నలుగురు సినీ ప్రేక్షకులపై కేసు | Bengaluru family bullied for not standing during national Anthem | Sakshi
Sakshi News home page

నలుగురు సినీ ప్రేక్షకులపై కేసు

Published Fri, Nov 8 2019 6:14 AM | Last Updated on Fri, Nov 8 2019 6:14 AM

Bengaluru family bullied for not standing during national Anthem - Sakshi

బెంగళూరు: సినిమాహాల్లో జాతీయగీతం ప్రదర్శించినప్పుడు కుర్చీల్లోంచి లేచి నిలబడలేదన్న కారణంతో నలుగురిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పదిహేను రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబరు 23న బెంగళూరులోని పీవీఆర్‌ ఓరియన్‌ సినిమాహాల్లో ప్రదర్శితమవుతోన్న తమిళ సినిమా ‘అసురన్‌’కు వచ్చిన ప్రేక్షకుల్లో నలుగురు సినిమాకు ముందుగా జాతీయగీతం ‘జనగణమన’ను ప్రదర్శించినప్పుడు లేచి నిలబడలేదు. దీంతో ఓ వ్యక్తి వారిని వీడియో తీశాడు. ఈ వీడియోను సినీ నటి బీవీ ఐశ్వర్య సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.  దీని ఆధారంగా పోలీసులు ఆ నలుగురు వ్యక్తులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే, వారి పేర్లను అందులో పేర్కొనలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement