national anthem
-
'జన గణ మన'ను జాతీయ గీతంగా స్వీకరించింది ఈరోజే!
'జన గణ మన'ను జాతీయ గీతంగా స్వీకరించింది ఈరోజే. భారత రాజ్యంగ సభ జనవరి 24 1950లో జన గణ మన గీతాన్ని భారత జాతీయ గీతంగా ఆమోదించింది. అయిదు పాదాలున్న ‘భారత భాగ్య విధాత’లోని మొదటి పాదాన్ని జాతీయ గీతంగా స్వీకరించారు. రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ఈ గీతానికి సంగీత బాణిని సమకూర్చింది కూడా ఆయనే.ఒకసారి మదనపల్లిలోని బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్‌ని 1919లో రవీంద్రనాద్ ఠాగూర్ సందర్శించాడు. ఆ కాలేజీలో ఉన్నప్పుడు జన గణ మన గీతాన్ని ‘మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు. 52 సెకండ్లలో జాతీయగీతం.. జాతీయ గీతం పూర్తిగా 52 సెకండ్ల కాలవ్యవధిలో ఆలపించాలి. జాతీయ గీతాన్ని ఈ కింది ప్రభుత్వ కార్యక్రమాలలో, వివిధ సందర్భాలలో పూర్తిగా వినిపించాలి. సివిల్, మిలటరీ ఇన్ స్టిట్యూట్స్, రాష్ట్రపతి, గవర్నర్ కు గౌరవందనం సందర్భాల్లో ఆలపించాలి. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ వంటి ప్రముఖులు లేకున్నప్పటికీ పరేడ్లలో ఆలపిస్తారు. రాష్ట్రప్రభుత్వ అధికార కార్యక్రమాలకు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజా సందోహ కార్యక్రమాలకు రాష్ట్రపతి వచ్చినప్పుడు, వెళ్తున్నప్పుడు, ఆకాశవాణిలో రాష్ట్రపతి జాతినుద్దేశించి చేసే ప్రంగానికి ముందు, వెనుక ఆలపిస్తారు. రాష్ట్ర గవర్నర్ తన రాష్ట్ర పరిధిలో అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు, నిష్క్రమించేటప్పుడు, జాతీయ పతాకాన్ని పరేడ్‌కు తెచ్చినప్పుడు, రెజిమెంటల్ కలర్స్ బహుకరించినప్పుడు, నౌకాదళంలో కలర్స్ ఆవిష్కరించినప్పుడు ఈ గీతాన్ని ఆలపిస్తారు. కొన్ని సందర్భాల్లో జాతీయ గీతాన్ని సంక్షిప్తంగా మొదటి, చివరి వరుసలను ఆలపించుకోవచ్చు. అలా ఆలపించడం 52 సెకండ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే? హడావిడిగా ఏదో పాడేశాం అన్నట్లుగానూ లేక సాగదీసినట్లుగా పాకుండా ఉండేదుకు ఇలా వ్యవధిని నిర్ణయించారు. మన జాతీయ గీతాన్ని గౌరవప్రదంగా ఆలపించదగినది అని చెప్పడానికే ఇలా వ్యవధిని ఏర్పాటు చేశారు. 1947లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జాతీయ గీతం గురించి భారత ప్రతినిధి బృందానికి అడిగినప్పుడు జన గణ మన రికార్డింగ్‌ను జనరల్‌అసెంబ్లీకి అందించారు. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతినిధుల ముందు జాతీయగీతాన్ని ఆలపించారు. అయితే మన జాతీయ గీతాన్ని అన్ని దేశాలు ప్రశంసించాయి. మూడు సంవత్సరాల తర్వాత అంటే 1950 జనవరి 24న భారత రాజ్యాంగంపై సంతకం చేయడానికి అసెంబ్లీ సమాశమైంది. ఈ సమయంలో దేశ మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ అధికారికంగా 'జన గణ మన' ను జాతీయ గీతంగా ప్రకటించారు. దీంతో మన గణతంత్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు ఇవాళే(జనవరి 24)న 'జన గణ మన'ను జాతీయగీతంగా స్వీకరించింది. (చదవండి: తొలిసారిగా మొక్కలు మాట్లాడుకోవడాన్ని కెమెరాలో బంధించిన శాస్త్రవేత్తలు!) -
వైరల్ జయహే!
గ్రామీ అవార్డ్ విజేత రికీ కేజ్ లండన్‌లోని ప్రసిద్ధ అబేరోడ్ స్టూడియోస్‌లో మన జాతీయ గీతానికి సంబంధించి 100 మందితో లార్జెస్ట్ ఆర్కెస్ట్రాను నిర్వహించి రికార్డ్ సృష్టించాడు. ఈ వీడియోకు నెటిజనులు ఫిదా అవుతున్నారు. ‘చారిత్రాత్మకమైన 100 పీస్ బ్రిటిష్ ఆర్కెస్ట్రాను నిర్వహించినందుకు మ్యూజిక్ కంపోజర్‌గా గర్విస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఈ వీడియోను ఎంతోమందికి షేర్ చేశాను. యూజ్ ఇట్, షేర్ ఇట్, వాచ్ ఇట్... బట్ విత్ రెస్పెక్ట్’ అంటూ ట్విట్టర్లో రాశాడు రికీ కేజ్. ‘వండర్ఫుల్’ అంటూ ఈ వీడియోను రీషేర్ చేశారు ప్రధాని మోదీ. -
వెస్టిండీస్‌తో తొలి టీ20.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్! వీడియో వైరల్
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆరంభానికి ముందు టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం ఆలపించే సమయంలో ఉబికి వస్తున్న కన్నీరును హార్దిక్ ఆపుకోలేకపోయాడు. తన చేతులతో కన్నీటిని తుడుచుకుంటూ హార్దిక్ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విండీస్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ దూరంకావడంతో హార్దిక్ పాండ్యా భారత జట్టు సారధిగా వ్యవహరిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్ చేతిలో 4 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత్ విజయానికి ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరమవ్వగా.. విండీస్ బౌలర్ షెపర్డ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ(39) మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. విండీస్ బౌలరల్లో మెకాయ్, హోల్డర్, షెపర్డ్ తలా రెండు వికెట్లు సాధించగా, అకేల్ హోసేన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. కెప్టెన్ పావెల్(48), పూరన్(41) పరుగులతో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక భారత్-విండీస్ మధ్య రెండో టీ20 ఆగస్టు6న గయానా వేదికగా జరగనుంది. చదవండి: #Tilak Varma: అరంగేట్రంలోనే అదుర్స్.. తొలి 3 బంతుల్లోనే 2 సిక్స్‌లు! వీడియో వైరల్ Hardik Pandya got emotional during the national anthem. pic.twitter.com/5VH2kM8cdf — Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2023 -
మన జాతీయగీతం మిల్బన్ నోట
వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన మన ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగింపు కార్యక్రమంలో ఆఫ్రికన్–అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బన్ ఆలపించిన మన జాతీయగీతం ‘జనగణమన’ వీడియో వైరల్‌గా మారింది. ‘అద్భుతం’ అంటున్నారు నెటిజనులు. ‘భారతీయులు నన్ను తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగా ప్రేమిస్తారు’ అంటున్న మిల్బన్ మన ప్రధానికి పాదాభివందనం చేసింది. మన జాతీయగీతం మాత్రమే కాదు ‘ఓమ్ జై జగదీష్ హరే’ భక్తిగీతాన్ని కూడా అద్భుతంగా ఆలపిస్తుంది మిల్బన్. -
ష్..! దేశమంటే ప్రాణం.. ఇది పుతిన్‌లో మరో కోణం..!
దేశమంటే ప్రాణం.. జాతీయ గీతం అంటే గౌరవం.. ఇదీ పుతిన్ నమ్మిన సిద్ధాంతం. ఓ వైపు పశ్చిమ దేశాలన్నీ కలిసి పగబట్టినా.. పట్టు వీడని మనస్థత్వం ఆయనది. ప్రపంచంలో రష్యా దేశ స్వాభిమానాన్ని నిలపడంలో అలిసిపోకుండా పోరాడుతున్నారు. అయినప్పటికీ ప్రతీ చిన్న విషయంలోనూ దేశ ప్రేమను వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ చిన్న సంఘటనతో దేశానికి ఆయన ఇచ్చే గౌరవం ఎంతటిదో అర్ధమవుతుంది. సెయింట్ పీటర్‌బర్గ్‌లో నిర్వహించిన ఓ జాతీయ వేడుకలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోలియం రిఫైనరీ కంపెనీ గాజ్ప్రోమ్ నెఫ్ట్‌కు చెందిన అధికారి ఎలెనా ఇల్యుఖినాతో కలిసి పడవపై నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ గీతం ఆలాపన ప్రారంభమైంది. అదే సమయంలో పుతిన్‌తో ఎలెనా చర్చను ప్రారంభించారు. జాతీయ గీతానికి గౌరవంగా నిలబడిన పుతిన్..మాట్లాడొద్దంటూ మూతిపై వేలు చూపించారు. తప్పు చేసినదానిలా భావించిన ఎలెనా.. నిశ్శబ్దంగా పుతిన్ పక్కన నిలబడ్డారు. 22 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Vladimir Putin 😎 reminds his talkative host not to speak during the Russian National Anthem pic.twitter.com/xMf7W8FeVH — Megh Updates 🚨™ (@MeghUpdates) June 18, 2023 అధ్యక్షుల వారి ఆంతర్యమేంటో..! మరో వేడుకలో పుతిన్ ఆ దేశ రక్షణ మంత్రికి వీపు చూపించిన వీడియో కూడా ఇటీవల బాగా వైరల్ అయింది. సైనికులకు బహుమతులు ఇవ్వడానికి మిలిటరీ ఆస్పత్రికి వెళ్లిన పుతిన్.. సైనికులతో మాట్లాడతారు. ఈ క్రమంలో పక్కనే నిల్చున్న రక్షణ మంత్రి సెర్జీ షోయిగు వైపు చూసి వెంటనే ముఖం తిప్పుకున్నారు. అంతటితో ఆగకుండా షోయిగుకు వీపు చూపించారు. వెనకనే ఉన్న మంత్రి ఎలా స్పందించాలో తెలియక తికమకపడ్డారు. దేశమే ప్రధానం.. ఆ తర్వాతే పుతిన్‌కు ఎవరైనా అనే విషయం ఈ ఘటనతో అర్థమవుతుంది. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అధ్యక్షుల వారీ ఆంతర్యమేంటో అని కామెంట్లు పెట్టారు. రక్షణ మంత్రి ఉద్యోగం ఊడినట్టేనని ఫన్నీగా స్పందించారు. అయితే.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో సరైనా విజయాలు సాధించట్లేదనే మంత్రిపై ఆ విధంగా పుతిన్ ప్రవర్తించారని మరికొందరు కామెంట్ చేశారు. You don't have to be a body language expert to understand what Putin currently thinks about his Defence Minister Sergei Shoigu... 😅 pic.twitter.com/ZRfJaJDE1X — Jimmy Rushton (@JimmySecUK) June 12, 2023 ఇదీ చదవండి:రష్యా అధ్యక్షుడికి తిక్క రేగింది.. భారీ క్షిపణులతో దాడి.. -
బాంబే హైకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు!
ముంబై: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. డిసెంబర్ 2021లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవపరిచారంటూ బీజేపీ సభ్యుడు దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ మమతా బెనర్జీ దాఖలు చేసిన అప్పీల్‌ను బాంబే హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ ఏడాది జనవరిలో గతంతో జారీ చేసిన సమన్లను పక్కకు పెట్టి, మమతాపై మళ్లీ కొత్తగా విచారణ ప్రారంభించాలని మేజిస్ట్రేట్ కోర్టును సెషన్స్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో సెషన్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. తనపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై. జస్టిస్ అమిత్ బోర్కర్‌తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం స్పందిస్తూ.. మెరిట్‌లపై ఫిర్యాదును నిర్ణయించకుండా సెషన్స్ జడ్జి అనుసరించిన విధానం, విచారణకు తిరిగి మేజిస్ట్రేట్‌కు పంపడం సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా ఉంది. కావున ప్రస్తుత కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసర లేదు’ అని పేర్కొన్నారు. కాగా 2022లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవపరిచినందుకు మమతాపై చర్య తీసుకోవాలని కోరుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముంబై యూనిట్ ఆఫీస్ బేరర్ వివేకానంద్ గుప్తా మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో గుప్తా..మమతా బెనర్జీ 2021 మార్చిలో ముంబై పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో లేచి నిలిబడలేదని పేర్కొన్నారు. జాతీయ గీతాన్ని మమత అవమానించారని ఆయన ఆరోపించారు. సీఎం బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీస్టేషన్ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌తో కూడిన డీవీడీని కోర్టుకు సమర్పించారు. ఐతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గుప్తా మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. గుప్తా ఫిర్యాదును పరిగణలోనికి తీసుకున్న మెజిస్ట్రేట్ కోర్టు మమతాకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో జనవరి 2023లో సెషన్‌కోర్టు న్యాయమూర్తి ఆర్కే రోకడే మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేసి, ఫిర్యాదు మళ్లీ పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కాగా మమతా ప్రత్యేక కోర్టు సవాలు చేస్తూ.. సమన్లు రద్దు చేసి, తిరిగి విచారణకు పంపించే బదులు మొత్తం ఫిర్యాదును రద్దు చేయాల్సిందిగా హైకోర్టుని ఆశ్రయించి పిటీషన్ దాఖలు చేశారు. అందుకు హైకోర్టు నిరాకరిస్తూ..పిటీషన్‌ను కొట్టేసింది. (చదవండి: ఆరు అంతస్తుల హోటల్లో భారీ అగ్నిప్రమాదం) -
ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. రాజకుటుంబంలోని సభ్యులందరితో పాటు 2,000 మంది అతిథులు, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే రాణి అంత్యక్రియల్లో ఆమె మనవడు, కింగ్ చార్లెస్-3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వ్యవహరించిన తీరుపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాణి భౌతికకాయం వెస్ట్‌మినిస్టర్ అబెలో ఉన్నప్పుడు ఆమెకు నివాళిగా అందరూ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ద కింగ్'ను ఆలపించారు. అయితే డేగ కళ్లున్న కొందరు ఈ సమయంలో ప్రిన్స్ హ్యారీని వీడియో తీశారు. ఆయన పెదాలు కదపనట్లు, జాతీయ గీతం ఆలపించనట్లు అందులో కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. Prince Harry not singing the national anthem 👀 #queensfuneral pic.twitter.com/laNk5JMZ6R — Kieran (@kierknobody) September 19, 2022 ప్రిన్స్ హ్యారీ.. రాణికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొకొందరు మాత్రం ప్రిన్స్ హ్యారీకి మద్దతుగా నిలిచారు. ఆయన జాతీయ గీతాన్ని ఆలపించారని, పెదాలు కదిలాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. జాతీయ గీతం మారింది కాబట్టి ఆయనకు కష్టంగా అన్పించిందేమో ఓ సారి అవకాశం ఇచ్చిచూద్దాం అన్నాడు. మరో నెటిజన్.. ఈ కార్యక్రమంలో ఇంకా చాలా మంది ప్రిన్స్ హ్యారీలాగే ప్రవర్తించారని, కింగ్ చార్లెస్ కూడా పెదాలు కదపలేదన్నారు. వాళ్లను పట్టించుకోకుండా ఈయనపైనే ఎందుకుపడ్డారని ప్రశ్నించాడు. మరికొందరు మాత్రం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు నోట మాటరాదని, అందుకే ప్రిన్స్ హ్యారీ జాతీయ గీతాన్ని ఆలపించలేకపోయి ఉండవచ్చని ఆయనకు అండగా నిలిచారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. చదవండి: బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు -
రాకుమారునిగా వెళ్లి... రాజుగా లండన్‌కు చార్లెస్
లండన్: రాణి ఎలిజబెత్–2 ఆరోగ్యం విషమించిన విషయం తెలియగానే గురువారం ఉదయం రాకుమారుని హోదాలో లండన్ వీడిన చార్లెస్, ఆమె మరణానంతరం శుక్రవారం బ్రిటన్ రాజు హోదాలో తిరిగి రాజధానిలో అడుగు పెట్టారు. ఆయన తల్లి రాణి ఎలిజబెత్–2 వృద్ధాప్యంతో గురువారం స్కాట్లాండ్లో మరణించడం తెలిసిందే. దాంతో నిబంధనల ప్రకారం ఆ మరుక్షణం నుంచే చార్లెస్ బ్రిటన్ రాజయ్యారు. శుక్రవారం స్కాట్లండ్ నుంచి లండన్ చేరుకున్న ఆయనకు ప్రజలు ‘గాడ్ సేవ్ ద కింగ్’ అంటూ జాతీయ గీతం పాడుతూ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రాజు హోదాలో చార్లెస్ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. దివంగత రాణికి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని లిజ్ ట్రస్‌తో భేటీ అయ్యారు. అంత్యక్రియలపై అస్పష్టత ఎలిజబెత్ అంత్యక్రియలు ఎప్పుడు జరిగేదీ ఇంకా తేలలేదు. రెండు వారాల్లోపు చారిత్రక వెస్ట్‌మినిస్టర్ అబేలో అంత్యక్రియలు జరుగుతాయని బీబీసీ వెల్లడించింది. పార్లమెంటు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై రాణికి నివాళులర్పించింది. 96 ఏళ్లపాటు జీవించిన రాణి గౌరవార్థం సెంట్రల్ లండన్‌లో 96 రౌండ్ల గన్ సెల్యూట్ జరిగింది. శనివారం హౌజ్ ఆఫ్ కామన్స్ ప్రత్యేక భేటీలో ఎంపీలంతా కింగ్ చార్లెస్–3కి విధేయత ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం యాక్సెషన్ కౌన్సిల్ సమావేశమై చార్లెస్‌ను రాజుగా లాంఛనంగా ప్రకటించనుంది సంతాపాల వెల్లువ ఎలిజబెత్ అస్తమయం పట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భా్రంతి వెలిబుచ్చారు. అంతర్జాతీయ సమాజం నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ దంపతులు వాషింగ్టన్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయానికి వెళ్లి మరీ నివాళులర్పించారు. ‘‘రాణిది అరుదైన, గొప్ప వ్యక్తిత్వం. అమెరికన్లందరి తరఫున మా ప్రగాఢ సానుభూతి’’ అంటూ సంతాపాల పుస్తకంలో రాశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తదితరులు కూడా సంతాప ప్రకటన విడుదల చేశారు. భారత్‌లో 11న ఆదివారం ఒక్కరోజు సంతాప దినంగా పాటించనున్నారు. -
కోట్ల గొంతుకలు.. ఒక్క స్వరమై
మంగళవారం ఉదయం 11.30 గంటలు.. రాష్ట్రంలో ఓ అద్భుత ఘట్టానికి తెర లేచింది.. హైదరాబాద్‌లో అన్ని చౌరస్తాల్లో రెడ్ సిగ్నల్ పడింది.. వాహనాలన్నీ ఆగిపోయాయి.. మెట్రో రైళ్లన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఉన్నవారి దగ్గర నుంచి కార్యాలయాలు, ఇళ్లలో ఉన్నవారు.. పంటపొలాల్లో పనిచేస్తున్నవారు.. పెళ్లి వేడుకల్లో ఉన్నవారు.. చివరకు అంత్యక్రియల్లో పాల్గొన్నవారు కూడా ఎక్కడివారు అక్కడ లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. కోట్లాది మంది ఒకేసారి గొంతు కలపడంతో రాష్ట్రం మొత్తం జనగణమనతో మార్మోగింది. హైదరాబాద్ అబిడ్స్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రం మంగళవారం జాతీయ గీతం ‘జనగణమన’తో మార్మోగిపోయింది. ఉద యం 11.30 గంటలకు ఎక్కడున్నవార క్కడే నిలబడి సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని ఎలుగెత్తి చాటారు. కోట్ల మంది ఒకేసారి గొంతు కలపడంతో రాష్ట్రమంతటా ప్రతిధ్వనించింది. ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. భరతమాత మది పులకించింది. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపు మేరకు.. ఊరూవాడ, పల్లెపట్నం అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బడులు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలు, అంగన్వాడీలు, పంట పొలాల్లో సైతం ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతో గొంతు కలిపిన జనం సీఎం కేసీఆర్.. పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి అబిడ్స్ సర్కిల్ వద్ద నిర్వహించిన ‘సామూహిక జాతీయ గీతాలాపన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వేదికపై నుంచి నిర్దేశిత సమయంలో జాతీయ గీతాలాపననను ఆయన ప్రారంభించారు. చౌరస్తాకు నలు దిక్కులతో పాటు భవనాలపై నుంచి వేలాది మందితో కూడిన జన సమూహం సీఎం కేసీఆర్‌తో గొంతు కలిపి ముక్త కంఠంతో ‘జనగణమన’ పాడారు. దీంతో అబిడ్స్ ప్రాంతం జాతీయ గీతాలపనతో ప్రతిధ్వనించింది. గీతాలాపన ముగియగానే..జై భారత్...భారత్ మాతా కీ జై...జై తెలంగాణ...అంటూ సీఎం కేసీఆర్ పిడికిలెత్తి నినదించారు. అనంతరం ‘బోలో స్వతంత్ర భారత్ కీ జై’ నినాదం మారుమోగింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, వజ్రోత్సవ కమిటీ చైర్మన్ ఎంపీ కె.కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బేతి సుభాష్ రెడ్డి, ఎ.జీవన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, పలు సంస్థల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల్లో.. ♦హన్మకొండలోని అంబేడ్కర్ సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జెడ్పీ చైర్మెన్ సుధీర్ కుమార్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య పాల్గొన్నారు. వరంగల్ ఆర్టీవో ఆఫీస్ వద్ద 2 వేల మందితో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. నల్లబెల్లి మండలం మూడుచుక్కలపల్లిలో రైతులు పంట పొలాల్లో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. ♦నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో భారత మాత చిత్రపటం ఆకారంలో నిలబడి విద్యార్థులు జనగణమన ఆలపించారు. ♦మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో 150 అడుగుల జాతీయ జెండా వద్ద ఎమ్మెల్యే దివాకర్ రావు, కలెక్టర్ భారతీ హోళికెరీ, డీసీపీ అఖిల్ మహా జన్ వేలాది మందితో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. ♦ఖమ్మంలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ ఎస్.విష్ణువారియర్, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, పాల్వంచలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కలెక్టర్ అనుదీప్, జెడ్పీ చైర్పర్సన్ కోరంలు కనకయ్య సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. ♦మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పెద్దనాగారం గ్రామ పంచాయతీ పరిధిలో కూలీలు వరినాట్లు వేస్తూ జాతీయ గీతాలాపన చేశారు. వనపర్తి జిల్లాలో ఈ సందర్భంగా దాదాపు మూడు కిలోమీటర్ల జాతీయ పతాకం ప్రదర్శించారు. చదవండి: రిపోర్టింగ్ టు ప్రియాంక -
ఉప్పొంగిన దేశభక్తి.. తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపన (ఫొటోలు)
-
అబిడ్స్ పోస్టాఫీస్ వద్ద సామూహిక గీతాలాపనలో కేసీఆర్
-
తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపన గ్రాండ్ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన ప్రశాంతంగానే కాదు.. గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మంగళవారం ఉదయం 11గం.30ని. ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా అందరూ జనగణమన ఆలపించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. అబిడ్స్ జీపీవో నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ ప్రముఖలు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించింది. ఒక్క నిమిషం మెట్రోసర్వీసులు ఆగిపోగా.. ఎక్కడికక్కడే ప్రయాణికులు జాతీయ గీతం ఆలపించారు. సికింద్రాబాద్ ప్యాట్నీ కూడలి వద్ద జనగణమన జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న నగర పౌరులు సిగ్నల్స్ వద్ద నిమిషం పాటు రెడ్ సిగ్నల్ ఇచ్చి అంతా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు మిగతా జిల్లాల్లోనూ టీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే చాలాచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్నారు వాహనదారులు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మూడు నాలుగు గంటలపాటు ఈ రూట్లలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు -
నేడు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక గీతాలాపన
-
జాతి పండగకు జేజేలు
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని అబిడ్స్ జీపీఓ సర్కిల్ నెహ్రూ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉద్యోగులతో పాటు కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గోనున్నారు. జీపీఓ సర్కిల్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించనున్నారు. రంగురంగుల బ్యానర్లు, గీతాలాపన చేయడానికి మైక్ ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకంతో కళాకారుడి ఆనంద హేల సామూహిక గీతాలాపన ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీపీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యాపకులు తిరంగా సంబరం తరంగమై ఎగిసింది. నగరం అంగరంగ వైభవంగా మెరిసింది. మువ్వన్నెల జెండా వజ్రోత్సవంలా మురిసింది. స్వాతంత్య్ర శోభ వెల్లివిరిసింది. ఇళ్లు, వీధులు, వాహనాలపై త్రివర్ణ పతాకాలు సమున్నతంగా ఆవిష్కృతమయ్యాయి. సోమవారం నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు అంబరమంటాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో భారీ జెండాలతో బైక్ ర్యాలీలు, కారు ర్యాలీలు జోరుగా సాగాయి. భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతబస్తీలో జాతీయ జెండాలతో ఉత్సాహంగా ముస్లిం మహిళలు వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి పది మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన పతాకాలు చూడముచ్చగా కనువిందు చేశాయి. సంజీవయ్య పార్క్ సమీపంలో జాతీయ జెండాలతో వింటేజ్ కార్లతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అబిడ్స్ మొజంజాహీ మార్కెట్ వేదికగా అతి పొడవైన జాతీయ జెండాతో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాశాలు, స్కూళ్లలో వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి. కళాకారులు దేశభక్తి ఉట్టిపడేలా తయారైన విధానం అందరినీ ఆకట్టుకుంది. ట్యాంక్‌బండ్‌పై త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలతో పాటు నలుమూలలా వ్యాపించి ఉన్న కార్పొరేట్ ఆఫీసుల్లో, ఐటీ కంపెనీల్లో, విద్యా సంస్థల్లో 75 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాల్లో నగర యువత ఆసక్తిగా పాల్గొని సందడి చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా నగరానికి చెందిన మైక్రో ఆరి్టస్టు కృష్ణ ఉట్ల బియ్యపు గింజపై జాతీయ జెండాను రూపొందించారు. చిన్న పరిమాణంలో ఉండే బియ్యపు గింజపై అశోక చక్రం, మూడు వర్ణాలతో ఉన్న జాతీయ జెండాను వేసి దేశభక్తిని చాటుకున్నాడు. – సాక్షి, సిటీబ్యూరో (చదవండి: దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలి) -
జాతీయ గీతం.. మదనపల్లె రాగం
జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాతా! పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్ఛల జలధితరంగ తవశుభనామే జాగే తవశుభ ఆశిషమాగే గాహే తవ జయ గాథా! జనగణ మంగళ దాయక జయహే భారత భాగ్య విధాతా! జయహే! జయహే!జయహే! జయ జయ జయ జయహే! గురుదేవులు రవీంద్రనాథ్ఠాగూర్ బెంగాలీ భాషలో రచించిన ‘జనగణమన’ గీతాన్ని మదనపల్లెలో ఆంగ్లంలోకి అనువదించారు. అక్కడే ఆ గీతానికి రాగాలు కట్టారని చరిత్ర చెబుతోంది. మదనపల్లెకు..ఠాగూర్ గీతానికి ఏమిటీ సంబంధం.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ను ఘనంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం.. భావం: జనులందరి మనస్సులకూ అధినేతవు. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక. పంజాబు, సింధూ, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగదేశాలతోనూ ,వింధ్య, హిమాలయ పర్వతాలతోనూ, యమునా గంగా ప్రవాహాలతోనూ, ఉవ్వెత్తుగా లేచే సముద్ర తరంగాలతోనూ శోభించే ఓ భారతభాగ్య విధాతా! వాటికి నీ శుభనామం ఉద్బోధ కలిగిస్తుంది. అవి నీ ఆశీస్సులు అర్థిస్తాయి. నీ జయగాథల్ని గానం చేస్తాయి. సమస్త జనులకూ మంగళప్రదాతవు. భారత భాగ్యవిధాతవు అయిన నీకు జయమగు గాక! జయమగుగాక! జయమగుగాక ! మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెకు స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రత్యేక స్థానం ఉంది. ఐరిష్ వనిత డాక్టర్ అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమం చేపట్టి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఇందులో భాగంగా అదే సమయంలో మదనపల్లెలోని బీటీ కళాశాలను విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సందర్శించి జాతీయగీతం జనగణమన(మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా)ను ఆంగ్లంలోకి అనువదించారు. బీటీ కాలేజిని సందర్శిస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెకు ఠాగూర్ తెలుగు ప్రాంతాలలో హోమ్‌రూల్ ఉద్యమం దివ్యజ్ఞాన సమాజం వ్యక్తుల చేయూతతో పుంజుకుంటున్న రోజులవి. హోమ్‌రూల్ ఉద్యమ వ్యాప్తికి ఆంధ్రతిలక్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు చేసిన కృíషి విశేషమైనది. మదనపల్లెలోని బీ.టీ.కళాశాల విద్యార్థులు హోమ్‌రూల్ ఉద్యమానికి సంబంధించి కరపత్రాలు వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేసి ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని పెంచేవారు. బ్రిటీష్ వారికిది నచ్చలేదు.పైగా వారికి కంటగింపుగా మారింది. ఫలితంగా 1917 జూన్ 16న బీ.పీ.వాడియా, జీ.ఎస్.ఆరండేల్తో కలిసి అనిబిసెంట్‌ను అరెస్టు చేశారు. ఈ సమయంలో బీటీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు. బీ.టీ. కళాశాల వేదికగా అనేక కార్యక్రమాలు జరిగాయి. దీంతో కళాశాల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. 1917 సెప్టెంబర్‌లో అనిబిసెంట్, ఆమె సహచరులు కారాగారం నుంచి విముక్తులయ్యారు. అదే సమయంలో బీటీ కళాశాలకు మద్రాసు విశ్వవిద్యాలయం గుర్తింపును రద్దు చేసింది. అయితే అప్పట్లో నేషనల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తింపు ఇవ్వడంతో బీటీ కళాశాల యధావిధిగా నడిచింది. దక్షిణ భారతదేశ పర్యటనకు వచ్చిన ఠాగూర్ అప్పట్లో బీటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండే ఐరిష్ జాతీయుడైన ప్రముఖ విద్యావేత్త జేమ్స్ హెన్రీ కజిన్స్ ఆహ్వానం మేరకు మదనపల్లెకు వచ్చారు. ఠాగూర్ రాసిన జనగణమన గీతం తర్జుమా విశ్వకవి గీతాలాపన విశ్వకవి రవీంద్రుడు 1919 ఫిబ్రవరి 25న మదనపల్లెకు వచ్చారు. ఇక్కడి వాతావరణం ఆయనకు ఎంతోగానో నచ్చడంతో వారం రోజుల పాటు మార్చి 2 వరకు కాలేజీ ఆవరణంలోని కాటేజీలో బస చేశారు. అదే సమయంలో బెంగాలీ భాషలో ఉన్న మన జాతీయగీతం జనగణమనను ఆంగ్లంలోకి అనువదించారు. అప్పట్లో బీటీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉన్న జేమ్స్ హెన్రీ కజిన్స్ భార్య మార్గరేట్ కజిన్స్ సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఠాగూర్ అనువదించిన జనగణమన గీతాన్ని మార్గరేట్ కజిన్స్ బాణి సమకూర్చి విద్యార్థులతో కలిసి ఫిబ్రవరి 28న స్వయంగా ఆలపించారు. నాటి బీటీ కళాశాలలో విద్యార్థుల ఆలాపనతో ప్రారంభమైన జాతీయగీతం నేడు దేశ, విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడి నరనరాల్లో జీర్ణించుకుపోయింది. 1950 జనవరి 24న జనగణమనను భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయ గీతంగా ప్రకటించింది. జాతీయగీతం భారతీయులు పలికినంతకాలం చరిత్రపుటల్లో మదనపల్లె చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ గీతాన్ని ఠాగూర్ తన స్వదస్తూరితో రాయడంతో పాటు చివరలో కింది భాగాన మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని రాసి సంతకం చేశారు. -
16న ఏకకాలంలో ‘జనగణమన’ ఎక్కడివాళ్లు అక్కడే పాల్గొందాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజలందరిలో దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తి మేల్కొలిపేలా అంగరంగ వైభవంగా దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 15 రోజుల ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 16న రాష్ట్రమంతటా ఏకకాలంలో ‘తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన’నిర్వహించాలని, ఎక్కడివాళ్లక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్టు 21న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయితీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, అన్ని రకాల స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్య్ర పోరాట వీరులకు ఈ సమావేశాల్లో ఘన నివాళులు అర్పించాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’కార్యక్రమంపై మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కె. కేశవరావు నేతృత్వంలోని ఉత్సవ కమిటీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు మొదలు ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువత యావత్ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాలల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ ఉచితంగా జాతీయ జెండాలు... ఈ నెల 15న ఇంటింటిపై జాతీయ జెండాను ఎగరేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రాష్ట్రంలోని మొత్తం ఒక కోటీ 20 లక్షల గృహాలకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నెల 9 నుంచి మున్సిపాలిటీలు, పంచాయతీల ఆధ్వర్యంలో జెండాల పంపిణీ చేపట్టాలన్నారు. 8న ఘనంగా ఉత్సవాల ప్రారంభం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఆగస్టు 8న వజ్రోత్సవ ప్రారంభ సమారోహాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్మీ, పోలీస్ బ్యాండుతో రాష్ట్రీయ సెల్యూట్, జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అనంతరం స్వాగతోపన్యాసంతోపాటు, సభాధ్యక్షుడి తొలిపలుకులు, సీఎం కేసీఆర్ వజ్రోత్సవ వేడుకల ప్రత్యేక సందేశ ప్రసగం, వందన సమర్పణ ఉండనుంది. సీఎం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు.. ► బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు సహా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక అలంకరించడంతోపాటు ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రతిష్టాత్మక భవనాలపై జాతీయ జెండాలు ఎగరేయాలి. ► ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వక్తృత్వ, వ్యాస రచన, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించాలి. ► ప్రతిరోజూ ప్రార్ధన సమయంలో విద్యాసంస్థల్లో ఎంపిక చేసిన దేశభక్తి గీతాలను మైకుల ద్వారా వినిపించాలి. ► రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ‘గాంధీ’సినిమాను ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు ప్రతిరోజూ ప్రదర్శించాలి. ► స్వాతంత్య్ర సమరం ఇతివృత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలను, ముషాయిరాలు చేపట్టాలి. ► ప్రముఖ గాయకులు, సంగీత విధ్వాంసులతో సంగీత విభావరి. ► సమాజంలో నిరాదరణకు గురైన వర్గాలను గుర్తించి ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు. ► జిల్లాకో ఉత్తమ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, పాఠశాల, రైతు, డాక్టర్, ఇంజనీర్, పోలీస్ తదితర ఉద్యోగులు, కళాకారుడు, గాయకుడు, కవిని గుర్తించి సత్కరించాలి. ► రవీంద్ర భారతిలో 15 రోజులపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా నిర్వహించే రోజువారీ కార్యక్రమాలు.. ► ఈ నెల 8: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవం ► ఈ నెల 9న: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ మొదలు ► 10: వన మహోత్సవంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు ► 11: యువత, క్రీడాకారులు, ఇతరులతో ఫ్రీడం 2కే రన్ ► 12: రాఖీ సందర్భంగా వివిధ మీడియాల సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి ► 13: వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు ► 14: సాంస్కృతిక సారథి కళాకారులతో నియాజకవర్గ కేంద్రాల్లో జానపద కార్యక్రమాలు. ట్యాంక్‌బండ్ సహా రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా వెలుగులు ► 15: స్వాతంత్య్ర వేడుకలు ► 16: ఏకకాలంలో తెలంగాణవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాలు ► 17: రక్తదాన శిబిరాలు ► 18: గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ‘ఫ్రీడం కప్’పేరుతో ఆటల పోటీలు ► 19: దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లలో ఖైదీలకు పండ్లు, మిఠాయిల పంపిణీ ► 20: దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని చాటేలా ముగ్గుల పోటీలు ► 21: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు ► 22: ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు -
జైహింద్ స్పెషల్: జాతీయ గీతానికి ‘మదన’పల్లె రాగం
గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ (1861–1941) బెంగాలీ భాషలో రచించిన ‘జనగణమన’ గీతాన్ని మదనపల్లెలో ఇంగ్లీష్ లోకి అనువదించారనీ, అక్కడే ఆ గీతానికి రాగాలు కట్టారని చరిత్ర చెబుతోంది! ఏమిటి మదనపల్లెకు, ఠాగూరు గీతానికి సంబంధం? కేవలం 52 సెకన్ల నిడివి గల ‘జనగణమన’ గీతాన్ని స్వాతంత్య్రం పొందిన భారతదేశం 1950 జనవరి 24న జాతీయగీతంగా స్వీకరించింది. తొలి రిపబ్లిక్ దినోత్సవానికి రెండు రోజుల ముందు అన్నమాట! రాగానికి ముందే గానం కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో 1911 డిసెంబర్ 27న తొలిసారి ఈ గీతాన్ని (ఓ పెద్ద సమావేశంలో) పాడారు. అంతకుముందు పాట సిద్ధమయ్యాక 1911 డిసెంబర్ 11న రిహార్సల్స్ చేసినప్పుడు పాడారు. తర్వాత 1912 జనవరిలో కలకత్తాలో జరిగిన బ్రహ్మ సమాజం ప్రార్థనా సమావేశంలో (మూడోసారి) పాడారు. అంతేకాక బ్రహ్మ సమాజం వారి తత్వబోధిని పత్రిక 1912 జనవరి సంచికలో ఈ గీతం అచ్చయ్యింది. ఠాగూరు మేనకోడలు సరళాదేవి చౌదరి 1912లో పాడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనలన్నీ కలకత్తాలోనే జరిగాయి. ఆ పాట బెంగాలీ భాషలో పాడబడింది. 1913లో సాహిత్యపు నోబెల్ బహుమతి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ రచనకు రావడం మరో విశేషం. ఇది భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ బహుమతి! దక్షిణాదికి ‘దివ్యజ్ఞానం’ 1914లో బాలగంగాధర తిలక్ మహాశయుడు పూనా పట్టణంలో ‘హోమ్ రూల్ లీగ్’ ను స్థాపించి ఉద్యమంగా చేపట్టారు. అనిబిసెంట్ కు ఇది బాగా నచ్చింది. దక్షిణాదిలో ఇలాంటి ఉద్యమాన్ని అదే పేరుతో 1916లో ప్రారంభించారు. దీనికి ముందే అనిబిసెంట్ పూనికతో ‘దివ్యజ్ఞాన సమాజం’ మద్రాసులో ఏర్పడి, మంచి వనరులు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంతో 1915లో మదనపల్లెలో బీసెంట్ థియోసాఫికల్ కళాశాల (బి.టి.కాలేజి) స్థాపించారు. అంతకుముందు ఇండియన్ బాయ్స్ స్కౌట్ మూవ్మెంట్, నేషనల్ ఎడ్యుకేషన్ స్కీమ్ నిర్వహించి, ఆ ప్రాంతానికి కళాశాల అవసరమని భావించి, దివ్యజ్ఞాన సమాజం వారు మదనపల్లెలోనే ప్రారంభించారు. ధర్మవరం, మదనపల్లె, చిత్తూరు, చంద్రగిరి, కడప వంటిచోట్ల థియోసాఫికల్ సొసైటీ వారి లాడ్జిలు (కేంద్రాలు) ఏర్పడ్డాయి. మదనపల్లెకు ఠాగూర్ తెలుగు ప్రాంతాలలో హోమ్ రూల్ ఉద్యమం దివ్యజ్ఞాన సమాజం వ్యక్తుల చేయూతతో పుంజుకుంది. హోమ్ రూల్ ఉద్యమ వ్యాప్తికి ’ఆంధ్ర తిలక్’ గాడిచర్ల హరిసర్వోత్తమరావు చేసిన కృషి విశేషమైనది. బి.టి.కళాశాల విద్యార్థులు హోమ్ రూల్ ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలు వివిధ ప్రాంతాలలో అందజేసేవారు. బ్రిటిష్ వారికిది కంటగింపుగా తయారైంది. ఫలితంగా 1917 జూన్ 16న బి.పి. వాడియా, జి.ఎస్.ఆరండేల్ తో కలసి అనిబిసెంట్ ను అరెస్టు చేశారు. ఈ సమయంలో బి.టి. కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా సమావేశాలు నిర్వహించారు. ఇలాంటి సమావేశాలకు బి.టి. కళాశాల కేంద్ర బిందువు అయ్యింది. ఈ విషయాలను బ్రిటిషు ప్రభుత్వం గుర్తు పెట్టుకుంది. 1917 సెప్టెంబరులో అనిబిసెంట్, ఆమె సహచరులు కారాగారం నుంచి విముక్తులయ్యారు. కానీ, బి.టి. కళాశాలకు మద్రాసు విశ్వవిద్యాలయపు అనుబంధాన్ని రద్దు చేశారు. ఈ సమయంలో అనిబిసెంట్ విభిన్నంగా ఆలోచించి రవీంద్రనాథ్ ఠాగోర్ నిర్వహించే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా చేశారు. ఇదీ నేపథ్యం! కనుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెను సందర్శించారు. గురుదేవుని గీతాలాపన గురుదేవులు 1919లో మదనపల్లె వచ్చినపుడు బి.టి. కళాశాలలోని బిసెంట్ హాల్ లో ఫిబ్రవరి 28న ‘జనగణమన’ గీతాన్ని స్వయంగా పాడారు. ఆ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న మార్గరెట్ కజిన్ (Mrs Margaret Cousins) ఈ గీతాన్ని ఠాగూర్ సలహాల మేరకు పాశ్చాత్య బాణిలో రాగాలు రాశారు. మార్గరెట్ కజిన్స్ ఐరిష్ కవి డా. జేమ్స్ కజిన్స్ శ్రీమతి. ఈ సంగతులన్నీ డా. జేమ్స్ కజిన్స్ రాసిన ఆత్మకథ ‘వుయ్ టు టుగెదర్’ అనే గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి! అదే సమయంలో ఠాగూర్ ‘జనగణమన’ బెంగాలి గీతాన్ని ‘ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’గా తనే ఆంగ్లంలోకి అనువదించారు. 2018–19 సమయంలో మదనపల్లెలోని బి.టి. కళాశాలలో ఈ అపురూప సంఘటనలకు శత వార్షిక ఉత్సవాలు జరిగాయి. కానీ కలకత్తా వెలుపల మొట్టమొదటిసారి ‘జనగణమన’ గీతం పాడబడింది మదనపల్లెలోనే. ఈ రకంగా మదనపల్లె పట్టణానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ ఊరితో మన జాతీయ గీతానికి సంబంధించి ఇన్ని సందర్భాలు ముడిపడి ఉన్నాయి. భారత్‌కు ముందే బోస్! అప్పటికి ఈ గీతానికి పెద్ద ప్రాచుర్యం లేదు. 1935లో డెహ్రడూన్ స్కూల్ లో పాఠశాల గీతంగా స్వీకరించారు. సుభాష్ చంద్రబోస్ తన ఐఎన్ఏ సమావేశంలో 1942 సెప్టెంబరు 11న ఈ పాటను భారతదేశపు జాతీయ గీతంగా పాడించారు. 1945 లో ‘హమ్ రహి’ సినిమాలో తొలిసారిగా వాడారు. ఠాగూర్ 1941లో గతించారు, ఈ గీతానికి సంబంధించి ఏ వైభవాన్నీ వారు చూడలేదు! ‘జనగణమన’ గీతచరిత్రలో మదనపల్లె చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది! -డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
సీఎం యోగి కీలక నిర్ణయం.. అక్కడ జాతీయ గీతం తప్పనిసరి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు గురువారం జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో ప్రతీరోజు తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ యోగి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి తెలిపారు. జాతీయ గీతం ఆలపించడం మదర్సా విద్యార్థులందరిలో జాతీయతా భావాన్ని పెంపొందిచేలా చేస్తుందని అన్నారు. Uttar Pradesh Madrasa Education Board Council has made singing of National Anthem mandatory at madrasas before the start of classes. — ANI UP/Uttarakhand (@ANINewsUP) May 12, 2022 ఇది కూడా చదవండి: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం -
సగర్వంగా మాతృభాషలో మాట్లాడండి
న్యూఢిల్లీ: ప్రజలు సగర్వంగా తమ మాతృభాషల్లోనే మాట్లాడుకోవాలని ప్రధాని మోదీ కోరారు. భాషల సంపన్నతలో మనకు సాటి మరెవరూ లేరన్నారు. ప్రజాదరణ పొందిన పలు భారతీయ గీతాలను వివిధ భాషల్లో వీడియోలుగా రూపొందించి, వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చి, దేశ భిన్నత్వాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలని ప్రధాని యువతకు పిలుపునిచ్చారు. జాతీయ గీతం సహా పలు భారతీయ గీతాలకు అనుగుణంగా పెదాలు కదుపుతూ(లిప్ సింకింగ్) తయారు చేసిన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టాంజానియాకు చెందిన కవలలు కిలి పౌల్, నీమాలను ఆయన ఉదహరించారు. ఆదివారం ప్రధాని ‘మన్‌కీ బాత్’లో దేశ ప్రజలద్దేశించి మాట్లాడుతూ ఇటీవల జరుపుకున్న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ పైమాటలన్నారు. దేశంలో 121 మాతృభాషలుండగా, వీటిలో 14 భాషలను కోటి మందికి పైగా ప్రజలు నిత్యం మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీకి మూడో స్థానం దక్కిందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన తర్వాత కూడా చాలా మంది దేశవాసుల్లో ఇప్పటికీ వేషభాషలు, ఆహార పానీయాలకు సంబంధించి అపోహలు, అభ్యంతరాలు ఉన్నాయన్నారు. నూతన విద్యా విధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ప్రొఫెషనల్ కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు కృషి జరుగుతోందన్నారు. బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, టాంజానియా మాజీ ప్రధాని ఒడింగా కూతురు రోజ్మేరీ వంటి వారు మన ఆయుర్వేద విధానం పట్ల మక్కువ పెంచుకున్నారన్నారు. దేశంలో ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు ఆయుష్ శాఖను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ప్రధాని మోదీ.. పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించేందుకు, వివిధ రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సును పెంచినట్లు చెప్పారు. ట్రిపుల్ తలాక్ వంటి సామాజిక దురాచారాలనూ రూపుమాపాం. ట్రిపుల్ తలాక్‌పై చట్టం తీసుకువచ్చాక దేశంలో ట్రిపుల్ తలాక్ కేసుల్లో 80% తగ్గుదల కనిపించిందన్నారు. మార్పు కోరుతూ మహిళలు ముందుకు రావడమే ఈ పరిణామానికి కారణమైందన్నారు. అస్సాంలోని కోక్రాఝర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్, జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లలో పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు జరుగుతున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
జాతీయ గీతాన్ని అవమానించిన సీఎం మమతా బెనర్జీ.. కోర్టు సమన్లు జారీ
ముంబై: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబై మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల మమతా ముంబై వచ్చిన సమయంలో జాతీయ గీతాన్ని అవమానపరిచారనే ఆరోపణలపై దాఖలైన కేసులో మార్చి 2న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా డిసెంబరు 1, 2021న ముంబైలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అవమానించారని మహారాష్ట్రకు చెందిన బీజేపీ కార్యకర్త, న్యాయవాది వివేకానంద గుప్తా ఆరోపించారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మెజిస్ట్రేట్ కోర్టును కోరారు. చదవండి: గవర్నర్‌కు షాకిచ్చిన దీదీ.. ట్విటర్ అకౌంట్ బ్లాక్.. ముంబైలో ఈకార్యక్రమానికి హాజరైన బెనర్జీ జాతీయ గీతంలోని మొదటి రెండు పద్యాలను కూర్చొని ఆలపించారని, ఆ తర్వాత నిలబడి మరో రెండు శ్లోకాలు పఠించారని, ఆ తర్వాత అకస్మాత్తుగా ఆగిపోయారని కోర్టుకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే మమతా బెనర్జీ జాతీయగీతాన్ని ఆలపించి, ఆ తర్వాత వేదికపై నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదుదారుడి వాంగ్మూలం, వీడియో క్లిప్,యూట్యూబ్‌లోని వీడియోల ద్వారా ప్రాథమికంగా స్పష్టంగా తెలుస్తోందని కోర్టు పేర్కొంది. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971లోని సెక్షన్ 3 ప్రకారం మమతా శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డాడని ఈ ప్రాథమిక విచారణ రుజువు చేస్తుందని తెలిపింది. చదవండి: మంటల్లో లారీ.. ప్రాణాలకు తెగించి రియల్ హీరో అయ్యాడు -
జాతీయ గీతాలాపన సందర్భంగా కోహ్లి అనుచిత ప్రవర్తన.. ఫైరవుతున్న ఫ్యాన్స్
Virat Kohli Slammed For Chewing Gum During National Anthem: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేకి ముందు భారత జాతీయ గీతాలాపన సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన పనికి భారత అభిమానులు తీవ్రంగా హర్ట్ అవుతున్నారు. ఆన్ ఫీల్డ్ ప్రవర్తన ఎలా ఉన్నా, దేశం పట్ల అమితమైన గౌరవం కలిగిన కోహ్లి.. మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగిన జాతీయ గీతాలాపన సమయంలో చూయింగ్ గమ్ నములుతూ ఉదాసీనంగా కనిపించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోహ్లి వింతగా ప్రవర్తించడంతో భారతీయులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. Virat Kohli busy chewing something while National Anthem is playing. Ambassador of the nation.@BCCI pic.twitter.com/FiOA9roEkv — Vaayumaindan (@bystanderever) January 23, 2022 ఆన్ ఫీల్డ్(బ్యాటింగ్ ఫామ్), ఆఫ్ ద ఫీల్డ్(కెప్టెన్సీ విషయంలో బీసీసీఐతో గొడవ) విషయాలు పక్కకు పెట్టి మరీ అతనిపై విరుచుకుపడుతున్నారు. జాతీయ గీతం ఆలపించేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని ఫైరవుతున్నారు. కోహ్లి నుంచి ఇలాంటి అనుచిత ప్రవర్తన ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. జాతీయ జట్టుకు ఆడడం ఇష్టం లేకపోతే తప్పుకోవాలని ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం సోషల్‌మీడియాలో జోరుగా చర్చ సాగుతుంది. కాగా, టీమిండియా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాక కోహ్లి ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. ఎప్పుడూ కసిగా కనిపించే కోహ్లిలో ఆ ఫైర్ మిస్ అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మైదానంలో, డ్రెసింగ్ రూమ్‌లో పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. కోహ్లి ఇలా మారడానికి బీసీసీఐ అతని పట్ల వ్యవహరిస్తున్న తీరే కారణమని అతని అభిమానులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. గంగూలీ, జై షాలు జట్టు నుంచి సైతం తప్పిస్తామని వార్నింగ్‌లు ఇచ్చారని, అందుకే కోహ్లి ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడని గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లికి.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని కూడా లాక్కుంది. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం అతనే స్వయంగా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. చదవండి: ఇన్ని రోజులు కెప్టెన్‌గా ఉన్నావు కాబట్టి నడిచింది.. ఇకపై కుదరదు..! -
మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్
-
మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్
స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలకు జాతీయ గీతాలాపన చేసి దేశ భక్తిని చాటుకుంటాం.ఇటీవల సినిమా థియేటర్లో జాతీయ గీతం వస్తుంటే అక్కడున్న వారంతా నిల్చొని ‘జన గణ మన’ను ఆలపిస్తున్న విషయం తెలిసిందే. అయితే బార్లో జాతీయ గీతం పాడి భక్తికి ప్రదేశంతో సంబంధం లేదని నిరూపించారు మందుబాబులు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చదవండి: వైరల్: ధవణి దీనంగా.. ప్లీజ్ సీఎం తాతా వాటిని పూడ్చండి.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్లు జాతీయ గీతాన్ని ఆలపించడం సాధారణం. ఆ సమయంలో ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని వారంతా గీతాన్ని ఆలపిస్తారు. అయితే హైదరాబాద్‌లోని గోల్నాక బార్ అండ్ రెస్టారెంట్లో మందు తాగేందుకు వెళ్లిన వారంతా టీవీలో మ్యాచ్ ముందు జాతీయగీతం ప్లే అవుతుంటే అందరూ లేచి నిలబడ్డారు ప్రతీ ఒక్కరూ నిల్చోని జాతీయ గీతాన్ని ఆలపించారు. చదవండి: ఎవ్వరు చెప్పినా వినేది లేదు..చర్యలు తప్పవు: సిద్ధిపేట కలెక్టర్ మత్తులో ఉన్నా ఏమాత్రం తూలకుండా జన గణ మన అంటూ దేశంపై ఉన్న ప్రేమను చాటారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ‘మత్తులో ఉన్నా.. దేశభక్తి మరువలేదు. సూపర్ మందుబాబులు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
‘జనగణమన’ మరిచిపోయి దిక్కులు చూసిన ఎంపీ..!
లక్నో: స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు ఆదివారం దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలుచోట్ల అపశ్రుతి, తప్పులు దొర్లాయి. తాజాగా ఓ లోక్‌సభ సభ్యుడు జాతీయ గీతం ‘జనగణమన’ మరచిపోయారు. జెండా ఎగురవేసిన అనంతరం జాతీయ గీతం ఆళపిస్తుండగా ఎంపీ నోరు తిరగలేదు. ఆయనతో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా జాతీయ గీతం పాడలేక అవస్థలు ఎదుర్కొన్నారు. కొందరు గీతం మరచిపోయి మధ్యలోనే ఆపివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఎస్టీ హసన్ ఉత్తరప్రదేశ్ మొరదాబాద్‌లోని గుల్షాహీద్ పార్క్ సమీపంలో స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యారు. జెండా ఎగురవేసిన అనంతరం ఎంపీ హసన్‌తో పాటు ఆయన కార్యకర్తలు జనగణమన ప్రారంభించారు. వారు జాతీయ గీతాన్ని.పాడుతూ మధ్యలో మరచిపోయి ఇష్టమొచ్చినట్టు పాడారు. చివరకు జయ జయహే అనేది పూర్తిగా అనకుండానే ముగించారు. ఈ గీతం ఆళపిస్తుండగా ఎంపీ హసన్ బిత్తిరిచూపులు చూస్తుండడం వైరల్‌గా మారింది. ఈ సంఘటన రాజకీయ దుమారం రేపింది. ‘ఎంపీ, ఆయన కార్యకర్తలు జాతీయ గీతాన్ని పాడలేకపోయారు. మన నేతల పరిస్థితి ఇలా ఉంది’ అని బీజేపీ సీనియర్ నాయకుడు సంబిత్ పాత్ర ట్వీట్ చేస్తూ ఎద్దేవా చేశారు. So finally they thought that the best way out of the mess that they had created was to quickly move on to “जय है” ..and then move out .. वाह समाजवादियों वाह!! pic.twitter.com/BbqFffanMi — Sambit Patra (@sambitswaraj) August 15, 2021 -
13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతం: వైరల్ వీడియో
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి భారత్ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించారు. దీంతో 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతాన్ని వినిపించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో బంగారు పతకం సాధించినపుడు భారత జాతీయ గీతాన్ని వినిపించగా.. మళ్లీ ఇన్నేళ్లకు నీరజ్ చోప్రా స్వర్ణం సాధించడంతో ఒలింపిక్స్‌లో జాతీయ గీతాన్ని వినిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మొదటి ప్రయత్నంలో చోప్రా జావెలిన్‌ను 87.03 మీటర్లకు విసిరారు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లకు విసిరారు. కాగా రెండో స్థానంలో చెక్ రిపబ్లిక్కు చెందిన వడ్లెక్ నిలిచారు. ఈయన గరిష్ఠంగా 86.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు. అంతే కాకుండా చెక్ రిపబ్లిక్కు చెందిన విటెజ్స్లావ్ వెస్లీ మూడో స్థానంలో నిలిచారు. ఆయన గరిష్టంగా 85.44 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు. ఇక అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన గంట వ్యవధిలోనే లక్షకు పైగా నెటిజనులు వీక్షించారు. అంతేకాకుండా నీరజ్ చోప్రాకు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తూ.. అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రాకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. #IND National Anthem at Olympic Stadium in #Tokyo2020 Thank you @Neeraj_chopra1 #NeerajChopra pic.twitter.com/68zCrAX9Ka — Athletics Federation of India (@afiindia) August 7, 2021 -
ఆ పాట కాపీనా? మ్యూజిక్ డైరెక్టర్ని ఆడేసుకుంటున్న నెటిజన్లు
సినిమా ఇండస్ట్రీలో కాపీల వివాదాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. స్టోరీ, పోస్టర్లు, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలా చాలా విషయాల్లో ఇతర సినిమా నుంచి కాపీ కొట్టారనే ఆరోపణలు అనేక సందర్భంలో రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో కాపీల వివాదాలు కోకొల్లలుగా పుడుతున్నాయి. తెలుగు నుంచి బాలీవుడ్, హాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనుమాలిక్ సినిమాలోని పాటపై వివాదం చుట్టుముట్టింది. అనుమాలిక్ సంగీతం అందించిన దిల్జాలే సినిమా బాలీవుడ్లో 1996లో విడుదలైంది. ఇందులో ‘మేరా ముల్క్ మేరా దేశ్’ అనే పాట ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. టోక్యో ఒలింపిక్స్‌లో ఇజ్రాయిల్ జిమ్నాస్ట్ అర్టెమ్ డోల్గోప్యాట్ రెండోసారి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న తర్వత వారి జాతీయ గీతం హత్వికాను ప్లే చేశారు. ఇది విన్న భారత నెటిజన్లు అప్పటి నుంచి అనుమాలిక్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇజ్రాయిల్ జాతీయ గీతం హతిక్వా, అను ముల్క్ మేరా దేశ్ పాటకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇజ్రాయిల్ జాతీయ గీతాన్ని దొంగిలించి తన చిత్రంలో ఉపయోగించుకున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేలాది మంది వరుస ట్వీట్లు చేస్తూ అను మాలిక్ పేరును ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిపారు. నెటిజన్లు కామెంట్లు ఇలా ఉన్నాయి. ‘అను మాలిక్ తమ పాటను కాపీ కొట్టారని ఒలంపిక్ గోల్డ్ తెలుసుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 1996 లోని దిల్జాలేలోని మేరా ముల్క్ మేరా దేశ్ పాట ట్యూన్ కాపీ చేస్తున్నప్పుడు అను మాలిక్ ఇజ్రాయెల్ జాతీయ గీతాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఇంటర్నెట్కు ధన్యవాదాలు., ఇది ఇప్పుడైనా మనకు తెలిసింది. బాలీవుడ్ ఇజ్రాయిల్ జాతీయ గీతాన్ని కాపీ కొట్టింది.. ఇది నెక్స్ట్ లెవల్.. అనుమాలిక్ ఎంతో కచ్చితంగా ఉన్నాడు. ఇజ్రాయిల్ ఎప్పటికీ గోల్డ్ మెడల్ సాధించదని, ఇక తన దొంగతనం బయటపడదని’ అంటూ సంగీత దర్శకుడిని ఓ ఆట ఆడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై మాలిక్ స్పందించలేదు. So Anu Malik didn’t spare even Israeli national anthem while copying tune for Diljale’s Mera Mulk Mera Desh in 1996 Thanks to internet we now know thispic.twitter.com/LtQMyU5dp2 — Monica (@TrulyMonica) August 1, 2021 It took 25 years and Olympic gold 🥇 to realise That Anu Malik copy "Mera Mulk Mera Desh"😅😅😅😅😅😅 https://t.co/Nrgd3uokSM — ₭₳฿łⱤ ₱₳₮ɆⱠ (@kabeerbackup) August 1, 2021 Bollywood copied Israel's national anthem tune, this is next level ..... Anu Malik !! 😂 https://t.co/bZ0VUjJ0dG — Veer Phogat (@VeerPhogat1) August 1, 2021 Anu Malik had confidence Israel will never win a gold and his robbery will remain hidden 😭 https://t.co/PJQClHAJHx — Straight Cut (@StraightCut_) August 1, 2021 No it is not just you. 100% true. I can't get over it. Anu Malik actually copied the Israeli national anthem for one of his songs! Utha le re baba 😂😂 WDTT https://t.co/GvXdvlusyu — Anand Ranganathan (@ARanganathan72) August 1, 2021 -
పాపం రష్యా.. పతకాలు గెలిచినా జాతీయ గీతం వినిపించదు
టోక్యో: రష్యా స్విమ్మర్లు రిలోవ్, కొలెస్నికోవ్ అమెరికన్ల ‘కనక’పు కోటని బద్దలు కొట్టి మరీ బంగారు, రజత పతకాలు గెలిచారు. మరో వైపు జిమ్నాస్ట్‌లు అమెరికా మెరుపు విన్యాసాలకు చెక్ పెట్టారు. అకయిమోవా, లిస్టునోవా, మెల్నికొవా, వురజొవాతో కూడిన రష్యా జట్టు అమెరికా హ్యాట్రిక్ స్వర్ణావకాశాన్ని దెబ్బతీసి మరీ విజేతగా నిలిచింది. ఇంతటి ఘనవిజయాలు సాధించిన రష్యన్లకు పోడియం వద్ద అసంతృప్తే దక్కుతోంది. వ్యవస్థీకృత డోపింగ్ ఉదంతంతో రష్యా దేశంపై నిషేధం కొనసాగుతుండడమే దీనికి కారణం. అయితే నిష్కళంక అథ్లెట్లను మాత్రం రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జెండా కింద పోటీపడేందుకు అవకాశమిచ్చింది. దీంతో పోడియంలో వారి మెడలో పతకాలు పడినా అక్కడ జాతీయ గీతం వినిపించదు. ఓ సంగీతం వినిపిస్తారు. జెండా బదులు ఆర్ఓసీ జెండాను ఎగరేస్తారు. ఇది రష్యా అథ్లెట్లకు పతకం గెలిచిన ఆనందాన్ని దూరం చేస్తోంది -
నాగాలాండ్‌లో అరుదైన దృశ్యం.. 58 ఏళ్ల తర్వాత
కోహిమా: శాసనాలు రూపొందించే చట్టసభలో దాదాపు 58 ఏళ్లుగా జాతీయ గీతం ఆలపించడం లేదు. దేశవ్యాప్తంగా ‘జనగణమన’ ఆలపించడం సంప్రదాయం. కానీ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ అసెంబ్లీలో మాత్రం ఇంతవరకు జాతీయ గీతం ఆలపించలేదు. ఐదు దశాబ్దాల అనంతరం తొలిసారిగా ఇప్పుడు జనగణమనను సభ్యులు పాడారు. ఈ కొత్త సంప్రదాయం ప్రారంభమవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 1962లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడగా రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఆ అసెంబ్లీలో జనగణమనను ప్రజాప్రతినిధులు ఆలపించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగం ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపించి కొత్త సంప్రదాయానికి తెర లేపారు. ఈ పరిణామం ఫిబ్రవరి 12వ తేదీన శుక్రవారం ప్రారంభమైంది. మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తేమ్జన్ ఇమ్నా ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో ఎందుకు జనగణమన గీతం ఆలపించడం లేదో తమకు తెలియదని అసెంబ్లీ అధికారులు చెప్పారు. ఏది ఏమైనా ఇప్పటికైనా ఈ కొత్త సంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. స్పీకర్ షరిన్‌గైర్ లాంగ్‌కుమార్ నేతృత్వంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో ఆధ్వర్యంలో ఈ పరిణామం జరిగింది. 58 years after Nagaland became a state, Jana Gana Mana played in the assembly for the first time. Members of the Assembly stand as the National Anthem “Jana Gana Mana” is played in the House for the very first time in the history of the Nagaland Legislative Assembly. pic.twitter.com/nHLauZhucv — Nandan Pratim Sharma Bordoloi 🇮🇳 (@NANDANPRATIM) February 19, 2021 -
జాతీయగీతం మర్చిపోయిన విద్యాశాఖ మంత్రి
పట్నా: బిహార్ నూతన విద్యాశాఖ మంత్రిని నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. బడికి పోయావా లేదా సామి అంటూ ఎగతాళి చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టి పట్టుమని వారం రోజులు కూడా కావడం లేదు.. ఇన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నాడంటే.. అయ్యగారు ఇంతలోనే ఏం ఘనకార్యం వెలగబెట్టారో అనుకుంటున్నారా. నిజమే మంత్రిగారు చేసింది మాములు తప్పు కాదు. భారతీయుడు అయ్యి ఉండి.. అందులోనూ ప్రజాప్రతినిధిగా ఎన్నికై.. ఏకంగా జాతీయ గీతాన్ని మర్చిపోయాడంటే మామూలు తప్పిదం కాదు కదా. అందుకే నెటిజనులు సదరు మినిస్టర్‌ని ఇంతలా ట్రోల్ చేస్తున్నారు. వివరాలు.. బిహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరీ ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యి.. జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. అయితే మేవలాల్ జనగణమణ పాడుతూ.. మధ్యలో కొన్ని పదాలను మర్చిపోయారు. "పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా" కు బదులుగా "పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా" అని పాడారు. (చదవండి: బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు) ఇందుకు సంబంధించిన వీడియో ఆర్జేడీ నాయకులకు చిక్కింది. "అనేక అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరికి జాతీయ గీతం కూడా తెలియదు. నితీష్ కుమార్ జీ ఇంతకన్నా అవమానం ఏం ఉంటుంది? మీ మనస్సాక్షి ఎక్కడ మునిగిపోయింది?" అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరలవ్వడమే కాక ట్రోల్ అవుతోంది. ఈ వీడియోని ఇప్పటికే 2.2 లక్షల మంది వీక్షించారు. ఇక దీనిపై నెటిజనులు ‘ఇలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.. ఇక విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి’.. ‘ఇది 2020 సంవత్సరం.. ఇప్పటికి జాతీయ గీతం రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం నిజంగా సిగ్గు చేటు’.. ‘స్కూల్లో ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న అంశాలు విద్యాశాఖ మంత్రికి తెలియకపోవడం దురదృష్టం.. అసలు మీరు బడికి వెళ్లారా లేదా’ అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. (చదవండి: బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!) ఇక మేవలాల్ చౌదరిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీకి హెడ్‌గా ఉన్నప్పుడు జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో మేవలాలక్కు భాగం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టిన నితీష్ కుమార్ ద్వంద్వ వైఖరికి సిగ్గుపడుతున్నాం. 60 స్కాముల్లో మేవలాల్‌కు భాగస్వామ్యం ఉంది. అలాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించి ఆ పదవిని కించపరిచారు అంటూ ఆర్జేడీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టీచర్ నిర్వాకంపై తీవ్ర విమర్శలు
రాంచీ: కిండర్ గార్డెన్ పిల్లలకు జార్ఖండ్‌లోని ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయ గీతాలను నేర్పిస్తున్న వ్యవహారం బయటపడతంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు టీచర్ జాతి వ్యతిరేకి అని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. తూర్పు సింఘ్‌భూమ్ జిల్లా జంషెడ్పూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వెలుగుచూసిన ఈ ఉదంతంపై జిల్లా విద్యాశాఖ యంత్రాంగం విచారణ చేపట్టింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. (చదవండి: మన సరిహద్దులు ఆర్మీ చేతుల్లో భద్రం) ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ఆన్లైన్లో పాఠాలు చెప్తున్న ఓ టీచర్ బంగ్లా, పాక్ జాతీయ గీతాలు నేర్చుకోవాలని చెప్పింది. వాటికి సంబంధిచిన యూట్యూబ్ లింకులను వారికి షేర్ చేసింది. దాయాది దేశాల జాతీయ గీతాలు నేర్చుకోవడమేంటని తొలుత పిల్లల తల్లిదండ్రులు తికమకపడ్డారు. కొందరు ఇదేంటని అభ్యంతరం చెప్పారు. ఇక ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర నేత కునాల్ సారంగి ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్ యాంటి నేషనల్‌గా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీ వేశామని జిల్లా విద్యాధికారి శివేంద్ర కుమార్ చెప్పారు. ప్రైవేటు స్కూళ్ల నిర్వాకంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడుతోందని బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆదిత్య సాహు అన్నారు. పిల్లల మెదళ్లలో విషాన్ని నింపాలని చూస్తున్నారని మండిపడ్డారు. (ఆన్లైన్ క్లాసులకు ఫోన్లు లేకపోవడంతో) -
జాతీయ గీతంతో న్యూ ఇయర్‌కు స్వాగతం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల్లో నిరసనకారులు న్యూ ఇయర్‌కు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. ముఖ్యంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి యువత ఎక్కువగా పబ్‌లు, పార్టీలకు సమయం కేటాయిస్తారు.. కానీ అందుకు విరుద్ధంగా దేశ రాజధానిలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. తమ నిరసనల్లో భాగంగా ఢిల్లీలో పలు ప్రాంతాల్లో జాతీయ గీతం పాడుతూ.. కొత్త ఏడాదిని ఆహ్వానించారు. ఇప్పటికే ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయినప్పటికీ.. నిరసనలు చలిని ఏ మాత్రం లెక్కచేయకుండా రోడ్లపైకి చేరకున్నారు. వారిలో అధిక సంఖ్యలో మహిళలు ఉండటం గమనార్హం. కొందరు జాతీయ జెండాలు చేతపట్టుకుంటే.. మరి కొందరు సీఏఏకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఆజాదీ.. ఆజాదీ అంటూ నినాదాలు చేశారు. అలాగే నిరసనకారులు ఒకరికొక్కరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. జాతీయ గీతం పాడటం పూర్తయిన తర్వాత.. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ముగించారు. ఈ సందర్భంగా పలువరు మహిళలు మాట్లాడుతూ.. సీఏఏ వల్ల తమ పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. Shaheen Bagh welcomes the new year with the national anthem. #CAA_NRCProtests pic.twitter.com/gGa82Ddf2X — Asmita Bakshi (@asmitabee) December 31, 2019 -
నలుగురు సినీ ప్రేక్షకులపై కేసు
బెంగళూరు: సినిమాహాల్లో జాతీయగీతం ప్రదర్శించినప్పుడు కుర్చీల్లోంచి లేచి నిలబడలేదన్న కారణంతో నలుగురిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పదిహేను రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబరు 23న బెంగళూరులోని పీవీఆర్ ఓరియన్ సినిమాహాల్లో ప్రదర్శితమవుతోన్న తమిళ సినిమా ‘అసురన్’కు వచ్చిన ప్రేక్షకుల్లో నలుగురు సినిమాకు ముందుగా జాతీయగీతం ‘జనగణమన’ను ప్రదర్శించినప్పుడు లేచి నిలబడలేదు. దీంతో ఓ వ్యక్తి వారిని వీడియో తీశాడు. ఈ వీడియోను సినీ నటి బీవీ ఐశ్వర్య సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఆ నలుగురు వ్యక్తులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే, వారి పేర్లను అందులో పేర్కొనలేదు. -
సినిమా థియేటర్లో హీరోపై దాడి..
బంజారాహిల్స్: జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో సినిమా థియేటర్లో లేచి నిలబడలేదని తోటి ప్రేక్షకుడు ఓ యువకుడిపై దాడికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఆర్కే సినీప్లెక్స్ పీవీఆర్ సినిమాస్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్రపురి కాలనీకి చెందిన సినీనటుడు కార్తీక్ అడుసుమిల్లి గురువారం ఉదయం ఆర్కే సినీప్లెక్స్ పీవీఆర్ సినిమాస్‌లో హిప్పీ సినిమా చూసేందుకు వచ్చాడు.సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించగా ప్రతి ఒక్కరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. కార్తీక్ మాత్రం సీట్లోనే కూర్చున్నాడు. జాతీయ గీతం పూర్తయిన తర్వాత పక్క సీట్లో కూర్చున్న పద్మారావునగర్‌కు చెందిన వ్యాపారి ఆర్వీఎల్ శ్వేత్ హర్ష్ ఇదేం పద్ధతి అంటూ కార్తీక్‌ను నిలదీశాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కార్తీక్ అది తన ఇష్టమని, అడగడానికి నువ్వు ఎవరివంటూ అసభ్యంగా అతడిని దూషించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్వేత్ హర్ష్ కార్తీక్‌పై దాడి చేయడంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. దీంతో థియేటర్ నిర్వాహకులు, సెక్యూరిటీ గార్డులు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేశారు. ఐదు నిమిషాల తర్వాత కార్తీక్ మళ్లీ లేచి నన్నే కొడతావా అంటూ దూషించడంతో శ్వేత్ హర్ష్ మరోసారి అతడిపై దాడి చేయగా అక్కడే ఉన్న కార్తీక్ భార్య అతడిని అడ్డుకుంది. మాటామాటా పెరిగి వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్తీక్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై, తన భార్యపై దాడి చేసిన శ్వేత్ హర్ష్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో కూర్చోవడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు తనను దూషించిన కార్తీక్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా శ్వేత్ హర్ష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నటుడి కుమారుడిపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : నటుడు ఆహుతి ప్రసాద్ కుమారుడు కార్తీక్ ప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఆర్కే సినీప్లెక్స్‌లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్ లేచి నిలబడలేదు. అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్ ప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, క్యాన్సర్‌తో ఆహుతి ప్రసాద్ నాలుగేళ్ల కిందటే మరణించిన విషయం తెలిసిందే. -
జాతీయగీతం వచ్చినప్పుడు నిల్చోలేదని..
బెంగళూరు : సినిమా థియెటర్లో జాతీయగీతం వచ్చేటప్పుడు నిల్చోలేదని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాలు.. జితిన్ కుమార్(29) అనే వ్యక్తి బుధవారం అవెంజర్స్ సినిమా చూడటానికి స్థానిక ఐనాక్స్‌మాల్‌కి వెళ్లాడు. అయితే సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం వచ్చినప్పుడు జితన్ లేవలేదు. దాంతో సుమన్ అనే వ్యక్తి జితిన్‌తో గొడవపడటం ప్రారంభించాడు. వీరి గొడవ వలన ఇతర ప్రేక్షకులు ఇబ్బంది పడటంతో మాల్ సిబ్బంది వచ్చి వారిని బయటకు వెళ్లమని చెప్పారు. అనంతరం సుమన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జితిన్ మీద ఫిర్యాదు చేశాడు. జితిన్ జాతీయ గీతాన్ని అవమానపరిచాడని.. దీని గురించి ప్రశ్నించినందుకు తనను కూడా నిందించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో పోలీసులు జితిన్‌ను అరెస్ట్ చేశారు. ఈ విషయం గురించి జితిన్ ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని తెలియజేశాడు. జరిగిన విషయం పూర్తిగా తెలసుకోకుండానే.. మీడియా తనను దేశ ద్రోహిగా చిత్రీకరించిందని జితిన్ వాపోయాడు. ఈ వివాదం గురించి జితిన్ మాట్లాడుతూ.. ‘జాతీయ గీతం వచ్చినప్పుడు నేను లేవలేదు. దాంతో కొందరు దుండగులు నాతో గొడవకు దిగారు. వారిలో ఒక వ్యక్తి నన్ను శారీరకంగా గాయపర్చాడు. మాల్ యాజమాన్యం దీనిపై స్పందించలేదు. అంతేకాక నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాకు కనీసం బెయిల్ కూడా లభించలేదు. ఈ విషయంలో మీడియా స్పందించిన తీరు నాక చాలా బాధకల్గించింది. నా తరఫు వాదన వినకుండానే.. నన్ను దేశ ద్రోహిగా చిత్రికరించార’ని జితిన్ వాపోయాడు. అంతేకాక ట్విటర్ వేదికగా ఐనాక్స్‌ను బాయ్‌కాట్ చేయాలని కోరుతున్నాడు. @ndtv @TimesNow @abpnewstv @IndiaToday I was assaulted and harassed by thugs at an @INOXMovies theater Heres the Reddit post.https://t.co/SW5rsgiEUL Now the mall came out officially denying anything happened. This is not right! Please share and retweet#BOYCOTTINOX — Jithin Chand (@jithknot) May 10, 2019 -
దుబాయ్ చరిత్రలోనే తొలిసారి..
దుబాయ్ : ఎడారి దేశంలో తొలిసారి.. దివ్వేల పండుగ జరుగుతుంది. అది కూడా ఏకంగా పది రోజులు. అవును.. దుబాయ్ ప్రభుత్వం తొలిసారి తమ దేశంలో దీపావళి ఉత్సవాలు నిర్వహిస్తోంది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో కలిసి దాదాపు పది రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు దుబాయ్ అధికారులు తెలిపారు. నవంబర్ 1న మొదలైన ఈ వేడుకలు ఈ నెల 10 వరకూ కొనసాగుతాయన్నారు. వేడుకల్లో భాగంగా పది రోజులపాటు వేర్వేరు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల చేత ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు.. భంగ్రా ప్రదర్శనలతో పాటు దీపావళి సందర్భంగా దీపాల ప్రదర్శనే కాక ఫైర్‌క్రాకర్స్ షోని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీపావళి వేడుకల సందర్భంగా దుబాయ్ అధికారులు మరో అరుదైన రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎక్కువ మంది చేత ఒకేసారి ఎల్ఈడీ దీపాలను వెలిగించి.. గిన్నిస్ రికార్డ్ సృష్టించాలని దుబాయ్ ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలిస్తోంది. ఇవన్ని ఒక ఎత్తయితే.. దీపావళి వేడుకలకే హైలెట్‌గా నిలిచిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఏంటంటే దీపావళి వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మన జాతీయ పతాకాన్ని ప్రదర్శించడమే కాకుండా.. దుబాయి పోలీస్ బ్యాండ్ మన జాతీయ గీతాన్ని గిటార్ మీద ప్లే చేశారు. Diwali celebration in Dubai. Friend has shared this video from Ground Zero. A proud moment Indeed! Happy Diwali to all brother and Sisters of Dubai. pic.twitter.com/JflSGqqsoL — Prakash Priyadarshi (@priyadarshi108) November 5, 2018 అంతేకాక దుబాయ్ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ కూడా దివాళి వేడుకల్లో పాలుపంచుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులకు భారతీయ సాంప్రదాయ మిఠాయిలను, చిరుతిళ్లను అందిస్తోంది. -
భారత జాతీయ గీతాన్ని ఆలపించిన పాక్ ఫ్యాన్స్
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా గత రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ను 162 పరుగులకే కట్టడి చేసి, ఆపై విజయాన్ని సునాయాసంగా అందుకుంది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్ల సభ్యులు ఫీల్డ్‌లోకి వెళ్లిన తర్వాత తమ దేశాల జాతీయ గీతాన్ని ఆలపించారు. కాగా, భారత జాతీయ గీతం రన్ అవుతున్న సందర్భంలో పాకిస్తాన్ ఫ్యాన్స్ సైతం అందుకు తమ శృతిని జత చేశారు. పలువురు పాక్ అభిమానులు నిలబడి మరీ భారత జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపైభారత జాతీయ పలువురు భారత నెటిజన్లు వారిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరొకవైపు దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. -
జాతీయ గీతాన్ని ఆలపించిన పాక్
-
కంటతడి పెట్టిన ప్రపంచ మాజీ సుందరి!
-
కంటతడి పెట్టిన ఐశ్వర్యరాయ్!
ముంబై : ప్రపంచ మాజీ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కంటతడి పెట్టారు. ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఐశ్వర్య, జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో చాలా ఉద్వేగానికి గురయ్యారు. జాతీయ గీతం పాడుతూనే, ఎంతో గర్వకారకంగా ఫీలై కంటతడి పెట్టేశారు. జాతీయ గీతం ఆలపన చివరిలో ఉబికి వస్తున్న తన కన్నీళ్లను ఎవరూ చూడకుండా తుడుచుకున్నారు. కానీ అప్పటికే ఐష్ పెట్టిన కన్నీళ్లు మీడియా కంట పడ్డాయి. ఐశ్వర్య కంటతడి పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో ఐసీఎం ఉమెన్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ మాట్లాడుతూ... ఆధునిక కాల మహిళలకు, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామికవేత్తలకు ప్రాతినిధ్యం వహించేలా తనను ప్రధాన అతిథిగా ఆహ్వానించడం చాలా గర్వకారకంగా ఫీలవుతున్నట్టు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించడానికి అత్యంత ప్రతిష్టాత్మక వేదికల్లో ఐసీఎం ఉమెన్ ఒకటి. ఈ ఈవెంట్లో షబానా అజ్మి, సోను నిగమ్, జుహి చావ్లా, రోనిత్ రాయ్‌లు కూడా పాల్గొన్నారు. -
జాతీయ గీతాన్ని అవమానించిన ప్రిన్సిపాల్
లక్నో : విద్యార్ధులకు జాతీయ గీతంపై గౌరవాన్ని పెంపొందించాల్సిన ఉపాధ్యాయుడే దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ గీతంపై అవమానకరంగా ప్రవర్తించాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాలేజీలో జెండా ఆవిష్కరించిన అనంతరం విద్యార్థినిలు జాతీయ గీతం పాడుతుండగా కళాశాల ప్రిన్సిపాల్ దానికి నిరాకరించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌ఘనీలో మదర్సా బాలికల కళాశాలలో బుధవారం చోటుచేసుకుంది. సహా ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు మదర్సా ప్రిన్సిపాల్ ఫజ్ల్‌ర్ రెహ్మాన్‌తో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు జూనైద్ అన్సారీ, నిజాంలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అరేబియా అలే సునాత్ బాలికల కళాశాల యూపీ మదర్సా బోర్డుపై 2007లో నమోదు చేయబడి ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న కాలేజేలో ప్రిన్సిపాల్ జెండా ఆవిష్కరించగానే విద్యార్థినిలు జాతీయ గీతం పాడుతుండగా వారికి ప్రిన్సిపాల్ వారించినట్లు త్రిపాఠి అనే ఉపాధ్యాయుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. త్రిపాఠి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా జాతీయ గీతాన్ని అవమానించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుని, కళాశాల గుర్తింపుని రద్దు చేయవల్సిందిగా జిల్లా మెజిస్టేట్ అమర్నాథ్ ఉపాధ్యాయ అధికారులను ఆదేశించారు. కాగా దేశంలోని అన్ని మదర్సాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తప్పనిసరిగా నిర్వహించాలని కే్ంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాల జారీ చేసిన విషయం తెలిసిందే. -
‘బసవతారకం’లో వినూత్న కార్యక్రమం
బంజారాహిల్స్ : కేన్సర్‌తో స్వరపేటిక తొలగించిన రోగులు జాతీయ గీతాన్ని ఆలపించి కోల్పోయిన గొంతును తిరిగి సాధించవచ్చనే విశ్వాసాన్ని పొందారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వరపేటిక తొలగించడంతో కృత్రిమ వాయిస్ బాక్స్ అమర్చిన రోగులు తాము మాట్లాడుతున్నామన్న విషయాన్ని నలుగురికీ తెలియజేసేందుకు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ ఆస్పత్రిలో ఇప్పటి దాకా సుమారు 200 మందికి రోగంతో స్వరపేటిక తొలగించి దాని స్థానంలో ‘టీఈపీ’ మిషన్లను అమర్చారు. ఈ సందర్భంగా ఆంకాలజీ సర్జన్స్, ఫిజీషియన్స్, స్పీచ్ థెరపిస్టులు ఆధ్వర్యంలో కొందరు గీతాన్ని ఆలపించారు. ఆంకాలజీ విభాగం హెడ్ అండ్ నెక్ సర్జరీ వైద్యులు చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. స్వరపేటికను తొలగించిన వారు మాట్లాడే శక్తిని కోల్పోయి దివ్యాంగులుగా జీవితం గడపాల్సి వచ్చేదని, ఇటీవల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చికిత్సా విధానాలతో వారికి ఊరట లభిస్తోందన్నారు. స్వరపేటిక లేనివారు పాడడం కష్టమైనా వారిలో ధైర్యం నింపేందుకు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే తొలిసారిగా ఇక్కడ నిర్వహించామని తెలిపారు. -
అసెంబ్లీలో బీజేపీ ఘోరతప్పిదం..
రాయ్‌పూర్: బలపరీక్ష సందర్భంలో ప్రొటెం స్పీకర్ సహా బీజేపీ ఎమ్మెల్యేలంతా జాతీయగీతాన్ని అవమానించి ఘోరతప్పిదం చేశారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ‘‘మీరంతా టీవీల్లో గమనించే ఉంటారు.. జాతీయగీతం ఆలపించడానికి ముందే ప్రొటెం స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యేలు అసహనంగా సీట్లలో నుంచి లేచిపోవడాన్ని చూసేఉంటారు. ఆ చర్యతో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తమ దేశవ్యతిరేక నైజాన్ని బయటపెట్టుకున్నాయి’’ అని అన్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ఉన్న ఆయన.. కర్ణాటక బలపరీక్షలో బీజేపీ ఓటమిపై స్పందించారు. పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలాతో కలిసి శనివారం రాయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. (చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) ‘‘ఇదే..దీని గురించే మా పోరాటమంతా. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు జాతీయగీతం పట్ల గౌరవంలేదు. ప్రజాస్వామ్యమంటే అసలే గిట్టదు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. కాబట్టే మేం జనంతో కలిసి మేము గట్టిగా పోరాడుతున్నాం. బలం లేకపోయినా యడ్యూరప్పను సీఎం చేయడం ద్వారా ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకునే వ్యవహారానికి తెరలేపారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారమంతా నడిచిందని చెప్పాల్సిన పనిలేదు. కర్ణాటకలోగానీ, మొన్న గోవా, మణిపూర్లలోగానీ వీళ్లు ప్రజాతీర్పును గౌరవించకుండా అడ్డదారుల్లో అధికారం కైవసం చేసుకునేందుకు యత్నించారు. జాతిని కల్లోలం వైపునకు నెడుతోన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ బారి నుంచి దేశాన్ని కాపాడుకుందాం. కర్ణాటక పరిణామం వాళ్లకొక గుణపాఠం కావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో విజయంసాధించిన జేడీయూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, దేవేగౌడ గారికి, ప్రత్యేకించి కన్నడిగలకు నా అభినందనలు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. (చూడండి: కుమారస్వామికి పిలుపు.. నేడే సీఎంగా ప్రమాణం!) ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న బలపరీక్ష.. యడ్యూరప్ప నిష్క్రమణతో ఊహించని మలుపు తిరిగినట్లైంది. డివిజన్ ఓటింగ్‌కు ఆదేశించకముందే యడ్డీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కసరత్తు ప్రారంభించారు. -
జన గణ మన.. అక్కడ ఫస్ట్ టైమ్
అగర్తలా : త్రిపుర రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ ఘట్టం చోటు చేసుకుంది. జాతీయ గీతం జన గణ మనను రాష్ట్ర అసెంబ్లీలో తొలిసారిగా ప్రదర్శించారు. శుక్రవారం ఉదయం స్పీకర్ పదవి కోసం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొటెం-స్పీకర్‌గా వ్యవహరించిన రతన్ చక్రవర్తి తన స్థానానికి రాగానే జన గణ మనను ప్రదర్శించారు. ఆ సమయంలో సభలో ఉన్న సభ్యులు, అధికారులు, పాత్రికేయులు అంతా నిల్చుని గౌరవించారు. తర్వాత జరిగిన ఎన్నికలో రెబతీ మోహన్ దాస్‌ను స్పీకర్‌గా ఎన్నుకున్నారు. ‘దేశంలోని ఇతర రాష్ట్రాల శాసన సభల్లో జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తారో లేదో? నాకు తెలీదు,కానీ, ఇకపై మాత్రం రోజూ జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తాం అని అసెంబ్లీ కార్యదర్శి బామ్‌దేవ్ మజుందార్ వెల్లడించారు. అయితే ప్రతిపక్ష కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమను సంప్రదించకుండానే ఏపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ సీపీఎం పార్టీ నేత బాదల్ చౌదరి చెబుతున్నారు. సింధీలు కూడా మనకు అంటరాని వారేనా! -
జన గణ మనకు 'వంద'నం
అఖండ భారతావనిని ఒక్కటి చేసిన జనగణమన గీతానికి వందేళ్ల పండుగొచ్చింది. విశ్వకవి రవీంద్రనాథ్ఠాగూర్ విరచించి తొలిసారి స్వయంగా ఆలపించి ఈ గీతం ఈ నెల 28 నాటికి వందో ఏట అడుగుపెడుతోంది. ఆ మహనీయుడు ఆలపించింది మరెక్కడో కాదు.. మదనపల్లె బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో..అందరం ఒక్కటే..మనందరి గీతం ఒక్కటేనంటూ జాతికి అంకితం చేసిన జాతీయగీతానికి బాణి కట్టింది కూడా ఇక్కడే.. వేష, భాషలు వేరైనా, కట్టుబాట్లు, విశ్వాసాలు విభేదించినా, రైతు నుంచి సరిహద్దులో సైనికుడి వరకు, పలుగు, పార పట్టే శ్రామికుడి నుంచి మరయంత్రాల మధ్య నరయంత్రంలా పని చేసే కార్మికుడి వరకు ఏ గీతం వింటే గుండె నిండా దేశభక్తి అలుముకుంటుందో ఆ జనగణమనకు రేపేశత వసంతాల సంబరం జరుగనుంది. మదనపల్లె సిటీ వందేళ్ల ఉత్సవాలకు శ్రీకారం ఈ నెల 24 నుంచి 28 వరకు భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహణకు కళాశాల యాజమాన్యం కసరత్తులు ప్రారంభించారు. కళాశాల కరస్పాడెంట్ విజయభాస్కర్‌చౌదరి, బీజేపీ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి కలిసి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి ఉత్సవాలను ఆహ్వానించారు. ఠాగూర్ కాటేజీ రవీంద్రనాథ్ ఠాగూర్ బస చేసిన గదిని కాటేజీ ఏర్పాటు చేశారు. అందులో విశ్వకవి చిత్రపటాలను పెట్టారు. కాటేజీ ఎదురుగా రవీంద్రుడి 90 కిలోల పాలరాతి విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఠాగూర్ ఆడిటోరియం నిర్మాణం జరుగుతోంది. లక్ష గళార్చన విశ్వకవి రవీంద్రుడి 150 జన్మదిన వేడుకలు పురస్కరించుకుని 2012లో బి.టి.కళాశాలలో లక్ష గళార్చన నిర్వహించారు. భారీ ఎత్తున జరిగిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 20 వేల విద్యార్థులచే ఐదు సార్లు జాతీయగీతం ఆలపించారు. దక్షిణ భారతదేశంలో శాంతినికేతన్‌గా పేరుపొందిన బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాల(బి.టి) జాతీయగీతం వందేళ్ల పండుగకు ముస్తాబవుతోంది. విశ్వ కవి రవీంద్రనాథ్ఠాగూర్ జనగణమనను ఆంగ్లంలోకి తర్జుమా చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి చరిత్రలో చెరగని స్థానం దక్కింది. మారుమూల ప్రాంత యువతకు విద్యను అందించాలన్న ధ్యేయంతో 1915లో డాక్టర్ అనిబీసెంట్ ఏర్పాటు చేసిన బీటీ కళాశాల స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఎందరెందరో దేశభక్తులను తయారు చేసింది. తొలిసారిగా.. దక్షిణ భారతదేశ పర్యటనను బెంగుళూరుకు వచ్చిన విశ్వకవి రవీంద్రనాథ్ఠాగూర్ విశ్రాంతికి 1919 ఫిబ్రవరి 25న మదనపల్లెకు విచ్చేశారు. ఇక్కడ వాతావరణానికి ముగ్ధుడైన ఆయన మార్చి 2 వరకు మదనపల్లెలోని బి.టి.కళాశాలలో బస చేశారు. ఈ సమయంలో ఇండోర్ గేమ్స్, సంగీత పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీల్లో విద్యార్థుల గళం నుంచి జాలువారిన దేశభక్తి గీతాలకు స్పందించిన ఠాగూర్ పోటీల అనంతరం ఆర్ట్స్ రూములో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తాను బెంగాల్ భాషలో రాసిన జనగణమణ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. అప్పటి బీటీ కళాశాల ప్రిన్సిపాల్ జేమ్స్ హెచ్.కజిన్స్ భార్య మార్గరేట్ కజిన్స్ సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఠాగూర్ అనువదించిన జనగణమణ గీతాన్ని మార్గరేట్ కజిన్స్ బాణి సమకూర్చారు. కళాశాలలో పెద్ద ఎత్తున జరిగిన పోటీల్లో ముగింపు సమావేశంలో ఈ గీతాన్ని తొలిసారిగా తానే స్వయంగా ఆలపించారు. ఠాగూర్ అనువదించిన జనగణమణ గీతాన్ని మార్గరేట్ కజిన్స్ బాణి సమకూర్చి విద్యార్థులతో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. 1950 జనవరి 24న జనగణమణను భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయగీతంగా ప్రకటించింది. 1950 జనవరి గణతంత్ర దినోత్సవాల్లో జాతీయగీతాన్ని అధికారికంగా మెట్టమొదట ఆలపించారు. మన జాతీయగీతానికిఅర్థం ఇది.. ‘జనులందరి మనస్సుకూఅధినేతవు. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక. పంజాబు, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగ దేశాలతోనూ వింధ్య, హిమాలయ పర్వతాలతోనూ, యమునా గంగ ప్రవాహాలతోనూ, ఉవ్వెత్తుగా లేచే సముద్ర తరంగాలతోనూ శోభించే ఓ భారత విధాతా! వాటికి నీ శుభ నామం ఉద్భోద కలిగిస్తుంది. అవి నీ ఆశీస్సులు అర్థిస్తాయి. నీ జయగాథల్ని గానం చేస్తాయి. సమస్త జనులకూ మంగళ ప్రదాతవు. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగు గాక! జయమగుగాక! జయమగుగాక!’ -
జయజయ.. జనగణమన
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ప్రయాణికులు కొత్తపల్లి మండలకేంద్రంలోని బస్టాండ్‌లో కరీంనగర్–జగిత్యాల రహదారిపై సోమవారం నిత్య జాతీయ గీతాలాపనకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు గీతాలాపన చేపడతారు. మై విలేజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గీతాలాపన కార్యక్రమానికి కరీంనగర్ రూరల్ ఏసీపీ టి.ఉషారాణి, కరీంనగర్ ఎంపీపీ వాసాల రమేశ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ నిత్య గీతాలాపనతో సోదరభావం, ఐక్యత పెంపొందుతుందని చెప్పారు. ఎంపీపీ మాట్లాడుతూ జాతీయతను పెంపొందించేందుకు గీతాలాపన దోహదపడుతుందన్నారు. సర్పంచ్ వాసాల అ ంబికాదేవి, హైస్కూల్ హెచ్ఎం మంజుల, ఎస్సై పి.నాగరాజు, గ్రామస్తులు బండ గోపాల్‌రెడ్డి, గున్నాల రమేశ్, రుద్ర రాజు, స్వర్గం నర్సయ్య, ఫ క్రొద్దీన్, సాయిలు, మై విలేజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పెంటి నవీ న్, సభ్యులు శివగణేశ్, రామకృష్ణ, వెంకటేష్, శ్రీనాథ్, కొత్తపల్లి హైస్కూల్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జాతీయ గీతంపై సుప్రీం తీర్పు.. విజయం ఎవరిదీ?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రతి ఆటకు ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్లే చేయాలని, అలా ప్లే చేసినప్పుడు ప్రేక్షకులు తప్పనిసరిగా లేచి నిలబడాలంటూ 2016, డిసెంబర్లో జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు మంగళవారం సవరించుకొని ఇక ముందు గీతాన్ని ప్లే చేయడం ఐచ్ఛికమేనని, తప్పనిసరి కాదని తీర్పు చెప్పడానికి కారణం ఏమిటీ? అందుకు దారితీసిన పరిస్థితులేమిటీ ? ఇందులో ఎవరిదీ విజయం? ఎవరిదీ అపజయం? కేరళలోని ‘కోడంగళూరు ఫిల్మ్ సొసైటీ’ చేసిన న్యాయపోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు తన తొందరపాటు ఆదేశాలను సవరించుకోవాల్సి వచ్చింది. కేవలం 280 మంది సభ్యులు గల ఈ సొసైటీకి ఇది పెద్ద విజయమనే చెప్పవచ్చు. ఈ సొసైటీ సభ్యులు ప్రతి శుక్రవారం ఓ మేడ మీద సమావేశమై జాతీయ, అంతర్జాతీయ చిత్రాలను చూస్తారు. అనంతరం ఆ సినిమాల మంచి, చెడుల గురించి సమీక్షిస్తారు. ఓ శుక్రవారం నాడు, అన్ని థియేటర్లలో ప్రతి ఆట ముందు జాతీయ గీతాన్ని విధిగా ప్లే చేయాలంటూ సుప్రీం కోర్టు 2016, డిసెంబర్ 2వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిన అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చింది. ఒక్కోసారి తాము రెండు, మూడు చిత్రాలను చూస్తామని, ప్రతిసారి జాతీయ గీతాన్ని ప్లే చేయడం, లేచి నిలబడడం చేస్తే తిక్కపుట్టి ఆ గీతంపైనున్న భక్తి భావం కాస్త గాలిలో కలిసిపోతుందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇక అదే ఏడాది డిసెంబర్ 9వ తేదీ నుంచి కేరళలో జరుగనున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో వారం రోజుల్లో 60కిపైగా చిత్రాలను ప్రదర్శిస్తారని, అన్ని ఆటల ముందు జాతీయ గీతాన్ని ప్లే చేయడం, ప్రేక్షకులు లేచి నిలబడడం న్యూసెన్స్ అని కూడా ఫిల్మ్ సొసైటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అందుకని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేయాలని క్లబ్ సభ్యులు నిర్ణయించారు. ఆ మేరకు క్లబ్ కార్యదర్శి కేజే రిజాయ్ చొరవ తీసుకున్నారు. తీర్పును రివ్యూ చేయాలని సుప్రీంకోర్టును కోరడంతోపాటు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు జాతీయ గీతాలాపన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘చిత్రోత్సవం సందర్భంగా 40 సినిమాలు చూస్తే, 40 సార్లు నిలబడు’ అంటూ వ్యాఖ్యానం కూడా చేసింది. ఈ అంశంపై అప్పుడు సంఘ్ పరివార్ సంస్థలు రాజకీయ దుమారం కూడా రేపాయి. ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్ 9వ తేదీ నుంచి తిరువనంతపురం నగరంలో కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని 12 థియేటర్లలో దాదాపు 60 సినిమాలను ప్రదర్శించారు. ఈ చిత్రాల సందర్భంగా జాతీయ గీతాన్ని ప్లే చేసినప్పటికీ, ప్రేక్షకులు అందరు లేచి నిలబడలేదు. సంఘ్ పరివార్ సంస్థల ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు అంతర్జాతీయ చిత్రోత్సవాలను నిర్వహించిన కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్, మలయాళం చలనచిత్ర దర్శకుడు కమల్ అడ్డుపడ్డారు. ‘దేశ నిబంధనలు పాటిస్తే దేశంలో ఉండు, లేదంటే పాకిస్థాన్ వెళ్లిపొమ్మంటూ’ సంఘ్ సంస్థలు పెద్ద ఎత్తున కమల్‌కు వ్యతిరేకంగా గొడవ చేశాయి. చలనచిత్రోత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల తాము ఎలాంటి ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందో, జాతీయ గీతం పట్ల భక్తి భావం తగ్గే ప్రమాదం కూడా ఉందని సుప్రీంకోర్టులో ఫిల్మ్ సొసైటీ వాదించింది. పబ్లిక్ ప్లేసుల్లో ప్రజలు పాటించాల్సిన నిబంధనలు తీసుకొచ్చే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందిగానీ, సుప్రీంకోర్టుకు ఎక్కడుందంటూ కూడా నిలదీసింది. వాదోపవాదాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తన ఉత్తర్వులను సవరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది నిజమైన దేశభక్తుల విజయమని సుప్రీంకోర్టులో ఫిల్మ్ సొసైటీ తరఫున కేసును వాదించిన న్యాయవాదుల్లో ఒకరైన పీవీ దినోష్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రేక్షకులపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. -
థియేటర్లలో జనగణమన.. కేంద్రం యూటర్న్
సాక్షి, న్యూఢిల్లీ : సినిమాహాల్లో జాతీయ గీతాలాపన విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. జనగణమన ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తప్పనిసరిగా లేచి నిల్చొవాల్సిందేనని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆదేశాలను నిలుపుదల చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సోమవారం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. సినిమా మొదలయ్యే ముందు థియేటర్లలో జాతీయ గీతం అక్కర్లేదని కోర్టుకు తెలియజేసింది. జాతీయ గీతాన్ని ఎక్కడ? ఎప్పుడు? ఆలపించాలనే దానిపై మార్గదర్శకాల రూపకల్పన కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏర్పాటు చేసినట్టు కేంద్రం పేర్కొంది. ఆ కమిటీ ఆరు నెలల్లో నివేదిక ఇస్తుందని, అప్పటి వరకు తాము ఇచ్చిన ఆదేశాలు నిలుపుదల చేసి 30 నవంబరు 2016 తీర్పు ముందునాటి స్థితిని పునరుద్ధరించాలని కోరింది. కాగా, నేడు ఈ వ్యవహారంలో దాఖలైన పిల్ విచారణకు రానుంది. జాతీయ గీతాలాపనకు సినిమా హాళ్లు వేదిక కాకూడదని దేశ వ్యాప్తంగా చర్చలు జరిగాయి. ఈ మేరకు ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. పౌరులు తమలోని దేశభక్తిని ఇలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని గతంలో న్యాయస్థానం తేల్చి చెప్పిన విషయం విదితమే. దీంతో తర్జన భర్జన పడిన ప్రభుత్వం దిగి వచ్చి ఈ నిర్ణయం తీసుకుంది. -
వాహ్..! వారికి సెల్యూట్ చేయాల్సిందే
-
అక్కడ ప్రతిరోజూ జనగణమన
జైపూర్ : జాతీయగీతం జనగణమనపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న దశలో జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అపూర్వమైన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ప్రతి రోజూ జనగణమణ, వందేమాతరం గీతాలను ఆలపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సినిమా హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో జాతీయ గీతాలాపనపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన వారం రోజులు తరువాత ఇక్కడి అధికారులు ఇటువంటి అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మంగళవారం నుంచి జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి రోజూ ఉదయం 9:50 గంటలకు జాతీయ గీతం జనగణమన, సాయంత్రం 5:55 గంటలకు జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం 9:50 గంటలకు అధికారులంతా నిలబడి జనగణమన ఆలపించారు. జాతీయ గీతాలాపనపై జైపూర్ మేయర్ అశోక్ లాహోటి మాట్లాడుతూ.. జనగణమన ఆలపనతో పని ప్రారంభించడం వల్ల ఉత్తేజంతో పనిచేస్తామని తెలిపారు. -
జాతీయ గీతాలాపనే దేశభక్తా?
జస్టిస్ చంద్రచూడ్‌కు కృతజ్ఞతలు! ‘ప్రజలు తమ దేశభక్తిని బాహాటంగా ఎందుకు ప్రదర్శించాలి’ అంటూ గత మూడేళ్లుగా లక్షలాది మంది అడుగుతూ వస్తున్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఈ ప్రశ్నలోని పదాలను సువర్ణాక్షరాలతో లిఖించవలసి ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వాటిని చూసేలా ప్రత్యేకించి నరేంద్రమోదీ ప్రభుత్వంలోని మంత్రులు, వారి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సహచరులు కూడా చూసేలా వాటిని కొట్టొచ్చేలా కనిపించే ప్రాంతంలో ఉంచాలి. విషాదమేమిటంటే జస్టిస్ చంద్రచూడ్ తోటి న్యాయమూర్తుల్లో కొందరు కూడా వాటిని చూడాల్సి ఉంది. సినిమా ప్రారంభంలో జాతీయగీతాన్ని తప్పకుండా ఆలపించేలా ఏర్పాటు చేయాలంటూ గత ఏడాది నవంబర్ 30న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాల్సిందిగా తన ముందుకు వచ్చిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ తన అభిప్రాయాన్ని అత్యంత స్పష్టంగా చెప్పారు. ‘జాతీయగీతాన్ని సినిమా హాళ్లలో ఆలపించనట్లయితే మనం దేశభక్తులం కానట్లుగా మనమెందుకు భావించాలి.. మీ దేశభక్తిని నిరూపించుకునేందుకు జాతీయ గీతాన్ని మీరు ఆలపించాల్సిన పనిలేదు... సుప్రీంకోర్టు ద్వారా దేశభక్తిని ప్రజలకు అలవర్చలేము’. దీనికి పూర్తి భిన్నంగా భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ భావిస్తున్నదేమిటో ఆయన మాటల్లోనే విందాం. ‘మతం, కులం, ప్రాంతంపై ఆధారపడి ఉన్న విస్తృత వైవిధ్యపూరితమైన కారణాల వల్ల, థియేటర్లలో జాతీయగీతాన్ని ప్రదర్శించడం ద్వారా ఒక ఏకీకృత శక్తిని తీసుకురావడం అవసరంగా మారింది. ఆవిధంగా ప్రజలు థియేటర్లలోంచి బయటకు వచ్చినప్పుడు వాళ్లందరూ భారతీయులుగా ఉంటారు’. అటార్నీ జనరల్ వాదన నన్ను కలవరపెడుతోంది. మనం సినిమా హాల్లోకి ప్రవేశించడానికి ముందు, జాతీయ గీతాన్ని ఆలపించడానికి ముందు మనం ఎవరం అని ఆయన భావిస్తున్నారో ఆ మునుపటి హోదా గనుక ఆయనకు అంగీకారయోగ్యమైతే ఆ తరువాత కూడా అది ఎందుకు అంగీకారయోగ్యం కాదు? జాతీయగీతాన్ని ఆలపించినంత మాత్రాన అది మన జాతీయతను లేదా దేశం పట్ల మన ప్రేమను, అభిమానాన్ని మార్చదని వేణుగోపాల్ గ్రహించడం లేదా? జస్టిస్ చంద్రచూడ్, వేణుగోపాల్ ఇద్దరూ జాతీయగీతాన్ని ఒక ప్రతీకగా ఆమోదిస్తున్నారు. అయితే జాతీయగీతం పట్ల మనం మరీ ఆర్భాటాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదని జస్టిస్ నమ్ముతున్నారు. జాతీయగీతం పట్ల మన మనసులో విశ్వాసం ఉంటే చాలు. మరోవైపున వేణుగోపాల్ అభిప్రాయం ప్రకారం ఒక ప్రతీకగా జాతీయగీతమే సర్వస్వం అన్నమాట. మీ మనసులో ఉన్న దాన్ని బయటకు వ్యక్తపరచాల్సి ఉందని ఆయన భావన. నిజానికి, జాతీయగీతం, జాతీయపతాకం లేదా భారత్ మాతాకి జై వంటి నినాదాలు మన మనోభావాలను వ్యక్తపర్చలేవు. బహుశా, స్వాతంత్య్రం సిద్ధించిన తొలి రోజుల్లో ఈ ప్రతీకలు అవసరమయ్యే ఉంటాయి. ఆనాడు మన దేశం దుర్బలంగా ఉండేది. కాబట్టే అప్పట్లో అభద్రతతోపాటు జాతికి తనపై తనకు నమ్మకం ఉండేది కాదు. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆనాటి పరిస్థితి లేదు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్న భారత ప్రజలు తమ దేశభక్తిని నిరూపించుకోవలసిన అవసరంకానీ, విభేదిస్తున్న వారి దేశభక్తిని ప్రశ్నించవలసిన అవసరం కానీ లేవు. వేణుగోపాల్‌ని తీవ్రంగా భయపెడుతున్న భిన్నత్వం అనేది నిజానికి మన బలమే కానీ బలహీనత కాదు. భారతీయులుగా ఉండటంలోని సౌందర్యాన్ని మన వివిధ మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, శరీరచ్ఛాయలు, వంటల రకాల్లో మనం వ్యక్తపర్చగలం. మనకు ఇక అవసరం లేదని దశాబ్దాల క్రితమే వదిలించుకున్న ఒక వాడుకను మళ్లీ తీసుకురావడం ద్వారా గత నవంబర్‌లో సుప్రీం కోర్టు ఘోర తప్పిదానికి పాల్పడింది. ఈ అవివేకపు నిర్ణయానికి కారణమైన ధర్మాసనానికి, ప్రస్తుతం భారత సర్వోన్నత న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తే ఆనాడు నేతృత్వం వహించారు. తన చీఫ్ జస్టిస్ ఆనాడు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా.. నేడు మాట్లాడినందుకు జస్టిస్ చంద్రచూడ్‌ని అభినందిస్తున్నాను. జాతీయ సంక్షోభం నెలకొన్న సమయాల్లో దేశభక్తి ఒక మనోభావంగా అవసరమని లేక జాతి ఉల్లాస స్థితిని అనుభవిస్తున్న సందర్భాల్లో అది సహజమైనదని అదనంగా జోడిస్తే జస్టిస్ చంద్రచూడ్ తోసిపుచ్చుతారని నేనైతే భావించడం లేదు. కానీ అలాంటి సందర్భాల్లో కూడా దేశభక్తి భావన అప్రయత్నంగా మనలో వ్యక్తం కాకపోతే మీరు దాన్ని బలవంతంగా చొప్పించలేరు. ఇతరత్రా సందర్భాల్లో అది చాలావరకు మనలోని దురభిప్రాయాలకు, విభజనకు సంబంధించిన మొరటు వ్యక్తీకరణగా ముందుకొస్తుంది. జస్టిస్ చంద్రచూడ్ సంధించిన మహత్తర ప్రశ్నలో.. ‘నీతిమాలినవాడి చివరి నెలవు దేశభక్తి’ అంటూ శామ్యూల్ జాన్సన్ పేర్కొన్న ఆ అమృతోపమానమైన పదాలను కూడా చేర్చుకోవాలి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
భారత క్రికెటర్ గంభీర్ సూటి ప్రశ్న!
సాక్షి, న్యూఢిల్లీ : సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శన, లేచి నిల్చోవడం వివాదంపై టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కొన్ని సెకన్లపాటు నిల్చోలేరా అని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. దేశభక్తి రుజువు చేసుకోవాలంటే థియేటర్లలో జాతీయగీతం ప్లే అవుతున్నప్పుడు లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని, ఆ సమయంలో ఎవరైనా లేచి నిల్చోకపోతే వారిలో దేశభక్తి లేదని భావించలేమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలు రంగాల వ్యక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా క్రికెటర్ గంభీర్ ఈ వివాదంపై ఆసక్తికర ట్వీట్ చేశారు. మనకు నచ్చిన ఎన్నో విలాసవంతమైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎంతో సమయం వేచి చూడటం అలవాటే కదా, అలాంటప్పుడు థియేటర్లలో కాసేపు నిల్చోవడం వల్ల ఏ సమస్య వచ్చిందని గంభీర్ ప్రశ్నించారు. 'క్లబ్ బయట నిల్చుని 20 నిమిషాలు, ఇష్టమైన రెస్టారెంట్ ఎదుట 30 నిమిషాల పాటు ఎదురుచూస్తారు. జాతీయగీతం కోసం కేవలం 52 సెకన్లపాటు నిల్చోలేకపోతున్నారా' అని ప్రశ్నిస్తూ గంభీర్ ట్వీట్ చేశారు. ఇతర క్రికెటర్ల సంగతి పక్కనపెడితే.. గంభీర్‌కు దేశభక్తి ఎక్కువన్న విషయం తెలిసిందే. దేశం కోసం పోరాడి అమరులైన అనేక మంది జవాన్ల పిల్లల్ని చదివిస్తున్నాడు. ఇటీవల చనిపోయిన ఓ జవాన్ కూతురు చదువుకు, ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పించి అందరి ప్రశంసలందుకున్నారు గంభీర్. ఐపీఎల్ ద్వారం అందుకున్న మొత్తాన్ని అమరవీరుల కుటుంబాలకు విరాళంగా ప్రకటించిన గౌతం గంభీర్ మరోవైపు తన పేరుతో నెలకొల్పిన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. Standin n waitin outsid a club:20 mins.Standin n waitin outsid favourite restaurant 30 mins.Standin for national anthem: 52 secs. Tough? — Gautam Gambhir (@GautamGambhir) 27 October 2017 -
జాతీయ గీతం వినిపిస్తే.. నేను నిలబడతా!
సాక్షి, ముంబై : బహిరంగ ప్రదేశాలు, సినిమా థియేటర్లలోనూ జాతీయ గీతం వినిపిస్తే.. నేను మాత్రం తప్పకుండా లేచి నిలుచుంటాను.. అందులో సందేహం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోని స్పష్టం చేశారు. సన్నీలియోని మాటలతో ప్రముఖ నిర్మాత ఆర్బాజ్ ఖాన్ కూడా ఏకీభవించారు. ’తేరా ఇంతేజార్‘ చిత్రం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు వీరిద్దరు మాట్లాడారు. ఈ సందర్భంగా అర్బాజ్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ మధ్య సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తప్పు పట్టారు. బహిరంగ ప్రదేశాలు, సినిమా థియేటర్లు.. ఇలా ఒక్కడైనా జాతీయ గీతం.. జనగణమణ.. నా చెవులకు వినబడితే.. వెంటనే లేచి నిలబడతా.. అని ఆయన చెప్పారు. ఆలా చేయడం నా జాతికి, స్వతంత్ర సమరయోధులకు నేనిచ్చే గౌరవం అని భావిస్తానని అన్నారు. బాలీవుడ్ యాక్ట్రస్ సన్నీ లియోనీ మాట్లాడుతూ.. జాతీయతా స్ఫూర్తి అనేది మన మనసుల్లోంచి రావాలి. ఒకరు చెబితేనో, ప్రభుత్వాలు శాసిస్తేనో జాతీయభావాలు రావు. ఇది మన దేశం.. అన్న భావన, స్ఫూర్తి మనసులో ఉప్పొంగితే దానంతట అదే వస్తుందన్నారు. నాకు జాతీయతా భావాలున్నాయి.. కాబట్టి.. జాతీయ గీతం వినిపిస్తే వెంటనే లేచి నిలబడతాను అని సన్నీ చెప్పారు. -
దేశభక్తికి గీటురాయి ఏది?
♦ కొత్తకోణం జల మధ్య అనైక్యతకు కారణాలేమిటి? అనైక్యతను పెంచి పోషిస్తున్నది ఎవరు, ఏ విధానాలు? అనే ప్రశ్నలను పక్కనపెట్టి, జాతీయ గీతాలాపనతో లేదా దాన్ని గౌరవించ డంతో మాత్రమే దేశభక్తిని చాటుకోగలమనడం అవివేకం. ప్రజల మధ్య ఐక్యత లోపించ డానికి కారణం సామాజిక, సాంస్కృతిక వైరుధ్యాలు, వైవిధ్యాలు, వ్యత్యాసాలు, వివక్షలేననే వాస్తవాన్ని మరుగుపరిచే యత్నమే ఇది. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషు లోయ్ అంటున్నామంటే మనుషులను గౌరవించడమే నిజమైన దేశభక్తి అని చాటడమే. ‘‘మహాశక్తిపరులైన, మహా ప్రభావశీలురైన వజ్జియులను నేను నాశనం చేస్తాను. నామరూపాలు లేకుండా చేస్తాను’’ అంటూ మగధ రాజు అజాతశత్రువు తన మంత్రి వర్షకారుడితో అంటాడు. ఈ విషయమై గౌతమ బుద్ధుని అభిప్రాయం తెలుసుకొని రమ్మంటాడు. ఆ సమయంలో బుద్ధుడు రాజ గృహంలోని గృథ్ర కూట పర్వతంపై తన శిష్యులతో ఉంటాడు. అయితే మగధరాజు అజాత శత్రువు మంత్రి వర్షకారుడు గౌతమ బుద్ధుని చేరుకొని, అజాత శత్రువు ఆలోచనను తెలియజేస్తాడు. గౌతమ బుద్ధుడు తన శిష్యుడు ఆనందునితో ఆ విషయం గురించి మాట్లాడుతూ, ‘‘ఆనందా! వజ్జియులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నిస్తాడు. ఆనందుడు అవునంటాడు. బుద్ధుడు సంభాషణను కొనసాగిస్తూ, ‘‘సమావేశాల్లో వజ్జియులంతా కలసి కూర్చుంటారా? కలసి పనులు చేస్తారా? కలసి నడుస్తారా? ఆచరణాత్మకమైన నిబంధనలను మాత్రమే విధిస్తారా? విధించిన నిబంధనలను అమలు చేస్తారా? పెద్దలను గౌరవిస్తారా? మహిళలను సమాన భాగస్వాములుగా చూస్తారా? అత్యాచారాలు, వేధింపులు ఉండవా?’’ అని కూడా ప్రశ్నిస్తాడు. వాటికి కూడా ఆనందుడు అవుననే సమాధానమిస్తాడు. అప్పుడు బుద్ధుడు ఇటువంటి సాంప్రదాయం, విధివిధానాలు, మంచి నడవడిక, ప్రేమ, గౌరవం ఉన్నంత వరకు వజ్జియులు వృద్ధి చెందుతారే కానీ, వారిని ఎవ్వరూ జయించలేరని తేల్చి చెబుతాడు. జాతీయతకు అర్థం సమనాత్వం, సామరస్యాలే బుద్ధుని సుత్తపిటక దీఘనికాయ మహావగ్గలోని మహాపరినిర్వాణ సుత్తలో పేర్కొన్న అంశం ఇది. దాదాపు 2,600 ఏండ్ల క్రితం బుద్ధుడు ప్రజల మధ్య ఐక్యత ఉంటే ఎటువంటి ప్రమాదం వాటిల్లదని స్పష్టం చేశాడు. ప్రజల మధ్య సామరస్యం, ప్రేమ, గౌరవం, సమానత్వ భావన ఉంటేనే ఐక్యత సాధ్యమని, ఆ ఐక్యత వారి పురోభివృద్ధికి పునాదని దాని సారాంశం. ప్రజలు కుల, మత, భాషాభేదాలతో, ప్రాంతీయ తత్వాలతో ఉంటే ఆ దేశం పురోగమించడం సాధ్యం కాదని కూడా అర్థం. మన దేశంలో సామాజిక సాంస్కృతిక వైవిధ్యం చాలా ఎక్కువ. ఇక్కడ ఉన్నన్ని వైవిధ్యభరితమైన అంశాలు మరెక్కడా లేవు. వాటిని గౌరవించడం లేదు. అదేవిధంగా అన్ని రకాల వివక్షలు కూడా ఇక్కడ నెలకొని ఉన్నాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా భారత జాతీయత, భారత జాతి, దేశభక్తి నినాదాలు ముందుకొస్తుండటం విచారకరం. ఈ నేప«థ్యంలోనే సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన సమయంలో నిలబడి గౌరవం చూపాలనే అంశంపై నెలకొన్న వివాదాన్ని చూడాలి. గతంలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన తీర్పును పునరాలోచించుకోవాల్సి ఉందని, వ్యక్తి స్వేచ్ఛను హరించే ఎటువంటి చర్యనైనా న్యాయస్థానాలు సునిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని తాజాగా సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానం తరఫున మాట్లాడిన జస్టిస్ చంద్రచూడ్, భవిష్యత్‌లో సినిమా హాళ్లలోకి టీæ షర్ట్లు, షార్ట్‌లు (నిక్కర్లు) వేసుకొని రాకూడదంటే ఏం చేయాలి? జాతీయ గీతం ఆలపించకపోతే దేశభక్తి లేన ట్టా? అని కూడా ప్రశ్నించడం గమనార్హం. సామాన్యుడి మదిలోని మాటలను సుప్రీంకోర్టు వ్యక్తీకరించడం విశేషం. జాతీయ గీతాలాపన ద్వారా దేశ ప్రజలందరినీ ఉత్తేజితులను చేసి, ఐక్యతను నెలకొల్పడమే లక్ష్యమని చెపుతున్నారు. ప్రజల మధ్య అనైక్యతకు కారణాలేమిటి? అనైక్యతను పెంచి పోషిస్తున్నది. ఎవరు? ఏ విధానాలు, ఏ వైఖరులు ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి? అనే ప్రశ్నలను పక్కనపెట్టి, కేవలం జాతీయ గీతాలాపనతో లేదా దాన్ని గౌరవించడంతోనే దేశభక్తిని చాటుకోగలమనడం అవివేకం. ప్రజలు ఐక్యంగా ఉండకపోవడానికి కారణం భారతదేశ సామాజిక, సాంస్కృతిక వైరుధ్యాలు, వైవిధ్యాలు, వ్యత్యాసాలు, వివక్షలేననే వాస్తవాన్ని కప్పిపుచ్చే యత్నమే ఇది. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న కవి వాక్యాలు... మనుషులను గౌరవించడమే నిజమైన దేశభక్తి అని ఎన్నడో చాటాయి. ‘జనగణమన’లో లేని ప్రజలు ఎవరు? మనం జాతీయ గీతంగా ఆలపిస్తోన్న ‘జనగణమన’ గీతాన్ని 1911, డిసెం బర్ 27న కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఆలపించారు. ఆ తర్వాత, భారత పర్యటనకు వస్తున్న బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ 5కు ఆహ్వానం పలుకుతూ తీర్మానం చేశారు. జనగణమన గీతం కింగ్ జార్జ్‌ను కీర్తిస్తున్నదిగానే అప్పటి పత్రికలు రాశాయి. స్టేట్స్‌మాన్, ఇంగ్లిష్మాన్ పత్రికలు డిసెంబర్ 28న ప్రచురించిన వార్తలు దీనికి సాక్ష్యం. ‘‘బ్రిటన్ చక్రవర్తికి స్వాగతం తెలుపుతూ బెంగాలీ కవి రవీంద్రనాథ్ టాగూర్ రాసిన గీతాన్ని ఆలపించారు’’ అని స్టేట్స్‌మాన్ పత్రిక రాసింది. ఆ తర్వాత ఈ గీతంపై చెలరేగిన వివాదంపై రవీంద్రనాథ్ టాగూర్ 1937, నవంబర్ 10న పత్రికాసంపాదకులు పులిన్ బిహరిసేన్కు ఒక ఉత్తరం రాస్తూ, ‘‘ఇది ఒక రాజును, చక్రవర్తిని దృష్టిలో పెట్టుకొని రాయలేదు. భారతదేశ దశ, దిశ నిర్దేశకుడు, దైవసమానమైన వారెవరైనా దీనికి అర్హులే. ఒక ప్రభుత్వాధికారి విజ్ఞప్తిమేరకే ఇది రాశాను. అయితే దీనిని ఒక వ్యక్తికి పరిమితం చేయరాదు’’ అని సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ కొంత కాలం క్రితం ఒక వ్యాసం రాస్తూ, ఆ గీతంలో ఎక్కడా దేశాన్ని, మాతృభూమిని పొగుడుతున్నట్టు లేదని సోదాహరణంగా వివరించారు. ఈ గీతం దేశభక్తి పూరితమైనదేనని అనుకున్నా, అందులో చాలా లోటుపాట్లున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలను ఆ గేయం ప్రస్తావించదన్న విమర్శ ప్రధానమైనది. 1911లో ఆ గీతం రాసేనాటికి మన దేశంలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలు ఈ రోజు భారతదేశంలో లేవు. ఇప్పుడే కాదు నాడు కూడా భారత దేశంలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాల పేర్లు అందులో కనిపించవు. పంజాబు సింధ్, గుజరాత మరాఠా, ద్రావిడ ఉత్కళ వంగ అని ఉంది. సిం«ద్ ఈ రోజు మన దేశంలో లేదు. అదేవిధంగా దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల పేర్లు ఒక్కటి కూడా లేవు. అన్నిటికీ కలిపి ద్రావిడ అన్న పదమే వాడారు. గంగా, యమునా నదులపేర్లే తప్ప దక్షిణ భారతదేశంలోని ఎన్నో నదుల పేర్లు కనిపించవు. ఈ కారణంగా కూడా కొన్ని ప్రాంతాల ప్రజలు జాతీయగీతంతో తమ అనుబంధాన్ని ఊహించుకోలేకపోయారు. అయినా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు జాతీయగీతాన్ని చాలా సందర్భాల్లో ఆలపిస్తున్నారు, గౌరవిస్తున్నారు. జాతీయ గీతాన్ని దేశభక్తికి ప్రతీకగా చూస్తున్నారు. మంచిదే. కానీ దేశభక్తి. జాతీయత భావన ఉండాలంటే ముందు దేశంలో ప్రజాస్వామ్య విలువలకు స్థానముండాలి. భావప్రకటనా స్వేచ్ఛకు అవకాశం ఉండాలి. భారతదేశం విభిన్న జాతుల, భాషల, కులాల, మతాల, ప్రాంతాల సంగమం. ఇటువంటి దేశాన్ని ఐక్యం చేయడానికి ప్రభుత్వాధినేతలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలతో కూడిన కార్యక్రమం కావాలి. కానీ నిర్బంధ విధానాలు కాదు. ఈ దేశంలో మూడు వేలకు పైగా కులాలు, 25 వేల ఉపకులాలు, దాదాపు 1,208 అంటరాని కులాలు, 705 గిరిజన తెగలు ఉన్నాయి. దేశంలోని మొత్తం 1,721 రకాల భాషల్లో 122 ప్రధాన భాషలు కాగా, 22 భాషలను అధికారికమైనవిగా గుర్తించారు. చిన్న చిన్న తెగలు, కులాలు మాట్లాడే భాషలు మరో 1,599 ఉన్నాయి. అధికార భాషలుగా అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రి, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మైతేయి(మణిపురి), మరాఠీ, నేపాలి, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సంతాలి, సింధ్, తమిళ్, తెలుగు, ఉర్దూలను గుర్తిం చారు. ఈశాన్య రాష్ట్రాల్లో మాట్లాడే భాషలుగానీ, మెజారిటీ ఆదివాసులు మాట్లాడుకునే గోండీ, కోయ భాషల లాంటివిగానీ గుర్తింపుకు నోచుకోలేదు. ఇది వివిధ భాషల మధ్య వివక్షకు నిదర్శనం. దేశభక్తి వెల్లివిరియాలంటే... వీటన్నింటితో పాటు భారతదేశం ఏకీకృతమైనదేమీ కాదు. వలస పాలనా కాలంలో దేశం అంతా ఒక పాలన కిందికి వచ్చిందని భావిస్తుంటాం. కానీ అది కూడా నిజం కాదు. భారత దేశం స్వాతంత్య్రం పొందేనాటికి దాదాపు 565 సంస్థానాలు బ్రిటిష్ పాలనకు అవతల తమ అస్తిత్వాన్ని కొనసాగించాయి. దేశం ఏకీకృతం కావడానికి చాలా ప్రయత్నం జరిగింది. హైదరాబాద్‌లాంటి ప్రాంతం సైనిక చర్య ద్వారా భారత్‌లో విలీనమైంది. అంటే దేశంలోని ప్రాంతాలన్నీ ఒకే సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని కలిగినవి కావు. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల ప్రజలను మిగతా ప్రాంతాల వారు తమకు సమానులుగా చూసే పరిస్థితి లేదు. బెంగళూర్, హరియాణా, ఢిల్లీలాంటి ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల మీద, మహారాష్ట్రలో బిహారీల మీద దాడులను చూశాం. అదేవిధంగా కులాల మధ్య అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటరాని కులాల పట్ల వివక్ష, దాడుల గురించి చెప్పక్కర్లేదు. ఆదివాసీలను అడవి నుంచి తరుముతున్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. మతం పేరుతోనో, ఖనిజ సంపద పేరుతోనో వారిపైన జరుగుతున్న దాడులు వర్ణనాతీతం. వారిని వారి అడవి నుంచి తరిమికొట్టేందుకు పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపుతున్న దారుణ పరిస్థితి ఉంది. వారందరినీ ఈ దేశస్తులుగా చూస్తున్నారా? అని ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. ఆహారపు అలవాట్ల పేరిట, ఇతర రకాల సాంప్రదాయాల పేరిట ఇటీవల మైనారిటీలపై దాడులు, హత్యలు పెచ్చుపెరుగుతున్నాయి. దేశభక్తి అంటే నేల, నీరు, నిప్పు కాదు. దేశమంటే జనం. ప్రజల మధ్య సత్సంబంధాలు. మనుషులందరినీ ఒక్కటిగా చూసే భావన. మనిషిని మనిషి గౌరవించే సత్సంప్రదాయం. పౌరుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేసే వాతావరణాన్ని పెంపొందింపజేసే ప్రయత్నం. ఇవేవీ చేయకుండా సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని వింటూ నించుంటే దేశభక్తి వస్తుందా? అది భయపెట్టి కల్పించగలిగేదేనా? కానే కాదు. ప్రజలందరికీ సమానావకాశాలు, సమాన గౌరవం, కల్పించే ప్రజాస్వామిక విధానాలు అమలు జరగాలి. దేశభక్తిని పెంపొందించడానికి వ్యక్తి స్వేచ్ఛకు హామీని కల్పించాలి, వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే అప్రజాస్వామిక, నియంతృత్వ పోకడలకు స్వస్తిపలకాలి. దేశ ప్రజల మధ్య వ్యత్యాసాలను, వివక్షలను, వైమనస్యాలను తొలగించనిదే దేశభక్తిని ప్రేరేపించడం సాధ్యం కాదు. సమాజంలోని ఆర్థిక, సామాజిక, వ్యత్యాసాలను, వివక్షలను తొలగించి, భద్రత, ఆత్మగౌరవం గల జీవితాన్ని ప్రజలకు అందిస్తేనే దేశభక్తి ఇంద్రధనుస్సులా వెల్లివిరిసేది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
జాతీయగీతంపై నటుడి కీలక ప్రశ్న
చెన్నై: సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. సినిమా హాలులో జాతీయగీతం వస్తున్నప్పుడు లేచి నిలబడని వారికి దేశ భక్తి తక్కువ ఉందని అనుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద అంశంపై స్పందించిన నటుడు అరవిందస్వామి సోషల్ మీడియా ద్వారా కొన్ని విలువైన ప్రశ్నలు సంధించారు. 'జాతీయ గీతం వినిపించినప్పుడు నేను లేచి నిలబడి ఆ గీతాన్ని ఆలపిస్తాను. దీన్ని చాలా గౌరవంగా భావిస్తాను. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ముందు ప్రతిరోజూ జాతీయగీతాన్ని ఎందుకు ఆలపించరని' ట్వీట్ ద్వారా నటుడు ప్రశ్నించారు. అలాంటి కీలక ప్రదేశాలు, కార్యాలయాల్లో పాటించని జాతీయగీతం ప్రదర్శనను.. కేవలం థియేటర్లలోనే ఎందుకు తప్పనిసరి చేశారో అర్థం కావడం లేదంటూ మరో ట్వీట్ చేశారు. మరోవైపు దేశ భక్తిని భుజాలపై మోయాల్సిందిగా ప్రజలను ఎవరూ బలవంతపెట్టలేరని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సినిమా షోకు ముందు జాతీయగీతం ప్రసారానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ నటుడికి మంచి గుర్తింపు ఉంది. ఇటీవల రాంచరణ్ నటించిన ధృవ మూవీలో స్ట్రాంగ్ విలన్ రోల్ పోషించి తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించారు అరవిందస్వామి. Why not everyday in all govt offices, courts, before assembly and parliament sessions? — arvind swami (@thearvindswami) 24 October 2017 -
నిల్చోవాల్సిన అవసరం లేదు
న్యూఢిల్లీ: సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశ భక్తిని భుజాలపై మోయాల్సిందిగా ప్రజలను ఎవరూ బలవంతపెట్టలేరంది. సినిమా వేయడానికి ముందు జాతీయగీతం ప్రసారానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. సినిమా హాలులో జాతీయగీతం వస్తున్నప్పుడు లేచి నిలబడని వారికి దేశ భక్తి తక్కువ ఉందని అనుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. జాతీయగీతాన్ని అవమానపరిచేలా ఉన్నాయంటూ ప్రేక్షకులు థియేటర్లకు టీ–షర్టులు, నిక్కర్లు వేసుకురాకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వం నిషేధాజ్ఞలు తీసుకొచ్చినా రావొచ్చని జస్టిస్ మిశ్రా వ్యంగ్యంగా అన్నారు. కేరళకు చెందిన కొడుంగళ్లూరు ఫిల్మ్ సొసైటీ వేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. థియేటర్లలో సినిమాకు ముందు జాతీయగీతం తప్పనిసరిగా వేయాలనీ, ప్రేక్షకులు కచ్చితంగా లేచి నిలబడాలని గతేడాది నవంబరు 30న జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనమే తీర్పునిచ్చింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించలేమనీ, అది తల్లిదండ్రులు, గురువులు చేయాల్సిన పని అని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదిస్తూ భారత్ ఎంతో వైవిధ్యం కలగలసిన దేశమనీ, ప్రజల్లో ఐక్యత తెచ్చేందుకు జాతీయగీతాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికే ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 9కి వాయిదా వేసింది. -
థియేటర్లో జాతీయ గీతాన్ని అగౌరపరిచినందుకు..
♦ ముగ్గురు కశ్మీరి విద్యార్థులు అరెస్టు హైదరాబాద్: నగరంలోని ఓ థియేటర్లో జాతీయగీతం వస్తున్నప్పుడు నిలబడనందుకు ముగ్గురు కశ్మీర్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. నగర శివార్లైన చేవెళ్లలోని ఓ ప్రయివేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓమర్ ఫైయాజ్ లూనీ, ముదాబిర్ షబ్బీర్, జమీల్ గుల్లు ఆదివారం అత్తాపుర్లోని ఓ థియేటర్‌కు సినిమా చూడడానికి వెళ్లారు. సినిమాకు ముందు జాతీయ గీతం రాగా సదరు విద్యార్థులు నిలబడకుండా అగౌరవపరిచారని అదే థియేటర్లో ఉన్న ఓ ఐజీ ర్యాంకు పోలీస్ అధికారి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే థియేటర్ కు చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు వారిని అరెస్టు చేసి 1971 జాతీయ జెండా నిబంధనల ఉల్లంఘన చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు యువకుల్ని గంటలకొద్దీ స్టేషన్లో ఉంచిన పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకొని బెయిల్ మంజూరు చేశారు. -
సైగలతో జాతీయ గీతాలాపన
న్యూఢిల్లీ: సైగలతో జాతీయ గీతం ఆలాపిస్తున్న వీడియోను కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి మహేంద్ర నాథ్ పాండే గురువారం విడుదల చేశారు. దివ్యాంగులు, ఇతరుల మధ్య తేడా చూపకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు . ‘జాతీయ గీతాన్ని సైగల భాషలో రూపొందించినందుకు మనమంతా గర్వించాలి. మన దేశంలో సైగలను చాలా పురాతన కాలం నుంచే వాడుతున్నాం’ అని మంత్రి అన్నారు. గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన 3.35 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఎర్రకోట ముందు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొందరు దివ్యాంగులతో కలసి జాతీయగీతాన్ని సైగలతో ఆలపిస్తున్నట్లు కనిపిస్తోంది. -
కూర్చునే జాతీయగీతం వినాల్సి వచ్చింది..
ఇండోర్: విమానాల్లోని ప్రయాణీకులంతా సీట్లలో కూర్చుని ఉండగానే స్పైస్ జెట్ విమానంలో జాతీయ గీతం వినాల్సి వచ్చింది. గీతం అంటే మర్యాద లేదని కాదుగానీ లేవలేని పరిస్థితి. దీంతో తమ సీట్లలో అలాగే స్థూలాకారంగా ఉండి జాతీయ గీతం వింటూ ఆలపించారు. ఇలాంటి పరిస్థితి కల్పించినందుకు సదరు ఎయిర్‌లైన్స్ సంస్థపై పునీత్ తివారీ అనే ఓ ప్రయాణీకుడు ఫిర్యాదు చేశాడు. అనూహ్యంగా జాతీయ గీతం వచ్చిందని, గౌరవార్థం లేచి నిల్చుందామంటే అందుకు తగిన పరిస్థితి లేకుండా పోయిందని, పైగా నిల్చోవద్దని ఆదేశించారని, అందుకు సదరు విమాన సంస్థే కారణం అంటూ అందులో పేర్కొన్నారు. స్పైస్ జెట్‌కు చెందిన విమానం ఎస్జీ 1044 ఈ నెల (ఏప్రిల్) 18న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వస్తూ ల్యాండ్ అయ్యే ముందు జాతీయ గీతాన్ని ప్లే చేసింది. కానీ, విమానంలోని సిబ్బందిగానీ, ప్రయాణీకులుగానీ లేవలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం వారిని బంధించి ఉంచిన సీటు బెల్టులు. ‘ఓపక్క జాతీయ గీతం వస్తుండగా మమ్మల్ని సీట్లో నుంచి లేవోద్దంటూ పైలట్ ఆదేశించాడు. అతడి ఆదేశాలను మేం బలవంతంగా పాటించాల్సి వచ్చింది. పైగా జాతీయ గీతం వస్తుండగానే మధ్యలో ఒకసారి ఆపేసి కొద్దిసేపు ఆపి మళ్లీ ప్లే చేశారు’ అని ఆయన ఫిర్యాదు చేశాడు. అయితే, దీనిపై స్పైస్ జెట్ అధికారిక ప్రతినిధి వివరణ ఇస్తూ విమానంలో తమ సిబ్బంది పొరపాటువల్ల అనూహ్యంగా జాతీయ గీతం ప్లే అయిందని, అయితే, వెంటనే తాము ఆపేశామని, ఈ విషయంలో ప్రయాణీకులకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. -
జనగణమన: దివ్యాంగులకు ఊరట
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు దివ్యాంగులు గౌరవ సూచకంగా నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. అన్ని సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం తప్పకుండా ప్రదర్శించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, దివ్యాంగులకు ఈ నిబంధన ఇబ్బందిగా మారడంతో వారికి సడలింపును ఇస్తున్నట్లు తాజాగా పేర్కొంది అత్యున్నత న్యాయస్ధానం. మిగతావారు కచ్చితంగా జాతీయగీతం వస్తున్నప్పుడు గౌరవసూచకంగా లేచి నిలబడాలని స్పష్టం చేసింది. -
ఇదీ ఆమిర్‌ఖాన్.. ఇప్పటికైనా ఒప్పుకొంటారా!
గొప్ప దేశభక్తి గల నటుడిగా బాలీవుడ్లో ఆమిర్‌ఖాన్‌కు పేరుంది. అసహనం వివాదంలో చిక్కుకున్నా.. ఆయన తాజా సినిమా 'దంగల్' సినిమా దేశభక్తి చాటేదిగా.. క్రీడాలను ప్రోత్సహించేదిగా విమర్శల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఆయన వ్యక్తిత్వాన్ని చాటే మరో విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో భారత సినిమాల విడుదలను పాకిస్థాన్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్ నటులపై భారత్‌లో నిషేధం విధించడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లను బాలీవుడ్ సినిమాల విడుదలను అడ్డుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ నిషేధాన్ని ఎత్తివేసి.. భారత సినిమాలు పాకిస్థాన్‌లో ప్రదర్శించేందుకు అనుమతించారు. పలు భారతీయ సినిమాలు అక్కడ విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో పొరుగుదేశానికి చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ 'దంగల్' సినిమాను పాకిస్థాన్‌లో విడుదల చేసేందుకు ముందుకొచ్చాడు. ఇందుకు ఆమిర్‌ఖాన్, చిత్ర యూనిట్ సైతం ఆనందంగా ఓకే చెప్పింది. పాక్‌లో బాలీవుడ్ నటుల సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుందని భావించారు. అయినా, ఈ సినిమా పాకిస్థాన్‌లో విడుదల కాలేదు. అందుకు కారణం.. దాయాది దేశం నుంచి వచ్చిన ఓ 'ఆశ్చర్యకరమైన డిమాండే'. అదేమిటంటే.. 'ఈ సినిమా పాక్ సెన్సార్ బోర్డు పరిశీలనకు వెళ్లగా .. సినిమా అంతా బాగుంది కానీ, క్లైమాక్స్‌లో వచ్చే రెండు సీన్లపై మాత్రం కత్తెర వేయాలని సెన్సార్ బోర్డు చెప్పింది. క్లైమాక్స్‌లో రెజ్లర్ గీతా ఫోగట్ (ఫాతిమా సనా షేక్ ఈ పాత్రను పోషించింది) గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత భారత త్రివర్ణ పతకాన్ని చూపించి సీన్‌ను, జాతీయగీతాన్ని వినిపించే సీన్‌ను తొలగించాలని పాక్ సెన్సార్ బోర్డు కోరింది' అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ డిమాండ్ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఆమిర్‌కు చిత్రంగా తోచిందట. 'ఇది క్రీడల నేపథ్యంగా తెరకెక్కిన సినిమా. ఇందులో ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ పాకిస్థాన్ ప్రస్తావన లేదు. కేవలం భారత జాతీయవాద మనోభావాలను మాత్రమే సినిమా చూపించాం. అలాంటప్పుడు అలాంటి సీన్లను తొలగించడమెందుకు?' అన్న భావనతో ఈ డిమాండ్‌కు ఆమిర్ ఖాన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'దంగల్' సినిమా దేశంలో రూ. 385 కోట్ల వసూళ్లతో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా పాక్‌లో విడుదలైతే.. మరో రూ. 10 నుంచి 12 కోట్లు నిర్మాతలకు సమకూరేవి. అంతేకాకుండా ఈ సినిమా పాక్‌లో అధికారికంగా విడుదల కాకపోతే..అక్కడ పైరసీరూపంలో విచ్చలవిడిగా దొరికే అవకాశముంది. అయినా, ఈ విషయంలో నష్టమొచ్చినా పర్వాలేదు కానీ, సినిమాలో ఆ సీన్లకు కత్తెర వేసేందుకు ఆమిర్ ఒప్పుకోలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆమిర్ ఈ విషయమై అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ.. ఆయన అధికార ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. -
‘జనగణమన’పై స్పష్టతనిచ్చిన సుప్రీం
-
‘జనగణమన’పై స్పష్టతనిచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు గౌరవసూచకంగా ఎప్పుడు నిలబడలన్నదానిపై పలు సందర్భాల్లో ఎదురవుతున్న గందరగోళానికి సుప్రీం కోర్టు మంగళవారం తెరదించింది. సినిమా ప్రారంభానికి ముందు మాత్రమే జాతీయగీతం వస్తున్నప్పుడు గౌరవసూచకంగా లేచి నిలబడాలని స్పష్టం చేసింది. సినిమాకథ, న్యూస్‌రీల్, డాక్యుమెంటరీల్లో భాగంగా వచ్చే జాతీయ గీతానికి లేచి నిలబడాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ ఆర్.భానుమతిల ధర్మాసనం చెప్పింది. -
జాతీయ గీతం పాడతారా?
ఎటువంటి ఇమేజ్ చట్రంలోనూ చిక్కుకోని స్టార్ హీరోల్లో వెంకటేశ్ ఒకరు. పాత్రకు తగ్గట్టు పాదరసంలా మారుతుంటారు. ఇప్పుడీ పాదరసంను పవర్‌ఫుల్‌గా చూపించే ఆలోచనలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఉన్నారట. మహేశ్‌బాబు హీరోగా ‘జనగణమణ’ అనే దేశభక్తి చిత్రం తీయనున్నట్లు గతంలో పూరి ప్రకటించారు. కానీ, మహేశ్ ఏ మాటా చెప్పకపోవడంతో ఆ కథను పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ దేశభక్తి కథకు కొత్త హంగులు అద్ది వెంకీతో సినిమా తీయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. పూరి సినిమాల్లో హీరోయిజం ఏ స్థాయిలో పరుగులు పెడుతుందో.. పైపైకి వెళ్తుందో తెలిసిందే. ఈ ‘జనగణమణ’లోనూ వెంకీ క్యారెక్టర్, లుక్ అంతే స్థాయిలో పవర్‌ఫుల్‌గా ఉంటాయట. ప్రస్తుతం వెంకటేశ్ హీరోగా నటించిన ‘గురు’ను మార్చి 31న విడుదల చేయాలనుకుంటున్నారట. ‘గురు’ తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ చేయాలనుకున్నారు వెంకీ. దాంతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారనీ వార్తలొచ్చాయి. మరి, ఆ రెండు చిత్రాల్లో ఏది ముందు పట్టాలు ఎక్కుతుంది? ఆ రెండూ కాకుండా పూరి ‘జనగణమణ’ సెట్స్‌కి వెళుతుందా? వేచి చూడాల్సిందే. -
3.5 లక్షల మందితో జాతీయ గీతాలాపన
గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన ‘కొదియార్’ భక్తులు రాజ్‌కోట్: జాతీయ గీతాన్ని ఒకేసారి 3.5 లక్షల మంది ఆలపించి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా కగ్వాడ్ ప్రాంతంలో శనివారం జరిగింది. గుజరాత్‌లోని ల్యూవా పటేల్ సామాజిక వర్గ ప్రజల ఆరాధ్య దేవతైన ‘కొదియార్’కు నూతనంగా ఆలయం నిర్మించారు. ఈ సందర్భంగా కొదియార్ దేవత విగ్రహావిష్కరణ జరుగుతున్న సమయంలో 3.5 లక్షల మందితో జనగణమన ఆలపించి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పినట్లు దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు హన్స్‌రాజ్ గజేరా తెలిపారు. ఈ మేరకు గిన్నిస్ రికార్డ్ అధికారులు తమకు సర్టిఫికెట్ అందించినట్లు వెల్ల డించారు. 40 కి.మీ.ల మేర శోభాయాత్ర నిర్వహించినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్లు వివరించారు. ఆలయం పక్కనున్న ఖాళీ స్థలంలో వ్యవసాయ వర్సిటీని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. రూ.60 కోట్లతో నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవానికి బీజేపీ, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. పటేల్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించుకున్నారని హన్స్‌రాజ్ తెలిపారు. -
జాతీయ గీత ఆలాపనలో ప్రపంచ రికార్డు
రాజ్‌కోట్ : ఓ దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలో భక్తి పరవశంతో పాటు జాతీయ భావం వెల్లివిరిసింది. 3.5 లక్షలకు పైగా మంది ప్రజలంతా ఒకేవేదికపైకి వచ్చి ఆలపించిన జాతీయ గీతం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటుదక్కించుకుంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా కాగ్వాడ్‌లో కొత్తగా నిర్మించిన కోడల్ ధామ్ దేవాలయంలో కొడియార్ దేవత విగ్రహ ప్రతిష్ట సమయంలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొన్న 3.5 లక్షలకు పైగా మంది జాతీయగీతం ఆలపించి ప్రపంచ రికార్డు సృష్టించినట్టు కోడల్ ధామ్ దేవాలయ ట్రస్ట్ సభ్యుడు హన్సరాజ్ గజేరా తెలిపారు. 2014లో బంగ్లాదేశ్‌లో 2,54,537 మంది ప్రజలు జాతీయ గీతం ఆలపించి ప్రపంచ రికార్డు సాధించారు. ప్రస్తుతం ఈ రికార్డును చేధించినట్టు గజేరా పేర్కొన్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారుల నుంచి ప్రపంచ రికార్డు సర్టిఫికేట్‌ను పొందామని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. 40 కిలోమీటర్ల శోభ యాత్ర, 1008-కుండ్ మహాయగ్న నిర్వహించి ఇప్పటికే ఈ ట్రస్ట్ లిమ్కా బుక్ రికార్డులో చోటు సంపాదించింది. జనవరి 17న ప్రారంభమైన ఐదు రోజుల ఈ వేడుకకు, 50 లక్షలకు పైగా భక్తులు హాజరైనట్టు ట్రస్ట్ పేర్కొంది. రూ.60 కోట్లతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. టెంపుల్ పరిసర ప్రాంతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీని నిర్మించాలని ట్రస్ట్ ప్లాన్ చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన నేతలతో పాటు పలువురు ప్రముఖులు ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారు. -
జాతీయగీతం గురించి తెలియదా?
విశ్లేషణ చివరకు రాజ్యాంగసభలో ఈ రెండు గీతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ జనగణమనను జాతీయగీతంగానూ, వందేమాతరంను జాతీయగేయంగానూ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. జనగణమన జాతీయ గీతం, వందేమాతరం జాతీయగేయం గానూ ప్రకటించిన అధికారిక ప్రతుల కోసం హరిందర్ ధింగ్రా ప్రధాని కార్యాలయాన్ని కోరారు. జాతీయ జంతువు (పులి), జాతీయ పక్షి (నెమలి), జాతీయ పుష్పం (పద్మం), జాతీయ క్రీడ (హాకీ)లకు సంబంధించిన అధి కారిక పత్రాలు కూడా అడిగారు. జాతీయగీతం, జాతీయ గేయం గురించి చెప్పకుండా తప్పించుకోవడమే కాకుండా, మిగతా ప్రశ్నలన్నీ పర్యావరణ శాఖకు సంబం ధించినవి అంటూ వన్య మృగ శాఖ సమాచార అధికారికి బదిలీ చేసింది ప్రభుత్వం. వారు జాతీయ పుష్పం, జాతీయ క్రీడ సంగతి వదిలేసి, జాతీయపులుల సంరక్షణ అథారిటీకి పంపారు. జాతీయగీతం, జాతీయగేయం గురించి తమకు సంబంధం లేదని జవాబిచ్చారు. మొదటి అప్పీలులో అధికారి సరైన సమాచారం ఇచ్చారని సంతృప్తి చెంది అప్పీలు కొట్టిపారేశారు. రెండో అప్పీలు కమిషన్ ముందుకు వచ్చింది. ప్రధాని కార్యా లయం, వన్యమృగ విభాగం, పులుల అథారిటీలకు జనగణమన, వందే మాతరాల గురించి పట్టకపోవడం విచిత్రం. పులుల అథారిటీ అధికారి వాదం మరీ వింతగా ఉంది. మేము పులులను సంరక్షిస్తామే గానీ, అది జాతీయ మృగం ఎప్పుడైంది, దాని పత్రాలెక్కడున్నాయి వంటివి మాకు తెలియదన్నాడాయన. దరఖాస్తును మళ్లీ పర్యా వరణ మంత్రిత్వ శాఖ వన్యమృగ విభాగానికి పంపేశాడు. ఇన్ని బదిలీల తర్వాత కూడా బదులు రాలేదు. పర్యావరణ మంత్రిత్వశాఖ దగ్గర జాతీయ మృగం, పక్షి, పుష్పం గురించిన పత్రాలు లేవు. అవి దొర కడం లేదట. పులుల సంరక్షణ అధికారి వైభవ్. సి. మాథుర్,‘ జాతీయ జంతువు పులే అయి ఉంటుంది కానీ, నాకు సరిగ్గా తెలియదు’ అన్నారు. అధికారికంగా చెప్పగలిగేది కూడా ఆయనకు తెలియదన్నమాట. సుదీర్ఘంగా ప్రశ్నిం చగా ఆయన ఒక లేఖ బయటపెట్టారు. దానిపైన తేదీ 30.5. 2011 అని ఉంది. అది అంతకు ముందురోజే చేరిందట. వన్యజీవ సంరక్షణ శాఖ డైరెక్టర్ జగదీశ్æ కిష్వన్ రాసిన ఆ లేఖ సారాంశం ఏమంటే, ‘పులిని జాతీయ జంతువుగా, నెమలిని జాతీయపక్షిగా ప్రకటించామనీ, కాని ఆ నోటిఫికేషన్లు కొంత కాలం నుంచి మాయమైపో యినాయి కనుక మళ్లీ నోటిఫై చేస్తున్నా’మని. ఈ డైరెక్టర్ గారికి కూడా జాతీయ పుష్పం గురించి తెలియదేమో, ఏమీ చెప్పలేదు. జనగణమన, వందేమాతరం గురించి ప్రధాన మంత్రి కార్యాలయం చెప్పకపోవడం నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. నవంబర్ 30, 2016న శ్యాం నారాయణ్ చౌస్కీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయగీతాన్ని గౌరవించడం పవిత్ర బాధ్యత, రాజ్యాంగబద్ధ దేశభక్తి, జాతీయ లక్షణం అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. డిసెంబర్ 27, 2011కు జాతీయగీతం ఉద్భవించి 100 ఏళ్లు గడిచాయి. డిసెంబర్ 27, 1911న విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ భాషలో, భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశాల వేదిక మీద పాడారు. ఆ సభ పేరు భారతసభ. గీతాన్ని బ్రహ్మగీతం అని టాగోర్ పిలిచారు. డిసెంబర్ 28, 1917న మూడోరోజు కాంగ్రెస్ సభలో మరోసారి జాతీయగీతం ఆలపించారు. 1919లో రవీంద్రనాథ్ టాగోర్ మదనపల్లెలో ధియో సాఫికల్ కాలే జ్లో ఉన్నప్పుడు జనగణమన గీతాన్ని ఆలపించారు. తరువాత ఆయనే దీనిని ఆంగ్లంలోకి కూడా అనువాదం చేశారు. అయితే ఆ తరువాత జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ టాగోర్ బ్రిటిష్ రాజు ఐదో జార్జిని పొగు డుతూ రాశారనే విమర్శకు సంబంధించిన అనేక రచనలు సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందాయి. పూర్వం ఈ వివాదాన్ని లేవదీసినప్పుడే విశ్వకవితో పాటు, గాంధీ, నెహ్రూ ఆ వాదాన్ని ఖండిస్తూ ప్రకటనలు చేశారు. చివరకు నెహ్రూ ఆగస్టు 25, 1948నాడు రాజ్యాంగసభలో శాసన కమిటీ ముందు జాతీయగీతంగా జనగణమన ఉండాలా లేక వందేమాతరం ఉండాలా అనే ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చారు. చివరకు రాజ్యాంగసభలో ఈ రెండు గీతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ జనగణమ నను జాతీయగీతం గానూ, వందే మాతరంను జాతీయ గేయంగానూ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. అయిదు భాగా లున్న ఈ గీతంలో మొదటి భాగాన్ని రాజ్యాంగ సభ జాతీయ గీతంగా జనవరి 24, 1950 నాడు ఆమోదిం చిందని అనేక పత్రికలూ, పత్రాలూ సూచిస్తున్నాయి. కానీ ఏ ప్రభుత్వ శాఖ చేయవలసిన పనిని ఆ శాఖ చేయలేదు. జాతీయ గీతాన్ని గౌరవించాలని ఆర్టికల్ 51 (ఎ) కింద ప్రాథమిక విధిగా రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. జాతీయ గౌరవాలకు అవమానాలు నిరోధించే చట్టం 1971 ప్రకారం జాతీయగీతాన్ని కావాలని అవమానిస్తే నేరం. బిజో ఎమ్మాన్యుయెల్æ కేసులో సగౌరవంగా మౌనం పాటించిన ఇతర మత విద్యార్థులను శిక్షించడం తప్ప న్నామేగానీ, జాతీయగీతం ఆలపించిన పుడు నిలబడి గౌరవించాలనే ఆదేశించడం జరిగిందని ఇటీవల సుప్రీం కోర్టు వివరించింది. జాతీయ గీతం ప్రాధాన్యతను, చరి త్రను అధికారి కంగా ప్రకటించి ప్రజల్లో దానిపైన గౌరవాన్ని పెంచే బాధ్యత ప్రభుత్వానిదే. (హరిందర్ ధింగ్రా వర్సెస్ పర్యా వరణ శాఖ CIC/SA/A/2016/001453 కేసులో సీఐసీ 23.12. 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
థియేటర్లో జాతీయగీతం.. ఒవైసీ కామెంట్!
-
థియేటర్లో జాతీయగీతం.. ఒవైసీ కామెంట్!
సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని వినిపించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎంతమంది సంతృప్తిగా ఉన్నారో తనకు తెలియదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో ముచ్చటించిన ఆయన జాతీయగీతం, బీఫ్ నిషేధం సహా పలు అంశాలపై స్పందించారు. 'హలాల్ చేసినదైతే బీఫ్ తినడానికి నేను ఇష్టపడుతా. దీనితో ప్రభుత్వాలకు ఏం సంబంధం?' అని ఆయన ప్రశ్నించారు. ముస్లిం యువతలో అతివాద భావజాలం పెరిగిపోవడంపై స్పందిస్తూ అది ఆందోళనకరమని అన్నారు. రాడికలైజేషన్ ఏ మతంలో ఉన్నా అది ఆందోళనకరమేనని వ్యాఖ్యానించారు. అప్పుడు ఇస్లాం కూడా జీవన విధానమే..! లౌకికవాదం గురించి మాట్లాడుతూ.. 'హిందువులు చాలావరకు సెక్యులర్‌గా ఉంటారు. కానీ బాగా మాట్లాడగలిగే ఓ వ్యక్తి వారిని తనవైపు తిప్పుకొన్నాడు. అందుకు కారణం బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ అడ్డులేకపోవడమే' అని పేర్కొన్నారు. హిందుత్వాన్ని సుప్రీంకోర్టు ఒక జీవన విధానంగా గుర్తించినప్పుడు.. ఇస్లాం, క్రైస్తవ మతాలు కూడా ఎంతోమందికి జీవనవిధానాలేనని పేర్కొన్నారు. 'రిజన్, రిలీజియన్, ఐడెంటిటీ: కీపింగ్ ఇండియా ఫస్ట్' అన్న అంశంపై చర్చలో డీఎంకే ఎమ్మెల్యే త్యాగరాజన్, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ గౌడతో కలిసి ఒవైసీ పాల్గొన్నారు. -
జాతీయగీతంపై పోస్టు: రచయిత అరెస్టు
కొల్లం: జాతీయ గీతాన్ని అవమానిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఓ రచయితపై రాజద్రోహం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయగీతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మళయాళీ రచయిత, థియేటర్ ఆర్టిస్ట్ కమల్ సీ చవరాను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఫేస్ బుక్ లో ఆయన చేసిన పోస్టులను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కేరళ రాష్ట్ర బీజేపీ యువ మోర్చాకు చెందిన యూత్ వింగ్ ఈ మేరకు కమల్ పై కొల్లంలోని ఓ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో కోజికోడ్ లో నివసిస్తున్న కమల్ ను అరెస్టు చేసి కొల్లంకు తీసుకువచ్చినట్లు చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన అంతర్జాతీయ కేరళ ఫిల్మ్ ఫెస్టివల్(ఐఎఫ్ఎఫ్ కే)లో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో లేచి నిలబడనందుకు 12మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
'దేశభక్తి'పై పవన్ కల్యాణ్ ఘాటు ట్వీటు!
హైదరాబాద్: రోజుకో అంశంపై స్పందిస్తానని చెప్పిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ శనివారం 'దేశభక్తి' అంశంపై ట్వీట్ చేశారు. 'కులం, మతం, జాతి, ప్రాంతం, వర్గం, భాషకు అతీతంగా ఒక వ్యక్తిగానీ, రాజకీయ పార్టీగానీ వ్యవహరిస్తే దానిని నిజమైన దేశభక్తి అంటారు. ఒక పార్టీ ఆదర్శాలు, దృక్పథాల ఆధారంగా దేశభక్తిని చూడలేం' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మానవీయ విలువల్లో, సామరస్య భావనలో నిజమైన దేశభక్తి దాగి ఉంటుందని అన్నారు. 'ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అభిప్రాయంతోగానీ, విధానంతోగానీ విభేదిస్తే.. వారిని దేశద్రోహులుగా ముద్ర వేయకూడదు. ఇకవేళ వారు తమ ప్రత్యర్థుల గురించి తీవ్ర అభిప్రాయాలు వెల్లడించినా.. వారి గొంతును నులిమివేయకుండా మొదట వారు చెప్పేది వినాలి. ఆ తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా హడావిడిగా చర్యలు తీసుకుంటే జేఎన్‌యూ విద్యార్థులపై 'దేశద్రోహం' కేసు మాదిరిగానే ఎదురుదెబ్బ తగిలే అవకాశముంటుంది. జేఎన్‌యూ విద్యార్థుల కేసులో చివరకు వారి వీడియో కావాలని మార్చినట్టు తేలింది' అని అన్నారు. 'కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూస్తూ ఆస్వాదించాల్సిన సాయంకాలాన్ని 'దేశభక్తి' ని నిరుపించేకునే పరీక్షకు వేదికగా మార్చకూడదని పవన్ పేర్కొన్నారు. సినిమా థియేటర్లలోనే ఎందుకు? రాజకీయ పార్టీలు తమ సభల్లో మొదట జాతీయగీతాన్ని ఎందుకు ఆలపించవు? దేశంలోని ఉన్నత కార్యాలయాల్లో ఎందుకు ఆలపించడం లేదు? చట్టాలను అమలుచేయాలని ప్రబోధించే వారు మొదట తాము మార్గదర్శకంగా ఉండి ఇతరులు అనుసరించేలా చేయవచ్చు కదా' అని పవన్ పేర్కొన్నారు. 'నిజాయితీపరులకు చట్టాలను ఉచ్చుగా మార్చి.. కపటవేషగాళ్లకు వాటిని బొనంజా చేస్తున్నారా' అన్న అమెరికా ఆర్థికవేత్త థామస్ సోవెల్ వ్యాఖ్యలను పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై స్పందిస్తానని ఆయన ట్వీట్ చేశారు. జేఎన్‌యూను జేఎన్టీయూ అని పొరపాటున రాసినందుకు ఆయన క్షమాపణ కోరారు. pic.twitter.com/I4Gr7bboXO — Pawan Kalyan (@PawanKalyan) 17 December 2016 -
ఇవాంచోకే అవకాశం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో జాతీయ గీతం పాడేందుకు జాకీ ఇవాంచోకే అవకాశం దక్కింది. ఈ పదహారేళ్ల టీనేజ్ క్లాసికల్ సింగర్ అమెరికన్లకు కొత్తేం కాదు. గతంలో ఒబామా పాల్గొన్న పలు కార్యక్రమాల్లో జాతీయగీతం పాడింది ఇవాంచోనే. అధ్యక్షుడు మారినా ఆ అవకాశం మాత్రం మళ్లీ ఇవాంచోకే దక్కింది. 2010లో క్రిస్మస్ వేడుకలలో ప్రదర్శణ ద్వారా ఇవాంచో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అమెరికాలో జరిగిన చాలా ఈవెంట్లలో ఆమె పాటలు పాడి దేశ ప్రజల ప్రశంసలు పొందింది. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లలో ‘ గాడ్ బ్లెస్ అమెరికా’ ని ఆలపించింది. 10 ఏళ్ల వయసులో యూట్యూబ్ సంచలనంగా మారిన ఇవాంచో ‘ అమెరికా గాట్ టాలెంట్’ గా ఎంపికైంది. అప్పటినుంచీ అమెరికా ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంది. ప్రస్తుతం ఆమె ఎంపికపై మాట్లాడుతూ.. ‘ నాకు ఈ అవకాశం రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. గతంలో ఒబామా ప్రభుత్వంలో ఈవెంట్స్ చేశాను. ఇప్పుడు ట్రంప్ సమక్షంలో ప్రదర్శన ఇవ్వబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’ అని టీనేజ్ సింగర్ జాకీ ఇవాంచో చెప్పింది. -
అధ్యక్షుడు మారినా ఆమెకే ఛాన్స్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అయినా, ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ అయినా ఓ బాలిక మాత్రం వెరీ లక్కీ. ఆ టీనేజ్ సంచలనం పేరు జాకీ ఇవాంచో. అమెరికన్లకు ఆ 16 ఏళ్ల టీనేజ్ సంచలనం కొత్తేమీ కాదు. గతంలో ప్రదర్శలిచ్చిన ఆమెకు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో జాతీయ గీతం పాడేందుకు అవకావం కల్పించారు. అమెరికన్లకు ఇవాంచో ఎంతో స్ఫూర్తిగా నిలుస్తారని అమెరికా అధికార ప్రతినిధి బొరిస్ ఇపిస్టేన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. వివాదాలకు దూరంగా ఉండటం ఇవాంచోకు అవకాశాలు కల్పిస్తుందని, ఆమె క్లాసికల్ సింగర అని బొరిస్ తెలిపారు. 2010లో క్రిస్మస్ వేడుకలలో ప్రదర్శణ ద్వారా ఇవాంచో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అమెరికాలో జరిగిన చాలా ఈవెంట్లలో ఆమె పాటలు పాడి దేశ ప్రజల ప్రశంసలు పొందింది. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లలో ‘ గాడ్ బ్లెస్ అమెరికా’ ని ఆలపించింది. గత ఈవెంట్లలో బియాన్స్, కెల్లీ క్లార్క్సన్, అరేటా ఫ్రాంక్లిన్ లు ప్రదర్శన చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు పాప్ స్టార్స్ బియాన్స్, కేటి పెర్రీ బహిరంగంగానే మద్దతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో వీరికి అవకాశం ఇవ్వలేదని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. 10 ఏళ్ల వయసులో యూట్యూబ్ సంచలనంగా మారిన ఇవాంచో ‘ అమెరికా గాట్ టాలెంట్’ గా ఎంపికైంది. అప్పటినుంచీ అమెరికా ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంది. ప్రస్తుతం ఆమె ఎంపికపై మాట్లాడుతూ.. ‘ నాకు ఈ ఈవకాశం రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. గతంలో ఒబామా ప్రభుత్వంలో ఈవెంట్స్ చేశాను. ఇప్పుడు ట్రంప్ సమక్షంలో ప్రదర్శన ఇవ్వబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’ అని టీనేజ్ సింగర్ జాకీ ఇవాంచో చెప్పింది. -
జాతీయగీతం వస్తుంటే నిలబడలేదని...
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ సినిమా థియేటర్లో జాతీయ గీతాన్ని అవమానించినందుకు ఏడుగురు వ్యక్తులపై కేసు పెట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జాతీయ గీతం విషయంలో నమోదైన మొట్టమొదటి కేసు ఇదే. చెన్నై కాశీ థియేటర్లో జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు ఒక మహిళ సహా మొత్తం ఏడుగురు నిలబడలేదు. దాంతో వారితో మరో బృందం వివాదానికి దిగింది. నిందితులపై పోలీసులు జాతీయ గౌరవ చట్టం 1971 కింద కేసులు పెట్టారు. సినిమా ప్రదర్శించే ముందు ప్రతి థియేటర్లో తప్పనిసరిగా జాతీయ గీతం వినిపించాలని సుప్రీంకోర్టు గత నెలలో ఆదేశించింది. తాజాగా చెన్నై థియేటర్లో జరిగిన గొడవ గురించి విజయకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విజయకుమార్, అతడి స్నేహితులు ఎంత చెప్పినా కూడా 52 సెకండ్ల పాటు జాతీయగీతం వచ్చినప్పుడు అవతలివాళ్లు నిలబడలేదు. దాంతో ఇరు వర్గాల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. విజయకుమార్, అతడి స్నేహితులు తమను తిట్టడం మొదలుపెట్టారని.. ఇంటర్వెల్ సమయంలో తమను కొట్టారని, జాతీయ గీతం వచ్చేటప్పుడు నిలబడాలా వద్దా అన్నది తమ ఇష్టమని చెప్పడం వల్లే ఇదంతా జరిగిందని నిందితుల్లో ఒకరైన లీనస్ రోఫన్ చెప్పారు. తమను దూషించి, కొట్టినందుకు విజయకుమార్ బృందంపై కూడా వీళ్లు కేసు పెట్టారు. -
‘జనగణమనపై సుప్రీం ససేమిరా.. వారికి ఓకే’
ఢిల్లీ: అన్ని సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం తప్పకుండా ప్రదర్శించాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అయితే, ప్రత్యేక అవసరాలుగల వారికి మాత్రం ఈ జాతీయ గీతం విషయంలో మినహాయింపునిచ్చింది. జాతీయ గీతం ప్రదర్శితమవుతున్న సమయంలో దివ్యాంగులు లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని చెప్పింది. కాకపోతే, ఎవరైన ప్రశ్నించినప్పుడు తమ పరిస్థితి అర్థమయ్యేలా ఏదో ఒక సంకేతం సూచిస్తే సరిపోతుందని తెలిపింది. అలాగే, కావాలంటే థియేటర్‌కు తలుపులు దగ్గరికి వేసుకోవచ్చని, అయితే, గడియ మాత్రం పెట్టొద్దని స్పష్టం చేసింది. సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ప్రదర్శించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మరోసారి పునఃసమీక్షించాలంటూ కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, గీతం ప్రదర్శించి తీరాల్సిందేనని, ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. కేరళలో అంతర్జాతీయ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్న సభ్యులు తాజాగా జాతీయ గీతం ప్రదర్శనపై పిటిషన్ వేశారు. ఈ చిత్రోత్సవానికి దాదాపు 1500మంది విదేశీయులు వస్తున్నారని, ఈ నేపథ్యంలో కొంత వెసులుబాటును ఇప్పించాలని అందులో కోరారు. అయితే, న్యాయస్థానం అందుకు ససేమిరా అంది. -
‘రాహుల్ ఆలపిస్తే చూడాలనివుంది’
న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. రాహుల్ గాంధీకి ఉన్న దేశాభిమానంపై తనకు అనుమానం లేదంటూనే మెలిక పెట్టారు. రాహుల్ జాతీయగీతం ఆలపిస్తే చూడాలని ఉందని అన్నాయి. అయితే జాతీయ గీతంలోని పదాలకు అర్థాలు రాహుల్ గాంధీకి తెలుసో, లేదోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుదారుడైన అనుపమ్ ఖేర్ పలు చాలా సందర్భాల్లో స్వామిభక్తి చాటుకున్నారు. మోదీ వ్యతిరేకులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించేవారు. సినిమా ధియేటర్లతో జాతీయ గీతం వినిపించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పుపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. -
థియేటర్లలో జాతీయగీతంపై ఏమంటున్నారు?
న్యూఢిల్లీ: ఇక నుంచి ప్రతి సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని, ఆ సమయంలో ప్రతి ఒక్కరూ నిలబడాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పలువురు నిపుణుల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ఇది న్యాయవ్యవస్థ మితిమీరిన జోక్యం అని కొందరు అంటుండగా.. తాజా ఆదేశాల ద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని, మంచి ఫలితాన్నే ఇస్తుందని మరొకరు అంటున్నారు. ముఖ్యంగా మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ ఈ విషయంపై స్పందిస్తూ కోర్టులు ప్రజలు నిల్చోవాలని, ఏదో చేయాలని చెప్పకూడదని అన్నారు. కావాలంటే కార్యనిర్వాహక వర్గాన్ని మాత్రం చట్టంలో సవరణలు చేయండని ఆదేశించవచ్చని చెప్పారు. మరోపక్క, తనకు సంబంధించినది కానీ అంశాల వరకు న్యాయవ్యవస్థ వెళ్లకూడదని ప్రముఖ సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి అన్నారు. ఇక ఢిల్లీ నియోజవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, న్యాయవాది మీనాక్షి మాత్రం సానూకూలంగా స్పందించారు. జాతీయ గీతాన్ని ఇప్పటికే పలు పాఠశాలల్లో.. బహిరంగంగా జరిగే వేడుకల్లో, తదితర చోట్లలో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారని, ఇప్పుడొక కొత్త వేదికపై పాడితే తప్పేముందని, ఎలాంటి నష్టం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. జాతీయ గీతం వచ్చే సమయంలో లేచి నిల్చుంటే కలిగే నష్టమేమి లేదన్నారు. అయితే, థియేటర్లో ప్రతి ఒక్కరు నిల్చొనేలా చేయడం యాజమాన్యాలకు కష్టంగా ఉంటుందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, వికలాంగులతో ఈ సమస్య ఉంటుందని అన్నారు. -
సోలి సొరాబ్జీ (మాజీ అటార్నీ) రాయని డైరీ
దేశానికి ఒక జాతీయ గీతం, ఒక జాతీయ జెండా ఉండాల్సిందే. ఏ కాలానికి ఆ కాలంలో ఒక జాతీయ నేత ఎలాగూ ఉంటాడు. అలాగని ప్రతి పౌరుడూ ఒక జాతీయ పౌరుడిలా ఉండాలని కోర్టులు ఆదేశించవచ్చా అన్న విషయమై నేనేమీ ఆలోచించలేక పోతున్నాను. బహుశా ఇది నా న్యాయవాద వృత్తికి, నా వివేచనా శక్తికి మించిన ఆలోచనైతే కాదు కదా!! జాతీయ గీతాన్ని చదివే గుర్తు పట్టక్కర్లేదు. జాతీయ గీతాన్ని వినే గుర్తు పట్టక్కర్లేదు. నిరంతరం లేచి నిలబడి పాడుతూ ఉంటేనే జాతీయ గీతం గుర్తుంటుందని లేదు. అది మన బ్లడ్! లోపల ప్రవహిస్తూ ఉంటుంది. గుండె జనగణమన అని కొట్టుకుంటూ ఉంటుంది. నిలుచున్నా, కూర్చున్నా, పడుకుని ఉన్నా, ప్రయాణిస్తూ ఉన్నా కూడా. జెండా కూడా అంతే. కళ్ల ముందు రెపరెపలాడుతుంటేనే, మనం వెళ్లి సెల్యూట్ కొడుతుంటేనే గుర్తుకొస్తుందనేమీ లేదు. దేశం లోపల ఎన్ని రంగులు ఉన్నా, దేశంలోని మనుషుల లోపల ఉండేవి ఆ మూడు రంగులే. మన కొత్త జాతీయ నేత మాత్రం? ఏ రోజైనా ఆయన్ని గుర్తుపట్టకుండా ఉన్నామా? ఆయన దేశంలో ఉన్నా లేకున్నా మనం గుర్తుపట్టడం లేదా? ఆయన పార్లమెంటుకు వస్తున్నా రాకున్నా మనం గుర్తుపట్టడం లేదా? నోట్లపై ఉన్న జాతిపిత మనకెంత గుర్తో, నోట్లు రద్దు చేసిన జాతీయ నేత అంతే గుర్తు. పౌరుల్ని గుర్తుపట్టడానికి పాస్‌పోర్ట్‌లు ఉండాలి. మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు ఉండాలి. గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి. జిరాక్స్ కాపీలు ఉండాలి. ఆధార్ కార్డులు ఉండాలి. పాన్ కార్డులు ఉండాలి. రేషన్ కార్డులు ఉండాలి. జన్‌ధన్ ఖాతాలు ఉండాలి. గ్యాస్ రిసీట్ ఉండాలి. నీటి బిల్లు ఉండాలి. కరెంటు బిల్లు ఉండాలి. ఐటీ రిటర్న్స్ ఉండాలి. జాతీయ గీతానికీ, జాతీయ జెండాకు, జాతీయ నేతకు ఇవేవీ అక్కర్లేదు. దేశభక్తులకు, దేశభక్తికి కూడా అక్కర్లేదు. జాతీయ గీతాన్ని భక్తిగా ఆలపించమని, జాతీయ గీతాన్ని శ్రద్ధగా ఆలకించమని ఆదేశించడమంటే.. దేశభక్తికి ఐడీ కార్డు చూపించమని అడగడమే! భక్తిని శంకిస్తే భక్తుడు సహించడు. ‘ముందు నీ ఐడీ కార్డు చూపించు’ అంటాడు. ‘నీ భక్తిని గానీ, నా భక్తిని గానీ నిరూపించుకోవలసింది దేశానికే గానీ.. నేను నీకు, నువ్వు నాకు కాదు’ అంటాడు. ‘నేను సినిమా హాల్లో జాతీయ గీతం పాడి నా దేశభక్తిని ప్రదర్శించుకుంటాను. నువ్వు కోర్టు హాల్లో జాతీయ గీతం పాడి నీ దేశభక్తిని చాటుకోగలవా యువర్ ఆనర్’ అని అడుగుతాడు. భావప్రకటన స్వేచ్ఛ అంటే మాట్లాడే స్వేచ్ఛ అని మాత్రమే కాదు. మాట్లాడకుండా ఉండే స్వేచ్ఛ కూడా. బలవంతంగా మాట మాట్లాడించినా, బలవంతంగా పాట పాడించినా ఆ స్వేచ్ఛను హరించినట్టే. -మాధవ్ శింగరాజు -
కోర్టుల్లో ‘జనగణమన’కు నో..!
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలని, ఈ మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. అదే అంశానికి చెందిన మరో పిటిషన్ పై దిగ్భాంతికమైన తీర్పు చెప్పింది. దేశంలోని అన్ని కోర్టుల్లో కార్యకలాపాలు మొదలు కావడానికి ముందు ‘జనగణమన’ ఆలపించేలా ఆదేశాలివ్వాలన్న వాదనను తిరస్కరించింది. ఈ మేరకు శుక్రవారం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన ఉత్తర్వులపై తీవ్ర చర్చ జరుతున్న సందర్భంలోనే.. ‘కోర్టుల్లో కూడా ఆ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలి’ అంటూ ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. వాదనల అనంతరం శుక్రవారం పిటిషన్ ను కొట్టేసిన న్యాయమూర్తి.. ఇక ముందు ఇలాంటి వాదనలకు తావు ఇవ్వబోమని గట్టిగా వక్కాణించారు. సినిమా హాళ్లలో మాత్రం జాతీయ గీతం పాడాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు. (తప్పక చదవండి: గుండెల్లో దేశభక్తి చాలదా?) -
జాతీయ గీతం ఎలా పుట్టింది?
న్యూఢిల్లీ: ‘జన గణ మన అధినాయక జయహే’ వెనక మనకు గుర్తులేని చరిత్ర ఎంతో ఉంది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించేందుకు పార్లమెంట్‌కు ఎంతో కాలం పట్టలేదు. కానీ జాతీయ గీతాన్ని ఎంపిక చేసుకోవడానికే దాదాపు మూడేళ్లు పట్టింది. తొలుత స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించాలనే డిమాండ్ వచ్చింది. జాతీయ కాంగ్రెస్ ప్రతి సదస్సులో వందేమాతరం గీతాన్నే ఆలాపించేవారు. మొహమ్మద్ జిన్నా లాంటి ముస్లిం నాయకులు, ఆయన అనుచరులు కూడా గౌరవపూర్వకంగా లేచి నిలబడేవారు. ఆ తర్వాత ఛాందసవాద ముస్లిం నాయకులు తమ మత విశ్వాసాలకు ఆ గీతం వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. అప్పుడు వారి మనోభావాలను గౌరవించి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆ తర్వా 1950, జనవరి 26వ తేదీన దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించినప్పుడు పార్లమెంట్లో అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘జన గణ మన అధినాయక జయహే’ను జాతీయ గీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాటలకు సమాన హోదాను కల్పిస్తూ ఒక్కొక్కటి కచ్చితంగా 60 సెకండ్లు ఉండాలని కూడా పార్లమెంట్ నిర్ణయించింది. ఆకాశవాణి ద్వారానే ప్రచారం ఈ రెండు గీతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం 60 సెకండ్లకు మించకుండా గాత్రంతో ఒకటి, కేవలం సంగీత వాయిద్యాలతో ఒక్కటి చొప్పున అంతర్జాతీయ గీతాల బాణీలను పరిగణలోకి తీసుకొని బాణికట్టి పాడించే బాధ్యతని ఆలిండియా రేడియో (ఆకాశవాణికి)కు అప్పగించారు. గాత్ర గీతాలను పండిట్ దినకర్ కైకిని, సుమతి ముతాత్కర్తో పాడించారు. మ్యూజిక్ వర్షన్ కూడా కంపోజ్ చేశారు. వాయిద్యాల వర్షన్‌ను ప్రత్యేకంగా సైనిక బ్యాండ్‌కే పరిమితం చేయాలని కూడా పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ రెండు వర్షన్లను పార్లమెంట్ కమిటీ, గ్రాఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లు ఆమోదించాయి. రెండు పాటల రెండు వర్షన్లను వెయ్యేసి రికార్డుల చొప్పున కాపీ చేయించాలని నిర్ణయించారు. రికార్డుకు ఓ పక్కన వందేమాతరం గాత్రాన్ని, మరోపక్క వాయిద్య గీతాన్ని, అలాగే మరో రికార్డుకు ఓ పక్క జన గన మనను, మరో పక్క మ్యూజిక్ వర్షన్ రికార్డు చేయించారు. ఆ రికార్డులను దేశంలో 800 రేడియో స్టేషన్లకు పంపించారు. ప్రతి రోజు ఆకాశవాణి ప్రాథ:కాళ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందు వందేమాతరం గేయాన్ని ప్రసారం చేయాలని నిర్ణయించారు. 1955 నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయాన్ని ఆకాశవాణి పాటిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జన గణ మన గీతాన్ని వినిపించాలని నిర్ణయించారు. అదే సంప్రదాయం కొనసాగుతుంది. ఇదే క్రమంలో దేశంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల చేత తరగతులు ప్రారంభానికి ముందు వందేమాతరంను, తరగతులు ముగిశాక జన గన మనను పాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ ఎంపీలకు ప్రాక్టీస్ ఆరోజుల్లో జాతీయ గీతం 60 సెకండ్లు ఉండాలంటే ఎక్కువ, తక్కువ కాకుండా కచ్చితంగా 60 సెకండ్లే ఆలాపించేవారు. అప్పట్లో ఎంపీలందరికీ జాతీయ గీతం వచ్చేది. అయితే 60 సెకండ్ల కచ్చితత్వం కోసం గాయకురాలు సుమతి ముతాత్కర్ ప్రతి శుక్రవారం పార్లమెంట్‌కు వెళ్లి ఎంపీలకు పాడడంలో శిక్షణ ఇచ్చేవారు. (సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో) -
థియేటర్లలోకి జాతీయగీతం ఎప్పుడొచ్చింది?
(వెబ్ ప్రత్యేక కథనం) న్యూఢిల్లీ: చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయినప్పుడు సైనికుల్లోనే కాకుండా దేశ ప్రజల్లో కూడా దేశభక్తిని ప్రోత్సహించాలని పలువురు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఆ సూచనలు అలాగే మిగిలిపోయాయి. 1965లో పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం ముగిశాక మళ్లీ ఈ అంశం చర్చకు వచ్చింది. అప్పుడు ప్రతి సినిమా థియేటర్లలో సినిమా ముగింపులో జాతీయ గీతాలాపనను వినిపించాలని, ప్రేక్షకులంతా గౌరవ సూచకంగా నిలబడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోల్‌కతాలోని గ్రాంఫోన్ కంపెనీలో 78 ఆర్పీఎంలో జాతీయ గీతాన్ని రికార్డు చేయించి దేశంలోని అన్ని థియేటర్లకు పంపించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక నిమిషం వీడియోను కూడా రూపొందించి సినిమా థియేటర్లకు పంపించారు. తెరపై నలుపు, తెలుపు రంగుల్లో జాతీయ జెంగా రెప రెపలాడుతుండగా గీతాలాపన వినిపించేది. ఆ తర్వాత కొంతకాలానికి కలర్ వర్షన్ వచ్చింది. మొదట్లో ప్రేక్షకులు బుద్ధిగా లేచినలబడి గీతాలాపన ముగిసేవరకు అలాగే ఉండేవారు. రానురాను సినిమా ముగిసి గీతాలాపన ప్రారంభంకాగా ప్రేక్షకులు వెళ్లిపోవడం ప్రారంభమైంది. దాంతో 1980 దశకంలో థియేటర్లలో గీతాలాపనకు తెరదించారు. (జాతీయ గీతం ఎలా పుట్టింది?) మళ్లీ మల్టీప్లెక్స్‌లు వచ్చాక..... 1990వ దశకంలో దేశంలోని మెట్రో నగరాల్లో మల్టీప్లెక్స్‌ల రావడంతో అధికారులకు జాతీయ గీతాలాపనను పునరుద్ధరించాలనే ఆలోచన వచ్చింది. అయినా ఎవరు సీరియస్‌గా తీసుకోలేదు. 2003లో మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపనను వినిపించాలని అప్పటి డిప్యూటి ముఖ్యమంత్రి ఛాగల్ భుజ్పల్ రాష్ర్టంలోని థియేటర్లను ఆదేశించారు. సినిమాకు ముందే గీతాలాపనను వినిపించినట్లయితే ప్రేక్షకులు బయటకు వెళ్లే అవకాశం ఉండదన్న ఆయన ఆలోచన దాదాపు సక్సెస్ అయింది. అంతేకాకుండా జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చింది. ఇలాంటి చట్టం ఇప్పుడు దేశంలో మహారాష్ట్ర, గోవాలో మాత్రమే అమల్లో ఉంది. నాడు సోషల్ మీడియాలో హల్చల్ అందుకనే 2015, నవంబర్ నెలలో ముంబైలోని ఓ థియేటర్లో జాతీయ గీతాలాపన సందర్భంగా ఓ జంట సీట్ల నుంచి లేవనందుకు తోటి ప్రేక్షకుల ఆ జంటను థియేటర్ నుంచి బయటకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అమీషా పాటిల్‌ను కూడా ముంబై థియేటర్లలో ఇలాంటి సందర్భంలోనే ప్రేక్షకులు అవమానించారు. బాలివుడ్ నటి ప్రీతి జింటా కూడా 2014లో ముంబైలోని ఓ థియేటర్లో ఓ యువకుడు లేచి నిలబడనందుకు గోల చేసి థియేటర్ నుంచి బయటకు పంపించారు. గోవాలో ఇటీవల అంటే, అక్టోబర్ నెలలో ప్రముఖ రచయిత, దివ్యాంగుల హక్కుల కార్తకర్త సలీల్ చతుర్వేది జాతీయ గీతాలాపన సందర్భంగా థియేటర్లో లేచి నిలబడనందుకు ఆయన్ని ప్రేక్షకులు కొట్టారు. దివ్యాంగుడే కాకుండా వెన్నుముక దెబ్బతినడం వల్ల సలీల్ చతుర్వేది వీల్చేర్ నుంచి లేవలేకపోయారు. మల్టీప్లెక్స్‌లో అపహాస్యం వీటిల్లో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అపహాస్యం పాలైంది. వాణిజ్య ప్రకటనలన్నీ ముగిశాక ఈ గీతాన్ని వినిపిస్తున్నప్పుడు ఎక్కువ మంది లేచి నిలబడుతున్నప్పటికీ వారి వద్ద ఒక చేతిలో పాప్ కార్న్, మరో చేతిలో కూల్ డ్రింక్ ఉంటోంది. వారు కార్న్, తింటూ కోల్ డ్రింక్ తాగుతూ తాపీగా నిలబడేవారు, తొందరగా కూర్చొనేవారు. ఇది కూడా నిబంధనలు ఉల్లంఘిచడం అవుతుందని భావించిన యువతరం టెక్నీషన్లు 2000 దశకంలో జాతీయ గీతానికి కోరస్ ఇచ్చే కొత్త వీడియో వర్షన్ తీసుకొచ్చారు. అందులో జాతీయ జెండాలో ఉండే అసలు రంగులను కొద్దిగా మార్చి డిజిటల్ జెండాను తీసుకొచ్చారు. ఈ వర్షన్ ప్రేక్షకులను నిలబెడుతుందని, నిలబడకపోయినా జెండాను, గీతాన్ని అవమానించినట్లు కాదని టెక్నీషయన్లు థియేటర్ యజమానులు భావించారు. ఇదే వర్షన్ ఆ తర్వాత దేశంలోని పలు పాఠశాలలు అడాప్ట్ చేసుకున్నాయి. రెహమాన్ రంగప్రవేశం 2000 దశకంలోనే పండిట్ జస్రాజ్ మ్యూజిక్ మాయిస్ట్రో రెహమాన్‌తో కలసి కొత్త బాణీతో జాతీయ గీతం వీడియోను చిత్రీకరించనున్నట్లు ప్రకటించారు. నిమిషానికి బదులు జాతీయ గీతం రెండు నిమిషాలు ఉంటుందని వెల్లడించారు. పండిట్ భీంసేన్ జోషి, లతా మంగేష్కర్ లాంటి 50 మంది మహా మహా గాయణీ గాయకులు, సంగీత విద్వాంసులతో రిహార్సల్స్ కూడా ప్రారంభించారు. అయితే ఇది జాతీయ గీతం కోడ్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని అధికారులు, కొన్ని దేశభక్తి సంఘాలు గోల చేశాయి. దాంతో ఈ వీడియో రికార్డు ఆగిపోయింది. సోని మ్యూజిక్‌తో కలిసి... ఆ తర్వాత రెహమాన్ సోని మ్యూజిక్ కంపెనీ, భారత్ బాల ప్రొడక్షన్‌తో కలిసి జాతీయ గీతంపై 150 సెకండ్లతో వీడియోను తీసుకొచ్చారు. ఇందులో రెహమాన్, లతా మంగేష్కర్‌తోపాటు ఆశాభోంస్లే, క వితా కృష్ణమూర్తి నుంచి డీకె పట్టమ్మాల్ వరకు, పండిట్ భీంసేన్ జోషి నుంచి జస్రాజ్ వరకు, హరిప్రసాద్ చౌరాసియా, నుంచి అమ్జత్ అలీ ఖాన్ వరకు ఎందరో మహానుభావులైన విద్వాంసులు పాల్గొన్నారు. ఈ వీడియో కూడా జాతీయ గీతం కోడ్‌కు విరుద్ధంగా ఉండడంతో అధికారిక గుర్తింపు రాలేదు. టీవీలకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత మరాఠీ థియేటర్‌కు చెందిన టెలివిజన్ పర్సనాలిటీ పుష్కర్ స్త్రోత్రి ప్రభుత్వ పెద్దల సహకారంతో 40 మంది విద్వాంసులతో, మరాఠి నటీనటులతో రూపొందించిన జాతీయ గీతం కొత్త వర్షన్‌ను 2007, ఆగస్టు 15 తేదీ నుంచి మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శిస్తూ వస్తున్నారు. చట్టంలో నిలబడాలని లేదు.... 1971లో జాతీయ జెండాను, గీతాన్ని గౌరవించేందుకు తెచ్చిన ‘ప్రొటెక్సన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్’లో స్పష్టత లేదు. జాతీయ జెండాను, గీతాన్ని అగౌరవ పరిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని ఉందిగానీ గీతాలాపన సందర్భంగా నిలబడకపోవడం కూడా నేరమని లేదు. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరిగా వినిపించాలని, ఆ సందర్భంగా ప్రేక్షకులు గౌరవ సూచకంగా నిలబడాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
గుండెల్లో దేశభక్తి చాలదా?
దేశవ్యాప్తంగా ప్రతి సినిమా హాలులో ప్రదర్శనకంటే ముందు జాతీయ గీతం ఆల పించాలనీ, ప్రేక్షకులంతా విధిగా 52 సెకన్లు నిలబడి జాతీయ గీతాన్ని పూర్తిగా పాడాలనీ, ఆ సమయంలో తెరపైన జాతీయ పతాకం ప్రదర్శించాలనీ, ప్రేక్షకులు నిష్ర్కమించే అవకాశం లేకుండా ద్వారాలు మూసి ఉంచాలనీ సుప్రీంకోర్టు ధర్మా సనం బుధవారం తాత్కాలిక ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమై వాడివేడి చర్చకు దారి తీసింది. దేశభక్తిపైనా, జాతీయతపైనా జస్టిస్ దీపాంకర్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకూ, ప్రధాని నరేంద్రమోదీ రెండున్నర సంవత్సరాలుగా వెలిబుచ్చుతున్న అభిప్రాయాలకూ మధ్య కనిపిస్తున్న అభేదం ఆశ్చర్యం కలిగించకమానదు. మాతృ మూర్తినీ, మాతృదేశాన్నీ, మాతృభాషనూ ప్రేమించాలని బాధ్యతాయుతులైన పౌరులకు ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అది జాతి సంస్కారంలో భాగంగా సంక్రమించే విలువ. దేశాన్నీ, తల్లినీ ప్రేమించడం వ్యక్తిగత విషయం. ఆ ప్రేమకు కొలమానం ఉండదు. చట్టాల ద్వారా దేశభక్తిని కానీ మాతృభక్తిని కానీ పౌరులలో పాదుకొల్పడం అసాధ్యం. న్యాయమూర్తులు మానవమాత్రులు. వారిపైన దేశ కాల పరిస్థితుల ప్రభావం నిశ్చయంగా ఉంటుంది. జస్టిస్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ప్రస్తుతానికీ, జస్టిస్ చిన్నప్పరెడ్డి అదే న్యాయస్థానంలో పనిచేసిన గతానికీ మధ్య చాలా అంతరం ఉంది. కేరళ విద్యార్థుల కేసులో జాతీయగీతాన్ని పాడాలని పట్టు బట్టడం భావప్రకటన స్వేచ్ఛకు గండికొట్టడమేనంటూ చిన్నప్పరెడ్డి తీర్పు ఇచ్చారు. భావప్రకటన స్వేచ్ఛ ప్రసాదించిన రాజ్యాంగమే మౌనంగా ఉండే స్వేచ్ఛ ఇచ్చిం దంటూ ఆయన అన్వయించారు. జాతీయ గీతం రచించిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ అభిప్రాయాలకీ, అదే గీతంపైన ఇప్పుడు ఆదేశాలు జారీ చేసిన న్యాయ మూర్తుల భావాలకూ మధ్య గణనీయమైన అంతరం ఉంది. టాగోర్ తనను తాను విశ్వమానవుడుగా సంభావించుకునేవారు. ఆయన దేశభక్తుడు నిస్సందేహంగా. కానీ జాతీయతాభావాన్ని పనికట్టుకొని ప్రదర్శించడాన్ని ఆమోదించే వ్యక్తి మాత్రం కాడు. కవిగా సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కోరుకున్న మేధావి. స్వాతంత్య్ర దినోత్స వాలు, రిపబ్లిక్ డే వేడుకలలో జాతీయగీతాన్ని ఆలపించడం ఆనవాయితీ. 1962లో చైనా దురాక్రమణ తర్వాత సినిమా ప్రదర్శన చివరిలో జాతీయగీతాలాపన ప్రవేశ పెట్టారు. 1971 జాతీయ పతాకంపట్ల గౌరవాన్ని పరిరక్షించేందుకు ఒక చట్టాన్ని తెచ్చారు. జాతీయగీతాలాపన జరుగుతుండగానే ప్రేక్షకులు నిష్ర్కమించడం జాతీ యగీతాన్ని అవమానించడంగా భావించి 1975 నుంచి ఆ ఆనవాయితీకి స్వస్తి చెప్పారు. ఎవ్వరూ ఎవరి దేశభక్తినీ శంకించలేదు. ప్రశ్నించలేదు. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారాయి. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలోనూ 207 అడుగుల ఎత్తున జాతీ యపతాకం రెపరెపలాడుతూ ఉండాలని స్మృతిఇరానీ అధ్యక్షతన జరిగిన వైస్‌చాన్సలర్ల సమావేశం తీర్మానించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంపైన మెరుపు దాడుల సందర్భంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం జాతి వ్యతిరేక చర్యగా భావించే పరిస్థితులు దాపురించాయంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఇప్పటికీ సినిమాహాళ్ళలో జాతీయగీతాలాపన జరుగుతున్న రాష్ట్రాలలో మహా రాష్ట్ర, గోవా ఉన్నాయి. అక్టోబరులో గోవాలోని ఒక సినిమాహాలులో జాతీయగీతం పాడుతున్న సందర్భంలో ప్రముఖ రచయిత సలీల్చతుర్వేది తన సీట్లోనే కూర్చొని ఉన్నారు. ఆ దృశ్యాన్ని సహించలేని దేశభక్తులైన దంపతులు ఆయనపైన దాడి చేశారు. ఆ రచయితకు ప్రమావశాత్తూ వెన్నెముక గాయమైనదనీ, నిలబడలేనిస్థితి లో ఉన్నారనీ, వికలాంగుల హక్కుల సాధన ఉద్యమంలో ఆయన ప్రముఖుడనీ ఆ దంపతులకు తెలియదు. ఇటువంటి ఘటనలు మొన్నటి తీర్పు ప్రభావంతో ముమ్మరం కావచ్చుననే ఆందోళన ఆలోచనాపరులను అశాంతికి గురిచేస్తున్నది. మనం అన్ని విషయాలలో పాశ్చాత్యదేశాలను, ముఖ్యంగా అమెరికాను, ఆద ర్శంగా తీసుకుంటున్నాం. అమెరికా, బ్రిటన్వలె నగదు లావాదేవీలు లేని సమాజం నిర్మించాలన్న అభిలాషతోనే మోదీ పెద్దనోట్లను రద్దు చేశారని భావిస్తున్నాం. అదే అమెరికాలో జాతీయపతాకాన్ని తగులబెట్టడం శిక్షార్హమైన నేరం కాదు. మితవాద మనోభావాలకు ప్రతీక అయిన డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ట్వీట్లో ‘అమెరికా పతాకాన్ని తగులబెట్టినవారికి కనీసం ఒక సంవత్సరం కారాగార శిక్ష విధించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనను అమెరికా సుప్రీంకోర్టు ఆమోదించే అవకాశాలు లేవు. వియత్నాం యుద్ధ వ్యతిరేక ప్రదర్శకులు అమెరికా జాతీయ పతా కాన్ని దగ్ధం చేసినప్పుడు ‘సమాఖ్య పతాక పరిరక్షణ చట్టాన్ని (ఫెడరల్ ఫ్లాగ్ ప్రొటె క్షన్ యాక్ట్) 1968లో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) తెచ్చింది. అదే చట్టాన్ని అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోనూ 48 రాష్ట్రాలు ఆమోదించాయి. కానీ 1989లో అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ చట్టం రాజ్యాంగ విరు ద్ధమంటూ 5-4 మెజారిటీతో కొట్టివేసింది (టెక్సస్ వర్సెస్ జాన్సన్ కేసు). అమె రికా రాజ్యాంగానికి జరిగిన మొదటి సవరణలో హామీ ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛకు ఈ చట్టం విఘాతం కలిగిస్తుందని తీర్పు చెప్పింది. పట్టువీడని అమెరికా కాంగ్రెస్ మరోసారి జాతీయపతాక పరిరక్షణ చట్టాన్ని ఆమోదించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం 1990లో అదే 5-4 మెజారిటీతో కాంగ్రెస్ తాజా నిర్ణయాన్ని సైతం చెల్లదని ప్రకటించింది (యూఎస్ వర్సెస్ ఏక్మన్ కేసు). రిపబ్లికన్ పార్టీకి పార్లమెం టులో ఆధిక్యం ఉన్నది కనుక ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన ఆలో చనను అమలు చేయవచ్చు. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యే అవకాశాలే ఎక్కువ. పౌరులు మానవత్వం కలిగి ఉండాలనీ, తోటివారిని ప్రేమించాలనీ కోరుకో వాలి. దేశభక్తి గుండెనిండా ఉంటే చాలు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు 28 సంవత్సరాల తర్వాత తొలి స్వర్ణపతకాన్ని అభినవ్ భింద్రా సాధించినప్పుడు భారత జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే, జాతీయ గీతం ఆలపిస్తుంటే హృదయం ఆనందంతో ఉప్పొంగని భారతీయులు ఎవరుంటారు? అదే సహజ మైన, సార్వజనీనమైన దేశభక్తి. జాతికి అదే రక్ష. -
ఏటీఎంలలో నోట్లకు బదులు జాతీయ గీతం
న్యూఢిల్లీ : దేశంలోని సినిమా థియేటర్లన్నింటిలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ‘జన ఘన మన అధినాయక జయహే’ ఆలాపనను విధిగా వినిపించాలని, ఆ సందర్భంగా థియేటర్లలో ఉన్న ప్రేక్షకులు గౌరవ సూచకంగా నిలబడడం తప్పనిసరంటూ సుప్రీం కోర్టు బుధవారం ఇచ్చిన ఉత్తర్వులపై సోషల్ మీడియా తనదైన శైలిలో వినూత్నంగా స్పందిస్తోంది. ముఖ్యంగా ట్విట్లర్లో ట్వీట్లు పేలుతున్నాయి. ‘ఏటీఎంలలో క్యాష్ అయిపోగానే జాతీయ గీతాన్ని ప్లే చేయాలి.....వీకో టెర్మరిక్, నహీ కాస్మోటిక్ మన జాతీయ గీతం. అందుకే ప్రతి సినిమాకు ముందు చూపిస్తారు....ప్రతి ఒక్కరు అద్దం ముందు నిలబడి మూడుసార్లు జాతీయ గీతాన్ని ఆలాపించాలి. అలా చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ అద్దంలో ప్రత్యక్షమై మీకో వంద రూపాయల నోటు ఇస్తారు....భవిష్యత్తులో ప్రతి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు ముందు జాతీయ గీతం స్లైడ్‌ను ప్రదర్శించడం తప్పనిసరి చేస్తారేమో!....ఇక వధువు కావలె యాడ్ ఇలా ఉంటుంది: తెల్లగా ఉండే బ్రాహ్మణ యువకుడు ఎంటెక్ చదివాడు. నెలకు ఆరంకెల జీతం. పీవీఆర్‌లో జాతీయ గీతాలాపన వినిపించగానే బుద్ధిగా లేచి నిలబడతాడు....జాతీయ గీతాలాపన సందర్భంగా నేను ఎప్పుడూ నిలబడతాను. ఇక ముందు జాతికి సంబంధించినది ఏదైనా నిలబడతాను, అది నేషనల్ పానోసోనికైనా సరే..... ఒక్క థియేటర్లలో మాత్రమే ఎందుకు? జాతీయ గీతాన్ని అన్ని చోట్ల, అన్ని లీజర్ సమయాల్లో వినిపించాలి...ప్రతి రెస్టారెంట్లో భోజనానికి ముందు వినిపించాలి....ప్రతి యూట్యూబ్ వీడియోకు ముందు జాతీయ గీతాన్ని వినిపించాలి. అప్పుడు యాడ్స్లాగా స్కిప్ చేస్తే పోలీసులు వచ్చి లాప్ట్యాబ్, స్మార్ట్ఫోన్లు తీసుకపోతారు.....ప్రతి పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తుందని ఆశిస్తున్నా....పార్లమెంట్‌లోనే ఐక్యత అవసరం కనుక జాతీయ గీతాన్ని వినిపించడం తప్పనిసరి చేస్తే మంచిది....’ అంటూ ట్వీట్లు వెల్లువెత్తుతుండగా, నరేంద్ర మోదీకి, రవీంద్ర నాథ్ టాగూర్‌కు ఎలాంటి బంధం ఉందంటూ అరవింద్ కేజ్రివాల్ లాంటి వాళ్లు సీరియస్‌గా స్పందించారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ఏటీఎంలో ఎప్పుడు క్యాష్ నింపుతున్నారో, అది ఎప్పుడు అయిపోతుందో తెలియక ప్రజలు చస్తున్నారు. క్యాష్ అయిపోగానే జాతీయ గీతాన్ని వినిపిస్తే ఎంచక్కా క్యాష్ లేదని తెలుసుకోవచ్చు. కానీ భక్తిరసం ఎక్కువై క్యాష్ లేకపోయిన ప్రజలు క్యూలో కదలకుండా నిలుచుండిపోతే!...పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో గోల గోల చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను కట్టడి చేయడం కోసం జాతీయ గీతాలాపనను వినిపిస్తే నోరుమూసుకొని నిలబడతారుకదా! కానీ లక్ష్యం నెరవేరాలంటే పదేపదే గీతాలాపనను ఆపకుండా వినిపించాల్సి వస్తుంది కనుక ఎంపీలు ఇక ఎప్పటికీ బయటకు రారేమో! థియేటర్లో జాతీయ గీతాలాపనను వినిపిస్తున్నప్పుడు లోపలి నుంచి బయటకు, బయట నుంచి లోపలకు ఎవరూ రాకుండా తలుపులు మూసివేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇక్కడ గమనార్హం. -
హాళ్లలో ‘జనగణమన’ తప్పనిసరి
సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ఆలపించాలన్న సుప్రీంకోర్టు గౌరవ సూచకంగా ప్రజలు లేచి నిలబడాలి న్యూఢిల్లీ: ప్రజల్లో దేశభక్తి, జాతీయభావాన్ని పెంపొందించేందుకుగానూ సినిమా హాళ్లలో జాతీయ గీతం ‘జనగణమన’ను తప్పనిసరిగా ప్రదర్శించాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రారంభానికి ముందు దేశమంతటా సినిమా థియేటర్లన్నీ జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆదేశించింది. జాతీయగీతాన్ని ప్రదర్శించే సమయంలో తెరపై జాతీయ జెండా కనిపించాలని, ఆ సమయంలో ప్రేక్షకులంతా లేచి నిలబడాలని సూచించింది. జాతీయ గీతం, జాతీయ జెండాను గౌరవించడం దేశంలోని ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని పేర్కొంది. ‘‘జాతీయ జెండా, జాతీయ గీతంపై గౌరవమే మాతృభూమిపై వారికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని ప్రతిఫలిస్తుంది. ఇది నా దేశం. నా మాతృభూమి అని ప్రజలంతా భావించాలి. ఇది వ్యక్తుల్లో జాతీయభావాన్ని, దేశభక్తిని పెంపొందిస్తుంది. జాతీయభావం అనే దానిని శాస్త్రాలు కూడా ఆమోదించారుు’’ అని న్యాయమూర్తులు జస్టిస్ దీపక్‌మిశ్రా, అమితవరాయ్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని, అలాగే అధికారిక ఫంక్షన్లు, కార్యక్రమాల సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించేందుకు సరైన నిబంధనలను, ప్రొటోకాల్‌ను నిర్దేశించాలని కోరుతూ శ్యామ్ నారాయణ చౌస్కి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి 14కు వారుుదా వేసింది. జాతీయ గీతం ప్రాముఖ్యత దృష్ట్యా దానిని ప్రదర్శించే లేదా ఆలపించే సమయంలో సినిమా థియేటర్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసి ఉంచాలని, దీని వల్ల ఎవరూ జాతీయ గీతాన్ని అగౌరవ పరిచే అవకాశం ఉండదని, అందువల్ల జాతీయ గీతాన్ని ప్రదర్శించిన తర్వాత మాత్రమే సినిమా హాళ్ల తలుపులు తెరవాలని స్పష్టం చేసింది. జాతీయ గీతాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకోవడం లేదా నాటకీయంగా మలచడం వంటి చర్యలను ఏ ఒక్కరూ చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే అవాంఛనీయ వస్తువులపై జాతీయ గీతాన్ని ముద్రించడంగానీ లేదా జాతీయ గీతాన్ని అగౌరవపరిచే ప్రదేశాల్లో దానిని ప్రదర్శించడం గానీ చేయకూడదని, వెరైటీ షోల్లో సంక్షిప్తీకరించిన జాతీయగీతాన్ని ప్రదర్శించరాదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి పది రోజుల గడువు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ జాతీయ గీతాన్ని అందరూ గౌరవించాల్సిందే అని చెప్పారు. కోర్టు ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలకు అందజేస్తామని న్యాయస్థానానికి నివేదించారు. కోర్టు ఆదేశాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేలా కూడా చూస్తామని, దీని వల్ల అందరూ దీనిని ఆచరించేందుకు, తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పారు. పార్లమెంటులోనూ పాడమనండి.. కోర్టు ఆదేశాలపై సినీదర్శకుడు శేఖర్ కపూర్, నిర్మాత శిరీష్ కుందేర్లు మండిపడ్డారు. ‘ప్రతి సమావేశానికి ముందు జాతీయగీతాన్ని పాడాలని పార్లమెంటును కోర్టు ఆదేశించాలి. ఎందుకంటే పార్లమెంటు డ్రామా సినిమాలాగే ఉంటుంది’ అని కపూర్ అన్నారు. ‘జాతీయగీతాలాపన సమయంలో లేచి నిలబడకపోతే కాల్చేస్తారా? జైలుకు పంపుతారా? ఉరితీస్తారా?’ అని కుందేర్ విరుచుకుపడ్డారు. రెస్టారెంట్లలో తినడానికి ముందు దీన్ని పాడించాలని ఎద్దేవా చేశారు. దేశభక్తిని పెంపొందిస్తుంది: బీజేపీ జాతీయ గీతానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను బీజేపీ స్వాగతించింది. ఈ నిర్ణయం ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ అనే స్ఫూర్తికి ఇది ఉపకరిస్తుందని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా మంచి నిర్ణయమని, ఈ తీర్పుతో ప్రజల్లో ముఖ్యంగా యువతలో దేశభక్తి మరింత పెంపొందుతుందని చెప్పారు. కాగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా సుప్రీం ఆదేశాలను స్వాగతించారు. అరుుతే ఈ నిర్ణయం దేశభక్తి లేదా జాతీయభావాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తుందా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
మనది కాక, సోమాలియా జాతీయగీతం వింటారా?
న్యూఢిల్లీ: దేశంలోని థియేటర్లన్నింటిలోనూ సినిమా ప్రదర్శించేముందు తప్పకుండా జాతీయగీతాన్ని ప్రదర్శించాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో థియేటర్ తెరపై జాతీయ జెండాను చూపించాలని, థియేటర్లోని ప్రతి ఒక్కరూ లేచినిలబడి జాతీయ గీతాన్ని గౌరవించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. థియేటర్లలో జాతీయ గీతం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా.. దేశభక్తి ప్రదర్శించుకోవడానికి థియేటర్ల వేదిక కావాలా? అని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ స్పందించారు. ‘థియేటర్లలో జాతీయగీతాన్ని ప్రదర్శించాల్సిందే. జాతీయ జెండా చూపించాల్సిందే. మనది కాకుంటే సోమాలియా జాతీయగీతాన్ని వినిపించాలా?’ అని ఆయన ప్రశ్నించారు. -
థియేటర్లకు సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సినిమా థియేటర్ల యజమానులకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం వినిపించాలని ఆదేశించింది. అలాగే ఆ సమయంలో స్క్రీన్లపై జాతీయ పతాకాన్ని చూపించాలని సూచించింది. బుధవారం సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ గీతం, జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోర్టు పేర్కొంది. జాతీయ గీతాన్ని వినిపిస్తున్న సమయంలో సినిమా థియేటర్లలో ప్రతి ఒక్కరూ గౌరవసూచకంగా లేచి నిలబడాలని సూచించింది. కాగా ప్రస్తుతం కొన్ని మాల్స్, థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని వినిపిస్తున్నారు. -
వైవీయూలో సామూహిక జాతీయ గీతాలాపన
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలోని అబ్దుల్ కలాం కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో సామూహిక జాతీయ గీతాలాపన చేసి దేశభక్తిని ఎలుగెత్తి చాటారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యావత్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని జాతీయ గీతాన్ని రాగయుక్తంగా ఆలపించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కుల, మత, లింగ బేధాలకు అతీతంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య జి. గులాం తారీఖ్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఐకమత్యానికి, త్యాగ పురుషులను గుర్తుంచుకోవడానికి దేశం పట్ల విద్యార్థులకు గౌరవ భావం కలిగించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్అహ్మద్ మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల స్వాతంత్య్రభావన, త్యాగమూర్తుల గొప్పతనం, దేశప్రతిష్టలను భావితరాల వారికి అందించడానికి జాతీయ గీతాలాపన తప్పనిసరి అని వివరించారు. ఈ కార్యక్రమాన్ని వ్యాయామ విభాగం అధ్యాపకులు డా. రామసుబ్బారెడ్డి, చాంద్‌బాషాలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బియ్యం గింజలపై బంగారంతో జాతీయ గీతం
-
జాతీయ భావం.. సమైక్య సంకల్పం
పెదవేగి రూరల్: వెయ్యి గళాలు ఒక్కటయ్యాయి.. ఐదు గంటల పాటు మదినిండా దేశభక్తి భావంతో చిన్నారులు జాతీయ గీతం, జాతీయ గేయం, దేశ ప్రతిజ్ఞను మూడు భాషల్లో ఆలపించారు. జాతీయ భావాన్ని, సమైక్య సంకల్పాన్ని ఎలుగెత్తి చాటారు. 75వ క్విట్ ఇండియా దినోత్సవం, 70వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని పెదవేగి ఎస్ఎంసీ పాఠశాలలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు విజన్ లయన్స్ క్లబ్, ఎస్ఎంసీ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం కోసం ‘వందేమాతరం, జనగణమని, భారతదేశం నా మాతృభూమి’ని ఆలపించి చిన్నారులు ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి జాతీయ సమైక్యతను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పరిశీలకుడు సాయిశ్రీ అన్నారు. ఎస్ఎంసీ సంస్థ చైర్మన్ ఫాదర్ డొమినిక్ చుక్కా జ్వోతి ప్రజ్వలనం చేశారు. సభాధ్యక్షుడిగా లయన్ ఎ.శేషుకుమార్ వ్యవహరించగా విశిష్ట అతిథిగా డీజీఎం ఫాదర్ మోజెస్ హాజరయ్యారు. ముందుగా స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. లయన్ అక్కినేని వెంకటేశ్వరరావు, జోన్ చైర్పర్సన్ సీహెచ్ అవినాష్‌రాజ్, సర్పంచ్ మాతంగి కోటేశ్వరరావు, హెచ్ఎం కె.ఉషారాణి, లయన్ నూలు రామకృష్ణ పాల్గొన్నారు. -
పాఠశాలలో జాతీయగీతాన్ని ఆలపించొద్దని..
అలహాబాద్: స్వతంత్ర దినోత్సవం నాడు విద్యార్థులు జాతీయగీతాన్ని ఆలపించొద్దని ఓ పాఠశాల మేనేజర్ ఆదేశాలు జారీ చేసిన సంఘటన వివాదాస్పదమైంది. దాంతో పాఠశాలలో పనిచేసే ఏడుగురు ఉపాధ్యాయులతో పాటు ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నగరంలోని బఘారాలో ఉన్న జియా-ఉల్-హక్ పాఠశాలలో వందేమాతరం, సరస్వతి వందనాలను కూడా స్కూల్ మేనేజర్ నిషేధించారు. జాతీయ గీతం కులానికి వ్యతిరేకంగా ఉందని.. దాన్ని పాఠశాలల్లో విద్యార్థులతో పాడించకూడదని మేనేజర్ వ్యాఖ్యానించారు. నగరంలో మేనేజర్ గుర్తింపు లేని రెండు పాఠశాలలను నడుపుతున్నారు. బఘారాలోని స్కూల్లో 330 విద్యార్థులు, 20 మంది టీచర్లు పనిచేస్తుండగా.. శుక్రవారం మేనేజర్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకే సామాజిక వర్గానికి చెందిన 8 మంది రాజీనామా చేశారు. స్వతంత్ర దినోత్సవం తేదీ దగ్గరపడుతుండటంతో పాఠశాలలో సంబరాలకు ఏర్పాట్లుపూర్తి చేసి మేనేజర్ కు ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ రీతూ శుక్లా చెప్పారు. వాటిని పరిశీలించిన మేనేజర్ వందేమాతరం, సరస్వతి వందనం, జాతీయ గీతాల్లో ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పదాలు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిపారు. విద్యార్థులతో వీటిని పాడించడానికి వీల్లేదని చెప్పినట్లు వివరించారు. దీనిని వ్యతిరేకించిన వాళ్లందరూ స్కూల్ నుంచి వెళ్లిపోవచ్చని చెప్పినట్లు తెలిపారు. దాంతో ఎనిమిది టీచర్లు రాజీనామా చేశారని చెప్పారు. జాతీయ గీతంలోని 'భారత భాగ్య విధాత' అనే వరుసలో భారతదేశం దైవం కాదని, అల్లానే దైవమని మేనేజర్ వ్యాఖ్యనించినట్లు వివరించారు. జాతీయగీతాన్ని ఆలపించొద్దని విద్యార్థులు, టీచర్లను అడ్డగించే హక్కు ఎవరికీ లేదని.. జియా-ఉల్-హక్ స్కూల్ మేనేజర్ ను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్ స్పష్టం చేశారు. -
మా స్కూల్లో జాతీయ గీతాన్ని పాడనివ్వం!
అలహాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతి ఊరు, వాడ, ప్రతి బడిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. అదేవిధంగా తమ బడిలోనూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావించిన టీచర్లు, ప్రిన్సిపాల్‌కు యాజమాన్యం నుంచి చుక్కెదురైంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తమ స్కూల్లో జాతీయ గీతాన్ని ఆలపించడానికి అనుమతివ్వబోనంటూ యజమాని తేల్చిచెప్పాడు. దీనికి నిరసనగా ప్రిన్సిపాల్, సహా ఎనిమిది మంది టీచర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ ఘటన గుజరాత్ అహ్మదాబాద్‌లోని సైదాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగింది. పంద్రాగస్టునాడు స్కూలులో జెండా ఎగురవేసిన తర్వాత జాతీయగీతాన్ని ఆలపించాలని, ఆ తర్వాత వందేమాతరం, సరస్వతి వందన ఆలాపన చేయాలని స్కూల్ ప్రిన్సిపాల్ రితూ శుక్లా మేనేజ్మెంట్కు నివేదించారు. అయితే, జాతీయగీతం ఆలపించడం, ఇతర దేశభక్తి గీతాలను పాడటం వల్ల ఓ మతం వారి మనోభావాలు దెబ్బతింటాయని, కాబట్టి దీనిని అంగీకరించబోనని మేనేజర్ చెప్పారు. దీంతో మరో వర్గానికి చెందిన ఎనిమిది టీచర్లు సహా ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు విద్యాశాఖ తెలిపింది. అయితే, తమ స్కూల్ ప్రాంగణంలో జాతీయ గీతాన్ని ఆలపించొద్దన్న నిర్ణయాన్ని పాఠశాల యజమాని జియా వుల్ హక్ సమర్థించుకున్నారు. మతం, దైవం కన్నా దేశమే మిన్న అని జాతీయ గీతం ప్రబోధిస్తుందని, ఇది తమ మతాన్ని ప్రగాఢంగా విశ్వసించేవారికి ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళుతామని ఆయన చెప్పినట్టు సమాచారం. -
సన్నీ లియోన్ పై పోలీసు ఫిర్యాదు
-
సన్నీ లియోన్ పై పోలీసు ఫిర్యాదు
న్యూఢిల్లీ: బాలీవుడ్ శృంగారతార సన్నీ లియోన్ జాతీయ గీతాన్ని అవమానించారంటూ ఢిల్లీ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు నమోదయింది. ప్రో కబడ్డీ లీగ్స్ లో భాగంగా గురువారం ముంబైలో జరిగిన ఓ మ్యాచ్ కు హాజరైన సన్నీ లియోన్.. మ్యాచ్ ప్రారంభానికి ముందు 'జనగణమన..'ను ఆలపించారు. అయితే పదాలు పలకడం దగ్గర్నుంచి, రాగం ఆలపించడం వరకు ఆమె పొరపాట్లు చేశారని, తద్వారా జాతీయ గీతాన్ని అవమానించారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ప్రో కబడ్డీ లీగ్స్ లో జాతీయ గీతాలాపనపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. గత సీజన్ లో ఓ మ్యాచ్ సందర్భంగా బిగ్ బి అమితాబ్ జనగణమన ను సరిగా ఆలపించలేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గురువారం ముంబైలో జాతీయ గీతాలపన సందర్భంలో సన్నీ లియోన్ ఉద్వేగానికి గురయ్యారు. భారత జాతీయ గీతం పాడటాన్ని గర్వంగా భావిస్తున్నట్లు, అసలీ అవకాశం లభిస్తుందని ఎన్నడూ అనుకోలేదని ఆమె చెప్పారు. తన తండ్రి కూడా కబడ్డీ అభిమాని అని, చిన్నప్పుడు కబడ్డీ ఆడేలా ప్రోత్సహించారని, వ్యక్తిగతంగా ఆ ఆటపై మక్కువలేక పోవడంతో కబడ్డీ నేర్చుకోలేకపోయానని సన్నీ చెప్పుకొచ్చారు. ఇక ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా ఇంకా తెలియరాలేదు. -
క్షమాపణ చెప్పిన ఫరూఖ్ అబ్దుల్లా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. తనపై వచ్చిన విమర్శలకు ఆయన శనివారం వివరణ ఇచ్చుకున్నారు. అసలు విషయానికి వస్తే... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఫరూఖ్ అబ్దుల్లా హాజరయ్యారు. జాతీయ గీతాలాపన సందర్భంగా అందరూ లేచి నిలబడితే, ఆయన మాత్రం ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. ఈ దృశ్యం కాస్తా కెమెరా కంటికి చిక్కింది. దీంతో ఫరూఖ్ వ్యవహరించిన తీరుపట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఫరూఖ్ మాట్లాడుతూ ఆ సమయంలో తనకు ముఖ్యమైన ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. విదేశాల్లో ఉంటున్న తన బంధువుకు ఆరోగ్యం బాగాలేదని ఫోన్ కాల్ రావటంతో తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. అయితే గీతాలాపన జరిగినప్పుడు తానే నిలబడే ఉన్నానన్నారు. ఈ ఘటనపై ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే, అందుకు తాను క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. కాగా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి, కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఫరూఖ్ జాతీయ గీతం సమయంలో సెల్ఫోన్లో మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగించింది. గీతాలాపన అయిపోయేవరకూ కూడా ఆయన అలాగే సెల్ఫోన్లో మాట్లాడుతునే ఉన్నారు. మరోవైపు ఫరూఖ్ చర్యపై బిజెపి కన్నెర్ర చేసింది. జాతీయగీతాన్ని అవమానించేందుకే ఫరూఖ్ ఈ పని కావాలని చేశారని ఆరోపించింది. ఫరూఖ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దాంతో దిగివచ్చిన ఫరూఖ్ క్షమాపణ చెప్పారు. -
జాతీయ గీతాన్ని అవమానించిన ఫరూక్ అబ్దుల్లా
కోల్ కతా: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా జాతీయ గీతాన్ని అవమానించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఫరూక్ ముందు వరుసలో కూర్చున్నారు. జాతీయగీతాన్ని ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలుచున్నారు. ఫరూక్ మాత్రం ఫోన్ లో మాట్లాడుతూ కనిపించారు. రాజ్యాంగంలోని 51(ఎ) అధికరణ ప్రకారం జాతీయ పతాకాన్ని, గీతాన్ని గౌరవించడం ప్రతీ పౌరుని ప్రాథమిక విధి. -
అసలైన జాతీయగీతం.. వందేమాతరం
'భారత్ మాతాకీ జై' నినాదం తాలూకు వివాదం ఇంకా చల్లారక ముందే మరో వివాదం మొదలైంది. అసలైన జాతీయగీతం జనగణమణ కాదని, వందేమాతరమే అసలైన జాతీయ గీతమని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు. ప్రస్తుతం జనగణమణ మన జాతీయ గీతమని, అందువల్ల దాన్ని గౌరవించాల్సిందేనని, అయితే సరైన అర్థం తీసుకుంటే వందేమాతరమే మన జాతీయ గీతం కావాలని ఆయన అన్నారు. ముంబైలో దీన దయాళ్ ఉపాధ్యాయ రీచ్ సంస్థలో మాట్లాడుతూ ఆయనీ విషయం తెలిపారు. అయితే రాజ్యాంగం ప్రకారం జనగణమణ ఉంది కాబట్టి దాన్నే మనం కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. జనగణమణ ఎప్పుడో రాశారని, కానీ అందులో అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాశారని భయ్యాజీ జోషి అన్నారు. వందేమాతరంలో మాత్రం దేశ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించారని చెప్పారు. ఈ రెండింటి మధ్య తేడా ఇదేనని, రెండింటినీ గౌరవించాల్సిందేనని ఆయన తెలిపారు. వందే మాతరం అంటే.. భరతమాతకు వందనం అని అర్థం. దీన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ రాశారు. ఇది స్వాతంత్ర్య సమరం సమయంలో కీలకపాత్ర పోషించింది. 1950లో దీని మొదటి రెండు పాదాలను కలిపి జాతీయ గేయంగా ప్రకటించారు. -
అమితాబ్ సార్ కు హ్యాట్సాఫ్ : ఎస్పీ బాలు
హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మద్ధతు తెలిపారు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ - పాక్ జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌కి ముందు బిగ్ బి అమితాబ్ బచ్చన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతాన్ని తప్పుగా ఆలపించారంటూ అమితాబ్ పై పిఆర్ ఉల్లాస్ అనే డాక్యుమెంటరీ దర్శకుడు ఢిల్లీలోని న్యూ అశోక్‌నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. ఈ కేసు వివాదంపై బాలు గారు తీవ్రంగా మండిపడ్డారు. అమితాబ్ సార్ జాతీయ గీతాన్ని చాలా బాగా ఆలపించారని, తాను చాలా గర్వపడుతున్నాని.. ఆయనకు హ్యాట్సాప్ అంటూ బాలు గారు తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. నిర్ధిష్ట సమయం కచ్చితంగా పాడాలని లేకపోతే చర్యలు తీసుకోవడానికి చట్టాలు కూడా ఉన్నాయా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. లతా మంగేష్కర్, భీమ్ సేన్ జోషీ, బాలమురళీ గారితో పాటు తాను జనగనమణను ప్రాక్టీస్ చేసేవాడినని అయితే ఏ ఒక్కరూ ఇంత సమయం పాడాలని తనకు ఎప్పుడు చెప్పలేదని జాతీయ అవార్డు గ్రహీత బాలు అన్నారు. దేశంలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఉన్నాయని అలాంటి వాటిని అరికట్టేందుకు తోడ్పడాలని సూచించారు. అంతేకానీ, పాపులర్ అయ్యేందుకు ఏదో ఓ విషయాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారేందుకని బాలు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. -
అమితాబ్ జాతీయగీతాన్ని తప్పుగా పాడారా?
టి-20 ప్రపంచకప్‌లో భాగంగా.. భారత్ - పాక్ జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌కి ముందు బాలీవుడ్ పెద్దమనిషి బిగ్ బి అమితాబ్ బచ్చన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే, దాన్ని ఆయన తప్పుగా మాట్లాడారంటూ ఫిర్యాదు దాఖలైంది. పిఆర్ ఉల్లాస్ అనే డాక్యుమెంటరీ దర్శకుడు ఢిల్లీలోని న్యూ అశోక్‌నగర్ పోలీసు స్టేషన్లో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. అమితాబ్ పదే పదే జాతీయగీతాన్ని తప్పుగా పాడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసారి ఈడెన్ గార్డెన్స్‌లో ఆయన తన సొంత శైలిలో ఒక నిమిషం 10 సెకండ్ల పాటు పాడారని, అయితే హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన నిబంధనలతో పాటు ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. జాతీయగీతాన్ని పాడే విషయంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలను రూపొందించింది. వీటిని దేశంలో ప్రతి పౌరుడూ పాటించాలి. వీటిలో ఒకటి.. జాతీయ గీతాన్ని సరిగ్గా 52 సెకండ్లలో పాడాలి. కానీ అమితాబ్ మాత్రం 18 సెకండ్ల సమయం అధికంగా తీసుకున్నారు. దాంతోపాటు, 'మంగళ దాయక' అనడానికి బదులు 'మంగళ నాయక' అని పాడారని కూడా ఉల్లాస్ ఫిర్యాదులో చెప్పారు. జాతీయగీతంలోని పదాల విషయంలో స్వేచ్ఛ తీసుకోకూడదని, కానీ బిగ్‌బీ అలా తీసుకున్నారని తెలిపారు. తన ఫిర్యాదు కాపీని ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి, హోం మంత్రిత్వశాఖకు కూడా పంపారు. -
ఆ క్షణం చిరస్మరణీయం...
జాతీయ గీతాలాపనపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముంబై: వేలాది ప్రేక్షకుల మధ్య 2011 ప్రపంచకప్ ఫైనల్లో జాతీయ గీతం పాడుతున్నప్పుడు కలిగిన అనుభూతి తన జీవితంలో మరిచిపోలేనిదని భారత క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపారు. ‘జనగణమన పాడుతున్నప్పుడు మన తల ఎప్పుడూ పైకే ఉంటుంది. అదే స్టేడియంలోని వేలాది ప్రేక్షకులు ఆలపిస్తున్నప్పుడు మన ఛాతీ గర్వంతో ఉప్పొంగి పోతుంటుంది. ఇలాంటి అనుభం నాకు 2003 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో ఆడుతున్నప్పుడు.. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లోనూ ఎదురైంది. ముఖ్యంగా ముంబైలోని వాంఖడే స్టేడియం మొత్తం జాతీయ గీతాలాపన చేసిన వైనం ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇది ఎప్పటికీ మరిచిపోలేను. నా జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ క్షణాలవి. నేను ఎన్ని రికార్డులు సాధించినా ఈ అనుభవం ముందు దిగదుడుపే’ అని సచిన్ అన్నారు. హాకీ స్టార్ ధన్‌రాజ్ పిళ్లై, క్రికెటర్ నిలేశ్ కులకర్ణిలతో కలిసి ‘ది స్పోర్ట్ హీరోస్’ వీడియో ఆవిష్కరణలో సచిన్ పాల్గొన్నారు. ఈ వీడియోలో భారత క్రీడారంగం ప్రముఖులైన సచిన్ టెండూల్కర్‌తోపాటు సునీల్ గవాస్కర్, సానియా మీర్జా, మహేశ్ భూపతి, ధన్‌రాజ్ పిళ్లై, బైచుంగ్ భూటియా, గగన్ నారంగ్, సుశీల్ కుమార్ తదితరులు జాతీయగీతం పాడారు. -
మదర్సాలో జాతీయగీతం పాడాలన్నందుకు..
కోల్‌కతా: కాజీ మసూం అఖ్తర్.. కోల్‌కతాలోని తల్పుకుర్ ఆరా ఉన్నత మదర్సాలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని పాడాలని విద్యార్థులకు బోధించినందుకు ఆయనపై మౌలానాలు, వారి అనుచరులు దాడి చేశారు. దాడికి పాల్పడిన మౌలానాలకు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులన్న ముద్ర ఉంది. తనపై దాడి గురించి అఖ్తర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్‌ను ఆరుసార్లు కలిసినా ఆయనకు ఎలాంటి మద్దతుగానీ, హామీగానీ లభించలేదు. ఇప్పటికే మౌలానాలు అఖ్తర్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీచేశారు. అంతేకాకుండా జాతీయ గీతం దైవదూషణేనని, అది హిందూత్వ గీతమని వారు పేర్కొన్నారు. గత ఏడాది మార్చ్‌లో అఖ్తర్‌పై కొందరు దుండగులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో తలకు తీవ్ర గాయమైన ఆయన కొన్ని నెలలపాటు ఆస్పత్రి మంచానికే పరిమితమయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడైనప్పటికీ అఖ్తర్ మదర్సాలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఫత్వా జారీచేశారు. ముస్లిం వస్త్రాలైన కుర్తా, పైజామా ధరించి.. గడ్డాన్ని పెంచితేనే ఆయనను మదర్సాలోకి అనుమతిస్తామని, గడ్డం ఎంతవరకు పెంచాలనేది కూడా మౌలానాలే నిర్ణయిస్తారని ఫత్వాలో పేర్కొన్నారు. గడ్డం పెరుగుదల గురించి ప్రతివారం ఫొటోలు పంపుతూ తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇంత జరుగుతున్నా.. మత ఉద్రిక్తతల కారణంగా అఖ్తర్‌కు భద్రత కల్పించలేమంటూ కోల్‌కతా పోలీసు కమిషనర్ మైనారిటీ కమిషన్ చైర్మన్‌కు లేఖ రాయడం గమనార్హం. -
జాతీయ గీతంపై ద్వంద్వ నీతా?
హైదరాబాద్: ‘ముంబైలోని ఒక థియేటర్లో జాతీయ గీతాన్ని వినిపిస్తుండగా లేచి నిలబడి గౌరవించలేదని దేశ ద్రోహులంటూ ఓ ముస్లిం కుటుంబాన్ని బయటికి గెంటేసి గగ్గోలు పెట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు... రష్యా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూస్ ఎయిర్ పోర్టులో గౌరవ వందనం తర్వాత జాతీయ గీతాన్ని వినిపిస్తుండగా ఆగకుండా ముందుకు వెళ్లడంపై ఏం చెబుతారు? పొరపాటు అనేది మానవ సహజం. ముస్లింలు అనగానే ఉగ్రవాదులు, దేశద్రోహులంటూ వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం’ అని ఆల్ ఇండియా ఇత్తెహదుల్-ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. బుధవారం రాత్రి దారుస్సలాంలో జరిగిన మిలాద్-ఉన్-నబీ సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీకి దేశ ప్రజల బాగోగులు పట్టడం లేదని, కేవలం విదేశీ పర్యటనల్లో మునిగి తేలాడుతున్నారని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లో కరవు విలయ తాండవం చేస్తోందని, బుందేల్‌ఖండ్‌లో ప్రజలు గడ్డి రొట్టెలు తిని జీవిస్తున్నా పట్టని ములాయం సింగ్.. తన 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకొనేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో పంటలు ఎండి, తినడానికి తిండి లేక జంతువులున్నా అమ్ముకోవడానికి వీలు లేక ఏడాది కాలంలో సుమారు నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అసద్ ఆవేదన వ్యక్తం చేశారు. గోవధ నిషేధ చట్టం లేకుంటే కనీసం జంతువుల్ని అమ్ముకొని జీవనం గడిపే వారని పేర్కొన్నారు. అయోధ్య నిర్మాణానికి వస్తున్న రాళ్లను సీజ్ చేయకుండా సమాజ్‌వాదీ పార్టీ ప్రేక్షక పాత్ర పోషిస్తోందన్నారు. దీన్ని బట్టి ఆ పార్టీ నిజ స్వరూపం బహిర్గతమవుతుందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చేంతవరకు అయోధ్యలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐఎస్ఐఎస్తో ఇస్లాంకు సంబంధం లేదని, యువత ఉద్వేగాలకు గురికావద్దని కోరారు. ప్రాణాలు తీయడం కాదు.. ప్రాణాలను రక్షించాలని సూచించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసులు పరిష్కరించండి ముస్లిం యువత తప్పుడు కేసుల వల్ల తిరగబడుతున్నారని ఇటీవల గుజరాత్లో జరిగిన సదస్సులో వ్యాఖ్యానించిన రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మకు చిత్తశుద్ధి ఉంటే చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో మగ్గుతున్న ముస్లిం యువత కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆర్నెల్లలో పరిష్కరించాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ముస్లింలపై తప్పుడు కేసులు బనాయించడం నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. నేరస్తులకు కాంగ్రెస్ వత్తాసా..? తమ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నానికి పాల్పడిన నేరస్తులను కాంగ్రెస్ నేతలు పరామర్శించడాన్ని అసద్ ఎద్దేవా చేశారు. బిహార్, బెంగళూర్లలో తమని బయటి వారని పేర్కొన్న కాంగ్రెస్ వాదులు.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా రంగంలో దిగుతారని ప్రశ్నించారు. ఈ సభలో మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు పాషా ఖాద్రీ, బలాల, జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ బంధం అనిర్వచనీయమైంది
-
రష్యా నమ్మకమైన నేస్తం!
-
ఈ బంధం అనిర్వచనీయమైంది
మాస్కో: రష్యాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం రాత్రి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. రష్యా ఎక్స్పో సెంటర్లో 3000మంది ప్రవాసభారతీయులు పాల్గొన్న ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యన్లు భారత్‌పై చూపిస్తున్న మమకారానికి సగటు భారతీయ హృదయం ఉప్పొంగుతుందన్నారు. భారత్ రష్యాల బంధం అనిర్వచనీయమైందన్నారు. ముందుగా నమస్తే అంటూ ప్రవాస భారతీయులను సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రష్యా ప్రముఖ పాప్ సింగర్ సాటి కఝనోవా వేద మంత్రాలను ఉచ్ఛరించటం విశేషం. చూస్తూ చదవకుండా.. మంత్రాలను స్పష్టంగా ఉచ్ఛరింటం ఆనందం కలిగించిందని.. అది ఆమె చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రశంసించారు. క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, మాజీ ప్రధాని వాజపేయి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన రాసిన ‘మై గీత్ నయా గాతా హూ’ పాటపై రష్యా కళాకారులు ప్రదర్శన, గుజారాతీ నృత్యం గార్బాపై డాన్సులపై సంతోషం వ్యక్తం చేశారు. రష్యన్ల నుంచి గార్బా నేర్చుకుంటామన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. * భారత్-రష్యా మధ్య బంధం చాలా పాతది. కానీ రష్యన్లు భారత సంస్కృతిని నేర్చుకోవటం గొప్పవిషయం. * రష్యాకు చెందిన ఓ మహిళ తను యోగాపై రాసిన పుస్తకాన్ని నాకు కానుకగా ఇచ్చారు. రష్యాలో 400 ఏళ్లనాటి భారతదేశ పద్ధతిలో కట్టిన ఇంటిని చూశాను ఆనందం వేసింది. * రష్యాపై సంస్కృత భాష ప్రభావం చాలా ఉంది. అష్ట్రాఖాన్ ప్రాంత గవర్నర్‌తో మాట్లాడాను. ఆయనకు వాటర్ మిలన్ కంటే.. తర్బూజ్ అంటేనే అర్థమైంది. మొదట్నుంచీ భారత్‌కు వెన్నంటి నిలిచిన దేశం రష్యా. * రష్యన్లు ఎక్కువగా పర్యాటకాన్ని ఇష్టపడతారు. అందుకే ఏడాదికి కనీసం ఐదు రష్యన్ల కుటుంబాలైనా భారత్‌లో పర్యటించాలని కోరుతున్నాను. * 21వ శతాబ్దం ఆసియా ఖండానిదే. అందులోనూ భారతదేశమే పరిస్థితులను ముందుండి నడిపిస్తుంది. * దేశంలో 35 ఏళ్ల లోపున్న వారు 80కోట్ల మంది ఉన్నారు. వారే ప్రస్తుతం భారతదేశపు శక్తి. మేం నవభారత నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. రైల్వేల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు దారులు తెరిచాం. * ఉగ్రవాదంతో ప్రపంచ మానవాళికి ముప్పుందని 30 ఏళ్లుగా చెబుతున్నాం. అప్పుడు ఎవరూ వినలేదు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఉగ్రవాద ప్రభావాన్ని అనుభవిస్తోంది. భారత్‌లో కొందరు ఎప్పుడూ సమస్యల గురించే ఆలోచిస్తున్నారు. మేం వాటికి పరిష్కారం సూచించాం. -
రష్యా నమ్మకమైన నేస్తం!
మాస్కో: మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లో కమోవ్-226 యుద్ధ హెలికాప్టర్ల తయారీకి రష్యా పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా 12 అణువిద్యుదుత్పత్తికి రియాక్టర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ప్రధాని మోదీ రెండ్రోజుల రష్యా పర్యటన సందర్భంగా జరిగిన ఇండో-రష్యా శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల మధ్య బంధం బలపడే దిశగా మొత్తం 16 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్టిలో ఉంచుకుని రక్షణ, అణుశక్తితోపాటు ఆర్థిక రంగంలోనూ పరస్పరం సహకారం చేసుకోవాలని నిర్ణయించారు. మాస్కోలోని క్రెమ్లిన్ భవనంలో జరిగిన ఈ సదస్సులో మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఇరుదేశాలకు చెందిన పలువురు అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించటంపై తమ పూర్తి మద్దతుంటుందని ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో ప్రపంచమంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని సంయుక్త మీడియా సమావేశంలో మోదీ పేర్కొన్నారు. రష్యాలో చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీతలో భారత కంపెనీలకు అవకాశం ఇచ్చేందుకు కూడా పుతిన్ అంగీకరించారు. ప్రస్తుతం పది బిలియన్ డాలర్ల (రూ.66 వేల కోట్ల) ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుండగా.. వచ్చే పదేళ్లలో దీన్ని 30 బిలియన్ డాలర్లకు (రూ.1.98 లక్షల కోట్లు) పెంచాలని నిర్ణయించారు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న రష్యా.. ఆర్థికంగా బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. భారత్‌తో రక్షణ, ఆర్థిక సహకారంపైనా చర్చలు జరిపారు. అటు భారత్ కూడా ‘యురేషియా’ ఆర్థిక జోన్ పరిధిలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం పట్టుబడుతోంది. గతవారం భారత రక్షణ శాఖ రష్యానుంచి రూ.40 వేల కోట్లతో ‘ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ’ను కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, సమావేశం జరిగిన తీరుపై మోదీ, పుతిన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య అభివృద్ధితోపాటు అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక, మానవీయ విషయాల్లో మరింత బలమైన బంధాలకు సదస్సు దోహద పడుతుందని సంయుక్త ప్రకటనలో ఇరువురు నేతలు తెలిపారు. తమ భేటీ ఫలప్రదంగా జరిగిందని మోదీ ట్వీట్ చేశారు. మంచిరోజుల్లో, చెడ్డ రోజుల్లో రష్యా భారత్‌కు నమ్మకమైన నేస్తంగా ఉన్నదని మోదీ అన్నారు. రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందాలతో.. భారత తయారీ రంగం మరింత వేగం అందుకుంటుందన్నారు. అంతకుముందు క్రెమ్లిన్‌లోని అలెగ్జాండర్ గార్డెన్లో ఉన్న రెండో ప్రపంచయుద్ధ అమరవీరులకు పుష్పాంజలి అర్పించారు. తర్వాత రష్యా ప్రభుత్వం ఆధీనంలో నడిచే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్సీఎంసీ)ని ప్రధాని మోదీ గురువారం సందర్శించారు. అరగంటసేపు ఈ కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి సిబ్బందితో వ్యవస్థ పనితీరును అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాత్రి మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన పుతిన్.. ఆయన ఇచ్చిన విందును స్వీకరించారు. మోదీతో భేటీ సందర్భంగా బెంగాల్‌కు చెందిన 18వ శతాబ్దం నాటి ఖడ్గం, మహాత్మాగాంధీ డైరీలోని ఓ పేజీ (చేతిరాత)ని పుతిన్ మోదీకి బహూకరించారు. భారత విదేశాంగ నీతి బాధ్యతాయుతమైనదన్న నితిన్.. ప్రపంచం ఎదుర్కుంటున్న చాలా సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపించే స్థానంలో భారత్‌ను చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. సిరియాలో జరిగిన రష్యా విమాన ప్రమాద మృతులకు మోదీ సంతాపం తెలిపారు. కాగా, రష్యా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్‌కు బయల్దేరారు. శుక్రవారం ఉదయం చేరుకోనున్నారు. రష్యాతో కుదుర్చుకున్న 16 ఒప్పందాలు * పౌరుల విమాన ప్రయాణాల విషయం లో పరస్పరం నిబంధనల సరళీకరణ. * అధికారులు, దౌత్యవేత్తల పాస్‌పోర్టులున్న వారికి ఇరుదేశాల్లో పరస్పరం ప్రయాణించే సౌకర్యం. * హెలికాప్టర్ ఇంజనీరింగ్‌రంగంలో సహకారం. * 2015-17 మధ్య కస్టమ్స్ ఎగవేత నియంత్రణలో సహకారం. * భారత్‌లో 12 రష్యా తయారీ అణురియాక్టర్ల ఏర్పాటు (ఏపీతో సహా). * రైల్వే రంగంలో సాంకేతిక సహకారం. * భారత్‌లో సౌరశక్తి ప్లాంట్ల నిర్మాణంలో సహకారం. * రాంచీలోని హెచ్ఈసీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెవీ ఇంజనీరింగ్ అభివృద్ధికి ఒప్పందం. * హెచ్ఈసీ తయారీ సామర్థ్యాన్ని పెంచ టం, నూతనీకరించేందుకు ఒప్పందం * ప్రసార రంగంలో సహకారం. * సీ-డాక్, ఐఐఎస్సీ (బెంగళూరు), లోమొనోసోవ్ మాస్కో స్టేట్ వర్సిటీ మధ్య ఒప్పందం. * సీ-డాక్, ఓజేఎస్‌సీ, గ్లోనాస్ యూనియన్ మధ్య ఒప్పందం. * రష్యాలోని తూర్పు ప్రాంతంలో పెట్టుబడులకు సహకారం. * హైడ్రోకార్బన్ల ఉత్పత్తి, అన్వేషణ, జియోలాజికల్ సర్వేలో సహకారానికి (రష్యా భూభాగంపై) ఒప్పందం. * జేఎస్సీ వాంకోర్‌నెఫ్ట్‌లో సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టులో తొలివిడత పనులు పూర్తయినట్లు ధృవీకరణ. * హైడ్రోకార్బన్ల ఉత్పత్తి, అన్వేషణ, జియోలాజికల్ సర్వేలో సహకారానికి(భారత భూభాగంపై) ఒప్పందం. -
ఈ పొరపాటేమిటి నరేంద్ర మోదీజీ?
మాస్కో: రష్యా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం అక్కడ స్వాగత కార్యక్రమంలో తనకు తెలియకుండానే ఓ పొరపాటు చేశారు. రష్యా బ్యాండ్ భారత జాతీయ గీతమైన ‘జన గణ మన అధినాయక జయహే’ను ఆలపిస్తుండగా రెడ్ కార్పెట్‌పై ముందుకు నడిచారు. ఈ విషయాన్ని గ్రహించిన ఓ అధికారి వెంటనే మోదీ ముందుకువెళ్లి ఆయన్ని అంతకుముందున్న చోటుకు తీసుకెళ్లి నిలబెట్టారు. గీతాలాపన అనంతరం మోది మళ్లీ ముందుకు కదిలారు. మోదీని ఆహ్వానించేందుకు వచ్చిన రష్యా ప్రభుత్వ ప్రతినిధి, మోదీ రాగానే భారత జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందిగా రష్యా అధికార బ్యాండ్‌ను ఉద్దేశించి చేయి ముందుకు సాచారు. ఆ సైగను పొరపాటుగా అర్థం చేసుకున్న మోదీ, తనను ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నారని భావించి భారత జాతీయ గీతాలాపన కొనసాగుతుండగానే ముందుకు నడిచారు. ఈ సంఘటనను ఎవరు ఎలా అర్థం చేసుకున్నప్పటికీ పార్టీకన్నా దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా ముద్రపడిన మోదీ ఇలా చేయడమేమిటని ట్విట్టర్ యూజర్లు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘జన గణ మన అధినాయక జయహే....జాతీయ గీతాన్ని దేశానికి ఆపాదించిందీ కాంగ్రెస్ పార్టీ, అలాంటప్పుడు బీజేపీ పార్టీకి చెందిన మోదీ దాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు....మొన్న జాతీయ జెండాను అవమానించారు. నేడు జాతీయ గీతాన్ని అవమానించారు. విదేశీ పర్యటనల్లో ఎప్పుడూ కెమేరాలపైనే కాకుండా ఇలాంటి విషయాలపై కూడా దృష్టి పెట్టండీ మోదీ గారు....మోదీ పచార్లు చేస్తున్నప్పుడు జాతీయ గీతాలాపన ఆపవద్దా?....మోదీనే జాతీయ గీతం అవమానించిందీ, ఆయన నడిచేందుకు పాస్ ఇవ్వాలిగదా!.....ముంబై సినిమా థియేటర్లో జాతీయ గీతాలాపన సందర్భంగా లేచి నిలబడనందుకు ఓ జంటను బయటకు తరిమేసిన దేశభక్తులారా! ఇప్పుడేమంటారు?...’ లాంటి విమర్శలు ట్విట్టర్లో చెక్కర్లు కొడుతున్నాయి. విదేశీ పర్యటనల సందర్భంగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఇలాంటి పొరపొట్లు చేయకపోలేదు. మోదీకి కూడా ఇది కొత్తేమి కాదు. మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చేందుకు భారత జాతీయ జెండాపై ఆయన తన సంతకం చేశారు. సంతకం చేయడం కూడా జాతీయ జెండాను అవమానపర్చడమే. అంతెందుకు గత నెలలో మోదీ, జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేను కలసుకున్నప్పుడు వారి వెనకాల భారత జాతీయ జెండా తలకిందులుగా అమర్చి ఉంది. అప్పుడు కూడా విమర్శలు రాగా అది ప్రొటోకాల్ ఆఫీసర్ తప్పిదమని, చర్యలు తీసుకుంటామని పీఎంవో వర్గాలు తెలిపాయి. -
లేచి నిలబడితేనే గౌరవమా?
న్యూఢిల్లీ: భరత భూమిలో దేశభక్తి రసం ఉప్పొంగి పొరలుతోందనడానికి ముంబైలోని ఓ పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో ‘తమాషా’ హిందీ చిత్రం ప్రదర్శన సందర్భంగా జరిగిన ఓ ఉదంతమే తార్కాణం. రవీంద్రనాథ్ టాగూర్ రాసిన జాతీయ గీతం ‘జన గణ మన అధినాయక జయహే’ అన్న పాట వస్తున్నప్పుడు అందరు లేచి నిలబడడం దేశ సంస్కృతి సంప్రదాయమే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధం కూడా. దీన్ని ఉల్లంఘించి సీట్లోనే కూర్చున్న ఓ ముస్లిం యువ దంపతులను థియేటర్ నుంచే తరిమేశారు. ఇప్పుడు ఈ వీడియో ఆన్లైన్ హల్చల్ చేస్తోంది. క్రికెట్ ద్వారా దేశభక్తిని పూసుకున్న సినీ నటి ప్రీతి జింటా కూడా 2014, అక్టోబర్ నెలలో ఓ సినిమా థియేటర్లో ఇలాగే హల్చల్ చేశారు. జాతీయ గీతం ఆలాపన వస్తున్నప్పుడు లేచి నిలబడడం, నిలబడక పోవడం తన ఇష్టమని ఆ ముంబై థియేటర్లో ఓ ముస్లిం యువకుడు వ్యాఖ్యానించడం మరోసారి వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. దశాబ్దాల క్రితమే ఓ ముస్లిం యువకుడు తమ మతాచారానికి విరుద్ధం లేచి నిలబడడం అంటూ హైకోర్టులో వాదించడాన్ని కోర్టు కొట్టివేసింది. మత విశ్వాసాలు వేరు, దేశభక్తి వేరంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దేశభక్తి పేరిట వ్యక్తిగత విశ్వాసాలను దెబ్బతీయరాదని, ఈ విషయంలో సరైన చట్టాలు కూడా లేవని ఆ యువకుడి తరఫున తీర్పు వెలువరించింది. దేశభక్తి ఉందనడానికి నిలబడడం, నిలబడక పోవడం కొలమానం కాదని, దేశభక్తి లేనివాళ్లు కూడా నిలబడవచ్చని వ్యాఖ్యానించింది. దాంతో కొన్ని రాష్ట్రాలు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ గీతాన్ని ఆలపించడం, నిలబడి జాతీయ జెండాకు వందన సమర్పణ చేయడం తప్పనిసరి చేశాయి. 2014, ఆగస్టులో తిరువనంతపురంలోని ఓ సినిమా థియేటర్లో జాతీయ గీతాలాపన సందర్భంగా సల్మాన్ అనే వ్యక్తి లేచి నిలబడనందుకు 124ఏ సెక్షన్ కింద దేశద్రోహం కేసు పెట్టింది. పాస్‌పోర్టును సీజ్ చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో జాతీయ గీతాలాపన ఓ సంప్రదాయంగానే పాటిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఈ సంప్రదాయానికి చట్టబద్ధత ఉన్నప్పటికే శిక్షలంటూ పెద్దగా లేవు. కొన్ని దేశాలు అతి స్వల్ప జరిమానాలతో సరిపుచ్చుతున్నాయి. అమెరికాలో....... జాతీయ జెండాను చూపించినా, చూపించకపోయినా జాతీయ గీతాలాపన వస్తున్న వైపు మొఖం ఉండేలా నిలబడాలి. కుడిచేతిని గుండెపై పెట్టుకొని ఆలాపన ముగిసేవరకు నిలబడే ఉండాలి. అయితే ఎవరు నిలబడినా, నిలబడక పోయినా పట్టించుకోరు. శిక్షించేందుకు ఎలాంటి చట్టాలు లేవు. థాయ్‌లాండ్‌లో... ప్రతిరోజు ఉదయం 8 గంటలకు సాయంత్రం ఆరు గంటలకు విధిగా టెలివిజన్‌లో జాతీయ గీతాన్ని ప్రసారం చేస్తారు. విద్యా సంస్థల్లో ఉదయం 8 గంటలకు ప్రతిరోజు ప్రార్థనాగీతం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో, సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పకుండా వినిపిస్తారు. ఆ సందర్భంగా అందరూ నిలబడాల్సిందే. అయితే ఉల్లంఘించిన వారికి ఎలాంటి శిక్షలు లేవు. ఇటలీలో..... దేశాధ్యక్షుడు హాజరయ్యే ప్రజా సమావేశాల్లో, క్రీడా పోటీల్లో తప్పా మరెక్కడా, పాఠశాలల్లో కూడా జాతీయ గీతాన్ని ఆలపించరు. గీతాలాపన సందర్భంగా ఇలా ప్రవర్తించాలనే ఎలాంటి నిబంధనలు లేవు. అయితే విదేశీ జాతీయ గీతాలాపన సంఘటనల్లో మాత్రం గౌరవ సూచకంగా ఇటాలియన్లు నిలబడడం వారి సంస్కృతి. మెక్సికోలో అన్ని విశ్వవిద్యాలయాల్లో, పాఠశాలల్లో ప్రతి సోమవారం జాతీయ జెండా ముందు జాతీయ గీతాలాపన చేస్తారు. విద్యార్థులు తెల్ల దుస్తులు ధరిస్తారు. ధరించకోపోయినా ఎలాంటి శిక్షలు ఉండవు. జపాన్ విద్యా సంస్థల్లో జాతీయ గీతాలాపన సందర్భంగా తప్పనిసరి నిలబడాలి. నిరసనలో భాగంగా నిలబడకపోతే మాత్రం విద్యార్థులకు జరిమానాలు, టీచర్లకు జీతాల్లో కోతలుంటాయి. ముఖ్యంగా స్నాతకోత్సవాల్లో జాతీయ గీతాన్ని గౌరవించాలి. పలుదేశాల్లో జాతీయ గీతాల పట్ల వివాదాలు ఉన్నట్లే మన జాతీయ గీతంపై కూడా వివాదం ఉన్న విషయం తెల్సిందే. ‘జన గణ మన అధినాయక జయహే, భారత భాగ్యవిదాత’ అని టాగూర్ రాసిందీ బ్రిటీష్ పాలకుడు నాలుగవ జార్జ్ కోల్‌కత రాక సందర్భంగా ఆయనను ఉద్దేశించి రాసిందన్నది వివాదం. ఏ వివాదాలు ఎలా ఉన్నా ‘దేశమును ప్రేమించుమన్నా మంచిఅన్నది పెంచుమన్నా.....దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్న కవి సూక్తులు మరచిపోకుంటేచాలు. -
'తమాషా' థియేటర్ నుంచి గెంటేశారు..
ఓ సినిమా థియేటర్లో జాతీయ గీతం వినిపించినపుడు గౌరవ సూచకంగా లేచి నిలబడలేదనే కారణంతో ఓ మతానికి చెందిన కుటుంబాన్ని ఆ థియేటర్ నుంచి బయటకు పంపేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గత శుక్రవారం విడుదలయిన హిందీ చిత్రం 'తమాషా'ను ప్రదర్శిస్తున్న ఓ మల్టీప్లెక్స్‌లో ఈ సంఘటన జరిగింది. తమాషా చిత్రం ప్రారంభకాకముందు జాతీయ గీతాన్ని ప్లే చేశారు. థియేటర్లోని ప్రేక్షకులు లేచి నిలబడగా, ఆ సమయంలో ఓ కుటుంబ సభ్యులు మాత్రం సీట్లలోనే కూర్చున్నారు. ఇది గమనించిన ప్రేక్షకులు వారితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో థియేటర్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ కుటుంబాన్ని బయటకు పంపారు. ఆ కుటుంబం వెళ్లడంతో ఇతర ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం కచ్చితంగా తెలియరాలేదు. బెంగళూరులోని అని కొన్ని, ముంబై కుర్లా ప్రాంతంలో అని మరికొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యం ఈ ఘటనపై స్పందించలేదు. కొందరు నెటిజన్లు మాత్రం వెంటనే స్పందించి ప్రేక్షకుల చర్యను సమర్థించారు. -
కుషాల్ ఓ ఇడియట్ : అమీషా
సోషల్ మీడియా మంచికి ఎంత ఉపయోగపడుతుందో, అంతకు మించి చెడు కూడా చేస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో కొంత మంది సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు వ్యక్తిగత దూషణలకూ కారణం అవుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. టీవీ ఆర్టిస్ట్ కుషాల్ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ మీద చేసిన కామెంట్స్, తరువాత అమీషా ఆ కామెంట్స్‌పై స్పందించిన తీరు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వివాదానికి తెరతీసింది. అమీషా జుహులోని పివిఆర్ థియేటర్లో సినిమా చూస్తుండగా తను చూసిన విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు కుషాల్. థియేటర్లో జాతీయగీతం వస్తున్న సమయంలో ఓ అమ్మాయి గౌరవసూచకంగా నిలబడకుండా కూర్చొని ఉందని, ఆమె వికలాంగురాలేమో అనుకున్నానని, కాని ఆమె అమీషా పటేల్ కావటంతో ఆశ్యర్యపోయానని కుషాల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించింది అమీషా. తను ఆడవాళ్లకు ఉండే వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆరోజు థియేటర్లో లేచి నిలబడలేదని, ఈ సమస్యను అర్థం చేసుకోలేని కుషాల్ ఓ ఇడియట్ అంటూ ఘాటుగా స్పందించింది. కుషాల్‌కు తల్లి, చెల్లి లేరేమో అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ల వ్యక్తిగత విషయాలు, సమస్యలను పట్టించుకోని కుషాల్ లాంటి వారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలంటూ ట్వీట్ చేసింది అమీషా. pic.twitter.com/RDhOa0J5R9 — KUSHAL TANDON (@KushalT2803) October 23, 2015 pic.twitter.com/UeSeF2tUHP — KUSHAL TANDON (@KushalT2803) October 23, 2015 Idiot kushal Tandon had the nerve to tweet that I didn't get up during national anthem. Did the jackass ask why? — ameesha patel (@ameesha_patel) October 26, 2015 Women we all need to slap kushal. I had the monthly girly problem. Getting up wud have caused a blood flow on the theatre ground — ameesha patel (@ameesha_patel) October 26, 2015 I waited for the film to start so I cud address my GirLY problem in the bathroom. Didn't know that kushal wud make it a national issue — ameesha patel (@ameesha_patel) October 26, 2015 Assholes like kushal who invade the privacy of a woman n their problems need 2 b slapped.idiot culdnt even win big boss — ameesha patel (@ameesha_patel) October 26, 2015 -
జాతీయ గీతం వివాదం వెనుక..
న్యూఢిల్లీ: ‘జన గణ మన అధినాయక జయ హే’ అనే జాతీయ గీతంపై మళ్లీ వివాదం రేగింది. రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఈ గీతంలో ‘అధినాయక జయ హే’ అన్న చరణాన్ని మార్చాలని డిమాండ్ చేయడంతో ఈ గీతం పూర్వాపరాల్లోకి వెళ్లి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ గీతంపై వివాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. వందేళ్ల క్రితమే వివాదం మొదలైంది. భారత పర్యటనకు వచ్చిన కింగ్ జార్జ్-5 గౌరవార్థం కోల్‌కతలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 1911, డిసెంబర్ 27వ తేదీన ఓ భారీ సదస్సును ఏర్పాటు చేసింది. ఆ సదస్సు సాధారణ దేవుడి ప్రార్థనాగీతంతో ప్రారంభమైంది. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘జన గణ మన అధినాయక జయ హే’ అన్న గీతాన్ని తొలిసారిగా బాలబాలికలు ఆలపించారు. అనంతరం ఐదవ కింగ్ జార్జ్‌ను సన్మానించి ఓ తీర్మానాన్ని ఆమోదించారు. చివరను కింగ్ జార్జ్‌ను ప్రశంసిస్తూ రాంభూజ్ చౌదరి రాసిన హిందీ గీతాన్ని ఆలపించారు. దీన్ని ఆంగ్లో-ఇండియా ప్రెస్ తప్పుగా కవర్ చేయడం వివాదానికి దారితీసింది. ‘బ్రిటిష్ ఎంపరర్ గౌరవార్థం రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రత్యేకంగా రాసిన గీతాలాపనతో సదస్సు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి-ది ఇంగ్లీష్‌మేన్, డిసెంబర్ 28, 1911’. ‘ఎంపరర్‌కు స్వాగతం చెబుతూ బెంగాల్ కవి ఠాగూర్ రాసిన గీతాలాపనతో సదస్సు ప్రారంభమైంది-ది స్టేట్స్‌మేన్, డిసెంబర్ 28, 1911’. ఇలాంటి కథనాలు ఆ తర్వాత ఠాగూర్ రాసిన జాతీయ గీతంపై వివాదానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఠాగూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాగూర్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాంతినికేతన్ పాఠశాలలో పిల్లలను చదివించకూడదంటూ కూడా ఆదేశాలు జారి చేసింది. 1930లో మళ్లీ దీనిపై వివాదం రేగింది. బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ను జాతీయ గీతంగా ఎంపిక చేద్దామంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గం పట్టుబట్టడంతో ఈ వివాదం ఏర్పడింది. అయితే వందేమాతరం గీతంలో దేశాన్ని దుర్గాదేవితో పోల్చడం వల్ల అది ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని (వారు అల్లాను తప్పించి మరొకరిని ప్రార్థించరు కాబట్టి) అభిప్రాయపడి ఠాగూర్ గీతం జోలికి వెళ్లలేదు. ఠాగూర్ వివరణ పులిన్ బిహారి సేన్‌కు ఠాగూర్ 1937, నవంబ ర్ 10వ తేదీన రాసిన లేఖలో తాను రాసిన జాతీయ గీతం గురించి ప్రస్తావించారు. తాను కింగ్ జార్జ్ ఐదు లేదా ఆరు రాజుల గురించి రాయలేదని, అంత టి దౌర్భగ్య పరిస్థితికి తాను ఎన్నడూ దిగజారబోనని స్పష్టం చేశారు. తాను అధినాయక్ అన్న పదా న్ని భారత దేశానికి, ఉద్యమానికి నాయకత్వం వహించే సారథి అనే అర్థంలోనే రాశానని వివరించారు. ఒక్క చరణం చదివి విశ్లేషిస్తే ఇలాగే ఉంటుం దని, మొత్తం తాను రాసిన ఐదు చరణాలను చదివి, తన ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలని అన్నారు. ఠాగూర్ వ్యక్తిత్వం, సాహిత్యోద్యమం గురించి బాగా తెలిసిన వారు కూడా గీతంలో బ్రిటీష్ ఎంపరర్‌ను ప్రశంసిస్తూ రాయలేదని ఇప్పటికీ వాదిస్తారు. ఎప్పుడో సద్దు మణిగిందనుకున్న ఈ వివాదం బాబ్రీ మసీదుకు వ్యతిరేకంగా 1980 దశకంలో హిందుత్వ శక్తుల ఉద్యమంతో మళ్లీ రాజుకుంది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం వరకు కొనసాగింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్‌కు కూడా ఈ వివాదం సుపరిచితమే. -
జాతీయ గీతం వివాదం వెనుక..
న్యూఢిల్లీ: జాతీయ గీతం 'జన గణ మన అధినాయక జయ హే' పై మళ్లీ వివాదం రేగింది. రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఈ గీతంలో 'అధినాయక జయ హే'అన్న చరణాన్ని మార్చాలని డిమాండ్ చేయడంతో ఈ గీతం పూర్వపరాల్లోకి వెళ్లి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ గీతంపై వివాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. వాస్తవానికి వందేళ్ల క్రితమే వివాదం మొదలైంది. భారత పర్యటనకు వచ్చిన కింగ్ జార్జ్-5 గౌరవార్థం కోల్‌కతాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 1911, డిసెంబర్ 27వ తేదీన ఓ భారీ సదస్సును ఏర్పాటు చేసింది. ఆ సదస్సు సాధారణ దేవుడి ప్రార్థనాగీతంతో ప్రారంభమైంది. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'జన గణ మన అధినాయక జయ హే' అన్న గీతాన్ని తొలిసారిగాబాలబాలికలు ఆలపించారు. అనంతరం ఐదవ కింగ్ జార్జ్‌ను సన్మానించి ఓ తీర్మానాన్ని ఆమోదించారు. చివరను కింగ్ జార్జ్‌ను ప్రశంసిస్తూ రాంభూజ్ చౌదరి రాసిన హిందీ గీతాన్ని ఆలపించారు. దీన్ని ఆంగ్లో-ఇండియా ప్రెస్ తప్పుగా కవర్ చేయడం వివాదానికి దారితీసింది. 'బ్రిటిష్ ఎంపరర్ గౌరవార్థం రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రత్యేకంగా రాసిన గీతాలాపనతో సదస్సు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి-ది ఇంగ్లీష్‌మేన్, డిసెంబర్ 28, 1911'. 'ఎంపరర్‌కు స్వాగతం చెబుతూ బెంగాల్ కవి ఠాగూర్ రాసిన గీతాలాపనతో సదస్సు ప్రారంభమైంది-ది స్టేట్స్‌మేన్, డిసెంబర్ 28, 1911'. '1911 డిసెంబర్ 27 తేదీ బుధవారం నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంపరర్‌ను స్వాగతిస్తూ బెంగాలీలో పాడిన పాటతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఎంపరర్‌ను స్వాగతిస్తూ కాంగ్రెస్ సదస్సు ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించింది-ది ఇండియన్, డిసెంబర్ 29, 1911' 'దేవుడిని పొగుడుతూ పాడిన బెంగాలీ ప్రార్థనా గీతంతో కాంగ్రెస్ సదస్సు ప్రారంభమైంది. ఐదవ కింగ్ జార్జికి విధేయతను ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించారు. అనంతరం ఆయన్ని ప్రశంసిస్తూ హిందీలో ఓ గీతాలాపన చేశారు-ది అమృత బజార్ పత్రిక, డిసెంబర్ 28, 1911' ఇలాంటి కథనాలు ఆ తర్వాత ఠాగూర్ రాసిన జాతీయ గీతంపై వివాదానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఠాగూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాగూర్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాంతినికేతన్ పాఠశాలలో పిల్లలను చదివించకూడదంటూ కూడా ఆదేశాలు జారి చేసింది. 1930లో మళ్లీ దీనిపై వివాదం రేగింది. బంకిం చంద్ర ఛటర్జీ రాసిన 'వందేమాతరం'ను జాతీయ గీతంగా ఎంపిక చేద్దామంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గం పట్టుబట్టడంతో ఈ వివాదం ఏర్పడింది. అయితే వందేమాతరం గీతంలో దేశాన్ని దుర్గాదేవితో పోల్చడం వల్ల అది ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని (వారు అల్లాను తప్పించి మరొకరిని ప్రార్థించరుకనుక) అభిప్రాయపడి ఠాగూర్ గీతం జోలికి వెళ్లలేదు. 1937, నవంబర్ 10వ తేదీన పులిన్ బిహారి సేన్‌కు ఠాగూర్ తాను స్వయంగా రాసిన లేఖలో తాను రాసిన జాతీయ గీతం గురించి ప్రస్తావించారు. తాను కింగ్ జార్జ్ ఐదు లేదా ఆరు రాజుల గురించి రాయలేదని, అంతటి దౌర్భాగ్య పరిస్థితికి తాను ఎన్నడూ దిగజారనని స్పష్టం చేశారు. తాను అధినాయక్ అన్న పదాన్ని భారత దేశానికి, ఉద్యమానికి నాయకత్వం వహించే సారథి అనే అర్థంలోనే రాశానని వివరించారు. ఒక్క చరణం చదివి విశ్లేషిస్తే ఇలాగే ఉంటుందని, మొత్తం తాను రాసిన ఐదు చరణాలను చదవి, తన ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలని అన్నారు. ఠాగూర్ వ్యక్తిత్వం, సాహిత్యోద్యమం గురించి బాగా తెలిసిన వారు కూడా గీతంలో బ్రిటీష్ ఎంపరర్‌ను ప్రశంసిస్తూ రాయలేదని ఇప్పటికి వాదిస్తారు. ఎప్పుడో సద్దుమణిగిందనుకున్న ఈ వివాదం బాబ్రీ మసీదుకు వ్యతిరేకంగా 1980 దశకంలో హిందుత్వ శక్తుల ఉద్యమంతో మళ్లీ రాజుకుంది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం వరకు కొనసాగింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్‌కు కూడా ఈ వివాదం సుపరిచితమే. అందుకనే ఆయనకు మళ్లీ ఈ వివాదం గుర్తొంచి మాట్లాడుతున్నట్టున్నారు. -
'అధినాయక్'పై గవర్నర్ VS గవర్నర్
కోల్‌కతా: జాతీయ గీతం జనగణమనలో 'అధినాయక్' అనే పదాన్ని తొలగించాలన్న రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ వ్యాఖ్యలపై త్రిపుర గవర్నర్ టతగట రాయ్ విబేధించారు. జాతీయ గీతంలో మార్పులో చేయగాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని, మనకు స్వాతంత్ర్య వచ్చి 67 ఏళ్లు అవుతోందని, అధినాయక్ అన్న పదం బ్రిటీష్‌కు సంబంధించినది ఎందుకు అవుతుందని త్రిపుర గవర్నర్ ట్వీట్ చేశారు. జనగణమనలోని 'అధినాయక్' అంటే బ్రిటీషర్లను కీర్తించడమేనని, ఈ పదాన్ని తొలగించాలని కల్యాణ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీకే చెందిన పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత, ప్రస్తుత త్రిపుర గవర్నర్ విబేధించారు. -
జాతీయ గీతంలో ‘అధినాయక్’ను తొలగించాలి
జైపూర్: జాతీయ గీతం ‘జనగణమన’లోని అధినాయక్ పదాన్ని తొలగించాలని రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ డిమాండ్ చేశారు. దాని స్థానంలో ‘మంగళ్’ పదాన్ని చేర్చాలన్నారు. ‘జనగణమన అధినాయక్ జయహో’ వాక్యంలో అధినాయక్ ఎవరని ఆయన ప్రశ్నించారు. ఆ పదం ఆంగ్లేయుల పాలనను పొగిడేలా ఉందని చెప్పారు. ఆ వాక్యాన్ని ‘జనగణమన మంగళ్ గాయే’గా మార్చాలని పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన రాజస్థాన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవ కార్యక్రమంలో అయన మాట్లాడారు. ఈ గీతం రాసిన టాగూరు అంటే తనకు గౌరవమని, అయినా ‘అధినాయక్’ పదాన్ని తీసేయాల్సిందేనని అన్నారు. -
జాతీయ గీతాలాపన బాలీవుడ్ పాట కాదు..
సందర్భం సినిమా హాళ్లలో జాతీయగీతం వినిపిస్తున్నప్పుడు లేచి వెళ్లిపోయే సినీ ప్రేక్షకులకు హితవు చెప్పేటట్టుగా జాతీయ గీతం పవిత్రత గురించి గవర్నర్, ఎమ్మెల్యే స్థాయి నేతలకు గుర్తుచేయవలసి రావడం దురదృష్టకరం. జాతీయగీతం పాడుతున్న ప్పుడు ఎవరయినా సరే అవత లికి వెళ్లిపోవడానికి అదేం బాలీవుడ్ పాట కాదు. ఇటీ వల కర్నాటక గవర్నర్ వజు భాయ్ వాలా ఒక అధికారిక కార్యక్రమం చివరలో జాతీయ గీతాలాపన కొనసాగుతుం డగా లేచి వెళ్లిపోయారు. గవ ర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలంగాణ అసెంబ్లీని ఉద్దే శించి ప్రసంగిస్తుండగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు జాతీ య గీతాన్ని అవమానించడం వంటి చర్యలకు పూను కునే హక్కు ఎవరికీ ఉండదు. ఈ ఘటనతో 11 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి సస్పెండ్ అయ్యారు కూడా. 1987 ఆగస్టులో ముంబైలోని క్రాంతి మైదాన్‌లో క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవం జరుగుతున్న ప్పుడు నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ కూడా జాతీయ గీతా లాపన మధ్యలోనే వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో రహస్య రేడియోను నిర్వ హించిన స్వాతంత్య్ర సమర యోధురాలు ఉషా మెహ తా దీంతో ఆగ్రహించి రాజీవ్‌ను వెనక్కు పిలవడమే కాకుండా ఆయనను తీవ్రంగా ఆక్షేపించారు. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. కానీ కర్నాటక గవర్నర్ మాటేమిటి? తన అభ్యంతర చర్యకు గాను ఆయన నుంచి సంజాయిషీ కానీ, క్షమాపణ కానీ మనం నేటికీ వినలేదు. చివరకు రాష్ట్రపతి కూడా గవర్నర్‌ను బహిరంగంగా మందలిం చినట్లు లేదు. రాష్ట్రపతి లేదా కేంద్ర హోం శాఖ కానీ అం తర్గతంగా అలా మందలించి ఉండొచ్చు కానీ, జాతీయ గీతం ప్రాధాన్యతను గుర్తించే విషయంలో ప్రజలను జాగరూకులను చేయడానికి ఈ లోపాయకారీ చర్యలు సరిపోవు. ఈ ఘటన కేవలం అధికారిక లాంఛనాల ఉల్లంఘనకు మాత్రమే పరిమితం కాదు. సినిమా హాళ్లలో జాతీయగీతం వినిపిస్తున్నప్పుడు లేచి వెళ్లిపోయే సినీ ప్రేక్షకులకు హితవు చెప్పేటట్టుగా జాతీయ గీతం పవిత్రత గురించి ఈ స్థాయి నేతలకు గుర్తుచేయవలసి రావడం దురదృష్టకరం. కానీ జాతీయ గీతాన్ని ప్రజలు గౌరవించేలా చేయవలసిన అవసరం ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం లేదా గణతంత్ర దినోత్స వం సందర్భంగా కొద్ది రోజులకు ముందే అధికారులు ప్లాస్టిక్ జెండాలు ఉపయోగించరాదనీ, వాటిని చెత్తసా మానులాగా పారవేయరాదని ప్రజలను కోరుతుం టారు. స్వాతంత్య్ర దినోత్సవం పూర్తయిన వెంటనే జాతీ య జెండా గౌరవం ముగిసిపోదు. దేశ ప్రజలుగా మనం జాతీయ గీతాన్ని తేలికగా తీసుకోరాదనే నా అభిప్రాయాన్ని మరొక అంశం మరిం తగా బలపరుస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని అనేక సార్లు వినిపిస్తు న్నందున దాన్ని గౌరవించడం గురించి మనందరికీ తెలిసి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉండవచ్చు కానీ, థియేటర్లలో ప్రసారం చేసే జాతీయ గీతం వెర్షన్లు అధికారపూర్వకమైనవి కావు. వాటిని తమదైన కళాత్మక స్వేచ్ఛతో స్వరపరుస్తున్నారు. అవి వినసొంపుగా ఉండ వచ్చు. కదిలించవచ్చు కానీ అవి అసలైన పాట వెర్షన్ కాదు. భారత ప్రభుత్వ వెబ్సైట్ (జ్ట్టిఞ://జుౌఠీజీఛీజ్చీ. జౌఠి.జీ) ప్రకారం జాతీయ గీతం అధికారిక వెర్షన్ పాడ టానికి పట్టే సమయం 52 సెకనులు కాగా, భారత బాల సృజనకారులు స్వరపరిచిన గీతం ఒక నిమిషం కంటే ఎక్కువగా ఉంటోంది. భారతీయ సైన్యం సహకారంతో జాతీయ గీతాన్ని స్వరపర్చిన ఒక స్వరకర్త సియాచిన్ గ్లేసియర్ నేపథ్యాన్ని ఉపయోగించగా, వన్యప్రాణులకు అంకితమిస్తూ రూపొందించిన జాతీయ గీతాలాపన రెం డు నిమిషాల ఒక సెకను వరకు సాగుతోంది. మరొకరైతే సుప్రసిద్ధ శాస్త్రీయ గాయకుల స్వరాలను అరువు తీసు కుని వారందరూ పాడిన గీత భాగాలను అతికించారు. అయితే వీరెవరూ అధికారిక వెర్షన్ అయిన 52 నిమిషాల పరిమితిలో జాతీయ గీతాన్ని స్వరపర్చలేదు. వీరంతా అత్యున్నత కళాత్మక విషయంతో స్వరకల్పన చేసినందున వీరి కృషిని విమర్శించడానికో లేదా తక్కు వ చేసి చూపడానికో ఇలా రాస్తున్నట్లు భావించరాదు. కానీ వారు జాతీయ గీతాన్ని ఆలాపిస్తున్న తీరుతో ప్రజ లు దాన్ని ఇలాగే పాడాలి కామోసు అని పొరపడే ప్రమా దం ఎంతైనా ఉంది. చాలామంది భారతీయులు ఏఆర్ రహ్మాన్ స్వరపర్చిన వందే మాతరం పాట వెర్షన్‌ను స్వాతంత్య్రం రాకముందు నుంచీ పాడుతున్నట్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. భారత ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం జాతీయ గీతా న్ని పాడేటప్పుడు, ఆలపించేటప్పుడు కొన్ని ప్రత్యేకత లకు మనం కట్టుబడి ఉండాల్సిన అవసరముంది. ఒకటి కాలవ్యవధి కాగా అధికారికంగానే రెండు వెర్షన్లు ఉన్నా యి. ఒకటి దీర్ఘ గీతం, మరొకటి హ్రస్వగీతం. పొట్టి గీతం జాతీయ గీతంలోని తొలి, చివరి పంక్తులు మాత్ర మే కలిగి ఉంటుంది. పైగా మరొక రెండు విషయాలను గీతాలాపన సమయంలో దృష్టిలో ఉంచుకోవాలి. జాతీ య గీతం పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ లేచి నిలబ డాలి. పాడుతున్నప్పుడు అందరూ కలసి పాడాలి. ఆ సందర్భంలో ఉన్నవారంతా గొంతు కలపాలి. కేంద్రప్రభుత్వం విధించిన ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ విషయంలో తెలంగాణ ఎంఎల్ఏలు, కర్నాటక గవర్నర్ వ్యవహరించిన తీరును మినహాయిం చడానికి తగినన్ని కారణాలు ఉండవచ్చు కానీ... జాతీ య గీతాన్ని పాడవలసిన సమయాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే.. ఆ సమయాన్ని పాటించడం చాలా ముఖ్యం. మహేష్ విజా పుర్కార్, సీనియర్ పాత్రికేయులు mvijapurkar@gmail.com -
జనగణమన అధినాయక జయహే..
భావిభారత పౌరులు వేలాదిగా ఒక్కచోట చేరారు. గళాలన్నీ ఒక్కటిగా చేసి జాతీయ గీతం ఆలపిస్తుంటే ప్రతి ఒక్కరి హృదయంలోనూ దేశభక్తి ఉప్పొంగింది. సమైక్యతా భావం తొణికిసలాడింది. భరతమాత సేవలో మేము సైతం అంటూ కదం తొక్కే ఉత్సాహం కనిపించింది. జాతీయ గీతాన్ని ఆలపించిన 6 వేల మంది విద్యార్థులు ప్రొద్దుటూరు కల్చరల్: జయహో జనగణమన చతుర్థ వార్షికోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలు ఆవరణంలో పలు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. 1911 డిసెంబరు 27వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని రచించి ఆలపించిన సందర్భంగా అందరిలో ఐక్యతాభావం, జాతీయతా భావం, దేశభక్తిని పెంపొందించేందుకు, మహనీయులను స్మరించుకునేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సుమారు 6 వేల మంది విద్యార్థులు మైదానానికి చేరుకున్నారు. మాజీమున్సిపల్ చైర్మన్ నరాల బాలిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్‌చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రుల ప్రసంగాన్ని ఆడియో టేపుల ద్వారా విద్యార్థులకు వినిపించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా ఆలపించిన జాతీయ గీతాన్ని వినిపిస్తూ అందరూ ఏక కంఠంతో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. దేశ ఔన్నత్యాన్ని అందరికి తెలియజేసేందుకు జయహో జనగణమన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహక అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జునరావు, మహబూబ్‌బాషా తెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, పరుగు, చిత్రలేఖనం, లాంగ్‌జంప్, హైజంప్ తదితర పోటీలలో గెలుపొందిన వారికి పతకాలను తహశీల్దార్ రాంభూపాల్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి తదితరులు అందజేశారు. స్పందన సుబ్బరామిరెడ్డి, ఆడిటర్ సాధు గోపాలకృష్ణ, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకరరెడ్డి, కేవీ రమణారెడ్డి, ఆర్సీపీఈ ప్రిన్సిపాల్ గోపాల్‌రెడ్డి, బాలసుబ్బారెడ్డి, న్యాయవాది కొండారెడ్డి, సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిని బయటకు తోసేసిన ప్రీతీ జింటా
బాలీవుడ్ నటి ప్రీతీ జింటాకు కోపం వచ్చింది. అది ఏ రేంజ్లో అంటే.....ఓ యువకుడిని సినియా థియేటర్ నుంచి బలవంతంగా బయటకు తోసేటంత. జాతీయ గీతం వస్తున్నప్పుడు ఓ యువకుడు లేచి నిలబడేందుకు నిరాకరించటం ప్రీతి జింతాకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే హృతిక్ రోషన్ తాజా చిత్రం 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా చూసేందుకు ప్రీతి మంగళవారం ఓ థియేటర్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా సినిమా మొదలయ్యే ముందు జనగణమణ గీతం వస్తుండగా సినిమాకు వచ్చిన ఓ యువకుడు లేచి నిలబడలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ప్రీతికి అతడిని బలవంతంగా థియేటర్ నుంచి తోసేసింది. ఈ సంఘటనను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసింది.మరోవైపు ప్రీతి చర్యపై సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమెకు దేశభక్తి ఉండచ్చు కాని మరీ ఇంత తలబిరుసు తనం పనికిరాదని బాధితుడి తరపున వ్యాఖ్యలు చేశారు. -
150 దేశాల్లో 600 థియేటర్లలో 'జన గణ మన'!
కోల్ కతా: పాప్ సాంగ్స్, హిప్పీ, వెస్ట్రన్ సంగీతం మోజులో పడిన పిల్లలకు, యువతకు జాతీయ గీతంపై అవగాహన కల్పించేందుకు సుమారు 70 మంది ప్రముఖ వ్యక్తులతో జాతీయ గీతం 'జన గణ మన'ను కొత్త వీడియోగా చిత్రీకరించారు. రాజీవ్ వాలియా దర్శకత్వం వహించిన కొత్త వీడియోను 150 దేశాలల్లో 600 థియేటర్లలో ప్రదర్శించారు. జాతీయ గీతాన్ని రూపొందించడానికి ఎనిమిది నెలలు పట్టిందని రాజీవ్ వాలియా తెలిపారు. ఈ వీడియోకు స్వరూప్ భల్వంకర్ సంగీతాన్ని సమకూర్చగా, బాల గాయని సంచితి సాకత్ పాడారని వాలియా మీడియాకు వివరాలందించారు. ఈ వీడియోలో బాలీవుడ్ తారలు శిల్పాశెట్టి, వివేక్ ఓబెరాయ్, తుషార్ కపూర్, అనుపమ్ ఖేర్, ఇషా కొప్పికర్, మల్లికా షరావత్, జానీ లీవర్ లు, మెజీషియన్ పీసీ సర్కార్, నృత్యాకారిణీలు సుజాతా మహాపాత్ర, క్రికెటర్లు ఇర్ఫాన్, యూసఫ్ పఠాన్, కుస్తీ ఆటగాడు సంగ్రామ్ సింగ్, బాలీవుడ్ గాయకులు అల్కా యాగ్నినిక్, అను మాలిక్, జావెద్ ఆలీ, మోహిత్ చౌహాన్, ఉదిత్ నారాయణ్ లు, ఇంకా పూనమ్ థిల్లాన్, పద్మిని కొల్హాపూరి లు కూడా ఉన్నారు. తాజ్ మహల్, కోణార్క్ టెంపుల్, బాంద్రా, ఇండియా గేట్, ఎర్రకోట, తదితర ప్రాంతాల్లో 1500 మంది పిల్లలపై చిత్రీకరించారు. -
జాతీయ గీతం మర్యాద పట్టని ఏపీ సీఎం
* తెలంగాణ సర్కారు సందడిలో ఒంటరైన చంద్రబాబు * జాతీయ గీతాలాపన ఆరంభమైనా కారెక్కి వెళ్లిన వైనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి హైదరాబాద్ రాకను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఏపీ సీఎంచంద్రబాబు ఒంటరయ్యారు. కార్యక్రమం ఆద్యంతం తెలంగాణ ప్రభుత్వ సందడే కనిపించింది. తనతో మాట్లాడేవారే కరువవడంతో ఇబ్బందిగా ఫీలయిన బాబు.. రాష్ట్రపతి ప్రణబ్ రాగానే ఆయనకు నమస్కరించి మధ్యలోనే నిష్ర్కమించారు. ఆ సమయంలో జాతీయ గీతాలాపన ఆరంభమైనప్పటికీ..పట్టించుకోకుండా వెళ్లిపోయారు. రాష్ట్రపతి రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయం వద్ద బాబు, ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మరో ఇద్దరు అధికారులు మినహా ఏపీ వారెవరూ కన్పించలేదు. అదే సమయంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, అధికారులతో సందడి వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ సైతం ఆద్యంతం అక్కడున్న ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పలకరిస్తూ.. ఉత్సాహంగా గడిపారు. నేతలెవరూ పట్టించుకోకపోవడంతో బాబు ఇబ్బందిపడ్డారు. ఏం చేయాలో తెలియక తన పక్కనేఉన్న గవర్నర్ నరసింహన్‌తో కొద్దిసేపు ముచ్చటించిన చంద్రబాబు... రాష్ట్రపతి రాగానే విమానం వద్దకు వెళ్లి అందరితో పాటు స్వాగతం పలికారు. అనంతరం ప్రణబ్ సైనిక వందనం స్వీకరించేందుకు వెళ్లగా.. చంద్రబాబు స్వాగత వేదిక వద్దకు రాకుండానే వెనుదిరిగారు. ఆ సమయంలో జాతీయ గీతాలాపన ఆరంభమైనా అదేమీ పట్టించుకోకుండా చంద్రబాబు కారెక్కి వెళ్లిపోయారు. అక్కడున్న అధికారులంతా చంద్రబాబు తీరుకు అవాక్కయ్యారు.