలో నిర్మించనున్నాయి. మనకు థియేటర్ల సంఖ్య సమస్యేనా? ‘‘సినిమాల సంఖ్య పరంగా చూస్తే మనకు ఎలాంటి సమస్యా లేదు. ఎందుకంటే దేశంలో ఏటా 1000కి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. సంవత్సరానికి 4 బిలియన్ల టికెట్లను విక్రయిస్తున్నాం. మనకు ఉన్న సమస్యల్లా వాటి ప్రదర్శనకు తగినన్ని థియేటర్లు లేకపోవటమే’’ అనేది ఐనాక్స్ గ్రూప్ మాట. 10 లక్షల జనాభాకు మనం 9 స్క్రీన్లను (2 మల్టీప్లెక్స్‌లు) మాత్రమే కలిగి ఉంటే చైనా 25 స్క్రీన్లను కలిగి ఉందని సంస్థ వెల్లడించింది. మన దేశంలోని మొత్తం మల్టీప్లెక్స్ స్క్రీన్లు 2,050 మాత్రమే. -
పవన్‌కు... రాజు రవితేజ దూరమయ్యాడా?
సినీనటుడు పవన్ కళ్యాణ్ అట్టహాసంగా ప్రారంభించిన 'జనసేన' పాల పొంగులాంటిదేనా? తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన విషయంలోనూ అదే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు సంవత్సరం క్రితం జనసేనను ఒక తుఫాను అని అభివర్ణించిన వారే ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం జనసేన కోమాలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన అనేది సోదిలో కూడా కనిపించటం లేదు. పవన్ కూడా జనసేనపై ఆసక్తి చూపించటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో జనసేన పార్టీ స్థాపించడానికి తన వెనుక డబ్బున్నవారు, రాజకీయ నేతలు లేరనీ చెప్పిన పవన్ కళ్యాణ్... తన స్నేహితుడు రాజు రవితేజ మాత్రమే ఉన్నాడంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు పవన్‌కు కుడి భుజమైన రాజు రవితేజ ప్రస్తుతం కనిపించటం లేదు. పవన్ తో రాజు రవితేజ పూర్తిగా కట్ ఆఫ్ చేసుకున్నట్లు సమాచారం. పవన్ వ్యవహార శైలి నచ్చకే అతను ...దూరం జరిగినట్లు తెలుస్తోంది. పవన్.. ఊకదంపుడు ఉపన్యాసాలే కానీ.. చేతలు మాత్రం శూన్యమని తెలుసుకున్న రాజు రవితేజ పక్కకు తప్పుకున్నాడని ఓ వర్గం చెబుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... పీవీఆర్... పొట్లూరి వరప్రసాద్. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. తాజాగా పీవీఆర్ కూడా పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, విశాఖలో జరిగిన జనసేన సభల ఏర్పాటు నిమిత్తం పీవీఆర్...సుమారు మూడు కోట్లు ఖర్చుపెట్టారట. ఇందుకోసం ఆయన..ఎంపీ టిక్కెట్ ఇప్పించే విషయంలో ఒత్తిడి తెచ్చినా చివరికి ఫలితం లేకపోయింది. ఎన్నికల తర్వాత పీవీఆర్ కూడా 'తమ్ముడి' పట్టించుకోవటం లేదట. ఓ వైపు వ్యాపార వ్యవహారాలతో పాటు మరోవైపు సినిమా నిర్మాణాలతో బిజీగా ఉన్నారట. ఇక పవన్ కూడా తన సినిమాలపై దృష్టి పెట్టాడు. ఓ వైపు మాల్టీ స్టారర్ సినిమా 'గోపాల గోపాల' తో పాటు గబ్బర్ సింగ్-2లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఒకవేళ టీడీపీ, బీజేపీలకు తన సేవలు అవసరం అయితే ...మరోసారి పవన్ తెరమీదకు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు ప్రతిఫలంగా బీజేపీ... పవన్‌కు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం. -
జయహో తెలంగాణ సంబురాలు
రామకృష్ణాపూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రామకృష్ణాపూర్‌లోని సూపర్‌బజార్ వద్ద జయహో తెలంగాణ సంబురాలు పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తూర్పు జిల్లాకు చెందిన కళాకారులు, విద్యావంతులు, జేఏసీ నేతలు, రచయితలు, అమరవీరుల తల్లిదండ్రులను సన్మానించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావ్, తూర్పు జిల్లా జేఏసీ చైర్మన్ గోనె శ్యాంసుందర్‌రావు, విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురిజాల రవీందర్రావు, సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండీ.మునీర్, ధూంధాం వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజు హాజరయ్యారు. కార్యక్రమంలో పీవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ పొన్నాల వినయ్, ప్రధాన కార్యదర్శి పొన్నాల సాగర్, సర్పంచ్ జాడి శ్రీనివాస్, పట్టణ జేఏసీ కన్వీనర్ పెద్దపెల్లి ఉప్పలయ్య తదిత రులు పాల్గొన్నారు. -
కొత్తగా వంద స్క్రీన్లు : పీవీఆర్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వందకు పైగా కొత్త స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నామని మల్టీప్లెక్స్ చెయిన్ ఆపరేటర్, పీవీఆర్ శుక్రవారం తెలిపింది. ఇందుకోసం రూ.150 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని పీవీఆర్ ఎండీ, అజయ్ బిజిలి చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న వంద స్క్రీన్లలలో సగం మెట్రో నగరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న 400 స్క్రీన్లకు ఇవి అదనమని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. ప్రతీ ఏడాది వంద స్క్రీన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, మొత్తం స్క్రీన్ల సంఖ్యను వెయ్యికి పెంచడం లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో సినిమా హాళ్ల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. భారత్‌లో వినోదపు పన్ను అధికంగా ఉందని, ఈ పన్నును తగ్గించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.